Boman Irani
-
అత్తారింటికి దారేది నటుడికి ప్రతిష్టాత్మక అవార్డ్!
టాలీవుడ్ మూవీ అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీకి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రానికి గానూ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. తాజా చిత్రం ది మెహతా బాయ్స్‌లో నటనకు ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. అత్తారింటికి దారేదీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బోమన్.తాజాగా టోరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఏషియా కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. తండ్రి, కుమారుల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో ది మెహతా బాయ్స్ అనే చిత్రాన్ని బోమన్ ఇరానీ తెరకెక్కించారు. కాగా.. అంతకుముందే సెప్టెంబరు 20న చికాగోలో జరిగిన సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ది మెహతా బాయ్స్ మూవీ ఆయనకు మరో ఘనతను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ఆస్కార్-విజేత అలెగ్జాండర్ డినెలారిస్ కథ అందించారు. ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రానుంది. -
చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!
బొమన్ ఇరానీ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదీ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. 2003లో డర్నా మనా హై చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బొమన్ ఇరానీ.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లో అత్తారింటికీ దారేదీ మూవీతో ఫేమస్ అయ్యారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ మూవీ డంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి రాకముందు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ వివరాలేంటో చుద్దాం. మధ్య తరగతి పార్సీ కుటుంబంలో జన్మించిన బోమన్ ఆరు నెలల వయస్సులోపే తండ్రిని కోల్పోయాడు. ముంబయిలో పుట్టిన పెరిగిన బొమన్ ఇరానీ.. ఆయన కుటుంబం కోసం చిన్న చిన్న పనులు కూడా చేశారు. బాలీవుడ్‌లోకి రాకముందు బొమన్ ఇరానీ తాజ్ మహల్ హోటల్లో వెయిటర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఆయన తల్లికి చిన్నపాటి చిరుతిళ్ల దుకాణం ఉండేది. అందులోనూ బొమన్ ఇరానీ పనిచేస్తూ తన తల్లికి అండగా నిలిచారు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాకుండా తాను డైస్లెక్సియా అనే వ్యాధితో పోరాడినట్లు తెలిపారు. (ఇది చదవండి: 'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్) వెయిటర్‌గా.. బోమన్ ఇరానీ మాట్లాడుతూ..' నాకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పాసయ్యాక వెయిటర్ కోర్సు చేశాను. వెయిటర్‌గా 6 నెలల కోర్సులో చేరా. వెయిటర్ ఉద్యోగం కోసం తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లా. ఆ తర్వాత హోటల్లో ఆరు నెలల పాటు రూమ్ సర్వీస్‌లో పనిచేసి.. ఏడాదిన్నర తర్వాత వెయిటర్‌గా మారానని' తెలిపారు. తల్లి కోసం తన ఉద్యోగాన్ని వదిలి.. బోమన్ తల్లి ప్రమాదానికి గురికావడంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తమ దుకాణాన్ని నడపాలని నిర్ణయించుకున్నాడు. అలా 14 ఏళ్లపాటు బోమన్ దుకాణాన్ని నడిపాడు. అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉండేదని..తాను అనుకున్న లక్ష్యం కోసం శ్రమించాడు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) ఫోటోగ్రాఫర్ నుంచి నటుడిగా.. బోమన్‌కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతని తండ్రి కూడా ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో బోమన్ ఫోటోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. చాలా రోజుల తర్వాత బోమన్ సక్సెస్స అయ్యారు. ఆ సమయంలో ఒక స్నేహితుడు అతన్ని యాడ్‌లో నటించమని అడిగాడు. దీంతో అప్పటి నుండి అతను దాదాపు 180కి పైగా యాడ్స్‌లో కనిపించారు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించడానికి కూడా ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని నిర్మాత విధు వినోద్ చోప్రా చూశారు. ఇరానీ నటనను చూసి ఆయనకు మున్నా భాయ్ ఎంబీబీఎస్‌లో అవకాశమిచ్చారు. అలా ఆయన తన సినీ ప్రయాణం ప్రారంభించారు. ఈ మూవీ కోసం బోమన్ ఇరానికి రూ.2 లక్షలు ఆఫర్ చేశారు. ఆ తర్వాత బొమన్ ఇరానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దృష్టిలో పడ్డారు. అందివచ్చిన అవకాశంతో బాలీవుడ్లో నో ఎంట్రీ, ఖోస్లా కా ఘోస్లా, డాన్, లగే రహో మున్నా భాయ్, 3 ఇడియట్స్, హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్, జాలీ ఎల్ఎల్బీ,ఉంచాయ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో కనిపించనున్నారు. తెలుగులోనూ అత్తారింటికీ దారేది, బెంగాల్ టైగర్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. -
సెకండ్ హ్యాండ్ కారు కొన్న 'అత్తారింటికి దారేది' నటుడు..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్‌ను కొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతని కుటుంబ సభ్యులతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్! ) అయితే బోమన్ ఇరానీ కొన్నకారు కొత్తదేం కాదు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కొత్త మోడల్ అయినప్పటికీ.. ఈ కారును సెకండ్ హ్యాండ్‌లోనే ఆయన కొనుగోలు చేశారు. చాలా మంది సెలబ్రిటీలు ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ కారును బోమన్ ఇరానీ తన ఇంటికి తీసుకెళ్లారు. ఇండియాలో విరాట్ కోహ్లీతో పాటు ప్రీ-ఓన్డ్ కారును కలిగి ఉన్న చాలా మంది ప్రముఖులు ఉన్నారు. బాలీవుడ్లో, శిల్పాశెట్టికి ప్రీ-ఓన్డ్ కార్లంటే చాలా ఇష్టం ఆమె దాదాపు అన్ని లగ్జరీ కార్లు సెకండ్ హ్యాండ్ కార్లే. కాగా.. బోమన్ ఇరానీ అత్తారింటికి దారేది కీలక పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) View this post on Instagram A post shared by Auto Hangar Advantage (@autohangar.advantage) View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
