byke
-
టాటా చెప్పి వెళ్లొస్తా మమ్మీ అని.. చివరికి తండ్రి ముందే
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో ఘోరం జరిగింది. బీఎంటీసీ బస్సు మృత్యుశకటమై నాలుగు సంవత్సరాల బాలికను బలిగొంది. ఈ విషాద ఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఉత్తరహళ్లి నివాసి ప్రసన్న సిస్కో కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూర్వీరావ్ బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీకేజీ చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు సిద్దమైంది. తల్లికి టాటా చెప్పి, వెళ్లోస్తా అని తండ్రి ప్రసన్న బైక్ ఎక్కింది. ఉత్తరహళ్లి మెయిన్‌రోడ్డు పద్మావతి సిల్క్షోరూమ్ వద్ద వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్ బైక్‌ను ఢీకొంది. తండ్రీకుమార్తె కిందపడగా చిన్నారిపై బస్సు చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారస్వామి లేఔట్ ట్రాఫిక్ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే.. -
ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే
సీతంపేట/బూర్జ(శ్రీకాకుళం): సీతంపేట ఏజెన్సీలోని గొయిది గ్రామ సమీపంలో సోమవారం ఓ బైక్, ఆటో ఢీనండంతో జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తవల్లికి చెందిన పైడి వసంతకుమారి (17) మృతి చెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుత్తవల్లి పక్కగ్రామానికి చెందిన యువకుడు కూన వెంకటేష్, వసంతకుమారి బైక్‌పై సీతంపేట వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో గాయాలపాలవగా యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇద్దరినీ 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడు వెంకటేష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, సత్యనారాయణ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.నీలకంఠరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
ఇదేందిది.. ఒక్క బైక్‌పై ఏడుగురా?.. ఆఖరోడు అలా కూర్చున్నాడేంటి?
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ లేక్కలేనన్ని చర్యలు చేపడుతోంది. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. తాజగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ బైక్‌పై ఒకరో, ఇద్దరో కాదు ఏకంగా ఏగుగురు కుర్రాళ్లు రయ్యిమని దూసుకుపోతున్నారు. పైగా వారు తామేదో ఘనకార్యం చేశామన్నట్టు ఫీలవుతున్నారు. ఈ వీడియో యూపీలోని హాపూర్‌కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్‌పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. వారిలో చివరనున్న కుర్రాడు ముందునున్న కుర్రాడిపై ఎక్కి కూర్చున్నాడు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్‌పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఆ బైక్‌పై ఉన్నవారితో కించిత్తు ఆందోళన కూడా లేకపోవడం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాళ్లపై పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను @Akshara117 అనే ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇది కూడా చదవండి: పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా.. Video of 7 people riding a bike in #Hapur goes viral, raising questions on the working style of Hapur police. #Viralvideo pic.twitter.com/wfMfjkOkdF — Akshara (@Akshara117) August 9, 2023 -
సిగరెట్ కొనివ్వలేదని.. బాలుడిని కిరాతకంగా చంపాడు
హోసూరు(బెంగళూరు): అడిగిన వెంటనే సిగరెట్ కొనివ్వలేదని ఓ వ్యక్తి బాలుడి ప్రాణం తీసిన ఘటన క్రిష్ణగిరి తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు.. క్రిష్ణగిరి సమీపంలోని పాంచాలియూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్ (14) అదే ప్రాంతంలోని మద్యంషాపు వద్ద బుధవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడున్న ఓ మందుబాబు బాలున్ని పిలిచి దుకాణంలో సిగరెట్ కొనిపెట్టాలన్నాడు. అందుకు బాలుడు నిరాకరించాడు. ఆగ్రహంతో బాలుడిపై మందుబాబు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడు. విషయం తెలుసుకొన్న బాలుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. క్రిష్ణగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో శాంతి చర్చలు జరిపారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
