Custodial Death
-
ఇరాన్లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
దుబాయ్: ఇద్దరు మహిళా జర్నలిస్టులకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణం పెను సంచలనం సృష్టించడం, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తెలిసిందే. ఆ కస్టడీ మరణంపై రిపోరి్టంగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లను దోషులుగా న్యాయ శాఖ నిర్ధారించింది. అలాహేకు ఆరు సంవత్సరాలు, హమెదీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వారిద్దరూ 2022 సెపె్టంబర్ నుంచీ టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో మగ్గిపోతున్నారు. గత మే నెలలో వారిపై విచారణ మొదలైంది. తాజా తీర్పుపై వారు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కలి్పంచామని న్యాయ శాఖ పేర్కొంది. -
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్‌లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్‌లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన నితీశ్ నానక్‌రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్‌ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్‌లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్‌ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
కస్టోడియల్ మరణం విచారకరం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ మరణం విచారకరమని, ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. గచ్చిబౌలి పోలీస్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పత్రికల్లో వచ్చిన కస్టోడియల్ మరణం వార్తపై స్పందించి న్యాయవాది రాపోలు భాస్కర్.. న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు కస్టోడియల్ మరణంపై మహబూబాబాద్‌కు చెందిన న్యాయ విద్యార్థి కరుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ కస్టోడియల్ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను 8 వారాల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. -
HYD: పోలీసు స్టేషన్లో కస్టోడియల్ డెత్!.. కారణం అదేనా?
సాక్షి, హైదరాబాద్: ఓ గొడవకు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు తీసుకువచ్చిన సెక్యూరిటీ గార్డు పోలీస్‌స్టేషన్‌లోనే మృతి చెందాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నానక్‌రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహార్‌కు చెందిన నితీశ్(32), బిట్టు, వికాస్‌లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే, క్యాంపులోని కూలీలు శనివారం రాత్రి 11 గంటలకు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వీరు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు డయల్ 100కు కాల్ చేయడంతో గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించి.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే వీరిలో నితీశ్ ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు. పోలీసు సిబ్బంది అది గమనించి తొలుత సీపీఆర్ చేశారు. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్ మృతి చెందాడని ప్రకటించారు. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరణ ఇస్తూ.. కూలీలు, సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరగడంతో అదుపులోకి తీసుకున్నామని, ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్ మృతి చెందాడని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు -
మెదక్‌లో ఖదీర్ ఖాన్ ‘లాకప్‌డెత్’.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మెదక్‌లో జరిగిన ఖదీర్ ఖాన్ లాకప్‌డెత్ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం కార్యదర్శి, డీసీపీ, మెదక్ ఎస్పీలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్...గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ రాత్రి మృతి చెందాడు. దొంగతనం కేసులో అతన్ని పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏఏజీ రామచంద్రరావు పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ...ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఖదీర్‌ను హాజరుపరిచిన 14 రోజుల తర్వాత అతను మృతి చెందాడని చెప్పారు. వాదనల తర్వాత ధర్మాసనం..ఖదీర్ భార్య తన భర్తను లాకప్‌డెత్ చేశారని ఆరోపిస్తోందని, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సిట్‌తో విచారణ జరిపించాలి... ఖదీర్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని, ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ అతని భార్య సిద్ధేశ్వరి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను అత్యంత క్రూరంగా చంపారని, సీసీటీవీ ఫుటేజీ ఫ్రీజ్ చేసేలా ఎస్పీకి ఆదేశాలివ్వాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. స్పెషల్ జీపీ సంతోశ్‌కుమార్ హాజరై.. సుమోటో పిల్ వివరాలను తెలిపారు. తదుపరి వాదనల కోసం ఈ పిటిషన్‌ను కూడా పిల్‌తోపాటే జతచేయాలని రిజిస్ట్రీకి సూచించారు. -
ఇరాన్లో ‘నైతిక పోలీస్’ రద్దు
