Asian cup
-
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
దోహా (ఖతర్): ఆసియాన్ కప్ ఫుట్‌బాల్ టోర్నీని భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 2–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. ఆసీస్ తరఫున 50వ నిమిషంలో జాక్సన్ ఇరి్వన్, 73వ నిమిషంలో జోర్డాన్ బాస్ గోల్స్ సాధించారు. ఆసీస్ ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఆరంభంలోనే అజీజ్ బెహిచ్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లిపోగా, గుడ్విన్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో గోల్ చేయడంలో డ్యూక్ విఫలమయ్యాడు. 16వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసేందుకు మంచి అవకాశం లభించింది. నిఖిల్ పుజారి క్రాసింగ్ పాస్ అందించగా, కెపె్టన్ సునీల్ ఛెత్రి దానిని గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి అర్ధభాగంలో ఆసీస్‌ను నిలువరించడంలో భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సఫలమయ్యాడు. తమకు లభించిన 11 కార్నర్ కిక్‌లలో ఆసీస్ సఫలం కాలేదు. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ్రస్టేలియా పైచేయి సాధించింది. మార్టిన్ బాయెల్ కొట్టిన షాట్‌ను గుర్ప్రీత్ ఆపగలిగినా...అక్కడే ఉన్న ఇర్విన్ దానిని గోల్‌గా మలిచాడు. 69వ నిమిషంలో కూడా గోల్ చేసేందుకు చేరువైన భారత్ మళ్లీ విఫలమైంది. స్కోరు సమం చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికే సుభాషిష్ బోస్‌ను తప్పించి ర్యాన్ మెక్గ్రీ బంతితో దూసుకెళ్లగా...పోస్ట్‌కు దగ్గరలోనే ఉన్న బాస్ దానిని అందుకొని సునాయాసంగా గోల్ సాధించాడు. తమ తర్వాతి మ్యాచ్‌లో గురువారం ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. -
పతకాల మోత..
చైనా గడ్డపై భారత క్రీడాకారుల పతకాల వేట అప్రతిహతంగా కొనసాగుతోంది. పోటీల ఆరో రోజు భారత్ ఏకంగా ఎనిమిది పతకాలతో అదరగొట్టింది. ఇందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ జోడీ రజతం నెగ్గింది. మహిళల స్క్వాష్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు సెమీస్‌లో ఓడి కాంస్యం సాధించింది. అథ్లెటిక్స్ మహిళల షాట్‌పుట్ ఈవెంట్లో కిరణ్ బలియాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో ఐదో స్థానంలో నిలిచిన భారత్ ఆ తర్వాత మళ్లీ టాప్–5లోకి రావడం ఇదే తొలిసారి. తదుపరి అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్, వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ మరిన్ని పతకాలు వచ్చే అవకాశముండటంతో భారత్ ఈసారి నాలుగో స్థానంతో ఆసియా క్రీడలను దిగి్వజయంగా ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 72 ఏళ్ల తర్వాత.. ► మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కు తొలి పతకం! ► కిరణ్ బలియాన్ ఘనత.. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆసియా క్రీడల అథ్లెటిక్స్ మహిళల షాట్‌పుట్ ఈవెంట్లో భారత్‌కు 72 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం లభించింది. శుక్రవారం జరిగిన షాట్‌పుట్ ఈవెంట్లో భారత్‌కు చెందిన 24 ఏళ్ల కిరణ్ బలియాన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. కిరణ్ ఇనుప గుండును 17.36 మీటర్ల దూరం విసిరింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతానికి చెందిన ట్రాఫిక్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూతురైన కిరణ్ తొమ్మిదేళ్ల క్రితం ఈ ఆటలో ప్రవేశించింది. 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో మహిళల షాట్‌పుట్ క్రీడాంశంలో ఆంగ్లో ఇండియన్ బార్బరా వెబ్‌స్టర్ కాంస్య పతకం గెల్చుకుంది. ఆ తర్వాత ఈ క్రీడాంశంలో కిరణ్ బలియాన్ రూపంలో భారత్‌కు రెండో పతకం లభించడం విశేషం. లిజియావో గాంగ్ (చైనా; 19.58 మీటర్లు) స్వర్ణం... జియాయువాన్ సాంగ్ (చైనా; 18.92 మీటర్లు) రజతం సాధించారు. భారత్‌కే చెందిన మరో షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ (16.25 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. మహిళల హ్యామర్ త్రో ఈవెంట్లో భారత క్రీడాకారిణులు తాన్యా చౌధరీ (60.50 మీటర్లు) ఏడో స్థానంలో, రచనా కుమారి (58.13 మీటర్లు) తొమ్మిదో స్థానంలో నిలిచి నిరాశపరిచారు. మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో ప్రియాంక గోస్వామి (1గం:43ని:7 సెకన్లు)... పురుషుల 20 కిలోమీటర్ల నడక రేసులో వికాశ్ సింగ్ (1గం:27ని:33 సెకన్లు) ఐదో స్థానంలో నిలిచారు. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో మరోసారి భారత తుపాకీ గురి అదిరింది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలతో మెరిపించారు. ముందుగా పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలె, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టు 1769 పాయింట్లు స్కోరు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. 2022లో 1761 పాయింట్లతో అమెరికా నెలకొలి్పన ప్రపంచ రికార్డును భారత జట్టు బద్దలు కొట్టింది. క్వాలిఫయింగ్‌లో స్వప్నిల్ (10 పాయింట్ల షాట్లు 33), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ (10 పాయింట్ల షాట్లు 27) 591 పాయింట్ల చొప్పున స్కోరు చేసి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత పొందారు. అఖిల్ షెరాన్ 587 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లు మాత్రమే ఫైనల్లో ఆడాలి. దాంతో అఖిల్ ఫైనల్‌కు దూరమయ్యాడు. టాప్–8లో నిలిచిన షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 459.