challa ramakrishna reddy
-
నేనున్నానంటూ..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి, మనోధైర్యాన్ని నింపారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోవిడ్ బారిన పడిన రామకృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి బుధవారం చల్లా సొంతూరైన కర్నూలు జిల్లా అవుకు పట్టణానికి వచ్చారు. మధ్యాహ్నం 12.31 గంటలకు అవుకులోని ‘చల్లా భవన్’కు చేరుకున్నారు. చల్లా చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తర్వాత చల్లా సతీమణి శ్రీదేవి, కుమారుడు భగీరథరెడ్డి, సోదరులు రఘునాథరెడ్డి, రామేశ్వరరెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని పేరుపేరునా పలుకరించారు. కోవెలకుంట్ల, బనగానపల్లె నియోజకవర్గాల అభివృద్ధికి చల్లా ఎనలేని కృషి చేశారని, ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకూ తీరని లోటని సీఎం అన్నారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చల్లా ఎమ్మెల్యేగా ఉన్నారని, తాను సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయ్యారని గుర్తు చేసుకున్నారు. చల్లా లేని లోటు తీర్చలేనిది చల్లా లేని లోటు కుటుంబానికి తీర్చలేనిదని, అయితే అన్ని విధాలుగా తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. దాదాపు 25 నిమిషాల పాటు చల్లా కుటుంబసభ్యులతో గడిపారు. ఆ తర్వాత అవుకు నుంచి నేరుగా ఓర్వకల్లు చేరుకుని..అక్కడి నుండి విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, తదితరులు చల్లా కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి ఉదయం 11.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అవుకు వచ్చారు. ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. -
కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన
కర్నూలు(సెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు పట్టణానికి హెలికాప్టర్లో వెళతారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం విజయవాడకు తిరిగి వెళతారు. -
కర్నూలు పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇదివరకే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
కోవెలకుంట్లపై ‘చల్లా’ ముద్ర
కోవెలకుంట్ల: చల్లా రామకృష్ణారెడ్డి.. కర్నూలు జిల్లాలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రత్యర్థులు ఆయనపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసినా.. చెరగని చిరునవ్వుతో దానిని తుడిపేసుకున్నారు. తన దగ్గరికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆప్తుడయ్యారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అభిమాన నేతగా మారారు. ఈయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోనే కాకుండా సినీ, సాహిత్య రంగాల్లో ప్రావీణ్యం సాధించారు. సైరా.. చిన్నపురెడ్డి, సత్యాగ్రహం సినిమాల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమాలతోపాటు కవితలు రాయడంలో మంచి నేర్పరిగా ఖ్యాతి గడించాడు. స్వహస్తాలతో అనే కవితలు రాసి వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లకు పంపేవారు. వ్యవసాయాన్ని బాగా ఇష్టపడేవారు. తన సొంత పొలంలో జొన్న సాగు చేసి.. మంచి దిగుబడి సాధించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా కృషి పండిట్ అవార్డు అందుకున్నారు. అవుకు రిజర్వాయర్ కింద 1,600 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరందించడలో చల్లా కృషి ఎంతో ఉంది. నీలం సంజీవరెడ్డితో చల్లా రామకృష్ణారెడ్డి (ఫైల్) కోవెలకుంట్లను అగ్రగామిగా నిలిపిన చల్లా కోవెలకుంట్ల ప్రాంతాన్ని చల్లా రామకృష్ణారెడ్డి అగ్రగామిగా నిలిపారు. 1999 నుంచి 2009 వరకు పదేళ్లపాటు ఎమ్మెల్యే పని చేసి అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి యోగక్షేమాలు తెలుసుకునే నాయకుడిగా గుర్తింపు పొందారు. కోవెలకుంట్ల పట్టణ శివారులో కుందూనదిపై బ్రిటీష్‌కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం నుంచి రూ. 3 కోట్ల నిధులు తెప్పించి.. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశారు. చల్లా ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఇప్పటికీ రాజ భవనాలను తలపిస్తున్నాయి. ‘అవుకు’ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర అవుకు రిజర్వాయర్ సామార్థ్యాన్ని నాలుగు టీఎంసీలకు పెంచడంలో చల్లా రామకృష్ణా రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2004లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అవుకు రిజర్వాయర్ వద్దకు రప్పించి, అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చల్లా కోరిక మేరకు ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ కాల్వల ద్వారా నీరు అవుకు రిజర్వాయర్‌లో చేరేందుకు రెండు టన్నెల్ల ఏర్పాటుకు సుమారు రూ.1,200 