anudeep
-
జాతిరత్నాలు డైరెక్టర్ తో మాస్ కా దాస్ కామెడీ ఫిల్మ్
-
జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా
-
మోపిదేవిలంకలో బాలశౌరి తనయుడి వీరంగం
మోపిదేవి (అవనిగడ్డ): ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంకలో సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు రె చ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా కిందపడేసి పిడిగుద్దులు గుద్దడమేగాక కాళ్లతో తన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వచ్చిన జనసేన నాయకులు కూడా ఈ దాడులకు పాల్పడ్డారు.మోపిదేవిలంకలో ఏజెంట్లు టీ అడగడంతో స్థానికంగా ఉండే యార్లగడ్డ అంకరాజుతో తెప్పించారు. లోపలికి వెళుతున్న అంకరాజుపై జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వ చ్చిన జనసేన నాయకులు, కొందరు టీడీపీ నేతలు దాడిచేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం మోపిదేవి మండల కన్వినర్ రాజులపాటి నాగేశ్వరరావు మీద జనసేన నేతలు బల్లా సీతారాంప్రసాద్, బల్లా మునికుమారి, బల్లా దినేష్, శ్రీనివాసరావు, పవన్ తదితరులు దాడిచేసి కొట్టారు. నాగేశ్వరరావు కుమార్తె కేశాని తేజశ్రీని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. అడ్డువ చ్చిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావుతో పాటు రాజులపాటి సుజాత, నరసారావు, వినయ్‌బాబు, శివనాగరాజులను తీవ్రంగా కొట్టారు.బాధిత వైఎస్సార్సీపీ నాయకులు మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అవనిగడ్డ వైద్యశాలలో చేరారు. వీరికంటే ముందే.. దాడిచేసిన టీడీపీ నాయకులు ఆస్పత్రిలో చేరారు. తరువాత వైఎస్సార్సీపీ నాయకులు హాస్పటల్లో చేరగా అదే వార్డులో ఇరువర్గాలను ఉంచారు. టీడీపీ నాయకురాలు బల్లా మునికుమారిని పరామర్శించేందుకు వ చ్చిన ఆమె సోదరులు అక్కడే చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి యత్నించారు. ఎస్ఐ రమేష్ ఇరువర్గాలకు సర్దిచెప్పారు.అనంతరం ఇరువర్గాలను మచిలీపట్నం ఆస్పత్రికి పంపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు వైద్యశాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించారు. ఈ దాడుల్ని ఎమ్మెల్యే సింహాద్రి తీవ్రంగా ఖండించారు. -
బాధపడకమ్మా.. నేనున్నా: సీఎం జగన్
బత్తలపల్లి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్‌కుమార్‌రెడ్డి కలిశారు. చదువులో రాణిస్తున్న తన కుమారుడు అనుదీప్‌కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి నాగలక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న అనుదీప్ యూట్యూబ్‌లో పాఠాలు వింటూ.. తోటి విద్యార్థి సహకారంతో పరీక్షలు రాస్తున్నాడని తెలిపింది. తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్ స్పందిస్తూ.. బాధపడకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కాగా, అర్జీ ఇచ్చిన అరగంటలోనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి నాగలక్ష్మికి ఫోన్ వచ్చింది. అనుదీప్ ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు, ఆస్పత్రి తదితర వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. -
స్పీడ్ పెంచిన స్టార్ డైరెక్టర్స్
-
క్రేజీ ప్రాజెక్ట్ మాస్ మహారాజ్ అనుదీప్ కాంబినేషన్
-
మాస్ హీరో కోసం 'సప్త సాగరాలు' దాటి వచ్చేస్తున్న వైరల్ బ్యూటీ
సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్‌ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది. కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు. (ఇదీ చదవండి: సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి) తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. -
నా కొడుకు మన్యం బిడ్డే.. కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి(కొత్తగూడెం): అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి వైపు పయనింపజేయగలిగామని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ అనుదీప్ అన్నారు. జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, అనుభూతులతో ఇక్కడి నుంచి వెళుతున్నానని చెప్పారు. అనుదీప్ బదిలీ అయిన సందర్భంగా ఐడీఓసీలో సోమవారం ఆత్మీయ వీడ్కోలు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో తనకు శిక్షణా కలెక్టర్‌గా జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారని, భద్రాద్రి కొత్తగూడెం అంటే చాలా దూరమని మొదట అనుకున్నానని, కానీ జిల్లా ఇంతగా ఆదరిస్తుందని అనుకోలేదని అన్నారు. తనకంటే ముందు కలెక్టర్లు రజత్‌కుమార్ శైనీ, ఎంవీ రెడ్డి వద్ద పనిచేయడంతో ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. క్లిష్టమైన పరిస్థితుల్లో అదనపు కలెక్టర్ సలహాలు, సూచనలు ఉపయోగపడ్డాయని చెప్పారు. పోడు సమస్య పరిష్కారంలో ఐటీడీఏ పీఓ, డీఎఫ్ఓల సహకారం మరువలేనిదన్నారు. ఎస్పీలు సునీల్‌దత్, వినీత్ కూడా ఎంతగానో సహకరించారని, విధుల నిర్వహణలో సిబ్బంది సైతం అద్భుతంగా పనిచేశారని అభినందించారు. ముఖ్యంగా గోదావరి వరదల సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడ్డారని అన్నారు. తన బాధ్యతల్లో సతీమణి సైతం ఓ స్నేహితురాలిగా సహకారం అందించారని, తన కుమారుడు మన్యం బిడ్డేనని చెప్పారు. తల్లిదండ్రులు నేర్పిన సిద్ధాంతాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. భద్రాద్రి రాముడితో పాటు పరిపాలనా ఓనమాలు నేర్పిన జిల్లాకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ.. జాతీయ ర్యాంకర్‌గా ఖ్యాతిని ఆర్జించడమే కాదు.. మొదటి సారి సొంత రాష్ట్రంలో, అదీ ఆదివాసీ జిల్లా అయిన భద్రాద్రిలో మొదటి పోస్టింగ్ సాధించిన అనుదీప్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాఽధిస్తారని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ జిల్లాకు కలెక్టర్‌గా వెళుతున్నారని, ముందు ముందు దేశ రాజధాని ఢిల్లీలో కూడా సత్తా చాటడం ఖాయమని చెప్పారు. అనంతరం కలెక్టర్ అనుదీప్‌ను పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి డీఆర్ఓ అశోకచక్రవర్తి అధ్యక్షత వహించగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అందుకే ఆ అమ్మాయిని లవ్ చేశా.. ఆసక్తికరంగా ‘ప్రిన్స్’ ట్రైలర్
డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్. శివ కార్తికేయన్, మరియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించారు. 'రేయ్ కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మనందరిదీ ఒకే రక్తం రా' అన్న సత్యరాజ్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. జెస్సికా అనే బ్రిటీష్ అమ్మాయిని శివ కార్తికేయన్ ప్రేమించే ఆసక్తికర కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో అతను తన ప్రేమ గెలిచాడా? అతను పడ్డ ఇబ్బందులు ఎంటీ? కథ ఎలాంటి ఆసక్తికర మలుపులు తిరిగిందో తెరపై చూడాల్సిందే. ట్రైలర్ చూస్తే కామెడీ ఫుల్ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 21న దిపావళీకి థియేటర్లలో కనువిందు చేయనుంది. -
'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అలా సినిమా చాన్స్ వచ్చింది.. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా
‘‘ముందు టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాను. నా వీడియోలు చూసిన దర్శకుడు అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారు’’ అన్నారు సంచిత బషు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దర్శకుడు అనుదీప్ కథతో ఏడిద శ్రీజ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. సంచిత మాట్లాడుతూ – ‘‘చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన లయ పాత్రలో నటించాను. దర్శకులు వంశీ, లక్ష్మి నన్ను బాగా ప్రోత్సహించారు. నిర్మాత శ్రీజగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు’’ అన్నారు. -
ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డా: అనుదీప్
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనుదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని ఉండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు ఉంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ ఉన్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపథ్యాన్ని తీసుకుని ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’ కథని చెబుతున్నాం. ► నా జీవితానికి ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.`ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే ఉండదు. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. మహేశ్‌బాబు నటించిన 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. ► లెక్కలు వేసుకొని నేను సినిమాలు తీయను. సినిమా చేసినప్పుడు మాజా రావాలి.అంతే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. ► ఈ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ ఉంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ ఉంటుంది. ► ‘జాతిరత్నాలు’లాగే `ఫస్ట్ డే ఫస్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ ఉంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. ► ఈ చిత్రానికి మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ ఉంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు ఉంటే బాగుండని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ ఉంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా బాధ్యత ఉంటుంది. ► రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో ఉన్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను. ► కామెడీ విషయంలో ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుంచి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా ఉన్న కథలు కూడా రాయాలని ఉంది. ► హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు ఉంటాయి. సినిమా అంటే క్రేజీ ఉండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నారాయణ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ ఉంది. ► నాగ్ అశ్విన్ `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం. ► శివకార్తికేయన్ తో చేస్తున్న ప్రిన్స్ సినిమా పాండిచ్చేరి నేపధ్యంలో సాగుతుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళిలో రిలీజ్ ఉంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా ఉంటుంది. ► జాతిరత్నాలు 2 తీసే ఆలోచన ఉంది. అయితే దానికి ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం వెంకటేశ్ కోసం ఓ కథను రాశా. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా. ఆయన ఒప్పుకుంటే నా తర్వాతి చిత్రం వెంకటేశ్ గారితోనే ఉంటుంది. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతా సర్..
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చస్తార్రా? చచ్చిపోతార్రా?' అన్న తనికెళ్ల భరణి డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. కట్ చేస్తే జైల్లో ఉన్న హీరో నేను చస్త సర్, పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే నేను చచ్చిపోత సర్ అని ఆన్సరిస్తాడు. మరో సీన్లో ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం టికెట్లు తెస్తానని తను ప్రేమించే అమ్మాయి దగ్గర పోజు కొడతాడు హీరో. మరోవైపు ఈ పిచ్చి అలవాటుని మాన్పించాలని తాపత్రయపడుతున్నాడు అతడి తండ్రి పాత్ర పోషించిన తనికెళ్ల భరణి. మొత్తానికి ట్రైలర్ అయితే సరదాగా కొనసాగగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకుల మోములపై నవ్వులు పూయిస్తోంది. చదవండి: వాళ్లిద్దరూ నా షోలో ఎప్పటికీ అడుగు పెట్టరు ‘లైగర్’ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే.. -
‘ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం పవన్ కల్యాణ్‌ని వాడుకున్నాం
‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ లాంటి సినిమాలను అందించిన సంస్థ పూర్ణోదయ మవీ క్రియేషన్స్. దీని అనుబంధ సంస్థ శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు.. `ఫస్ట్ డే ఫస్ట్ షో` కథ ఎలా ఉండబోతుంది ? వంశీ : ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత శ్రీనుతో తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా `ఫస్ట్ డే ఫస్ట్ షో` టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్ల సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా ఎంటర్ టైనింగ్ ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. హీరో గోల్.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ గోల్ ని రీచ్ అయ్యే క్రమంలో చాలా సర్ ప్రైజులు ఉంటాయి. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇద్దరు దర్శకులని తీసుకోవడానికి కారణం ? వంశీ : 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ చాలా ఎక్సయిట్ చేసింది. దర్శకుడిగా లాంచ్ అవ్వడం కంటే కథని అద్భుతంగా తీయాలనే ఆలోచనపైనే దృష్టి ఉండేది. ఫస్ట్ టైం డైరెక్టర్ గా నాకు అంత అనుభవం లేదు. మరొకరు ఉండే బావువుంటుందని అనుకున్నాం. నాకు లక్ష్మీ నారాయణకి మంచి సింక్ ఉంది. చాలా అద్భుతమైన సమన్వయంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా కథ విషయంలో వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా ? వంశీ : ఖుషి సినిమా సమయంలో నేను ఫస్ట్ క్లాస్. నా అనుభవంలో లేవు కానీ అనుదీప్ వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్పేవారు. టికెట్ల కోసం ఎంతదూరం వెళ్తారో చెబుతుంటే చాలా సీరియస్ గా, అదే సమయంలో ఫన్నీ అనిపిస్తాయి. అప్పట్లో చాలా మానియా ఉండేది. ఖుషి అంటే 2001.. ఈ సినిమా కోసం అప్పటి వాతావరణం రిక్రియేట్ చేశారా ? చాలా అంశాలు రిక్రియేట్ చేశాం. టీజర్ లో చూస్తే అప్పటి బాక్సులు కనిపిస్తాయి. దాంతో పాటు చాలా వరకు అప్పటి వావతరణం సృష్టించాం. హీరో హీరోయిన్ల గురించి వంశీ: శ్రీకాంత్ పిట్టగోడ అనే సినిమాలో చేశాడు. ఆడిషన్ చేశాం. తెలంగాణ యాస, సింపుల్ హ్యుమర్, అమాయకత్వంతో కథకు సరిగ్గా నప్పాడు. హీరోయిన్ సంచితాది బిహార్. ఫస్ట్ డే ఫస్ట్ షో మరో జాతిరత్నాలు అనుకోవచ్చా ? వంశీ: ఫస్ట్ డే ఫస్ట్ షో డిఫరెంట్ మూవీ. అయితే జాతిరత్నాలు ఫ్లేవర్ ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో మీ అనుభవాలు గురించి ? లక్ష్మీనారాయణ : తిరుపతిలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరికేవి. రాత్రి మూడు గంటలకు షో వుండేది. అలా పంజా సినిమా చూశా. చాలా మంది జనం వుండేవారు. అప్పుడప్పుడు తొక్కిసలాట వుండేది. అందుకే ఈ కథకి చాలా కనెక్ట్ అయ్యా. వంశీ: నా జనరేషన్ కి వచ్చేసరికి టికెట్లు సులువుగానే దొరికేవి. ఒక్కడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా. కథలో పవన్ కళ్యాణ్ ని ఎంతవరకూ వాడుకున్నారు ? హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కథలో ఎంత మేరకు వాడాలో అంతవరకు ఉంటుంది. ఏది వాడినా సినిమాని వినోదాత్మకంగా చేయడానికే ప్రయత్నించాం. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నటులతో పని చేయడం ఎలా అనిపించింది ? లక్ష్మీ నారాయణ : సీనియర్స్ తో పని చేయడం చాలా మంచి అనుభవం. వారి అనుభవంతో యాడ్ చేసిన ఫ్లావర్ అద్భుతం అనిపించింది. వారితో పని చేయడానికి కాస్త భయపడ్డాం. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ నటులకు మనం ఏం చెప్పగలం అనిపించేది. ఐతే వాళ్ళు గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. అందరి సీన్స్ అద్భుతంగా వచ్చాయి. యంగ్ టీంతో పని చేయడాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. భవిష్యత్ లో ఇద్దరూ కలసి ప్రయాణించే ఆలోచన ఉందా ? వంశీ: ఇప్పటికి ఏం అనుకోలేదు. ఈ సినిమాకి అవసరం కాబట్టి కలసి చేశాం. మీకు బలమున్న జోనర్ ఏది ? వంశీ : కామెడీ. అలాగే నాకు నటనపై కూడా ఆసక్తి ఎక్కువ లక్ష్మీ నారాయణ: అన్ని జోనర్స్ చేస్తాను. కామెడీ కొంచెం ఎక్కువ ఇష్టం సంగీతం గురించి చెప్పండి ? రధన్ చాలా ప్రతిభ ఉన్న కంపోజర్. భాష తెలియనప్పటికీ ఆయనకి గొప్ప అండర్ స్టాండింగ్ వుంది. పాటలతో పాటు అద్భుతమైన నేపధ్య సంగీతం అందించారు. పూర్ణోదయలో సినిమా చేయడం ఎలా అనిపించింది ? పూర్ణోదయ అంటేనే క్లాసిక్. సినిమాని ప్రేమించే నిర్మాతలు. సినిమాలో స్వర్ణయుగం చూశారు. శ్రీజ గారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొదటిసారి సినిమా చేస్తున్న నిర్మాతలా అనిపించలేదు. చాలా ఫాస్ట్ గా చేశారు. అనుకున్న షెడ్యుల్ ప్రకారమే షూటింగ్ ఫినిష్ చేయడం వారికి చాలా నచ్చింది. కొత్తగాచేయబోతున్న సినిమాలు ? కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఏదీ ఖరారు కాలేదు. -
వినాయక చవితికి కాదు దీపావళికి ‘ప్రిన్స్’ వస్తున్నాడు
వినాయక చవితికి రావాల్సిన ప్రిన్స్ దీపావళికి వస్తున్నాడు. తమిళ హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ప్రిన్స్’. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణలో డి. సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ‘ప్రిన్స్’ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మంగళవారం ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
ప్రిన్స్‌గా రాబోతున్న హీరో శివకార్తికేయన్
సీమ రాజా, శక్తి, రెమో, డాక్టర్ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివకార్తికేయన్. ప్రస్తుతం అతడు అనుదీప్ కేవి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా ప్రిన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు శివకార్తికేయన్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సైతం వదిలారు. ఇందులో హీరో చేతిలో గ్లోబ్ పట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఈ సినిమాను సురేశ్ బాబు, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నారు. Here's the first look of #PRINCE 🇮🇳🕊🇬🇧#PrinceFirstLook@anudeepfilm #MariaRyaboshapka #Sathyaraj sir @MusicThaman @manojdft @premji @Cinemainmygenes @SVCLLP @SureshProdns @ShanthiTalkies @Gopuram_Cinemas #NarayandasNarang @AsianSuniel @SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/NbLSADkdv8 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 9, 2022 చదవండి: పూజా హెగ్డేకు ఘోర అవమానం బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు -
నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ‘ఫస్ట్‌డే ఫస్ట్ షో’ మూవీ లోగో విడుదల
జాతీయస్థాయిలో పలు అవార్దులు పొంది తెలుగులో గర్వించే సంస్థగా పేరొందిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర లోగోను సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రంతో ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ శిష్యులు వంశీ, లక్ష్మీనారాయణలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఏడిద నాగేశ్వరరావుగారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఆ సినిమాలన్నీ చూశాను. వారి సినిమాల్లో ‘ఆపద్భాంథవుడు’ సినిమా చాలా ఇష్టం. నేను చదువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడలేదని చాలా కోపం వచ్చింది. ఎందుకు ఆడలేదో ఆర్థం కాలేదు. ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్‌కు హెల్ప్ అవడం సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సంస్థలో అవకాశం ఉంటే తప్పకుండా నేను సినిమా చేస్తాను. ఇకపై శ్రీజ ఎంటర్టైన్మెంట్లో మంచి సినిమాలు రావాలి’ అని అన్నారు. అనంతరం దర్శకుడు అనుదీప్‌పై ఈ సందర్బంగా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాకు అనుదీప్ కథ, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫన్ ఉంటుంది. జాతిరత్నాలు హిట్ తర్వాత తన స్వార్థం చూసుకోకుండా తన తోటివారిని ఎంకరేజ్ చేయడం నాకు గర్వంగా ఉంది. దర్శకుడు వంశీ ఎం.బి.బి.ఎస్. చదివాడు. సినిమాపై తపనతో ఈ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు అనుదీప్ వల్ల దర్శకుడు అయ్యాడు’ అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, వివిఎల్. నరసింహారావు తదితరులు నటిస్తున్నారు. -
త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్ కాదు.. జాతి రత్నానికే వెంకీమామ గ్రీన్ సిగ్నల్
గతేడాది విక్టరీ వెంకటేశ్ రెండు సినిమాల్లో నటించాడు. అయితే బ్యాడ్‌లక్ ఏంటంటే.. ఆ రెండు సినిమాలు(నారప్ప, దృశ్యం-2) ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత ఎఫ్3 సినిమాతో థియేటర్స్ ప్రేక్షకులను పలకరించేందుకు వెంకీ సిద్దమవుతున్నాడు. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత వెంకీ చేయబోయే కొత్త చిత్రంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్లతో సినిమాలు చేయాల్సి ఉన్నా.. ఇంకా ఫైనల్ కాలేదు. అన్నీ కూడా చర్చల దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేశ్ నెట్ ఫ్లిక్స్ కోసం రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రానా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత వెంకీ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే అది త్రివిక్రమ్ లేదా తరుణ్ భాస్కర్‌తో కాదు. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్‌తో మూవీ చేయబోతున్నాడట. ఇటీవల అనుదీప్ వెళ్లి వెంకీకి కథ వినిపించి ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ హీరో శివకార్తికేయన్‌తో తెలుగు తమిళ బైలింగువల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే వెంకీని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. -
SK20: ఉక్రెయిన్ బ్యూటీతో శివకార్తికేయన్ రొమాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అప్‌కమింగ్ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతీరత్నాలు’ ఫేం అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఎస్కే20 అనే వర్కింగ్ టైటిల్ ఇటీవల చెన్నైలో ఈ మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీతో ఉక్రెయిన్ నటి, మోడల్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరియా ర్యాబోషాప్క శివకార్తికేయన్‌తో సరసన ఈ ఉక్రెయిన్ బ్యూటీ సందడి చేయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అలాగే హీరో శివకార్తీకేయన్ కూడా ‘వెల్కమ్ మరియా ర్యాబోషాప్క’ అంటూ ట్వీట్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫుల్ లెన్త్ కామెడీతో సాగే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A Beautiful Angel👼has just Landed to Mesmerise✨ Team #SK20 Welcomes Actress #MariaRyaboshapka On Board as Female Lead 🎬@Siva_Kartikeyan @anudeepfilm @MusicThaman @sureshProdns @SVCLLP @ShanthiTalkies #NarayanDasNarang@SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/75cKykYk1Z — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 21, 2022 -
'జాతిరత్నాలు' డైరెక్టర్‌తో వెంకీమామ.. ఇక నవ్వులే నవ్వులు
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎఫ్-3'. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో వెంకటేశ్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో సినిమా చేసేందుకు వెంకీమామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వెంకటేశ్‌తో చేసే ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. -
'జాతిరత్నాలు' డైరెక్టర్‌తో కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ప్రారంభం
Shivakarthikeyan Next With Kv Anudeep Shooting Goes On Floors: తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో లాంఛనంగా ప్రారంభమయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. హీరోయిన్ సహా ఇతర అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
జాతిరత్నాలు డైరెక్టర్‌తో స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్
Sivakarthikeyan Announces Next With Jathi Ratnalu Director KV Anudeep: జాతిరత్నాలు సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనుదీప్. డైరెక్టర్‌గా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌తో ఆయన సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగులో ఈయనకు ఇదే మొదటి చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి ఎస్కే 20 అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఇక ఎస్ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే రెమో చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఇటీవలె ఈయన నటించిన డాక్టర్ సైతం విడుదలైంది. Very happy to join with @AsianSuniel sir @SBDaggubati sir & my frnd @iamarunviswa for #SK20 ,directed by my fav @anudeepfilm & music by @MusicThaman bro😊 A fun-filled entertainer on the way👍❤️#NarayanDasNarang @SVCLLP @SureshProdns #PuskurRamMohanRao @ShanthiTalkies pic.twitter.com/3g5sjGCePH — Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2022 -
వైభవంగా ఎంపీ బాలశౌరి కుమారుడి వివాహం
-
‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్, హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లెన్త్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట. ఇందులో హీరోను కూడా నవీల్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా గతంలో నవీల్ పోలీశెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌ను కూడా నవీన్‌నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్ పూర్తి చేసినట్లు సమాచారం. చదవండి: ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్