coaching
-
ఒక్క మాట మాట్లాడరు కానీ ఐఏఎస్ కోచింగ్..!
ప్రస్తుత రోజుల్లో కోచింగ్ అంటే ఎంత డబ్బు వెచ్చించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఐఏఎస్‌లాంటి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలకు కొచింగ్కి అయ్యే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో తెలియంది కాదు. కానీ అలాంటి కఠినతరమైన ఐఏఎస్ పోటీ పరీక్షకి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి. ఇక్కడ విశేషం ఏంటంటే మౌనంగానే కోచింగ్ ఇస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడకుండా కోచింగ్ ఇస్తాడు. అందరికీ ఉన్నతోద్యోగాలు చేసే అవకాశం దక్కాలని ఇలా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాడట. ఇంతకీ ఎవరా ఆ వింత వ్యక్తి..ఆ వ్యక్తి పేరు దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి. ఎప్పుడూ కాషాయ దుస్తులు ధరించి, పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించే ఈయనను అంతా చాయ్‌వాలే బాబా (Chai Wale Baba)గా పిలుస్తారు. తన జీవితాన్ని ఐఏఎస్(IAS) కోచింగ్‌కి అంకితం చేశారు. ఆయన అందరూ ఉన్నతోద్యోగాలు పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారికైనా ఉచితంగానే ఐఏఎస్ కోచింగ్ ఇస్తారు చాయ్‌వాలే బాబా . ప్రత్యేకత ఏంటంటే..కోచింగ్ ఇవ్వాలంటే నోరు విప్పాల్సిందే. స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా విపులంగా విడమర్చి గట్టిగా చెప్పక తప్పదు. అలాంటిది ఈయన నోరు తెరవకుండానే భోధిస్తారు. మౌనవ్రతం పాటిస్తూనే..సైగలతో అభ్యర్థులను గైడ్ చేస్తుంటారు. వాట్సప్ ద్వారా నోట్స్ ఇస్తారు. ఇతరత్రా ఆదేశాలు, మెసేజ్‌లు కూడా వాట్సప్ ద్వారానే. అయినప్పటికీ.. వేలాది మంది ఆయన దగ్గర మెంటార్షిప్ తీసుకుంటున్నారు. ఏ డౌట్ ఉన్నా సరే, ఆయనకు వాట్సప్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆన్సర్ రిప్లై వస్తుంది.కేవలం 'టీ' మాత్రమేఈ చాయ్‌వాలా బాబాకు సంబంధించిన మరొక విశేషమేమిటంటే..ఆయన అస్సలు ఎలాంటి ఘనాహారం తినరు. కేవలం రోజుకి పది కప్పుల టీ(చాయ్) మాత్రమే తాగుతారు. అందువల్లే ఆయన్ని చాయ్‌వాలే బాబాగా పిలుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయన జీవనశైలి ఇదేనట.ఏ డౌట్ ఉన్నా వెంటనే గైడ్ చేస్తారు..ఆయన శిఘ్యులు తమ గురువు బాబా ఎప్పుడు ఏ సాయం కావాలన్నా..తక్షణమే తమకు గైడెన్స్ ఇస్తారని అంటున్నారు. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన సైగలు, సంకేతాలు, వాట్సప్ మెసేజ్‌ల ద్వారానే గైడ్ చేస్తారని చెప్పారు. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేస్తే చాలు, తక్షణమే రిప్లై ఇస్తారని చెబుతున్నారు. ఆఖరికి నోట్స్ కూడా వాట్సప్ ద్వారానే పంపుతారని ఓ శిఘ్యుడు చెబుతున్నాడు.(చదవండి: సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!) -
UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ
పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని అంటారు. దీనిని కొందరు నిజమని నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు శ్వేతా భారతి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమైన శ్వేత తాను అనుకున్నది సాధించి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష(UPSC Civil Service Exam) ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటని చెబుతుంటారు. పలువురు అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటారు. అయితే ఏమాత్రం కోచింగ్ అవసరం లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కూడా ఉన్నారు. ఇటీవలే బీహార్ కేడర్‌లో పోస్టింగ్ అందుకున్న ఐఏఎస్ శ్వేతా భారతి దీనికి ఉదాహరణగా నిలిచారు.బీహార్ యువతి శ్వేతా భారతి(Shweta Bharti) యూపీఎస్సీ పరీక్షకు ముందు బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే ఐఏఎస్ అధికారి కావడమే ఆమె కల. అందుకే ఆమె ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నప్పటికీ, యూపీఎస్సీకి ప్రపరేషన్ కొనసాగించారు. శ్వేతా భారతి ఉదయం పూట 9 గంటల పాటు పనిచేస్తూనే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.శ్వేతా భారతి బీహార్‌లోని నలంద జిల్లాలో జన్మించారు. ఆమెది సాధారణ కుటుంబ నేపధ్యం. శ్వేతా భారతి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. పట్నాలోని ఇషాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఆమె భాగల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్,టెలికమ్యూనికేషన్‌లో బీటెక్ డిగ్రీని అందుకున్నారు. తరువాత ఆమె విప్రోలో ఉద్యోగం సంపాదించారు.లక్షల్లో జీతం అందుకుంటున్నప్పటికీ ఆమె ఐఏఎస్ అధికారి(IAS officer) కావాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చారు. పగటిపూట ఉద్యోగం చేస్తూనే, రాత్రపూట చదువుకోసాగారు. 2020లో జరిగిన బీపీఎస్సీ పరీక్షలో శ్వేతా భారతి 65 వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు ప్రోగ్రామ్ ఆఫీసర్ (డీపీఓ)గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగానే ముందుకు సాగారు. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. 2021లో యూపీఎస్సీ పరీక్షలో 356వ ర్యాంక్ సాధించారు. శ్వేతా భారతి యూపీఎస్సీ2021 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ మహిళా అధికారి. ప్రస్తుతం బీహార్‌లోని భాగల్పూర్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం: ఇస్రో -
ఖాళీ అవుతున్న కోచింగ్ సిటీ.. ఆత్మహత్యలే కారణమా?
