chepauk stadium
-
మా వాళ్లకు ఇలాంటివి చేతకావు: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్‌ల తయారీ ఎలా ఉండాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. చెన్నై వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు అద్భుతంగా సాగిందని.. ఇందుకు పిచ్ క్యూరేటర్లే కారణమని కొనియాడాడు.280 పరుగుల తేడాతో విజయంకాగా పాకిస్తాన్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత్ టూర్లో ఉంది. ఇందులో భాగంగా చెపాక్ వేదికగా సెప్టెంబరు 19న మొదలైన తొలి టెస్టు మూడున్నర రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.అయితే, పేసర్లకు అనుకూలంగా ఉండే ఎర్రమట్టి పిచ్‌పై జరిగిన భారత్- బంగ్లా మ్యాచ్‌లో ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటగా.. పాతబడే కొద్ది స్పిన్నర్లు దుమ్ములేపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. చెన్నై పిచ్ క్యూరేటర్ల పనితనాన్ని ప్రశంసించాడు.ప్రతి బౌలర్ వికెట్లు తీశాడు‘‘బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. జడేజా ఐదు వికెట్లు కూల్చాడు. సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా టీమిండియా 20 వికెట్లూ పడగొట్టింది. జట్టులోని ప్రతి బౌలర్ అన్ని రకాలుగా పరీక్షలో పాసయ్యారు.మా వాళ్లకు ఇలాంటివి సాధ్యం కావుపిచ్ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేసిన భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లనూ తుదిజట్టులోకి తీసుకుంది. అందుకు తగ్గట్లుగానే మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్ బౌలర్లు ప్రభావం చూపారు. ఈ మ్యాచ్ ఇంత బాగా సాగడానికి కారణం పిచ్ క్యూరేటర్లు. క్రెడిట్ మొత్తం వాళ్లకే ఇవ్వాలి. టెస్టు మ్యాచ్‌ను ఎలా నిర్వహించాలో వారికి ఎంతబాగా తెలుసో మ్యాచ్ చూశాక అర్థమైంది.మా వాళ్లకు మాత్రం ఇలాంటివి సాధ్యం కావు. మా దేశంలో పిచ్‌లకు ఎలాంటి విలువా లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్లు నిరక్షరాస్యులేనని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడినందుకు గర్వపడే తనకు.. ఇప్పటి పిచ్ క్యూరేటర్లను చూసి కోపం వస్తోందంటూ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఆడించింది.చదవండి: రోహిత్‌పై విమర్శలు.. ఎన్ని పరుగులు చేస్తారో చేయండి! పంత్ చెప్పిందిదే! -
IPL 2024: కోల్‌కతాకే కిరీటం
సన్‌రైజర్స్ అభిమానులకు తీవ్ర వేదన... లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌కు కొత్త పాఠాలు నేర్పిన టీమ్ అదే బ్యాటింగ్ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిలపడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్ శర్మ, హెడ్ లాంటి హిట్టర్లు వెనుదిరగ్గా... క్లాసెన్‌కు కూడా కాలం కలిసిరాని వేళ జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకూ సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్ అందుకొని సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్ 2018 తరహాలో ఫైనల్‌కే పరిమితమై నిరాశలో మునిగింది. ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ. 20 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చెన్నై: పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మళ్లీ ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెపాక్ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరులో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్‌రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రహ్మానుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 45 బంతుల్లో 91పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సమష్టి వైఫల్యం... తొలి ఓవర్లో స్టార్క్ వేసిన అద్భుత బంతికి అభిõÙక్ శర్మ (2) క్లీన్‌బౌల్డ్ కావడంతో మొదలైన సన్‌రైజర్స్ పతనం వేగంగా సాగింది. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఏ దశలోనూ హైదరాబాద్ తిరిగి కోలుకోలేకపోయింది. హెడ్ (0) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆడిన తొలి బంతికి అవుటై మరో డకౌట్ ఖాతాలో వేసుకున్నాడు. త్రిపాఠి (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఈసారి ఆదుకోలేకపోగా, నితీశ్ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), షహబాజ్ (7 బంతుల్లో 8; 1 సిక్స్), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు మార్క్రమ్ (23 బంతుల్లో 20; 3 ఫోర్లు) పరుగులు తీయడానికి ఇబ్బంది పడగా... క్లాసెన్ (17 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోరు 90/7. క్లాసెన్ క్రీజ్‌లో ఉండటంతో చివరి 6 ఓవర్లలోనైనా ఎక్కువ పరుగులు సాధించవచ్చని రైజర్స్ ఆశించింది. అయితే తర్వాతి బంతికే అతను బౌల్డ్ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో కమిన్స్ కొన్ని పరుగులు జత చేసి స్కోరును 100 దాటించాడు. ఫటాఫట్... స్వల్ప ఛేదనలో కేకేఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. నరైన్ (2 బంతుల్లో 6; 1 సిక్స్) ఆరంభంలోనే వెనుదిరిగినా... వెంకటేశ్, గుర్బాజ్ వేగంగా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన వెంకటేశ్, ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది లక్ష్యాన్ని మరింత సులువగా మార్చేశాడు. 24 బంతుల్లోనే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 12 పరుగుల దూరంలో గుర్బాజ్ అవుటైనా... వెంకటేశ్, కెపె్టన్ శ్రేయస్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) కలిసి ఆట ముగించారు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) స్టార్క్ 2; హెడ్ (సి) గుర్బాజ్ (బి) వైభవ్ అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; మార్క్రమ్ (సి) స్టార్క్ (బి) రసెల్ 20; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ రాణా 13; క్లాసెన్ (బి) హర్షిత్ రాణా 16; షహబాజ్ (సి) నరైన్ (బి) వరుణ్ 8; సమద్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 4; కమిన్స్ (సి) స్టార్క్ (బి) రసెల్ 24; జైదేవ్ ఉనాద్కట్ (ఎల్బీ) (బి) నరైన్ 4; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–6, 3–21, 4–47, 5–62, 6–71, 7–77, 8–90, 9–113, 10– 113. బౌలింగ్: స్టార్క్ 3–0–14–2, వైభవ్ అరోరా 3–0–24–1, హర్షిత్ రాణా 4–1–24– 2, నరైన్ 4–0–16–1, రసెల్ 2.3–0– 19–3, వరుణ్ చక్రవర్తి 2–0–9–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీ) (బి) షహబాజ్ 39; నరైన్ (సి) షహబాజ్ (బి) కమిన్స్ 6; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 52; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–11, 2–102. బౌలింగ్: భువనేశ్వర్ 2–0– 25–0, కమిన్స్ 2–0–18–1, నటరాజన్ 2–0– 29–0, షహబాజ్ 2.3–0–22–1, ఉనాద్కట్ 1–0–9–0, మార్క్రమ్ 1–0–5–0. ఐపీఎల్–17 బౌండరీ మీటర్ మొత్తం సిక్స్‌లు: 1260 మొత్తం ఫోర్లు: 2174 -
MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్– రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం చెపాక్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీని చూడడానికి ఢిల్లీ నుండి చెన్నైకి వచ్చిన గౌరవ్ (19) అనే యువకుడు.. చెన్నై సూపర్‌స్టార్ మహేంద్ర సింగ్ ధోనీని వ్యక్తిగతంగా చూసిన తరువాతనే ఢిల్లీకి వెళ్తానంటూ అభిమానాన్ని చాటుకున్నాడు.ధోనీకి వీరాభిమాని అయిన గౌరవ్ తలాను కలిసేందుకు సైకిల్‌పై 23 రోజుల పాటు ప్రయాణించి ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చాడు. దాదాపు 2100 కిలో మీటర్ల ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయక చెన్నై చేరుకున్నాడు. స్నేహితులు ఇచ్చిన టికెట్‌తో రాజస్తాన్ రాయల్స్, చెన్నై మధ్య మ్యాచ్‌ను చూశాడు. ఈ క్రమంలో ధోనిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఢిల్లీకి తిరిగి వెళుతానంటూ చేపాక్కం మైదానం 9వ గేట్ ప్రవేశ ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. తానూ క్రీడాకారుడిగా ఎదగాలనుకుంటున్నానని.. ధోని అంటే అభిమానం ఉన్నందు వల్లే ఈ సాహసం చేశానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. From Delhi to Den! Yellove has no boundaries 🫶A tale of sheer passion and unconditional love that transcends distance and time!🥹💛#WhistlePodu #Yellove pic.twitter.com/YtrG96yHXp— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2024ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్ సేనను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రుతురాజ్ గైక్వాడ్ బృందం ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరుగుతూ ఉత్సాహపరిచిన విషయం తెలిసిందే. కాగా.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా చెన్నై జట్టు ఆర్సీబీతో తలపడనుంది. బెంగళూరు వేదికగా మే 18న ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు -
పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కేకు స్టార్ ప్లేయర్స్ దూరం
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో ఉన్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసారిగా గెవాల్సిందే. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్లు మతీషా పతిరానా, తుషార్ దేశ్‌పాండే దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో శార్ధూల్ ఠాకూర్, గ్లీసన్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఎటువంటి మార్పలు లేకుండా బరిలోకి దిగంది.తుది జట్లుపంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్చెన్నై సూపర్ కింగ్స్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్ -
IPL 2024: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్
క్రికెట్ సర్కిల్స్‌లో ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు కేరింతలు పెడతారు. ధోని హోం గ్రౌండ్ (ఐపీఎల్) చెపాక్ స్టేడియంలో అయితే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ధోని స్క్రీన్‌పై కనిపిస్తే చాలు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ధోని నామస్మరణతో వచ్చే సౌండ్లకు చెవులు చిల్లులు పడతాయి. నిన్న సీఎస్కే, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగుతుండగా అభిమానులు చేసిన రచ్చ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో ధోని ఫ్యాన్స్ చేసిన సౌండ్లకు మైదానంలో ఉన్నవారి కర్ణభేరులు పగిలిపోయుంటాయి. ధోని బరిలోకి దిగుతున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ ఆటగాడు రసెల్ అయితే ఫ్యాన్స్ చేసిన శబ్దాలు తట్టుకోలేక చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అట్లుంటది ధోని ఫ్యాన్స్‌తోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. Russell's reaction is Gold. 😄👌 - The Craze for Dhoni....!!!!!pic.twitter.com/r7iePy96Op — Johns. (@CricCrazyJohns) April 8, 2024 కాగా, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. The Goosebumps entry in IPL history. - MS Dhoni, the face of IPL. 🦁pic.twitter.com/7nxy7Kdhpn — Johns. (@CricCrazyJohns) April 8, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ బ్రో.. ఇంత అందాన్ని మర్చిపోయారా?