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు. స్వప్నిల్ 438.9 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పలక్ ‘పసిడి’.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత ఈవెంట్లలో భారత షూటర్లు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. పలక్, ఇషా సింగ్, దివ్యలతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం దక్కించుకుంది. క్వాలిఫయింగ్‌లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 579 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో, పలక్ 577 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో పలక్ 242.1 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం సొంతం చేసుకోగా... ఇషా సింగ్ 239.7 పాయింట్లతో రజత పతకాన్ని గెల్చుకుంది. పాకిస్తాన్ షూటర్ తలత్ కిష్మలా 218.2 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది. ఈ ఆసియా క్రీడల్లో ఇషా సింగ్ ఓవరాల్‌గా నాలుగు పతకాలు సాధించడం విశేషం. -
భారత ఫుట్‌బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి
ఆసియా కప్ 2023కి భారత ఫుట్‌బాల్ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. హాంకాంగ్‌తో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అర్హత సాధించినట్లయింది. గ్రూప్ -డిలో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టాప్‌లో ఉన్న హంగ్‌కాంగ్‌కి, భారత జట్టుకి మధ్య ఒక పాయింట్ మాత్రమే తేడా. ఒకవేళ హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికి ఆసియన్ కప్‌కు అర్హత సాధించనుంది. 1956లో ఆసియా కప్ ఆరంభం కాగా.. భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే అర్హత సాధించగలిగింది. 1964లో మొదటిసారి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఆడిన భారత జట్టు.. ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 1984లో ఆసియాకప్‌లో ఆడింది. ఆ తర్వాత 37 ఏళ్ల పాటు ఆసియాకప్‌కు అర్హత సాధించని భారత్.. 2011లో మూడోసారి ఆసియాకప్ ఆడింది. ఇక 2019లో నాలుగోసారి అర్హత సాధించిన భారత్ ఫుట్‌బాల్ జట్టు 2023 ఆసియాకప్ సీజన్లో ఐదోసారి ఆడనుంది. 1964లో ఆసియా కప్ ఫైనల్ మినహా మరెన్నడూ భారత్ ఫుట్‌బాల్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయచలేదు. 🥳 HERE WE COME 🥳 As Palestine 🇵🇸 defeat Philippines 🇵🇭 in Group 🅱️, the #BlueTigers 🐯 🇮🇳 have now secured back-to-back qualifications for the @afcasiancup 🤩#ACQ2023 🏆 #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/3aNjymWLSm — Indian Football Team (@IndianFootball) June 14, 2022 చదవండి: రూట్ సెంచరీ.. ఎవరు ఊహించని సర్ప్రైజ్! విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత -
భారత మహిళల ఫుట్‌బాల్ శిబిరానికి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) ఆసియా కప్ టోర్నమెంట్ సన్నాహాల కోసం భారత సీనియర్ మహిళలకు ఈనెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ థామస్ డెనర్‌బై 30 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించాడు. ఈ ప్రాబబుల్స్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల సౌమ్య గుగులోత్‌కు చోటు లభించింది. గతంలో భారత అండర్–17, అండర్–19 జట్లకు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున కూడా అరంగేట్రం చేసింది. -
ఆఖరి క్షణాల్లో ఆశలు ఆవిరి
షార్జా: మరో నాలుగు నిమిషాలు గడిస్తే... భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆసియా కప్‌లో నాకౌట్ బెర్త్ ఖాయమయ్యేది. కానీ ఇంజ్యూరీ సమయంలో ‘డి’ ఏరియాలో ప్రణయ్ హల్డర్ చేసిన తప్పిదంతో భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. బహ్రెయిన్ ప్లేయర్‌ను ప్రణయ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. జమాల్ రషీద్ భారత గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో బహ్రెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంజ్యూరీ సమయంలోని మిగతా మూడు నిమిషాలు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న బహ్రెయిన్ తుదకు 1–0తో భారత్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది. దాంతో గ్రూప్ ‘ఎ’ నుంచి ఆతిథ్య యూఏఈ (5 పాయింట్లు), థాయ్‌లాండ్ (4 పాయింట్లు), బహ్రెయిన్ (4 పాయింట్లు) జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. 3 పాయింట్లతో భారత్ చివరి స్థానంలో నిలిచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో 4–1తో థాయ్‌లాండ్‌ను ఓడించిన భారత్... రెండో మ్యాచ్‌లో 0–2తో యూఏఈ చేతిలో... మూడో మ్యాచ్‌లో 0–1తో బహ్రెయిన్ చేతిలో ఓడింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారమే జరిగిన యూఏఈ–థాయ్‌లాండ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ కావడం భారత్ నాకౌట్ ఆశలను దెబ్బ తీసింది. ఒకవేళ యూఏఈ గెలిచి ఉంటే భారత్‌కు నాకౌట్ అవకాశాలు మిగిలి ఉండేవి. ఓటమి తర్వాత భారత కోచ్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కాన్స్టంటైన్ ప్రకటించారు. -
యూఏఈదే పైచేయి