Video: కారు బీభత్సం.. గాల్లో ఎగిరిపడ్డ విద్యార్థులు
బెంగళూరు: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. రోడ్డు ప్రమాదాలైతే మరీ దారుణం, మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినప్పటికీ అవతల వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల కూడా మనం ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. తాజాగా ఓ కారు నడుపతున్న వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ని ఢీ కొట్టింది. అనంతరం అటుగా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చోటు చే''కుంది. అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం. నిమిషానికి పైగా నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో కాలేజీ అమ్మాయిలు వాహనాలు వెళుతుండగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. కారు దూసుకువచ్చి బైక్‌ను ఢీ కొట్టి అనంతరం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇంత ప్రమాదం జరిగినా కారు నడుపుతున్న వ్యక్తి కనీసం వారికి ఏమైందని కూడా చూడకుండా వేగంగా కారు నడుపుకుంటా వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రాయచూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం, బైకర్ రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ರಾಯಚೂರಿನ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರಸ್ತೆಯಲ್ಲಿ ಕಾರು ಹಾಯ್ದ ರಭಸಕ್ಕೆ ಇಬ್ಬರು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು ಹಾರಿ ಬಿದ್ದ ದೃಶ್ಯ#raichur pic.twitter.com/9BrsoFevc3 — Prajavani (@prajavani) July 26, 2023 చదవండి పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..? -
ఊహించని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు.. చూడగానే టీచర్ ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు
చెన్నై: తల్లి, తండ్రి, గురువు అంటారు.. వీళ్లు ముగ్గురు జీవితంలో చాల కీలకమైన వాళ్లుగా మన పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు నీకు ఆలనాపాలనా చూస్తే , గురువులు నీకు విద్యా బుద్దులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి గురువుకి కొందరు విద్యార్థులు ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఊహించిన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి తమ గుర్తుగా ఓ చిరు కానుకను అందజేశారు. తిరువారూరు జిల్లా ముత్తుపేట సమీపంలోని అలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రామన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన 1988 జూన్ 27న ఈ స్కూల్లో చేరి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో రామన్ ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని మాలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఆయనకు రూ.లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందజేశారు. ఉపాధ్యాయుడు రామన్‌ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విద్యార్థులు తనపై చూపిన ప్రేమకు ఆ ఉపాధ్యాయుడికి ఆనందంతో కంట కన్నీళ్లు ఆగలేదు. చదవండి: బస్సు వైపు కోపంగా దూసుకొచ్చిన ఏనుగు.. ఇదే చివరి రోజు అనుకున్నారు.. కానీ ఫైనల్‌గా -
నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. అప్రమత్తమై పుట్‌పాత్ పైకి దూకడంతో..
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం ఎప్పటిలానే తన ఇంటి నుంచి వాకింగ్ కోసమని బైటకు వచ్చారు. అంతలో అటుగా వస్తున్న ఓ బైకర్ సీఎం సెక్యూరిటీ బలగాలను దాటుకుని నితీశ్ వైపుకు దూసుకొచ్చాడు. చూస్తుండగానే సీఎంకు అత్యంత సమీపానికి వచ్చేశాడు. దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే రోడ్డుపై నుంచి పుట్పాతవైపు దూకాల్సి వచ్చింది. సీఎం తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డులోని వాకింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం బైకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నరు. ప్రస్తుతం అధికారులు దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ‘నీట్’ని క్రాక్ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. -
ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా యూఎస్‌లో 63 శాతం, మరి భారత్‌లో ఎంతో తెలుసా?
ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు 2030 నాటికి భారత్‌లో 2.2 కోట్ల యూనిట్లకు చేరతాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలకు డిమాండ్, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యం ఇందుకు కారణమని వివరించింది. ‘2022లో దేశంలో జరిగిన మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా కేవలం 3 శాతమే. అదే యూఎస్‌లో అయితే ఈవీల వాటా ఏకంగా 63 శాతం, చైనాలో 56 శాతం ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఈవీలతో యాజమాన్య ఖర్చులు చాలా తక్కువ. అందుకే క్రమంగా కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. దిగుమతులను ఆసరాగా చేసుకుని చాలా బ్రాండ్లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. మార్కెట్ పరిపక్వత చెంది, నిబంధనలు కఠినతరం అయితే ఈ రంగం ఏకీకృతం (కన్సాలిడేట్) అవుతుంది’ అని తెలిపింది. ప్రయాణ ఖర్చు తక్కువ.. ‘కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ‘ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది’ అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్ పూర్తి అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్, పీఎల్ఐ పథకాలు కొనసాగాలి’ అని నివేదిక వివరించింది. -
హీరో నుంచి గ్రాండ్ లాంచ్.. తక్కువ ధరకే 110 సీసీ స్కూటర్!
గురుగ్రామ్: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ కొత్తగా జూమ్ పేరిట 110 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 68,599–76,699గా ఉంటుందని సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రణ్జీవ్జిత్ సింగ్ తెలిపారు. స్కూటర్ల మార్కెట్లో 110 సీసీ వాహనాల వాటా అత్యధికంగా 60 శాతం పైగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పోర్టీ స్కూటర్ల విభాగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణమైన హీరో జూమ్‌లో పూర్తి డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ ఐడీ, ఎస్ఎంఎస్ అప్డేట్స్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్, మొబైల్ చార్జర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో హీరో 2,82,169 స్కూటర్లను విక్రయించింది. చదవండి: పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి! -
మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయి దాటిన కేటీఎం
హైదరాబాద్: ప్రపంచంలో నెంబర్ 1 ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎం భారతదేశంలో మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని అధిగమించింది. పుణేలోని బజాజ్ చకన్ ప్లాంట్ నుండి 1 మిలియన్ కేటీఎం మోటార్ సైకిల్– కేటీఎం అడ్వెంచర్ 390 విడుదలైంది. రికార్డు బైక్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజాజ్ ఆటో ఎండీ, సీఈఓ రాజీవ్ బజాజ్, పియరర్ మొబిలిటీ ఏజీ (కేటీఎం మాతృ సంస్థ) సీఈఓ స్టీఫన్ పీరర్ (ఫొటోలో ఎడమ నుంచి కుడికి) తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రియన్ బ్రాండ్ కేటీఎం తన సబ్–400 సీసీ మోటార్‌సైకిళ్ల దేశీయ, ఎగుమతి యూనిట్ల తయారీకి బజాజ్ ఆటోతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కేటీఎం ఇండియా 2014లో 1,00,000వ మోటార్‌సైకిల్‌ను, 2020లో 5,00,000వ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కేవలం మరో మూడేళ్ల వ్యవధిలోనే కీలక మిలియన్ మైలురాయికి చేరుకోవడం గమనార్హం. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
వావ్ అనిపించే ఫీచర్లతో హీరో కొత్త బైక్.. స్టైలిష్ లుక్‌తో అదరగొడుతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే లుక్‌తో ఓ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్‌పల్స్ 200టీ మోడల్లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర ముంబై ఎక్స్‌షోరూంలో రూ.1.25 లక్షలు. కొత్తగా మార్కెటలోకి తీసుకువచ్చిన ఈ అప్డేటెడ్ వెర్షన్లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్‌పీ, 17.3 ఎన్ఎం టార్క్‌తో రాబోతోంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ యాడ్ చేశారు. ఈ బైక్‌లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకున్న వారు కంపెనీ వెబ్సైట్లోకి రూ. 2,500తో ఈ బైక్‌ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్‌తో ఫుల్ డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్, యూఎస్బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లను జోడించారు. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