కోలీవుడ్ భామ ఇటీవలే హనుమాన్ సినిమాతో అలరించారు. తేజ సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది టాలీవుడ్లో వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. అయితే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన బ్యూటీ.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెనే లేడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మ్యాచ్‌లో తళుక్కున మెరిసింది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వరలక్ష్మి సందడి చేసింది. చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్‌లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్‌లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు.. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మరిచిపోయారు? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Cameraman ka focus Aaj kahan hai 🙄🤪Itna glamor nahi notice kiya ? pic.twitter.com/bJqvmluOo8 — aCute 📐 (@chaoticalm_090) March 26, 2024 -
CWC 2023 IND VS AUS: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (అక్టోబర్ 8) హైఓల్టేజీ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు. వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ జరగదేమోనని దిగులుపెట్టున్నారు. అయితే ఇవాళ ఉదయం చెపాక్ పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితి చూస్తే వర్షం వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఢోకా ఉండదేమోనని అనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ ఎండ విపరీతంగా కాస్తుంది. వర్షం పడే ఛాయలు అస్సలు కనిపించడం లేదు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అగ్రశ్రేణి జట్ల మధ్య పూర్తి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుందని సంబరపడిపోతున్నారు. కాగా, చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఇవాళ చెపాక్ మైదాన పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా.. రాత్రి ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్‌గా ఉండనుంది. చీకటి పడ్డాక మైదాన ప్రాంతంలో జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా వాష్ అవుట్ అయ్యే ప్రమాదం మాత్రం లేదని వాతావరణ శాఖ హెచ్చరించింది . ఇదిలా ఉంటే, ఇవాల్టి మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా దూరం కానున్నారని తెలుస్తుంది. డెంగ్యూ కారణంగా గిల్, చేతి గాయం కారణంగా హార్దిక్ ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయావకాశలపై భారీ ప్రభావం పడటం ఖాయం. మరోవైపు గాయాల బెడద ఆసీస్‌ను కూడా వేధిస్తుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరో ఆటగాడు ఆడమ్ జంపా నిన్న స్విమ్మింగ్ పూల్‌లో గాయపడ్డాడని తెలుస్తుంది. అయితే జంపా గాయాలు తీవ్రమైనవి కాకపోవడంతో అతను భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. భారత్-ఆసీస్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా).. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్/హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ -
చెపాక్‌లో ఇదే చివరిసారి అనుకున్నారేమో..!
ఐపీఎల్ 16వ సీజన్లో ఫైనల్ చేరుకున్న సీఎస్కే కూల్‌గా ఉంది. ఇవాళ(మే 26న) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. ఆదివారం(మే 28న) జరగనున్న ఫైనల్లో సీఎస్కే.. గుజరాత్, ముంబై ఇండియన్స్‌లో ఎవరిని ఎదుర్కోనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సీజన్లో సీఎస్కే టైటిల్ కొడితే ధోని రిటైర్ అవుతాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా గాసిప్స్ వదులుతూనే ఉన్నారు. ధోని కూడా వచ్చే సీజన్లో తాను ఆడేది లేనిది మరో ఎనిమిది-తొమ్మిది నెలల్లో చెబుతానని పేర్కొన్నాడు. అందుకే ఈ సీజన్లో సీఎస్కే కప్ కొడితే.. వచ్చే సీజన్లో ధోని జట్టుకు ప్లేయర్‌గా కాకుండా మెంటార్‌గా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే ఫైనల్ చేరుకున్న సీఎస్కే తమ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. శుక్రవారం(మే26న) సీఎస్కే జట్టు అహ్మదాబాద్‌కు చేరుకోనుంది. ఇక సీఎస్కే కెప్టెన్ ధోని మాత్రం చెపాక్ గ్రౌండ్ సిబ్బందితో సరదాగా గడిపాడు. దాదాపు 16 ఏళ్ల పాటు తనపై అభిమానం పెంచుకున్న చెపాక్ స్టేడియం సిబ్బందికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చి క్యాష్ రివార్డ్స్ అందజేశాడు. అంతేకాదు వారికి థ్యాంక్స్ గివింగ్ టోకెన్ అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ '' చెపాక్‌లో చివరిసారి అనుకున్నారు.. అందుకే తలాపై అభిమానంతో'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Anbuden Thala - A mark of respect for the markers and the ground staff who toil hard to make us game ready! 💛📹#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/MTyFpvEWud — Chennai Super Kings (@ChennaiIPL) May 25, 2023 చదవండి: #MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే! -
చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే?
ఐపీఎల్-2023లో భాగంగా మే20న అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు సీఎస్కేను ఓ వివాదం చుట్టుముట్టుంది. సీఎస్కే మెనెజ్‌మెంట్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు. సీఎస్కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్ కోర్టులో మే17న ఫిటిషిన్ వేశారు. కాగా ఇప్పటివరకు సీఎస్కే తమ హోం గ్రౌండ్ చెపాక్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఏడు మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బ్లాక్‌లో విక్రయించందని వార్తలు వినిపిస్తున్నాయి. రూ.1500, 2000 ధరలుగా వుండే లోయర్ స్టాండ్ టిక్కెట్లను 8,000 రూపాయలకు విక్రయించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అందులో సీఎస్కే మెనెజ్‌మెంట్ పాత్ర కూడా ఉంది అని పలువరు అరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్ చక్రవర్తి అనే అడ్వకేట్ కేసు ఫైల్ చేశారు. "ఏంఎ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాలలో అక్రమాలు, బ్లాక్ మార్కెట్, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరగతున్నాయి. ఇందుకు సంబంధించి నేను ఈ రోజు సివిల్ కోర్టులో కేసు వేశాను. చెన్నై సూపర్ కింగ్స్, బీసీసీఐ, టీఎన్‌సీఏలపై ఫిటిషిన్ దాఖలు చేశాను" అని అశోక్ చక్రవర్తి తన ఫేస్బుక్ పోస్టు చేశారు. కాగా చెన్నై వేదికగానే ఈ ఏడాది ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అంతకుతోడు సీఎస్కే సారధి ఎంఎస్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని ప్రచారం జరగతుండడంతో.. అభిమానులు ఎంత ధర చెల్లించడానికైనా సిద్దమవుతున్నారు. చదవండి: గావస్కర్.. సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? టీమిండియా యువ ఓపెనర్లకు చురకలు! -
ధోనికి సీఎస్కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు ఉద్వేగానికి లోనయ్యేవాడు!
