camp office
-
డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట చిరుద్యోగుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్‌లలో పనిచేసే చిరుద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట మరో విడత ఆందోళన చేపట్టారు. 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూటమి ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తుండటంతో చిరుద్యోగులు ఇప్పటికే సెపె్టంబర్ 13, అక్టోబర్ 6 తేదీల్లో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగుల ఆందోళన విషయాన్ని కార్యాలయ అధికారులు చిరుద్యోగుల సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులెవరినీ తొలగించకుండా శాఖాపరంగా చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా హామీ ఇచ్చినట్టు ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ లే»ొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల తొలగించిన ఉద్యోగుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని.. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారని ఆయన తెలిపారు. -
బాబు దుబారా భరించలేనంత..!
సాక్షి, అమరావతి: ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. గతంలో 2014 – 19 మధ్య సీఎంగా ఉండగా ఆయన విలాసాలు, హంగు, ఆర్భాటం, సొంత ఇళ్లు, క్యాంప్ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వంద కోట్లకు పైనే. ఆ ఐదేళ్లలో హైదరాబాద్‌లో రెండేసి బంగ్లాలు, రెండేసి క్యాంపు ఆఫీస్‌లు, విజయవాడలో రెండేసి క్యాంపు ఆఫీస్‌ల పేరుతో మరమ్మతులకు, సెక్యూరిటీ, సీసీ కెమేరాలు, పోలీస్ బరాక్‌లకు కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు.హైదరాబాద్‌లో ఏడు నక్షత్రాల పార్క్ హయత్ హోటల్లో ఉంటూ ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ, స్టార్ హోటల్లో ఉంటూ కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం గమనార్హం. ఇవన్నీ టీడీపీ సోషల్ మీడియాకు మచ్చుకు కూడా కనిపించడంలేదు. పైగా వైఎస్ జగన్ భద్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ దుష్ప్రచారానికి దిగారు.చంద్రబాబు 2014లో సీఎం అయిన తర్వాత హైదరాబాద్ మదీనాగూడలోని తన బంగ్లాను క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 65లోని తన ఇంటిని కూడా సీఎం క్యాంపు ఆఫీస్‌గా ప్రకటించుకున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఇక విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌ను కూడా క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకున్నారు. ఆ తరువాత లింగమనేని గెస్ట్ హౌస్‌ను సీఎం క్యాంపు, నివాస భవనంగా చేసుకున్నారు. వీటన్నింటికీ మరమ్మత్తులు చేయడంతో పాటు భద్రత ఏర్పాట్లు, సీసీ కెమేరాల ఏర్పాటు, పోలీస్ బరాక్ల నిర్మాణం, 24 గంటలు నిఘా ఏర్పాట్లు, విద్యుత్తు పనులు, విజయవాడ క్యాంపు ఆఫీస్‌లో కంట్రోల్ ఎక్విప్మెంట్, రహదారుల నిర్మాణాలకు చంద్రబాబు ఆ ఐదేళ్లలో ఏకంగా 126.76 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ సమయంలో ఇష్టానుసారం క్యాంపు ఆఫీస్‌లకు కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని అప్పట్లోనే అధికార వర్గాలు తప్పుపట్టాయి. అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్ హౌస్‌ను ముఖ్యమంత్రి నివాసంగా మార్చుకుని అక్కడ రోడ్ల నిర్మాణం, భద్రత కోసం ఏకంగా రూ.10 కోట్లు వ్యయం చేశారు.కార్యాలయాల పేరుతో సెక్యూరిటీ తదితరాలకు 2014–19 మధ్య చంద్రబాబు చేసిన కొన్ని ఖర్చులు ఇలా.. ఇదంతా జీవోల ద్వారా చేసిన ఖర్చే..» హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయం (ఎల్ బ్లాక్)రూ.14.63 కోట్లు»సీఎం కోసంహైదరాబాద్ సెక్రటేరియట్లో హెచ్ బ్లాక్‌కు రూ.6.29 కోట్లు»హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ కోసం రూ.9.47 కోట్లు»సీఎం కార్యాలయం ఫర్నిచర్‌కు రూ.10.00 కోట్లు»మదీనాగూడ ఫామ్ హౌస్, జూబ్లిహిల్స్ అద్దె ఇంటికి రూ.4.37 కోట్లు»విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్, కలెక్టరేట్లో సీఎం క్యాంపు ఆఫీసులకు రూ.42.00 కోట్లు»లింగమనేని గెస్ట్ హౌస్‌కు రూ.10.00 కోట్లు»హైదరాబాద్‌లో పార్క్ హయత్ హోటల్లో బసకురూ.30.00 కోట్లు -
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం.. వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు
గుంటూరు, సాక్షి: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు.పార్టీ సూచనల మేరకు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిని నియమించారు. అలాగే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు.వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ సమావేశం జరిగింది. తొలుత వైఎస్సార్సీపీ జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. రేపు(గురువారం)కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆర్నెలలపాటు సమయం ఇవ్వాలని తొలుత జగన్ భావించారు. ఆ తర్వాతే చంద్రబాబు సర్కార్‌ను నిలదీయాలని భావించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో అరాచకం మొదలైంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా లోకేష్ ప్రొత్సహిస్తూ వస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. వైఎస్సార్సీపీపై ప్రతీకార దాడులు, అంతటా నేతల అధికార జులుం, వివిధ విభాగాలు.. వాటి అధిపతులు ఆఖరికి క్షేత్ర స్థాయి ఉద్యోగులపైనా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వంపై తక్షణ పోరును ప్రారంభించారు జగన్. మరోపక్క.. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులపాటు(ఇవాళ, రేపు) పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతుండడం విశేషం. -
సిద్ధిపేటలో హై టెన్షన్
-
హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ లో BRS ఫ్లెక్సీ తొలగించిన కాంగ్రెస్
-
తాడేపల్లి : కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబు ఆటవిక పాలనను ఎండగడుతూ జగన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
పులివెందులలో ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
జగన్ రాకతో పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో పోటెత్తిన జనం
-
గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీస్ కాల్చివేత
వేముల: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీసును శనివారం రాత్రి కాల్చివేశారు. టీడీపీ వారు తన ఆఫీసును కాల్చివేసినట్లు కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తాము ఇక్కడ 4 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఏప్రిల్‌లో చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆపివేయాలని, తమకు అప్పజెప్పాలని ఒత్తిడి తెచ్చారaన్నారు.రెండు కిలోమీటర్ల పనులు ఇస్తామని చెప్పినప్పటికీ, నాలుగు కిలోమీటర్లూ తామే చేసుకుంటామని పట్టుబట్టారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా క్యాంప్ ఆఫీసును కాల్చివేశారని తెలిపారు. సుమారు రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందుల క్యాంపు ఆఫీస్ కు తరలొచ్చిన జనసంద్రం..
-
నేడు వైఎస్ జగన్ ను కలిసిన కీలక నేతలు
-
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌తో పవన్.. క్యాంపు ఆఫీసు పరిశీలన
సాక్షి, విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు క్యాంపు కార్యాలయం సిద్ధమైంది. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరుకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆఫీసు నిర్మాణం చేపట్టారు. పవన్ మెచ్చే విధంగా ఆయనకు నచ్చిన రంగుల్లో క్యాంపు ఆఫీస్ నిర్మాణం జరిగింది. ఇదంతా చూసిన తర్వాతే ఆఫీసుకు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం.కాగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి మంగళవారం తన ఆఫీసును పవన్ పరిశీలించారు. ఆఫీసు నిర్మాణంలో భాగంగా భవనంలో పైన అంతస్తులో నివాసం, కింద కార్యాలయం ఏర్పాటు చేశారు. అదే భవనంలో సమావేశం మందిరం కూడా అందుబాటులో ఉండటంతో ప్లాన్‌కు పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం. తన ఆలోచనలు, అభిరుచులకు తగిన విధంగా క్యాంపు ఆఫీసులో పవన్ మార్పులు సూచించడంతో అందుకు తగినే విధంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక, గతంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే ఆఫీసును వినియోగించుకున్నారు. మరోవైపు.. కాసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి పవన్ బయలుదేరారు. అలాగే, ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచిన విషయం తెలిసిందే. వై ప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా పవన్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇక.. రేపు పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, గుంటూరు: అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నిచర్‌పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.‘‘ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంప్ కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది.’’ అని ఆయన వివరించారు.‘‘వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైఎస్ జగన్‌ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి.’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. -
టీడీపీ-జనసేన హనీమూన్ నడుస్తోంది.. కొంతటైమిచ్చి పోరాడుదాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎవరెన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్.. ‘‘40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు వుంది. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దాం.. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్‌లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదలచేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకు వచ్చాం. ఇవన్నీ మనం చేసి, చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదు.2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మనపట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడపగడపకూ మనంచేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి.అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కాని మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబుగారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం.మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా.. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా… రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టంచేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అవమానిస్తున్నారు. అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీకూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి.ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికీ డోలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. చంద్రబాబు రెండో పాపంకూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడం, ఎన్టీయేలో కీలకంగా ఉన్న పరిస్ధితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోతే… రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు.మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన, మత్స్యకారభరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. ఇవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి.ఈ పాపాలన్నీ పండేదాకా.. మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను. కష్టాలు రావడం సర్వ సహజం. ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం.అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో… మనుషులు మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టంచేస్తున్నపరిస్థితుల్లో,అవమానిస్తున్న సమయంలో… ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే.హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉంది. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి.జగన్ రాష్ట్ర పర్యటనత్వరలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఆ విషయాన్ని ధృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలుస్తోంది. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్‌రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్‌ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు. -
మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్సార్ సీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్ వైభవానికి ఇదే గట్టి పునాది అని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఫలితాలపై ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ⇒ మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ⇒ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకూ మంచి చేశాం. పార్టీ కచ్చితంగా పునర్ వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది. ⇒ రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు, పోలింగ్ బూత్‌ల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరుపై కచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారు. ఎన్నికల తీరుపై అనుమానాలుఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలుచోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైస్ ఛైర్మన్ జకియా ఖానమ్, నూతనంగా గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, తనూజ రాణి తదితరులున్నారు. ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రూహుల్లా, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, విడదల రజని, పేర్ని నాని, ఉషా శ్రీచరణ్, కె.నాగేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్ కుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేశినేని నాని
-
సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్హెచ్ఆర్డీ) సందర్శించారు. అక్కడి బోధన సిబ్బందితో సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాల గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ డాక్టర్ శశాంక్ గోయల్ సంస్థ కార్యకలాపాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్‌కు వివరించారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను రేవంత్‌రెడ్డి సోలార్ పవర్ వాహనంలో కలియతిరుగుతూ పరిశీలించారు. సీఎం వెంట రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. ప్రగతిభవన్ రాచరికానికి చిహ్నంగా ఉందంటూ గతంలో విమర్శలు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాన్ని సందర్శించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడంతో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్.. తన క్యాంపు కార్యాలయంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌ను వినియోగించడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంట్లోనే రేవంత్ నివాసముంటున్నారు. రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
క్యాంపు కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ
-
ప్రపంచంతో పోటీ పడండి
సాక్షి, అమరావతి: ప్రపంచంతో పోటీపడితేనే మన బతుకులు మారతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పేదరికం సమసిపోవాలంటే దానికి విద్య ఒక్కటే మార్గమని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనడానికి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గతనెలలో 15 రోజులపాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘అమెరికా పర్యటన ద్వారా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి మీకు ఆ అనుభవాలు ఉపయోగపడతాయి. ప్రపంచస్థాయికి ఎదగాలన్న కోరిక మీకు మరింత గట్టిపడుతుంది. ఈ పర్యటన మీ మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఎలా ఉంది? మనం ఎక్కడ ఉన్నాం? ఎంత వెనుకబడి ఉన్నాం? అనేది అర్థమవుతుంది. ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. మనం చాలా వెనుకబడి ఉన్నాం.. ప్రపంచంతో మనం పోటీపడి నిలబడాలి. అప్పుడే మన బతుకులు మారతాయి. ఇందుకు చదువు ఒక్కటే సాధనం’ అని విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. విద్య అనే సాధనం ద్వారా పెద్ద పెద్ద కలలను కనాలని సూచించారు. ఆ కలల నుంచే వాస్తవాలు సాకారం అవుతాయన్నారు. ఇప్పటి నుంచే తెలుసుకోవాలి.. విద్యార్థులు చూసిన కొలంబియా యూనివర్సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 350 కాలేజీల్లో 21 కోర్సుల్లో సీటు సాధిస్తే ప్రభుత్వమే చదివిస్తుందని సీఎం జగన్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సంబంధిత కాలేజీల్లో ఫీజులు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకూ ఉంటాయన్నారు. వీటిలో సీటు తెచ్చుకుంటే జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా రూ.1.25 కోట్ల వరకు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ‘సీఈవో వంటి స్థాయికి వెళ్లాలంటే ప్రతిభ, నైపుణ్యం ఉండాలి. మనం చదివే చదువులవల్లే ఇవి వస్తాయి. ప్రపంచ అత్యుత్తమ కాలేజీల్లో చదువుకోవడం ద్వారా మీ నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలు మీకు మంచిస్థానాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి. తద్వారా మీ జీవితాలు మారతాయి. అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసం కోసం, సీటు సాధించేందుకు మీరు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి’ అని సీఎం జగన్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ‘మీకు ఆసక్తి ఉన్న కోర్సు ఏంటి? ప్రపంచంలో ఈ కోర్సును అందిస్తున్న అత్యుత్తమ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి?’ అనేది ఇప్పటి నుంచే తెలుసుకోవాలని సూచించారు. ఆ కాలేజీల్లో సీటు రావాలంటేం ఏయే పరీక్షల్లో ఎన్ని మార్కులు రావాలో కూడా తెలుసుకోవాలన్నారు. జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్ వంటి పరీక్షలు ఏమున్నాయో.. వాటికి ఎలా సన్నద్ధం కావాలో తెలియాలన్నారు. జీఆర్ఈ, జీమ్యాట్‌లకు కూడా ఉచిత శిక్షణ టోఫెల్‌కు ఎలా తీసుకువచ్చామో.. అలాగే జీఆర్ఈ, జీమ్యాట్‌లకు కూడా మెటీరియల్, ఉచిత శిక్షణను విద్యార్థులకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. కొలంబియా యూనివర్సిటీ, వార్టన్, ఎల్ఎస్ఈ, ఇన్సీడ్.. ఇలాంటి యూనివర్సిటీలు, కాలేజీలు 350 ఉన్నాయని.. వీటిలో సీటు సాధించాలని హితబోధ చేశారు. ఆ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేశాక విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయన్నారు. ఇది సాకారమైతే మీ, మీ కుటుంబాల బతుకులు మారడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచినవారవుతారన్నారు. అంతేకాకుండా మీ స్థాయిలో మరో పది మందికి సహాయపడొచ్చని విద్యార్థులకు సీఎం హితబోధ చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ‘ఇక్కడున్న ఈ పిల్లలు చిన్నప్పుడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలని కలలు కని ఉంటారు.. చాలా మందికి సీట్లు వచ్చాయి. ఆ విజన్ అక్కడితో పూర్తయ్యింది. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి తర్వాత ఎక్కడికి అనేది విజన్ కావాలి’ అని సీఎం పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళికలోకి 1,800 సబ్జెక్టులు మన పాఠ్యప్రణాళికలో లేని 1,800 సబ్జెక్టులను పాఠ్యప్రణాళికలోకి తెస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎంఐటీ, హార్వర్డ్ వంటి యూనివర్సిటీ నిపుణులతో తయారు చేయించిన సబ్జెక్టులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎడెక్స్‌తో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. ఈ కోర్సులు చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్ కూడా లభిస్తుందన్నారు. ఈ కోర్సులు నేర్చుకోవాలని.. దీనివల్ల ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ‘మీరు ఇలా విదేశాలకు వెళ్లి బయటి ప్రపంచం చూసినప్పుడు మరింత కష్టపడాలన్న స్ఫూర్తి మీలో కలుగుతుంది. ఈ పర్యటన మీకు మాత్రమే కాకుండా, మీ వల్ల ఇతరులకు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. ఒక స్థాయిలో ఉన్న మనం బాగా కష్టపడటం ద్వారా మరో స్థాయికి చేరుకుంటాం. మన కష్టమే మనల్ని పై స్థానాలకు తీసుకెళుతుంది. మీ అందరికీ అభినందనలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. పర్యటన ఎలా జరిగింది? అమెరికాలో పర్యటించిన విద్యార్థులు శివలింగమ్మ, చంద్రలేఖ, గణేశ్, జ్యోత్స్న, రాజేశ్వరి, గాయత్రి, రిషితారెడ్డి, యోగీశ్వర్, షేక్ అమ్మాజాన్, మనస్వినిలతోపాటు వారి తల్లిదండ్రులను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), కొలంబియా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ‘ఆణిముత్యాలు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 126 మంది విద్యార్థులను గుర్తించి వారికి పోటీపరీక్ష నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల భాషా పరిజ్ఞానాన్ని పరిశీలించి అమెరికా పర్యటనకు 10 మందిని ఎంపిక చేశామని సీఎంకు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం.. అమెరికా పర్యటన ఎలా జరిగిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజనం డైరెక్టర్ నిధి మీనా, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఐక్యరాజ్యసమితి సభ్యులు ఉన్నవ షకిన్ కుమార్, మంగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నేను మహిళా సాధికారత, బాలికా విద్యపై ప్రసంగించాను. మీ విజన్ వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. మాకు చక్కటి అవకాశం కల్పించారు.. థ్యాంక్యూ సార్. – రాజేశ్వరి, విద్యార్థిని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశమిచ్చారు.. మాకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం కల్పించారు. విద్యా వ్యవస్థలో మీరు తీసుకొచ్చిన మార్పులన్నీ వివరించాం. మేం విమానం ఎక్కుతామని కలలో కూడా అనుకోలేదు.. కానీ మీరు సాధ్యం చేశారు. మీరు చెప్పిన ‘వన్ చైల్డ్.. వన్ టీచర్.. వన్ పెన్.. వన్ బుక్.. కెన్ చేంజ్ ద వరల్డ్’ మాటకు తిరుగులేదు.. మీ నమ్మకాన్ని నిలబెడతాం సార్. – అల్లం రిషితారెడ్డి, విద్యార్థిని యూఎన్వోను మీ వల్ల నిజంగా చూడగలిగా.. నేను యూఎన్వో గురించి సోషల్ బుక్స్‌లో చదువుకున్నాను. దాన్ని మీ వల్ల నిజంగా చూడగలిగాను. థ్యాంక్యూ సార్. ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందుతుందనేది నేను అమెరికాలో వివరించాను. – వంజివాకు యోగీశ్వర్, విద్యార్థి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలబెట్టారు.. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి అనేక అంశాలపై మాట్లాడాను. అక్కడంతా ఆశ్చర్యపోయారు. మేం ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలబెట్టారు. – సామల మనస్విని, విద్యార్థిని మీ గొప్ప ఆలోచన వల్లే.. విద్యావ్యవస్థలో చాలా మంచి మార్పులు తెచ్చారు. మీ గొప్ప ఆలోచన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ రోజు మన రాష్ట్రం గొప్ప స్థాయిలో ఉందంటే అది మీ వల్లే. థ్యాంక్యూ సీఎం సార్. – షేక్ అమ్మాజాన్, విద్యార్థిని -
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి
సాక్షి,ఖమ్మం: మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న పూల కుండీలను పగలకొట్టి, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అయితే దీన్ని గమనించిన అక్కడి స్థానికులు వారించటంతో ఆ దుండగులు పరారయ్యారు. కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పొంగలేటి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది? -
రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘షర్మిలమ్మ అడ్రస్ ఈరోజు పాలేరు అయింది. తెలంగాణకు ప్రధాన గుమ్మం ఖమ్మం అయితే.. రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా చెప్పుకునే అడ్రస్ అవుతుంది ఈ కార్యాలయం’అని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్నగర్లో పాలేరు నియోజకవర్గ వైఎస్సార్ తెలంగాణ పార్టీ క్యాంపు కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను మీ బిడ్డను, మీతో ఉంటాను అని.. పాలేరు ప్రజలకు ఇక్కడి మట్టి సాక్షిగా ప్రమాణం చేసిన షర్మిలమ్మను ఆశీర్వదించాలి’అని కోరారు. షర్మిల తెలంగాణ బిడ్డ కాదనే వారికి ఆమె ప్రేమ.. తెలంగాణలో షర్మిలమ్మ ఉనికి పోయిందనే వారికి ఆమె మానవత్వమే జవాబు చెబుతుందని పేర్కొన్నారు. వైఎస్‌ది జగమంత కుటుంబం పాలేరు నియోజకవర్గం వేదికగా నిర్మిస్తున్న పార్టీ కొత్త కార్యాలయం వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8న ప్రారంభించనున్నట్లు విజయమ్మ తెలిపారు. వైఎస్ తన కుటుంబాన్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించారని ఆమె చెప్పారు. ఆయనది జగమంత కుటుంబమని, రాజశేఖరరెడ్డి కుటుంబం అంటేనే ప్రజల కుటుంబమని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం షర్మిల ప్రయత్నం చేస్తోందని అన్నారు. షర్మిలమ్మ పాలేరులో పోటీకి నిర్ణయించుకోవడం యాదృచ్ఛికం కాదని, అది దైవేచ్ఛగా భావిస్తున్నామని తెలిపారు. తమకు పులివెందుల ఎలాగో.. షర్మిలకు పాలేరు కూడా అలాగేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గడిపల్లి కవిత, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.