British Airways
-
ఇంత బరువుంటే విమానం టేకాఫ్ కాదు.. ప్లీజ్ కొందరు దిగిపోండి..
విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌కు రెడీగా ఉంది. ప్రయాణీకులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో విమానంలో ఉన్న వారికి పైలట్ ఓ షాకింగ్ వార్త చెప్పాడు. విమానంలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టేకాఫ్ చేయలేము.. అందకు కొందరు ప్రయాణీకులు విమానం దిగాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో, ప్రమాణీకులంతా ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ఈజీ జెట్ విమానం లాంజరెటో నుంచి లివర్ పూల్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో, ప్రయాణీకులకు విమాన పైలట్ అసలు విషయం చెప్పుకొచ్చాడు. విమానాశ్రయం రన్‌వే పొడువు తక్కువగా ఉండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమాన టేకాఫ్ ఆలస్యమవుతోందని పైలట్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టేకాఫ్ కష్టమవుతోందని వివరించాడు. ఇక, పైలట్ వ్యాఖ్యలతో విమానం ఉన్న ప్రయాణీకులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇదే సమయంలో, పైలట్ మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితుల్లో బరువైన ఈ విమానాన్ని టేకాఫ్ చేయడం కష్టతరమని తెలిపాడు. విమానం టేకాఫ్ కావలంటే కొందరు ప్రయాణీకులు విమానం దిగిపోవాల్సిందేనని చెప్పాడు. కనీసం ఓ 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానం దిగి, తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించాడు. అలా దిగిన వారికి 500 యూరోలు పారితోషికం కూడా ఇస్తామనీ చెప్పాడు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి సిబ్బంది తర్వాతి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులతో విమానం రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #easyJet's Captain asked 20 passengers to leave the aircraft because it was overweight and wouldn't be able to takeoff from #Lanzarote due to wind and warm weather. The flight from Lanzarote to #Liverpool was delayed by about 2 hours. 🎥 ©razza699/TikTok#Spain #uk #aviation pic.twitter.com/oa8pi4Imox — FlightMode (@FlightModeblog) July 8, 2023 ఇది కూడా చదవండి: మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..! -
బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం బ్రిటిష్ ఎయిర్వేస్ దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దాదాపు శతాబ్ద కాలంగా దేశానికి సరీ్వసులు నిర్వహిస్తున్న కంపెనీ తాజాగా ఢిల్లీ, ముంబైలకు మరిన్ని విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. విస్తరణకు అవకాశముండటంతోపాటు.. కోవిడ్–19 తదుపరి పలు ప్రాంతాల నుంచి డిమాండు ఊపందుకోవడం ఇందుకు కారణమైనట్లు తెలియజేసింది. కొత్తగా అధికారిక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో పనిచేస్తున్న 1,700 మందితోపాటు మరో 300 మందికి ఉపాధి కలి్పంచినట్లు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశీ అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు చైర్మన్, సీఈవో సీన్ డోయల్ పేర్కొన్నారు. పలు ప్రాంతాల నుంచి సరీ్వసుల వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో కరోనా మహమ్మారికి ముందుస్థాయిలో ప్రస్తుతం వారానికి 56 విమానాలను నడుపుతున్నట్లు తెలియజేశారు. మెట్రో నగరాలకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను కలుపుతూ సరీ్వసులను నిర్వహిస్తున్నట్లు డోయల్ తెలియజేశారు. ఇటీవలి వరకూ 49 విమానాలను నడిపినట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఎయిర్ సర్వీస్ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ, ముంబైలకు విమాన సరీ్వసులను పెంచనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా 2,000 మందికిపైగా ఉద్యోగులను కలిగి ఉన్నట్లు కంపెనీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కేలమ్ లామింగ్ తెలియజేశారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. -
రండి రండి.. దయచేయండి!
సాక్షి, హైదరాబాద్: ఏ అంతర్జాతీయ విమానం ఎక్కినా ఎయిర్‌హోస్టెస్ ఆంగ్లంలో ‘వెల్కం’ అని పలకరిస్తూ ఆహ్వానిస్తుంది. కానీ చక్కటి తెలుగులో ‘స్వాగతం.. రండి కూర్చోండి. ప్రయాణ సమయం లో మీకు ఎలాంటి సహాయం కావలసినా మమ్మల్ని సంప్రదించండి’...అంటూ ఆత్మీయంగా పలకరిస్తే ఎలా ఉంటుంది. విమానాల్లో తెలుగుదనం ఉట్టిపడితే ఎంత బావుంటుందో కదా. అలాంటి అద్భుతమైన తెలుగు క్యాబిన్ క్రూ సేవలను అందుబాటులోకి తెచ్చింది బ్రిటిష్ ఎయిర్వేస్. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇకనుంచి తెలుగులో మాట్లాడే క్యాబిన్ క్రూ అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మాట్లాడవచ్చు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చేందుకు గతంలోనే ప్రతిపాదనలను సిద్ధంచేసిన బ్రిటిష్ ఎయిర్వేస్ తాజాగా హైదరాబాద్ ప్రయాణికులకు తెలుగు క్యాబిన్ క్రూను పరిచయం చేసింది. ఇందుకోసం 25 మంది సిబ్బందికి 6 వారాలు శిక్షణనిచ్చి వారి సేవలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే బీఏ 276, బీఏ 277 విమానాలలో ప్రయాణికులు ఇక నుంచి మాతృభాషలో పలకరింపులను ఆస్వాదించవచ్చు. 95 ఏళ్లు గా బ్రిటిష్ ఎయిర్వేస్ దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాలను నడుపుతోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి ప్రస్తుతం 28 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
Viral: పాపం ఆ బుడ్డోడు.. నిజంగా నువ్వు లేకపోయి ఉంటేనా!
చంటిపిల్లలతో ప్రయాణాలు అంటే తల్లిదండ్రులకు కష్టమే. ఏమాత్రం అసౌకర్యం అనిపించినా చాలు వెంటనే ఏడుపు మొదలెట్టేస్తారు చిన్నారులు. ఆ చికాకులో నచ్చిన బొమ్మలు ఇచ్చినా విసిరి అవతల పారేస్తారు. వారిని ఊరుకోబెట్టాలంటే ఒక్కోసారి తలప్రాణం తోకకు వస్తుంది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు కాసేపు ఆగైనా సరే.. వారిని శాంతపరిచి ముందుకు సాగవచ్చు. ఏ బస్సో, రైలో ఎక్కినా కాస్త పర్లేదు. మధ్యలో దిగిపోయినా పెద్దగా నష్టం ఉండదు. అదే విమానమైతే ఇలాంటి వెసలుబాట్లు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఓ కుటుంబానికి! గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లాడిని ఊరుకోబెట్టడం ఎవరి వల్లా కాలేదు. అంతలో రంగంలోకి దిగింది ఫ్లైట్ అటెండెంట్. ఆడుకోవడానికి అతడికి బొమ్మలు ఇచ్చింది. కాసేపు కబుర్లు చెప్పింది. అయినా, ఆ బుడ్డోడు ఊరుకుంటేనా! ఇక లాభం లేదనుకుని వాడిని భుజాన వేసుకుని లాలించింది. తల్లిలా అక్కున చేర్చుకుని తన ఆత్మీయ స్పర్శతో ఊరట కలిగించింది. కాసేపటి తర్వాత ఆ పిల్లాడు ఏడుపు ఆపి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని బ్రెసీలియా నుంచి కుయీబా పట్టణానికి వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సదరు మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అరె మంత్రం వేసినట్లుగా ఆ పిల్లాడు నిద్రపోయాడు. నిజంగా మీరు గ్రేట్. తల్లి ప్రేమను పంచారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓ మహిళ.. మాక్కూడా విమాన ప్రయాణంలో ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. అప్పుడు నేను ఏడు నెలల గర్భవతిని. ఫ్లైట్ అటెండెంట్ నా బిడ్డను గంటల పాటు ఎత్తుకుని ఆడించారు. వారి వల్లే నాకు కాస్త ఉపశమనం దొరికింది. ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు అంటూ తన అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేసింది. చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) -
ఓ గృహిణి లక్ష్యం.. సవాళ్లే మన గురువులు
‘ఒక చిన్న అడ్డంకి కూడా నా ఎదుగుదలను ఆపలేదు’ అంటోంది మోడల్ తనూ గార్గ్ మెహతా. భారతదేశంలోని హర్యానాలో పుట్టి పెరిగిన తనూ కెనడా వెళ్లి, అటు నుంచి అమెరికా చేరుకొని ప్రసిద్ధ కంపెనీలలో పని చేస్తూ అక్కడి గ్లామర్ ప్రపంచంలో మహామహులతో పోటీ పడుతూ గుర్తింపును పొందుతోంది. బ్రిటిష్ ఎయిర్‌లైన్, వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన అనుభవం తనూ గార్గ్ సొంతం. రాబోయే మిసెస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఒంటరి పోరుకు సిద్ధపడింది. అమెరికాలో పర్యావరణం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తోంది. ప్రకటనలలో నటిస్తోంది. కలల సాధనకు కృషితోపాటు కుటుంబం బంధాన్ని నిలుపుకోవాల్సిన విధానం గురించి కూడా వివరిస్తోంది. ‘‘భారతీయ మహిళ అనే కారణం ఏ దశలోనూ నన్ను తగ్గించలేదు. మోడల్‌గా రాణించాలనే నా కల నా పని షెడ్యూల్‌నూ మార్చలేదు. రంగుల ప్రపంచంలో విజయం సాధించడానికి ఏం అవసరమో నాకు తెలుసు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో పుట్టి పెరిగాను. మధ్య తరగతి కుటుంబం. బి.టెక్ అయ్యాక పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ కుటుంబం ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి చాలా కష్టమైంది. కెనడా వెళితే కొంత ఖర్చు తగ్గుతుందనుకున్నా. అందుకు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సాయం తీసుకున్నాను. అప్పుడే అనుకున్నా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని. అడుగడుగునా సవాళ్లు కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక పేరున్న ఐటి కంపెనీలలో ఉద్యోగం చేశాను. అక్కడే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి బంధానికి గుర్తుగా కొడుకు పుట్టాడు. అందమైన కుటుంబం. హాయిగా సాగిపోతోంది జీవితం. కానీ, నా కల మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అమెరికాలోని అందాల పోటీలలో విజేతగా నిలవాలన్నది నా కల. అక్కడి రంగుల ప్రపంచంలో మోడల్‌గా రాణించాలన్నది లక్ష్యం. ఇందుకు నా భర్త మద్దతు లభించింది. బాబును నా భర్త వద్ద వదిలి, కొద్ది కాలంలోనే అమెరికా చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి ముఖ్యంగా స్త్రీకి చాలా సవాళ్లతో కూడిన జీవితం ఉంటుందని అర్థమైంది. మగవారితో పోల్చితే తక్కువ జీతం, వర్ణ వివక్ష, సాంస్కృతిక అడ్డంకులు .. ఎన్నో చూశాను. కానీ, అన్నింటినీ అధిగమించడమే నేను చేయాల్సింది అని బలంగా అనుకున్నాను. అప్పుడే అందరికీ సమాన అవకాశాలకు మద్దతు ఇచ్చే సేవాసంస్థ నిర్వాహకులతో పరిచయమైంది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సేవా సంస్థ పనుల్లో నిమగ్నమయ్యాను. మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటూనే సంస్థ పనులు చేస్తున్నాను. అలాగే, పర్యావరణ రక్షణకు పాటు పడే సంస్థకోసం కృషి చేస్తున్నాను. ఫలితంగా ఆర్థిక వెసులుబాటు, సేవాభాగ్యం లభించింది. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి మార్గమూ సులువయ్యింది. దూరాన్ని దగ్గర చేసే నమ్మకం పెళ్లి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒక కప్పు కింద ఉన్నా, సుదూరంగా, ఇతర దేశాలలో ఉన్నా భాగస్వామి కలను అర్థం చేసుకోవడంతో బంధం బలంగా ఉంటుంది. దూరం హృదయాలను మరింత మృదువుగా మార్చేస్తుందనడానికి నా జీవితమే ఉదాహరణ. నిజానికి భారతీయ సంస్కృతిలో భార్య–భర్త దూరంగా ఉండటం ఇప్పటికీ నిషేధం. కానీ, బదిలీలు, దేశ రక్షణలో సైనికులు, అతిగా క్యాంపులు ఉండే ఉద్యోగాలు ఇవన్నీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంచుతాయి. దూరం అనేది వివాహానికి సవాల్‌గా ఉంటుంది. కానీ, సరిగ్గా నిర్వహిస్తే వారిద్దరి బంధం కచ్చితంగా బలంగా ఉంటుంది. ఒక మహిళ కుటుంబాన్ని పోషించగలదు, కలలను సాధించుకోవడానికి కృషి చేయగలదు. ఏదైనా సంబంధాన్ని కొనసాగించడంలో వారి మధ్య కమ్యూనికేషన్, నమ్మకం రెండూ కీలకమైన అంశాలు. ఇవి మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అందుకే నా కల కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్, యోగా, ధ్యానం, పోషకాహారం .. అన్నింటిపైనా దృష్టిపెడుతున్నాను. తెలుపు–నలుపు, పొట్టి–పొడవు భేదాలేవీ మన కలలకు అడ్డంకి కావు. మానవ ప్రపంచంలో అందరూ సమానమే అని చాటాలన్నదే నా లక్ష్యం’’ అనే తనూ గార్గ్ ఎదుర్కొంటున్న సవాళ్లు మనకూ ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. -
ఎయిర్ హోస్టెస్ వ్యభిచార ప్రచారం: విమానంలో..
లండన్ : ‘‘ మీరు విమానంలో శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా? అయితే మీరు నాకు కొంత డబ్బులు చెల్లించండి. మీరు కోరుకున్న విధంగా గడపండి’’ అంటూ బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థ సోమవారం స్పందించి, విచారణకు ఆదేశించింది. ప్రస్తుతానికి ఆచూకీ తెలియని సదరు ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియా వేదికగా విమానంలో వ్యభిచరిస్తానంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం పోస్టులు, విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫొటోలను ఉంచింది. తన లోదుస్తులను కూడా అమ్ముతానని ప్రచారం మొదలుపెట్టింది. (ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది) లోదుస్తుల ధర దాదాపు 2,500 రూపాయలు ఉంటుందని తెలిపింది. ఈ పోస్టులు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆదివారం చాలా వరకు పోస్టులను తొలిగించింది. అయితే సదరు ఎయిర్ హోస్టెస్ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భద్రంగా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మా తోటి ఉద్యోగుల నుంచి అన్ని వేళలా.. అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నాము. దీనిపై విచారణ చేపట్టాము’’ అని పేర్కొన్నాడు. -
కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్
కరోనా వైరస్ సంక్షోభం ఫలితంగా బిజినెస్ ట్రావెలర్ బ్రిటీష్ ఎయిర్వేస్ (బీఏ)భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్‌తో బ్రిటీష్ ఎయిర్వేస్ ఒక ఒప్పందం కుదర్చుకోనుంది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి తొలగించనుది. అంతేకాదు రానున్న రెండు నెలల్లో సగం జీతానికే (50 శాతం వేతన కోత) పైలట్లు విధులను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి విమానయాన సంస్థ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. మరోవైపు మరో ప్రత్యర్థి సంస్థ వర్జిన అట్లాంటిక్ రాబోయే రోజుల్లో వందల మిలియన్ల పౌండ్ల విలువై ఉద్దీపన కోసం యూకే ప్రభుత్వాన్ని ఆశ్రయించనుందని భావిస్తున్నారు. అయితే యూకే ఆర్థికమంత్రి రిషి సునక్ ఇటీవలమాట్లాడుతూ, విమానయానసంస్థలకు "చివరి ప్రయత్నంగా"సహాయం చేయడానికి మాత్రమే ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వాటాదారుల నుండి డబ్బును సేకరించడానికి ప్రయత్నించమని విమానయాన సంస్థలను కోరారు. ఈ విషయంలో "కేసుల వారీగా" నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా కరోనా కల్లోలం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీదాదాపు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశాయి. బీఏ కంపెనీ కూడా దాదాపు అన్ని విమానాలు సేవలు నిలిపి వేసింది. ప్రపంచ ప్రయాణ ఆంక్షలు, క్షీణిస్తున్న డిమాండ్ విమానయాన సంస్థలు కుదేలవుతున్న సంగతి విదితమే. (కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్) చదవండి : కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం -
బ్రిటీష్ ఎయిర్వేస్పై హీరోయిన్లు ఫైర్
బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్లక్ష్యంపై హీరోయిన్లు సోనమ్ కపూర్, పూజా హెగ్డేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సంస్థ తీరు ఏం బాగోలేదని మండిపడ్డారు. బ్రిటీష్ ఎయిర్వేస్ రెండు సార్లు తన బ్యాగ్ పోగొట్టిందని తెలిపిన సోనమ్.. మరోసారి అందులో ప్రయాణించబోనని స్పష్టం చేశారు. ‘ఈ నెలలో బ్రిటీష్ ఎయిర్వేస్లో ప్రయాణించడం ఇది మూడోసారి.. అందులో రెండుసార్లు వాళ్లు నా బ్యాగ్‌ను పోగొట్టారు. వారి చర్య నాకు గుణపాఠం నేర్పింది. ఇకపై బ్రిటీష్ ఎయిర్వేస్లో ప్రయాణించను’అని పేర్కొన్నారు. సోనమ్ ట్వీట్‌పై పూజా హెగ్డే కూడా స్పందించారు.‘అవును. గత నెలలో నా బ్యాగ్‌లను కూడా వాళ్లు పోగొట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వాటిని కొరియర్లో పంపించారు. చూస్తుంటే.. ఇదంతా వారికి అలవాటే అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, సోనమ్ ట్వీట్‌పై స్పందించిన బ్రిటీష్ ఎయిర్వేస్.. బ్యాగేజీ విషయంలో ఆలస్యం జరుగుతున్నందుకు క్షమించాల్సిందిగా కోరింది. బ్యాగేజీ గురించి ఎయిర్‌పోర్ట్‌లో సమాచారం ఇచ్చినప్పుడు.. ట్రాకింగ్ సూచన ఏమైనా చేశారా అని సోనమ్‌ను అడిగింది. ఎయిర్వేస్ ప్రశ్నలకు సోనమ్ బదులిస్తూ.. ‘అదంతా చేశాను.. కానీ ఆ ప్రక్రియ చాలా అసౌకర్యంగా ఉంది. ఇలాంటివి జరగకుండా.. మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా భయంకరమైన సర్వీస్, నిర్వహణ కూడా చెత్తగా ఉంద’ని తెలిపారు. దీనిపై ఈ ఘటనపై తాము తాము క్షమాపణలు మాత్రమే చెప్పగలమని పేర్కొంది. వీలైనంతా తొందరలో బ్యాగేజ్‌ను సోనమ్ వద్దకు చేరుస్తామని హామీ ఇచ్చింది. -
బాయ్‌ఫ్రెండ్ నిర్వాకంతో చిక్కుల్లో ఎయిర్‌హోస్టెస్
లండన్ : బాయ్‌ఫ్రెండ్ నిర్వాకానికి మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. పీకల్లోతు మద్యం సేవించి తన బాయ్‌ఫ్రెండ్ పైలట్‌తో ఘర్షణకు దిగడంతో ఎయిర్‌హోస్టెస్‌ను బ్రిటిష్ ఎయిర్వేస్ సస్పెండ్ చేసింది. ప్రయాణంలో భాగంగా సింగపూర్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్లోని రిసెప్షన్ ప్రాంతంలో బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్‌తో ఎయిర్‌హోస్టెస్ నటాలీ ఫ్లిండాల్ బాయ్‌ఫ్రెండ్ ఘర్షణకు దిగాడని బ్రిటిష్ పత్రిక సన్ పేర్కొంది. నటాలీ తన బాయ్‌ఫ్రెండ్‌ను వెనుకసీటులో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలని సూచించగా అతను సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్‌హోస్టెస్ నటాషాను సస్పెండ్ చేసింది. తమ సిబ్బంది నుంచి సరైన ప్రవర్తనను ఆశిస్తామని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు చేపడతామని ఎయిర్వేస్ ప్రతినిధి స్పష్టం చేశారు. -
పైలట్ల సమ్మె : అన్ని విమానాలు రద్దు
లండన్ : బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ కు భారీ షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చెందిన సుమారు నాలుగువేల మంది పైలెట్లు ఉన్నపళంగా సంచలన నిర్ణయం తీసుకోవడంతో భారీ ఇబ్బందుల్లో పడింది. వేతన సవరణకుసంబంధించిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిరసిస్తూ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. దాదాపు అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని బ్రిటిష్ ఎయిర్వేస్ (బిఎ) సోమవారం (సెప్టెంబర్ 9) ఒక ప్రటనలో తెలిపింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలమని, క్షమించమని వారికి విజ్ఞప్తి చేసింది. నూతన పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ (బాల్పా) గత నెలలో సమ్మె నోటీసులిచ్చింది. అయినా సంస్థ ముందుకు రాకపోవడంతో సిబ్బంది మొత్తం సమ్మెకు దిగారు. బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చరిత్రలో పైలట్ల మొట్టమొదటి సమ్మె ఇదే. మరోవైపు ఈ నిర్ణయంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనత త్వరలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీలలో సమ్మె తరువాత, సెప్టెంబర్ 27న మరో సమ్మె నిర్వహించనున్నారని సమాచారం. కాగా బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ లాభాలను ఉద్యోగులకు పంచాలని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. జూలైలో విమానయాన సంస్థ ప్రతిపాదించిన మూడేళ్లలో 11.5 శాతం వేతన పెంపును బాల్పా తిరస్కరించింది. ఈ సమ్మె ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అవసరమైన పెట్టుబడి కంటే సమ్మె మూలంగా కంపెనీకి చాలా నష్టం వస్తుందని బాల్పా ప్రధాన కార్యదర్శి బ్రియాన్ స్ట్రట్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉద్యోగుల సమ్మె న్యాయబద్దం కాదని, తాము సరైన ప్రతిపాదనలే చేశామని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. 90 శాతం విమానయాన కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో రెండు యూనియన్లు 11.5 శాతం పెంపును అంగీకరించాయని కంపెనీ వాదిస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ సాధారణంగా 48 గంటల వ్యవధిలో 1,700 విమానాలను నడుపుతుంది బ్రిటిష్ ఎయిర్‌లైన్స్. -
భయానక అనుభవం; హారర్ మూవీలా..
లండన్ : కాసేపట్లో హాయిగా గమ్య స్థానానికి చేరుకోవచ్చు అనుకున్న ప్రయాణికులకు విమానంలో భయానక అనుభవం ఎదురైంది. విమానం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నారు. అయితే సిబ్బంది అప్రమత్తతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఫ్లైట్ బీఏ422లో చోటుచేసుకుంది. వివరాలు... 175 మంది ప్రయాణికులతో బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం లండన్ నుంచి స్పెయిన్ బయల్దేరింది. ఈ క్రమంలో ల్యాండ్ అవడానికి కొన్ని నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం మొత్తం పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో వెంటనే విమానం దిగిపోవాల్సిందిగా సిబ్బంది ప్రయాణికులకు సూచించారు. దీంతో వారంతా పరుగులు పెట్టడంతో తోపులాట జరిగింది. అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ విభాగం సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు పంపివేశారు. కాగా హారర్ మూవీని తలపించిన అనుభవం అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను లూసీ బ్రౌన్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రతినిధి.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని.. అయితే వారిని భద్రంగా గమ్యస్థానానికి చేర్చగలిగామన్నారు. తోపులాటలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని..వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. -
సోలో ట్రావెల్ సో బెటరూ..
ఒంటరిగా విదేశీ ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్వహించిన గ్లోబల్ సోలో ట్రావెల్ స్టడీ ప్రకారం – ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 శాతం మంది మహిళలు స్వతంత్రంగా ప్రపంచ దేశాలు చుట్టొస్తున్నారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో 75 శాతం మంది సోలో ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆసక్తులకు అనుగుణంగా గడపడానికి, తమ గురించి తాము తెలుసుకోవడానికి ఒంటరి ప్రయాణాలను ఒక సాధనంగా మలచుకుంటున్నారు. ఇండియా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, చైనాల్లో 18 – 64 వయోశ్రేణికి చెందిన 9,000 మందిపై జరిగిన ఈ సర్వేలో.. సంప్రదాయ ప్రయాణ తీరుతెన్నుల్లో వచ్చిన మార్పులు వెలుగుచూశాయి. ఒంటరి ప్రయాణాలు చేస్తున్న వారిలో ఇటలీ మహిళలు (63శాతం) ముందున్నారు. జర్మన్లు ఆ తర్వాత (60 శాతం) వున్నారు. ఆఖరులో అమెరికా స్త్రీలున్నారు. ఒంటరిగా విదేశీయానం చేసే అమెరికా మహిళలు 17 శాతం మందే (పురుషులు 46 శాతం) కానీ, వారంతా దాదాపుగా ఆరునెలల ప్రయాణానికి మోగ్గు చూపే వారే. చైనాలో పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు పదిసార్లు ఎక్కువగా ఒంటరి ప్రయాణాలు చేస్తున్నారు. మొత్తంగా.. 67 శాతం మహిళా ప్రయాణికులు తమ ఖండంలోని అద్భుతాలు ఆస్వాదించడం కోసం స్వల్ప కాలిక యాత్రలు చేస్తున్నారు. 50 శాతం మందికి పైగా స్త్రీలు స్వల్ప కాలిక ప్రయాణాలు ఎంపిక చేసుకుంటున్నారు. మార్కెట్ సర్వేల ప్రకారం – 3.05 కోట్లకు పైగా స్త్రీలు ఆరు మాసాలకు పైగా విదేశీ సందర్శనలో గడుపుతున్నారు. చాలా తరచుగా విదేశీ యాత్రలు చేస్తున్న వారిలో జర్మనీ మహిళలు ముందున్నారు. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు ఏడాదికి పదిసార్లకు పైగా ప్రయాణాలు గడుతున్నారు. 50 శాతం మంది తమకు చాలా దూరంగా వున్న చైనా యాత్రకు పోతున్నారు. భారతీయ యువతుల జోరు.. మన దేశంలో కనీసం రెండు నుంచి ఐదుసార్లు ఒంటరి ప్రయాణాలు చేసిన మహిళలు 47 శాతం మంది. వీరిలో అత్యధికులు 18 – 25 ఏళ్ల యువతులే. 37 శాతం మంది భారతీయ మహిళలు ఒంటరిగా ఐరోపా దేశాలు తిరిగొచ్చారు. 33 శాతం మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్య ప్రాచ్య దేశాలు సందర్శించారు. 30 శాతం మంది రెండు మూడు మాసాల్లో ఒంటరిగా విదేశాలు సందర్శించబోతున్నట్టు చెబుతున్నారు. థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, శ్రీలంక దేశాలకు ఒంటరి ప్రయాణాలు సర్వసాధారణమయ్యాయి. స్వేచ్ఛగా.. కోరినట్టుగా.. ఒంటరి ప్రయాణాల్లో స్వేచ్ఛ వుంటుంది.. అందుకే సోలో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నాం.. అంటున్నారు 55 శాతం మంది. ఇష్టమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కోరుకున్నది తినొచ్చు. కోరిన చోట తిరగొచ్చు. ఈ వెసులుబాటు కోసమే సోల్ ట్రిప్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నామని చెబుతున్నారు. సరికొత్త అనుభవాలు.. కొత్త కొత్త వ్యక్తుల్ని కలవడాలు.. వంటివి కూడా తమ ప్రాధాన్యతల జాబితాలో వున్నాయంటున్నారు 55 శాతం పైగా భారతీయ మహిళలు. మారుతున్న ప్రయాణ పోకడలపై వ్యాఖ్యానిస్తూ.. స్త్రీలు ఒంటరి ప్రయాణాన్ని తప్పుగా పరిగణించే ఆలోచనలకు కాలం చెల్లిందంటున్నారు సోలో ట్రిప్స్ ఏర్పాట్లు చూసే ట్రావెల్ బ్లాగర్ జన్నా వన్ డిజ్క్. -
3.8 లక్షల క్రెడిట్‌కార్డులు హ్యాక్
లండన్: బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు సంస్థ మొబైల్ యాప్ ద్వారా, ఎయిర్వేస్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసిన 3.8లక్షల ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు చోరీఅయ్యాయని బ్రిటీష్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ వివరాలు దుర్వినియోగంకాకుండా ఆపేందుకు యత్నిస్తున్నామని బ్రిటీష్ ఎయిర్వేస్ సీఈవో అలెక్స్ క్రూజ్ చెప్పారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. ‘ప్రయాణికుడి పేరు, చిరునామా, ఈ–మెయిల్ అడ్రస్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని (కార్డు నెంబరు, ఎక్సై్పరీ డేట్, సీవీసీ కోడ్) హ్యాకర్లు సంపాదించారు. ప్రయాణికుల పాస్‌పోర్టు వివరాలు హ్యాక్ కాలేదు’ అని క్రూజ్ చెప్పారు. ఆగస్టు 21 – సెప్టెంబర్ 5 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కార్డులను బ్లాక్ చేసుకోవాలని ఆయన కోరారు. బ్రిటీష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి సమాచారం అందించామని చెప్పారు. కాగా, పలువురు ప్రయాణికులు తమ క్రెడిట్ కార్డును ఎవరో వాడుకున్నట్లు ఫోన్‌కు సందేశాలు వచ్చాయని బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. పెద్ద కంపెనీల్లో భద్రత డొల్లే! డిజిటల్ సర్వీసులను కల్పించే ప్రయత్నంలో కనీస భద్రత కల్పించకపోవడంపై బ్రిటీష్ ఎయిర్వేస్పై ప్రయాణికులు సహా ఐటీ నిపుణులు మండిపడుతున్నారు. బ్రిటీష్ ఎయిర్వేస్లో ఐటీ సంబంధిత సమస్య తలెత్తడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది మేలో కంప్యూటర్ వ్యవస్థలో లోపాల కారణంగా 700కు పైగా విమానాలు హఠాత్తుగా రద్దవడం.. 75వేల మంది ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. అమెరికాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా మాల్వేర్ కారణంగా తమ ప్రయాణికుల చెల్లింపుల వివరాలు బహిర్గతమయ్యేందుకు ఆస్కారముందని ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. -
భారీ చోరీ : 3.80 లక్షల లావాదేవీలపై ప్రభావం
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరగడమే కాని, తగ్గడం కనిపించడం లేదు. బడా బడా కంపెనీలు, దిగ్గజ సంస్థలు, పెద్ద బ్యాంక్‌లు సైతం వీటి బారిన పడుతున్నాయి. తాజాగా దిగ్గజ ఎయిర్‌లైన్ సంస్థ బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా సైబర్ నేరగాళ్లు బారిన పడింది. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేసి, కస్టమర్ల డేటాను దొంగలించారు. ఈ విషయాన్ని ఆ విమానయాన సంస్థనే ట్విటర్ ద్వారా వెల్లడించింది. యూకేలో బ్రిటిష్ ఎయిర్వేస్ అతిపెద్ద విమానయాన సంస్థ. కస్టమర్ల వ్యక్తిగత డేటా, ఆర్థిక సమాచారం దొంగతనం పాలైన విషయంపై ఈ సంస్థ తమ కస్టమర్లకు క్షమాపణ కూడా చెప్పింది. ఈ డేటా చోరిపై విచారణ చేపట్టినట్టు పేర్కొంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దొంగతనానికి గురైందని, దాదాపు 3,80,000 లావాదేవీలు దీని బారిన పడినట్టు బ్రిటీష్ ఎయిర్వేస్ వెల్లడించింది. అయితే పాస్‌పోర్టు లేదా ప్రయాణ వివరాలు మాత్రం దొంగతనానికి గురికాలేదని పేర్కొంది. ‘ 21 ఆగస్టు 2018, 22:58 బీఎస్టీ(బ్రిటీష్ స్టాండర్డ్ టైమ్) నుంచి 5 సెప్టెంబర్ 2018, 21:45 బీఎస్టీ వరకు ఏ కస్టమర్లైతే, మా వెబ్సైట్, యాప్‌లో బుకింగ్స్‌ను, షెడ్యూల్ మార్పులను చేపట్టారో, వారి వ్యక్తిగత, ఆర్థిక వివరాలన్నీ చోరికి గురయ్యాయి’ అని బ్రిటీష్ ఎయిర్వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారిన పడినట్టు అనిపిస్తే, వెంటనే బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డు ప్రొవైడర్ల సూచనలు తీసుకోవాలని కస్టమర్లను ఎయిర్‌లైన్స్ ఆదేశించింది. తదుపరి సమాచారం కోసం ఓ లింక్‌ను అప్డేట్ చేయనున్నట్టు పేర్కొంది. కస్టమర్లను వ్యక్తిగతంగా సంప్రదించి, తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. ప్రభావితమైన కస్టమర్ల నగదును పూర్తిగా రియంబర్స్ చేస్తామని, క్రెడిట్ చెకింగ్ సర్వీసుకు చెల్లించనున్నట్టు పేర్కొంది. తాజా సమాచారంపై ఎప్పడికప్పుడు కస్టమర్లకు అప్డేట్ చేస్తామని తెలిపింది. ప్రస్తుతం దీన్ని పరిష్కరించామని, తదుపరి బుకింగ్స్‌పై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని చెప్పింది. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. -
ఆ విమాన సంస్థపై సెలబ్రిటీల ఆగ్రహం!
బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్, అతుల్ కస్బేకర్, పూజా హెగ్డేలు అంతర్జాతీయ విమానసంస్థపై విరుచుకపడ్డారు. భారతీయుల పట్ల బ్రిటీష్ ఎయిర్వేస్ వ్యవహరిస్తున్న తీరుపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకు గౌరవమివ్వని సంస్థను ఆదరించకూడదనీ. అలాంటి వాటిని మనం కూడా దూరం పెట్టాలని రిషీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అతుల్ కస్బేకర్ కూడా బ్రిటీష్ ఎయిర్వేస్పై అసహనం వ్యక్తం చేశాడు. తనకు కూడా గతంలో ఇలాంటి అనుభవం ఎదురైందని అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ విమానాలను ఎక్కలేదని తెలిపాడు. పూజా హెగ్డే కూడా ఓ సంఘటనను వివరిస్తూ.. ‘ ఓ ఇండియన్ నీళ్లు అడిగితే ఇవ్వడం లేదు. కానీ, పక్కనున్న విదేశీయులకు మద్యం మాత్రం ఎన్నిసార్లైనా ఇచ్చారని, భారతీయులంటే వారికి చిన్నచూపు. గ్లాస్ మంచి నీళ్ల కోసం రెండు గంటల ఎదురుచూశానని నిన్న రాత్రే నా ఫ్రెండ్ నాతో చెప్పుకొచ్చాడం’టూ ట్వీట్ చేసింది. -
ఆ సంస్థ విమానాలు ఎక్కడం మానేయండి!
జాతి వివక్ష ఎక్కడ ఉన్న తప్పుబట్టాల్సిందే. జాత్యహంకారం ఈ మధ్య కాలంలో మితి మీరిపోతోంది. తాజాగా జాత్యాహంకారాన్ని ప్రదర్శించిన బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థపై బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మండిపడ్డారు. తనకు గతంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘లండన్ విమాన ఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. విమానంలోని భారతీయుల్ని దించేయడం సరికాదు. ఇది జాతి వివక్షే. గతంలో నేను ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ.. రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ సంస్థ విమానాలను ఎక్కడం మానేశాను. మనకు గౌరవం ఇవ్వని ఇలాంటి విమానాలను ఇకపై ఎక్కడం మానేయండి. జెట్ ఎయిర్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించండి. అక్కడ గౌరవం దక్కుతుంది’ అని ట్వీట్ చేశారు. జూలైలో ఓ ఇండియన్ ఫ్యామిలీ లండన్ నుంచి బెర్లిన్‌కు వెళ్లడానికి బ్రిటీష్ ఎయిర్వేస్ సర్వీస్ విమానంలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న బాలుడు ఏడ్వడంతో అక్కడి సిబ్బంధి వారిని దూషించి అక్కడే దించేశారు. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రిషీ కపూర్ పైవిధంగా స్పందించారు. Racist. Dont fly British Airways.We cannot be kicked around. Sad to hear about the Berlin child incident. I stopped flying BA after the cabin crew were rude and had attitude not once but twice even after being a first class passenger. Fly Jetair or Emirates. There is dignity. — Rishi Kapoor (@chintskap) August 9, 2018 -
పిల్లాడు ఏడ్చాడని విమానం నుంచి బలవంతంగా...
న్యూఢిల్లీ : పిల్లాడు ఏడ్చాడని ఓ ఇండియన్ ఫ్యామిలీని విమానం నుంచి బలవంతంగా దించేశారు. ఈ దారుణమైన సంఘటన బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ లండన్-బెర్లిన్ విమానం(బీఏ 8495)లో జూలై 23న చోటు చేసుకుంది. ఈ విషయంపై ఈ పిల్లాడి తండ్రి ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సురేష్ ప్రభుకు లేఖ రాశాడు. బ్రిటీష్ విమానయాన సంస్థ తమతో వ్యవహరించిన అవమానకరమైన చర్యపై మంత్రికి వివరించాడు. విమానం టేకాఫ్ అవుతుండగా తమ పిల్లాడు బెదిరిపోయి ఏడ్వడం ప్రారంభించాడు. దీంతో తల్లి అతడ్ని ఒళ్లోకి తీసుకుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న క్రూ సిబ్బంది ఒకరు.. తమపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. చిన్నారిని తన సీట్లోకి వెళ్లాలని గద్దించాడు. దీంతో పసిపిల్లాడు మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ దంపతుల పక్కన సీట్లలో కూర్చున్న ఇతర భారతీయ కుటుంబాలు, పిల్లాడి ఏడుపు ఆపడానికి శతవిథాలా ప్రయత్నించారని, బిస్కెట్లు ఇస్తూ ఏడుపు ఆపేలా ప్రయత్నించారు. అయితే మళ్లీ వచ్చిన ఆ క్యాబిన్ సిబ్బంది.. యూ బ్లడీ.. ఏడుపు ఆపుతావా? లేదా? అంటూ మండిపడ్డాడు. లేకపోతే విండోలో నుంచి బయటకు పడేస్తా అంటూ హెచ్చరించాడు. దీంతో తమ చిన్నారి మరింత దడుచుకున్నాడని మంత్రికి రాసిన లేఖలో ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆ కేబిన్ సిబ్బంది భారతీయులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, బ్లడీ ఇండియన్స్ అంటూ వ్యాఖ్యానించాడని లేఖలో తెలిపాడు. విమానాన్ని టెర్మినల్‌కు తీసుకెళ్లి, తమల్ని బలవంతంగా కిందకి దించేశారని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుని విచారించాలని ప్రయాణికుడు కోరాడు. ప్రయాణికుడు చేసిన ఈ ఫిర్యాదును, తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి వివక్షపూరిత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ బ్రిటీష్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి చెప్పారు. కస్టమర్‌తో ప్రత్యక్షంగా సంప్రదించి, దీనిపై పూర్తి విచారణ ప్రారంభిస్తామన్నారు. -
ఇంకా ఎగరని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలు
లండన్: బ్రిటన్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులకు సేవలందించే బ్రిటిష్ ఎయిర్వేస్(బీఏ)విమానాలు మూడ్రోజులుగా మూలనపడ్డాయి లండన్‌లోని హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాలకు రాకపోకలు నిలిచిపోవడంతో.. వెయ్యి విమానాలు రెక్కలు విచ్చుకోలేదు. సోమవారం పాక్షికంగా రాకపోకల్ని పునరుద్ధరించినా.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ నిర్వహణ సేవల్ని భారత్‌కు ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, అనుభవరాహిత్య ఉద్యోగుల వల్లే బ్యాకప్ కోసం చేసిన యత్నాలు విఫలమయ్యాయని బీఏ ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. 2016లో వందల మంది ఐటీ సిబ్బందిని తొలగించి, ఆ ఉద్యోగాలను భారత్‌కు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారన్నాయి. ఆరోపణల్ని బీఏ తోసిపుచ్చింది. ఖర్చుల్ని తగ్గించుకోవడం, లేదా ఐటీ సేవల్ని భారత్‌కు ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వడం ఈ సమస్యకు కారణం కాదని పేర్కొంది. -
రెక్కలు తెగిన లోహవిహంగాలు!
మూడు రోజులుగా ఎగరని విమానాలు లక్షలాది మంది ప్రయాణికుల గగ్గోలు ఐటీ వ్యవస్థ కుప్పకూలడమే కారణం బీఏ బ్యాకప్ వ్యవస్థ పునరుద్ధరణలో భారత ఐటీ నిపుణులు వైఫల్యమంటూ విమర్శలు (సాక్షి నాలెడ్జ్ సెంటర్): బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానాలు మూడు రోజులుగా ఎగరలేకపోతున్నాయి. ప్రధానంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం, గాట్విక్ విమానాశ్రయాలకు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాల రాకపోకలు శనివారం అకస్మాత్తుగా నిలిచిపోయాయి. వేయికి పైగా విమానాల రెక్కలు విచ్చుకోలేదు. దీనికి కారణం.. కంప్యూటర్ వ్యవస్థలు మొరాయించడమే. విద్యుత్ సరఫరాలో లోపాల కారణంగా కంప్యూటర్ వ్యవస్థలు విఫలమయ్యాయని.. దీంతో విమాన సర్వీసులు రద్దయినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ (బీఏ) శనివారం ప్రకటించింది. బీఏ ఐటీ ఉద్యోగాలను భారతదేశానికి ఔట్‌సోర్స్ చేయడం వల్ల.. అక్కడి అనుభవరహిత ఉద్యోగులు సమస్యను తక్షణమే పరిష్కరించలేకపోయారని బీఏ ఉద్యోగ సంఘం తప్పుపట్టింది. ఈ ఆరోపణను బీఏ తిరస్కరించింది. బ్రిటిష్ ఎయిర్వేస్లో భారీస్థాయి ఐటీ వ్యవస్థ వైఫల్యం ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థ విమానాల రాకపోకలపై పెను ప్రభావం చూపింది. బ్రిటన్ రాజధాని లండన్ సహా ప్రపంచ వ్యాప్తంగా విమానాలు మూడు రోజులుగా నింగిలోకి ఎగరలేకపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాల్లో కంప్యూటర్ వ్యవస్థలు మొరాయించడమే దీనికి కారణం. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. కానీ విద్యుత్ పునరుద్ధరణ జరిగిన తర్వాత కంప్యూటర్లలోని సమాచారమంతా గందరగోళంగా మారడంతో వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. విమాన ప్రయాణికుల వివరాలు, విమాన రాకపోకల వివరాలు, లగేజీ కదలికలు వంటి వివరాలన్నీ తారుమారయ్యాయి. దీంతో విమానాలు ఎగరలేదు. ఒక్క హీత్రూ విమానాశ్రయంలో శనివారం నాడే వేయికి పైగా విమానాలు రద్దయ్యాయ. హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాలు.. ప్రయాణికులతో నిండిపోయాయు. దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. సుదీర్ఘ వారాంతం, పాఠశాలలకు మధ్యంతర సెలవులు కావడంతో శనివారం ఉదయం వేలాదిమంది విదేశీ ప్రయాణాలకు సంసిద్ధమయ్యారు. కానీ విమానయాన సంస్థ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లు కూడా పనిచేయలేదు. విమానాలు మళ్లీ ఎప్పుడు బయల్దేరుతాయో, తమకు ఏ విమానంలో సీట్లు ఇస్తారో తెలియక ప్రయాణికులు మూడు రోజులుగా టెర్మినళ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. టెర్మినళ్లు విపరీతమైన రద్దీతో ఇరుకుగా మారాయని, ప్రయాణికులు ఎవరూ రావద్దని విమానయాన సంస్థ విజ్ఞప్తులు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజా సమాచారం కోసం తమ ట్విటర్‌ను అనుసరించాలని కోరింది. శనివారం, ఆదివారం కూడా విమానాలు రద్దయ్యాయి. సోమవారం పాక్షికంగా విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. తీవ్ర నిస్పృహకు లోనైన వారందరూ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బీఏ 2016లో వందలాది మంది ఐటీ సిబ్బందిని తొలగించి, ఆ ఐటీ ఉద్యోగాలను భారతదేశానికి ఔట్ సోర్స్ చేస్తూ తీసుకున్న నిర్ణయమే.. ఈ పరిస్థితికి కారణమని సంస్థ జీఎంబీ యూనియన్ ఆరోపించింది. ఇలా ఔట్‌సోర్స్ చేయవద్దని తాము 2016 ఫిబ్రవరి 29న బ్రిటిష్ ఎయిర్ వేస్ను హెచ్చరించామని పేర్కొంది. విమానయాన సంస్థ బ్యాకప్ వ్యవస్థను తక్షణం ఎలా ప్రారంభించాలనేది.. భారతదేశంలోని అనుభవ రాహిత్య ఔట్సోర్సింగ్ సిబ్బందికి తెలియదని.. వారు బ్యాకప్ వ్యవస్థను తక్షణమే ప్రారంభించగలిగినట్లయితే సమస్య ఇంతగా పెరిగేది కాదని బీఏ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అయితే యూనియన్ విమర్శలను బ్రిటిష్ ఎయిర్వేస్ తిరస్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా పంపిణీ సంస్థలు ఐటీ సేవలను అందిస్తున్నాయని.. అన్నిరకాల పరిశ్రమలు, బ్రిటన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరించడం మామూలేనని పేర్కొంది. తమ సంస్థ ఐటీ వ్యవస్థల భద్రత విషయంలో రాజీ ఉండబోదని ఉద్ఘాటించింది. -
కంప్యూటర్స్ క్రాష్: విమానాలు రద్దు
లండన్ : కంప్యూటర్లు క్రాష్ అవడంతో బ్రిటీష్ ఎయిర్ వేస్ తన విమానాలన్నింటిన్నీ రద్దు చేసింది. మేజర్ ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ తో ప్రపంచవ్యాప్తంగా నడిపే తమ విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం చోటుచేసుకుందని ఈ విమానయానసంస్థ ప్రకటించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ చెప్పింది. ఈ అంతరాయంతో లండన్ లోని రెండు ప్రధాన విమానశ్రయాల నుంచి నడిపే విమానాలను రద్దుచేస్తున్నట్టు పేర్కొంది. లోకల్ టైమ్ సాయంత్రం ఆరుగంటల వరకు హీత్రూ, గాట్విక్ విమానశ్రయాల నుంచి తమ ఎయిర్ వేస్ కు చెందిన ఎలాంటి విమానాలు ఉండవని తెలిపింది. ఇటీవల నెలల్లో చాలా సార్లు బ్రిటీష్ ఎయిర్ వేస్ తన కంప్యూటర్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ తో తీవ్ర సతమతమవుతోంది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని బ్రిటీష్ ఎయిర్ వేస్ పేర్కొంది. అయితే ఐటీసిస్టమ్స్ క్రాష్ అవడంతో సైబర్ అటాక్ ఏమైనా జరిగిందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఐటీ సిస్టమ్స్ పై సైబర్ అటాక్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. చాలామంది ప్రయాణికులు దీనికి ప్రభావితమైనట్టు తెలిసింది. ప్రయాణికులకు రీషెడ్యూలింగ్ లేదా రీఫండ్ అనే రెండు ఆప్షన్లను బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. అయితే హీత్రూ, గాట్విక్ లనుంచి ప్రయాణించే ఇతర విమానాలకు ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఆరుగంటల తర్వాత ప్రయాణించే ప్యాసెంజర్లు కూడా తమ విమాన ప్రయాణ సమయాలను ఓ సారి చెక్ చేసుకోవాలని బ్రిటీష్ ఎయిర్ వేస్ సూచించింది. -
ఎలుక కారణంగా ఎగరని విమానం
లండన్: విమానం లోపల ఎలుకను గుర్తించడంతో ఇక్కడి హీత్రో విమానాశ్రయం నంచి అమెరికాకు వెళ్తోన్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఒకటి నాలుగు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. విమానం వైరింగ్‌ను ఎలుక కొరికే ప్రమాదం ఉన్నందున దాన్ని బయటికి పంపించిన తరువాతే విమానం టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. లోపల ఎలుక ఉండగా విమానం బయల్దేరదని, మరో విమానాన్ని సిద్ధం చేస్తామని సిబ్బంది ప్రకటించినా అది సాధ్యం కాలేదు. దీంతో ప్రయాణికులు నాలుగు గంటలు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఎలుకను బయటికి పంపించడంతో ఆ విమానం బయల్దేరింది. ఈ చిత్రమైన సంఘటన బుధవారం జరిగిందని బీబీసీ పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి బ్రిటిష్ ఎయిర్వేస్ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనపై స్పందించేందుకు హీత్రో విమానాశ్రయం నిరాకరించింది. -
బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: బెంగళూరు విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాన్ని మంగళవారం ఉదయం శంషాబాద్ విమానా శ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లండన్ నుంచి బయలుదేరిన ఈ విమానం మంగళవారం ఉదయం 6 గంటలకు బెంగళూరులో ల్యాండ్ కావల్సి ఉంది. అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టులో పొగ మంచు కారణంగా విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారుల అను మతితో శంషాబాద్‌లో ల్యాండ్ చేశారు. 2 గంటల తర్వాత విమానం తిరిగి టేకాఫ్ తీసుకుని బెంగళూరు బయలుదేరినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. -
విమానంలో వికృతచేష్ట.. జీవితకాల బహిష్కరణ
కేప్‌టౌన్: అతనో పెద్ద మనిషి. పేరుమోసిన కంపెనీకి అధిపతి. విమానం ఎక్కితే బిజినెస్ క్లాస్ తప్ప మరోచోట కూర్చుని ఎరగడు. కానీ వ్యవహారం మాత్రం నేరబారుకంటే దారుణం. విధినిర్వహణలో ఉన్న విమాన సహాయకురాలిపై వికృత చేష్టకుదిన అతడిని పోలీసులు అరెస్ట్ చేసేశారు. కానీ లంచం కొట్టి, చిటికెలో బయటపడ్డాడు. బ్రిటన్, సౌతాఫ్రికాల్లో సంచలనం రేపుతోన్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కు చెందిన మార్టిన్ వాన్(61) గత అక్టోబర్ లో బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానంలో కేప్ టౌన్(సౌతాఫ్రికా) వెళ్లాడు. బిజినెస్ క్లాసులో ప్రయాణించిన ఆయన.. ఆహారం వడ్డించేందుకు వచ్చిన విమాన సహాయకురాలిపై వికృతానికి దిగాడు. మార్టిన్ పక్క సీట్లో కూర్చున్న వేరొకరికి ఆహారం వడ్డిస్తూ విమాన సహాయకురాలు ముందుకు వంగింది. అదే సమయంలో మార్టిన్ ఆమె గౌను కిందుగా ఫోన్ ఉంచి వీడియో తీశాడు. ఇది గమనించిన ఆ ఉద్యోగిని మార్టిన్ ను నిలదీసింది. ఫ్లైట్ కెప్టెన్ కు ఫిర్యాదుచేసింది. కెప్టెన్ ఇచ్చిన సమాచారంతో విమానం కేప్ టౌన్ లో ల్యాండ్ అయిన వెంటనే మార్గిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది సేపటికే అతను బయటపడటం గమనార్హం. మహిళపై వికృతానికి పాల్పడ్డ మార్టిన్ పై పిటీ కేసు పెట్టి, కేవలం 13 యూరోలు జరిమాన విధించి వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. మార్టిన్ ను అరెస్టుచేసిన పోలీసు.. ఆ తర్వాత సెలవుపై వెళ్లడం లంచం అనుమానాలకు బలమిచ్చినట్లైంది. దీంతో మొత్తం కేసును పునర్విచారిస్తామని సౌతాఫ్రికా పోలీసులు చెప్పాల్సివచ్చింది. ఇదిలాఉంటే, సదరు నేరానికి పాల్పడ్డ మార్టిన్ ను తమ విమానాల్లో ప్రయాణించనివ్వబోమని బ్రిటిష్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటన విడుదలచేసింది. సిబ్బందితో తప్పుగా ప్రవర్తించిన అతడికి శిక్షపడాల్సిందేనని, ఈ మేరకు సౌతాఫ్రికా పోలీసులకు సహకరిస్తామని ఎయిర్ లైన్స్ పేర్కొంది. -
8 ఏళ్ల తర్వాత బ్రిటీష్ ఎయిర్వేస్పై గెలిచాడు
న్యూఢిల్లీ: సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా బ్యాగ్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి లక్ష రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ బ్రిటీష్ ఎయిర్వేస్ను ఆదేశించింది. ఎనిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. సిమ్లాకు చెందిన రమేష్ భార్గవ 2008లో ఢిల్లీ నుంచి బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో లండన్‌కు వెళ్లాడు. అక్కడ హీత్రో విమనాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత రమేష్ తీసుకెళ్లిన రెండు బ్యాగుల్లో ఒకటి మాత్రమే అందింది. ఆయన ఈ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపినా ఫలితం లేకపోయింది. మూడు వారాల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే బ్రిటీష్ ఎయిర్వేస్ సిబ్బంది పరిహారం చెల్లించకపోవడంతో ఆయన కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు. బ్యాగ్ పోవడంతో తాను మానసికక్షోభ అనుభవించానని, న్యాయం చేయాల్సిందిగా కోర్టును కోరాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఎనిమిదేళ్ల తర్వాత తీర్పును వెలువరించింది. ఆలస్యం చేయకుండా వెంటనే పరిహారం చెల్లించాల్సిందిగా బ్రిటీష్ ఎయిర్వేస్ను ఆదేశించింది. -
విమానం కాక్‌పిట్‌లో దుస్తులు విప్పి..
లండన్: భూమికి 38వేల అడుగుల ఎత్తులో.. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానాన్ని పైలట్ ఎంత జాగ్రత్తగా నడపాలి? ఎంత బాధ్యతతో మెలగాలి? కానీ ఇవేవీ పట్టని ఓ పైలట్.. కాక్‌పిట్‌లో దుస్తులు విప్పేసి, మహిళల సాక్స్ ధరించి కాళ్లతో విమానం నడిపాడు. ప్రమాదకరమైన చర్యకు పాల్పడిన కారణంగా సదరు పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే అతని వాదన మరోలాఉంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటిష్ ఎయిర్వేస్లో కెప్టెన్‌గా పనిచేస్తోన్న కొలిన్ గ్లోవర్(51) మధ్యతరహా, భారీ విమానాలను నడపడంలో దిట్ట. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం 777ను నడిపిన అనుభవంకూడా ఉందాయనకు. అయితే విమాన ప్రయాణం మధ్యలో కోలిన్ విపరీత చర్యలకు పాల్పడినట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. వివిధ సందర్భాల్లో పోర్న్ ఫొటోలు చూస్తూ, దుస్తులు విప్పి, కాళ్లతో విమానం నడుపుతున్న ఫొటోలు బహిర్గతం కావడంతో ఎయిర్ వేస్ సంస్థ కొలిన్‌ను సస్పెండ్ చేసింది. అయితే ఆ ఫొటోల్లో ఉన్నది తాను కాదని, తనపై కుట్రజరిగి ఉండొచ్చని కొలిన్ వాదిస్తున్నారు. దీంతో విమానయాన సంస్థ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఒకవేళ ఆ ఫొటోల్లోని వ్యక్తి కొలినే అని తేలితేమాత్రం అతని పైలెట్ లైసెన్స్ శాశ్వతంగా రద్దుచేస్తామని బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పలువురు పైలట్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.