AP Assembly Sessions
-
పీఏసీ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ
అమరావతి, సాక్షి: రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు.‘‘ఇప్పటివరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుంది... పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తప్ప. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గరి నుంచి కోల్ గేట్ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం.. అన్నీ పీఏసీనే వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చారు... మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కి పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ, ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ను ఇవ్వడం లేదు. అందుకే.. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’’ అని పెద్దిరెడ్డి ప్రకటించారు. -
ఫ్లాష్‌బ్యాక్ గుర్తుందా చంద్రబాబూ?
అమరావతి, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ప్రజా పద్దుల సంఘం(PAC) ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగబోతోంది. వైఎస్సార్సీపీకి తగిన సంఖ్యా బలం లేదనే సాకు చూపిస్తూ.. అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.పీఏసీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా.. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా(1966 నుండి) వస్తోంది. అధికార కూటమి తర్వాత ఉంది.. విపక్ష స్థానంలో వైఎస్సార్సీపీనే కాబట్టి న్యాయంగా ఆ పదవి ఆ పార్టీకే దక్కాలి. అయితే.. ఆ సంప్రదాయానికి గండికొట్టి.. తామే దక్కించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోంది. పైగా ఏకగ్రీవం చేయకుండా.. కావాలనే కూటమి పార్టీ వాళ్లతో కావాలనే నామినేషన్లు వేయించారు చంద్రబాబు. అయితే..సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. నామినేషన్ సమయంలోనూ చివరిక్షణం దాకా అసెంబ్లీ సెక్రటరీ ఛాంబర్ వద్ద పెద్దడ్రామానే నడిచింది. ఇక.. మొత్తం 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు(టీడీపీ 7, జనసేన 1, బీజేపీ 1, వైఎస్సార్సీపీ 1) వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ సభ జరిగే టైంలోనే.. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.వైఎస్సార్సీపీ హయాంలో గుర్తుందా?2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించారు వైఎస్ జగన్. ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి అప్పగించారు... అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా మాత్రం చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. కానీ,అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించడం గమనార్హం. పీఏసీతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుంది. -
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్హౌస్లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్‌ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్‌తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్‌మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్సమదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. -
ఏపీ అసెంబ్లీలో మంత్రుల తీరుపై TDP MLA కూన రవి విమర్శలు
-
ప్రశ్నించిన వైఎస్సార్సీపీ.. సమాధానం చెప్పలేక ఊగిపోయిన మంత్రి సత్యకుమార్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రులు అన్నట్టుగా చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్య కుమార్ సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ, ఏపీ శాసన మండలిలో మాత్రం మంత్రులు దీనికి విరుద్దంగా ప్రవరిస్తున్నారు. సమావేశాల సందర్బంగా నేడు మండలిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా? లేదా?. సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని అనుసరిస్తున్నారు. గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా?. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లను నీట్ కౌన్సెలింగ్ ద్వారా చేయాలన్నారు.ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్ చేసే విధంగా కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం. 50శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?. అందరిని రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు. మంత్రి సత్య కుమార్ సభని తప్పుదోవ పట్టించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని తెలిపారు. -
కూటమి సర్కార్‌కు ఊపిరి సలపనివ్వని వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. పలు అంశాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాము ఎందుకు సమాధానం చెప్పాలనే విధంగా ప్రవర్తించడం గమనార్హం.ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సాయి కల్పలత పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీపం పథకంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం దాటవేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో, మంత్రిపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా?. దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?. తొమ్మిది నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా?. కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఇదే సమయంలో మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా?. గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది? అని అడిగారు. దీనికి కూడా కూటమి మంత్రులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.ఇక, అంతకుముందు రాష్ట్రంలో బెల్టు షాపుల విషయమై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు పెడుతున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు. చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నలు సంధించారు. దీనికి కూడా కూటమి నేతలు స్పందించలేదు. -
22 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలను బడ్జెట్ ప్రసంగం తర్వాత వాయిదా వేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ పాల్గొని పది రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఒకపూటే సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు, పలు అంశాలపై చర్చలు ఉన్నప్పుడు సాయంత్రం వరకూ సభ నిర్వహిద్దామని స్పీకర్ చెప్పారు. మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మంగళవారం చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేస్తామని సీఎం చెప్పారు. బీఏసీలోనూ జగన్ జపమే బీఏసీ సమావేశంలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్ గురించే ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారనే దానిపై సీఎం, స్పీకర్ పలు విమర్శలు చేసినట్లు సమాచారం -
వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్ సిక్స్ మోసాలపై శాసనసభలో పాలకపక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40 శాతం ఓట్లు సాధించిన వెఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులు పెడతారని ఎవరూ భయపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం శాసన సభ్యులతో, మధ్యాహ్నం శాసన మండలి సభ్యులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..⇒ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం. కానీ స్పీకర్ కోర్టు ఆదేశాలకు సమాధానం ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. మనం మినహా మరో ప్రతిపక్షం లేదు. అయినా కూడా వారు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అలా గుర్తిస్తే... ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడ్డానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే వారు ముందుకు రావడం లేదు. ⇒ సభా నాయకుడికి మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తారో.. ఆ తర్వాత అంతే హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా సమయం ఇవ్వాల్సి వస్తుందేమోనని, ఇవ్వక తప్పని పరిస్థితులు వస్తాయనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడం లేదు. 40 శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ⇒ హైకోర్టులో మనం వేసిన పిటిషన్‌పై కౌంటర్ వేయడానికి కూడా స్పీకర్ సుముఖంగా లేరు. అందుకే మన ఎమ్మెల్యేలు తమ గళాన్ని మీడియా వేదికగా ప్రజలకు వినిపించాలి.⇒ ప్రతి రోజూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారు. ⇒ అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరికీ పంపిస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నించాలి. ⇒ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బుల్డోజ్ చేస్తూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ⇒ అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే తాజాగా బడ్జెట్ పత్రాల ద్వారా చాటి చెప్పారు. అప్పుల సంఖ్యల్లోనూ అన్నీ అబద్ధాలే. వాళ్లే అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలు విడుదల చేశారు. అందులోని వాస్తవాలతో ఇప్పటివరకూ వారు చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. పాలక పక్షానికి చెందినవారు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్ర వివరాలను ప్రెస్ మీట్ ద్వారా నేనే వివరిస్తా. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, చేసేవన్నీ మోసాలేనని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నైజాన్ని ప్రజలు మరోసారి గుర్తించారు. ⇒ అందరికీ ఒకటే చెబుతున్నా... ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం. కచ్చితంగా మనం తిరిగి అధికారంలోకి వస్తాం. జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం. ⇒ వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గట్టిగా పోరాటం చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న ఆందోళన అనవసరం. నేను మీకు అండగా ఉంటా. ⇒ నా వయసు చిన్నదే. మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తా. మనం అందరం కలసి రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజనీరింగ్ చేశాం. ఎక్కడాలేని మార్పులు తీసుకువచ్చాం. కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. -
బడ్జెట్లో మహిళలకు షాకిచ్చిన బాబు ప్రభుత్వం
అమరావతి, సాక్షి: మహిళకు బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహాశక్తి పథకం కానరాకుండాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయించారు. సూపర్ సిక్స్ హామీల్లో.. స్కూల్‌కి వెళ్లిన ప్రతి పిల్లాడికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రు. 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా.. కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. ఇక.. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు జరిగింది. ప్రతి ఏటా రూ. 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!చదవండి: ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు -
ఏపీ బడ్జెట్ సమావేశాలు..
-
AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణంగా ఎన్నికల సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం జూన్‌లోనే అధికారంలోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు అంటే.. నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది.సూపర్ సిక్స్ వంటి పథకాల అమలు నుంచి తప్పించుకోవడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఖర్చులకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024–25 ఆర్థిక ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
అసెంబ్లీ సమావేశాలపై వైఎస్ జగన్ రియాక్షన్
-
ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు
-
AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11నుంచి జరగనున్నాయి. 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమవుతాయని శాసన వ్యవహారాల కార్యదర్శి సోమవారం రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది.జూన్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పొడిగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాని గడువు నవంబర్‌తో ముగుస్తుండటంతో అనివార్యంగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగతా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో ఆ కాలానికే పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను మరో గంట అదనంగా స్పీకర్ కొనసాగించారు. కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతోంది. ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. -
ఆకాంక్షలు ఆవిరి! చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పునిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలు (హామీలు) నెరవేర్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు బకాయిల చెల్లింపులతో పాటు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టం, సంక్లిష్టం. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరపాలి. అందుకే అర్ధవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్లాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ హాలులో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాడు 13.5 శాతం సమ్మిళిత వృద్ధి సాధించాం సవాళ్లను అధిగమించి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా 2014–19లో గట్టి పునాది వేశాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో రాష్ట్రం నెం.1గా అవతరించింది. కాకినాడ సెజ్ పోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో 2014–19 మధ్య 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించాం. 2019 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చడంతో బ్రాండ్ ఏపీకి భారీ నష్టం జరిగింది. 2014–19తో పోలిస్తే 2019–24 మధ్య మూలధన వ్యయం 60 శాతం తగ్గిపోయింది. మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. రూ.2 లక్షల కోట్ల సంపద నష్టానికి దారి తీసింది. ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల భారీ నష్టానికి గురైంది. సహజ వనరులు దురి్వనియోగమయ్యాయి. రీ–సర్వే, ఏపీ భూ హక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇసుకను కొల్లగొట్టడంతో రూ.19,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల నష్టం వాటిల్లింది. ఎర్రచందనం విక్రయాల వల్ల 2014–2019 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం వస్తే 2019–2024 మ«ద్య కేవలం రూ.441 కోట్లకు ఆదాయం పడిపోయింది. చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు పెరిగాయి గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయ మార్గాలను గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్‌పై వ్యాట్‌ను తగ్గించి ప్రత్యేక మార్జిన్‌గా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించారు. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలతో పాటు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది. ఇప్పటికిప్పుడు హామీలన్నీ అమలు చేయలేంప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకోవడం వల్లే 93 శాతం స్ట్రయిక్ రేట్‌తో ఎన్డీఏకు చారిత్రక తీర్పునిచ్చారు. గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించాం. “సూపర్ సిక్స్ఙ్ వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన, ఉచితంగా ఇసుక సరఫరా లాంటివి చేపట్టాం. అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నాం. మిగిలిన హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమి కారణంగా అభివృద్ధి ప్రణాళిక చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆరి్ధక పరిస్థితిని వివరించాం. రాష్ట్రానికి ఉదారంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతమున్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర పునరి్నర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నమిది: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ గళం విప్పింది. సోమవారం నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలపై మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతిభద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం అయింది. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు బయటకు రావాలంటే బయటపడుతున్నారు. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, హత్య. ఏపీలో రాష్ట్రపతిపాలన విధించాలి’’ అని అన్నారు.ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి‘‘ ఏపీలో మహిళలకు రక్షణ లేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఘటన జరిగితే ఏపీలో దిశా చట్టాన్ని రూపొంచించాం. కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, 36 మందిని హత్య చేశారు. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... ప్రజలగొంతుకగా వైఎస్సార్సీపీ ఉంటుంది. ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తాం. దేశ వ్యాప్తంగా ఏపీలో ఏం జరుహుతుందో చెబుతాం. హోంమంత్రి అనిత ఫ్రస్టేషన్లో ఉన్నారు. హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక అమ్మాయి దారుణ హత్య జరిగింది. ముచ్చుమర్రిలో ఒక బాలిక హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించలేదు. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు’’ అని ఆమె మండిపడ్డారు.ప్రజల మధ్యనే మా నిరసనఅప్పులు చేయటానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ‘‘శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతున్నా పట్టించుకోవడం లేదు. హత్యలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టింపులేనందునే బాయ్ కట్ చేశాం. హోంమంత్రి మీడియా సమావేశాలు పెట్టి కామెడీ చేస్తున్నారు. ప్రధాని, రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాం. ఒక వర్గం మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రజల మధ్యనే మా నిరసన తెలుపుతున్నాం’’ అని అన్నారు. -
అసెంబ్లీలో నేడు వైఎస్సార్సీపీ నిరసనలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై, హింసాత్మక ఘటనలపై నిరసనలు తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను అందుకు వేదికగా ఎంచుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో.. హత్యా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నిరసన తెలిపే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. దీంతో శాంతి భద్రతల అంశంపై వైఎస్సార్సీపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టనుంది. వినుకొండ వైస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్యా ఘటనతో పాటు వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన హత్యాయత్నాలను ప్రధానంగా ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు జాప్యాన్ని కూడా నిలదీసే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు..సాధారణంగా.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మూడు-నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గుచూపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జగన్ పాలనను బద్నాం చేసే కుట్రలో భాగంగా సంక్షేమాన్ని స్కామ్‌లుగా తప్పుడు లెక్కలు చూపిస్తూ సచివాలయంలో శ్వేత పత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆ వ్యవహారం కొనసాగించాలనుకోవడం.. హామీల జాప్యానికే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపైనా వైఎస్సార్సీపీ నిలదీసే అవకాశం ఉంది. ఇక.. ఇదీ చదవండి: ‘రెడ్‌బుక్’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలనరషీద్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో.. ఏపీలో చంద్రబాబు ఆటవిక పాలనపై ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క అసెంబ్లీలోనూ తమ నిరసన కొనసాగుతుందని ఆ సమయంలోనే ప్రకటించారాయన. అలాగే.. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీ పరిస్థితిని వివరించాలని ఎంపీలకు వైఎస్సార్సీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లోనూ దిశానిర్దేశం చేశారు కూడా.ఏపీలో సామాన్యులపై జరుగుతున్న అకృత్యాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఎంపీల నుంచి సామాన్యుల దాకా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీని అణచివేసే కుట్ర జరుగుతోందని గవర్నర్‌కు నివేదించారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలను వివరాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు సమర్పించిన జగన్.. వాటన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. కళ్లెదుటే ఘోరాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం వాటిని నిలువరించే సాహసం చేయలేకపోతోందని జగన్ ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై అజెండాను ఖరారు చేయనుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న హత్యా రాజకీయాలు, దాడులు, దౌర్జన్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిలదీయనున్నారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేత రషీద్‌ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా నరికి చంపిన విషయాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని, ప్రభుత్వమే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార పక్షం హామీలకు కేటాయింపుల చేయకుండా తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్‌కు సభలో ఆమోదం పొందడం ద్వారా కాలయాపన చేయాలని నిర్ణయించింది. కాలయాపన చేసే ఎత్తుగడఎన్నికల ముందు కేంద్రం ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టి.. ఇప్పుడు ఈ నెల 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడతాయి. అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపుల్లేకుండా కాలయాపన చేసే ఎత్తుగడకు పాల్పడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంపై ఆరోపణలకు, నిందలకు అసెంబ్లీని వేదికగా చేసుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల ఎత్తుగడకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై అసెంబ్లీలో చర్చకు అవకాశం లేకుండా ఆర్థిక, ఎక్సైజ్, శాంతిభద్రతల పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేసి అసెంబ్లీని ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోనున్నారు. మరో పక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు అసెంబ్లీలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే యోచనలో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని పార్టీ సూచించింది. ఐదు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24 లేదా 25వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
కొత్త ఎమ్మెల్యేలకు స్పీకర్ గుడ్ న్యూస్
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్‌తో భేటీ (ఫొటోలు)
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
-
ముగిసిన ఎమ్మెల్యేల ప్రమాణం.. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
అమరావతి, సాక్షి: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ అసెంబ్లీలో 172 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. మిగిలిన ముగ్గురి ప్రమాణ స్వీకారంతో పాటు రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యతో నిన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ కార్యక్రమం ముగిశాక.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. అసెంబ్లీ ఛాంబర్లో జగన్‌తో భేటీ (ఫొటోలు)ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక.. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి నామినేషన్ కార్యక్రమం జరిగింది. కూటమి నేతలు నామినేషన్‌కు మద్దతు ఇవ్వగా.. మెజారిటీ ఉండడంతో అయ్యన్నపాత్రుడి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు.. ఈ ఉదయం అసెంబ్లీ దగ్గర ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టిన సీఎం చంద్రబాబు.. భావోద్వేగానిని లోనయ్యారు. అసెంబ్లీ మెట్లకు మొక్కి లోపలకు వచ్చారాయన. ఇక పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం చూసేందుకు ఆయన సోదరుడు, జనసేన రాష్ట్రకార్యదర్శి నాగబాబు వచ్చారు. గ్యాలరీ కోసం క్లిక్ చేయండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారంతొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 81 మంది ఎమ్మెల్యేలుఉమ్మడి కృష్ణా జిల్లానుంచి ఆరుగురు కొత్త సభ్యులుఎమ్మెల్యేలలో.. ఇద్దరు మాజీ ఐఏఎస్లుశ్రీనివాస్ పేరుతో 11 మంది సభ్యులు