కోటా: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన రాజస్థాన్‌లోని కోటాలోగల కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిపోతోంది. ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, హాస్టల్ యాజమాన్యాలు ఏంచేయాలో తెలియని స్థితిలో చిక్కుకున్నాయి.కోచింగ్‌పై తొలగిన బ్రమకోటాలోని కోచింగ్ సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది ఇక్కడి కోచింగ్ సెంటర్లపై ఇంతవరకూ ఉన్న బ్రమలు తొలగిపోవడమైతే, మరొకటి విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరగడమేనని చెబుతున్నారు. అలాగే లెక్కకుమించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వీరు అందించే విద్యానాణ్యత తగ్గిపోతున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.వేల కోట్ల టర్నోవర్‌కు గండికోచింగ్ సిటీగా పేరొందిన కోటాలో ప్రస్తుతం 1.10 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది మునుపటి కంటే 30-35 శాతం తక్కువ. రూ. 6.5 వేల కోట్ల విలువ కలిగిన పరిశ్రమ ఇప్పుడు రూ.3.5 వేల కోట్లకు దిగజారింది. ఇది కోటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. కోటాలో కోచింగ్ పరిశ్రమ 2000లో వేగంగా అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్ల ప్రగతి ఈ ఏడాదిలో ఊహించనంతగా దిగజారింది.కనీస హాస్టల్ అద్దె కూడా కరువు2018 నుంచి 2022 వరకు ఒకరికి నెలకు హాస్టల్ అద్దె రూ.15-16 వేలు వరకూ ఉండేది. ఇప్పుడు ఒకరి నుంచి రూ. 3000 కూడా దక్కడం లేదని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. నెలకు రూ.2500 అద్దె తీసుకున్నా 30 శాతం గదులు మాత్రమే నిండుతున్నాయంటున్నారు. స్థానికంగా చాలా మంది అప్పులు చేసి హాస్టళ్లు నిర్మించుకున్నారని, విద్యార్థుల కొరత కారణంగా ఆ రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని పలు హాస్టళ్ల యజమానులు అంటున్నారు.ఆత్మహత్యలే కారణమా?స్థానికంగా ఉన్న హాస్టళ్లు గతంలో విద్యార్థులను పీడించిమరీ డబ్బులు వసూలు చేశాయని, అందుకే వాటికి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కోటాలోని కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విరక్తి చెందడానికి ఇక్కడ చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2023లో కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువు ఒత్తిడే ఈ సంఘటనలకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా కోటాకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.ప్రముఖ కోచింగ్ సెంటర్లకు మరిన్ని బ్రాంచీలుమరోవైపు ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు దేశంలోని వివిధ నగరాల్లో తమ కేంద్రాలను తెరిచాయి. 2020 వరకు 10 కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 80 నుండి 100 కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫలితంగా విద్యార్థులకు కోటా ఒక్కటే కాకుండా పలు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ పెద్ద బ్రాండ్ కోచింగ్ సెంట్లర్ల కారణంగా స్థానిక కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.పరిష్కారం కోసం మల్లగుల్లాలుప్రస్తుతం కోటా కోచింగ్ పరిశ్రమకు కష్టకాలం నడుస్తోంది. దీనిని సవాలుగా తీసుకున్న హాస్టళ్ల యజమానులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరిష్కారం దిశగా యోచిస్తున్నారు. విద్యార్థుల భద్రత, వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే కోచింగ్ నాణ్యతను మెరుగుపరచడానికి, కొత్త కోర్సులను ప్రారంభించేందుకు కూడా కోచింగ్ సెంటర్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్‌టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్‌పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్‌కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్ లాక్ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు. -
ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఉదంతం వెలుగు చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్ ఫోనును బయటకు విసిరేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40 మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్ ఫోనును మెయిన్ రోడ్డు వైపునకు విసిరేసింది. ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. -
నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్
ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ పట్టణంలోనూ అటువంటి మహల్ ఒకటి ఉంది. సూర్యాస్తమయం అయ్యాక ఈ మహల్ సమీపంలోకి రావాలంటే ఎవరైనా భయంతో వణికిపోతారు. అటువంటి సాహసం కూడా ఎవరూ చేయరు. రాత్రి వేళ విచిత్ర శబ్ధాలు పాకిస్తాన్‌కు చెందిన లోకల్ డిజిటల్ పబ్లికేషన్ బ్రాండ్ సినారియోలో ప్రచురితమైన వివరాల ప్రకారం ప్యాలెస్ పరిసరాల్లో రాత్రివేళ విచిత్రమైన శబ్ధాలు వస్తుంటాయి. భవనంలో పెద్ద ఎత్తున పార్టీలు జరుగున్నట్లు రాత్రి వేళ ఏవో శబ్ధాలు వస్తుంటాయని చెబుతారు. 1927లో రాజస్థాన్‌కు చెందిన ఒక హిందూ వ్యాపారి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను పాకిస్తాన్ సర్కారు మ్యూజియంగా మార్చివేసింది. అయినప్పటికీ నేటికీ రాత్రి వేళ ఇక్కడకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. అనారోగ్యం పాలైన భార్య కోసం.. ఈ ప్యాలెస్ నిర్మాణ విషయానికి వస్తే చరిత్రలో పేర్కొన్న వివరాల ప్రకారం 1927లో రాజస్థాన్‌కు చెందిన శివరతన్ చంద్రరతన్ అనే మార్వాడీ వ్యాపారి తన భార్యపై తనకున్న ప్రేమకు గుర్తుగా ఈ ప్యాలెస్ నిర్మింపజేశారు. శివరతన్ చంద్రరతన్ దంపతుల ప్రేమ కథ అటు పాక్‌లోనూ, ఇటు భారత్‌లోనూ వినిపిస్తుంటుంది. శివరతన్ చంద్రరతన్ మొహట్టా భార్య తీవ్రమైన వ్యాధి బారిన పడింది. ఈ నమయంలో వైద్యులు అతనికి ఒక సలహా ఇచ్చారు. సముద్రపు వేగవంతమైన గాలి తగిలే ప్రాంతంలో ఆమెను ఉంచితే, ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు ఆ వ్యాపారికి సూచించారు. వారి సలహా వినగానే ఆ వ్యాపారి రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ప్రముఖ కళాకారులను పిలిపించి, ఈ ప్యాలెస్‌ను నిర్మింపజేశారు. ఆ సమయంలో ఈ ప్యాలెస్‌లో లెక్కకుమించిన సంఖ్యలో విందువినోద కార్యక్రమాలు జరిగేవని చెబుతుంటారు. సొరంగం గుండా ఆలయానికి మార్గం అత్యంత ఆదరణ పొందిన ఈ మొహట్టా మహల్ కింది భాగంలో ఒక సొరంగం ఉంది. ఇది కరాచీలోని ఒక ప్రముఖ హిందూ దేవాలయానికి దారితీస్తుందని చెబుతారు. శివరతన్ చంద్రరతన్ మొహట్టా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆలయానికి చేరుకునేందుకే ఈ సొరంగం నిర్మించారట. ఈ మార్గం గుండానే శివరతన్ చంద్రరతన్ భార్య ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తుండేవారట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బ్రిటీష్ పాలనా కాలంలో ఈ ప్యాలెస్ పలు అక్రమ కార్యకలాపాలకు నిలయంగా ఉండేదని, అందుకే దీనికి భూతాల నిలయం అనే పేరు వచ్చింటారు. ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది! -
రాజస్థాన్ కోటలో ఆత్మహత్యల పరంపర.. ఈ ఏడాది ఇప్పటికే 18.. ఆందోళనలో నిపుణులు!
రాజస్థాన్‌లోని కోట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర నిరంతరం కొనసాగుతోంది. తాజాగా బీహార్‌కు చెందిన భార్గవ్ ఆత్మహత్యతో కోట కోచింగ్ సెంటర్లలో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల జాబితాలో మారోపేరు చేరింది. తమ కుమారుడు భార్గవ్ మిశ్రా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కోటకు వచ్చిన మృతుని కుటుంబ సభ్యుల రోదన అక్కడున్నవారి హృదయాలను కలచివేసింది. జేఈఈ కోచింగ్ కోసం వచ్చి.. 17 ఏళ్ల భార్గవ్ మిశ్రా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం 4 నెలల క్రితమే బీహార్‌లోని చంపారణ్ నుంచి కోట నగరానికి వచ్చాడు. ఇక్కడి మహావీర్ నగర్ ప్రాంతంలోని పీజీలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో జేఈఈ కాంపిటీటివ్ పరీక్ష కోసం సిద్ధం అవుతున్నాడు. తాజాగా భార్గవ్ తండ్రి కుమారునికి ఫోన్ చేయగా, కుమారుడు ఫోన్ తీయలేదు. ఎంతసేపు ప్రయత్నించినా కుమారుడు ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో తండ్రి కుమారుని ఇంటి యజమానికి ఈ విషయం తెలిపాడు. ఉరి వేసుకున్న స్థితిలో భార్గవ్ వెంటనే ఇంటి యజమాని గది తలుపులు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని కిటికీలో నుంచి గదిలోనికి తొంగిచూడగా, భార్గవ్ మిశ్రా ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే అతను ఈ సమాచారాన్ని మహావీర్ నగర్ పోలీసులకు తెలియజేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి అవధేష్ కుమార్ మాట్లాడుతూ గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం దానిని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! మెడికల్, ఇంజినీరింగ్ కోచింగ్ సెంటర్ల ఫ్యాక్టరీలు నడిచే కోటకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారు. వీరు ఇంజినీర్లు లేదా డాక్టర్లు కావాలన్న తమ కలను నెరవేర్చుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే హామీలను నమ్మి, ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటారు. ఈ ఏడాది ఈ ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపధ్యంలో కోట కోచింగ్ సెంటర్ల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. 18కి చేరిన విద్యార్థుల ఆత్మహత్యలు భార్గవ్ మిశ్ర ఆత్మహత్యతో ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 18కి చేరింది. ఇది అందరిలోనూ ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులలో మోటివేషన్ తీసుకు వచ్చే చర్యలు చేపట్టాలని కోరింది. జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసి నిపుణుల సాయంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. స్థానిక పోలీసులు కూడా డెడికేటెడ్ స్టూడెంట్ సెల్‌ను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేసి, తమ సహాయం తీసుకోవచ్చని విద్యార్థులకు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం 2లక్షలకు పైగా విద్యార్థులు కోటలో వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది! -
విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా.. బజాజ్ ఆటో కీలక నిర్ణయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ రంగంలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి బజాజ్ ఆటో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కంపెనీ మంగళవారం తెలిపింది. ఈ శిక్షణ కేంద్రాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, డిప్లమాలతో కూడిన అధునాతన నైపుణ్య శిక్షణను ఇస్తాయని వివరించింది. మెకాట్రానిక్స్, మోషన్ కంట్రోల్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి క్లిష్ట మాడ్యూల్స్‌పై శిక్షణ ఉంటుంది. తయారీ పరిశ్రమలో నైపుణ్యం అంతరాన్ని పరిష్కరించడంలో ట్రైనింగ్ సెంటర్లు సహాయం చేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అవసరమైన పరికరాలను ఈ శిక్షణా కేంద్రాలకు బజాజ్ ఆటో అందిస్తుంది. కార్యక్రమ ప్రారంభ దశలో నిర్వహణ ఖర్చులకు నిధులు కూడా సమకూరుస్తుంది. ‘భారత్‌లో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగులుగా చేరుతున్నారు. సాంకేతికతలో వేగవంతమైన మార్పులతో యువతను ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడంలో విద్య, పరిశ్రమల మధ్య భారీ అంతరం ఉంది. సమాజానికి తిరిగి ఇచ్చే వారసత్వంతో ఈ అంతరాన్ని పూడ్చేందుకు కట్టుబడి సీఎస్ఆర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నాము’ అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. -
ఫ్రెండ్ యూట్యూబ్ ఛానెల్‌ని రూ. 26వేల కోట్ల కంపెనీగా మార్చాడు, షాకింగ్ శాలరీ!
