Bigg Boss 2 Telugu
-
బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం
బిగ్‌బాస్ పలువురు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో నూతన్ నాయుడు ఒకరు. వైజాగ్‌కి చెందిన ఇతడు ఒకటి అరా సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ 2వ సీజన్లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. కుటుంబం గురించి మాట్లాడొద్దు అని కౌశల్‌తో గొడవపెట్టుకున్నది ఇతడే. ఇప్పుడు ఈయన ఇంట్లోనే విషాదం చోటుచేసుకుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత ఎలిమినేట్)గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన నూతన్ నాయడు తండ్రి సన్యాసి రావు నాడు.. పండగపూట అంటే శనివారం ఉదయం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. ఉత్తరాంధ్ర తరఫున కాంగ్రెస్ సీనియర్ నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన సంతాపాన్ని తెలియజేశారు.బిగ్‌బాస్ షోలో వచ్చిన గుర్తింపుతో కమెడియన్, విలన్‌గా ఛాన్సులు అందుకున్నాడు. కానీ వాటి ద్వారా పెద్ద ఫేమ్ తెచ్చుకోలేకోయాడు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.(ఇదీ చదవండి: మణి హగ్గుల పిచ్చి.. ఈ చెండాలం చూడలేకున్నాం సామీ!) -
ఘనంగా ‘స్వామిరారా’ నటి సీమంతం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
ప్రముఖ నటి పూజా రామాచంద్రన్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఆమె సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కనుల పండుగగా జరిగిన ఈ సీమంత వేడుకలో పూజా దంపతుల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా పూజా భర్త జాన్ కూడా నటుడనే విషయం తెలిసిందే. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ వన్.. నేనొక్కడినే, కేజీఎఫ్ చాప్టర్ 1, బాహుబలి బిగినింగ్ సినిమాల్లో అతడు విలన్ పాత్రలు పోషించాడు. కాగా పూజా తెలుగులో స్వామి రారా, ఎంత మంచివాడవురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. కాగా పూజా రామ చంద్రన్- జాన్ కొకెన్ల వివాహం 2019లో జరిగింది. పూజాకి ఇది రెండో పెళ్లి. అంతకు ముందు 2017లో విజె క్రెగ్‌తో పూజా వివాహం జరిగింది. చదవండి: ‘యశోద’ లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
అలా ఏడిస్తే హౌజ్ నుంచి ముందుగా వచ్చేది నువ్వే: కౌశల్
ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లో తొలి రోజే గొడవలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకరి నెగిటివిటి ఒకరూ బయటపెట్టడంతో రచ్చ రచ్చ జరిగింది. ఆదివారం బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో నామినేట్ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్ కమ్యూనికేషన్ వల్ల హౌజ్‌మెట్స్ మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఎక్కువ మంది ఇంటి సభ్యులు జస్సీని నామినేట్ చేశారు. చదవండి: బిగ్‌బాస్ 5: నాగార్జున రెమ్యునరేషన్ మామూలుగా లేదుగా! కాగా జస్సీ మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో హౌజ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా జస్సీ ఓ సందర్భంలో మాట్లాడిన తీరు తమకు నచ్చలేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నామినేషన్ సమయంలో విశ్వకు, జస్సీకి మధ్య జరిగిన చిన్నపాటి డిస్కషన్లో జస్సీ బాధపడ్డాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా జస్సీని నామినేట్ చేస్తూ ‘చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్న’ అంటూ లిన చెప్పడంతో వెంటనే జస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. చదవండి: Bigg Boss 5 Telugu: వీడియోతో దొరికిపోయిన లోబో..నెటిజన్ల ట్రోల్స్ దీంతో అందరూ అతడి ఓదార్చడం జరిగింది. దీనిపై బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తోటి మోడల్‌గా జస్సీకి మద్దతుగా నిలిచాడు. అతడిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేస్తూ.. ‘నా తర్వాత, సీజన్ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్‌లో ప్రేమని గెలుచుకోవాలి. అలా ఏడిస్తే మొదటగా హౌజ్ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు. జాగ్రత్తగా ఆడు. ఆల్ ది బెస్ట్’ అని సూచించాడు. కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో కాజల్, హమీదా, జెస్సీ, రవి, మానస్, సరయూలు ఈ వీకెండ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లే సభ్యులుగా డేంజర్ జోన్లో ఉన్నారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ రెండో వివాహం
నటుడు, బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అంజనా శ్రీ లిఖిత అనే యువతి మెడలో బుధవారం మూడు ముళ్లు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. కోవిడ్ కారణంగా ఎలాంటి హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు బిగ్‌బాస్‌లో తన స్నేహితులైన తనీష్, దీప్తీ సునాయనా కూడా హాజరయ్యారు. సామ్రాట్ పెళ్లి వార్త తెలిసిన నెటిజన్లు, అభిమనులు నటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించిన వీడియోను సామ్రాట్ సోదరి, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ శిల్పా రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: నటుడు సామ్రాట్ సోదరికి కరోనా ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పేరు సంపాదించాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఆట మీద దృష్టి పెడుతూ టాప్ 5కు చేరాడు. ఇదిలా ఉండగా సామ్రాట్‌కు ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే. ఇంతకముందు హర్షితా రెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2018లో కట్నం కోసం వేధిస్తున్నాడని, తనపై హత్య ప్రయత్నం చేశాడని సామ్రాట్‌పై హర్షిత కేసు నమోదు చేసింది. అనంతరం ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. చదవండి: నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ -
ఆ గళంలో...నాగలి
ర్యాప్ సింగర్‌గా సుపరిచితుడైన రోల్‌రైడా బిగ్‌బాస్ సీజన్–2తో అందరికీ మరింత దగ్గరయ్యాడు...! ఎన్నో ర్యాప్, హిప్హాప్ పాటలతో శ్రోతలను అలరించిన రైడా, ర్యాప్ సాంగ్స్‌కి సందేశాత్మకతను జోడించి ప్రత్యేకమైన మార్క్‌ను ఏర్పరచుకున్నాడు. సామాజిక అంశాలను ముడిసరుకుగా తీసుకొని ఆల్బమ్స్ చేసే రోల్‌రైడా.., ఈ సారి రైతుల కథాంశంతో సమస్త మానవాళికి రైతే ఫ్రంట్వారియర్ అంటూ ‘నాగలి’ ర్యాప్‌తో వస్తున్నాడు...! సాక్షి,సిటీబ్యూరో: మ్యూజిక్‌లో ర్యాప్ సాంగ్స్ అనేవి విభిన్నమైనవి. అంతర్జాతీయంగా దానికంటూ ప్రత్యేకంగా మ్యుజిషియన్స్ ఉన్నారు. ఎన్నో పాశ్చాత్య సంగీత శైలుల్ని అందిపుచ్చుకోగలిగినా.. తెలుగులో ర్యాప్సింగర్స్ మాత్రం కొందరే ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేకించిన ర్యాప్ పాటలతో యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు రోల్‌రైడా. ‘అరుపు’..ఓ పిలుపు... విభిన్నమైన కాన్సెప్టులతో పలు ర్యాప్, హిప్హప్ సాంగ్స్ చేశాడు రైడా. ముఖ్యంగా మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను ప్రతిస్పందిస్తూ ‘అరుపు’ పేరుతో చేసిన ర్యాప్‌సాంగ్ విశేషమైన ఆదరణ పొంది కోట్ల సంఖ్యలో వీక్షకుల్ని సొంతం చేసుకుని, ఎంతోమందిని ఆలోచింపజేసింది. అతిసున్నితమైన అంశాలని హృదయానికి హత్తుకునేలా మ్యూజిక్‌ని, సాంగ్ వెర్షన్‌ని రోల్‌రైడా ఎంచుకుంటాడు. రైడా ర్యాప్ సింగర్ మాత్రమే కాకుండా మంచి రైటర్ కూడా. తన ర్యాప్స్‌తో సినిమాల్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రముఖ టాలివుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం పలు సినిమాలకి సైతం ర్యాప్ సాంగ్స్ పాడాడు. రైతులే ఫ్రంట్వారియర్స్... కరోనా లాక్డౌన్లో ప్రపంచ జీవన విధానమే మారిపోయింది. కానీ మనిషి ఆకలి మాత్రం మారలేదు. ఏది లేకపోయినా సర్దుకున్నాం కానీ ఆకలికి ఓర్చుకోలేకపోయాం. ‘‘ఆహారం లేకపోతే మనిషికి మనుగడే లేదు. మనిషికి అంత ముఖ్యమైన ఆహారాన్ని, అదీ మట్టి నుండి పండిస్తున్న∙రైతుకు మాత్రం సానుభూతి తప్ప తగినంత గుర్తింపు రాలేదు’’ అంటున్నాడు రైడా. గుర్తింపు అటుంచితే సగటు మనిషి సామాజిక, ఆర్థిక జీవనానికి ఎంతో దూరంలో బ్రతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. అసలు రైతే లేకుంటే ఏంటి పరిస్థితి., రైతుకు కోపమొస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచనతోనే ‘నాగలి’ని రూపొందించానన్నారు. ‘‘ఇది ‘అరుపు టీం’ నుండి వస్తున్న మరో సందేశాత్మక ప్రయోగం. సమాజానికి రైతులే ఫ్రంట్వారియర్స్ అని, వారి స్థితిగతులను, మానవీయ కోనాలను, మానసిక వేదనలను ఇందులో పొందుపరిచామని’’ రైడా తెలిపారు. ఈ ‘నాగలి’లో రైడాతో పాటు బిగ్‌బాస్‌లో అలరించిన ‘అమిత్ తివారి’ కూడా లీడ్‌రోల్‌గా చేశాడు. దీనికి రైడా లిరిక్స్ రాసి, ర్యాప్ పాడగా హరికాంత్ దర్శకత్వం చేశాడు. దీనంతటికి ఆత్మ అయినటువంటి మ్యూజిక్‌ని ప్రవీణ్ లక్కరాజు సమకూర్చాడు. నాగలి ట్రైలర్‌ని శనివారం రిలీజ్ చేయగా.., ఈ ర్యాప్సాంగ్ని స్వాతంత్ర దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల కోసం రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తుందని రైడా చెప్పారు. -
ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం
‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-2’తో కౌశల్ మందకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తన అటిట్యూడ్, గేమ్ ప్లానింగ్, ఇమేజ్‌తో ఆ సీజన్ మొత్తం రఫ్పాడించాడు. ఇక విజేతగా కౌశల్ పేరును ప్రకటించిన తర్వాత ఆయన అభిమానులు చేసిన కార్యక్రమాలు, కౌశల్ ఆర్మీ పేరిట చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నంత సేపు కౌశల్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. బోయపాటి శ్రీను, సుకుమార్ వంటి స్టార్ దర్శకుల సినిమాల్లో కౌశల్‌కు సినిమా అవకాశం లభించినట్లు అనేక వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే కౌశల్, అయన అభిమానులు ఊహించని విధంగా సీన్ రివర్సయింది. టాలీవుడ్లో ఎక్కడా కూడా అతడి ఊసే లేదు. దీంతో తన యాడ్ ఏజెన్సీకే పరిమితమయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత కౌశల్‌కు ఒక సినిమా అవకాశం లభించింది. సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కౌశల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చాలా కీలకమైందిని తెలుస్తోంది. జీబీ క్రిష్ణ దర్వకత్వం వహిస్తున్న ఆది 16వ చిత్రంలో కౌశల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం కౌశల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుందనీ, కెరీర్‌కు మరింత హెల్ప్ అవుతుందని కౌశల్‌తో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కౌశల్ నుంచి గాని చిత్రబృందం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కౌశల్‌కు సినిమా అవకాశం వార్త నిజమా కాదా అని తెలియాలంటే కొంత కాలం వేచిచూడాలి. చదవండి: సల్మాన్ పేరుతో మోసం! బాలయ్య కోసం భారీగా శత్రు గణం View this post on Instagram Here's the first look poster of mine from my upcoming movie........... Sending my heartfelt thanks to my director @krishna_kitti123 , producer @diwakargaru n my dear hero @aadipudipeddi for releasing my first look on my b'day.Thank you so much for this surprise gift & also thank you for all the support that i receive from you guys on the sets. So guys hope you all love the first look poster of mine. A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) on May 13, 2020 at 7:33am PDT -
మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన
సాక్షి, హైదరాబాద్ : పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంజన బుధవారం మరోసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే పోలీసులు సంజనను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచారా లేక, కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌కు వెళ్లిన తనను.. ఆశిష్ చెప్పలేని రీతిలో దూషించినట్టు సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ తమపైకి ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడని.. ఆ ప్రమాదం నుంచి తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని ఆమె తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆశిష్ ఖండించారు. తను నోవాటెల్‌కు వెళ్లిన విషయం వాస్తమమేనని.. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశిష్ చెప్పారు. చదవండి : నందీశ్వర్ గౌడ్ కుమారుడిపై కేసు నమోదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
నన్నే గుర్తు పట్టలేదా అంటూ వీరంగం..
సాక్షి, హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్ బాస్ –2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్ బాస్–2 కాంటెస్టెంట్ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్ వద్ద ఉండగా కింది ఫ్లోర్లో ఉన్న అశిష్ గౌడ్ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్ గౌడ్ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు. వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది. సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితుడు రమేష్ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్ అజార్ పట్టించుకోకపోవడంతో అశీష్ మరింత రెచ్చిపోయాడు. 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్ గౌడ్ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాటిళ్లు విసిరి, తోసేశాడు... గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్ యాజామాన్యానికి కాల్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాస్ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని అశిష్ గౌడ్ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ పబ్‌కు నిబంధనలు వర్తించవు... నోవాటెల్ వీకెండ్లో పబ్‌లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్‌లోని అర్టిస్ట్రీ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్వో టీ పోలీసులు పబ్‌లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు మైనర్ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లా ఖాన్ తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్ రాయల్ డిమ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహ్మద్ వాహిదోద్దిన్ (43) హరియంత్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్ వాహిదోద్దీన్ ఖాన్‌కు పంకజ్‌తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్ తరచుగా ఇసామియా బజార్లో ఉంటున్న పంకజ్ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్ చదువుతున్న పంకజ్ కూతురు (17)తో వాహీదోద్దీన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్ ఖాన్‌లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు వాహిదోద్దిన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. -
కౌశల్ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్ గెస్ట్!
బిగ్‌బాస్ రెండో సీజన్‌తో మోస్ట్ పాపులర్ అయిన కంటెస్టెంట్ కౌశల్. తన ఆటతో అందరి అభిమానాన్ని సంపాదించుకుని విన్నర్‌గా నిలిచాడు. అయితే అంతవరకు మంచి పేరున్న కౌశల్.. బయటకు వచ్చాక చేసిన కొన్ని పనులతో నవ్వులపాలయ్యాడు. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఓ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ పట్టా ఇస్తామన్నారంటూ ప్రచారం చేసుకునే సరికి అతనికి కొంత నెగెటివిటీ ఏర్పడింది. హౌస్‌లో ఉన్నంత సేపు ఎవ్వరితోనూ అంతగా కలవకుండా సొంతంగా గేమ్ ఆడిన కౌశల్.. బయటకు వచ్చాక కూడా తన హౌస్‌మేట్స్‌తో ఎక్కువ కలిసిమెలిసి ఉన్నట్లు కనిపించలేదు. అయితే మిగతా కంటెస్టెంట్లు అందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఎవరి పుట్టినరోజు వేడుకలు అయినా, పండగలు వచ్చినా కలిసి ఎంజాయ్ చేస్తారు. అయితే శుక్రవారం (సెప్టెంబర్ 20) నాడు కౌశల్ కూతురు లల్లీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు తనీష్, గీతా మాధురి, అమిత్, రోల్ రైడా, గణేష్ ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు చాలామంది హాజరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరంతా లల్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవ్వడం మరో ఎత్తు. ఈ సందర్భంగా సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
