Bajirao Mastani
-
బాలీవుడ్ సినిమా అంగీకరిస్తుందా..?
చాలా రోజులుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా త్వరలో ఓ హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. వరుసగా హాలీవుడ్ సినిమాలతో టీవీ సీరిస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాజీరావ్ మస్తాని తరువాత ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. దీంతో ప్రియాంక బాలీవుడ్ సినిమాలో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే పని మీద ముంబై చేరుకున్న ప్రియాంక చోప్రా మూడు రోజుల పాటు ఇక్కడ దర్శక నిర్మాతలతో చర్చలు జరపనున్నారు. త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేసి ఇక్కడి ప్రేక్షకులను అలరించాలన్న ప్లాన్‌లోనే ప్రియాంక ముంబై వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా కల్పనా చావ్లా బయోపిక్ లో ప్రియాంక నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఈ ట్రిప్ లోనే ఫైనల్ చేస్తారో లేదో చూడాలి. మూడు రోజుల పాటు ముంబైలో గడపనున్న పీసీ తరువాత క్వాంటికో 3 సీరిస్ కోసం ఐర్లాండ్ వెళ్లనున్నారు. -
అతడికి భార్యగా.. సోదరిగానూ ఒకే!: నటి
ముంబై: బాలీవుడ్ లో విజయాలతో హాలీవుడ్ బాటపట్టిన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. క్వాంటికో అమెరికన్ టీవీ షోలతో అక్కడ కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బేవాచ్ అనే మూవీతో హాలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రియాంక. అయితే ప్రేక్షకుల అభిరుచిపై ఇటీవల ప్రియాంక మాట్లాడుతూ.. వారు తెరపై తమ నటనను మాత్రమే చూస్తారు, కానీ ఆన్ స్క్రీన్ వ్యక్తులతో అన్ని మూవీలలో అదే రిలేషన్ ను ఆశించనరని పేర్కొంది. రణవీర్, తాను మూడు మూవీలు చేసినా కేవలం ఆయా పాత్రల్లో మేము మెప్పించామా లేదా అన్నదే ప్రేక్షకులు గుర్తించారు. ’రణవీర్ సింగ్, నేను ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించాం. గూండే మూవీలో నేను రణవీర్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించాను. ఆ తర్వాత ’దిల్ ధడ్ కనే దో’ మూవీలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆ హీరోకు సోదరిగా నటించాను. మేమిద్దం ముచ్చటగా మూడోసారి కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం బాజీరావ్ మస్తానీ. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ మూవీలో రణవీర్, నేను భార్యాభర్తలుగా నటించాం. ప్రేక్షకులు నన్ను, రణవీర్ సోదరిగానూ, భార్యగానూ, గర్ల్ ఫ్రెండ్ పాత్రలోనూ ఆదరించారని అర్ధం చేసుకోవచ్చు’ నని మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ప్రతి మూవీలో అదే పాత్రలు, రిలేషన్స్ చేయడం కుదరదని.. ప్రయోగాలు చేయడమూ ఆరోగ్యానికి మంచిదేనంటూ నవ్వేసింది ఈ బ్యూటీ. -
ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది
ముంబై: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక ప్రేమకథా చిత్రం బాజీరావ్ మస్తానీ తన జీవితాన్ని మార్చివేసిందని బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ అన్నాడు. ఈ సినిమా టైటిల్ రోల్లో రణవీర్ నటించిన సంగతి తెలిసిందే. అతనికి జోడీగా దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా నటించారు. గతేడాది డిసెంబర్ 18న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రణవీర్ తన అనుభూతిని అభిమానులతో పంచుకుంటూ ట్వీట్ చేశాడు. ‘బాజీరావ్ మస్తానీ సినిమాలో మరాఠా వీరుడు బాజీరావ్ పాత్రలో నటించడం వల్ల నా జీవితం ఎంతో మారిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ సర్‌కు కృతజ్ఞతలు. నాతో పాటు నటించిన దీపిక, ప్రియాంక, చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని రణవీర్ ట్వీట్ చేశాడు. హీరోయిన్లు దీపిక, ప్రియాంక కూడా దర్శకుడు సంజయ్ ఇతర యూనిట్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. -
'జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు'
ముంబై: బాజీరావ్ మస్తానీతో హిట్ కొట్టడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సక్సెస్ తో తాను మరెన్నో ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. తన తర్వాతి ప్రాజెక్టు ఎలా ఉండబోతుందంటే ఎవరూ ఊహించలేనంత ట్విస్ట్ తో ఉంటుందన్నాడు. అయితే ప్రేమ కథలు చాలా బాగా తెరకెక్కించగలనని తనకు తెలుసునని భన్సాలీ అంటున్నాడు. గతంలో తాను తీసిన చిత్రాలకు చాలా కేటగిరీల్లో అవార్డులు వచ్చాయని... అందుకే బాజీరావ్ మస్తానీ మూవీకి అవార్డు వస్తుందని భావించానని, కానీ ఏకంగా తనకే అవార్డు వస్తుందని అసలు ఊహించలేదని భన్సాలీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండాలని భావించడం లేదని, అలా ఉన్నప్పుడే మన నుంచి బెస్ట్ పార్మార్మెన్స్, ప్రొడక్ట్ వస్తాయని చెప్పుకొచ్చాడు. తన నెక్స్ట్ మూవీ కోసం ఏ కథాంశం ఎంచుకోవాలి అనే విషయంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించాడు. రౌడీ రాథోడ్ లాంటి మూవీ చేస్తారా అన్న విలేఖరి ప్రశ్నపై స్పందిస్తూ.. అలాంటి ఆలోచనే తనకు లేదన్నాడు. బాద్షా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర హీరోలతో మూవీ ఏమైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. షారుక్ తో ప్రస్తుతం మూవీ చేయడం లేదని భవిష్యత్తులో ఆ విషయంపై కసరత్తు చేస్తానని భన్సాలీ తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. -