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎడ్-టెక్ కంపెనీలలో ఒకటి అన్‌ఎకాడెమీ. స్థాపించిన అయిదేళ్లలోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా అన్‌ఎకాడెమీ సక్సెస్‌లో కోఫౌండర్‌గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా హేమేష్ సింగ్ పాత్ర చాలా కీలకం. ఆ వివరాలేంటో చూద్దాం..! ఇంజనీర్‌గా ఉండి వ్యాపారవేత్తగా మారిన గౌరవ్ ముంజాల్ యూట్యూబ్ చానల్లే తరువాతి కాలంలో అన్ఎకాడెమీగా ఆవిర్భవించింది. 26 వేల కోట్ల రూపాయల కంపెనీగా ఈ యూట్యూబ్ చానల్లే పునాది వేసింది. ముఖ్యంగా ముంజాల్, స్నేహితుడు రోమన్ సైనీ, హేమేష్ సింగ్ త్రయం కలిసి అన్కాడెమీని విజయవంతమైన వ్యాపార సంస్థగా తీర్చిదిద్దారు. (అదరగొట్టిన టీసీఎస్: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిట్కాలివిగో!) గౌరవ్ ముంజాల్ ప్రేరణతో ఇంజనీర్ అయిన హేమేష్ సింగ్ కూడా ముంజాల్ యూట్యూబ్‌లో చానల్లో చేరారు. అనంతరం అన్‌ఎకాడెమీ సహ వ్యవస్థాపకుడుగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కంపెనీ ముందుకునడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అన్ఎకాడెమీలో చేరడానికి ముందు ఫ్లాట్చాట్ సీటీవోగా పనిచేశారు. 2015లో ఫ్లాట్చాట్ను విడిచి పెట్టిన తర్వాత, హేమేష్ సింగ్ ,రమణ్ సైనీ, గౌరవ్ ముంజాల్‌తో కలిసి అన్ఎకాడెమీని స్థాపించారు. ఇక అంతే అప్పటినుంచి కంపెనీ శరవేగంగా డెవలప్ అయింది. 🎉 1/ You asked, and we delivered!@CohesiveAI pricing is finally here. Our focus is to help you choose the perfect plan that suits all your needs.✨ pic.twitter.com/ygxNrHdEYz — hemesh singh (@hemezh) April 18, 2023 అదిరిపోయే వేతనం 2022లో గౌరవ్ ముంజాల్ రూ. అన్‌ఎకాడెమీ సీఈఓగా రూ. 1.58 కోట్లు తీసుకోగా, హేమేష్ సింగ్ రూ. 1.19 కోట్లు, రోమన్ సైనీ రూ. 88 లక్షలు వార్షిక వేతనం అందుకున్నారు. అన్‌ఎకాడెమీ 2020లో యునికార్న్ క్లబ్లో చేరింది, ప్రస్తుతం దీని విలువ 3.4 బిలియన్లు డాలర్లు. కాగా హేమేష్ సింగ్ మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో నివసిస్తున్నారు. (యానివర్సరీ సేల్, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు) కాగా యూట్యూబ్ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌గా గౌరవ్ ముంజాల్ 2010లో అన్ఎకాడెమీని స్టార్ట్ చేశారు. ఆ తరువాత హేమేష్, రమణ కోఫౌండర్స్గా 2015లో అధికారికంగా కంపెనీ లాంచ్ అయింది. యూట్యూబ్ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వేలాది ఏఐఎస్ అభ్యర్థులకు అన్‌ఎకాడెమీ కోచింగ్ ఇస్తుంది. విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేని యుపిఎస్సి కోచింగ్‌కు వేదికను అందించాలనే లక్క్ష్యంతోనే ఆవిర్భవించింది అన్‌ఎకాడెమీ. కేవలం ఆరేళ్లలో, అన్ఎకాడెమీలో టీచర్స్ సంఖ్య 18వేలకు చేరింది. (ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్?) (ఒకపుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్: కండోమ్ బిజినెస్‌తో రూ. 43వేల కోట్లు!) -
కోచింగ్ పూర్తాయె.. కొలువు రాదాయె!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. అప్పుచేసి హైదరాబాద్ బాట పట్టిన వాళ్లంతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కోచింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నగరాల్లో చేసేదేమీ లేక సొంతూళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది ఏదో ఒక ఉపాధి చూసుకునే యత్నంలో ఉన్నారు. కోచింగ్‌ల కోసం అప్పులు చేసిన వాళ్లు.. భవిష్యత్ ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారు. కొలువు వచ్చేదెన్నడు? ఆర్నెల్ల క్రితం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో పోలీసు శాఖలో నియామకాల్లో మాత్రమే పురోగతి కన్పిస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష జరగాల్సి ఉంది. గ్రూప్–4 ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు. టీచర్ల నియామకాల విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల టీచర్ పోస్టులున్నట్టు అధికారులు అంటుంటే, 12 వేల ఖాళీలున్నట్టు ప్రభుత్వం ఏడాది క్రితం తెలిపింది. బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప ఈ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనేది స్పష్టమయ్యేలా లేదు. ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేలా లేదు. టెట్ ఉత్తీర్ణులు టీచర్ పోస్టుల కోసం పెద్దఎత్తున కోచింగ్ తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపైనా అడుగులు పడాల్సి ఉంది. కోచింగ్ కోసం రూ. లక్షల్లో... నోటిఫికేషన్లు వస్తాయనే సమాచారం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించింది. దీంతో నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో 25 వేల కోచింగ్ సెంటర్లలో 3.5 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ తీసుకున్నట్టు ఓ కోచింగ్ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. కోచింగ్ ఫీజులు కూడా నాలుగు రెట్లు పెంచారు. అయితే, ఇప్పుడు నగరంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సైతం కోచింగ్ పెద్దగా సాగడం లేదు. గ్రూప్–1 కోచింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ పరీక్ష జరిగితే నిరుద్యోగులు గ్రూప్–4పై దృష్టి పెడతారు. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలూ ఇదే ధోరణితో ఉన్నాయి. టీచర్ పోస్టుల కోసం ఇచ్చే కోచింగ్ చాలాచోట్ల ఆపేశారు. కోచింగ్ తీసుకునే వాళ్లు టీచర్ల నియామకాలు ఇప్పట్లో లేవని సొంతూళ్లకు వెళ్లిపోయారు. నోటిఫికేషన్ వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందని, దీనికి మళ్లీ ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఓయూలో మళ్లీ మొదలు పెడతాం గ్రూప్–1 పరీక్ష తర్వాత గ్రూప్–4 శిక్షణ మొదలు పెడతాం. తాత్కాలికంగానే కోచింగ్ ఆపేశాం. అయితే, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనే యోచనలో ఉన్నారు. కోచింగ్ తీసుకున్న వాళ్లు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాలని భావిస్తున్నారు. –ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కోచింగ్ తీసుకుని ఎదురుచూస్తున్నాం టీచర్ పోస్టు కోసం అప్పు చేసి కోచింగ్ తీసుకున్నా. ఇంకా హైదరాబాద్‌లో ఉండాలంటే సాధ్యం కావడం లేదు. ప్రైవేటు టీచర్‌గా పనిచేశాను. ఇప్పు డు ఏదో ఒక ఉపాధి చూసుకోవాలి. నియామకాలు చేపడతారనే ఆశతో ఉన్నాను. –ఆర్.నరేంద్ర, వరంగల్, టెట్ కోసం కోచింగ్ తీసుకున్న అభ్యర్థి -
AP: టెన్త్ ఫెయిల్ అయ్యారా?.. అయితే ఇది మీకోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ‘ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్‌ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని వివరించారు. విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్‌టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలని నిర్దేశించారు. చదవండి: ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పాఠశాలవిద్య కమిషనర్ మార్గదర్శకాలు అందిన వెంటనే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఏర్పాట్లపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు ఏ బాధ్యత నెరవేర్చాలో సూచనలు జారీచేస్తున్నారు. కొందరు డీఈవోలు జారీచేసిన సూచనలు.. ►సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా తన పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులంతా ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలి. ►షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాటు వారి సబ్జెక్టు విభాగం ప్రకారం బాధ్యత ఇవ్వాలి. ►సంబంధిత సీఆర్పీ సహాయంతో గూగుల్ ఫారం ద్వారా రోజువారీ హాజరు నివేదికను డీసీఈబీ సెక్రటరీకి సమర్పించాలి. ►సబ్జెక్టు టీచర్లందరూ తమ సబ్జెక్టుల్లో ఫలితాల మెరుగుదల కోసం సొంత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలి. ►సబ్జెక్టు వారీగా ప్లాన్‌తో పాటు టైమ్‌టేబుల్, దానికోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను గూగుల్ ఫారం ద్వారా ప్రధానోపాధ్యాయులు జూన్ 11వ తేదీ నాటికి డీసీఈబీలకు తెలియజేయాలి. ►రెమిడియల్ తరగతులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. ►ఈ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా డిప్యూటీ డీఈవోలు పర్యవేక్షించాలి. ►తక్కువ పనితీరు కనబరుస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. -
