Bhojpuri Actor
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ మెహర్( 40) మృతి చెందారు. అర్ధరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఒడిశాలో అతనికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. శుభకార్యం జరగాల్సిన నటుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం అర్థరాత్రి తన సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూరజ్ మెహర్ ప్రస్తుతం "ఆఖ్రీ ఫైస్లా" అనే చిత్రంలో నటిస్తున్నారు. సూరజ్ ముఖ్యంగా విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. సూరజ్ మెహర్ బిలాస్‌పూర్‌లోని సరియా గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. -
BJP: లోక్‌సభ పోటీపై పవన్ యూటర్న్
లోక్‌సభ పోరు కోసం రెండు జాబితాల్ని విడుదల చేసిన బీజేపీ.. పాతవాళ్లలో కొందర్ని తప్పించి, కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తున్నది చూస్తున్నాం. తొలి జాబితాలో సీటు దక్కినప్పటికీ తాను పోటీ చేయలేనంటూ మరుసటిరోజే ప్రకటించి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు భోజ్‌పుర్ నటుడు కమ్ సింగర్ పవన్ సింగ్. అయితే..ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమేనంటూ ప్రకటించారు. ‘‘నా తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా. ఇది నా సమాజం కోసం.. నా ప్రజల కోసం. ఇందుకు అందరి సహకారం, ఆశీస్సులు నాకు కావాలి’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. मैंअपने समाज जनता जनार्दन और माँ से किया हुआ वादा पूरा करने के लिए चुनाव लडूँगा आप सभी का आशीर्वाद एवं सहयोग अपेक्षित है जय माता दी — Pawan Singh (@PawanSingh909) March 13, 2024 బీజేపీ ఫస్ట్‌లిస్ట్‌లో పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్ టికెట్‌ను పవన్‌కు కేటాయించింది కమల అధిష్టానం. ఆ సమయంలో.. ‘బీజేపీ అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి ఆసన్సోల్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి పోటీ చేయలేను’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పవన్ సింగ్ తెలియజేశాడు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. ఇప్పుడు పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. మరి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారా?.. వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆసన్సోల్ టికెట్‌ను బీజేపీ పవన్‌కు ప్రకటించగానే.. తృణమూల్ కాంగ్రెస్ విమర్శలతో విరుచుకుపడింది. మహిళలను కించపరుస్తూ.. అసహ్యమైన రీతిలో పాటలు పాడి, నటించే వ్యక్తిని బీజేపీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెడుతోందంటూ మండిపడింది. ఇక.. ఆసన్సోల్ నుంచి టీఎంసీ బాలీవుడ్ సీనియర్ నటుడు, పొలిటీషియన్ శతృఘ్నసిన్హాను బరిలో దించింది. -
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తూ..
ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తున్నాయా? అనిపిస్తుంది! రంగుల ప్రపంచంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న కొందరు తారలు తర్వాత గుర్తుపట్టలేని స్థితికి మారిపోయారు. చేతినిండా డబ్బులుండే స్థితి నుంచి ఒకరి దగ్గర చేతులు చాచి అడగాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు. తెలుగు, తమిళం, హిందీ అని కాకుండా అన్ని భాషల్లోనూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొన్న తారలు ఉన్నారు. ఒకప్పటి ఆ సెలబ్రిటీయేనా ఇలాంటి హీనస్థితిలో ఉంది? అని అభిమానులు కళ్లు చెమర్చుకున్న రోజులున్నాయి. హీరోయిన్ మిథాలి శర్మ కూడా అందనంత ఎత్తుకు వెళుతుందనుకుంటే అందరి దగ్గర భిక్షమడిగే స్థాయికి దిగజారింది. అందుకు గల కారణాలేంటి? అసలు తనకు ఏమైంది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. ఇంటితో సంబంధం కట్ మిథాలి శర్మ.. భోజ్‌పురిలో ఫేమస్ హీరోయిన్. ఈమె స్వస్థలం ఢిల్లీ. ఎప్పటికైనా టీవీలో కనిపించాలనుకున్న ఆమె అందుకోసం ఇంటి నుంచి పారిపోయింది. ఒంటరిగా ముంబై వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడే ఆమెతో సంబంధాలు తెంచేసుకుంది మిథాలి కుటుంబం. ఇక ముంబైలో చెప్పులరిగేలా తిరిగిన మిథాలి తొలుత మోడలింగ్ చేసింది. తర్వాత సినిమాలు చేసింది, బాగానే క్లిక్ అయింది. దీంతో దర్శకనిర్మాతలు ఈమెతో సినిమా తీసేందుకు పోటీపడ్డారు. ఆ రేంజ్లో క్రేజ్ అందుకుంది. పని దొరక్క డిప్రెషన్లోకి.. కానీ, సడన్‌గా అంతా మారిపోయింది. అదృష్టం బాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందన్నట్లు తన జీవితంలో బ్యాడ్ టైమ్ మొదలైంది. తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌టాక్‌ను మూటగట్టుకున్నాయి. అవకాశాలు తగ్గిపోయాయి. చాలాకాలం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. నెలలు కావస్తున్నా పని దొరక్కపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అలాగే కూర్చుంటే కడుపు నిండదు కదా.. పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేయాలనుకుంది. అందుకే భిక్షాటన మొదలుపెట్టింది. ముంబై వీధుల్లో కనిపించినవారినల్లా నాలుగు రూపాయలు దానం చేయమని కోరింది. భిక్షాటన చేస్తూ పోలీసులకు దొరికిన హీరోయిన్ ఆ మధ్య ముంబై లోఖండ్వాలాలో భిక్షాటన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో మిథాలి శర్మ కూడా ఉంది. తన చేతికి మహిళా పోలీసు బేడీలు వేస్తుంటే మిథాలి ఆమెను తిట్టిందని, అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. చివరకు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా మిథాలి తనకు కాస్త అన్నం పెట్టమని అడిగిందట! దీంతో ఆమెకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన పోలీసులు తన మానసిక స్థితి సరిగా లేదని గ్రహించారు. దీంతో తనను మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మిథాలి శర్మ ఎక్కడుంది? ఎలా ఉంది? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. చదవండి: సినీప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు! -
ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!