బైక్ కొనుగోలుదారులకు షాక్.. డుకాటీ ధరలు పెరగనున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ వైపు కొత్త సంవత్సరం వస్తుండగా, మరో వైపు ఆటో మొబైల్ రంగ సంస్థలు క్రమంగా తమ వాహనాల ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ కూడా చేరింది. తమ అన్ని మోడళ్ల బైక్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఎంత శాతం సవరిస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. “ముడిసరుకు, ఉత్పత్తి, రవాణాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కొంతకాలంగా కంపెనీ ఈ భారాన్ని భరిస్తూ వస్తోంది. అయితే వీటిని అధిగమించేందుకు, ప్రస్తుతం ధరలను సవరించాలని నిర్ణయించుకున్నట్లు” అని డుకాటీ తెలిపింది. అలాగే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలయ్యే అన్ని బైక్‌లను భారత్‌కు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 1,500 వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్స్, మార్కెట్లను బట్టి పెంపు పరిమాణం ఉంటుందని సంస్థ వివరించింది. ‘ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదు’ అని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ధరల భారం ప్రభావం కస్టమర్లపై ఎక్కువగా పడకుండా వినూత్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందించడం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నట్లు గుప్తా వివరించారు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
భారత్‌లోకి అడుగుపెడుతున్న బీఎండబ్ల్యూ సూపర్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
దేశంలో బైక్‌ల వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రత్యేకంగా యువతలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు కూడా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏటా పలు రకాల మోడల్స్ బైకులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా యువతను ఆకట్టుకునేలా ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూ తన సూపర్ స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేయనుంది. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ ( BMW S 1000 RR) పేరుతో ఈ బైకును డిసెంబర్ 10న భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2023 BMW S 1000 RR ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. అయితే ఈ ఏడాది భారత్‌లోకి రానున్న ఈ మోడల్ బైక్ అప్డేటెడ్ ఇంజిన్‌తో పాటు మునుపటి కంటే లేటెస్ట్ టెక్నాలజీతో రాబోతోంది. ఈ బైక్.. మునుపటి వాటికంటే మెరుగ్గా! బీఎండబ్ల్యూ ఫ్లాగ్షిప్ బైక్‌ల కంటే కొన్ని ముఖ్యమైన మార్పులతో ఈ బైక్ మార్కెట్లోకి రాబోతోంది. అత్యంత సమగ్రంగా సవరించిన ఛాసెస్ను కలిగి ఉండటం ఈ సూపర్ బైక్ ప్రాధాన్యత. లేటెస్ట్ ఇంజిన్, సస్పెన్షన్ కంట్రెల్, ఛాసిస్, ఏరోడైనమిక్స్, డిజైన్ వంటి అప్డేట్లతో వస్తోంది. ఇది 999 సీసీ ఇన్లైన్ఫోర్ మోటార్ శక్తితో నడుస్తుంది. ఆరు గేర్లుండే ఈ బైక్ 13,750 ఆర్పీఎంతో మాగ్జిమమ్ పవర్ 206.5 బీహెచ్పీకి చేరుతుంది. ఈ బైక్ స్లయిడ్ కంట్రోల్‌ని కలిగి ఉంది. ఇందులో కొత్త డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC)తో వస్తుంది. దీని ఇంజిన్ స్పీడ్ పరిధి మునుపటి కంటే ఇప్పుడు విస్తృతంగా ఉంది. ఇది మోటార్‌ను 14,600 rpm వరకు పుష్ చేయడంలో సహాయపడుతుంది. ఈ బైక్ వీల్‌బేస్ 1,441 mm నుంచి 1,457 mm వరకు పెరిగింది. ఇందులో కొత్త స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈ బైక్‌ను కంపెనీ డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా సేల్స్ జరపనున్నారు. దీని ధర ₹20-25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండచ్చని అంచనా. బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, స్టైల్ ప్యాషన్ రెడ్ నాన్-మెటాలిక్, లైట్ వైట్ నాన్-మెటాలిక్ రంగుల్లో ఈ స్పోర్ట్స్ బైక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్? -
100 పైగా షోరూమ్‌ల ఏర్పాటులో ఈవీయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ ఈవీయం 2023 ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 100 షోరూమ్‌లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 1,000 పైచిలుకు ఈవీ స్కూటర్లను విక్రయించినట్లు ఎలీజియమ్ ఆటోమోటివ్స్ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 11 డీలర్‌షిప్‌లు ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 8 రాష్ట్రాల్లోని 25 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రియాజ్ వివరించారు. కొత్త షోరూమ్‌లలో ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, ఫైనాన్సింగ్ సేవలు, యాక్సెసరీలు మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థ మెటా4 గ్రూప్‌లో భాగమైన ఎలీజియం ఆటోమోటివ్స్ .. ఈవీయం బ్రాండ్ కింద మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు తయారు చేస్తోంది. చదవండి: ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాట్ ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో.. -
బైక్ చోరీ ఫిర్యాదు.. బాధితుడికి షాకిచ్చిన కానిస్టేబుల్!