గుడ్ న్యూస్, అమెజాన్‌లో ఆ టెక్నాలజీపై ఉచితంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీ/స్టార్ట్ కార్యక్రమాన్ని భారత్‌లో ప్రారంభించింది. ఇందులో భాగంగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఔత్సాహికులకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ ఇస్తారు. 12 వారాలపాటు సాగే ఈ ఆన్లైన్ ప్రోగ్రాంకు ఎటువంటి సాంకేతిక అనుభవం అవసరం లేదు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్ ప్రారంభించేందుకు ఇది దోహదం చేస్తుందని కంపెనీ తెలిపింది. యూఎస్, యూకేతోపాటు ప్ర పంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఇప్పటికే రీ/స్టార్ట్ కార్యక్రమం నిర్వహించారు. మల్టీక్లౌడ్కు భారీ అవకాశాలు దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్లకు భారీ అవకాశాలున్నట్లు యూఎస్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ వీఎంవేర్ తాజాగా అంచనా వేసింది. దీంతో దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్వహించిన వీఎంవరల్డ్ 2021 సదస్సులో పలు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా పలు సంస్థలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రయాణం రెండో దశలో ఉన్నట్లు పేర్కొంది. కంపెనీలు క్లౌడ్స్మార్ట్గా ఆవిర్భవించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్ల మార్కెట్ అత్యంత వృద్ధి బాటలో సాగనున్నట్లు అభిప్రాయపడింది. దేశీ మార్కెట్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వీఎంవేర్ ప్రెసిడెంట్ సుమీత్ ధావన్ వెల్లడించారు. తమ మల్టీక్లౌడ్ సొల్యూషన్లనకు పలు అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఐదేళ్ల కాలంలో దేశీ మార్కెట్లో రెండు బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు 2018లోనే వీఎంవేర్ ప్రకటించింది. తద్వారా కార్యకలాపాల విస్తరణ, ఉపాధి కల్పను తెరతీయను -
NEET Coaching: డబ్బుల కోసం హుండీల చోరీ
రాంగోపాల్‌పేట్: నీట్ కోచింగ్ కోసం ఓ యువకుడు ఏకంగా గుడిలోని హుండీలకే కన్నం వేశాడు. ఇలా 8 గుళ్లలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరకు గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన బాలాజీ కుమారుడు మూలే సంతోష్ అలియాస్ రవి (21) చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నీట్ రాసి డాక్టర్ కావాలని కలలుగన్నాడు. గత ఏడాది నీట్ పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. దీంతో కోచింగ్ తీసుకోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చోరీల బాట పట్టాడు. ఆలయాల్లో చోరీలు చేసి తరువాత వీలున్నపుడు చెల్లించాలని అనుకున్నాడు. జనవరి నుంచి ఐదు నెలల్లోనే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిల్లో ఉండే 7 దేవాలయాల్లో హుండీలను పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ నెల 14న సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో చోరీ చేశాడు. సుమారు రూ.80 వేల వరకు హుండీలో ఉండే నగదును దొంగిలించి తప్పించుకుని తిరుగుతూ గోపాలపురం పోలీసులకు ప ట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 74 వేల నగదును స్వాధీనం చేసుని రిమాండ్‌కు తరలించారు. ఇంకా డబ్బు సంపాదించడానికి ఐపీఎల్, లూడో లాంటివి కూడా ఆడాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు పోలీసులకు విచారణలో చుక్కలు చూపించినట్లు తెలిసింది. తాను చేసింది నేరమే కాదని నన్నెట్లా అరెస్టు చేస్తారని పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడు. దేవుడి డబ్బు తీసుకున్నా ఆయనకే ఇచ్చేస్తా ఇందులో తప్పెక్కడిది అంటూ వారినే ప్రశ్నిస్తూ విచారణలో ముప్పుతిప్పలు పెట్టాడు. చదవండి: ప్రియురాలిని బీరు సీసాతో పొడిచి చంపిన ప్రేమోన్మాది -
యువత కలలకు రెక్కలు
‘జీవితంలో ఏం అవ్వాలో కలగన్నాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సాధన చేశాను. కల నెరవేరింది..’ అంటూ రిలాక్స్ అయ్యేవారికి ఓ కొత్త మార్గాన్ని సూచిస్తున్నారు ఐపీఎస్ అంకితా శర్మ. ఓ వైపు విధులను నిర్వర్తిస్తూనే సెలవురోజును కూడా ఉపయోగించుకోకుండా కోచింగ్‌లకు ఫీజులు కట్టుకోలేని యువతను యూపీఎస్సీ ఎగ్జామ్‌కు ప్రిపేర్ చేస్తున్నారు. పేదరికపు యువత కలలకు కొత్త రెక్కలు కడుతున్నారు. ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో సూపరింటెండెంట్ విధులను నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అంకితా శర్మ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోదు. విధి నిర్వహణలోనూ, లుక్స్‌లోనూ ఆమె తరచూ చర్చలోనే ఉంటుంటారు. అంకిత చేస్తున్న పనులతోపాటు తన స్టైలిష్ ఫొటోలను కూడా సోషల్‌మీడియా వేదిక గా పంచుకుంటారు. రచనలతో పాటు సమాజానికి బెస్ట్‌ని అందించాలనే తపన ఉన్న అంకితా శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ సోషల్‌మీడియాలో ఆమెకు ప్రశంసలు అందుతూనే ఉంటాయి. ఆదివారం అధ్యాపకురాలు అంకిత వారమంతా విధి నిర్వహణలో బిజీగా ఉంటుంది. ఆదివారం మాత్రం టీచర్ పాత్ర పోషిస్తుంది. ఆమె తన ఆఫీసునే తరగతి గదిగా మార్చి, పాతిక మంది యువతకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎగ్జామ్‌కు కోచింగ్ ఇస్తుంటారు. వారందరూ కోచింగ్‌కు ఫీజు చెల్లించలేనివారు. పేదరికం కారణంగా వారి కలలు ఆగిపోకూడదని ఆమె ఆలోచన. మరువలేని మార్గం అంకిత ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. కాలేజీ చదువు కూడా ప్రభుత్వ కాలేజీల్లోనే కొనసాగింది. యూపిఎస్సీ పరీక్షలో విజయం సాధించాలన్నదే ఆమె ఆశయం. రెండుసార్లు ప్రయత్నించినా సక్సెస్ దరిచేరలేదు. పట్టు వదలకుండా మూడవసారి 203వ ర్యాంక్ సాధించి, ఛత్తీస్‌గడ్‌కు మొదటి మహిళా ఐపీఎస్ అయ్యారు. ‘చిన్నప్పటి నుంచీ ఐపీఎస్ కావాలని కల ఉండేది. అయితే సరైన మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ స్థితికి చేరుకున్న మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కొందరికైనా నేను సాయపడాలనుకున్నాను. అందుకే ఈ కోచింగ్’ అని అంకిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, ఐపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎంపిక విధానంలో తనకు ఎదురైన ఇబ్బందులు మరెవరూ ఎదుర్కోకూడదని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీకి సన్నద్ధమవుతున్న యువత ఏదైనా సహాయం అవసరమైతే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య అజాద్ చౌక్ పోలీస్ స్టేషన్లో తనని కలవవచ్చని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు. వదలని కల అంకిత దుర్గ్ నుండి పట్టా పొందిన తర్వాత ఎంబీయే చేసి యూపీఎస్సీకి సిద్ధం కావడానికి ఢిల్లీకి వెళ్లింది. కానీ, ఆమె అక్కడ కేవలం ఆరు నెలలు మాత్రమే చదువుకుంది. కానీ, పరిస్థితులు అనుకూలించక స్వయంగా చదువుకోవడానికి ఇంటికి తిరిగి వచ్చింది. యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలోనే ఆర్మీలో మేజర్ అయిన వివేకానంద శుక్లాతో పెళ్లి అయ్యింది. అతనితో పాటు ఆమె కొన్నాళ్లు జమ్మూ కశ్మీర్లో నివసించింది. ఆ తర్వాత భర్తతో కలిసి ముంబయ్, ఝాన్సీ నగరాలలోనూ నివసించింది. ‘ఎలాంటి స్థితిలో ఉన్నా నా కలను వదల్లేదు’ అని తెలిపారు అంకిత. గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్ ఆడటం అంటే అంకితా శర్మకు చాలా ఇష్టం. తరచుగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటారు ఆమె. పరేడ్ గ్రౌండ్లో కవాతు ఈ యేడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ట్రైనీ ఐíపీఎస్ గ్రూప్‌కు అంకితాశర్మ నాయకత్వం వహించారు. దీనితో రాష్ట్రచరిత్రలో గణతంత్ర దినోత్సవ కవాతు నిర్వహించిన మొదటి మహిళా పోలీసు అధికారి అయ్యారు. ‘మహిళలు ఎవరికన్నా తక్కువ కాదు. ప్రజలకు సేవ చేయడానికి వారు యూనిఫామ్ ధరించాలి’ అంటున్నారు ఈ పోలీస్ అధికారి. తన మార్గంలో మరెందరో ప్రయాణించి విజయతీరాలను చేరుకునేందుకు ముందడుగు అంకిత. నవీన సమాజపు యువత కలలకు ప్రతీక అంకిత. -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