భోజ్‌పురి నటుడు రవికిషన్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా ప్రతినాయకుని పాత్రలో మెప్పించాడు. హిందీలో 'ఫిర్ హేరా ఫేరీ', 'వెల్కమ్ టు సజ్జన్‌పూర్', 'ముక్కాబాజ్', 'కిక్ 2' చిత్రాల్లోనూ నటించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రవికిషన్ గోరఖ్‌పూర్ ఎంపీగా గెలిచారు. అయితే ఆయన కూతురు ఇషితా శుక్లా ఆర్మీలో చేరడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తండ్రి, కూతురిని అభినందిస్తున్నారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) ప్రస్తుతం రవి కిషన్ కూతురు ఇషిత వయసు 21 ఏళ్లు కాగా.. నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఇద్దరిని చూసి మేము గర్విస్తున్నాము.. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు అంటూ పొగుడుతున్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 26న జరిగిన పరేడ్‌లోనూ రవికిషన్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని రవికిషన్ ట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పనిచేసిన తన కూతురిని చూసి గర్వపడుతున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. ( ఇది చదవండి:ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో? ) View this post on Instagram A post shared by @varindertchawla 🇮🇳 https://t.co/Bjh3qIjTWg — Ravi Kishan (@ravikishann) June 27, 2023 मेरी बिटिया ईशिता शुक्ला ,आज सुबह बोली पापा I wanna b in #AgnipathRecruitmentScheme I said go ahead beta 🇮🇳 pic.twitter.com/BkxoOB81QQ — Ravi Kishan (@ravikishann) June 15, 2022 Being a father of an extremely diligent daughter Ishita Shukla has broken all records for me to keep head up with pride as she received award of excellence ADG, Delhi DTE out of 1500 cadets. Her training begins to serve our nation Jai Hind!!! @HQ_DG_NCC pic.twitter.com/HzU4XkTBhP — Ravi Kishan (@ravikishann) January 30, 2022 -
హోటల్ రూంలో శవమై కనిపించిన దర్శకుడు
ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం ఓ హోటల్లో బస చేసిన దర్శకుడు శవమై కనిపించారు. వివరాల ప్రకారం.. భోజ్‌పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారీ ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో షూటింగ్ కోసం మూవీ టీం అందరితో కలిసి ఓ హోటల్లో బసచేశారు. అయితే ఉదయం ఎంత పిలిచినా స్పందించికపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు బద్దలుకొట్టగా అప్పటికే తివారీ మృతిచెందారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. -
ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
మహారాష్ట్రలోని పుణె పోలీసులు భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. పుణేలోని వాకాడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న భారీ వ్యభిచార రాకెట్‌ను ఛేదించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటితో సహా ఓ మోడల్, ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) వ్యభిచార ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం హోటల్‌పై దాడులు నిర్వహించారు. వారిలో ఒకరు మోడల్, మరొకరు భోజ్‌పురి నటిగా పోలీసులు గుర్తించారు. వీరు మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పింప్రీ, చించ్వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర చవాన్ వార్నింగ్ ఇచ్చారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) ఇన్స్పెక్టర్ దేవేంద్ర మాట్లాడుతూ..' ఫైవ్ స్టార్ హోటల్లో ఏజెంట్‌తో కలిసి భోజ్‌పురి నటి, మోడల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. మేం వెంటనే ఓ డమ్మీ కస్టమర్‌ను అక్కడికి పంపాం. ఏజెంట్‌ను ఆన్లైన్ ద్వారా సంప్రదించాం. ఏజెంట్.. డమ్మీ కస్టమర్‌ని ఫైవ్ స్టార్ హోటల్లో గదిని బుక్ చేయమని చెప్పాడు. నటి, మోడల్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతే అటాక్ చేశాం.' అని వెల్లడించారు. -
బుల్లితెర నటి సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!