ప్రభాస్-మారుతి చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదోక రూమర్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. చదవండి: ‘వరహరూపం..’ కాంతార లిరికల్ సాంగ్ రిలీజ్ బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించనున్నాడని అంటున్నారు. ఇందులో ఆయన ప్రభాస్ తాతగా కనిపించనున్నారని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా బొమన్ గతంలో పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పవన్ కల్యాణ్ తాత, బడా వ్యాపారవేత్తగా కనిపించారరు. దీంతో ఈ చిత్రంలో కూడా ప్రభాస్ తాతగా కనిపించనున్నాడని తెలిసి మరిన్ని అంచనా నెలకొన్నాయి. ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, అసలు మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు -
అమ్మ చివరి క్షణాల్లో అవి కావాలంది: నటుడు
నటుడు బొమన్ ఇరానీ తల్లి జెర్బానీ ఇరానీ ఇటీవల కన్ను మూసింది. ఆమె వయసు 94 సంవత్సరాలు. ‘ఆమె తన 32 ఏళ్లకే నాకు తల్లిగా తండ్రిగా మారింది’ అని గుర్తు చేసుకున్నాడు బొమన్. ‘ఆమె నన్ను సినిమాలు చూడమని ప్రోత్సహించి తప్పక పాప్‌కార్న్‌కు కూడా డబ్బులిచ్చి పంపేది. ఆ ప్రోత్సాహమే నన్ను నటుణ్ణి చేసింది’ అంటాడాయన. భర్త మరణించాక ఆమె చిన్న బేకరీ నడిపింది.. బొమన్ 40 ఏళ్లు దాటాక గాని సినిమాల్లో ఎదగలేదు. అప్పటి వరకూ ఆమె అతని అండా దండా. ఒక సింగిల్ మదర్‌గా ఆమె జ్ఞాపకాలు అతడు చెప్పినవి... బొమన్ ఇరానీ సినిమాల్లో వచ్చేటప్పటికి అతనికి 42 ఏళ్లు. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ రిలీజ్ అయ్యేటప్పటికి అతని వయసు అదే. అప్పటి వరకూ అతడు చేయని పని లేదు. ముంబై తాజ్‌మహల్ హోటల్లో వెయిటర్‌గా పని చేశాడు. కాపీ 20 రూపాయల లెక్కన అమ్మే ఫొటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఆ తర్వాత బేకరి రన్ చేశాడు. అవును. తన బేకరీనే. తన తల్లి నడిపే బేకరీ. ఏం చేసినా ఆ బేకరీ ఉందన్న ధైర్యం. తల్లి ఉందన్న ధైర్యం. బొమన్ కడుపులో పడగానే తండ్రి మరణించాడు. కడుపులో బిడ్డను ఉంచుకుని తల్లి జెర్బానీ ఇరానీ ఆ బాధంతా భరించింది. బొమన్ పుట్టాక అతనికి హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉండేది. దాంతో పాటు నంగిగా మాట్లాడేవాడు. తండ్రి నడుపుతూ మరణించిన చిన్న బేకరీనే జెర్బానీ నడుపుతూ బొమన్‌ను పెంచింది. ఆ బేకరీలో చిప్స్, శాండ్విచ్లు తప్ప పెద్దగా ఏమీ ఉండేవి కాదు. ఆ ఆదాయంతోనే వారు జీవించారు. ‘రోజూ స్కూల్ నుంచి వచ్చాక నన్ను మా అమ్మ సినిమాకు పంపేది. పాప్‌కార్న్‌కు డబ్బులు తప్పక ఇచ్చేది’ అని తల్లిని గుర్తు చేసుకున్నాడు ఇరానీ. ‘ఎన్ని కష్టాలు వచ్చినా రోజూ నాతో సాయంత్రం ఆ రోజు జరిగిన విషయాలు, ఇరుగుపొరుగువారి కబుర్లు చెప్పేది. ఆమె నన్ను తల్లి. తండ్రి అయి పెంచింది’ అంటాడు బొమన్. వెయిటర్ అయినా, పెళ్లి చేసుకుని తండ్రి అయినా, నాటకాలంటూ తిరిగినా తల్లి ఉందన్న ధైర్యంతో బొమన్ అవన్నీ చేశాడు. ‘కష్టం మీద మా జీవితంలో మొదటిసారిగా విహారానికి వెళితే అది కాస్తా పిచ్చి హోటల్లో విడిది దొరికి అభాసు అయ్యింది’ అని నవ్వుతాడు బొమన్. కాని ఆ తల్లీ కొడుకులు పడ్డ కష్టం వృథా పోలేదు. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ సినిమాతో బొమన్ సూపర్‌స్టార్ అయ్యాడు. గొప్ప డబ్బు, సంపద వచ్చి పడ్డాయి. తల్లిని చూసుకున్నాడు. ‘నువ్వు మెచ్చుకునే జనం కోసం నటుడుగా ఉండకు. ఉల్లాసపడే జనం కోసం నటుడుగా ఉండు. నటుడుగా నువ్వు జనాన్ని ఉల్లాసపరుచు అని మా అమ్మ నాతో అనేది’ అంటాడు బొమన్. ఫిబ్రవరి తొమ్మిదిన ఆమె మరణించింది. ‘చనిపోయే రోజు ఆమె కుల్ఫీ, కొంచెం మామిడి పండు అడిగింది. ఆమె చందమామనో నక్షత్రాలనో అడిగి ఉండవచ్చు. ఇప్పుడామె నక్షత్రంగా మారింది’ అని రాసుకున్నాడు బొమన్. ఒక పిల్లవాడు పెరిగి వృద్ధిలోకి వచ్చాడంటే అది ఊరికే జరిగిపోదు. దానివెనుక తల్లిదండ్రుల కఠోర శ్రమ, త్యాగం ఉంటాయి. తండ్రి లేకపోతే తల్లి పడే శ్రమ మరింత అధికం. ఇవాళ తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలతో పాటు వారిని దూరం పెట్టే పిల్లలూ తయారయ్యారు. ఈ రెండో కోవకు చెందిన వారంతా తమ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుంది. -
ముగ్గురు మిత్రుల కథ
బాలీవుడ్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే ౖహె∙కౌన్’, ‘ప్రేమ రతన్ ధన్ పాయో’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సూరజ్ బర్జాత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘ఊంచాయీ’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ముగ్గురి వ్యక్తుల జీవితాల్లోని స్నేహం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ‘‘మే డే’ (అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న చిత్రం) షూటింగ్లో అమితాబ్ బచ్చన్‌ను కలిశాను. సూరజ్ డైరెక్షన్‌లోని సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఓ రోజు అనుపమ్ ఖేర్ ఫోన్ చేసి.. ‘ఇంకా ఏంటి ఆలస్యం.. టీమ్‌లోకి వచ్చెయ్’ అన్నారు. అంతే.. నేను కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధమైపోయాను’’ అని పేర్కొన్నారు బొమన్ ఇరానీ. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించాలనుకుంటున్నారు. -
