auditions
-
రాయలసీమ వాసులకు గుడ్‌న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వీడీ14 వర్కింగ్ టైటిల్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీని ప్రధానంగా రాయలసీమలో జరిగిన పీరియాడిక్ కథగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినవారికే ప్రత్యేకంగా ఆడిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 'ఈ తూరి అంతా మన సీమలోనే..బెరీనా పోయి మావోల్లను కల్వండి' అంటూ సీమ యాసలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జూలై 1,2 తేదీల్లో కర్నూలు, 3,4 తేదీల్లో కడప, 5,6 తేదీల్లో తిరుపతి, 7,8 తేదీల్లో అనంతపురంలో కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడేవారిని ఆడిషన్స్ ద్వారా సినిమా ఛాన్సులు ఇవ్వనున్నారు. మరి ఇక ఆలస్యమెందుకు? సీమ యాసలో మెప్పించి సినిమా ఛాన్స్ కొట్టేయండి. -
ఆడిషన్స్‌లోనే అవమానం.. ఇప్పుడు ఆమెనే స్టార్ హీరోయిన్!
పుట్టుకతోనే అందరూ ప్రతిభావంతులు కారు. పుత్తడి అయినా సాన పెడితేనే మెరుస్తుంది. ఒకసారి కాకపోయినా మరోసారి ప్రతిభ వెలికి వస్తుంది. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార జీవితం కూడా అలాంటిదే. ఈ కేరళ భామ కోలీవుడ్‌లో ఎంటర్ అవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలా పలు అవమానాలను, ఆవేదనలను భరించారు. అయ్యా చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి దిగుమతి అయ్యారు. అయితే అంతకు ముందే అవకాశాలు ఈమెను ఊరించి ఉసూరుమనిపించాయి. అయితే నటుడు, దర్శకుడు పార్తీపన్ నయనతారకు తొలి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెప్పిన సమయానికి నయనతార అడిషన్‌కు హాజరు కాలేకపోయారు. అప్పటి ఆమె పరిస్థితి అలాంటిది. కేరళ నుంచి చైన్నెకు బస్సులో చేరుకునే ప్రయత్నంలో ఆమెకు ఆలస్యమైంది. కారణం పార్తీపన్‌కు ఫోన్ ద్వారా వివరించినా.. ఆయన కోపంతో నువ్వు ఇక రావలసిన అవసరం లేదని చెప్పడం నయనతారకు కలిగిన తొలి నిరాశ. ఆ తరువాత శింబుకు జంటగా తొట్టి జయ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు వీజెడ్ దురై అడిషన్ నిర్వహించారు. అందులో పాల్గొన్న నయనతార సరిగా నటించకపోవడంతో నీకు నటన సెట్ కాదు వెళ్లిపోవచ్చు అంటూ రిజెక్ట్ చేశారు. ఇది నయనతార ఎదుర్కొన్న మరో అవమానం. అలాంటిది అయ్యా చిత్రంలో శరత్‌కుమార్ సరసన నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో నయనతారకు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో పలు సంఘటనలు కారణంగా ఆవేదనకు గురయ్యారు. సవాళ్లను ఎదురొడ్డి, ప్రేమ వైఫల్యాలను తట్టుకుని నిలిచారు. అలాంటిది రజనీకాంత్, శరత్‌కుమార్, విజయ్, అజిత్, శింబు, ధనుష్ అంటూ తమిళంలోనూ తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌తోనూ, హిందీలో బాద్షా షారూక్‌ఖాన్ వంటి సూపర్స్టార్లతో నటించి లేడీ సూపర్ స్టార్ అయ్యారు. కాగా.. నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టిన రోజు తన పిల్లలతో కలిసి జరుపుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లి, అక్కడ జోరుగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రియాంకా చోప్రా. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన నేను హాలీవుడ్లో కొత్త నటిలా కెరీర్ ఆరంభించినప్పుడు ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆడిషన్స్ ఇవ్వడం తప్పని అనడంలేదు. ఎందుకంటే ఆడిషన్స్ అనేవి మన ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. ఇండస్ట్రీలో ఉన్న కనెక్షన్స్తో కాదు. ఆడిషన్స్‌లో గెలిచి, చాన్స్ తెచ్చుకోవడం అప్పట్లో న్యూ కమర్గా హాలీవుడ్లో నాకో మంచి అనుభూతి. అయితే ఇప్పుడు ‘సిటాడెల్’కి ఆడిషన్స్ ఇవ్వ కుండానే సెలక్ట్ అయ్యాను. అంతగా నా ప్రతిభని నిరూపించుకున్నాను. ఇప్పుడు పోస్టర్స్‌లో నాకూ సమభాగం దక్కుతోంది. అలాగే, మేల్ స్టార్స్‌కి ఈక్వల్‌గా పారితోషికం తీసుకుంటున్నా. హాలీవుడ్‌కి వెళ్లిన పదేళ్లకు నేను సాధించుకున్న ఘనత ఇది’’ అన్నారు. ఇంకా భారతీయ తారల గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండియన్ స్టార్స్ ఉంటున్నారు. తెర పైనే కాదు.. తెరవెనక కూడా ప్రతిభను చాటుకుంటున్నారు. వాళ్లందరూ హాలీవుడ్‌కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనవాళ్లకి అంత ప్రతిభ ఉంది’’ అన్నారు. -
సమంతను ఫస్ట్ ఆడిషన్ చేసింది నేనే.. కానీ: టాలీవుడ్ డైరెక్టర్
సమంత ప్రస్తుతం ఇటీవలే 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ప్రత్యేకపాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమాపై కొందరు అభిమానులైతే ఏకంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా సమంత కెరీర్‌పై డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతను టాలీవుడ్‌కు తానే పరిచయం చేయాల్సిందని అన్నారు. సమంతను ఫస్ట్ ఆడిషన్ చేసిందని తానేనని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: అలాంటి పాత్రలు చేయాలని ఉంది: పూజా హేగ్డే) శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 'సమంత చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. ఆడిషన్ కోసం హైదరాబాద్ రమ్మని పిలిచాం. ఆడిషన్ ముగిశాక సమంతను చెన్నై పంపిద్దామంటే విమాన టికెట్ ధరలు చాలా ఎక్కువ. ఆ నెక్ట్స్ డే తక్కువగానే ఉన్నాయి. దీంతో ఒక్కరోజు హైదరాబాద్‌లో ఉండమని సమంతను అడిగాం. కానీ ఆమె అంగీకరించలేదు. చేసేదేమీ లేక టికెట్ బుక్ చేసి అదే రోజు చెన్నై పంపించాం. హైదరాబాద్‌లో ఒక్కరోజు ఉండేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే సమంత ఆడిషన్ నచ్చి తీసుకుందామంటే అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. మా వద్ద అంత బడ్జెట్ లేక వెనక్కి తగ్గాం.' అని వెల్లడించారు. కాగా.. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్‌గా శివ నాగేశ్వరరావు పనిచేశారు. మనీ మనీ, సిసింద్రీ, హేండ్సప్, ధనలక్ష్మి ఐ లవ్ యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజాకృష్ణమూర్తి లాంటి సినిమాలు అందించారు. హీరోయిన్ అంజలిని ఫొటో సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. -
నా జీవితంలో అత్యంత చెత్త సందర్భం అదే: సన్నీ లియోన్
బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కెన్నెడీ'. ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. సన్నీ లియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా ఆడిషన్‌పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెన్నెడీ సినిమాకు ఆడిషన్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. రూమ్ మొత్తం మనుషులు ఉండటం చూసి చాలా కంగారు పడ్డానన్నారు. సన్నీ లియోన్ మాట్లాడుతూ..' కెన్నెడీలో ఆఫర్ కోసం అనురాగ్ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. దర్శక, నిర్మాతలు మాత్రమే ఆడిషన్ చేస్తారని తెలుసు. అందుకే ఎలాంటి భయం లేకుండా వెళ్లాను. తీరా చూస్తే అక్కడ సినిమా యూనిట్ అంతా ఉంది. సినిమా కోసం పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర టీమ్ మొత్తం అక్కడే రూమ్‌లో ఉన్నారు. దీంతో వాళ్లందర్నీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఇది నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. నాలో చాలా కంగారు మొదలైంది. నేను ఆడిషన్ ఇవ్వడం పూర్తయిన వెంటనే అనురాగ్ వాళ్ల టీమ్ వైపు చూసి.. ఆమె ఎలా చేసింది? అని అడిగారు. ఆ క్షణం సినీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త ఆడిషన్ అదే అనిపించింది,.' అని అన్నారు. అదృష్టవశాత్తు తాను ఆ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సన్నీ లియోన్ తెలిపారు. -