బుల్లితెర నటి ఆకాంక్ష దూబే హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భోజ్‌పురికి చెందిన నటి వారణాసిలో షూటింగ్‌కు వెళ్లి అక్కడే బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటి ఆకాంక్ష దూబే తాను చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ వీడియోలో తన చావుకు కారణమైన వ్యక్తి వివరాలను వెల్లడించింది. ఆకాంక్ష దూబే ఏడుస్తూ.. 'నాకు ఏం జరిగినా దీనంతటికీ సమర్ సింగే కారణం. నా చావుకు కారణం అతడే' అంటూ తన బాధను వెల్లడించింది. కాగా.. 25 ఏళ్ల ఆకాంక్ష దూబే ముజ్సే షాదీ కరోగి , వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్ సమర్ సింగ్‌తో ప్రేమలో పడిన ఆమె.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌కు గురైన ఆకాంక్ష చాలా రోజుల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. भोजपुरी एक्ट्रेस आकांक्षा दुबे का एक नया वीडियो आया सामने.इसमे वह रोते हुए अपने साथ कुछ भी गलत होने पर समर सिंह को जिम्मेदार बता रही.#AkanshaDubeySuicide #UPPolice #SamarSingh #Jaunpur #Varanasi #akanshadubey #CMYogi pic.twitter.com/tcP5fzSjqF — Sri Kant Chaturvedi (@SriChatur007) April 19, 2023 -
నటి ప్రైవేట్ వీడియో లీక్, ఎప్పుడు గర్భం దాల్చావంటున్న నెటిజన్లు
నటీనటులు వేసుకునే మేకప్, డ్రెస్సింగ్ అనేది వారికి నచ్చితే సరిపోదు.. చూసేవాళ్లకు కూడా నచ్చాలి! లేదంటే నెటిజన్లు నోరేసుకుని పడిపోతారు. అదేం డ్రెస్సు, నీకేది దొరకలేదా? సరిగ్గా మేకప్ వేసుకోవడం కూడా రాదా? కనీసం ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియదా? అని తిట్టిపోస్తారు. అందుకే నలుగురిలోకి వచ్చేటపుడైనా, కెమెరా ముందు నిలబడే ముందైనా అందంగా రెడీ అవ్వాల్సిందే! లేదంటే తిప్పలు తప్పవు. ఇక అందం కోసం, ఆకృతి కోసం డైటింగ్ సరే సరి! ఏమాత్రం బొద్దుగా కనిపించినా నానార్థాలు తీస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు. అందుకు ఇప్పుడు చెప్పుకునే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. భోజ్‌పురి నటి త్రిష కర్ మధు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నేను నీ సొంతం కాదు అని దీనికి క్యాప్షన్ జత చేసింది. ఇందులో ఆమె బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ శారీలో మెరిసింది. అయితే ఈ ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. ఇంకేముంది, ఇది చూసిన నెటిజన్లు ఏంటి? అంత లావయ్యావు. అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యావా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా గతేడాది త్రిష కర్ మధుకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో లీకైంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దయచేసి ఆ వీడియోను డిలీట్ చేయాలని అభ్యర్థించింది నటి. ఈ వీడియో దుమారం ముగిసిన తర్వాత తిరిగి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తోంది త్రిష. View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) -
నటి సూసైడ్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భోజ్ పురి ఫేమస్ నటి అయిన ఆకాంక్ష వారణాసిలోని ఓ హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. షూటింగ్లో భాగంగా ఓ హోటల్లో బస చేసిన ఆమె అక్కడే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.చనిపోయే ముందు కూడా ఫాలోవర్స్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించిన ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఆకాంక్ష దుబే పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆమె కడుపులో 20 మీ.లీ. గుర్తు తెలియని లిక్విడ్‌ని గుర్తించారు. అలాగే ఆమె మణికట్టుపై కూడా గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆకాంక్ష దుబేది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో ప్రేమలో ఉంది. ఆకాంక్ష మరణానంతరం సమర్ సింగ్‌తో పాటు అతని సోదరుడు సంజయ్ సింగ్ పరారీలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. -
నెట్టింట లీక్ అయిన హీరోయిన్ ప్రైవేట్ వీడియో
సోషల్ మీడియా వాడకం పెరిగాక హీరోయిన్ల ప్రైవసీ అంశం కాస్త కష్టతరమైందనే చెప్పొచ్చు. సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలు ఆన్లైన్లో దర్శనవ్వడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఓ ప్రముఖ నటి అక్షరాసింగ్కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట లీక్ అయ్యింది. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన అక్షరా సింగ్ ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉంది. అయితే సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న అక్షరా సింగ్‌కు సంబంధించి గతంలో ఎంఎంఎస్ వీడియో సోషల్ మీడియాలో బయటికొచ్చిన సంగతి తెలిసిందే.అప్పుడు తన పరువును బజారున పడేయడానికే ఎవరో కావాలనే ఇలా మార్ఫింగ్ చేశారంటూ క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి ఆమె ప్రైవేట్ వీడియో లీకయ్యింది. దీంతో ఆమెను చాలామంది నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోస్తున్నారు. దీనిపై అక్షరాసింగ్ ఏమైనా వివరణ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
