Cylinder
-
సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సికిందరాబాద్‌లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోనివారంతా ఉలిక్కిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.ఈ ఘటనకు ముందు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కూడా సిలిండర్ పేలుడు చోటుచేసుకుంది. వెల్కమ్ హోటల్లోని సర్వీస్ కిచెన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. హోటల్లోని నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదే తరహాలో యూపీలోని ఘజియాబాద్‌లోని తిలా మోడ్ ప్రాంతంలో గల న్యూ డిఫెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.2024, అక్టోబర్ ఒకటి నుండి, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్‌కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్‌కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్‌కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్‌పై రైల్వే సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో ఎల్పీజీ సిలిండర్‌ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్పీఎఫ్కి, డిపార్ట్మెంట్లోని ఇతర అధికారులకు తెలియజేశారు.ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్‌పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ పీఆర్వో అమిత్ సింగ్‌కు సమాచారం అందించారు.ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
రైలు పట్టాలపై సిలిండర్.. ఉగ్రవాదుల పనేనా?
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై కుట్ర కోణం దాగింవుందనే చర్చ జరుగుతోంది. యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైల్వే మార్గంలో భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ పట్టాలపై సిలిండర్ ఉంచిన ఉదంతాన్ని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో రైలు వేగం ఎక్కువగా ఉంది. డ్రైవర్ రైలును ఆపినప్పటికీ, అది సిలిండర్‌ను ఢీకొంది. దీంతో పెద్ధ శబ్ధం వచ్చింది. ప్రయాణికులు భయకంపితులయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.ఈ కేసును ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యూపీ ఏటీఎస్‌సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి. దీనివెనుక ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఒక ఆడియోను విడుదల చేశాడు. దానిలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్‌లను ఆదేశించినట్లు ఉంది. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈమధ్య ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.తాజాగా కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిలిండర్ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కుట్ర పన్నారనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ డీసీపీ వెస్ట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలన్నీ తమ తమ స్థాయిలలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామని ఆయా సంస్థల అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. దర్యాప్తునకు ఇది ఆటంకం కలిగించే అంశంగా మారింది. కాగా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బాటిల్లో మండే పదార్థాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. -
Uttar Pradesh: తప్పిన రైలు ప్రమాదం.. అనుమానిత వస్తువులు స్వాధీనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ రైలు.. పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్‌పూర్ సమీపంలో సిలిండర్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.విచారణ అనంతరం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.69 మేర తగ్గిస్తూ కీలక ప్రకటన చేశాయి. నేటి నుంచే (జూన్ 1వ తేదీ) ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. -
సిలిండర్ నుంచి మంటలు.. ఆపద్బాంధవుడు వచ్చి..