టెహ్రాన్: మహ్సా అమినీ (22) అనే కుర్దిష్ యువతి మరణంతో ఇరాన్ నెలలుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేని నైతిక పోలీస్ వ్యవస్థను రద్దు చేసింది. ఒక మత కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నకు బదులుగా ఇరాన్ అటార్నీ జనరల్ ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్ గణతంత్ర, ఇస్లామిక్ పునాదులు రాజ్యాంగబద్ధంగా స్థిరంగా ఉన్నాయని, అయితే అమలు విధానాలు సరళంగా ఉంటాయని అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం వ్యాఖ్యానించారు. హిజాబ్ సరిగా ధరించలేదని అమినిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేయడం, మూడు రోజుల తర్వాత ఆమె కస్టడీలోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగాయి. మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి. బలగాలు కాల్పుల్లో వందలాదిగా చనిపోయారు. అమిని పేరు, ఫొటో ప్రదర్శిస్తూ ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలు హిజాబ్‌ను కాల్చివేయడం, బహిరంగంగా జుత్తును కత్తిరించుకోవడం చేశారు. నైతిక పోలీసింగ్ ఇలా మొదలైంది... అతివాద అధ్యక్షుడు అహ్మదీ నెజాది హయాంలో 2006లో గష్త్–ఇ–ఇర్షాద్ (మార్గదర్శక పహారా) పేరుతో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో భాగంగా మహిళలకు హిజాబ్ ధారణ తప్పనిసరి చేశారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించి, అయినా ఖాతరు చేయని మహిళలను అరెస్ట్ చేసేవారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. -
హిజాబ్ హీట్
ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వారం రోజుల క్రితం 22 ఏళ్ల యువతి మోరల్ పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోవడంతో యువతరం భగ్గుమంది. లక్షలాది మంది అమ్మాయిలు రోడ్డెక్కి జుట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను ఇక ధరించే ప్రసక్తే లేదని తగులబెడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడం మతపరంగా తమ హక్కు అని, వాటిని ధరించే విద్యాసంస్థలకు వస్తామని డిమాండ్ చేస్తూ ఉంటే, ఇరాన్లో పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. పోలీసు కస్టడీలో ఏం జరిగింది ? కుర్దిష్ ప్రాంతంలోని సాకేజ్ నగరానికి చెందిన 22 ఏళ్ల వయసున్న మహస అమిని టెహ్రాన్‌కు వచ్చింది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో సెప్టెంబర్ 13న మోరల్ పోలీసులు మెట్రోస్టేషన్ బయట ఆమెని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు కొట్టే దెబ్బలకు తాళలేక నిర్బంధ కేంద్రంలో కోమాలోకి వెళ్లిపోయిన అమిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. వ్యాన్‌లోకి ఎక్కించేటప్పుడే మహిళా పోలీసులు ఆమెను చితకబాదుతూ కనిపించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అమిని అప్పటికే అనారోగ్యంతో ఉందని గుండె పోటుతో మరణించిందని పోలీసుల వాదనగా ఉంది. పోలీసుల వాదనను ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. తమ అమ్మాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని వారు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన అరెస్ట్‌ల్లో అమ్మాయిల ముఖం మీద గట్టిగా కొడుతూ, లాఠీలు ఝుళిపిస్తూ, వారిని వ్యాన్లలోకి తోసేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయంటూ ఐక్యరాజ్యసమితి హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అమిని మరణానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేసింది. మహిళల్ని ఎలా చూస్తారు ? ఇరాన్లో మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చెయ్యడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ప్రభుత్వ అధికారులుగా కూడా మహిళలున్నారు. కానీ ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు వస్త్రధారణపై కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తారు. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించడం, శరీరం కనిపించకుండా పొడవైన వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలన్న నిబంధనలున్నాయి. పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరితో ఒకరు కలిసిమెలిసి తిరగకూడదు. 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చి మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలపై ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు మహిళలు స్వేచ్ఛగా తమకిష్టమైన దుస్తులు ధరించేవారు. ఇరాన్లో అమ్మాయిల వస్త్రధారణపై ఫిర్యాదుల్ని పరిశీలించడానికి 2005లో మోరల్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల మోరల్ పోలీసులు అత్యంత దారుణంగా అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 2017లో హసన్ రౌహని అధ్యక్షుడయ్యాక మోరల్ పోలీసుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశారు. డ్రెస్‌కోడ్ నిబంధనల్ని అమ్మాయిలు ఉల్లంఘించినా వారిని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మత ఛాందసవాది అయిన ఇబ్రహీం రైజి అధ్యక్ష పగ్గాలు చేపట్టాక మోరలిటీ పోలీసులు చెలరేగిపోతున్నారు. షరియా చట్టాలపై అవగాహన పెంచాల్సిన పోలీసులు అమ్మాయిలపై జులుం ప్రదర్శిస్తున్నారు. గతంలోనూ నిరసనలు ఇరాన్లో మహిళలు హిజాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ 2014లో పెద్ద ఎత్తున ఆన్లైన్ ఉద్యమం నడిపించారు. మై స్టెల్తీ ఫ్రీడమ్ పేరుతో పెద్ద సంఖ్యలో నెటిజన్ల హిజాబ్‌ను ధరించబోమంటూ ఫోటోలు , వీడియోలు చేశారు. వైట్ వెడ్నస్డేస్, గర్ల్సŠ ఆప్ రివల్యూషన్ స్ట్రీట్ అన్న పేరుతో కూడా షరియా చట్టాలకు వ్యతిరేకంగా అమ్మాయిలు ఉద్యమాలు నిర్వహించారు. నిరసనల్లో ఏడుగురు మృతి హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్లో టెహ్రాన్‌తో దాదాపు 15 నగరాలు దద్దరిల్లుతున్నాయి. అమ్మాయిలు, వారికి మద్దతుగా యువకులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో గత ఐదారు రోజుల్లో ఇద్దరు యువకులు సహా ఏడుగురు మరణించారు. నిరసనలు కుర్దిష్ వేర్పాటువాదుల పనేనని ప్రభుత్వం అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Juscti For Manikandan: సంచలన ఆదేశం.. రీపోస్ట్ మార్టం చేయాల్సిందే!
