Ankitha
-
భారత్‌ను గెలిపించిన అంకిత–ప్రార్థన జోడీ
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు మూడో విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–2, 6–2తో సోహున్ పార్క్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 2–6, 3–6తో సుజియోంగ్ జాంగ్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో అంకిత –ప్రార్థన తొంబారే ద్వయం 6–4, 6–4తో దబిన్ కిమ్–సోహున్ పార్క్ జంటను ఓడించి భారత్‌కు విజయాన్ని ఖరారు చేసింది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోరీ్నలో ప్రస్తుతం చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌తో భారత్, కొరియాతో చైనా పోటీపడతాయి. టాప్–2లో నిలిచిన జట్లు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధిస్తాయి. -
నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2003లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఈ చిత్రంలో భూమిక ప్రధాన పాత్రలో కనిపించగా.. మరో హీరోయిన్గా అంకిత నటించింది. సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న అంకిత.. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేసింది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ధనలక్ష్మీ.. ఐ లవ్ యూ, ప్రేమలో పావని కల్యాణ్ చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా నవదీప్ సరసన మనసు మాట వినదు, గోపీచంద్‌తో రారాజు, రవితేజతో ఖతర్నాక్ సినిమాల్లో నటించారు. అయితే ఆ తర్వాత వచ్చిన విజయేంద్రవర్మ మూవీ ఆమెకు కలిసి రాలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత తాను సినిమాలకు ఎందుకు దూరమయ్యానో చెప్పుకొచ్చింది. అంకిత 2009 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. (ఇది చదవండి: సరదాగా చెప్తే.. లావణ్య సీరియస్‌గా తీసుకుంది: అల్లు అరవింద్ ) అంకిత మాట్లాడుతూ.. 'విజయేంద్రవర్మ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ నేను ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ చిత్రం సక్సెస్ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని.' అని అన్నారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే కెరీర్ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నవదీప్‌తో వివాదం! అయితే టాలీవుడ్ హీరో నవదీప్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని అంకిత స్పష్టం చేశారు. నవదీప్ మూవీతో పాటు.. తమిళంలో మరో సినిమా ఓకేసారి చేయడంతో కాస్త ఒత్తిడిగా ఫీలయ్యానని.. ఆ క్రమంలో అసహనానికి గురయ్యాను తప్ప.. ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఆర్తీ అగర్వాల్, ఉదయ్ కిరణ్ తనకు మంచి స్నేహితులని తెలిపారు. వారిద్దరు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వ్యాపారవేత్తతో పెళ్లి అంతే కాకుండా గతేడాది హీరో అల్లు అర్జున్ను కలిశానని.. ఎన్టీఆర్‌తో సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నానని తెలిపారు. మంచి అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా.. ముంబయికి చెందిన అంకితకు విశాల్ జగపతి అనే బిజినెస్‌మెన్‌ను 2016లో పెళ్లి చేసుకుని యూఎస్‌లోని న్యూజెర్సీలో అంకిత స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా! ) -
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి?
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా మీకు గుర్తుందా?. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు. కేరళలో నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా లిస్ట్‌లో చేరింది. అయితే కొన్ని చిత్రంలో తన అందమైన కళ్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ అంకిత. 'చీమ చీమ చీమ చీమ' అంటూ సాగే సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌తో అదరగొట్టింది. (ఇది చదవండి: 'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న భామ.. ఆ తర్వాత చేసిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. విజయేంద్రవర్మ, లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు లాంటి చిత్రాల్లోనూ కనిపించింది. అయితే కొద్ది సినిమాలకే పరిమితమైన అంకిత 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించిన అంకిత ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన అంకిత ప్రస్తుతం అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) -