‘జ్ఞానం ఉంటే సరిపోదు.. అనుభవం ఉండాలి’ అని చాలామంది అంటుంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌ను తీసుకువెళుతుండటాన్ని చూడవచ్చు. మరి ఆ తరువాత ఏం జరిగిందంటే.. అకస్మాత్తుగా ఆ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి మంటలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా ఆ మంటలు చల్లారవు. దారినపోయేవారు కూడా ఆ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే ఎట్టకేలకు ఒక వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి, మంటలను అదుపులోకి తీసుకువస్తాడు. వీడియోలో ఉన్న కంటెంట్ గమనిస్తే.. ఒక వ్యక్తి సిలిండర్ నుంచి మంటలు రాగానే సైకిల్‌ను పక్కన పడేసి, ఆపై మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. మరో నలుగురు కూడా అక్కడికి వచ్చి, సిలిండర్‌పై నీళ్లు చల్లడం మొదలుపెడతారు. అయితే మంటలు అంతకంతకూ పెరుగుతుంటాయి తప్ప చల్లారవు. దీంతో ఆ సిలిండర్‌ను పక్కనే ఉన్న చెరువులో ముంచుతారు. అయినా ఆ మంటలు చల్లారవు. దీంతో ఆకుల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు వారంతా ప్రయత్నిస్తారు. అయినా మంటలు ఆరిపోకపోవడంతో వారంతా కూలబడతారు. అప్పుడు అక్కడికి ఆపద్బాంధవునిలా వచ్చిన ఒక వ్యక్తి తన తెలివితేటలను ప్రదర్శిస్తాడు. చేతిలో తడి సంచితో వచ్చిన అతను దానిని సిలిండర్‌పైన కప్పుతాడు. దీంతో నిప్పుకు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోతుంది. అంతే ఆ సిలిండర్లోని మంటలు ఆరిపోతాయి. @ScienceGuys_ అనే పేరు గల ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. Experience is stronger than knowledge. 👍pic.twitter.com/OtXvLhjvYQ — Science (@ScienceGuys_) March 1, 2024 -
సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిపోవడంతో 41 మంది కూలీలు గత 9 రోజులుగా దానిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలవంతం కావడం లేదు. ఇదిలా ఉండగా సోమవారం (నవంబర్ 20) ఆరు అంగుళాల కొత్త పైప్‌లైన్ ద్వారా మొదటిసారిగా బాధితులకు ఘన ఆహారాన్ని అధికారులు అందించగలిగారు. రెస్క్యూ టీమ్ ఈ పైపు ద్వారా వారికి బాటిళ్లలో వేడి కిచిడీని పంపింది. ఇన్ని రోజులుగా సరైన ఆహారం అందకపోవడంతో వారు నీరసించిపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హేమంత్ అనే కుక్ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం కిచిడీని తయారు చేశారు. కార్మికులకు వేడి వేడి ఆహారాన్ని పంపడం ఇదే తొలిసారి అని హేమంత్ తెలిపారు. తాము కిచిడీ మాత్రమే పంపుతున్నామని, తమకు అధికారులు చెప్పిన ఆహారాన్ని మాత్రమే వండుతున్నామని హేమంత్ పేర్కొన్నారు. బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిపోయింది. చార్ధామ్ ప్రాజెక్ట్ కింద, బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్గావ్ మధ్య ఈ సొరంగం నిర్మితమవుతోంది. నవంబర్ 12 తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది. 41 మంది కూలీలు లోపల చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం పంపిస్తున్నామని, ఇందుకోసం వైద్యుల సహకారంతో చార్ట్‌ను సిద్ధం చేశామన్నారు. అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, గంజి మొదలైనవి బాధితులకు పంపిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Food items including Khichdi, Dal are being prepared and packed to be delivered to the people trapped inside the tunnel Cook Hemant says, "Food will be sent to the people trapped inside. For the first time, hot food is being sent… pic.twitter.com/dAVZSSi1Ne — ANI (@ANI) November 20, 2023 -
షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది. అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని స్థిరంగా ఉంచింది. నేటి నుంచి పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉంది. సిలిండర్ మీద సబ్సిడీ ఈ ఏడాది ప్రారంభంలో, దేశంలోని 330 మిలియన్ల వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ‘ఎల్పీజీ సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ లభిస్తుంది. పీఎం ఉజ్వల పథకం కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుత సబ్సిడీపై ఈ సబ్సిడీని పొందుతారు, ”అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్, ఓనం కానుకగా ఎల్పీజీ సిలిండర్లపై అదనపు సబ్సిడీ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ పొందే అవకాశం లభించినట్లైంది. చదవండి👉 ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా? -
గ్యాస్ బండ రూ. 200 తగ్గింది
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. మధ్యప్రదేశ్‌తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్ సిలిండర్‌పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది. ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సోదరీమణులకు ఉపశమనం: మోదీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఎన్నికల వ్యూహమే!? రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. -
కొత్త ఏడాది తొలిరోజే షాక్..పెరిగిన గ్యాస్ ధర.. ఎంతంటే?
