bullets
-
గన్నవరం విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద బుల్లెట్లు స్వాధీనం
-
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం
-
రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు వద్ద బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లైసెన్సుడ్ గన్ బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని చెప్పారు. ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికుడు సుబ్బరాజును కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్‌ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్‌లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది. -
నర్సాపూర్: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
సాక్షి, నర్సాపూర్: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. అస్లాం అనే వ్యక్తి దగ్గర నుంచి 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అస్లాంను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న అస్లాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అస్లాంను విచారిస్తున్నారు. చదవండి: దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్ -
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. షహరాన్‌పూర్‌లో డియోబంద్ ప్రాంతంలో వెళ్లున్న చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌పై దాడి జరిగింది. ఈ కాల్పుల్లో ఆజాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై భీమ్ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆజాద్ కారుపై దుండగులు కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ కారు సీట్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆజాద్ నడుము భాగంలో బుల్లెట్ గాయమైంది. రెండో బుల్లెట్ కారు వెనక భాగంలో డోర్‌కు తగలగా.. దానిని ఆయన తప్పించుకున్నారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఆజాద్ ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను భీమ్ సేన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. 'బహుజన్ మిషన్ ఉద్యమాన్ని నిలిపివేయాలనే భీమ్ ఆర్మీ చీఫ్, జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై దాడి చేశారు. ఇది ఓ పిరికి చర్య. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి' అని భీమ్ సేన డిమాండ్ చేసింది. తమ నాయకునికి భద్రత కల్పించాలని కోరింది. ఇదీ చదవండి: కేసీఆర్ భారీ కాన్వాయ్‌పై స్పందించిన శరద్ పవార్.. ఏమన్నాడంటే! -
విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్
సియోల్: 218 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బందితో టేకాఫ్‌కు సిద్ధమైన విమానంలో లైవ్ బుల్లెట్లు కన్పించడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన విమానయాన సంస్థ టేకాఫ్ క్యాన్సల్ చేసుకుని ఫ్లైట్‌ను తిరికి టెర్మినల్‌కు తీసుకెళ్లింది. ప్రయాణికులతో పాటు సిబ్బందిని కిందకు దింపేసింది. దక్షిణకొరియాలోని ఇంచెవాన్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడి వద్ద 9ఎంఎం బుల్లెట్లు రెండు దొరకడంతో సిబ్బంది భయాందోళన చెంది టేకాఫ్ రద్దు చేసింది. అయితే పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించినా బుల్లెట్లు విమానంలోకి ఎలా చేరాయో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, విమానయాన సంస్థ కూడా దీన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు. బుల్లెట్లు కన్పించిన కారణంగా ఉదయం 7:45కు టేకాఫ్ కావాల్సిన విమానం మూడు గంటలకుపైగా ఆలస్యంగా 11:00 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఎలాంటి ఉగ్రముప్పు లేదని అధికారులు నిర్ధరించుకున్న తర్వాతే విమానం తిరిగి బయలుదేరింది. దక్షిణ కొరియాలో కఠినమైన తుపాకీ చట్టాలు అమలులో ఉన్నాయి. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 75,300 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అయినా విమానంలోకి బుల్లెట్లు ఎలా తీసుకెళ్లారో అంతుచిక్కడం లేదు. చదవండి: చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం -
బుల్లెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది. చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్‌గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
చిన్నారి హ్యాండ్ బ్యాగ్‌లో తూటా కలకలం