విశాఖపట్నం : తెలుగు అమ్మాయి ఆడిషన్స్ (ఫొటోలు)
-
నా మొహానికి డెస్క్ జాబే కరెక్ట్.. ఏడ్చేసిన హీరోయిన్
సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం గుర్తు రాకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ ఆ తర్వాత పెద్దగా తెరపై కనిపించలేదు. కానీ టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్ ఆరంగ్రేటం చేసింది సమీర. తెలుగులో చిరంజీవి సరసన జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. 1998లో తెలుగు సినిమా ఆడిషన్స్‌కు హాజరైన విషయాన్ని వెల్లడించింది. టాలీవుడ్ హీరో ఆడిషన్స్‌లో సరైన ఫర్మామెన్స్ చేయకపోవడంతో ఏడ్చుకుంటూ ఇంటికెళ్లానని చెప్పుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సమీరా తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' అప్పుడు 1998. నేను మహేశ్ బాబు సినిమా ఆడిషన్‌కు వెళ్లా. ఆరోజు చాలా భయమేసింది. దాంతో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయా. ఇంటికి తిరిగి వెళ్తూ ఏడ్చేశా. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చేశా. నేను రెండేళ్లు పని చేసిన వాచ్ కంపెనీలోనే ఉండాలని డిసైడ్ అయిపోయా. నా ముఖానికి డెస్క్ జాబే కరెక్ట్ అనుకున్నా. కానీ ఆ తర్వాత నేను మళ్లీ ధైర్యం తెచ్చుకుని బాలీవుడ్లో అహిస్తా కీజియో బాటియన్ మ్యూజిక్ వీడియో చేశా. ' అంటూ ఆడిషన్స్ ఫోటోలు పంచుకుంది. ఇది చూసిన సమీరా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే మీరు చాలా అందంగా ఉన్నారంటూ మరికొందరు పొగుడుతున్నారు. కాగా.. సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది సమీరా రెడ్డి. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) -
‘మిసెస్’ మిసమిస (ఫొటోలు)
-
ఆడిషన్స్ ఇచ్చా కానీ.. రెండుసార్లు రెజెక్ట్ చేశారు: ప్రముఖ హీరో
Tiger Shroff Says Hollywood Is His Goal But I Have Failed In Auditions: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటించిన చిత్రం 'హీరోపంతి 2'. 2014లో వచ్చిన రొమాంటిక్-యాక్షన్ మూవీ 'హీరోపంతి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్గా యాక్ట్ చేసింది. సాజిద్ నడియద్వాలా నిర్మించగా, ఇందులో లైలా అనే ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన యాక్టింగ్ మార్క్ చూపించనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో 'మీరు హాలీవుడ్‌కు వెళ్లే సమయం వచ్చిందా' అని అడిగిన ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ ఆసక్తిర విషయాలు తెలిపాడు. 'హాలీవుడ్లో యాక్షన్ హీరోలు ఎవరు లేరు. అందులోనూ నా ఏజ్ గ్రూప్ యాక్షన్ హీరోలు అసలే లేరు. 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ తప్ప పూర్తి తరహాలో యాక్షన్ చిత్రీకరించే నైపుణ్యం ఉన్న వారిని చూసి చాలా కాలం అయింది. అయితే హాలీవుడ్ నుంచి నాకు రెండు సార్లు ఆఫర్ వచ్చింది. కానీ ఆ రెండు సార్లు ఆడిషన్లో ఫెయిల్ అయ్యాను. అయినా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాబట్టి చూద్దాం. హాలీవుడ్ సినిమాల్లో నటించడమే నా లక్ష్యం.' అని చెప్పుకొచ్చాడు టైగర్ ష్రాఫ్. కాగా సైబర్ నేరాలను అరికట్టేందుకు లైలాతో బబ్లూ (టైగర్ ష్రాఫ్) అనే వ్యక్తి ఎలా తలపడ్డాడనేదే 'హీరోపంతి 2' కథ అని తెలుస్తోంది. చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్ హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వెబ్ సిరీస్‌లో చాన్స్! కానీ నగ్నంగా ఆడిషన్ అంటూ కండీషన్!