MS Dhoni- CSK: టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి చెన్నై అన్నా.. అక్కడి మనుషులన్నా మహా ఇష్టమని.. నగరంతో అతడి అనుబంధం విడదీయలేనిదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైనా మిస్టర్ కూల్‌కు అమితమైన ప్రేమ ఉందని పేర్కొన్నాడు. అదే విధంగా ధోని పట్ల కూడా చెన్నై ప్రజలకు ఉన్న ప్రేమ వెలకట్టలేదని.. చెపాక్‌లో ఆదివారం నాటి దృశ్యాలే ఇందుకు నిదర్శనమని పీటర్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 లీగ్ దశలో సీఎస్కే ఆదివారం తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నేపథ్యంలో.. మైదానంలో చోటుచేసుకున్న దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. అరుదైన దృశ్యాలు కేకేఆర్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి తర్వాత ధోని ముందుండి నడుస్తుండగా సీఎస్కే బృందం అతడిని అనుసరించింది. ఈ సందర్భంగా ధోని తాను సంతకం చేసిన టెన్నిస్ బంతులను స్టాండ్స్‌లోకి విసరగా.. వాటిని అందుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే ఏకంగా తన షర్టు మీద ఆటోగ్రాఫ్ తీసుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పీటర్సన్ మాట్లాడుతూ ధోనితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ‘‘ధోని ఆటగాళ్లందరికీ స్ఫూర్తిదాయకం. అతడి కోసమైనా మనమంతా జట్టుగా బాగా ఆడాలి అనే ఫీలింగ్ వస్తుంది. అతడి కెప్టెన్సీ అలా ఉంటుంది మరి! గత కొన్నేళ్లుగా మిస్టర్ కూల్‌ను చూస్తూనే ఉన్నాం. జట్టు పట్ల, ఆటగాళ్ల పట్ల అతడు పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తాడు. అలాంటి కెప్టెన్ ఉంటే ప్లేయర్లంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు’’ అని పీటర్సన్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోని ఉద్వేగానికి లోనయ్యేవాడు ఇక రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు ఆడే సమయంలో ధోనిని దగ్గరగా గమనించానన్న పీటర్సన్.. ధోనికి సీఎస్కే అంటే ఎంతో ఇష్టమని, ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ అతడు భావోద్వేగానికి లోనయ్యేవాడని గుర్తు చేసుకున్నాడు. కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగా కూడా ధోని ఒక అద్భుతం అంటూ కొనియాడాడు. ‘‘ధోని చూసేందుకు జనాలు ఎలా ఎగబడుతున్నారో చూడండి. తనని తాకేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం ఓ క్రికెటర్‌గానే కాదు మనిషిగానూ అతడిది అసాధారణ వ్యక్తిత్వం. ఈ అద్భుత దృశ్యాలు ఇందుకు నిదర్శనం. భావోద్వేగ క్షణాలు. చూడటానికి ఎంతో బాగుంది’’ అని పీటర్సన్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఎస్కేపై నిషేధం విధించగా.. 2016, 2017 సీజన్లలో ధోని పుణె ఫ్రాంఛైజీకి మారిన ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో పీటర్సన్ ధోనితో కలిసి ఆడాడు. చదవండి: ‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు! 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన భారత్ 248 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆసీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొమ్మిదో వికెట్ డౌన్.. ఓటమి అంచుల్లో భారత్ టీమిండియా 243 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిక్సర్, ఫోర్ కొట్టిన అనంతరం షమీ స్టొయినిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్.. ఓటమి దిశగా భారత్ 225 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి జడేజా (18) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే 29 బంతుల్లో 45 పరుగులు చేయాలి. కుల్దీప్ (1), షమీ క్రీజ్‌లో ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. హార్ధిక్ ఔట్ 218 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్నోయింది. జంపా బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి హార్ధిక్ (40) ఔటయ్యాడు. భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే 38 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉంది. వరుస బంతుల్లో వికెట్లు కోల్నోయిన భారత్.. స్కై మరోసారి గోల్డన్ డక్ 185 పరుగుల వద్ద టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్నోయింది. 36వ ఓవర్ తొలి బంతికి కోహ్లిని (54) ఔట్ చేసిన అగర్, ఆతర్వాతి బంతికే సూర్యకుమార్‌కు (0) క్లీన్ బౌల్డ్ చేశాడు. సూర్యకుమార్‌కు ఇది హ్యాట్రిక్ గోల్డన్ డకౌట్ కావడం విశేషం. హార్ధిక్ (28), జడేజా క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 88 బంతుల్లో 85 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అక్షర్ పటేల్ రనౌట్ 7 బంతుల వ్యవధిలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. భారీ షాట్‌కు ప్రయత్నించి తొలుత రాహుల్ ఔట్ కాగా.. ఆతర్వాత అక్షర్ పటేల్ (2) రనౌటయ్యాడు. కోహ్లి (48), హార్ధిక్ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ ఔట్ 146 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కేఎల్ రాహుల్ (32) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (45), అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 22.1 ఓవర్లలో 124 పరుగులు చేయాల్సి ఉంది. నిలకడగా ఆడుతున్న కోహ్లి, రాహుల్ 77 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్.. ఆతర్వాత మరో వికట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 23 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/2గా ఉంది. విరాట్ కోహ్లి (33), కేఎల్ రాహుల్ (15) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ (37) ఔట్ 77 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (37) ఎల్బీడబ్యూ ఔట్ అయ్యాడు. కోహ్లి (8), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ (30) ఔట్ 65 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ (30) ఔటయ్యాడు. గిల్ (33), విరాట్ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్లకు భారత్ స్కోర్: 65/0 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(30), శుబ్‌మన్ గిల్(33) పరుగులతో ఉన్నారు. రాణించిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్ 270 పరుగులు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(47), కారీ(38), హెడ్(33) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్ పటేల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 43 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 229/7 43 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. క్రీజులో అగర్(8), అబాట్(18) పరుగులతో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 196 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన స్టోయినిష్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 28.1: ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా లబుషేన్ రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి లబుషేన్(28) పెవిలియన్ చేరాడు. ఆసీస్ స్కోరు: 138/5 (28.1). స్టొయినిస్, క్యారీ క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 128-4 నాలుగో వికెట్ డౌన్ 24.3: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్న అతడు 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. లబుషేన్, అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్నారు. వారెవ్వా హార్దిక్.. మార్ష్ క్లీన్ బౌల్డ్ ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 47 పరుగులతో దూకుడుగా ఆడుతోన్న మిచెల్ మార్ష్‌ను హార్దిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇప్పటివరకు టీమిండియా సాధించిన మూడు వికెట్లు కూడా హార్దిక్ పడగొట్టినవే కావడం గమనార్హం. 15 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 87/3 రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి డేవిడ్ వార్నర్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ ఔట్ 68 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. ►5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 39/0 ►రెండు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(9), హెడ్(4) పరుగులతో ఉన్నారు. చెపాక్ వేదికగా సిరీస్‌ను డిసైడ్ చేసే మూడో వన్డేలో తలపడేందుకు భారత్- ఆస్ట్రేలియా జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. చెన్నై లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో కూడా చోటు దక్కలేదు ఇక ఆస్ట్రేలియా మాత్రం రెండు మార్పులు చేసింది. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచ్‌కు జట్టులోకి వచ్చాడు. అదే విధంగా స్పిన్నర్ అగర్‌కు కూడా తుది జట్టు చోటు దక్కింది. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! సూర్యకు ఆఖరి ఛాన్స్
విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఘోర పరాభావం చవి చూసిన టీమిండియా.. ఇప్పుడు కీలకమైన మూడో వన్డేకు సిద్దమైంది. బుధవారం(మార్చి 22)న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి వన్డేలో భారత్-ఆసీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో వన్డేలో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన సుందర్‌ను, తన హోం గ్రౌండ్ చెపాక్‌లో ఖచ్చితంగా ఆడించాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడట. అదే విధంగా తొలి రెండు వన్డేల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వాలని జట్టు మెనెజెమెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టును మూడో వన్డేకు కొనసాగించాలని ఆసీస్ మెనెజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పిచ్ రిపోర్ట్ చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గదామం వంటింది. స్పిన్నర్లకు అనుకూలమైన ఈ పిచ్‌లో పరుగులు తియ్యడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ పిచ్ రెండవ ఇన్నింగ్స్‌లో చాలా నెమ్మదిగా ఉంటుంది. రాత్రి మ్యాచ్‌లో మంచు ముఖ్యమైన అంశం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు భారత్ తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ చదవండి: టీమిండియాలో నాలా బ్యాటింగ్ చేసే ఆటగాడే లేడు.. కానీ వాళ్లిద్దరు మాత్రం! -
ధోని ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఫేర్వెల్ గేమ్ అక్కడే..!