కరీంనగర్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తెలంగాణలో ఎనలేని క్రేజ్. ఏటా వేల మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందికిపై దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. ఇందుకు సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఠీఠీఠీ. జుpజ్చీట. ఛిౌఝలో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాల వ్యవధి ఏడాదిన్నర.‡ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9505514424, 9666013544 పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సంప్రదించొచ్చు. -
'జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్'
పట్నా : లాక్డౌన్ నేపథ్యంలోనూ గాయపడిన తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1200 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన జ్యోతి కుమారి పట్ల సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని ప్రకటించాడు. ''ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్ల ప్రయాణించడం అంటే ఒక సాహసమే. కానీ జ్యోతి కుమారి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. సూపర్ 30 తరపున మా తమ్ముడు జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. భవిష్యత్తులో ఐఐటీయన్ కావాలనుకుంటే జ్యోతికుమారికి మా సూపర్ 30 స్వాగతం పలుకుతుంది'' అంటూ ఆనంద్ కుమార్ ట్వీట్ చేశారు. (పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు ) #Bihar daughter #jyotikumari has set an example by paddling all the way from #Delhi carrying her father on a bicycle, covering an unimaginable 1200 kms. Yesterday, my brother @Pranavsuper30 met her. If she would like to prepare for #IIT in future she is welcome to the #super30 pic.twitter.com/PMhsMvhDwn — Anand Kumar (@teacheranand) May 25, 2020 అంతకుముందు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతికి సైక్లింగ్‌లో శిక్షణతో పాటు ఆమె చదువుకు కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. జ్యోతిని ధైర్యవంతురాలిగా ప్రశంసిస్తూ పలువురు మంత్రులు ఆమెకు సహాయం అందివ్వడానికి ముందుకు వచ్చారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి సైతం జ్యోతి చదువుకు, వివాహానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్డేడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జ్యోతి సాహాసానికి ఇవాంకా ట్రంప్ సైతం ఫిదా అయ్యారు. ఆమె కథని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఇవాంకా ''అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ. ఆమె చేసిన ఫీట్‌ని భారత ప్రజలతో పాటు సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించాయి'' అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక ) -
అడ్డుకుంటేనే ఆగుతారు
విద్యార్ధినులు, యువతులు, మహిళా ఉద్యోగినులు, అంగన్వాడీ, ఆశా మహిళలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తున్నారు లక్ష్మి. శాంతి భద్రతలను కాపాడడంతోపాటు, సమాజానికి రక్షణ కల్పించే పనిలో ఉన్న మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, షీ టీం సభ్యులకు సైతం పోరాట కళలో మెళుకువలు నేర్పిస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఆగడాల భయంతో ఆడపిల్లలు ఇంట్లోనే ఉండిపోతే తమ కలల్ని నిజం చేసుకోలేరని లక్ష్మి అంటున్నారు. ఈ కథ లక్ష్మిదే అయినా, రవి దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. రవిది వరంగల్ జిల్లా కొత్తవాడ. కరాటే అంటే ఆసక్తి. చిన్నతనంలోనే ఏడాదిన్నర వ్యవధిలో బ్లాక్ బెల్ట్ సాధించే దశకు చేరుకున్నాడు! ప్రస్తుతం బ్లాక్ బెల్ట్‌లో సెవన్త్ డాన్. కరాటేనే వృత్తిగా ఎంచుకొని పాఠశాల పిల్లలకు నేర్పిచడానికి రాష్ట్రమంతటా తిరుగుతున్నప్పుడు అతడికి లక్ష్మితో పరిచయం అయింది. లక్ష్మిది నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం శాంతినగర్ గ్రామం. అప్పటికే ఆమెకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇద్దరూ 1997లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా లక్ష్మి మార్షల్ ఆర్ట్స్‌ను కొనసాగించారు. ప్రస్తుతం ఆమె బ్లాక్‌బెల్ట్‌లో సిక్త్స్ డాన్. షీ టీమ్‌లకు కోచింగ్! తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో లక్ష్మి ప్రాధాన్యం మరింత పెరిగింది. మహిళా ఐపీఎస్‌ల నేతృత్వంలో విధులు నిర్వర్తించే షీ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి లక్ష్మికి అవకాశం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా లక్ష్మికి ప్రాధాన్యం లభించింది. ఆమె చేత పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలకు శిక్షణ ఇప్పించారు. మూడేళ్ల క్రితం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ‘సంఘటిత సబల’ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం వెనుక లక్ష్మి కృషి, పట్టుదల ఉన్నాయి. ఆమె భర్త సహకారం ఉంది. – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ, ఫోటోలు: గోవర్ధనం వేణుగోపాల్ పోకిరీల భయంతో చదువు ఆగకూడదు చిన్నప్పటి నుంచే పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. సుమన్, విజయశాంతి, సినిమాలను చూసి అప్పుడే కరాటే నేర్చుకోవడం ప్రారంభించాను. పదో తరగతి చదువుతున్న సమయంలోనే నా స్నేహితురాలిని కొందరు పోకిరీలు వేధించడంతో భయంతో చదువును ఆపేసి ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆ సంఘటన తరువాత ప్రతి విద్యార్థినీ ధైర్యంగా చదువుకోవడానికి స్వేచ్ఛగా వెళ్లాల్సిన ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పాలని భావించాను. ఆ విధిని నా భర్తతో కలసి నెరవేరుస్తున్నాను. – లక్ష్మి -
కోచింగ్ పేరుతో ఇంటికి కన్నం
భాగ్యనగర్‌కాలనీ: టెన్నిస్ కోచింగ్ పేరుతో చిన్నారుల కుటుంబ సభ్యులతో సన్నిహింతగా ఉంటూ వారి ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్టు చేసి అతడి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన కోమలి రామకృష్ణ రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి హెచ్ఎంటీ శాతవాహన నగర్లో ఉంటున్నాడు. టెన్నిస్ కోచ్‌గా పరిచయం చేసుకున్న అతను పరిసర ప్రాంతాల్లోని పలువురు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ధార్ పటేల్ నగర్‌కు చెందిన ఓ బాలుడికి కోచింగ్ ఇస్తున్న అతను బాలుడి కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సదరు బాలడిని ఇంటికి వెళ్లి కుమారుడిని తీసుకురావటం శిక్షణ అనంతరం ఇంట్లో దిగబెట్టడం చేసేవాడు. గత నెల సదరు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు. తాళం చెవి కిటికీ సమీపంలో పెట్టడాన్ని గుర్తించిన రామకృష్ణ తాళం తీసి ఇంట్లోకి చొరబడి బీరువా తాళం పగల గొట్టి అందులో ఉన్న 11.5 తులాల బంగారు నగలు, 1.5 కేజీల వెండి వస్తువులు ఎత్తుకెళ్లాడు. యాత్ర నుంచి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానస్పదంగా కనిపించిన రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతను 2018లో ఇదే తరహాలో మరో ఇంటిలో బైక్, మిక్సీ, ఎల్ఈడీ టీవీ దొంగలించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. కాగా అతను రాజమండ్రిలో గతంలో పలు మార్లు చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లుగా తెలిపారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. సమావేశంలో కూకట్పల్లి ఏసీ పీ సురేందర్‌రావు, సీఐ లక్ష్మీనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్ఐలు హరిశంకర్, రామచంద్రయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థులకు ఎంసెట్‌లో ప్రత్యేక శిక్షణ