‘ఐక్యూ’టీమ్‌తో మరో చిత్రం
కాయగూరల లక్ష్మీపతి నిర్మాతగా కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కెఎల్పి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం2 చిత్రం అనౌన్స్మెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ చిత్రానికి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. వరికుప్పల యాదగిరి సంగీతాన్ని అందించారు. పోలూరి ఘటికాచలం కథ మాటలు అందించారు. ఈ బ్యానర్లో ఐక్యూ మొదటి చిత్రం పూర్తయి ఫస్ట్ కాపీ రావడంతో పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ... ‘ఐక్యూ’ చిత్రంలో ఉన్నవారినే ఈ చిత్రంలో తీసుకున్నాం. మెడికల్ కాన్సెప్ట్ మీద వస్తున్న చిత్రమిది. ‘ఐక్యూ’లాగే ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఈ నెల 19న ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది’ అన్నారు. ‘ఐక్యూ’ చిత్రం మొదటి కాపీ రావడం.. ఆదే బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2 కూడా అనౌన్స్మెంట్ చేయడం ఆనందంగా ఉంది’అని దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ అన్నారు. ఈ చిత్రంలో నేను పోలీసు అధికారి పాత్ర పోషించాను. సినిమాను చాలా ఫాస్ట్‌గా పూర్తి చేశారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’అని హీరో సుమన్ అన్నారు. సుమన్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని హీరో భూషన్ అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ అంకిత, బాబా, ల్లవి, పద్మిని, ప్రమోదిని, ట్రాన్సీ, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
Bharat Jodo Yatra: మహిళలను వస్తువుల్లా... చూస్తున్న బీజేపీ
మలప్పురం: మహిళలను ఒక వస్తువుగా చూసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల భావజాలం ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్య ఘటనతో తేటతెల్లమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర 20వ రోజు మంగళవారం మలప్పురం జిల్లాలో ప్రవేశించింది. తచ్చింగనాదం హైస్కూల్ వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అంకితకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్యోదంతంతో బీజేపీ నేత కుమారుడికి సంబంధముందన్న ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘చెప్పినట్లు వినలేదనే అంకితను చంపేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవమిదే. ఆర్ఎస్ఎస్, బీజేపీ మహిళలను వస్తువులుగా రెండో తరగతి పౌరులుగా చూస్తున్నాయి. ఇది సిగ్గుచేటు. మహిళలను గౌరవించని, సాధికారిత కల్పించని దేశం ఏమీ సాధించలేదు’ అని ఆయన అన్నారు. ‘బీజేపీ నాయకులకు కావాల్సింది అధికారం. అధికారం దక్కాక, దానిని నిలుపుకునేందుకు ఏదైనా చేస్తారు. ఆ క్రమంలోనే అంకిత హత్యకు గురైంది’అని రాహుల్ వ్యాఖ్యానించారు. మహిళలను చిన్నచూపు చూడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమనే హెచ్చరికను బీజేపీకి పంపాలని కోరారు. ‘జస్టిస్ ఫర్ అంకిత, జస్టిస్ ఫర్ ఇండియన్ ఉమెన్, బీజేపీ సే బేటీ బచావో’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. -
అది రిసార్ట్ కాదు.. వ్యభిచార కూపం!
వ్యభిచార కూపంలోకి దిగనందుకే అకింతను కిరాతకంగా చంపారనే విషయం సిట్ దర్యాప్తులో వెలుగు చూడడంతో.. అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. తొమ్మిదేళ్ల కిందట ఇదే తరహాలో ఓ అమ్మాయి కనిపించకుండా పోయిందనే విషయం బయటపడింది. అంతేకాదు ఆ రిసార్ట్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులు రిసార్ట్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రిసార్ట్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. వ్యభిచార కూపంలోకి దిగనందుకే అకింతను కిరాతకంగా చంపారనే విషయం సిట్ దర్యాప్తులో వెలుగు చూడడంతో.. అధికారులు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ఆ రిసార్ట్‌లో పని చేసిన మాజీ ఉద్యోగులు రిసార్ట్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ పౌరీ జిల్లా రిషికేష్ వద్ద ఉన్న వనతారా రిసార్ట్.. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉండేదని అందులో పని చేసి మానేసిన కొందరు చెప్తున్నారు. రిసార్ట్‌లో అక్రమ మద్యం అమ్మకాలతోపాటు గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా చేసే వారని.. చివరకు అమ్మాయిలతో వ్యభిచారం కూడా నిర్వహించేవారని వెల్లడించారు చాలామంది. ఆరు నెలల కిందట అక్కడ ఉద్యోగం మానేసిన ఆ ఉద్యోగి అక్కడ తనకు ఎదురైన అనుభవాలను పోలీసులకు, మీడియాకు తెలియజేశాడు. రిసార్ట్‌లో వ్యభిచారం జోరుగా జరుగుతుండేది. అక్కడికి వచ్చే యువతను మద్యం, మత్తు పదార్థాలతో రిసార్ట్ యాజమాన్యం లొంగదీసుకునేది. వ్యభిచారంలోకి దింపి ఆ అమ్మాయిలతో వీఐపీలను సంతృప్తిపరిచేది. అక్కడి పరిస్థితులపై ఎవరైనా మాట్లాడినా, ఫిర్యాదులు చేయాలని ప్రయత్నించినా దాడి చేసేవారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించేవాళ్లు. పోలీసులకు నేను ఫిర్యాదు చేశా. కానీ, తమ పరిధిలోకి రాదని.. స్థానికంగా ఉన్న పట్వారీ(రెవెన్యూ అధికారి)కి ఆ ఫిర్యాదును అందజేశారు. కానీ, ఆయన కూడా వాళ్ల మనిషే. అందుకే నాపై దాడి జరిగింది. మానసికంగానూ నన్ను వేధించారు అని సదరు మాజీ ఉద్యోగి వాపోయాడు. బీజేపీ(బహిష్కృత) నేత వినోద్ ఆర్య కొడుకు అయిన పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలు వనతారా రిసార్ట్‌ను నిర్వహించేవాళ్లు. ఈ ముగ్గురు రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే 19 ఏళ్ల అకింత భండారిని వ్యభిచారంలోకి దిగాలని, వీఐపీలను సుఖపెట్టాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. మాట వినని అంకిత.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. ఆమెను కిరాతకంగా హత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆపై శవాన్ని సమీపంలోని కాలువలో పడేయగా.. పోలీసులు మృతదేహాన్ని అతికష్టం మీద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోనే కాదు యావత్ దేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆమెపై హత్యాచారం జరిగిందని బాధిత కుటుంబం.. న్యాయ పోరాటానికి దిగింది. ఈ పోరాటానికి మద్ధతుగా స్థానికులు ఆందోళనలతో పాటు విధ్వంసానికి దిగారు. ఘటనకు కారణమైన రిసార్ట్‌ను అప్పటికే అధికారులు బుల్డోజర్లతో కూల్చేయగా.. స్థానికులు మరి కొంత భాగానికి నిప్పు పెట్టారు. అయితే.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని సీఎం పుష్కర్ ధామి హామీ ఇవ్వడంతో పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. ఇదీ చదవండి: ఫుల్లుగా తాగొచ్చి మహిళపై అత్యాచారం.. రూంలో లాక్ చేసిన బాధితురాలు -
అంకిత మైనర్!!.. ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి
జార్ఖండ్ డుమ్కాలో ఓ ప్రేమోన్మాది ఒక స్టూడెంట్ను సజీవ దహనం చేసిన ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలు మేజర్ కాదని.. మైనర్ అని చైల్డ్ వెల్ఫ్‌ఫేర్ కమిటీ నిర్ధారించింది. దీంతో పోక్సో చట్టం ప్రకారం కేసు, నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాలని ఈ ప్యానెల్.. పోలీసులను ఆదేశించింది. రాంచీ: అకింతా సింగ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలి వయసును తొలుత.. 19 ఏళ్లుగా రిపోర్ట్‌లో పొందుపర్చారు పోలీసులు. అయితే మీడియాకు మాత్రం వయసును 17ఏళ్లుగా చెప్పారు. అంకిత వయసుపై పోలీసులు చేస్తున్న వేర్వేరు ప్రకటనలపై ఆమె కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమె వయసును 15ఏళ్లుగా నిర్ధారిస్తూ ప్రకటన చేసింది. అంతేకాదు.. రికార్డెడ్ స్టేట్మెంట్లోనూ ఆమె వయసును సవరించాలంటూ స్థానిక ఎస్పీకి సూచించింది. మతోన్మాది ఘాతుకం! డుమ్కా ప్రాంతానికి చెందిన అంకితా కుమారి సింగ్‌ను.. పొరుగింట్లో ఉండే షారూఖ్ హుస్సేన్(19) ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. పెద్దలు మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆగష్టు 23వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి.. నిప్పటించి పారిపోయాడు. 90 శాతం తీవ్ర గాయాలతో ఫులో జానో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆగస్టు 28వ తేదీన అంకిత కన్నుమూసింది. ఈ ఘటనలో బాధితురాలిని వేధింపులు.. మతం మారాలనే ఒత్తిడి చేసినట్లు తేలడంతో ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలను దారి తీసింది. బీజేపీతో పాటు భజరంగ్ దల్ కార్యకర్తలు బాధితురాలి న్యాయం కోసం పోరాటానికి దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు చేపట్టారు. మరోవైపు బీజేపీ ఒత్తిడితో బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించగా.. ఆమె తండ్రి సంజీవ్ సింగ్ ఆ పరిహారాన్ని తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక కేసులో సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఆ ఫొటోలు మార్ఫింగ్‌వి! ఇదిలా ఉంటే.. నిందితుడు షారూఖ్ హుస్సేన్‌తో సన్నిహితంగా ఉన్న బాధితురాలి ఫొటోలు కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై అంకిత కుటుంబం స్పందించింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, నిందితుడిని బయటపడేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ మండిపడింది. తమ కూతురికి సత్వర న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించింది అంకిత కుటుంబం. ఫొటోలు, వీడియోలు వైరల్ చేయకండి ఇదిలా ఉంటే.. డుమ్కా మైనర్ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(బుధవారం) డుమ్కాలో పర్యటించి.. వివరాలను సేకరించింది. అయితే.. బాధితురాలి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై ఎన్సీడబ్ల్యూ లీగల్ కౌన్సెలర్ షాలిని సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బాధితురాలి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. Dumka, Jharkhand | People are circulating photos of victim on social media. Please ensure this is stopped, vital information is not misused & a woman's dignity is protected: Shalini Singh, Legal Counsellor, NCW pic.twitter.com/mj5jKRqMXo — ANI (@ANI) August 31, 2022 ఇదీ చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను -
రొమాంటిక్ ఫొటో: నాకిష్టమైన ప్రదేశం ఇదే..!
ముంబై: ‘‘ఏడేళ్ల ప్రయాణంలో ప్రపంచమంతా చుట్టివచ్చాం. సముద్ర గర్భంలోకి వెళ్లాం. శిఖరాల అంచుల వరకు వెళ్లగలిగాం. దేశ విదేశాలను సందర్శించాం. అడవుల్లో విహరించాం. పడవల్లో తిరిగాం. ఎడారులు, అగ్నిపర్వతాలు.. ఇలా అన్నీ చూశాం కదా. మరి నాకిష్టమైన ప్రదేశం ఏమింటే.. ఇదిగో ఇక్కడే.. నీ బాహువుల్లో(చేతుల్లో) ఇలా ప్రశాంతంగా నిద్రపోవడం అంటే ఇష్టం... ఎప్పటికీ అంతంకాని మన ప్రేమకు.. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నెన్నో’’ అంటూ నటుడు మిలింద్ సోమన్ తన భార్య అంకిత కొన్వార్‌పై ప్రేమను చాటుకున్నాడు. తమ ప్రేమ బంధానికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాలో సతీమణి ఆలింగనంలో సేదతీరుతున్న ఫొటో షేర్ చేసి ఈ మేరకు క్యాప్షన్ జతచేశాడు. ఇక ఇందుకు స్పందనగా అంకిత సైతం భర్త మిలింద్ రాసిన వాక్యాల్లోని ప్రదేశాలను ప్రతిబింబించేలా ఆయా చోట్ల తాము దిగిన ఫొటోలు పోస్ట్ చేశారు. ఏడేళ్లు ఒక్క క్షణంలా గడిచిపోయాయి. ఈ జ్ఞాపకాలు కలకాలం ఇలాగే నిలిచిపోతాయి. నా ప్రేమమూర్తిగా ఉన్నందుకు థాంక్యూ’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో.. ‘‘మీ ఇద్దరి బంధం చిరకాలం ఇలాగే వర్ధిల్లాలలి’’అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఈ జంట ఒకరినొకరు తొలిసారిగా కలుసుకున్నారు. ఈ క్రమంలో 2018 ఏప్రిల్‌లో పెద్దల అంగీకారంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా వీరిద్దరి మధ్య 26 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో ట్రోలింగ్ బారినపడ్డారు. కూతురు వయస్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని మిలింద్(55)పై, యువకుడు దొరకలేదా అంటూ అంకితపై కొంతమంది నెటిజన్లు విద్వేష విషం చిమ్మారు. కానీ ఇవేమీ పట్టించుకోమని, వయసు ఒక నంబర్ మాత్రమేనంటూ తేలికగ్గా కొట్టిపారేశారు ఈ లవబుల్ కపుల్. నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. నిజానికి మిలింద్‌ను కలవడానికి ముందు అంకిత ఓ వ్యక్తిని ప్రేమించారు. అయితే హఠాత్తుగా అతడు మరణించడంతో తీవ్రంగా కుంగిపోయారు. ఈ క్రమంలో చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తున్న సమయంలో మిలింద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ, ఆపై పరిణయం వరకు దారితీసింది. ఇక మిలింద్కు గతంలో ఫ్రెంచ్ మహిళ్లతో పెళ్లి కాగా ఇద్దరూ విడిపోయారు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
భారత్‌కు రెండో గెలుపు
దుబాయ్: ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో విజయం లభించింది. దక్షిణ కొరియాతో గురవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోసలే 7–5, 6–4తో జాంగ్ సు జియోంగ్ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 4–6, 0–6తో నా లే హాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా జంట 6–4, 6–4తో నా లే హాన్–నా రి కిమ్ జోడీపై గెలిచి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. -
రెండు లక్షలమందికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం
‘‘సినిమా ఇండస్ట్రీపై ఉన్న ప్రేమతో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తున్నాను. పెద్ద హీరోలు నటించినా కంటెంట్ సరిగా లేకపోతే ఆ చిత్రాలను ప్రేక్షకులు మెచ్చరు. అలాగే కథాబలం ఉన్న మంచి సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా వాటికి ప్రేక్షకాదరణ తప్పక ఉంటుంది’’ అన్నారు నిర్మాత ఏ. గురురాజ్. నటరాజ్, నూరిన్, అంకిత జంటగా సుఖీభవ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సీనియర్ నటుడు సత్యప్రకాష్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జనవరి 1న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా గురురాజ్ చెప్పిన విశేషాలు. ► మాది మధ్యతరగతి కుటుంబం. నటుణ్ణి కావాలని వచ్చాను. అప్పట్లో అవకాశం, అదృష్టం కలిసి రాలేదు. దాంతో సుఖీభవ ప్రాపర్టీస్‌ను స్థాపించి రియల్ఎస్టేట్ రంగంలో మంచి స్థాయికి ఎదిగాను. ఇంతకుముందు మా సుఖీభవ మూవీస్ సంస్థ నుంచి ‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రం నిర్మించా. కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ► సినిమాల్లో సత్యప్రకాష్ విలన్‌గా కనిపించినా బయట మాత్రం మంచి వ్యక్తి. ఓ సందర్భంలో స్టోరీ లైన్ ఉంది వింటావా? అని సత్యప్రకాష్ అన్నారు. ఆయన చెప్పిన లైన్ నచ్చింది. ఆ లైన్‌ని తీసుకుని ‘ఊల్లాల ఊల్లాల’ స్టోరీని మేమే రాశాం. నటుడు కావాలనుకున్న వ్యక్తి నిర్మాతగా మారినప్పుడు మెయిన్ క్యారెక్టర్‌గా తననే పెట్టుకుని సినిమా చేస్తాడు. కానీ నేను కథలో ఏ పాత్రకు సెట్ అవుతానో ఆ పాత్రను మాత్రమే ఈ సినిమాలో చేశాను. ► నిర్మాతగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పట్లో మాకు ఛాంబర్లో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో అవకాశాలు కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి. ప్రతిభ ఉన్నవారు పైకి వస్తున్నారు. మా ఆడియో ఫంక్షన్‌కు రామ్‌గోపాల్ వర్మగారు వచ్చారు. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తాను. రాజమౌళితో కూడా చేయవచ్చు. నాకు అందరితో సినిమాలు చేయాలని ఉంది. ► 100, 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు తీసే స్థాయికి ఏదో ఒక రోజు నేను వెళ్తాననే నమ్మకం ఉంది. దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం. ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే అది తప్పకుండా నేరవేరుతుంది. -
రామ్.. రామ్.. హిట్
సీనియర్ నటుడు సత్య ప్రకాశ్ కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. నూరిన్, అంకిత కథానాయికలు. ఎ. ముత్తమ్మ సమర్పణలో ఎ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు. ఈ చిత్రంలో ‘రామ్ రామ్..’ అనే పాటను పాడుతూ నటించటమే కాకుండా హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పారు గాయని, నటి మంగ్లీ. ఆమెతో పాటు కమెడియన్ రఘుబాబు, ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఈ పాటకు గొంతు కలిపారు. మంగ్లీ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు సత్యప్రకాశ్‌ను చిన్నప్పుడు విలన్‌గా చూసిన గుర్తుతో మొదట్లో భయపడ్డాను. తర్వాత ఆయన తెరవెనక స్వభావం, తెలుగుపై ఆయనకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాను. రచయిత కాసర్ల శ్యామ్ రాసి, నేను పాడిన పాటలన్నీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘మా చిత్రం జనవరి 1న విడుదలవుతుంది. ఈ మధ్య కాసర్ల శ్యామ్ రాసిన ‘అల.. వైకుంఠపురములో..’, ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలు పెద్ద హిట్. అలాగే మా సినిమాలోని ‘రామ్ రామ్..’ పాట కూడా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాకేం తెలుసో, తెలియదో అడక్కుండా ఈ సినిమాకి దర్శకత్వం చేసే చాన్స్ ఇచ్చిన మా నిర్మాత గురురాజ్ గారే ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నారు’’ సత్యప్రకాశ్. -
ప్రేమతోనే సమస్య
నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సత్యప్రకాశ్ దర్శకత్వంలో ఎ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘అసలు నాకు నీతో కాదు.. ఆ ప్రేమతోనే ప్రాబ్లమ్, ఈ ప్రేమలూ ప్రేతాత్మలు నాకు అస్సల్ నచ్చవ్’, ‘నిన్ను అంత ఈజీగా వదులుకుంటానా?’ అనే డైలాగ్స్‌తో సాగే ఈ టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాశ్‌తో నా అసోసియేషన్ మూడు చిత్రాలే అయినప్పటికీ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తారు. మంచి నటుడు. ఇప్పుడు ఆయనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తన కొడుకు హీరోగా ఈ సినిమా చేయడం అభినందనీయం. ఈ చిత్రం విజయం సాధించాలి. నిర్మాత గురురాజ్ భవిష్యత్‌లో ఇంకా ఎన్నో పెద్ద చిత్రాలను నిర్మించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు సత్యప్రకాశ్. ‘‘నటరాజ్ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. జై రాయరాల మంచి సంగీతం ఇచ్చారు. త్వరలో ట్రైలర్, పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్. ‘‘టీజర్‌ను విడుదల చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. మా నాన్న సత్యప్రకాశ్, గురురాజ్ ఈ సినిమాకు రెండు కళ్లులాంటివారు’’ అన్నారు నటరాజ్. జై రాయరాల మాట్లాడారు. -
పాట.. మాట.. నటన
నటుడు సత్యప్రకాశ్ కుమారుడు నటరాజ్ ‘ఊల్లాలా ఊల్లాలా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నాడు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఏ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు, ఓ పాట పాడి, హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పారు తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ. ‘‘బిగ్‌బాస్–2’ఫేమ్ రోల్ రైడా కూడా ఓ పాట పాడి, నటించారు’’ అని గురురాజ్ అన్నారు. -
మంచి మలుపు అవుతుంది
సీనియర్ నటుడు సత్యప్రకాశ్ దర్శకుడిగా మారి, రూపొందిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. రక్షకభటుడు, ఆనందం, లవర్స్ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఎ. గురురాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత తదితరులు ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మోషన్ పోస్టర్ని హీరో వెంకటేశ్ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాష్ నాకు మంచి మిత్రుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కు ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు’’ అన్నారు సత్యప్రకాష్. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ. -
వింతలు...విశేషాలు
పదకొండు భాషల్లో దాదాపు ఐదొందల చిత్రాల్లో నటించిన సత్యప్రకాష్ తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉల్లాల ఉల్లాల’. నటరాజ్, నూరిస్, అంకిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురురాజ్, సత్య ప్రకాష్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఏ. గురురాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సత్య ప్రకాష్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్ల నా కెరీర్లో నటుడిగా సంతృప్తిగా ఉన్నాను. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. రొమాంటిక్ ఎంటర్టైనింగ్ చిత్రమిది. సినిమాలో చాలా వింతలు, విశేషాలు ఉన్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా కథనం ఉంటుంది. గురురాజ్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నటుడిగా సత్యప్రకాష్‌కు ఎంత ఫైర్ ఉందో దర్శకునిగా అంతే ఫైర్ ఉంది. ఈ సినిమా మాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్. ఈ సినిమాకు సంగీతం: జాయ్. -
భారత్‌లో గో జీరో మొబిలిటీ బైక్‌లు
న్యూఢిల్లీ: బ్రిటిష్ ఎలక్ట్రిక్ బైక్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. వచ్చే వారం రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు... వన్, మైల్లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నది. గోజీరో వన్ బైక్‌లో 400 వాట్అవర్(డబ్ల్యూహెచ్) లిథియమ్ బ్యాటరీని అమర్చామని, గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్ కుమార్ తెలిపారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే, 60 కీమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. గోజీరో మైల్ బైక్‌ను 300 వాట్అవర్ లిథియమ్ బ్యాటరీతో రూపొందించామని, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 45 కిమీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ రెండు బైక్‌లతో జాకెట్లు, బెల్ట్‌లు, వాలెట్స్ వంటి లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాగా తాజా ఉత్పత్తుల ధరలు తెలియాల్సి ఉంది. -
ఆలోచింపజేస్తోంది
ఈశ్వర్ హీరోగా టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్’. ఓం శ్రీచక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై దొమ్మరాజు ఆశాలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లను చిత్రబృందం సందర్శించింది. అదేవిధంగా సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌తో చిత్రవిజయాన్ని పంచుకున్నారు. ‘‘నేటితరం ప్రేమకథా చిత్రంగా రుపొందిన ‘4 లెటర్స్’ యువతకు ఎంతగానో నచ్చింది. ప్రధానంగా హీరో కళాశాల ప్రొఫెసర్ల గురించి గొప్పగా, గౌరవంగా మాట్లాడే సన్నివేశాలు, ప్రేమ–పెళ్లి నేపథ్యంలో సాగే పతాక సన్నివేశాలతో పాటు కళాశాలలో జరిగే సన్నివేశాలలోని వినోదం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు అండగా నిలవాలన్న సందేశం యువతను ఆలోచించేలా చేస్తోంది. ఇదే చిత్ర విజయానికి సంకేతం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
భారత్‌ను గెలిపించిన అంకిత
ఆస్తానా (కజకిస్తాన్): ప్రతిష్టాత్మక ఫెడ్‌కప్‌లో భారత్ శుభారంభం చేసింది. భారత నెం.1 టెన్నిస్ సింగిల్స్ ప్లేయర్ అంకిత రైనా కీలక సమయంలో రాణించడంతో ఈ టోర్నమెంట్లో భారత్ ముందంజ వేసింది. గురువారం జరిగిన పోరులో 2–1తో థాయిలాండ్‌పై విజయం సాధించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 211వ ర్యాంకర్ కర్మన్ కౌర్ తాండి (భారత్) 2–6, 6–3, 3–6తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 712వ స్థానంలో ఉన్న నుడిండా లాంగమ్ చేతిలో పరాజయం పాలైంది. రెండో సింగిల్స్‌లో అంకిత 6–7 (3), 6–2, 6–4తో పియాంగ్‌టాన్ ప్లిపుచ్ (థాయిలాండ్)పై పోరాడి నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకిత–కర్మన్ ద్వయం 6–4, 6–7 (6), 7–5తో పియాంగ్‌టాన్–నుడిండా జోడీపై కష్టపడి గెలిచి ఊపిరి పీల్చుకుంది. భారత్ శుక్రవారం జరిగే తదుపరి పోరులో కజకిస్తాన్‌తో తలపడుతుంది. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ చిత్రం అంకితం
‘‘ఈశ్వర్‌కు హీరో కావాలనే గొప్ప కల ఉంది. ఆ కలను అతని తల్లి దండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సినిమా ఫీల్డ్‌లోనే కాదు. ఏ రంగంలో అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆశీర్వాదం లేకుంటే రాణించడం కష్టం’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఈశ్వర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బ్యానర్ లోగోను నిర్మాత కిరణ్, ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఆడియో బిగ్ సీడీని నిర్మాత అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి విడుదల చేశారు. ‘‘చిన్న చిత్రాలు హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు అచ్చిరెడ్డి. ఆర్. రఘురాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని 75 రోజుల్లో పూర్తి చేశాం. టీమ్ ఎంతగానో సహకరించారు. ఇందులో మంచి సందేశం ఉంది. ఈ సినిమాను ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ డిఫరెంట్ పాయింట్‌ను టచ్ చేశాం’’ అన్నారు. ‘‘ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఉదయ్ కుమార్. ‘‘తొలి సినిమాలోనే అన్నపూర్ణమ్మ, పోసాని, సురేష్‌గార్ల వంటి సీనియర్ నటులతో నటించడం హ్యాపీ. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈశ్వర్. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు సురేశ్, కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్, గీత రచయిత చంద్రబోస్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు భీమ్స్, అంకిత, టువ మాట్లాడారు. -
ఒలింపియన్ అంకితపై శైలు సంచలన విజయం
