Animation
-
విషాదం.. ఆ స్వీట్ వాయిస్ ఇక వినిపించదు!
పెద్దలకు సినిమాలంటే ఎంత ఇష్టమో.. పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే ఇష్టం. అలా చిన్నపిల్లలు ఇష్టపడేవాటిలో డోరమాన్, నింజా హటోరి పాత్రలు ప్రధానంగా వినిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌కు చిన్నపిల్లల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాత్రలకు కిడ్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఈ కార్టూన్ సిరీస్‌లకు యానిమేషన్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.ఇంత క్రేజ్ ఉన్న నింజా హట్టోరి, డోరేమాన్ల పాత్రలకు వాయిస్ అందించిన యానిమేషన్ లెజెండ్ జుంకో హోరీ మరణించారు. జపాన్‌కు చెందిన ఆమె నవంబర్ 18న మరణించినట్లు ఆమె టాలెంట్ ఏజెన్సీ ప్రొడక్షన్ బావోబాబ్ ఈ వారంలో ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతోనే జుంకో హోరీ మరణించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని నవంబర్ 25న తెలిపారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఆలస్యంగా ప్రకటన విడుదల చేశామని పేర్కొన్నారు. దయచేసి అభిమానులు ఆమె ఇంటిని సందర్శించడం మానుకోవాలని ప్రకటనలో వెల్లడించారు. -
‘డిజిటల్ అరెస్టు’కు... భయపడకండి
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం వేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌ను ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. ‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివరి్ణంచారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలన్నారు. అవి మరపురాని క్షణాలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్‌లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.యానిమేషన్లో అద్భుతాలు ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ధోలక్పూర్ కా ధోల్ వంటి యానిమేషన్ సిరీస్‌లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌ను ప్రపంచ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్‌కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్‌ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు. -
ఈ యానిమేటెడ్ కామెడీ సిరీస్.. జోకులేస్తూ..! జోస్యం చెబుతూ!!
‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు’ అంటూ ‘లవకుశ’ పాట గుర్తుకొచ్చినా సరే, ఊహించడం కష్టమేమీ కాదు అంటుంది ది సింప్సన్. ఆర్థిక, సామాజిక. సాంస్కృతిక... ఇలా పలురంగాలకు సంబంధించిన భవిష్యత్ పరిణామాలను ప్రసిద్ధ యానిమేషన్ సిరీస్ ‘ది సింప్సన్’ ఊహించింది. గతంలో ఊహించిన వాటిలో కొన్ని నిజం అయ్యాయి.‘ది సింప్సన్’ ఊహించిన వాటిలో కొన్ని నిజం కావడంతో ‘సింప్సన్’ మోడ్రన్ నోస్ట్రడామస్‌గా పేరు తెచ్చుకుంది. ఈ యానిమేటెడ్ కామెడీ సిరీస్ అమెరికన్ సాంస్కృతిక, సామాజిక పరిణామాలపై హాస్యంతో కూడిక వ్యాఖ్యానాలు చేయడమే కాదు జోస్యం కూడా చెబుతుంటుంది.2000 సంవత్సరంలో ప్రసారమైన 11వ సీజన్‌లోని 17వ ఎపిసోడ్లో లీసా సింప్సన్ యూఎస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డ్ సృష్టిస్తుంది. ‘ఆ ప్రెసిడెంట్ ఎవరో కాదు కమలా హారిసే’ అంటున్నారు ఇప్పుడు చాలామంది. టీవీ సిరీస్‌లోని అమెరికా ప్రెసిడెంట్ కమలా హారిస్ ధరించే దుస్తులను పోలిన దుస్తులలో(ప్యాంట్స్యూట్) కనిపిస్తుంది. మెడలో ముత్యాల నెక్లస్...సేమ్ టు సేమ్! కమలా హారిస్‌ను అలనాడే డెమోక్రాట్ అభ్యర్థిగా ప్రిడిక్ట్ చేయడంపై ‘ది సింప్సన్’ షో రైటర్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ ఏఐ జీన్ గర్వంగా ఫీలవుతూ ‘ది సింప్సన్స్ ప్రిడిక్షన్. ఐయామ్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్’ అంటూ పోస్ట్ చేశాడు. ‘ఈ పదవిని గతంలో ఒక రియల్ ఎస్టేట్ మొఘల్ నిర్వహించాడు’ అనే మాట ఈ ఎపిసోడ్లో వినిపిస్తుంది. గతంలో అమెరికా అ«ధ్యక్షుడిగా పని చేసిన డోనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ మొఘల్ కావడం గమనార్హం.‘ఇలా జరగనుంది’ అని సింప్సన్ వ్యంగ్యంగానో, సూచన్రపాయంగానో చెప్పిన విషయాలు కొన్ని నిజం అయ్యాయి. రియల్ ఎస్టేట్‌లో ఉన్న వారు అమెరికా అధ్యక్ష బరిలోకి వస్తారని, స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరుగుతుందని, ట్వంటీయత్ సెంచరి ఫాక్స్‌ను డిస్నీ కొనుగోలు చేస్తుందని, ఆర్థికవేత్త బెంగ్ ఆర్ హోమ్స్ట్రోమ్ నోబెల్ బహుమతి గెలుచుకుంటాడని...ఇలాంటి అంచనాలు నిజం అయ్యాయి. మరికొన్ని....– రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్ ఫ్లైట్ (2021) ని 2015 సంవత్సరంలో సీజన్ 25, ఎపిసోడ్ 15లో ప్రిడిక్ట్ చేశారు.– జనవరి 6, 2021లో జరిగిన యూఎస్ క్యాపిటల్ అల్లర్లకు సంబంధించిన దృశ్యం 1996లో వచ్చిన సీజన్ 7, ఎపిసోడ్ 18 (ది డే ది వయోలెన్స్ డైడ్)లో కనిపిస్తుంది.– 2003లో జరిగిన ఒక లైవ్ పెర్ఫార్మెన్స్లో సిగ్ఫ్రీడ్, రాయ్ అనే మ్యాజిషియన్లపై పులి దాడి చేసింది. 1993లో ప్రసారమైన సీజన్ 5, ఎపిసోడ్ 10లో ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది.– యూఎస్ మెన్ కర్లింగ్ టీమ్ 2018లో వింటర్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయాన్ని సీజన్ 21, ఎపిసోడ్ 12లోనే ఊహించారు. -
యానిమేషన్, గేమింగ్‌లో మనమే టాప్
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 3 వేలకుపైగా హాలివుడ్ సినిమాలకు యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు సబంధించిన అవుట్ సోర్సింగ్ పనులు చేశారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ–హబ్ ప్రాంగణంలో శనివారం వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, యానిమేషన్, ఫిల్మ్, గేమింగ్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అలాగే తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్, ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలపైనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ నుంచి యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాల ప్రచారంతోపాటు ప్రపంచ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, సినిమాలలో భారతదేశంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఆయన వివరించారు. సోనీ, కామ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి పెద్ద కంపెనీలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడంలో ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడు పంకజ్ బొహ్ర మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్, నిరంతర ఆవిష్కరణలు భారత్‌లో ఈ రంగాన్ని తాము ప్రోత్సహించడానికి ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అమెరికన్ కాన్సులేట్ వాణిజ్య వ్యవహరాల సలహాదారు రాఘవన్ శ్రీనివాసన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రాజెక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. మధుసూదన్ ప్రసంగించారు. -
Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది..
సర్జెంట్ స్టూడియోస్ వారి ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్‌లో ప్రధాన పాత్ర జావ్. డబుల్ జంప్, వాల్ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్ మాస్క్, మూన్ మాస్క్ అనేవి జావ్ ప్రధాన ఆయుధాలు. శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ అనేది 2.5డీ ప్లాట్‌ఫామ్ అడ్వెంచర్ గేమ్. ప్లేయర్స్ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్‌ను సొంతం చేసుకుంటారు. ప్లాట్‌ఫామ్స్: మైక్రోసాఫ్ట్ విండోస్, నిన్టెండో స్విచ్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ మోడ్: సింగిల్ ప్లేయర్ -
గేమ్ డెవలపర్ల కోసం భారత్ టెక్ ట్రయంఫ్ చాలెంజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ భాషల్లో ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాం విన్జో తాజాగా తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ)తో చేతులు కలిపింది. గేమింగ్ టెక్నాలజీని ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన భారత్ టెక్ ట్రయంఫ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దేశీ స్టార్టప్‌ల అభివృద్ధికి అవసరమైన కీలక వనరులు సమకూర్చేందుకు, వినోద రంగంలో మేథో సంపత్తిని పెంపొందించేందుకు ఇది సహాయకరంగా ఉండనుంది. ఈ ప్రోగ్రాం కింద సోషల్ గేమింగ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి డీప్ టెక్‌పై పరిశోధనలకు సహాయం లభిస్తుంది. తదుపరి అభివృద్ధి చేసేందుకు అత్యధిక అవకాశాలున్న టెక్నాలజీలను గుర్తించడంలో టీవీఏజీఏతో పాటు పరిశ్రమ దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తారు. ఎంపికైన కంపెనీలకు ఈ ఏడాది మార్చ్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఇండియా పెవిలియన్‌లో చోటు కలి్పంచేందుకు విన్జో సహాయ సహకారాలు అందిస్తుంది. ఆసక్తి గల డెవలపర్లు జనవరి 24లోగా https:// bharattech. winzogames. com పోర్టల్‌లో తమ ప్రాజెక్టులను సమరి్పంచవచ్చు. -
ఓటీటీకి లియో.. రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఓ ట్విస్ట్!
