Booking
-
ఇలా చేస్తే భారీగా విదేశీ పర్యాటకులు
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగం వృద్ధికి వీలుగా బుకింగ్ డాట్ కామ్ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ విమాన సరీ్వసులను అందుబాటులోకి తీసుకురావడం, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, భారత్‌లోని విభిన్న, విస్తృతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని సూచించింది. వివిధ భాగస్వాముల నుంచి సమిష్టి చర్యలకు తోడు నిర్దేశిత పెట్టుబడులతో భారత పర్యాటకం కొత్త శిఖరాలకు వెళుతుందని పేర్కొంది. రానున్న ఏడాది, రెండేళ్లలో భారత్‌ను సందర్శించాలని అనుకుంటున్న వయోజనుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుని బుకింగ్ డాట్ కామ్ ఒక నివేదిక విడుదల చేసింది. 19 దేశాలకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. భారత్‌కు రావాలనుకుంటే, ఎదుర్కొనే సవాళ్లు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు ఏంటని ప్రశ్నించి, వారి అభిప్రాయాలు రాబట్టింది. విదేశీ పర్యాటకుల్లో సగం మంది కేవలం భారత్‌ను చూసి వెళ్లేందుకే వస్తున్నారు. మూడింట ఒక వంతు భారత్‌తోపాటు, ఆసియాలో ని మరికొన్ని దేశాలకూ వెళ్లేలా ట్రావెల్ ప్లాన్‌తో వస్తున్నారు. యూఎస్, యూకే, జర్మనీ, యూఏఈ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సంప్రదాయంగా చైనా, కెనడా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. భారత్‌కు వస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఆ్రస్టేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ తాజాగా చేరాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్ విదేశీ పర్యాటకులు సందర్శించే వాటిల్లో టాప్–5 ఎంపికలుగా ఉంటున్నాయి. హంపి, లేహ్‌కు ఆదరణ పెరుగుతోంది. పతి్నటాప్, పెహల్గామ్, మడికెరి, విజయవాడ, ఖజురహో ప్రాంతాలను సైతం సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. -
ట్రాన్స్‌జెండర్‌కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్‌ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్‌ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్‌కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్‌జండర్‌ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
ఈసారి చార్ధామ్ యాత్రకు సరికొత్త రికార్డులు?
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర 2024, మే 10 నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ చార్ధామ్ యాత్రకు అనూహ్య స్పందన వస్తున్నదని యాత్రా మార్గంలోని జీఎంవీఎన్ అతిథి గృహాల బుకింగ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు.గత ఏడాది 56 లక్షల 31 వేల మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారని, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కానున్నదని సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర మార్గాల్లోని 94 జీఎంవీఎన్ అతిథి గృహాల్లో వసతి కోసం ఆన్లైన్ మాధ్యమంలో 8 కోట్ల 58 లక్షల 39 వేల 892 మంది, ఆఫ్‌లైన్‌లో 3 కోట్ల 70 లక్షల 22 వేల 819 మంది బుకింగ్స్ చేశారన్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదన్నారు.ఇప్పటివరకు యాత్రకు సంబంధించిన జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ, గంగోత్రి ధామ్ సందర్శనకు 2,87,358 మంది, యమునోత్రి ధామ్‌కు 2,60,597 మంది, కేదార్నాథ్ ధామ్‌కు 5,40,999 మంది, బద్రీనాథ్ ధామ్‌కు 4,53,213 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు డెహ్రాడూన్‌లోని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికుల కోసం టోకెన్లు, స్టాళ్ల వ్యవస్థను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈసారి చార్ధామ్ యాత్రలో రవాణా శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. -
అమెరికాలో సూర్య గ్రహణం సందడి
ఉత్తర అమెరికా ఆకాశంలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అక్కడి జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్‌తో పాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది. ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సౌత్‌వెస్ట్, డెల్టా వంటి విమానయాన సంస్థలు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ రంగురంగుల టీ షర్టులు, ఖగోళ సావనీర్లు విక్రయిస్తున్నారు. 2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పలు కంపెనీలు దానిని ఆదాయమార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రిస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్య గ్రహణం సందర్భంగా పరిమిత-ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్లను విడుదల చేసింది. -
అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న రామ్‌లల్లా పవిత్రోత్సవం జరగనుంది. ఈ నేపధ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయ్యాయి. హోటల్ రూమ్ బుకింగ్ ధర గతంలో కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలో 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజు రూమ్ బుకింగ్ లక్ష రూపాయల వరకూ చేరింది. రామ్‌లల్లా పవిత్రోత్సవం రోజున మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్‌ల ధరలను అమాంతం పెంచేశారు. హోటల్ అయోధ్య ప్యాలెస్‌లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు రూ. 18,500 పలుకుతోంది. సాధారణంగా ఇక్కడ గది అద్దె రూ. 3,700. ది రామాయణ హోటల్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె రూ. 40 వేలు. 2023లో దీని అద్దె రూ. 14,900గా ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో ప్రస్తుతం ఒకరోజు అద్దె దాదాపు రూ.70, 500. గత ఏడాది జనవరిలో ఇక్కడ గది అద్దె రూ. 16,800గా ఉండేది. మీడియాకు అందిన వివరాల ప్రకారం అయోధ్యలోని రామాయణ్ హోటల్లోని గదుల బుకింగ్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయింది. ఈ హోటల్లోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఈ హోటల్లో గది అద్దె రోజుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్‌లోని విలాసవంతమైన గది ఒకరోజు అద్దె లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. ఈ హోటల్లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. గతంలో ఈ హోటల్లో గది అద్దె కనీసంగా రూ.7,500 ఉండేది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్!
కరీంనగర్: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన కోనరావుపేట మండలం కనగర్తిలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన కొల్లూరి వికాస్ ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కోసం జనవరి 1న బుక్ చేశాడు. 12న డెలివరీ ఇస్తామని షాపింగ్ సంస్థ స్పష్టం చేయగా.. ఆదివారమే పార్సిల్ ఇంటికొచ్చింది. డెలివరీ బాయ్‌కి రూ.2,718 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్ తెరిచి చూడగా రాళ్లు కనిపించడంతో కంగుతినడం యువకుడి వంతైంది. మోసం జరిగిందని వెంటనే డెలివరీ బాయ్‌కి చెప్పగా ఐటమ్ రిటర్న్ పెట్టమంటూ వెళ్లిపోయాడు. -
బుకింగ్‌లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
మెట్రోలు, హిల్ స్టేషన్లకే మొగ్గు
ముంబై: దేశీయంగా మెట్రో నగరాలు, హిల్స్టేషన్లతో కూడిన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలలపై ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ‘బుకింగ్ డాట్ కామ్’ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, మనాలీ, రిషికేశ్, వారసత్వ సంపదకు నిలయమైన జైపూర్ తదితర ప్రాంతాలను ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా చూస్తే, దుబాయి, బ్యాంకాక్, లండన్, సింగపూర్, కౌలాలంపూర్, హోచిమిన్హ్, ప్యారిస్, హనోయ్ ప్రాంతాలను సందర్శించేందుకు భారత పర్యాటకులు ఎక్కువ మంది బుకింగ్ చేసుకున్నారు. హోటళ్లకు అదనంగా, రిసార్ట్లు, గెస్ట్ హౌస్‌లు, ఆతిథ్య గృహాలు పర్యాటకుల ప్రాధాన్యంగా ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎక్కువగా.. మొదటి ఆరు నెలల్లో యూఎస్, బంగ్లాదేశ్, రష్యా, యూఏఈని నుంచి ఎక్కువ మంది భారత్‌ను సందర్శించారు. అలాగే, విదేశీ పర్యాటకులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు మెట్రోలను ఎక్కువగా చూశారు. 86 శాతం భారత పర్యాటకులు వచ్చే 12 నెలల్లో తమ పర్యటనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘‘స్థూల ఆర్థిక సమస్యలను పర్యాటక రంగం ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. హోటళ్లే కాకుండా పర్యాటకులు ప్రత్యామ్నాయ ఆతిథ్యాలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు’’అని బుకింగ్ డాట్ కామ్ కంట్రీ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. -
హౌసింగ్ స్కీం: 5500 ఫ్లాట్లు, రూ.9.89 లక్షలకే ఫ్లాట్
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) గృహకొనుగోలుదారులకు భలే మంచి శుభవార్త అందించింది. వివిధ ప్రదేశాలలో 5,500 ఫ్లాట్లతో కూడిన కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రూ. 9.89 లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్‌ను అందించ నుంది. శుక్రవారం (జూన్ 30) ప్రారంభించిన ఈ పథకంలో ముందుగా వచ్చిన వారికి, ముందుగా కేటాయింపు ప్రాతిపదికన వీటిని విక్రయించ నుంది. ఫ్లాట్లలో 1-BHK, 2-BHK ,3-BHK ఇళ్లు ఉన్నాయి. అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జూన్ 14న ఆన్లైన్లో ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 4ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ఈ పథకం టోకెన్ చెల్లించి తమ కిష్టమైన ప్రాంతంలో ఫ్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) డీడీఏ హౌసింగ్ స్కీమ్‌లోని ఫ్లాట్ల వివరాలు 1-BHK ఫ్లాట్లు నరేలా, సిరాస్‌పూర్, రోహిణి, లోక్‌నాయక్ పురంలో ఉన్నాయి 2-BHK ఫ్లాట్లు నరేలా ,ద్వారకలో ఉన్నాయి 3-BHK ఫ్లాట్లు జసోలాలో ఉన్నాయి (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ఫ్లాట్లు: ధరలు సుమారుగా 1-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 9.89 లక్షల -రూ. 26.98 లక్షలు, లోక్‌నాయక్ పురంలో రూ. 28.47 లక్షలకు 2-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 1 కోటి నుండి రూ. 1.23 కోట్లకు-ద్వారకలో రూ. 1.33 కోట్లు 3-BHK ఫ్లాట్లు: రూ. 2.08 కోట్ల నుండి రూ. 2.18 కోట్లు బుకింక్ అమౌంట్ 1-BHK ఫ్లాట్లు: రూ. 50,000 (ఆర్థికంగా వెనుకబడినవారికి ), రూ. 1 లక్ష (జనరల్) 2-BHK ఫ్లాట్: రూ. 4 లక్షలు 3-BHK ఫ్లాట్: రూ. 10 లక్షలుచెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిఉంటుంది. జూన్ 30 సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్. జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి (మరిన్ని అప్డేట్స్కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. పరిష్కారం ఏమిటంటే..
ఇంటర్నెట్ అన్నిచోట్లా అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో అన్నిపనులు ఎంతో సులభం అయ్యాయి. గతంలో ఇటువంటి పనుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ముఖ్యంగా ట్రైన్ టిక్కెట్ బుకింగ్ విషయంలో అందరికీ భారీ ఉపశమనం లభించింది. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో వయసు, జండర్ మొదలైనవాటిని తప్పుగా నమోదు చేస్తే రైల్వే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పులు దొర్లుతుండటం అనేది అందరి విషయంలో అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. అయితే ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో ఎటువంటి పొరపాటు జరిగినా దాని ప్రభావం ప్రయాణంపై పడుతుంది. ఒకవేళ ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో వయసు లేదా జండర్ తప్పుగా నమోదు చేస్తే ఆ టిక్కెట్ మార్చేందుకు అవకాశం ఉండదు. వీటిని సరిదిద్దే అవకాశం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదు. అయితే కౌంటర్ దగ్గరకు వెళ్లి, ఈ పొరపాటును దిద్దుకోవచ్చా లేదా అనే విషయం కూడా వెబ్సైట్లో అందుబాటులో లేదు. అలాగే పేరును పొరపాటుగా రాసినా కూడా దానిని మార్చుకునేందుకు అవకాశం లేదు. దీని గురించి రైల్వే అధికారులను సంప్రదించగా అక్రమాలను, మోసపూరిత చర్యలను అరికట్టేందుకే ఐఆర్సీటీసీ ఈ విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం ఒకరి టిక్కెట్‌పై మరొకరు ప్రయాణించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఐఆర్టీసీ విధించిన నిబంధనలను ఎవరూ అతిక్రమించలేరు. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో పేరు, వయసు, జండర్ ఇలా ఏదైనా తప్పుగా లేదా పొరపాటుగా నమోదు చేస్తే, ఆ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు. అలా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత సరైన రీతిలో తిరిగి టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వయసు ఒక్కటి తప్పుగా నమోదు చేసిన సందర్భాల్లో తమకు కేటాయించిన సీటును కాపాడుకునేందుకు వీలైనంత త్వరగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడి రిజర్వేషన్ సూపర్వైజర్ను సంప్రదించి, జరిగిన పొరపాటు గురించి తెలియజేయాలి. అప్పడు అతను దానిపై అధికారికి స్టాంపు వేస్తారు. అప్పుడు ఈ టిక్కెట్‌కు వయసు నిర్ధారిత పత్రాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు టిక్కెట్ నమోదులో జరిగిన పొరపాటును గుర్తించిన 24 గంటల ముందుగానే ఈ పని చేయాలి. అయితే ఈ ప్రయత్నం చేసినా సఫలం అవుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు. రిజర్వేషన్ సూపర్వైజర్ నిర్ణయంపై ఇది ఆధారపడివుంటుంది. ఇదేవిధంగా సంబంధిత ట్రైన్ టీటీని సంప్రదించి, తగిన ఐడెంటిటీ చూపిస్తే, ఆయన మానవత్వ దృష్టితో మీ పొరపాటును గ్రహించి, ఆ టిక్కెట్‌తో ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించవచ్చు. ఇది కూడా చదవండి: రూ. 8 కోట్లు కొట్టేసి.. ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోయింది! -
Adipurush: ఏకంగా లక్షకు పైగా టికెట్లు కొనేశాడు..!
ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్'. రేపు (జూన్ 16)న విడుదుల కానుంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో 'ఆదిపురుష్' టీమ్ ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో మరికొందరు వేల సంఖ్యలో టికెట్లను కొని.. విద్యార్థులకు, పేదలకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్ని టికెట్లు కొన్నారంటే.. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట) ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ముందుగా 10 వేల టికెట్లను కొనుగోలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ , ప్రముఖ సింగర్ అనన్య బిర్లా ఒక్కొక్కరు 10 వేల టికెట్లు బుక్ చేశారు. వాటిని పేద చిన్నారులకు ఇవ్వనున్నారు. (ఇదీ చదవండి: తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి) ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి 101 టికెట్లు ఇవ్వనున్నుట్టు ప్రకటించారు. అంటే, ఆ టికెట్ల సంఖ్య దాదాపు 1,40,000 కానుంది. మంచు మనోజ్ దంపతులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లోని చిన్నారుల కోసం 2500 టికెట్లను కొనుగోలు చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. -
లాంఛ్‌కు ముందే బుకింగ్‌కు టయోటా బ్రేకులు!
భారత్‌లో లాంచ్ చేయడానికి కంటే ముందే హైలక్స్ ట్రక్ బుకింగ్‌ను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించుకుంది. ఈ మేరకు జపనీస్ ఆటోమేకర్ టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోస్ట్ అవెయిటింగ్ మోడల్‌గా ఉన్న ‘హైలక్స్’ కోసం కిందటి నెలలోనే బుకింగ్స్‌ను ప్రారంభించింది. మార్చ్‌లో లాంఛింగ్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు డీలర్షిప్స్ వద్ద లక్ష రూ., కంపెనీ ఆన్లైన్ పోర్టల్‌లో రూ. 50వేలతో బుకింగ్స్ కొనసాగించింది. అయితే ఉన్నపళంగా ఆ బుక్సింగ్‌ను ఆపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కానీ, ఇది తాత్కాలికమే అని పేర్కొంది. వాస్తవానికి బుకింగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది సప్లయ్‌కి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకే బుకింగ్‌ను టెంపరరీగా ఆపేశామని, త్వరలో మళ్లీ బుక్సింగ్స్‌ను కొనసాగిస్తామని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. Hilux టయోటా ఫార్చ్యూనర్ SUV వలె.. సేమ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అయితే ప్రస్తుతం ఇక్కడ మైక్రోస్కోపిక్‌గా ఉన్న విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని చూస్తోంది. హైలక్స్కు సమీప ప్రత్యర్థిగా ఇసుజు V-క్రాస్‌ను భావిస్తున్నారు. -
బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ
This Toyota Car Will Deliver After 4 Years: ఆ కారును బుక్ చేసుకున్నవాళ్లు డెలివరీ కోసం నాలుగేళ్లు ఎదురుచూడక తప్పదంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ కార్ మేకర్ టయోటా స్పందించింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కోసం ఎదురు చూడకతప్పదంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారం వాస్తవమని, వాహనదారులు మన్నించాలంటోంది టయోటా. నిజానికి ఈ మోడల్‌ను కిందటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై ఫీచర్లతో తీసుకొచ్చింది. 2022 మూడవ త్రైమాసికంలో మార్కెట్లోకి రావొచ్చని భావించారు. అయితే.. సెమీకండక్టర్ల కొరత వల్ల ఇప్పుడు బుక్ చేసుకున్నవాళ్లకు నాలుగేళ్ల దాకా వాహనం డెలివరీ చేయలేమని కంపెనీ తేల్చేసింది. హై ఫీచర్లు ఉండడంతో సెమీకండర్లు అధికంగా అవసరం పడుతోందని, అందుకే అవాంతరాలు ఎదురవుతున్నాయని, అయినా నాలుగేళ్లలోపే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభావం ఇతర మార్కెట్లపై పడనుంది. భారత మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 ధర కోటిన్నర రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఈ వెహికిల్ 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్‌పరంగా రెండు వేరియెంట్స్ లభించనున్నాయి. నిస్సాన్ పాట్రోల్, బెర్సిడెజ్ బెంజ్ జీఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 6 మోడల్స్‌కు గట్టి పోటీగా దీనిని భావిస్తున్నారు. -
2 గంటల్లో సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. బుకింగ్ చేసిన రెండు గంటల్లో బండ ఇంటికొచ్చేస్తుంది. ‘ఇండేన్ తత్కాల్ సేవ’ పేరిట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఈ తరహా సేవలను ప్రారంభించింది. దేశంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌గా తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల రోజుల వ్యవధిలో హెచ్‌పీ గ్యాస్ కూడా ఈ తరహా సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ప్రియారిటీ’ సర్వీస్ పేరిట కస్టమర్ కోరిన సమయంలో గ్యాస్ డెలివరీ సేవలను భారత్ గ్యాస్ దశాబ్ధ క్రితం నుంచే అందిస్తుంది. ►సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు సిలిండర్ బుకింగ్ చేశాక.. డెలివరీ కోసం ఎందుకు ఎదురుచూడాలనే ప్రశ్నకు సమాధానమే ‘తత్కాల్ సేవ’. పాలు, కూరగాయల తరహాలోనే వంట గ్యాస్ కూడా అత్యవసర సర్వీసే. సాధారణంగా గ్యాస్ డెలివరీకి 48–72 గంటల సమయం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువే అవుతుంది. గంటల వ్యవధిలోనే సిలిండర్‌ను డెలివరీ చేయాలన్న లక్ష్యంతో తత్కాల్ సేవను ప్రారంభించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఏపీ, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 15.20 లక్షల ఇండేన్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లో 6.15 లక్షలు సింగిల్ బాటిల్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తత్కాల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బుకింగ్ చేసేది ఇలా.. ►ఐవీఆర్ నంబర్ 77189 55555, సీఎక్స్.ఇండియ న్ ఆయిల్.ఇన్, ఇండియన్ఆయిల్ వన్ యాప్ వీటిల్లో ఏ మాద్యమం ద్వారా అయినా తత్కాల్ సేవను వినియోగించుకోవచ్చు. ►ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 4 గంట ల మ«ధ్య పని దినాల్లో మాత్రమే బుకింగ్ చేయా ల్సి ఉంటుంది. ►సింగిల్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. తత్కాల్ సేవకు సిలిండర్ ధరతో పాటు అదనంగా రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ►తత్కాల్ సేవలో గ్యాస్ బుకింగ్ కాగానే.. ఐఓసీ డెలివరీ పర్సన్ అప్లికేషన్‌కు ఆర్డర్ నోటిఫికేషన్ వెళుతుంది. వెంటనే ఆర్డర్ డెలివరీ కోసం ప్రాసెస్ అవుతుంది. ►సిలిండర్ డెలివరీ నిమిషం ఆలస్యమైనా .. గ్యాస్ బండను కస్టమర్‌కు అందించి.. తత్కాల్ కింద చెల్లించిన రూ.25 చార్జీ కస్టమర్‌కు తిరిగి ఇస్తారు. నెల రోజుల్లో హెచ్‌పీ కూడా.. ఇండేన్ తత్కాల్ సేవ ఫీడ్ బ్యాక్‌ను విశ్లేషించి.. ఇంకా మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌పీ గ్యాస్ సన్నాహాలు ప్రారంభించింది. కస్టమర్ సౌకర్యార్థం, అదరపు చార్జీల వసూలు చేసి గంటల వ్యవధిలోనే సిలిండర్‌ను డెలివరీ చేస్తామని హెచ్‌పీ గ్యాస్ హైదరాబాద్ హెడ్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో హైదరాబాద్‌తో పాటూ మరో నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ లో 35 లక్షల హెచ్‌పీ కనెక్షన్లు ఉండగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 15 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ఎల్పీజీ మార్కెట్లో హెచ్‌పీ కంటే ఐఓసీఎల్ వాటా 5 శాతం ఎక్కువగా ఉంటుంది. భారత్ గ్యాస్ ‘ప్రియారిటీ’ సేవలు.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన ఎల్పీజీ విభాగం భారత్ గ్యాస్... 15 ఏళ్ల క్రితమే ప్రియారిటీ సర్వీసెస్‌ను ప్రారంభించింది. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగులుగా ఉన్న కుటుంబాలు ప్రియారిటీ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 6 తర్వాత కస్టమర్ కోరిన సమయంలో గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ సమయాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందన్నమాట. ప్రియారిటీ సర్వీసెస్‌కు సిలిండర్ మీద రూ.15–25 చార్జీ ఉంటుందని భారత్ గ్యాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తెలంగాణలో 28 లక్షల భారత్ గ్యాస్ కనెక్షన్లుండగా.. వీటిల్లో 14.4 లక్షల కనెక్షన్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్లు ఆయన వివరించారు. -
న్యూ ఇయర్ 2022: క్యాబ్ బుకింగ్ రద్దు చేస్తే జరిమానా..
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పరిమితులు, మార్గదర్శకాలను విడుదల చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి. వాహన డ్రైవర్లు ప్రయాణికుల బుకింగ్‌లను రద్దు చేస్తే . ఈ– చలాన్ రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా క్యాబ్, ఆటో బుకింగ్స్‌ను రద్దు చేస్తే సైబరాబాద్ పరిధిలో అయితే 94906 17346, రాచకొండ పరిధిలో అయితే 94906 17111కు వాహనం, సమయం, ప్రాంతం వంటి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు. ఓఆర్ఆర్పై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు (విమాన టికెట్‌ను చూపించాలి) మినహా ప్యాసింజర్, తేలికపాటి వాహనాలకు అనుమతి లేదు. మీడియం, గూడ్స్ వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు మినహా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మీదకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. చదవండి: (Hyderabad: రాత్రి పది తర్వాత అడుగడుగునా తనిఖీలు) క్లబ్, పబ్ నిర్వాహకులూ బాధ్యులే.. బార్, క్లబ్, పబ్‌లలో మద్యం తాగి వాహనం నడిపి ఏదైనా ప్రమాదాలకు కారణమైతే వాహనదారులతో పాటూ సంబంధిత బార్, క్లబ్, పబ్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తాగి వాహనం నడిపే బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, హారన్, ట్రిపుల్, మల్టీఫుల్ రైడింగ్ వంటి వాటిపై కేసులు నమోదు చేస్తారు. -
పేటీఎం నుంచి నవరాత్రి గోల్డ్ ఆఫర్
దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఫెస్టివల్ ఆఫర్‌ని ప్రకటించింది పేటీఎం సంస్థ. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం ద్వారా రూ.10,001 విలువైన బంగారాన్ని గెలుపొందే అవకాశం కల్పిస్తోంది. నవరాత్రి గోల్డ్ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటుంది. బుక్ చేసుకుంటే చాలు ఈ ఫెస్టివల్ ఆఫర్‌ను పొందాలంటే గ్యాస్ బుకింగ్ సమయంలో పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం పోస్ట్ పెయిడ్ నుంచి చెల్లింపు విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. క్యాష్‌బ్యాక్ పాయింట్లు పేటీఎం డిజిటల్ గోల్డ్ తో పాటుగా ప్రతీ బుకింగ్ పై యూజర్లు రూ 1,000 విలువైన క్యాష్ బ్యాక్ పాయింట్లు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన గిఫ్ట్ వోచర్ల కూడా రిడీమ్ చేసుకోవచ్చు రోజుకి ఐదుగురు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ వరకు సిలిండర్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఫీచర్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతోపాటు రీఫిల్స్ కు సంబంధించి ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్స్ పొందే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. నవరాత్రి ఫెస్టివ్ సీజన్లో భాగంగా ప్రతి రోజూ ఐదుగురిని ఎంపిక చేసి రూ.10,001 విలువైన బంగారాన్ని అందిస్తామని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. చదవండి : షో స్టాపర్స్ బ్యూటీ హంట్ -
ఏపీ: ఆన్లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో ఈ పోర్టల్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల విక్రయాల విధానాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆన్లైన్ పోర్టల్ రూపొందించడం, అమలును పర్యవేక్షించడానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో ఐటీ శాఖ కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఇవీ చదవండి: అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ ఉప్పొంగుతున్న వరద.. టీచర్ల సాహసం -
ఈ చిన్న స్టెప్స్ తో తత్కాల్ టికెట్ కన్ఫార్మ్..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దూరపు ప్రయాణాలు చేయలనే అనుకునే వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎక్కువ రైళ్లు అందుబాటులో లేవు. మరీ ముఖ్యంగా పండుగ సెలవుల సమయంలో రైల్వే టికెట్ల కోసం ఎన్నో కష్టాలు పడాల్సివస్తుంది. రైల్వే జనరల్ టిక్కెట్స్ కొన్ని నెలల ముందే బుకింగ్ చేసుకోవడం వల్ల ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్లపైనే ఆశలు పెట్టుకుంటారు. ప్రయాణానికి ఒక రోజు ముందు ఏసీ టికెట్ బుకింగ్ కోసం టైమ్ స్లాట్‌ను ఉదయం 10 గంటలుగా నిర్ణయించారు. అదే స్లీపర్ క్లాస్ టికెట్ కోసం అయితే ఉదయం 11 గంటలకు టైమ్ స్లాట్ ఉంటుంది. ఈ టికెట్స్ కూడా చాలా పరిమితంగానే ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ చాలా ఉంటుంది. కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించిన తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడం కష్టం అవుతుంది. కానీ ప్రయాణికులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..(చదవండి: కొత్త ఏడాదిలో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్) మాస్టర్ జాబితా: ఇప్పుడు మీరు ఎంత మందికి సంబందించిన టికెట్స్ బుక్ చేయాలనీ అనుకుంటున్నారో వారి వ్యక్తి వివరాలను ముందుగానే మీ ఐఆర్సీటీసీ ఖాతాలోని మై ప్రొఫైల్ విభాగంలో సేవ్ చేయండి. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేవలం ఒక్క క్లిక్‌తో మీ పని పూర్తవుతుంది. పేమెంట్ గేట్‌వే: ఐఆర్సీటీసీలో టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వేగంగా చెల్లించవచ్చు. కానీ, ఇప్పుడు మీకు ఈ-వాలెట్, పేటీమ్, యూపీఐ యాప్ లలో ఉన్న స్కాన్ ఆప్షన్ ద్వారా చెల్లింపు చేయడం వల్ల కేవలం కొన్ని సెకన్లలో టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్: టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అన్నింటి కంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండటం చాలా ముఖ్యం. టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో వెబ్సైట్ లోడ్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఇంటర్ నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండటం కారణంగా బుకింగ్ సమయంలో లోపాలు సంభవిస్తాయి. పేమెంట్ కొన్ని సార్లు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో టిక్కెట్లు బుక్ చేయబడవు. సిద్ధంగా ఉండటం: మీరు టికెట్ బుక్ చేసుకునే ముందు అందులో తర్వాత రాబోయే స్టెప్స్ గురుంచి మీకు పూర్తి అవగాహనా ఉండాలి. ఒకవేల మీకు అవగాహన లేకపోతే మీ టికెట్ బుకింగ్ సమయం ఎక్కువ కావడం వల్ల మీ బుకింగ్ రద్దు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందు లాగిన్ అవ్వడం: తత్కాల్ టికెట్ బుకింగ్ కోటా తెరవడానికి ఒకటి లేదా రెండు నిమిషాల ముందు లాగిన్ అవ్వడం మంచిది. అలాగే స్టేషన్ కోడ్, బెర్త్ ను ముందే ఎంచుకోండి. బుకింగ్ కోటా తెరిచిన వెంటనే మాస్టర్ జాబితా నుండి ప్రయాణీకుల పేర్లను వెంటనే ఎంచుకుని ఆపై నేరుగా పేమెంట్ ఆప్షన్ కు వెళ్ళండి. బ్యాంక్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం: ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారు అన్ని బ్యాంక్ వివరాలను పేమెంట్ చేయడం కోసం సిద్ధంగా ఉంచాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఓటీపీ, క్యూఆర్ కోడ్ ఆప్షన్ లలో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం. ఓటీపీ కోసం రిజిస్టర్డ్ మొబైల్‌ను మీ దగ్గర ఉంచుకోండి. ఒకే బ్రౌజర్లో లాగిన్ అవ్వండి: మీరు టికెట్ తొందరగా బుకింగ్ చేయడం కోసం ఒకే ఐడితో రెండు వేర్వేరు బ్రౌజర్లలో లాగిన్ అవ్వకండి. దీని వల్ల మీ బుకింగ్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక బ్రౌజర్ పనిచేయకపోతే, మీరు మరొక బ్రౌజర్లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. -
మిస్డ్ కాల్‌తో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్
న్యూఢిల్లీ: కేవలం ఫోన్ మిస్డ్ కాల్తోనే ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సదుపాయం ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే రీఫిల్ సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కాల్ ఛార్జీలు పడకుండానే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి, వృద్ధులకు, ఐవీఆర్ఎస్ తెలియని వారికి ఇది సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. (చదవండి: కొనగలుగుతున్నారా... తినగలుగుతున్నారా?) -
ఆన్లైన్లో రైళ్లు, బోగీల బుకింగ్
న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలకు, విహార యాత్రలకు ఇకమీదట రైల్వే బోగీలను, ప్రత్యేక రైళ్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. ‘సింగిల్ విండో బుకింగ్’ విధానంలో ఫుల్ టారిఫ్ రేట్ (ఎఫ్టీఆర్) చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇలాంటి బుకింగ్‌లపై 30 శాతం సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ప్రతి బోగీకి రూ.50,000 చెల్లించాలి. గతంలో కోచ్‌లు, రైళ్లను బుక్ చేసేందుకు సంబంధిత స్టేషన్ సూపర్వైజర్, స్టేషన్ మాష్టర్‌ను సంప్రదించాలి. ప్రయాణవివరాలన్నీ ఎఫ్‌టీఆర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. డబ్బులు డిపాజిట్ చేశాక రసీదు ఇస్తారు. అయితే ఈ విధానమంతా గందరగోళంగా ఉందని, దీన్ని సవరించాలని ఫిర్యాదులు రావడంతో కొత్తగా ఈ విధానం తెచ్చారు. -
గ్యాస్ బుకింగ్ వయా ఫేస్బుక్, ట్విటర్
న్యూఢిల్లీ : ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా?. అయితే, మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ విధానంలో సిలిండర్‌ను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు!. డిజిటలైజేషన్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కల్పించింది. ఫేస్‘బుక్’లో ఇలా.. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన అనంతరం ఐఓసీఎల్ అధికారిక పేజీ (@indianoilcorplimited)కి వెళ్లి, అక్కడ కనిపిస్తున్న బుక్ నౌ (Book Now) అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. తర్వాత మీ వివరాలను నింపితే సరి. ట్విటర్లో ఇలా.. ట్విటర్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయానికొస్తే, లాగిన్ అయిన అనంతరం refill @indanerefill అని ట్వీట్ చేయాల్సి వుంటుంది. అయితే, ట్విటర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవడం తొలిసారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం register LPGID అని ట్వీట్ చేయాలి. సామాజిక మాధ్యమాల వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ప్రజలకు సేవలను సునాయాసంగా అందజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. -
దళారుల బస
►టీటీడీ వసతి సముదాయాల్లో దందా ►50 శాతం కరెంటు బుకింగ్‌లో చేతివాటం ►పట్టించుకోని టీటీడీ అధికారులు వేసవి సెలవుల రద్దీతో తిరుమల, తిరుపతిలో టీటీడీ గదులు సకాలంలో దొరక్క వందలాది మంది యాత్రికులు రోజూ అవస్థలు పడుతున్నారు. అయితే తిరుపతి వసతి సముదాయాల్లో మాత్రం కొందరు ఉద్యోగులు దళారులతో దందా నడిపిస్తున్నారు. దీంతో యాత్రికులు ఆర్థికంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికుల్లో సగం మందికి పైగా తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో బస చేస్తుంటారు. అయితే ఈ సముదాయాల్లో 50 శాతం గదులను ఆన్లైన్, మరో 50 శాతం గదులను కరెంటు బుకింగ్ విధానంలో కేటాయిస్తుంటారు. ఇందులో కరెంటు బుకింగ్ విధానం సముదాయాల్లోని కౌంటర్ సిబ్బందికి, దళారులకు పంట పండిస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న విష్ణునివాసం వసతి సముదాయంలో కొత్త మంచాలు, పరుపులు ఉండడంతో ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడ బస చేసేందుకే ఆసక్తి చూపుతుంటారు. రైళ్లల్లో వచ్చే యాత్రికులు సరాసరి విష్ణునివాసం సముదాయంలోకి ప్రవేశిస్తుంటారు. అయితే టీటీడీ సముదాయాల్లో అమలు చేస్తున్న క్యూ పద్ధతి అవస్థలతో పడలేక దళారులను ఆశ్రయించి త్వరితగతిన గదులు పొందుతుంటారు. ముందస్తు ఒప్పందం దళారుల అవతారమెత్తే వ్యక్తులు నేరుగా టీటీడీ వసతి సముదాయాల్లోని కొందరు ఉద్యోగులు, కౌంటర్ సిబ్బందితో ముందస్తుగా చేసుకునే ఒప్పందం మేరకే యాత్రికులకు గదులను తీసి ఇస్తుంటారు. ఈ తరుణంలో యాత్రికుల నుంచి గదుల అద్దెపై సుమారు రూ.200 నుంచి రెండింతలు అదనంగా తీసుకుంటున్నారన్న విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి. విష్ణునివాసం వసతి సముదాయంలో 204 ఏసీ గదులు, 204 నాన్ ఏసీ గదులతో పాటు 24 డార్మిటరీ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రూ.300 నుంచి రూ.1300 వరకు టీటీడీ అద్దెలను నిర్ణయించింది. అయితే దళారులు యాత్రికుల హుందాతనం బట్టి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటిన్నింటిపై వసతి సముదాయం అధికారులకు, విజిలెన్స్ సిబ్బందికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. కాషన్ డిపాజిట్ పేరుతో టోకరా టీటీడీ ఆధ్వర్యంలో గదుల కేటాయింపునకు కాషన్ డిపాజిట్ విధానాన్ని కొన్ని నెలల క్రితమే రద్దు చేసింది. అయితే తిరుపతిలోని వసతి సముదాయాల్లో బస చేసే యాత్రికులకు చాలామందికి డిపాజిట్ రద్దు విషయం చెప్పకుండానే దళారులు రెండింతల అద్దెలను తీసుకుని గదులు తీసి ఇచ్చి, తప్పించుకుంటున్నారు. తీరా యాత్రికులు గదులు ఖాళీ చేసిన సమయంలో కాషన్ డిపాజిట్ కోసం వెళితే అసలు నిజాలు బయటపడి లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న శ్రీనివాసం వసతి సముదాయంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమాత్రం లేదు. ఇక్కడ తోపుడు బండ్ల నిర్వాహకులు కూడా దళారుల అవతారం ఎత్తుతున్నారు. ఇక్కడ అధికారులతో సంబం«ధం లేకుండా కొందరు ఉద్యోగులు గదుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. విజిలెన్స్‌కు నివేదిస్తాం కరెంటు బుకింగ్ గదులను దళారులకు ఇస్తూ మా కౌంటర్ సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టీటీడీ విజిలెన్స్ అధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా ఎవరైనా రూముల కేటాయింపు కోసం అధికంగా డబ్బులు డిమాండ్ చేసినా, బయట వ్యక్తులు టీటీడీలో గదులు తీసిస్తామని చెప్పినా యాత్రికులు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి. -
ఈ–వాలెట్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్
న్యూఢిల్లీ: త్వరలో పేటీఎం, జియోమనీ, ఎయిర్‌టెల్‌మనీ లాంటి ఈ–వాలెట్ సర్వీసుల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కాగిత రహిత మొబైల్ టికెటింగ్‌ను పెంచేందుకు ఈ–కామర్స్ రంగంపై రైల్వేశాఖ దృష్టిసారించింది. రిజర్వేషన్ లేని టికెట్ల ఫారమ్‌ల నిర్వహణ సమస్యగా తయారైందని పేపర్‌లెస్ వ్యవస్థ దిశగా అడుగులేసేందుకే ఈ–వాలెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. టికెట్లను విక్రయించిన ఈ–వాలెట్ సంస్థల నుంచి రైల్వేకి కమీషన్ల రూపంలో ఆదాయం సమకూరనుంది. -
భక్తుల ఇంటికి దుర్గమ్మ ప్రసాదం
గుంటూరు (లక్ష్మీపురం): దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ, మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోలేని భక్తులకు అమ్మవారి ప్రసాదం ఇంటికి చేరేలా పోస్టల్ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టిందని గుంటూరు హెడ్ పోస్టాఫీస్ పోస్ట్‌మాస్టర్ ఎమ్.తిరుమలరావు, డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ ముస్తఫా తెలిపారు. బ్రాడిపేటలోని హెడ్ పోస్టాఫీసు కార్యాలయంలో బుధవారం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ప్రసాదం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న పోస్టల్ శాఖలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ బుకింగ్ బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటుందన్నారు. భక్తులు అమ్మవారి ప్రసాదం కోసం వారి పేరు వివరాలతో పాటు సరైన అడ్రస్ రాసి రూ.50 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బుకింగ్ చేసుకున్న భక్తులకు రసీదు ఇస్తామని చెప్పారు. ప్యాకెట్లో 5 రకాల ప్రసాదాలు ఉండేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వాటిలో అమ్మవారి ఖడ్గమాల పూజలో ఉంచి మలేశ్వరస్వామి అభిషేకంతో సంప్రోక్షణ గావింపబడిన శక్తి కంకణం, అమ్మవారి లామినేటెడ్ చిత్రపటం, అమ్మవారి డ్రైఫ్రూట్స్ ప్రసాదం, అమ్మవారి పూజలో ఉంచిన కుంకుమ, అమ్మవారి స్వామి వార్ల పూజలో ఉంచిన అక్షింతలు ఉంటాయని వివరించారు. అమ్మవారి ప్రసాదంను బుకింగ్ చేసుకున్న భక్తులకు తమ శాఖ పోస్ట్‌మాన్ స్వయంగా ఇంటి వద్దకు వచ్చి ప్రసాదం ప్యాకెట్లను అందజేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. నవరాత్రులు ప్రారంభమైన రెండో రోజు నుంచి పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత అమ్మవారి ప్రసాదంను ప్రత్యేక ప్యాకింగ్ చేసి బుకింగ్ చేసుకున్న భక్తులకు చేరవేస్తామన్నారు. అమ్మవారి పవిత్ర నవరాత్రుల ప్రసాదాన్ని గ్రామ స్థాయిలోని ఉన్న తమ శాఖలో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. -
మోసగాళ్లకు మోసగాడు - ఒక జ్ఞాపకం
హ్యూమర్ ఫ్లస్ మోసగాళ్లకు మోసగాడు సినిమా వచ్చి 45 ఏళ్లయింది. కాలం ఒక పెద్ద మోసగత్తె. అది మనల్ని మాయచేసి అన్నీ లాగేస్తుంది. ముఖ్యంగా మన పసితనాన్ని. ఆ సినిమా చూసినపుడు నా వయసు ఏడేళ్లు. ఇంట్లో తెలియకుండా దొంగగా చూసిన మొదటి సినిమా అది. నా కంటే పెద్దవాళ్ల గ్రూప్ (వాళ్ల వయసు 13) రహస్యంగా ప్లాన్ చేసి మ్యాట్నీకి వెళ్లాలనుకుంది. ప్లాన్ నాకు లీకయ్యింది. నన్ను తీసుకెళ్లకపోతే అందరిళ్లలో చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేశాను. చచ్చినట్టు తీసుకెళ్లారు. రాయదుర్గంలో కె.బి. ప్యాలెస్ అనే థియేటర్ వుండేది. (ఇంకా వుంది) బాక్సులు తుప్పుపట్టి, రీళ్లు అనేకసార్లు కటింగైన తరవాత ఈ థియేటర్‌కి సినిమాలు వచ్చేవి. కొత్త సినిమా వచ్చిన రోజు ఒంటెద్దు బండిపై బ్యాండ్ మేళంతో వూరేగించేవారు. మోసగాళ్లకు మోసగాడు ఊరేగింపు చూసి ఆవేశపడి మా సీనియర్స్ థియేటర్‌కి చేరుకున్నారు. వాళ్ల వెంట నేను కూడా పరుగులు తీశాను. బుకింగ్ దగ్గర జనం ఒకరిమీద ఇంకొకరు ఎక్కి తొక్కుకుంటున్నారు. నేల క్లాస్‌కి లిమిట్ ఉండేది కాదు. ఎంతమందినైనా లోనికి తోసేసేవాళ్లు. లోపలున్నవాళ్లు ఒకరిలో ఒకరు ఇరుక్కుని, ఇక స్థలం లేక కుయ్యోమని సోడా కొట్టినట్టు అరిచేవాళ్లు. హాహాకారాలు వినిపించిన తరువాత టికెట్లు ఆపేవాళ్లు. మా దొంగల బ్యాచ్‌కి టికెట్లు ఎలా తెచ్చుకోవాలో తెలియకపోతే ఒక బ్లాక్ మార్కెట్వాడు వచ్చాడు. నలభై పైసల టికెట్‌ని నలభై ఐదు పైసలకి అమ్మాడు. ఐదు పైసలకి బ్లాక్ టికెట్లు అమ్మే అమాయకుల్ని చూడ్డం అదే మొదలు, ఆఖరు కూడా. గర్వంగా థియేటర్లోనికెళితే బీడీల కంపు, చీకటి. న్యూస్‌రీల్ వేస్తున్నారు. నెహ్రూ ప్రధానిగా వున్నప్పటి న్యూస్‌ని, ఇందిరాగాంధీ ప్రధానిగా వున్నప్పుడు చూపించేవాళ్లు. ఆరోజుల్లో వార్తలు అంత వేగంగా అందించేవాళ్లు. ఒకరి చెయ్యి ఇంకొకరు పట్టుకుని తడుముకుంటూ అనేకమంది కాళ్లు తొక్కుతూ మనుషుల భుజాలపై వెళ్లాం. నేను వెళ్లి ఎవడి ఒళ్లోనో కూచున్నాను. కుక్క చెవుల్లాగా సాగిపోయిన పాత రీళ్లు కాబట్టి, కాసేపు సరళరేఖలు వక్రరేఖలు తెరపై కనిపించి సినిమా మొదలైంది. కృష్ణ గుర్రంపై రాగానే కేకలు, ఈలలు. బుకింగ్ క్లర్క్ రెండు చేతులతో ఇంకా టికెట్లు ఇస్తున్నందువల్ల నల్లటి పరదా తొలగించుకుని గుంపులు గుంపులుగా జనం వస్తూ ఎవడో ఒకడి మీద కూచుంటున్నారు. కొంతమంది స్క్రీన్ ముందరున్న అరుగు మీద కూడా కూచున్నారు. ప్రతి నటుడు ఆకాశమంత ఎత్తు కనిపిస్తాడు వాళ్లకి. కృష్ణ వచ్చి గన్ని లోడ్ కూడా చేయకుండా వరసపెట్టి కాలుస్తూ వుంటే ఆనందంతో అక్కడికక్కడే అభిమానయ్యాను. ఆ తరువాత అన్ని సినిమాల్లో కృష్ణ ఒకేరకంగా నటిస్తాడని తెలుసుకుని వీరాభిమానినయ్యాను. అప్పట్లో ఇంటర్వెల్ లేదు. ఎన్నిసార్లు సినిమా కట్ అయితే అన్ని ఇంటర్వెళ్లు. రష్ ఎక్కువుంటే సోడాలు, మురుకులు అయ్యేవాళ్లకి పండగ. ఆ జనంలో సుడిగాలి పర్యటన చేసేవాళ్లు. సోడాలు కుయ్యిమని మోగేవి. మురుకులు రాళ్లకంటే గట్టిగా వుండేవి. థియేటరంతా కటకటమని సౌండొచ్చేది. కృష్ణని చూసిన ఆనందంతో గుర్రంలాగా పరిగెత్తుతూ ఇంటికెళ్లాను. గాడిదని కొట్టినట్టు కొట్టారు. అందరి ఇళ్లలోనూ బడితపూజ జరిగిందని తెలిసింది. మోసగాళ్లకు మోసగాడిని తరువాత నేను చాలాసార్లు చూశాను. ఇది అనేక ఇంగ్లిష్ సినిమాలకి అనుకరణ అని తెలిసిన తరువాత కూడా చూశాను. ఇంకా బాగా నచ్చింది. నిజంగా హాలివుడ్ స్థాయిలోనే వుంటుందిది. సినిమాలో ఆడిపాడి డ్యాన్స్ చేసిన జ్యోతిలక్ష్మి ఈమధ్యే పోయింది. నాగభూషణం ఎపుడో పోయాడు. గుమ్మడి, త్యాగరాజు, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి ఇంకా చాలామంది జీవించిలేరు. కానీ వాళ్ల పాత్రలు ఎప్పటికీ బతికే వుంటాయి. అతి తెలివితో ప్రవర్తించేవాళ్లని చూసినపుడు నాగభూషణం గుర్తుకొస్తాడు. తాగుబోతు వాగుడు వాగే సాక్షి రంగారావు ప్రతి వైన్‌షాపు దగ్గర కనిపిస్తాడు. ఇండియన్ కౌబాయ్ కృష్ణకి ఈరోజు 70 ఏళ్లు దాటొచ్చు. కానీ మాలాంటి అభిమానుల గుండెల్లో ఆయనెప్పుడూ జేమ్స్‌బాండే! - జి.ఆర్. మహర్షి