Brisbane Heat
-
నిప్పులు చేరిన గుజరాత్ బౌలర్.. బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్
బిగ్ బాష్ లీగ్ 2023-24 సీజన్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్ హీట్ నిలిచింది. సిడ్నీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సిడ్నీ సిక్సర్స్‌ను 54 పరుగుల తేడాతో చిత్తు చేసిన బ్రిస్బేన్ హీట్.. రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. బ్రిస్బేన్ బౌలర్ల దాటికి కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. బ్రిస్బేన్ బౌలర్లలో ఎక్స్‌ప్రెస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన 4 ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్-2024 వేలంలో జాన్సన్‌ను రూ. 10 కోట్లకు గుజరాత్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జాన్సన్‌తో పాటు బ్రాట్‌లెట్,స్వీప్సన్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. సిడ్నీ బ్యాటర్లలో హెన్రిక్స్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ బాదిన జోష్ బ్రౌన్.. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 5 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రౌన్‌తో పాటు రెన్షా(40) పరుగులతో రాణించాడు. సిడ్నీ బౌలర్లలో అబాట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. స్టార్ క్రికెటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ Spencer 👑 Your Player of The Final. #BBL13 pic.twitter.com/saEDxVXG0q — KFC Big Bash League (@BBL) January 24, 2024 -
ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 22) జరుగుతున్న నాకౌట్ (ఛాలెంజర్) మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఓపెనర్ జోష్ బ్రౌన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు బాదాడు. తొలి బంతి నుంచే శివాలెత్తిన బ్రౌన్.. బిగ్‌బాష్ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీని (41 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రౌన్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హిట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. Josh Brown scored an insane 140 in just 57 balls with 12 sixes for Brisbane Heat in the BBL....!!! 🤯 pic.twitter.com/O2hZWNKyLu — Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024 బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రౌన్, కెప్టెన్ నాథన్ మెక్ స్వీని (33) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. చార్లీ వాకిమ్ 7, మ్యాట్ రెన్షా 6, మ్యాక్స్ బ్రయాంట్ 9, పాల్ వాల్టర్ 0, జిమ్మీ పియర్సన్ 4 పరుగులు చేయగా.. మైఖేల్ నెసర్ 6, జేవియర్ బార్ట్లెట్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, బాయ్స్, లాయిడ్ పోప్ తలో రెండు వికెట్లు.. థామ్టన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, బిగ్‌బాష్ లీగ్ 2023-24 ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ఈ మ్యాచ్‌తో ప్రస్తుత ఎడిషన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతారు. బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్లో గెలిచిన జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీ సిక్సర్స్ క్వాలిఫయర్‌లో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. జనవరి 24న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
కొలిన్ మున్రో ఊచకోత.. తృటిలో సెంచరీ మిస్.. ఎందుకంటే?
బిగ్ బాష్ లీగ్ 2023 సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గురువారం (డిసెంబర్ 7) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై బ్రిస్బేన్ హీట్ 103 పరుగుల భారీ విజయం సాధించింది. బ్రిస్బేన్ గెలుపులో కొలిన్ మున్రో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 99 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో మున్రోకు సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాక్స్ బ్రయాంట్ (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) కారణంగా ఆ అవకాశం చేజారింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీశాక మున్రో స్కోర్ 99కి చేరింది. అయితే ఆతర్వాత మూడు బంతులను బ్రయాంట్ బౌండరీలుగా తరలించడంతో మున్రోకు సెంచరీ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్.. మున్రో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (28), లబూషేన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మెల్బోర్న్ బౌలర్లు జోయెల్ పారిస్, మ్యాక్స్‌వెల్, కౌల్డర్‌నైల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ను బ్రిస్బేన్ బౌలర్లు 111 పరుగులకే (15.1 ఓవర్లలో) కుప్పకూల్చారు. మిచెల్ స్వెప్సన్ 3, మైఖేల్ నెసర్, జేవియర్ బార్ట్లెట్ చెరో 2 వికెట్లు, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కున్హేమన్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో హిల్టన్ కార్ట్‌వైట్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టై రికార్డులకెక్కాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై.. ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బేజ్లే ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ తన టీ20 కెరీర్లో 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. తాజామ్యాచ్తో రషీద్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు సాధించాడు. ఐదో సారి ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. No player has reached 300 T20 wickets faster than Andrew Tye 👏 pic.twitter.com/DMEpXNHOQB — 7Cricket (@7Cricket) February 4, 2023 చదవండి: W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ GAME OVER. WHAT A GAME.@ScorchersBBL are BBL champions!#BBL12 pic.twitter.com/wfcVqfYpZc — 7Cricket (@7Cricket) February 4, 2023 -
టర్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్ జట్టు నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదవసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ బ్యాటర్లలో కెప్టెన్ అష్టన్ టర్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, జాన్సెన్ తలా వికెట్ సాధించారు. రాణించిన బ్రెయింట్, మెక్‌స్వీనీ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బ్యాటర్లలో మెక్‌స్వీనీ(41), బ్రెయింట్(14 బంతుల్లో 31) పరుగులతో రాణించారు. ఇక పెర్త్ బౌలర్లలో బెహ్రెండోర్ఫ్, కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దీ, టై తలా వికెట్ సాధించారు. చదవండి: 'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’ -
నెసర్ ఆల్‌రౌండ్ షో.. స్టీవ్ స్మిత్ లేని సిక్సర్స్‌ను కొట్టి ఫైనల్‌కు చేరిన హీట్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఛాలెంజర్ గేమ్‌లో బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ సిక్సర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, తుది సమరంలో పెర్త్ క్కార్చర్స్తో ఢీకి సిద్ధమైంది. లోకల్ (ఆసీస్) స్టార్ ఆటగాళ్లంతా ఇండియా టూర్ (4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్)కు వెళ్లడంతో చప్పగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. కున్నెమన్ (3/17), స్పెన్సర్ జాన్సన్ (3/28), మైఖేల్ నెసర్ (2/28), మెక్ స్వీనీ (1/21) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేసింది. The winning moment! From the man who stole the show. What a performance by Michael Neser and the @HeatBBL #BBL12 #BBLFinals pic.twitter.com/zWuwlsv8QE — KFC Big Bash League (@BBL) February 2, 2023 డేనియల్ హ్యూస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 117 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హీట్‌ను.. నెసర్ (32 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో ఈ జట్టు కూడా వడివడిగా వికెట్లు కోల్పోయినా నెసర్ ఒక్కడే నిలబడి, ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. హీట్ టీమ్ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్ బ్రౌన్ (20) ఓ మోస్తరుగా రాణించాడు. సిక్సర్స్ బౌలర్లలో నవీద్ 2, స్టీవ్ ఓకీఫ్, సీన్ అబాట్, డ్వార్షుయిష్ తలో వికెట్ దక్కించుకున్నారు. THE BOYS ARE GOING TO THE SHOW! 🎥 @marnus3cricket (Instagram) #BBL12 #BBLFinals pic.twitter.com/4Q79Fihd8O — KFC Big Bash League (@BBL) February 2, 2023 ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగిన నెసర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్లో బ్రిస్బేన్ హీట్ టీమ్.. పెర్త్ స్కార్చర్స్‌తో టైటిల్ కోసం పోరాడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు వరకు స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ లాంటి విధ్వంసకర వీరుల మెరుపులతో బీబీఎల్ కళకళలాడింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లంతా భారత పర్యటనలో ఉండటంతో లీగ్ కళావిహీనంగా, ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగుతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా దాదాపుగా ఇలాగే సాగవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. Ice cool under pressure, Michael Neser's batting tonight was something to behold. @KFCAustralia | #BBL12 | #BBLFinals pic.twitter.com/ZROhw7aWIW — KFC Big Bash League (@BBL) February 2, 2023 -
ఆఖరి బంతికి సిక్సర్ కావాలి, స్ట్రయిక్‌లో స్టోయినిస్.. ఏం జరిగిందంటే..?