హాలీవుడ్ నటుడు ఆడమ్ శాండ్లర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో ఈ నెలలోనే ఓటీటీకి రానుంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ యానిమేషన్ చిత్రానికి రాబర్ట్ మరియానెట్టి, డేవిడ్ వాచెన్హీమ్, రాబర్ట్ స్మిగెల్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఒక బల్లి, తాబేలు ఓ పాఠశాలలో చిక్కుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో సినిమాలో హాలీవుడ్ నటుడు సెప్టాజినేరియన్ బల్లి పాత్రకు వాయిస్ అందించారు. ఆడమ్ శాండ్లర్ కథను అందించారు. మిగిలిన పాత్రలకు పలువురు హాలీవుడ్ నటులు వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్, హ్యాపీ మాడిసన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: నాగచైతన్య తొలి సిరీస్ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్) అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో ఇండియాలో ఫ్యాన్స్ అంతా దళపతి విజయ్ మూవీ అనుకుంటున్నారు. వాస్తవానికి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో మూవీ డేట్ ఇంకా వెల్లడించలేదు. మొదట ఈనెల 16న ఓటీటీకి రావొచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన లిస్ట్‌లో 21న లియో మూవీ ఉండడంతో అందరూ విజయ్ సినిమానేని భావిస్తున్నారు. కానీ అదే పేరుతో తెరకెక్కించిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ లియో ఈనెల 21న స్ట్రీమింగ్ కానుంది. November is for the crowning of heroes 👑🚂🔴🔵#WhatToWatch #NewOnNetflix #NetflixForAll pic.twitter.com/gDzrboSd0P — Netflix India (@NetflixIndia) November 16, 2023 -
యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు విపరీతమైన డిమాండ్.. అలా చేస్తే సూపర్ సక్సెస్
అద్భుత దృశ్యాలను వర్ణించడానికి...‘రెండు కళ్లు సరిపోవు’ అంటాం. అద్భుత దృశ్యాలను సృష్టించడానికి రెండు కళ్లతో పాటు మూడోకన్ను కూడా అవసరం.దాని పేరే... క్రియేటివ్ ఐబూమింగ్ మార్కెట్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెరగడం ఒక కోణం అయితే, ఉపాధి అవకాశాలు పెరగడం, యువతరం క్రియేటివిటీకి విశాలమైన వేదిక దొరకడం అనేది మరో కోణం... ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల అభినవ్ భరద్వాజ్ ఫ్యాషన్ బ్లాగర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్. వీఎఫ్ఎక్స్, యానిమేషన్లో డిగ్రీ పూర్తి చేసిన అభినవ్‌కు ఎన్నో పురాణ పాత్రలపై అవగాహన ఉంది. ఇరవై సంవత్సరాల వయసులో ఆర్ట్, డిజైనింగ్‌ను కెరీర్‌గా చేసుకున్న అభినవ్ లాక్డౌన్ సమయంలో ట్రెండింగ్ టాపిక్స్‌పై లెక్కలేనన్ని డిజైన్లను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సృష్టించాడు. వాటికి మంచి స్పందన రావడం ఒక ఎత్తయితే పాపులర్ బ్రాండ్ల నుంచి అవకాశాలు రావడం మరో ఎత్తు. ‘మనకు ఉన్న రెండు కళ్లతో పాటు క్రియేటివ్ ఐ అనే మూడో కన్ను కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే బ్రాండ్ డిజైనింగ్ నుంచి సినిమా వీఎఫ్ఎక్స్ వరకు రాణించగలం’ అంటాడు అభినవ్. కలర్స్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ వరకు అతడి యూనిక్ స్టైల్ స్టేట్మెంట్కు యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో బెంగళూరుకు చెందిన శ్రీతేజస్వి ఒకరు. డిగ్రీ రెండోసంవత్సరం చదువుతున్న తేజస్వి వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను విడుదలైన మొదటి రోజే చూస్తుంది. ఆ సాంకేతికత గురించి తన అభిప్రాయాలను ఫేస్బుక్లో రాస్తుంది. వినోద రంగంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి ఇది బంగారు కాలం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ స్టూడియోల సంఖ్య పెరుగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు... మొదలైన నగరాలు యానిమేషన్ కంపెనీలు, అకాడమీలకు కేంద్రాలుగా మారాయి. మన దేశానికి పెద్ద ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ రంగంలో 2025 కల్లా 75,000 నుంచి 1,25,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. కమర్షియల్స్, వెబ్ సిరీస్, మూవీస్, వోటీటీకి హై–క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఈ నేపథ్యంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్లకు ప్రాధాన్యత పెరిగింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ బిజినెస్ కాంబినేషన్ యువతను ఆకర్షిస్తుంది. కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ యానిమేషన్‌కు డిమాండ్‌ను పెంచే కథలను సిద్ధం చేస్తోంది. ‘వీఎఫ్ఎక్స్, యానిమేషన్లకు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. అంచనాలకు అందని విధంగా ఈ రంగం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వీఎఫ్ఎక్స్ అనేది సాంకేతికత మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. కథాసం విధానంలో భాగం’ అంటున్నాడు వీఎఫ్ఎక్స్ నిపుణుడు రాజీవ్ కుమార్. స్కూల్ రోజుల నుంచే వీఎఫ్ఎక్స్ అంటే రాజీవ్‌కు ఆసక్తి. అయితే దాన్ని కెరీర్‌గా ఎలా చేసుకోవాలనే దానిపై స్పష్టత ఉండేది కాదు. పుణెలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన రాజీవ్ ముంబైకి వెళ్లి వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీతో ప్రయాణం మొదలుపెట్టి భారీ విజయం సాధించాడు. మలయాళ చిత్రం కందిట్టుండు (అది చూడు) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ గెలుచుకుంది. 25 సంవత్సరాల అదితి క్రిష్టదాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (ఎన్ఐడీ) లో యానిమేషన్ కోర్సు చేసిన అదితి క్రిష్ణదాస్ తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకుంది చెన్నైకి చెందిన ప్రియాంక సుబ్రమణియన్. లండన్ ఫిల్మ్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా మూవింగ్ పిక్చర్ కంపెనీకి తరచు వెళ్లేది. ఇండస్ట్రీ ధోరణులను అర్థం చేసుకోవడం కోసం ఎందరో కళాకారులతో మాట్లాడేది. పుస్తకాలు చదివేది. స్టూడియోలలో అవసరమైన వారికి టీ, కాఫీలు, వోల్డ్ టేప్‌లు, హార్డ్ డిస్క్‌లు అందించేది. వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ప్రియాంక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని కలలు కనేది. వీఎఫ్ఎక్స్ స్టూడియో రూపంలో తన కలను సాకారం చేసుకుంది. మీ శక్తి వృథా చేయవద్దు వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా చేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి నిరుపయోగం కాకుండా చూసుకోవాలి. – ప్రియాంక సుబ్రమణియన్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అ కథలు మళ్లీ ఇప్పుడు మనకు తరతరాల కథల సంపద ఉంది. అమ్మమ్మలు, నానమ్మల నోటి నుంచి కథలు వినే దృశ్యాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో యానిమేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. మరుగున పడిన ఎన్నో కథలను పిల్లలకు ఆకట్టుకునేలా చెప్పవచ్చు. యానిమేషన్ ఫిల్మ్స్ అంటే ఫన్నీ కార్టూన్స్‌ను మాత్రమే కాదు. – అదితి క్రిష్ణదాస్, డైరెక్టర్ -