తిరువొత్తియూరు: చోరీకి గురైన బైక్‌ను పోలీసు నడుపుతుండడంతో బాధితుడు ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలో వేట్టై గుడికి చెందిన వెట్రివేల్ (40) వ్యవసాయ కార్మికుడు. ఇతను తంజావూరు సర్కిల్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను 2018లో ఓ ఎరుపు రంగు ద్విచక్ర వాహనాన్ని కొన్నానని, అది 2021 డిసెంబర్ 10వ తేదీ రాత్రి చోరీకి గురైందని పేర్కొన్నాడు. అయితే ఇటీవల తాను హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నానంటూ రూ.100 జరిమానాకు సంబంధించిన చలానా తన మొబైల్‌కు మెసేజ్ రూపంలో వచ్చిందన్నారు. బైక్ చోరీకి గురై.. ఫిర్యాదు చేసినా తనకు చలానా రావడంపై విచారణ జరపగా.. తన బైక్‌ను నాగై జిల్లాలో ఉన్న ఒక పోలీసు స్టేషన్లో ఓ కానిస్టేబుల్ నడుపుతున్నట్లు తెలిందన్నారు. ఇప్పటికైనా తన బైక్‌ను తనకు ఇప్పించి.. చోరీపై నిందితుడైన కానిస్టేబుల్‌ను ప్రశ్నించాలని కోరారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డీజీపీ కయల్ విళి ఆదేశించారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూలీ.. 10,000 రూపాయి నాణేలతో.. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి హిందుస్తాన్ మోటార్స్
సి.కె.బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్తాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023–24లో ఈవీలు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరప్‌నకు చెందిన ఓ సంస్థతో కలిసి సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉత్తరపర ప్లాంటును ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత రూ.600 కోట్లు వెచ్చిస్తాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్‌కు ఆరు నెలల సమయం పట్టనుందని హిందుస్తాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది. చదవండి: బంగారమా? ఇల్లా? పెట్టుబడికి ఏది బెటర్? ఈ విషయాలు తెలుసుకోండి! -
టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా!
యువతను తన వైపుకు తిప్పుకొని రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టిన టీవీఎస్ అపాచీ (Tvs Apache) మోడల్ బైకులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ కొత్తగా రెండు అపాచీ మోడళ్లను లాంచ్ చేసింది. ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160( 2022 TVS Apache RTR 160), రెండోది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోడల్. RTR 160 ధర రూ 1.18 లక్షలు కాగా RTR 180 ధర 1.31 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తగా రాబోతున్న ఈ రెండు మోటార్‌సైకిళ్లలో రిఫ్రెష్డ్ డిజైన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect) చేయబడిన టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక రెయిన్, అర్బన్, స్పోర్ట్ పేరుతో మూడు విభిన్న డైవింగ్ మోడ్లు ప్రత్యేక ఫీచర్‌గా చెప్పాలి. ఫీచర్లు ఇవే: 2022 TVS Apache RTR 160.. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, 16.04 PS పవర్, 13.85 Nm టార్క్ డెలివర్ చేస్తుంది. 2022 TVS Apache RTR 180.. 5-స్పీడ్ గేర్‌బాక్స్, 17PS పవర్, 15 Nm టార్క్‌తో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. వీటిలో..ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్‌లతో పాటు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్ కూడా ఉంది. అధునాతన బ్లూటూత్‌తో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 సిరీస్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుండగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్‌లో గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, టీ-గ్రే వంటి ఐదు వేరియంట్ కలర్స్‌లో లభ్యమవుతుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
షాకింగ్ వీడియో: ఒకే బైక్‌పై ఏడుగురు ప్రయాణం
ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్లేందుకే అనుమతి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ముగ్గురు వెళ్తారు. బైక్ ముగ్గురు కూర్చుంటేనే కష్టంగా ఉంటుంది.. ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తే..! ఆలోచిస్తే.. అసాధ్యం అనుంకుటున్నారు కదా? అయితే ఒకే బైక్‌పై ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు(నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి) వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాటల్లేవ్.. అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన బైక్‌పై ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకోగా.. వెనకాల ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు. కుటుంబం మొత్తాన్ని ఒకే బైక్‌పై తీసుకెళ్లి ఔరా అనిపించాడు ఆ వ్యక్తి. అయితే, బైక్‌పై ఉన్న ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోవటం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.2 మిలయన్ల మంది చూశారు. ఈ విధంగా ప్రయాణించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందేమోనని మద్దతు తెలుపుతున్నారు. ఏడుగురిని ఒకే బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తిని అరెస్ట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. Speechless 😶 pic.twitter.com/O86UZTn4at — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022 ఇదీ చదవండి: Ajith: బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు.. -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇంటింటికి తప్పనిసరిగా మారింది
సాక్షి,హైదరాబాద్: వాహన విస్ఫోటనం గ్రేటర్ హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తోంది. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ఏకంగా 71 లక్షలు దాటింది. ఇందులో ప్రజా రవాణా వాహనాలు పట్టుమని పది లక్షలు కూడా లేవు. సింహభాగం వ్యక్తిగత వాహనాలే. రోజురోజుకూ వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు స్తంభించిపోతున్నాయి. ఇంచుమించు రెండేళ్ల పాటు కోవిడ్ కాలంలో స్తంభించిన ప్రజారవాణా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ రెండేళ్లలోనే 5 లక్షలకుపైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. రహదారులను విస్తరించి, ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు కోవిడ్ కంటే ముందు నుంచే ప్రజా రవాణా ప్రాధాన్యం తగ్గింది. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. ఇంటింటికీ సొంత బండి... సొంత బండి ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మారింది. రోజురోజుకూ నగరం విస్తరిస్తోంది. ఔటర్‌ను దాటి పెరిగిపోతోంది. ఇందుకు తగినట్లుగా ప్రజా రవాణా పెరగడం లేదు. దీంతో నగరానికి దూరంగా ఉండి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించాల్సినవాళ్లు సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగర శివార్ల నుంచి, కాలనీల నుంచి ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసే రవాణా సదుపాయాలు లేకపోవడంతో సొంత ఇల్లైనా, అద్దె ఇంట్లో ఉంటున్నా సరే బండి తప్పనిసరిగా మారింది. మొబైల్ ఫోన్ ఉన్నట్లే బైక్.. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక మొబైల్ ఫోన్ అనివార్యమైన అవసరంగా మారింది. ఇంచుమించు యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయసుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. ప్రజా రవాణా పెరగాలి వాహన విస్ఫోటనాన్ని అరికట్టేందుకు ప్రజా రవాణా విస్తరణ ఒకటే పరిష్కారం. వ్యక్తిగత వాహనాలను నియంత్రించలేకపోతే రానున్న కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది. – పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు! -
దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ చౌరస్తా నుంచి ఆదివారం అర్ధరాత్రి హెల్మెట్ ధరించకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తూ మద్యం సేవిస్తూ దూసుకుపోతున్న ఓ బైక్‌ను అదే రోడ్డు వెంట వెళ్తున్న ఓ వాహనదారుడు ఫొటోలు తీసి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశాడు. అంతే కాకుండా ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా చేతుల్లో బీరు సీసాలతో రోడ్డువెంట వెళ్లేవారిని న్యూసెన్స్ చేస్తూ పోతున్నారంటూ ఆ వాహనదారుడు ట్వీట్ చేశాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై ఈ ఘటన ఎక్కడ జరిగిందంటూ ఆరా తీశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఎల్వీ ప్రసాద్ విగ్రహం పక్క నుంచి అంటూ సమాచారం రావడంతో హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సదరు వాహనాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. స్కూటర్ నెంబర్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బైక్ నెంబర్ ఆధారంగా చిరునామా పట్టుకున్నట్లుగా తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించే దిశలో పోలీసులు యత్నిస్తున్నారు. పట్టాపగ్గాలు లేకుండా రోడ్డుపై మద్యం సేవిస్తున్న యువకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. Beverage na kodukulu. Triple ride with beers. Scooty meeda kanipinche ammailni kelikkuntaa potnaru ❌ @hydcitypolice pic.twitter.com/3Tw98tI56c — Joyyyyy (@JacksonBr0) May 1, 2022 చదవండి: వనస్థలిపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్ -
18 రోజులు.. 12వేల కిలోమీటర్ల బైక్ ప్రయాణం
మందస: కొండలు దాటారు.. కోనలు దాటారు.. లోయలు చూశారు.. శిఖరాల పక్క నుంచి ప్రయాణించారు... ‘ఏడుగురు అక్కచెల్లెళ్లు’ను పలకరించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. ఒకటా రెండా.. పన్నెండు రాష్ట్రాలు.. పన్నెండు వేల కిలోమీటర్ల దూరా న్ని 18 రోజుల్లో పూర్తి చేశారు. సైని కులు తలపెట్టిన బృహత్తర సాహస యాత్ర ఇది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కోవిడ్, వైద్యంపై అవగాహన కల్పించడానికి 12 మంది సోల్జర్ల బృందం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించా రు. ఈ బృందంలో ఓ సిక్కోలు సైనికుడు కూడా ఉన్నాడు. మందస గ్రామానికి చెందిన డుంకురు సతీష్‌కుమార్ ఈ సాహస బృందంలో ఓ సభ్యుడు. ఈయన నాయక్ క్యాడర్లో పనిచేస్తున్నారు. సెవెన్ సిస్టర్స్‌గా ముద్దుగా పిలిచే ఈశాన్య రా ష్ట్రాలో బైక్ రైడింగ్ అంత ఈజీ కాదు. సులభమైన పనులు చేస్తే వారు సైనికులు ఎందుకవుతారు. అందుకే ఈ 12 మంది బృందం ఈ రాష్ట్రాల మీదుగా బైక్‌లతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ అడావ్ ఆధ్వర్యంలో నలుగురు డాక్టర్లు, నలుగురు ఆర్మీ అధికారులు, నాయక్ కేడర్ కలిగిన ఇద్దరు సైనికులు, హవల్దార్ కేడరు ఇద్దరు మొత్తం 12 మందితో కూడిన బృందం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి ఈ నెల 9న బయలుదేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాంఛల్ రాష్ట్రాల మీదుగా 18 రోజుల పాటు 12వేల కిలో మీటర్లు మోటారు వాహనాలతో సాహస యాత్ర సాగింది. దారిలో 78 ఆర్మీ మెడి కల్ యూనిట్లలో ఈ బృందం అవగాహన కల్పించింది. యాత్ర ఈ నెల 27తో ముగియగా, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ బృందాన్ని అభినందించారు. సాహస యా త్రలో పాల్గొ న్న సతీష్‌కుమార్‌కు మందస ప్రజలు అభినందనలు తెలిపారు. గర్వంగా ఉంది 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆర్మీ సాహస యాత్ర చేయడానికి నిర్ణయించింది. 12 మందితో కూడిన బృందం, 12 రాష్ట్రాల మీదు గా 18వేల కిలోమీటర్లు యాత్ర చేయడానికి సంకల్పించాం. వివిధ రాష్ట్రాల్లోని వాతావరణాలను తట్టుకున్నాం. నిజంగా సాహసంగానే యాత్ర జరిగింది. పెద్ద లక్ష్యం, రోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం. సమస్యలు ఎన్ని వచ్చినా అధిగమించాం. చైనా బోర్డరును దాటాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గర్వకారణంగా ఉంది. ఈ యాత్రతో మందసకు పేరు రావడం ఆనందంగా ఉంది. – డుంకురు సతీష్‌కుమార్, సాహస బృందం సభ్యుడు, మందస -