'బాజీరావ్ మస్తానీ'కి పన్ను మినహాయింపు
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన పీరియాడిక్ విజువల్ వండర్ 'బాజీరావ్ మస్తానీ'. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ ప్రేమకథ బాలీవుడ్లో కాసుల పంట పండిస్తోంది. షారూఖ్ ఖాన్ 'దిల్ వాలే' సినిమాకు పోటీగా రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. డిసెంబర్ 18న రిలీజ్ అయిన బాజీరావ్ మస్తానీ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబ సమేతంగా 'బాజీరావ్ మస్తానీ' సినిమాను చూశారు. 16 శతాబ్దానికి చెందిన విశేషాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిభకు ముగ్దుడైన అఖిలేష్, ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్‌లో వినోద పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లోనూ సత్తా చాటిన బాజీరావ్ మస్తానీ 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. -
సత్తా చాటిన టాలీవుడ్ టాప్ రైటర్
ముంబై: ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో భారీ విజయాలు సాధించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన ఈయన 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల కుంభవృష్టి కురిపించి బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్‌ను మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఆయన ప్రతిభకు తాజాగా ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ పురస్కారం లభించింది. 2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డును పొందారు. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్ వచ్చిన మూగ, చెవిటి బాలికను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చే కథతో 'బజరంగీ భాయ్‌జాన్' సినిమా తెరకెక్కింది. ఇందులో కథాకథనలు, సల్మాన్ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకొని రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. -
ఫిలింఫేర్లో దుమ్మురేపిన 'బాజీరావు'!
ముంబై: ఊహించినట్టే సంజయ్‌లీలా భన్సాలీ చారిత్రక ప్రేమకథ 'బాజీరావు మస్తానీ' అవార్డుల విషయంలో దుమ్మురేపుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ పురస్కారాల్లో ఈ సినిమా పంట పండింది. శుక్రవారం ముంబైలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులతో భన్సాలీ తన సత్తా చాట్టాడు. 'బాజీరావు మస్తానీ' ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం తొమ్మిది పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత స్థానంలో షుజిత్ సర్కార్ 'పీకూ' సినిమా నిలిచింది. ఉత్తమ కథాకథనాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా ఐదు అవార్డులతో తన ప్రతిష్ట నిలబెట్టుకుంది. 'పీకూ' సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న దీపికా పదుకొణ్కు ఉత్తమ నటి అవార్డు లభించింది. మరాఠా యోధుడు 'బాజీరావు' పాత్రను సమర్థంగా పోషించి మెప్పించినందుకు ఆమె చెలికాడు రణ్వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది. 'బాజీరావు మస్తానీ'లోనూ దీపిక అద్భుతమైన ప్రతిభ కనబర్చినప్పటికీ.. 'పీకూ'లోని ఆమె అభినయానికి న్యాయనిర్ణేతలు ఓటువేశారు. 'పీకూ' సినిమాలో చివరిసారిగా కనిపించిన అలనాటి నటి మౌషుమి చటర్జీకి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. 