నటి సూసైడ్ కేసు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
భోజ్‌పురి నటి ఇటీవల వారణాసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు ముందే ఓ వీడియో సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే నటి ఆత్మహత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో మరో వ్యక్తి కూడా నటితో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతను ఎవరన్నదానిపై ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మార్చి 26న ఆకాంక్ష తన హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇప్పటికే ఆమె సూసైడ్ చేసుకున్న రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె హోటల్ గదిలో 17 నిమిషాల పాటు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మిస్టరీ మ్యాన్ ఆకాంక్షతో పాటే ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అతని ముఖం ఆ వీడియో ఫుటేజీలో తగినంత స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కాగా.. ఆకాంక్ష దుబే 'లైక్ హూన్ మై నాలైక్ నహిన్' చిత్రం షూటింగ్ కోసం వారణాసిలోని ఒక హోటల్లో బస చేసింది. ప్రియుడిపై కేసు నమోదు ఆకాంక్ష మరణానంతరం ఆమె ప్రియుడు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తల్లి కేసు పెట్టింది. సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని, అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి తన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుంచి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Exclusive CCTV footage of Bhojpuri actress Akanksha Dubey surfaced, in the video the actress is seen with Sandeep Singh. Look #AkanshaDubey #AkanshaDubeySuicide #CCTVFootage #bhojpuriactress https://t.co/b9kotfX75c pic.twitter.com/fbtQzCitSr — Siraj Noorani (@sirajnoorani) March 31, 2023 -
ఆత్మహత్యకు కొద్ది గంటల ముందు వెక్కివెక్కి ఏడ్చిన నటి
యువ నటి ఆకాంక్ష దూబే(25) ఆత్మహత్యతో భోజ్‌పురి చిత్రసీమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లిన ఆమె ఆదివారం అక్కడి హోటల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఇంత చిన్నవయసులో బలవన్మరణానికి పాల్పడేంత కష్టం ఏమొచ్చిందంటూ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే తను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్‌కి వచ్చింది నటి. ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన ఆమె దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ కంటతడి పెట్టుకుంది. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఇది సూసైడ్ కాదని తనను మెంటల్ టార్చర్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో ప్రేమలో ఉంది. తనతో ఉన్న ఫోటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన కెరీర్ విషయానికి వస్తే.. మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది ఆకాంక్ష. ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్టుల్లో నటించింది. Bhojpuri actress Akanksha Dubey committed suicide in a hotel in Banaras.. Last night live video viral on #socialmedia..#Varanasi #Bhojpuri #AkankshaDubey #akankshadubey #viral #viralnews #Sarnath #bhojpuriactress #bhojpuri #varanasipolice #Varanasi #UPPolice pic.twitter.com/yuwt6v6Kdg — BOBBY UPPAL 🇮🇳🛡⚔️⚖️ (@ibobbyuppal) March 26, 2023 This is Bhojpuri actress Akanksha Dubey, She committed suicide in a hotel in Varanasi today morning Yesterday late night Akanksha came live on Instagram, at that time she was crying What’s even happening? Why people are giving their life on petty things?pic.twitter.com/RZUyoOwJRE — Dr Nimo Yadav (@niiravmodi) March 26, 2023 NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com -
పవర్ స్టార్ పవన్ సింగ్‌పై రాళ్లదాడి.. అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైవ్ షోలోనే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. భోజ్ పురి ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సింగ్ నటుడిగానే కాకుండా గాయకుడిగానూ అలరిస్తున్నారు. తాజాగా ఈయన హోళి సందర్భంగా యూపీలో యూపీలోని బల్లియా జిల్లాలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో లైవ్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా జనాల్లో నుంచి ఒకరు రాయి విసిరారు. అది నేరుగా పవన్ సింగ్ ముఖానికి తగిలింది. ఆ పని ఎవరు చేశారు అని చూసేలోపే గుంపులోంచి మరికొంతమంది పవన్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన పవన్ సింగ్.. గుంపులో ఉండి రాళ్లు విసరడం కాదు.. దమ్ముంటే నా ముందుకు వచ్చి నాపై రాళ్లు విసరండి అంటూ సవాల్ విసిరారు. ఊహించని ఈ పరిణామం నేపథ్యంలో ఈవెంట్ మేనేజర్లు వెంటనే ఈవెంట్‌ను ఆపేశారు. పవన్ సింగ్ ముఖానికి స్వల్పగాయమైనట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. पवन सिंह के लाइव शो में चला पत्थर#pawansingh #pawansinghbaliashow pic.twitter.com/TQSj6cO6bx — Ravi Kant Mishra (@ravimishravats) March 7, 2023 -