తిరువొత్తియూరు(చెన్నై): ఇజ్రాయేల్ పర్యాటనకు వెళ్లి బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విశ్రాంత యూనియన్ అధికారి మనవరాలి హ్యాండ్ బ్యాగ్‌లో తుపాకీ తూటాలు ఉండడం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కృష్ణాదుబ్ (64) ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఇజ్రాయేల్ పర్యాటనకు వెళ్లి వచ్చారు. పలు ప్రాంతాలు చూసి దుబాయ్ మార్గంగా ఆదివారం ఉదయం చెన్నైకి వచ్చారు. అనంతరం బెంగళూరు వెళ్లడానికి చెన్నై స్వదీశీ విమానాశ్రయానికి వచ్చారు. భద్రతా అధికారులు తనిఖీ చేయగా అందులో తుపాకీ తూటా ఒకటి కనిపించింది. ఆ తూటాను స్వాధీనం చేసుకుని కృష్ణ దుబ్ ప్రయాణాన్ని రద్దు చేసి, అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆ తుపాకీ తూటా పెద్ద తుపాకీ 9 ఎంఎం రకంలో ఉపయోగించేదని తెలిసింది. వారిని హెచ్చరించి వదిలేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: Ashwini Dutt: మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే.. -
వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ఒక వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు దొరికాయి. విశాఖ నగరానికి చెందిన త్రిపురాణి సుజాత (70) బ్యాగ్‌లో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్‌ను స్కానర్‌లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు. ఆమెను ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ విచారించారు. తమ పాత ఇంట్లో వస్తువులు సర్దానని, ఈ క్రమంలో పాత బ్యాగ్‌లో కొన్ని దుస్తులు పెట్టుకుని హైదరాబాద్ బయలుదేరానని ఆమె తెలిపారు. గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనవై ఉంటాయని చెప్పారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయట పడినప్పుడే చూశానని తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
దిశ ఎన్కౌంటర్: గడ్డి ఉండటంతో బుల్లెట్లు దొరకలేదు!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితుల ఎన్కౌంటర్ సంఘటన స్థలంలో ఎన్ని బుల్లెట్లు లభ్యమయ్యాయి? వేరే వస్తువులు ఏం సేకరించారు? అనే కోణంలో దిశ కమిషన్ విచారణ సోమవారం కొనసాగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. వెంకన్నను సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ విచారించింది. దిశ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో బాగా గడ్డి ఉండటంతో బుల్లెట్లు దొరకలేదని.. వాటి 19 కాట్రిడ్జ్‌లు మాత్రం లభ్యమయ్యాయని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. బుల్లెట్ల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాలని విచారణ అధికారి (ఐఓ) సురేందర్‌రెడ్డికి సూచించామని.. ఆయన బాంబ్ స్క్వాడ్‌తో కలసి వెతికినా కూడా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఐఓకు చేతి గ్లవ్జ్లు, పంచ్ మెటీరియల్‌లను ఎప్పుడు ఇచ్చారని కమిషన్ ప్రశ్నించగా.. గుర్తులేదని సమాధానం చెప్పారు. ఘటనా స్థలం నుంచి కాట్రిడ్జ్‌లు కాకుండా ఇంకా ఏం సేకరించారని అడగగా.. 9ఎంఎం తుపాకీ, రక్తం అంటిన దూది, మట్టి లభించిందని తెలిపారు. ఎన్కౌంటర్లో పోలీసులు 9 ఎంఎం తుపాకీ, ఏకే–47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్)ను వినియోగించారని చెప్పారు. టెంట్ ఎక్కడిది?... అంతకుముందు ఉదయం 11 గంటలకు దిశ హత్యాచార నిందితులను సీన్–రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లే సమయంలో హాజరైన రెండో ప్రత్యక్ష సాక్షి (పంచ్ విట్నెస్) ఫరూక్నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్‌ను విచారించారు. కమిషన్: మీ కళ్లలో మట్టి పడింది కదా.. మరి ఆరీఫ్యే కాల్పులు జరిపాడని ఎలా చెప్పారు? సాక్షి: శబ్దం ముందు నుంచి వచ్చింది కాబట్టి అంచనా వేశా. కమిషన్: ఆరీఫ్ కాల్పులు జరపడం మీ కళ్లతో చూశారా? లేదా? సాక్షి: చూడలేదు. కాల్పులు జరిపాక పోలీసులతో కలసి పక్కనే టెంట్లో నిల్చున్నా. కమిషన్: ఆ సమయంలో అక్కడ టెంట్ లేదు కదా? సాక్షి: లేదు, సీఐ చెప్పినట్లుగా కొంచెం దూరంలో నిల్చున్నా. కమిషన్: టెంట్ ఎప్పుడొచ్చింది? సాక్షి: తెలియదు. కమిషన్: మీ కళ్లల్లో మట్టి పడింది కదా మరి అంబులెన్స్‌లో ఉన్న వైద్యులకు చూపించుకోలేదా? సాక్షి: లేదు, నాకు నేను కళ్లు తుడుచుకుంటే మంటపోయింది. కమిషన్: ఎన్కౌంటర్ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వచ్చారా? సాక్షి: వచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కమిషన్: సీపీ మృతదేహాలను చూశారా? సాక్షి: నాకు తెలియదు.. గుర్తులేదు. సాయంత్రం వరకూ సజ్జనార్ అక్కడే.. సోమవారం మధ్యాహ్నం సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. దీంతో ఉదయం 10:32 గం.కు ఆయన హైకోర్టు ఆవరణలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, రహుఫ్ విచారణే సోమవారం కూడా కొనసాగింది. భోజనానంతరం డాక్టర్ వెంకన్న విచారణ జరిగింది. సాయంత్రం 4:02 గంటల వరకూ సజ్జనార్ వేచి ఉన్నా, సమయం లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. గురు లేదా శుక్రవారం ఆయన్ను విచారించే అవకాశముంది. -
పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం ఉందా? తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. గతంలో అతను లైసెన్స్ తీసుకున్న ఆయుధానికి, బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో అతని బ్యాగేజ్ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్‌కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లోనే ఆయుధం సరెండర్... పరిటాల సిద్ధార్థ్ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అనంతపురం కలెక్టర్ నుంచి ఆయుధ లైసెన్స్ తీసుకొని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు. దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే తన ఆయుధాన్ని రామగిరి పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజ్లో లభించినవి 5.56 క్యాలిబర్ తూటాలు. ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్స్‌కు సంబంధించినవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ వద్ద 5.56 క్యాలిబర్‌కు చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరి స్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులను విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్‌ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం. ఆ కానిస్టేబుల్‌తో లింకులు ఉన్నాయా..? సిద్ధార్థ్ వద్ద లభించిన తూటాకు, ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్సాంలోని బాగ్డోగ్రా విమానా శ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్ వద్ద లభిం చిన తూటాలకు లింకులున్నాయా? అనే అను మానాలు కలుగుతున్నాయి. అస్సాంలో పని చేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు కానిస్టేబుల్ ఏప్రిల్ 17న బెంగళూరు వెళ్లేందుకు బాగ్డోగ్రా విమానాశ్రయానికి రాగా ఆయన బ్యాగేజ్లో 5.56 క్యాలిబర్‌కు చెందిన 100 పేల్చని తూటాలు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికితోడు ఆ కానిస్టేబుల్‌కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బాధితుల శరీరాల్లో తూటాల తొలగింపు
పంజగుట్ట (హైదరాబాద్): ఆదిలాబాద్‌లో శుక్రవారం చిన్నపిల్లల ఆట కాస్తా మాటా మాట పెరిగి కాల్పుల వరకు దారితీసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొతేషీన్ నడుము భాగంలో ఉన్న ఒక తూటా, సయ్యద్ జమీర్ శరీరంలో రెండు తూటాలను శనివారం నిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం న్యూరోసర్జన్ విభాగం, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల నుంచి వారు వైద్య సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఆదిలాబాద్ ఏఐఎంఐఎం శాఖ రద్దు ఏఐఏంఐఎం ఆదిలాబాద్ శాఖను రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆదిలాబాద్ ఘటన దురదృష్టకరమని, త్వరలోనే నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. -
అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ
సాక్షి, అమరావతి: రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్ షూలీ అండ్ సోమప్ప స్ప్రింగ్స్ (ఎస్ఎస్ఎస్ స్ప్రింగ్స్) సంస్థ రాష్ట్రంలో ఏర్పాటుచేయనుంది. రూ.580 కోట్లతో అనంతపురం జిల్లాలో ఈ యూనిట్‌ను ఆ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పో సందర్భంగా ఎస్ఎస్ఎస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటుచేయనున్న డిఫెన్స్, ఏరోస్పేస్ క్లస్టర్‌పై విదేశీ కంపెనీలు ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు. బోయింగ్, ఎయిర్‌బస్, బీఏఈ సిస్టమ్స్, జాకబ్స్, లాక్‌హీద్ మార్టిన్ వంటి సంస్థలు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ఆసక్తి వ్యక్తంచేసినట్లు మేకపాటి తెలిపారు. టాటా ఏరోస్పేస్ సంస్థ కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి కనబరిచిందని, త్వరలోనే సీఎం సమక్షంలో మరోమారు చర్చలు జరపనున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్కు ఎన్ఎస్డీసీ సహకారం: మరోవైపు.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి సహకారం అందించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. న్యూఢిల్లీలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ఎండీ, సీఈఓ డాక్టర్ మనీష్‌కుమార్ ఈ మేరకు హామీ ఇచ్చినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి అందించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంపై విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. రెనాల్ట్ ఇండియాతో పాటు, సీమెన్స్ వంటి సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. -
వారిని ఏ తుపాకీతో కాల్చారు?