అబుదాబి: అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)... ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్‌ను 2–0 తేడాతో ఓడించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆతిథ్య యూఏఈ తరఫున ఖల్ఫాన్ ముబారక్ (41వ నిమిషం), అలీ మబ్కోత్ (88వ నిమిషం) గోల్స్ చేశారు. ఆటగాళ్లు పాస్‌లను చక్కగా అందుకోవడంతో బంతి ఎక్కువ శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని భారత జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడుల్లో ఫర్వాలేకున్నా... ఫౌల్స్ ఎక్కువగా చేసింది. పాస్‌లలోనూ వెనుకబడ్డారు. తొలి భాగం, రెండో భాగం చివర్లో ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకున్నా భారత్ నాకౌట్ చేరేది. ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో భారత్... సోమవారం జరిగే చివరి మ్యాచ్‌లో బహ్రెయిన్‌ను ఎదుర్కొంటుంది. -
భారత్ సత్తాకు పరీక్ష
అబుదాబి: తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 4–1తో చిత్తుగా ఓడించిన భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆసియా కప్‌లో నేడు అసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ ఆడనుంది. యూఏఈ మాత్రం థాయ్‌లాండ్‌లా బలహీన జట్టేమీ కాదు. ర్యాంకింగ్స్‌లో కానీ, ఆటతీరులోగానీ భారత్ కంటే మెరుగ్గా ఉంది. అయితే బోణీ కొట్టిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ కనీసం ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా గ్రూప్ ‘ఎ’ నుంచి నాకౌట్‌కు చేరే అవకాశాలున్నాయి. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తన అనుభవంతో యూఏఈ మ్యాచ్‌లోనూ జట్టును ముందుండి నడిపిస్తే సానుకూల ఫలితం సాధించొచ్చు. మరోవైపు ప్రపంచ 79వ ర్యాంకర్ యూఏఈ తొలి మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో అతికష్టంమీద ‘డ్రా’ చేసుకుంది. దీంతో ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. యూఏఈలో మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ హమది, అహ్మద్ ఖలీల్ కీలక ప్లేయర్లు. ఖలీల్ తొలి మ్యాచ్‌లో జట్టుకు కీలక గోల్ తెచ్చిపెట్టాడు. వీళ్లిద్దరిపై భారత డిఫెండర్లు దృష్టి పెట్టాలి. ఇప్పటివరకు భారత్, యూఏఈ ముఖాముఖిగా 13 సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... ఎనిమిదింటిలో యూఏఈ విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. -
55 ఏళ్ల తర్వాత...
అబుదాబి: స్టార్ స్ట్రయికర్ సునీల్ చెత్రి (27వ, 46వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగడంతో ఆసియా కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలో భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత్ 1964 తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ చెత్రి రెండు గోల్స్ చేయగా... అనిరుధ్ థాపా (68వ ని.లో), జెజె లాల్‌పెఖుల (80వ ని.లో) చెరో గోల్ చేశారు. థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా (33వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని చెత్రి గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. మరో ఆరు నిమిషాల్లోనే థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా గోల్ కొట్టడంతో స్కోరు 1–1తో సమం అయింది. రెండో అర్ధభాగం ప్రారంభ నిమిషంలోనే సునీల్ చెత్రి మెరుపు వేగంతో ఫీల్డ్ గోల్ చేసి భారత్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత అనిరుధ్, జెజె లాల్‌పెఖుల గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యంతో భారత్ మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన సునీల్ చెత్రి (66 గోల్స్) అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ప్రస్తుత క్రీడాకారుల జాబితాలో లియోనెల్ మెస్సీని (అర్జెంటీనా–65 గోల్స్) వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–85 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ 10న ఆతిథ్య యూఏఈతో... 14న బహ్రెయిన్‌తో ఆడనుంది. ఈ రెండింటిలో ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నా భారత్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఆసీస్‌కు షాక్... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఆసియా కప్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆసీస్ 0–1తో అనామక జోర్డాన్ చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను అనస్ బనీ యాసీన్ (26వ ని.లో) చేశాడు. -
తుది పోరులో భారత్‌కు నిరాశ
కొలంబో: చివరి ఓవర్‌దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. అజేయంగా ఫైనల్ చేరిన భారత జట్టుకు తుదిపోరులో ఆతిథ్య శ్రీలంక జట్టు చేతిలో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో జయంత్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా... అతీత్ సేథ్ (15 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) 16 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. లీగ్ దశలో లంకను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ తుదిపోరులో ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. హసిథ బోయగొడ (54; 8 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కమిందు మెండిస్ (61; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్ 2, షమ్స్ ములాని, మయాంక్ మార్కండే, జయంత్, నితీశ్ రాణా తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలో దిగిన భారత్ 9 వికెట్ల నష్టానికి 267 పరుగులకు పరిమితమైంది. జయంత్ యాదవ్ (71; 5 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... ములాని (46; 5 ఫోర్లు), నితీశ్ రాణా (40; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
13 మ్యాచ్‌ల తర్వాత...
బిష్కెక్ (కిర్గిస్తాన్): వరుసగా 13 మ్యాచ్‌ల్లో పరాజయం లేకుండా దూసుకెళ్తున్న భారత ఫుట్‌బాల్ జట్టుకు కిర్గిస్తాన్ బ్రేక్ వేసింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో కిర్గిస్తాన్ చేతిలో ఓడిపోయింది. కిర్గిస్తాన్ తరఫున జెమ్లియాన్‌ఖున్ (2వ నిమిషంలో), ముర్జయెవ్ (72వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు 88వ నిమిషంలో జెజె లాల్‌ఫెకులువా ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత రెగ్యులర్ కెప్టెన్ సునీల్ చెత్రి బరిలోకి దిగలేదు. ఇప్పటికే భారత్, కిర్గిస్తాన్ వచ్చే ఏడాది యూఏఈలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చివరిసారి 2016 మార్చి 29న తుర్క్‌మెనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–2తో ఓడిన భారత్ ఆ తర్వాత వరుసగా 13 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు సాధించి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. -
భారత్ జోరు కొనసాగేనా!
భువనేశ్వర్: ఆసియా కప్‌లో ఇటీవలే విజేతగా నిలిచి సత్తా చాటిన భారత హాకీ జట్టు ముందు మరో పెద్ద సవాల్ నిలిచింది. అగ్రశ్రేణి జట్లు బరిలో నిలిచిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో భారత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటినుంచి జరిగే ఈ టోర్నమెంట్లో ప్రపంచ టాప్–8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఈ టోర్నీ డిఫెండింగ్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఉపఖండంలో జరిగే ఏ టోర్నీలోనైనా భారత్ మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. కానీ ఈ లీగ్‌లో పరిస్థితులు భిన్నం. ప్రపంచ మేటి జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో భారత్ గెలవాలంటే అద్భుతంగా పోరాడాల్సి ఉంటుంది. ఆసియా కప్ దక్కించుకొని మన జట్టు మంచి ఊపు మీద ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో మన జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చాంపియన్స్ ట్రోఫీ, అజ్లాన్ షా కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో ఆ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఆ పరాజయాలకు బదులు తీర్చుకునే అవకాశం ప్రస్తుతం భారత్ ముందుంది. కోచ్‌కు పరీక్ష... రెండు నెలల క్రితమే భారత జట్టు కోచ్ పగ్గాలు చేపట్టిన జోయెర్డ్ మరీనేకు ఇది అసలు సిసలు పరీక్ష. వచ్చే ఏడాది పెద్ద పెద్ద టోర్నీలు జరగనున్న నేపథ్యంలో జట్టు బలాబలాలను పరీక్షించుకునేందుకు కోచ్‌కు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. మరీనే కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెను మార్పుల జోలికి వెళ్లకుండా.. డిఫెన్స్‌తో పాటు, వ్యూహాత్మక శిక్షణ పైనే దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్‌కప్ జరగనుండటంతో.. ఈ టోర్నీలో మన ఆటగాళ్ల లోపాలతో పాటు సత్తా పై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మరీనే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మన జట్టు ఆసియా కప్ ఫైనల్లో 2–1తో మలేసియాపై విజయం సాధించింది. సర్దార్ సింగ్ లేకపోవడంతో మిడ్‌ఫీల్డర్‌గా కెప్టెన్ మన్‌ప్రీత్‌పై బాధ్యత మరింత పెరిగింది. కెప్టెన్‌తో పాటు గతేడాది జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, దిప్సన్ టిర్కీ, గుర్జంత్ సింగ్, వరుణ్‌కుమార్ లాంటి యువ ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉండనుంది. జట్టులో సీనియర్లు రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లక్డా గాయాల నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చారు. వారు తమని తాము నిరూపించుకోవడానికి ఇది చక్కటి అవకాశం. హాకీ ఇండియా లీగ్–2017లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అమిత్ రోహిదాస్ జట్టులో ఉండటం అదనపు బలాన్ని చేకూర్చనుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. దూకుడుగా ఆడుతూ.. ట్రోఫీని నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆసీస్ బరిలోకి దిగుతోంది. గతేడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాతినుంచి ఆ జట్టు నిలకడగా రాణిస్తోంది. పూల్ ‘బి’: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ పూల్ ‘ఎ’: అర్జెంటీనా, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్ మ్యాచ్ సా.7.30 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసియా కప్ హాకీ టైటిల్ లక్ష్యంగా...
కకమిగహర (జపాన్): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నేడు జరిగే టైటిల్‌పోరులో భారత్, చైనా జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో చెలరేగుతూ అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్ ‘ఆసి యా టైటిల్’తో పాటు వరల్డ్ కప్ బెర్తునూ సాధించాలని తహతహలాడుతోంది. ఫైనల్లో గెలిస్తే భారత అమ్మాయిలు వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారు. క్వార్టర్స్‌లో కజకిస్థాన్‌పై, సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌పై గెలవడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. దీనితో పాటు టైటిల్ పోరులో తలపడనున్న చైనాను పూల్ స్థాయిలో భారత్ 4–1తో ఓడించింది. ఇదే ఫలితాన్ని ఫైనల్లోనూ పునరావృతం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. పూల్‌లో ఓడించినప్పటికీ చైనాను తేలిగ్గా తీసుకోబోమని, సరైన వ్యూహాంతో ఫైనల్లోనూ మట్టికరిపిస్తామని జట్టు కెప్టెన్ రాణి చెప్పింది. ‘ఆసియా కప్’ టైటిల్‌ను నెగ్గిన పురుషుల జట్టు నుంచి తాము స్ఫూర్తి పొందామని, అమ్మాయిలంతా ఫైనల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొంది. పూల్ స్థాయి నుంచి చెలరేగి ఆడుతున్న భారత అమ్మాయిలు ఈ టోర్నీ మొత్తంలో 27 గోల్స్ చేయడం విశేషం. భారత డ్రాగ్ ఫ్లిక్కర్ గుర్జీత్‌సింగ్ ఇప్పటివరకు 8 గోల్స్ సాధించి టోర్నీలో ఎక్కువ గోల్స్ సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. నవ్‌జ్యోత్ కౌర్, నవ్‌నీత్ కౌర్ చెరో నాలుగు గోల్స్‌తో, దీప్ గ్రేస్ ఎక్కా, రాణి చెరో మూడు గోల్స్ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫైనల్లోనూ రాణించి చాంపియన్లుగా నిలవాలనుకుంటున్నారు. -
క్వార్టర్స్‌లో భారత్
కకమిగహర (జపాన్): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు 9 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–0తో మలేసియాపై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో తొలి మూడు క్వార్టర్స్‌లోనూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నాలుగో క్వార్టర్లో అప్రమత్తమైన భారత్ 54వ నిమిషంలో వందన కటారియా ఫీల్డ్ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే నిమిషం వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ గోల్‌గా మలచడంతో భారత్ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. చివరి నిమిషాల్లో మలేసియా పోరాడినప్పటికీ భారత్ వారిని సమర్థంగా నిలువరించింది. -
భారత మహిళల సంచలనం
కకమిగహర (జపాన్): భారత మహిళల హాకీ జట్టు అసాధారణ విజయంతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. శనివారం పూల్ ‘ఎ’లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10–0 గోల్స్‌తో సింగపూర్‌పై ఘన విజయం సాధించింది. నవ్‌నీత్ కౌర్ (3వ, 41వ నిమిషాల్లో), రాణి రాంపాల్ (15వ, 18వ ని.లో), నవజ్యోత్ కౌర్ (30వ, 50వ ని.లో) తలా రెండేసి గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి (18వ ని.లో), దీప్ గ్రేస్ ఎక్కా (25వ ని.లో), గుర్జీత్ కౌర్ (41వ ని.లో), సోనిక (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్ రాణి రాంపాల్ తన కెరీర్లో 100 గోల్స్‌ను పూర్తి చేసుకుంది. -
భారత్‌కు కొరియా సవాల్
ఢాకా: కొరకరాని కొరియాతో భారత హాకీ జట్టు ‘సూపర్ ఫోర్’ సమరానికి సిద్ధమైంది. ఆసియా కప్ హాకీలో కొత్తగా సెమీఫైనల్‌కు బదులుగా ఈ రౌండ్ రాబిన్ స్టేజ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్ తమ తొలి మ్యాచ్‌లో 13వ ర్యాంకులో ఉన్న దక్షిణ కొరియాను ఎదుర్కోనుంది. ఈ టోర్నమెంట్లో పూల్ ‘ఎ’లో భారత్ అజేయంగా లీగ్ దశను ముగించింది. వరుస విజయాలు సాధించడమే కాకుండా టీమిండియా ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ మార్గదర్శకంలో కుర్రాళ్లు రాణిస్తున్నారు. స్ట్రయికర్లు రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, చింగ్లేన్సన సింగ్ దూకుడు కనబరుస్తున్నారు. వీళ్లతో పాటు మిడ్‌ఫీల్డర్లు సర్దార్ సింగ్, కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లతో భారత్ ఇప్పుడు అత్యంత పటిష్టంగా ఉంది. అయితే అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలచలేకపోవడంపై కోచ్ మరిన్ దృష్టిపెట్టారు. మరోవైపు కొరియా పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలువడం ద్వారా సూపర్ ఫోర్కు చేరింది. గతంలో భారత్‌కు చేడు ఫలితాలిచ్చిన అనుభవం కొరియాది. అటాకింగ్ గేమ్‌లో, మ్యాచ్ ముగిసే దశలో కొరియన్ల ఆటతీరు ప్రమాదకరంగా ఉంటుంది. భారత్ ఫామ్ దృష్ట్యా దక్షిణ కొరియాను ఓడించే సత్తా ఉన్నప్పటికీ అదేమంత సులభం మాత్రం కాదు. మరో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పూల్ ‘బి’ టాపర్ మలేసియాతో పాకిస్తాన్ తలపడనుంది. ►సాయంత్రం 5 గం. నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీకి రజని
ఈనెల 28న జపాన్‌లో మొదలయ్యే ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు రాణి రాంపాల్ నేతృత్వం వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రజని ఎతిమరపు రెండో గోల్‌కీపర్‌గా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకుంది. మరో గోల్‌కీపర్ సవిత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో తొలి టోర్నీలో బరిలోకి దిగుతున్న భారత్ విజేతగా నిలిస్తే వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. -
పాక్‌కు ఈ జట్టు సరిపోతుంది
సంజయ్ మంజ్రేకర్ చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు నిజంగా ఇది తీపి కబురే. బ్యాటింగ్ విభాగంలో తంటాలు పడుతున్న ఈ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో విజృంభించింది. మొహమ్మద్ హఫీజ్, అహ్మద్ షహజాద్ రాణింపుతో గతంలోకన్నా వీరి బ్యాటింగ్ మెరుగైనట్టే. బౌలింగ్‌లో ఎలాగూ దూకుడు ఉంది. దీంతో ఇటీవలి ఆసియా కప్‌లా కాకుండా ఈసారి భారత్‌కు తగిన హెచ్చరిక జారీ చేసినట్టుగానే భావించాలి. అయితే ధోని సేనను ఇప్పటికీ ఫేవరెట్‌గానే భావించాల్సి ఉంటుంది. తమ చివరి 11 మ్యాచ్‌ల్లో పదింట్లో గెలిచిన భారత జట్టు ఒక్క ఓటమితో తేడాగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఈ జట్టు ప్రమాదకరంగా కనిపించలేదు. ఆసియా కప్‌లో కనిపించిన జోరు ఇప్పుడు లేదు. ఒక్క టి20 మ్యాచ్‌లో ఓడిపోవడం పెద్ద విషయం కాదు. కానీ మరీ 47 పరుగుల తేడాతో ఓడడం.. అదీ సొంతగడ్డపై అంటే దారుణమే. నిజానికి తమ బ్యాట్స్‌మెన్ ఆటతీరును క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్‌లో మాత్రం తప్పదు. నైపుణ్యత కలిగిన బ్యాట్స్‌మెన్‌ను గుర్తించాలి. అప్పుడే ఏ పిచ్‌పైనైనా భారత్ ప్రమాదకారిగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికి మాత్రం పాకిస్తాన్‌ను ఓడించేందుకు ప్రస్తుత జట్టు సరిపోతుంది. -
ఆఖరి సన్నాహకం!
నేడు భారత్ రెండో వార్మప్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో పోరు ‘తుది’ జట్టు బరిలోకి దిగే అవకాశం ముంబై: ఈ ఏడాది ఆడిన 11 టి20 మ్యాచ్‌లలో 10 విజయాలను సాధించిన భారత్ జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదలుపెట్టి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరకు ప్రత్యర్థి ఎవరైనా ధోని సేన విజయయాత్రకు అడ్డు ఉండటం లేదు. అయితే ఈ దూకుడుకు కాస్త ముందు దక్షిణాఫ్రికా మనకు పరాభవం మిగిల్చింది. అదీ సొంతగడ్డపై 0-2తో ఓడిన తీరు అటు ఆటగాళ్లు, ఇటు అభిమానులు కూడా మరచిపోలేదు. ఇప్పుడు ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టుతో మరోసారి తలపడే అవకాశం వచ్చింది. పేరుకు వార్మప్ మ్యాచే అయినా, జట్ల బలాబలాలను పరిశీలిస్తే హోరాహోరీ పోరు సాగవచ్చు. వరుసగా టి20 మ్యాచ్‌లే ఆడి కావాల్సినంత సన్నాహాలు చేసుకున్న టీమిండియాకు... మంగళవారం కివీస్‌తో జరిగే ప్రధాన టోర్నీ తొలి మ్యాచ్‌కు ముందు ఇదే ఆఖరి ప్రాక్టీస్. భారత్ ఆడిన తొలి మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్‌లో దాదాపు 25 వేల ప్రేక్షకులు హాజరు కావడం చూస్తే ఫ్యాన్స్, ప్రాక్టీస్ మ్యాచ్‌లను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారని అర్థమవుతుంది. రైనా ఫామ్‌లోకొచ్చేనా! భారత బ్యాటింగ్‌కు సంబంధించి కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, రోహిత్ శర్మ కూడా అదరగొడుతున్నాడు. ఇక ఆసియా కప్ ఫైనల్‌తో ధావన్‌పై కూడా నమ్మకం పెరిగింది. చివర్లో హిట్టింగ్ చేసే ధోని గురించి ఆందోళన లేకపోగా, యువరాజ్ కూడా నిల దొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతున్న అంశం సురేశ్ రైనా బ్యాటింగ్. ప్రధాన బ్యాట్స్మెన్లలో అతను మాత్రమే కాస్త తడబడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన అతను శ్రీలంకతో సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఆసియా కప్‌లో రెండుసార్లు బ్యాటింగ్ అవకాశం రాకపోగా... రెండింటిలో విఫలమై, ఒక్క లంకతో మాత్రం అతి కష్టమ్మీద కొన్ని పరుగులు చేయగలిగాడు. వెస్టిండీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే బంతి ఎదుర్కోవడం అతనికి పెద్దగా పనికి రాలేదు. ఇప్పుడు తన బ్యాట్‌కు పదును పెట్టేందుకు రైనాకు ఇదే సరైన సమయం. ఇక్కడ రాణించి ఫామ్‌లోకి వస్తే అసలు పోరులో అతని గురించి ఆందోళన ఉండదు. గత మ్యాచ్‌లో రహానే, నేగిలకు అవకాశం ఇచ్చినా, ఈ వార్మప్‌లో అసలైన తుది 11 మందినే ఆడించే అవకాశం ఉంది. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు ఇదే బృందంతో ఫలితం సాధించడంపై జట్టు దృష్టి పెట్టింది. బౌలింగ్‌లో కూడా అంతా ఊహించినట్లే ఉన్నా... షమీ పునరాగమనంతో ఆ ఒక్క స్థానం విషయంలో అస్పష్టత నెలకొంది. పూర్తి ఫిట్నెస్ను అందుకునే ప్రయత్నంలో ఉన్న షమీని సిద్ధం చేసేందుకు ధోని అతనికే అవకాశం ఇవ్వవచ్చు. సఫారీలు సిద్ధం... సొంతగడ్డపై 1-2తో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓడిన అనంతరం భారత్ చేరిన దక్షిణాఫ్రికా తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆ జట్టు కూడా ఎక్కువ ప్రయోగాలకు పోకుండా ఇటీవలి మ్యాచ్ ఆడిన తుది జట్టునే ఆడించవచ్చు. కెప్టెన్ డు ప్లెసిస్, డివిలియర్స్, డి కాక్, మిల్లర్‌లాంటి హిట్టర్లకు తోడు ఆమ్లా కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో సఫారీల బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో స్టెయిన్, రబడ, అబాట్‌లపై జట్టు ఆ జట్టు ఆధారపడుతోంది. అయితే ఐపీఎల్ అనుభవంతో రాటుదేలిన ఆల్‌రౌండర్లు డుమిని, మోరిస్, వీస్ కీలకం కానున్నారు. వీరిలో దాదాపు అందరికీ భారత్‌లో ఆడిన అనుభవం ఉండటం ఆ జట్టుకు అనుకూలాంశం. -
తడబడ్డా.. నిలబడ్డారు!
యూఏఈపై శ్రీలంక గెలుపు రాణించిన చండిమల్ ఆసియా కప్ మిర్పూర్: చిన్న ప్రత్యర్థిని మొదట తేలికగా తీసుకున్న డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక... బ్యాటింగ్‌లో తడబడినా... నాణ్యమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని కట్టడి చేసి ఆసియా కప్ టి20 టోర్నీలో బోణీ చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక 14 పరుగుల తేడాతో యూఏఈపై నెగ్గింది. షేర్ ఏ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. చండిమల్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడగా, దిల్షాన్ (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... యూఏఈ బౌలర్ల ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. జావేద్ 3, నవీద్, షెహజాద్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. స్వప్నిల్ పాటిల్ (36 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. తొలి ఓవర్లోనే మలింగ... ముస్తఫా (0), షెహజాద్ (1)లను అవుట్ చేసి యూఏఈకి షాకిచ్చాడు. తర్వాత కులశేఖర తన రెండో ఓవర్లో కలీమ్ (7), ఉస్మాన్ (6)లను వెనక్కిపంపాడు. హెరాత్ వచ్చి రావడంతోనే తన తొలి రెండు ఓవర్లలో అన్వర్ (13), హైదర్ (1) వికెట్ తీయడంతో యూఏఈ 47 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. ఇక రెండు వైపుల నుంచి లంక బౌలర్లు ఒత్తిడి పెంచడంతో యూఏఈ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించాక... పాటిల్, అంజద్ జావేద్ (13)లతో పాటు నవీద్ (10)లు వరుస ఓవర్లలో అవుట్‌కావడం దెబ్బతీసింది. -
మేమూ భారత్‌ను బహిష్కరిస్తాం
-
మేమూ భారత్‌ను బహిష్కరిస్తాం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరిక కరాచీ : వచ్చే డిసెంబర్లో తమతో ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకుంటే ఇక భవిష్యత్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరించింది. ఐసీసీ, ఆసియా కప్ ఈవెంట్లలో జరిగే మ్యాచ్‌లను బహిష్కరిస్తామని వెల్లడించింది. ఇంతవరకు సిరీస్ కోసం భారత క్రీడాశాఖతో అనుమతి తీసుకునే ప్రయత్నం బీసీసీఐ చేయకపోవడం బాధ కలిగిస్తోందని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ విమర్శించారు. ‘ఇప్పటి వరకు ఏదీ తేలలేదు. అయితే భారత బోర్డు అధికారికంగా సిరీస్ నుంచి వైదొలిగితే... మేం ఇతర టోర్నీల్లో వారితో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను బహిష్కరిస్తాం. డిసెంబర్ దగ్గరకు వస్తోంది. ఏదో ఒక స్పష్టమైన నిర్ణయాన్ని బోర్డు మాకు తెలపాలి. మేం ఆగస్టు 28న అధికారికంగా ఓ లేఖ కూడా రాశాం. దానిపై స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. ఆడతారో, లేదో చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. ద్వైపాక్షిక సిరీస్ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పోతే మేం కూడా దానికి తగ్గట్లుగానే నిర్ణయం తీసుకుంటాం’ అని ఖాన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్... ఇండో-పాక్ సిరీస్ గురించి నెగెటివ్‌గా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదన్నారు. -
బాస్కెట్‌బాల్‌లో జాతి వివక్ష
సిక్కు ఆటగాళ్ల తలపాగా తొలగింపు నాగ్‌పూర్: ఇటీవల చైనాలో ముగిసిన ‘ఫిబా’ ఆసియా కప్‌లో భారత్ ఆటగాళ్లు ఇద్దరు జాతి వివక్షకు గురయ్యారు. మ్యాచ్‌లు ఆడాలంటే తలపాగా (టర్బన్స్) తొలగించాల్సిందేనని జట్టులోని సిక్కు ఆటగాళ్లు అమ్రిత్‌పాల్ సింగ్, అమ్‌జ్యోత్ సింగ్‌లకు నిర్వాహకులు అల్టీమేటం జారీ చేయడంతో చేసేదేమీలేక తలపాగా తీసేసి బరిలోకి దిగారు. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌ఐబీఏ) నిబంధలన (ఆర్టికల్ 4.4.2) ప్రకారం తలకు హెల్మెట్‌గానీ, పిన్నులుగానీ, విలువైన వస్తువులుగానీ ధరించి మ్యాచ్‌లు ఆడకూడదు. వీటివల్ల ప్రత్యర్థి ఆటగాళ్లకు గాయాలు అవుతాయనే ఉద్దేశంతో ఈ నిబంధనను విధించారు. అయితే సిక్కులు ధరించే టర్బన్స్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా దీన్ని సాకుగా చూపి నిర్వాహకులు జాతి వివక్షకు గురి చేశారు. లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు... భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకునేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో టర్బన్స్‌ను తీసేసి ఆడారు. ఈ మ్యాచ్‌లో అమ్రిత్‌పాల్ 15 పాయింట్లు చేశాడు. భారత్ జట్టు అమెరికన్ కోచ్ స్కాట్ ఫ్లెమింగ్ ఈ నిబంధనపై ఓ రోజంతా నిర్వాహకులకు నచ్చజెప్పినా మొదట ఒప్పుకొని మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు మళ్లీ షాకిచ్చారు. గతంలో ఏ టోర్నీలోనూ ఇలా టర్బన్స్‌ను తీసేయమని చెప్పకపోవడంతో ఈ ఇద్దరు ప్లేయర్లు స్వేచ్ఛగా మ్యాచ్‌లు ఆడారు. కానీ ఇప్పుడు... భారత్‌లో తప్ప బయటి దేశాల్లో మ్యాచ్‌లు ఆడబోమని చెబుతున్నారు. అయితే ఇంత జరిగినా... ఈ విషయం గురించి భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ)కు ఇప్పటి వరకు తెలియకపోవడం కొసమెరుపు! -
భారత్‌కు తొమ్మిదో స్థానం
ది హేగ్ (నెదర్లాండ్స్): టోర్నీ ఆరంభంలో అంచనాలకు అనుగుణంగా రాణించడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు... ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. 9-10వ స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో టీమిండియా 3-0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. ఈ విజయంతో గతేడాది ఆసియా కప్ ఫైనల్లో కొరియా చేతిలో ఎదురైన ఓటమికి సర్దార్ సింగ్ బృందం బదులు తీర్చుకుంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ (6, 50వ నిమిషాల్లో) చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (43వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. స్వదేశంలో జరిగిన 2010 ప్రపంచకప్‌లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలువగా... ఈసారి ఒకస్థానం పడిపోయి తొమ్మిదో స్థానంతో సంతృప్తి పడింది. నెదర్లాండ్స్‌కు టైటిల్ మహిళల విభాగంలో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1తో అమెరికాపై గెలిచింది. -
పుజారా బౌలింగ్ ప్రయత్నాలు!
వన్డేల్లో స్థానం కోసం నెట్స్‌లో శ్రమిస్తున్న బ్యాట్స్‌మన్ న్యూఢిల్లీ: చతేశ్వర్ పుజారా అంటే చక్కటి బ్యాట్స్‌మన్‌గానే గుర్తింపు ఉంది. ఇకపై అతనిలో బౌలర్‌ను కూడా చూస్తామేమో! కేవలం బ్యాటింగ్‌తో వన్డే జట్టులో స్థానం దక్కడం అసాధ్యమని అనుకున్నాడేమో, బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టాడు. ఇటీవల ఆసియా కప్‌లో భారత జట్టుతో పాటు ఉన్నా అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. తాజాగా పుజారా నెట్స్‌లో లెగ్‌స్పిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో చతేశ్వర్ 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ‘నెట్స్‌లో బౌలింగ్ కూడా చేస్తున్నా. పార్ట్ టైమ్ బౌలర్‌గా నా వంతు పాత్ర పోషించగలను. కెప్టెన్ అవకాశం ఇస్తే బౌలింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడగలని నా నమ్మకం’ అని పుజారా వ్యాఖ్యానించాడు. రాబోయే ఐపీఎల్లో సత్తా చాటితే తనకు వన్డే జట్టులోనూ రెగ్యులర్‌గా స్థానం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నేను గతంలో కొన్ని చక్కటి టి20 ఇన్నింగ్స్ ఆడాను. ఈ ఫార్మాట్లోనూ రాణించగల సామర్థ్యం నాకుంది. భారీ షాట్లు ఆడటం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని పుజారా వెల్లడించాడు. ఐపీఎల్-7లో పుజారా కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడనున్నాడు. -
బంగ్లా పోరాటం వృథా
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక విజయం ఆసియాకప్ మిర్పూర్: ఆసియాకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ పోరాడి ఓడిపోయింది. గురువారం షేర్-ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అనాముల్ హక్ (49),రెహమాన్ (39) పరుగులతో రాణించారు. లక్మల్ (2/32), తిషార పెరీరా (2/29), మెండిస్ (2/55), ప్రియంజన్ (2/11) బంగ్లాను కట్టడి చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. మాథ్యూస్ (103 బంతుల్లో 74 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన శ్రీలంక... లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం (17 పాయింట్లు)లో నిలిచింది. గత ఏడాది ఫైనలిస్ట్ బంగ్లాదేశ్ ఈ సారి ఒక్క విజయం కూడా లేకుండా టోర్నీని ముగించింది. శనివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడుతుంది. మాథ్యూస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఫైనల్‌కు ప్రాక్టీస్‌గా భావించిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 205 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు అష్టకష్టాలు పడింది. ఓపెనర్ కుషాల్ పెరీరా (0), సంగక్కర (2), జయవర్ధనె (0) విఫలమయ్యారు. ప్రియంజన్ (24), తిరిమన్నె (33) ఫర్వాలేదనిపించినా... శ్రీలంక 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మాథ్యూస్.... చతురంగ డిసిల్వా (44)తో కలిసి ఆరో వికెట్‌కు 82 పరుగులు జోడించి లంకను గెలిపించాడు.