ప్రైవేట్ వీడియో లీక్.. కెరీర్ నాశనమైందన్న నటి
ఒకప్పుడు అభిమాన తారలను వెండితెరపై చూసి సంబరపడిపోయేవాళ్లు.. కానీ సోషల్ మీడియా వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు యాక్టర్స్. నటీమణులైతే తమ ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను పంచుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాంటి వారిలో భోజ్‌పురి నటి ప్రియాంక పండిత్ కూడా ఒకరు. గ్లామరస్ ఫోటోస్‌తో అభిమానులను అల్లాడిస్తుంది ప్రియాంక. కానీ గతేడాది ఆమె పేరిట ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. తనే కాదు, చాలామంది భోజ్‌పురి నటీమణుల పోర్న్ వీడియోలు నెట్టింట లీకయ్యాయి. కానీ ఎవరూ బయటకు వచ్చి దాన్ని ఖండించలేదు. అయితే ప్రియాంక మాత్రం దాన్ని ఎంతమాత్రం సహించలేదు. ఆ వైరల్ వీడియోల్లో ఉన్నది తాను కాదని, అనవసరంగా తన ప్రతిష్ట దిగజార్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నా ఇమేజ్ను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. దీనివల్ల నా కెరీర్ నాశనమైంది' అని ఆవేదన వ్యక్తం చేసింది. దిల్ మత్ దేనా మేరీ సౌతాన్ కో, బెహనోజీ, మేరే ప్యార్ కో తుమ్ భులాతో న డోగే, పోలీస్గిరి వంటి చిత్రాలు చేసింది ప్రియాంక. చదవండి: నా పెళ్లి సంబంధాలు చెడగొట్టారు: పోసాని కృష్ణమురళి హీరోతో లవ్ బ్రేకప్.. నోరు విప్పిన హీరోయిన్ -
స్టార్ హీరోపై నటి తీవ్ర ఆరోపణలు.. ‘నన్ను లైంగికంగా వేధించాడు’
ఓ స్టార్ హీరోపై నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్‌పై నటి యామిని సింగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ సింగ్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా భోజ్‌పూరి నటి అయిన యామిని సింగ్ అక్కడ స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె పవన్ సింగ్ లేటెస్ట్ మూవీ బాస్‌లో నటించే చాన్స్ అందుకుంది. ఇటీవల సెట్‌పై వెళ్లిన ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే సడెన్‌గా ఆమెను ఈ సినిమా నుంచి తొలగించినట్లు ఇటివల వార్తలు వచ్చాయి. చదవండి: నా పిచ్చికి, బాధకు ఇదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్ ఆమె తీరు నచ్చకే ఈ సినిమాలో నుంచి తొలగించారంటూ రకరకాలు పుకార్లు వినిపించాయి. తాజాగా తనపై వస్తున్న రూమార్స్‌పై యామిని సింగ్ స్పందించింది. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. పవన్ సింగ్‌తో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. ఆయన సినిమాల్లో లేడీ యాక్టర్స్‌కు సరైన పాత్రలు ఉండవని చెప్పింది. అదే విధంగా ‘పవన్ సింగ్ తన సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలోనే అందరు అనుకుంటున్నారు. చదవండి: కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్ కానీ అది నిజం కాదు. బాస్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది డైరెక్టర్ అరవింద్ చౌబే. ఈ సినిమా నుంచి నన్ను ఎవరు తీసేయలేదు. నేనే తప్పుకున్నా. పవన్ చాలా మంచి నటుడు అని ఈ సినిమా ముందు వరకు అనుకున్నాను. కానీ అతడు అసలు స్వరూపం తర్వాత బయటపడింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రావాలని చెప్పాడు. అయితే రాత్రి అయ్యింది నేను రాలేనని చెప్పాను. దీంతో అతడు సినిమా చేయాలని ఉందా? లేదా? అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నువ్వు నటించాలంటే ఇప్పుడు రావాల్సిందే అంటూ బెదిరించాడు. ఇక నేను కాల్ కట్ చేసి సినిమా నుంచి తప్పుకున్నాను’ అంటూ యామిని చెప్పుకొచ్చింది. -
ముచ్చటగా మూడోసారి తండ్రైన ప్రముఖ నటుడు.. ట్వీట్ వైరల్
భోజ్‌పూరి నటుడు, ఎంపీ మనోజ్ తివారి ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. సోమవారం ఆయన భార్య సురభి తివారీ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వార్త విన్న అభిమానులు మనోజ్ తివారికి అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్లో ఆయన రాస్తూ..' లక్ష్మి తర్వాత సరస్వతి మా ఇంటికి వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందమైన చిన్నారి జన్మించింది. మా పాపను మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇట్లు సురభి-మనోజ్ తివారి' అంటూ పోస్ట్ చేశారు. మనోజ్ తివారి ప్రస్తుతం భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా.. గత నెలలో మనోజ్ భార్య సురభి తివారీ బేబీ షవర్‌ని(సీమంతం) నిర్వహించారు. సురభి- మనోజ్ తివారీకి రెండో భార్య కాగా.. వీరికి 2020లో కూతురు జన్మించింది. అంతకు ముందే రాణి తివారీని 1999లో వివాహం చేసుకోగా.. వారికి రితి అనే కుమార్తె ఉంది. बड़े हर्ष के साथ सूचित करना है कि मेरे घर में लक्ष्मी के बाद सरस्वती का आगमन हुआ है..आज घर में प्यारी सी बिटिया पैदा हुई है.. उसपे आप सभी का आशीर्वाद बना रहे.. सुरभि-मनोज तिवारी pic.twitter.com/JJj1H82XEr — Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) December 12, 2022 -
ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడుగుతూ అసభ్యంగా..
బిగ్‌బాస్ షో వల్ల కంటెస్టెంట్లు మరింత పాపులర్ అవుతుంటారు. కానీ ఓ వ్యక్తి వల్ల కొద్ది రోజులుగా హిందీ బిగ్‌బాస్ షో పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. బిగ్‌బాస్ 16 వ సీజన్లో అడుగుపెట్టిన సాజిద్ ఖాన్‌పై పలువురు సెలబ్రిటీలు విరుచుకుపడుతున్నారు. షెర్లిన్ చోప్రా, కనిష్క సోని సహా పలువురు.. అతడు చేసిన అరాచకాలను బయటపెడుతూ వెంటనే సాజిద్‌ను బయటకు పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి రాణి చటర్జీ తన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. "హిమ్మత్వాలా సినిమా షూటింగ్లో సాజిద్‌ను మొదటి సారి కలిశాను. తర్వాత ఓసారి ఆయన తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఈ మీటింగ్ మనిద్దరి మధ్యే అని, నా మేనేజర్‌ను వెంటపెట్టుకుని రావొద్దని ఫోన్లో చెప్పాడు. బాలీవుడ్లో అతడు పెద్ద డైరెక్టర్, అందుకని నేను ఆయన చెప్పినట్లు చేశాను. జుహులో ఆయన ఇంటికి ఒంటరిగా వెళ్లాను. ఢోకా ఢోకా ఐటమ్ సాంగ్ కోసం నన్ను సెలక్ట్ చేసిశాడన్నాడు. ఆ పాటలో నేను పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుందని చెప్తూ నా కాళ్లు చూపించమన్నాడు. ఆయన ఉద్దేశం అర్థం కాక అతడు చెప్పింది చేశా. ఆ వెంటనే ఆయన నా చుట్టు కొలతలు అడుగుతూ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? మీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారా? అని అభ్యంతరకరమైన ప్రశ్నలు వేశాడు. నన్ను అసభ్యంగా తాకాలని ప్రయత్నించాడు. ఈ విషయం బయటకు చెప్తే ఎక్కడ నన్ను ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తారోనన్న భయంతో ఇంతవరకు నోరు మెదపలేదు " అని చెప్పుకొచ్చింది రాణి చటర్జీ. చదవండి: ప్రపంచంలో అందమైన భామలు.. అందులో దీపికా యాంకర్‌కే కౌంటర్లు ఇచ్చిన సుదీప -
నెట్టింట ఎంఎంఎస్ వీడియో లీక్.. స్పందించిన నటి
బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన భోజ్‌పురి నటి అక్షర సింగ్. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఈమె గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. కొన్నిరోజుల క్రితం ఓ వ్యక్తితో రూమ్‌లో అశ్లీలంగా కనిపించిన అక్షర సింగ్ ఎంఎంఎస్ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను చాలామంది నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోశారు. అయితే తాజాగా ఆ వీడియోపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమె స్పందించింది. ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఎవరో నా ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఆ పని ఎవరు చేశారు అని కూడా నేను పట్టించుకోను ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. ఇప్పటివరకు నేను ఆ వీడియోను చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నామీద ఎవరో కోపంతో ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉంటారు. కానీ ఇవి నన్ను ఏమాత్రం బాధించలేవు అంటూ చెప్పుకొచ్చింది. -
పేడను ఒళ్లంతా రుద్దుకున్న నటి
భోజ్‌పురి సెన్సేషన్, బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ మోనాలిసాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తన ఫొటోలు, డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుందీ నటి. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఆమె తన శరీరం మొత్తానికి ఆవుపేడ పూసుకుంది. ముఖంతో సహా బాడీ అంతటికీ పేడను దట్టంగా పట్టించింది. అయితే పేడ రుద్దడంతో ఆమెకు దురద మొదలవగా దాన్ని భరించలేక మెలికలు తిరిగిపోయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఇదేదో కామెడీ షోలో యాక్టింగ్ చేసినట్లుగా ఉందంటూ ఛలోక్తులు విసురుతున్నారు. కాగా బిగ్‌బాస్‌తో పాటు నాచ్ బలియే డ్యాన్స్ షోలో పాల్గొన్న మోనాలిసా.. ఇటీవల స్మార్ట్ జోడీ అనే షోలో తన భర్త విక్రాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి పాల్గొంది. ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. వెండితెరపై తాను పోషించిన పాత్రలు చూసి జనాలు తనను అసహ్యించుకునేవారని తెలిపింది. ఇదిలా ఉంటే ఆమె రాత్రి కే యాత్రి 2 అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది త్వరలో హంగామా ప్లే అనే ఓటీటీలో ప్రసారం కానుంది. చదవండి: వాళ్లిద్దరూ నా షోలో ఎప్పటికీ అడుగు పెట్టరు మళ్లీ పెళ్లి చేసుకోనున్న మేఘనా సర్జా? -
నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్
Bhojpuri Actor Pawan Singh Divorce Case: భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్, ఆయన భార్య జ్యోతి సింగ్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని అరా ఫ్యామిలీ కోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 9, 2021న పవన్ విడాకుల కోసం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు మే 26కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని సూచించింది. అయితే ఈ విచారణ ఏప్రిల్ 28న జరగాల్సింది. కానీ పలు కారణాల వల్ల పవన్ సింగ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో మే 26కు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇంతకుముందు విడాకుల గురించి పవన్ మాట్లాడుతూ 'నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు. నాకు