achanta
-
ఈ భవంతి.. వందేళ్ల గంధర్వ మహల్! ఇక్కడ?
ఈ భవంతి.. జైపూర్ హవా మహల్‌ని గుర్తుకు తెస్తోంది కదూ! ఇది గంధర్వ మహల్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో ఉంది! ప్రస్తుతం ఇందులో నివసిస్తున్న మూడోతరం.. ఇటీవలే దీని వందేళ్ల వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ మహల్‌ని చూపించడానికి సందర్భం అదే!ఆచంటకు చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చిన్నతనం నుంచీ కోటలు చూస్తూ పెరగడంతో సొంతూళ్లో అటువంటి కట్టడాన్ని నిర్మించాలని భావించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి కోటలను క్షుణ్ణంగా పరిశీలించి, 1918లో.. ఈ గంధర్వ మహల్‌కు శంకుస్థాపన చేశారు. ఆరేళ్లపాటు కొనసాగిన దీని నిర్మాణం 1924 నాటికి పూర్తయింది. సుమారు ఎకరం విస్తీర్ణంలో కొలువై ఉన్న ఈ మహల్ కోసం అప్పట్లోనే సుమారు పది లక్షల రూపాయల వరకు వెచ్చించినట్టు జమీందారు కుటుంబ సభ్యులు చెప్పారు.ప్రత్యేకతలెన్నో.. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. రవాణా సదుపాయం అంతగాలేని ఆ రోజుల్లో జలరవాణా ద్వారా వాటిని తీసుకువచ్చారు. ఈ కట్టడానికి ఇనుప ఊచల ఊసు లేకుండా డంగు సున్నాన్నే వాడారు. ఈ మహల్లోకి అడుగుపెడితే మైసూర్ మహారాజా ప్యాలస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతి కలుగుతుంది. 1885, లండన్ ఎగ్జిబిషన్లో రజత పతకం గెలిచిన పియానో ఈ మహల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ ఆ పియానో స్వరాలను పలికిస్తుంది. విశాలమైన హాల్లో బెల్జియం నుంచి తెప్పించిన నిలువెత్తు అద్దాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో వెలిగించేవారని, ఆ వెలుగుల్లో మహల్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారని స్థానికులు చెబుతారు. ఈ మహల్ కట్టిన పదేళ్లకు గానీ ఆచంటకు విద్యుత్‌సదుపాయం రాలేదట.ముఖ్యమంత్రులు బసచేశారు..ఈ గంధర్వ మహల్ ఎందరో ప్రముఖులకు విడిదిగా విరాజిల్లింది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీ రామారావుతో పాటు ఎంతో మంది మాజీ మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భవంతిలోనే బసచేసేవారు. ఈ మేడలో మొత్తం నాలుగు అంతస్తులు, 12 గదులున్నాయి. గొడవర్తి నాగేశ్వరరావు అనంతరం మూడు తరాలకు ఇది నివాసంగా ఉంది. నాలుగోతరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని జమీందారు కుటుంబ సభ్యుల్లో ఒకరైన గొడవర్తి వెంకటేశ్వరస్వామి తెలిపారు. ఈ భవంతి కట్టాక రెండు పర్యాయాలు రంగులు వేయగా, వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూ. 40 లక్షల వ్యయంతో మరమ్మతులు చేయించి రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా మరమ్మతులు చేయించామని వెంకటేశ్వరస్వామి చెప్పారు. గంధర్వ మహల్లో సినిమా షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎంతోమంది సినీరంగ ప్రముఖులు కోరినప్పటికీ జమీందారు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమ తాతగారి వారసత్వ సంపదగా వస్తున్న ఈ మహల్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
ఎగ్జిట్ పోల్స్ పై ఆచంట ఎమ్మెల్యే రియాక్షన్
-
చంద్రబాబుపై మాజీ మంత్రి చెరుకువాడ ఫైర్
-
చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు ఎన్టీఆర్ బ్యానర్లతో ఫ్యాన్స్ రాగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను తీసుకువచ్చిన ఫ్యాన్స్.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తిరువూరులో... కాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్ -
ఆచంట నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం
-
గోదావరిలో పడవ బోల్తా ..ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పడవ బొల్తా పడటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అధిక కొబ్బరి లోడుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతయిన బాధితులు వల్లురూ గ్రామనికి చెందిన కుడిపుడి పెద్దిరాజు(58), దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటన రమణ(35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. సామార్థ్యానికి మించి కొబ్బరి కాయల లోడు ఎక్కించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పడవలో మొత్తం ఐదుగురు ఉన్నారని అందులో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధత) -
చంద్రబాబు చరిత్ర హీనుడు..
సాక్షి, పశ్చిమగోదావరి: పేదల ఇళ్ల పట్టాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. ఆచంట నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి విడతలో భాగంగా రెండవ రోజు పెనుగొండ, దొంగగూడెం, మునమర్రు రోడ్ , వడలి గ్రామాల్లో 1,194 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. (చదవండి: ‘సినిమాల్లో వకిల్ సాబ్.. బయట పకీర్ సాబ్’) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టాలివ్వడమే కాకుండా.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తిలో 15 వేల మందికి ఒకే చోట ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. పేదలకు ఇళ్ల పట్టాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లు అనుభవం ఉందంటూ హైకోర్టులో వేలాది కేసులు వేసి, 25న పేదలకు పట్టాలు ఇస్తుంటే 24 తేదీన కూడా కోర్టులో స్టే వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కతుందని ఆయన ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్క సెంటు భూమి కూడా సేకరించి అవ్వలేని చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శలు గుప్పించారు (చదవండి: ‘అది చిడతల నాయుడికే చెల్లింది’) అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలతో 7 వేల కోట్లతో ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీటి ట్యాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆచంట నియోజకవర్గంలో 54 వేల కుటుంబాలు ఉంటే, 18 వేల ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 68 వేల ఎకరాల్లో భూమిని 12 వేల కోట్ల రూపాయల భూముల లే అవుట్లు నిర్మించి ఇచ్చామన్నారు. 175 నియోజకవర్గంలో కూడా ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. -
పెనుగొండ మాజీ ఎమ్మెల్మే చినబాబు మృతి
పెనుగొండ(ప.గో): పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చినబాబు గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పెనుగొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. చినబాబు ఇక లేరన్న వార్తతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నింపింది. 1999లో పెనుగొండ అసెంబ్లీ నుంచి స్వతంత్య అభ్యర్థిగా చినబాబు గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరిన చినబాబు.. 2014లో వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. వైఎస్పార్సీపీ ఆచంట నియోజవర్గం కన్వీనర్‌గా చినబాబు పనిచేశారు. కూనపరెడ్డి మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు..
