Advisory Committee
-
Bangladesh Political Crisis: బంగ్లా సారథిగా యూనుస్
ఢాకా: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(84)ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు. ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైనది. గురువారం అధ్యక్ష భవనం ‘బంగభవన్’లో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. యూనుస్‌కు 16 మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది. ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్తోపాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులున్నారు. వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. పౌరులకు భద్రత కలి్పంచడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు తనకు సాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు. -
సలహా బోర్డు అనుమతిస్తే.. 3 నెలలకుపైగా నిర్బంధించొచ్చు
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధానికి సరైన కారణం ఉందని అడ్వైజరీ బోర్డు అభిప్రాయపడిన సందర్భాల్లో.. ‘ 3 నెలలకు మించి ముందస్తు నిర్బంధంలో ఉంచరాదు’ అనే నిబంధన వర్తించబోదని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. గత ఏడాది ఆగస్టులో తనను అరెస్ట్‌చేశారని, కాకినాడ జిల్లా మేజి్రస్టేట్ ఇచ్చిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వు చెల్లదంటూ పెసల నూకరాజు అనే వ్యక్తి ఆంధ్రపదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయగా దానిని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆయనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. ‘ ముందుస్తు నిర్బంధం సహేతుకమని అడ్వైజరీ బోర్డు భావిస్తే మూడునెలలకు మించి కూడా సంబంధిత వ్యక్తులను నిర్బంధంలో కొనసాగించవచ్చు. నిర్బంధం మూడు నెలలకు మించకూడదనే నిబంధన ఇలాంటి సందర్భాల్లో వర్తించదు’ అని కోర్టు తీర్పు చెప్పింది. ‘కింది కోర్టు ఉత్తర్వుల్లో ఇంతకాలం నిర్బంధించండి అని పేర్కొంటే అంత కాలానికే నిర్బంధంలో ఉంచుతారు. ఒకవేళ కాలావధిని కోర్టు పేర్కొనకపోతే ఆ వ్యక్తిని గరిష్టకాలం(12 నెలలు) నిర్బంధంలో ఉంచుతారు. నిర్బంధ ఉత్తర్వులొచ్చాక ప్రతీ మూడు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వును సమీక్షించాల్సిన అవసరంలేదు’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
ప్రభుత్వ శాఖల్లో న్యాయ వివాదాల సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: వివిధ శాఖల్లో పెరిగిపోతున్న న్యాయ వివాదాలను వేగంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం లీగల్ మేనేజ్మెంట్ యూనిట్ (ఎల్ఎంయూ), లీగల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ (ఎల్ఎంవో) పేరుతో రెండు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయ కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ లీగల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (ఓఎల్‌సీఎంఎస్) ఏర్పాటు చేసిన తర్వాత నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఆర్థికపరమైనవే. వీటికి న్యాయపరంగా పాటించాల్సిన ప్రోటోకాల్స్, పరిష్కారం తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన లేకపోవడం కారణంగా గుర్తించింది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్) లీగల్ మేనేజ్మెంట్ యూనిట్, లీగల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ సహాయం తీసుకోనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎల్ఎంయూ, ఎల్ఎంవో విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఎల్ఎంయూ సీనియర్, జూనియర్ న్యాయ విశ్లేషకులు, పోగ్రామ్ మేనేజర్, డేటా ఎనలటిక్స్ సభ్యులతో లీగల్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇది ఏపీసీఎఫ్ఎస్ఎస్కి గవర్నెన్స్ కన్సల్టెన్సీ వింగ్‌గా పనిచేస్తుంది. వివిధ శాఖల్లో న్యాయపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఓఎల్సీఎంఎస్ను సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. న్యాయ శాఖ అధికారుల సూచనలతో ప్రతి విభాగంలో లిటిగేషన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, టెంప్లెట్స్, అధికారులకు సూచనలు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఎల్ఎంయూకు అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అడ్వొకేట్ జనరల్ కో చైర్‌పర్సన్‌గా ఉండే ఈ అడ్వైజరీ కమిటీలో రెవెన్యూ, ఆర్థిక, పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హోం, పాఠశాల విద్య, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శులు, ఫైనాన్స్, జీఏడీ కార్యదర్శులు, ఓఎల్‌సీఎంఎస్ నోడల్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. న్యాయ శాఖ కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమై అన్ని విభాగాల్లో అమలవుతున్న ప్రాజెక్టులు, వాటి పనితీరు, న్యాయపరమైన ఇబ్బందులు వంటి వాటిని గుర్తించి పరిష్కరించాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా వివిధ శాఖల విభాగాధిపతులతో కూడిన 12 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై పర్యవేక్షిస్తుండాలి. ఎల్ఎంవో సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఎల్ఎంయూ సహకారం అందిస్తుంది. న్యాయపరంగా కేసులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, అధికా రులు, ప్రభుత్వ ప్లీడర్లు, ఏజీ కౌన్సిల్ ఆఫీసర్ల సమాచారం త్వరతగతిన చేరేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఎల్ఎంవోగా ప్ర ముఖ న్యాయసేవల సంస్థ దక్ష సొసైటీ వ్యవహరించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
ఐటీ టూల్స్ దేశానికే ఆదర్శం
సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు (మెట్రో): పన్నుల విధింపులో అధికారుల తప్పిదాలు, ప్రభావం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చేసిన టూల్స్ దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. స్థానిక ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ ద్వారా వ్యాపారులకు అనువైన సంస్కరణలు, వెసులుబాట్లు తెచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన గుర్తు చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడారు. పన్నులకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల పరిష్కారంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. డిపార్ట్మెంట్కు, డీలర్‌కు మధ్య మంచి సంబంధాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణం రాష్ట్రంలో వివిధ శాఖల భవనాలను నిర్మించేందుకు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ ప్రమాణాలను పాటిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఏలూరులో రూ.10 కోట్లతో నిర్మించిన జిల్లా సమీకృత ఆర్మింక భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో నూతన భవనాల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేశామన్నారు. -
ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు... కీలక పదవులు
వాషింగ్టన్: మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈఓ మనీశ్ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది. ‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
బైడెన్ సలహా కమిటీలో ఇద్దరు భారతీయ అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇద్దరు భారతీయ అమెరికన్లను తమ వాణిజ్య విధానం, చర్చల సలహా కమిటీలో నియమించారు. వారిలో ఒకరు ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి, మరొకరు నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈవో మనీష్ బాప్నా. ప్రెసిడెంట్ నియమించిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ సిఫార్సు చేసినవారు 45 మంది వరకు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వాణిజ్యం, పెట్టుబడి, అభివృద్ధి అంశాలలో నైపుణ్యం కలిగి వారు, ఫెడరల్ ప్రభుత్వాలకు సంబంధం లేని కార్మిక, పరిశ్రమ, వ్యవసాయం, స్మాల్ బిజినెస్, సేవల ప్రతినిధులను ఇందులో సభ్యులుగా నియమిస్తారు. పరిశ్రమలు, రిటైలర్లు, ప్రభుత్వేతర పర్యావరణ, పరిరక్షణ సంస్థలు, వినియోగదారుల సంస్థలకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం ఉంటుంది. వరుసగా నాలుగు సార్లు పవర్ఫుల్ బిజినెస్ వుమెన్ ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ వ్యూహాత్మక దిశను రూపొందించి తయారీ రంగంలో కొత్త శకాన్ని నిర్వచిస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఫ్లెక్స్‌కు ముందు అద్వైతి ఈటన్ కంపెనీ ఎలక్ట్రికల్ సెక్టార్ వ్యాపారానికి ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చేశారు. అమెరికాస్, హనీవెల్‌లో కూడా పని చేసిన ఆమె ఉబెర్, కేటలిస్ట్ కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా సేవలందించారు. అద్వైతి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ సీఈవో కమ్యూనిటీకి ఉపాధ్యక్షత వహిస్తున్నారు, సీఈవో క్లైమేట్ లీడర్స్ డబ్ల్యూఈఎఫ్ అలయన్స్‌లో చేరారు. రేవతి వరుసగా నాలుగు సార్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన వ్యాపార జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే భారత్‌లోని బిజినెస్ టుడే సంస్థ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఎంపికయ్యారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఆమె థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. పర్యావరణ రంగంలో విశేష అనుభవం దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా అనేక ముఖ్యమైన పర్యావరణ మైలురాళ్లు, పర్యావరణ చట్టాల రూపకల్పన వెనుక మనీష్ బాప్నా ప్రెసిడెంట్, సీఈవోగా ఉన్న నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్ఆర్డీసీ) ఉందని వైట్ హౌస్ తెలిపింది. మనీష్ బాప్నా 25 ఏళ్ల అనుభవంలో పేదరికం, వాతావరణ మార్పుల మూలాలను కనుగొనేందుకు విశేష కృషి చేశారు. ఆయన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆర్థికవేత్త కూడా అయిన మనీష్ బాప్నా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో న్యాయవాద వృత్తిని కొనసాగించే ముందు మెకిన్సే అండ్ కంపెనీ, ప్రపంచ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బిజినెస్‌తో పాటు పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఆయన మాస్టర్ డిగ్రీలు పొందారు. అంతకుముందు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. -
భారతీయుల అమెరికా వీసా ప్రక్రియలో పురోగతి
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న భారతీయుల ఇబ్బందుల్ని తొలగించేందుకు అధ్యక్ష అడ్వైజరీ కమిషన్ చేసిన సిఫార్సులను ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆచరణలో పెడుతోంది. భారతీయుల వీసా దరఖాస్తులను విదేశాల్లోనూ త్వరగా తేల్చేలా అదనంగా దౌత్య కార్యాలయాలు, కౌంటర్లు తెరుస్తున్నారు. కోవిడ్ అనంతరం ప్రయాణ ఆంక్షలు తొలగించాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడటం తెల్సిందే. అమెరికాలో అభ్యసించనున్న విద్యార్థులు, పర్యటించే సందర్శకులు చాలాకాలంపాటు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రెసిడెన్షియల్ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా వ్యాఖ్యానించారు. భారతీయ వీసా దరఖాస్తుదారులకు ప్రపంచంలో ఏ దేశంలో కుదిరితే ఆ దేశం నుంచే అక్కడి అమెరికా ఎంబసీ సిబ్బంది వర్చవల్‌గా ఇంటర్వ్యూలు చేసి వీసా జారీ/నిరాకరణ ప్రక్రియను పూర్తిచేయడంలో సాయపడతారు. విదేశాల్లోని అమెరికా ఎంబసీల్లో ఎక్కువ వీసా అపాయ్మెంట్ కౌంటర్లను తెరుస్తారు. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటారు. ఎంబసీల్లో కొత్తగా సిబ్బందిని నియమించుకుంటారు. 400 రోజులకుపైబడిన వెయిటింగ్ సమయాన్ని 2–4 వారాలకు కుదించడమే వీరి లక్ష్యం. -
పీడీ యాక్ట్‌పై రాజాసింగ్ అప్పీల్ తిరస్కరణ
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ షాక్ తగిలింది. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది. ఈ కేసును నిశితంగా పరిశీలించి ఇరువర్గాల వాదోపవాదాలు విని విచారణ చేపట్టిన కమిటీ.. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థించింది. అంతేకాదు.. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో ఆయనకు ప్రతికూలంగా బోర్డు ఇవాళ తీర్పు వెలువరించింది. రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయని, అందులో 18 కేసులు కమ్యూనల్(మత సంబంధిత) ఉన్నాయని పోలీసులు కమిటీకి నివేదించారు. దీంతో హైదరాబాద్ పోలీసుల వాదనతో ఏకీభవించింది అడ్వైజరీ కమిటీ. -
పీడీ యాక్ట్ బోర్డు ఎదుట ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదు అయిన పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ చేపట్టింది. పీడీ యాక్ట్ బోర్డ్ చైర్మన్ జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో విచారణ సాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ జరిగిన విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇదిలా ఉంటే.. ముహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే.. ‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు’ అంటూ మరో వీడియోను అరెస్ట్‌కు ముందు రిలీజ్ చేశారు రాజాసింగ్. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి.. నవంబర్ 1 లోగా సమాధానం ఇవ్వాలని రాజాసింగ్ తరపు న్యాయవాదుల్ని కోరింది. -
రైల్వే ప్రయాణికులకు ‘139’ టోల్ ఫ్రీ నంబర్
సాక్షి, అమరావతి: రైల్వే ప్రయాణికులు 139 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలని రైల్వే సలహా కమిటీ సూచించింది. రైల్వే పోలీసుల ప్రవర్తనపై సలహా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. విశాఖపట్నంలో జరిగిన సమావేశం వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్) సంజయ్ వర్మ మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. రైల్వే ప్రయాణికులకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు, సహకారం కోసం 139 ఉపయోగపడుతుందన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్‌పై పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రైల్వే పోలీసుల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, వారి పనితీరుపై అభినందనలు కూడా వచ్చాయని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్య, ఇబ్బందులు వచ్చినా ప్రతి రైలులోను ఉండే ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. -
చర్యలకు ఉపక్రమించిన అధ్యక్షుడు రాజపక్స.. లంక గట్టేక్కేనా?
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. ఆహార వస్తువుల కొరత, నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చోవడంతో.. పట్టెడన్నం తినలేక పస్తులుంటున్నారు లంక ప్రజలు. ఈక్రమంలో అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశాన్ని గట్టెకించేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స చర్యలకు ఉపక్రమించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనల కోసం ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సలహా బృందాన్ని నియమించారు. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సలహా బృందాన్ని రాజపక్స నియమించారు. ఐఎంఎఫ్‌తో చర్చలు జరపడం, ప్రస్తుత రుణ సంక్షోభాన్ని అధిగమించడంపై మార్గదర్శకత్వం చేసే బాధ్యతలను ఈ బృందానికి అప్పగించారు.మరోవైపు.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు 2.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. -
అన్ని అంశాల్లో వ్యవసాయ మండళ్లు భాగస్వామ్యం: కన్నబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అంశాల్లో వ్యవసాయ మండళ్లను భాగస్వామ్యం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన వ్యవసాయ సలహా మండళ్ల ఛైర్మన్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ మండళ్లకు రైతునే ఛైర్మన్‌గా నియమించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా, మెరుగ్గా అందాలనే మంచి ఉద్దేశంతో సీఎం.. వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టు సాగు, చేపలు రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు తమ సూచనలను అందిస్తాయని వెల్లడించారు. సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్ చేయించాలని మంత్రి కన్నబాబు అన్నారు. -
డ్యాషింగ్ అడ్వైజర్
ఐక్యరాజ్య సమితి అంటేనే హై లెవల్. అందులోని ‘హై లెవల్ అడ్వైజరీ బోర్డ్’ (హెచ్.ఎల్.ఎ.బి.) అంటే ఐక్యరాజ్య సమితి కన్నా హై లెవల్! సమితికి ఏ విషయంలోనైనా మార్గదర్శనం చేసేందుకు ఆ బోర్డులోని సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన మేధావులు, విద్యావంతులు అయి ఉంటారు. ఆ టీమ్‌లో తాజాగా భారతదేశ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌కు స్థానం లభించింది! కొన్నాళ్లుగా యూఎస్‌లోనే మసాచుసెట్స్‌లో ఉంటున్నారు జయతి. ఇప్పుడిక సలహా బృందంలో సభ్యురాలు అయ్యారు అట్నుంచటు విమానంలో అరగంట ప్రయాణదూరంలో ఉండే న్యూయార్క్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి త్వరలోనే ఆమె తన బుక్స్ సర్దుకుని వెళ్లబోతున్నారు. ఆ బుక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోడానికి జయతి అధ్యయనం చేస్తూ వస్తున్నవి మాత్రమే కాదు, జయతి రూపొందించిన వివిధ దేశాల అభివృద్ధి ప్రణాళికల సమగ్ర నివేదికలు కూడా. ప్రభుత్వాలకు అవి పరిష్కార సూచికలు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్’లో ఎకమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి ఘోష్. అక్కడికి వెళ్లడానికి ముందు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) లో 35 ఏళ్ల పాటు ఆర్థికశాస్త్రాచార్యులుగా ఆమె పని చేశారు. ఇప్పుడు సమితి సలహా బృందానికి ఆమె పేరును ప్రతిపాదించినది వేరెవరో కాదు. ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ అఫైర్స్’! జయతికి హ్యూమనిస్ట్ ర్యాడికల్ అనే పేరు ఉన్నప్పటికీ ఆ ర్యాడికల్ అనే పేరును పక్కన పెట్టి, ఆమెలోని హ్యూమనిస్టుని మాత్రం సమితి తీసుకున్నట్లుంది. లేదా, దేశాల ఆర్థికస్థితిని మెరుగు పరిచి సామాజిక జీవనాలను సరళతరం చేయడానికి జయంతి సూచించే కఠినతరమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించాలని నిశ్చయించుకుని ఉండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలోని పేద దేశాలన్నీ శుభ్రమైన తిండి, బట్ట కలిగి ఉండాలని సమితి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అందుకోసం రెండేళ్ల క్రితం ఎకనమిక్స్, సోషల్ అఫైర్స్ విభాగం ‘యు.ఎన్. హై–లెవల్ అడ్వయిజరీ బోర్డు’ను ఏర్పాటు చేసుకుంది. ఆ బోర్డు కాల పరిమితి రెండేళ్లు. అది పూర్తవడంతో ఇప్పుడు రెండో అడ్వయిజరీ బోర్టు అవసరమైంది. ఇందులో ఆర్థిక, సామాజిక అంశాలలో అంతర్జాతీయంగా నిపుణులు, అధ్యయనవేత్తలైన పలు రంగాల ప్రసిద్ధులు మొత్తం 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 65 ఏళ్ల జయతీ ఘోష్ ఒకరు. ∙∙ జె.ఎన్.యు.లో చదివి, జె.ఎన్.యు.లోనే పాఠాలు చెప్పారు జయతి. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్ ఆమె. పిహెచ్.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. సలహా బోర్డు సభ్యురాలుగా ఇక ఆమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గ్యుటెరస్‌కు వివిధ దేశాల వర్తమాన, భావి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రణాళికా విధానాలను సూచించవలసి ఉంటుంది. అదేమీ ఆమెకు కష్టమైన సంగతి కాబోదు. ప్రజల్లో తిరిగిన మనిషి. విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ప్రొఫెసర్. డెవలప్మెంట్ ఎకనమిస్ట్. ఆమె భర్త అభిజిత్ భారతదేశ ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు. జయతి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలవైపు లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పిడికిలి బిగించిన ప్రతి ఉద్యమంలోనూ జయతి నినాదం ఉంది. మొన్నటి ఢిల్లీ సి.