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శైలు నూర్‌బాషా సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 11–8, 11–7, 12–14, 6–11, 11–8, 11–9తో అంకిత దాస్ (పీఎస్‌పీబీ)పై గెలిచింది. బెంగాల్‌కు చెందిన అంకిత 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అయితే శైలు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. సుతీర్థతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 7–11, 4–11, 8–11తో పరాజయం పాలైంది. ఆర్బీఐ తరఫున పోటీపడిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో... ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున ఆడుతున్న హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
గ్రూప్–1లోనే భారత్
న్యూఢిల్లీ: ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా టెన్నిస్ టోర్నమెంట్ గ్రూప్–1లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఇప్పటికే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన భారత్ శనివారం చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో 2–0తో గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ థండి గెలుపొందడం... రెండో మ్యాచ్‌లో అంకిత జోరు కొనసాగించడంతో భారత్ విజయంతో టోర్నీని ముగించింది. తొలి మ్యాచ్‌లో కర్మన్‌కౌర్ 7–6 (7/4), 6–3తో లీ పై చీపై విజయం సాధించడం ద్వారా 1–0 ఆధిక్యం అందించింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌లో అంకిత 6–4, 5–7, 6–1తో ప్రపంచ 377వ ర్యాంకర్ చియె యూ సూపై గెలుపొందింది. 2 గంటల 54 నిమిషాల పాటు సాగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో అంకిత అద్భుత ప్రదర్శన కనబర్చింది. టోర్నీలో అంకిత నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం. -
సౌండ్ పొల్యూషన్...
రామకృష్ణ, అంకిత జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఉందా..లేదా..?’. అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మించి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ని నిర్మాత మాల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ‘‘సౌండ్ పొల్యూషన్ వల్ల ప్రజలకు జరిగే అనర్థాలు, సమస్యల్ని చూపించబోతున్నాం’’ అన్నారు వెంకట శివప్రసాద్. ‘‘ఇప్పటి వరకూ రాని కొత్త కథతో తీసిన చిత్రమిది’’ అన్నారు ఎస్.కమల్. నటులు జీవా, దర్శకుడు శివప్రసాద్, రామ్ జగన్, అంకిత పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అల్లం సుబ్రమణ్యం, అల్లం నాగిశెట్టి. -
సస్పెన్స్ థ్రిల్లర్
రామకృష్ణ, అంకిత జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉందా..లేదా?’. వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి అయితం ఎస్.కమల్ నిర్మించారు. శ్రీ మురళి స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండు పాటలను దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘టైటిల్ క్యాచీగా, టీజర్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రంలోని ‘ఉందా లేదా..’ టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా హిట్ సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ–‘‘ సస్పెన్స్ , థ్రిల్లర్ నేపథ్యంలో మా చిత్రం తెరకెక్కింది. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మారుతిగారు పాటలు విడుదల చేయడం హ్యాపీ. అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే వాణిజ్య హంగులున్న చిత్రమిది’’ అన్నారు. ఎస్.కమల్, రామకృష్ణ, అంకిత, శ్రీమురళి, హాస్యనటుడు సాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. బంగారి. -
వినూత్నమైన స్క్రిప్ట్
రామకృష్ణ, అంకిత జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఉందా.. లేదా?’. శివప్రసాద్ దర్శకత్వంలో కమల్ ఆర్ట్స్ పతాకంపై అయితం ఎస్.కమల్ నిర్మించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ కొట్టారు. దర్శకుడు దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇప్పటి వరకు సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో చాలా సినిమాలొచ్చినా, ఇదొక కొత్త వెర్షన్లో రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రమిది. మంచి ప్రేమకథ ఉంటుంది’’ అని దర్శకుడు శివ ప్రసాద్ పేర్కొన్నారు. ‘‘డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. కథ నచ్చడంతో నిర్మించేందుకు ముందుకొచ్చా. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది’’ అని నిర్మాత కమల్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రవీణ్ కె.బంగారి. -
‘సింహాద్రి’ చీమకు పెళ్లయింది