Dhoni Hints Playing Fare Well Game In Chennai: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నాటి నుంచి అతని ఐపీఎల్ రిటైర్మెంట్పై కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు, అప్పుడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే వీటన్నిటిపై మాహీ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. తన ఐపీఎల్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని.. వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడతానని.. తన ఫేర్వెల్ గేమ్ చెన్నైలోని చెపాక్‌లోనే ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించాడు. తాజాగా తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇండియా సిమెంట్స్‌కు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ.. తన ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటనతో సీఎస్కే అభిమానులతో పాటు ధోని వ్యక్తిగత అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సోషల్‌మీడియా వేదికగా తెగ హల్చల్ చేస్తున్నారు. కాగా, ధోని.. 2019 ఐపీఎల్లో చివరిసారిగా చెన్నైలో ఆడాడు. గతేడాది ఐపీఎల్ యూఏఈలో జరగగా.. ఈ ఏడాది తొలి అంచె పోటీలు భారత్‌లో జరిగినా కరోనా కేసుల కారణంగా తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. ఇదిలా ఉంటే, వచ్చే సీజన్ కోసం జరుగబోయే మెగా వేలానికి ముందు ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లను సీఎస్కే జట్టు రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చదవండి: పాక్‌తో పోరుకు ముందు అగ్రశ్రేణి జట్లను ఢీకొట్టనున్న కోహ్లి సేన.. షెడ్యూల్ ఇదే -
IPL 2021 SRH vs DC: మరో గెలుపే లక్ష్యంగా...
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు వరుస పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన హైదరాబాద్... నేడు ఇక్కడి చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మరో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో, బ్యాట్‌తో మెరిసి తొలి విజయాన్ని అందుకున్న వార్నర్ బృందం ఆత్మ విశ్వాసంతో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే ఓడి మూడింటిలో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్‌కు చెక్ పెట్టేందుకు రెడీగా ఉంది. మరోసారి స్పిన్నర్లే కీలకం ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై ఆతిథ్యమివ్వనున్న చివరి మ్యాచ్ ఇదే. ఇప్పటి వరకు ఇక్కడ 9 మ్యాచ్‌లు జరగ్గా... కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఇరు జట్లు కూడా 150కిపైగా స్కోర్లను నమోదు చేశాయి. అంటే ఇక్కడి పిచ్ ఎంత మందకొడిగా ఉందో అర్థమవుతోంది. దాంతో హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్‌లో కూడా మరోసారి బౌలర్లే కీలకం కానున్నారు. అయితే బౌలర్ల గాయాలు హైదరాబాద్‌ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే మోకాలి గాయంతో నటరాజన్ ఐపీఎల్ నుంచి తప్పుకోగా... తొడ కండరాలు పట్టేయడంతో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే పేసర్ భువనేశ్వర్ కుమార్ మైదానం వీడాడు. ఆ మ్యాచ్‌లో అతడు తన పూర్తి కోటా ఓవర్లను వేయలేదు. దాంతో భువనేశ్వర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేది అనుమానమే. హైదరాబాద్‌కు నమ్మకమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్ ఖాన్ ఈ సీజన్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ ఖలీల్ అహ్మద్, ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మలు బౌలింగ్‌లో సత్తా చాటారు. కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడంతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా బెయిర్‌స్టో సూపర్ ఫామ్‌లో ఉండగా... వార్నర్ కూడా పరుగులు సాధిస్తున్నాడు. ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే మరో ఓపెనర్ పృథ్వీ షా ఫామ్ జట్టును కలవరపెడుతోంది. అతడు గాడిన పడాల్సి ఉంది. రిషభ్ పంత్, స్టీవ్ స్మిత్, హెట్‌మైర్, స్టొయినిస్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్లు ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు రెడీగా ఉన్నారు. ముఖాముఖి పోరులో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు జరగ్గా... హైదరాబాద్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఢిల్లీ ఏడింటిలో గెలిచింది. -
చెన్నపట్నం చిన్నోడు.. రవిచంద్రన్ అశ్విన్
‘చెపాక్ మైదానంలో సెంచరీ చేయడం నా చిన్ననాటి కల’... కొన్నాళ్ల క్రితం రవిచంద్రన్ అశ్విన్ చెప్పిన మాట ఇది. 34 ఏళ్ల వయసులో కెరీర్ దాదాపు చివరి దశకు వచ్చిన తర్వాత అతను తన కోరికను నెరవేర్చుకున్నాడు. మళ్లీ చెన్నైలో అతను ఎప్పుడు టెస్టు ఆడగలడో తెలీదు కానీ సోమవారం మాత్రం అతను తన బ్యాటింగ్‌లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాడు. అందుకే శతకం పూర్తయ్యాక తనకు అండగా నిలిచిన అభిమానులను ఎవరినీ మరచిపోలేదన్నట్లుగా ప్రేక్షకులు ఉన్న ప్రతీ ఒక్క గ్యాలరీ వైపు మళ్లీ మళ్లీ బ్యాట్ చూపిస్తూ ‘థ్యాంక్స్’ చెప్పాడు. ఒక బౌలర్‌గా సొంత మైదానంలో అశ్విన్ ఖాతాలో చెప్పుకోదగ్గ గణాంకాలే ఉన్నాయి. తాజా సిరీస్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అశ్విన్ అంతకుముందే మరో రెండుసార్లు చెన్నైలో ఈ ఘనత సాధించాడు. అయితే ఈసారి తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను అతను చిరస్మరణీయం చేసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా కెరీర్ మొదలు పెట్టి జూనియర్ స్థాయి వరకు అలాగే కొనసాగి ఆపై ఆఫ్‌స్పిన్నర్‌గా మారిన అశ్విన్‌లోని అసలైన బ్యాట్స్‌మన్ ఇక్కడ మళ్లీ కనిపించాడు. నిజానికి కెరీర్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చినా ఆ తర్వాత అశ్విన్ బ్యాటింగ్ కళ మసకబారింది. 2017 ఆగస్టు తర్వాత అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే ఇటీవల సిడ్నీలో మ్యాచ్‌ను కాపాడిన ఇన్నింగ్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ఈ సిరీస్‌లో కూడా జడేజా లేకపోవడంతో బ్యాటింగ్‌పరంగా కూడా అశ్విన్‌పై బాధ్యత పెరిగింది. అయితే గతంలో అతను సాధించిన నాలుగు టెస్టు సెంచరీలతో (అన్నీ వెస్టిండీస్‌పైనే) పోలిస్తే సోమవారం పరిస్థితులు భిన్నం. అశ్విన్ క్రీజ్‌లో వచ్చే సమయానికి భారత్ మంచి ఆధిక్యంలో ఉన్నా సరే... పిచ్ అంత అనుకూలంగా లేదు. పరుగులు సునాయాసంగా వచ్చేలా కనిపించడం లేదు. ఒకే సెషన్లో జట్టు ఐదు వికెట్లు కోల్పోయిందంటే ఇకపై ఎలా ఆడాలన్న ఒక సందిగ్ధతతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ దశలో అతను అతను తన ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన ఈ మదరాసీ తొలి ఐదు బంతుల్లోనే రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అతని ఇన్నింగ్స్‌లో స్వీప్ షాట్లు హైలైట్‌గా నిలిచాయి. చదవండి: (వహ్వా.. చెపాక్ తలైవా!) మొదటి నాలుగు బౌండరీలను స్వీప్ ద్వారానే రాబట్టిన అశ్విన్ పదే పదే ఆ షాట్‌తో ఫలితం సాధించాడు. ‘ఎప్పుడో అండర్–19 స్థాయిలో స్వీప్ షాట్లు ఆడాను. వాటి కారణంగా తుది జట్టులో చోటు పోవడంతో వదిలేశాను. గత 13–14 ఏళ్లుగా స్వీప్ షాట్ ఆడనే లేదు. ఇప్పుడు మాత్రం పిచ్‌ను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా సాధన చేశాను’ అని అతను స్వయంగా చెప్పాడు. 64 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సాహసవంతులకే అదృష్టం కూడా కలిసొస్తుందన్నట్లుగా రెండుసార్లు అశ్విన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్రాడ్ బౌలింగ్‌లో స్టోక్స్ క్యాచ్ వదిలేసినప్పుడు అశ్విన్ స్కోరు 29 పరుగులు కాగా, 56 పరుగుల వద్ద బ్రాడ్ బౌలింగ్‌లోనే కీపర్ ఫోక్స్ క్యాచ్ అందుకోలేకపోయాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి, కుల్దీప్, ఇషాంత్ తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో అశ్విన్ సెంచరీ సాధించడం దాదాపు అసాధ్యంగా అనిపించింది. చివరి బ్యాట్స్‌మన్ సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి అశ్విన్ స్కోరు 77 పరుగులు! ఈ దశలో సిరాజ్ పట్టుదలగా నిలబడి అశ్విన్‌కు సహకరించాడు. పదో వికెట్‌కు వీరిద్దరి మధ్య 49 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. లీచ్ బౌలింగ్‌లో ఫోర్‌తో 90ల్లోకి వచ్చిన అశ్విన్... అలీ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్‌లో సిక్సర్ బాది 97 వద్ద నిలిచాడు. అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా, బంతి స్లిప్స్ మీదుగా బౌండరీని చేరింది. అంతే... తన ఆనందాన్ని ప్రదర్శిస్తూ మైదానంలో అశ్విన్ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో సిరాజ్ కూడా తానే సెంచరీ చేసినంతగా సందడి చేయడం విశేషం. తాను ఓనమాలు నేర్చిన చోట బ్యాట్‌తోనూ అశ్విన్ సాధించిన ఈ ఘనత ఎప్పటికీ అతనికి ప్రత్యేకంగా నిలిచిపోతుంది. చదవండి: వైరల్: అశ్విన్ సెంచరీ.. సిరాజ్ స్పందన కాస్తైనా కనికరం లేదా అశ్విన్..! -
వహ్వా.. చెపాక్ తలైవా!
