ambika krishna
-
బీజేపీకి చంద్రబాబు అన్యాయం.. అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు
-
‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ స్థాయి ఇదేనా?’
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. రాష్ట్రంలో.. అందునా కూటమిలో పార్టీ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ(Ambika Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీని మిగతా పార్టీల పెద్దలు పట్టించకోవడం లేదని, ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తున్నాయిన ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ‘‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ(BJP) ప్రతీ కార్యకర్త బాధపడుతున్నారు. తమకు సరైన గుర్తింపు లేదనుకుంటున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తేనే 164సీట్లు వచ్చాయి. మేమందరం తిరిగితేనే కదా కూటమి గెలిచింది. కానీ, ఇప్పుడు ఎక్కడా జనసేన, టీడీపీ జెండాలు కనబడుతున్నాయి తప్ప బీజేపీ జెండాలు కనబడటం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏపీ బీజేపీ నేతలకు ఆహ్వానించడం లేదు. ఆఖరికి.. రోడ్లు ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగిన పిలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ సైతం మెమరాండం ఇచ్చాము.. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో బీజేపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మోదీ పథకాలు డబ్బు ద్వారానే రాష్ట్రం నడుస్తోంది. ప్రధానిమోడీ ఇచ్చే డబ్బులు వాడుకుంటూ బీజేపీ నేతలను కార్యక్రమాలకు ఎందుకు పిలవరు.?.. అని అంబికా కృష్ణ నిలదీశారు. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. సమీక్షా సమావేశంలో బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఇది జరిగి మూడు రోజులు కాకముందే.. ఈ వ్యాఖ్యలు తెరపైకి రావడం గమనార్హం. -
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అత్యుత్సాహం
సాక్షి,అనంతపురం: టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల సమావేశంలో పుత్రోత్సాహం చూపించారు. కలెక్టరేట్లో అభివృద్ధి, సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ కుమారుడు వీక్షిత్ హాజరయ్యారు. వీక్షిత్కు ఏ పదవీ లేకపోయినా అధికారులు పెద్దపీట వేశారు. సమావేశంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వీక్షిత్ హాజరవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీతో పొత్తు బీజేపీ కార్యకర్తలకు ఎవరికి ఇష్టం లేదు
-
ఫిల్మ్ ఫేర్‌కి జాతీయ రహదారి
నరసింహనంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటించారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌కు నామినేట్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ ‘జాతీయ రహదారి’ చిత్ర దర్శక, నిర్మాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ–‘‘రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకొని, 101వ సినిమా ‘జాతీయ రహదారి’ తో ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయం. ఈ సినిమాకి నరసింహ నంది లాంటి డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. తెలుగు చిత్రసీమలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. తమిళంలో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా, మలయాళంలో తీసిన ‘జల్లికట్టు’ సినిమాలు ఆస్కార్ నామినేషన్‌కి వెళ్లాయి. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాలి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంధ్య స్టూడియోస్, సంగీతం: సుక్కు, కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
వైఎస్సార్ సీపీలోకి అంబికా సంస్థల అధినేత
సాక్షి, ఏలూరు : ఉప ముఖ్యమంత్రి,వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆళ్ల నాని ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ...‘అంబికా రాజా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేద ఆర్యవైశ్య ప్రజలకు సాయం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరేలా పని చేయాలి. రానున్న అన్ని స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీదే గెలుపు.’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. -
‘విభేదాలు వద్దని చంద్రబాబుకి ఎప్పుడో చెప్పా’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, థియేటర్, టెలివిజన్ కార్పొరేషన్ ఛైర్మెన్‌గా కొనసాగుతున్న టీడీపీ సీనియర్ అంబికా కృష్ణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దేశానికి దిశానిర్దేశం చేసేది బీజేపీ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గతకొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన.. బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించిన అంబికా కృష్ణ తాను బీజేపీలో చేరుతున్నట్ల ప్రకటించారు. ఏపీలో బీజేపీలో చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో విభేదాలు, పోరాటాలు వద్దని చంద్రబాబు నాయుడికి చాలా సార్లు చెప్పాని, ఆ తప్పిదాల కారణంగానే పార్టీ తీవ్రంగా దెబ్బ తిన్నదని అన్నారు. చంద్రబాబు బీజేపీ మీద చేసిన పోరాటాలు తనకు నచ్చలేదన్నారు. ‘‘నేను టీడీపీలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవించలేదు. నేను టీడీపీకి నమ్మక ద్రోహం చేయలేదు. టీడీపీనే నాకు నమ్మక ద్రోహం చేసింది. 20 ఏళ్లు నుంచి టీడీపీలో ఉన్నాను. పార్టీ ఓడిపోయిందని బీజేపీలో చేరట్లేదు. టీడీపీలో గల్ఫ్ ఏర్పడింది. కేంద్రంతో సఖ్యత లేకపోతే నిధులు రావని ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు’’ అని అన్నారు. ఆయన పార్టీ మార్పుతో పశ్చిమ గోదావరి టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇటీవల గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. -
టీడీపీకి మరో షాక్!