న్యూ ఇయర్ తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని మాత్రం పెంచలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 25 రూపాయలు ఉండగా ముంబై, హైదరాబాద్,బెంగుళూరు సహా అన్ని నగరాల్లో ఇలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి. దేశంలో స్థిరంగా డొమెస్టిక్ గ్యాస్ ధరలు దేశంలో డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా గతేడాది ఏడాది జులై 6న రూ.50 పెరగ్గా.. మొత్తంగా గతేడాది కాలంలో గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరలు.. ఢిల్లో రూ.1053, ముంబైలో రూ.1052, కోల్‌కతాలో రూ.1079, చెన్నై రూ.1068, హైదరాబాద్‌లో రూ.1105 కొనసాగుతున్నాయి. -
గ్యాస్ ధరపై సామాన్యులకు గుడ్ న్యూస్
-
మంచిర్యాలలో నయా దందా
-
పండుగ కానుక: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్!
దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్ 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది. బిగ్ రిలీఫ్.. భారీ తగ్గింపు! అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్ ఎల్పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది. కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్
న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే ఆగస్టు 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 తగ్గింది. నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్‌పై రూ.8.50 తగ్గించారు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,976గా ఉండగా అంతకు ముందు రూ. 2,012.50 ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.2,095.50, ముంబైలో రూ.1,936.50, చెన్నైలో రూ.2,141 ఉంది. కాగా స్థానిక టాక్స్‌ల ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
-
హోటల్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బోరజ్ ప్రాంతంలోని ఒక హోటల్లో సిలెండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా హోటల్ అంతా మంటలు వ్యాపించాయి. కాగా, అప్రమత్తమైన హోటల్ యజమాని వెంటనే బయటకు పరుగులు తీశాడు. హోటల్లో కస్టమర్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది డ్రమ్లోని నీళ్లతో మంటలను ఆర్పుతున్నారు. తమకు రోజు అన్నంపెట్టే హోటల్ అగ్నిప్రమాదానికి గురవ్వడం చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
-
సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి
జీడీపీ లెక్కలు బాగానే ఉన్నాయంటూ కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి షాక్ తగిలింది. ఎల్పీజీ గ్యాస్ ధరను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.50కి చేరుకుంది. రెండు వారాల్లో రెండు సార్లు ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి గ్యాస్ ధరలను చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి. అందులో భాగంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలను స్థిరీకరిస్తున్నాయి. చివరి సారిగా ఆగస్టు 18న గ్యాస్ ధరను రూ. 25 పెంచాయి. రెండు వారాలు తిరిగే సరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. దీంతో రెండు వారాల వ్యవధిలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 వరకు పెరిగింది. ఈ ఏడాది పెంపు రూ. 165.50 ఈ ఏడాది ఆరంభంలో రూ.694లుగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో, మార్చి, జూన్లలో కూడా ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఐదు సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో కొద్ది మేరకు ధరలను తగ్గించాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.165.50 వరకు ధర పెరిగింది. 2017 నుంచి బాదుడే పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలో 29.11 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లపై భారం పడనుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ -
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇకపై
న్యూ ఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును. ప్రస్తుతం ఐఓసీఎల్ విడుదల చేసిన స్మార్ట్ సిలిండర్లతో గ్యాస్ ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా ఐఓసీఎల్ రిలీజ్ చేసిన స్మార్ట్ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్ సిలిండర్లు మాదిరి స్మార్ట్ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది. ఇండానే కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు ►నార్మల్ సిలిండర్ల కంటే ఈ సిలిండర్లు తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ►ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ►వినియోగదారులు సులభంగా రీఫిల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. ►స్టీల్ సిలిండర్లు వినియోగించే కొద్దీ అవి తుప్పు పడతుంటాయి. కానీ ఈ సిలిండర్‌కు అలాంటి సమస్యలు ఉండవు. ►మూస పద్దతిలో కాకుండా ట్రెండ్‌కు తగ్గట్లు ఆధునిక పద్దతుల్లో దీన్ని డిజైన్ చేశారు. ►ప్రస్తుతం, ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలలో అందుబాటులో ఉన్నాయి. ►వినియోగదారుల సౌకర్యం కోసం 5 కిలోల నుంచి 10 కిలోల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ►ఈ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని ఐఓసిఎల్ ప్రకటించింది. ►మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు ప్రస్తుతం ఉన్న ఎల్పిజి స్టీల్ సిలిండర్లకు బదులు ఈ స్మార్ట్ సిలిండర్లను మార్చుకునే సౌకర్యం ఉంది. ►ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని ఈ సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10 కిలోల బరువు సిలిండర్ కు రూ .3350, 5 కిలోల బరువున్న సిలిండర్‌కు రూ .2150 చెల్లించాల్సి ఉంటుంది. -
గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా మొత్తం సబ్సిడీ ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది. అయితే ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగే వార్త వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్ సిలిండర్ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు. -
ఇకపై ఓటీపీ చెబితేనే.. సిలిండర్
సాక్షి, కరీంనగర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల రాయితీలు అందజేస్తున్నాయి. గ్యాస్‌బండ ధర పెరిగినప్పుడల్లా రాయితీని కూడా పెంచుతూ ఆ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. గరిష్ఠంగా ఒక్కో వినియోగదారుడు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లు పొందే అవకాశముంది. అన్ని అవసరం లేకపోయినా కొందరు తీసుకుని ఇతరులకు విక్రయిస్తున్నారు. పథకాల్లో ఉన్న లోపాలను అదనుగా చేసుకుని పలు ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో లక్ష్యానికి తీరని విఘాతం కలుగుతోంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను ఎక్కువగా వాణిజ్య అవసరాలకు వినియోగించడం సర్వసాధారణమైంది. ఇలాంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. వినియోగదారుడి ధ్రువీకరణతోనే వాణిజ్యానికి వినియోగించే సిలిండర్ల ధరలు అధికంగా ఉండటంతో గృహవసర సిలిండర్లు దారి మళ్లుతున్నాయి. హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. రాయితీ లక్షల్లో దుర్వినియోగమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు చమురు సంస్థలు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. పెట్రోలియం మంత్రిత్వశాఖ వంట గ్యాస్ డెలివరీకి సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్)ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తాము రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నుంచి రీఫిల్ బుక్‌చేసుకుంటే ఓటీపీ వస్తుంది. ఈ నంబర్ చెబితేనే ఇక నుంచి గ్యాస్ సిలిండర్ అందనుంది. ఇలా సదరు వినియోగదారుడి ధ్రువీకరణతోనే సరఫరా చేసే విధానం అమలుకు చమురు సంస్థలు శ్రీకారం చుట్టాయి. జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో భారత్ గ్యాస్, ఇండెన్, హెచ్‌పీ చమురు సంస్థల ఏజెన్సీలు 35వరకు ఉన్నాయి. మొత్తంగా 5.10 లక్షల కనెక్షన్లుండగా.. ప్రతి నెలా జిల్లాలో లక్షకు పైగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యం జిల్లాలో నానాటికి కరోనా కేసులు అధికమవుతునే ఉన్నాయి. ఏజెన్సీలు గ్యాస్ బండలకు నగదు చెల్లింపులకు కూడా చెక్ పెడుతూ వాట్సప్ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. రిజిష్టర్ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్ నంబర్లకు హాయ్ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్‌తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్‌పే, గూగుల్ పేల ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. ప్రజల్లో మరింత అవగాహన పెంచడం ద్వారా చమురు సంస్థలు అమలు చేసే డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుసంధానం చేసుకుంటే మేలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది తమ మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోలేదు. ఇప్పటివరకు మొబైల్ నంబర్ అనుసం«ధానం లేని వినియోగదారులు ఈ నెలాఖరులోపు అనుసంధానించుకోవాలి. లేదంటే ఆ తరువాత ఓటీపీ చెప్పని క్రమంలో గ్యాస్ బండలను పొందే అవకాశం కోల్పొవాల్సి ఉంటుందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. -
రాయితీ పెంచినా తప్పని భారం..!