‘ఫ్రెండ్షిప్’ మీద సూరజ్ బర్జాత్యా కన్ను
సూరజ్ బర్జాత్యా భారతీయ సినిమాను తిరిగి ఇళ్ల డ్రాయింగ్ రూమ్‌లలోకి తీసుకొచ్చిన దర్శకుడు. తల్లి దండ్రీ కొడుకు కోడలు బంధువులు అందరూ కలిసి ఉండే భారతీయ సెంటిమెంట్‌ను విపరీతంగా ఉపయోగించి సూపర్‌హిట్ లు కొట్టాడు. ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమాలు ఇందుకు నిదర్శనం. ఇక ప్రేమికులను ఉర్రూతలూగించిన ‘మైనే ప్యార్ కియా’ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. వివాహ బంధం మీద ‘వివాహ్’ తీసి బ్లాక్‌బస్టర్ చేశాడాయన. ఇక అతని చివరి చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ కూడా పెద్ద హిట్టే. ఇప్పుడు సూరజ్ బర్జాత్యా కన్ను ‘స్నేహం’ మీద పడింది. అతని అన్ని సినిమాల్లో స్నేహితుల పాత్రలు కనిపించినా ఈసారి స్నేహితులే లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ ఈ సినిమాలో ఇతని స్నేహితులుగా నటించనున్నారు. వీరిద్దరి ప్రతిభ ప్రేక్షకులకు తెలుసు. పైగా గతంలో ‘వక్త్’ సినిమాలో నటించి నవ్వులు పండించారు. ఇప్పుడు సూరజ్ బర్జాత్యా సినిమాలో ఏం సందడి చేస్తారో తెలియదు.తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుని సూరజ్ ఈ సినిమాలు తీయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది. -
‘నా భార్యకు హెల్ప్ చేస్తున్న జానీ సార్’
ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ పెట్టిన ఫన్నీ కామెంటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ నటులు బొమన్ ఇరానీ, జానీలు మానవత్వంపై ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం రాత్రి లైవ్ చాట్‌ను నిర్వహించారు. కాగా లైవ్ చాట్ కొనసాగుతుండగా రణ్వీర్ మధ్యలో ‘నేను నా భర్యకు సాయం చేస్తున్నాను జానీ సార్!!!’ అంటూ కామెంటు చేశాడు. అయితే లైవ్‌లో జరుగుతున్న సంభాషణకు పొంతన లేకుండా రణ్వీర్ కామెంట్ పెట్టి నవ్వులు పూయించాడు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు) Ranveer left a comment on Boman Irani’s live with Johny Lever❤️ #deepveer (tfs @RanveersNour ) Ranveer: Main biwi ki help kar raha hoon Johnny sir !!! (I am helping my wife Johnny sir !!!) pic.twitter.com/SQIFHzmaas — #DeepVeerwale - Ranveer Deepika FC (@DeepVeer_FC) April 7, 2020 ఇక ఈ కామెంటుకు సంబంధించిన ఫొటోను దీప్‌వీర్ ఫ్యాన్స్ ట్విటర్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా లాక్డౌన్ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న రణ్వీర్ తన భార్య దీపికా పదుకొనెతో ఇంటి పనుల్లో బిజీగా ఉన్నట్లు తన కామెంట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. కాగా ప్రస్తుతం రణ్వీర్ హీరోగా రాబోయే స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘83’ లో బొమన్ ఇరానీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ ప్రపంచకప్ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. (లాక్డౌన్: ‘ప్రజలకు వైద్యంతోపాటు అవి కూడా ముఖ్యం’) -
నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు : నటుడు
బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ వినూత్నమైన నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తానడంలో సందేహం లేదు. ఎటువంటి పాత్రలైనా సరే తన దగ్గరికి వస్తే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి కసరత్తు చేయడం ఆయనకు అలవాటు. తాజాగా... రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009 లో బ్లాక్బాస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బొమన్ ఇరానీ తాను పోషించిన పాత్ర గురించి, ఆ పాత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. త్రీ ఇడియట్స్ చిత్రంలో బొమన్ ఇరానీ ఐఐఎమ్ బెంగుళూరు కాలేజీ డైరెక్టర్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాత్ర పేరు డాక్టర్ విరు సహస్త్రాబుద్ధా వైరస్. ఈ పాత్ర కోసం తాను ఎలా సిద్ధమాయ్యరో బొమన్ ఇరానీ మీడియాకు వివరించారు. 'త్రీ ఇడియట్స్ సినిమా సమయంలో ప్రతిరోజు ఉదయం షూటింగ్ ఉన్నా లేకపోయినా పాత్రకు సంబంధించిన వెల్క్రో షర్ట్, హుక్ టైని ధరించి క్యాంపస్ మొత్తం కలియతిరిగేవాడిని. అయితే నన్ను చూసిన కొందరు విద్యార్థులు గుర్తుపట్టకపోగా ఒక ఫ్రొఫెసర్‌గా భావించి విష్ చేసేవారు. ఒక్కోసారి వారిపై అరుస్తూ నా కోపాన్ని ప్రదర్శించడంతో వారంతా ఆశ్చర్యపోయేవారు. క్లాస్‌రూంలో పాఠాలు బోధిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి క్లాస్‌రూం మొత్తం పరిశీలించి మీ పని చేసుకొండి అని చెప్పి వెళ్లిపోయేవాడిని. ఆ సమయంలో అక్కడే ఉన్న లెక్చరర్స్ నేను కాలేజ్‌లో కొత్తగా చేరిన ఫ్రొపెసర్‌గా భావించేవారు. కాకపోతే అక్కడి వాతావరణం, పరిస్థితులను అధ్యయనం చేయడం కోసమే ఇదంతా చేశాను. దీంతో షూటింగ్ సమయంలో ఒక 20-30 సంవత్సరాల పాటు నాకు ఆ క్యాంపస్‌తో పరిచయంలాగా అనిపించేదని' బొమన్ ఇరానీ పేర్కొన్నారు. కాగా 2009లో విడుదలైన త్రీ ఇడియట్స్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ పెద్ద విజయం సాధించింది. భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఈ చిత్రంలో చూపించారు. కాగా ఇదే చిత్రం తమిళంలో శంకర్ ‘నన్బన్’గా రీమేక్ చేశాడు. బొమన్ ఇరానీ పాత్రను ఇక్కడ సత్యరాజ్ పోషించగా, తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదలైంది. -
కన్నడకు స్వాగతం!
ఏ ఇండస్ట్రీలో అయినా, తొలి పరిచయం ఒక్కసారే జరుగుతుంది. కానీ ఫిల్మ్ఇండస్ట్రీలోనే తొలి పరిచయం పలుసార్లు జరిగే అవకాశం వస్తుంది. ఒక ఇండస్ట్రీలో స్టార్స్ మరో ఇండస్ట్రీలోకి పరిచయం అవడం ఫస్ట్ టైమ్ అన్నట్లేగా. తాజాగా బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కన్నడ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ‘యువరత్న’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా కన్నడ ప్రేక్షకులను పలకరించడానికి ఇరానీ రెడీ అయ్యారని సమాచారం. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఆల్రెడీ ‘అత్తారింటికి దారేది, బెంగాల్ టైగర్’ సినిమాలతో బోమన్ ఇరానీ తెలుగులో కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
రతన్‌టాటాలా ఉన్నావంటారు
‘మీరు రతన్ టాటాలా ఉంటారు’ అనే కామెంట్స్‌ని సోషల్ మీడియాలో చాలాసార్లు విన్నాను. ఇప్పుడు రతన్ టాటా పాత్రనే పోషిస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు బొమన్ ఇరానీ. దేశప్రధాని నరేంద్ర మోది బయోపిక్‌లో రతన్ టాటా పాత్రను పోషిస్తున్నారాయన. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఒబెరాయ్ ముఖ్యపాత్రలో ‘పీయం నరేంద్ర మోది’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. సందీప్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ నిర్మాతలు. ‘‘దర్శకుడు ఒమంగ్, వివేక్ ఒబెరాయ్ ఈ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అంగీకరించాను. అద్భుతమైన టీమ్ కుదిరింది. నా పార్ట్ çషూటింగ్ ముగిసింది. చాలా అద్భుతంగా వచ్చింది’’ అని తన ఆనందాన్ని పంచుకున్నారు బొమన్ ఇరానీ. -
‘స్లిప్పర్ సెల్ఫీ’కి సోషల్ మీడియా ఫిదా
పిల్లలు దైవంతో సమానం అంటారు. నిజమే మరి.. కల్లాకపటం లేని మనసులు వారివి. ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించడం వారి నుంచే నేర్చుకోవాలి. పెద్దలు చేసే పనులను అనుకరిస్తూ వారు చేసే అల్లరి ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటుంది.. మరోసారి అబ్బురపరుస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘స్లిప్పర్ సెల్ఫీ’గా వైరలవుతోన్న ఈ ఫోటోలో ఐదుగురు చిన్నారులు చిరునవ్వులు చిందిస్తూ ఉండగా.. వారిలో ఒక పిల్లాడు చెప్పు(స్లిప్పర్)తో సెల్ఫీ తీస్తున్నాడు. ఈ చిన్నారుల సృజనకు నెటిజన్లే కాక బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అంతే వెంటనే ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తున్నారు. ‘మీరు ఎంచుకున్న దాని బట్టే మీరు సంతోషంగా ఉంటారు’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశారు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ. అయితే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం ఇది ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన ఫోటో కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘నేనిలా అంటున్నందుకు క్షమించండి. ఇది ఫొటోషాప్ చేసిన చిత్రమని నాకనిపిస్తుంది. స్లిప్పర్ పట్టుకున్న చేతికి, మరో చేతికి తేడా ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. కానీ చాలామంది నెటిజన్లు బిగ్‌బీతో ఏకీభవించడం లేదు. ‘అమిత్ జీ.. అది ఫొటో షాప్ చేసిన చిత్రం కాదు. నేను క్రాస్ చెక్ చేయించా. అది నిజమైందే’ అంటూ ఓ నెటిజన్ బిగ్ బీకి సమాధానమిచ్చాడు. .. with due respect and apology .. i feel this is photoshopped .. notice that the hand that holds the chappal is different than the rest of his body in size .. to his other hand by his side !! — Amitabh Bachchan (@SrBachchan) February 3, 2019 -
‘మరోసారి అతనితో నటించాలని ఉంది’
ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ నిర్మాతగా మారుతున్నారు. ‘ఇరానీ మూవీటోన్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. బాలీవుడ్ సుపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘ఈ క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో ఇరానీ మూవీటోన్ సంస్థ విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నా’నని తెలిపారు అమితాబ్. అంతేకాక ‘మరోసారి బొమన్ ఇరానీతో కలిసి నటించాలనుకుంటున్నాను. కానీ దేవుని దయ వల్ల ఈసారి అతను నన్ను అధిగమించకూడదని ఆశిస్తున్నాను’ అంటూ బిగ్ బీ చమత్కరించారు. అమితాబ్, బొమన్ ఇరానీ నటించిన ‘వక్త్ : ది రేస్ ఎగెనెస్ట్ టైమ్’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో వీరద్దరు పండించిన కామెడీ అద్భుతం. ఈ నిర్మాణ సంస్థ గురించి బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన రచయితలను గుర్తించి వారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘పక్కింటావిడకు నేనే టార్గెట్’
తనలో నటుడు దాగున్నాడన్న విషయాన్ని మొదట గుర్తించింది మా అమ్మే అంటున్నాడు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ. గువాహటిలో జరుగుతున్న బ్రహ్మపుత్ర వ్యాలీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న బొమన్ ఇరానీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పొటాటో చిప్స్ షాప్ ఓనర్ స్థాయి నుంచి సినిమా నటుడిగా ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్నఅనుభవాల నుంచి వెల్లడించాడు. పక్కింటావిడకు నేనే టార్గెట్... ‘చిన్నపుడు చాలా బిడియంగా ఉండేవాడిని. భయం కారణంగా నత్తి కూడా వచ్చేది. దీంతో ఎక్కువగా మాట్లాడే వాడిని కూడా కాదు. అందుకే మా పక్కింట్లో ఉండే ఆవిడ ఎప్పుడూ నన్ను టార్గెట్ చేసేవారు. వాళ్ల పిల్లలు నాకంటే చాలా బెటర్ అని నిరూపించేందుకు.. నా ఈ లోపాన్ని మా అమ్మ ముందు ప్రస్తావించేవారు. పాపం బొమన్.. ఇలా అయితే కష్టం అంటూ నన్ను కామెంట్ చేసేవారు. దీంతో మా అమ్మకు నా భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది అని బొమన్ వ్యాఖ్యానించాడు. అలా ధైర్యవంతుడిగా మారాను ‘నాకు చదువుపై శ్రద్ధ లేదని మా అమ్మ ముందుగానే గుర్తించింది. అందుకే సినిమాలు చూడమని ప్రోత్సహించేది. అల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినిమాలు చూడమని ఓ రోజు డబ్బులు ఇచ్చింది. అప్పుడు నా వయసు పదకొండేళ్లు. దీంతో ఆ థియేటర్ వాళ్లు నన్ను లోపలికి రానివ్వడం లేదని చెప్పాను. మా అమ్మ వెంటనే ఆ థియేటర్ మేనేజర్‌కు లేఖ రాసింది. నన్ను సినిమా చూడనివ్వాలని కోరింది. అలా అప్పటి నుంచి ఒంటరిగా బయటికి వెళ్లడం మెల్లగా మెల్లగా అలవాటైంది. ముద్దపప్పులా ఉండే నేను చాలా ధైర్యవంతుడిగా మారాను. ఆ తర్వాత నాటకాలు చూసేందుకు వెళ్లేవాడిని. ఆర్టిస్టుల హావభావాలు క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. అమ్మ కూడా కొన్ని చిట్కాలు చెప్పేది. అలా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో సుమారు 14 ఏళ్లు థియేటర్ ఆర్టిస్టుగా కొనసాగాను. ఆ తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టాను. ప్రస్తుతం విజయవంతమైన నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నా’ అని బొమన్ చెప్పుకొచ్చాడు. ఆర్థిక కారణాల దృష్ట్యా కొన్నాళ్లు పొటాట్ చిప్స్ షాప్ ఓనరుగా, మరికొన్నాళ్లు ముంబై తాజ్ హోటల్లో వెయిటర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. -
సోల్జర్ సూర్య!