Juscti For Manikandan: పోలీసు కస్టోడియల్ మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. 21ఏళ్ల విద్యార్థి ఎల్ మణికందన్ పోలీసు కస్టడీ నుంచి విడుదలైన మరుసటిరోజే మృతి చెందటం కలకలం రేపుతోంది. తన కుమారుడిది పోలీసు కస్టోడియల్ మరణమంటూ అతని తల్లి కోర్టును ఆశ్రయించింది. మంగళవారం మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ మణికందన్ మృతదేహానికి తిరిగి పోస్ట్ మార్టం చేయాలని ఆదేశించింది. వివరాలు.. ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఎల్ మణికందన్ తన స్నేహితుడితో బైక్ మీద వెళుతుండగా.. పరమకుడి-కీజాతొరోవల్ రోడ్డులో వెహికల్ చెకప్ చేస్తున్న పోలీసులు ఆపారు. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి మణికందన్, అతని స్నేహితుడు ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకొగా అతని స్నేహితుడు భయంతో పారిపోయాడు. దీంతో పోలీసులు మణికందన్‌ను స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతని తల్లి రామలక్ష్మీకి సమాచారం అందించగా.. మణికందన్‌ను తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. అయితే మరుసటి రోజు ఉదయం మణికందన్ సృహలో లేకపోవడం గమనించిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మణికందన్ మృతిచెందాడు. మణికందన్‌కు పోస్ట్ మార్టం చేయించిన పోలీసులు.. తల్లిందండ్రులకు అప్పగించారు. అయితే తమ కొడుకు పోలీసులే స్టేషన్లో హింసించడం వల్ల మారణించాడని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసు అధికారలు చెప్పడంతో నిరసన విరమించారు. సోమవారం పోలీసులు పోలీసు స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. అతని శరీరానికి ఎటువంటి గాయం లేదని, పోలీసులు హింసించలేదని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నామని, అతని(మణికందన్) స్నేహితుడు గంజాయి కేసుల్లో ఉన్నాడని తెలిపారు. పోలీసులు హింసించారని దానికారణంగా మణికందన్ తల్లిదండ్రులు కోర్టును అశ్రయించారు. పోలీసులు చాలా తక్కువ నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మణికందన్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే మణికందన్ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలీసు దౌర్జన్యం, కస్టోడియల్ మరణాలకు వ్యతిరేకంగా ‘జై భీం’ మూవీ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. -
Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక
అడ్డగూడూరు/చౌటుప్పల్: మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ దర్యాప్తులో భాగంగా ఓఎస్డీ మల్లారెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. స్టేషన్లో ఉన్న లాకప్ గదులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండింటిని మరమ్మతు చేయించినా ఒకటే పనిచేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. అలాగే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.మణికంఠ శనివారం రాత్రి అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. సీల్డ్ కవర్లో తన నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు.. చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు -
కస్టడీ వ్యక్తి మృతి: ముగ్గురు పోలీసులకు పదేళ్ల జైలు
సాక్షి, చెన్నై: కస్టడీలో ఉన్న నిందితుడి మృతి కేసులో సబ్ ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులకు పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ దిండుగల్ కోర్టు తీర్పు వెలువరించింది. దిండుగల్ జిల్లా వడమదురై పోలీసులు గతంలో మెట్టినా పట్టికి చెందిన సెంథిల్‌కుమార్‌ను బెదిరింపు కేసులో అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించే సమయంలో గుండెపోటు రావడంతో అతను మరణించాడు. అయితే పోలీసులు కొట్టి చంపేసినట్టుగా ఆరోపణలు రావడం, బంధువులు ఆందోళనకు దిగడంతో కేసు సీబీసీఐడీకి చేరింది. విచారణ ముగించిన సీబీసీఐడీ వడమదురై స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుమలై ముత్తుస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు అరవిందన్, పొన్రాజ్, అబ్దుల్ వహబ్‌లపై మీద కేసు నమోదు చేసింది. దిండుగల్ కోర్టు న్యాయమూర్తి శరవణన్ ఈ కేసును విచారిస్తూ వచ్చారు. సీబీసీఐడీ సమర్పించిన చార్జ్ షీట్ మేరకు 60 మంది సాక్షులను విచారించారు. వాదనలు ముగించారు. విచారణలో సెంథిల్‌కుమార్‌ను అరెస్టు చేసిన సమయంలో మెట్టినాపట్టి నుంచి వడమదురై పోలీసు స్టేషన్ వరకు దారి పొడవునా కొట్టుకుంటూ తీసుకొచ్చినట్టు తేలింది. తీవ్ర రక్తస్త్రావం జరిగినా కప్పిపుచ్చి ఆగమేఘాలపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేసినట్టు వెలుగు చూసింది. దీంతో ఈ కేసులో ఎస్ఐ తిరుమలైస్వామి, పొన్రాజ్, అరవిందన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అలాగే చెరో రూ.5 వేల జరిమానా విధించారు. అదే సమయంలో సబ్ ఇన్స్పెక్టర్కు అదనంగా ఏడాది జైలు, రూ. వెయ్యి జరిమానా విధించారు. చదవండి: 10 కిలోల బంగారు ఆభరణాలతో పరార్ -
పోలీసు కస్టడీలో మృతి?