61వ బ్రిటానియా ఫిలింఫేర్ అవార్డ్-2015 విజేతలు వీరే ఉత్తమ నటుడు: రణ్వీర్ సింగ్ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ నటి: దీపికా పడుకొనే (పీకూ) ఉత్తమ చిత్రం - బాజీరావ్ మస్తానీ ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - నీరజ్ ఘాయ్వాన్ (మసాన్) ఉత్తమ హీరోయిన్ (తొలిచిత్రం) - భూమి పెడ్నెకర్ (దమ్ లాగాకే హైస్సా ) ఉత్తమ హీరో (తొలిచిత్రం) - సూరజ్ పంచోలి ('హీరో') విమర్శకులు మెచ్చిన ఉత్తమ చిత్రం - పీకూ క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటుడు - అమితాబ్ బచ్చన్ (పీకూ) క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి - కంగనా రానౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) సహాయ పాత్రలో ఉత్తమ నటి: ప్రియాంకా చోప్రా (బాజీరావ్ మస్తానీ') సహాయ పాత్రలో ఉత్తమ నటి: అనిల్ కపూర్ (దిల్ దడక్నే దో) జీవితకాల సాఫల్య పురస్కారం - మౌషుమి ఛటర్జీ ఉత్తమ కాస్ట్యూమ్ - అంజు మోడీ, గరిష్ట బసు (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ సౌండ్ డిజైన్ - షాజిత్ కోయెరీ (తల్వార్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సుజీత్ సావంత్, శ్రీరామ్ అయ్యంగార్, సలోని ధాత్రక్ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ నృత్యదర్శకుడు - పండిట్ బిర్జు మహరాజ్ ('బాజీరావ్ మస్తానీ'లో మోహె రంగ్ దో లాల్ పాటకు) ఉత్తమ సినిమాటోగ్రఫీ - మను ఆనంద్ ('దమ్ లాగాకే హైస్సా') ఉత్తమ యాక్షన్ - నకిలీ కౌశల్ (బాజీరావ్ మస్తానీ) ఆర్డీ బర్మన్ అవార్డు - అర్మాన్ మాలిక్ ఉత్తమ నేపథ్య సంగీతం - అనుపమ్ రాయ్ (పీకూ) ఉత్తమ వీఎఫ్ఎక్స్ - ప్రాణ స్టూడియో (బొంబే వెల్వెట్) ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్ ('బాజీరావ్ మస్తాని'లో దివానీ మస్తానీ పాట) ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజిత్ సింగ్ ('రాయ్'లో సూరజ్ డుబా హై పాట) ఉత్తమ పాట - ఇర్షాద్ కామిల్ ('తమాషా'లో అగర్ తుమ్ సాత్ హో) ఉత్తమ సంగీతం - అంకిత్ తివారీ, మీట్ బ్రదర్స్ అంజన్, అమాల్ మల్లిక్ (రాయ్) ఉత్తమ స్క్రీన్‌ప్లే - జుహీ చతుర్వేది (పీకూ) ఉత్తమ ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్ (తల్వార్) ఉత్తమ కథ - విజయేంద్ర ప్రసాద్ (బజరంరీ భాయ్‌జాన్) ఉత్తమ సంభాషణలు - హిమాన్షు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్) -
బాజీరావు మస్తానీకి ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట
-
దీపిక పారితోషికం ఎంతో తెలుసా?
ఈ నెల 5వ తేదీతో 30వ వసంతంలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందాల సుందరి దీపికా పదుకొణ్. ఆమె జన్మదినం సందర్భంగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది వరుస విజయాలతో జోరుమీదున్న దీపిక పారితోషికం గురించి. 2015 వరకు ఈ సుందరి సినిమాకు రూ. 10 కోట్ల చొప్పున తీసుకునేదట. కానీ 'బాజీరావు మస్తానీ' సినిమా ఊహించనంత విజయం సాధించడంతో ఈమె పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు సినిమాకు రూ. 15 కోట్లు అడుగుతున్నదని సమాచారం. ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరిగా దీపిక నిలిచింది. 2015లో దీపిక ప్రేక్షక జనం నుంచే కాదు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంది. గత ఏడాది షుజిత్ సర్కార్ తెరకెక్కించిన 'పీకూ' సినిమాలో దీపిక తన అభినయంతో అదరగొట్టింది. చక్కని విజయం సాధించిన 'పీకూ'లో దీపిక తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక మాజీ బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన 'తమాషా' సినిమా కూడా దీపికకు మంచి పేరునే తీసుకొచ్చింది. ఏడాది చివర్లో వచ్చిన 'బాజీరావు మస్తానీ'లో మస్తానీగా ఈ సొట్టబుగ్గల చిన్నది అభిమానులను కట్టిపడేసింది. ఈ సినిమాలో దీపిక చూపిన అభినయ కౌశల్యంపై విమర్శకుల నుంచీ ప్రశంసల వర్షం కురిసింది. 'బాజీరావు మస్తానీ' విజయంతో నిర్మాతలకు దీపిక మరింత ప్రియంగా మారింది.. ఆమె పారితోషికం కళ్లు చేదిరేస్థాయికి పెరిగిందంటున్నారు బాలీవుడ్ జనాలు. -
నేనెవరి మాటా విననంతే!
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ 2013 బెస్ట్ ఇయర్ అనుకున్నాను. కానీ, ఇప్పుడు 2015 బెస్ట్ అంటున్నా. ఈ ఏడాది సూపర్ అని చెప్పడానికి ‘బాజీరావ్ మస్తానీ’ ఒక్కటి చాలు. ‘పీకు’ కూడా నాకు మంచి పేరు తెచ్చింది’’ అని నటి దీపికా పదుకొనే అన్నారు. సినిమాలు సెలక్ట్ చేసుకునే విషయంలో ఎవరి మాటా విననని ఆమె చెబుతూ - ‘‘దర్శకుడు నాకు కథ చెప్పిన తర్వాత చేయాలా? వద్దా? అనే విషయాన్ని నేనే నిర్ణయించుకుంటా. కథ నచ్చితే ఒప్పేసుకుంటా. కథ అంత బాగాలేదని ఎవరైనా వెనక్కి లాగాలని చూసినా వినను. ఒక్కసారి నేను డిసైడ్ అయ్యాక ఇక ఇతరుల మాటలు వినను. వృత్తిపరంగానే కాదు... వ్యక్తిగతంగా కూడా అన్ని నిర్ణయాలూ నావే. ఇల్లు కొనడం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వరకూ ఎవరినీ సంప్రతించను. మా అమ్మానాన్న నాకు అంత స్వేచ్ఛ ఇచ్చారు. దానికి కారణం నా నిర్ణయాల మీద వాళ్లకున్న నమ్మకమే’’ అన్నారు. ‘‘ ‘మీ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసిందట కదా?’ అని కొంతమంది అడుగుతుంటారు. కలెక్షన్స్ గురించి నాకెందుకు? మొదటి ఆటకే హిట్ టాక్ రావాలని మాత్రం కోరుకుంటాను. ఆ టాక్ వినపడితే చాలు. రిలీఫ్ ఫీలవుతాను’’ అని చెప్పారు. -
అక్కడ 'దిల్వాలే' జోరు- 'బాజీరావు' బేజారు!