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అధికారులను పూర్తిపేరుతో చల్లా పిలిచే వారు. ఆప్యాయంగా పలకరించే అభిమాన నేత ఇక లేరని తెలిసి కోవెలకుంట్ల ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సమకాలీకుల శకం ముగిసింది ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతితో పాత నియోజకవర్గమైన కోవెలకుంట్ల, ప్రస్తుత బనగానపల్లె నియోజకవర్గాల్లో రాజకీయంగా సమకాలీకుల శకం ముగిసింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి తండ్రి బిజ్జం సత్యంరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, ప్రస్తుత బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చిన్నాన్న కాటసాని శివారెడ్డి, కొలిమిగుండ్ల మండలం నాయినిపల్లెకు చెందిన ఎర్రబోతుల వెంకటరెడ్డి రాజకీయ సమకాలీకులు. బిజ్జం సత్యంరెడ్డి 2000లో మృతి చెందగా, కాటసాని శివారెడ్డి 2017లో, ఎర్రబోతుల వెంకటరెడ్డి 2020లో మృతి చెందారు. చల్లా రామకృష్ణారెడ్డి 2021 ప్రారంభ తొలిరోజున మరణించారు. రాజకీయాల్లో కురువృద్ధులుగా పేరుగాంచిన ఈ నలుగురు నేతలు మృతి చెందటంతో నియోజకవర్గంలో నమకాలీకుల శకం ముగిసిపోయింది. వీరితో పాటు కోవెలకుంట్ల నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తిపు పొందిన రాజకీయ నేత కర్రా సుబ్బారెడ్డి 2004లో మరణించారు. రాజకీయాల్లో ప్రత్యేక స్థానం చల్లా స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. 1948 ఆగస్టు 27న చిన్నపురెడ్డి, నారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఏజీ బీఎస్సీతో పాటు ఎంఏ చదివారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు భగీరథరెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఫ్యాక్షన్‌లో తండ్రి చిన్నపురెడ్డి మరణించడంతో రామకృష్ణారెడ్డి ఫ్యాక్షన్‌కు స్వస్తి పలికి రాజకీయాల్లో చేరారు. రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1983లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానానికి, 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1994 ఎన్నికల్లో కోవెలకుంట్లలో ఓడిపోయారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కోవెలకుంట్ల నుంచి ఘన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో బనగానపల్లెలో ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర పాటు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి.. కాటసాని రామిరెడ్డి విజయానికి సాయం అందించారు. -
ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్ : కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: చల్లా రామకృష్ణారెడ్డి మృతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లా రాజకీయాల్లో చల్లా చురుకైనా పాత్రను పోషించేవారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. చల్లా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంచి నేతను కోల్పోయాం: సజ్జల కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అకస్మిక మృతి పట్ల ప్రభుత్వ సలహాదారులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా విశిష్టమైన స్థానం ఉందని సజ్జల తెలిపారు. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారని అన్నారు. చల్లా గొప్ప కవి, మంచి వ్యక్తి అని చెప్పారు. చల్లా స్థానం.. విశిష్టం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి. కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. -
నివర్ తుఫాన్‌పై మండలిలో చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు నివర్ తుఫాన్ వల్ల కలిగిన పంట నష్ట్రంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మండలిలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఇద్దరే ఇద్దరూ మహనీయులను చుశానన్నారు. ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరొకరు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలోని ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండాయన్నారు. తను రైతుగా అనేక తోటలు సాగు చేస్తున్నానని, ఒక రైతుగా ఇలాంటి ప్రభుత్వాన్ని తానేప్పుడు చూడలేదన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. ఆర్బీకే పరిశీలించడానికి కర్ణాటక నుంచి కర్నూలుకు అధికారులు వచ్చారన్నారు. గత ప్రభుత్వంలో రాత్రి వేళ రైతులకు విద్యుత్ ఇవ్వడం వల్ల తన దగ్గర పనిచేసే వాళ్ళు ఇద్దరూ చనిపొయారని చెప్పారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన చెప్పారు. టీడీపీ వాళ్లకు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ లాంటి వారు కావాలని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులకు తమ ప్రభుత్వం మేమున్నామన్న భరోసా కల్పిస్తుందని చల్లా పేర్కొన్నారు. -
నాకు తెలిసిన మహనీయుడు
‘చాలు.. చాల్లేవయ్యా.. కూర్చోవయ్యా.. కూర్చో.. ఏందయ్యా.. నీకు బుద్ధి, జ్ఞానం ఉందా?’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును సూటిగా, స్పష్టంగా, ఘాటుగా మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటాయి. చంద్రబాబు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేస్తూ ఆవేశపడిన ప్రతిసారీ వైఎస్సార్ తాపీగా చిరునవ్వులు చిందిస్తున్న దశ్యం నా కళ్ల ముందు నేటికీ కనువిందు చేస్తుంటుంది. అసెంబ్లీలో నాడు వైఎస్ మాట్లాడిన ప్రతి మాటా తూటాలా పేలేది. నిక్కచ్చిగా ఆయన మాట్లాడే విధానం, ముక్కు సూటితనం, నిజాయితీ.. సభ్యులను ముగ్ధు్దల్ని చేసేది. ఆయనతో కలిసి ఒక దశాబ్ద కాలంపాటు శాసనసభ్యునిగా అసెంబ్లీలో నేను ఉన్న దృశ్యాలు కళ్లలో కదలాడుతూనే ఉంటాయి. 1999లో ప్రతిపక్ష నాయకుడిగా, 2004లో తొలిసారి ముఖ్యమంత్రిగా సభలో అందరినీ ఆకట్టుకునే ఆయన శైలి అనితర సాధ్యం. (చదవండి: ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా?) 1978లో 29 సంవత్సరాల పిన్న వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి మొదటిసారి శాసనసభ్యునిగా గెలిచారు. నాలుగుసార్లు కడప పార్లమెంట్ సభ్యునిగా, ఆరుసార్లు పులివెందుల శాసనసభ్యునిగా విజయదుందుభి మోగించి, విజయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పీసీసీ రథసారథిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సమస్తం విభిన్న పార్శ్వాలే కనిపిస్తాయి. పదవి ప్రజల కోసమే అని నిరూపించిన గొప్ప నేత. ప్రతిపక్ష నాయకుడిగా 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్సార్ చేసిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆనాడు ఒక చరిత్ర. మండుటెండల్లో సుమారు 1,500 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో మరో సరికొత్త వైఎస్సార్ ఆవిష్కృతమయ్యారు. వైఎస్సార్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పాదయాత్రకు ముందు.. పాదయాత్ర తర్వాత అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఆనాడు అఖిలాంధ్ర జనం అనుకున్నట్టే 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. పాదయాత్రలో ప్రతి పేదవాడి కష్టం కళ్లారా చూశారు. వారి వెతలు విన్నారు. రైతును ఎలా ఆదుకోవాలి? మహిళామణులకు ఏం చెయ్యాలి? విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి మేలు చేయాలి? పేదవాడి కన్నీరు ఎలా తుడవాలి? ఇలాంటి నిరంతర ఆలోచనలే ఆయన అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టడానికి దోహదపడ్డాయి. (చదవండి:మహానుభావుడు లేకుంటే బతికేవాణ్ణి కాదు) రూపాయి డాక్టరుగా పేదల మన్ననలు పొందిన వైఎస్సార్ ప్రజల మనిషిగా గొప్ప గుర్తింపు పొందారు. ఎవరు ఎదురుపడినా చిరునవ్వుతో ‘ఏమయ్యా’ అని, ‘సార్’ అని ప్రేమతో పేరుపెట్టి ఆప్యాయంగా పిలిస్తే రాజన్న మత్తులో, ఆ మనిషి మాయలో పడినట్టే. ఇక అంతే. జీవితాంతం ఆయన మనిషిగా ఉండిపోతాడు. 2009 ఎన్నికల్లో 33 పార్లమెంట్ స్థానాలను గెలిపించిన ఘనత వైఎస్సార్‌కే సొంతం. సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి ఎలా చేర్చాలి అన్నది చేసి చూపించిన ఘనత వైఎస్సార్‌దే. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని నిరూపించిన రైతు జనబాంధవుడు. ముఖ్యమంత్రి హోదాలో 2005లో కర్నూలు జిల్లాలోని నా నివాసం అవుకులో ‘అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’కు శంకుస్థాపన మహోత్సవానికి నా ఆహ్వానం మేరకు వచ్చారు. ఆనాడు అవుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోవెలకుంట్ల శాసనసభ్యునిగా నేను అడిగిన ప్రతి పనీ మంజూరు చేశారు. కర్నూలు జిల్లాలో 50 ఏళ్ల తర్వాత అవుకులో ప్రభుత్వ ఐటీఐ మంజూరు చేశారు. దీంతోపాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీ, 30 పడకల ఆస్పత్రి, మెట్టుపల్లె అడిషనల్ స్లూయిస్.. ఇలా నేను అడిగినవన్నీ ఇచ్చారు. కోవెలకుంట్ల సమీపంలో కుందూ నదిపై ‘జోళదరాశి ప్రాజెక్టు’కు నాంది పలికింది కూడా ఆయనే. ఉచితవిద్యుత్తు, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, రెండు రూపాయలకు కిలో బియ్యం, పావలా వడ్డీ, భూపంపిణీ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్, రిమ్స్, ఐఐఐటీ.. వైఎస్సార్ సంక్షేమానికి మారుపేర్లయిన పథకాలివి. ఒక వ్యక్తిలో ఇన్ని విశిష్ట లక్షణాలు, భిన్న కోణాలు, ఇంత పోరాట పటిమ, మరే నాయకుడికి లేనంత జనాకర్షణ, అన్నింటికీ మించి పాలనాదక్షత.. వైఎస్సార్‌లోని ఈ గుణాలను తలుచుకున్న ప్రతిసారీ నా కళ్లు చెమర్చుతాయి. వారి సాహచర్యం మరపురానిది, మరువలేనిది. ఆ జ్ఞాపకాలతో ఒక్కోసారి గుండె బరువెక్కుతుంది. గొంతు మూగబోతుంది. వారి మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లినా, ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాత్రం సజీవంగా నిలిచారు. -చల్లా రామకృష్ణారెడ్డి వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ -
జిల్లాకు ఎందుకొచ్చావు బాబూ?
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూల్) : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి, శ్రీశైలం జలాశయం నిండి..గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులంతా సంతోషంగా ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో వారితో ఫొటోలు దిగేందుకు వచ్చావా అంటూ టీడీపీ అధినేత చంద్ర బాబుపై ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన చల్లా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘ నీ హయాంలో రాయలసీమ జిల్లాల్లో కరువు కాటకాలతో అల్లాడిపోయిన దినసరి కూలీలు, రైతు సోదరులు వలసలు వెళితే.. రెయిన్గన్లతో మాయాజాలం చేశావు. కరెంట్ సరిగా ఇవ్వకపోవడంతో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అర్ధరాత్రి చీకట్లో వెళ్లి కరెంట్ షాక్‌కు, పాముకాటుకు బలై పోలేదా? అప్పటి కాలానికి విరుద్ధంగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిస్తే వర్షాలు కురుస్తున్నాయి. పట్టపగలే 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. దీన్ని చూసి పోదామని వచ్చావా బాబూ? నీ పాలనలో ఆశావర్కర్లకు రోజుకు వంద రూపాయల ప్రకారం మాత్రమే ఇచ్చి దినసరి కూలీలకంటే హీనంగా చూశావు. అలాంటి వారి వేతనాన్ని వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచి ఆదుకున్నారు. దేశచరిత్రలోనే అతి తక్కువ కాలంలో 4.30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి వారి జీవితాలను నిలబెట్టారు. వారిని పలకరించేందుకు ఏమైనా వచ్చావా బాబూ? మీ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేశారు. ఇప్పుడు పూర్వ వైభవం తెచ్చి దాదాపు రెండువేల జబ్బులకు అవకాశం కల్పించారు. మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగున ఉన్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లోనూ చికిత్స చేయించుకునేందుకు వీలు కలి్పంచారు. ఆ పథకం గురించి తెలుసుకునేందుకు ఏమైనా వచ్చావా బాబూ? నీ కాలంలో ఒకరికి పింఛన్ కావాలంటే మరొకరు చావాల్సిన పరిస్థితి ఉండేది. మద్యం షాపులకు పోటీలు పెంచి ఆంధ్రా ప్రజానీకంలో సగభాగాన్ని తాగుబోతులను చేశావు. ఎందరో తల్లుల నల్లపూసల దండలు తెగి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే..నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాబోయే తరాలు కూడా హర్షించేలా దశల వారీగా మద్యపాన నిషేధం అమలుకు శ్రీకారం చుట్టారు. నిరుపేద పిల్లలు సైతం బడులకు వెళ్లి చక్కగా చదువుకునేందుకు త్వరలో అమ్మఒడి పథకాన్ని అమలు చేయనున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకే కాకుండా దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరు నెలల కాలంలోనే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నార’ని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను పదిసార్లు చదువుకుని, కర్నూలు జిల్లాలో మీరెక్కిన వేదిక నుంచి ఏ ఒక్క పథకాన్ని కూడా మిస్ కాకుండా అన్నింటిని చూడకుండా చెప్పగలిగితే నేను రాజకీయాల నుంచి నిష్క్ర మిస్తానని, ఇందుకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు చల్లా సవాల్ విసిరారు. -
చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉపాధి - శిల్పా చక్రపాణి
సాక్షి, ఆత్మకూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. శిల్పాతో పాటు నంద్యాల ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైల నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆత్మకూరులో అత్యధికంగా పేద కుటుంబాలు ఉన్నాయని.. వీరికి ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటకు కృషి చేస్తానన్నారు. త్వరలో ఈ ప్రాంతాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మారుస్తానని చెప్పారు. అందులో భాగంగానే 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు 23 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాబ్‌మేళాకు భారీగా హాజరైన నిరుద్యోగులు డీఎస్సీకీ ప్రిపేర్ అవుతున్న వారికి స్థానికంగా ఉచిత కోచింగ్ ఇప్పిస్తానని చెప్పారు. నందికొట్కూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధి శిల్పాతోనే సాధ్యమన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామ,వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతకుమునుపు వైఎస్సార్సీపీ నాయకులు శిల్పాకార్తీక్ రెడ్డి, శిల్పా భువనేశ్వరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ శ్రీనివాసులు, తహసీల్దార్ ఆదినారాయణ, ఎంపీడీఓ కృష్టమోహన్, సీఐ కళావెంకటరమణ, వైఎస్సార్సీపీ నాయకులు అంజాద్‌అలీ, చిట్యాల వెంకటరెడ్డి, శరభారెడ్డి, సులేమాన్, సుల్తాన్, ఫరుక్, సురేష్, దినకర్, నాగేశ్వరరెడ్డి, డిగ్రీకళాశాల కరస్పాండెంట్ గోపిశెట్టి వసుంధర, వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ సభ్యులు స్వామి, ముర్తుజా, రెహమాన్, కలిములా పాల్గొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందివచ్చిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. పని ఏదైనా ఇష్టపడి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని..ప్రయోజకులై వాటిని తీర్చాలన్నారు. – ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయం జిల్లాలో మారుమూల నియోజకవర్గం శ్రీశైలమని ఆలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యే శిల్పా మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలాన్ని మోడల్ నియోజకవర్గంగా చేస్తామని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. – చల్లా రామకృష్టారెడ్డి, ఎమ్మెల్సీ -
'వైఎస్ జగన్ ఒక డైనమిక్ లీడర్'
సాక్షి,కర్నూలు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మూడు నెలల్లోనే ఆచరణలో పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే డైనమిక్ లీడర్‌గా పేరు సంపాదించారని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో దశల వారిగా అమలు చేస్తున్న మద్యపాన నిషేధం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడగలిగారని తెలిపారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి కేవలం ఏడు గంటలు ఉచిత కరెంటు ఇస్తే, సీఎం వైఎస్ జగన్ మాత్రం పగటిపూటే తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడం గొప్ప విషయమని వెల్లడించారు. నిరక్ష్యరాస్యతను తగ్గించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఒక బాధ్యతగా గుర్తించి సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. -
అమరావతి : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డి, ఇక్బాల్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బుధవారం శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డిలు భగవద్గీత మీద, ఇక్బాల్ ఖురాన్ మీద ప్రమాణం చేసి ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేనాటిగడ్డకు అరుదైన అవకాశం
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు) : రేనాటిగడ్డగా పేరొందిన కోవెలకుంట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన అవకాశం కల్పించారు. శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు యాధృచ్చికంగా కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు నేతలకు దక్కాయి. అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి, కోవెలకుంట్ల విద్యార్థిగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న రాయలసీమ రిటైర్డ్ ఐజీ, అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మహమ్మద్ ఇక్బాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇద్దరూ రేనాటిగడ్డ నేతలే అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా రాజకీయ అరంగ్రేటం చేశారు. 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కోవెలకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొంది పదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. 2009 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోవెలకుంట్ల నియోజకవర్గం కనుమరుగై బనగానపల్లె నియోజకవర్గంగా మార్పు చెందటంతో ఆ ఎన్నికల్లో అప్పటి పీఆర్పీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చల్లా సేవలను పట్టించుకోకపోవడంతో 2019 ఎన్నికల సమయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాటసాని విజయం కోసం కృషి చేయాలని, అందుకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైఎస్ జగన్ చల్లాకు సూచించారు. ఇచ్చిన హామీ మేరకు చల్లాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కోవెలకుంట్ల విద్యార్థి మహమ్మద్ ఇక్బాల్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ కోవెలకుంట్ల పూర్వ విద్యార్థి. ఇదే మండలంలోని కంపమల్ల ఇక్బాల్ తాతగారి ఊరు. మహమ్మద్ ఇక్బాల్ తాత మదార్‌సాహెబ్ 1965–70 మధ్యకాలంలో కోవెలకుంట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ మనవడైన మహమ్మద్ ఇక్బాల్‌ను తన వద్ద ఉంచుకుని పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. హైస్కూల్ విద్య బనగానపల్లె మండలం నందివర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి, ఉన్నత విద్య అనంతరం ఐపీఎస్‌గా కర్నూలు, కడప జిల్లాల్లో విశిష్ట సేవలందించారు. పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. తనకు విద్యనందించిన కోవెలకుంట్ల ప్రాంతంతో ఇక్బాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి దక్కనుండటంతో రేనాటిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం విదితమే. ఈ స్థానాలకు రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పార్టీ మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. పార్టీ పరంగా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు సామాజిక వర్గాలకు శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. అందులో భాగంగానే మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార–బీసీ), మహ్మద్ ఇక్బాల్ (ముస్లిం–మైనార్టీ), చల్లా రామకృష్ణారెడ్డి (రెడ్డి)ని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ సామాజిక సమతౌల్యం పాటించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. శాసనసభ కోటా నుంచి ఎంపికైన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన ఫలితంగా ఖాళీ అయిన ఈ స్థానాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 14వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్ సీపీకి ఉన్న సంఖ్యాబలం రీత్యా ఈ మూడు ఖాళీలు ఆ పార్టీకే లభిస్తాయి. అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు వైఎస్సార్సీపీ నేతలు ఈ నెల 14వ తేదీన నామినేషన్లు వేయనున్నట్టు సమాచారం. -
మాట నిలుపుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను పార్టీ అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకోని తొలి విడత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయనకు అవకాశం కల్పించారు. హిందుపూర్లో ఓటమి చెందిన ఇక్బాల్‌కు, బనగానపల్లెలో విజయానికి కృషి చేసిన చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే కావడంతో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు వీరిద్దరికి ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. మరికొందరికి కూడా ఇచ్చిన హామీలను భవిష్యత్తులో నెరవేర్చుతామని పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతపురం జిల్లా హందూపురం నియోజకవర్గ నుంచి పోటీచేసిన మైనార్టీ నేత, రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహ్మాద్ ఇక్బాల్ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం మైనార్టీల అత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఇక్బాల్‌కు తొలి విడుత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా గెలిచే శాసనసభ్యుల కోటాలో ఆయనను మండలికి ఎంపిక చేశారు. సీఎం నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. చల్లా వర్గీయుల్లో ఆనందం 2014 ఎన్నికల్లో చంద్రబాబు స్వయంగా చల్లా రామకృష్ణారెడ్డిని ఆహ్వానించి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. టీడీపీ అధికారంలోకి వచ్చినా చల్లాకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఏదో కంటి తుడుపు చర్యగా రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అదీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇచ్చారు. దీంతో చల్లా మాట తప్పిన చంద్రబాబు దగ్గర పనిచేయడం కంటే మాట ఇస్తే మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గర పనిచేయడం ఉత్తమమని 2019 మార్చిలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆనాడు పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బనగానపల్లెలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయానికి కృషి చేయాలని చల్లాకు సూచించారు. అంతేకాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం మొదట విడతలోనే ఎమ్మెల్సీగా చల్లాను ఎంపిక చేయడంతో ఆయన వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికలకు వైస్సార్సీపీ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఈమేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైఎస్సార్సీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నిక లాంఛనమే.. మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే మూడు స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఉప ఎన్నికల ఓటింగ్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సంఖ్యా బలం లేకపోవడంతో మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కావున ముగ్గురూ ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం లాంఛనమే. చల్లా స్థానం.. విశిష్టం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి. కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. పార్టీకి చల్లా చేసిన సేవలను గుర్తిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. -
ఎమ్మెల్సీగా చల్లా రామకృష్ణారెడ్డి..
సాక్షి, కోవెలకుంట్ల: శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఒక స్థానం నుంచి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైఎస్సార్సీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నిక లాంఛనమే.. మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే మూడు స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఉప ఎన్నికల ఓటింగ్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సంఖ్యా బలం లేకపోవడంతో మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కావున చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే. మాట నిలుపుకున్న వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో చంద్రబాబు స్వయంగా చల్లాను ఆహ్వానించి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. టీడీపీ అధికారంలోకి వచ్చినా చల్లాకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఏదో కంటి తుడుపు చర్యగా రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అదీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇచ్చారు. దీంతో చల్లా మాట తప్పిన చంద్రబాబు దగ్గర పనిచేయడం కంటే మాట ఇస్తే మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గర పనిచేయడం ఉత్తమమని 2019 మార్చిలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆనాడు పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బనగానపల్లెలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయానికి కృషి చేయాలని చల్లాకు సూచించారు. అంతేకాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం మొదట విడతలోనే ఎమ్మెల్సీగా చల్లాను ఎంపిక చేయడంతో ఆయన వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చల్లా స్థానం..విశిష్టం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి. కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. పార్టీకి చల్లా చేసిన సేవలను గుర్తిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అవుకు, కోవెలకుంట్లలో సంబరాలు చల్లాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు పలువురికి స్వీట్లు పంచిపెట్టారు. -
బాబూ.. లెక్కసరిపోయిందా?
కొలిమిగుండ్ల: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీకి సంబంధించిన 23 ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కోగా చివరకు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి దక్కింది 23 సీట్లేనని ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం అవుకు పట్టణంలోని చల్లా భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం హోదాలో చంద్రబాబు జగన్‌పై అడుగడుగునా విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కత్తితో దాడి జరిగితే ఆదాడిని కూడా సానుభూతి కోసం జగన్నే చేయించుకున్నారని నీచాతి నీచంగా మాట్లాడారని విమర్శించారు. వైఎస్ జగన్ చిన్నాన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా ఆపాదించడం ఇంత కంటే ఘోరం మరొకటి లేదన్నారు. ఈవిషయంపై జగన్ హైకోర్టుకు వెళ్లి సీబీఐతో విచారణ చేయించాలని కోరితే దానిపై చంద్రబాబు బదులు ఇవ్వలేక పోయారన్నారు. ఇలాంటి దుష్టబద్ధి గల చంద్రబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. నాలుగు జిల్లాల్లో క్వీన్ స్వీప్: ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరుతో మహిళల్లో సానుభూతి పొందాలని చూసిన చంద్రబాబుకు అక్కా చెల్లెమ్మలు బాబు ముఖానికి పసుపు రాసి జగన్‌కు నుదట తిలకం దిద్దారని చల్లా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ క్వీన్ స్వీప్ చేసిందన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్ అవ్వాతాతలకు రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు పింఛన్ ఇస్తానని ప్రకటించారు, కాని బాబు మాత్రం ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్ పెంచినా అవ్వాతాతలు శాపం పెట్టారన్నారు. బాబు తీరు వల్లే తన కుమారుడు లోకేష్, మంత్రులతోపాటు పార్టీ ఘోరంగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. చివరకు రాజధాని అమరావతి ఉన్న కృష్ణా జిల్లాలో సైతం 16 సీట్లకు గాను రెండు సీట్లకే టీడీపీ పరిమితమైందంటే చంద్రబాబును ప్రజలు ఏవిధంగా అసహించుకున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పులు తెలుసుకొని వ్యవహార శైలి మార్చుకోవాలని చల్లా హితవు పలికారు. -
ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు ప్రజలకు పరోక్ష సంకేతం
రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విప్లవాత్మకమైన మార్పుతో జనరంజక పాలనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలకబోతున్నారని, ఈ పాలన రాష్ట్రానికి శుభారంభం కాబోతోందని కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే, ఏపీ సివిల్ çసప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు. ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలపై శనివారం అవుకు చల్లా భవన్లో ‘సాక్షి’కి ఇచ్చిన విశ్లేషణ ఆయన మాటల్లోనే.. కోవెలకుంట్ల: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఐదేళ్లలో రాష్ట్రమంతటా కొన్ని వేల చిన్న, పెద్ద సభలు పెట్టి 1,001 అపద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టినందుకు ప్రతిఫలంగా వచ్చే నెల 23న వెలువడే ప్రజాతీర్పు వైఎస్సార్సీపీ గెలుపు కాబోతోంది. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దంపట్టే చక్కటి సుపరిపాలన వచ్చే నెల 23 తర్వాత ఆరంభం కాబోతోంది. అది సకల జనులకు సౌలభ్యంగా ఉండే సుపరిపాలనకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. అటు మేధావులు, ఇటు సామాన్య ప్రజానీకం సైతం మెప్పు పొందే ఒక చక్కటి పాలన సుదీర్ఘకాలంగా కొనసాగనుంది. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా గ్రహించిన ప్రజల మనోభావాల ప్రతిరూపమే వైఎస్ జగన్ పాలనకు ఒక ఆకృతి ఆవిష్కారం అవుతుంది’. ఎన్నికల కమిషన్‌ను తప్పుపట్టడం హాస్యాస్పదం ‘ఎన్నికలు జరిగిన రోజు నుంచి చంద్రబాబు మానసిక మార్పును గమనిస్తే చిత్ర, విచిత్ర వేషధారణలా ఉంది. ప్రపంచదేశాల్లోనే 133 కోట్ల జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశంలో భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ మచ్చలేకుండా ఎన్నికల కమిషన్ చక్కగా ఎన్నికలు నిర్వహిస్తుందని దేశ, విదేశాలు కొనియాడుతుంటే చంద్రబాబు అదే ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టడం హాస్యాస్పదం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చాంబర్‌కు వెళ్లి ఎన్నికల కమిషనర్‌పై.. అదే ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం విడ్డూరం. చాంబర్ నుంచి బయటకు వచ్చి మెట్ట మీద కూర్చోవడం ఇవన్నీ విచిత్ర వేషధారణలా కన్పిస్తున్నాయి. మరోవైపు తాను వేసిన ఓటు తన పార్టీ సింబల్‌కే పడిందో లేదో అర్థం కావడం లేదంటున్నారు. హైటెక్నాటజీ మేధావిగా చెప్పుకునే చంద్రబాబు హైటెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఓటు వేస్తే.. వారు ఏ పార్టీ సింబల్‌కు ఓటు వేశారో వీవీప్యాడ్స్లో ఏడు సెకన్లు డిస్ప్లే అవుతున్నా.. అది కూడా గ్రహించలేకపోవడం విడ్దూరం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తప్పుపడుతున్నారు. వీవీప్యాడ్స్‌ను తప్పుపడుతున్నారు. ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. అతిపెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, చత్తీష్‌ఘడ్, రాజస్తాన్‌లో నాలుగు నెలల క్రితం ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే టెక్నాలజీతో ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ లేదా? ఎన్నికల కమిషన్ బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ అని పదే పదే అంటున్నావు.. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసి కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధించింది’ అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఓడిపోతున్నట్లు ప్రజలకు సంకేతం ‘ఓడిపోతున్నానని ముందే గ్రహించి ప్రజలకు తానే ఈ రూపంలో పరోక్షంగా సంకేతం పంపుతున్నారు. వచ్చే నెల 23న వైఎస్సార్సీపీ విజయం సాధించబోతోందని, వైఎస్ జగన్ పాలన రాబోతోందని చంద్రబాబు నిస్పృహ, నైరాశ్యంతో రోజుకో తీరుగా ప్రవర్తిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసినా, దేశ, విదేశ సర్వే ఫలితాలు చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మనోభావాలను పరిగణలోకి తీసుకున్నా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి రెండు, మూడు జిల్లాలు తప్ప మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కర్నూలు జిల్లాలో ఒకటి, రెండు సీట్లు తప్ప ఎక్కడా టీడీపీకి అనుకూలంగా లేవు. వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన రాబోతోందన్నది అక్షర సత్యం’. -
వైఎస్సార్సీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి
-
చల్లా మాట ఇస్తే తిరుగేలేదు
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఏపీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. లోటస్‌పాండ్‌లో శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేశారు. పార్టీ కండువాతో ఆయనకు జగన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ఒడిదుడుకులు భరించలేకనే వైఎస్సార్సీపీలో చేరానన్నారు. వైఎస్ జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని ప్రశంసించారు. ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు తాయిలాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఆయన మాయమాటలకు దూరంగా వచ్చినట్టు చెప్పారు. వైఎస్సార్, ఎన్టీఆర్ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తు చేశారు. టీడీపీలో తాను పెద్ద పదవులు అనుభవించలేదని చెప్పారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బతిమాలితే తీసుకున్నానని వెల్లడించారు. తనకు పెద్ద పదవి ఇస్తానని మూడుసార్లు చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడతానని.. కల్మషం, కపటం లేకుండా పనిచేస్తానని అన్నారు. కర్నూలులో వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేస్తానని, చల్లా మాట ఇస్తే తిరుగేలేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
8న వైఎస్సార్ సీపీలోకి చల్లా రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ సీపీలో చేరికపై ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదు దశాబ్దాలుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు బ్యాంక్ కలిగిన చల్లా నిర్ణయంతో జిల్లాలో టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. కాగా చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఫాక్స్ ద్వారా లేఖ పంపారు. చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. -
టీడీపీకి షాక్!
కర్నూలు, బనగానపల్లె: జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగలింది. ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాక్స్ ద్వారా లేఖ పంపారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు చల్లా సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో అధికార పార్టీకి షాక్ తగిలింది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలసల పరంపర కొనసాగుతుండడంతో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో సోమవారం చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించడంతో అధికార పార్టీకి గట్టి దెబ్బతగిలింది. చల్లా కుటుంబం ఐదు దశాబ్దాలుగా జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం విదితమే. చల్లా రామకృష్ణారెడ్డి తండ్రి చల్లా చిన్నపురెడ్డి మంచి నాయకుడిగా ప్రజల్లో పేరుగాంచారు. చల్లా సోదరులు సైతం ప్రజల్లో అదే అభిమానం, గౌరవాన్ని కలిగి ఉన్నారు. ప్రజాభిమానంతో 1983లో పాణ్యం నుంచి 1999, 2004లో కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి చల్లా రామకృష్ణారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సముచిత స్థానం లభించనందునే.. బనగానపల్లె నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ కలిగి ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత.. చల్లాకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కూడా సముచిత స్థానం కల్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అవుకు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంగా చల్లాకు తగిన గౌరవం ఇవ్వలేదన్నవిషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. మంత్రి హోదాలో నారా లోకేష్ అవుకులోని పర్యటన చేస్తున్న సమయంలోను మర్యాదపూర్వకంగా పిలవకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఎమ్మెల్యే బీసీతో విభేదాలు పొడచూపాయని గ్రహించిన సీఎం చంద్రబాబు..కడప ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పదవిని ఇవ్వగా , అది తన స్థాయికి తగదని బహిరంగంగానే చల్లా సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో.. తను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం కొన్ని నెలల పాటు చేపట్టారు. కొసమెరుపు.. సముచిత స్థానం కల్పించకపోవడంతో పార్టీకి, పదవికి చల్లా రాజీనామా చేసినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. సోమవారం అవుకు పట్టణానికి వెళ్లారు. అక్కడ ఉన్న చల్లా సోదరులను కలిశారు. అయితే తాము కూడా అన్నబాటలోనే పయనిస్తామని తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు. -
కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్
సాక్షి, కర్నూలు: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలు మధ్య రోజు రోజుకు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చెర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి సోమవారం పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు తన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇష్టపూర్వకంగా రాజీనామా సమర్పిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, చల్లా రామకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. -
లిఫ్ట్‌లో ఇరుక్కున్న టీడీపీ నేతలు.. పావుగంట ఉత్కంఠ
సాక్షి, విజయవాడ : పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. వీరితోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్, మీనాక్షి నాయుడు, మరికొందరు నేతలు లిఫ్ట్ ఎక్కారు. వారు లిఫ్ట్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపంతో అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో 15 నిమిషాలపాటు నేతలు లిఫ్ట్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. శ్వాస అందక ఒక దశలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో లిఫ్ట్‌లోని నేతలు ఫోన్ ద్వారా బయట ఉన్నవారికి సమాచారం అందించడంతో.. సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. లిఫ్ట్ డోర్‌ను తొలగించి.. వారిని బయటకు తీసుకురావడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.