టీ.నగర్: పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి వ్యవహారంపై తిరుమంగళం అమముక అభ్యర్థి ఆదినారాయణన్ సహా నలుగురు మదురై హైకోర్టు బెంచ్ ఎదుట హాజరయ్యారు. మదురై సోలైయళగుపురం ముత్తుకరుప్పన్ కుమారుడు డ్రైవర్ బాలమురుగన్. అతన్ని ఒక కిడ్నాప్ కేసులో అవనియాపురం పోలీసులు 2019లో చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్లో ఉంచి దాడి చేశారు. దీంతో అతను మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి. ఈ కేసుపై శనివారం విచారణ జరిగింది. న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, ఎస్ ఆనంద్ విచారణ జరిపారు. పోలీసుల దాడిలో బాలమురుగ న్ మృతిచెందలేదని, ప్రమాదంలో గాయపడి మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసులో ఆదినారాయణన్ సహా నలుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. దీనిపై జూన్ 14న రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష తిరువొత్తియూరు: ఈరోడ్ జిల్లాలో చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ రోడ్డు మహిళా కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈరోడ్ జిల్లా భవానిసాగర్ తాండం పాళయానికి చెందిన జగన్ (19) అదే ప్రాంతంలో ఉంటున్న నాలుగేళ్ల బాలికపై 2019లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ శనివారం ఈరోడ్ మహిళా కోర్టులో జరిగింది. విచారణ అనంతరం జగన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు చెప్పారు. హత్య కేసులో యవజ్జీవం బాంబుతో దాడి చేసి రైతును హత్య చేసిన యువకుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. శివగంగై జిల్లా తిరుప్పాచ్చికి చెందిన ముత్తు రామలింగం (35) రైతు. ఇతనికి దూతైకి చెందిన పెరియస్వామికి వైగై నదిలో ఇసుక తరలింపులో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. 2003 అక్టోబర్ 3న బాంబు దాడిలో ముత్తు రామలింగం మృతి చెందాడు. పోలీసులు సేంగైస్వామిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి శివగంగై జిల్లా సెషన్స్ కోర్టులో శనివారం న్యాయమూర్తి సుమతీ సాయి ప్రియ సమక్షంలో జరిగింది. సేంగైస్వామికి యావజ్జీవ శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
ఆరు నెలల్లో ముగించాల్సిందే: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, చెన్నై: జ్యుడిషియల్ కస్టడీలో తండ్రి, కొడుకుల మరణం కేసులో విచారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు నెలల్లోపు దర్యాప్తును ముగించి తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం ఆదేశించింది. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, ఫినిక్స్ అనే తండ్రి కుమారులు జ్యుడిషియల్ కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా సాత్తాన్‌కులం పోలీసులు ఈ ఇద్దర్ని చిత్రహింసలు పెట్టినట్టు తేలింది. ఆ స్టేషన్ సీఐ, ఇద్దరు ఎస్ఐలతో పాటు పది మంది పోలీసులు అరెస్టు అయ్యారు. కేసును సీబీఐ విచారిస్తోంది. చార్జ్‌షీట్‌ను మదురై జిల్లా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ నేపథ్యంలో కింది కోర్టులో విచారణ జాప్యంపై హైకోర్టు గురువారం స్పందించింది. కేసును త్వరితగతిన విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆరునెలల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని గడువు విధించారు. చదవండి: కస్టడీ డెత్: సీబీఐ విచారణలో విస్తుపోయే విషయాలు డీజీపీతో పాటు ఎస్పీ కన్నన్ మెడకు ఉచ్చు -
చిత్రహింసలు: రక్తపు మరకలు తుడవాలంటూ
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మద్రాస్ హైకోర్టుకు నివేదిక అందజేసింది. ‘‘రిజల్ట్స్ ఆఫ్ లాబొరేటరి అనాలిసిస్’’ పేరిట రూపొందించిన ఫోరెన్సిక్ రిపోర్టును మధురై ధర్మాసనానికి సమర్పించింది. సత్తాన్‌కులం లాకప్, టాయిలెట్, ఎస్హెచ్ఓ గదిలోని గోడలపై సేకరించిన రక్త నమూనాలు, మృతుల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరి నిపుణులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు..‘‘సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్లో 19.06.2020 రోజున సాయంత్రం బెనిక్స్, జయరాజ్‌లను, నిందితులైన పోలీసు అధికారులు అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. (చదవండి: అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ) అదే రోజు రాత్రి మరోసారి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలే వారి మృతికి కారణమయ్యాయి’’అని స్పష్టం చేసింది. ఇక బాధితులను తీవ్రంగా హింసించడమే గాకుండా, గాయాల వల్ల వారి శరీరం నుంచి కారిన రక్తం ఫ్లోర్‌పై పడితే, దానిని కూడా వారి దుస్తులతోనే శుభ్రం చేయాలంటూ అత్యంత పాశవికంగా ప్రవర్తించారని పేర్కొంది. ఇక కోవిల్పట్టి మెజిస్ట్రేట్ విచారణ, పోస్ట్‌మార్టం నివేదికలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించినట్లు చార్జిషీట్లో పొందుపరిచింది. (చదవండి: కస్టడీ డెత్: 9 మంది పోలీసులపై చార్జిషీట్) ఆరోజు ఏం జరిగింది? సీబీఐ నివేదికలోని వివరాల ప్రకారం.. జూన్ 19న ఎస్సై బాలక్రిష్ణన్, ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, కానిస్టేబుల్ ఎం ముత్తురాజాతో పాటు మరికొంత మంది పోలీసులు కామరాజార్ చౌక్ వద్ద జయరాజ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బెనిక్స్ వెంటనే సత్తానుకులం పోలీస్ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. తన తండ్రిని ఎందుకు కొడుతున్నారంటూ ఎస్సై బాలక్రిష్ణన్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు అతడిపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్‌ను బెనిక్స్ నెట్టివేయడంతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపై చేయి ఎత్తినందుకు తగిన గుణపాఠం చెబుతామంటూ బెనిక్స్ను తీవ్రంగా కొట్టారు. అలా కొన్ని గంటలపాటు జయరాజ్, బెనిక్స్లను చిత్ర హింసలకు గురిచేశారు. ఆ తర్వాత వారిద్దరి దుస్తులు విప్పించి, మళ్లీ కొట్టడం ప్రారంభించారు. చెక్కబల్లపై వారిని పడుకోబెట్టి, కాళ్లూ, చేతులూ వెనక్కి మడిచి పెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తమను విడిచిపెట్టాలని ఎంతగా ప్రాధేయపడినా కనికరం చూపలేదు. తీవ్రమైన గాయాల వల్లే వీరిద్దరు మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. -