కరాచీ: బాలీవుద్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన యాక్షన్ కామెడీ 'దిల్వాలే' పాకిస్థాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జాతర చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి మూడురోజుల్లో ఏన్నడులేనంతంగా వసూళ్లు రాబట్టింది. 'దిల్వాలే'తో ధాటిగా దీటుగా పోటీపడి రీలిజైన 'బాజీరావు మస్తానీ' మాత్రం పాకిస్థాన్‌లో పెద్దగా సందడి చేయలేకపోతున్నది. రోహిత్‌శెట్టి మార్క్ సినిమా అయిన 'దిల్వాలే' పాక్‌లో తొలి మూడురోజుల్లో రూ. 6.5 కోట్లు (65 మిలియన్లు) రాబట్టింది. ఈ సినిమా వరుసగా మూడురోజుల్లో రూ. 2.13 కోట్లు, రూ. 2.4 కోట్లు, రూ. 2.3 కోట్ల వసూళ్లు రాబట్టిందని డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఎవర్రెడీ పిక్చర్స్ తెలిపింది. ఇక సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాజీరావు మస్తానీ' మాత్రం తొలి మూడురోజుల్లో రూ. 2.1 కోట్లు వసూలు చేసింది. 'దిల్వాలే' కలెక్షన్‌తో పోల్చుకుంటే ఇది మూడోవంతు కూడా కాదు. అయితే 'బాజీరావు మస్తానీ' పాక్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నదని ఇప్పుడే చెప్పడం సరికాదని, ఇప్పుడు ఆ సినిమా థియేటర్లకు కూడా 'క్యూ' కట్టే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్నదని, 'బాజీరావు' కలెక్షన్లు కూడా పెరిగే అవకాశముందని ఆ సినిమా పంపిణీదారు నదీం మందిద్వివాలా తెలిపారు. ఇటు షారుఖ్-కాజోల్ జోడీ 'దిల్వాలే', అటు భన్సాలీ మార్క్ చారిత్రక ప్రణయకావ్యం 'బాజీరావు'.. రెండు సినిమాలు భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. రెండు సినిమాలకు దాదాపు సానుకూల రివ్యూలే వచ్చాయి. భారత్‌లో మాత్రం రెండు సినిమాలు పోటాపోటీగా వసూళ్లు రాబడుతున్నాయి. -
'నా జీవితంలో మాత్రం ట్రయాంగిల్ లవ్ లేదు'
హిస్టారికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాజీరావు మస్తానీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రణ్వీర్ సింగ్.. తన నిజ జీవితంలో మాత్రం అలాంటి అవకాశం లేనే లేదని స్పష్టం చేశాడు. జీవితం గురించి తనకు కావల్సినంత స్పష్టత ఉందని, ట్రయాంగిల్ లవ్ లాంటిది తన జీవితంలో పొరపాటున కూడా ఉండబోదని తెలిపాడు. దీపికా పదుకొనెతో రణ్వీర్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ జనాలు కోడై కూస్తున్న విషయం తెలిసిందే. దాని విషయం ఏమీ చెప్పలేదు గానీ.. తాను మాత్రం అద్భుతమైన బోయ్ ఫ్రెండ్ అవుతానని అన్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన రామ్‌లీలా సినిమాలో కావల్సినంత రొమాన్స్ పండించిన ఈ జంట.. తరచు బయట పార్టీలలో క్లోజ్‌గా కనిపిస్తుంటారు. అయితే.. ఇద్దరిలో ఎవరూ ఈ బంధం గురించి బయటపడలేదు. బాజీరావు మస్తానీ సినిమాలో రణ్‌వీర్‌కు ప్రియురాలిగా దీపిక నటించిన విషయం తెలిసిందే. రణ్వీర్ ప్రస్తుతం ఆదిత్య చోప్రా దర్శకత్వంలో బేఫికర్ సినిమా చేస్తున్నాడు. -
ఆ ఇద్దరితోనూ చనువుంది: దీపిక
న్యూఢిల్లీ: బాలీవుడ్లో దూకుడు మీద ఉన్న టాప్ హీరోయిన్ దీపిక పదుకొణె. ఇటీవలే ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో జట్టుకట్టి 'తమాషా' సినిమాను రక్తి కట్టించింది. తన చెలికాడు రణ్‌వీర్‌సింగ్‌తో 'బాజీరావు మస్తానీ' వంటి భారీ చారిత్రక సినిమాతో ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఒకేసారి వీరిద్దరితో తెరపంచుకున్న విషయమై స్పందిస్తూ తనకు వారిద్దరితోనూ చనువు ఉందని దీపిక తెలిపింది. అయితే రణ్వీర్తో 'బాజీరావు మస్తానీ' ప్రమోట్ చేయడం.. రణ్‌బీర్‌తో 'తమాషా' ప్రమోట్ చేయడం కన్నా భిన్నమైందని అభిప్రాయపడింది. 'ఒక్క నెల గ్యాప్ కూడా లేకుండా వరుసగా నీ సినిమాలు రెండు రానున్నాయి. పని ఒత్తిడితో నువ్వు నీరసించిపోతావని చాలామంది చెప్పారు. కానీ రణ్వీర్ సింగ్‌ను చూడండి. అతను నన్ను పెద్దగా మాట్లాడనియ్యడు. తనే మొదట గొంతు విప్పుతాడు. నాకు ఇదెంతో మంచి విషయం. ఇక రణ్‌బీర్ కపూర్ విషయానికొస్తే. అతను అంతగా మాట్లాడలేడు. అప్పుడు ఆ బాధ్యత నాది అవుతుంది. అందుకు భిన్నంగా 'బాజీరావు మస్తానీ' ప్రమోషన్లో నాకోసం ముందుగా గొంతు విప్పేది రణ్‌వీర్‌సింగే' అని దీపిక వివరించింది. 'వాళ్లిద్దరితోనూ నాకు చనువుంది. పరిస్థితులను బట్టి ఇది ఉంటుంది. అందుకు అనుగుణంగా నేను వ్యవహరిస్తాను' అని చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాలతో రూపొందిన 'బాజీరావు మస్తానీ' సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా భన్సాలీ ఎమోషనల్ డ్రామాతోపాటు యాక్షన్, రోమాన్స్, కామెడీ, పాటలు వంటి సినిమా దినుస్సులన్నీ పుష్కలంగా ఉంటాయని ఆమె చెప్పింది. -
'సీఎం గారూ.. ఆ మూవీ రిలీజ్ ఆపేయండి'
ముంబై: మరాఠా యోధుడు బాజీరావు పీష్వా, ఆయన ప్రియురాలు మస్తానీ మధ్య సాగిన ప్రేమకథను కళ్లకు కట్టేలా చూపించేందుకు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసిన మూవీ 'బాజీరావు మస్తానీ'పై విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. చారిత్రక అంశాల నేపథ్యంలో తీసిన ఆ మూవీలో కొన్ని తప్పులు దొర్లాయని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఆరోపించారు. సమస్య వీగిపోయి, వివాదాస్పద సన్నివేశాలను మూవీ నుంచి తొలగించేంత వరకూ 'బాజీరావు మస్తానీ' విడుదల చేయడానికి అనుమతించవద్దని సేన ఎమ్మెల్యేలు మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. మరాఠా పీష్వా బాజీరావు చరిత్రను ఆ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ పూర్తిగా మరిచిపోయాడని శివసేన ఎమ్మెల్యేలు విమర్శించారు. చారిత్రక అంశాలపై తీస్తున్న చిత్రంలో ఇలా చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే సర్నాయక్ పేర్కొన్నారు. బాజీరావు మస్తానీ' విడుదలకు ముందే శాసనసభ్యులకు అసెంబ్లీలో స్పెషల్ షో ప్రదర్శించాలని సర్నాయక్ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 18న విడుదల కానున్న 'బాజీరావు మస్తానీ'లో రణ్వీర్ సింగ్ బాజీరావు పాత్రలో రాజసంతో కనిపిస్తుండగా, ఆయన భార్య కాశీబాయిగా అమాయకత్వం, భావోద్వేగం మేళవించిన పాత్రలో ప్రియాంకచోప్రా, బాజీరావు ప్రియురాలు మస్తానీగా దీపికా పదుకొణె నటించిన విషయం అందరికీ విదితమే. -
మహేశ్‌బాబుకు థాంక్స్ చెప్పిన దీపిక!