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో మరో రసవత్తర సమరం జరిగింది. గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మెల్బోర్న్ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్సర్ బాదాల్సి ఉండింది. స్ట్రయిక్‌లో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించిన స్టోయినిస్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని స్టోయినిస్ భారీ షాట్‌గా మలిచేందుకు విఫలయత్నం చేశాడు. మెల్బోర్న్ కేవలం ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకుని, 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ఓవర్లో (ఇన్నింగ్స్ 19వ ఓవర్) 21 పరుగులు పిండుకున్న స్టోయినిస్ (23 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), హిల్టన్ కార్ట్‌రైట్ (24 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) జోడీ ఆఖరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. సామ్ హెయిన్ (41 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), పియర్సన్ (43 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెల్బోర్న్ బౌలర్లలో లూక్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్ నైల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో మెల్బోర్న్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ వారికి విజయం దక్కలేదు. జో క్లార్క్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు), థామస్ రోజర్స్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), క్యాంప్‌బెల్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు), స్టోయినిస్ (36 నాటౌట్), హిల్టన్ (33 నాటౌట్) తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో మెల్బోర్న్ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. బ్రిస్బేన్ బౌలర్లలో స్వెప్సన్ 2, జేమ్స్ బాజ్లీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో బ్రిస్బేన్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (13 పాయింట్లు) ఎగబాకింది. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించాడు
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఇవాళ (జనవరి 16) ఓ రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఆఖరి బంతికి విజయం సాధించింది. బ్రిస్బేన్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (56 బంతుల్లో 90 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఆఖరి బంతిని బౌండరీగా తరలించి తన జట్టును గెలిపించాడు. బ్రిస్బేన్ గెలవాలంటే చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, రెన్షా అద్భుతమైన స్కూప్ షాట్ ఆడి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు. Matt Renshaw scoops for four to win the game off the last ball 😮 Talk about holding your nerve!#BBL12 pic.twitter.com/l4GamZxqK4 — Wisden (@WisdenCricket) January 16, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బ్రిస్బేన్.. మైఖేల్ నెసర్ (4/25), స్పెన్సర్ జాన్సన్ (1/41), బాజ్లీ (1/35), రెన్షా (1/5) రాణించడంతో మెల్బోర్న్ హీట్‌ను 159 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో నిక్ లార్కిన్ (58) అర్ధసెంచరీతో రాణించగా.. థామస్ రోజర్స్ (26), వెబ్‌స్టర్ (36) పర్వాలేదనిపించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ను రెన్షా ఒంటి చేత్తో గెలిపించాడు. బిస్బేన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఉస్మాన్ ఖ్వాజా (14), జిమ్మీ పియర్సన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేసినప్పటికీ.. రెన్షా ఆఖరి బంతి వరకు పట్టువదలకుండా క్రీజ్‌లో ఉండి తన జట్టును గెలిపించాడు. మెల్బోర్న్ బౌలర్లలో లియామ్ హ్యాచర్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ కౌల్టర్ నైల్, క్లింట్ హింక్లిఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..
మనకు రానిది ప్రయత్నించి కొన్నిసార్లు చేతులు కాల్చుకున్న సందర్బాలున్నాయి. తాజాగా ఒక అభిమాని క్యాచ్ అందుకోవడం సాధ్యం కాదని తెలిసినా అత్యుత్సాహం ప్రదర్శించి అనవసరంగా ముక్కు పచ్చడి చేసుకున్నాడు. ఇదంతా బిగ్‌బాష్ లీగ్ సీజన్-12లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇక మంగళవారం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు ఓపెనర్ మాథ్యూ గిల్క్స్ దూకుడుగా ఆడుతున్నాడు. 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిచెల్ స్వీప్సన్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. అయితే బంతి నేరుగా స్టాండ్స్‌వైపు దూసుకొచ్చింది. అయితే స్టాండ్స్‌లో నిలబడిన ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తనవైపు వస్తున్న క్యాచ్‌ను అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ పాపం క్యాచ్ పట్టడంలో విఫలం కావడంతో బంతి నేరుగా అతన్ని ముక్కు మీద గట్టిగా తాకి పక్కకు పడింది. అయినా కూడా తనకేం కాలేదన్నట్లుగా అంతా ఒకే అని సింబల్ చూపించాడు. అయితే కాసేపటికే సదరు అభిమాని ముక్కు నుంచి రక్తం దారలా కారసాగింది. ఇది గమనించిన బ్యాటర్ మాథ్యూ గిల్క్స్ అతని వైపు చూడగా.. ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకున్న అభిమాని పర్లేదులే అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియర్సన్ 27, గ్జేవియర్ బార్లెట్ 28 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 59 నాటౌట్, మాథ్యూ గిల్క్స్ 56 నాటౌట్ జట్టును గెలిపించారు. Anyone know this guy who can let us know if his nose is all good?! 🫣@KFC #BucketMoment #BBL12 pic.twitter.com/YVjvgg6a9v — KFC Big Bash League (@BBL) December 27, 2022 చదవండి: Ashwin-Shreyas Iyer: మొన్న గెలిపించారు.. ఇవాళ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ -
హ్యాట్రిక్ వృధా.. అర డజన్ సిక్సర్లు కొట్టి గెలిపించిన రసెల్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు ఇవాళ (డిసెంబర్ 21) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. టామ్ రోజర్స్ (4/23), అకీల్ హొసేన్ (3/26) ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/18) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (29), సామ్ బిల్లింగ్స్ (25), పీయర్సన్ (45) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ టీమ్‌ను ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నెసర్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి (4/32) భయపెట్టాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన నెసర్.. అదే ఓవర్ ఆఖరి బంతికి మరో వికెట్‌ను, ఆతర్వాత మూడో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. నెసర్ ధాటికి మెల్బోర్న్ 2.2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. Just admiring this shot 😍 pic.twitter.com/G6ljSi7q2J — Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022 అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఆరోన్ ఫించ్ (43 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), అకీల్ హొసేన్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అర డజన్ సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్ ప్రత్యర్ధి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని మెల్బోర్న్ రెనెగేడ్స్‌ను 4 వికెట్ల తేడాతో గెలిపించాడు. రసెల్ మెరుపు ఇన్నింగ్స్ హవాలో నెసర్ హ్యాట్రిక్ వృధా అయిపోయింది. బ్రిస్బేన్ బౌలర్లలో నెసర్తో పాటు మార్క్ స్టీకీట్ (2/23) వికెట్లు దక్కించుకున్నాడు. జేమ్స్ బాజ్లే బౌలింగ్‌లో రసెల్ కొట్టిన 103 మీటర్ల సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు 1400 రోజుల తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. -
బిగ్‌బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..!
భారత ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్ బాష్ లీగ్-2022లో తొలి సారి ఆడనుంది. ఈ మెరకు బ్రిస్బేన్ హీట్‌తో పూజా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రిస్బేన్ హీట్ వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ తర్వాత బ్రిస్బేన్ హీట్‌కు పూజా రెండో విదేశీ క్రికెటర్ కావడం గమనార్హం. గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు తరపున వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. అదే విధంగా ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పూజా తన ప్రదర్శనతో అకట్టుకుంది. వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పూజా.. 156 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టింది. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022కు ప్రకటించిన భారత జట్టులో పూజా భాగంగా ఉంది. అయితే ఆమె కరోనా బరిన పడడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానుంది. బిగ్ బాష్ లీగ్‌లో భారత స్టార్ క్రికెటర్లు ఇప్పటికే భారత స్టార్ మహిళా క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్‌లో భాగమయ్యారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. చదవండి: Prabath Jayasuriya: టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! -
యాష్లే బార్టీ.. మనకు తెలియని యాంగిల్ ఏంటంటే
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022 టైటిల్‌ను యాష్లే బార్టీ తొలిసారి గెలిచిన సంగతి తెలిసిందే. డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో బార్టీ 6-3, 7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బార్టీ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది. కాగా 2021 ఏడాదిని నెంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన బార్టీ.. స్టెఫీ గ్రాఫ్, మార్టినా నవ్రతిలోవా, సెరెనా విలియమ్స్, క్రిస్ ఎవర్ట్ సరసన నిలిచింది. చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్.. ఇక యాష్లే బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్ ఒకటి దాగుంది. అదేంటో తెలుసా 2015లో కొన్ని రోజులు బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ ఆడింది. బార్టీ వుమెన్స్ క్రికెటర్‌గా మారడానికి ఒక కారణం ఉంది. 2014 యూఎస్ ఓపెన్ తర్వాత యాష్లే బార్టీ సుధీర్ఘ విరామం తీసుకుంది. ఆ సమయంలో ఆమెను టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసి.. ఒక సాధారణ టీనేజీ అమ్మాయిలా జీవితం కొనసాగించింది. ఈ సమయంలోనే ఆమెకు క్రికెట్‌వైపు మనసు మళ్లింది. అలా 2015లో బార్టీ క్రికెట్‌వైపు అడుగులు వేసింది. అనుకుందే తడవుగా క్వీన్స్లాండ్ ఫైర్‌కు క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ రిచర్డ్స్‌ను కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. బార్టీ వచ్చి తనను అడిగిన విధానం రిచర్డ్స్కు బాగా నచ్చి ఆమెకు క్రికెట్లో మెళుకువలు నేర్పాడు. కొన్ని నెలల్లోనే క్రికెట్‌పై మంచి పట్టు సాధించిన బార్టీ వెస్ట్రన్ సబరబ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్‌కు ఆడింది. ఆ తర్వాత బ్రిస్బేన్ వుమెన్స్ ప్రీమియర్ టి20 లీగ్‌లో యాష్లే బార్టీ పాల్గొంది. చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున.. భారత్‌తో ఐపీఎల్ ఎంత పాపులరో.. ఆస్ట్రేలియా క్రికెట్లో బిగ్‌బాష్ లీగ్‌కు అంతే ప్రాధాన్యముంది. వెస్ర్టన్ సబ్రబ్స్ తరపున ఫైనల్లో బార్టీ 39 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ బ్రిస్బేన్ హీట్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున బరిలోకి దిగిన యాష్లే బార్టీ మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లో 27 బంతుల్లో 39 పరుగులు చేసింది. ఆ సీజన్లో బార్టీ రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగింది. ఈ సీజన్లో బ్రిస్బేన్ హీట్ 14 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక 2016లో యాష్లే బార్టీ తిరిగి టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. వస్తూనే పారిస్ వేదికగా రోలాండ్ గారోస్ టెన్నిస్ టోర్నమెంట్లో విజృంభించిన బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి బార్టీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా'
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే తాను క్యాచ్ పట్టేశానా అన్న విధంగా మ్యాక్సీ ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను నాథన్ కౌల్టర్‌నీల్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని గుడ్‌లెంగ్త్‌తో వేయగా.. సామ్ హీజ్లెట్ మిడాఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న మ్యాక్స్‌వెల్ వెనక్కి పరిగెట్టి.. డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మ్యాక్సీ విన్యాసాన్ని తోటి ఆటగాళ్లు సహా మైదానంలోని ప్రేక్షకులు ఎంజాయ్ చేయగా.. అతను మాత్రం క్యాచ్ అందుకున్నాన్నా అనే భ్రమలోనే ఉండిపోవడం విశేషం. దీనిపై అభిమానులు వినూత్నరీతిలో స్పందించారు. ' మ్యాక్సీ నువ్వు క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022 Auction: ఈ ఏడాది ఐపీఎల్లో వారి మెరుపులు లేనట్టేనా..? ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జో క్లార్క్ 62 పరుగులతో రాణించగా.. మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. GLENN MAXWELL! WHAT A CATCH! 😱#BBL11 pic.twitter.com/czENSVwG2s — 7Cricket (@7Cricket) January 16, 2022 -
కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో జాసన్ బెండార్సీస్ వేసిన బంతిని ఓపెనర్ క్రిస్ లిన్ ఆఫ్‌సైడ్ దిశగా కవర్‌డ్రైవ్ ఆడాడు. అయితే ఎవరు ఊహించని విధంగా సీన్ అబాట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో క్రిస్ లిన్.. సీన్ అబాట్ స్టన్నింగ్ ఫీట్‌కు షాక్ తిన్నాడు. అసలు ఔటయ్యానా అనే సందేహం కలిగిందంటే.. సీన్ అబాట్ ఎంత వేగంతో బంతిని అందుకున్నాడో అర్థమవుతుంది. ఇక చేసేదేం లేక 2 పరుగులు చేసిన లిన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డకెట్ 21, విల్డర్మత్ 27, మాక్స్ బ్రియాంట్ 22 పరుగులు చేశారు. సీన్ అబాట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం సీన్ అబాట్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తుండడంతో 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో ఉంది. Catch of the summer? 🤯 Chris Lynn could NOT believe it... #BBL11 This 'Oh What a Feeling' Moment brought to you by @Toyota_Aus pic.twitter.com/6fGBa3l5D0 — Fox Cricket (@FoxCricket) December 29, 2021 -
Ashleigh Barty: ఈమె ఓ క్రికెటర్ అన్న విషయం తెలుసా..?
లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆష్లీ బార్టీ.. ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టక ముందు కొంతకాలంపాటు క్రికెట్ ఆడిందన్న విషయం చాలా మందికి తెలీదు. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ.. 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో 2016లో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. బార్టీ 2015లో క్వీన్స్లాండ్ తరఫున 2 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కూడా ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ చేసే బార్టీ.. 19 ఏళ్ల వయసులోనే ఆసీస్ అండర్-15 జట్టు కోచ్‌గా కూడా వ్యవహరించింది. 2019లో తొలి గ్రాండ్‌స్లామ్(ఫ్రెంచ్ ఓపెన్) సాధించిన 25 ఏళ్ల బార్టీ.. శనివారం జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఆమె పలు ఘనతలను సొంతం చేసుకుంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. అలాగే, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
టైం లేదని గ్రౌండ్‌లోనే పని కానిచ్చాడు
కాన్బెర్రా: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10)లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ సమయంలో ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాజా చేసిన ఒక పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. సిడ్నీ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ తర్వాత కొన్ని నిమిషాల పాటు బ్రేక్ లభించింది. ఇదే సమయంలో ఖాజా తన అండర్గార్మెంట్లో గార్డ్ సమస్యగా మారడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు కాల్ ఇచ్చాడు. అయితే వారు వచ్చేలోపే ఖాజా తన ప్యాంటును విప్పి తన అండర్గార్డ్ను తొలగించి దానిని సరిచేసే పనిలో పడ్డాడు. అంతలో సిబ్బంది అతని వద్దకు వచ్చి కొత్త గార్డ్ అందించడంతో దాన్ని వేసుకొని మళ్లీ యధావిథిగా ఆటను ప్రారంభించాడు. అయితే ఖాజా చర్యతో మైదానంలోని ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అంపైర్లు, ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఖాజాకు సంబంధించిన వీడియోనూ సెవెన్ క్రికెట్ డాట్‌కామ్ తన ట్విటర్లో షేర్ చేసింది. క్రికెట్లో ఇలాంటి సీన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు.. అందరూ చూస్తుండగానే ఖాజా గ్రౌండ్‌లోనే పని కానిచ్చేశాడు అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. చదవండి: థ్యాంక్స్ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్ ట్వీట్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ థండర్స్‌పై 7 వికెట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కటింగ్ 34, బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ 3 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సామ్ హీజ్లెట్ 74 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. జిమ్మీ పియర్సన్ 43 పరుగులతో రాణించాడు.చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది Have ... have you ever seen this before 😂 Usman Khawaja had to change everything - on the field! 🙈#BBL10 pic.twitter.com/XOKsXkhLVS — 7Cricket (@7Cricket) January 31, 2021 -
కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది
కాన్బెర్రా: ఆసీస్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టడంలో బెన్ కటింగ్ పాత్ర మరువలేనిది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి సన్‌రైజర్స్‌కు కప్పు అందించాడు. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. గెలిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యే మ్యాచ్‌లో బెన్ కంటింగ్ జూలు విదిల్చాడు. 18 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే బెన్ కటింగ్ కొట్టిన నాలుగు సిక్సర్లలో .. ఒక సిక్సర్ స్టేడియం అవతల పడింది. మోర్నీ మోర్కెల్ వేసిన 18 ఓవర్ మూడో బంతిని కటింగ్ ప్రంట్ ఫుట్ వచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం రూఫ్‌ను తాకుతూ బయటపడింది. మీటర్ రేంజ్లో కటింగ్ కొట్టిన సిక్స్ 101 మీటర్లుగా నమోదైంది. బెన్ కటింగ్ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా! ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో కటింగ్ కొట్టిన సిక్స్ అత్యంత ఎత్తులో వెళ్లిన సిక్స్‌గా రికార్డుకెక్కింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కటింగ్ 34, సామ్ బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ఆడుతున్న బ్రిస్బేన్ హీట్స్ ఇప్పటివరకు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హీట్స్ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే That is OUTTTAAAAA HERE!! Wow! #BBL10 #BBLFinals pic.twitter.com/lOTzhwDtyb — KFC Big Bash League (@BBL) January 31, 2021 -
భారీ షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
-
షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
బ్రిస్బేన్ : క్రికెట్ ఆటలో ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకువడం సహజంగా కనిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో గురువారం బ్రిస్బేన్ హీట్ , హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ హీట్ బౌలర్ జోష్ లాలోర్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరినీ స్టంప్స్‌కు దూరంగా జరిగి ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించి పొరపాటున బ్యాట్‌ను వదిలేశాడు. దీంతో బ్యాట్ గాల్లో గిర్రున తిరిగి కొంచెం దూరంలో పడింది. అయితే బ్యాట్‌ను తీసుకొచ్చిన ఆటగాడు ఖైస్కు ఇస్తూ' గబ్బాలో బాల్‌కు బదులు బ్యాట్లు ఎగురుతున్నాయి' అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో ఖైస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా చిరునవ్వులు చిందించారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ హోబర్ట్ హరికేన్స్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవరల్లో 9వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 18.2 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. (ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు) -
వరుసగా ఐదు సిక్సర్లు.. ఆనందంలో కేకేఆర్
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఆనందంతో మురిసిపోతుంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 కోసం జరిగిన వేలంలో తాము చేజిక్కించుకున్న ఆటగాడు అదరగొట్టడమే దీనికి కారణం. ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ టామ్ బాంటన్‌ను ఐపీఎల్లో కనీస ధర రూ. కోటికి కేకేఆర్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆటగాడు బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాంటన్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ముఖ్యంగా సిడ్నీ ఆటగాడు అర్జున్ నాయర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బాంటన్ ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా బాంటన్ ఓకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘సిడ్నీలో బాంటన్ కొట్టిన సిక్సర్ల సౌండ్ కోల్‌కతాలో వినపడుతోంది’, ‘క్రిస్ లిన్ లేకున్నా బాంటన్ ఉన్నాడుగా’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది కేకేఆర్‌కు అమితానందం కలిగించేదే అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇక బ్రిస్బేన్-సిడ్నీల మధ్య జరిగిన మ్యాచ్‌కు వరణుడు పలుమార్లు అడ్డంకిగా నిలిచాడు. వర్షం కారణంగా తొలుత మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్రిస్బేన్ నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. బాంటన్(19 బంతుల్లో 56; 2ఫోర్లు, 7 సిక్సర్లు)కు తోడు క్రిస్ లిన్(31; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉన్న క్రమంలో వర్షం మరోసారి రావడంతో డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం బ్రిస్బేన్ 16 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. This is just extraordinary. Tom Banton launches five consecutive sixes! #BBL09 pic.twitter.com/STYOFVvchy — KFC Big Bash League (@BBL) January 6, 2020 -
మళ్లీ లిన్ మోత మోగించాడు..
హోబార్ట్: ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరుపులు మెరిపిస్తున్నాడు. బీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు సారథిగా వ్యవహరిస్తున్న లిన్.. శుక్రవారం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 88 పరుగులు సాధించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన లిన్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ మ్యాక్స్ బ్రయాంట్(65)తో కలిసి 95 పరుగుల్ని జోడించాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో బ్రిస్బేన్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆపై మ్యాట్ రెన్షాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన లిన్ జట్టు స్కోరును రెండొందల దాటించాడు. రెన్ షా 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో బ్రిస్బేన్ మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక లిన్ నాటౌట్‌గా మిగిలాడు. ఆపై టార్గెట్‌ను ఛేదించే క్రమంలో హరికేన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దాంతో బ్రిస్బేన్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో బ్రిస్బేన్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కూడా లిన్ దూకుడుగా ఆడాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 94 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ హీట్ 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.(ఇక్కడ చదవండి:‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’) -
ఔరా.. ఏం క్యాచ్ అది!
సిడ్నీ: అసలైన క్రికెట్ మజా కేవలం పురుషుల క్రికెట్లోనే ఉంటుందనుకుంటే పొరపాటు పడినట్టే. సంచలన ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తూ.. పురుషుల క్రికెట్లోనూ సాధ్యంకాని కొత్త రికార్డులను మహిళా క్రికెటర్లు సృష్టిస్తున్నారు. తాజాగా గెలుపును డిసైడ్ చేసే బంతిని బౌండరీ వద్ద కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ అపురూప దృశ్యం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బెన్ హీట్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ జట్టు నాలుగు పరుగుల తేడాతో బ్రిస్బేన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఐసీసీ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక హైదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ జట్టు ఆరంభం ఘనంగానే ప్రారంభించింది. అయితే బ్రిస్బేన్ పటిష్ట బౌలింగ్ మందు సిడ్నీ మిడిలార్డర్ బ్యాట్స్వువెన్ పరుగులు రాబట్టడానికి నానా తంటాలు పడ్డారు. దీంతో చివరి ఓవర్లో 13 పరుగుల చేస్తేనే సిడ్నీ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. బంతి బంతికి సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక సిడ్నీ గెలుపు సమీకరణాలు ఎలా ఉన్నాయంటే చివరి బంతికి ఫోర్ కొడితే డ్రా, ఐదు పరుగులు చేస్తే విజయం. ఈ సమయంలో జోనాసెన్ బౌలింగ్‌లో నికోలా కారే గాల్లోకి బంతిని బలంగా బాదింది.. అందరూ పక్కా సిక్సర్ అనుకున్న తరుణంలో మెరుపువేగంతో వచ్చిన హైదీ బిర్కెట్ కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. దీంతో గెలుపు సంబరం బ్రిస్బెన్ను వరించగా .. ఓటమి బాధ సిడ్నీ జట్టుకు దక్కింది. -
గెలుపును డిసైడ్ చేసే బంతి.. బౌండరీ వద్ద కళ్లు చెదిరే క్యాచ్..