9 మంది పోలీసులపై సీబీఐ చార్జిషీట్
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ హౌజ్ ఇన్చార్జ్ సహా తొమ్మిది మంది పోలీసుల పేర్లను అభియోగపత్రంలో చేర్చింది. ఎస్ శ్రీధర్, కె.బాలకృష్ణ, పి.రఘుగణేష్, ఏఎస్ మురుగన్, ఎ. సమదురై, ఏఎమ్ ముత్తురాజ, ఎస్. చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్.వేల్‌ముత్తు తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు మధురై కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై ఇటీవలే కరోనాతో మృతి చెందినట్లు సీబీఐ వెల్లడించింది. (చదవండి: ‘కొడుకు ఒంటిపై 13, తండ్రి శరీరంపై 17 గాయాలు’) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇక కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్‌కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరైన సీబీఐ అధికారులు, పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. తాజాగా తొమ్మిది మంది పేర్లను చార్జిషీట్లో చేర్చింది. -
అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ
చెన్నై: తమిళనాట ప్రకంపనలు రేపిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో సీబీఐ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. సత్తాన్‌కుళంకు చెందిన జయరాజ్, బెనిక్స్ పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్‌కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించారు. (చదవండి: కస్టడీ డెత్ కేసు: కరోనాతో ఎస్ఎస్ఐ మృతి) ఈ సందర్భంగా.. తగిన ఆధారాలతో కోర్టు ముందు హాజరైన సీబీఐ అధికారి.. విచారణలో భాగంగా మురుగన్, థామస్ జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టినట్లు ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 38 మందిని విచారించామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు తండ్రీకొడుకులు చిత్రహింసలకు గురిచేసినట్లు తేలిందన్నారు. లోతైన గాయాల కారణంగానే వారిద్దరు మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. ఇక కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఎస్ఐ పాల్దురై ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.(చదవండి:రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు అభ్యర్థన మేరకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. దీంతో విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. కస్డడీ డెత్ కేసులో సత్తాన్‌కుళం పోలీస్ స్టేషనుకు చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. -
కస్టడీ డెత్ కేసు: కరోనాతో ఎస్ఎస్ఐ మృతి
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో పాల్దురై మరణించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సరైన చికిత్స అందించనందు వల్లే పాల్దురై మృతి చెందారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) ఇక లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. చిత్ర హింసలు పెట్టగా వారు మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు అభ్యర్థన మేరకు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు అనుమతినిచ్చింది. విచారణ వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. కస్డడీ డెత్ కేసులో సత్తాన్‌కులం పోలీస్ స్టేషనుకు చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. వీరిలో పాల్దురై కూడా ఉన్నారు. -
కస్టడీ డెత్: వీడియో డెలిట్ చేసిన సింగర్!
చెన్నై: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ ఘటనకు సంబంధించిన వీడియోను తొలగించాలని తమిళనాడు క్రైంబ్రాంచ్ సీఐడీ(సీబీ-సీఐడీ) ప్రముఖ గాయని సుచిత్రకు విజ్ఞప్తి చేసింది. పోలీసుల కస్టడీలో చిత్ర హింసలకు గురై వారిద్దరు చనిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవ సంఘటనలకు ఆమె వ్యాఖ్యలకు ఏమాత్రం పొంతన లేదని కొట్టిపారేసింది. ఊహాజనిత కథనాలు జోడించి ఈ ఘటనను సంచలనంగా మార్చేందుకు సుచిత్ర ప్రయత్నించారని పేర్కొంది. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వెంటనే ఈ వీడియోను తీసివేయాలని ఆమెకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తూత్తుకుడి జిల్లా పోలీసులు ట్విటర్లో చేశారు. సీబీ-సీఐడీ విజ్ఞప్తి మేరకు సుచిత్ర తన నిరాధార కథనాలతో కూడిన వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.(రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు) కాగా తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్ సమీపంలోని సాత్తాన్‌కులం పోలీసుల దాష్టీకానికి జయరాజ్, బెనిక్స్ అనే తండ్రీకొడుకులు మరణించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన వీరు పోలీస్ కస్టడీలో దారుణంగా మృతి చెందడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణలో కూడా వారిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు వెల్లడైంది. ఇక ఈ ఘటనపై సినీ, క్రీడా ఇతర రంగాల సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక దక్షిణాది గాయని అయిన సుచిత్ర ఘటన జరిగిన వెంటనే స్పందించి తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. అయితే అవన్నీ నిరాధార, కల్పిత కథనాలంటూ శుక్రవారం సీబీ-సీఐడీ ఆమెకు ఓ నోటీసు జారీ చేసింది. కస్టడీ డెత్ కేసు విచారణ జరుగుతున్నందున ప్రింట్, విజువల్, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను నమ్మవద్దని ప్రజలను కోరింది. కాగా జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్ కేసును మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం సీబీ-సీఐడీకి అప్పగించగా.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తండ్రీకొడుకుల మృతిపై విచారణ కొనసాగుతోంది. -