విశాఖపట్నం, గూడెంకొత్తవీధి (పాడేరు) : ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్ సీటు పొందేందుకు మూడు జిల్లాల్లోని గురుకుల చెందిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జీకే వీధి గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ పద్మకుమారి అన్నారు. ఇంటర్ మొదటి, ద్వి తీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థు లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రధానంగా మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షకు శిక్షణ ఇస్తున్నామన్నారు. విశాఖ జిల్లా బాలికలకు జీకే వీధిలో, బాలురకు అరకులోయలో ఈ శిక్షణ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కురుపాం, సీతంపేట, పి.కొత్తవలస, భద్రగిరి, అరకులోయ, జీకే వీధి గురుకుల కళాశాలలకు చెందిన బాలికలకు జీకే వీధి, జి.మాడుగుల, కొయ్యూరు, అరకులోయ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన బాలురకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 14 నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి కళాశాల నుంచి 100 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వీరందరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఎంసెట్‌లో మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు పొం దేందుకు విద్యాశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ ఎంతో అవసరం మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివే పేద విద్యార్థు లకు ఎంతో డబ్బులు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకుంటుంటారు. అయితే విద్యాశాఖ ద్వారా గురుకుల విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. ఇది ఎంతో ఉపయోగపడుతుంది.– అశ్వని, కురుపాం, విజయనగరం జిల్లా -
కిర్‌స్టెన్ మళ్లీ వస్తున్నాడా?
ముంబై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ మరోసారి టీమిండియా కోచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సారి పురుషుల జట్టుకు కాకుండా మహిళల జట్టుకు కోచ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. భారత మహిళల జట్టుకు నూతన కోచ్ నియామకంలో భాగంగా గురువారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇప్పుటికే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి పది మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారిని బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ ఇంటర్వ్యూ చేయనుంది. అందుబాటులో లేని వారు స్కైప్ ద్వారా కూడా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని బీసీసీఐ తెలిపింది. (కోచ్‌గా పొవార్‌నే కొనసాగించండి: హర్మన్ లేఖ) ఇంటర్వ్యూ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తోపాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్, తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్, రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్, బ్రాడ్ హాగ్, డిమిట్రి మస్కరెన్హాస్లు ఇంటర్వ్యూకు హాజరవనున్నారు. కోచ్ పదవి కోసం ఏర్పాటు చేసిన బీసీసీఐ సెలక్షన్ ప్యానల్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. (పొవార్ కోచింగ్ ముగిసింది...) మొదటి నుంచి టీమిండియాకు నూతన కోచ్ అవసరం లేదంటూ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో సభ్యురాలైన డియానా ఎడుల్జీ వాదిస్తున్నా.. చైర్మన్ వినోద్ రాయ్ మాత్రం పొవార్ కోచింగ్‌పై సుముఖత వ్యక్తం చేయటం లేదు. దీంతో భారత మహిళల క్రికెట్ నూతన కోచ్ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ) కిర్‌స్టెన్‌కే అవకాశం? మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు గ్యారీ కిర్‌స్టెన్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. వివాదరహితుడిగా పేరొందడం, నైపుణ్యం, కోచింగ్‌లో అనుభవరీత్యా కోచ్ పదవి కిర్స్టెన్నే వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతడిని మరలా కోచ్‌గా నియమించే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. అయితే టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మద్దతు ఉండటం పొవార్‌కు కలిసొచ్చే అంశం. సఫారీ మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్కు కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. స్వదేశీ కోచ్‌నే తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్) -
పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదే మరీ!
సాక్షి, హైదరాబాద్ : అతని వయసు 11 ఏళ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే మాకేంటి అనుకుంటున్నారా? మాములోడు అయితే మనకు అవసరం లేదు. కానీ ఈ బాలుడు సమ్‌థింగ్ స్పెషల్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఇతనికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. స్కూల్ వెళ్లి పాఠాలు వినాల్సిన వయసులో ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యాని గురిచేస్తున్నాడు. హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ హసన్ అలీ(11) ఏడో తరగతి చదువుతున్నాడు. అందరిలాగే తను కూడా పాఠశాలకు వెళ్తాడు. అందరితో కలిసి ఆటలు ఆడుతాడు. చదువుతాడు. కానీ సాయంత్రం 6 గంటలకు మాత్రం లెక్చరర్ అవతారం ఎత్తి బీటెక్ విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. అతని కంటే రెండింతల ఎక్కువ వయసులో గల వారికి పాఠాలు భోదిస్తాడు. అతని దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కూడా మా బుల్లి మాస్టార్ చాలా గ్రేట్ అని చెబుతున్నారు. అతడు చెప్పే విధానం కూడా ఈజీగా, అందరికి అర్ధమయ్యేలా ఉంటుందంటున్నారు. అయితే ఇలాంటి ఐడియా, ఇంత మేధాశక్తి ఎలా వచ్చిందని ఈ బుల్లి మాస్టారుని అడిగితే.. తెలుసుకోవాలనే తపనతో నేర్చుకుంటూ ఇతరులకి నేర్పిస్తున్నాను అని చెప్పాడు. ‘ నేను ఇంటర్నెట్లో ఓ వీడియో చూశాను. భారతీయులు ఇతర దేశాలకి వలస వెళ్లి కష్టమైన పనులు చేస్తున్నారు. పెద్ద చదువులు చదివిన వారు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మన దగ్గర లక్షల మంది ఇంజనీరింగ్ చేస్తున్నప్పటికి వారికి ఉద్యోగాలు రావడంలేదు. వారికి టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లే విదేశాల్లో ఉద్యోగాలు రావడం లేదని అర్ధమైంది. దీంతో నా దృష్టి డిజైనింగ్ వైపు మళ్లింది. అప్పటి నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్నది బోధించడం మొదలు పెట్టాను. గత ఏడాది నుంచి పాఠాలు చెబుతున్నాను. ప్రతి రోజు ఉదయం స్కూల్‌కి వెళ్తాను. 3 గంటలకు ఇంటికి వస్తాను. హోంవర్క్ పూర్తి చేసుకుంటాను. కాసేపు ఆడుకుంటాను. సాయంత్రం కోచింగ్ సెంటర్‌కి వెళ్లి సివిల్, మెకానికల్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాఠాలు చెబుతాను. 2020నాటికి 1000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధించడమే నా లక్ష్యం’ అని ఆ బాలుడు చెబుతున్నాడు. నిజంగా ఈ బుడతడి ఆలోచనకి, మేధాశక్తికి వావ్.. అనాల్సిందే. -
కోటి జీతం వదిలి..కోచింగ్ లేకుండా..