గేమింగ్, యానిమేషన్ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ హబ్ (ఏవీజీసీ)గా మార్చేందుకు ప్రగతిశీల, స్థిరమైన వ్యక్తిగత పన్నుల విధానం అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గేమింగ్ ఆదాయంపై అత్యధికంగా 30 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయడం అన్నది ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. ఆఫ్‌షోర్ పాŠల్ట్ఫామ్లు ఎలాంటి పన్నులు చెల్లించకుండా, నియంత్రణల పరిధిలోకి రాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విధమైన పన్నుల ఎగవేత అన్నది ప్రభుత్వ ఖజానాకు పెద్ద నష్టమని, అంతిమంగా దేశీ పరిశ్రమకు మరణశాసనమని పేర్కొన్నారు. ఆన్లైన్లో నైపుణ్యాల ఆధారిత గేమింగ్ పరిశ్రమ పరిమాణం 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఏటా 38 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధితో 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. లాటరీల మాదిరి ఆన్లైన్ స్కిల్ గేమ్‌ల్లో భారీ ఆర్జన ఉండదని, కేవలం కొద్ది మందే ఆడతారని గేమ్స్24ఇంటూ7 వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ థంపి తెలిపారు. కనుక ఒక ఆటగాడు 70 శాతం గేముల్లో గెలిచినా, పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి వస్తున్నట్టు చెప్పారు. లాటరీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పన్ను చట్టాలను ఆన్లైన్ గేమింగ్‌కు అమలు చేయడం వల్ల ప్రతికూతల ఫలితాలు చూడాల్సి వస్తుందన్నారు. స్టాక్ మార్కెట్ మాదిరి కాకుండా, ఆన్లైన్ గేమర్లు అంతర్జాతీయంగా నడిచే చట్ట విరుద్ధమైన, పన్నుల పరిధిలో లేని గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు చెప్పారు. అక్కడ అయితే గేమర్లు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదన్నారు. పన్నుల్లో మార్పులు అవసరం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రోషన్‌షా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలంటే, 1970 నాటి నిబంధనలను ప్రస్తుత నూతన తరం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర దేశాలు గేమింగ్ పరిశ్రమ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడాల్సి ఉంది. అమెరికాలో గేమింగ్ ఆదాయాన్ని సాధారణ ఆదాయంగానే పరగణిస్తున్నారు. అక్కడ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్రిటన్‌లో గెలుచుకున్న మొత్తంపై ఎలాంటి పన్నులేదు’’అని షా చెప్పారు. ఊహించతగిన, ప్రగతిశీల పన్నుల విధానం భారత్‌కు అవసరమన్నారు. -
ఇండియా గేమింగ్ స్టడీ 2022.. లేడీ ‘గేమ్స్’బాండ్స్
వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటోంది యువత. ఆన్లైన్ గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యానిమేషన్‌ను వృత్తిగా మార్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ‘హెచ్‌పీ ఇండియా’ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాక్షి, అమరావతి: కేవలం మానసిక ఉల్లాసానికి.. ఆలోచన శక్తి పెంచుకోవడానికి మాత్రమే ఆన్లైన్ గేమింగ్‌ను పరిమితం చేయకుండా.. దీనిని ఓ వృత్తిగా మలుచుకుంటోంది నేటి యువత. కొందరు గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్‌గా మారుతుండగా.. మరి కొందరు గేమింగ్ యానిమేటర్స్‌గా మారుతున్నారు. ఈ రంగంలో పురుషుల కంటే.. మహిళల శాతమే అధికంగా ఉంటోంది. ఈ రంగంలో 56 శాతం మంది మహిళలు ఉండగా.. 44 శాతం మంది మాత్రమే పురుషులు. ఆన్లైన్ గేమింగ్‌ను పూర్తిస్థాయిలో కొందరు, పాక్షికంగా మరికొందరు.. గిగ్ వర్కర్‌గా ఇంకొందరు సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నట్టు హెచ్‌పీ ఇండియా ‘ఇండియా గేమింగ్ స్టడీ 2022’ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే.. మిగిలిన ఐటీ జాబ్స్‌తో పోలిస్తే గేమింగ్ రంగంలోని ఉద్యోగులకు 25 శాతానికి పైగా అధికంగా జీతాలు లభిస్తున్నాయి. ఎందుకంటే.. గేమింగ్ రంగంలో ఆలోచనశక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే నిలబడగలుగుతారని, అందుకే వారికి జీతాలు అధికంగా ఇస్తున్నారని ఐటీ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.68,800 కోట్లకు చేరనున్న మార్కెట్ భారత్‌లో ఆన్లైన్ గేమింగ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 50.70 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నట్టు ఋఇంటరాక్టివ్ మీడియా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లుమికియా’ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ రూ.20,800 కోట్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగి రూ.68,800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో ఉపాధి అవకాశాలపై యువత ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. సాఫ్ట్వేర్ రంగంలోనే 18 శాతం మంది గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్‌గా మారుతుండగా.. మరో 2 శాతం మంది గేమింగ్ యానిమేటర్స్‌గా ఉపాధి పొందుతున్నారు. కాగా, ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్న వారిలో అత్యధికంగా 92 శాతం మంది వినోదం, మానసిక ఉల్లాసం కోసం ఆడుతున్నట్టు సర్వేలో తేలింది. మొబైల్ ఫోన్లో కంటే కంప్యూటర్లోనే గేమింగ్ ఆడేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందంట. మొబైల్ కంటే పర్సనల్ కంప్యూటర్లోనే ఆటలు ఆడటానికి 68 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొబైల్ కంటే కంప్యూటర్లో ఆడితే అనుభూతి అధికంగా ఉంటోందని, అందుకనే ఈ మధ్య కాలంలో 39 శాతం మంది మొబైల్ నుంచి కంప్యూటర్లోకి ఆటలు ఆడటానికి మారినట్టు సర్వేలో వెల్లడైంది. పీసీ గేమింగ్‌పై దృష్టి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ పీసీ గేమింగ్‌లో మరిన్ని ఆవిష్కరణలు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్బేడి తెలిపారు. రాష్ట్రంలో కూడా ఆన్లైన్ గేమింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్నాయని, విజయవాడ, రాజమండ్రి, విశాఖ కేంద్రంగా 8కి పైగా ఐటీ సంస్థలు ఆన్లైన్ గేమింగ్‌లకు వివిధ సేవలను అందిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు లెర్నింగ్ ఆధారిత గేమ్స్‌కు బాగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో అవకాశాలను యువత అందిపుచ్చుకుంటోందన్నారు. వీఎఫ్ఎక్స్ యానిమేటర్స్, మెటావర్క్స్లో ఏఆర్, వీఆర్, ఎక్స్ఆర్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. ఆన్లైన్ గేమ్స్‌తోనే పిల్లల్లో చురుకు ఈ కాలంలో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి ఉండటంతో వారి మెదడు చురుకుగా పనిచేయడానికి కనీసం రోజుకు గంట లేదా గంటన్నర ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనివ్వాలి. ఇందుకోసం నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ థింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి. విశాఖలోని శ్రీశారద విద్యాలయంలో గల ఏటీఎల్‌లో పిల్లలను 3, 4 వారాలపాటు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి వదిలేసి పరిశీలిస్తున్నారు. ఎవరైతే ముందుకు వెళ్లలేకపోతున్నారో గుర్తించి వాళ్లకు అనుగుణంగా గేమింగ్‌లో కోడింగ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను గేమింగ్ రూపంలో చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమవుతోంది. – రాజశేఖర్ వాసా, ఫౌండర్, స్కెచ్ ఈఏ ఐటీ, వైజాగ్ -
గేమింగ్‌లో భారీ ఉద్యోగాలు
ముంబై: గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించొచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది. ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. 20–30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ‘గేమింగ్–రేపటి బ్లాక్ బస్టర్’పేరుతో టీమ్‌లీజ్ డిజిటల్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 30 శాతం ఉద్యోగాలు ప్రోగ్రామర్లు, డెవలపర్ల రూపంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రంగంలో గేమ్ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు, గేమ్స్ టెస్ట్ ఇంజనీర్లు, క్యూఏ హెడ్లు, యానిమేటర్లు, మోషన్ గ్రాఫిక్ డిజైనర్లు, వర్చువల్ రియాలిటీ డిజైనర్లు, వీఎఫ్ఎక్స్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. అధిక వేతనం.. ఈ రంగంలో అత్యధికంగా గేమ్ ప్రొడ్యూసర్లకు రూ.10 లక్షల వార్షిక వేతనం ఉంటే.. గేమ్ డిజైనర్లకు 6.5 లక్షలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు, గేమ్ డెవలపర్లు రూ.5.25 లక్షలు, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్లకు రూ.5.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీలున్నాయి. ‘‘గేమింగ్ పరిశ్రమ తదుపరి ఉదయించే రంగం. యూజర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. తరచూ నియంత్రణపరమైన నిబంధనల మార్పు రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి ఉపాధినిస్తుంది. 2026 నాటికి 2.5 రెట్లు వృద్ధి చెందుతుంది’’అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. 2026 నాటికి గేమింగ్ పరిశ్రమ రూ.38,097 కోట్లకు చేరుతుందని టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఆదాయం పరంగా భారత్ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆరో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఈ విపణి విలువ రూ.17,24,800 కోట్లుగా ఉంది. -
గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా!