సాక్షి, నల్లగొండ : వంటగ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలను అనుసరించి ఇంధన కంపెనీలు వంటగ్యాస్ ధరలు పెంచాయి. దీంతో సామాన్యుడిపై గ్యాస్ ధర భారం పడింది. కంపెనీలు పెంచిన ధరలకు అనుగుణంగా పేదలపై భారం పడకుండా సిలిండర్లకు ఇచ్చే రాయితీని కూడా కేంద్రం పెంచింది. దీంతో వినియోగదారులకు పెద్దఝెత్తున ఊరట కలిగినా భారం మాత్రం కొద్ది మొత్తంలో తప్పడం లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ.6.50 భారం పడనుంది. ప్రతి నెలా జిల్లాలో రూ.6లక్షలపైగా భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 1,56,200 రెగ్యులర్, 40వేల దీపం కనెక్షన్లు ఉన్నాయి. ఇండేన్, భారత్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 31 మండలాల పరిధిలో 33 ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతోంది. అయితే రోజూ 4,140 సిలిండర్ల వరకు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. భారీగా పెంచిన సిలిండర్ ధర... ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.788 ఉంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.206 రాయితీ కల్పిస్తూ లబ్ధిదారుని అకౌంట్లో ఆ మొత్తం జమచేస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ వినియోగదారుడికి రూ.582కి అందుతుంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు సిలిండర్ దరను పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.148.50 పెంచాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.936.50కి చేరింది. అయితే ఇందులో ప్రభుత్వం సబ్సిడీని రూ.348కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుడికి కాస్త ఊరట ఓ పక్క ఇంధన కంపెనీలు సిలిండర్ ధర పెంచగా ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా రాయితీని కూడా పెంచింది. దీంతో కంపెనీలు పెంచిన ధర మొత్తం వినియోగదారులపై పడడం లేదు. కేవలం రూ.6.50 అదనంగా పెరిగిన ధరతో చెల్లించాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి నెలా జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.6 లక్షల పైచిలుకు భారం పడనుంది. జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఈ స్వల్ప భారం తప్పడం లేదు. -
హోండా ‘సీబీఆర్650ఆర్’ స్పోర్ట్స్ బైక్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ).. ‘సీబీఆర్650ఆర్’ పేరుతో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీబీఆర్650ఎఫ్ స్థానాన్ని భర్తీ చేస్తూ విడుదలైన ఈ బైక్.. 649–సీసీ లిక్విడ్ కూల్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. బైక్ ధర రూ.7.7 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘గతవారంలోనే కొత్త ప్రీమియం బిగ్ బైక్ వర్టికల్‌పై ప్రకటన చేశాం. ఇందుకు అనుగుణంగా హోండా బిగ్‌వింగ్ క్యాటగిరిలో ఈ నూతన బైక్ విడుదలైంది’ అని అన్నారు. -
తప్పిన పెను ప్రమాదం
గంట్యాడ: పాఠశాల వంటగదిలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో భవనం కుప్పకూలింది. సంఘటన సమయంలో పరిసర ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని రామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాఠశాల నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. పేలుడు శబ్ధానికి పరిసర నివాసితులు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పాఠశాల వంటగది నుంచి పొగలు రావడంతో అక్కడకు చేరుకున్నారు. భవనంలో నుంచి మంటలు రావడంతో స్కూల్ కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం ఇచ్చారు. హెచ్ఎం ఎంఈఓకు సమాచారం ఇవ్వగా ఆమె 101 ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసిం ది. ప్రమాదంలో భవనం పూర్తిగా కూలి పోయింది. పాఠశాలకు ఒంటి పూట బడులు కావడం, సాయంత్రం ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్ర మాద వివరాలను ఉన్నతాధికారులకు తె లియజేస్తామని ఎంఈఓ జి.విజయలక్ష్మి తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలి యరాలేదు. ప్రమాదంలో గుడ్లు, వంట సామగ్రి, వంటపాత్రలు ధ్వంసమయ్యా యి. సిలెండర్ తునాతునకలైంది. విజయనగరం అగ్నిమాపక సిబ్బంది ఎస్ఎఫ్ఓ దిలీప్‌కుమార్, సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు.