bombs
-
పొంగులేటి బాంబుల కామెంట్స్.. జగదీష్‌రెడ్డి కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబుల కామెంట్స్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మంగళవారం(అక్టోబర్ 29) మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ బాంబులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ దోపిడీ బాంబులను అడ్డుకుంటాం. మా హాయాంలో తప్పు జరిగితే విచారణ జరుపుకోవచ్చు.కాంగ్రెస్ నేతల చిల్లర బెదిరింపులకు భయపడేది లేదు. మంత్రులు చిల్లర మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. పాలన చేతకాకనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ప్రజాస్వామికవాదిగా చెప్పుకునే పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నారు? పెద్దమనిషి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులే రోడ్డు ఎక్కటం చరిత్రలో ఇది మెదటిసారి.సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించటం అన్యాయం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆంధ్రకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.పండుగల సమయంలో 144సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. లోఓల్టేజీ కరెంట్‌తో ఇళ్ళల్లో వస్తువులు కాలిపోతున్నాయి. కమీషన్ రాదన్న కారణంగానే విద్యుత్ శాఖను ప్రభుత్వం గాలికొదిలేసింది. కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ ఆదాయం తగ్గలేదు.ఇప్పుడెందుకు తగ్గింది? పేదలకు చెందాల్సిన ఆదాయం మంత్రులు,కాంగ్రెస్ నేతలు తింటున్నారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకు కూడా 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు,రైతాంగానికి అర్థమైంది. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. పత్తిని కొనుగోలు చేయాలి.నాణ్యత లేని గుజరాత్ పత్తికి ఎక్కువ ధర ఇస్తున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి: సమస్యలు కొనితెచ్చుకుంటున్న తెలంగాణ సీఎం -
150 స్కూళ్లకు బాంబు బెదిరింపు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలను బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకులు పంపిన హెచ్చరికలు దేశ రాజధాని ఢిల్లీలోని బుధవారం ఉదయం తీవ్ర కలకలానికి కారణమయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 150 పైచిలుకు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ అందడంపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తమకు 97 ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సరీ్వస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతా కొన్ని కాల్స్ అందాయన్నారు. తూర్పు ఢిల్లీలోని 24 ప్రైవేట్ స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని 18 స్కూళ్లు, పశి్చమ ఢిల్లీ ప్రాంతంలోని 21, షాదారాలోని 10 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూళ్ల వద్దకు చేరుకుని, తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం, పాఠశాలల నిర్వాహకులు మైక్‌ల ద్వారా తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం కనిపించింది. సోదాల్లో 20 బృందాలు ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసు బృందాలు సీపీ రవీందర్ యాదవ్ నేతృత్వంలోని బెదిరింపులు అందిన స్కూళ్లలో ప్రొటోకాల్ ప్రకారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కూడిన 20 బృందాలను రంగంలోకి దించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కని పించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని హోం శాఖ ప్రకటించింది.డార్క్‌నెట్ నుంచి మెయిళ్లు ఎటువంటి ఆధారాలు చిక్కకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగించుకుని దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ట్చఠ్చీటజీజీఝఃఝ్చజీ . టu. అనే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చిన ఈ మెయిళ్లన్నిటిలోనూ..‘మీరు ఎక్కడ కలుసుకున్నా వారిని చంపండి, వారు మిమ్మల్ని తరిమికొట్టిన ప్రదేశాల నుంచి వారినీ తరిమికొట్టండి. స్కూల్లో చాలా పేలుడు పదార్థాలున్నాయి..’అనే విషయమే ఉందని వెల్లడించింది. ఇందులోని సవరిమ్ అనే అరబిక్ పదాన్ని ఉగ్ర సంస్థ ఐఎస్ తరచూ వాడుతుంటుందని ఓ అధికారి తెలిపారు. బెదిరింపుల్లో పవిత్ర ఖురాన్‌ను కూడా ఉటంకించారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్ర సంస్థలు పన్నిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ లోతుగా దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది. వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది. మృత్యు నగరాలు ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్‌లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్‌లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి! ఫలించని దౌత్యం ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడు డీజీపీ ఆఫీస్‌కు ‘బాంబు’ బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయానికి బుధవారం రాత్రి వచి్చన ఒక ఈ మెయిల్ పోలీసులను పరుగులు తీయిస్తోంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టామని, సాహసం చేసి కని పెట్టండి అని వచ్చిన ఆ బెదిరింపు మెయిల్‌తో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సమయం ఆసన్నం అవుతోండటంతో చెన్నై నగరంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కమిషనర్ సందీప్‌రాయ్ రాథోర్ ఆదేశాలు ఇచ్చారు. 400 చోట్ల సోదాలు జరిపే విధంగా , 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండే రీతిలో చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో బుధవారం రాత్రి డీజీపీ కార్యాలయానికి ఓ ఈ మెయిల్ వచి్చంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టినట్టు, బెసెంట్ నగర్, ఎలియట్స్ బీచ్‌లలో బాంబులు పెట్టి్టనట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. నగరంలో తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టుగా గతంలో వెలుగు చూసిన ›ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి సోదాలు ముమ్మరం చేశారు. -
కేరళ వరుస పేలుళ్లు: రూ. 3 వేలతోనే బాంబులు,గల్ప్‌లో ఉద్యోగం
కొచ్చిన్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కేరళ బాంబు పేళుళ్ల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరుస పేలుళ్లకు పాల్పడిన నిందితుడు డొమినిక్ మార్టిన్ దీనికి సంబంధించి పోలీసుల ముందు సంచలన విషయాలను వెల్లడించాడు. కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లకు బాధ్యత వహిస్తూ లొంగిపోయిన 28 గంటల తర్వాత, నిన్న (సోమవారం) అరెస్టయిన మార్టిన్ తాను ఏ విధంగా బాంబులు తయారు చేసిందీ, తన లక్ష్యం ఏమిటీ అనే వివరాలను పోలీసులకు వివరించినట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం కొచ్చికి చెందిన డొమినిక్ మార్టిన్ ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నాడు. బాంబులను తయారు చేయడానికి కేవలం 3 వేల రూపాయల ఖర్చు చేసినట్టు వెల్లడించాడు. గల్ఫ్‌లో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న సమయంలో బాంబులు తయారీ నేర్చుకున్నాడు. మార్టిన్ కుటుంబం ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటోంది. పేలుళ్లకు రెండు నెలల ముందు మార్టిన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పేలుళ్లకు పాల్పడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయి. బాణాసంచా తయారీలో ఉపయోగించే తక్కువ గ్రేడ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు (IEDలు)తో ఈ బాంబును తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోలును త్రిపుణితుర నుంచి కొనుగోలు చేశాననీ, ఇతర మెటీరియల్స్, మందుగుండు సామగ్రిని కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించాడు. యూట్యూబ్ ద్వారా నేర్చుకుని, తన ఇంట్లోనే ఎసెంబుల్డ్ చేసి, ఆదివారం ఉదయం 7 గంటలకు యెహోవా విట్నెస్ కన్వెన్షన్ సెంటర్లోని కుర్చీల కింద పెట్టాడు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపిమొత్తం ఆరు చోట్ల ఉంచాడు. అనంతరం వాటిని రిమోట్ కంట్రోల్‌తో పేల్చివేశాడు. అయితే వాటిల్లో మూడు బాంబులు పేలాయి. అంతేకాదు దీనికి సంబంధించి లైవ్ వీడియోను కూడా రికార్డు చేసినట్లు నిందితుడు తెలిపినట్టు సమాచారం. అలాగే లొంగిపోయే ముందు, మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. సంబంధిత సంస్థ విద్రోహ పూరిత బోధన చేస్తోందని, సమాజం, పిల్లలకు తప్పుడు విలువలను ప్రచారం చేస్తోందనీ, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వరుస పేలుళ్లకు పాల్పడినట్టు పేర్కొన్నాడు. లొంగిపోయే ముందు, మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. సంబంధిత సంస్థ విద్రోహపూరిత బోధన చేస్తోందని, సమాజం, పిల్లలకు తప్పుడు విలువలను ప్రచారం చేస్తోందనీ, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వరుస పేలుళ్లకు పాల్పడినట్టు పేర్కొన్నాడు. ఈ మార్టిన్ ఎఫ్బీ లైవ్ వీడియోను అప్లోడ్ చేసిన త్రిసూర్‌లోని లాడ్జీని కూడా పోలీసులు గుర్తించారు. జాతీయ దర్యాప్తుసంస్థ(ఎన్ఐఏ) నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంమార్టిన్ ప్రశ్నిస్తోంది. బాంబుల తయారీకి విడిభాగాలను కొనుగోలు చేయడానికి మార్టిన్ వెళ్లిన స్థలాలను పోలీసులు పరిశీలిచారు. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీని సేకరించినట్లు తెలిసింది. మార్టిన్ మానసిక పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లలో ఇతరుల ప్రమేయంపై కూడా పరిశీలిస్తున్నామని కొచ్చి కమిషనర్ ఎ అక్బర్ తెలిపారు. కాగా ఆదివారం (అక్టోబర్ 29) ప్రార్థనలు నిర్వహిస్తుండగా జరిగిన పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 52 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం?
తరచూ బాంబు దాడులు జరిగే దేశాలలో భూగర్భ బంకర్లను నిర్మించడం తప్పనిసరి. ఇటువంటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలూ క్షిపణులను పరస్పరం ప్రయోగించుకుంటున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వారి ఇళ్లలోని బంకర్లలోనికి వెళ్లి తలదాచుకుంటున్నారు. యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బంకర్లలో తల దాచుకున్నవారు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు. బంకర్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బంకర్ అంటే భూగర్భంలో నిర్మితమైన ఇల్లు. దీనిని భద్రతా ప్రయోజనాల కోసం నిర్మిస్తారు. ఈ బంకర్లు ఆర్మీ సైనికులు, అధికారులు, శివారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో అవసరం అవుతుంటాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బంకర్లను సైనిక అధికారులు, సైనికులు తమ భద్రత కోసం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతల నివాసాలలో బంకర్లు ఉన్నాయి. బంకర్ అనేది సామాజిక, రసాయన, బాంబు, వైమానిక దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ బంకర్లు సాధారణంగా ఉక్కు, కాంక్రీటు, కలపతో నిర్మిస్తారు. జాతీయ భద్రత కోసం పలు దేశాలు అణ్వాయుధాల నిల్వకు బంకర్లను నిర్మించాయి. ఈ బంకర్లు వేర్వేరు డిజైన్లను కలిగి ఉంటాయి. ఇది కూడా చదవండి: సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది? -
విద్యార్థుల మధ్య గొడవ.. హాస్టల్ గదిలో మారణాయుధాలు..
లక్నో: చదువుకోవాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు లభించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హాస్టల్లో రెండు పిస్టళ్లు, 30 వరకు బాంబులు లభించాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్లో తనిఖీలు చేయగా.. 2 పిస్టళ్లు, 30 బాంబులు లభించాయని పోలీసులు తెలిపారు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఉమేశ్ పాల్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఎస్పీ నాయకుడు రాజు పాల్‌ను కూడా దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఈ హాస్టల్లోనే తలదాచుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి -
Russia-Ukraine War: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్
కీవ్: రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంపై ఉక్రెయిన్ తిరిగి పట్టు బిగిస్తోంది. ఖేర్సన్ను ఉక్రెయిన్ మిలటరీ పాక్షికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. నిరంతరాయంగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ పరిణామాలతో ఖేర్సన్ ప్రాంతానికి చీఫ్‌గా నియమితుడైన వ్లాదిమర్ సాల్దో ఆ ప్రాంతం నుంచి రష్యాకు ఎవరైనా వెళ్లిపోతామంటే వారికి ఉచితంగా వసతి సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ చట్టవిరుద్ధంగా ఖేర్సన్‌సహా నాలుగు ప్రాంతాలను తమ భూభాగంలో కలిపేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖేర్సన్ ప్రాంతంలోని ప్రజల ప్రాణాలను రక్షించడానికి రష్యన్ ప్రాంతాలైన రోస్తోవ్, క్రానోడర్, స్ట్రావోపోల్, క్రిమియాకు తరలిస్తామని చెప్పారు. యుద్ధ సమయంలో అనాథమైన వేలాది మంది పిల్లల్ని రష్యాకు బలవంతంగా తరలిస్తోందని, ఇలా చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బయటి వ్యక్తులు తుపాకులు, బాంబులతో దిగారు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ మంగళవారం చేపట్టిన 'నాబన్నా చలో(చలో సెక్రెటేరియేట్)' ర్యాలీలో తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం మమతా బెనర్జీ బుధవారం స్పందించారు. బీజేపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బెంగాల్లో హింస సృష్టించేందుకు కమలం పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తుపాకులు, బాంబులతో రాష్ట్రంలోకి తీసుకొచ్చిందని ఆరోపించారు. కోల్‌కతా హౌరాలో పోలీసులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయంపైనా మమత స్పందించారు. ఆందోళకారులు దారుణంగా దాడులు చేసినా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ గానీ, ఫైరింగ్ గానీ చేయలేదని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వివిధ ఘటనల్లో చాలా మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. రాజకీయాలు, సంఘ విద్రోహ శక్తులు ఒకే చోట ఇమడలేవని మమత అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే తమకెలాంటి ఇబ్బంది లేదని, కానీ ఆందోళనల పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని మమత తేల్చిచెప్పారు. చదవండి:బీజేపీ మహిళా నేతకు లైంగిక వేధింపులు.. సొంత పార్టీ నాయకుడే -
Amarnath Yatra: అమరనాథ్ యాత్రపై కన్నేసిన ఉగ్రవాదులు
మూడేళ్ల విరామం తర్వాత మొదలవుతున్న అమరనాథ్ యాత్రపై ఉగ్రవాదులు కన్నేశారు. జూన్ 30 నుంచి మొదలై 43 రోజుల పాటు సాగే యాత్రను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా స్టికీ బాంబులతో విరుచుకుపడొచ్చని నిఘా వర్గాలకు ముందే ఉప్పందింది. ఇందుకోసం తరలిస్తున్న ఈ బాంబుల్ని తాజాగా పోలీసులు పట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో స్టికీ బాంబుల కథా కమామిషు... హిందువులకు అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్రను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు స్టికీ బాంబులతో సవాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా వాటిని డ్రోన్ల ద్వారా తరలిస్తుండగా జమ్ము పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్ము శివార్లలో పాక్ డ్రోన్ ఒకటి ఓ పేలోడ్‌ను జారవిడిచింది. స్టికీ బాంబులతో కూడిన టిఫిన్ బాక్సులు అందులో దొరికాయి. 3, 8 గంటల్లో పేలేలా వాటికి టైమర్లు కూడా సెట్ చేశారు. వాటిని పోలీసులు నిర్వీర్యం చేశారు. అమర్నాథ్ యాత్రలో భక్తులపై ప్రయోగించేందుకే వీటిని పాక్ నుంచి తరలించినట్టు చెప్పారు. తొలిసారి వాడిందెప్పుడు? స్టికీ బాంబుల్ని తొలిసారిగా బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించింది. అప్పట్లో ఇది గ్రెనేడ్‌లా ఉండేది. గోళాకారపు గాజు ఫ్లాస్క్‌లో నైట్రో గ్లిసరిన్ నింపి తయారు చేసేవారు. దాన్ని లోహంతో కవర్ చేసి అంటించేవారు. బాంబును ప్రయోగించేటప్పుడు దాని రక్షణ కవచాన్ని బయటకు లాగి విసిరేవారు. ఐదు సెకండ్లలో బాంబు పేలేది. అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో వీటిని బాగా వాడారు. గతేడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించినప్పుడు అమెరికా సైనికులపై వీటిని ఎక్కువగా వాడారు. కాబూల్‌లో జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ స్టికీ బాంబులు పెటట్డంతో అమెరికా సైనికులు నిత్యం హడలిపోయేవారు. 2020 డిసెంబర్లో కాబూల్ డిప్యూటీ ప్రొవిన్షియల్ గవర్నర్‌ను స్టికీ బాంబుతోనే బలిగొన్నారు. చదవండి: (బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత) మన దేశంలో... ►2012 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై దాడిలో స్టికీ బాంబులు వాడారు. ►2012 ఫిబ్రవరిలో కశ్మీర్లో సాంబా సెక్టార్లో భద్రతా దళాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి. ►2021 ఏప్రిల్‌లో జమ్ము శివార్లలో సిధారా బైపాస్ దగ్గర, ఆగస్టులో పూంచ్‌లో ఇవి దొరికాయి. ►2021 మేలో కథువాలోని హరియా చౌక్ దగ్గర మినీ డ్రోన్‌ను కశ్మీర్ పోలీసులు కూల్చేశారు. అందులోనూ స్టికీ బాంబులు దొరికాయి. ►2021 మేలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న బస్సు పెట్రోల్ ట్యాంక్‌కు స్టికీ బాంబులు అతికించి నలుగురిని బలిగొన్నారు. భద్రతా వ్యూహంలో మార్పు స్టికీ బాంబులతో ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదమున్నందున ఈసారి అమర్నాథ్ యాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏమిటీ స్టికీ బాంబులు? చిన్న సైజుల్లో ఉండే బాక్సుల్లో పేలుడు పదార్థాలుంచి ఈ బాంబుల్ని తయారు చేస్తారు. వాటికి నాణెం ఆకారంలోని మాగ్నెట్లను అతికిస్తారు. దాంతో ఈ బాంబులు వాహనాలకు సులభంగా అతుక్కుంటాయి. టైమర్‌తో అనుకున్న సమయానికి వీటిని పేల్చవచ్చు. వీటి తయారీ చౌకే గాక తరలించడమూ సులభమే. వీటిని వాడే ప్రక్రియ ఒకప్పుడు కాస్త సంక్లిష్టంగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక అదీ సులభంగా మారింది. పార్క్ చేసిన వాహనాలకు వీటిని అతికించి రిమోట్‌తో పేలుస్తారు. -
మొబైల్ ఫోన్లు కొంప ముంచుతున్నాయి!
యుద్ధంలో బాంబులు వేసుకోవడం మామూలే. ఆ బాంబులు ఎక్కడ వేయాలో నిర్ణయించడానికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో సెల్‌ఫోన్ లను వాడుతున్నారంటే ఎవరికీ వింతగా తోచడం లేదు. అవి అధునాతనమయిన స్మార్ట్ ఫోన్లయినా; కేవలం కాల్స్, మెసేజ్‌లు మాత్రమే పంపగల సింపుల్ ఫోన్లయినా సైనికులందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాయి. ఇరుపక్షాల వారు ఎదుటివారి కదలికలను, స్థావరాలను గుర్తించడానికి ఈ ఫోన్లు సాయపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు అన్నీ దగ్గరలోని కమ్యూనికేషన్ టవర్‌కు సంకేతాలు పంపుతుంటాయి. వాటి ఆధారంగానే కాల్స్, మెసేజెస్ వీలవుతాయి. ఈ మధ్యన ఈ సంకేతాల ఆధారంగా నేరస్థులను, ఇతరులను అనుసరించి ఆరా తీయడం మామూలయింది. మూడు టవర్ల నుంచి సంకేతాలను ‘ట్రయాంగులేషన్’ అనే పద్ధతిలో విశ్లేషిస్తే, వాటిని పంపిన ఫోన్ ఉన్న స్థలం తెలిసిపోతుంది. దీంతో రష్యా–ఉక్రెయిన్ సైన్యాలు దీన్ని అనువుగా వాడుకుని శత్రుపక్షం ఆచూకీ సులభంగా తెలుసుకుంటున్నాయి. ‘ఇదేదో, ఇదుగో నేను నీ లక్ష్యాన్ని’ అని వీపు మీద బొమ్మ గీసుకుని తిరుగుతున్నట్లయిందని అంటారు యూకేలోని సర్రె విశ్వవిద్యాలయం పరిశోధకులు అలన్ వుడ్‌వర్డ్. ఇక రష్యావారు ఒక అడుగు ముందుకు వేసి ‘లియత్–3’ అనే సిస్టమ్‌ను తయారు చేశారు. ఇందులో మొబైల్ ఫోన్ టవర్స్లాగ పనిచేసే డ్రోన్స్ ఉంటాయి. అవి ఆరు కిలో మీటర్ల పరిధిలోనున్న సుమారు రెండు వేలకు పైగా మొబైల్ ఫోన్ల ఆచూకీ తెలుసుకునే శక్తి గలవి. ఈ రకంగా అధికారులను అనుసరించి మట్టుబెట్టిన సందర్భాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వివరంగా రాశారు. ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజేషన్, రీకన్నాయిజాన్స్ అంటే కంప్యూటర్ వాడకం సాయంగా గమ్యాలను గుర్తించే ‘ఇస్తార్’ సిస్టమ్‌లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక క్షణాల్లో గమ్యాలను తెలుసుకుని మిసైల్స్ ప్రయోగించే వీలు కలుగుతున్నది. (క్లిక్: యుద్ధ నివారణే పాలకుల కర్తవ్యం!) ఇక స్మార్ట్ ఫోన్లలో ‘జీపీఎస్’ అనే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. అది సులభంగా ఎదుటివారికి అందరి స్థావరాల ఉనికినీ అందజేస్తుంది. అన్నింటికీ మించి యుద్ధరంగంలోని సైనికులను భయానికి గురిచేసే, సందేశాలు కూడా మొబైల్ ఫోన్లలో వస్తున్నాయి అంటారు ‘కోపెన్ హేగెన్ యూనివర్సిటీ’ పరిశోధకులు గొలోవ్షెంకో. మీవాడు చనిపోయాడంటూ తప్పుడు సమాచారాన్ని అందించిన సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ బాధలు రెండు పక్షాల వారికీ తప్పడం లేదు. (క్లిక్: అందుకే రష్యాను సమర్థించక తప్పదు) బాల్టిక్ స్టేట్స్‌లోనూ, అఫ్గానిస్తాన్‌లో కూడా ఈ రకం పద్ధతులను వాడి సైనికులను మానసికంగా వ్యథకు గురిచేసిన సందర్భాలను గురించి గొలోన్షెంకో వంటి పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. రష్యా సైన్యం ఏప్రిల్ మొదటి తేదీన సుమారు 5 వేలమంది ఉక్రెయిన్, సైన్యాధికారులు, రక్షణ సిబ్బందికి మెసేజీలు పంపినట్టు సమాచారం. తాము కూడా ఇటువంటి సందేశాలు పంపుతున్నట్టు ఉక్రెయిన్ ఇంటీరియర్ అఫెయిర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్ వాడుతున్న ప్రతి సైనికుడూ ఒక డేటా పాయింట్‌గా నిలచి, తమ గురించి సమాచారం వెదజల్లుతున్నట్లే లెక్క. అది సైనికులకు ప్రాణాపాయం కలిగిస్తున్నది. - డాక్టర్ కె.బి. గోపాలం రచయిత, అనువాదకులు -
మాకు మరింత ఆయుధ సంపత్తిని ఇవ్వండి! జెలెన్ స్కీ విజ్ఞప్తి
Russian Phosphorus Bombs Were Used: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా గత మూడు వారాలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలను, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఖతరు చేయకుండా మరింతగా బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఫాస్ఫరస్ వంటి ప్రమాదకరమైన బాంబులతో మరింతగా విరుచుకుపడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఆవేదనగా చెప్పారు. మళ్లీ ఈ భయానక విధ్వంసంలో పెద్ద ఎత్తున్న పిల్లలు, పెద్దలు మృతి చెందారని అన్నారు. పైగా రష్యా తన భయంకరమై ఆయుధ సంపత్తితో ఎలాంటి ఆంక్షలు లేకుండా యథేచ్ఛగా దాడి చేస్తోందని తెలిపారు. అందువల్ల తమకు విస్తృత ఆయుధ సాయాన్ని అందించాలని నాటోని కోరారు. ఉక్రెయిన్‌లోని నగరాలను ప్రజలను రక్షించుకునేందకు ఉక్రెయిన్‌కి ఆంక్షలు లేని సైనిక సహాయం అవసరం అని నొక్కి చెప్పారు. ఇంతవరకు ఆయుధ సామాగ్రిని సమకూర్చిన పాశ్చాత్య సైనిక కూటమి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ...మీ యుద్ధ విమానాల్లో ఒక శాతం మాకు ఇవ్వండి. మీ ట్యాంకులలో ఒక శాతం ఇవ్వడం అని కోరారు. అంతేగాక రష్యా తమ దేశంలో ఫాస్ఫరస్ ఆయుధాలతో మోహరించిందని చెప్పారు. రష్యన్ దాడులను ఎదుర్కొనేలా దురాక్రమణకు గురికాకుండా తమ దేశాన్ని రక్షించుకునేందుకు విస్తృతమైన ఆయుధ సాయాన్ని అందించి ఉక్రెనియన్ల మరణాన్ని నిరోధించాలని నాటోకి విజ్ఞప్తి చేశారు. (చదవండి: భారత్ ఆ నిర్ణయం తీసుకుంటే...నేను సంతోషకరమైన రాయబారిని అవుతా!) -
రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధం నానాటికీ ఉగ్రరూపు దాలుస్తోంది. దేశంలోని పలు నగరాలపై రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతోంది. పెద్దపెట్టున బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. రాజధాని కీవ్‌పై బాంబుల వర్షమే కురిపిస్తోంది. ఎక్కడ చూసినా చెలరేగుతున్న మంటలతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. యుద్ధం మొదలైన 8 రోజుల అనంతరం ఎట్టకేలకు ఒక నగరాన్ని రష్యా ఆక్రమించుకోగలిగింది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటించింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా దీన్ని ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ ప్రజలకు నగర మేయర్ పిలుపునిచ్చారు. కీవ్‌తో పాటు పలు ఇతర నగరాలపైనా రష్యా భారీగా విరుచుకుపడుతోంది. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌పై దాడులను తీవ్రతరం చేసింది. దాంతో ఇక్కడినుంచి జనం తండోపతండాలుగా పారిపోతూ కన్పిస్తున్నారు. వారితో రైల్వేస్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. మరో కీలక రేవు పట్టణం మారిపోల్ కూడా బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అక్కడి విద్యుత్కేంద్రాలు ఇతర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. కరెంటు లేక నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆహారం, తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. టెలిఫోన్ సేవలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి. ఇక ఖెర్సన్‌ను ఆక్రమించిన రష్యా సేనలు అక్కడినుంచి మరో రేవు పట్టణం మైకోలెవ్ దిశగా కదులుతున్నాయి. భారీ కాన్వాయ్‌లు తమకేసి దూసుకొస్తున్నాయని నగర మేయర్ ధ్రువీకరించారు. రష్యా నావికా దళం కూడా యుద్ధ రంగంలోకి కదులుతోంది. సముద్రంతో పాటు నేలపైనా దూసుకుపోగల వాహనాలు సముద్ర మార్గంలో ఒడెసా తీరంకేసి కదులుతున్నట్టు ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వలసలు 10 లక్షలు దాటిపోయాయి. దేశ జనాభాలో 2 శాతానికి పైగా ఇప్పటికే సరిహద్దులు దాటారని ఐరాస అంచనా వేసింది. పోరాడుతున్న ఉక్రెయిన్ రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధ వ్యూహాలతో ప్రతి చోటా అడుగడుగునా ఆటంకపరుస్తున్నాయి. సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వాడుకుంటున్నాయి. నగరాలకు దారితీసే నేమ్ బోర్డులను మార్చడం, తారుమారు చేయడం, బ్రిడ్జీలను పేల్చేయడం తదితర చర్యలకు దిగుతున్నాయి. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 9 వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టిన్టట్టు ఉక్రెయిన్ సైనిక జనరల్ కార్యాలయం ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. రష్యాకు చెందిన సైనిక ఉన్నతాధికారి మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్సికీని తమ స్నైపర్ చంపేశాడని ఉక్రెయిన్ చెప్పింది. తమపై దండయాత్ర రష్యా అనుకున్న రీతిలో సాగడం లేదనేందుకు ఇదే నిదర్శనమంది. రష్యా ఫైటర్ జెట్‌ను ఒకదానిన కూల్చేసినట్టు కూడా ప్రకటించింది. ఆండ్రీ రష్యా సెంట్రల్ మిలటరీ జిల్లా 41వ సీఏఏకు డిప్యుటీ కమాండర్. ఆయన మరణాన్ని రష్యా ధ్రువీకరించలేదు. రష్యా సైన్యాలను తమ యోధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. బాంబులు, క్షిపణులు, రాకెట్ లాంచర్లతో కూడిన భారీ దాడిని కీవ్ మరో రోజు తట్టుకుని నిలిచిందన్నారు. దాంతో దిక్కుతోచక యుద్ధ విమానాల ద్వారా భారీ దాడులకు రష్యా దిగుతోందన్నారు. ఉక్రేనియన్లు గ్యాంగ్స్టర్లు యుద్ధం ఆపేదే లేదు: పుతిన్ ఉక్రెయిన్లను భయంకరమైన గ్యాంగ్స్టర్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. ఉక్రెయిన్ సైనికులు నియో నాజీలని, పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అక్కడి అమాయాకులను కాపాడేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోందని చెప్పుకున్నారు. ఏదేమైనా పట్టించుకోబోనని, అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు చివరిదాకా పోరును కొనసాగిస్తామని టీవీలో మాట్లాడుతూ ప్రకటించారు. దాడిని ఆపే ఉద్దేశమే లేదని అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఫోన్ సంభాషణలో పుతిన్ స్పష్టం చేశారు. పుతిన్ తీరు సరిగా లేదని మాక్రాన్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ‘‘మీరు భారీ తప్పిదానికి పాల్పడుతున్నారు. పైగా మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు’’ అని చెప్పారంటున్నారు. పౌరులను పోనిద్దాం రెండో దఫా చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ త్వరలో మళ్లీ సమావేశానికి అంగీకారం కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా చర్చలు బెలారస్ సమీపంలో పోలండ్ సరిహద్దుల వద్ద గురువారం జరిగాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలూ తమ డిమాండ్లపై పట్టుబట్టినట్టు సమాచారం. అయితే పౌరులు యుద్ధ క్షేత్రాల నుంచి సురక్షితంగా తరలి వెళ్లేందుకు సహకరించాలని, అందుకు వీలుగా ఆయా చోట్ల తాత్కాలికంగా కాల్పులను విరమించాలని అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు రష్యా తరఫున చర్చల్లో పాల్గొన్న పుతిన్ సలహాదారు వ్లాదిమిర్ మెడిన్స్కీ తెలిపారు. చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ డిమాండ్లకు కట్టుబడ్డాయన్నారు. కొన్నింటిపై పట్టువిడుపులతో వ్యవహరించాలన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమైందని చెప్పారు. -
తెరపైకి థర్మో బారిక్ బాంబులు.. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగం..?
అణ్వాయుధాల తర్వాత అంతటి విధ్వంసాన్ని, ప్రాణనష్టాన్ని సృష్టించగల ఆయుధాలు.. థర్మో బారిక్ బాంబులు. అటు భారీ ఆస్తి నష్టంతో పాటు, ఇటు పెద్ద ఎత్తున జనహననానికి కారణమయ్యే ఈ బాంబులను తమ నగరాలపై రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇంతకీ ఏమిటీ బాంబులు? ఎందుకు అంతగా విధ్వంసం సృష్టిస్తాయి? చూద్దాం... అత్యధిక నష్టాన్ని కలిగించే ఈ థర్మోబారిక్ ఆయుధాల తయారీ 1960లో యూఎస్, సోవియట్ పోటాపోటీగా చేపట్టాయి. అప్పటినుంచి అంచెలంచెలుగా వీటిని అభివృద్ధి చేస్తూ వచ్చాయి. 2007లో రష్యా అతిపెద్ద థర్మోబారిక్ ఆయుధాన్ని పరీక్షించింది. ఈ ఆయుధం 39.9 టన్నుల పేలుడును సృష్టించింది. వీటి తయారీకి ఒక్కో బాంబుకు దాదాపు 1.6 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతుంది. 2017లో అమెరికా తాలిబన్లపై అఫ్గాన్‌లో ఈ బాంబును ప్రయోగించింది. దీని బరువు 21,600 పౌండ్లు. దీని ప్రయోగంతో దాదాపు వెయ్యి అడుగుల విస్తీర్ణంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. వీటిని వాక్యూం బాంబ్ అని, ఏరోసాల్ బాంబ్ అని, ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్ అని వ్యవహరిస్తారు. ఉక్రెయిన్‌పై ప్రయోగించారా? ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా టీఓఎస్1 బురాటినో అనే థర్మోబారిక్ రాకెట్ సిస్టమ్‌ను వాడినట్లు కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఆయుధాన్ని ఫ్లేమ్ త్రోయర్ అని కూడా వ్యవహరిస్తారు. రష్యా తమపై వాక్యూమ్ బాంబ్‌ను ప్రయోగించిందని ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి విలేకరులతో ధ్రువీకరించారు. అయితే రష్యా నిజంగా వీటిని ప్రయోగించిందనేందుకు మరే ఇతర అధికారిక ఆధారాలు ఇంతవరకు లభించలేదు. ఈ బాంబులను ప్రయోగించాలని పుతిన్ భావిస్తే పరిణామాలు వినాశకరంగా ఉంటాయని అమెరికా మాజీ సైనికాధికారి సర్ రిచర్డ్ హెచ్చరించారు. వీటివల్ల అమాయకులైన వేలాది మంది చనిపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిప్రయోగంతో పరిసరాల్లోని ప్రజలు చనిపోవడమేకాకుండా దూరంగా ఉన్నవారిలో బయటకు కనిపించని దుష్పరిణామాలుంటాయని చెప్పారు. వీటి ప్రభా వం శ్వాసకోస, హృదయ, జీర్ణకోశ, కేంద్ర నాడీ వ్యవస్థలపై ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా పనిచేస్తుంది.. ఆవిరిమేఘాల పేలుడు సూత్రం ఆధారంగా ఈ బాంబులు విధ్వంసం సృష్టిస్తాయి. ఈ బాంబులను ప్రయోగించినప్పుడు తొలుత పదునైన లోహ శకలాలు లేదా రసాయన బిందువులతో కూడిన ఏరోసాల్ (గాలి తుంపరలు) ఇంధన మేఘం విడుదలవుతుంది. మేఘంలోని ఏరోసాల్స్ పరిసరాల్లోకి వేగంగా వ్యాపిస్తాయి. అనంతరం సంభవించే పేలుడుతో మేఘంలోని ఏరోసాల్స్ అన్నీ ఒక్కసారిగా అంటుకుంటాయి. పేలుడు కారణంగా ఉత్పన్నమయ్యే శూన్యంలోకి పరిసరాల్లోని గాలి వేగంగా వస్తుంది, ఇందులోని ఆక్సిజన్ ఏరోసాల్స్‌ను మరింత వేగంగా మండిస్తుంది. దీంతో తీవ్రమైన ఉష్ణోగ్రతతో కూడిన విస్ఫోటనం సంభవిస్తుంది. ఈ విస్ఫోటనంతో పరిసరాల్లోని జీవజాలమంతా మాడిపోతుంది, భారీగా ఆస్తి నష్టం సంభవిస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత ఉధృతం చేసింది. దేశంలోని రెండో పెద్ద నగరం ఖర్కీవ్‌పై బాంబులు, క్షిపణులతో మరింతగా విరుచుకుపడింది. పలు జనసమ్మర్ధ ప్రాంతాలపై విచక్షణారహితంగా దాడులకు దిగింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోనూ దాడులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇక రాజధాని కీవ్ స్వాధీనమే లక్ష్యంగా మంగళవారం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ రష్యా సైనిక కాన్వాయ్ నగరాన్ని అన్నివైపుల నుంచీ వ్యూహాత్మకంగా చుట్టుముడుతోంది. సైనిక స్థావరాలతో పాటు నివాసాలు, ఆవాస సముదాయాలు, మౌలిక వ్యవస్థలపై భారీగా బాంబు దాడులకు, క్షిపణి ప్రయోగాలకు దిగుతుండటంతో రోజంతా నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దక్షిణాదిన తీర ప్రాంత నగరం మారిపోల్‌లోనూ ఇదే పరిస్థితి! పలు నగరాలు రష్యా అధీనంలోకి వెళ్లాయని వార్తలు వస్తున్నాయి. దాడుల భయంతో దేశవ్యాప్తంగా బంకర్లలో, పార్కింగ్ స్థలాల్లో, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వణికించే చలిలో కనీస రక్షణ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో వారంతా గజగజ వణుకుతున్నారు. తిండీతిప్పలకూ గతి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 2000 మందికి పైగా అమాయకులు యుద్ధానికి బలైనట్టు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ప్రకటించింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా వాయు, భూతల దాడులు భారీగా పెరిగాయని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. వలస బాట పట్టిన ఉక్రేనియన్ల సంఖ్య 9 లక్షలు దాటిందని ఐరాస వలసల ఏజెన్సీ పేర్కొంది. త్వరలో 10 లక్షలు దాటేస్తుందని ఆందోళన వెలిబుచ్చింది. మంటల్లో ఖర్కీవ్ రష్యా దాడుల ధాటికి ఖర్కీవ్ నిప్పుల కుంపటిలా మారుతోంది. నగరంలోని ప్రాంతీయ పోలీసు, నిఘా విభాగాల ప్రధాన కార్యాలయాలపై రష్యా దళాలు బుధవారం భారీగా బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో కనీసం నలుగురు మరణించినట్టు సమాచారం. ఐదంతస్తుల పోలీసు విభాగం భవనం పై కప్పు దాడుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవన శిథిలాలు పక్క వీధుల దాకా చెల్లాచెదురుగా పడ్డాయి. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసు విభాగం విడుదల చేసింది. వీటితో పాటు బుధవారం కూడా పలు నివాసాలు, ఆవాస సముదాయాలపై పెద్దపెట్టున బాంబులు, క్షిపణులు విరుచుకుపడ్డాయని సమాచారం. చెర్నిహివ్‌లో ఒక ఆస్పత్రిపై రెండు క్రూయిజ్ మిసైళ్లతో దాడి జరిగిందని నగర మేయర్ తెలిపారు. ప్రధాన భవనం పూర్తిగా దెబ్బ తినడంతో పాటు భారీగా ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించారు. దాడుల తీవ్రత వల్ల గాయపడ్డ వారిని కనీసం తరలించే పరిస్థితి కూడా లేదని మారిపోల్ మేయర్ వాపోయారు. హోలోకాస్ట్ స్మారకం ధ్వంసం ఖర్కీవ్‌లో టీవీ టవర్‌పై మంగళవారం జరిగిన దాడిలో రెండో ప్రపంచయుద్ధం నాటి హోలోకాస్ట్ స్మారకం కూడా బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. 1941లో ఇక్కడ హిట్లర్ నాజీ సేనలు 33 వేల మందికి పైగా యూదులను రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపాయి. దానికి గుర్తుగా నిర్మించిన స్మారకం రష్యా దాడిలో దెబ్బ తిన్నది. హసిడిక్ యూదులకు ప్రముఖ యాత్రా స్థలమైన ఉమన్ నగరంపై కూడా బాంబుల వర్షం కురిసింది. చివరికి యాత్రా స్థలాలను, చారిత్రక కట్టడాలను కూడా లక్ష్యంగా చేసుకుంటూ రష్యా నానాటికీ దిగజారి ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. దాని తీరు మానవత్వానికే మాయని మచ్చ అని ఫేస్బుక్ పోస్టులో మండిపడ్డారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రను, దాంతోపాటు మా ప్రజలందరినీ పూర్తిగా తుడిచిపెట్టేయాలని సైన్యాలకు మాస్కో నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అందుకే ఇంతటి నైచ్యానికి ఒడిగడుతున్నారు’’ అని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించాలని, తమకు అన్నివిధాలా సాయం రావాలని ప్రపంచ దేశాలన్నింటికీ మరోసారి విజ్ఞప్తి చేశారు. 498 మంది మరణించారు: రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇప్పటిదాకా 498 మంది రష్యా సైనికులు మరణించారని ఆ దేశం ప్రకటించింది. 1,597 మంది గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ వెల్లడించారు. తమకు భారీగా ప్రాణ నష్టం జరిగిందన్న వార్తలను కొట్టిపారేశారు. 2,870 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను హతమార్చామన్నారు. 3,700 మందికి పైగా గాయపడ్డారని, 572 మంది యుద్ధ ఖైదీలుగా దొరికారని చెప్పారు. ఈ యుద్ధంలో తమ సైనికులు మరణించారని రష్యా అంగీకరించడం ఇదే తొలిసారి. మాల్డోవా మీదా దాడి? మిన్స్క్: ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన మాల్డోవాపై కూడా దాడికి రష్యా ప్రణాళిక వేస్తోందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో అన్నారు. ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీలో ఆయన ఈ మేరకు చెప్పారు. సంబంధిత వీడియోను బెలారస్ ప్రభుత్వమే ఆన్లైన్లో పెట్టింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని రేపు పట్టణమైన ఒడెసా గుండా మాల్డోవాపైకి రష్యా దండెత్తుతుందని లుకషెంకో చెప్పుకొచ్చారు. దీనిపై యూరప్ దేశాలు మరింత మండిపడుతున్నాయి. -
బాంబుల హోరుతో భయం భయంగా..విద్యార్థులు
సాక్షి, నెట్వర్క్ : ఉక్రెయిన్‌లో మూడో రోజూ రష్యా దాడులు కొనసాగుతుండడం.. యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బాంబుల హోరుతో బెంబేలెత్తుతున్నారు. రాజధాని కీవ్‌లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన వైద్య విద్యార్థిని సాయినిఖిత ఉంటున్న అపార్ట్మెంటుకు కిలోమీటర్ దూరంలో శుక్రవారం రాత్రి బాంబులు పడటంతో అక్కడ వారంతా భయంకంపితులయ్యారు. బాంబులు పడిన ప్రాంతమంతా భీకర శబ్దాలతో దద్దరిల్లిందని శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పింది. రాత్రంతా బాంబుల శబ్దాలతో నిద్రపోలేదని చెప్పింది. కానీ, శనివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ వాతావరణం నెలకొందని వివరించింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ వాట్సప్ గ్రూపులో మెసేజ్‌లు వస్తున్నాయని అక్కడి పరిస్థితిని నిఖిత వివరించింది. వాహనాలు లేనందున ఎక్కడికీ కదల్లేని పరిస్థితని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లడం కూడా అంత శ్రేయస్కరం కాదని హెచ్చరించడంతో తామంతా కీవ్‌లోని అపార్ట్మెంట్లోనే ఉండిపోయామని తెలిపింది. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి దైర్యం చెప్పారని, ఆయన సిబ్బంది తరచూ మాట్లాడుతున్నారని చెప్పింది. అలాగే, బి.కొత్తకోట శెట్టిపల్లె రోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కూడా తన కుమారుడు ఎస్. చైతన్య కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే శనివారం సాయంత్రం చైతన్య సహా పలువురు విద్యార్థులు బస్సులో రుమేనియా దేశానికి బయలుదేరారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ముంబై కాని, ఢిల్లీకాని చేరుకుంటారు. బస్సుల కొరతతో విడతల వారీగా.. ఇక భారత్ ఎంబసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రుమేనియాకు బయల్దేరామని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన మోతుకూరు నాగప్రణవ్ తెలిపాడు. శనివారం మధ్యాహ్నం ప్రణవ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బస్సులో రుమేనియాకు చేరుకునేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, అక్కడ నుంచి స్వదేశానికి వస్తామని తెలిపాడు. ఇక్కడ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం 30 మంది బస్సులో రుమేనియా బయలుదేరామని తెలిపాడు. మరో 20 మంది రాత్రికి, మిగతా 20 మంది రేపు బయల్దేరుతారన్నాడు. బస్సుల కొరత కారణంగా విడతల వారీగా రుమేనియాకు వెళ్లాల్సి వస్తోందని ప్రణవ్ ‘సాక్షి’కి వివరించాడు. మరోవైపు.. విమానాలు లేక దాచేపల్లికి చెందిన కటకం మురళీకృష్ణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. విమానం టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న మరో యూనివర్సిటీకి రమ్యశ్రీతో పాటు మరికొంతమంది విద్యార్థులను అక్కడి అధికారులు తరలించారు. భయపడొద్దు..మేమందరం ఉన్నాం : కోన రఘుపతి ‘ఉక్రెయిన్ నుంచి ప్రతి ఒక్కరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.. భయపడొద్దు..మేమందరం ఉన్నాం’.. అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఉక్రెయిన్‌లో ఉన్న నోషితకు, ఇక్కడ ఆమె తల్లిదండ్రులు శ్రీదేవి, శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పారు. వీడియోకాల్‌లో నోషితతో మాట్లాడిన అనంతరం ఆయన టాస్క్‌ఫోర్స్ కమిటీతో ఉక్రెయిన్‌లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అధైర్య పడొద్దని అమలాపురం ఎంపీ అనురాధ తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవల్లికి చెందిన సలాది గంగా భవాని (భవ్య)కు శనివారం వీడియో కాల్చేసి మాట్లాడారు. భవ్యతో పాటు 20 మంది విద్యార్థులు బంకర్లో ఉన్నారు. -
సంచిలో నాటు బాంబులు చూసి ఉలిక్కిడ్డ పోలీసులు
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): పట్టపగలే ఓ వ్యక్తి చేతిసంచిలో నాటుబాంబులు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శనివారం చిత్తూరు జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపింది. వివరాల్లోకి వెళితే.. వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని మహేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన దొరస్వామి (37) తీసుకెళ్తున్న ఓ చేతిసంచిని అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ సంచిలో ఉన్న నాటు బాంబులను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి.. దొరస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాంబులు ఎందుకోసం తీసుకొస్తున్నారు? ఎక్కడ నుంచి తెస్తున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చేతిసంచిలో సుమారు 20 నాటు బాంబులు ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతున్నదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గోపి తెలిపారు. -
ఇరాక్‌లో అమెరికా దాడులు
బాగ్దాద్: ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల వర్గంపై అమెరికా ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. సిరియా సరిహద్దుల్లోని అల్ ఖయిమ్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా బ్రిగేడ్స్‌కు చెందిన పలు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది చనిపోయారు. 51 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురు కమాండర్లు కూడా ఉన్నారు. ఇరాన్ అనుకూల హషెద్ అల్ షాబి సంస్థ విభాగమే హెజ్బొల్లా బ్రిగేడ్స్. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని మండిపడింది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్బాస్ మౌసవి హెచ్చరించారు. ఇరాక్‌లోని 3, సిరియాలోని 2 స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు విజయవంతమయ్యాయని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ చెప్పారు. -
కడపలో బాంబుల భయం.!
సాక్షి, జమ్మలమడుగు(కడప) : జమ్మలమడుగుకు బాంబుల మడుగు ఉన్న అపవాదు తొలగిపోయి దశాబ్దాల కాలమైంది. ఈ మధ్య కాలంలో అక్కడక్కడా హత్యలు జరిగినప్పటికి బాంబులను వినియోగించిన సంఘటనలు లేవు. ఇక బాంబుల సంస్కృతి పూర్తిగా చరిత్రలో కలిసిపోయిందనుకుంటున్న తరుణంలో జమ్మలమడుగు ప్రాంతంలో మళ్లీ బాంబుల బకెట్లు బయటపడటం సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. జమ్మలమడుగు పట్టణ శివారు ప్రాంతంలో రెండు రోజుల క్రితం నాలుగు బకెట్లలో 54 నాటు బాంబులు బయటపడేసరికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 20 ఏళ్ల క్రితం.. 1999వ సంవత్సరానికి ముందు జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబులు దొరకడం పెద్ద వింతేమీ కాదు. అప్పట్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ ఉండటంతో ఇరువర్గాల వద్ద నాటుబాంబులు విరివిగా లభించేవి. వీటి తయారీ కూడా జమ్మలమడుగు ప్రాంతంలోనే జరిగేది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సైతం బాంబులను సరఫరా చేసేవారు. బకెట్లలో, లెదర్ బ్యాగులలో బాంబులను తీసుకెళ్లేవారు. కాని 1999లో జమ్మలమడుగు సబ్ డివిజన్‌కు అడిషనల్ ఎస్పీగా వచ్చిన శంకరబాత్రా బాగ్చీ అప్పటి జిల్లా ఎస్పీ గోవింద్‌సింగ్‌ల ప్రత్యేక కృషి వల్ల నియోజకవర్గంలో స్వచ్ఛంద బాంబుల అప్పగింత కార్యక్రమం జరిగింది. ఫ్యాక్షనిస్టుల వద్ద నుంచి వేల సంఖ్యలో బాంబులను స్వాధీనం చేసుకుని అప్పట్లో పోలీసులు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత బాంబుల వాడకం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నేతలు సైతం అభివృద్ధి, ఆదాయాలపై దృష్టి సారించడంతో గ్రామాల్లో ఫ్యాక్షనిజం దాదాపు కనుమరుగైపోయింది. గత పది సంవత్సరాలుగా జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబుల మాటే వినబడలేదు. ఇప్పుడు తాజాగా బయటపడుతున్న నాటుబాంబులు జమ్మలమడుగు ప్రాంతంలో కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న రామచంద్రాయపల్లె..నిన్న జమ్మలమడుగు... ఇటీవల రెండు వారాల క్రితం మైలవరం మండలం రామచంద్రాయపల్లె గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం దాచిపెట్టిన బాంబుల బకెట్ బయట పడింది. పొక్లెయిన్‌తో పొలం గట్లను చదును చేస్తున్న సమయంలో కనిపించిన బాంబుల బకెట్‌ను పరిశీలిస్తున్న సమయంలో అందులోని బాంబులు పగిలి పొలం యజమాని కుమారుడు గాయపడ్డాడు. ఆ సంఘటన మరువక ముందే మంగళవారం జమ్మలమడుగు పట్టణ శివార్లలో , ముద్దనూరు రహదారిలో భూములను కొనుగోలు చేసి వాటిని ఫ్లాట్లుగా మార్చుతున్న క్రమంలో భూమి లోపల నాలుగు బాంబుల బకెట్లు బయటపడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వతేదీ జమ్మలమడుగుకు వచ్చిన సందర్భంగా ముద్దనూరు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ నాటు బాంబులు దొరకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. అలాంటిది హెలిప్యాడ్‌కు సమీపంలోనే ఉన్న పొలంలోనే నాటుబాంబులు బయటపడటం నిఘా వైఫల్యానికి పరాకాష్టగా నిలిచింది. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రస్తుతం దొరికిన నాటుబాంబులకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు గాని శిక్షణ పొందిన బాంబ్‌స్క్వాడ్ సభ్యులు సీఎం పర్యటన సందర్భంలో వీటిని ఎందుకు పసిగట్టలేకపోయారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి సభకు విచ్చేసిన ప్రజల్లో కొందరు మలమూత్ర విసర్జన నిమిత్తం ఆ పరిసరాలలో సంచరిస్తున్నప్పుడు పొరపాటున జరగరానిది ఏదైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరన్న ప్రశ్నకు నిఘా విభాగమే జవాబు చెప్పాలి. -
అధికార కుట్ర
ప్రశాంతంగా ఉన్న పల్నాడు పల్లెల్లో చిచ్చుపెట్టే కుట్ర.. ఫ్యాక్షన్‌కు దూరంగా బతుకుతున్న గ్రామాల్లో అలజడి రేపే కుయుక్తులు.. సినీ ఫక్కీలో నాటు బాంబులు ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయించేందుకు అధికార పార్టీ నేతల పథక రచన.. మొత్తంగా రెండు దశాబ్దాలుగా బాంబుల మోతలు లేని పల్నాడులో మళ్లీ నాటు బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లులో శుక్రవారం తెల్లవారుజామున నాటు బాంబులు దొరికాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబుల తతంగంతో పల్నాడు గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. సాక్షి, గుంటూరు, రెంటచింతల: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం మంచికల్లులో ఆయన ఇంటికి అతి సమీపంలో శుక్రవారం నాటు బాంబులు దొరకడం కలకలం రేపింది. ఈ నాటు బాంబులు పట్టుబడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం గ్రామ దేవత పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా గుంటూరుకు చెందిన 10 మంది డాగ్ స్క్వాడ్, మరో 10 మంది బాంబు స్క్వాడ్‌తోపాటు 30 మంది పోలీసులతో గురజాల రూరల్ సీఐ బీ నర్సింహారావు, మాచర్ల సీఐ జీ సాంబశివరావు నేతృత్వంలో కారంపూడి ఎస్ఐ ఎం మురళితో కలిసి రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు జరిపారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత యరపతినేని నరసింహారావు నివాసం ముందు ఉన్న వాహనం కింద ప్లాస్టిక్ బకెట్లో నాటు బాంబులను పోలీసు జాగిలాలు గుర్తించాయి. పోలీసులు నరసింహారావు కుటుంబ సభ్యులను నిద్రలేపి బాంబులు ఉన్న విషయం చెప్పడంతో వాళ్లు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఆ బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నరసింహారావునును అదుపులోకి తీసుకుని గురజాల డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో విచారించారు. అన్నీ అనుమానాలే.. పోలీసులు తనిఖీలకు వచ్చిన రోజే నరసింహారావు ఇంటి ముందు నాటు బాంబుల బకెట్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గురజాల ఎమ్మెల్యేకు వరుసకు తమ్ముడు అయిన నరసింహారావు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బాంబులతో నరసింహారావును హత మార్చేందుకు ప్రత్యర్థులు ఆయన కారు కింద ఉంచారో? అక్రమ కేసులో ఇరికించి వేధింపులకు గురి చేసేందుకే కుయుక్తులు పన్నారో ? తెలియాల్సి ఉంది. ఒక వేళ నరసింహావు బాంబులు తెచ్చి ఉంటే నడి రోడ్డుపై తాను కొత్తగా కొనుగోలు చేసిన కారు కింద ఎందుకు పెడతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గ్రామంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసినా వాటిని అక్కడ ఎందుకు వదిలేస్తారనే చిన్న లాజిక్కును టీడీపీ నేతలు, పోలీసులు విస్మరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పట్టుకోల్పోతున్నామనే భయంతోనే ? మంచికల్లులో టీడీపీ నుంచి ముఖ్య నేతలు, భారీ స్థాయిలో కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. దీంతో గ్రామంలో పట్టుకోల్పోతున్నామనే భయంతోనే నాటు బాంబులను తెచ్చి పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గురజాల, మాచర్ల నియోజకవర్గంలో ఓ ముఖ్యనేత తన స్వగ్రామంలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బాంబుల కుట్ర పన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నరసింహారావు ఈ ఏడాది మేలో మాజీ సర్పంచ్‌లు గీదా సీతారామిరెడ్డి, గోగుల లక్ష్మీ పుల్లారెడ్డి, బొల్లినేని లక్ష్మీ నారాయణతో కలిసి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నరసింహారావు కుమారుడు శివాజీ సోషల్ మీడియా ద్వారా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోస్టింగ్‌లు పెడుతుండే వాడు. శుక్రవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు తెనాలి వెంకట నారపరెడ్డితోపాటు మరో ముగ్గురు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పెట్టారు ? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు పెట్టారని కేసు నమోదు చేశామని వెల్లడించారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు నాటు బాంబుల కలకలంతో మంచికల్లులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం అమ్మవారి తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుంతుందోనని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
మందు‘పాతర’కేనా?
సాక్షి, కొత్తగూడెం: ఈ నెల 2వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు ఈ రెండువారాల్లో సరిహద్దు ప్రాంతాల్లో అనేక విధ్వంసాలకు పాల్పడ్డారు. దీనిని మరింతగా కొనసాగించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మరింత శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో దాడులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. మరిన్ని అత్యాధునిక ఆయుధాలు, మరింత శక్తిమంతమైన పేలుడు పదార్థాలు సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. గురువారం కొత్తగూడెం నుంచి చర్ల వైపు లారీలో తరలిస్తున్న 1,000 డిటోనేటర్లు, 75 జిలెటిన్ స్టిక్స్‌ను భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. 8మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇవి మావోయిస్టులకు వెళుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు మరిన్ని దాడులు, విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లో మరింత టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మావోయిస్టులు 2వ తేదీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఈ నెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలో శక్తిమంతమైన ఐఈడీతో మైన్‌ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చారు. 5వ తేదీన సుక్మా జిల్లా డోర్నపాల్ వద్ద మూడు బస్సులు, మూడు లారీలు తగులబెట్టిన మావోయిస్టులు 14వ తేదీన బీజాపూర్ జిల్లాలో 7 వాహనాలు తగులబెట్టారు. ఈ దాడులు మరింత పెంచేందుకు మావోయిస్టులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు నిఘా కోసం డ్రోన్ కెమెరాలను వాడుతున్నారని, వాటిని సైతం పడగొట్టేందుకు సైతం మావోయిస్టులు ప్రణాళికలు తయారుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌తో రగులుతున్న వైనం.. మూడేళ్ల తర్వాత తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించాలనుకునే క్రమంలో ఈనెల 2వ తేదీన ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టులు రగిలిపోతున్నారు. మరింత ఉధృతంగా దాడులు చేసేందుకు ముందుకెళుతున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాజాగా భద్రాచలంలో పేలుడు పదార్థాలు లభించడంతో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరింత టెన్షన్ పడుతున్నారు. ప్రతి ఏడాది ఈ సీజన్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య హోరాహోరీగా పోరాటం నడుస్తోంది. దీంతో ఇరువైపులా ప్రాణనష్టం అధికంగానే ఉంటోంది. గతంలోనూ ప్రతీకారేచ్ఛ.. 2008 మార్చి 18న బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రతీకారంగా అదే నెలలో మావోయిస్టులు 18 మంది పోలీసులను హతమార్చారు. 2012 మార్చి 18న నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2013 మే 25న దర్బా డివిజన్లో మావోయిస్టులు చేసిన దాడిలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులతో సహా మొత్తం 28 మంది మృతి చెందారు. 2014 ఏప్రిల్ 11న సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2014 ఏప్రిల్ 12న చింతలనార్‌లో మావోయిస్టులు మందుపాతర అమర్చి 32 మంది పోలీసులను హతమార్చారు. అదే ఏడాది మరో ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2014 ఏప్రిల్ 25న సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర భారినపడి 24 మంది పోలీసులు మృతి చెందారు. 2016 మార్చి 2వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మహిళలు సహా మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రతీసారి ఈ సీజన్లోనే భారీ సంఘటనలు జరిగి ఇరువైపులా పెద్దఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతోపాటు తెలంగాణలో అధికారపార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మన్యంలో బాంబుల కలకలం
వెంకటాపురం(కె): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కె) మండల పరిధిలోని విజయపురి కాలనీ సమీపంలో మావోయిస్టులు మంగళవారం పోస్టర్లు మాటున అమర్చిన ప్రెషర్బాంబు కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లే కొత్తపల్లి రహదారి సమీపంలో అమర్చిన ఈ బాంబును వెంకటా పురం సీఐ నలవాల రవీందర్, ఎస్సై బండారి కుమార్ ఆధ్వర్యంలో బాంబుస్క్వాడ్, డాగ్ డ్, సీఆర్ఫీఎఫ్ బలగాలు వెళ్లి రెండు గంటలపాటు శ్రమించి ఆ ప్రెషర్‌బాంబును నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి వెళ్లే వాహనాలను రెండుగంటలపాటు నిలిపివేసి ట్రాఫిక్ నియంత్రించారు. దీంతో ఇరువైపులా వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు. కాగా రెండు గంటల పోలీస్ అపరేషన్ తర్వాత బాంబును నిర్వీర్యం చేయటంతో ఊపిరి పీల్చుకున్నారు. భయం భయంగా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజ లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు డిసెంబర్ 2 నుంచి 8 వ తేదీ వరకు మావోయిస్టులు పీఎల్జీఎ వారోత్సవాలకు పిలుపునివ్వడంతో పోలీసులు తెలం గాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు భయం గుప్పిట నుంచి భయటపడడం లేదు. వరుస బాంబులతో.. వెంకటాపురం మండలంలో మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు వరుస బాంబులను అమర్చి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. 2016 జూన్1న సూరవీడు సమీపంలోని విజయపురి కాలనీలో కొత్తపల్లికి వెళ్లే రహదారి సమీపంలో ప్రెషర్ బాంబు అమర్చడంతో ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన తెల్లం రమేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి. 2016 జాలై 24న మొర్రవానిగూడెం గ్రామ సమీపంలో బకెట్ బాంబులను అమర్చి భయందోళనలకు గురిచేశారు. 2016 డిసెంబర్ 1న సూరవీడు వద్ద ప్రెషర్ బాంబు పేలి కార్తీక్ అనే ఆటో డ్త్రెవర్కు గాయాలయ్యాయి. 2017 మార్చి 4న పాలెం ప్రాజెక్టు వద్ద మందు పాతరను అమర్చారు. నవంబర్ 5 న ఆలుబాక సమీపంలో 2 మందు పాతరలను అమర్చి కలకలం సృష్టించారు. -
భారత సరిహద్దులో బాంబుల కలకలం
బహ్రాయిచ్(యూపీ) : భారత సరిహద్దులో గురువారం బాంబులు దొరకడంతో తీవ్రకలకలం రేగింది. ఇండియా-నేపాల్ సరిహద్దులో ఆరు బాంబులు లభ్యమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని రుపైదియా గ్రామంలో బాంబులున్నట్టు గుర్తించారు. భారత్ నేపాల్ సరిహద్దును పహారా కాసే సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) జవాన్లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మావోల పేలుళ్లకు రోబోతో చెక్!
- మందుపాతర్ల గుర్తింపు, నిర్వీర్యానికి ప్రత్యేక రోబోలు - ఆర్మీ ఉపయోగిస్తున్న దక్ష్‌ను తలదన్నే రీతిలో సీఆర్పీఎఫ్ కోసం తయారీ - 10 అడుగుల దూరం నుంచే ల్యాండ్మైన్లను గుర్తించే పరిజ్ఞానం - ఐఐటీ ముంబై నేతృత్వంలో రూపకల్పన - రోడ్ ఓపెనింగ్ బృందాలకు సాయంగా ఫోర్ వీలర్ రోబోలు కూడా... - ల్యాండ్మైన్లను గుర్తించే బూట్లనూ సిద్ధం చేస్తున్న సీఆర్పీఎఫ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర పారామిలిటరీ (సీఆర్పీఎఫ్) బలగాలపై మావోయిస్టులు మందుపాతరలు, అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ)తో జరుపుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దూరం నుంచే రిమోట్ల సాయంతో పేలుళ్లు జరుపుతున్న మావోయిస్టులకు అదే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పేలుళ్లను అరికట్టేందుకు సిద్ధమవుతోంది. మావోయిస్టుల చర్యలను తిప్పికొట్టేందుకు రోబోలను రంగంలోకి దించనుంది. ఐఐటీ ముంబై నేతృత్వంలో వీటిని తయారు చేయనుంది. ఎలా పనిచేస్తాయంటే... ఏడు అడుగుల ఎత్తు ఉండే ఈ రోబోలు... మందుపాతరలు, అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ)ను 10 అడుగుల దూరం నుంచే సెన్సార్ల సాయంతో గుర్తించి నిర్వీర్యం చేయగలవు. హై రిజల్యూషన్ కెమెరాల ద్వారా ఐఈడీ, ల్యాండ్మైన్లను స్కాన్ చేసి వాటి తీవ్రతను కూడా పక్కాగా చెప్పగలిగేలా వ్యవస్థను ఈ రోబోలలో ఏర్పాటు చేస్తున్నారు. మందుపాతరలకు 100 నుంచి 200 మీటర్ల దూరంలో నిలబడే సీఆర్పీఎఫ్ బలగాలు ఈ రోబోలను పనిచేయించేలా మినీ కంప్యూటర్లను తయారు చేస్తున్నారు. ఈ రోబోలను ఆపరేట్ చేసేందుకు కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. రోబోల అవసరం ఏమిటి? మావోయిస్టుల కంచుకోటగా మారిన ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్కు గత కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టులు పేలుస్తున్న ల్యాండ్మైన్లకు భారీ స్థాయిలో సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడుతున్నారు. 2015లో 49 మంది, 2016లో 64 మంది జవాన్లు ల్యాండ్‌మైన్ పేలుళ్లలో మరణించారు. దీనివల్ల కూంబింగ్ చేస్తున్న మిగతా జవాన్లలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ప్రాణ భయం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ రోబోలను రంగంలోకి తెస్తోంది. ఒకవైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరోవైపు ల్యాండ్మైన్లకు జవాన్లు బలికాకుండా రోబోలను ముందుపెట్టి కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో 92 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు పనిచేస్తున్నారు. దక్ష్‌ను తలదన్నే రీతిలో... ఉగ్ర దాడుల నియంత్రణకు సైన్యం ప్రస్తుతం ఉపయోగిస్తున్న దక్ష్ రోబోలకు దీటుగా ఈ రోబోలను రూపొందిస్తున్నారు. ఆర్మీ కోసం డీఆర్డీఓ నేతృత్వంలో దక్ష్ సిరిస్ రోబోలను రంగంలోకి దించారు. అత్యాధునిక టెలిస్కోప్, హై రిజల్యూషన్ కెమెరాలతో అనుమానిత పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేయడం, మెట్లు ఎక్కగలగడంతోపాటు ఎగుడుదిగుడు నేలలు, ఇరుకైన ప్రదేశాల్లో పనిచేసేలా దక్ష్ రోబోలను రూపొందించారు. దక్ష్ రోబోలను 200 మీటర్ల దూరం నుంచి కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్ష్ రోబోలకన్నా మరింత మెరుగ్గా పనిచేసేలా ఏడడుగుల రోబోలను తయారు చేస్తున్నారు. ఎక్కడ వాడతారంటే... మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రెడ్ జోన్ (ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బస్తర్, ఒడిశాలోని మల్కాన్‌గిరి, ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, బిహార్) పరిధిలో రోబోలను ఉపయోగించాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. కూంబింగ్‌కు వెళ్లే సీఆర్పీఎఫ్ బలగాలకు సహకరిస్తూనే రోబోలు కార్యకలాపాలు చేపట్టనున్నాయి. పెట్రోలింగ్ కోసం ఫోర్ వీలర్ రోబోలు... మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తూ వారి కార్యకలాపాలకు చెక్‌పెట్టేందుకు రోబోలతో కూడిన ఫోర్ వీలర్లను కూడా రూపొందించే పనిలో ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ ఒకరు తెలిపారు. ఈ రోబోలు రోడ్ ఓపెనింగ్ పార్టీలకు అనుసంధానంగా పనిచేస్తాయన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, సుక్మా, మహారాష్ట్రలోని దంతెవాడ, ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతాల్లో రోడ్లపై మావోయిస్టులు అమర్చే బాంబులను 15 అడుగుల దూరం నుంచే గుర్తించి క్యాంపు కంట్రోల్ సెంటర్‌ను అప్రమత్తం చేయడం, తర్వాత కూంబింగ్‌లో ఉండే రోబోల సాయంతో ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ రెండు రకాల రోబోలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. సెన్సార్ల బూట్లు...హైదరాబాద్ క్యాంపులో ప్రయోగం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌కు వెళ్లే జవాన్లకు అత్యాధునిక బూట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ల్యాండ్మైన్లను గుర్తించలేక వాటిని తొక్కడం వల్ల అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి ల్యాండ్మైన్లను గుర్తించేలా జవాన్ల బూట్లకు ప్రత్యేక సెన్సార్లు అమర్చే పనిలో ఉన్నామని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం వీటిని హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అక్కడ రెండో ప్రపంచయుద్ద బాంబులు దొరికాయి
కొహిమా: నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కొహిమాలో రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు బాంబులు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీఆర్ హిల్ కాలనీలో జరుగుతున్న నిర్మాణపనుల సందర్భంగా బాంబులు కూలీలకు దొరికినట్లు చెప్పారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాంబులను డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. నిర్మాణపనులు పూర్తయ్యేవరకూ అనుమానాస్పదంగా కనిపించే ఏ వస్తువునీ తాకొద్దని కూలీలకు చెప్పినట్లు తెలిపారు. అలాంటి వస్తువులు ఏవైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.