-
టీ20 మ్యాచ్ టై: సూపర్ ఓవర్లో విజయం
బ్రిస్బేన్: బిగ్‌బాష్ లీగ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బ్రిస్బేన్ హీట్‌పై సూపర్ ఓవర్లో 6 పరుగులతో నెగ్గి సిడ్నీ సిక్సర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్లో విజయానికి 6 పరుగులు చేయాల్సిన తరణంలో సిడ్నీ సిక్సర్స్ 5 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్టై అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. మొదట సిడ్నీ సిక్సర్స్ జట్టు సూపర్ ఓవర్లో 21 పరుగులు చేసింది. హెన్రిక్స్ 18 పరుగులు చేశాడు. 22 పరుగుల టార్గెట్‌తో దిగిన బ్రిస్బేన్ టీమ్ సూపర్ ఓవర్లో తొలి ఐదు బంతులకు 9 పరుగులు చేసింది. చివరి బంతికి మెకల్లమ్ సిక్సర్ కొట్టినా జరగాల్సిన నష్టం జరిగింది. ఐదు పరుగులతో నెగ్గిన సిడ్నీ ఈ 28న ఫైనల్లో పెర్త్ స్కాచర్స్ తో తలపడనుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ ఆటగాళ్లలో కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ 46(27 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. సీన్ అబాట్, లియాన్ చెరో 4 వికెట్లు తీశారు. 168 పరుగుల టార్గెట్‌తో దిగిన సిడ్నీ సిక్సర్ బ్యాట్స్మన్లలో కెప్టెన్ హెన్రిక్స్ 64( 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యూస్ (46) రాణించారు. చివర్లో 12 బంతులకు 19 పరుగులు చేయాల్సిన తరుణంలో జాన్ బోథా మూడు ఫోర్లు బాదడంతో విజయావకాశాలు మెరుగు పడ్డాయి. ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా, బ్రిస్బేన్ బౌలర్ బెన్ కటింగ్ చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో ఐదు పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో విజయం సాధించిన సిడ్నీ సిక్సర్స్ బిగ్ బాష్ లీగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
టైటాన్స్ గెలుపు
మొహాలీ: బ్రిస్బేన్ హీట్స్‌కు మరో పరాభవం...తక్కువ పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఈ ఆస్ట్రేలియా జట్టు మళ్లీ చతికిల పడింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 4 పరుగుల తేడాతో బ్రిస్బేన్‌ను ఓడించి సీఎల్‌టి20లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 18.5 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా...హీట్స్ 20 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. చెలరేగిన గాలే ఓపెనర్ రుడాల్ఫ్ (1) తొందరగానే అవుటైనా, డేవిడ్స్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), కున్ (27 బంతుల్లో 31; 6 ఫోర్లు) కలిసి టైటాన్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత డివిలియర్స్ (19 బంతుల్లో 28; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. అయితే డివిలియర్స్ అనూహ్యంగా రనౌట్ కావడంతో జట్టు ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. 16 పరుగుల తేడాతో టైటాన్స్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. మ్యాథ్యూ గాలే (4/10) చెలరేగి టైటాన్స్‌ను దెబ్బ తీశాడు. రాణించిన లాంజ్ స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా బ్రిస్బేన్ హీట్స్ ఛేదించలేకపోయింది. కెప్టెన్ జేమ్స్ హోప్స్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. క్రిస్టియాన్ (24 బంతుల్లో 21; 1 సిక్స్), సబర్గ్ (7 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మర్చంట్ డి లాంజ్ (3/13), రిచర్డ్స్ (2/20) చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో హీట్స్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. విజయం కోసం చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా మెక్‌డెర్మట్ క్లీన్ బౌల్డ్ కావడంతో హీట్స్ ఓటమిపాలైంది.