దేశం కోసం ఎందాకైనా తెగిస్తా అంటున్నారట హీరో సూర్య. ఎందుకంటే ఆయన తన తాజా సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. బొమన్ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ షూటింగ్ స్పాట్లో సూర్య లుక్‌కి చెందిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఈ ఫొటోలో సూర్య ఆర్మీ ఆఫీసర్లా హెయిర్ కట్ చేయించుకుని కనిపించారు. అంతే.. సూర్య సోల్జర్ పాత్రలో కనిపిస్తారన్న ఊహగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో బలమైన సందేశం కూడా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక తారాగణంపై సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ (నందగోపాల కుమారన్) అనే సినిమా రూపొందుతోంది. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయాలను కున్నారు. కానీ, వాయిదా వేశారు. -
లండన్ టు జైపూర్
లండన్‌కి బై బై చెప్పారు కథానాయిక పూజా హెగ్డే. ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రం కోసం ఆమె లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, బొమన్ ఇరానీ, కృతీ సనన్, కృతీ కర్భందా, పూజా హెగ్డే ముఖ్య తారలుగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ బార్బర్ గెటప్‌లో కనిపిస్తారట. లండన్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో భాగంగానే ఫర్హాఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల మొదటివారంలో జైపూర్‌లో స్టార్ట్ కానుందని బీ టౌన్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
సూర్యతో ఆర్య
తమిళ హీరో ఆర్య లండన్ వెళ్లారు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తీసిన తన ఫొటోను ఆర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సూర్య సినిమా కోసం బొమన్ ఇరానీ లండన్ వెళ్లారట. సో.. సూర్య సినిమాలో ఆర్య ఓ రోల్ చేయబోతున్నారనే ఉహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. తన సినిమాలో ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు దర్శకుడు కేవీ ఆనంద్ ప్రకటించారు. ‘‘జామీ (ఆర్య) షూట్లో జాయిన్ అయ్యాడు’’ అని పేర్కొన్నారు కేవీ ఆనంద్. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. మోహన్‌లాల్, అల్లుశిరీష్, బొమన్ ఇరానీ, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు హారీష్ జైరాజ్ స్వరాలు అందిస్తున్నారు. -
ఫోర్ గెటప్స్‌లో...
ఊహలకు, వదంతులకు ఫుల్స్టాప్ పెట్టారు సూర్య అండ్ టీమ్. సినిమాలో నిజంగా ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని వెల్లడించారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ముందు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఫైనల్లీ సాయేషాని తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే మోహన్‌లాల్, అల్లు శిరీష్ నటించనున్న ఈ సినిమాలో తాజాగా సముద్రఖని, బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ యూనిట్లో యాడ్ అయినట్లు కేవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15ఏళ్ల తర్వాత ఈ సినిమాతో బొమన్ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘నా నెక్ట్స్ సినిమాలో డైనమిక్ యాక్టర్ సూర్య సరసన నటించబోతున్నానని చెప్పడానికి ఆనందంగా ఉంది. బ్రిలియంట్ డైరెక్టర్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో మోహన్‌లాల్, శిరీష్‌లతో నటించబోతున్నందకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు సాయేషా. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న లండన్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. అక్కడే ఓ పబ్ సాంగ్‌ను కూడా తీస్తారట. ఈ సినిమాలో సూర్య ఫోర్ గెటప్స్‌లో కనిపించనున్నారని టాక్. -
నిలకడగా ‘పరమాణు’ కలెక్షన్స్
జాన్ అబ్రహాం, డయానా పెంటీ జంటగా నటించిన పరమాణు చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. దర్శకుడు అభిషేక్ శర్మ ఈ చిత్రాన్ని పొఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక పక్క రేస్ 3, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా.. వాటి పోటీని తట్టుకుని ఈ చిత్రం నిలబడింది. పరమాణు చిత్ర కలెక్షన్స్‌కు సంబంధించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ.. రేస్ 3 వంటి కమర్షియల్ సినిమాని తట్టుకుని 62.14 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాలు గడిచినప్పటికి రోజు వారి కలెక్షన్స్‌లు బాగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, వికాస్ కుమార్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
సూర్య సినిమాలో బొమన్ ఇరానీ!
కోలీవుడ్‌లో ఓ భారీ మల్టిస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ సూర్య, మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. కేవీ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో ‘అత్తారింటికి దారేది’ ఫేం బొమాన్ ఇరానీ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్‌కు తాతగా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే తాజాగా సూర్య , మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ కూడా నటించనున్నాడు. ఇది సూర్యకు 37వ చిత్రం. గతంలో కేవీ ఆనంద్ డైరక్షన్లో వచ్చిన వీడొక్కడే, బ్రదర్స్‌తో హిట్స్ కొట్టిన సూర్య ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. Welcome to Kollywood, @bomanirani sir! #Suriya37 https://t.co/LNUAkSDVTb — Allu Sirish (@AlluSirish) June 22, 2018 -
రహస్య విజయం
ఆగస్టు 15, 1947. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన రోజు. ఆ రోజును ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. జాతీయ జెండాను ఎగురవేసి రొమ్ము విరుచుకొని రోమాలు నిక్కబొడుచుకొనేలా దిక్కులు పిక్కటిల్లేలా ‘భారత్ మాతా కీ జై’ ‘మేరా భారత్ మహాన్’ ‘జెహింద్’ అంటూ దేశం నలుమూలలా సంబరాలు జరుపుకుంటాం. అలా దేశమంతా ఒక్కతాటిపైకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటి చెప్పే రోజుగా మనందరం పంద్రాగస్టును గుర్తుపెట్టుకుంటాం. అలాంటి ఒక రోజుతో పాటు భారతీయుల మేథాశక్తికి గుర్తుగా ‘నేషనల్ టెక్నాలజీ డే’ అని ఓ రోజును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఆ రోజే మే 11. భారతదేశమంతా గర్వించిన రోజు. విజయగర్వంతో ఉప్పొంగిన రోజు. టెక్నాలజీ డేగా ఎందుకు ఆ రోజునే ప్రకటించిందంటే– మొదటిసారిగా భారతదేశంలో అణుపరీక్ష జరిగి విజయవంతమైన రోజు. మేము ఎవ్వరికంటే తక్కువ కాదు అని ప్రపంచ దేశాలకి చాటిచెప్పిన రోజు. అందుకే ఆ రోజుకంతటి విశిష్టత.ఇక ‘పరమాణు’ సినిమా విషయానికొస్తే ఇది ఒక ట్రూ స్టోరీ అని అందరికి తెలిసిన విషయమే. అణు పరీక్ష నిర్వహించాలంటే ప్రపంచ దేశాలు ఓ పట్టాన ఈ పరీక్ష నిర్వహించటానికి ఒప్పుకోవు. అందుకే ఇది దేశంలోని అన్నిటికంటే చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎంతో రహస్యంగా ఈ మిషన్‌ను ఇండియన్ ఆర్మీ పూర్తిచేసింది. ‘పరమాణు’ పూర్తిగా భారత్ నిర్వహించిన ‘పోఖ్రాన్’ అణుపరీక్షపై రూపొందిన సినిమా. ‘పరమాణు’ సినిమాను ఆద్యంతం ఉత్కంఠతో ముందుకు నడిపించారు దర్శకుడు‘అభిషేక్ శర్మ’. నిజానికి ఇటువంటి తరహాలో సినిమాలు రావడం ఇది మొదలు కాదు... అలియా భట్ ప్రముఖ పాత్రలో నటించిన ‘రాజీ’, తెలుగులో రానా ‘ఘాజీ’ కూడా ఇలాంటివే. పరమాణు కథ..... ఈ సినిమా అభిషేక్ శర్మ దృష్టి కోణం నుండి చూస్తే ప్రధానమంత్రి రక్షణ కార్యాలయం నుండి కథ ప్రారంభం అవుతుంది. అశ్వథ్ రాణా (జాన్ అబ్రహామ్) ఓ సిన్సియర్ ఐ.ఏ.ఎస్ అధికారి. అణుపరీక్షలను నిర్శహించటానికి 1995లో అప్పటి ప్రభుత్వం నియమించిన కమిటీలో కీలక సభ్యుడు. ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తారు. ఆ కమిటీ మీటింగ్‌కు హాజరైన వారందరూ అదొక దేశానికి సంబంధించిన కీలక సమావేశంలా కాకుండా ఏదో పిచ్చాపాటి మీటింగ్‌లా వ్యవహరిస్తుంటారు. ఆ మీటింగ్‌లో అశ్వథ్ రాణా మాత్రం తాను ఎన్నో విషయాలను చర్చించటానికి వచ్చాను ఇలా పిచ్చాపాటి మాట్లాడుకోటానికి కాదు అని చెప్తాడు. అక్కడ ఉన్న అందరూ ఇతన్ని చూసి నవ్వుకొంటారు. అయినప్పటికీ తను ఊరుకోకుండా తన దగ్గర ఎంతో విలువైన సమాచారంతో పాటు ఈ అణు పరీక్షను ఏ విధంగా నిర్వహించాలి అనే దాని గురించి క్లియర్‌గా వివరిస్తాను అని ప్రధానమంత్రి కార్యాలయ అధికారికి వివరిస్తాడు. ఆ మీటింగ్‌లో ఉన్నవారందరూ అతన్ని చూసి నవ్వుతుంటే ‘ఇంకా టీ, సమోసా రావాటానికి ఎట్లాగూ టైం ఉంది. ఈలోపు నువ్వు చెప్పదలుచుకుంది, మాట్లాడవలసింది నిర్భయంగా చెప్ప’మంటాడు అక్కడున్న ఆఫీసర్. తన ఫ్లాపీలో కొంత సమాచారం ఉందని, దాన్ని ఓపెన్ చేస్తే విషయం తెలిసిపోతుందని అంటాడు అశ్వథ్. ఆ మాట పూర్తి అయ్యేలోపు టీ వస్తుంది. ఆ మీటింగ్‌లో ఉన్న ఒకతను ఆ ఫ్లాపీని తీసుకొని తన టీ కప్ కింద బాటమ్లా పెట్టుకుంటాడు. అది చూసి చిన్నబుచ్చుకుంటాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహిస్తునట్లు అగ్రదేశమైన అమెరికా గుర్తించి భారత్‌ను హెచ్చరిస్తుంది. అప్పటికి ఆ పరీక్ష విఫలమవుతుంది. ఆ సంఘటనతో అశ్వథ్ రాణాను విధులనుండి తొలగిస్తుంది ప్రభుత్వం. ఆ తర్వాత సంవత్సరమే ప్రభుత్వం మారుతోంది. అప్పుడు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉంటారు. ఆయన సెక్రటరీగా హిమాన్ష్ శుక్లా (బొమన్ ఇరానీ) చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఈయన ఈ మిషన్ చేస్తున్నట్లు ఎవ్వరికి తెలియకుండా ‘ఆపరేషన్ శక్తి’ అనే పేరుతో సస్పెండైన ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అశ్వథ్‌ను తిరిగి అణుపరీక్షను తన ఆధ్వర్యంలో నిర్వహించమని అడుగుతాడు. అప్పుడు జాన్ అబ్రహం ఎటువంటి షరతులతో తాను విధి