తనతో జీవించడం ఇష్టం లేదు. డివోర్స్ కావాలి.' అని తెలిపాడు. దీతో అతడి భార్య జ్యోతిసింగ్ కూడా పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక జ్యోతిసింగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ 'జ్యోతికి పవన్ సింగ్ రెండు సార్లు అబార్షన్ చేయించారు. పెళ్లయిన తర్వాత నిత్యం భార్యను కొట్టడంతోపాటు చిత్రహింసలు పెట్టేవాడు. అదితట్టుకోలేక గత కొన్ని నెలలుగా జ్యోతిసింగ్ తన తల్లి ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి పవన్ సింగ్ నుంచి విడాకులతోపాటు మధ్యంతర భరణం కూడా ఇప్పించాలి' అని కోర్టును కోరారు. చదవండి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్.. ఇదిలా ఉంటే పవన్ సింగ్ మొదటి భార్య నీలం సింగ్ మనస్పర్థల కారణంగా మార్చి 8, 2015న ముంబైలోని ఒక ఫ్లాట్‌లో ఆత్యహత్య చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకు పాపులర్ నటి అక్షరా సింగ్‌తో పవన్ సింగ్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. మార్చి 7, 2018న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన జ్యోతిసింగ్‌ను వివాహం చేసుకుని అందరిని షాక్‌కు గురి చేశాడు పవన్ సింగ్. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ -
డ్రగ్స్ తీసుకునేవారితో నాపై యాసిడ్ అటాక్!: బిగ్‌బాస్ కంటెస్టెంట్
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్, భోజ్‌పురి ఫేమ్ అక్షర సింగ్ ఈ మధ్యే వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో షో నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి వల్ల నరకం చూశానని చెప్పుకొచ్చింది. తనపై యాసిడ్ దాడి చేయించేందుకు అతడు కుట్ర పన్నాడని, కెరీర్ నాశనం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నించాడని చెప్తూ కన్నీటిపర్యంతమైంది. 'ఒకరోజు రోడ్డుపై ఒంటరిగా వెళ్తుండగా కొందరు యాసిడ్ బాటిళ్లతో నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వీధుల్లో డ్రగ్స్ తీసుకునేవారిని నాపై దాడి చేసేందుకు నియమించాడు. అంతే కాదు, నా కెరీర్‌ను నాశనం చేస్తానని, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టనని మాజీ ప్రియుడు తరచూ బెదిరించేవాడు. దీంతో నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కానీ నా తండ్రి మాటలు నాలో కొత్త ధైర్యాన్ని నింపాయి. గతాన్ని మర్చిపోయి పరిస్థితులతో పోరాడమని, ఈ పోరాటంలో నా వెంట ఉంటానంటూ బతికి చూపించమన్నాడు. ఆయన చెప్పిన మాటలతో మానసికంగా బలాన్ని కూడదీసుకున్నాను. ఇక అప్పటినుంచి ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. కానీ నా జీవితంలో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులు ఏ అమ్మాయికి ఎదురవకూడదని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: Bigg Boss: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన శిల్పా సోదరి ఇండస్ట్రీలో అవకాశాల గురించి మాట్లాడుతూ.. 'పరిశ్రమ నుంచి నాకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొందరు నన్ను ఓదార్చడానికి వచ్చారు.. కానీ నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అందుకే నాకిలా జరుగుతోందని చెప్పారే తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు. మొత్తం ఇండస్ట్రీ ఒకవైపు, ఒంటరిగా నేనొకవైపు ఉన్నాను. ఏ కారణం చెప్పకుండానే నాకు పనివ్వడం మానేశారు. చేతిలో ఏ పనీ లేదు. ఆ సమయంలో ముంబైలో ఎలా బతికాను అన్నది నాకు, నా కుటుంబానికి మాత్రమే తెలుసు' 'అప్పుడే మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం ప్రారంభించాను. నేను సంపాదించినదానితో పాటు అప్పు తీసుకొచ్చి మరీ దానిపై ఖర్చు పెట్టాను. ఎందుకంటే నాకిక సినిమా అవకాశాలు రావని అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ నేను సంతకం చేసిన సినిమాల్లో నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా నన్ను తీసివేశారు. అందుకే సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మొదలుపెట్టాను. దీనికి ప్రశంసలు దక్కడంతో పాటు డబ్బులు కూడా వచ్చాయి. అయితే నా పాటలు ఏ మ్యూజిక్ కంపెనీ తీసుకోకుండా నా మాజీ ప్రియుడు వారి మీద ఒత్తిడి తెచ్చాడు. నన్ను బతకనివ్వకూడదన్నది అతడి కోరిక. కానీ నేను వెనుకడుగు వేయలేదు. నేనే సొంతంగా కంపెనీ పెట్టి నా పాటలను నేనే లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాను' అని చెప్పుకొచ్చింది నటి అక్షర సింగ్. -
వైరల్ : బాయ్‌ఫ్రెండ్‌తో నటి ప్రైవేట్ వీడియో లీక్
పాట్నా : ప్రముఖ భోజ్‌పురి నటి త్రిషకర్ మధు ప్రైవేటు వీడియో లీకైంది. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నటి మధు..'దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు' అంటూ ట్వీట్ చేసింది. అయితే వీడియో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. వీడియో లీక్ వెనుక స్వయంగా నటి మధునే ఉందనే, పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికే మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉంటుందని నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా "హమ్ హై హిందుస్తానీ" అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి త్రిషకర్ మధు ఆ తర్వాత పలు ఐటెమ్ సాంగ్స్‌లో నటించి పాపులర్ అయ్యింది. -
నా సోదరుడిని కాపాడుకోలేకపోయాను: నటుడు ఎమోషనల్
ప్రముఖ భోజ్‌పురి గేయ రచయిత శ్యామ్ దేహాటి ఇటీవలే కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన భోజ్‌పురి సూపర్ స్టార్ కేసరిలాల్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో తన ప్రియ ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు శ్యామ్ దేహాటిని గుర్తు చేసుకున్నాడు. తన సోదరుడిని కాపాడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడికి భార్యాపిల్లలు ఉన్నారని, వాళ్లు సైతం కరోనాతో బాధపడుతున్నారని తెలిపాడు. శ్యామ్‌ను కాపాడుకోలేకపోయిన తాను కనీసం అతడి కుటుంబాన్ని అయినా ఆదుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో అభిమానుల మనసులను కదిలించి వేస్తోంది. కాగా కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న శ్యామ్ కొన్నాళ్ల క్రితం ఓ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడట. కానీ, అంతలోనే కరోనా బారిన పడి సోమవారం గోరఖ్‌పూర్‌లో తుది శ్వాస విడిచాడు. ఇతడి మృతి పట్ల భోజ్‌పురి ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టాప్ సెలబ్రిటీలు పవన్ సింగ్, దినేశ్ లాల్ యాదవ్, రితేశ్ పాండే, అర్వింద్ అకేలా కల్లు, రాణీ చటర్జీ, కాజల్ రాఘ్వానీ సహా పలువురు శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: క్వారంటైన్లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోలు వైరల్ -
సూసైడ్ చేసుకునేలా ఉన్నా: నటి
ప్రముఖ భోజ్‌పురి నటి రాణీ చటర్జీకి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె బుధవారం సోషల్ మీడియాలో తన ఆవేదనను వెల్లగక్కింది. అందులో ఆమె.. "ఫేస్బుక్లో ధనంజయ్ సింగ్ అనే వ్యక్తి నాపై వేధింపులకు పాల్పడుతున్నాడు. లావుగా ఉన్నావు, ముసలిదానా.. అంటూ నోటికొచ్చినట్లు పిలుస్తున్నాడు. అంతటితో ఆగకుండా చెప్పడానికి కూడా వీలు లేని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొన్నేళ్లుగా దీన్ని పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు నా వల్ల కావడం లేదు. డిప్రెషన్‌కు లోనవుతున్నాను. నేనేదైనా అఘాయిత్యం చేసుకుంటే అందుకు ధనుంజయ్ సింగే కారణం" అని పేర్కొంది. (బాస్కే సైబర్ వేధింపులు!) ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుకు ఆమె ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. ఈ విషయం గురించి నటి ఇప్పటికే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిరాశే ఎదురైంది. ధనుంజయ్ చేసిన పోస్టుల్లో నటి పేరు ప్రస్తావించకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోలేమని పోలీసులు చేతులెత్తేశారు. మరోవైపు ఈ వేధింపులతో మానసికంగా ఆందోళన చెందుతున్నానన్న నటి ఈ పరిస్థితి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకునేలా ఉన్నానని వాపోయింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధనుంజయ్ సింగ్ పోస్టుల స్క్రీన్షాట్లను సైతం ఆమె పోస్ట్ చేసింది. (బాలీవుడ్‌కీ హోమ్ డెలివరీ ) View this post on Instagram @mumbaipolice 🙏🙏🙏😭😭😭😭😭 give up A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on Jun 30, 2020 at 8:07am PDT -
సుశాంత్ మరణం అబద్ధమైతే బాగుండు
ముంబై: ‘నేను, నా కుటుంబం.. కాస్తా ప్రశాంతమైన జీవితం అంతే ఇంతకు మించి నేను కోరుకోవడం లేదు’ అంటూ భోజ్‌పురి స్టార్ హీరోయిన్ రాణి ఛటర్జీ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్ర ఒత్తిడితో అదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. అదే విధంగా రాణి, సుశాంత్ మృతిపై స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కోరుకుంటుంది ఒకటే.. నేను నా కుటుంబం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని. ఈ దశాబ్థ కాలంలో అత్యంత కలతకు గురిచేసిన సంఘటనలో సుశాంత్ మరణం ఒకటి. ఇకపై ఇలాంటి విషాద ఘటనలు జరగకూడదని ఆ దేవుడిని పార్థిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (నవంబర్‌లో పెళ్లికి సిద్ధమైన సుశాంత్) View this post on Instagram A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on Jun 14, 2020 at 10:23pm PDT అంతేగాక సుశాంత్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ ఆయన మరణించాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్న, ఆయన మరణ వార్త అబద్ధమైతే బాగుండు. WHY??????? SHUSHANT #shushantsinghrajput’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తను కూడా ఒత్తిడికి లోనయ్యాయని, ఆ సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సహయంతో మెల్లిగా ఒత్తిడి నుంచి బయటపడిగలిగానని చెప్పారు. కావున ఒత్తిడితో పోరాడుతున్న వారికి సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం రాణి భోజ్‌పురి యాక్షన్ డ్రామా 'లేడీ సింఘం'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ప్రధాన పాత్రలో కినిపించనున్నట్లు సమాచారం. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) View this post on Instagram It is getting very hard to believe that someone will say that this is not true 😭😭😭😭😭😭 RIP . WHY??????? SHUSHANT #shushantsinghrajput A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on Jun 14, 2020 at 2:18am PDT