Actress Sagarika Shona: ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టవడం బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లో అవకాశాల పేరిట యువతులను ట్రాప్‌లోకి దించి వారితో బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించాడంటూ అతడి మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మోడల్, నటి సాగరిక సోనా సుమన్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది. "నేను మోడల్‌ను. మూడు నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో లాక్డౌన్లో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవి మీతో పంచుకోవాలనుకుంటున్నా. గతేడాది ఆగస్టులో ఉమేశ్ కామత్ అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చింది. రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పాడు. ఇంతకీ రాజ్ కుంద్రా ఎవరని అడిగితే అతడు శిల్పాశెట్టి భర్త అని పేర్కొన్నాడు." "నేను ఆ వెబ్‌సిరీస్‌లో నటిస్తే మున్ముందు కూడా మంచి అవకాశాలు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకుంటానని ఎంతో గొప్పగా చెప్పడంతో నేను సరే అన్నాను. అయితే ముందుగా ఆడిషన్ ఉంటుందని, కోవిడ్ టైం కాబట్టి వీడియో కాల్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పాడు. ఇక వీడియో కాల్లో జాయిన్ అయ్యాక అతడు నగ్నంగా ఆడిషన్లో పాల్గొనమన్నాడు. ఒక్కసారిగా షాకైన నేను వెంటనే అతడికి కుదరదని తేల్చి చెప్పాను" "అప్పుడు వీడియో కాల్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు, కానీ అతడే రాజ్‌కుంద్రా అనుకుంటున్నా. నిజంగా అతడు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసి, ఈ రాకెట్ గుట్టు రట్టు చేయాలని కోరుకుంటున్నా" అని సాగరిక పేర్కొంది. కాగా రాజ్‌కుంద్రా ఆఫీసు నుంచి పోర్న్ వీడియోలు అప్లోడ్ చేయడంలో ఉమేశ్ కామత్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే బలమైన ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. -
300 ఆడిషన్స్‌లో రిజెక్ట్ చేశారు: నటుడు
అదృష్టం గడప దాటేలోపే దరిద్రం ఊరు చుట్టొస్తుందంటారు. కొందరు నటీనటులు సినిమాల్లోకి రావడానికి పడ్డ కష్టాలను చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. వెండితెర మీద కనిపించేందుకు వారు ఎదుర్కొన్న కష్టనష్టాలను చూస్తే మనసు చలించక మానదు. హిందీ నటుడు తాహీర్ రాజ్ భాసిన్ కూడా ఈ పరిస్థితిని దాటి వచ్చినవాడే. మర్దానీ సినిమాలో నటించే అవకాశం రావడానికి ముందు అతడు 250 నుంచి 300 ఆడిషన్లకు వెళ్లాడు, కానీ అంతటా మొండిచేయే ఎదురైంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత మర్దానీలో చాన్స్ రాగా, దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంతో చిచోరే, ఫోర్స్ 2 చిత్రాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తాహిర్ మాట్లాడుతూ.. "ఎన్నో కలలతో ముంబైలోకి అడుగుపెట్టాను. వారంలోనే యశ్‌రాజ్ లేదా ధర్మ ఫిలింస్ బ్యానర్లో సినిమా చేస్తాను అని ఊహించాను. కానీ అంతా మనం అనుకున్నట్లు ఉండదని తర్వాత తెలిసింది. నిలువ నీడ సంపాదించుకోవడానికే మూడు నెలలు పట్టింది. ఇక సినిమా అవకాశాల గురించి చెప్పేదేముంది? నాలుగేళ్లపాటు కాళ్లరిగేలా తిరిగాను. దాదాపు 250 నుంచి 300 వరకు ఆడిషన్లలో నన్ను రిజెక్ట్ చేసినా ప్రయత్నాలు మానలేదు. చిట్టచివరికి మర్దానీలో ఛాన్స్ వచ్చింది" అని తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. కాగా తాహిర్ ప్రస్తుతం క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న '83' సినిమాలో నటిస్తున్నాడు. చదవండి: కరోనాతో సోదరుడు మృతి; నటి భావోద్వేగం.. సోనూసూద్‌కు థాంక్స్ -
రష్మిక ఫస్ట్ ఆడిషన్: వీడియో రిలీజ్ చేసిన మాజీ ప్రియుడు
రష్మిక మందన్నా.. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈమె. కన్నడ కిరిక్ పార్టీతో వెండితెరపై కాలు మోపిన ఈ భామ చలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ వెంటనే ఆమె చేసిన గీతాగోవిందం సూపర్ డూపర్ హిట్టైంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండను తన వెంట తిప్పించుకున్న ఈ మేడమ్ ఎంతోమంది అబ్బాయిలకు క్రష్‌గా మారింది. మిషన్ మజ్నుతో హిందీలో అడుగు పెడుతున్న ఈ హీరోయిన్ అమితాబ్‌తో గుడ్‌బై సినిమా చేస్తోంది. ఇదిలా వుంటే ఈ భామ కిరిక్ పార్టీ ఆడిషన్స్‌లో పాల్గొన్న వీడియోను నటుడు రక్షిత్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "కిరిక్ పార్టీ ఆడిషన్‌లోని మధురానుభూతులను షేర్ చేస్తున్నాను. అప్పటి నుంచి నీ ప్రయాణం ఎంతో దేదీప్యమానంగా సాగింది. నిజమైన యోధురాలిలా నీ కలలను చేధించావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలి.." అని రాసుకొచ్చాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. "అప్పటి క్షణాలు నాకింకా గుర్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్" అని బదులిచ్చింది. ఇక ఈ వీడియోలో కళ్లజోడు పెట్టుకున్న రష్మిక పేపర్లో ఉన్న డైలాగ్స్ నేర్చుకుంటూ అప్పజెబుతోంది. అలాగే అక్కడున్న వారితో నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలావుంటే రష్మిక బర్త్‌డేను పురస్కరించుకుని 'పుష్ప', 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ హీరోయిన్ మాత్రం తన బర్త్‌డే రోజు కూడా షూటింగ్లో పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం ఆవిడ అమితాబ్ బచ్చన్ 'గుడ్‌బై' సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉంది. కాగా 'కిరిక్ పార్టీ' హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించిన ఈ హీరోయిన్ ఆమధ్య పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. 2017లో వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ మరుసటి ఏడాదే విడిపోయారు. చదవండి: పుష్ప: శాంపిల్ వస్తోంది! -
ఆడిషన్స్ అదుర్స్..
-
ఆడిషన్స్‌కి రణ్‌వీర్‌సింగ్ ఎలా వెళ్లాడో చూడండి
రణ్వీర్ సింగ్..ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరో. కానీ ఈ గుర్తింపు అతనికి అంత సులభంగా ఏం దక్కలేదు. ఎన్నో ఆడిషన్స్‌కి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో చిన్నా చితకా పాత్రలే దక్కాయి. కానీ ఏదో ఒకసారి అదృష్టం తలుపుతడుతుంది అంటారు కదా..బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో రణ్వీర్ కెరియర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోనంతగా స్టార్ హీరో స్థాయికి చేరాడు. ఆ సినిమాకి సంబంధించి రణ్వీర్ ఆడిషన్ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి ఫడ్నేకర్ తాజాగా రణ్వీర్ను మొదట ఆడిషన్స్‌కి తీసుకుంది తానేనని అప్పటి అనుభవాలను పంచుకుంది. (ఆ రోజులు చాలా ప్రత్యేకం: నటి) ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ 2010లో నిర్మించిన రొమాంటిక్ కామెడీ సినిమా బ్యాండ్ బాజా బరాత్. ఈ సినిమాలో రణ్వీర్ ముఖ్యపాత్రలో నటించి అలరించాడు. ఆడిషన్ సమయంలో వైట్ టీ షర్ట్ వేసుకొని చెప్పిన డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా తర్వాత లేడీస్ వర్సెస్ రికీ బహ్ల, గల్లీ బాయ్, సింబా, పద్మావత్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 83 సినిమా విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. View this post on Instagram Ranveer had to go through multiple auditions to land the role of Bittoo Sharma in Band Baaja Baraat. Swipe to see what Bhumi Pednekar, then casting director has to say about his audition!! 😍😍 A post shared by ranveersinghera 🧚✨ (@ranveersinghera) on Jul 7, 2020 at 3:31am PDT -
ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ ఆన్లైన్లో..