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుల బృందం విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆ బృందం పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకుంది. తొలుత దిశను దహనం చేసిన ప్రాంతం నుంచి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వరకు పరిశీలించారు. ఇంతదూరం నిందితులు ఎలా వచ్చారు? అంతా ఒకే దగ్గర ఎలా పడిపోయా రు? నిందితుల శరీరంలో ఎలాంటి బుల్లెట్లు లేకపోవడంపై సభ్యులు దృష్టిసారించినట్లు సమాచారం. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్‌లను పోలీసులు ఏ రకం తుపాకీతో కాల్చారు? పిస్టల్స్‌తోనా.. పెద్ద గన్స్ వాడారా? పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు నిందితులు తొలుత ఫైర్ ఓపెన్ చేస్తే.. పోలీసులు నలుగురిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అన్న విషయాలపై ఎన్హెచ్ఆర్సీ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే మృతుల శరీరంలో బుల్లెట్లు లేకపోవడంపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ఎన్కౌంటర్లో శరీరంలో నుంచి తూటాలు దూసుకుపోవడం సాధారణ విషయమేనని తెలిపారు. ఎముకలు, పక్కటెముకలకు తగిలినపుడు తూటాల దిశ మారుతుందని, మెత్తని శరీరభాగాలకు తగిలినప్పుడు ఇలా బయటికి వస్తుంటాయని వివరించారు. ముగ్గుర్ని తూర్పు వైపు నుంచి.. ఎన్కౌంటర్లో నిందితులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులు ఏ రకానికి చెందినవి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వద్ద 9 ఎంఎం పిస్టల్, ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్) ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులను పోలీసులు ఎస్ఎల్ఆర్ తుపాకులతోనే కాల్చా రు. ఈ ఘటనలో చటాన్‌పల్లి బ్రిడ్జి నుంచి పారిపోతున్న నిందితులను లొంగిపొమ్మని హెచ్చరిస్తూ.. వెంబడించిన పోలీసులు రెండువైపులా చుట్టుముట్టారు. అయినా నిందితులు కాల్పులు ఆపకపోవడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఆరిఫ్, శివ, నవీన్ ముగ్గురిని పోలీసులు తూర్పు వైపు నుంచి కాల్చారు. అందుకే, వారి తలలు పడమర వైపు వాలి ఉన్నాయి. అంటే పోలీసుల తూటాలు వారికి ఎదురుగా వచ్చి తగిలినట్లు తెలుస్తోంది. ఇక చెన్నకేశవులుకు మాత్రం బుల్లెట్లు వెనక నుంచి వచ్చి తగిలినట్లుగా అతని శరీరం పడి ఉన్న తీరు చెబుతోంది. అందుకే, ఇతని ఒక్కడి తల మాత్రం తూర్పు వైపు వాలి ఉంది. గాయం ఆధారంగా చెప్పొచ్చు..! నిందితుల పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు ఏ తుపాకీతో కాల్చింది చెప్పగలరు. తూటా గాయం ఆధారంగా చేసుకుని, శరీరాన్ని తగిలిన చోట, వెలుపలికి వచ్చిన ప్రాంతంలో ఏమేరకు గాయం చేసింది అన్న విషయాలను ఆధారంగా చేసుకుంటారు. సాధారణంగా ఏ బుల్లెటయినా శరీరాన్ని తగి లిన చోట మామూలు వ్యాసార్థంలో.. వెలుపలికి వచ్చినపుడు అందుకు రెట్టింపు వ్యాసార్థం లో గాయాలను ఏర్పరుస్తాయి. అదే సమయం లో గాయంపై ఉన్న గన్‌పౌడర్ రెసిడ్యూ (జీపీఆర్) ఆధారంగా చెప్పగలరు. గాయం తగిలిన విధానాన్ని బట్టి, అది ఏ దిశ నుంచి దూసుకొచ్చింది.. ఎంత దూరం నుంచి వచ్చింది.. కచ్చితంగా చెప్పే పరిజ్ఞానం మన ఫోరెన్సిక్ నిపుణుల వద్ద ఉంది. వీరిని ఫోరెన్సిక్ బాలిస్టిక్ ప్రొఫెసర్లు అని పిలుస్తారు. ఈ ఎన్కౌంటర్లో వీరు ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఘటనాస్థలి వద్ద బందోబస్తు.. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు 59 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా దిశను దహనం చేసిన చోటు, హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే పోలీసులు ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా జాతీయ రహదారి వద్దనే కట్టడి చేస్తున్నారు. ‘ఎన్కౌంటర్’పై సీన్ రీకన్స్ట్రక్షన్ షాద్‌నగర్ : దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై ఆదివారం ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఘటనా స్థలాలను ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్కౌంటర్ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. హంతకులు పోలీసులపై ఏవిధంగా తిరగబడ్డారు.. ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు.. ఏవిధంగా పోలీసులు, హంతకులపై కాల్పులు జరిగాయన్న వాటిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. దీనిని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే, ఎన్హెచ్ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. -
ఎయిర్‌పోర్టులోకి తూటాలతో ప్రవేశం
రేణిగుంట(చిత్తూరు జిల్లా): అత్యంత భద్రతా వలయంతో కూడుకున్న ఎయిర్ పోర్టులోకి ఓ టీడీపీ నేత తుపాకీ తూటాలతో ప్రవేశించగా భద్రతా సిబ్బంది గుర్తించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా కమలాపురం సింగిల్ విండో అధ్యక్షుడు సాయినాథ్ శర్మ హైదరాబాద్ వెళ్లేందుకు శనివారం స్పైస్‌జెట్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. అతను మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతని బ్యాగును తనిఖీ చేయగా 20 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానాశ్రయం పోలీసులకు సమాచారం అందించారు. ఏర్పేడు సీఐ మురళీ నాయక్ అక్కడకు చేరుకుని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయినాథ్ అదుపులోకి తీసుకుని రాత్రి 8 గంటల వరకు విచారణ చేసినట్లు సమాచారం. అతను లైసెన్డŠస్ తుపాకీని కలిగి ఉన్నప్పటికీ మారణాయుధాలతో ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించడాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. తనను విడిచి పెట్టాలని, హైదరాబాద్‌లో పని ఉందని, తాను త్వరగా వెళ్లాలని పోలీసులతో సాయినాథ్ గొడవపడినట్లు సమాచారం. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట ఇదే తరహాలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి బంధువు తూటాలను తీసుకెళుతూ రేణిగుంట విమానాశ్రయంలోనే పట్టుబడిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ విజిటర్స్ పాసులను సైతం రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికుల ముసుగులో మారణాయుధాలతో విమానాశ్రయంలోకి తరచూ ప్రవేశిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
బుల్లెట్లతో దొరికిపోయిన టీడీపీ నేత!
సాక్షి, రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో శనివారం టీడీపీ నేత వద్ద 20 బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది. తనిఖీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు, సింగిల్ విండో చైర్మన్ సాయినాథ్ శర్మ వద్ద 20 తూటాలు లభించాయి. దీంతో ఆయనను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ శర్మ లైసెన్స్డ్ గన్ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని సమాచారం. అధికార బలంతో ఆయన గన్ను తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయినాథ్ శర్మ ఆయుధాన్ని అప్పగించారా లేదా అనేదానిపై కమలాపురం పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు... సాయినాథ్ శర్మ వెపన్ డిపాజిట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల (మే) మూడో తేదీతో గడువు ముగియనుంది. లైసెన్స్ దారుడు తన వద్ద ఉన్న ఆయుధాన్ని డిపాజిట్ చేస్తే పోలీసులు రసీదు ఇస్తారు. ఆ రసీదు ఆధారంగా ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా లైసెన్స్‌దారుడు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి పూర్తయ్యేవరకూ ఆయుధంతో పాటు తుటాలను కూడా కచ్చితంగా పోలీసుల వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆయుధం నెంబర్, లైసెన్స్‌లో ఉన్న నంబర్ అదేవిధంగా జారీ చేసిన బుల్లెట్లకు సంబంధించిన నంబర్లు పరిశీలించిన తర్వాతే డిపాజిట్‌ను స్వీకరిస్తారు. ఆయుధ లైసెన్స్ ఉన్నప్పటికీ, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బుల్లెట్లు కలిగి ఉండటం నేరమని స్థానిక డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. టీడీపీ నేత సాయినాథ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు. ఈ విషయంపై టీడీపీ నేత సాయినాథ్ స్పందిస్తూ.. పోలీసులు తనకు నోటీస్ ఇవ్వకున్నా...ఆర్మ్ హౌస్ వద్ద గన్ డిపాజిట్ చేశానని తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. -
అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం
ఉత్తర ప్రదేశ్ : మీరుట్లో బుధవారం అర్థరాత్రి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బుల్లెట్లు, హ్యాండ్ గ్రెనేడ్‌తో సంగీత్ ఇంటిపై దాడి చేశారు. సెక్యురిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. స్పాట్లో ఖాళీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ టీమ్ పరిశీలిస్తుందని మీరుట్ ఎస్ఎస్పీ తెలిపారు. హ్యాండ్ గ్రెనైడ్‌ను కూడా గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, సెక్యురిటీ గార్డు క్యాబిన్‌ను, ఎమ్మెల్యే ఇంటి మెయిన్ గేట్‌ను లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరో కనుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఎమ్మెల్యే సోమ్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే చెప్పారు. ఆ సమయంలో తనను గ్రెనైడ్ చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన బెదిరింపులేమీ రాలేదన్నారు. -
ఎమ్మెల్యేకు బెదిరింపు..లేఖతో పాటు రెండు తూటాలు !