నిర్వహణలో పాల్గొంటాడో బొమన్ ఇరానీకి చెప్తాడు. అలా కుదిరిన ఆ ఒప్పందం వల్ల ఏం జరిగింది అనేది తర్వాత కథ. మిషన్‌లో పాల్గొన్న వారికి వారి వారి సొంత పేర్లు కాకుండా మారు పేర్లు పెట్టుకునే సీన్ చాలా బావుంటుంది. మహాభారతంలో పంచ పాండవుల పేర్లతో వీరిని వ్యవహరించడం అందరినీ ఆకట్టుకునే విషయం. కృష్ణుడి పాత్రను అశ్వథ్ రాణా (జాన్ అబ్రహం) పోషించడమే కాదు, మెప్పించాడు కూడా. ఈ మిషన్ కంప్లీట్ చేసే క్రమంలో శాటిలైట్ కంటపడకుండా అణుపరీక్ష ఎలా నిర్వహించారో, ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం కావటంతో తమ ఇంట్లో వాళ్లకి కూడా తెలియకుండా ఎవరెవరు ఎంత కష్టపడ్డారు అనే సీన్స్‌ని చాలా కన్విన్సింగ్‌గా మలిచారు దర్శకుడు. ఈ ‘ట్రూ స్టోరీ’లో భారతదేశ రక్షణ విభాగాలైన బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్), డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఇస్రో ( ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఇండియన్ ఆర్మీ తదితర అంతర్గత ప్రభుత్వ విభాగాల సహకారంతో ఈ మిషన్ విజయవంతమైనట్లుగా సినిమాలో చూపించారు. మధ్య మధ్యలో ఆయా దేశాలకు చెందిన అప్పటి ప్రధానమంత్రులు బిల్ క్లింటన్ (అమెరికా) అటల్ బిహారీ వాజ్‌పేయ్ (ఇండియా) బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ (పాకిస్తాన్)ల ఒరిజినల్ ప్రసంగాలను సినిమాలో ఆయా సందర్భాలకు తగ్గట్టు చూపించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో పాటు జాన్ అబ్రహాం కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కెమెరా పనితీరును ఖచ్చితంగా మెచ్చుకోవలసిందే. ‘పరమాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ 2018 పేరుతో ప్రపంచవ్యాపంగా శుక్రవారం రిలీజైంది. సినిమా బడ్జెట్ సుమారు 50 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. ఎంత వసూళ్లను రాబడుతుందో వెయిట్ అండ్ సీ.... తారాగణం : జాన్ అబ్రహాం, బొమన్ ఇరానీ, డైయానా పెంటీ దర్శకుడు : అభిషేక్ శర్మ నిర్మాణ సంస్థలు : జే ఏ(జాన్ అబ్రహాం) స్టూడియోస్, జీ స్టూడియోస్ మ్యూజిక్ : సచిన్ జిగర్ కెమెరా : అశీమ్ మిశ్రా, జూబిన్ మిస్త్రీ. – శివ మల్లాల -
ఈసారైనా... వస్తారా
వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.. హిందీ మూవీ ‘పరమాణు’ థియేటర్లోకి రావడానికి. నిజానికి ఈ సినిమాను గతేడాది డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ‘పద్మావతి’ మూవీ ఎఫెక్ట్‌తో కుదర్లేదు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్‌కు మోక్షం లభించలేదు. రీసెంట్గా నిర్మాతలకు గొడవలు అయ్యాయి. అంతే.. సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు మరో రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసింది చిత్రబృందం. మే 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరి.. ఈసారైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో? లేదో తెలియాలంటే మరో నెల రోజులు ఆగక తప్పదు. జాన్ అబ్రహాం, డయానా పెంటీ, బొమన్ ఇరానీ ముఖ్య తారలుగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పరమాణు’. క్రీర్జ్ ఎంటర్టైన్మెంట్, జేఏ ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియోస్, కైట ప్రొడక్షన్స్ నిర్మించాయి. పొఖ్రాన్–2 అణుపరీక్షల బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించారు. ‘‘చరిత్రను చూపించడం అంత ఈజీ కాదు. న్యూక్లియర్ స్టేట్‌కి వచ్చే దారి ఫుల్ ఆఫ్ చాలెంజెస్‌తో ఉంది. సినిమాను మే 25న రిలీజ్ చేయనున్నాం’’ అని జాన్ అబ్రహాం పేర్కొన్నారు. -
స్పూఫ్ ఆఫ్ బాలీవుడ్
‘వెలకమ్ టు న్యూయార్క్’... ఐఫా అవార్డ్స్ మీద వచ్చిన స్పూఫ్ అని చెప్పొచ్చు. వెంకటేష్, కమల్‌హసన్ నటించిన ‘ఈనాడు’ సినిమా దర్శకుడు చక్రి తోలేటి నిర్దేశకత్వంలో వచ్చిన చిత్రం వెల్కమ్ టు న్యూయార్క్. నిజానికిది పారిస్ ఫ్యాషన్ వీక్ మీద రాబర్ట్ అల్ట్మన్ తీసిన ‘ప్రెట్ ఎ పోర్టర్’ సినిమాకు రీమేక్ లాంటిదని చెప్పొచ్చు. ఫ్యాషన్ వీక్ చోట ఐఫా అవార్డ్ ఫంక్షన్ ఉంది అంతే. కథ.. సోఫియా (లారా దత్తా) ఐఫా అవార్డ్స్ ఈవెంట్‌ను నిర్వహించే సంస్థ ఎంప్లాయి. గ్యారీ (బొమన్ ఇరానీ) ఆమె బాస్. పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా అహోరాత్రులు కష్టపడి ఆ సంస్థను నిలబెడుతుంది. అంత కష్టపడ్డా తనకు రావల్సిన వాటా ఇవ్వడు గ్యారీ. ఈసారి జరగబోయే ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ ఫెయిల్ చేసి కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ఇండియాలో టాలెంట్ సెర్చ్ పెట్టి జీనల్ పటేల్ (సోనాక్షి సిన్హా), తేజి (దిల్జిత్)లను ఎంపిక చేస్తుంది. వాళ్లు గొప్ప ప్రతిభావంతులని కాదు.. ఎందుకూ పనికిరారని. ఇంతకీ ఆ ఇద్దరికున్న టాలెంట్ ఏంటీ? జీనల్ పటేల్.. యాంబిషియస్ గుజ్జి గర్ల్. డ్రెస్ డిజైనర్. గొప్ప డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలని.. ఎలాగైనా సరే బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారాలని కలలు కంటుంది.. కష్టపడుతుంటుంది. తేజీ విషయానికి వస్తే.. రికవరీ ఏజెంట్. యాక్టింగ్ అంటే పిచ్చి. అద్దాన్ని చూస్తే అతనిలో ఉన్న నటుడు నిద్రలేస్తాడు. బాలీవుడ్‌లోని నటులను అనుకరిస్తూ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. జీనల్ డ్రెస్ డిజైనింగ్, తేజ్ నటనతో పంపిన వీడియోలను ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ చేసేస్తారు. తన బాస్ మీద రివేంజ్ తీసుకోదల్చిన సోఫియా వాటిని ఏరి ఓకే చేస్తుంది. న్యూయార్క్‌లో జరగబోయే ఐఫా అవార్డ్స్‌కు టికెట్స్, హోటల్ గదులు బుక్ చేసి వాళ్లకు ఆహ్వానం పంపుతుంది. ఇంకో వైపు.. ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు యాంకర్స్‌గా కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్‌లను పిలుస్తారు. కరణ్‌జోహార్.. ఫ్యాషన్ ఫ్రీక్.. బ్రాండ్స్ అంటే పడి చస్తుంటాడు. అయితే కరణ్‌కు ఓ కవల సోదరుడు ఉంటాడు. అతని పేరు అర్జున్. న్యూయార్క్‌లో అతనో గ్యాంగ్‌స్టర్. కరణ్ జోహార్ తీసిన కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ వంటి సినిమా అభిమానులు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్, మ్యాన్ హటన్ లాంటి వీథుల్లో అర్జున్ తిరుగుతుంటే జనాలు భయపడకపోగా.. కరణ్.. కరణ్ అంటూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం వెంటపడుతుంటారు. ఇది అర్జున్‌కు చాలా కోపం తెప్పిస్తుంది. తన దందాను పాడు చేస్తున్నాడు అని కరణ్ మీద చిరాకు కలుగుతుంది. ఎలాగైనా కరణ్‌ను చంపాలనుకుంటాడు. ఐఫా అవార్డ్స్‌కు న్యూయార్క్ వస్తున్నాడని తెలుసుకొని ఆ టైమ్‌ను వినియోగించుకోవాలనుకుంటాడు. కాని కథ అడ్డం తిరిగి అర్జున్ ప్లాన్ పాడవుతుంది. అతను కటకటాల్లో చిక్కుకుంటాడు. కరణ్, రితేష్‌తో కలిసి హోస్ట్ చేసి ఐఫా అవార్డ్ ఫంక్షన్‌ను హిట్ చేస్తాడు. ఆ షోను వరెస్ట్ షోగా చూపించాలనుకున్న సోఫియా కుట్రను అర్థం చేసుకున్న జీనల్, తేజీలు అలా కానివ్వకుండా నిజంగానే తమ టాలెంట్‌ను చూపిస్తారు. సల్మాన్‌కు డ్రెస్ డిజైన్ చేసి జీనల్, షోలో తన అభినయ కౌశలం చూపించి తేజీలు తమలో ప్రతిభ ఉందని రుజువు చేస్తారు. టీవీ షోకి కొనసాగింపుగా.. సినిమా అవార్డుల ప్రదానోత్సవ వేడుకల వెనక ఉన్న డ్రామా, డబ్బు వంటి విషయాలను హాస్యరసప్రధానంగా తెరకెక్కించే ప్రయత్నమే వెల్కమ్ టు న్యూయార్క్. కరణ్ జోహార్ తన సినిమాల మీద తానే సెటైర్ వేసుకుంటుంటాడు. బాలీవుడ్ స్టార్స్ మీద వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. అయితే ఈమాత్రం టీవీ షోల్లో, టీవీల్లోనే ప్రసారమయ్యే స్టాండప్ కామెడీ షోలో చాలా కనపడుతున్నాయి. దీన్ని సినిమాగా తీస్తున్నప్పుడు చక్రీ తోలేటి ఇంకాస్త పకడ్బందీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను పెట్టుకుంటే బాగుండేది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి తెలుగువారికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. – శరాది -
మెరుపులా మెరిసి..
రానా కేవలం తెలుగు హీరోనే కాదు. టాలీవుడ్, బాలీవుడ్ అటు తమిళం కూడా కవర్ చేస్తూ బిజీగా ఉన్న నటుడు. కథ బావుంటే హీరో, విలన్ అని పట్టించుకోరు. సినిమాలో తన స్క్రీన్ టైమ్ ఎంత సేపు అని కూడా ఆలోచించరు. అతిథి పాత్రలో ఇలా కనిపించి అలా మాయమవుతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ మెరుపులా మెరుస్తా అంటున్నారు రానా. చక్రి తోలేటి దర్శకత్వంలో సోనాక్షి సిన్హా, కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్, బొమన్ ఇరానీ ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వెల్కమ్ న్యూయార్క్’. ప్రస్తుతం రానా ‘మడై తిరందు’, ‘హాతీ మేరా సాథీ’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘వెల్కమ్ న్యూయార్క్’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. -
'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే'
విలక్షణ పాత్రలతో సౌత్ నార్త్ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బొమన్ ఇరానీ. మున్నాభాయ్ ఎంబిబియస్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన బొమన్ ప్రస్తుతం 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాలో నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన తెరంగేట్రానికి సంబందించిన విశేషాలను తెలియజేశాడు. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న బొమన్ తొలిసారిగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొరియోగ్రాఫ్ చేసిన నాటకంలో నటించాడు. ఆ తరువాత అర్షద్ ప్రోత్సాహంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బోమన్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో అర్షద్‌తో కలిసి నటించాడు. ప్రస్తుతం ఐదోసారి ఈ జోడి 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాతో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తనలోని నటుణ్ని గుర్తించిన అర్షద్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన బొమన్ ఇరానీ.. మరోసారి అతనితో కలిసి నటిచటం ఆనందంగా ఉందని తెలిపాడు.