Google's July 4 Animation: అమెరికాలో జులై 4న స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన వేడుకల్లో ఒక దుండగుడు ఇండిపెండెన్స్ డే పరేడ్ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తదనంతరం ఒక నెటిజన్ జులై 4వ తేదికి సంబంధించిన కంటెంట్ కోసం వెతుకుతున్నప్పుడూ...గూగుల్‌కి సంబంధించిన ప్రత్యేక సెలబ్రేషన్ యానిమేషన్ పేజీ కనిపించింది. అది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఐతే ఆ పేజిలో జులై 4న యూఎస్‌లో జరిగిన కాల్పులకు సంబంధించిన తాజా వార్తల పోటో లే అవుట్లతో పాటు కలర్‌ఫుల్ బాణ సంచాలతో రూపొందించింది. దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పుడూ ఇలా బాణాసంచాలతో కలర్ఫుల్గా ఇవ్వకూడదు. షికాగోలోని ఐలాండ్ పార్క్‌లో జరిగిన సాముహిక కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు, పైగా ప్రజలు భయంతో పరుగులు తీయడం వంటి బాధకరమైన వార్తలను ప్రజెంట్ చేస్తూ... రంగరంగుల బాణాసంచా కాల్పుతో కలర్ఫుల్గా సంబరంలా ఇవ్వడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. ఈ విషయమై మండిపడుతూ.. నెటిజన్లు ఫిర్యాదులు చేశారు కూడా. అంతేకాదు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడమే కాకుండా చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు సుమారు 24 మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడితే ఇవ్వాల్సిన నివాళి ఇదేనా! అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు సంబంధిత గూగుల్ యానిమేషన్ పేజీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. God bless America pic.twitter.com/BjVbymWJ1F — Sawbuck Wine (@sawbuckwine) July 4, 2022 (చదవండి: అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు) -
Baby Shark: యూట్యూబ్‌లో పెనుసంచలనం.. వెయ్యి కోట్ల వ్యూస్
బేబీ షార్క్ డ్యాన్స్.. పిల్లలు తెగ వినే ఈ పాట గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఈ పాటను యూట్యూబ్‌లో ఇప్పటివరకు వెయ్యి కోట్లమందికి పైగా వీక్షించారు కాబట్టి. అంటే ఒకరకంగా చూస్కుంటే ప్రపంచ జనాభానే ఈ పాట క్రాస్ చేసిందన్నమాట!! యస్.. దక్షిణ కొరియా ఎడ్యుకేషన్ అండ్ రైమ్స్ క్రియేట్ కంపెనీ పింక్‌ఫాంగ్ రూపొందించిన బేబీ షార్క్ సాంగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూస్ సాంగ్ ఘనత దక్కించుకుంది. తాజాగా పది బిలియన్ల వ్యూస్‌ను దాటేసి.. యూట్యూబ్‌లో ఎక్కువమంది చూసిన వీడియో ఘనత దక్కించుకుంది. ప్రపంచ జనాభానే దాదాపు 7.8 బిలియన్ కి అటుగా ఉంటే.. 10 బిలియన్ వ్యూస్ ఎలాగబ్బా అని అనుమానం రావొచ్చు. యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం.. అదనంగా ఆ 2 బిలియన్ వ్యూస్ జత అయ్యాయన్నమాట. దక్షిణ కొరియాకు చెందిన “పింక్ఫోంగ్” అనే సంస్థ రూపొందించిన “Baby Shark” అనే వీడియో ఈ ఘనత సాధించింది. ఇద్దరు చిన్న పిల్లలు ‘‘బేబీ షార్క్ డు డు డు..’’ అంటూ లయబద్ధంగా స్టెప్పులు వేయడం, ఆ వెనుక బేబీ షార్క్‌తో పాటు మామ్మీ, డాడీ, గ్రాండ్‌పా, గ్రాండ్మా షార్ట్‌లు రావడం.. ఇలా సాగుతుందని ఆ పాట. కొరియన్-అమెరికన్ గాయని హోప్ సెగోయిన్ తన 10 ఏళ్ల వయస్సులో ఈ సాంగ్ పాడింది. 2016లో ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది పింక్‌ఫాంగ్. కాగా 2020లో నవంబర్ లో ఈ వీడియో సాంగ్ 7 బిలియన్ వ్యూస్ దాటి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ప్యూర్టో రికన్ పాప్ స్టార్లు లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీ కంపోజ్ చేసిన ‘డెస్పాసిటో’ యూట్యూబ్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరికొన్ని ఆసక్తికర విషయాలు ఇదొక క్యాంప్‌ఫైర్ సాంగ్ అని, సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించే కొందరు ఈ పాట ప్రచారానికి మూల కారణం అని చెప్తుంటారు. 2016లో PINKFONG యూట్యూబ్ఛానెల్లో అప్లోడ్ అయ్యింది. సాంగ్ మొత్తం రన్ టైం 2 నిమిషాల 16 సెకండ్లు కాగా.. జస్ట్ ఒక్క నిమిషం మాత్రమే లిరిక్స్, ఎఫెక్ట్లు ఉంటాయి. 2017లో ఇండొనేషియాకు చెందిన కొన్ని కమ్యూనిటీలు, కుటుంబాలు ఈ సాంగ్‌ను వైరల్ చేశాయి. 2018లో టిక్ టాక్ ద్వారా #BabySharkChallenge వైరల్ కావడంతో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. బేబీ షార్క్.. 2021లో బేబీ షార్క్స్ బిగ్షోగా నిక్కెలోడియన్ ప్రీ స్కూల్ సిరీస్‌గా అలరించింది. అంతేకాదు దీనిపై ఫీచర్ ఫిల్మ్ తీసే ఆలోచనలో ఉంది నిక్కెలోడియన్. డిసెంబర్ 2021.. సిక్స్ పీస్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ ఘనత సాధించింది. బిల్బోర్డ్ హాట్ 100లో 32వ స్థానంతో ఎంట్రీ ఇచ్చి.. జనవరి 12, 2019న హయ్యెస్ట్ పొజిషన్ సాధించింది. సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. విచిత్రం ఏంటంటే.. ఈ పాట రాసిందెవరో క్లారిటీ లేకపోవడం!!. పింక్ఫోంగ్ పేరెంట్ కంపెనీ స్మార్ట్స్టడీ దగ్గర ఈ సాంగ్ రైట్స్ ఉన్నాయి. -
కోవిడ్ పూర్వ స్థాయికి మీడియా, వినోదం
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద రంగం నెమ్మదిగా కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకుంది. 10–12% వార్షిక వృద్ధితో 2030 నాటికి 55–70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ మొదలై నవి గణనీయంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు ఊతంగా నిలవనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటల్ వీడియోల వినియోగం మిగతా విభాగాలన్నింటినీ మించి భారీ స్థాయిలో పెరుగుతోందని నివేదిక పేర్కొంది. చైనాతో పాటు అంతర్జాతీయంగా అత్యధికంగా వృద్ధి నమోదు చేస్తున్న మార్కెట్లలో ఒకటిగా దేశీ మీడియా, వినోద రంగం కూడా ఒకటని తెలిపింది. ‘టీవీల్లో ప్రకటనల పరిమాణాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. భవిష్యత్ లో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతీయ చానళ్లలో అడ్వర్టైజింగ్ పెరగడం, కొత్తగా వచ్చే ప్రకటనకర్తల సంఖ్య వృద్ధి చెందనుండటం ఇందుకు దోహదపడగలవు‘ అని నివేదిక వివరించింది. చౌక డేటాతో అందుబాటులోకి ఓటీటీలు.. డేటా ధరలు మరింతగా తగ్గిపోవడంతో ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ చెల్లింపుల విధానాలు గణీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ వీడియోలు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. వివిధ రకాల కంటెంట్ అందిస్తున్న 40 పైచిలుకు సంస్థలతో తీవ్రమైన పోటీ నెలకొన్న వర్ధమాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందని వివరించింది. గత కొన్నేళ్లుగా ఎస్‌వీవోడీ (సబ్స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)లకు డిమాండ్ బాగా పెరిగిందని.. రాబోయే రోజుల్లో ఇది ఏవీవోడీ (అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)ని మించిపోగలదని పేర్కొంది. యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థలు .. ధరల విషయంలో వినూత్న విధానాలు పాటించడం, కంటెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలైనవి ఇందుకు దోహదపడుతున్నాయని నివేదిక తెలిపింది. గేమింగ్ వృద్ధికి మరింతగా అవకాశం.. గేమింగ్ విషయానికొస్తే.. అమెరికా, చైనాతో పోల్చినప్పుడు ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ మొబైల్ వినియోగం పెరిగే కొద్దీ ఇది పటిష్టంగా వృద్ధి కనపర్చవచ్చని వివరించింది. ‘భారత్ ప్రతిభావంతులకు హబ్‌గా మారుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో గేమింగ్ కంపెనీల సంఖ్య పది రెట్లు పెరిగింది. గత కొన్నాళ్లుగా ఈ రంగంలో వెంచర్ క్యాపిటల్ సంస్థల పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి‘ అని సీఐఐ, బీసీజీ నివేదిక తెలిపింది. -
ఇక కొలువు సులువు..
మనసులోని భావాలకు దృశ్యరూపం ఇచ్చే అరుదైన కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లోని యానిమేషన్ కోర్సు. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కోర్సు డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. 100 శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న ఈ కోర్సు ప్రత్యేకతలపై కథనం. సాక్షి,కడప(వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి స్పెషలైజ్డ్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నగరాలకే పరిమితమైన యానిమేషన్ కోర్సును బీఎఫ్ఏ యానిమేషన్ కోర్సుగా కడప విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలను తీర్చేవిధంగా తీర్చిదిద్దిన ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా సొంతగా, వివిధ సంస్థల్లో పనిచేసి పేరుప్రఖ్యాతులు, ఆకర్షణీయమైన వేతనాలు పొందవచ్చును. అర్హత : ఇంటర్మీడియట్లో ఏదైనా కోర్సు పూర్తిచేసిన ఇందులో చేరడానికి అర్హులు. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 ద్వారా ప్రవేశాలు పొందచ్చు. నాలుగు సంవత్సరాల ఈ కోర్సుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. కోర్సులో ప్రవేశం పొందిన వారికి వివిధ రకాల సాంకేతికతను వినియోగించి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అవకాశాల వెల్లువ.. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నది నిపుణుల మాట. చదువకుంటూ వివిధ సంస్థల్లో ఫ్రీలాన్స్‌గా కూడా ఉద్యోగం చేసుకునే సౌకర్యం ఉంది. ఆన్లైన్ ద్వారా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఫిల్మ్‌మేకింగ్, గేమ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ చేసే అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యానిమేషన్, గేమ్ డిజైనింగ్, కార్టూన్, టీవీఛానల్స్, బుక్ మేగజైన్స్, వెబ్ మాధ్యమాల్లో అపారంగా అవకాశాలు ఉన్నాయి. 2డీ, 3డీ యానిమేటర్లుగాను, లైటింగ్, రిగ్గింగ్ ఆర్టిస్ట్‌గాను, కేరక్టర్ డిజైనర్‌గాను, స్క్రిప్ట్ రైటర్, వీడియో, ఆడియో ఎడిటర్‌గా, పోస్ట్ ప్రొడక్షన్లో వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా, గ్రాఫిక్ డిజైనర్, టాయ్ యానిమేటర్, స్టోరీబోర్డు ఆర్టిస్టుగా, ఇలస్ట్రేటర్‌గా, టైటిల్ డిజైనర్, కంపోస్టర్, విజువల్ డెవలపర్, ఫ్లాష్న్యూస్మేకర్స్, ప్రొడక్షన్ డిజైనర్, లేఅవుట్ ఆర్టిస్ట్, 3డీ మోడులర్, కీ ప్రైమ్ యానిమేటర్, ఇమేజ్ ఎడిటర్‌గా, ఫోరెన్సిక్ యానిమేటర్ వంటి వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చదవండి: వైవీయూకు ఏపీ పీజీసెట్–21 నిర్వహణ బాధ్యతలు -
వందేళ్లనాటి అడవి కథ.. ఇప్పటికీ చూడాల్సిందే!