ఎ.ఎ. అల్లర్లలో ప్రేరేపకులుగా పోలీస్‌లు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్‌ల పేర్లతో పాటు జయతి పేరు కూడా ఉంది. అలాగని ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపును ఇవ్వకుండా ఏమీ లేవు. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) 2010 లో ఆమెకు ‘డీసెంట్ వర్క్ రిసెర్చ్ ప్రైజ్’ను అందించింది. యు.ఎన్.డి.పి. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనాలిసిస్’ అవార్డును ప్రకటì ంచింది. సమితి సలహాదారుగా ఇప్పుడు ఆమెకు లభించించీ అవార్డులాంటి ప్రతిష్టే. -
నేతలకు సందేహం వచ్చినప్పుడే..!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ లాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు భారత్‌లోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేయడం పరిపాటి. అయితే కొన్ని రాష్ట్రాలు వీటిని కమిటీలని కాకుండా టాస్క్‌ఫోర్స్‌లని, ఎంపవర్డ్ గ్రూప్స్ అని, కోఆర్డినేషన్ టీమ్లని, వార్ రూమ్స్ అని పిలుస్తున్నాయి. ఎలా పిలిచినా అందరి ఉద్దేశం కమిటీలే. ఈ కమిటీల పద్ధతి మనకు బ్రిటీష్ పాలకుల నుంచి వచ్చిన సంప్రదాయం. అందుకనే మన కమిటీల్లో నిపుణులకు బదులుగా అధికారులు లేదా రాజకీయ విధేయులు ఎక్కువగా ఉంటారు. మధ్యకాలం నాటి ఇంగ్లీషు భాష ప్రకారం ‘క్రైసిస్ (సీఆర్‌ఐఎస్‌ఐఎస్)’ మలుపు అని అర్థం. ఇప్పుడదికాస్త సంక్షోభంగా మారింది. అదే లాటిన్ పదం ‘క్రైసిస్ (కేఆర్‌ఐఎస్‌ఐఎస్)’ ప్రకారం డౌట్ (సందేహం) అని అర్థం. కనుక మన రాజకీయ నాయకులు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు, లేదా ఏ నిర్ణయం తీసుకుంటే ఏ కొంప మునుగుతుందో తెలియక సందేహంలో పడినప్పుడే కమిటీలు వేస్తుంటారు. చదవండి: అలర్ట్: ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం -
వ్యవసాయ సలహా మండళ్లు
ప్రతి ఊళ్లో ఏయే పంటలు ఎంత మేర పండించాలన్న దానిపై రైతులతో కలిసి కూర్చుని చర్చించి నిర్ణయించాలి. జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. ఆ మేరకు కార్యాచరణ ఉండాలి. ఈ నేపథ్యంలో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్నెట్,విద్యుత్ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలి. ఏ ఊరిలో ఏ పంట వేస్తే మార్కెట్లో మంచి ధర వస్తుందనే విషయాన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు అవగాహన కలిగించాలి. గత ప్రభుత్వం ఏ రోజూ వ్యవసాయం మీద దృష్టి పెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాం. రైతులకు అన్ని విధాలా న్యాయం చేకూర్చే విషయమై విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంత చేస్తున్నప్పుడు కచ్చితంగా ఫలితాలు రావాల్సిందే. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి, ఏ పంటలకు ఎంత డిమాండ్ ఉంటుందన్న ముందస్తు అంచనాతో వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ల స్థితిగతులను పరిశీలించి, భవిష్యత్ డిమాండ్ అంచనాను శాస్త్రీయంగా విశ్లేషించి.. నమ్మకమైన సలహాలను అందిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. తద్వారా ఏ పంటలు ఎంత మేర సాగు చేయాలని రైతులే నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు వివరించారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాల్లో బస్తాకు కొంత ధాన్యం మినహాయించుకుంటున్నారని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. అందరం ఉన్నా ఇలా జరిగిందా.. ► బస్తాకు కొంత ధాన్యం మినహాయిస్తున్నారని కృష్ణా జిల్లా రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు లపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ విధంగా ఎలా మినహా యిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ► ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నా సరే.. ఇలాంటి ఘటనలు చోటు చేసు కోవడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దన్నారు. ► వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరు కోవద్దని, అన్యాయం చేసే వారిని ఉపేక్షిం చరాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఫలితాలు రావాల్సిందే ► పంటలను రోడ్డు మీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవి. అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదు. ► చీనీ, అరటి, టమాటా, మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలి. వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల మార్కెటింగ్‌లో సమస్యలు రాకూడదు. ► సమీక్షలో సీఎస్ సాహ్ని, మంత్రి కన్న బాబు, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. ధర ముందుగానే ప్రకటించాలి ► వ్యవసాయ సలహా మండళ్లు రాష్ట్రం, జిల్లా, మండలం స్థాయిలో ఏర్పాటు కావాలి. ఈ మేరకు వెంటనే కార్యాచరణ రూపొందించాలి. ► రాష్ట్ర స్థాయి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులు జిల్లా స్థాయి బోర్డులకు.. అక్కడి నుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి. ► పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి. దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతుంది. ► పంటలను ఇ– క్రాపింగ్ చేయడం, రైతు భరోసా కేంద్రాలను వినియోగించి వాటిని కొను గోలు చేయడం.. ఈ ప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృ తంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలి. -
రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్ : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (57) కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది. ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న తమ సభ్యదేశాలను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానాల రూపకల్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగ్రశ్రేణి నిపుణుల సలహాలు తమకిపుడు చాలా అవసరం అని ఆమె చెప్పారు. వీరంతా తమ అమూల్య సేవలను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీలక పరిణామాలు, ఇతర విధి విధానాలపై ఈ టీం సూచనలు చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు కమిటీలో వున్నారు. (కరోనా : శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం) కాగా కోవిడ్-19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్నిఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. (దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్) నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా, కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం -
డీహెచ్ఎఫ్ఎల్ పరిష్కార ప్రక్రియ వేగవంతం
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) దివాలా పరిష్కార ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ వేగవంతం చేసింది. ఈ విషయంలో అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు, సూచనలు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈవో ఎన్ఎస్ కణ్ణన్, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ సభ్యులుగా ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఎండీ సుబ్రమణియకుమార్‌కు ఈ కమిటీ తగు విధంగా తోడ్పాటు అందిస్తుందని ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకులకు సుమారు రూ. 83,873 కోట్ల మేర బాకీ పడిన డీహెచ్ఎఫ్ఎల్ .. దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న తొలి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్/హౌసింగ్ సంస్థ. దివాలా స్మృతికి సంబంధించి ఇటీవల నోటిఫై చేసిన సెక్షన్ 227 ప్రకారం డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును ఆర్బీఐ తన అజమాయిషీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
అమెరికాలో భారతీయుడికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగంలో మరో భారత సంతతి అమెరికన్‌కు కీలక పదవి లభించనుంది. ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు ప్రేమ్ పరమేశ్వరన్(50) ‘ఏషియన్–అమెరికన్స్, పసిఫిక్ ఐలాండర్స్ అడ్వైజరీ కమిషన్’లో సభ్యుడిగా నియమించేందుకు ట్రంప్ అంగీకరించినట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తెలిపింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ పరమేశ్వరన్ ప్రస్తుతం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉత్తర అమెరికా విభాగం అధ్యక్షుడిగా, గ్రూప్ సీఎఫ్‌వోగా పనిచేస్తున్నారు. ఇండో–అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్థిరపడ్డ పసిఫిక్ ద్వీపవాసుల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వృద్ధిని మెరుగుపర్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సలహా కమిషన్‌ను తొలుత ఏర్పాటుచేశారు. ఇందులో వాణిజ్యం, ఆరోగ్యం, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు. -
టీఏసీ అనుమతి కాంగ్రెస్‌కు చెంపపెట్టు
జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంస్థ టీఏసీ (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) అనుమతి ఇవ్వడంతో ఇక అన్ని అనుమతులు పూర్తయినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన సంగారెడ్డి జిల్లా తాలెల్మ బహిరంగ సభలో మాట్లాడుతూ, టీఏసీ అనుమతికి సంబంధించి తనకు ఇప్పుడే ఢిల్లీ నుంచి తీపి కబురు వచ్చిం దన్నారు. విపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరానికి అన్ని అనుమతులు పొందగలిగామని, టీఏసీ అనుమతి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ రీడిజైన్‌ను జలవనరుల సంస్థ, కేంద్రం ఆమోదించిందన్నారు. ఆప్షన్ లేనందునే బీమా ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యులకు ఉద్యోగం.. ఎమ్మెల్యే, ఎంపీ చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఎన్నికల్లో గెలిపిస్తాం, మరి రైతు చనిపోతే ఏం చేస్తున్నామని..?, అందుకే సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్ అన్నారు. రైతు ఎటువంటి పరిస్థితుల్లో మరణించినా వారం రోజుల్లో రూ.5 లక్షల చెక్కు అతడి ఇంటికి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వర విజయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకమైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించింది. బుధవారం ఢిల్లీలోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రాజెక్టుకు ఉన్న అన్ని ప్రధాన అవరోధాలు తొలగిపోనున్నాయి. తాజా అనుమతి నేపథ్యంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం మళ్లీ తెరపైకి రానుండగా, ప్రపంచంలోని ఎక్కడ్నుంచైనా కాళేశ్వరానికి అవసరమయ్యే నిధుల సేకరణకు వెసులుబాటు కలగనుంది. అన్ని అనుమతులు వచ్చేసినట్టే! టీఏసీ అనుమతులకు సంబంధించి బుధవారం జరిగిన భేటీలో కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, నీతి ఆయోగ్ సలహాదారు, భూగర్భ జల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, కేంద్ర జల సంఘానికి చెందిన అన్ని విభాగాల సంచాలకులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్) మురళీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) హరిరామ్ పాల్గొని ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం నిర్మాణ ప్రక్రియకు సంబంధించి లింక్ –1, లింక్ –2, లింక్ –3 పనుల పురోగతిని ప్రదర్శించారు. ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల నీటిని గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు రూపొందించిన ప్రణాళికను వివరించారు. ఎల్లంపల్లిలో లభ్యమయ్యే 20 టీఎంసీల నీరు, మరో 25 టీఎంసీల భూగర్భ జలాలు కలుపుకొని మొత్తం ప్రాజెక్టు నీటి లభ్యత 240 టీఎంసీలు ఉండగా, ఇందులో నుంచి 237 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి కేంద్ర జల సంఘం ఇప్పటికే తన అంగీకారం తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందులో 169 టీఎంసీలు సాగునీటికి, 30 టీఎంసీలు హైదారాబాద్ తాగు నీటి అవసరాలకు, 10 టీఎంసీలు దారి పొడవునా ఉండే గ్రామాల తాగునీటికి, 16 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలు, 12 టీఎంసీలు ఆవిరి నష్టం కోసం వినియోగించే ప్రణాళికపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల్లో 24 గంటల పాటు జరుగుతున్న పనులు, ఇప్పటికే జరిగిన రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు అంశాలను వివరించారు. అధికారుల ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన టీఏసీ.. సమావేశం అనంతరం ఏకగ్రీవంగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులను మంజూరు చేస్తూ తీర్మానించింది. ఈ మేరకు ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్‌లు ఢిల్లీ నుంచి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 9 కీలక అనుమతులు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు రావడంతో సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు లభించినట్లయింది. జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) మాత్రమే మిగిలి ఉంది. అన్ని అనుమతులు ఇప్పటికే రావడంతో ఈ అనుమతి త్వరలోనే వస్తుందని హరిరామ్ తెలిపారు. మంత్రి హరీశ్ హర్షం కాళేశ్వరానికి టీఏసీ అనుమతిపై నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. అనుమతుల సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్‌లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు లభించిన అనుమతులివీ.. 1. పర్యావరణ ప్రభావ నివేదిక తయారీకి టీఓఆర్ 2. మేడిగడ్డ వద్ద 75% డిపెండబిలిటీతో 283.3 టీఎంసీలకు హైడ్రాలజీ క్లియరెన్స్ 3. అంతర్రాష్ట్ర అనుమతి 4. కేంద్ర భూగర్భ జల శాఖ 5. కన్స్ట్రక్షన్ అండ్ మిషనరీస్ డైరెక్టరేట్ 6. అటవీ మంత్రిత్వ శాఖ తుది అనుమతి 7. పర్యావరణ తుది అనుమతి 8. ఇరిగేషన్ ప్లానింగ్ 9. ప్రాజెక్టు అంచనా , -
వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, అంజాద్ బాషా సహా 20 మంది నేతలను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు. ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి సహా 33 మంది పార్టీ నేతలను పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరే 1) రెడ్డి శాంతి 2) గొల్ల బాబురావు 3) నందమూరి లక్ష్మిపార్వతి 4) పి.రవీంద్రనాథ్ రెడ్డి (ఎమ్మెల్యే) 5) తలశిల రఘురాం 6) గిడ్డి ఈశ్వరి (ఎమ్మెల్యే) 7) వంగవీటి రాధాకృష్ణ 8) మర్రి రాజశేఖర్ 9) నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 10) గౌరు వెంకట్ రెడ్డి 11) కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని), ఎమ్మెల్యే 12) పినిపే విశ్వరూప్ 13) కొక్కిలిగడ్డ రక్షణనిధి, (ఎమ్మెల్యే) 14) కిలారి వెంకట రోశయ్య 15) డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ (ఎమ్మెల్యే) 16) షేక్ బెపారి అంజాద్ బాషా (ఎమ్మెల్యే) 17) ఆతుకూరి ఆంజనేయులు 18) జోగి రమేష్ 19) మారక్కగారి క్రిష్ణప్ప 20) కె.నారాయణ స్వామి (ఎమ్మెల్యే) వైఎస్ఆర్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వీరే 1) పాలవలస రాజశేఖరం 2) కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ 3) బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే 4) జక్కంపూడి విజయలక్ష్మి 5) సాగి దుర్గాప్రసాద రాజు 6) ఘట్టమనేని ఆదిశేషగిరిరావు 7) పెన్మత్స సాంబశివ రాజు 8) ఇందుకూరి రామకృష్ణంరాజు 9) పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే 10) కోలా గురువులు 11) ధర్మాన కృష్ణదాస్ 12) వంకా రవీంద్రనాధ్ 13) మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్యే 14) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే 15) కారుమూరి వెంకట నాగేశ్వరరావు 16) ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే 17) కొన రఘుపతి, ఎమ్మెల్యే 18) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే 19) గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే 20) తలారి వెంకట్రావు 21) పేర్ని వెంకట్రామయ్య (నాని) 22) వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే 23) షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్యే 24) యస్. రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే 25) మేకా శేషుబాబు 26) బుక్కపట్నం నవీన్ నిశ్చల్ 27) రత్నవేల్ గాంధీ 28) కొట్టు సత్యనారాయణ 29) చల్లపల్లి మోహన్ రావు 30) కె. చంద్రమౌళి 31) కుడుపూడి చిట్టబ్బాయి 32) డా. మధుసూదన్ 33) పాతపాటి సర్రాజు -
‘కనీస వేతనం’పై సలహా బోర్డు: కార్మిక శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న రంగాల్లో కనీస వేతనాన్ని నిర్ధారించడానికి సలహా బోర్డును నియమించనున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ‘జాతీయ కనీస వేతనాన్ని నిర్ధారించడానికి కేంద్రం సలహా బోర్డును ఏర్పాటుచేస్తుంది. అవసరాలు, నైపుణ్యాలు, ఉద్యోగ స్వభావం తదితరాల ఆధారంగా ఒక్కో రంగం, ప్రాంతంలో ఒక్కోలా కనీస వేతనాలు నిర్ణయిస్తాం’ అని కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్కే గుప్తా చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు జాతీయ కనీస వేతనాలను ప్రకటించలేదని, ఉద్యోగులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని అన్నారు. అది మీ పాపమే కదా.! -
మెట్రో చార్జీలు తగ్గించాలి
- సిఫార్సు చేసిన సలహా కమిటీ - చార్జీల పెంపునకు జాప్యమే కారణమని వివరణ సాక్షి, ముంబై: పెంచిన మెట్రో చార్జీలను తగ్గించాలని చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం నియమించిన సలహా కమిటీ సిఫార్సు చేసింది. చార్జీలు పెంచడానికి మెట్రో నిర్మాణ వ్యయం కారణం కాదని, నిర్మాణంలో జాప్యమే కారణమని తేల్చి చెప్పింది. వర్సోవా-అంధేరి-ఘట్కోపర్ మెట్రో రైలు చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం సలహా కమిటీని నియమించిన సంగతి తెలిసింది. మెట్రో నిర్మాణానికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే, రిలయన్స్ ఇన్ఫ్రా మధ్య 2007లో ఒప్పందం కుదిరింది. అయితే పనులు మాత్రం 2008లో ప్రారంభమయ్యాయి. దీంతో మొదట్లో అనుకున్న వ్యయం రూ. 2,356 కోట్లు జాప్యం కారణంగా రూ. 4,329 కోట్లకు చేరుకుంది. పెరిగిన వ్యయాన్ని రాబట్టుకోడానికి చార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ఎమ్మెమ్మార్డీయే తెరమీదకు తెచ్చింది. ఆ ప్రకారం రూ.9, 11, 13 ఉన్న చార్జీలను పెంచి రూ.10, 20, 30, 40 అమలు చేసింది. ఇష్టానుసారంగా మెట్రో చార్జీలు పెంచడంతో అన్ని రంగాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో చార్జీలు ఎంతమేర ఉండాలనే విషయంపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కమిటీ నియామకంపై తీవ్ర జాప్యం చేసిన కేంద్రం చివరకు రెండు నెలల కిందట ఏర్పాటు చేసింది. మెట్రో నిర్మాణంపై అధ్యయనం చేపట్టిన కమిటీ అందులోని లొసుగులు, వాస్తవాలను వెలికి తీసింది. ముంబైకర్లపై చార్జీల భారం మోపడానికి వ్యయం పెరగడం కారణం కాదని చెప్పింది. పెంచిన చార్జీలు ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసింది. -
మౌలిక వసతుల అధ్యయనానికి కమిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని నియమించింది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని నిర్మాణం పై ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అన్ని విభాగాల్లోని నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)కి అప్పగించింది. కమిటీ విధివిధానాలను, మార్గదర్శకాలను ఆస్కీ సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ(ఇన్‌క్యాప్) సమగ్ర వివరాలతో ఓ డ్రాప్ట్‌ను రూపొం దించి ప్రభుత్వానికి అందిస్తుంది. రాజధాని ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, సమాచార వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనేదానిపై సూచనలిస్తుంది. మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ డి. సాంబశివరావు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేశారు. కమిటీలో ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, న్యాయ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇన్‌క్యాప్ ఎండీ, ఏపీఐఐసీ ఎండీ కూడా సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆరు నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.