కస్టడీ డెత్: మరో కీలక మలుపు
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు బెనిక్స్- జయరాజ్ కస్టోడియల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ కేసును ప్రస్తుతం సీబీ- సీఐడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు తిరునల్వేలి డీఐజీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.(రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఐదుగురి అరెస్టు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టగా వారు మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా.. మెజిస్ట్రేట్ ఇటీవలే నాలుగు పేజీల నివేదిక అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.(కస్టడీ డెత్: పోలీసుల అరెస్టు.. స్థానికుల సంబరాలు) -
కస్టడీ డెత్: మరో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడుకు చెందిన జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీ-సీఐడీ వర్గాలు వెల్లడించాయి. జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పోలీసులను కూడా విచారిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జయరాజ్, బెనిక్స్‌ల దారుణ మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీ వీ షణ్ముగం ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితులు అరెస్టు కావడం గమనార్హం. (రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఇదిలా ఉండగా.. కస్టడీ డెత్ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే తూత్తుకుడిలో సంబరాలు మొదలయ్యాయి. టపాసులు పేలుస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సత్తాన్‌కుళం పోలీసు స్టేషన్లో పనిచేసే పోలీసులంతా ఈ కేసులో అరెస్టు అవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ స్టేషన్ రెవెన్యూ విభాగం నియంత్రణలోకి వెళ్లింది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల దాష్టీకానికి బలైన జయరాజ్, బెనిక్స్‌లకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక ఈ హేయమైన ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికలో పోలీసుల కర్కశత్వం, సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ అధికారులకు చట్టం పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏపాటివో తెలియజేస్తూ మెజిస్ట్రేట్ నాలుగు పేజీల నివేదిక అందజేశారు.(కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
రాత్రంతా చిత్ర హింసలు.. రక్తపు మరకలు
చెన్నై: పోలీసులు విచక్షణారహితంగా కొట్టినందు వల్లే సత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, బెనిక్స్ మరణించినట్లు జ్యుడిషియల్ విచారణలో తేలింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై మద్రాస్ హైకోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘటనపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ మంగళవారం ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, పోలీస్ స్టేషనులోని పరిస్థితులను బట్టి పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే జయరాజ్, బెనిక్స్ మృతి చెందారని పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన నివేదికలో.. ‘‘జూన్ 19 రాత్రంతా పోలీసు అధికారులు ఆ తండ్రీకొడుకులను కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బాధితులను కొట్టేందుకు ఉపయోగించిన లాఠీలు, వారిని పడుకోబెట్టిన బల్లపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ లాఠీలను హ్యాండోవర్ చేయాల్సిందిగా నేను ఆదేశించగా.. సత్తాన్‌కులం పోలీసులు నా మాటలు వినబడనట్లు నటించారు. నేను గట్టిగా అడిగిన తర్వాత అయిష్టంగానే వాటిని ఇచ్చారు. మహరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ నా వెనుక చేరి గొణగడం మొదలు పెట్టారు. విచారణతో నేనేమీ సాధించలేది లేదని అన్నారు. ఇక మరో పోలీసు అధికారి బాధితులను వేధిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు తెలిసింది. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్టింగులు మార్చారు. ఇవే కాకుండా ఈ కేసులో ఉన్న ఇతర సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటిని పరిరక్షించే ఏర్పాట్లు చేయాలి’’అంటూ విచారణలో వెల్లడైన అంశాలను పొందుపరిచారు. (కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు) కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు షాపును తెరచి ఉంచాడని పోలీసులు జూన్ 19న జయరాజ్(59) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి అరెస్టును నిరసిస్తూ సత్తాన్‌కులం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అతడి కొడుకు బెనిక్స్(31)ను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిపై ఐపీసీ 188, 383,506(II)తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. మెజిస్ట్రేట్ ఆదేశాలతో కోవిల్ పట్టి సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జూన్ 23న తండ్రీకొడుకులు ఇద్దరు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టడం వల్లే వారు మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఇక అమానుష ఘటనపై మండిపడ్డ మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇక మంగళవారం ఈ ఘటనపై మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించిన నేపథ్యంలో ఈ విషయంపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) -
కస్టడీ డెత్: తగిన ఆధారాలు ఉన్నాయి!