బాలీవుడ్ భామ దీపికా పదుకొనే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు థాంక్స్ చెప్పింది. తన తాజా సినిమా 'తమాషా' హిట్టవ్వడంతో ఆనందంగా ఉన్న దీపిక.. మహేశ్‌బాబుతో కలిసి నటించేందుకు గతంలో ఆసక్తి కనబర్చింది. తెలుగు హీరోల్లో తన ఫేవరెట్ స్టార్ మహేశ్‌బాబు అని ఆమె ఓసారి చెప్పింది కూడా. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేశ్‌బాబు ' ఒకప్పుడు నా ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి. ఇప్పుడు మాత్రం దీపికా పదుకొనే. ఆమె అద్భుతమైన నటి. 'పీకూ'లో ఆమె నటన చూసి ముగ్ధుడిన్నయాను. ఆమె చాలా అందంగా ఉంటుంది. దానికితోడు అలాంటి నటన కూడా ప్రదర్శించడం చాలా గొప్ప విషయం' అని చెప్పారు. దీంతో మహేశ్ ప్రశంసలతో కదిలిపోయిన దీపిక ఆయనకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. 'తమాషా' చిత్రంలో దీపిక అద్భుతమైన నటనను ప్రశంసిస్తూ ఆమెకు వ్యక్తిగతంలో మహేశ్ కాల్ చేసినట్టు తెలిసింది. దీపిక ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ 'బాజీరావు మస్తానీ'లో నటిస్తుండగా.. మహేశ్‌బాబు 'బ్రహ్మోత్సవం' వచ్చే ఏడాది ప్రేక్షకులను పలుకరించనుంది. -
డబ్‌స్మాష్‌తో స్మాష్ చేసిన మెగాస్టార్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మొట్ట మొదటి సారిగా డబ్స్మాష్ వీడియోతో సంచలనం సృష్టించారు. తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మ్యాజిక్ చేశారు. హీరో కోసం చేసిన డబ్స్మాష్ వీడియో.. నెటిజన్లను కట్టిపడేస్తోంది. అమితాబ్ చేస్తున్న 'ఆజ్ కీ రాత్ హై జిందగీ' టెలివిజన్ షో సెట్లో తన కోసం డబ్ స్మాష్ చేయాలని రణవీర్ అడగ్గానే ఓకే చెప్పేశారు బిగ్ బి. దీంతో రణవీర్ తెగ సంబరపడిపోతున్నాడు. వెంటనే బాజీరావు మస్తానీ సినిమా కోసం తామిద్దరం కలిసి చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లెజెండ్, బిగ్ బి నాకోసం డబ్స్మాష్ చేశారు... ఇపుడు ఇదే పెద్ద పురాణ గాధ.. అంటూ రణవీర్ ట్వీట్ చేశాడు. బాజీరావు మస్తానీ మూవీ డైలాగ్‌తో కూడిన ఈ వీడియో ఇపుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. బాజీరావు నే మస్తానీ సే ప్యార్ కీ హై అయ్యాషీ నహీ.. అంటూ సాగే ఈ 6 సెకన్ల వీడియో ఇపుడు వైరల్ అయింది. కాగా 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్యపు అధినేత బాజీరావు చరిత్ర ఆధారంగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలీ రూపొందిస్తున్న హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీ. ఓటమి ఎరుగని మరాఠా యోధుడు బాజీరావుగా రణవీర్ సింగ్, మస్తానీగా దీపిక, కాశీభాయ్గా ప్రియాంక నటించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ కూడా అంచనాలను మరింతగా పెంచేసింది. అదిరిపోయే యుద్ధ సన్నివేశాలతో భన్సాలీ వెండితరపై అద్భుతంగా మలుస్తున్న ఈ మూవీ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. Now this .. is Epic !!! :))) the Biggest 'B' of all @SrBachchan #BajiraoMastani pic.twitter.com/AUhO1OJslC — Ranveer Singh (@RanveerOfficial) November 25, 2015 -
బాజీరావ్ మస్తాని సందడి
-
ఒక్కపైసా తీసుకోకుండా ఆ సినిమా చేశాడా!
'బాజీరావు మస్తానీ'.. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అత్యంత భారీ సినిమా. ఆయన ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత కఠినమైన పాత్ర ఇదే అవుతుందని భావిస్తున్నారు. దర్శకుడు సంజయ్‌లీలా భన్సలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలో టైటిల్ రోల్ బాజీరావు పాత్రను రణ్వీర్ సింగ్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా దూసుకుపోతున్నది. మరాఠా సామ్రాజ్య వైభవానికి వెండితెర దృశ్యరూపంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి మరో వార్త తాజాగా హల్చల్ చేస్తున్నది. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి పారితోషికం కూడా రణ్వీర్ సింగ్ తీసుకోలేదట. నిర్మాతల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా రణ్వీర్ ఈ పాత్ర పోషించారని, పారితోషికానికి బదులు ఆయన సినిమా లాభాల్లో వాటా తీసుకోవడానికి మొగ్గు చూపారని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అత్యంత భారీతనంతో, చారిత్రక ప్రేమకథగా రూపొందిన 'బాజీరావు మస్తానీ' బడ్జెట్ రూ. 130 కోట్లకుపైనని తెలుస్తున్నది. నిజానికి ఇటీవల చాలామంది బాలీవుడ్ నటులు పారితోషికానికి బదులు సినిమా లాభాల్లో వాటాలకే ప్రాధాన్యమిస్తున్నారు. హీరోలు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్దేవగణ్తోపాటు హీరోయిన్లు దీపికా పదుకొణే, ఐశ్వర్యరాయ్ సైతం ఇదే పంథాను అనుసరించారు. -
భన్సాలీ మ్యాజిక్ ఆఫ్ 'మస్తానీ'!
చారిత్రాత్మక ప్రణయగాథ 'బాజీరావు మస్తానీ'. మరాఠా యోధుడు బాజీరావు పీష్వా, ఆయన ప్రియురాలు మస్తానీ మధ్య సాగిన ప్రేమకథను అత్యంత భారీస్థాయిలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా 'ట్రైలర్' అద్భుతంగా ఉండి.. చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరాఠా సామ్రాజ్య వైభవం వెండితెర దృశ్యరూపంగా భన్సాలీ ఈ సినిమాను మలిచారు. ఇందులో రణ్వీర్ సింగ్ బాజీరావు రాజసంతో కనిపిస్తుండగా, ఆయన భార్య కాశీబాయిగా అమాయకత్వం, భావోద్వేగం మేళవించిన పాత్రలో ప్రియాంకచోప్రా నటించారు. బాజీరావు ప్రియారాలి మస్తానీగా దీపికా పదుకొణె అడుగడుగునా తన అందంతో మెరిసిపోయింది. మూడు నిమిషాల నిడివిగల ఈ సినిమా ట్రైలర్లో అడుగడుగునా భన్సాలీ భారీతనాన్ని చూడవచ్చు. వచ్చే ఈ నెల 18న సినిమా ప్రేక్షకులను పలుకరించనుంది. -
'నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం'
పుణె : వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించే నిమజ్జనం ఊరేగింపు వేడుకలలో డ్యాన్స్ చేయడం తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చెప్పాడు. ఆ సమయంలో నన్ను నేను నియంత్రించుకోలేక పలు గణేష్ విగ్రహాల వద్ద డ్యాన్స్ చేస్తుంటానని తెలిపాడు. 'బాజీరావ్ మస్తానీ' మూవీలో బాజీరావ్ క్యారెక్టర్లో ప్రస్తుతం రణవీర్ నటిస్తున్న విషయం విదితమే. పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. బాజీరావ్ చాలా గొప్ప వ్యక్తి అని, ఆ పాత్రకు నన్ను ఎంపిక చేయడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పాడు. బాజీరావ్ పాత్రకు న్యాయం చేసేందుకు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తానన్నాడు. దశాబ్దకాలంలో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుందని, అందుకోసం ఇతర మూవీలను కొన్ని వదులుకున్నట్లు తెలిపాడు. 'బాజీరావ్ మస్తానీ' పేరుతో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మస్తానీగా కనిపించనుంది దీపిక. దీవానీ మస్తానీ అనే పాట కోసం దర్శకుడు ఏకంగా ఓ గ్లాస్ పాలెస్ సెట్ ఏర్పాటు చేయించాడని తెలిపాడు. ప్రేయసి దీపికా అందాలను మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు ఈ మహల్ తోడ్పడుతుందన్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక కాశీబాయ్గా కనిపిస్తోంది. బాజీరావ్ మరాఠా ప్రాంతానికి చెందిన రాజు మాత్రమే కాదు.. గొప్ప వ్యక్తి కూడా అంటూ ఆ పాత్ర పోషిస్తున్న రణవీర్ ముచ్చటించాడు. -
హీరోయిన్ను మేకప్ వేసుకోవద్దన్న డైరెక్టర్
హిందీ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరోయిన్ దీపిక పదుకొనే. నటనతో పాటు గ్లామర్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యూటీని, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. దీపిక ప్రస్తుతం బన్సాలీ దర్శకత్వంలో ఓ చారిత్రక చిత్రంలో నటిస్తుంది. 'బాజీరావ్ మస్తానీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మస్తానీగా కనిపించనుంది దీపిక. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కావటంతో అప్పటి పరిస్థితులను సహజంగా చూపించటం కోసం నటీనటులకు మేకప్ వద్దంటున్నాడట దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. నటుల వరకు ఈ నిబంధన ఓకే కానీ నటీమణులు విషయంలో కూడా ఇదే కండిషన్ పెట్టడంతో దీపిక లాంటి గ్లామర్ స్టార్స్ ఇబ్బంది పడిపోతున్నారు. అందాల రాణులుగా తమను చూస్తున్న ఆడియన్స్ మేకప్ లేకుండా చూస్తే అంగీకరించరేమో అని భయపడుతుంది దీపిక. బాజీరావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక కాశీబాయ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న 'బాజీరావ్ మస్తానీ' సినిమాను డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. -
బాజీరావ్ ఎలా ఉంటాడు?
బాజీరావ్ ఎలా ఉంటాడు? ఆయన మొదటి భార్య కాశీభాయ్ ఎలా ఉంటుంది? రెండో భార్య మస్తానీ ఎలా ఉంటుంది? కొన్ని రోజులుగా హిందీ రంగంలో సాగిన ఈ ప్రశ్నలకు బుధవారం సమాధానం లభించింది. మరాఠా పెషావర్ బాజీరావ్, ఆయన భార్యలిద్దరి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చారిత్రక చిత్రం - ‘బాజీరావ్ మస్తానీ’. స్వీయ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాజీరావ్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తుంటే, మొదటి భార్య పాత్రను ప్రియాంకా చోప్రా, రెండో భార్య పాత్రను దీపికా పదుకొనే పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వీరి గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంది. బుధవారం విడుదల చేసిన రణ్వీర్, ప్రియాంక, దీపికల లుక్ చూసి, ‘ముగ్గురూ ముచ్చటగా ఉన్నారు’ అని అందరూ కితాబిచ్చారు. ఈ సినిమా కోసం రణ్వీర్ జుత్తు త్యాగం చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రియాంక, దీపికలు కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారట. మొత్తం మీద చరిత్ర నేపథ్యంలో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా చరిత్ర సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 120 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కానుంది. -
పాత్ర కోసం గుండు కొట్టించిన బాలీవుడ్ నటుడు!
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'డ్రీమ్ ప్రాజెక్ట్' 'బాజీరావ్ మస్తానీ' చిత్రం కోసం బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ గుండు కొట్టించుకున్నాడు. పాత్ర కోసం రణవీర్ గుండు చేయించుకోవడానికి ఓకే చెప్పడంపై బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. బాజీరావు పాత్ర డిమాండ్ చేయడంతో ఇటీవల రణవీర్ గుండు కొట్టించుకుని వెరైటీ గెటప్ లో దర్శనమిచ్చారు. సరైన నటీనటులు దొరకపోవడంతో గత పది సంవత్సరాలుగా ఈ చిత్రం వాయిదాలు పడుతూ వచ్చింది. బాజీరావు మస్తానీ చిత్రంలో నటించడానికి రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనేలు అంగీకరించడంతో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. -
‘బాజీరావు మస్తానీ’ కోసం రణవీర్ కేశత్యాగం!
సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాజీరావు మస్తానీ’ చిత్రంలో పాత్ర కోసం రణవీర్‌సింగ్ కేశత్యాగం చేయనున్నాడు. పూర్తిగా ఏడాది సమయం ఈ చిత్రం కోసమే కేటాయించనున్నట్లు రణవీర్ చెబుతున్నాడు. ఏడాది వ్యవధిలో నిజానికి మూడు సినిమాలు చేయవచ్చని, అయితే, ఈ సినిమా కోసం తాను రిస్క్ చేయదలచు కున్నానని అంటున్నాడు. అక్టోబర్ నుంచి ‘మొహెంజదారో’ షూటింగ్ హృతిక్ రోషన్ హీరోగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కించనున్న ‘మొహెంజదారో’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ‘జోధా అక్బర్’ తర్వాత హృతిక్, అశుతోష్‌ల కాంబినేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ‘మొహెంజదారో’ షూటింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ఈ చిత్ర బృందం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. -
బాజీరావు కోసం బట్టతల
కొత్త సినిమా బాజీరావు మస్తానీ కోసం రణ్వీర్ సింగ్ ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఇది చరిత్రాత్మక పాత్ర కావడంతో బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మరాఠీ వీరుడు బాజీరావులా సహజంగా కనిపించడానికి గుండు కొట్టించుకోవడంతోపాటు మరాఠీ నేర్చుకుంటున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో రణ్‌వీర్‌కు జోడీగా దీపికా పదుకొణే కనిపిస్తుందని సమాచారం. బాజీరావు పీశ్వా 18వ శతాబ్దానికి చెందిన మరాఠీ రాజనీతిజ్ఞుడు. సైనిక వ్యవహారాల్లోనూ నిపుణుడిగా చెబుతారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా కూడా ముఖ్యపాత్రలో కనిపిస్తుందట. దీపిక, ప్రియాంక నటిస్తున్నప్పటికీ, వీరిద్దరిలో మస్తానీ పాత్ర ఎవరు చేస్తారో ఇప్పటికీ తెలియరాలేదు. సినిమా షూటింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలీవుడ్వర్గాలు చెబుతున్నాయి. ‘బాజీరావు పాత్ర కోసం నేను మరాఠీ భాష, గుర్రపుస్వారీ నేర్చుకున్నాను. ఆయనలా మాట్లాడేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. గుండు చేయించుకోవడమే కాదు శరీరాన్ని కూడా పాత్రకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకున్నాను. ఆయన జీవిత చరిత్ర చదివాను. సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖరు వరకు ముగుస్తుంది’ అని రణ్వీర్ వివరించాడు. భన్సాలీకి ఎంతో ఇష్టమైన ఈ కథకు హమ్ దిల్ దే చుకే సనమ్ జంట సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్‌ను ఎంచుకుందామని మొదట అనుకున్నాడు. తరువాత ఏమైందో తెలియదు కానీ రణ్వీర్ తెరమీదికి వచ్చాడు. ఇదిలా ఉంటే కరణ్ జోహార్ త్వరలో తీయబోయే శుద్ధి సినిమా కోసం రణ్వీర్, దీపిక జోడీనే ఎంచుకోవాలని అనుకున్నాడు. మనోడు మాత్రం బాజీరావువైపే మొగ్గుచూపాడు. యశ్‌రాజ్ చోప్రా బ్యానర్ తీయబోయే కిల్ దిల్, జోయా అఖ్తర్ కొత్త సినిమా దిల్ దడఖ్నేదోలోనూ రణ్వీర్ సింగే హీరో. కిల్దిల్లో పరిణీతి చోప్రా హీరోయిన్గా కనిపిస్తుంది.