-
టీడీపీకి మరో షాక్!
సాక్షి, హైదరాబాద్ : టీడీపీకి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ గుడ్‌బై చెప్పనున్నారు. నేడు ఢిల్లీలో ఆయన రామ్‌మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తతం ఏపీ ఫిల్మ్, థియేటర్, టెలివిజన్ కార్పొరేషన్ ఛైర్మెన్‌గా కొనసాగుతున్న అంబికా కృష్ణ.. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మార్పుతో పశ్చిమ టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇటీవల గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ఆ పదవి పాముల పుట్ట వంటిది.. అందుకే’
సాక్షి, అమరావతి : వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జలీల్‌ఖాన్ అభినందనలు తెలిపారు. తన రాజీనామా నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనేది పాముల పుట్టవంటిదని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని.. నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇతరుల వల్ల కొంత నష్టం జరిగిందని.. ఓడిపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికలు మొత్తం కులరాజకీయాల మీద నడిచాయని పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన జలీల్‌ఖాన్ ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి జలీల్‌ఖాన్ కుమార్తెకు టికెట్ ఇచ్చారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఫ్యాను హవా వీచిన నేపథ్యంలో ఆమె ఓటమి పాలయ్యారు. నామినేటెడ్ పదవుల రాజీనామా పర్వం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జలీల్‌ఖాన్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రికి చైర్మన్‌గా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి నుంచి అంబికా కృష్ణ వైదొలిగారు. ఇక ఇప్పటికే దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ సభ్యులు రాజీనామా సమర్పించగా.. ఎస్వీబీసీ ఛానెల్లో పోస్టు దక్కించుకున్న రాఘవేంద్రరావు కూడా రాజీనామా చేశారు. అదే విధంగా.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. -
చెంప చెళ్లుమనిపిస్తా! : పీతల సుజాత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘చింతలపూడి నియోజకవర్గంలో రూ.1800 కోట్లతో అభివృద్ధి పనులు చేశాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే అంబికా కృష్ణ నాపై అసత్య ఆరోపణలు చేశారు. బుద్ధి ఉన్నోడు ఎవడూ అంత నీచంగా మాట్లాడడు’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత అంబికా కృష్ణపై ధ్వజమెత్తారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీతల సుజాత హయాంలో అభివృద్ధి జరగలేదని, ఆ పాపం కడిగేసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ అభ్యర్థిని మార్చారని జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల క్రితం ఆర్యవైశ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో అంబికా కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ప్రచారం చేసి ఆర్యవైశ్యులను పార్టీకి దగ్గర చేయమని పార్టీ ఆదేశిస్తే, అంబికా కృష్ణ ఆ పని చేయకుండా తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షంతో లాలూచీ పడి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి అంబికా కృష్ణ కంకణం కట్టుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. తానేమీ అంబికా కృష్ణలా సొంత బావమరిది హోటల్‌ను ఆక్రమించుకోలేదని, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు ఎగ్గొట్టలేదని ఎద్దేవా చేశారు. సినీ రంగంలో ఆయన వేషాలు అందరికీ తెలుసని అన్నారు. ఒక దశలో ఆమె అంబికా కృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దళిత మహిళననే తనపై ఇటువంటి ఆరోపణలు చేశారని, అగ్ర వర్ణాలు ప్రజాప్రతినిధులుగా ఉన్న మరో నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ అభివృద్ధి జరగలేదనే దమ్ము అంబికాకు ఉందా అని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే వారిని ఇక ఉపేక్షించేది లేదని ఎవరినైనా చెంప ఛెళ్లుమనిపిస్తానని హెచ్చరించారు. అంబికా కృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
అంబికా కృష్ణకు పీతల సుజాత కౌంటర్
-
అంబికా కృష్ణకు పీతల సుజాత వార్నింగ్
సాక్షి, ఏలూరు : మాజీమంత్రి, టీడీపీ మహిళా నేత పీతల సుజాత మీడియా సాక్షిగా కంటతడి పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆర్యవైశ్య సభలో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంబికా కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనపై అంబికా కృష్ణ తప్పుడు ప్రచారం చేశారంటూ... బుధవారమిక్కడ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ‘బుద్ధిన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని, మంత్రి పదవి లేకున్నా... పార్టీని బలోపేతం చేస్తూంటే ...మీకు నాలో పొగరు కనిపిస్తుందా?. నన్ను అవమానించడానికా?. పార్టీని అవమానించడానికా ఈ వ్యాఖ్యలు. ప్రతి నియోజకవర్గంలోను నాయకులకు నాయకులకు మధ్య ఉన్న సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకే అంటకడతారు. అలాగే కారణం ఏదైనా నాకు టికెట్ రాలేదు అన్న విషయం అందరికి తెలిసిందే. జంగారెడ్డిగూడెం సమావేశంలో టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకునే అంబికా కృష్ణ పార్టీ అభివృద్ధి గురించి చెప్పకుండా పీతల సుజాతను టార్గెట్ చేసి మాట్లాడతాడా?. పీతల సుజాతకు పొగరు, అహంభావం, చేతగానితనం అంటూ పాపం చేసింది కాబట్టి టికెట్ ఇవ్వలేదని మాట్లాడతారా?. నన్ను అవమానించడానికా లేక పార్టీని అవమానించడానికా?. చింతలపూడిలో పార్టీని గెలిపించడానికి ఓట్లు అడగకుండా ఓడించడానికి సొంత పార్టీపై అంబికా కృష్ణ దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక దళిత మహిళ పై తప్పుడు ఆరోపణలు చేస్తావా. చదవండి...(దళిత నాయకురాలిపై టీడీపీ నేత అనుచిత వ్యాఖ్యలు) నాలో ఏ పొగరు చూసారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వందల కోట్లు ఇచ్చారు. కానీ ఏ అభివృద్ధి లేదని చెప్తారా?. ఏ రోజైన నియోజకవర్గంలో పర్యటించారా అంబికా కృష్ణ?. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీలో ఉండి, అదే అధికార పార్టీ ఎమ్మెల్యేని అవమాన పరుస్తూ నియోజక వర్గంలో అభివృద్ధి జరగలేదని చెప్తే ప్రజాలేమనుకుంటారు. నాలో ఏ పాపం చూశావ్. నీలాగా సొంత బామ్మర్ది హోటల్ని అక్రమించుకున్ననా?. రోజు నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పాపం ఆ కుటుంబమంతా. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టే చరిత్ర నీకుంది .. నాకు లేదు. సినీ ఇండస్ట్రీలో నీ వేషాలు ఎవరికి తెలియదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇంకోసారి తనతో ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే చెంప చెళ్లుమనిపిస్తా’ అంటూ పీతల సుజాత వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తన గాడ్ ఫాదర్ అని...కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషిస్తున్నారన్నారు. ఒక ఉపాధ్యాయురాలిగా ఉన్న తనను రాజకీయాల్లోకి చంద్రబాబు తీసుకొచ్చారని, అదే నమ్మకంతో పని చేస్తూ వచ్చానన్నారు. స్థానికేతురాలు అయినప్పటికీ ముందు ఆచంట, ఆ తర్వాత చింతలపూడిలో గెలిచానని గుర్తు చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం బాధపడటం లేదని, ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఉన్న లేకపోయినా ఆఖరి వరకు నియోజకవర్గంలో కష్టపడి పనిచేశానన్నారు. టికెట్ రాకపోయినా బాధ పడలేదని, అది అధిష్టాన నిర్ణయానికి వదిలేసినట్లు చెప్పారు. కానీ కొందరు వ్యక్తులు తనపై వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని పీతల సుజాత వాపోయారు. కాగా మొన్న (సోమవారం) జంగారెడ్డి గూడెంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిధులు ఇచ్చినా పొగరు, అహంకారంతో పీతల సుజాత వాటిని ఖర్చు చేయలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే పీతల సుజాతకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని విమర్శించారు. ఓటు వేసిన నియోజకవర్గ ప్రజలకు పని చేయాలనే ఇంగితజ్ఞానం కూడా పీతల సుజాతకు లేదన్నారు. మంత్రిగా ఉండి సూజాత నియోజకవర్గంలో చేసిందేమి లేదని, అభివృద్ధి శూన్యమని, పాపాలు తగలకూడదనే పీతల సుజాతకు చంద్రబాబు సీటు ఇవ్వలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై పార్టీతో తీవ్ర దుమారం రేగటంతో అంబికాకృష్ణ ఎట్టకేలకు పీతల సుజాతకు క్షమాపణ చెప్పారు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సొంతపార్టీ నేతలే రచ్చకెక్కడంతో ఏ మొహంతో ప్రచారానికి వెళ్లాలంటూ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. -
దళిత నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: టీడీపీలో మరోసారి దళిత నాయకులపై తమ అక్కసును వెళ్లగక్కారు. మాజీ మంత్రి పీతల సుజాతపై సినీ నిర్మాత, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పొగరు అహంకారం అంటూ సుజాతను నోటికొచ్చినట్టు తిట్టారు. ఈ వ్యాఖ్యలను ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వర రావు తీవ్రంగా ఖండించారు. మంత్రి పదవి చేపట్టి, రాజకీయంగా పేరొందిన దళిత మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీలో దళిత నాయకులపై గౌరవంగా ప్రవర్తించరని, చులకనభావంతో చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నాయకులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
పీతల సుజాతకు పొగరు,అహంకారం..
-
‘సినిమా షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితం’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ అంబికా కృష్ణ పలు రాయితీలను ప్రకటించారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరించే సినిమాలకు ప్రోత్సాహకాలతో పాటు నగదు, పన్ను రాయితీలు కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు. 4 కోట్ల రూపాయలలోపు రూపొందే సినిమాలను ప్రభుత్వం చిన్న సినిమాలుగా గుర్తించి, ఆ సినిమాలకు పన్ను మొత్తం వెనక్కి ఇవ్వనుందని.. 18 శాతం జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతం రద్దు చేసి తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. చిన్న సినిమాలకు పన్ను రాయితీలతో పాటు షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితంగా ఇవ్వటం, ఎఫ్డీసీ ద్వారా సింగల్ విండోలో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. షూటింగ్‌ల కోసం సెక్యురిటి డిపాజిట్ మాత్రం చెల్లిస్తే సరిపోతుందని ఆ డబ్బును కూడా షూటింగ్ పూర్తయిన తరువాత వెనక్కి తిరిగిచ్చేస్తామన్నారు. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన డబ్బింగ్, రీరికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా ఏపీలోనే చేయాలన్నారు. రాయితీలతో పాటు చిన్న సినిమాల్లో ఉత్తమ కథాంశాలు, విలువలు ఉన్న 15 చిత్రాలకు 10 లక్షల నజరానా ప్రభుత్వం నుంచి అందిచనున్నట్టుగా తెలిపారు. పరభాషా చిత్రాలు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటంతో ధియేటర్ల సమస్య తలెత్తుందని, పైరసీ వల్ల సినీరంగం తీవ్రంగా నష్టపోతుందని అలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటుగా తెలిపారు. -
బాలరాజు త్వరలో వస్తాడు
‘‘బంగారి బాలరాజు’ పాటలన్నీ చాలా బాగున్నాయి. చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు కొత్తవారైనా చక్కని సంగీతం అందించారు ’’ అని నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ సినిమా ట్రైలర్‌ని అంబికా కృష్ణ రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను సురక్ష కంపెనీస్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ పద్మజ మానేపల్లి విడుదల చేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘4 కోట్ల లోపు నిర్మించే ప్రతి చిత్రానికి 10 లక్షల సబ్సిడీతో పాటు పన్ను రాయితీ కూడా ఉంటుంది. అయితే.. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించాలి’’ అన్నారు. కోటేంద్ర దుద్యాల, కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ∙కరోణ్య, రాఘవ్ -
ఏలూరులో తీవ్ర కలకలం
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ సంస్థను సీజ్ చేయటానికి విజయ బ్యాంకు అధికారులు రావడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ ఏలూరు మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అంబికా కృష్ణకు చెందిన అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ కంపెనీ చెన్నైలోని విజయా బ్యాంకుకు భారీగా బకాయి పడ్డారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లింపులు చేయకపోవడంతో చెన్నై విజయా బ్యాంకు అదనపు జీఎం రాధాకృష్ణ నేతృత్వంలోని బ్యాంకు అధికారుల బృందం ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి ఏలూరు వచ్చారు. బకాయిలపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపి రేపటి వరకు గడువు ఇచ్చారు. ఈనెల 18వ తేదీలోపు బకాయిలు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు జప్తు ఆలోచనను తాత్కాలికంగా విరమించుకుని బ్యాంకు అధికారులు వెనుదిరిగారు. అంబికా గ్రూపు సంస్థలను అంబికా కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. విజయా బ్యాంకుకు అంబికా సంస్ధలు దాదాపుగా రూ. 28 కోట్ల వరకు బకాయిలు పడ్డట్టు సమాచారం. బకాయిల వ్యవహారంపై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు. -
ఫిల్మ్ ఇండస్ట్రీని విజయవాడకు రప్పిస్తాం..
సాక్షి, విజయవాడ : చలన చిత్ర రంగాన్ని విజయవాడకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ పేర్కొన్నారు. జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. చిన్న సినిమాలను ఏపీలో తీస్తే ప్రత్యేకమైన రాయితీ ఇవ్వడం ద్వారా చిత్ర నిర్మాణాన్ని రాష్ట్రానికి తీసుకురావాలనుకుంటున్నామని వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు, నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. అమరావతి కథలు పేరిట షార్ట్ ఫిల్మ్ రూపొందించడం తన ఆశయమన్నారు. అందుకు ఎఫ్డీసీ గానీ, ఎన్నారైలు కానీ ఆర్థిక సహకారమందించాలని కోరారు. జాషువా మనమడు సుశీల్‌కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో రుగ్మతలు, అసమానతలను రచనల ద్వారా శక్తివంతంగా ఎత్తిచూపిన తన తాత గారి ఆశయాల మేరకు సమాజ సేవలో ఇతోధికంగా పాల్గొంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యుడు, సీనియర్ జర్నలిస్టు జీవీ రంగారెడ్డి ప్రారంభించగా.. గుండు నారాయణరావు గౌరవ అధ్యక్షత వహించారు. సభలో సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఏపీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ చైర్మన్‌గా అంబికా కృష్ణ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ) చైర్మన్‌గా నిర్మాత అంబికా కృష్ణ నియమితులయ్యారు. బాలకృష్ణ హీరోగా ‘వీరభద్ర’, ఈవీవీ దర్శకత్వంలో ‘కన్యాదానం’, ‘ఆడంతే అదోటైపు’ తదితర సినిమాలను అంబికా కృష్ణ నిర్మించారు. ఏపీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ చైర్మన్‌గా మూడేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణకు పలువురు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. -
కేసిఆర్‌కు ఆభినందనలు: అంబిక క్రిష్ణ
-
మళ్లీ ఎమ్మెల్సీ పదవుల ఆశ
అంబికా కృష్ణ, పాందువ్వ శీనులకు బెర్త్ దక్కేనా? ఏలూరు: జిల్లాలో టీడీపీ నాయకులను ఎమ్మెల్సీ పదవులు ఊరిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా కేటాయించిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 1న ఎన్నికల నిర్వహించనున్నారు. కాగా తక్కువ కాల వ్యవధిలోనే మళ్లీ పదవులు భర్తీ కానుండడంతో గతంలో భంగపడ్డ వారు యత్నాలు ప్రారంభించారు. కొద్దినెలల క్రితం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాగా జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంతెన సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అంబికాకృష్ణకు పదవిని ఇవ్వాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధిష్టానానికి అప్పట్లో సిఫార్సు చేశారు. మరోవైపు జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పాందువ్వ శ్రీనుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అధినేతను కలిసి కోరారు. అయితే ఇద్దరికీ చుక్కెదురైంది. అన్ని సీట్లను గెలిపించి టీడీపీ అధికారంలో వచ్చేందుకు శ్రమించిన తెలుగు తమ్ముళ్లకు కీలకమైన ఈ పదవుల విషయంలో అధినేత అన్యాయం చేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఈసారైనా పదవిని దక్కించుకోవాలని నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. -
చంద్రబాబు హ్యాండిచ్చారు
అంబికా కృష్ణ, పాందువ్వ శ్రీనుకు దక్కని ఎమ్మెల్సీ పదవులు ఏలూరు: జిల్లాలో అన్ని స్థానాలూ గెలిచిన టీడీపీ నాయకులకు ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో అంబికా కృష్ణను పోటీ నుంచి తప్పించారు. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయనకు ముఖ్య నాయకులు హామీ ఇచ్చారు. చివరకు ఆయ నకు పదవి కట్టబెట్టే విషయంలో రిక్తహస్తం చూపించారు. టీడీపీ సర్కారులో ఆర్యవైశ్య వర్గానికి ఒక్క కీలక పదవి లేని తరుణంలో అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అందరూ భావించారు. ఆయన సైతం ఆ పదవిపై ఆశ పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై ఆర్యవైశ్యులు ఒకింత ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి వైశ్య వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రరావు పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేయడంతో పోటాపోటీగా అంబికా పేరు ఉంటుందని వైశ్యులంతా ఆశగా ఎదురు చూశారు. తీరా పెద్దగా పేరులేని వారికి పదవులు కట్టబెట్టడంపై ఏలూరు నియోజకవర్గ నేతలు కొంత గుర్రుగా ఉన్నారు. ఇదిలా వుండగా, జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ రాష్ట్ర నాయకుడు మంతెన సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను)కు పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గతంలోనే విన్నవించారు. అయినా చంద్రబాబు వారి విన్నపాన్ని మన్నించలేదు. పాందువ్వ శ్రీనుకు పదవి వస్తుందనుకున్న క్షత్రియ వర్గం ఆశలు అడియాసలయ్యాయి. -
నిజంగా... ఇది డబుల్ ధమాకా!
‘‘రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మొత్తం 72 సన్నివేశాల్లోనూ కావాల్సినంత కామెడీ ఉంది’’ అని దర్శకుడు ఇ. సత్తిబాబు చెప్పారు. అల్లరి నరేశ్ ద్విపాత్రాభినయంలో అంబికా రాజా నిర్మించిన చిత్రం ‘జంప్ జిలానీ’. అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్-రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకుడు. అంబికా రామచంద్రరావు నిర్మాణ నిర్వాహకుడు. ఈ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సత్తిబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘తాతల కాలం నాటి హోటల్ని కాపాడుకోవాలనుకునే ఓ మనవడు, ఆ హోటల్ని అమ్మేసి వేరే ఏదైనా వ్యాపారం చేసుకోవాలని తపన పడే మరో మనవడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ రెండు పాత్రలనూ అల్లరి నరేశే చేశారు. మామూలుగా ఒక్క నరేశ్ ఉంటేనే కడుపుబ్బా నవ్వుకుంటాం. ఇక, ఇద్దరు నరేశ్లంటే డబుల్ ధమాకానే. ద్విపాత్రాభినయం నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో రెండు పాత్రలూ తెరపై కనిపించే సన్నివేశాలు తక్కువ ఉంటాయి. కానీ, ఈ సినిమాలో దాదాపు పాతిక సన్నివేశాల్లో ఇద్దరు నరేశ్లూ కనిపిస్తారు. మూడు పాటల్లో కూడా ఈ రెండు పాత్రలూ కనిపిస్తాయి. పంచ్ డైలాగ్‌లతో సినిమా పసందుగా ఉంటుంది. నా ‘యముడికి మొగుడు’ సినిమాకి మంచి సంభాషణలు ఇచ్చిన క్రాంతిరెడ్డి సకినాల ఈ చిత్రానికి కూడా మంచి డైలాగులు రాశాడు. పాత్రలు విసిరే పంచ్ డైలాగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మరో హైలైట్ పోసాని పాత్ర. ఒక పాటకు పోసాని స్టెప్స్ కూడా వేశారు. తమిళ చిత్రం ‘కలగలప్పు’ ఆధారంగా తీసిన సినిమా అయినప్పటికీ, మాతృకకు చాలా మార్పులు చేశాం’’ అని చెప్పారు. -
టిడిపి నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ అరెస్ట్
ఏలూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా వారు పేరయ్యకోడేరులో సభ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. ఈసీ అనుమతి లేకుండా వారు ఎన్నికల సభ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.