చెన్నై: జ్యుడిషియల్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్, బెనిక్స్‌లపై హేయమైన దాడి జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు రుజువైందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘తండ్రీకొడుకులపై దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు లభించాయి’’అని మంగళవారం పేర్కొంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31) పోలీసు కస్టడీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో వారిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయగా... గాయాలతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారి అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం... జయరాజ్, బెనిక్స్‌ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీఎన్ ప్రకాశ్, జస్టిస్ పుగళేందిలతో కూడిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను మంగళవారం పరిశీలించింది. బాధితుల మృతదేహాలపై గాయాలు ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొంది. (పోలీసులు కావాలనే దాడికి దిగారు) ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించే విషయం గురించి న్యాయమూర్తులు మాట్లాడుతూ..‘‘వారికి న్యాయం జరుగుతుందని జయరాం కుటుంబం నమ్ముతోంది. ఒక్క సెకన్ కూడా వృథా కావడానికి వీల్లేదు. సీబీఐ ఈ కేసును చేపట్టే లోపు తిరునల్వేలి డీఐజీ ఎందుకు విచారణ ప్రారంభించకూడదు’’అంటూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఈ విషయంపై మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు విచారణకై నియమించిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ విషయంపై సంబంధిత జ్యుడిషియల్ పరిధిలోని అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులు 4 వారాల్లోగా స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, మరో పదిహేను మందిని బదిలీ చేశారు. -
కస్టడీ డెత్: పోలీసులు చెప్పినవి అబద్ధాలే
చెన్నై: తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక వీడియో వెలుగు చూసింది. దీని ప్రకారం పోలీసులు చెప్పిన ఎన్నో విషయాలు అబద్ధమని రుజువవుతోంది. ట్యుటికోరన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జూన్ 19న వారు నిర్వహించే మొబైల్ దుకాణం ముందు రద్దీ ఉందని, దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా తండ్రీకొడుకులు ఎదురు తిరిగినట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి రద్దీ లేదు. సాధారణంగా ఫోన్లో మాట్లాడుతున్న జయరాజ్ పోలీసులు పిలవడంతో వారి దగ్గరకు వెళ్లాడు. అతని వెనకాలే కొడుకు కూడా వెళ్లాడు. పైగా పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ వాళ్లు పోలీసులకు సహకరించారే తప్ప ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని సీసీటీవీలో స్పష్టమవుతోంది. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. (వివాదాస్పదమైన తండ్రీ కొడుకుల మృతి) పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహనంలో తీసుకు వెళుతుంటే అతడి కుమారుడు ఆ వాహనాన్ని అనుసరించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయపర్చుకున్నట్లు ఎక్కడా కనిపించకపోవడంతో వారికి వారే స్వతాహాగా గాయాలు చేసుకున్నారన్న వాదనలోనూ నిజం లేదని తేలింది. ఇక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్టడాన్ని బెనిక్స్ గమనించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే తండ్రీకొడుకులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ ఘటనపై ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా మరో 15 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) -
ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన తమిళనాడులోని తూత్తుకూడి, సాతాంకుళంలో పోలీసుల కస్టడీలో తండ్రీ కొడుకుల హత్య ఆరోపణల కేసులో ప్రముఖ తమిళ దర్శకుడు హరి గోపాలకృష్ణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసుల సవాళ్లు, వారి ధైర్యసాహసాలను హైలైట్ చేసిన చిత్ర దర్శకుడిగా పేరుగాంచిన హరి ఇకపై అలాంటి సినిమాలను చేయనంటూ కీలక ప్రకటన విడుదల చేశారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) జయరాజ్, బెన్నిక్స్ దారుణ హత్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరి ఇలాంటి సంఘటనలు మళ్లీ తమిళనాడులో జరగకూడదు. కొద్దిమంది అధికారుల కారణంగా, మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. పోలీసులను ప్రశంసిస్తూ ఐదు సినిమాలు చేసినందుకు చింతిస్తున్నానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం, సింగం-2, సింగం-3, సామి, సామి-2 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. (కస్టడీలో తండ్రి కొడుకుల మృతి; ఆందోళనలు) తమిళనాడులో పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగం హీరో సూర్య ఈ సంఘటనను వ్యవస్థీకృత నేరంగా పేర్కొనగా, ప్రముఖ నటి కుష్బూ దీనిపై విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వరకర్త డి ఇమ్మన్ కూడా ఈ అమానవీయ హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ భారతదేశపు జార్జ్ ఫ్లాయిడ్స్ అంటూ ఇమ్మన్ ట్వీట్ చేశారు. కాలా దర్శకుడు పా రంజిత్ స్పందిస్తూ పోలీసుల క్రూరత్వానికి మరో ప్రాణం కోల్పోకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఎలాంటి భయం లేకుండా ప్రజలపై హింసను ప్రయోగిస్తున్న ప్రతీ పోలీసు అధికారిని నేరస్థుడిగా భావించాలన్నారు. వీరితోపాటు హీరోయిన్లు సమంతా, కాజల్ అగర్వాల్, హన్సిక, అలాగే హీరో విష్ణు విశాల్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల దారుణాన్ని ఖండించారు. కాగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించారంటూ పి జయరాజ్ (59), ఆయన కుమారుడు బెన్నిక్స్ (31)లను పోలీసులు అరెస్టు చేయగా, రెండు రోజుల అనంతరం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో వీరు మరణించడం కలకలం రేపింది. గుండెపోటుతో మరణించారని పోలీసులు ప్రకటించగా, తీవ్రంగా హింసించి, చంపేశారంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