సాక్షి, పశ్చిమగోదావరి: క్వారంటైన్‌కి వచ్చే పేషెంట్స్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశించారు. ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలని మంత్రి బుధవారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, నెగ్గిపూడి ఆచార్య ఎన్జీ రంగా రైతుభవనంలో సుమారు 400 మందికి సరిపడే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రోజురోజుకి కేసులు అధికమవుతుండటంతో నియోజకవర్గంలో ఉన్న కళాశాలలు, స్కూల్స్‌ను ప్రజలకు దగ్గరగా క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తున్నాం. నియోజవర్గ ప్రజలలో కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని, పాజిటివ్ వచ్చిన వారిని పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, క్వారంటైన్ కేంద్రాలకి తరలిస్తున్నారని అక్కడ బాధితులు పెరిగిపోవడంతో నియోజక వర్గ ప్రజలకు దగ్గరగా ఏర్పాటు చేస్తున్నాం. సోమవారం నుంచి నియోజకవర్గంలో క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. (వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్: పేర్నినాని) -
ఆచంటలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
ఆచంట ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!
సాక్షి, ఆచంట : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. నిన్నామొన్నటి వరకూ ధీమాగా ఉన్న నేతలకు సైతం కౌటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కలవరం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు ఇంకా కూడికలు తీసివేతల్లోనే ఉన్నారు. పైకి ధీమాగా ఉన్నా లోలోపల మాత్రం ఒకింత కలవరపాటు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆచంట నియోజకవర్గంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. నియోజకవర్గంలో 1,74,229 మంది ఓటర్లు ఉండగా 1,41,921 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొత్తం మీద 81.46 శాతంపోలింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ బూత్‌లలో రాత్రి పది గంటల వరకూ ఓటర్లు బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పోటీ వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే నెలకొంది. జనసేన పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉద్దండుల పోటీతో ఉత్కంఠ... నియోజకవర్గం నుంచి ఈసారి ఉద్దండులైన ఇద్దరు బరిలోఉండడంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్ సీపీ నుంచి అత్తిలి మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేయగా, టీడపీ నుంచి ఆచంట నుంచి రెండు సార్లు, పెనుగొండ నుంచి ఒక సారి గెలుపొందిన రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయ పోటీ చేశారు. ఇరువురు నేతలు కాకలు తీరిన వారే. పోల్ మేనేజ్మెంటులో ఇద్దరిదీ ప్రత్యేక శైలి. ఇద్దరూ ఆర్థికంగా బలవంతులు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆచంట సీట్ హాట్ సీట్‌గా మారింది. అందరి దృష్టి అచంట మీద పడింది. గెలుపు కోసం ఇరు పార్టీల నేతలు, కేడర్ హోరా హోరీగా తలపడ్డాయి. ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాతంగా ముగియడంతో ఇరువురు అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. గెలుపు తమదంటే తమదే అన్న ధీమా ఇరు పార్టీల్లోనూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బూత్‌ల వారీగా సమీక్షలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ విజయంపై పందేల జోరు పోలింగ్ అనంతరం ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల విజయంపై పందేలు జోరుగా సాగాయి. కౌంటింగ్ తేదీ దగ్గర పడడంతో వైఎస్సార్ సీపీ విజయం ఖాయం అంటూ జోరుగా పందేలు సాగుతున్నాయి. గెలుపు ఒక్కటే కాదు ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకూ మెజారిటీ అంటూ వైఎస్సార్ సీపీ నేతలు పందేలు ముందుకు దూకటం టీడీపీ శ్రేణులను కలవర పెడుతోంది. వైఎస్సార్సీపీ నేతల హడావుడితో టీడీపీ నేతలు ఒకటికి రెండు సార్లు బూత్‌ల వారీగా సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అంతిమ విజయం తమదే అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రధాన పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే జనసేన చీల్చే ఓట్లపై కూడా పందేలు జోరుగా సాగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో పోటీ చేసిన కుడిపూడి శ్రీనివాసరావు 16,770 ఓట్లు సాధించారు. గతంలో పీఆర్పీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు నేడు పోటీ చేసిన జనసేన అభ్యర్థికి రావని కొందరు, దాటతాయని మరి కొందరు పందేలు కాస్తున్నారు. మొత్తం మీద పందెం రాయుళ్ల హల్చల్తో ఆయా పార్టీ కేడర్‌లో గుబులు మొదలైంది. ఏది ఏమైనా ఆచంట ఫలితంపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. ఫలితాలు వెలువడే ఈనెల 23 వరకూ పార్టీ కేడర్‌కు టెన్షన్ తప్పదు మరి. -
కబ్జాకు కాదేదీ అనర్హం
సాక్షి, పెరవలి: పేదలు ప్రభుత్వ స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటేనే నానా రాద్ధాంతం చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు వారి కళ్లెదుటే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. పెరవలి మండలంలో కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ స్థలాలను టీడీపీ నేత, పెరవలి నీటి సంఘం అధ్యక్షుడే దర్జాగా ఆక్రమణలకు పాల్పడటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతే కాకుండా ఆక్రమించుకున్న స్థలం చాలదన్నట్టు కాలువను పూడ్చి గట్టును ఆక్రమించుకుని ఇటుక బట్టీ ఏర్పాటు చేసి ఇరిగేషన్ స్థలాన్ని తన సొంత జాగీరుగా అనుభవిస్తున్నాడు. మరోవైపు శ్మశానాన్ని సైతం ఆక్రమించుకుని చేనుగా మలిచాడు. కాలువగట్లను రెండువైపులా ఆక్రమించుకుని ఇళ్లు కూడా నిర్మించుకున్నాడు. ఈ అధికార పార్టీ నేత కబ్జాలో ఇరిగేషన్‌కు చెందిన సుమారు 70 సెంట్ల భూమి ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్టు వ్యవహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలువలనూ వదలని అక్రమార్కులు ప్రభుత్వ కార్యాలయాల మధ్య జాతీయ రహదారి పక్కన లక్షలాది రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ భూమి ఆక్రమణ చెరలో ఉంది. ఇరిగేషన్‌కు చెందిన రెండున్నర ఎకరాల స్థలం ఈ కాలువ పక్కనే ఉండగా అడుగడుగునా ఆక్రమణలకు గురవ్వడంతో కనీసం 10 సెంట్లు భూమి కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇది మండల కేంద్రమైన పెరవలిలో ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని విలవిల్లాడుతున్న భూపయ్య కాలువ దుస్థితి. ఈ కాలువ నర్సాపురం నుంచి పెరవలి లాకుల వద్ద మీదుగా నేరుగా ఇరగవరం మండలంలో వందలాది ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తోంది. కాలువగట్లను పూడ్చేసి ఇళ్లు నిర్మించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కాలువనే పూడ్చివేసి ఇటుకబట్టీ నిర్వహిస్తున్నాడు. ఇంత ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు. సదరు నేతపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు నెలనెలా అందుతున్న మామూళ్లే కారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 70 సెంట్లు స్వాహా ఇరిగేషన్కి చెందిన ఖాళీ స్థలం 24 సెంట్లు, కాలువగట్టు 10 సెంట్లు, ఇరిగేషన్ స్థలం మరో 20 సెంట్లు, శశాన భూమి 16 సెంట్లు మొత్తం కలిపి సమారు 70 సెంట్లు ఆనేత అధీనంలో ఉంది శ్మశాన భూమిలో ఇటుకల బట్టీ జాతీయ రహదారి పక్కన, మండల పరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని సర్వే నం.117/2ఏలో 18 సెంట్లు, 117/2సీలో 13 సెంట్లు మొత్తం 31 సెంట్లు భూమి ఉంది. కానీ జాతీయ రహదారి విస్తరణలో దీనిలో 9 సెంట్లు భూమి పోవడంతో మిగిలిన 22 సెంట్లు ఉంది. దీనిపై కన్నేసిన ఆనేత దీనిని కొద్దికొద్దిగా ఆక్రమించుకుని చేనుగా మలిచి ఇప్పడు ఇటుక బట్టీ నిర్వహిçస్తున్నాడు. కనుమరుగవుతున్న కాలువ గట్లు కాలువ గట్లు అక్రమణదారుల కోరల్లో చిక్కుకుని గట్లే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గట్లు చిక్కిపోయి నడవటానికి తప్ప, ఎటువంటి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్పుడు ఏకంగా గట్టునే కబ్జా చేసి నేరుగా సాగు చేస్తున్నారు. పెరవలి మండలంలో మూడు ప్రధాన కాలువలతో పాటు 69 పిల్ల కాలువలు ఉన్నాయి. వీటిపై మండలంలో 34,600 ఎకరాల్లో సాగు జరుగుతుండగా ఇరగవరం, పెనుగొండ, తణుకు, అత్తిలి, ఆచంట మండలాల భూముల పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పడు ఇవన్నీ ఆక్రమణల చెరలో ఉన్నాయి. ముక్కామలలో వైరు కాలువ గట్లుపై అరిటి సాగు చేస్తుంటే ఖండవల్లి వద్ద నక్కల డ్రెయిన్ కుడిగట్టును ఆక్రమించుకుని దర్జాగా బొప్పాయి, జామ సాగు చేస్తున్నారు. అన్నవరప్పాడులో బ్రాంచ్ కెనాల్ గట్లు పూర్తిగా ఆక్రమించుకోవడంతో గట్టుపై నడవటానికి తప్ప కనీసం సైకిల్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఈకాలువ గట్ల పొడవునా కొందరు రైతులు గట్లను చేలో కలుపుకోగా మరికొందరు గట్లపైనే పశువుల పాకలు వేసి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం వరకు ఈ గట్లపై ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు రాకపోకలు సాగించేవి. శివారు భూముల పంట ఉత్పత్తులను ఈ గట్ల ద్వారానే ప్రధాన రహదారి చేర్చేవారు. ఇప్పుడు గట్లు కనుమరుగవ్వటంతో శివారు భూముల రైతులు పంట ఉత్పత్తులను మోసుకురావడం తప్ప మార్గం లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్టు వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి మారుపేరు
-
చంద్రబాబు హామీల బాకీ తీర్చమని అడగండి: షర్మిల
సాక్షి, పశ్చిమ గోదావరి: ‘టీడీపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని అడగండి. మీకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి సంబంధించి.. రావాల్సిన బాకీని చెల్లించమనండి. రాష్ట్రంలో దోచుకున్న మీ భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఇలా అయితే ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీ బాకీ తీర్చలేర’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే జగనన్న అధికారంలోకి రావాలని అన్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజును, ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరంగనాథరాజును గెలిపించమని కోరారు. చంద్రబాబుకు బై బై చెప్పాలన్నారు. ఇంకా షర్మిల మాట్లాడుతూ.. ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది. ప్రతి మహిళకు నాకు అండ ఉందనే ధైర్యం ఉండేది. ప్రతి విద్యార్థికి నా చదవుకు డోకా లేదు ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఉండేది. ప్రతి పేదవాడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్య శ్రీ ఉండేది. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని ఆశపడ్డాడు. ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్ ప్రతి ఒక్కరికి మేలు చేశారు.ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసింది వైఎస్సార్ మాత్రమే. అందుకే ఆ మహానేత చనిపోయి పదేళ్లు కావస్తున్న కోట్ల మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరు. రైతులకు, మహిళలను చంద్రబాబు దగా చేశారు. డ్వాక్రా మహిళను రుణమాఫీ పేరుతో మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారా?. ఆరోగ్య శ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రికి కెళ్లి వైద్యం చేయించుకుంటుందా?. 16వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న పోలవరాన్ని తన కమిషన్ల కోసం 60వేల కోట్లకు చంద్రబాబు పెంచారు. తన బినామీల కోసం కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తానే కడతానని తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు. రాజధాని విషయంలో చాలా అనుభవం ఉంది.. హైదరాబాద్‌ను అంతా నేనే కట్టేశానని చంద్రబాబు చెప్పారు. రాజధాని గొప్పగా కబుర్లు చెప్పారు. కానీ ఒక్క శాశ్వత నిర్మాణం అయిన చేపట్టారా?. బీజేపీ ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే చంద్రబాబు రాజధానిలో చేసిందేమీ లేదు. ఆ డబ్బులు అన్ని ఎక్కడ ఉన్నట్టు?. ఆ డబ్బు చంద్రబాబు బొజ్జలో ఉన్నట్టు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు ఉంది చంద్రబాబు తీరు. ఐదేళ్లలో అమరావతిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారు. శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తానని మన చెవుల్లో పూలు పెట్టారు. క్యాబేజీలు కూడా పెడతారట. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఆయన తెలివిమంతుడు అనుకుంటే.. ఈ లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. ఈ ఐదేళ్లు లోకేశ్ కోసమే చంద్రబాబు పనిచేశారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతో అవసరం. హోదా లేకుంటే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. ఇది తెలిసికూడా చంద్రబాబు బీజేపీతో కలిసి హోదాను తాకట్టు పెట్టారు. చంద్రబాబు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి వస్తున్నారు. ఎవరికైనా టీడీపీ వాళ్లు రెండు వేళ్లు చూపెడితే మీకు రెండు నాలుకలు ఉన్నాయి నిజమేనని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్ జగన వల్లనే. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారు. బంద్‌లు చేశారు, యువభేరీలుపెట్టారు. అఖరికి వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి త్యాగం చేశారు.ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఊరురా తిరిగి హోదా కోసం పోరాడకపోతే.. ఈ రోజు చంద్రబాబు యూ టర్న్ తీసుకునేవారా?. చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా?. నాన్నగారు చెప్పారు.. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెబితే, ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ వెయ్యి ముక్కలు అవుతుందటా. అందుకే ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని లూఠీ చేశారు. మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. నారారూపరాక్షసులు వీళ్లు. తాను బస్సు డ్రైవర్ అని.. బస్సు నడపకపోతే రాష్ట్రం ముందకు వెళ్లదని చంద్రబాబు చెప్తున్నారు. ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదా బస్సును నడిపి బీజేపీకి అమ్మి డబ్బులు తీసుకున్నారు. రాజధాని బస్సును నడిపి బోల్తా కొట్టించారు. పోలవరం అనే బస్సును చంద్రబాబు నడిపితే దానిలో ఉన్న సీట్లను, టైర్లను, ఎసీలను అమ్ముకున్నారు. ఈయన బస్సు డ్రైవరైతే ఆ బస్సును నేరుగా మీ మీద నడిపించి ప్రాణాలు కూడా తీసేస్తారు. నిన్ను నమ్మం బాబు అని టీడీపీ వాళ్లకి తెల్చిచెప్పండి. టీడీపీ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. దాని ప్రకారం పిల్లల ఫీజులు చెల్లించమని అడగండి. ఆడపిల్ల పుడితే 25వేలు డిపాజిట్ చేస్తామని చెప్పారు.. చేశారా?. కాలేజ్ విద్యార్థులకు ఐ ప్యాడ్ ఇస్తామని అన్నారు.. ఇచ్చారా?. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పాడు.. ఇచ్చారా?. ఇవన్నీ మీ హక్కుగా టీడీపీని అడగండి. ఇంటికోక ఉద్యోగం అన్నాడు.. లేకపోతే రెండు వేలు ఇస్తానని వాగ్ధానం చేశారు. ప్రతి ఇంటికి చంద్రబాబు లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారు అన్నమాట. పేదలకు మూడు సెంట్ల భూమి ఇచ్చాడా?. రాష్ట్రంలో దోచుకున్న భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీకిచ్చిన బాకీ తీర్చలేరు. మళ్లీ మోసపోకండి. ఈ అవినీతి రాజ్యం పోవాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ఈ తొమ్మిదేళ్లు నీతివంతమైన రాజకీయాలు చేశారు. పాదయాత్ర 3,648 కి.మీ చేశారు. ప్రజ సమస్యలను దగ్గరగా చూశారు. వ్యవసాయం పండగ కావాలంటే, మాట తప్పనివాడు కావాలంటే, మడమతిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. ప్రతి రైతు తలెత్తుకునేలా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులను ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు.కరువులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా నాలుగు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్, మెస్ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. అవ్వ తాతలకు పింఛన్ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తూ.. ప్రతి విషయంలో వారికి అండగా నిలుస్తాం. సమస్య లేకుండా.. మీ సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. ఎరువుల ప్యాక్టరీ రాకుండా చూస్తాం. మళ్లీ దుర్మార్గపు పాలన మనకు అవసరం లేదు. హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనే ఉంచుకుని కేసీఆర్‌తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారు. తమకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు అందరినీ వెంట పెట్టుకుని వస్తున్నారు. చంద్రబాబుకు బాయ్ బాయ్ చెప్పమ’ని కోరారు. -
నవరత్నాలే అస్త్రం
సాక్షి , ఆచంట: సీనియర్ పొలిటీషియన్‌గా, రాజకీయ వ్యూహకర్తగా, విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన శ్రీరంగనాథరాజు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. 24 ఏళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న ఆయన జిల్లా ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం ఆయన ఆచంట నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలో దిగారు. ఆయన మనోగతం.. ప్రశ్న : మీరు రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తి ? రంగరాజు : మా తాతగారైన శివరామరాజు 30 ఏళ్ల పాటు మాస్వగ్రామమైన యండగండికి సర్పంచ్‌గా పనిచేశారు. ఎంతో అభివృద్ధి చేశారు. మా నాన్న, పెదనాన్న రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మా తాతగారి ప్రభావం నాపై పడింది. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా. ప్రశ్న : సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారుగా? రంగరాజు : అవును. జిల్లావ్యాప్తంగా ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. రాజకీయ రంగంలో మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందనే రాజకీయ రంగంలోకి వచ్చా. ప్రశ్న : ప్రజల ఆదరణ ఎలా ఉంది? రంగరాజు : అనతి కాలంలోనే తనను అక్కున చేర్చుకున్నారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. కష్టజీవులు. ఇప్పుడు ఏగ్రామం వెళ్లినా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రశ్న : గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? రంగరాజు : ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే నా విజయం నూటికి నూరు శాతం ఖాయం. నా విజయం కోసం ప్రజలే స్వచ్ఛందంగా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవలే సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లు అందించాం. ప్రజలకు సదుపాయాలూ కల్పించాం. దీంతో నాపై ఓటర్లకు నమ్మకం కలిగింది. ప్రశ్న : అత్తిలిలో చేసిన పనులు మీ విజయానికి ఎంతవరకూ దోహదపడతాయి? రంగరాజు: పెళ్లి చేసేటప్పుడు ఎలా అయితే అన్నీ విచారించి చేస్తామో.. అలాగే నా గురించి కూడా అత్తిలి నియోజకవర్గ ప్రజలను కూడా విచారించి ఓటేయాలని కోరుతున్నా. ఆచంట నియోజకర్గాన్ని కూడా ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. దీనికోసం రంగం సిద్ధమైంది. ప్రశ్న : నియోజకవర్గ సమస్యలు తెలుసా? రంగరాజు: ప్రధానంగా ఇళ్లస్థలాల సమస్య అధికంగా ఉంది, అందరికీ స్థలాలతోపాటు ఇళ్లు కట్టించి ఇస్తా. డ్రెయినేజీ, సాగునీటి సమస్యలు అయోధ్యలంక అనగారలంక గ్రామాల ప్రజలకు వంతెనలు నిర్మిస్తా. గోదావరి విద్యావికాస్ ట్రస్టు ద్వారా డాక్టర్లను నియమించి వైద్యసేవలు అందిస్తా. విద్యాప్రమాణాల పెంపులో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తా. ప్రశ్న : మీ అంతిమ లక్ష్యం? రంగరాజు : ప్రజలకు సేవ చేయడమే నా అంతిమ లక్ష్యం. తుది శ్వాస వరకూ ప్రజలకు సేవా చేస్తా. సేవా కార్యక్రమాలే నాకు శ్రీరామ రక్ష. -
పోరాటాల కోట..ఆచంట
సాక్షి, ఆచంట : గలగల పారే గోదావరి.. నది మధ్యలో చిన్న చిన్న దీవుల్లా ఉండే లంకలు.. పచ్చని పంట పొలాలు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.. ఆహ్లాదకర వాతావరణం ఇమిడి ఉండే గ్రామీణ నియోజకవర్గం ఆచంట. పల్లె ప్రాంతమైనా ఇక్కడి ప్రజలు పట్టణవాసులకు దీటుగా రాజకీయ చైతన్యం కలిగిన వారు. ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట. అందుకే ఉద్యమాలకు పుట్టినిల్లుగా చెబుతుంటారు. ఏ ప్రజాపోరాటం జరిగినా ఇక్కడి వాసులు ముందుంటారు. నరసాపురం డివిజన్లో చరిత్ర ప్రసిద్ధమైన కాళీపట్నం, వ్యవసాయకూలీ, ఆకలియాత్ర తదితర ఉద్యమాలలో ఈ ప్రాంతవాసులు ప్రధాన భూమికను పోషించారు. ఒక ప్రేరేప మృత్యుం జయుడు.. ఒక తాళ్ల బసవమల్లయ్య వంటి కామ్రేడ్లు అసువులుబాసిన గడ్డ ఇది. రాజకీయ చరిత్ర... పాలకొల్లు నియోజకవర్గం నుంచి విడిపడి 1962లో ఆచంట నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకూ ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. పునర్విభజనలో 2009లో జనరల్ నియోజకవర్గంగా మారింది.ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. ఇప్పటి వరకూ నియోజవర్గంలో 12సార్లు ఎన్నికలు జరగ్గా అన్ని ప్రధాన పార్టీలను గెలిపించి నియోజకవర్గ ఓటర్లు తమ విలక్షతను చాటుకున్నారు. భౌగోళిక స్వరూపం నియోజకవర్గం 286 చదరపు కలోమీటర్లలో విసిరించి ఉంది. తూర్పున వశిష్ట గోదావరి, పడమర భీమవరం, తణుకు నియోజకవర్గాలు, దక్షిణాన పాలకొల్లు, ఉత్తరాన నిడదవోలు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆచంట మండలంలో 12, పెనుగొండ మండలంలో 14, పెనుమంట్ర మండలంలో 18, పోడూరు మండలంలో 8 గ్రామాలు కలిపి 52 గ్రామాలతో నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. జనాభా : 2,30,028 పురుషులు : 1,15,572 మహిళలు : 1,14,456 ఓటర్లు : 1,66,421 పురుషులు : 82,547 మహిళలు : 83,866 ఇతరులు : 08 రవాణా సౌకర్యాలు ఆచంట నుంచి 8 కిలోమీటర్ల దూరంలో సిద్ధాతం గ్రామంలో ఎన్‌హెచ్–5 జాతీయ రహదారి ఉంది. ఆచంటకు 16 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు, రైల్వేస్టేషన్, 25 కిలోమీటర్లదూరంలో తణుకు, నియోజకవర్గ శివారు గ్రామమైన నత్తా రామేశ్వరం నుంచి మరో మూడు కిలోమీటర్ల దూరంలో మంచిలి రైల్వే స్టేషన్ ఉంది. ఆచంట మండలం కోడేరు గ్రామంలోని గోదావరి పడవపై దాటితే తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం చేరుకోవచ్చు. అక్కడి నుంచి అమలాపురం 20 కిలోమీటర్లు దూరం. జాతీయ రహదారిని చేరి ఉండడంతో సిద్ధాంతం చేరుకుంటే అక్కడి రాష్ట్రంలోని ఏప్రాంతానికైనా చేరుకోవచ్చు. ప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక కేంద్రాలు నియోజకవర్గం పర్యాటక కేంద్రంగానూ ఆధ్యాత్మిక కేంద్రంగానూ భాసిల్లుతోంది. ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆచంటేశ్వరస్వామి, జైన దేవాలయం, ప్రసిద్ధిగాంచిన పెనుగొండలోని శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరి ఆలయం, వాసవీధామ్, పెదమల్లంలోని మాచేనమ్మ అమ్మవారు, పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలోని నత్తా రామేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి. ప్రధాన సమస్యలివీ.. అక్షర క్రమంలో ముందున్న ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. లంక గ్రామాల పరిస్థితి మరీ దయనీయం. వీటిని చేరుకోవాలంటే పడవలను ఆశ్రయించక తప్పదు. లంక గ్రామాలను కలుపుతూ గోదావరిపై వంతెనలు నిర్మిస్తామని పాలకులు హామీలు ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు. లంక గ్రామాల అభివృద్ధి అంతా వంతెనలతోనే ముడిపడి ఉంది. కోడేరు నుంచి తూర్పు గోదావరి జిల్లా గన్నవరం వరకూ గోదావరిపై వంతెన నిర్మాణం కలగా మారింది. ఇది నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. బ్యాంకు కెనాల్‌పై ఆధార పడి దాదాపు 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది .ఏటా దాళ్వాలో శివారు ప్రాంతాల వారు సాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల ప«థకం నిర్మించాలని కోరుతున్నా తాత్కాలిక లిఫ్టు ఏర్పాటు చేసి పాలకులు చేతులు దులుపుకున్నారు. ఆచంటలో అగ్నిమాపక కేంద్రం, బస్టాండ్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం పరిష్కారానికి నోచుకోలేదు. నియోజకవర్గంలో వందలాది మంది లబ్ధిదారులు ఇళ్లస్థలాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆచంటలో రూ.14 కోట్లతో చేట్టిన సమగ్ర రక్షిత నీటి పథకం ఏళ్ల తరబడి పూర్తి కాలేదు. దీంతో కోడేరు, కుందరవల్లి, కరుగోరుమిల్లి, పెదమల్లం తదితర గ్రామాల్లో తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆచంటలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన సీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడంలేదు. రోగులు అవస్థలు పడుతున్నారు. వైఎస్ చరిష్మాతో ..దేశం కంచుకోటకు బీటలు ఆచంట నియోజవర్గం 1962లో ఏర్పడింది. 2004 వరకూ రిజర్వుడు నియోజకవర్గంగా కొనసాగింది. 1962 నుంచి 1978 వరకూ నియోజకవర్గంలో పోరు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యే సాగింది. టీడీపీ ఆవిర్భావంతో ఆచంట ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1983 నుంచి 2004 వరకూ ఆరు సార్లు టీడీపీ, ఆపార్టీ బలపర్చిన సీపీఎం అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. 1983లో టీడీపీ నుంచి కోట భాస్కరరావు గెలిచారు. 1985 నుంచి 1994 వరకూ సీపీఎం, టీడీపీ పొత్తులలో భాగంగా ఇక్కడి సీటు సీపీఎంకు కేటాయించారు. 1985లో సీపీఎం అభ్యర్థి అలుగు చిత్తరంజన్, 1989, 94 ఎన్నికలలో సీపీఎం అభ్యర్థి దిగుపాటి రాజగోపాల్ గెలిచారు. 1999లో సీపీఎంతో పొత్తు చెదరడంతో టీడీపీ అభ్యర్ధి మోచర్ల జోహర్వతి గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి పీతల సుజాత గెలుపొందారు. 2009 పునర్విభజనలో జనరల్‌గా మారిన ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీ అభ్యర్థి పితాని సత్యనారాయణను బరిలోకి దించి దేశం కంచుకోటలో పాగావేశారు. 1983 నుంచి కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా ఉన్న ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను ఎగురవేయించారు. జనసేన ఆవిర్భావంతో త్రిముఖ పోటీ జరిగినా ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. -
వాటర్ ప్లాంట్ నిర్మాణం అభనందనీయం: వైవీ
ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం అయోధ్యలంక గ్రామస్తుల తాగునీటి కష్టాలను ఆచంట వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తీర్చారు. గోదావరి మధ్యలోనే గ్రామమున్నా అనేక దశాబ్దాలుగా అయోధ్యలంక గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసి అయోధ్యలంక గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. గ్రామంలో రూ.8 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మించి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ..వెనకబడిన లంక గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత నిధులతో శ్రీరంగనాథ రాజు అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. అలాగే అయోధ్యలంకలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. -
జగన్ యూత్ ఫోర్స్ ఆవిర్భావం
ఆచంట : ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేందుకు విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరిట ఆచంటలో జగన్ యూత్ ఫోర్స్ ఆవిర్భవించింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని యూత్ ఫోర్స్ సభ్యులను కోరారు. జగన్ యూత్ ఫోర్స్ కమిటీ అధ్యక్షుడు వైట్ల కిషోర్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతను చైతన్యపర్చి ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తామని, సేవా కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కౌరు శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర యువజన కార్యదర్శి కారుమంచి రమేష్ చౌదరి పాల్గొన్నారు. కమిటీ సభ్యులుగా ఆరుపల్లి అశోక్, పాలసత్తి రామిరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, చింతపల్లి గనిరాజు, పిల్లి రుద్రప్రసాదు, నంబూరి సుబ్రహ్మణ్యం, అరిగెల సురేష్‌బాబు, దొంగ శ్రీనివాసు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ నేతలు వైట్ల కిషోర్‌కుమార్‌ను అభినందించారు. -
సొసైటీలో కుంభకోణంపై విచారణకు ఆదేశం
ఏలూరు (మెట్రో) : ఆచంట మండలం వల్లూరు సహకార సొసైటీలో అవినీతి కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా సహకార అధికారి లూథర్‌ను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వల్లూరుకు చెందిన రాములు కలెక్టర్‌కు ఫోన్ చేసి సొసైటీలో నిధులు దుర్వినియోగమయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకుని సొసైటీని రక్షించాలని కోరాడు. కలెక్టరేట్లో విధులు నిర్వహించి రిటైర్ అయిన సాంబశివరావు అనే ఉద్యోగి తనకు పెన్షన్ బెనిఫిట్స్ ఇంకా అందలేదని ఫిర్యాదు చేయగా జిల్లా రెవెన్యూ అధికారిని కలవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఏఎంసీ పోస్టుల భర్తీ
ఆచంట: ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న ఆచంట, పెనుగొండ ఏఎంసీల నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఈమేరకు మార్కెటింగ్ శాఖ కమీషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆచంట ఏఎంసీ ఛైర్మన్‌గా ఉప్పలపాటి సురేష్‌బాబు, వైఎస్ ఛైర్మన్‌గా రుద్రరాజు సీతారామరాజు(రవిరాజు), పెనుగొండ ఏఎంసీ ఛైర్మన్‌గా సానబోయిన గోపాలకష్ణ, వైఎస్ ఛైర్మన్‌గా బడేటి బ్రహ్మజీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో ఈరెండు పాలకవర్గాలకు సబంధించి ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల తర్వాత కీలకమైన నామిటేటెడ్ పోస్టులు భర్తీకావడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెనుగొండ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎంపిక చేసిన అభ్యర్థులనే ప్రకటించంటం పట్ల పట్ల ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఘాటు తగ్గిన మిర్చి
– ధర పతనంతో రైతుల కుదేలు – గత సీజన్లో పది కిలోలు రూ. 500 – ప్రస్తుతం రూ.80 – కూలి ఖర్చులు కూడా రాక వదిలేస్తున్న రైతులు ఆచంట : అన్నదాతను కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అయితే అతివష్టి లేకపోతే అనావష్టి. రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పడిస్తున్నా ఫలితం మాత్రం పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దిగుబడులు బాగుంటే ధరలు ఉండటం లేదు. ధర ఉంటే ప్రకతి వైపరీత్యాలు తెగుళ్లు. ప్రతి సీజన్లోనూ రైతుకు ఏదో ఒక విధంగా ఆపద వచ్చి పడుతూనే ఉంది. ఈసారి పచ్చిమిర్చి పండించిన రైతులదీ ఇదే దుస్థితి. జిల్లాలో 3,500 వేల ఎకరాల్లో సాగు ఈ వేసవిలో పచ్చిమిర్చి ధర హోల్‌సేల్ మార్కెట్లో పది కేజీలు రూ. 400 నుంచి రూ.500 పలికింది. ధర బాగుండడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో రైతులు మిర్చి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపారు. ప్రస్తుతం జిల్లాలో 3,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గోదావరి తీరప్రాంతంలోని మండలాలు, లంక భూములతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో ఎక్కువగా మిర్చిని సాగు చేస్తున్నారు. ధర పతనం.. రైతుల దైన్యం మిర్చి ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పతనమైంది. వేసవి సీజన్లో పది కేజీలు రూ.400 పైగా పలకగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరితో పోలిస్తే పచ్చిమిర్చి ఖర్చుతో కూడిన సాగు. ఎకరాకు సుమారు రూ.40 వేలుపైనే ఖర్చవుతుంది. నెలా 15 రోజుల వరకూ పంట కాపుకు రాదు. దాదాపు నాలుగు నెలల వరకూ కోతలు కోయవచ్చు. రైతులు ఆశించినట్టుగానే ఈసారి మిర్చిసాగు ఆశాజనకంగానే ఉంది. చీడ పీడల ప్రభావం ఉన్నా అది దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపలేదు. గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. ఎకరాకు మూడు క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్లను ముంచెత్తింది. దీంతో ధరలు నేలచూపులు చూశాయి. మొక్కలనే కాయలు వదిలేస్తున్న రైతులు ప్రస్తుతం మార్కెట్లో పలుకుకుతున్న ధరలు చూస్తుంటే మిుర్చి కోయకుండా వదిలివేయడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. పంటను నెలకు మూడుసార్లు వరకూ కోత కోస్తారు. ఎకరాకు కనీసం ఆరుగురు కూలీలను వినియోగిస్తే రెండు రోజులపాటు కోత సాగుతుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.200 చెల్లించాలి. రెండు రోజుల పాటు కోత సాగితే రూ.2,400 కోత కూలి ఖర్చు అవుతుంది. దిగుబడి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకూ వస్తోంది. మార్కెట్లో క్వింటాల్ రూ.700– రూ.800 మధ్య పలుకుతోంది. మూడు క్వింటాళ్లకు రూ.2,100 నుంచి రూ.2,400లోపు ఆదాయం వస్తోంది. లాభం సంగతి అలా ఉంచితే రవాణా ఖర్చులకు చేతి సొమ్ము వదులుతోంది. రెండు రోజుల శ్రమా వథాగా మారుతోంది. దీంతో రైతులు ఎందుకొచ్చిందిలే అని తయారైన కాయలను మొక్కలనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం పరువుకోసం పంటను కోస్తున్నారు. దళారుల దందా ఆరుగాలం శ్రమించిన రైతులకు ఏమీ మిగలకపోయినా దళారులు మాత్రం దండుకుంటున్నారు. రైతుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్న కమీషన్‌దారులు చిరు వ్యాపారులకు పది కేజీలు రూ.120 వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులు చిల్లరగా కేజీ రూ.20 చేసి విక్రయాలు సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా సాగు చేస్తున్నా ఇతడు పెనుగొడం మండలం మదనగూడెంకు చెందిన కౌలు రైతు కుడిపూడి వెంకటేశ్వరరావు. 30 ఏళ్లుగా పచ్చిమిర్చి సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది 8 కుంచాల్లో సాగు చేశాడు. ఎకరాకు 35 బస్తాలు మక్తా చెల్లించేలా రైతుతో ఒప్పందం చేసుకున్నాడు. అప్పులు చేసి 30 వేలకుపైనే పెట్టుబడులు పెట్టాడు. పంట బాగా పండింది. దిగుబడులు బాగున్నాయి. కోసిన కాయలు సిద్ధాంతం మార్కెట్‌కు తీసుకెళితే పది కేజీలు రూ.70 చేసి కొనుగోలు చేశారు. దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధర లేదని కమీషన్ వ్యాపారులు చెప్పుకొచ్చారు. కనీసం కూలీలకు కూడా సొమ్ములు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లాభం రాకున్నా పరువు పోకూడదని సాగు చేస్తున్నానని ఆవేదనతో చెప్పారు. ‘ కుడిపూడి వెంకటేశ్వరరావు, మదనగూడెం, పెనుగొండ మండలం -
యువతిని అశ్లీలంగా చిత్రీకరించి...