బ్రేకింగ్ న్యూస్‌తో హీరోయిన్గా..
సినిమా: బ్రేకింగ్ న్యూస్‌తో నటి భానుశ్రీ హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–2 ద్వారా పాపులర్ అయిన నటి అన్నది గమనార్హం. యువ నటుడు జై హీరోగా నటిస్తున్న చిత్రం బ్రేకింగ్ న్యూస్. నాగర్ కోవిల్‌కు చెందిన తిరుక్కడల్ ఉదయం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆండ్రూ పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విషయాలను నటి భానుశ్రీ తెలుపుతూ ఇందులో తాను నటుడు జైకు ప్రేయసిగా నటిస్తున్నానని చెప్పింది. ఆయన అమాయకత్వం చూసి ప్రేమలో పడతానని, అది పెళ్లికి దారి తీస్తుందని తెలిపింది. అయితే ఆ తరువాత ఈగో, విభేదాల కారణంగా విడిపోతామని చెప్పింది. ఆరంభంలో తాను సంసారపక్షంగా ఉండే యువతిగా, చాలా చలాకీగా ఉంటానని, వివాహనంతరం సంప్రదాయ బద్ధంగా, ప్రశాంతంగా ఉండే అమ్మాయిగా మారిపోతానని చెప్పింది. తాము విడిపోవడానికి కారణం మాత్రం అడగకండి. ఎందుకంటే ఆ విషయాలను ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చూస్తారు అని అంది. ఒక సాధారణ యువకుడు సమాజ శ్రేయస్సు కోసం సూపర్ హీరోగా మారే ఇతి వృత్తంతో సాగే చిత్రం బ్రేకింగ్ న్యూస్ అని చెప్పింది. ఇది ఫాంటసీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. గ్రాఫిక్స్ ఉన్నా, ఇది గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రం కాదని, చాలా ఎమోషన్స్‌తో కూడిన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. నటుడు జై గురించి చెప్పాలంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైనా చాలా నిరాడంబరంగా ఉంటారని చెప్పింది. సహ నటీనటులకు ఎంతగానో సహకారం అందించే నటుడు జై అని పేర్కొంది. దర్శకుడు ఆండ్రూ పాండియన్ చాలా సమర్థుడని అంది. కథను చెప్పింది చెప్పినట్లు తెరకెక్కిస్తున్నారని తెలిపింది. చిత్ర షూటింగ్ ఇప్పటికే 15 రోజులు పూర్తి అయ్యిందని, షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరించబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. చిత్రంలో సీజీ వర్క్ 90 నిమిషాలు ఉంటుందని, అదేవిధంగా వీఎఫ్ఎక్స్ వర్క్ అధికంగా ఉంటుందని తెలిపారు. -
‘కౌశల్‌ను నమ్మొద్దు.. అతనొక మోసగాడు’
బిగ్‌బాస్ కౌశల్.. ఈ పేరు ఒకానొక టైమ్‌లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి యుద్దమే జరిగింది. సేవా కార్యక్రమాలు, 2కే రన్లు చేస్తూ.. కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్‌కు మద్దతుకు నిలిచారు. మొత్తానికి బిగ్‌బాస్2 సీజన్ విజేతగా కౌశల్ నిలిచాడు. అటు తరువాత కౌశల్ ఇంటర్వ్యూలు, సన్మాన సభలు, విదేశాల్లో కూడా సభలు నిర్వహించడం, డాక్టరేట్‌ను ప్రధానం చేయడంలాంటి వ్యవహారాలు హల్చల్ చేశాయి. దీంతో ఒక వర్గం కౌశల్‌పై కుట్ర చేసేందుకు రెడీ అవుతోందని కౌశల్ అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే రీసెంట్గా మళ్లీ ఇలాంటి ఆరోపణలే వైరల్ అయ్యాయి. కౌశల్‌ను నమ్మొద్దని, అతనొక మోసగాడంటూ, కౌశల్ చెప్పేదానికీ, చేసేదానికీ పొంతన వుండదని, అభిమానులతో డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటాడే తప్ప తన జేబులోంచి రూపాయి బయటకి తీయడని ఆరోపిస్తోస్తున్నారు. ఎక్కడికి అతడిని రమ్మన్నా కూడా అందులో తనకేంటి లాభమని చూసుకుంటాడని, ప్రతి చిన్న ఈవెంట్‌కి కూడా డబ్బులు ఆశిస్తున్నాడని కౌశల్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఈ ఆరోపణలపై కౌశల్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఇలా ప్రతీసారి తనపై ఆరోపణలు చేయడం అలవాటైందని, అయినా ప్రతీ దానికి సమాధానం చెప్పుకుంటూ పోవడం తనకేం అవసరం లేదని కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇలా వచ్చే ప్రతీ దానిపై స్పందించేంత సమయం కూడా తనవద్ద లేదంటూ.. కావాలనే తనను కించపరచాలని ఇదంతా చేస్తున్నారని విమర్శించాడు. కాలమే వీటన్నంటికి సమాధానం చెబుతుందని, కొంత సమయం ఆగితే నిజాలు అవే బయటకు వస్తాయన్నాడు. -
‘మీ టూ’ కంటే ముందే.. మనీషా
అవును.. వారి ‘అరుపు’లో నిజాయితీ ఉంది.. ఎమోషన్ ఉంది.. ఒక బృందం కష్టంతో పాటు చిత్తశుద్ధి ఉంది. అందుకే ఆ తెలుగు వీడియో అంతర్జాతీయ వేదికపై కేక పుట్టించింది. చూసిన వారందరినీ కంట తడి పెట్టించింది. శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ అవార్డుని దక్కించుకుంది. ‘అరుపు’ వీడియో టీమ్‌ని పలకరించినప్పుడు తమ వీడియో ప్రారంభం నుంచి అవార్డు వరకు జర్నీ విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘అరుపు’ అలా మొదలైంది..రోల్‌రైడా ‘ఆసిఫా’ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. ఆడ శిశువనే కారణంతో ఆరునెలల బిడ్డని తల్లిదండ్రులే కర్చిఫ్ నోట్లో కుక్కి చంపేశారని ఫ్రెండ్ చెబితే కలవరపడ్డాను. వెంటనే పాట రాశాను. తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటే చెప్పమన్న ప్రొడ్యూసర్స్‌కి సాంగ్ పంపించాం. వారికి నచ్చింది. డైరెక్టర్ హరికాంత్ని వారికి కలిపించాను. లిరిక్స్ రికార్డ్ చేసి, నా వరకు వీడియో రికార్డ్ చేసి నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లిపోయాను. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాన్సెప్టే డిఫరెంట్‌గా చేశారు.. నిజరూపానికి ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తాం. అలా మనకు కళ్లకు కనిపించేది వాస్తవం కాదు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. కంటికి చాలా మాములుగా కనిపించే ఎన్నో విషయాల వెనుక ఎన్నో భయంకర విషాదాలు ఉండవచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్‌ని ఇలా రెడీ చేశాం. కమరాన్ చాలా కష్టపడ్డాడు. మనీషా బాగా పాడింది. తర్వాత మేం షూట్ కోసం అడిగాం. ఆమె ఒప్పుకుంది. కానీ ఆమెకు షూట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. వీడియో పూర్తయ్యాక మెచ్చుకుంది. ప్రాజెక్ట్ విలువ రూ.27 లక్షలు.పోస్ట్ ప్రొడక్షన్‌కి, వీఎఫెక్ట్కి ఎక్కువ సమయం పట్టింది. తర్వాత ఏం జరిగింది..కమరాన్, మ్యూజిక్ కంపోజర్ సీరియస్ ఇష్యూస్‌ని తీసుకుని ర్యాప్ వీడియోలు చేయాలని ముందు నుంచే ఉంది. కానీ స్టార్టింగ్‌లోనే ఇలాంటి పాట చేసి ఉంటే మమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ఇప్పుడు మాకు ఒక లిజనర్షిప్ ఉంది. అది రైడా ఫీలై రాసేసరికి ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. రైడా డెమో ట్రాక్ పాడించి పెట్టాం. తర్వాత తను బిగ్‌బాస్‌కి వెళ్లిపోయాడు. దాని మీదే రైడా షూట్ కూడా జరిగింది. మనీషా యూఎస్ నుంచి రావడానికి 20 రోజుల టైం ఉండే. అప్పుడు ఈ ఎఫెక్ట్స్ చేసి పెట్టాను. ఆమె ఇంగ్లిష్‌లో పాడుతుంది, డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. సినిమాకి మ్యూజిక్ స్క్రిప్ట్ పరంగా చేయాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఉన్న పవర్ ఏంటంటే,ఆర్టిస్ట్‌కి నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంటుంది.. నిజాయితీగా చేస్తారు. దాంతో వినే వారు కనెక్ట్ అవుతారు. అందుకే చేస్తున్నప్పుడు జనాల్లోకి వెళుతుందా లేదా అనే డౌట్ రాదు. ఈ వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్ వచ్చింది. ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. పతంగ్ తర్వాత మళ్లీ అంత రెస్పాన్స్ ఇంది. ప్రొడ్యూసర్లు కూడా ఒక్క ప్రశ్న వేయకుండా సపోర్ట్ చేశారు. ‘మీ టూ’ కంటే ముందే.. మనీషా ఇది రోల్‌రైడా ఐడియా. అమ్మాయిలపై లైంగిక హింస, వేదింపులు అనేక అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మన దగ్గర ‘మీ టూ’ కంటే ముందే ఈ వీడియో విడుదలైంది. ‘మీ టూ’ వంటి మూమెంట్ వల్ల మార్పు వెంటనే వస్తుందని చెప్పలేం. కానీ అందరూ దీని గురించి మాట్లాడతారు.. ఆలోచిస్తారు. అవగాహన పెరుగుతుంది. మార్పుకి మార్గం ఏర్పడుతుందని భావిస్తాను. మీ గురించి... వీడియో గురించి.. ‘నేను లోకల్, మహానుభావుడు, సవ్యసాచి, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో పాడాను. మాషప్స్ చేస్తుంటాను. అది చూసి రోల్, కమరాన్ ఏదైనా ప్లాన్ చేద్దామన్నారు. నేను పాడిన లిరిక్స్, కోరస్ కృష్ణకాంత్ రాశారు. మిగతాది రోల్‌రైడా రాశారు. ఈ పాటను యూఎస్ నుంచి వచ్చి పాడాను. తర్వాత వీడియోలో కూడా ఉంటే బాగుంటందన్నారు. గంటలో షూటింగ్ అయిపోయింది. చాలా మంచి రివ్యూస్, ఫీడ్‌బ్యాక్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియో చూసి మాకు ఏడుపొచ్చింది అని మెసేజ్ చేశారు. అంతకంటే గొప్ప రివ్యూ ఏం ఉంటుంది? ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణమిదీ..సునీల్ గడ్డమేడి,వీడియో ప్రొడ్యూసర్ నేను ఓ ఈవెంట్లో రైడాను కలిసినప్పుడు తెలుగులో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలు వేడుకలు, పండుగలు, సంబురాల మీదనే ఉన్నాయి. అలా కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్‌లో సీరియస్ ఇష్యూస్‌ని.. ముఖ్యంగా స్త్రీల సమస్యలను చూపవచ్చు కదా అని సూచించా. అయితే, అలాంటివి చేయాలని తనకున్నా ప్రొడ్యూసర్లు ముందుకు రారని రైడా అన్నారు. స్త్రీ సాధికారతపై వీడియో ప్లాన్ చేస్తే చెప్పమన్నాం. తను ఈ రికార్డింగ్ పంపితే విన్నా.. బాగా నచ్చింది. వెంటనే ప్రాజెక్టుకు ఓకే చెప్పాం. ముప్పైవేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. శ్రీని శ్రీగద నా ఫ్రెండ్. ఈ ప్రాజెక్ట్‌కి ఎక్కువ బడ్జెట్ అవసరం కావడంతో తనని అడిగాను. వెంటనే ఏ వివరాలు అడగకుండా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. మూడు నెలల్లో పూర్తి చేశాం. ఎక్కువ ప్రమోషన్ చేయకుండానే వీడియో పాపులర్ అయింది. ఇకపై కూడా అర్థవంతమైన ప్రొడక్షన్స్ చేస్తాం. పరిచయం లేనివారు కూడా వివరాలు తెలుసుకొని ఫొన్ చేసి చక్కటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఒక్కటే బాధ, యాదృచ్ఛికంగా ‘మీ టూ’ సమయంలో ఈ వీడియో విడుదలైంది. అయినా ఫెమినిస్టులు, సెలబ్రిటీలు ఈ వీడియో గురించి మాట్లాడ్డం గానీ, ట్వీట్ కానీ చేయలేదు. అదే కొంచెం వెలితి. అంతర్జాతీయ పురస్కారం.. ‘అరుపు’ మ్యూజిక్ వీడియోలో రోల్‌రైడా, మనీషా పాడడంతో పాటు నటించారు. హరికాంత్ గుణమగరి దర్శకత్వం వహించిన ఈ వీడియోకి మ్యూజిక్ స్కోర్ అందించింది కమరాన్. ఈ వీడియోని యూ–ట్యూబ్‌లో 50 లక్షల మందికి పైగా వీక్షించారు. శాన్ఫ్రాన్సిస్కో న్యూ కాన్సెప్ట్ ఫిలిం ఫెస్టివల్ యూఎస్ఏ అవార్డు దక్కించుకుంది. భారత్ నుంచిఎంపికైన ఏకైక చిత్రం ‘అరుపు’ మాత్రమే. ప్రొడ్యూసర్స్ సునీల్ గడ్డమేడి, శ్రీని శ్రీగదని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానించారు. ఈ వీడియో ‘ది బెస్ట్’గా అవార్డు అందుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదంటోంది ఈ వీడియో బృందం. -
ఓటు వేస్తేనే రెట్టింపు ఆనందం: కౌశల్
హైదరాబాద్: ఓటు వేయడం ద్వారా సంతృప్తి లభించడమే కాదు మనం ఓటు వేసిన నాయకుడు గెలిస్తే ఆ తృప్తి రెండింతలవుతుంది. మనం ఓటు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధి పనులు చేయకపోతే ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. పని చేస్తే ప్రశంసించేందుకు అవకాశం దక్కుతుంది. దేశ భవిష్యత్ గురించి మన భవిష్యత్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన నాయకులను మనమే ఎన్నుకున్నామన్న తృప్తి మిగలాలి. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు లభిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓటు విషయంలో అందరూ ఒక్కటే. ప్రతి ఒక్కరూ లైన్లో నిలబడి తప్పనిసరిగా ఓటు వేయాలి. నేను ప్రతిసారీ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకుంటాను.– కౌశల్, నటుడు, బిగ్‌బాస్– 2 విజేత -
శ్రీవారి సేవలో నటుడు సామ్రాట్
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల: సినీ నటుడు, బిగ్‌బాస్–2షో కంటెస్టెంట్ సామ్రాట్‌రెడ్డి బుధవారం చినవెంకన్న క్షేత్రాన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు సినిమాల్లో తాను హీరోగా, ప్రతినాయకుడిగా నటించానన్నారు. మూడు నెలలపాటు బిగ్‌బాస్ షోలో పాల్గొన్నట్టు చె ప్పారు. షో తనకు మరింత గుర్తింపును తేవడంతో పాటు జీవితంలో మలుపుగా నిలిచిందని చెప్పారు. సామ్రాట్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. -
ఏడ్చి చాలా మందిని బాధ పెట్టా ..
గల్లీల్లో లొల్లిలొల్లి చేసే తెలుగు ర్యాపర్ రోల్‌రైడా, సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే అమిత్ తివారీ బిగ్‌బాస్ షోలో కలుసుకున్నారు. రూపంలో, స్వభావాల్లో వీరిద్దరికి అస్సలు సంబంధం లేదు. కానీ వీరి మధ్య బంధం అల్లుకోవడానికి అంత సమయమేం పట్టలేదు. షో తొలి రోజు రాత్రి రైడా మాటలు విన్న అమిత్ రోల్ అయిపోయాడు. అమిత్ వేసిన జోకులకు రైడా కనెక్ట్ అయిపోయాడు. పరిచయమే లేని వారిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ‘బిగ్‌బాస్’ లైఫ్‌టైమ్ ఫ్రెండ్‌ని ఇచ్చిందంటూ చెబుతున్న వీరిద్దరి ‘షో’ జర్నీ విశేషాలు వారి మాటల్లోనే... రోల్ రైడా .. షో ప్రిపరేషన్ ‘బిగ్‌బాస్’లో అవకాశం వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను. ప్రేక్షకులు మన వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేసే అధికారమిచ్చి ఆ షోలోకి వెళ్తాం. హౌస్‌లో ఎలాంటి సందర్భంలో అయినా మనం మనలాగా ఉండడం ముఖ్యం. రెండు మూడు వారాల్లో బయటకు వచ్చినా... పబ్లిక్‌లో మనం కనిపిస్తే గుసగుసలు పెట్టుకోకుండా, దగ్గరికొచ్చి ఒక సెల్ఫీ అడగాలి. ఇదే హౌస్‌మేట్స్‌కి చెప్పేవాణ్ణి. నేను బయటకు వచ్చాక అంతకుమించిన అభిమానం పొందుతున్నాను. ‘షో’ తర్వాత సర్ప్రైజ్ అభిమానం. ఈ షోకి ముందు నా వీడియోలు చూసిన వాళ్లు చాలా తక్కువ. షో తర్వాత తెలుగు రాష్ట్రాల వాళ్లే కాకుండా... ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లంతా నా వీడియోలు చూసి విషెస్ పంపిస్తుండ్రు. రోడ్ మీద కనిపిస్తే బండి ఆపేసి రోల్‌రైడా అని మాట్లాడుతున్నరు. ఏం మిస్సవుతున్నారు? పొద్దున్నే అమ్మ నిద్ర లేపుతుంది. అదేంటి పాట రావాలి కదా! నిద్రపోతే కుక్కలు మోరుగుతలేవ్? మాట్లాడుతున్నప్పుడు మైక్, ఏదీ చేయాలన్నా... ఇంకా బిగ్‌బాస్ చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నాను. చెప్పాలంటే ఇంకా బిగ్‌బాస్ హ్యాంగోవర్లోనే ఉన్నాను. బిగ్‌బాస్ వాయిస్ బాగా మిస్ అవుతున్నాను. గిల్టీ ఫీలింగ్ టెంట్ టాస్క్‌లో దీప్తికి దెబ్బ తగిలింది. అది తెలియకుండానే జరిగినప్పటికీ, నావల్లే తలిగిందని చాలా బాధ పడ్డాను. మళ్లీ నాకోసం గణేశ్ ఒక వీక్ మొత్తం ఫ్రూట్స్ తిన్నాడు. తట్టుకోలేకపోయాను. తర్వాత గణేశ్ కోసం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పుడు గిల్టీ ఫీలింగ్ తగ్గింది. ఆ వారం ఎలిమినేట్ అయినా ఫర్వాలేదని అనుకున్నాను. రిగ్రెట్ కౌశల్ ఒక మాట అన్నప్పుడు ఎమోషనల్‌గా బస్ట్ అయ్యాను. కానీ అలా కాకుండా ఉండాల్సింది. ఏడ్చి చాలా మందిని బాధ పెట్టానని అనిపించింది. అసలు ఎందుకు అలా అయిందంటే... చెల్లి రావడం, అమిత్గాడు వెళ్లి పోవడంతో నాలో ఎమోషనల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఒంటరినైపోయాను. అప్పుడే కౌశల్ అలా అన్నారు. కెప్టెన్సీ వచ్చేది కాస్త పోయింది. ఇలా ఒక్కసారే చాలా ఫ్యాక్టర్స్, నేను ఎమోషనల్‌గా బ్రేక్‌డౌన్ కావడం, ఎగ్స్ సామ్రాట్‌కి ఇచ్చేయడం నా ఎలిమినేషన్‌కి కారణం కావచ్చు. ఎగ్స్ టాస్క్‌లో గెలిచే అవకాశం ఉంటే గివప్ చేసేవాడిని కాదు. నేను గెలవలేదని, ఇంకొకరు గెలవొద్దనే మెంటాలిటీ కాదు నాది. ‘హౌస్’లో మీ స్ట్రెంత్ బాండింగ్.. నేను ఒంటరిగా ఉండలేను. గొడవలున్నా ఇంటికి రాగనే మంచిగ పలకరిస్తే రిఫ్రెష్ అయిపోతం. అలా నాకు తోడున్నది అమిత్. చాలా మాట్లాడుకునేవాళ్లం. హౌస్‌లో అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటెయిన్ చేశాను. అందరినీ ఎంటర్టైన్ చేసేవాడిని. ఆ ఎమోషనల్ బాండ్తోనే ఆ ఇంట్లో నేను ఉండగలిగాను. నా క్యారెక్టర్ కూడా అదే. అది ప్రేక్షకులకు నచ్చిందనుకుంటాను. ఏం నేర్చుకున్నారు? హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ ఎంత ముఖ్యమో అర్థమైంది. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫోన్‌తోనే గడుపుతుంటాం. ఇంట్లో వాళ్లకి టైమ్ ఇవ్వం. ఇంటికి రాగానే మన గురించి అడిగే వాళ్ల విలువ అక్కడ తెలిసొచ్చింది. బయట కొట్లాడితే మాట్లాడుకోం. కానీ బిగ్‌బాస్‌లో గొడవ అయినవాళ్లతో కలిసి టాస్క్ చేయాల్సి ఉంటుంది. మెంటల్, ఫిజికల్, బిహేవియర్... ఇలా అన్నింటికీ బిగ్‌బాస్ ఓ పరీక్ష. బిగ్‌బాస్ జర్నీ మనల్ని మనం పరీక్షించుకునేందుకు ఒక అవకాశం. అది కొనుక్కుంటే వచ్చేది కాదు... లక్కుండాలి. ఇంతకముందు వరకు నాకు మొహమాటం, స్టాండ్ తీసుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు నా ఇంటెన్షన్ బయటకు చెబుతున్నాను. నచ్చని విషయాలు బయటకు చెప్పడంతో మనసు తేలికవుతుంది. అమిత్ .. ఫ్రెండ్షిప్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి, సరదాగా ఉండాలి. నాది, రోల్రైడాది ఇదే మైండ్‌సెట్. వాడు అదే విషయం ఫస్ట్ డే చెప్తుంటే విని కనెక్ట్ అయ్యాను. తర్వాత వాడు ఏ జోక్ వేసినా నేను పడిపడి నవ్వేవాణ్ణి. నేను ఏ జోక్ వేసినా వాడికి బాగా నవ్వు వచ్చేది. వాడికి నాకు ఒకటే తేడా... వాడికి జుట్టుంది, నాకు లేదంతే (నవ్వుతూ). బిగ్‌బాస్ షో నాకు లైఫ్‌టైమ్ బ్రదర్‌ని ఇచ్చింది. ‘లఫంగ్ గిరిగిట్టా ఫిలిం మేకింగ్’ టాస్క్ చాలా ఎంజాయ్ చేశాను. రోలి జోక్స్ మరిచిపోలేను. ‘షో’ తర్వాత సర్ప్రైజ్ ఇంటికొచ్చాక నా వైఫ్ సోషల్ మీడియాలో వచ్చిన లవింగ్ మెసేజెస్ చూపించింది. అలాంటి అభిమానం కోసమే షోకి వెళ్లాను. ఆ మెసేజెస్ చూసి నేను విన్ అయ్యానని అనుకున్నాను. బిగ్‌బాస్‌కి ముందు పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు దగ్గరికి వచ్చి ఎవరూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. అది మారాలి... నేను మామూలుగా ఎలాంటి వాడినో తెలియాలని ఉండేది. ఈ షో ద్వారా నేనేంటో చాలా మందికి తెలిసింది. ఈ షో తర్వాత దిగినన్ని సెల్ఫీలు నా లైఫ్‌లో ఎప్పుడూ దిగలేదు. సెల్ఫీలు అడిగిన వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ (నవ్వుతూ). ‘హౌస్’లో మీ స్ట్రెంత్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. దాంతో హౌస్‌లో ఉండగలననే నమ్మకం ఉండేది. ఇంకా మా వైఫ్, ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసి పంపించారు. మేం బాగా ఉంటామని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండగలిగాను. హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి కూడా నేను ఎలా ఉన్నానో... అలానే నచ్చాను. కాబట్టే అన్ని రోజులు హౌస్‌లో ఉండగలిగానని అనుకుంటున్నాను. షో ప్రిపరేషన్ లైఫ్‌లో ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని ఉండేది. అదే ఆలోచనతో ఉన్నప్పుడు బిగ్‌బాస్ నుంచి కాల్ వచ్చింది. ఇంతకన్నా డిఫరెంట్‌గా చేయడానికి ఇంకా ఏం ఉంటుందని నా వైఫ్ ఎంకరేజ్ చేసింది. అంతకుమించి ప్రిపరేషన్ ఏమీ లేదు. ఏం మిస్సవుతున్నారు? అక్కడ ఒక సుప్రీం పవర్‌లా మమ్మల్ని గైడ్ చేసే బిగ్‌బాస్ వాయిస్‌ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా అక్కడి కెమెరాలను కూడా. ఇంట్లోవాళ్ల పేర్లు పెట్టి వాటితో మాట్లాడేవాడిని. రిగ్రెట్ నేను రిగ్రెట్ అయ్యే విషయాలేమీ లేవు. చెరుకు రసం టాస్క్ ఫిజికల్‌గా చాలా కష్టమనిపించింది. ఫ్రీజింగ్ టాస్క్ మెమరబుల్. ఇక వేరే ఏ విషయాలు నాకు ఎక్కువ గుర్తులేవు. దాదాపు 100 రోజులు హౌస్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం నేర్చుకున్నారు? నాకు ఫుడ్, నిద్ర, టీవీ అంటే చాలా ఇష్టం. 20 ఏళ్లుగా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైనా కంట్రోల్ చేసుకోవడం అలవాటైంది. నేను ఓవర్కం చేయగలిగాను. ‘సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేస్తడు. మరి ఇక్కడ కూడా కొట్లాటలు పెట్టుకుంటాడేమో’ అని అమిత్ తివారీ గురించి అనుకున్నాడు రోల్‌రైడా. ‘తలకు రంగు, చూడ్డానికి వింతగా ఉన్నాడు. ఈ ఇంట్లో ఎలా ఉంటాడో’ అని రోల్‌రైడా గురించి అనుకున్నాడు అమిత్ తివారీ. బిగ్‌బాస్ హౌస్ ఎంట్రీలో ఒకరినొకరు చూసి వీరు మనసులో అనుకున్న మాటలివీ... -
డబ్బులిచ్చి బిగ్‌బాస్ విజేత కాలేదు: కౌశల్
సాక్షి, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్–2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ మండ అన్నారు. అంత కోటీశ్వరుడినే అయి ఉంటే తన తండ్రి బీహెచ్‌పీవీలో ఉద్యోగం చేసే వారే కాదన్నారు. తన అభిమానుల ఓటింగ్ వల్లే విన్నర్ అయ్యానని తెలిపారు. కౌశల్ ఆర్మీని దుషించేవారిని మట్టికరిపిస్తానని హెచ్చరించారు. భెల్ (హెచ్‌పీవీపీ) మైదానంలో బుధవారం రాత్రి తన అభిమానులు నిర్వహించిన సభలో కౌశల్ పాల్గొన్నాడు. తొలుత తన తల్లి లలిత కుమారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. (బిగ్‌బాస్ విజేత కౌశల్) తాను బీహెచ్‌పీవీ ప్రాంతంలో పుట్టి, విద్యాభ్యాసం అంతా టౌన్షిప్ క్వార్టర్స్‌లోనే కొనసాగించానని గుర్తుచేశారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు, ఆటలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుతెచ్చుకున్నారు. కళాకారుడిగా తన తండ్రి సుందరయ్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని అందువల్లే సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. ఆ తరువాత ఫ్యాషన్‌పై మక్కువతోనే హైదరాబాదు వెళ్లిపోయినట్టు చెప్పారు. అనంతరం అనేక సంఘాలు, వివిధ పార్టీలు, అసోసియేషన్ సభ్యులు కౌశల్‌ను ఘనంగా సన్మానించారు. కౌశల్ ఆర్మీని విస్తరిస్తా.. పెదవాల్తేరు(విశాఖతూర్పు): కౌశల్ ఆర్మీని మరింత విస్తరిస్తానని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ పేర్కొన్నారు. ఆయన పెదవాల్తేరులోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో పర్యటించి కౌశల్ ఆర్మీ సభ్యులను కలుస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కౌశల్‌ఆర్మీ తరపున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో పడిన బాధ వర్ణణాతీతమన్నారు. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలతోపాటు క్యాన్సర్ రోగుల వైద్యానికి తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని కౌశల్ వెల్లడించారు. చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా.. బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్! -
బిగ్‌బాస్–2 కౌశల్ మనోడే
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు బుల్లితెర నటుడు కౌశల్ మండ. ఈ షో ద్వారా ఎందరో అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన్ని అభిమానించే వాళ్లలో మహిళల శాతమే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేసి తమ ప్రేమను చాటుకున్నారు. బిగ్‌బాస్–2 విజేతగా కౌశల్ నిలవడంతో ముఖ్య పాత్ర పోషించారు. ఇంతకీ కౌశల్ ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. ఆయన మన విశాఖ వాసే. గాజువాక ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఆయన తండ్రి మండ సుందరయ్య బీహెచ్‌పీవీ విశ్రాంత ఉద్యోగి. కౌశల్ గెలుపులో గాజువాక ప్రాంత వాసుల భాగస్వామం ఉంది. కౌశల్‌తో తమకున్న జ్ఞాపకాలను ఆయన బాల్య స్నేహితులు, కుటుంబ సన్నిహితులు ‘సాక్షి’తో పంచుకున్నారు. కౌశల్ తల్లిదండ్రులు లలిత కుమారి, సుందరయ్యలు గాజువాక ప్రాంతంలో నివసించేవారు. ఐదేళ్ల వయసులోనే కౌశల్ బెస్ట్ హెల్తీ బాయ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడని సుందరయ్య తెలిపారు. బీహెచ్‌పీవీ కళావేదికపై కౌశల్ ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. బీహెచ్‌పీవీ పాఠశాలలోనే 10వ తరగతి, గాజువాక ప్రాంతంలోని కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత మెటలర్జీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ దశలోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడని కౌశల్ తండ్రి తెలిపారు. 