ఓవైపు మల్టీనేషన్ కంపెనీ (ఎంఎన్సీ)లో ఏడాదికి కోటి రూపాయల జీతం. మరోవంక అనుకున్న లక్ష్యం సాధించాలనే సంకల్పం. భారీ జీతం కంటే లక్ష్యం వైపే మొగ్గు చూపి.. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించాడు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్. ముంబైలో ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సామ్సంగ్ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. పట్టుదలతో చదివి ప్రతిభ కనబరచాడు. చిన్నప్పటి నుంచే చదువులో పృథ్వీ మంచి ప్రతిభ కనబరచేవాడని ఆయన తండ్రి యిమ్మడి శ్రీనివాసరావు, తల్లి రాణి తెలిపారు. 100వ ర్యాంకు సాధించిన నారపురెడ్డి మౌర్య వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలోని నాగులపల్లెకు చెందిన రైతు నారపురెడ్డి ఓబుళరెడ్డి కుమార్తె మౌర్య యూపీఎస్సీ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లో స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించింది. 206వ ర్యాంక్: నాగవెంకట మణికంఠ గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీహెచ్ నాగవెంకట మణికంఠ సివిల్ సర్వీసెస్‌లో 206 ర్యాంక్ సాధించారు. ప్రకాశం జిల్లా మార్టురులో ఇంటర్ వరకు చదివిన మణికంఠ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. 2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపికై ప్రస్తుతం డెహ్రాడూన్‌లో శిక్షణ పొందుతున్నారు. ఆయన తండ్రి సీహెచ్ మంగాచారి ఫొటోగ్రాఫర్, తల్లి శారదాదేవి గహిణి. 512వ ర్యాంక్: ప్రవీణ్‌చంద్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సివిల్స్‌లో 512వ ర్యాంకు సాధించారు. పాట్నా ఐఐటీలో ఎలక్టిక్రల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్ చంద్ ..నలుగురికీ సేవచేయాలనే లక్ష్యంతో తన బెంగళూరులో తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. 2016లో సివిల్స్‌కు ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అవకాశం రాలేదు. 2017 జూన్‌లో ప్రిలిమ్స్లోను, అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు రాసి, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూకు వెళ్లాడు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో 512వ ర్యాంకు సాధించాడు. కోచింగ్ తీసుకోకుండానే 374వ ర్యాంకు 2017 సివిల్స్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాతల కుమారుడు రిషికేశ్‌రెడ్డి శుక్రవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 374 ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. 245వ ర్యాంకు: చందీష్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం అడపగుండ్లపల్లి గ్రామానికి జి. చందీష్ సివిల్స్‌లో 245వ ర్యాంకు సాధించారు. తనను ఐపీఎస్‌గా చూడాలన్నదే తన అమ్మానాన్న కోరిక అని తెలిపారు. 513వ ర్యాంకు: ప్రసన్నకుమారి అనంతపురం జిల్లాకు చెందిన ప్రసన్న కుమారికి సివిల్స్ ఫలితాల్లో 513వ ర్యాంకు పొందారు. తాడిపత్రి రూరల్ మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన ప్రసన్నకుమారి బీటెక్‌ను 2014లో పూర్తి చేసి 2015 నుంచి సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇటీవల విడుదలైన గ్రూప్–1లోనూ డీఎస్పీ పోస్టు దక్కింది. సేవాభావమే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లేలా చేసిందని ప్రసన్న కుమారి తెలిపారు. 884 ర్యాంకు: వంశీ దిలీప్ 2017 సివిల్స్ ఫలితాల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఇరుకుపాలెంకు చెందిన మీరావత్ వంశీదిలీప్ 884వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి డాక్టర్ మీరావత్ గోపినాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఐదేళ్లపాటు గుంటూరు జిల్లాలో పనిచేశారు. వరంగల్ నిట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో క్యాంపస్ సెలక్షన్లో తమిళనాడు నైవేలీలో నెలకు రూ.67వేల వేతనానికి ప్రై వేటు కంపెనీలో ఎంపికయ్యాడు. తొమ్మిదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సివిల్స్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలిపెట్టి ఢిల్లీలో కోచింగ్‌లో చేరాడు. ఒకసారి సివిల్స్ మెయిన్స్ వరకు, మరోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. మూడోసారి పట్టుదలతో చదివి 884వ ర్యాంకు సాధించాడు. తన తండ్రి జిల్లా వైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన్ను చూసి ప్రజలకు సేవలు అందించేందుకు సివిల్స్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు వంశీ దిలీప్ తెలిపాడు. 6వ ర్యాంకు శ్రీహర్ష ఖమ్మంఅర్బన్: ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన కోయ శ్రీహర్ష శుక్రవారం వెలువరించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈయన తల్లిదండ్రులు కోయ నాగేశ్వరరావు, సులోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు. శ్రీహర్ష 1 నుంచి 5వ తరగతి వరకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు బల్లేపల్లి ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ను హైద రాబాద్లోని నారాయణ కళాశాలలో, ఇంజనీరింగ్‌ను ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో పూర్తి చేశారు. 2012లో సిగ్నోర్ ఇండియా కంపెనీలో ఉద్యోగాన్ని పొంది.. హైదరాబాద్, గుజరాత్లో పనిచేసిన ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2017 సివిల్స్ పరీక్షలో ప్రతిభను చాటి, శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 6వ ర్యాంక్‌తో సత్తా చాటారు. 22 ఏళ్లకే సివిల్స్.. హైదరాబాద్ కుర్రాడి ఘనత హెదరాబాద్ కుర్రాడు సాయి తేజ మొదటి ప్రయత్నంలోనే 22ఏళ్లకే సివిల్స్‌లో 43వ ర్యాంకు సాధించారు. ఆయన మాటల్లోనే...‘ హైదరాబాద్(మలక్ పేట). నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఐఐటీ, హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. 2016లో బీటెక్ పూర్తవుతూనే సివిల్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను. 2017 జూన్‌లో ప్రిలిమ్స్ రాశాను. పబ్లిక్ సర్వీసులోకి రావాలని, సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి ఎంతో చేయొచ్చని భావించి సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాను. నాన్న సివిల్స్ ద్వారా సమాజానికి సేవ చేయొచ్చని చెబుతుండటం కూడా నేను సివిల్స్ వైపు రావడానికి కారణం. సివిల్స్‌కు చాలా తక్కువ పుస్తకాలు చదివా. క్రమశిక్షణతో అంకితభావంతో ప్రిపరేషన్ కొనసాగించా. ఆయా అంశాలను విశ్లేషణాత్మకంగా చదవడం లాభించింది. పొలిటికల్‌సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆఫ్షనల్‌గా ఎంచుకున్నా. ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన, అంతర్జాతీయ అంశాలను అడిగారు. నమ్మకం, పట్టుదలతోనే విజయం సాధించా’. జేసీ కుమారుడికి 393 ర్యాంక్ సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య కుమారుడు సురభి ఆదర్శ్ సివిల్స్‌లో 393 ర్యాంకు సాధించారు. గతంతో మెయిన్స్ వరకు వెళ్లిన ఆదర్స్ ఈసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధించారు. సివిల్స్ సాధించాలన్నది తన కల అని.. ఇందుకోసం కష్టపడి చదివినట్లు చెప్పారు. అమ్మానాన్న పోత్సాహంతోనే: సాయినాథ్‌రెడ్డి యూపీఎస్సీ శుక్రవారం వెల్లడించిన సివిల్స్ తుది ఫలితాలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బిడ్డ ఆలిండియా 480వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి భాగ్యలక్ష్మి, లింగారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు సాయినాథ్‌రెడ్డి. ఒకటి, రెండు తరగతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఢిల్లీలో సివిల్స్‌కు కోచింగ్ తీసుకొని ర్యాంక్ సాధించాడు. 607వ ర్యాంకు: కృష్ణకాంత్ పటేల్ సివిల్స్‌లో 607వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎస్ కావాలనేది నా చిన్ననాటి కల. 2011లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అప్పటినుంచి సివిల్స్‌కు సిద్ధమవుతూ ఉన్నాను. ఇప్పటివరకు 5 సార్లు సివిల్స్ రాశాను. 2016లో ఎస్ఎస్బీలో అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ ర్యాంకు)ఉద్యోగానికి ఎంపికయ్యాను. సివిల్స్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎస్ఎస్బీ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ఎన్నిసార్లు ఓటమి వచ్చినా పట్టుదల వదలకుండా కష్టపడ్డాను. నా విజయానికి తల్లిదండ్రులు, మా అన్నయ్య తోడ్పాటు అందించారు. పాజిటివ్‌గా ఆలోచించడమే నా సక్సెస్ మంత్ర. 624వ ర్యాంకు: ఎడవెల్లి అక్షయ్‌కుమార్ మాది వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ. మా తాత, తండ్రి ఇద్దరు పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితోనే పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. అందుకే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు కొనసాగిస్తున్నాడు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ భూపాల్‌లోని నిట్‌లో పూర్తి చేశాను. క్యాంపస్ ఇంటర్య్వూలో దుబాయ్‌లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది.. కానీ ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో వదులుకున్నా. జాతీయ స్థాయిలో 726వ ర్యాంక్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషు (23) చిన్నవయస్సులోనే సివిల్ సర్వీస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2012–16 విద్యాసంవత్సరంలో ఢిల్లీలో బీటెక్(మెకానికల్) కోర్సు పూర్తి చేసి సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. -
సొంతంగా ప్రిపేరయ్యా..
సాక్షి, మహబూబాబాద్: ‘ఎక్కడా కోచింగ్ తీసుకో లేదు.. అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రణాళిక ప్రకారం.. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివి గేట్ ఇన్ ఇంజినీరింగ్ (గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించా’నని తెలిపాడు సౌరవ్ సింగ్. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరవ్ గేట్లో ప్రతిభ చాటాడు. తన ప్రిపరేషన్, భవిష్యత్ లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. గేట్లో మొదటి ర్యాంక్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నమ్మటానికి కొంచెం టైమ్ పట్టింది. ఒకటికి రెండుసార్లు రిజల్ట్ చూసుకున్నా. కుటుంబ నేపథ్యం.. బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్‌పూర్‌కు చెందిన విమల్సింగ్, పూనమ్‌సింగ్ నా తల్లిదండ్రులు. నాకు దివ్య, ప్రతిమ అక్కలు ఉన్నారు. నాన్న గ్రామంలో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు. పెద్దక్క టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తోంది. రెండో అక్క సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రిపరేషన్ ఇలా... నిట్‌లో డాక్టర్ నర్సయ్య సార్ అందించిన ప్రోత్సాహం, నిట్ డైరెక్టర్, ఇతర ప్రొఫెసర్ల చొరవతోనే నంబర్‌వన్ ర్యాంకు సాధించా. గేట్ ప్రవేశపరీక్షకు సుమారు ఆరు నెలలు కష్టపడి చదివాను. ప్రతిరోజూ నాలుగు గంటలపాటు వివిధ పుస్తకాలను చదివే వాడిని. విషయ పరిజ్ఞానం కోసం అగ్లాసెమ్ వెబ్సైట్ చాలా తోడ్పడింది. సైట్లో గేట్లో విజయం సాధించిన ర్యాంకర్ల ఇంటరŠూయ్వలను పొందుపరిచారు. గత ఏడాది నంబర్‌వన్ ర్యాంకు సాధించిన నితీష్రాయ్ ఇంటరŠూయ్వ స్ఫూర్తినిచ్చింది. సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. సొంతగానే నోట్స్ తయారు చేసుకున్నా. ఐఓసీఎల్‌లో ఉద్యోగం చేస్తా.. మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. గేట్లో ఆల్ ఇండియా లెవల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన నాకు ఎంటెక్ వైపు కాకుండా ఆయిల్, రీఫైనరీలో ఉద్యోగం చేయాలనుంది. ఆయిల్ కంపెనీల్లో పేరెన్నిక గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో ఉద్యోగం చేస్తా. ప్రస్తుతం ఐఓసీఎల్‌లో జాయిన్ అవుతా. నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తా.. నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. జేఈఈలో 20605 ర్యాంకు సాధించి నిట్ వరంగల్‌లో మెటలర్జికల్ విభాగంలో చేరాను. నిట్‌లోని అత్యుత్తమ బోధనతోనే ఆల్ ఇండియా నంబర్‌వన్ ర్యాంకు సాధించా. నాకు నంబర్‌వన్ ర్యాంకు అందించిన నిట్‌కు రుణపడి ఉంటా. నిరుపేదలకు ప్రోత్సాహం అందిస్తా. ఆర్థిక చేయూతనందిస్తా. వరంగల్ బ్యూటీపుల్ సిటీ. -
సమస్యలే స్ఫూర్తి..సేవే లక్ష్యం
పలమనేరు : చేయూత లేదని అనాథలు బాధపడకూడదు.. ఆదరణ లేదని వృద్ధులు శోకించకూడదు..విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదు. సమాజంలో ప్రతి మూల ఓ వివక్ష కాని ఓ సమస్య కాని విష వృక్షంలా మారి మనిషి జీవితాన్ని కుదిపేస్తోంది. అలాంటి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న మహోన్నత ఆశయం కోసం ఓ యువతి తపిస్తోంది. వారి సమస్యలే ఆమెకు స్ఫూర్తి..వారికి సేవ చేయడమే ఆమె లక్ష్యం..విద్యార్థి దశలోనే తనకు చేతనైన సాయం చేస్తూ సమా జ సేవలో ముందున్న ఆమె దృక్పథం నేటి యువతరానికి ఆదర్శం. పలమనేరు మదర్‌థెరీసా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించి, ప్రస్తుతం ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న రోహిత మనగతం ఆమె మాటల్లోనే.. కుటుంబం, చదువు నా పేరు రోహిత.. మాది గంగవరం సమీపంలోని మబ్బువాళ్లపేట. నాన్న వెంకటేశ్వర్లు ఏసీటీఓగా పనిచేస్తున్నారు. అమ్మ హేమలత గృహిణి. అన్నయ్య రిత్విక్ రోబోటెక్ ఆటోమేషన్‌లో యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. నా ప్రాథమిక విద్య యూనివర్సల్‌లో, ఇంటర్ శ్రీవాణిలో సాగింది. ఇంటర్ ఎంపీసీలో 97.3 శాతం మార్కులు సాధించా. విట్, ఎస్ఆర్ఎం, సస్త్ర యూనివర్సిటీల్లో ఫ్రీ సీటు వచ్చింది. కానీ బీటెక్(సివిల్) ఇక్కడి మథర్ థెరీసాలో చదివా. బీటెక్ 86.01 మార్కులు సాధించి జేఎన్టీయూలో టాపర్‌గా గోల్డ్‌మెడల్‌ను పొందా. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డులు పొందాను. ఏటా కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్ వస్తోంది. పోటీల్లో గెలిచి..పేదలకు పంచి కాలేజీలో ఉన్న దాదాపు 20 ఇతర యూనివర్సిటీలు, కాలేజీల్లో జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇతర కాంపిటీషన్స్‌కు వెళ్లాను. దాదాపు అన్నింటిలోనూ మొదటి బహుమతి గెలుచుకున్నా. అందులో ఇచ్చే క్యాష్ ప్రైజ్‌ను పలమనేరులోని వృద్ధాశ్రమానికి, గ్రామంలోని నిరుపేదలకు ఇచ్చేదానిని. మా తల్లిదండ్రులు కూడా నాకు అండదండగా ఉండేవారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం గంటలకొద్దీ చదవడం ముఖ్యం కాదు. సబ్జెక్ట్‌పై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాలి. ఇందు కోసం నెట్, యూట్యూబ్ లాంటివి ఎంతో ఉపయోగం. అందుకే నేను బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నా. సింథెటిక్ పెయింటింగ్, సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేస్తూ జేఎన్టీయూ, సౌత్ ఇండియా ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో టాపర్‌గా నిలిచా. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. 2015లో జిల్లాకు వరదలు వచ్చాయి. కాని కొద్ది రోజులకే మా నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ నీటి కోసం అవస్థలు పడ్డారు. నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యామ్‌లు, చెరువులు లేకపోవడమే ఇందుకు కారణమనిపించింది. దీంతో ఐదు పంచాయతీల్లో దాదాపు 300 ఎకరాలకు నీరు అందించేలా ఓ ప్రాజెక్టును తయారు చేశాను. ఇందు కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నెలల పాటు శ్రమించి అన్ని వివరాలతో ప్రాజెక్టు సిద్ధం చేసి అధికారులకు 2017 జూన్‌లో అందజేశా. కానీ నేటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మంచి చేయాలని ఆశ ఉంటే చాలదు అధికారం కూడా కావాలని అప్పుడే అనిపించింది. కలెక్టర్ అయితే నేను అనుకున్నది చేయగలనని అనిపించింది. అందుకోసమే ఐఏఎస్ చదువుతున్నా.. సంక్పలం నేను చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగా. నాకు ప్రజలు కష్టాలు బాగా తెలుసు. మా నాన్నకు వ్యవసాయమంటే ఇష్టం కావడం వల్ల నాకు కూడా పొలం పనులంటే ఆసక్తి. కూలి పనులకొచ్చేవారి జీవితాల్లో కష్టాలను చూశా. విద్య, వైద్య సదుపాయాలు లేక నిరుపేదలు అవస్థలపాలు కాకూడదని అనిపించింది. వృద్ధులు, అనాథల అవస్థలను చూశా. వారికి ఏదో ఒక రకంగా సాయం చేయాలనిపించేది.