అదో దట్టమైన అడవి, అందులో.. మోగ్లీ అనే కుర్రాడి సాహసాలు చూసి ‘శెభాష్’ అనుకుంటాం షేర్ ఖాన్ క్రూరత్వం చూసి ‘కోపం’తో రగిలిపోతాం. తోడేలు తల్లి బాధకి గుండె కరిగిపోతుంది. భగీర గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. భల్లూ అల్లరి వేషాలకు నవ్వకుండా ఉండలేం. చివరికి అడవిని కాపాడటానికి ఏనుగులు చేసే ప్రయత్నం అదుర్స్ అనిపించకమానదు. పిల్లల నుంచి పెద్దల దాకా.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి అదొక ఫేవరెట్ సబ్జెక్ట్.. అదే జంగిల్ బుక్. ఆదివారం వచ్చిందంటే దిగ్గజ రచయిత గుల్జార్ రాసిన ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై..’ లౌడ్ సౌండ్‌తో మారుమోగేది. అంతలా ఆదరించబట్టే.. ఈ కల్పిత గాథకి రూపం ఏదైనా ఆదరణ మాత్రం తగ్గట్లేదు. సాక్షి, వెబ్‌డెస్క్: చిన్నతనంలో పెద్దపులి దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అవుతాడు ఓ చిన్నారి. ఆ పెద్దపులి బారినపడకుండా తోడేళ్లు ఆ పిల్లాడిని కాపాడుతుంటాయి. చివరికి ఆ పిల్లాడే పులిని చంపడంతో కథ సుఖాంతం అవుతుంది. సింపుల్‌గా ఇది రుడ్యార్డ్ కిప్లింగ్ కథ. ఈ కథ మొత్తం జంతువుల ప్రవర్తన నేపథ్యంలో సాగుతుంది. అయితే, అంతర్లీనంగా ఉన్న థీమ్ వేరు. డార్విన్ ‘మనుగడ’ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ.. మనిషి–జంతువుల మధ్య సంబంధాలను చూపించాడు. అదే విధంగా చట్టం–న్యాయం, అధికారానికి గౌరవం ఇవ్వడం, విధేయత, శాంతి స్థాపన, అడవుల నరికివేత, అడవి– ఊరు అనే రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య సంఘర్షణ... ఇలాంటి విషయాలెన్నో చర్చించాడు. ప్రకృతిపై మనిషి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో అనే పాయింట్ విమర్శకులకు సైతం బాగా నచ్చింది. అసలు కథ... షేర్ ఖాన్ అనే పెద్దపులి ఆ అడవికి రాజు. ఒకరోజు ఫారెస్ట్ అధికారుల క్యాంపెయిన్‌పై దాడిచేసి అధికారిని, అతని భార్యను చంపేస్తుంది. ఆపై అధికారి కొడుకుని చంపే ప్రయత్నం చేస్తుంది. కానీ, తోడేళ్ల రాజు ఆ పిల్లాడిని రక్షిస్తుంది. మోగ్లీ అని పేరు పెట్టి తోడేళ్ల మందలో కలిపేస్తుంది. అంతే కాకుండా తమ సరిహద్దుల్లో ఉన్నప్పుడు మోగ్లీపై దాడి చేయకూడదని షేర్ ఖాన్‌కి నిబంధన పెడతాయి. చిన్నతనంలో ఓ రోజు ఆడుకుంటూ మోగ్లీ సరిహద్దు దాటుతాడు. షేర్ ఖాన్ మోగ్లీని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, తోడేలు రాజు తన ప్రాణాలు పణంగా పెట్టి మోగ్లీని కాపాడుతుంది. తర్వాత రక్ష(ఆడ తోడేలు) మోగ్లీ తల్లిగా తన పిల్లలతో పెంచుకుంటుంది. భగీర(నల్ల చిరుత) మోగ్లీకి చెట్లు ఎక్కడం, వేటాడటంపై శిక్షణ ఇస్తుంది. భల్లు(ఎలుగు బంటి) తోడేళ్లకు విద్యాబుద్ధులు, అడవి చట్టాల్ని బోధిస్తుంటుంది. ఈ ఇద్దరి శిక్షణలో మోగ్లీ రాటు దేలతాడు. తర్వాత కొన్నేళ్లకు అనివార్య పరిస్థితుల్లో మోగ్లీ అడవి దాటాల్సి వస్తుంది. అప్పుడు షేర్ ఖాన్ మోగ్లీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, నిప్పుని ఆయుధంగా చేసుకుని మోగ్లీ తప్పించుకుంటాడు. పొరుగున ఉన్న ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఓ జంట మోగ్లీని దత్తత తీసుకుంటుంది. చిన్నతనంలో ఆ జంట బిడ్డని కూడా పులి ఎత్తుకుపోతుంది. మోగ్లీ పశువుల్ని కాస్తుంటాడు. అయితే, ఈ విషయం షేర్ ఖాన్‌కి తెలుస్తుంది. తోడేళ్ల మందలోని వేగుల సాయంతో మోగ్లీ చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ, మోగ్లీ అగ్గి సాయంతో షేర్ ఖాన్ని చంపేస్తాడు. అయితే ఊళ్లోవాళ్లు మాత్రం మోగ్లీని మంత్రగాడిగా అనుమానించి.. వెళ్లగొడతారు. దీంతో మోగ్లీ తిరిగి అడవికి చేరి తన తోడేలు కుటుంబంతో హాయిగా నివసిస్తుంటాడు. ఇది మొదటి పుస్తకం కథ. రెండో పుస్తకంలో జంగిల్ బుక్ సీక్వెల్. అప్పటికే ఆ ఊరి గ్రామస్తులు అడవిని నాశనం చేస్తుంటారు. అదే సమయంలో కరువుతో గ్రామస్తులు చనిపోతుంటారు. అయితే, మోగ్లీ చేతబడి చేయటంతోనే తమ ప్రాణాలు పోతున్నాయని ప్రజలంతా నమ్ముతారు. మోగ్లీ్కి ఆశ్రయం ఇచ్చారన్న కారణంతో ఆ జంటను చంపేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం స్నేహితురాలి ద్వారా మోగ్లీ తెలుసుకుంటాడు. వెంటనే మోగ్లీ జంతువులతో ఊరిపై దాడి చేయించి వారిని రక్షిస్తాడు. ఇది ఆసరాగా చేసుకుని ఎర్ర తోడేళ్లు మనుషులపై దాడి చేయాలనుకుంటాయి. కానీ, మోగ్లీ తన తోడేలు కుటుంబం సాయంతో ప్రజల్ని రక్షిస్తాడు. మోగ్లీ మానవత్వానికి కరిగిపోయిన అతని తల్లి.. మనుషులతో ఉండాలా? జంతువులతో అడవిలోనే నివసించాలా? అన్న నిర్ణయాన్ని మోగ్లీకే వదిలేస్తుంది. అలా మోగ్లీ ఆలోచిస్తుండగానే కథ ముగుస్తుంది. అయితే తర్వాత రుడ్ యార్డ్ కిప్లింగ్ రాసిన ‘ది స్పింగ్ రన్నింగ్’ పుస్తకంలోనూ మోగ్లీ సంఘర్షణకు ముగింపు ఇవ్వకపోవటం విశేషం. జంగిల్ బుక్ పుట్టుక నిజానికి జంగిల్ బుక్ కథ కంటే ముందే కీలక పాత్ర మోగ్లీ పుట్టింది. ఇంగ్లండ్ ఆర్టిస్ట్ జాన్ లాక్వుడ్ కిప్లింగ్. భారత దేశ చరిత్రపై కొన్నాళ్ల పాటు అధ్యయనం చేశాడు. ఆ సమయంలో భారత్‌లో పర్యటించిన ఆయన.. మోగ్లీ, మరికొన్ని పాత్రలను స్కెచ్ వేశాడు. మోగ్లీ అంటే కప్ప అని అర్థం. ఆ తర్వాత లాక్వుడ్ కొడుకు రుడ్యార్డ్ కిప్లింగ్ ఆ క్యారెక్టర్లతోనే జంగిల్ బుక్ రచన మొదలుపెట్టాడు. రుడ్యార్డ్ ముంబైలో పుట్టాడు. మధ్యప్రదేశ్(అప్పుడు మధ్యభారతం)లోని సియోని ప్రాంతంలోని ‘పెంచ్’ అడవి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఓ ఇంగ్లిష్ ఫారెస్ట్ అధికారికి సహకరించే గిరిజన చిన్నారే మోగ్లీ. అలా చిన్న చిన్న కథలు రాశాడు. ఆ కథలన్నింటినీ సంపుటిగా చేసి ‘ఇన్ ది రుఖ్’ పేరిట సంకలనం చేశాడు. ఆ మరుసటి ఏడాది అంటే 1894లో ది జంగిల్ బుక్‌గా పుస్తకం అచ్చయ్యింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోగ్లీ–షేర్ ఖాన్ కథ ఆ పుస్తకంలోనిదే. ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంతో ముడిపెట్టి రెండో పుస్తకం రాశాడు రుడ్యార్డ్. ఈ రెండు పుస్తకాల్ని కలిపి 1907లో ఒకే పుస్తకంగా అచ్చేయించాడు. 1933లో అది కాస్త ‘ఆల్ ది మోగ్లీ స్టోరీస్’ పేరుతో ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది రచయితలు, దర్శకులు తమ వర్షన్లను జంగిల్ బుక్కి అన్వయించారు. ఎన్ని కథలోచ్చినా ఆ క్రెడిట్ మాత్రం కిప్లింగ్కే కట్టబెడుతుంటారు. తెరపై భారీ విజయాలు జంగిల్ బుక్ మీద యానిమేటెడ్ సిరీస్‌లు.. చిత్రాలు బోలెడన్ని వచ్చాయి. అవన్నీ బంపర్ హిట్లే. జపాన్‌కు చెందిన నిప్పోన్, డోరో టీవీ మర్చండైజింగ్ స్టూడియోలు సంయుక్తంగా జంగిల్ బుక్–షోనెన్ మోగ్లీని 52 ఎపిసోడ్లతో కార్టూన్‌గా తెరకెక్కించాయి. దానిని భారత్‌లో ది జంగిల్ బుక్: ది అడ్వెంచర్స్ ఆఫ్ మోగ్లీ గా అనువదించారు. భారత్‌లో 90వ దశకంలో ఊపు ఊపిన యానిమేటెడ్ సిరీస్ అదే. తర్వాత వీడియో గేమ్‌గా జంగిల్ బుక్ ఆదరణ పొందింది. ఇవన్నీ ఒక ఎత్తయితే జాన్ ఫావ్రూ డైరెక్షన్లో 2016లో రిలీజ్ అయిన ది జంగిల్ బుక్ చిత్రం. వాల్ట్ డిస్నీ బ్యానర్లో 3డీ లైవ్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం యానిమేటెడ్ చిత్రాల చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాలో ఒకే ఒక్క హ్యుమన్ క్యారెక్టర్. ‘మోగ్లీ’ పాత్రలో ఏషియన్–అమెరికన్ సంతతికి చెందిన నీల్ సేథి నటించాడు. సంకల్ప్ వాయుపుత్ర అనే కుర్రాడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో మోగ్లీ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. బిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. భారత్‌లోనూ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. -
దివాళా తీసిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ యానిమేషన్ కంపెనీ డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తన కార్యాలయాన్ని మూసివేసింది. దివాలా తీసినట్లు కోర్టులో ఆ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ఈ సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సంస్థపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.14లక్షల వరకు రావాలని ఉద్యోగులు తెలిపారు. తమ వేతనాలు అడిగితే వేధింపులకు , బెదిరింపులకు పాలుపడుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి -
కథ కంచికి.. మనం ఇంటికి!