2000లో సినీ రంగ ప్రవేశం చేసిన కౌశల్ ఇప్పటి వరకు 70 సినిమాల్లో నటించాడని వివరించారు. ప్రముఖ హీరోల సరసన నటించాడని, మూడు సినిమాల్లో ప్రధాన భూమిక వహించాడని చెప్పారు. పలు సీరియళ్లలో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, మోడలింగ్ రంగంలో విశేషంగా రాణించాడని సుందరయ్య వివరించారు. కౌశల్‌ను సన్మానించేందుకు టౌన్షిప్ ప్రాంత వాసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌశల్ ఎంతో మందికి ప్రేరణ కౌశల్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. చిన్నతనం నుంచి నటనలో రాణించాడు. నాటక, బుల్లి తెర, వెండితెరలో మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్–2 విజేతగా అవతరించడం ఆనందంగా ఉంది. కౌశల్ నాకు బాల్య మిత్రుడు. ఆయనతో గడిపిన క్షణలు ఇప్పటికీ గుర్తున్నాయి. – రాంజానే, షార్ట్‌ఫిల్మ్ మేకర్, భెల్ ఉద్యోగి మంచి స్నేహితుడు కౌశల్ మంచి స్నేహితుడు కౌశల్. స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తాడు. కౌశల్ నగరానికి వచ్చిన ప్రతిసారి తమను కలుస్తాడు. ఆ రోజు మాకు పండగే. ప్రతి క్షణాన్ని పండగలా జరుపుకుంటాం. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ అంటే కౌశల్‌కు ఎంతో ఇష్టం. – ప్రశాంత్, బాల్య స్నేహితుడు నటన వారి కుటుంబంలోనే ఉంది కౌశల్ తండ్రి సుందరయ్య బీహెచ్‌పీవీ ఉద్యోగిగా ఉన్న సమయంలో అసోసియేషన్ ఏర్పాటు చేసి నాటికలు వేసేవారు. కౌశల్ కూడా నటన రంగంలో రాణిస్తున్నాడు. అందివచ్చిన మంచి అవకాశాన్ని కౌశల్ సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పవచ్చు. కౌశల్ నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. – శ్యాం, స్నేహితుడు చెప్పలేనంత ఆనందంగా ఉంది బీహెచ్‌పీవీ టౌన్షిప్లో మా అందరితో కలసి మెలసి తిరిగిన కౌశల్ ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఎంతో ఆనందంగా ఉంది. కౌశల్ కోసం బిగ్‌బాస్ షో క్రమం తప్పకుండా చూశాను. చాలా మంది ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఆయన ఇక్కడకు విచ్చేస్తే ఘన స్వాగతం పలుకుతాం. – శ్రీదేవి, కౌశల్ కుటుంబ సన్నిహితురాలు -
అదే పెద్ద విక్టరీ అనుకుంటున్నా: దీప్తి
‘బిగ్‌బాస్ 2’లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇన్ని రోజులు ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాననే బాధ అనిపించిందా? కచ్చితంగా బాధగానే ఉంది. దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసే ‘బిగ్‌బాస్ 2’లో అడుగుపెట్టాను. మా అమ్మ, భర్త శ్రీకాంత్, కొడుకు సిద్ధార్థ్.. ఇలా మా కుటుంబ సభ్యులందరి సపోర్ట్‌తో బిగ్‌బాస్‌కి వెళ్లగలిగాను. జనరల్‌గా అమ్మాయిలకు పెళ్లయితే కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ, నాకు అలాంటివేం పెట్టలేదు. ఇంత మంచి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు. నాకు బాధ అనిపించినప్పుడల్లా వారి మాటలు నన్ను చాలా మోటివేట్ చేశాయి. ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని గట్టిగా ఉన్నా. మా కుటుంబ సభ్యులను చూశాక కన్నీళ్లు ఆగలేదు. నాకే కాదు. బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందరి పరిస్థితి ఇంతే. వందరోజుల్లో కనీసం నాపేరు 100 సార్లైనా తలచుకున్నావా? అని మా అబ్బాయి సిద్ధార్థ్ అడిగాడు.100కంటే ఎక్కువ సార్లు తలచుకున్నా. మీరెందుకు గెలవలేకపోయారు? ఏ ఆటలో అయినా విజేత అనేవాడు ఒక్కడే ఉంటాడు. షో నుంచి బయటికొచ్చాక చాలా మంది నన్ను కలిసి ‘విజేతగా మిమ్మల్ని కూడా మేము ఊహించుకున్నాం. కనీసం రన్నరప్లో అయినా ఉంటారనుకున్నాం’ అంటుంటే వారి మనసులను గెలుచుకున్నామనే హ్యాపీ ఉంది. ఆట ఆడటానికొచ్చినప్పుడు గెలిచినా.. ఓడినా, ఎలిమినేట్ అయినా స్పోర్టివ్‌గా ఉండాలనుకున్నా, ఉన్నాను. గెలవాలనే తాపత్రయం మా 17 మందిలో ఉండేది. కౌశల్ కూడా మాలో ఒక్కడే కదా? తను గెలిస్తే ఏంటి? సంతోషమే కదా? ‘బిగ్‌బాస్ 1’లో శివబాలాజీ విజేతగా నిలిచారు. ‘బిగ్‌బాస్ 2’లో కౌశల్ గెలిచారు. రెండు సీజన్స్‌లోనూ అబ్బాయిలే గెలిచారు. అమ్మాయిలను అణిచేశారనే భావన ఏమైనా ఉందా? అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ‘బిగ్‌బాస్’ టాస్క్‌లు ఇచ్చేటప్పుడు అబ్బాయిలకు ఒకలా.. అమ్మాయిలకు మరోలా ఇవ్వలేదు కదా? అందరికీ ఒకే టాస్క్‌లు ఇచ్చారు. ఎవరైనా ఒక్కటే అని ప్రేక్షకులు కూడా ఆటని ఆటలా చూశారు. అందుకే కదా ఫైనల్ వరకూ వెళ్లా. విజేత ఎవరన్నది చివరకు ప్రేక్షకులే నిర్ణయించారు. కౌశల్ ఎందుకు గెలిచారనుకుంటున్నారు? గేమ్ పరంగా ఆయన ఫోకస్ ప్లస్ అయింది. ఆయన గెలవడానికి అన్ని కారణాలు కలిసొచ్చాయి. అన్ని వర్గాలు ఆయన విజయానికి హెల్ప్ అయ్యాయి. కౌశల్ గెలవడానికి పూర్తి అర్హత ఉందని మీ నమ్మకమా? ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్న 17 మందికి గెలిచే అర్హత ఉంది. అయితే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలించవు.. మరికొన్ని సార్లు అనుకూలిస్తాయి. ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్నందుకు ఏమైనా అసంతృప్తి ఉందా? లేదు. ప్రతి టాస్క్‌లో నేను ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంత ఇచ్చాను. అందరితో మంచి స్నేహం కుదిరింది. గీతామాధురి అక్కతో కలిసి ఒకటో రెండో షోలు చేశా. ఓ రోజు విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాజువల్‌గా మాట్లాడాను. గీత అక్కతో తప్ప షోలో పాల్గొన్నవారిలో ఎవరితోనూ కనీసం ముఖ పరిచయం కూడా లేదు. నేనూ, గణేశ్ ఇంచుమించు ఒక్కటే అని చెప్పొచ్చు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంతవరకూ వెళ్లి ఫైనల్ వరకూ నిలవడమే ఓ విక్టరీగా భావిస్తున్నా. -
బిగ్ ఫ్యాన్ బేస్
లైట్స్ ఆఫ్ అయ్యాయి... బిగ్‌బాస్ తలుపులు మూసుకున్నాయి. షో ముగించుకుని కోట్లాది అభిమానుల హృదయాలలో తలుపులు తెరుచుకుంటూ నాని బయటకు వచ్చారు. చేయగలనో లేదో.... సక్సెస్ అవుతుందో లేదో... సీజన్ 1తో పోల్చి చూస్తారో ఏమో... వీటన్నింటి మధ్యా షో పెద్ద హిట్ అయ్యింది. ఇంటింటి టీవీని ‘నా...నీ’... టీవీగా మార్చుకున్న నానితో స్పెషల్ ఇంటర్వ్యూ. ∙‘బిగ్‌బాస్’ ముగిసింది. ఇక ‘నా.. నీ... టీవీలో’ అంటూ చిన్నితెరపై కనిపించరు... బిజీ తగ్గి రిలాక్స్ అవుతున్నారా?నాని: అవును. నా లోపల నుంచి ఏదో పెద్ద బరువు బయటకు వెళ్లిపోయినట్టు అనిపించింది. చాలా లైట్‌గా ఫీల్ అవుతున్నాను. ‘బిగ్ బాస్’ అయిపోయింది అని కాదు. గత నాలుగు నెలల్లో ఒక్క పూట కూడా సెలవు తీసుకోలేదు. చిన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్‌లో చివరి పరీక్ష అయిపోతే ‘ఏయ్ .. సమ్మర్ హాలీడేస్’ అని గంతులేస్తాం కదా. నా పరిస్థితి అలా ఉంది. శనివారం, ఆదివారం రెండు రోజులే కనిపించినా హౌస్‌మేట్స్‌ను ఫాలో అవుతూ షోకు ప్రిపేర్ అవుతూ అదంతా పెద్ద పని. ఎట్టకేలకు ముగిసింది. అందుకే ఆనందం. బుల్లితెరకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నారా? దూరంగా ఉండటమేమీ లేదు. ఒకవేళ ఏదైనా షో కమిట్ అయితే ఆ టైమ్‌లో వేరే సినిమా లేకుండా చూసుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ టైమ్ అస్సలు ఉండటం లేదు. మా బుడ్డోడు ఎదుగుతున్నాడు. ఈ టైమ్‌లో ఫ్యామిలీని మిస్ అవ్వకూడదు. ఇలాంటి టైమ్ తిరిగి రాదు కదా. బిగ్ బాస్ ప్లెజర్‌గా అనిపించిందా... ప్రెషర్గా అనిపించిందా? ప్రెషరే. ఆ గేమ్ ఫార్మాటే అలాంటిది. అందర్నీ ఆనందపరచలేం. ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరేట్ ఉంటారు. మనమేమో పక్షపాతం చూపించకూడదు. హోస్ట్‌కి నచ్చినవాళ్లంటూ స్పెషల్‌గా ఉండకూడదు. అందరూ సమానమే. అది కొంచెం ప్రెషర్గా ఉంటుంది. ఈ మధ్య ‘దేవదాస్’ ప్రమోషన్ కోసం ఎక్కడికి వెళ్లినా ‘బిగ్ బాస్’ గురించి అడిగేవాళ్లు. కొత్త ఫ్యాన్ బేస్ వచ్చిందని అర్థమైంది. ప్రతి వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాలి. ‘మీరు ఎలిమినేట్ అయ్యారు..’ అని చెప్పేటప్పుడు బాధగా ఉండేదా? కొంచెం బాధ ఉంటుంది. ఎలిమినేట్ అయ్యేవాళ్ల ‘బిగ్ బాస్ జర్నీ వీడియో’ బ్యూటిఫుల్‌గా ఉండాలి. వాళ్లు ఇంటికి వెళ్తున్నారు కాబట్టి పాజిటివ్‌గా ఉండాలి. నెగటివ్‌గా ఉండకూడదని చెబుతుండేవాణ్ని. ఎలిమినేట్ అయ్యారు అనే మాట చెప్పే ముందు సంఘర్షణ అనిపించేది. హోస్ట్‌గా కాకుండా మిమ్మల్ని ఆ హౌస్‌లో ఉండమంటే ఉండగలుగుతారా? అన్ని రోజులు. లేదు. ఇంపాజిబుల్. ఆడియన్స్‌కు బిగ్ బాస్ హౌస్ చూపించడానికి షూటింగ్ కోసం మూడు గంటలు ఉన్నాను. ఆ రెండు మూడు గంటలే చాలా ఎక్కువ అనిపించింది. రెండు సీజన్స్‌లో అబ్బాయిలనే గెలిపించారు. అమ్మాయిల్ని తక్కువ చేశారా? (నవ్వేస్తూ) గెలిపించింది మేం కాదు. ప్రేక్షకులే. వాళ్లని అడగాలి ఈ ప్రశ్న. ఇదంతా ఓటింగ్ విధానం. ఓటింగ్ పారదర్శకంగానే జరుగుతుందా అనే అనుమానాలు బయటి వాళ్లకు ఉంటాయి? అంతా పారదర్శకంగా జరిగింది. హిందీ, తమిళం, తెలుగు ‘బిగ్ బాస్’.. అన్ని భాషల ఓటింగ్స్ ఒకే ఏజెన్సీ చూసుకుంటుంది. షూటింగ్ జరిగే 3–4 గంటల ముందు రిజల్ట్ మాకు చెబుతారు. వెంటనే ఎలిమినేట్ అయ్యేవాళ్ల వీడియోలు రెడీ చేయాలి. ఎవరెళ్తున్నారో తెలియదు కాబట్టి అందరి వీడియోలు రఫ్‌గా కట్ చేసి పెట్టుకుంటాం. మాకు రిజల్ట్ తెలిశాక వీడియో ఫైనల్ చేసి అప్లోడ్ చేయాలి. కొన్ని షోస్‌కి ప్రైజ్‌మనీ అది ఇదీ అంటారు. ఇది మాత్రం అలాంటి షో కాదు. పూర్తి పబ్లిక్ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సీజన్ 3 చేయమంటే చేస్తారా? ఇదే నా లాస్ట్ సీజన్. నిన్ననే ట్విట్టర్లో అనౌన్స్ చేశాను కూడా. మొదట్లో ఎన్టీఆర్‌తో పోల్చారు అప్పుడు ఎలా అనిపించింది? పోలికలు ఉంటాయి అని ముందే తెలుసు. సీజన్ 2కి వచ్చే సరికి టాస్క్‌లు కొన్ని అగ్రెసీవ్‌గా ఉన్నాయి. ఈ సీజన్ బ్లాక్‌బస్టర్. మొదట్లో కొంచెం నెగటివిటీ వచ్చింది. ఆకాశానికి ఎత్తేసిన ఆర్టికల్స్ చూశాను. కిందకి దించేసినవీ చూశాను. అప్స్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సక్సెస్ అనేది బోనస్. ఈ హోస్టింగ్ కూడా చాలెంజ్‌గా తీసుకున్నాను. నా బెస్ట్ ఇచ్చాను. ‘దేవదాస్’ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది ‘దేవదాస్’ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను పర్సనల్‌గా ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేశాను. ఇంతకు ముందు మల్టీస్టారర్స్ చేస్తారా అని అడుగుతుంటే స్క్రిప్ట్ వస్తే చేస్తాను అని చెప్పేవాణ్ణి. ప్రతిసారి ఇలా చెప్పడమే తప్పితే చేసే చాన్స్ వస్తుందా? అనుకున్నాను. నిజంగా మంచి స్క్రిప్ట్ వచ్చింది. డాన్, డాక్టర్ కాంబినేషన్ సెట్ అయితేనే ఈ కథ సెట్ అవుతుంది. అలా కాకపోతే ఆ సినిమా చేసి ఉపయోగం లేదనిపించింది. లక్కీగా నాగ్ సార్‌కి కూడా స్క్రిప్ట్ నచ్చింది. చేసేటప్పుడే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో లేకుండా చేశాం. ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో కూడా మంచి స్క్రిప్ట్ వస్తే మల్టీస్టారర్ సినిమా తప్పకుండా చేస్తాను. సినిమాలో మీ కళ్లద్దాలు, బాడీ లాంగ్వేజ్ బావుంది. పాత్ర కోసం డాక్టర్స్‌ని పరిశీలించడం లాంటివి ఏవైనా చేశారా? మా కజిన్స్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో డాక్టర్స్ చాలామందే ఉన్నారు. అమ్మ చాలా కాలం డాక్టర్స్‌తో వర్క్ చేశారు. సో కొంచెం ఐడియా ఉంది. అది నా యాక్టింగ్‌లోకి ట్రాన్స్ఫామ్ అయింది అని అనుకోను. యాక్టింగ్ అనేది డిఫరెంట్ గేమ్. యాక్టింగ్ అంతా మన అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది. అలానే మా సినిమాలో డాక్టర్ హీరోలా కనబడకూడదు. డాక్టర్ డాక్టర్లా కనబడాలి. లుక్ ట్రైల్స్ చాలా చేశాం. అందరికీ ఈ లుక్ నచ్చింది. నాని ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తాడు అని మీ మీద ఆడియన్స్‌లో ఓ అభిప్రాయం ఏర్పడింది. అలాంటివి మీకు భయం కలిగిస్తాయా? భయం కంటే కూడా బాధ్యత అనిపిస్తుంది. ఓహో మన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు జాగ్రత్తగా చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఏ అంచనాలు లేకపోతే ఫర్లేదు.. బానే ఉందిలే అనుకుంటాం. కానీ ఇలాంటి అంచనాలు ఉన్నపుడు మనల్ని మనమే ఇంకా పుష్ చేసుకుంటాం మంచి అవుట్‌పుట్ కోసం. ఒక రకంగా అది యాక్టర్‌కి మంచిది. మనకి అభినందనలు వచ్చాయి అని ఎగరకుండా మనల్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటుంటాను. యాక్టర్‌గా ఎదుగుతున్నాను అని అంటున్నారంటే అది ప్రేక్షకులు చూపిస్తున్న నమ్మకమే. నాని ‘ఈ ఇమేజ్ ఉన్న హీరో’ అని ఓ బ్రాండ్ లేకపోవడంతో మీరు ఏ స్క్రిప్ట్ అయినా ఎంచుకోవచ్చు. మీకున్న అడ్వాంటేజ్ అది అని భావిస్తారా? అవును. దాని వల్లే పూర్తి కమర్షియల్ సినిమాల్లో కనిపించగలుగుతున్నాను. అసలు కమర్షియల్ ఎలిమెంట్ అనేది లేని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా కథలు చెప్పాలి అనుకోవడం, వరుసగా అన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం వల్ల స్క్రిప్ట్స్ వినడానికి కూడా సమయం దొరకడం లేదు. ఈ ప్రాసెస్‌లో కొన్ని మిస్ అవుతూనే ఉన్నాను. నెక్స్ సినిమాలు ‘జెర్సీ’ ఒక్కటే ఫిక్స్ అయ్యాను. 4 సినిమాల వరకూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏది ఫస్ట్ పట్టాలెక్కుతుందో మాత్రం చెప్పలేను. హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లున్నారు? అవును. ప్లేస్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఈ నెల 18 వరకూ హాలీడే. 18కి తిరిగి వచ్చేస్తాను. ఆ తర్వాత ‘జెర్సీ’ షూటింVŠ స్టార్ట్ చేస్తాను. -
బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 తెలుగు టైటిల్‌ను కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. ఆయన విజయంలో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. గెలిపించడమే కాదు దాదాపు ఈ రియాల్టీ షోను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. సోషల్ మీడియా వేదికగా వీరు చేసిన హంగామ అంత ఇంత కాదు. తమ అభిమాన కంటెస్టెంట్ జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి హోస్ట్ నానిని కూడా. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. నిజానికి ఈ సీజన్ బిగ్‌బాస్‌ను సోషల్ మీడియానే శాసించింది. మూడు భాషల్లో తమ అభిమాన కంటెస్టెంట్స్ పేరిట ఏర్పాటైన ఆర్మీలే గేమ్ ఆడించాయి. (చదవండి: బిగ్‌బాస్ విజేత కౌశల్) తెలుగులో కౌశల్ ఆర్మీ.. మళయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీలే పై చేయి సాధించాయి. మూడు భాషల్లో ఫైనల్ ఆదివారమే జరగగా.. మూడింట్లో ఈ ఆర్మీలే అంతిమ విజయం సాధించాయి. మలయాళంలో సబుమోన్ అబ్దుసమద్ టైటిల్ గెలవగా.. తమిళంలో రిత్వికా విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ మూడు ఆర్మీ గ్రూప్‌లు ఒకరికి ఒకరు మద్దతుగా ప్రచారం చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్‌లు క్యాంపెన్ నిర్వహించాయి. (చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..) గత తమిళ బిగ్‌బాస్ సీజన్లో ఓవియా కంటెస్టెంట్‌కు మద్దతుగా తొలిసారి ఓవియా ఆర్మీ ఏర్పాటైంది. అక్కడి నుంచి తొలిసారి దక్షిణ భారత దేశంలో ఈ ఆర్మీ సంస్కృతి పుట్టుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓవియా ఆర్మీ ఆమెను గెలిపించలేకపోయింది. కానీ ఈ సారి ఏర్పాటైన ఆర్మీలు మాత్రం విజయవంతంగా తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించాయి. (చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) #BiggBossTamil2 - #Riythvika #RiythvikaArmy #Biggbossmalayalam - #Sabu #SabuArmy #BiggBossTelugu -#Kaushal #KaushalArmy pic.twitter.com/ptTe5pjPcC — Shanu (@shanum8) September 26, 2018 #KaushalArmy #SabumonArmy Sabumon army is voting for Kaushal ✌️✌️💪💪💪💪💪💪💪#BiggBoss2Telugu pic.twitter.com/cAXFfn6gKT — VD7 (@Vishnu7dev) September 27, 2018 -
ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-2 సీజన్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో మునిగిపోయాడు కౌశల్. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఫ్యాన్స్‌తో తన విన్నింగ్స్ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. తొలుత అతని కోసం బయటవేచి ఉన్న అభిమానులను చూసిన కౌశల్ ఉప్పొంగిపోయాడు. ఈ క్రమంలోనే కారుపైకి ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. ఇక్కడ కౌశల్‌ను ఫొటోలు తీయడానికి ఫ్యాన్స్ పోటీ పడగా, వారిని అలానే చూస్తూ ఉండిపోవడం అతని వంతైంది. ‘మాటల్లేవ్’అన్న ఫీలింగ్ మాత్రమే ఇక్కడ కౌశల్ ముఖంలో కనిపించింది. ఒకింత ఆనంద బాష్పాలతో మురిసిపోయాడు కౌశల్. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో భాగంగా టాప్ ఐదుగురు కంటెస్టెంట్లో ముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. బిగ్‌బాస్ విజేత కౌశల్ -
టైటిల్‌ను గెలిచిన ఆనందంలో ఫ్యాన్స్‌తో కలిసి ఇలా..
-
బిగ్‌బాస్ విజేత కౌశల్
బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్ నిలిచాడు. తుది పోరుకు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తి, తనీష్, సామ్రాట్లు చేరిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధిక ఓటింగ్‌తో కౌశల్ విజేతగా అవతరించాడు. కౌశల్ అందరికీ కంటే ఎక్కువ ఓట్లతో టాప్‌లో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కౌశల్ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. దాదాపు 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఓవరాల్ కంటెస్టెంట్లకు రాగా, ఇందులో దాదాపు 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్ కే పడినట్లు తెలిసింది. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో టాప్ ఐదుగురు కంటెస్టెంట్లోముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. ఈ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నాడు కౌశల్. కౌశల్ ఓ సాధారణ మోడల్‌గా, సీరియల్స్ నటుడిగా బిగ్‌బాస్ హౌస్‌లోనికి అడుగుపెట్టాడు. కానీ.. అసాధారణ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ప్రధానంగా తన ముక్కుసూటితనం అతనికి కలిసొచ్చింది. అదే సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చే టాస్క్‌ల్లో కూడా కౌశల్ తనదైన ముద్ర వేశాడు. బిగ్‌బాస్ సుదీర్ఘ జర్నీలో ఆది నుంచి చివరి వరకూ ఒంటరి పోరాటం చేస్తూ.. బిగ్‌బాస్ గేమ్ షోకే ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడనడంలోఎలాంటి అతిశయోక్తి లేదు. కౌశల్ పేరు దేశవిదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నోటివెంట గత వంద రోజులుగా పలుకుతూనే ఉంది. కౌశల్ ఆర్మీ పేరుతో ప్రత్యేక ఫ్యాన్స్ సంఘం కూడా ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి లాంటి అనేక ప్రాంతాల్లో కౌశల్ ఆర్మీ 2కే రన్ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. కేవలం కౌశల్ ఆర్మీ అనేది సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే ఉన్న పెయిడ్ గ్రూపంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి ముందుగానే వెళ్లిపోయిన కొంతమంది కంటెస్టెంట్స్ ప్రచారం చేశారు. దీనికి కౌశల్ ఆర్మీ ధీటుగానే బదులిచ్చింది. కొంతమంది తాము కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. వాస్తవ ప్రపంచంలో ఉన్నామని నిరూపించడానికి ఈ ర్యాలీలను చేపట్టారు. బిగ్‌బాస్‌లో ఏకంగా 11సార్లు నామినేట్ అయి కూడా సేఫ్ జోన్‌లోనికి వెళ్లాడు. ప్రధానంగా తన పట్టుదల, ఎలాంటి పరిస్థితులకూ తగ్గని నైజం, నిజాయతీ, కష్టపడే తత్వం, ఎన్ని అవరోధాలు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యం.. ఇవన్నీ కౌశల్‌లో జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ బిగ్‌బాస్ సీజన్లో కౌశల్ పేరే ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. తొలుత సాధారణ వ్యక్తిలా మాత్రమే అభిమానులు చూసినా క్రమేపీ అతనిపై అభిమానం పెంచుకుంటూ వచ్చారు. ఇలా ఫ్యాన్స్ చూపిన అభిమానమే కౌశల్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. -
బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2కు మరి కొన్నిగంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. సోషల్ మీడియాలో అత్యంత హైప్ క్రియేట్ అయిన ఈ రియాల్టీ షో విన్నర్ ఎవరో ఈ రోజే తెలియనుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఓ ట్రెండ్ సృష్టించింది. హౌస్‌లో అనేక గొడవలు, ఆటలు, పాటలు, ఎలిమినేషన్స్.. హౌస్మేట్స్ రిలేషన్స్‌లతో తెలుగు ప్రజలు ఈ రియాల్టీ షోను తెగ ఎంజాయ్ చేశారు. తమే గేమ్ ఆడుతున్నట్లు ఇన్వాల్వ్ అయ్యారు. (చదవండి: కిరీటి ఇది మగతనమా?: నాని ఫైర్) ఇప్పుడు ఎక్కడ చూసిన విన్నర్ ఎవరు.. రన్నర్ ఎవరనే చర్చ. అయితే కౌశల్‌కు మద్దతుగా నిలిచే కౌశల్ ఆర్మీ బిగ్‌బాస్ సెట్ ముందు హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ బిగ్‌బాస్ సెట్ ముందు శనివారం రాత్రి సుమారు మూడువందల మంది కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్.. కౌశల్ అని అరుస్తూ హల్చల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్ షూట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కౌశల్ ఆర్మీ సెట్ చుట్టూ అనేక పోస్టర్లు అంటించారు. భారీ బందోబస్తు మధ్య ఫైనల్ షూట్‌ను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం. విన్నర్ కౌశల్.. మరోవైపు హౌస్‌లో తనదైన స్టైల్లో విభిన్నంగా గేమ్ ఆడిన కౌశలే బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మంది సెలబ్రిటీలు సైతం కౌశల్ విన్నర్ అయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి మాధవిలత తన ఫేస్బుక్లో కౌశల్ ఆర్మీ అభినందనలు.. కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్ చేశారు. ఆమెనే కాక చాల మంది కౌశల్ విన్నర్ అయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కౌశల్ ఆర్మీ అయితే విన్నర్ కౌశలే కానీ రన్నరప్ ఎవరనీ పోస్టులు పెడుతున్నాయి. ఫైనల్ ట్రోఫీ అందించడానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఫైనల్‌కు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తీలు చేరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ అందుకోనున్నారు. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు) View this post on Instagram A post shared by Harika Innamuri (@harika_innamuri) on Sep 29, 2018 at 10:35am PDT Patience , hardworking , focused many of them inspired congratulations #Kaushal anna bb2 title ❤❤❤❤❤😎😎#kaushalbbt2sensation #KaushalArmy #Kaushal #BiggBossTelugu2 #KaushalBB2Winner #KaushalManda pic.twitter.com/5UGzyjRWXc — Abhi (@AbhiSai008) September 30, 2018 -
తమిళ బిగ్‌బాస్‌లో తెలుగు హీరో
ఇప్పటికే తెలుగు బిగ్ బాస్‌లో సందడి చేసిన టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌లో అడుగు పెడుతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ద్విభాష చిత్రం ‘నోటా’ ప్రమోషన్ కోసం విజయ్ తమిళ బిగ్‌బాస్ షోకు వెళ్లాడు. లోకనాయకుడు కమల్ హాసన్ అక్కడి బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోకు వెళ్లి.. అక్కడ స్టేజ్ పై తన సినిమాను ప్రమోట్ చేసుకునే అవకాశం విజయ్ దేవరకొండకే దక్కింది. అక్టోబర్ 5న విడుదల కానున్న ‘నోటా’ సినిమాను తమిళ బిగ్‌బాస్ లో ప్రమోట్ చేసుకున్నాడు ఈ సెన్సెషన్ స్టార్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.