‘నేను చెప్పింది ఎలాగూ చేస్తాను... కానీ నేను చెప్పనిది కూడా చేస్తాను’... రజినీకాంత్ ‘అన్నామలై’ సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్ ఇది. రజినీకి వీరాభిమాని అయిన చెన్నై తలైవా రవిచంద్రన్ అశ్విన్ ఇదే మాట ఇంగ్లండ్ జట్టుకు చెప్పినట్లున్నాడు. తన బలమైన స్పిన్‌తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ చెలరేగాడు. స్పిన్ పిచ్, బ్యాటింగ్‌కు కష్టమంటూ చెబుతున్నవన్నీ ఒట్టి మాటలే అంటూ రుజువు చేస్తూ అశ్విన్ అనూహ్యంగా చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు నివ్వెరపోయింది. కీలక సమయంలో అద్భుత ప్రదర్శనతో సెంచరీ సాధించిన అతను రెండో టెస్టును పూర్తిగా టీమిండియా చేతుల్లోకి తెచ్చేశాడు. అసాధ్యమైన 482 పరుగుల లక్ష్య ఛేదనలో ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను మరో రెండు రోజులు ఎలాంటి వాన, తుఫాన్లు కూడా రక్షించే పరిస్థితి లేదు. అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్ టెస్టు’కు ముందు టెస్టు సిరీస్ 1–1తో సమం కావడం ఇక లాంఛనమే. చెన్నై: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. లారెన్స్ (19 బ్యాటింగ్), రూట్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 54/1తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. సూపర్ ఫోక్స్... మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సెషన్లో భారత్ ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. సోమవారమే తన 28వ పుట్టిన రోజు జరుపుకున్న వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఇందులో కీలకపాత్ర పోషించాడు. తొలి ఓవర్లోనే చతేశ్వర్ పుజారా (7) దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అలీ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడగా బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్ పోప్ వద్దకు వెళ్లింది. అతని త్రోను అందుకొని ఫోక్స్ స్టంప్స్‌ను పడగొట్టాడు. పుజారా సరైన సమయంలోనే వెనుదిరిగినా అతని బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోవడంతో రనౌట్ తప్పలేదు. అదే స్కోరు వద్ద ఫోక్స్ అద్భుత స్టంపింగ్‌తో రోహిత్ శర్మ (26) అవుటయ్యాడు. కొద్ది సేపటికే లీచ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన పంత్ (8)ను కూడా ఫోక్స్ స్టంపౌట్ చేశాడు. రహానే (10) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అక్షర్ పటేల్ (7) వికెట్ల ముందు దొరికిపోయాడు. 1968 (అలెన్ నాట్) తర్వాత ఒక ఇంగ్లండ్ వికెట్ కీపర్ టెస్టు మ్యాచ్‌లో మూడు స్టంపింగ్‌లు చేయడం (ఫోక్స్) ఇదే మొదటిసారి. కోహ్లి నిలకడ... భారత్ స్కోరు 106/6గా నిలిచిన దశలో జట్టును ఆదుకునే బాధ్యత కోహ్లి తనపై వేసుకున్నాడు. అశ్విన్ సహకారంతో అతను ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ 20వ బంతికి గానీ తొలి పరుగు తీయని కెప్టెన్... నిలదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. లంచ్ తర్వాత మరింత ఆత్మవిశ్వాసం ప్రదర్శించిన కోహ్లి 107 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి, అశ్విన్ భాగస్వామ్యం శతకానికి చేరువవుతున్న దశలో అలీ ఈ జోడీని విడదీశాడు. అలీ బౌలింగ్‌లో విరాట్ ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. అంపైర్ నిర్ణయంపై అతను రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. కుల్దీప్ (3), ఇషాంత్ (7) తొందరగానే వెనుదిరిగినా అశ్విన్‌కు సిరాజ్ (16 నాటౌట్) అండగా నిలిచాడు. చివర్లో సిరాజ్ రెండు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. అశ్విన్ సెంచరీ తర్వాత కూడా భారత జట్టు డిక్లేర్ చేయకుండా ఆలౌట్ అయ్యే వరకు ఆటను కొనసాగించింది. రోహిత్ స్టంపౌట్ అదే తడబాటు... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కాస్త పట్టుదల కనబర్చలేకపోయారు. అక్షర్ బంతిని ఆడలేక సిబ్లీ (3) వికెట్ల ముందు దొరికిపోగా, దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన రోరీ బర్న్స్ (25) ఆటను అశ్విన్ ముగించాడు. నైట్ వాచ్‌మన్ లీచ్ (0) తొలి బంతికే వెనుదిరగడంతో రూట్ బరిలోకి దిగక తప్పలేదు. ఆ తర్వాత రూట్ విషయంలో అంపైర్ నిర్ణయం కోహ్లి ఆగ్రహానికి కారణమైంది. కోహ్లికి కోపమొచ్చింది... ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ అవుట్ కోసం భారత్ చేసిన అప్పీల్ఫలితం ప్రతికూలంగా రావడం విరాట్ కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. అక్షర్ బౌలింగ్‌లో క్యాచ్ పట్టిన పంత్ అప్పీల్ చేయగా, అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో భారత్ రివ్యూ కోరింది. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని స్పష్టం కావడంతో ఎల్బీడబ్ల్యూ కోసం కూడా థర్డ్ అంపైర్ చెక్ చేశాడు. వికెట్ల ముందే రూట్ ప్యాడ్‌కు బంతి తగిలినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా... బాల్ ట్రాకర్ ప్రకారం ‘అంపైర్ కాల్’ అంటూ థర్డ్ అంపైర్ ప్రకటించడంతో రూట్ బతికిపోయాడు. దీనిపై కోహ్లి అంపైర్‌తో వాదనకు దిగగా, మైదానం బయట నుంచి హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 329; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 134; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) లీచ్ 26; గిల్ (ఎల్బీ) (బి) లీచ్ 14; పుజారా (రనౌట్) 7; కోహ్లి (ఎల్బీ) (బి) అలీ 62; పంత్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) లీచ్ 8; రహానే (సి) పోప్ (బి) అలీ 10; అక్షర్ (ఎల్బీ) (బి) అలీ 7; అశ్విన్ (బి) స్టోన్ 106; కుల్దీప్ (ఎల్బీ) (బి) అలీ 3; ఇషాంత్ (సి) స్టోన్ (బి) లీచ్ 7; సిరాజ్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (85.5 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–42, 2–55, 3–55, 4–65, 5–86, 6–106, 7–202, 8–210, 9–237, 10–286. బౌలింగ్: స్టోన్ 6.5–1–21–1, లీచ్ 33–6–100–4, మొయిన్ అలీ 32–7–98–4, రూట్ 4–0–15–0, స్టువర్ట్ బ్రాడ్ 9–3–25–0, లారెన్స్ 1–0–7–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 25; సిబ్లీ (ఎల్బీ) (బి) అక్షర్ 3; లారెన్స్ (బ్యాటింగ్) 19; లీచ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 0; రూట్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 53. వికెట్ల పతనం: 1–17, 2–49, 3–50. బౌలింగ్: ఇషాంత్ శర్మ 2–1–6–0, అక్షర్ పటేల్ 9–3–15–2, అశ్విన్ 8–1–28–1. ఒక టెస్టులో ఐదు వికెట్లు తీయడంతోపాటు సెంచరీ సాధించడం అశ్విన్‌కు మూడోసారి. రెండుసార్లు ఈ ఫీట్ చేసిన సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, కలిస్, షకీబ్‌లను అశ్విన్ అధిగమించగా... ఇయాన్ బోథమ్ (5 సార్లు) మాత్రమే ముందున్నాడు. సెంచరీతో పాటు మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన రికార్డు ఇప్పటి వరకు బోథమ్, ఇమ్రాన్ ఖాన్, షకీబ్ మాత్రమే నమోదు చేయగా, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ మరో 4 వికెట్లు తీస్తే వారి సరసన చేరతాడు. -
డకౌట్ల మధ్య నాకౌట్ ఇన్నింగ్స్
అనుకున్నట్లే పిచ్ మారింది. పూర్తిగా స్పిన్ వికెట్‌పై ఆట మొదలైంది. బంతి స్పిన్నర్ల చేతుల్లో గింగిర్లు తిరుగుతోంది. ఈ ఉచ్చులో గోడ (పుజారా) కూడా పడిపోయినా... సారథి కోహ్లి ఖాతానే తెరువలేకపోయినా... ఓపెనర్ రోహిత్ శర్మ ఏటికి ఎదురీదే ఇన్నింగ్స్‌తో నిలబడ్డాడు. పిచ్‌పై స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతున్నా... తను మాత్రం వారి పాలిట సింహస్వప్నమయ్యాడు. చక్కని పోరాటంతో భారీ సెంచరీ సాధించాడు. రహానే అర్ధశతకంతో రోహిత్‌కు అండగా నిలిచాడు. బలమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. దాంతో ఇంగ్లండ్‌తో శనివారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. స్పిన్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై భారత్ స్కోరు 400 పరుగులు దాటితే ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. చెన్నై: పిచ్ స్వభావం, స్పిన్నర్ల రాజసం చూస్తుంటే ఈ మ్యాచ్ ఫలితానికి ఐదు రోజులు అక్కర్లేదేమో! తొలిరోజు ఆటను చూసిన వారెవరైనా ఇదే అంటారు. ఈ టెస్టూ చెపాక్‌లోనే జరుగుతున్నా... మ్యాచ్ అయితే స్పిన్నర్ల చేతిలోనే తిరుగుతుంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ 300 పరుగులు చేయగలిగిందంటే... దానికి కారణం కచ్చితంగా ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (231 బంతుల్లో 161; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యద్భుత ఇన్నింగ్స్. ఏడాది తర్వాత మైదానంలోకి వచ్చిన ప్రేక్షకులకు తనదైన శైలిలో, దూకుడుతో క్రికెట్ మజాను అందించాడు రోహిత్. వైస్ కెప్టెన్ రహానే (149 బంతుల్లో 67; 9 ఫోర్లు) కూడా బాధ్యత పంచుకోవడంతో కీలకమైన వికెట్లు పడినా భారత్ మంచి స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు జాక్ లీచ్ (2/78), మొయిన్ అలీ (2/112) భారత జోరుకు బ్రేకులేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చి హైదరాబాద్ సీమర్ సిరాజ్‌కు అవకాశమిచ్చారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను, షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ జట్టు నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. బెస్ స్థానంలో మొయిన్ అలీ, అండర్సన్ స్థానంలో బ్రాడ్, ఆర్చర్ స్థానంలో ఓలీ స్టోన్, కీపర్ బట్లర్ స్థానంలో బెన్ ఫోక్స్ వచ్చారు. టాస్ గెలిచింది... గిల్ వికెట్‌తో మొదలైంది! స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగితే బంతిబంతికి సవాళ్లు ఎదురయ్యే ఈ పిచ్‌పై టాస్ గెలవడం భారత్‌కు కాస్త అనుకూలించింది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. కానీ భారత్ పరుగు కంటే ముందే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (0) డకౌటయ్యాడు. దీంతో ఆట ఆరంభంలోనే పుజారా (58 బంతుల్లో 21; 2 ఫోర్లు) ‘హిట్‌మ్యాన్’కు జతయ్యాడు. ఇద్దరు 20 ఓవర్లదాకా మరో వికెట్ పడిపోకుండా జాగ్రత్తగా ఆడారు. రోహిత్ మాత్రం డిఫెన్స్‌కే పరిమితం కాకుండా అప్పుడప్పుడు ఎదురుదాడి కూడా చేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు సాఫీగా సాగిపోయింది. కానీ 21వ, 22వ ఓవర్లు భారత్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. మొదట లీచ్... మొండిగా ఆడే పుజారాను పెవిలియన్ చేర్చాడు. తర్వాతి ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కోహ్లి (0)ని మొయిన్ అలీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. పిచ్‌పై పడిన బంతి అనూహ్యంగా వికెట్ల మీదికి దూసుకొచ్చి బెయిల్స్‌ను పడేసింది. ఇది అర్థంకాని కోహ్లి... ఔట్ కాదనుకొని రివ్యూకు వెళ్లాడు. మరుక్షణంలోనే పెద్ద తెరపై ‘ఔట్’ అని రావడంతో కెప్టెన్ నిష్క్రమించాడు. 106/3 స్కోరు వద్ద టీమిండియా బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ సమయానికి భారత్ చేసిన స్కోరు లో రోహిత్‌వి 80 పరుగులు ఉండటం విశేషం. రోహిత్ శతకం రెండో సెషన్లో రోహిత్‌తో పాటు రహానే కూడా క్రీజులో పాతుకుపోవడంతో అనుభవజ్ఞుల ఆట ముందు ఇంగ్లండ్ స్పిన్నర్ల ఆటలేం సాగలేదు. దూకుడుగా ఆడిన రోహిత్ 130 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటే జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. మరోవైపు రహానే నింపాదిగా ఆడాడు. నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించాక జట్టు స్కోరు 189/3 వద్ద ‘టీ’విరామానికెళ్లారు. కట్టడి చేసిన స్పిన్నర్లు రోహిత్ జోరు, రహానే నిలకడ ట్రీ బ్రేక్ తర్వాత కూడా కొనసాగింది. 58వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. ఆ వెంటనే రహానే కూడా తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ భారీ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ జోడీ పర్యాటక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. ఈ క్రమంలోనే స్టార్ ఓపెనర్ 208 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులకు చేరువైన దశలో రోహిత్ శర్మను స్పిన్నర్ లీచ్ ఔట్ చేశాడు. దీంతో 162 పరుగుల నాలుగోవికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. పరుగు తేడాతో రహానే కూడా నిష్క్రమించడం భారత ఇన్నింగ్స్‌ను కుదిపేసింది. అనంతరం పంత్, అశ్విన్‌ల ఆట మొదలైంది. వీరి భాగస్వామ్యం కుదుట పడకముందే రూట్ తన స్పిన్ బౌలింగ్‌తో అశ్విన్ (13) వికెట్‌ను పడేశాడు. ఆట నిలిచే సమయానికి పంత్ (33 బ్యాటింగ్), అక్షర్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఇంగ్లండ్ బౌలర్లు ఒక్క పరుగును కూడా ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) మొయిన్ అలీ (బి) లీచ్ 161; శుబ్‌మన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోన్ 0; చతేశ్వర్ పుజారా (సి) స్టోక్స్ (బి) లీచ్ 21; విరాట్ కోహ్లి (బి) మొయిన్ అలీ 0; అజింక్య రహానే (బి) మొయిన్ అలీ 67; రిషభ్ పంత్ (బ్యాటింగ్) 33; అశ్విన్ (సి) పోప్ (బి) రూట్ 13; అక్షర్ పటేల్ (బ్యాటింగ్) 5; మొత్తం (88 ఓవర్లలో 6 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–0, 2–85, 3–86, 4–248, 5–249, 6–284. బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 11–2–37–0, ఒలీ స్టోన్ 15–5–42–1; లీచ్ 26–2–78–2; స్టోక్స్ 2–0–16–0, మొయిన్ అలీ 26–3–112–2; రూట్ 8–2–15–1. -
ఫ్యాన్స్‌తో కళకళలాడుతున్న చెపాక్
చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు బీసీసీఐ 50 శాతం ప్రేక్షకులను మైదానాల్లోకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చెపాక్ స్టేడియం అభిమానులతో కళకళలాడుతుంది. దాదాపు ఏడాది విరామం తర్వాత భారత్‌లో మ్యాచ్ జరగడంతో మైదానంలో మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. 50వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న చిదంబరం స్టేడియంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో 15వేల మందికి మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఈ సందర్భంగా బీసీసీఐ వీడియోను రిలీజ్ చేసింది. 'చెన్నై స్టేడియానికి కొత్త కళ వచ్చింది. సుధీర్ఘ కరోనా విరామం తర్వాత మైదానంలో అభిమానులను చూడడం సంతోషంగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫేస్ మాస్క్ ఉన్న ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించినట్లు తెలిపారు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరు రూల్స్ పాటించడకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో మాత్రం ఓపెనర్ రోహిత్ శర్మ 80 పరుగులతో దాటిగా ఆడుతుండడంతో లంచ్ విరామం సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రహానే 5 పరగులతో రోహిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు కెప్టెన్ కోహ్లి, గిల్లు డకౌట్‌గా వెనుదిరగ్గా.. పుజారా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. It's good to have you back #TeamIndia fans 💙 Chepauk 🏟️ has come alive courtesy you 🤗 #INDvENG @Paytm pic.twitter.com/QVYISf40O1 — BCCI (@BCCI) February 13, 2021 -
ఒకేరోజు 381 పరుగులు.. సాధ్యమయ్యేనా!
సాక్షి క్రీడా విభాగం: నాలుగో రోజు లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్... ‘చెపాక్’ పిచ్ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో అనేదానికి ఇదో సూచిక! దాదాపు లెగ్‌స్టంప్‌పై పడిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను తాకింది. రోహిత్ తన కాలును ముందుకు జరిపి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్ తమ బౌలర్లకంటే కూడా పిచ్‌నే ఎక్కువగా నమ్ముకొని గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది. ఇలాంటి స్థితిలో భారత జట్టు ఆఖరి రోజు ఎలాంటి వ్యూహం అనుసరించబోతోందో చూడాలి. ఒక్క రోజులో, అదీ టెస్టు మ్యాచ్ చివరి రోజు 381 పరుగులు చేయడం సాధ్యమేనా? ఓవర్‌కు 4.2 పరుగుల వేగంతో అదీ అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై చేయగలరా అనేదే ఆసక్తికరం. బ్రిస్బేన్ విజయం తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందనడంలో సందేహం లేదు. ఎలాంటి లక్ష్యం ముందున్నా బెదరకుండా సానుకూల దృక్పథంతో ఆడగలమనే నమ్మకాన్ని ఆ మ్యాచ్ కలిగించింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. అయితే ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టులో భారత్ లక్ష్యం 328 పరుగులు. చివరి రోజు 324 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో పది వికెట్లూ ఉన్నాయి. సొంత మైదానం కాకపోయినా ఆ సమయానికి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మంచి బౌన్స్‌తో షాట్లు ఆడేందుకు తగిన అవకాశం కూడా కనిపించింది. అన్నింటికి మించి పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లుగా రహానే బృందం సాహసం చేయగా, పంత్ ప్రత్యేక ఇన్నింగ్స్ జట్టును గెలిపించింది. ఇక్కడ మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఓడితే అది అవమానకరంగా భావించే పరిస్థితి కాబట్టి రిస్క్ చేయడం కష్టం. దీనిని ‘డ్రా’గా ముగిస్తే చాలు, తర్వాతి మూడు టెస్టుల్లో చూసుకోవచ్చనే ఆలోచన సహజం. మరికొందరు తాజా పరిస్థితిని 2008లో ఇదే చెన్నైలో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచిన టెస్టుతో పోలుస్తున్నారు. నాటి మ్యాచ్‌లో భారత్ విజయలక్ష్యం 387 పరుగులు కాగా... నాలుగో రోజే సెహ్వాగ్ (68 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 83) మెరుపులతో భారత్ 131 పరుగులు చేసేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆఖరి రోజు మరో 256 పరుగులే అవసరమయ్యాయి కాబట్టి సచిన్ తదితరుల పని సులువైంది. కాబట్టి దానితో ఈ మ్యాచ్‌కు పోలికే లేదు. తాజాగా బంగ్లాదేశ్‌పై కైల్ మేయర్స్ అద్భుత బ్యాటింగ్‌తో వెస్టిండీస్ గెలిచిన టెస్టులో కూడా చివరి రోజు విండీస్ విజయానికి 285 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆట మొదలు పెట్టింది. ఇలా చూస్తే ఒకే రోజు 381 పరుగులు దాదాపు అసాధ్యమే! అయితే సంకల్పానికి, పట్టుదలకు అడ్డంకి ఏముంటుంది. భారత్ కూడా తొలి బంతి నుంచి ‘డ్రా’ కోసం ప్రయత్నించకపోవచ్చు. బ్రిస్బేన్ తరహాలోనే ఒక ఎండ్‌ను పుజారా రక్షిస్తుంటే మరో ఎండ్‌లో వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా పంత్ క్రీజ్‌లో ఉన్నంత వరకైనా గెలుపే లక్ష్యంగా టీమిండియా ముందుకు వెళుతుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు కాబట్టి పరుగులు ధారాళంగా రాకపోతే తమ డిఫెన్స్‌ను నమ్ముకొని ‘డ్రా’పై దృష్టి పెట్టగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయనేది వాస్తవం. ఇంగ్లండ్ కూడా ‘బ్రిస్బేన్’ భయంతోనే గెలుపు కాకపోయినా, ఓడకపోతే చాలనే స్థితిలోకి వెళ్లింది. భారత్‌కు ఎక్కువ ఓవర్లు అందుబాటులో ఉంచకుండా పరుగులు పెద్దగా రాకపోయినా రెండో ఇన్నింగ్స్‌ను సాగదీసింది. -
9 ఏళ్ల తర్వాత చెపాక్‌లో ఆ స్టాండ్స్..
చెన్నై: చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు... అన్ని వైపులా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ‘విజిల్ పొడు’ అంటూ హంగామా చేస్తుంటే... ఓ మూడు స్టాండ్స్ మాత్రం ఖాళీగా కనిపిస్తుంటాయి. వివిధ సమస్యల వల్ల ఏళ్ల తరబడి ఎం.ఎ. చిదంబరం మైదానంలోని ఐ, జె, కె స్టాండ్లు ప్రేక్షకులకు దూరమయ్యాయి. 2011 వన్డే ప్రపంచకప్ అనంతరం ఈ మూడు స్టాండ్లను సీజ్ చేశారు. అయితే 2012లో భారత్, పాక్‌ల మధ్య జరిగిన వన్డే కోసం ప్రత్యేక మినహాయింపుతో స్టాండ్లకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆ స్టాండ్లలో ప్రేక్షకులు లేరు. ఇప్పుడు తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ఆ సమస్యని పరిష్కరించుకోవడంతో ఈ నెల 13 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టుకు మిగతా స్టాండ్లతో పాటు ఐ, జె, కె స్టాండ్లలోనూ ప్రేక్షకులు కనిపించనున్నారు. సుమారు 12 వేల సీట్లు ఖాళీగా ఉంచడం వల్లే 2016లో టి20 ప్రపంచకప్, 2019లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను చెపాక్‌లో నిర్వహించలేదు. ఇపుడు స్టేడియం అంతా కలిపి 15 వేల ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నట్లు టీఎన్‌సీఏ తెలిపింది. రూ.100, రూ.150, రూ.200 ధరతో రోజువారీ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని టీఎన్‌సీఏ వెల్లడించింది. -
27 ఏళ్ల తర్వాత తొలి సారిగా..
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి సారిగా ఇద్దరు స్వదేశీ అంపైర్లు ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో చివరి సారిగా ఇద్దరు భారత అంపైర్లు బరిలో నిలిచారు. ఆ మ్యాచ్‌లో ఎల్.నరసింహన్, వీకే రామస్వామిలు ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇద్దరు భారత అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరీలు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కొద్ది రోజుల ముందే నితిన్ మీనన్, అనిల్ చౌదరీతో పాటు వీరేందర్ శర్మ అనే అంపైర్‌ను ఐసీసీ నియమించింది. తొలి టెస్టులో అనిల్, నితిన్ బరిలో నిలువగా రెండో టెస్టులో నితిన్‌కు తోడుగా వీరేందర్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. కరోనా ప్రయాణ అంక్షల కారణంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్సిప్కు స్థానిక అంపైర్లనే నియమించుకోవాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ అంపైర్ల ప్యానల్లో సభ్యులైన ఈ ముగ్గురు భారత అంపైర్లకు ఈ అరుదైన అవకాశం దక్కింది. మరోవైపు సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు భారతకు చెందిన వ్యక్తే రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌లకు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వహించనున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
చెన్నైకి షాక్.. అందుకే మేం గెలిచాం!
చెన్నై: ఎంఏ చిదంబరం స్టేడియం అలియాస్ చెపాక్ మైదానం.. ఏళ్లుగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఈ మైదానం పెట్టని కోటగా ఉంది. ఈ మైదానంలో 24 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 19 విజయాలను సొంతం చేసుకుంది. స్లోగా, మందకొడిగా ఉండే చెపాక్ మైదానాన్ని తన కంచుకోటగా మార్చుకున్న చెన్నై జట్టు.. ఇక్కడ ప్రత్యర్థులను వరుసగా మట్టికరిపిస్తూ వస్తోంది. ఇక, తాజా ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ విషయంలో ఇది తలకిందులైందనే చెప్పాలి. ఐపీఎల్ చాంపియన్స్ డెన్ అయిన చెప్పాక్‌లో చెన్నైని ఓడించే మంత్రాన్ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. వరుసగా మూడుసార్లు చెన్నైని సొంత మైదానంలో ఓడించిన ముంబై ఇండియన్స్.. తాజాగా ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ ఫైనల్‌కు వెళ్లడం ఆ జట్టుకు ఇది ఐదోసారి. గతంలో నాలుగుసార్లు ఫైనల్‌కు వెళ్లిన ముంబై మూడుసార్లు కప్ సొంతం చేసుకుంది. తాజా ఐపీఎల్ క్వాలిఫైయర్-1లో కంచుకోటలో చెన్నైను ముంబై అలవోకగా మట్టికరిపించింది. మందకొడిగా ఉండే చెప్పాక్ పిచ్‌ను బాగా అర్థం చేసుకున్న ముంబై జట్టు తన స్పిన్ వనరులతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టును కుదేలు చేసింది. చెన్నైను 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 131 పరుగులకు మాత్రమే పరిమితం చేసిన ముంబై బౌలర్లు రాహుల్ చాహర్ (14 పరుగులకు 2 వికెట్లు, కృనాల్ (21 పరుగులకు 1 వికెట్), జయంత్ యాదవ్ (25 పరుగులకు ఒక వికెట్).. ధోనీలాంటి టాప్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. 2010 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే.. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో చెన్నైపై ముంబై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మ్యాచ్ అనంతరం ఈ అంశంపై ముంబై సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చెన్నైను సొంతగడ్డ మీద ఓడించడంపై స్పందిస్తూ.. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఎదురుదాడి చేయగల బ్యాటింగ్ యూనిట్, వ్యూహాలు ఉండటమే చెప్పాక్‌లో తమ విజయానికి కారణమన్నారు. తమ జట్టు కూర్పు సమతూకంతో ఉందని, పరిస్థితులు ఎలా ఉన్నా దీటుగా ఆడగల నేర్పు ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారని, చెప్పాక్ మైదానంలోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం, ఆత్మవిశ్వాసంతో బ్యాట్స్‌మెన్ ఆడటమే చెన్నైలో తమ వరుస విజయాలకు కారణమని రోహిత్ తెలిపారు. ఇక్కడి పరిస్థితులను బాగా అర్థం చేసుకొని.. ఆకళింపు చేసుకొని బాగా ఆడగలిగామని రోహిత్ ఆనందం వ్యక్తం చేశారు. 54 బంతుల్లో 71 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముంబై ఇండియన్స్ ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లో సూర్యకూమార్ ఒకరని కొనియాడారు. తమ జట్టు ఫైనల్‌కు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఫైనల్‌కు ఇంకా మూడురోజుల సమయం ఉండటంతో ఈ విరామాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ఫైనల్‌కు సరికొత్తగా సన్నద్ధమవుతామని రోహిత్ వివరించారు. -
చెపాక్‌లో ఆర్సీబీకి కష్టమే?
చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఐపీఎల్లో బలమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఒకటి కానీ ట్రోఫీ మాత్రం ఈ జట్టుకు అందని ద్రాక్షలా మిగిలింది. కనీసం ఈ సారైనా తమ అభిమాన జట్టు ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తొలి పోరులోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టుతో కోహ్లి సేన తలపడుతోంది. అందులోనూ చెన్నైలోని చెపాక్ మైదానంలో. మామూలుగానే గర్జించే సీఎస్కే జట్టు సొంతమైదానంలో బెబ్బులిలా రెచ్చిపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చెపాక్‌లో ఆర్సీబీకి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇక్కడ ఆర్సీబీకీ కూడా అంత ఘనమైన రికార్డులేమి లేవు. చివరగా ఆడిన ఏడింటిలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. సీఎస్కే కంచుకోట ఏ జట్టుకైనా సొంతమైదానంలో ఆడటం అదనపు బలం. అయితే సీఎస్కేకు అంతకుమించి. చెన్నైలోని చెపాక్ స్టేడియం ధోనిసేనకు కంచుకోట వంటిది. సీఎస్కే ఇక్కడ చివరగా ఆడిన 13 మ్యాచ్‌లో కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. ఇక 2008లో అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఆర్సీబీ చివరగా చెపాక్‌లో సీఎస్కేను 14 పరుగుల తేడాతో ఓడించింది. సీఎస్కే బలమైన జట్టు అనడంలో సందేహమేలేదని.. కానీ తమ వ్యూహాలు తమకున్నాయని ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశాడు. -
‘పుణే’ సూపర్ కింగ్స్
చెన్నై: రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో అడుగు పెట్టిన చెన్నై జట్టుకు సొంతగడ్డపై కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం లభించింది. ప్రాక్టీస్ చూసేందుకే అభిమానులు ఎగబడగా, ఆ తర్వాత తొలి మ్యాచ్‌లో చెపాక్ మొత్తం పసుపు వర్ణంతో నిండిపోయింది. పైగా పరుగుల వరద పారిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ గెలవడం వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే చెన్నై క్రికెట్ ఫ్యాన్స్ ఆనందం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది! కావేరి జలవివాదం కారణంగా నిరసనలు తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ క్షేమం కాదని భావించిన బీసీసీఐ... మిగిలిన ఆరు మ్యాచ్‌లను తరలిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సీజన్లో సూపర్ కింగ్స్‌కు ఇకపై పుణే హోం గ్రౌండ్ కానుంది. లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని నిర్ధారించారు. చెన్నై మ్యాచ్‌ల నిర్వహణకు ప్రాథమికంగా పరిశీలించిన నాలుగు నగరాల్లో విశాఖపట్నం, తిరువనంతపురం, రాజ్‌కోట్ ఉన్నా... చివరకు సూపర్ కింగ్స్ యాజమాన్యం పుణేలోనే మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. సరిగ్గా రెండు వారాల క్రితం ధోని బృందం ఓపెన్ టాప్ వాహనంలో చెన్నై నగరమంతా తిరిగి అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. అప్పుడు భద్రతపరంగా ఎలాంటి సమస్య రాకపోగా... ఇప్పుడు స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు భద్రత కేటాయించలేమంటూ స్థానిక పోలీసులు చెప్పడం నిజంగా జట్టు వీరాభిమానులను తీవ్రంగా నిరాశపరిచేదే. రెండేళ్లపాటు ఐపీఎల్లో ఉన్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఇప్పుడు అదే వేదికపై చెన్నైని నడిపించనున్నాడు. -
చెపాక్ కళ తగ్గింది..!
చెన్నై:నగరంలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌ను భారీ భద్రత నడుమ నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ను అడ్డుకుంటామని ఆందోళన కారుల హెచ్చరికల నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మైదానం బయట 144 సెక్షన్‌ను తలపించేలా చెన్నై పోలీస్ విభాగం గస్తీ నిర్వహిస్తోంది. ఇదిలాఉంచితే, క్రికెట్ అభిమానులు కూడా మ్యాచ్‌ను చూడటానికి పెద్దగా ఆసక్తికనబరచలేనట్లే కనబడుతోంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, చెపాక్ స్టేడియంలో కళ తగ్గింది. దాదాపు 12 వేల సీట్లు ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మ్యాచ్ జరగదనే అనుమానంతోనే చాలా మంది టికెట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపలేదు. దాంతో స్టేడియంలో పూర్తి స్థాయి జోష్ లేదనే చెప్పాలి.