గువాహటి(అస్సాం): రాష్ట్రంలో గల ఏకైక బీజేపీ ముస్లిం ఎమ్మెల్యేకు శనివారం బెదిరింపు లేఖ వచ్చింది. ‘15 రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చెయ్, లేదంటే చంపేస్తా’ అని ఎమ్మెల్యే అమీనుల్ హఖీ లస్కర్కి ఆగంతకుడు లేఖ రాశాడు. ఉదాసీనంగా వ్యవహరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దనీ, సూచనగా లేఖతో రెండు బుల్లెట్లను కూడా పంపాడు. ఎరుపు రంగు సిరాతో రాసిన ఈ లెటర్ మే 22న బెంగాల్‌లోని కరీంగంజ్ నుంచి పోస్టు కాగా జూన్ 9 న సదరు ఎమ్మెల్యేకు చేరింది. వివరాలు.. పొరుగు దేశాల నుంచి భారత్‌లోకి చొరబడి ఆశ్రయం పొందే మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం యోచించింది. ఆ దిశగా 2016లో భారత పౌరసత్వ చట్టానికి సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, దీని వల్ల పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోని హిందువులు అస్సాంలోకి పెద్ద ఎత్తున చొరబడే ప్రమాదం ఉందనీ ఇక్కడి హిందువులు ఆందోళన చెందుతున్నారు. పౌరసత్వ చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం బీజేపీ సభ్యుడివి కావడం వల్లే.. ఒక ముస్లిం అయివుండీ హిందూ నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నావనీ లెటర్లో ఆగంతకుడు ఎమ్మెల్యేపై మండిపడ్డాడు. ముస్లిం వ్యతిరేకిగా ఉండిపోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించాడు. బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే, సిలిచార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోస్టల్ వివరాల ఆధారంగా త్వరలోనే ఆగంతకున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగులో బుల్లెట్లు దొరికాయి. కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రానికి చెందిన రాంమోహన్‌రెడ్డి ట్రూజెట్ విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం వద్ద సీఐఎఫ్ఎస్ భద్రతా దళాలు అతని బ్యాగును తనిఖీ చేయగా.. అందులో 17 బుల్లెట్లు దొరికాయి. వెంటనే వారు రాంమోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నంది పైపుల కర్మాగారంలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాంమోహన్‌రెడ్డికి లైసెన్సు కలిగిన రివాల్వర్ ఉందని పోలీసులు వివరించారు. ప్రయాణానికి బయల్దేరేముందు బ్యాగ్‌ను చెక్ చేసుకోకుండా తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రాంమోహన్‌రెడ్డి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాంమోహన్‌రెడ్డి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి సమీప బంధువని సమాచారం. -
విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న ఖాజాపాషా(51) అనే వ్యక్తి నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు ఆది వారం ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన హెడ్ కాని స్టేబుల్ ఖాజాపాషా బదిలీపై వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అతడి బ్యాగులో అధికారులు తనిఖీలు చేపట్ట గా.. 9 ఎంఎంకు చెందిన రెండు బుల్లెట్లు, 0.32 ఎంఎంకు చెందిన 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. సంబంధిత పత్రాలు లేక పోవడంతో ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. కరీంనగర్లో విధులు నిర్వహించనప్పటి బుల్లెట్లు డిపా జిట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నా నని.. వాటిని బ్యాగులో మరిచిపోయి నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం. -
ప్లాస్టిక్ బుల్లెట్లు వచ్చాయి
