BRS
-
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్
-
ముందు నీ కుర్చీ కాపాడుకో
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్‌రెడ్డీ.. ముందు నీ కుర్చీకింద ఉన్న బాంబు గురించి చూసుకో.. నీ పక్కన ఉన్నవారు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో.. నీ మంత్రులే నిన్ను ముంచుతారు. ఒకరేమో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. మరొకరు ఢిల్లీలో అధిష్టానం వద్దకు రహస్యంగా వెళ్లివస్తున్నారు. మరొకరు హెలికాప్టర్ ఇవ్వలేదని అలిగారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను డీల్ చేయడం తర్వాత.. ముందు నీవు ఐదేళ్లు పదవిలో ఉండేలా చూసుకో.. ఐదేళ్ల తర్వాత నిన్ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. ఏడాది అవుతోంది.. మంత్రివర్గ విస్తరణ చేసుకోలేవు. కనీసం చీఫ్‌విప్, డిప్యూటీ స్పీకర్‌ను నియమించుకోలేకపోయావు..’అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ను వాడుకొని కేసీఆర్‌ను ఫినిష్ చేశానని, బావను ఉపయోగించి బామ్మర్దిని ఫినిష్ చేయిస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నీకు సీఎం పదవి కేసీఆర్ భిక్షే ‘నీ సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే. నీకు, కేసీఆర్‌కు పోలికా? నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన త్యాగశీలి, సాధనాపరుడు. ఆయన ఉద్యమం చేసి తెలంగాణ తేకుంటే నీవు సీఎం అయ్యేవాడివే కాదు. నోరు తెరిస్తే అబద్ధాలు. నిన్ను చూస్తే గోబెల్స్ కూడా సిగ్గుపడేవాడు. ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. రుణమాఫీ పాక్షికంగానే చేశావు. 31 రకాల కోతలతో రుణమాఫీని గణనీయంగా తగ్గించావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోల్ చేసేది, వికెట్ తీసేది మేమే. కేసులకు భయపడం. హామీలు ఎగవేసిందుకు నేను సీఎంను ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటే నాపై బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బుల్డోజర్లు నడిపించి చంపేస్తామని సీఎం అంటే ఆయనపై మాత్రం కేసు నమోదు చేయడం లేదు..’అని హరీశ్ అన్నారు. కూల్చివేతలు, కమీషన్లకే వ్యతిరేకం ‘మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్ల కూల్చివేత, రియల్ ఎస్టేట్‌కు అప్పగించడం, కమీషన్లకు మాత్రమే వ్యతిరేకం. టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి వాడపల్లి వరకు పాదయాత్రకు నేను, కేటీఆర్ రెడీ.. తేదీ, సమయం చెప్పు. ఎవరూ లేకుండా వెళ్దాం. మల్లన్నసాగర్ కోసం 50 వేల ఎకరాలు ముంపునకు గురైందంటూ అన్నీ అసత్యాలే చెప్పావు. మేము సేకరించిందే 17 వేల ఎకరాలు. అందులో 3 వేలకు పైగా ప్రభుత్వ భూమి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మేం 2013 భూ సేకరణ చట్టం కంటే ఎక్కువ ఇచ్చాం. అయినా తక్కువ ఇచ్చామని ఆరోపించారు కదా.. అంతకంటే ఎక్కువ మీరు మూసీ నిర్వాసితులకు ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు? గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వండి. వారి ఉపాధికి ఒక్కో కుటుంబానికి రూ.7.5 లక్షలు ఇవ్వండి. పెళ్లి కానివారికి రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వండి. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలేవు. సందర్శకులు రాకుండా తాళం వేశావు. ఇప్పుడు మూసీలో మహాత్మాగాంధీ విగ్రహం పెడ్తానంటున్నావు. మూసీ సుందరీకరణకు కేసీఆర్ ముందే ప్రణాళికలు వేశారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీలోకి తీసుకుని రావడానికి రూ.1100 కోట్లతో ప్రణాళిక చేస్తే.. నీవు మరింత దూరం వెళ్లి మల్లన్నసాగర్ అంటూ రూ.7,000 కోట్లకు పెంచావు. ఎందుకంటే నీ కమీషన్ల కోసం..’అని మాజీమంత్రి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఢమాల్ ‘సీఎం నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. అదే సమయంలో ఢిల్లీ, ముంబయి, బెంగుళూరులో పెరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో రూ.4.86 లక్షల కోట్లు అప్పు చేస్తే, రూ.7.50 లక్షల కోట్ల అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే రూ. 80 వేల కోట్ల అప్పు చేశారు..’అని హరీశ్‌రావు తెలిపారు. బెటాలియన్ పోలీసుల డిస్మిస్లు, సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏక్ పోలీస్ హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తే పిలిచి చర్చించకుండా సస్పెండ్, డిస్మిస్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. -
సీఎం రేవంత్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సవాల్
-
డ్రగ్ టెస్ట్‌కు మేం రెడీ.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్
సాక్షి,హైదరాబాద్: తన పంచాయతీ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో కాదని, సీఎం రేవంత్‌రెడ్డితో అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా పంచాయతీ అనిల్ కుమార్ యాదవ్‌తో కాదు. రేవంత్ రెడ్డితో నాకు పంచాయతీ. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మేం కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్‌ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్ కు రావాలి. మేం యూరిన్ డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరు ఎదురు చేస్తున్నారు ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదు.ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలి. నన్ను ట్రాప్ చేసినట్లు రాజ్ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారు. కేసీఆర్ పేరు తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మీటింగ్ జరిగిందా .రేవంత్ రెడ్డి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, కేసీఆర్ పేరు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి అన్నారు. -