ముంబై: సోని చానెల్ నిర్వహించే రియాల్టి మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ‘ఇండియన్ ఐడల్-12’ సీజన్ ఆడిషన్స్‌ను జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు సోని చానెల్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఆడిషన్స్‌ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో వీడియోను సోని టీవీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఇడియన్ ఐడల్ ఈజ్ బ్యాక్! ఇండియన్ ఐడల్-12 ఆడిషన్స్‌ను సోని లైవ్ యాప్ ద్వారా జూలై 25 నుంచి ప్రారంభిస్తున్నాము. రెడీగా ఉండండి’ అని క్యాప్షన్ కూడా జత చేసింది. View this post on Instagram Did you see this surprise coming your way? #IndianIdol is back! Online Auditions for Season 12 begin from 25th July only on Sony Liv App, so get ready for your #GharSeManchTak journey! @sonylivindia @adityanarayanofficial A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Jul 11, 2020 at 7:30am PDT సోని లైవ్ యాప్ ద్వారా ఆసక్తి గల గాయకులు తమ పాటలకు సంబంధించిన వీడియోను పంపించాలని రియాల్టీ షో హోస్ట్ ఆదిత్య నారాయణ్ తెలిపారు. నూతన గాయని, గాయకులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆన్లైన్ ఆడిషన్స్‌లో ఎంపికైన వారికి ముంబైలో మరో ఆడిషన్ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది కూడా రియాల్టి మ్యూజిక్ షోకి సింగర్ నేహా కక్కర్, బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా, విశాల్ దడ్లాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన సన్నీ హిందూస్థానీ ఇండియన్ ఐడల్ సీజన్-11 టైటివ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
సోషల్ మీడియాలో లైవ్ ఆడిషన్స్
కొత్త వారికి నటీనటులుగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే డైరెక్టర్ తేజ మరోసారి తన తర్వాతి సినిమాకి ప్రతిభావంతులైన నటీనటులను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా ఆడిషన్స్ నిర్వహించనుండటం విశేషం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇలా లైవ్ ఆడిషన్స్ ప్లాన్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌లో సినిమాలు చేయనున్నట్లు ఆ మధ్య తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి రానా దగ్గుబాటితో ‘రాక్షసరాజు రావణాసురుడు’ సినిమా కాగా, మరొకటి గోపీచంద్‌తో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ చిత్రం. ఈ రెండు సినిమాల్లో దేని కోసం ఈ ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. కాగా హలో యాప్‌లో అప్లోడ్ చేసిన అప్లికేషన్లను మాత్రమే ఫైనల్ ఆడిషన్స్ కోసం పరిగణనలోకి తీసుకుంటామని తేజ స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఆయా సినిమా యూనిట్స్ తక్కువ మందితో షూటింగ్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇక ఆడిషన్స్ కూడా ఇలా లైవ్‌లో జరుగుతున్నాయన్న మాట. -
‘మిస్ దివా–2020’ ఆడిషన్స్
-
‘ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడిని’
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరుకున్న వారిలో రణ్వీర్ సింగ్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు రణ్వీర్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తొలినాళ్లలో నేను ఇచ్చిన కొన్ని ఆడిషన్లు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఎందుకంటే.. నాకికి రేపు అనేది లేదు.. ఈ రోజే ఆఖరు అనే భావంతో ఆడిషన్స్ ఇచ్చేవాడిని. దాంతో నాకు ఊపిరాడని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి’ అన్నారు. ‘‘బ్యాండ్ బజా బరాత్’ చిత్రం తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు నన్ను ఆడిషన్‌కు పిలిచాడు. తాగుబోతు ఫుల్లుగా తాగి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించమన్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేను ప్రతి చాన్స్‌ను వినియోగించుకునేవాడిని. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భావించేవాడిని. ఆ రోజు అలానే మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాను. ఎంత ఉద్రేకంగా డ్యాన్స్ చేశానంటే.. నాకు ఊపిరి ఆడటం కష్టంగా మారింది. నా డ్యాన్స్ చూసిన ఆ దర్శకుడు నన్ను ఎంతో ప్రశంసించాడు’ అన్నారు. ‘తొలినాళ్లలో కఠిన పరీక్షలు, నిరాశ, అవమానాలు, నిరాకరణ ఒక్కటేంటి అన్నింటిని చవి చూశాను. కానీ గడిచిన ఆ రోజులు నా జీవితంలో మధురస్మృతులు. నాకు అవకాశాలు వస్తాయా అని ఆలోచించేవాడిని. ‘మా చిత్రంలో మిమ్మల్ని సెలక్ట్ చేశాం రండి’ అంటూ ఎవరైనా నాకు ఫోన్ చేయకపోతారా అని ఎదురుచూసేవాడిని. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోలేదు. నాకు నేనే ధైర్యం చెప్పుకునే వాడిని. ఆ సమయంలో రెండు విషయాలను బాగా నమ్మేవాడిని’ అని తెలిపారు. ‘ఒకటి.. నటన పట్ల నాకున్న పిచ్చి.. రెండు నా మీద నాకున్న నమ్మకం. సంపాదన, పేరు కోసం నేను సినిమాల్లోకి రాలేదు. అందుకే ఎప్పుడు నాకు నేను ఒకటే చెప్పుకునేవాడిని. నీవు మంచివాడివి.. పట్టుదల కల్గిన వ్యక్తివి. కాబట్టి ఏదో రోజు నీకు మంచే జరుగుతుందని నాకు నేనే చెప్పుకునేవాడిని. ఈ రోజు నాకు వస్తోన్న ప్రతి అవకాశాన్ని విలువైనదిగానే భావిస్తాను’ అన్నారు రణ్వీర్ సింగ్. ప్రస్తుతం రణ్వీర్ ‘83’ చిత్రంతో బిజీగా ఉన్నారు. -
అందమైన భామలు...
-
అందాల పోటీలకు ఆంధ్రా అమ్మాయిలు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): మిస్ ఇండియా 2019 ఆడిషన్స్‌లో దక్షిణ ప్రాంత క్రౌనింగ్ వేడుకలకు ఎంపికయ్యారు ముగ్గురు యువతులు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా–2019 ఆడిషన్స్‌లో ప్రతిభను కనబరిచి టాప్ 3గా ఎంపికయ్యారు సిమ్మాన్ పారిక్, సుష్మిత రాజ్, నిఖిత తన్యా. ఎఫ్‌బీబీ (ఇండియాస్ ఫ్యాషన్ హబ్) ఆధ్వర్యంలో సెఫోరా, రజనీగంధ పెరల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ఆడిషన్స్‌కు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు హాజరు కాగా అందం, సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, నడక, నడవడిక, సేవా కార్యక్రమాలు.. ఇలా విభిన్న అంశాల సమాహారంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రాణించి ఈ ముగ్గురూ ఎంపికయ్యారు. 24న దక్షిణ ప్రాంత క్రౌనింగ్ వేడుక ఎంపికైన ఈ ముగ్గురు యువతులు ఫిబ్రవరి 24న బెంగుళూరులో నిర్వహించనున్న దక్షిణ ప్రాంత క్రౌనింగ్ వేడుకలకు హాజరవుతారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. వేడుక అనంతరం వారి మెంటార్ దియా మీర్జాను కలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యంత అర్హత గల అభ్యర్థులు జూన్ నెలలో ముంబైలో నిర్వహించే గ్రాండ్ ఫినాలేలో తమతమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. గ్రాండ్ ఫినాలేకు వెళ్లడానికి ముందు ఎంపికైన అభ్యర్థులకు నిపుణులు శిక్షణ ఇస్తారని తెలిపారు. నగరంలో నిర్వహించిన ఆడిషన్స్‌కు 2018 మిస్ఇండియా 2వ రన్నరప్ శ్రేయరావు కామవరపు, కార్‌రేసర్ శైలేష్ బొలిశెట్టి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