ఆచంట: భర్త చెడుమార్గంలో నడిస్తే సరిద్దాల్సిన భార్యే అతడికి వంతపాడింది. ఓ యువతిని అశ్లీలంగా చిత్రీకరించి.. కామ వాంఛలు తీర్చుకునేందుకు సహకరించింది. అంతేకాకుండా వ్యభిచారం చేయాలని ఆ యువతిపై ఆ భార్యాభర్తలిద్దరూ ఒత్తిడి తెచ్చారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో గురువారం వెలుగు చూసింది. పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. ఆచంట పంచాయతీ పరిధి కొత్తూరు ప్రాంతానికి చెందిన నెక్కంటి శ్రీనివాస్, సుశీల భార్యాభర్తలు. అదే ప్రాంతానికి చెందిన, డిగ్రీ చదువుతున్న ఓ యువతి తరచూ వారి ఇంటికి వస్తుండేది. గతేడాది మే 1న సాయంత్రం ఆ యువతి శ్రీను ఇంటికి వెళ్లింది. శ్రీను దంపతులు పథకం ప్రకారం ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతితో భర్త అశ్లీలంగా వ్యవహరించిన తీరును స్వయంగా భార్యే సెల్ఫోన్లో చిత్రీకరించింది. అప్పటినుంచి వారిద్దరూ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మాట వినలేదని వెలివేశారు
పసిబిడ్డలకు పాలు కూడా అమ్మొద్దని తీర్మానించారు ఆచంటలో నాలుగు కుటుంబాలపై సంఘ బహిష్కరణ వేటు అధికారులను ఆశ్రయించిన బాధితులు ఆచంట : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పంచాయతీ పరిధిలోని వంగతాళ్ల చెరువు గ్రామంలో సంఘ పెద్దలు నాలుగు కుటుంబాలను వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘ పెద్దలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండకపోవడంతో గ్రామానికి చెందిన కేతా ఏసు, కుడుపూడి నరసింహరావు, గుబ్బల విష్ణుమూర్తి, కుడుపూడి సత్యనారాయణ కుటుంబాలపై ఆ గ్రామానికి చెందిన పెద్దలు సంఘ బహిష్కారం విధించారు. ఈ నాలుగు కుటుంబాల్లో జరిగే మంచి చెడు కార్యక్రమాలకు ఎవరూ వెళ్లకూడదని, వారితో ఎవరైనా మాట్లాడితే రూ.3 వేలు తప్పు (జరిమానా) చెల్లించాలని తీర్పు వెలువరించారు. వెలి వేయబడ్డ కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులతో పాటు కిరాణా సరుకులు కూడా అమ్మకుండా బంద్ చేశారు. వారి ఇళ్లకు కేబుల్ కనెక్షన్లు కట్ చేశారు. చివరకు ఆ కుటుంబాల్లోని చిన్నారులకు పాలు కూడా పోయకుండా చేశారు. తమకు జరిగిన అన్యాయంపై గ్రామ కుల సంఘం నుంచి మండల కుల సంఘం వరకూ వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జరిమానా చెల్లించలేదని.. సంఘ పెద్దలు విధించిన జరిమానా చెల్లిచకపోవడం, ఆక్రమిత భూములను సంఘానికి అప్పగించకపోవడమే వెలికి ప్రధాన కారణమని బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం.. గ్రామంలో సుమారు నాలుగు ఎకరాల రెవెన్యూ పోరంబోకు స్థలం ఉంది. ఈ భూమిని గ్రామస్తుల్లో కొందరు తలో కొంత ఆక్రమించుకుని కొబ్బరి మొక్కలు పెంచుతూ ఫలసాయం అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. అయితే గ్రామానికి ఆనుకుని ఉన్న ఆరుగురికి చెందిన భూములను రామాలయానికి ఇవ్వాలని కోరుతూ సంఘం తీర్మానించింది. ఈ విషయమై మూడేళ్లుగా సంఘ పెద్దలకు లబ్ధిదారులకు మధ్య వివాదం నడుస్తోంది. చివరకూ మగ్గురు లబ్ధిదారులు స్థలానికి బదులుగా ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున సంఘానికి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కేతా ఏసు, కుడుపూడి నరసింహరావు, గుబ్బల విష్ణుమూర్తిలకు చెందిన స్థలాలను మాత్రం సంఘం స్వాధీనం చేసుకుంది. ఈ విషయమై నియోజకవరార్గనికి చెందిన ఒక ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ పెట్టారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రజాప్రతినిధి చేసిన సూచన మేరకు ఈనెల 2న పాలెంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంలో సంఘ పెద్దలు, బాధిత కుటుంబాల వారు దూషణలకు దిగారు. దీనిపై కేతా ఏసు, కుడుపూడి నరసింహరావు, గుబ్బల విష్ణుమూర్తి, కుడుపూడి సత్యనారాయణలకు రూ.500 చొప్పున సంఘ పెద్దలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించేందుకు ఆ నలుగురు నిరాకరించడంతోపాటు ఆక్రమిత భూములను సంఘానికి ఇవ్వలేదనే కారణాలతో తమపై సంఘ బహిష్కారం విధించి వెలి వేశారని నాలుగు కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాతో ఎవరూ మాట్లడటం లేదు ఏళ్ల తరబడి అనుభవిస్తున్న పోరంబోకు భూమిని సంఘం ద్వారాఆలయం కోసం ఇవ్వాలని సంఘ పెద్దలు చెప్పారు. దీనికి నిరాకరించాం. సంఘ సమావేశం పెట్టి మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించారు. మా తప్పు లేకపోయినా సంఘ పెద్దలు జరిమానా విధించారు. భూమి ఇవ్వకపోవడం, జరిమానా చెల్లించకపోవడంతో వెలివేశారు. మాతో మాట్లాడితే రూ.3 వేలు జరిమానా విధిస్తామని చెప్పడంతో ఎవరూ మాట్లాడటం లేదు. కేబుల్ కనెక్షన్లు కట్ చేశారు. గ్రామానికి చెందిన ఎరువులు పురుగు మందుల డీలర్ చేలకు మందులు కూడా ఇవ్వడం లేదు. - కేతా ఏసు, బాధితుడు చిన్న పిల్లలన్న కనికరమైనా లేదు చిన్నపిల్లలు కిరాణా కొట్టు దగ్గరకు వెళ్లి సరుకులు ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదు. కనీసం మా కుటుంబాల వారికి పాలు కూడా పోయనివ్వడం లేదు. మా పాపను అంగన్వాడీ సెంటర్‌కు కూడా తీసుకు వెళ్లడం లేదు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం. మా పుట్టింటికి వెళ్లిపోదామని అనుకుంటున్నాను. - కుడిపూడి తనూజ, బాధితురాలు -
బస్సు - ఆటో ఢీ: 14 మందికి గాయాలు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి వద్ద శనివారం స్కూల్ బస్సు ... ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో స్కూల్ బస్సు ఆటోను ఢీ కొట్టింది. స్కూల్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు
ఏలూరు: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఇబ్బందులెదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో వర్షాలకు కూలిన విద్యుత్ స్తంభాలు కూలిపోడంతో కందరవల్లి, కాంబొట్లపాలెం, అయోధ్యలంక, వల్లూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భీమవరంలో రోడ్లు జలమయం అయ్యాయి. హౌసింగ్ బోర్డు కాలనీ, ఆర్టీసీ డిపోలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్టప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దేవరపల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.