అనూహ్య మృతి; 70 లక్షల పరిహారం
చెన్నై: తమిళనాడులో పోలీసు కస్టడీలో మరణించిన మృతుల కుటుంబానికి అధికార అన్నాడీఎంకే పార్టీ 25 లక్షల రూపాయల సహాయాన్ని శనివారం ప్రకటించింది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలోని సాత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్(59), బెనిక్స్(31) కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయానికి ఇది అదనమని పేర్కొంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నందూరితో కలిసి సమాచార శాఖ మంత్రి సి. రాజు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీ కూడా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తరపున ఎంపీ కనిమొళి శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. దీంతో బాధిత కుటుంబానికి మొత్తం రూ. 70 లక్షల పరిహారం ప్రకటించినట్టు అయింది. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’) కాగా, ఈ దారుణ ఘటనపై తూత్తుకుడి ఎస్పీ శుక్రవారం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు నివేదిక సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కోర్టుకు వివరాలు తెలిపారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిందని, అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్నందున నివేదిక ఇంకా రాలేదని వెల్లడించారు. మరోవైపు జయరాజ్, బెనిక్స్ మరణానికి కారకులైన పోలీసులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. (తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి) -
‘కుక్కను కొట్టినట్లు కొట్టాను.. చచ్చాడు’
ముంబై: మాజీ డీసీపీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవ్వడమే కాక.. పోలీసు కస్టడీలో సంభవించే మరణాల గురించి తాజాగా మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. ముంబై మాజీ డీసీపీ భీమ్రావ్ సోనావనేకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో భీమ్రావ్ 1990 కాలంలో వర్లీ పోలీస్ స్టేషన్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. రట్టు గోసావి అనే ముద్దాయిని ఎలా హింసించింది.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి సోనావనే వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. ‘1990 సంవత్సరం అప్పుడు నేను వర్లీ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాను. రట్టు గోసావి అనే నేరస్తుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. అతడి మీద అప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రట్టు పోలీసులకు చిక్కాడు. అప్పుడు స్టేషన్లో నేనే ఉన్నాను. మా కస్టడీలో ఉన్న రట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్ స్టేషన్ బయట గందరగోళం ప్రారంభమయ్యింది’ అన్నాడు సోనావనే. ‘దాదాపు 400 మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వారి ఎదురుగా రట్టు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడం కష్టం. ఎలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఉపాయం తట్టింది. స్టేషన్ బయట ఓ వాహనాన్ని సిద్ధం చేసి ఉంచాను. రట్టు చేతికి బేడీలు వేశాను. ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో రట్టును బయటకు నడిపించుకుంటూ తీసుకెళ్లాం. చూసే వారికి అతడు గాయంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. రట్టు గురించి అడిగిన వారికి ‘తనను తాను గాయపర్చుకున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. గాయం కారణంగా నడవలేకపోతున్నాడు’ అని చెప్పాం. చేతికి బేడీలు ఉండటంతో మేం చెప్పింది నిజమని నమ్మారు. ఆ తర్వాత అతడిని కేఈఎం ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వారు రట్టు మృత దేహాన్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు’ అన్నాడు సోనావనే. ‘తర్వాత రట్టు బాడీని జేజే ఆస్పత్రిలో చేర్చాం. అతడి చేతిలో తుపాకీ పెట్టాం. రట్టు పోలీసుల మీద కాల్పులుకు పాల్పడ్డాడని.. పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. మొదటి అంతస్తు నుంచి దుకాడని.. ఈ క్రమంలో అతడు చనిపోయాడని చెప్పాం. దాని ప్రకారం ఆ తర్వాత స్టేషన్ డైరీలో కూడా మార్పులు చేశాం’ అంటూ సోనావనే చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా సోనావనే బంధువు, వ్యాపారవేత్త రాజేంద్ర ఠక్కర్ ఆఫీస్‌లో చోటు చేసుకుంది. దాంతో సోనావనే చెప్పినవన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఈ వీడియో తీసుకెళ్లి ముంబై పోలీసులకు ఇచ్చి, సోనావనే మీద ఫిర్యాదు చేసింది రాజేంద్ర ఠక్కర్ కావడం ఇక్కడ అసలు ట్విస్ట్. డబ్బుల విషయంలో ఠక్కర్‌కు, సోనావనేకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. దాంతో ఇదే అదునుగా భావించిన ఠక్కర్ ఈ వీడియో ఫుటేజ్‌ను వర్లీ పోలీసులకు అందజేశాడు. అంతేకాక వీడియో ఆధారంగా సోనావనే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఠక్కర్ వ్యాఖ్యలను సోనావనే ఖండిస్తున్నాడు. తనపై చేసినవన్ని నిరాధారమైన ఆరోపణలని.. వ్యక్తిగత వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఠక్కర్ నకిలీ వీడియో రూపొందించి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని సోనావనే పేర్కొన్నాడు. ఇక ఈ విషయం గురించి ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ‘ఈ ఘటన జరిగినప్పుడే దీని గురించి విచారణ చేశాము. ప్రస్తుతం మళ్లీ కొత్తగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మరో సారి విచారణ చేస్తాం. అలా చేయాలంటే ఈ వీడియో మాత్రమే సరిపోదు.. మరికొన్ని బలమైన సాక్ష్యాలు కావాలి’ అంటూ చెప్పుకొచ్చారు.