కార్పొరేట్ ‘రాక్‌స్టార్’
-
30 సార్లు తిరస్కరించారు
సినిమా: 30సార్లు తిరస్కరింపబడ్డానని నటి అమైరా దస్తూర్ చెప్పింది. అనేగన్ చిత్రంలో ధనుష్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బాలీవుడ్ భామను ఆ తరువాత ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య ఒక దక్షిణాది నటుడు తనను పడక గదికి రమ్మన్నాడని, అందు కు నిరాకరించినందుకు గానూ, షూటింగ్లో లైట్ల ముం దు గంటల కొద్ది నిలబెట్టడం లాంటి వేధింపులకు గురి చేశారని ఆరోపణలు గుప్పించి వార్తల్లోకెక్కిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి సినీ పరిశ్రమపై ధ్వజమెత్తింది. ఇక్కడ సినీ నేపథ్యం లేకపోతే అవకాశాలు రావడం కష్టం అని చెప్పింది. నటీనటుల వారసులైతే అవకాశాలు సులభంగా వరిస్తాయని అంది. వారికైతే నటనలో శిక్షణ ఉందా? అని కూడా పరి క్షించరని చెప్పింది. తాను సినీ అవకాశాల కోసం చెప్పులరిగేలా చిత్ర కార్యాలయాలకు తిరిగినప్పుడు పలువురు తనను నిరాకరించారని చెప్పింది. అలా 30 చిత్రాల ఆడిషన్స్‌లో పాల్గొని నిరాశకు గురయ్యానని అంది. ఆ తరువాత 2013 లో ఇషాక్ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నానని చెప్పింది. ఇక తొలి చిత్రం విజయవంతం అయితేనే తదుపరి అవకాశాలు వస్తాయని, సరిగా ఆడకపోతే ఇక అంతే సంగతులని అంది. అదే సినిమా నేపథ్యం ఉన్న వారినైతే అందరూ ఆదరిస్తారని, బయట వారిని పట్టించుకోరని నటి అమిరా దస్తూర్ ఆవేదన వ్యక్తం చేసింది. హిందీతో పాటు, తెలుగు, తమిళం భాషలపైనా గురి పెట్టిన ఈ అమ్మడు దాదాపు మూడేళ్ల తరువాత తమిళంలో ఓడి ఓడి ఉళైక్కనుమ్ అనే చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఇది అమైరా దస్తూర్‌కు తమిళంలో రెండో చిత్రం అన్నది గమనార్హం. -
బ్యూటీ హంట్
-
అందం హిందోళం..
-
ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కు విశేష స్పందన
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్‌లో బుధవారం సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో ప్రసారం కానున్న ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి 1500 మంది ఔత్సాహిక గాయకులు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆడిషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్–9 విజేత ఎల్.వి.రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఔత్సాహిక గాయకులు పరిచయం కానున్నారన్నారు. 10 వ ఇం డియర్ ఐడియల్ హైదరాబాద్‌తో పా టు వై జాగ్లలో ఆడిషన్స్‌ను నిర్వహించనుందన్నా రు. గతంలో కంటే ప్రస్తుతం నిర్వహిస్తు న్న ఆ డిషన్స్కు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ ఆడిషన్స్‌లో న్యాయ నిర్ణేతలుగా నీరజ్ కా లాకర్, మంగల్ మిశ్రాలు వ్యవహరించారు. ఆడిషన్స్ మేనేజర్ శర్మ మాట్లాడుతూ... మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇప్పటికి 22 వేల మందికి పైగా ఈ ఆడిషన్స్‌లో పాలుపంచుకున్నారన్నారు. మొత్తం 200 మందిని ఎం పిక చేసి ముంబాయిలో జరిగే ఆడిషన్స్‌కు ఎంపిక చేస్తామన్నారు. ప్రస్తుతం రెండు రౌం డ్లల్లో పోటీలు నిర్వహించామన్నారు. ఈ ఆడిషన్స్‌కు పలువురు గాయకులు హాజరయ్యారు.