కథ చదవడం ఆసక్తి అయితే.. కథ చెప్పడం గొప్ప ఆర్ట్. సంపూర్ణ బాల్యానికి కథ పునాది. చిన్నారుల్లో దీక్ష, పట్టుదల, జ్ఞాన సముపార్జన, మంచి చెడుల మధ్య వ్యత్యాసం, మానవ సంబంధాల గొప్పతనాన్ని కథ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. గతంలో ప్రతి ఇంటిలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు గొప్ప కథకులుగా ఉండేవారు. కథ ఎంపిక దగ్గర నుంచి దానిని చిన్నారులకు అర్థమయ్యేలా, వారిని ఆకట్టుకునేలా వివరించడంలో ఇప్పటి సినిమా స్క్రీన్ ప్లే రైటర్స్ కంటే అద్భుతంగా నడిపించేవారు. తెనాలి: ‘అనగనగా’.. అంటూ మొదలు పెట్టి సాఫీగా వెళ్తున్న కథను ఒక్కసారిగా ఆపి.. చిన్నారుల ఆలోచనా శక్తికి కథకులు పదనుపెట్టే వారు. కథలోని ట్విస్టే ఉలిక్కిపడేలా ఉత్సుకతను పెంచి ఆ ట్విస్ట్‌ని బయటపెట్టి పిల్లలను ఆశ్చర్యపరిచి ఆనందాన్ని అందిచేవారు. ఒక రాజు కథలో.. ‘ఏడు చేపలు’ గురించి ఏడు తరాలు చెప్పుకునేవారు. ‘నాన్నా పులి’ అంటూ చిన్నారి కేకలో.. ముందు నవ్వును పంచి.. కన్నీటి నీతిని బయటపెట్టేవారు. ఇతరుల శక్తిని తక్కువ అంచనా వేయవద్దంటూ ‘కుందేలు–తాబేలు’ పోటీని వినిపించేవారు. ‘మాట తప్పని ఆవు’ గురించి చెప్పి మాట విలువను పెంచేవారు. ‘పంచతంత్ర’లో విజ్ఞాన్ని పంచి.. ‘చందమామ’లో జానపథాన్ని వినిపించి.. ‘అక్బర్ బీర్బల్’.. తెనాలి రామకృష్ణుడి తెలివిని వినిపించి, ‘ఇంద్రజాలాన్ని’ పరిచయం చేసి కథతోనే కథను చెప్పించి.. బాలలకు వినోద, విజ్ఞానాన్ని అందించేవారు. తరాలు మారడంతో.. కానీ, ఇప్పుడు తరాలు మారాయి. ఆ కథలు కలగా మిగిలిపోయాయి. అమ్మమ్మ, నాయనమ్మ ఒడిలో చిన్నారులు నిద్రపోవడం లేదు. సాయంత్రం వేళ సరదా కబుర్లు లేవు. కుటుంబ వ్యవస్థ చిన్నదైపోయింది. పని ఒత్తిడిలో ఎవరికివారే యమునా తీరే. పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడంతో ఎప్పుడైనా ఏదైనా కథ చెప్పాలనిపించినా ఏదీ గుర్తుకురాదు. నేటి పాఠశాల విద్యలో పుస్తకాలతోపాటు మోసుకొచ్చే హోంవర్క్‌తోనే పిల్లల కళ్లమీదకు నిద్ర ముంచుకొస్తోంది. ఇక కథలకు ఆస్కారం ఎక్కడ! ఈ క్రమంలోనే తనను వినిపించేవారు, వినేవారు లేక కథ మూగబోయింది. లోగిళ్ల నుంచి దూరమైపోంది. కొత్త రూపు దాల్చిన కథ ప్రస్తుతం కథ.. కొత్త రూపుదాల్చింది. ‘తెర’బొమ్మగా మారింది. సినిమాలు, నాటికలు, షార్ట్‌ఫిల్మŠస్‌గా కనిపిస్తోంది. కాలక్షేపంగా కార్టూన్ సినిమాలు, వీడియో గేమ్‌లలోకి వచ్చేసింది. మొబైల్/టీవీలకు అతుక్కుపోతున్న పిల్లలకు కంటి సమస్యలు రావడం తప్ప కథా విషయాలు తెలియడం లేదు. కథ చెప్పడంలో కొత్త మార్పులొచ్చాయి గానీ నీతిని, జ్ఞానాన్ని పంచడంలో నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది. పిల్లల్ని కథలకు దగ్గర చేద్దాం.. విధి ఎంత విచిత్రమో!.. ‘కథ’ కంచికి వెళ్తే.. ‘మనం’ ఇంటికి వచ్చాం. కరోనా లాక్డౌన్లో కుటుంబం మొత్తం ఒకే చోటుకు చేరింది. వ్యక్తుల మధ్య దూరం తగ్గి ప్రేమానురాగం బలపడింది. పెద్దల సంగతి అలా ఉంటే బడుల కెళ్లాల్సిన చిన్నారులకు మరే అవకాశం లేదు. కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ఆన్లైన్ పాఠాలు చెవికెక్కుతున్నా, మెదడుకు ఎక్కేది ఎంతవరకు అన్నదీ ప్రశ్నే! ఎటుతిరిగి పెద్దోళ్లు, పిల్లలు ఇంటిలోనే గడుపుతున్న ఈ కాలంలో పిల్లలి్న, కథల్లోకి తీసుకెళ్లగలిగితే, సెలవులు సది్వనియోగమైనట్టే. అపరిమిత విలువలు, జ్ఞానం, ఆలోచనాశక్తిని అందించినట్టే. మరోవైపు వెబ్సైట్, యూట్యూబ్ చానళ్లలో కూడా తెలుగు కథలు లభిస్తున్నాయి. నెట్టింట్లో కథలు.. ♦help@pratham.org ♦podupukathalu.blogspot.com ♦indianepicstories.blogspot.in ♦telugupennidhi.com ♦telugu& velugu.net ♦forkids.in ♦telugumalika.blogspot.com యానిమేషన్ రూపంలో కథలు అందిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు ♦fairy toonz telugu ♦bommarillu videos ♦kids planet -
నువ్వు నిజంగా దేవుడివి సామి
టెక్నాలజీ ఎంతగా కొత్త పుంతలు తొక్కుతుందనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. టెక్నాలజీ ఉపయోగించి ఎదుటివారి కళ్లను కూడా మోసం చేయగలం. దానిలో ఉండే చిన్న కిటుకు తెలిస్తే చాలు.. విచ్చలవిడిగా వాడేయచ్చు. ఇప్పుడు మనం చూడబోయే వార్త అలాంటిదే మరి. ఒక వ్యక్తి భూతద్దంలోంచి మనకు ఏదో చూపిస్తున్నట్లు ఒక కన్నును పెద్దదిగా చేసి చూపిస్తాడు. అప్పటివరకు కంటిపాప మాత్రమే కనిపించే అద్దంలో ఒక్కసారిగా వ్యక్తి ముఖం పైకి చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అదేంటి కంటిపాప లోంచి అతను ఎలా బయటికి వచ్చాడా అంటూ ఆశ్చర్యంతో పాటు సందేహం కూడా కలుగుతుంది. మూములుగా ఆలోచిస్తే ఇందులో మర్మమేంటనేది చిక్కదు.. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు విషయం బోధపడుతుంది. కేవలం టెక్నాలజీని ఉపయోగించి వీడియో చూసేవారి కళ్లను మోసం చేశాడు కెవిన్ పారీ అనే వ్యక్తి. కెవిన్ పారీ వాడిన ఆ టెక్నాలజీ గురించి రెండో వీడియో విడుదల చేశాడు. రెండో వీడియోలో భూతద్దం నుంచి కంటిపాపలో ఆ ముఖం ఎలా కనపడిందనేది వివరించాడు. మొదట గ్రీన్ కలర్ కోటింగ్ ఉన్న భూతద్ధం తీసుకున్నట్లు చెప్పాడు. తర్వతా దాని స్థానంలో మాములు భూతద్ధంను ఉంచాడు. తర్వాతి స్టెప్‌లో తానే ఒక నల్ల డ్రెస్ వేసుకొని కంటిపాపలో నుంచి పైకి చూస్తున్నట్లుగా చిన్న స్టిల్ ఏర్పాటు చేసి యానిమేషన్ టెక్నాలజీతో మొదటి దానితో రెండో దానిని అటాచ్ చేశాడు. ఈ రెండింటిని కలిపి మనకు చూపించాడు. భూతద్దం లోంచి చూడగానే మనకు ఆ కంటిపాపలో అతని ముఖం కనిపించే విధంగా భ్రమ కలిగించాడు. వీడియో చూడడానికి కొంచెం భయం కలిగినా కెవిన్ పనితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే ఇదంతా ఏదో సరదా కోసం చేశానని కెవిన్ వెల్లడించాడు. ఏది ఏమైనా కెవిన్ చేసిన ఈ వీడియో మోస్ట్ పాపులర్ వీడియోల్లో ఒకటిగా నిలిచింది. న సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అసలు ఇలాంటి ట్రిక్ ఇంతవరకు చూడలేదు.. నువ్వు నిజంగా దేవుడివి సామి.. అమేజింగ్.. నీలాంటి వాళ్లు ఇక్కడ కాదు ఉండాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram I don’t know what this is or why I made it 🔍👁 A post shared by Kevin Parry (@kevinbparry) on Aug 21, 2020 at 2:01pm PDT View this post on Instagram How I made this weird eyeball trick 🔍👁 A post shared by Kevin Parry (@kevinbparry) on Aug 31, 2020 at 2:22pm PDT -
చిట్టి చుల్ బుల్ పాండే
సల్మాన్ ఖాన్ సినిమా కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిన సినిమాల్లో ‘వాంటెడ్’ (తెలుగు ‘పోకిరి’ రీమేక్), ‘దబాంగ్’కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘దబాంగ్’లో చేసిన చుల్ బుల్ అనే అల్లరి పోలీస్ పాత్రను సల్మాన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అదే చుల్ బుల్ పాండే పాత్ర చిన్న పిల్లలకు మరింత చేరువ కాబోతోందట. ప్రస్తుతం ఈ పాత్రకు యానిమేషన్ రూపం ఇవ్వబోతున్నారు. చిన్న పిల్లలు ఆస్వాదించే విధంగా ఓ యానిమేషన్ సీరియల్ ప్రారంభించనున్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మరియు కాస్మోస్ మాయ యానిమేషన్ స్టూడియో సంయుక్తంగా ఈ సీరియల్ ను నిర్మించనున్నాయి. 52 ఎపిసోడ్ల ఈ సీరియల్ వచ్చే ఏడాది వేసవికి ప్రసారం కానుంది. చుల్ బుల్ పాండేతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్రలయిన రాజ్జో, మఖ్ఖి, చెడ్డీ సింగ్ వంటి పాత్రలు కుడా ఈ సీరియల్లో ఉంటాయి. అయితే ఈ పాత్రలకు సల్మాన్ ఖాన్ వాయిస్ ఓవర్ ఉండదని స్పష్టం చేశారు అర్బాజ్. -
ఛోటా భీమ్-ఇందుమతి పెళ్లి: నిజమేనా?
పిల్లల నుంచి యువతీయువకుల వరకు అందరికీ ఎంతగానో నచ్చే కార్టూన్ ప్రోగ్రాంలో "చోటా భీమ్" అగ్రస్థానంలో ఉంటుంది. లాక్డౌన్ పుణ్యమాని అందరూ మరోసారి ఈ యానిమేషన్ ప్రోగ్రామ్ వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కాగా "ఛోటా భీమ్" కార్టూన్ విషయానికొస్తే.. ఢోలక్ పూర్ అనే పల్లెటూరిలో తొమ్మిదేళ్ల ఛోటా భీమ్ అనే శక్తివంతుడైన కుర్రాడు ఉంటాడు. ఎవరికి ఆపద వచ్చినా తక్షణమే భీమ్ వారిని రక్షిస్తాడు. అయితే అతనికి ఎంతో ఇష్టమైన లడ్డూ తింటే గానీ శత్రువుని ఎదిరించలేడు. ఇక ఛోటా భీమ్‌కు చుట్కీ, రాజు, జగ్గు అనే కోతి, ఆ ఊరి రాజుగారి కూతురు ఇందుమతి స్నేహితులు. (బుజ్జి బుజ్జి మాటలు) ఇందులో చుట్కీ.. భీమ్‌కు బెస్ట్ ఫ్రెండ్. అయితే తాజాగా ఛోటా భీమ్ ఇందుమతిని పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. "లేదు, వీల్లేదు, భీమ్.. చుట్కీకి అన్యాయం చేయకూడదు" "చుట్కీని ఒంటరిగా వదిలేయకు భీమ్.." అంటూ నెటిజన్లు కోరుతున్నారు. దీంతో ట్విటర్లో గురువారం #JusticeForChutki ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై స్పందించిన కార్టూన్ నిర్వాహకులు గ్రీన్ గోల్డ్ యానిమేషన్స్ అదంతా అబద్ధమని కొట్టిపారేసింది. భీమ్-ఇందుమతి వివాహం వుట్టి పుకారేనని స్పష్టం చేసింది. భీమ్, చుట్కీ, ఇందుమతి ఇంకా చిన్నపిల్లలే అని, వారి మధ్య ప్రేమ, పెళ్లి అనే విషయాలను జోడించకండి అని సెలవిచ్చింది. దీంతో శాంతించిన అభిమానులు "న్యాయం జరిగింది" అంటూ సంతోషం వ్యక్తం చేశారు. (‘చోటా భీమ్’కు కేటీఆర్ అభినందనలు) -
యానిమేషన్ రాంమోహన్ కన్నుమూత
ముంబై: భారత్ యానిమేషన్ రంగ ఆద్యుడు రామ్మోహన్(88) శుక్రవారం కన్నుమూశారు. భారత ప్రభుత్వ ఫిల్మ్స్ డివిజన్ కార్టూన్ ఫిల్మ్స్ యూనిట్లో 1956 వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1968లో ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో యానిమేషన్ విభాగానికి చీఫ్‌గా చేరారు. 1972లో సొంతంగా తన పేరుతో ‘రామ్మోహన్ బయోగ్రాఫిక్’ సంస్థను స్థాపించారు. దేశంలోనే మంచి పేరున్న ముంబైలోని గ్రాఫిటి మల్టీమీడియా సంస్థకు ఆయన చైర్మన్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. గ్రాఫిటి స్కూల్ ఆఫ్ యానిమేషన్‌ను 2006లో ప్రారంభించారు. పలు హిట్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు ఆయన యానిమేషన్ రూపం ఇచ్చారు. ఎంతో మంది యానిమేషన్ నిపుణులను ఆయన తయారు చేశారు. రామ్మోహన్ మరణం పట్ల యానిమేషన్ ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. -
రావణ బ్రహ్మలు
లార్డ్ గణేశ్.. యానిమేషన్‌కు ఓ క్యారెక్టర్ అయ్యాడు.రావణుడు.. యాడ్స్‌కి మోడల్ అయ్యాడు. తలనొప్పి మాత్రల నుంచి భావోద్వేగాల వరకు ప్రకటనలకు ఆయన పదితలలు పనికొచ్చినట్టుగా ఇంకే పౌరాణిక పాత్రా మేకప్ వేసుకోలేదు. ఇటీవలే నిమజ్జనం కాబట్టి గణేశ్ ఇంకా వార్తల్లో ఉన్నాడు అనుకోవచ్చు. మరి హఠాత్తుగా రావణుడి ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే ఆయన బొమ్మల తయారీకి టైమ్ వచ్చింది కనుక. ఢిల్లీ ఆ పనిలో అప్పుడే బిజీ అయిపోయింది కూడా. దసరాకి ఉత్తర భారతంలో రావణ దగ్ధం ఓ ఘట్టం. అందుకు రావణుడి దిష్టిబొమ్మలు కావాలి కదా. తితార్‌పూర్ ఇప్పుడు ఆ పనిలో ఉంది. ఢిల్లీలోని సుభాష్‌నగర్‌కి టాగోర్ గార్డెన్స్కీ మధ్యలో ఉంటుంది తితార్‌పూర్. మెట్రోలో వెళ్లాలంటే బ్లూలైన్ పట్టుకోవాలి. ఇదొక అర్బన్ విలేజ్. దీన్ని రావణ సూపర్‌మార్కెట్ అని పిలిచుకుంటారు అర్బన్ ఫోక్స్ (పురజనులు). ఎందుకంటే ఆసియాఖండంలోనే అతిపెద్ద దిష్టిబొమ్మల మార్కెట్ ఇది. దసరా సమయంలో రావణ, మేఘనా«థుడు (రావణుడి కొడుకు), కుంభకర్ణుడి బొమ్మలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరు ఏ బొమ్మలు (రాజకీయ నాయకులు ఎట్సెట్రా) చేయమని ఆర్డర్ ఇస్తే అవి చేసిపెడ్తారు. తితార్‌పూర్ ఫుట్పాత్లన్నీ రావణుడి తలలు, చేతులు, కాళ్లు, అవయవాలతో నిండి ఉంటాయి. ఇంకోవైపు.. తయారైన రంగురంగుల దిష్టిబొమ్మలు. వీటిని కొనుక్కునేవాళ్లతోనే కాదు.. ఫొటోలు తీసుకునే విదేశీయులు, దేశీ టూరిస్ట్లతోనూ తితాపూర్ కిటకిటలాడుతూ ఉంటుంది దసరా వరకు. 