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన కోర్టు.. ఇవాళ మిగిలిన ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది.కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.మరోవైపు హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యనున్నారు. ఈకేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. -
కేటీఆర్ ఖేల్ ఖతం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలం చెల్లిన మందు. ఆయన పని అయిపోయింది. కేసీఆర్ కోసం కేటీఆర్‌ను వాడా. పది నెలల్లో కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేయించా. ఇప్పుడు బావను ఉపయోగించి బావమరిదిని ఫినిష్ చేయిస్తా. ఆ తర్వాత హరీశ్‌రావును ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ ఉనికి లేకుండా చేస్తా...’ అంటూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి అంటే తమకు చిచ్చుబుడ్లు గుర్తుకు వస్తాయని, కానీ వారికి మాత్రం సారాబుడ్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఏమీ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన విచారణల్లో ఎలాంటి కక్ష సాధింపులు ఉండబోవని, దర్యాప్తు సంస్థలు ఇచ్చే నివేదికల ప్రకారమే చర్యలుంటాయని చెప్పారు. ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్‌లో పర్యటించిన మీడియా ప్రతినిధులతో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మాకు నష్టం జరిగినా ప్రజలకు మేలు చేస్తాం ‘సీఎం కావాలన్నది నాకల. ఆ కల నెరవేరింది. కొత్తగా ఏదో కావాలనే కోరిక నాలో లేదు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడమే పని. నేను అనుకున్నది ఇచ్చిన ప్రజలకు మేలు చేయడమే నా ముందున్న లక్ష్యం. మాకు రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతాం. పనితీరులో నా స్టైల్ రాజమౌళిది.. రాంగోపాల్‌వర్మ లాంటిది కాదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోంది. కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయ్యింది. శ్రవణ్‌రావు వాస్తవాలు చెప్పడానికి ముందుకొచ్చాడు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు. ఏమీ చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు? ముందస్తు బెయిల్ ఎందుకు అడి గారు? ఇంటి దావత్లో క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు?..’ అని సీఎం ప్రశ్నించారు. హామీలు నెరవేరుస్తున్నాం.. ‘గత ప్రభుత్వం ఎంత గుడ్డిగా వ్యవహరించిందంటే.. కనీసం అధికారుల సర్వీసు రికార్డులు కూడా లేవు. రెవెన్యూ అధికారుల బదిలీల వ్యవహారంతో ఇది తేటతెల్లమైంది. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఏకంగా రూ.7 లక్షల కోట్ల భారం మోపారు. మేం పది నెలల్లో భూములు అమ్మలేదు, లీజుకు ఇవ్వలేదు. రాబడిలో లీకేజీలను అరికట్టాం. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాం. ఏకకాలంలో రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలలో తొలిరోజే వేతనాలు, పింఛన్లతో ప్రజలకిచ్చిన హామీలను నెర వేరుస్తున్నాం. రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.31 వేల కోట్లు పెట్టి ఇవ్వలేదని అంటున్నారు. అది కేవలం ప్రొవిజన్ కోసమే పెట్టాం తప్ప అదంతా ఇవ్వాలని కాదు. రైతులకు అవసరమైన మేరకు రూ.26 వేల కోట్లు ఖచ్చితంగా ఇస్తాం..’ ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థిక మాంద్యంతో రియల్టీ తగ్గుముఖం ‘హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఆర్థిక మాంద్యం కారణంగా రియల్టీ తగ్గుముఖం పట్టిందనే విషయం బీఆర్ఎస్ నేతలకు తెలియదా? గండిపేటలో అక్రమంగా కట్టిన బలిసినవాళ్ల ఇళ్లే కూలగొట్టాం. పేదల జోలికి వెళ్లడం లేదు. కూకట్‌పల్లిలో చిన్నారిని పరామర్శించిన కేటీఆర్ ఇల్లు కట్టిస్తారని అనుకున్నా. పుస్తకాల బ్యాగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు..’ అని సీఎం విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి – ప్రాజెక్టుపై ముందుకే..వెనక్కి తగ్గేదిలేదు – 18 నెలల్లో మూడు పద్ధతుల్లో డీపీఆర్ రెడీ – మేలైన మోడల్‌ను ఎంచుకుని పనులు ప్రారంభిస్తాం – తొలిదశలో జంట జలాశయాల నుంచి బాపుఘాట్ వరకు ప్రాజెక్టు – బాపూఘాట్ వద్ద అతిపెద్ద గాంధీ విగ్రహం, లండన్ ఐ, పెద్ద టవర్ మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తూ లేనిపోని ప్రచారాలతో ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వం తరహాలో కాకుండా మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వేయిసార్లు ఆలోచిస్తా. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నా. ఇక ముందడుగే. వెనుకడుగు వేసేది లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు సంస్థల కన్సారి్టయంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాం. రివర్ బెడ్ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో, అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్ వస్తుంది. ప్రభుత్వ, పీపీటీ, హైబ్రిడ్.. ఈ మూడు పద్ధతుల్లో వస్తుంది. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్‌ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుడతాం..’ అని సీఎం తెలిపారు. తొలిదశలో 21 కిలోమీటర్లు ‘తొలిదశలో బాపుఘాట్ వరకు మూసీ పునరుజ్జీవం చేపడతాం. జంట జలాశయాల నుంచి బాపుఘాట్ త్రివేణి సంగమం వరకు ఈ పనులు మొదలు పెడతాం. మల్లన్నసాగర్ నుంచి గండిపేట, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు తరలిస్తాం. ఆలోపు వంద శాతం నీటిని శుద్ధి చేస్తాం. అక్కడికి 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవం పూర్తవుతుంది. నవంబర్ తొలివారంలో మల్లన్నసాగర్ నుంచి జంట జలాశయాలకు నీటి తరలింపు ట్రంక్ లైన్ పనులకు టెండర్లను పిలుస్తాం. బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తాం. అతిపెద్ద బాపూ విగ్రహం ఏర్పాటు చేస్తాం. లండన్ ఐ (అతిపెద్ద జెయింట్ వీల్) ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి నగరమంతా వీక్షించేలా సియోల్ టవర్ తరహాలో పెద్ద టవర్ నిర్మిస్తాం. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ..రీ క్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్ చెప్పారు. నైట్‌లైఫ్‌కు వేదికగా హైదరాబాద్ ‘మూసీ సుందరీకరణతో ఆదాయ పరంగా మరో నగరం ఏర్పడుతుంది. రాత్రివేళల్లో మూసీ రివర్ ఫ్రంట్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరం పగలు మాత్రమే మేలుకుంటోంది. మూసీ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నైట్ లైఫ్‌కు వేదిక కానుంది. మూసీ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రజలనే అడుగుదాం రండి ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నా, ప్రతిపక్షాలకు ఏదైనా ఆలోచన ఉన్నా నాకందజేయాలి. ఒకవేళ కేటీఆర్, హరీశ్, ఈటల లాంటి నేతలకు నా దగ్గరకు రావడం మొహమాటం అనిపిస్తే సీఎస్‌ను లేదంటే మంత్రులను కలిసి ఇవ్వొచ్చు. మూసీని నగర జీవనాడిగా మార్చేందుకు కలిసి రండి. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. కేటీఆర్, ఈటల, హరీశ్ కూడా నాతో కలిసి రావాలి. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదాం. రూ.లక్షన్నర కోట్ల ఖర్చు కేవలం మూసీకే కాదు.. విశ్వనగర అభివృద్ధి కోసం. ట్రిపుల్ ఆర్, మెట్రో, గోదావరి జలాల తరలింపు, ఎస్టీపీల నిర్మాణం, రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
మాట తప్పిన రేవంత్ రెడ్డి.. హరీష్ రావు ఫైర్
-
ఫ్రస్టేషన్లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై ఫ్రస్టేషన్,డేస్పరేషన్‌లో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ మాపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయి. మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకి ధన్యవాదాలు. ప్రభుత్వం చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, కుతంత్రాలను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం.కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బీఆర్ఎస్ను టార్గెట్ చేయబోతున్నాయి. ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆగం కావొద్దు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం.తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న మన పోరాటం పైనే దృష్టి సారిద్దాం. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై వారిపైన ఒత్తిడి తెద్దాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. Failed Congress Govt and its CM in Telangana is desperate & frustrated with BRS thoroughly exposing their failures, corruption Thank you to all the BRS leaders & SM warriors for your efforts and support What we saw last two days was just the beginning of a long drawn battle…— KTR (@KTRBRS) October 29, 2024 -
కాంగ్రెస్ పాలనలో పత్తి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
-
TG: ‘విందు’పై రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన విందు రాజకీయ రంగు పులుముకుంది. పోలీసుల దాడులు.. రేవ్ పార్టీ జరిగిందనే ప్రచారం.. అనుమతి లేకుండా మద్యంతో పార్టీ నిర్వహించారంటూ కేసులు.. ఒకరికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందనే వార్తలు.. రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల నివాసాల్లో పోలీసుల సోదాలు.. అధికార, విపక్షాల నేతల విమర్శలతో ఆదివారం పొద్దంతా హైడ్రామా చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి రాజ్ పాకాల ఇంటిపై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు చేసిన దాడిలో విదేశీ మద్యం సీసాలు దొరకడం, విందులో పాల్గొన్న ఒకరు డ్రగ్స్ తీసుకుని ఉన్నట్టు తేలడంతో.. కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో రేవ్ పార్టీ జరిగిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయగా.. విందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులతో కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కొత్తగా ఇల్లు కట్టుకుని, దీపావళికి దావత్ చేసుకుంటే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారని, అక్కడ తన బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరించారు. అసలు డ్రగ్స్ ఏమీ దొరకలేదని చెప్తూనే.. కేసులు ఎలా పెట్టారని నిలదీశారు. -
మూసీ పేరిట లూటీకే వ్యతిరేకం
మల్లాపూర్ (హైదరాబాద్): మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, అభివృద్ధికి తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదని, దానిపేరిట లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి ఢిల్లీ పెద్దల కోసం లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలను పక్కనపెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చుపెడతామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, కేవలం రూ.1,100 కోట్లతో గోదావరి నీళ్లు మూసీకి తీసుకువస్తే సుందరీకరణ పూర్తి అవుతుందని చెప్పారు. నాచారంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) పనితీరును పార్టీ నేతలతో కలిసి ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణంబీఆర్ఎస్ హయాంలోని పదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. మురుగునీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పేద ప్రజల ఇళ్లు కూలగొట్టి షాపింగ్ మాల్స్ కట్టేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకుంటామని, పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.ఆవు పంచకంతో ఎస్టీపీ శుద్ధికేటీఆర్ నాచారం ఎస్టీపీ సందర్శన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు చేతులకు నల్ల బ్యాడ్జీలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ తిరిగిన ప్రదేశంలో ఆవు పంచకంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ కేసులు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జన్వాడ రాజ్ పాకాల ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే.. వాటిపై బీఆర్ఎస్ మానసిక దెబ్బ తీసేలా మా కుటుంబ సభ్యులపై కేసులు పెడుతోంది. జన్వాడలో నా బావమరిది విల్లా కాదు. ఇల్లు. నా బావమరిది రాజ్ పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? గృహ ప్రవేశం సందర్భంగా బంధువులను పిలిచి దావత్ ఇచ్చారు. కొందరు రేవ్‌పార్టీ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అటు ప్రభుత్వం,మీడియా,సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? వృద్ధులు, చిన్న పిల్లలతో సహా కుటుంబం మొత్తం బంధుమిత్రులతో కలిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు’అని కేటీఆర్ మండిపడ్డారు. -
కేటీఆర్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ కుట్రలు : హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వారి కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. జన్వాడ్ ఫామ్‌హౌస్ ఘటనపై స్పందించారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బురదజల్లడంలో భాగంగానే కేటీఆర్ బావమరిదిపై రాజ్పాకలపై డ్రగ్స్ కేసంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. ప్రజల దృష్టి మళ్లించేందుకు సృష్టించేందుకే జన్వాడ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తోంది.రాజ్ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసు. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం శని, ఆదివారాల్లో బాంబులు పేలుతాయని అనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే, ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్ అని స్పష్టం అవుతోంది. ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడిచేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్, ఆయన సతీమణి గానీ ఆ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లకపోయినా వెళ్లినట్టు చిత్రీకరించడం దారుణం, కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదు.పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని నా విజ్ఙప్తి.రోజురోజుకు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టిమళ్లించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు. రాజకీయాల్లో నేరుగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని చీప్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను. -
జన్వాడ ఫామ్ హౌస్ ఘటన : బీజేపీ నేతలపై జగదీష్ రెడ్డి ఫైర్
సూర్యాపేట: సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు కూడా భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి. జన్వాడ్ ఫామ్ హౌస్ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.కేటీఆర్ ఇంటిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. వారెంట్ లేకుండా ఎలా వస్తారు ఎక్కడో ఏదో జరిగిందని సాకుతో రావడం ఏంటి. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు కూడా భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎందుకు స్పందిచడం లేదు.పోలీస్ వ్యవస్థ దిగజారుతోంది. నిజాం కాలంలో కూడా ఇంతదారుణంగా లేదు. చిల్లర దాడులు మమ్మల్ని బెదిరిస్తాయని అనుకోవద్దు. కేటీఆర్ ప్రజల తరపున కొట్లాడుతోండనే ఈ దాడులు. తప్పుడు కేసులు పెట్టినా మా గొంతును మూయలేరు. గతంలో స్వయంగా పోలీసులు ఇళ్లల్లో ఆయుధాలు పెట్టి కేసులు నమోదు చేశారు. రాజ్ పాకాల విషయంలో అలాంటిదే జరిగి ఉండొచ్చు. పోలీసులే జేబుల్లో ఏదన్నా పెట్టుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఉండేవారేమో.బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునంధన్ రావుకు ఎందుకంత అత్యుత్సాహం.బండి సంజయ్ కి సమాచారం ఎవరిచ్చారు. ఇంట్లో దావత్ చేసుకుంటే బాటిల్స్ ఉన్నాయట. తెలంగాణలో ఉదయమే మంత్రులు తాగుతున్నారు.పరీక్ష చేద్దామా. తెలంగాణలో గృహప్రవేశం చేసుకుంటే దావత్ చేసుకుంటారా లేదా?.ఎలాంటి కేసులనైనా ఎదుర్కోవడానికి సిద్ధం. పోలీసులు తగిన మూల్యం చెల్లిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఫైర్
సాక్షి,వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. శనివారం(అక్టోబర్ 26) స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ ఫిరాయించిన వారిని కేటీఆర్ రాజకీయ వ్యభిచారి అనడం సిగ్గుచేటు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత ఎందరో పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటాం.కేటీఆర్ అహంకార, బలుపు వ్యాఖ్యలు సహించేది లేదు. 2014 ముందు నీ ఆస్తులు ఎంత,ఇప్పుడు ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలి. గురివింద గింజ కింద నలుపు ఎరుగది అన్నట్లు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. 2014లో పార్టీ మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వలేదా. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదా. పార్టీ ఫిరాయింపులకు తెర లేపిందే బీఆర్ఎస్. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’అని కడియం హెచ్చరించారు.ఇదీ చదవండి: కేసులకు భయపడం ఏం చేస్తారో చేస్కోండి: కేటీఆర్ -
‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠాలా తయారైందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు పిచ్చిపట్టిందని ఎద్దేవా చేశారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కేటీఆర్, హరీశ్‌రావు పనిగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీశ్‌రావులు తిట్లు తింటుంన్నారు. అమెరికా, సింగపూర్ల నుంచి సోషల్ మీడియా నడపడం కాదు. దమ్ముంటే ధైర్యంగా ముందుకు రండి. సమస్యలపై పోరాడితే తప్పులేదు. కానీ వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ..బీఆర్ఎస్ హాయాంలో ఇద్దరు కలెక్టర్లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. తిట్టినా.. తప్పేంటి? నేను తిట్టింది గత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు. సీఎం వ్యాఖ్యలు అననివి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైటర్స్. బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే.. మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’’ అని అన్నారు. -
హైదరాబాద్‌ను ఫినిష్ చేసేయత్నం
సాక్షి, హైదరాబాద్: ‘‘గుజరాత్‌తో పోటీపడుతోందన్న అక్కసుతో హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని చూస్తున్నారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగు రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో పురోగతి సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం.. గుజరాత్‌కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి మా ప్రయత్నాలను ఆపాలని చూస్తున్నాయి..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.అందుకే కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కూడా తప్పుపడతారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ నెట్వర్క్ ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మాత్రం బీజేపీ నేతలు అడ్డుకుంటారు. మూసీ పునరుజ్జీవంతోపాటు బాపూఘాట్ అభివృద్ధిని కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. మీకు నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూడొద్దు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నది గుర్తుంచుకోండి. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు తెలంగాణ ప్రజల ఆలోచనలను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పడగొట్టాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు.కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే ఎందుకు బయటకు రావడం లేదు? తానో జమీందార్ అని, ప్రజలందరూ గులాములని కేసీఆర్ భావిస్తారు. అందుకే బయటికి రావడం లేదు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా దానిని అభివృద్ధి చేస్తాం. గాంధీజీ వారసులుగా మేం ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. గుజరాత్లో పటేల్ విగ్రహం తరహాలోనే బాపూఘాట్లో గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజల కోసం మోదీ ఏం చేశారు? నెహ్రూ మొదలుకుని ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులందరూ దేశంలో అనేక సంస్కరణలతో పాటు విప్లవాలు తీసుకువచ్చారు. కానీ దేశానికి మూడోసారి ప్రధాని అయిన మోదీ ఏం విప్లవం తెచ్చారో, దేశ ప్రజల కోసం ఏం చేశారో, ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెప్పాలి. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం, పడగొట్టడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు మోదీ ఏమీ చేయలేదు. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారతాలనే విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేది. ఉత్తరాది రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేవారు. కానీ ఎన్డీఏ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గతంలో ఉత్తర భారతం నుంచి ప్రధాని ఉంటే.. దక్షిణ భారతం నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించింది. కానీ మోదీ ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే పనిచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాలకు మోదీ నుంచి అందిన సహకారం చాలా తక్కువ. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఒక్క రూపాయి వెళితే.. 7 రూపాయలు వెనక్కు ఇస్తున్నారు. అలాగే బీహార్‌కు 6 రూపాయలు వెనక్కి ఇస్తున్నారు. తెలంగాణ నుంచి రూపాయి వెళితే.. కేవలం 40పైసలు మాత్రమే వెనక్కి ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతోనే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలి..’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. -
కాంగ్రెసోళ్లను ప్రజలే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి
సాక్షి, ఆదిలాబాద్: ప్రజలే మర్లవడి కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. గరీబులు, రైతులు, విద్యార్థులతోపాటు తనపై కేసులు పెడతానంటే ఊరుకొనేవారెవరూ లేరన్నారు. ఈ ప్రభుత్వం ఎవరినీ వదలకుండా అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా ఇచ్చే దాకా.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే వరకు పోరాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఆదిలాబాద్ నుంచే అగ్గి అంటుకుందని.. ఈ సర్కారుపై మూడేళ్లు కొట్లాడేది ఉందని.. అందుకు పోరాట తోవ చూపారన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు పోరుబాట సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజలు కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా? రుణమాఫీ కాలేదని రైతులు ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేస్తే పోలీసులు వారిని జైల్లో పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వంద రోజుల్లో అన్నీ చేస్తామని మాట తప్పిన వారిని జైల్లో పెట్టాలా లేక పేద ప్రజలను జైల్లో పెట్టాలా అని ప్రశ్నించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు వరుసపెట్టి కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీకి శక్తినిస్తే రైతుల పక్షాన పోరాడతామని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటే.. భారత రాష్ట్ర సమితే కాకుండా భారత రైతు సమితి కూడా అని ఆయన పేర్కొన్నారు. అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి.. ‘పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. లేదంటే మా టైమ్ వ స్తది. ఎవరైనా ఎక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోండి. మిత్తితో సహా చెల్లిస్తాం. పెద్ద పెద్దోళ్లను చూసినం.. చంద్రబాబుతోనే కొట్లాడినం.. ఈ చిట్టినాయుడు ఎంత? అతన్ని చూసి మనం భయపడాల్నా?’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడి బంధువులు, శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసిన మోసాల గురించి వివరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన పత్తికి సైతం గుజరాత్ ధర ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలు మరింత ప్ర మాదకారులని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబా ద్ ఎమ్మెల్యే, ఎంపీ బీజేపీ నేతలేనని వివరించా రు. ‘గుజరాత్లో పత్తి క్వింటాల్‌కు రూ. 8,800 ఇ స్తున్నారు. అక్కడికన్నా తెలంగాణలో పత్తి నాణ్య మైనదని పరిశ్రమ వర్గాల వారే నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. అందుకే గుజరాత్లో ఇచ్చినట్టే పత్తికి ఇక్కడ కూడా ధర ఇవ్వాలని బీజేపీపై కొట్లాడాలి’అని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందూ దొందేనన్నారు. పీఎం మోదీ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోసగిస్తే.. రేవంత్‌రెడ్డి రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో వేస్తానని వేయలేదని విమర్శించారు. ఈ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాడి కౌసిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, లోలం శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. -
ఎలాంటి ఆధారాలూ లేకుండా దిగజారి మాట్లాడారు: కేటీఆర్
సిటీ కోర్టులు (హైదరాబాద్): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు, తమ పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు చెప్పారు. ఆమె వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, వాటిని విని తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. తనపై సురేఖ చేసిన కామెంట్లను చూసి పలువురు సాక్షులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. కొండా సురేఖ తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తన వాంగ్మూలం ఇచ్చారు. వాస్తవానికి గత వారం విచారణలోనే కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సి ఉండగా..ఆయన కోర్టుకు రాలేకపోవడంతో న్యాయవాదులు వాయిదా కోరారు. జడ్జి ఎస్.శ్రీదేవి విచారణను బుధవారానికి వాయిదా వేయగా కేటీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు సాక్షులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, తుల ఉమా, బాల్క సుమన్ కూడా తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే సమయం లేకపోవడంతో శ్రవణ్‌కుమార్ వాంగ్మూలం మాత్రమే కోర్టు రికార్డు చేసింది. మిగతావారి వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బుధవారం నాటి విచారణకు కేటీఆర్ తరఫు న్యాయవాదులు సురేందర్, అరవింద్, సిద్ధార్థ, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ హాజరయ్యారు. తదుపరి విచారణకు సాక్షులు అందరూ హాజరుకావాలని ఆరోజు వారి వాంగ్మూలం తీసుకుంటామని జడ్జి శ్రీదేవి తెలిపారు. కేటీఆర్ వాంగ్మూలం ఇలా.. ‘డబుల్ పీజీ చేసిన నేను తొలుత అమెరికాలో ఉద్యోగం చేశా. 2006లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ సారథ్యంలో ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశా. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందా. ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించా. వివిధ దేశాల నుంచి కంపెనీలు తీసుకువచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశా. కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. అలాంటి నాపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. దాదాపు 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవచేస్తున్న నాపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో, నా గురించి తెలిసిన చాలామంది బాధపడ్డారు. సురేఖ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా, తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయి. నేను డ్రగ్ అడిక్ట్నని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని, ఇతరులకు డ్రగ్స్ అలవాటు చేస్తానని, సినీ, రాజకీయ నేతలు చాలామంది విడాకులకు నేనే కారణమని.. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను అన్నీ చెప్పలేకపోతున్నా. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోండి. సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను కూడా కోర్టుకు సమర్పించా. నాపై అసత్య ఆరోపణలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని కేటీఆర్ కోర్టును కోరారు. సురేఖ అనుచిత వ్యాఖ్యలతో బాధపడ్డా.. ‘కేటీఆర్ నాకు 2007 నుంచి తెలుసు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశా. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో చాలా బాధపడ్డా. మా నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని శ్రవణ్‌కుమార్ తన వాంగ్మూలంలో కోరారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బుధవారం కోర్టుకు వచ్చారు. -
భార్యలు ధర్నా చేస్తే భర్తల్ని సస్పెండ్ చేస్తారా?
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ పోలిసుల్ని మనుషులుగా చూస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారని మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణలో స్పెషల్ పోలీసులు నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాలి. అనంతరం, నాలుగు రోజులు మాత్రమే సెలవు తీసుకుని వెసులు బాటు ఉంది. దీంతో తమ భర్తలు కుటుంబానికి, పిల్లలికి దూరంగా ఉండాల్సి వస్తుందంటూ నల్గొండలో పోలీస్ కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. వారి ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం దారుణం. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పోలీసులే నిరసన చేయటమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలి. భర్తలు ఇబ్బందులు పడ్తుంటే భార్యలు సమ్మె చేస్తే తప్పేంటి. పోలీసులే సమ్మె చేయటం దేశంలోనే తొలిసారి. 26రోజులు పొడవునా డ్యూటీ చేస్తే 4రోజులు సెలవు ఇస్తామనడం దారుణం. పాత పద్దతిలో 15రోజులు డ్యూటీ చేస్తే..4రోజులు సెలవులు ఇవ్వాలి. తెలంగాణ పోలీసుల్లో అశాంతి ఉంది. ఇది ప్రమాదకరం. తెలంగాణలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో వృద్ద దంపతులను హత్య చేస్తే కనీసం సీసీ టీవీలు పనిచేయటం లేదు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా సమీక్ష చేశారా?.కేటీఆర్, హరీష్ రావు మీద ఎన్ని కేసులు పెట్టారనే దానిపై మాత్రమే రేవంత్ సమీక్ష చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై పెట్రోల్ పోయాలన్న మైనంపల్లిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మీద కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకే రేవంత్ సమయం కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. -
కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం(అక్టోబర్22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పార్లమెంట్ సెంట్రల్‌హాల్ తరహాలో అసెంబ్లీ..‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. -
జీవన్ రెడ్డికి ఝలక్..
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్
ఆర్మూర్: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు ఆంధ్రప్రదే శ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సోమవా రం నోటీసులు జారీ చేసింది. సంస్థ యజ మాని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డితో పాటు రుణం తీసుకోవడానికి షూరిటీ ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్ అండ్ మలి్టప్లెక్స్ నిర్మాణం కోసం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద రూ.40 కోట్ల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.45.46 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆస్తులను షూరిటీగా పెట్టిన కాటిపల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో భూములు స్వా«దీనం చేసుకుంటామని వ్యవసాయ భూముల వద్ద ఫ్లకార్డులు పెట్టి, నోటీసులను అతికించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
మూసీపై సీఎంది పూటకోమాట: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మూ సీ నది ప్రక్షాళనపై ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూటకోమాట మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎ క్స్’ వేదికగా విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం రూ. 1.50 లక్షల కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జూలై 20న సీఎం ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అలాగే సెప్టెంబర్ 6న సీఎం విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ: దిరోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకాన మీ’ అనే విజన్ డాక్యుమెంట్లోనూ ఇదే విష యాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ దీనిపై విపక్షాలు ప్రశి్నస్తే తాను ఎన్నడూ రూ. 1.50 లక్షల కోట్ల ఖర్చవుతుందని చెప్పలేదంటూ సీఎం ఆవేశంతో ఊగిపోతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట ప్ర జాధనం లూటీ చేయాలనుకొనే ప్రభుత్వ కు ట్రను బట్టబయలు చేస్తామనిస్పష్టం చేశారు. ప్రవీణ్‌ను ఆహ్వానించి అరెస్టు చేస్తారా? గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి, తమ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను ఓవైపు ఆహా్వనించి మరోవైపు హౌస్ అరెస్ట్ చేయడాన్ని హరీశ్‌రావు ఖండించారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రకటన చేశారని.. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమని హరీశ్‌రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
జీఓ 29పై న్యాయ పోరాటం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల విషయంలో విద్యార్థుల కోరిక మేరకు బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేసిందని, జీఓ 29పై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. ‘మేము లేవనెత్తిన ఏ అంశాన్నీ సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు. జీఓ 29పై తీర్పు వచ్చేంత వరకు ఫలితాలు ఇవ్వవద్దని ఆదేశించడంతో పాటు వేగంగా విచారణ జరపాలని కోరింది. కోర్టు కేసు తేలేదాకా మేము విద్యార్థులకు అండగా ఉంటాం..’అని స్పష్టం చేశారు.సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్, కోవాలక్షి్మ, కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, గ్యాదరి కిశోర్, నరేందర్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణేతరులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. జీవో 29 విషయంలోనే కాదు,ం జీవో 48, గ్రూప్ 4 ఉద్యోగుల విషయంలో కూడా కోర్టులో పోరాడతాం.’అని తెలిపారు. రేవంత్‌రెడ్డికి సంజయ్ రహస్య మిత్రుడు ‘విదేశీ పర్యటనకు వెళ్లిన జర్నలిస్టులను అవమానించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీ విషయంలో మాకన్నా ఎక్కువ పోరాడాల్సిన బాధ్యత మీడియాదే. కళ్ల ముందే మూసీ పేరిట జరుగుతున్న కుంభకోణాన్ని ప్రశి్నస్తున్నాం. మూసీ పేరిట లూటీని మరుగు పరిచేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నడుమ రహస్య స్నేహం కొనసాగుతోంది. రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడు. అందుకే రేవంత్ ప్రభుత్వాన్ని మంత్రులు కూల్చేస్తారంటూ బండి సంజయ్ బాధపడుతున్నాడు. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు, కర్ణాటకలో వాలీ్మకి స్కామ్, అమృత్ కుంభకోణంలో సీఎం బావమరిదికి కాంట్రాక్టు తదితరాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదు..’అని కేటీఆర్ అన్నారు.