శ్రీనగర్ : పిల్లెట్ గన్స్‌పై కొంతకాలంగా వివాదాలు వస్తున్న నేపథ్యంలో తాజా ప్రభుత్వం భద్రతా బలగాలకు ప్లాస్టిక్ బుల్లెట్లను అందించింది. పెద్దగా ప్రాణహాని లేకపోయినా.. స్టోన్ పెల్టర్స్‌ని వీటితో బాగా దెబ్బతీయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ బుల్లెట్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్టనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది. ఈ ప్లాస్టిక్ బుల్లెట్లను ఏకే సిరీస్, రైఫిల్స్‌లో ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్ బుల్లెట్లపై పరీక్షలు పూర్తి చేశాకే వీటిని భద్రతా బలగాలకు అప్పగించడం జరిగిందని.. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ భతన్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో అల్లర్లను అదుపు చేయడానికి, స్టోన్ పెల్టర్స్ను కట్టడి చేసేందుకు ఈ ప్లాస్టిక్ బుల్లెట్లు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. -
కశ్మీర్‌కు 21 వేల రౌండ్ల ప్లాస్టిక్ బుల్లెట్లు
మీరట్: కశ్మీర్లో అల్లరిమూకలను చెదరగొట్టే పెల్లెట్స్ వినియోగాన్ని తగ్గించేందుకు తక్కువ హానికరమైన ప్లాస్టిక్ బుల్లెట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఈ మేరకు 21 వేల రౌండ్లకు సరిపడా ఈ బుల్లెట్లను కశ్మీర్‌కు పంపించింది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన బుల్లెట్లు తక్కువ హానికరమైనవని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ భట్నాగర్ పేర్కొన్నారు. కశ్మీర్‌లోని అన్ని యూనిట్లకు ఈ ప్లాస్టిక్ బుల్లెట్లను సరఫరా చేశామన్నారు. సీఆర్పీఎఫ్ దళాల వద్ద ఉండే ఏకే 47, 56 రైఫిళ్లలో ఉపయోగించేందుకు వీలుగా వీటిని తయారు చేశారని వివరించారు. భద్రతా దళాలపైకి అల్లరిమూకలు రాళ్లు విసిరినప్పుడు మాత్రమే వీటిని వాడాలని ఆదేశించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెల్లెట్లపై విమర్శలు వస్తుండటంతో వీటి స్థానంలో తక్కువ హానికరమైన ప్లాస్టిక్ బుల్లెట్లను వాడాలని కేంద్రం నిర్ణయించింది. -
ఆ తూటాలు రెండవ ప్రపంచ యుద్ధం నాటివి..
జయపురం(ఒడిశా): జయపురంలోని జిల్లా పారిశ్రామిక కేంద్రం కార్యాలయం వెనుక ప్రాంతంలో ఇటీవల ఒక పాయికానా ట్యాంక్‌లో 700కు పైగా లభించిన తుపాకీ తూటాలు 1925 నాటివని అనుమానిస్తున్నారు. ట్యాంక్‌లో లభించిన తూటాలపై ఉన్న వివరాల ప్రకారం అవి జపాన్, ఇంగ్లండ్ దేశాలలో తయారైనవిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ తూటాలు 1935–1945 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో వినియోగించేవారని అభిప్రాయ పడుతున్నారు. దాదాపు నాలుగు అంగుళాల పొడవున ఉన్న ఆ తూటాలు ఆ కాలంలోనే వినియోగించేవారు. జయపురంలో లభించిన తూటాలు వాడనివి. ఆ తూటాలు ఇక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వాడిన తూటాలు నేడు జయపురంలో ఒక పాయికానా ట్యాంక్‌లో బయటపడడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్ స్వాధీనం
తిరుపతి: తిరుమల అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో బుల్లెట్లు, పిస్టల్ లభ్యమవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్ర పుణే రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో నలుగురు తిరుమలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో ఆ కారులో 14 రౌండ్ల బుల్లెట్లు, ఒక పిస్టల్‌ను విజిలెన్స్ అధికారులు గమనించారు. వాటిని స్వాధీనం చేసుకుని వాహనంలోని వారిని ప్రశ్నించగా తమ వారు కొండపైన ఉన్నారంటూ పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. వీరు వేటగాళ్లు.. లేక దోపిడి దొంగలన్న అయ్యింటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.