2 నుంచి 80 అడుగుల వరకు వెదురు బద్దలతో ముందు రావణుడి దేహాకృతిని తయారు చేస్తారు. తర్వాత దాంట్లో అన్నీ గుడ్డముక్కలు కుక్కుతారు. పటాసులూ పెడ్తారు (పటాసులు కూడా కావాలని కోరుకున్న వాళ్లకు మాత్రమే పటాసులు పెట్టి తయారు చేసిస్తారు). పైనుంచి మళ్లీ ఓ గుడ్డను చుట్టి.. తర్వాత రంగురంగుల కాగితాలతో తల నుంచి కాళ్ల వరకు అతికించేస్తారు. ఇప్పుడు పెయింట్‌తో కళ్లు, ముక్కు, చెవులు, నోరు గీస్తారు. దాంతో రావణుడి దిష్టిబొమ్మ రెడీ. ఈ బొమ్మలు రెండు అడుగుల నుంచి దాదాపు 80 అడుగుల ఎత్తు వరకు రకరకాల సైజుల్లో దొరుకుతాయి. అయిదు వందల నుంచి లక్షరూపాయల వరకు ధరలుంటాయి. బాహుబలి.. డ్రాక్యూలా దసరా వస్తోందంటే రావణుడి దిష్టిబొమ్మలకు చాలా గిరాకీ ఉంటుంది. రావణుడిని రావణుడి ఆకారంలోనే కాక తమకు ఇష్టమైన వారి ఆకారంలో కూడా తయారు చేసివ్వమని అడుగుతుంటారట కస్టమర్లు. కిందటేడు బాహుబలి, డ్రాక్యూలా షేప్‌లో రావణుడి బొమ్మలు కావాలని మహా డిమాండ్ వచ్చిందట. ఇంకొంత మంది తమకు నచ్చిన దుస్తుల్లో రావణుడిని అలంకరించమంటారట. కాని ఈ తయారీదారులు ఇలాంటి వాటికి ‘నో’ అని సమాధానం చెప్తారు చాలా సింపుల్‌గా. ‘‘ఎంతైనా రావణుడే కదా మాకు అన్నదాత. ఆయన బొమ్మలు అమ్మే కదా మా పొట్టనింపుకుంటున్నాం. మాకు అన్నంబెట్టే ఆ దేవుడిని అతని రూపంలో కాకుండా వేరే వేరే రూపాల్లో తయారు చేయడమంటే ఆ దేవుడిని అవమానించినట్టే కదా! అందుకే కలర్స్, డిజైన్ ఎలిమెంట్స్ తప్ప ఇంక వేటినీ కస్టమైజ్ చేయం’’ అంటాడు రాజు అనే తయారీదారుడు. దహనం చేస్తున్నప్పుడు ఏమైనా ఫీలవుతారా? అని అడిగితే.. ‘‘బాధనిపిస్తుంటుంది.. ఈ చేతులతో తయారు చేస్తాం కదా... కాని ఏంచేస్తాం? పండగలో భాగం. అదొక సంప్రదాయం’’ అని సమాధానమిస్తాడు శంకర్ అనే ఇంకో తయారీదారుడు. సీజన్ అయ్యాక ఇంట్లో శిక్షణ ఈ సంచార కమ్మరులు దిష్టిబొమ్మల తయారీని ఓ పరిశ్రమగా కాక కళగానే చూస్తారు. సీజన్ అయిపోయాక ఇంట్లో ఉన్న పిల్లలకు ఈ కళను నేర్పిస్తుంటారు. వెదురుబద్దలను ఎండబెట్టడం.. వాటిని చీల్చడం.. బొమ్మల్లా చేయడం, రంగులు తయారు చేయడం.. రంగుల ఎంపిక.. కనుముక్కు తీరు గీయడం... వంటివాటన్నిటిలో శిక్షణనిస్తారు. చాలా మంది పిల్లలు బడికి వెళ్తూనే తమ పెద్దవాళ్ల దగ్గర ఈ కళనూ అభ్యసిస్తున్నారు. పనిముట్ల తయారీలో వచ్చే లాభం కన్నా సీజన్లో దిష్టిబొమ్మల ద్వారా సంపాదించేదే ఎక్కువ అని చెప్తారు. ఎవరీ రావణబ్రహ్మలు? కమ్మరుల్లో సంచార కమ్మరులు ఈ దిష్టిబొమ్మలు చేసేవారు. రాజస్థాన్‌కు చెందిన గడియా లోహార్ తెగవాళ్లు మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారట. అక్బర్‌తో జరిగిన యుద్ధంలో మహారాణా ప్రతాప్ ఓడిపోవడంతో ఆ అవమానం తట్టుకోలేక తిరిగి విజయం సాధించే వరకు ఆ రాజ్యంలో అడుగుపెట్టమని ప్రతిజ్ఞచేసి మరీ మేవాడ్‌ను వదిలారట. అలా చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లా చెదురై సంచారం కొనసాగించారట. వాళ్ల వారసులమే అని తమ చరిత్ర చెప్తారు వీళ్లు. కర్ణాటకతోపాటు మన దగ్గర కనిపించే లండాలు కూడా ఈ తెగవారే అంటారు. తితార్పూర్లో ఉంటున్న గడియా లోహార్స్ సీజన్లో దిష్టిబొమ్మలను చేస్తూ మిగిలిన సమయంలో ఇనుప వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తారు. – శరాది -
దీపికాపదుకొనే తరహాలో..
తమిళసినిమా: కోలీవుడ్‌లో సాయేషా సైగల్ ఖాతాలో విజయాలకు బీజం పడింది. అవును కడైకుట్టి సింగం చిత్రంతో తొలిసారిగా విజయానందాన్ని అనుభవిస్తోంది ముంబై బ్యూటీ. ఓటమి నుంచే విజయం పుడుతుందంటారు. అది సాయేషా విషయంలోనూ నిజమైంది. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం వనమగన్ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే సాయేషాసైగల్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అవే ఈ సుందరిని ఇక్కడ నిలదొక్కుకునేలా చేశాయి. కార్తీతో జతకట్టిన కడైకుట్టి సింగం ఇటీవల తెరపైకి వచ్చి ప్రేక్షకాదరణతో విజయం దిశగా పరుగులు పెడుతోంది. తదుపరి విజయ్‌సేతుపతికి జంటగా నటించిన జుంగా, ఆర్యతో రొమాన్స్ చేస్తున్న గజనీకాంత్ చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. తదుపరి చిత్రం ఏమిటాని ఎదురుచూస్తున్న తరుణంలో దీపికాపదుకొనే తరహాలో యానిమేషన్ చిత్రంలో నటించే అవకాశం సాయేషా తలుపుతట్టింది. ఐసరి గణేశ్ వేల్స్ ఫిలింస్, ప్రభుదేవా స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రంలో సాయేషా కొత్తగా వచ్చి చేరిందన్నది తాజా సమాచారం. ఎంజీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన ఉలగం చుట్రు వాలిబన్ చిత్రం తరువాత ఆయన దానికి సీక్వెల్ చేయాలని ఆశించారు. అయితే అందుకు సమయం అనుకూలించకపోవడంతో చేయలేకపోయారు. దాన్నిప్పుడు ఐసరి గణేశ్, ప్రభుదేవ యానిమేషన్ చిత్రంగా నిర్మిస్తున్నారు. అదే కిళక్కు ఆఫ్రికావిల్ రాజు. ఇందులో ఎంజీఆర్, జయలలిత పాత్రలను యానిమేషన్లో రూపొందిస్తున్నారు దర్శకుడు అరుళ్మూర్తి. అయితే కొన్ని నటీనటులు కూడా ఇందులో నటిస్తుండడం విశేషం. అలా నటి సాయేషాసైగల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్రను రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్ చిత్రంలో దీపికాపదుకొనే పాత్రలా యానిమేషన్లో రూపొందిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి వైరముత్తు పాటలను, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవలే నిర్వహించిన విషయం తెలిసిందే. -
మూడేళ్ల డిగ్రీగా గేమింగ్, యానిమేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్నాళ్లు అధికారిక గుర్తింపు లేకుండా కొనసాగిన గేమింగ్, యానిమేషన్ వంటి కోర్సులు ఇకపై మూడేళ్ల డిగ్రీ కోర్సులుగా కొనసాగించేందుకు యాజమాన్యాలు ముందుకొచ్చాయి. దీంతో వాటికి ప్రభు త్వం నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జవహర్‌లాల్‌నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఒప్పం దం చేసుకొని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే 17 విద్యా సంస్థలు వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అయితే వాటిపై అనేక ఫిర్యాదులు రావడం, విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించని కోర్సులను డిగ్రీలుగా ఎలా కొనసాగిస్తున్నారని, వాటి నిర్వహణకు జేఎన్ఏఎఫ్ఏయూ ఎలా ఒప్పందం చేసుకుంటోందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజీసీ గుర్తించిన కోర్సులను వాటిల్లో నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కోర్సులు నిర్వహించడానికి వీల్లేదని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే సదరు అధికారి సెలవులో ఉన్న సమయంలో వాటి గుర్తింపునకు ఉత్తర్వులు జారీ చేసేలా పావులు కదిపారు. ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే సెలవుపై వెళ్లిన సదరు అధికారి తిరిగొచ్చాక విషయం తెలుసుకొని ఆ ఉత్తర్వులను అమలు చేయొద్దని లేఖ రాశారు. దీంతో యాజమాన్యాలు దిగివచ్చాయి. నాలు గేళ్లు కాకుండా మూడేళ్ల కోర్సులుగానే నిర్వహిస్తామని, వాటికి గుర్తింపు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.