బైక్‌కు వేసిన తెల్ల రంగు.. స్నాచర్లను పట్టించింది
సాక్షి,బంజారాహిల్స్: మత్తు పదార్థాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులను బైక్ ఆధారంగా పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడి బస్తీలో నివసించే ఖాజా పాషా ఇంటర్ చదువుతూ తన స్నేహితులు సబిల్, సొహైల్‌తో కలిసి గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి మద్యం తాగుతూ బైక్‌పై దూసుకెళ్తూ స్థానికంగా హల్చల్ చేసేవాడు. ప్రత్యేకతను చాటుకోవాలని తన బైక్ వీల్ రిమ్ముకు తెల్ల రంగు వేసి బండిపై తిరిగేవాడు. మూడు రోజుల క్రితం ఇదే బైక్‌పై తన స్నేహితులను కూర్చోబెట్టుకొని వరుసగా ఆరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీలో బైక్ వీల్ తెల్ల రంగులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్ల క్రైం విభాగానికి ఈ సీసీ ఫుటేజీలను పంపించారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు బైక్ ఫొటోల ఆధారంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లా పలువురిని వాకబు చేస్తుండగా స్థానికులు ఖాజాపాషా ఇంటిని చూపించారు. పోలీసులు వెళ్లేసరికి ఇంటి ముందు తెల్ల రంగు వీల్‌తో స్నాచర్లు ఉపయోగించిన బైక్ పార్కింగ్ చేసి ఉంది. రాత్రిపూట గంజాయి మత్తులో చేతుల్లో కత్తులు, బ్లేడ్లు పట్టుకొని స్వైర విహారం చేసే ఈ ముగ్గురూ స్నాచర్లని తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. బైక్‌కు వేసిన తెల్ల రంగే స్నాచర్లను పట్టించిందని పోలీసులు తెలిపారు. -
ఆడుకుంటున్న చిన్నారిని.. నాన్నను చూపిస్తామని తీసుకెళ్లి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను.. గుర్తుతెలియని వ్యక్తులు మీ నాన్నను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత పాపను బైక్‌మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు. స్థానికురాలు ఒకరు బాలికను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌మీద తీసుకెళ్లినట్లు గమనించింది. ఆ తర్వాత వెంటనే.. చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!! -
బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి హాజరై.. తెల్లవారుజామున పెరుగు తెస్తామని ఇద్దరు మైనర్లు మోటర్‌సైకిల్‌పై వెళ్లగా ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఆడెపు ప్రసాద్ గృహాప్రవేశానికి అతని దగ్గరి బంధువుల అబ్బాయి ఆడెపు రోహిత్(16) హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున గృహాప్రవేశం ముగియగా సత్యనారాయణ వ్రతం కోసం పెరుగు అవసరం పడింది. అక్కడే ఉన్న ఆడెపు రోహిత్, మరో బంధువుల అబ్బాయి మనోజ్(14)తో కలిసి మోటార్‌సైకిల్‌పై తెల్లవారుజామున 5 గంటలకు పైడిమడుగు శివారులోని పెరుగు విక్రయ కేంద్రం వద్దకు వెళ్దామని బైక్‌పై బయలుదేరారు. ఊరు దాటి కొంత దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్‌సైకిల్ నడుపుతున్న రోహిత్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు. మనోజ్‌కు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దొంగచాటుగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి కారణమైనట్లుగా భావిస్తున్నారు. మనోజ్‌ది మహారాష్ట్రలోని భీవండి కాగా శుభకార్యం కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. రోహిత్ తల్లి వందన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ కల్లూర్ మాడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రోహిత్ తండ్రి సత్యనారాయణ ఉపాధి కోసం గల్ప్ దేశాల్లో ఉంటున్నాడు. చదవండి: కంప్యూటర్ ఆపరేటర్‌కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి