dealer
-
ఎమ్మెల్యే బొజ్జల నుంచి ప్రాణహాని ఉంది: స్క్రాప్ వ్యాపారి
-
ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా: కేంద్రమంత్రి
ప్రపంచవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం ఇండియా అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ), డీలర్ల మధ్య మార్జిన్లకు సంబంధించి ప్రభుత్వం చర్చలను ప్రోత్సహిస్తోందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు. అందుకు భిన్నంగా ప్రధాని తీసుకున్న సాహసోపేత, దూరదృష్టి నిర్ణయాల వల్ల భారత్‌లో వీటి ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2024 మధ్యకాలంలో దేశంలో పెట్రోల్ ధరలు 13.65 శాతం, డీజిల్ ధరలు 10.97 శాతం తగ్గాయి. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్‌లో 22.19 శాతం, జర్మనీలో 15.28 శాతం, ఇటలీలో 14.82 శాతం, స్పెయిన్‌లో 16.58 శాతం పెట్రోల్ ధర పెరిగింది. యూపీఏ ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్ల విలువైన ఫ్లోటింగ్ ఆయిల్ బాండ్లను(పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల ఓఎంసీ నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన బాండ్లు) జారీ చేసింది. దానికోసం ప్రస్తుతం రూ.3.5 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తోంది’ అని మంత్రి వివరించారు.డీలర్ల మార్జిన్ పెరుగుదలపై మంత్రి స్పందిస్తూ..‘ఇది ఓఎంసీలు, డీలర్లు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం. జులై 1, 2024 నాటికి దేశంలో 90,639 అయిల్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందినవి. చివరిసారిగా 2017లో డీలర్ల మార్జిన్లు పెరిగాయి. ఇటీవల నిర్దేశించిన మార్గదర్శకాల్లోని కొన్ని షరతులు కొంత కఠినంగా ఉన్నాయని డీలర్లు కోర్టుకు వెళ్లారు. డీలర్ల మార్జిన్లు పెంచితే వారి ఉద్యోగులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు పెంచాల్సి ఉంటుంది. దీన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నిబంధనలు సడలించి ఓఎంసీలు మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మధ్య చర్చలు సాగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గతంలో ఏర్పాటు చేసిన అపూర్వ చంద్ర కమిటీ నివేదికలోని వివరాల ప్రకారం.. డీలర్ల మార్జిన్ రివిజన్ సిఫార్సులను ఓఎంసీలు నిలుపుదల చేస్తున్నాయి. వీటిని ఏటా జనవరి, జులైలో రెండుసార్లు సవరించాలి. ఈమేరకు ఓఎంసీలు, డీలర్ల మధ్య నవంబర్ 4, 2016న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా, గత ఏడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా ఎలాంటి మార్జిన్లు పెంచలేదని డీలర్లు అంటున్నారు. -
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్‌లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్‌పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్‌లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్‌జైన్ ఇంట్లో సోదాలు
-
వామ్మో రూ. 3,500 కోట్లు ఎగ్గొట్టేశారు..!
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.3,500 కోట్లకు పైగా మొత్తాన్ని డీలర్లు ఎగ్గొట్టారని వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత అంచనాకు వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ వసూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న ఆ శాఖ ఈ మేరకు పన్ను ఎగవేత జరిగినట్టుగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభణతో లాక్డౌన్ విధించిన కాలంలోనూ, ఆ తర్వాత తనిఖీలు పెద్దగా నిర్వహించలేకపోయిన కారణంగా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున జీరో సరుకు వచ్చిందని వాణిజ్య పన్నుల అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, స్టీల్ ఉత్పత్తులతో పాటు, మరికొన్ని వస్తువులు ఎలాంటి ఇన్వాయిస్లు లేకుండా చెక్‌పోస్టులు దాటి జీరో సరుకు రూపంలో రాష్ట్రంలోకి ప్రవేశించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా డీలర్లు ఎక్కువగా క్లెయిమ్ చేసుకోవడం వల్ల పన్ను ఎగవేత ఈసారి రూ.3,500 కోట్లు మించిందని అంతర్గత లెక్కల్లో తేల్చినట్టు సమాచారం. వీటితోపాటు దుస్తులు, కరోనా కాలంలో విరివిగా వినియోగిస్తున్న మాస్క్ లు, శానిటైజర్లు, ఫార్మా ఉత్పత్తుల్లోనూ పన్ను ఎగవేతలు జరిగాయన్న దానిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నారు. ఈసారి పకడ్బందీగా.. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగా కాకుండా ఈసారి పన్ను ఎగవేత లేకుండా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించే పనిలో వాణిజ్య పన్నుల అధికారులు నిమగ్నమయ్యారు. రాబడి లోటును అధిగమించడమే కాకుండా పన్ను ఎగవేత, ఇతర రూపాల్లోని అక్రమాలను అరికట్టేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 460 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 1,370 మంది వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బందిని సభ్యులుగా నియమించారు. అక్రమాలను గుర్తించి శాఖకు రావాల్సిన రాబడిని నష్టపోకుండా చూసేందుకు గాను ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. డేగ కళ్ల నిఘాతో నిరంతరం అప్రమత్తంగా ఉండి ఈ-ఇన్వాయిస్లు పక్కాగా అమలయ్యేలా, చెక్‌పోస్టుల వద్ద సరుకు జీరోగా మారకుండా పహరా కాయాలని వాణిజ్య పన్నుల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం చెక్‌పోస్టుల నుంచి నేరుగా హైదరాబాద్‌లోని సెంట్రల్ కార్యాలయాన్ని ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసింది. ‘పన్ను ఎగవేతను పూర్తి స్థాయిలో నిరోధించడం సాధ్యం కాదు. అయితే, సాధ్యమైనంత మేర అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ ఖజానా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మాది. అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నాం..’అని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఓటీఎస్‌కు వెళ్తే వేల కోట్లు మరోవైపు దశాబ్దాల తరబడి వివాదాల రూపంలో కోర్టుల్లో నలుగుతున్న కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఈ ఏడాది వేల కోట్ల రూపాయలను రాబట్టుకోవాలనేది వాణిజ్య పన్నుల అధికారుల వ్యూహంగా కనిపిస్తోంది. హైకోర్టులో 479 కేసుల్లో ఉన్న రూ.1,960 కోట్లు, సుప్రీంకోర్టులో ఉన్న 34 కేసుల్లోని రూ.574 కోట్లు, అంతర్గత ట్రిబ్యునల్ పరిధిలోని 2,505 కేసుల్లో ఉన్న రూ.1,153.51 కోట్లతో పాటు పాతబకాయిలు రూ.130 కోట్లు, 13 ఏళ్ల పాటు బకాయిల వ్యత్యాసం కింద పెండింగ్‌లో ఉన్న రూ.1,907 కోట్లను ఎలాగైనా రాబట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే ఈ పెండింగ్ పన్నుల వసూలుకు గాను వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) లేదా ఇతర అందుబాటులో ఉన్న మార్గాలపై వాణిజ్య పన్నుల యంత్రాంగం దృష్టి సారించింది. ( చదవండి: పసిడి పరుగులకు బ్రేక్! ) -
తీర్చే మార్గం
పూర్వం బనీ ఇస్రాయీల్ జాతికి చెందిన ఒక వ్యక్తికి వెయ్యి బంగారు నాణేలు అత్యవసరపడ్డాయి. దాంతో తనకు బాగా తెలిసిన ఒక వ్యాపారిని అప్పివ్వమని అభ్యర్థించాడు. ఆ వ్యాపారి అల్లాహ్ పై నమ్మకం ఉంచి అతనికి వెయ్యి బంగారు నాణాలను అప్పుగా ఇచ్చాడు. ఫలానా గడువులోగా తిరిగి ఇచ్చేయాలని షరతు కూడా పెట్టాడు. బంగారు నాణేలను తీసుకుని సముద్ర మార్గాన్ని దాటి తన ప్రాంతానికి వెళ్లిపోయాడు. తీసుకున్న డబ్బుతో అవసరాలు తీర్చుకున్నాడు. అంతలోనే అప్పు తీర్చే గడువు రానేవచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నాణాలను తీసుకుని అప్పు తీర్చే ఉద్దేశంతో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సముద్ర తీరం దగ్గర నిలబడి పడవ కోసం ఎదురుచూడసాగాడు. ఎంతసేపటికీ పడవ వచ్చే జాడకానరావడం లేదు. ఎలాగైనా ఈ బంగారు నాణేలను ఈరోజు అతనిదాకా చేర్చాలని గట్టి సంకల్పం చేసుకున్నాడు. ఇచ్చిన మాట తప్పుతున్నానని కుమిలిపోసాగాడు. సముద్రం ఒడ్డున పడి ఉన్న ఒక కర్రను అందుకున్నాడు. దాన్ని రెండుగా చీల్చి అందులో అప్పుగా తీసుకున్న వెయ్యి బంగారు నాణాలను నింపాడు. చీల్చిన కర్రను అతికించాడు. ‘‘ఓ అల్లాహ్ రుణాన్ని తీర్చే మార్గం కానరావడం లేదు. కాబట్టి ఈ నాణాలు నా రుణదాత వరకు చేర్చు ప్రభూ’’ అని వేడుకుంటూ నాణేల కర్రను సముద్రంలో వదిలాడు. అటువైపు ఆ రోజు తనవద్ద అప్పు తీసుకున్న వ్యక్తి కోసం వ్యాపారి సముద్రం ఒడ్డున ఎదురుచూడసాగాడు. ఎంతసేపటికీ ఎవ్వరూ వచ్చే జాడకానరాలేదు. అయితే అంతలోనే ఒక కర్ర సముద్రంలో కొట్టుకువచ్చింది. పొయ్యిలో కనీసం కట్టెగానైనా పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంటికి తీసుకువచ్చాడు. కర్రను పొయ్యిలో పెట్టేందుకు కర్రను చీల్చి చూసినప్పుడు; అందులోంచి వెయ్యి బంగారు నాణాలు నేలపై రాలిపడ్డాయి. అందులో ఉన్న ఉత్తరాన్ని చదివాక అతనికి అసలు విషయం అర్థమయ్యింది. తర్వాత కొంతకాలానికి మళ్లీ ఆ వ్యక్తి అప్పు తీర్చే ఉద్దేశంతో వ్యాపారి ఇంటికి వెళ్లాడు. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆరోజు నీకిచ్చిన మాటప్రకారం అప్పు తీర్చే ఉద్దేశంతో సముద్ర తీరానికి చేరుకున్నాను. కానీ పడవలు అందుబాటులో లేకపోవడంతో నీదాకా రాలేకపోయాను. ఇప్పుడు నీ అప్పును నయా పైసాతో సహా చెల్లిస్తున్నాను. అందుకో’’ అంటూ బంగారు నాణేల సంచిని అందించబోయాడు. ‘‘నువ్వు ఆరోజు సముద్రంలో నాకోసం కర్రలో పెట్టి పంపిన నాణాలు నాదాకా చేరాయి. మళ్లీ ఎందుకు’’ అంటూ తిరిగి ఇచ్చేశాడు. ‘‘ఆరోజు నీకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వేరే మార్గంలేక సముద్రంలో కర్రలో పెట్టి వదిలాను. అవి నీకు ఇంకా చేరలేదేమోనని’’ ఆ వ్యక్తి చెప్పాడు. అప్పు తిరిగి ఇచ్చే ఉద్దేశంతో తీసుకుంటే రుణం తీర్చడంలో అల్లాహ్ తోడ్పడతాడన్నది ఈ గాథలో నీతి. రుణదాతలైనా, రుణ గ్రహీతలైనా మంచి మనస్సు కలిగి ఉండాలన్నదే ఇందులోని సందేశం. – ముహమ్మద్ ముజాహిద్ -
బ్రహ్మజ్ఞానమంటే...
ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేద బుద్ధి ఉంటుందా? ఎక్కడి నుండో ఓ సేటు (వ్యాపారి) బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటూ రావడం, సాయిని తొందరచేస్తూ.. వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు– అంటూ కంగారు పెట్టడం... ఈ కథనంతా విన్నాం కదా! ఆ సేటు వెళ్లిపోయాక ‘కాకా.. శ్యామా.. ఇంకా మరి కొందరు మసీదులోకి వచ్చాక సాయి ఆ అందరూ అడిగిన మీదట బ్రహ్మజ్ఞానమంటే ఏమిటో చెప్పడం ప్రారంభించాడు. ఈ కళ్లు ‘కళ్లు’ కావు! ఎంతో లోతుగా ఉన్న బావి (నుయ్యి) నుండి నీటిని బిందెతో లేదా చేదతో పైకి తెచ్చుకోవాలంటే బిందె బరువూ నీళ్ల బరువూ అనే రెండింటినీ పైకి లాగడం అనే కారణంగా మరింత బరువు జత అవుతుంది కదా! ఆ కారణంగా మామూలుగా మనం అలాంటి బిందె– చేదలని నేల మీద ఉన్నప్పుడు మోసెయ్యగలిగినా కూడా, నూతి నుండి తెచ్చుకోవాలంటే అది మూడు రెట్ల బరువుతో సమానమైన పనిగా అనిపిస్తుంది.ఇదంతా ఎందుకంటే ఏదో సామాన్యమైన విషయాన్ని తెలుసుకుంటూంటే అక్కడక్కడ కొంత విన్నా వినకున్నా కూడా మనకి అర్థం అయిపోతుంది– అయిపోవచ్చునేమో కానీ, అదే మరి గట్టిదీ ఎంతో అర్థమున్నదీ అయిన బ్రహ్మజ్ఞానం లాంటి విశేషాలని తెలుసుకోదలిస్తే ప్రతి అక్షరాన్నీ శ్రద్ధగా వింటూ ఉండవలసిందే. మీరందరూ అలాంటి శ్రద్ధ, విశ్వాసం కలవాళ్లు కాబట్టి కొద్దిగా తెలియజేస్తాను.ఉదాహరణకి మనందరికీ కళ్లున్నాయి కదా! ఆ కళ్లతో ఏం చేస్తాం.? ఎదుటి వ్యక్తినీ, వస్తువులనీ పదార్థాలనీ పశుపక్షి మృగ జంతువులనీ... ఇలా అన్నింటినీ చూస్తాం. అయితే ఓ వ్యక్తినో ఓ వస్తువునో... ఇలా పై వాటిని చూస్తే భౌతికరూపం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తున్నాడు? లావున్నాడు? సన్నగా ఉన్నాడు... వంటి విశేషాలే తెలుస్తాయి. అంతేతప్ప ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాడు? ఎంత హోదాలో ఉన్నవాడు?.. వంటివేమీ ఎవరో అతడ్ని గురించి చెప్తే గానీ తెలియవు కదా! అలా అతని గొప్పదనాన్ని గురించి మనకి తెలియనంత వరకూ అతడు ఓ సామాన్యుడనేదే కదా మన అభిప్రాయం. అయితే అది నిజమా? కాదుగా! ఈ నేపథ్యంతో మన కళ్లని మనం నిజమని నమ్మకూడదు. ఇలా చెప్తూంటే ఇది ఏదోలా అనిపించవచ్చు మనకి. అయినా శ్రద్ధగా వింటే అర్థమవుతుంది.ఉదాహరణకి ఓ బంగారపు చంద్రహారం, ఉంగరం, వడ్డాణం... ఇలా ఎన్నో బంగారు ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఆ ఆభరణాలని కరిగిస్తేనో... అన్నీ బంగారపు ముద్దలై కూచుంటాయి. అది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.అదే తీరుగా మరో ఉదాహరణని చూద్దాం. సముద్రంలో కెరటాలు, బుడగలు, నురగలు, సుడిగుండాలు.. ఇలా కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ కెరటాలూ, బుడగలూ.. అన్నీ ఆగిపోతే కనిపించేవి నీళ్లే. నీళ్లే ఇలా మరో మరో తీరు రూపాన్ని ధరించి కెరటాలూ, బుడగలూ, నురగలూ ఇలా అవుతాయి. ఇది లో దృష్టి. ఈ దృష్టి కావాలి. మనకి రావాలి.మరొక్క ఉదాహరణని కూడా చూసి విషయాన్ని తెలుసుకుందాం. కుండ, పిడత, మూకుడు... ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇది భౌతిక దృష్టి. ఈ అన్నింటినీ పగలగొడితే కనిపించేది మట్టి మాత్రమే కదా!అంటే ఏమన్నమాట? ఒక మూల పదార్థం అదే బంగారం, నీరు, మట్టీ... అనే ఇలాంటివన్నీ చంద్రహారం వడ్డాణం– కెరటాలు, నురగలు – కుండా పిడతా వంటివిగా మారుతున్నాయి. ఒక రూపాన్ని పొందినప్పుడు ఇదే తీరుగా బ్రహ్మపదార్థాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకుందాం. చెట్టూ పుట్టా పర్వతం, సముద్రం 84 లక్షల జీవరాసులూ... ఇలా కనిపిస్తున్నాయి కదా ప్రపంచంలో. ఇలా కనిపించడం భౌతికదృష్టి. ఈ ప్రపంచాన్ని అలా ఒకటిగా కలిపి ముద్ద చేసేస్తే (అది ప్రళయకాలంలో జరుగుతుంది) అది బ్రహ్మపదార్థం (బంగారం నీరూ మట్టీ లాగా అన్నమాట). అంటే ఏది మూల పదార్థమో అది బ్రహ్మపదార్థం. ఏది వికృత పదార్థమో అది మనకి భౌతికదృష్టికి కనిపించే పదార్థమన్నమాట. ఈ దృష్టి మనకి గాఢంగా కలిగినప్పుడు చెట్టూ పుట్టా మనిషీ జంతువూ అనే భేదభావం ఏర్పడదు. చంద్రహారం కంటే వడ్డాణం వేరు కాదు– దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది బంగారమే కాబట్టి. అయితే పేరు, రూపం మాత్రమే వేరు. అలాగే కెరటమూ నురుగూ కూడా వేరు కాదు. దానికి కారణం ఆ రెండింటిలోనూ ఉన్నది నీరే కాబట్టి.ఈ దృష్టిని మన కళ్లకి బాగా పట్టించినట్లయితే కుక్క, పాము, పక్షి, చేప, మనిషి... ఇలా కనిపించే అన్నింటిలోనూ కూడా పైకి కనిపించే(పేరూ రూపమూ ఆకృతీ...) రూపాన్ని తొలగించి చూస్తే అంతా బ్రహ్మపదార్థమే అని అర్థమవుతుంది. ఇది నిజం కాబట్టే మనకంటూ తెచ్చుకున్న ఆహారపదార్థాలని కుక్కలు, పిల్లులు, ఎలుకలు... ఇలా ఏవి తింటున్నా... మూల పదార్థ దృష్టితో చూస్తే అవన్నీ కూడా బ్రహ్మపదార్థం నుండి వచ్చినవే కాబట్టి– ఏ విధంగానూ మనకంటే వేరు కావు. రూపాన్ని బట్టి పేరుని బట్టీ వేరువేరు పేర్లతో పిలువబడుతున్నాయి తప్ప అన్నీ ఒకటే నిజానికి. ఒకే భూమి నుండి పూల చెట్లూ, పళ్ల చెట్లూ, తీగల పాదూ... పుడుతున్నాయో అదే తీరుగా బ్రహ్మపదార్థం ఒకటే అయినా దాని నుండి వచ్చే రూపాలని బట్టి పేర్లు మారుతుంటాయనేది సత్యం.నాలో ఉన్న బ్రహ్మపదార్థమే మీలోనూ ఉంది. అయితే పేర్లు మారడం కారణంగా ఇతను శ్యామా, అతను కాకా, మరొకతను గోల్కరే... అని ఇలా అందరి చేతా పిలిపించుకో బడుతున్నారు. నిజానికి ఈ అందరూ ఒకే బ్రహ్మపదార్థానికి సంబంధించిన వాళ్లే. ఈ దృష్టే గనుక మనకి గాఢంగా కలిగితే మరొకనికి కష్టాన్ని కలిగిద్దామనీ, మరొకనికి హానిని తలపెడదామనీ, ఏ ఒకరిద్దరికి మాత్రమే సహాయపడుదామనీ... ఆ తీరు ఆలోచన రాదు.’ వసుధైక కుటుంబక’ మనే మాట ఒకటుంది. వసుధ అంటే భూమి అని అర్థం. ‘ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబానికి చెందినదే సుమా!’ అని దానర్థం. ఈ దృష్టికి రాగలిగినప్పుడు ఎవరికైనా ద్రోహాన్ని తలపెడితే మనకి మనమే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్నామని అర్థమవుతుంది. దాంతో ద్రోహాన్ని తలపెట్టనేలేరు. అప్పుడు సర్వసమానభావం (ఎవరికి ద్రోహాన్ని తలపెట్టినా తనకి తానే ద్రోహాన్ని తలపెట్టుకుంటున్న భావం) అలవడుతుంది. ఇదంతా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే ఒక తీరు విధానం. కాబట్టి మన కళ్లు ‘కళ్లు’ కావు. దృష్టి మారిన కళ్లు కావాలన్నమాట. ఇది ఒక తీరు. ఇక మరో తీరులో కూడా బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకునే వీలుంది. ఇదేం శ్లోకం? మనందరికీ ప్రసిద్ధంగా తెలిసిన ఓ శ్లోకముంది.‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అనేది.సృష్టించేవాడు బ్రహ్మ. ఆయన పురుషుడే. రక్షించేవాడు విష్ణువు. ఆయనా పురుషుడే. లయింపజేసేవాడు శివుడు. ఆయనా పురుషుడే. పుట్టుక, రక్షణ, మరణం అనే మూడు క్రియలూ అయిపోతే ఇక మిగిలిందేమిటి? ఏం చేయవలసి ఉంది? లేదు కదా! మరి శ్లోకం అక్కడితో ముగిసిపోకుండా ‘సాక్షాత్పరబ్రహ్మ’ అనే ఒక మాట ద్వారా ఆ పరబ్రహ్మని గురువుగా చెప్పడమేమిటి? ఈ పరబ్రహ్మ పురుషుడా? స్త్రీ నా? లేక నపుంసకధర్మంతో ఉన్నవాడా? అని ఈ తీరుగా ఆలోచిస్తే తెలుస్తుంది బ్రహ్మపదార్థమేమిటో!?కొంత విసుగ్గా అర్థమయ్యీ కానట్టుగా అనిపించినా కొద్ది ఓపిక పడితే తెలుస్తుంది. తెలిశాక మన ఆలోచనా విధానమే మారుతుంది.పైన ఆకాశముంది. ఉందా? అంటే లేదు. ఎందుకని? కనిపిస్తూ.. ఉన్నట్లుగా ఉంటూ.. ఎప్పటికీ కనిపించకుండా ఉండేదే ఆకాశం కాబట్టి. ఆ మాటకొస్తే ఆకాశమనే మాటకి అర్థమే ‘శూన్యం’ అని. ఆ ఆకాశాన్ని పట్టుకుని వేలాడుతూ పగటివేళ సూర్యుడూ రాత్రివేళ చంద్రుడూ మనకి కనిపిస్తున్నారా? ఈ ఇద్దరూ కూడా ఏ మాత్రపు క్షణమాలస్యం కూడా చేయకుండా – ఎంతటి చలికాలమైనా, ఎండ కాలమైనా, వర్షకాలమైనా– వచ్చి కనిపిస్తూ ఉంటారా? వీళ్లు కాక ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు.. ఇలా ఎన్నో ఆ ఆకాశాన్ని పట్టుకుని అతుక్కుని కనిపిస్తూ ఉంటే ఆకాశాన్ని శూన్యపదార్థమని ఎలా అనగలం?కాబట్టి కనిపించని దాంట్లో కనిపించేదేదో ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించి దాన్ని చూడగలగడం బ్రహ్మజ్ఞానం. పైగా నవగ్రహాలుంటాయక్కడే. పోనీ అవన్నీ ఓ వరుసలో నడుస్తున్న వ్యక్తుల్లా పక్క పక్కన లేక కొన్ని సమానమైన వరసల్లోనో నడుస్తారా? అంటే కానే కాదు. వాళ్లకి వాళ్లు నడవరు. నడిచేలా చేయబడతారు. అంటే వాళ్ల ప్రయత్నం ఏమీ లేకుండా వాహనం కదులుతుంటే దాంట్లో ఉన్న మనం ఏ మాత్రమూ కదలకుండా ఉంటామో, అయినా కదులుతూ వెళ్తున్నామో అలా నడిపింపబడుతూ ఉంటాయి. పోనీ ఒకే వరుసలో ఒకే పద్ధతిలో ఉంటాయా? అంటే కానేకాదు. కొందరు తూర్పుని చూస్తుంటే (శుక్రుడూ రవీ) మరి కొందరు పశ్చిమాన్ని చూస్తుంటే (శనిచంద్రులు) ఇంకొందరు ఉత్తరాన్ని చూస్తుంటే (బుధగురులు) మిగిలిన వాళ్లు దక్షిణముఖంగా ఉంటారా? వీళ్లలో కొందరు ఒక వేగంతో మరి కొందరు మరి కొంత వేగంతో ఇంకొందరు మరీ వేగంతో ప్రయాణిస్తూ ఉంటారా? వీళ్లలో కొందరు సూర్యునికి ప్రదక్షిణాకారంతో కొందరు అప్రదక్షిణాకారంతో తిరుగుతారా? ఇలా తిరుగుతున్నా కూడా ఏనాడూ ఒకరినొకరు గుద్దుకోనే గుద్దుకోరా? ఈ నిర్మాణం ఎవరిది? ఈ నిర్వహణ ఎవరిది? వీళ్లే కనిపించని వాళ్లవుతుంటే వీళ్లని నిర్వహించే ఆయనెక్కడ కనిపిస్తాడు? ఈ తీరుగా ఆలోచిస్తూ పోతే ఓ అదృశ్య శక్తి ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. అదే బ్రహ్మం. దీన్నే అదృశ్యుడుగా ఉన్న దైవంగా భావిస్తారు లౌకిక దృష్టితో జనమంతా. ఈ నిర్మాణాన్నీ వ్యవస్థనీ నిర్వహణా విధానాన్నీ ఏ మాత్రమూ గమనించకుండా ఆ శక్తికి ఓ పేరు పెట్టుకుని ఈయన చదువునీ ఆమె డబ్బునీ ఫలాని ఆయన ఆరోగ్యాన్నీ... ఇలా ఇస్తుంటారని పూజల్నీ పురస్కారాల్నీ, మళ్లీ వాటిని కూడా అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తూ పోతూ ఉండటమా? హిందూ ధర్మాన్ని తప్పుపట్టడం కానే కాదు నా లక్ష్యం. సరిగా ఆ ధర్మాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారా? అనేదే నా ఆందోళన.అందుకే పైన అనుకున్న శ్లోకం ఓ మాటని చెప్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఎంతో గొప్పగా అనుకుంటున్నా వాళ్లని కూడా నడిపించే బ్రహ్మపదార్థ మొకటుందని గమనించవలసి ఉందనీ, ఆయన్నే గురువుగా భావిస్తూ నమస్కరిస్తూ ఉండవలసిందనీను.ఆ పరబ్రహ్మనే కొందరు రాముడు, కృష్ణుడూ అంటుంటే మరికొందరు అల్లా అంటూంటారు. రాముడూ కృష్ణుడూ ఓ ప్రత్యేకమైన నిర్మాణ విధానంలో ఉన్న ఆలయాల్లో ఉంటూ ఉంటే, అల్లాహ్ మరో ప్రత్యేకమైన నిర్మాణవిధానంలో ఉన్న మసీదుల్లో ఉంటాడు. విధానం ఒక్కటే. రూపాలు వేరు. నివాసాలు వేరు. ఈ ప్రాంతం వాళ్లు జొన్నల్ని తింటే ఆ ప్రాంతం వాళ్లు గోధుమల్ని తింటే ఇంకో ప్రాంతం వాళ్లు వరి అన్నాన్ని తింటే ఆ తినబడే దాన్ని కొందరు అన్నమన్నారు. కొందరు రొట్టెలన్నారు. ఇంకొందరు మరో పేరుతో పిలిచారు. ఏమైనా ఈ భిన్నభిన్నతీరులున్నవన్నీ ఆకలిని పోగొట్టేందుకే కదా! ఈ దృష్టిగాని మనకి కలిగితే అప్పుడు ఈ విధానమంతా బ్రహ్మమే అనే ఆలోచనకి రాగలం. అందుకే ‘అల్లాహో మాలిక్’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండే నాకు ‘రాజారామ్ రాజారామ్’ అనే మంత్రం వేరుగా అనిపించదు. ఖాపర్దే భార్యకి ఇదే మంత్రాన్నిచ్చాను కూడా. హేమాడ్ పంత్ పుట్టుకకి బ్రాహ్మణుడయ్యుండీ సాయబునీ ఫకీరునీ అయిన నన్ను హిందూ దేవాలయ అర్చకుడయ్యుండీ ‘యా సాయీ!’ అని మరాఠీ భాషలో నన్నాహ్వానించినపుడు అందుకే ఆనందపడ్డాను– ‘ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టే సర్వదేవతలనీ ఒకే తీరుగా లెక్కించే గొప్పగుణం కలిగి కనిపిస్తున్నాడని.ఈ బ్రహ్మజ్ఞానమే మనకి కలిగిన రోజున మతద్వేషాలు దైవనిందలు దండయాత్రలు దేవాలయధ్వంసాలు మసీదుల్ని కూలగొట్టడాలు వంటివి ఉండనే ఉండవు. ఖురాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో సొంత బిడ్డలా చేతితో పట్టుకుంటామో అదే తీరుగా భగవద్గీతని కూడా చేతిలోకి తీసుకోగలుగుతాం.అంత దాకా ఎందుకు? నేను మొదటిసారి పెళ్లి వాళ్ల గుంపుతో షిర్డీకి వచ్చినప్పుడు ఈయనకి విడిది ఎక్కడియ్యాలా? అని అందరూ సంశయపడుతూ ఉంటేనూ, ఖండోబా దేవాలయ అర్చకుడు హేమాడ్‌పంత్ ‘పోనీ! ఈ ఆలయంలో ఓ గదిని కేటాయిద్దామా?’ అని ఆలోచిస్తూ ఉంటేనూ అందరూ కూడా ‘అతను సాయబు’ కాబట్టి పొరపాటున కూడా ఇక్కడికి రానియ్యద్దన్నారు. నేనూ అక్కడ ఉండదలచలేదు వారు ఉండవలసిందంటూ ఒకవేళ కోరినా. ఇది హిందువుల అజ్ఞాన దృష్టి అని నేననను.‘నువ్వు హిందూ దేవతలని కూడా కొలుస్తూ దేవతలని గురించి ప్రశంసిస్తూ దేవాలయాలకి వెళ్తూ ఆ మతం వాళ్లకి భోజనాలని పెడుతూ వాళ్లతో కలిసి మమేకంగా తిరుగుతూ కనిపిస్తున్నావు కాబట్టి మసీదు మెట్లని ఎక్కనియ్యం’ అంటూ మా వాళ్లు కూడా నన్ను రానీయలేదు. దాన్ని కూడా వారి అజ్ఞానమని నేననను. ఇంట్లో పిల్లవాడు తెలిసి తెలియని వయసులో కేవలం ఆటలమీదే దృష్టి ఉన్న దశలో బడికి వెళ్లనే వెళ్లనంటూ మారాం చేయడమే కాక ఏడుస్తూ చేతికి దొరికిన ప్రతి వస్తువునీ దూరంగా గిరవాటువేస్తున్న వేళ తల్లి మాత్రమే వాడికి పక్కవాళ్ల పిల్లల్నీ చదువుకున్న గొప్పవాళ్లనీ.... ఇలా చూపించి అర్థమయ్యేలా చెప్పి వాడంతట వాడే బడికి వెళ్లేలా చేస్తోంది. అదుగో అలాంటి బాల్యదశలో ఉన్నవాళ్లే ఈ భేదభావంతోనూ బ్రహ్మజ్ఞాన దృష్టి లేకుండానూ ఉంటారు– కనిపిస్తున్నారు కూడా. అది వాళ్ల తప్పు కాదు. వాళ్లకి సదవగాహన కలిగేలా చెప్పకపోవటం మన తప్పు మాత్రమే. అందుకే నా ఈ ప్రయత్నాలన్నీ. మసీదులో తులసి మొక్కా, హోమగుండానికి సంకేతరూపంగా ధునీ, భజనలకి ప్రతిరూపంగా నామజపం, భేదభావాలు రాకుండా వ్యాపించకుండా ఉండేందుకోసం– సాయబులకి ప్రీతి పాత్రమైన చందనోత్సవంతో హిందువులకిష్టమైన దైవకల్యాణాలూ– శ్రీరామనవమి ఉత్సవం రోజునే ఉరుసు ఉత్సవం... వంటివన్నీ జరుపుతున్నాం మసీదులో. ఇలా క్రమక్రమంగా మనం బుద్ధిలో అవగాహన పెంచుకోగలిగితే ఇక భేదభావం ఎక్కడుంటుంది?ఒకేనది సముద్రంగా ప్రవహిస్తోందా? అన్ని నదుల కలయికా కాదూ? ఒకే చెట్టుగాలి వీస్తోందా? అన్ని చెట్లగాలుల కలయికా కాదూ? లోకమంతా ఒకే తీరునేల మీద ఉంటోందా? ఇసుక రాయి చవిటి నల్లరేగడి... ఇలా అన్ని తీరుల కలయికా కాదూ? ఈ విశాల దృష్టితో ఆలోచించిన నాడు మనలో భేదబుద్ధి ఉంటుందా? ఉండగలుగుతుందా? ఆ ఏకత్వ దృష్టిని సాధించడమే బ్రహ్మజ్ఞానమంటారు. (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
జ్ఞానమా? శీలమా? ఏది మిన్న?
కాశీరాజు ఆస్థానంలో అనేకమంది పండితులుండేవారు. వారిలో ధర్మధరుడు మహాపండితుడే కాదు, శీలవంతుడు కూడా. రాజు పండితుల్ని వారి వారి పాండిత్యానికి తగిన రీతిలో ఘనంగా సత్కరించేవాడు. వారిలో పాండిత్యంతోపాటు శీలసంపన్నులూ ఉండేవారు. శీలగుణం లేని పండితులూ ఉండేవారు. రాజు మాత్రం వారి బుద్ధుల్ని లెక్కించకుండా కేవలం పాండిత్యానికే గౌరవ సత్కారాలు అందించడం ధర్మధరునికి నచ్చలేదు. రాజు మాత్రం అందరికంటే ధర్మధరుణ్ణే మిన్నగా గౌరవించేవాడు. ధర్మధరుడు రాజుకి జ్ఞానోదయం కలిగించాలనుకున్నాడు. ఒకరోజున నగరంలోని ఒక వజ్రాల దుకాణానికి వెళ్లాడు. దుకాణం యజమాని లేచి ధర్మధరునికి నమస్కరించాడు. యజమానితో మాట్లాడుతూ ఒక వజ్రాన్ని చేతిలో పట్టుకుని వెళ్లిపోయాడు ధర్మధరుడు. ‘మాటల మధ్య మరపుగా తీసుకుని ఉంటారు’ అనుకుని ఊరుకున్నాడు వ్యాపారి. రెండోరోజు అలానే చేశాడు ధర్మధరుడు. రెండోసారీ ఏమీ అనలేదు వ్యాపారి. మూడోరోజూ అలానే చేశాడు. వ్యాపారికి కోపం వచ్చి– ‘‘ఓరీ! దొంగవెధవా! నీ పాండిత్యం తగలబడ. నిన్ను గౌరవించడం నా తప్పు’’ అని గట్టిగా అరచి ధర్మధరుణ్ణి నాలుగు తన్ని, రాజు దగ్గరకు ఈడ్చుకుపోయాడు వ్యాపారి. దొంగగా తన ఎదుట నిలిచిన ధర్మధరుని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ‘‘రాజా! ఇప్పుడు నన్ను సత్కరించగలరా?’’అని అడిగాడు ధర్మధరుడు. ‘‘సత్కరించడం కాదు. శిక్షిస్తాను. అదే నీకు సత్కారం’’ అన్నాడు రాజు.‘‘ఔను కదా! మహారాజా! నేను మీకు చెప్పదలచుకుంది ఇదే! పాండిత్యమే కాదు, శీలం కూడా ఉండాలి. అలాంటివారినే గౌరవించాలి. కానీ, మీరు శీలం లేని పండితుల్ని కూడా అందరితోపాటే ఘనంగా సత్కరిస్తున్నారు’’ అన్నాడు ధర్మధరుడు. తను చేస్తున్న తప్పు తెలియజెప్పడానికే ధర్మధరుడు ఇలా చేశాడని రాజుకు అర్థమైంది.జ్ఞానం కంటే పాండిత్యం కంటే శీలమే గొప్పది అని బుద్ధుడు చెప్పిన కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
అమ్మకానికి డీలర్ పోస్టులు..!
విజయనగరం గంటస్తంభం: చౌకధరల దుకాణం డీలర్ పోస్టుల భర్తీలో అక్రమాలకు తెరలేచింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులకు కట్టబెట్టేందుకు అధికారపార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించి ఏ డిపోకు ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై ఇప్పటికే జాబితాలు సిద్ధమైనట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది. వీటికే అధికారులు ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తోందని సమాచారం. మరోవైపు ఈపోస్టులు కట్టబెట్టేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిభను కాదని... పోస్టు ఏదైనా ప్రతిభను పక్కన పెట్టి తమ అనుయాయులకు కట్టబెట్టడంలో టీడీపీ నేతలకు మించిన వారు లేరు. ఇప్పటికే నాలుగేళ్లుగా అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో తమ వారిని నియమించారన్నది అందరికీ తెలిసిందే. మెరిట్ ఉన్నా, అన్ని అర్హతలు ఉన్నా నష్టపోయి ఆందోళన చేసిన సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. తాజాగా తెలుగు తమ్ముళ్ల కన్ను డీలర్ పోస్టుల భర్తీపై పడింది. విజయనగరం డివిజన్లో 95 రేషన్‌డిపో డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేయడంతో వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఇందులో ఆరింటికి అభ్యర్థులు ఎవరూ దరఖాస్తు చేయకపోవడంతో మిగతా పోస్టుల్లో మాత్రం తమవారిని నియమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే రాత పరీక్ష ముగియడం, ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనుండడంతో.. అందులో తమ వారినే ఎంపికచేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంటర్వ్యూలు నామమాత్రమేనా..? ఇంటర్వ్యూలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఇతర నేతలు తమ వారి పేర్లుతో జాబితాలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ వివరాలను ఇప్పటికే ఎంపిక చేపడుతున్న విజయనగరం ఆర్డీవోకు పంపించారన్న చర్చ జోరందుకుంది. విజయనగరంలో ఒక కీలకనేత తన పరిధిలో 20 డిపోలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలన్న జాబితా సిద్ధం చేసి ఇచ్చేసినట్లు సమాచారం. ఎవరి పేర్లు ప్రతిపాదించారన్న విషయం కూడా బయట చెప్పుకుంటున్నారు. గజపతినగరం నియోజకవర్గ పరిధిలో అన్నింటిలోనూ మెరిట్ ఉన్నా లేకున్నా తమ వారికే ఇవ్వాలని అక్కడ నేత అధికారులకు సూచించినట్లు అధికారపార్టీ నేతలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు తమ వారి పేర్లును సూచించారు. ఆర్డీవో జె.వి.మురళి వీరి సిఫార్సులు ఎంతవరకు పరగణలోనికి తీసుకుంటారో చూడాలి. ప్రతిభను కాదని ఇచ్చినా ఇబ్బందులు వస్తాయని తెలిసి నిజాయితీగా వ్యవహరిస్తారా?, నేతల ఒత్తిడికి తలొగ్గుతారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. ఆర్డీవో మాత్రం అంతా నిష్పక్షపాతంగా చేస్తామని ప్రకటించారు. అయితే, ఆయన ప్రకటనను అభ్యర్థుల నమ్మడంలేదు. గరివిడి మండలం కుమరాం డీలరు పోస్టుకు ప్రతిభ ఉన్న వారిని పక్కన పెట్టి ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారని ముషిడి కుమార్, మరికొందరు ఇప్పటికే ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పూల్‌బాగ్‌లో ఒక డిపోకు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూకు పిలిచారన్న ఆరోపణలు ఉండడంతో అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా చేస్తారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆర్డీవో వద్ద ఇంటర్వ్యూకు సంబంధించి 20 మార్కులు ఉండడంతో వాటితో మేనేజ్ చేసి నేతలు చెప్పిన వారికి ఇస్తారని అభిప్రాయపడుతున్నారు. పోస్టుకో రేటు? ఇదిలా ఉండగా తెలుగు తమ్ముళ్లకే డీలర్ పోస్టులు ఇచ్చేలా సిఫార్సు చేస్తున్నా ఇక్కడ కూడా నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కో పోస్టుకు రూ.25వేలు నుంచి రూ.50వేలు అధికారపార్టీ నాయకులు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విజయనగరంలో ఒక పోస్టుకు రూ.25వేలు నుంచి రూ.30వేలు రేటు పెట్టగా గజపతినగరంలో రూ.50 వేలు వరకు, చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్లలో రూ.40వేల వరకు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారపార్టీ వారే కాకుండా ఇతరలు కూడా ఇంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తక్కువైనా తమ వారికే చేయాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఎంతోకొంతకు డీలరు పోస్టులు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా నిజాయితీగానే చేస్తాం చౌకధరల డీలరు పోస్టు భర్తీ నియమనిబంధనలకు లోబడి జరుగుతాయి. ప్రతిభ ఉన్న వారినే ఎంపిక చేస్తాం. ఈ విషయంలో ఎటువంటి దళారులను నమ్మి మోసపోవద్దు. ఎటువంటి వదంతులూ నమ్మొద్దు. కొన్ని డిపోల మెరిట్ జాబితాపై ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిని పరిశీలిస్తాం. మొత్తం పక్రియ నిజాయితీగా చేస్తాం. – జేవీ మురళి, ఆర్డీవో, విజయనగరం -
కారు దొంగ కోసం వెళ్తే...
బాబిగ్నీ, ఫ్రాన్స్ : ఫ్రాన్స్ పోలీసులు కారు దొంగను పట్టుకుందామని వెళ్తే మత్తు పదర్ధాలు అమ్మే వాళ్లు పట్టుబడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం ఉత్తర పారిస్ బాండీలో కొందరు పోలీసు అధికారులు కారు దొంగను పట్టుకోవడం కోసం సివిల్ దుస్తుల్లో మాటు వేసారు. ఆ సమయంలో మత్తు పదర్ధాలు అమ్మే ఇద్దరు వ్యక్తులు వీరిని సాధరణ మనుషులే అనుకుని వారి వద్దకు వచ్చి మత్తు పదర్ధాలు కావాలా అని అడిగాడు. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయ్యింది. కానీ పోలీసులు వెంటనే తమ ఐడెంటిటీని బయట పెట్టకుండా వారి వద్ద నుంచి పూర్తి వివరాలు కూపీ లాగారు. అనంతరం తాము పోలీసులమని చెప్పి వారిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 67 కేజీల మత్తు పదర్ధాలను స్వాధీనం చేసుకున్నారు. -
చిట్టీల వ్యాపారి అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): చీటీల పేరుతో జనాన్ని మోసం చేసి పరారైన వ్యాపారిని ఇనగుదురుపేట పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న అతన్ని కోర్టుకు హాజరుపరిచారు. శనివారం ఇనగుదురుపేట సీఐ ఎస్కే నబీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం రాజుపేటకు చెందిన అన్నం రాధాకృష్ణమూర్తి 30 ఏళ్లుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఏడాదిగా వ్యాపారం సరిగా నడవకపోవటంతో కుటుంబంతో సహా రాధాకృష్ణమూర్తి మచిలీపట్నం నుంచి రాత్రికిరాత్రే ఉడాయించాడు. బాధితులు పలువురు ఫిబ్రవరిలో రాధాకృష్ణమూర్తిపై ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. పోలీసులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి అతనిని రాజుపేటలో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చీటీల పేరుతో సుమారు రూ. 50 లక్షలకుపైగా బాధితులకు టోకరా పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. రాధాకృష్ణమూర్తితోపాటు వ్యాపారానికి సంబంధించి మరి కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. అదుపులోకి తీసుకున్న అతన్ని కోర్టుకు హాజరుపరచి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ కుమార్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
తరుగు..బస్తాకు 3 కిలోలు
పై చిత్రం పద్మాజీవాడి రేషన్ షాపులోనిది.. ఎల్ఎంఎస్ పాయింట్ నుంచి దుకాణానికి సరఫరా అయిన బియ్యం తూకం వేయగా.. 50 కిలోల బస్తాలో మూడు కిలోల తరుగు వచ్చింది. ప్రతి నెల ఇలాగే బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్ కిషన్‌రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. సదాశివనగర్: ఆహార భద్రతాకార్డులు కలిగిన వారికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం సరఫరాలో గోల్మాల్ జరుగుతోంది. గోదాముల నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం సంచుల్లో.. బస్తాకు మూడు నాలుగు కిలోల తరుగు వస్తోంది. దీంతో రేషన్ డీలర్లు నష్టపోతున్నారు. నిబంధనల మేరకు ఒక్కో బస్తాలో 50 కిలోల బియ్యం ఉండాలి. హమాలీలు బస్తాలను లారీలలో ఎత్తేముందు ఒక్కో బస్తాను గోదాంలో తూకం వేస్తారు. తూకం తక్కువ ఉంటే బస్తాలో తిరిగి ఆ మేరకు బియ్యాన్ని కలిపి బస్తాలు కుట్టి పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో బస్తాలో ఒక్కో తీరుగా బియ్యం తూకం వస్తున్నాయని డీలర్లు పేర్కొంటున్నారు. బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు ఉంటోందంటున్నారు. యంత్రంతో లెక్కపక్కా.. ఒక్కో చౌకధరల దుకాణంలో లబ్ధిదారుల వివరాలను ముందుగానే యంత్రానికి అనుసంధానం చేయడంతో వారు చౌకధరల దుకాణంలో బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు నమోదు చేయగానే వారికి అందాల్సిన బియ్యం వివరాలను మిషన్ తెలియజేస్తుంది. బియ్యం తూకం వేసే సమయంలో ఏ మాత్రం తక్కువగా ఉన్నా వివరాలను చూపించదు. ఈ రకంగా తూకం వేస్తే ఒక్కో బస్తాకు మూడు కిలోలపైనే తక్కువగా వస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. నష్టపోతున్నాం.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాల్లో తరుగు వస్తోంది. బస్తాకు మూడు నుంచి ఐదు కిలోలు తక్కువ వస్తున్నాయి. దీంతో నష్టపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – కిషన్‌రావు, రేషన్ డీలర్, పద్మాజీవాడి తరుగు లేకుండా చూస్తాం గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యంలో తరుగు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సరైన తూకంతో బియ్యం సరఫరా చేయాలని సూచించాం. గోదాంలో తూకం వేసిన తర్వాతే డీలర్లకు అందేలా చర్యలు తీసుకుంటాం. – అమీన్‌సింగ్, తహసీల్దార్, సదాశివనగర్ -
మంచి మాటల వాసన
అక్కడ ఒక సన్యాసి కూర్చునివున్నాడు. సన్యాసి మౌనంగా, ధ్యానంగా ప్రార్థిస్తూవున్నాడు. ఆయన పెదవులు చిన్నగా కదులుతున్నాయి. పాతకాలంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన పచ్చి అబద్ధాలు ఆడేవాడు. అందువల్ల ఆయన్ని ఎవరూ నమ్మేవాళ్లు కాదు. పైగా పరమ కోపిష్టి. కుటుంబ సభ్యులపై, బంధువులపై రుసరుసలాడుతుంటాడు. ఊరివాళ్లతో గొడవపడుతుంటాడు. దాంతో ఎవరూ ఆత్మీయంగా ఉండేవారు కాదు. ఆయనను చూస్తూనే ఏదో దుర్గంధం వీచినట్టుగా జనం పక్కకు తొలగిపోయేవారు. దీనితో వ్యాపారిలో దిగులు మొదలైంది.ఒకరోజు వ్యాపారి వీధిలో నడుస్తుండగా, ఏదో పరిమళాన్ని ఆయన ముక్కు గుర్తించింది. సుగంధ ద్రవ్యాల దుకాణం గానీ, అత్తర్ల దుకాణం గానీ సమీపంలో లేవని ఆయనకు తెలుసు. మరెక్కడినుంచి ఇంత మంచి వాసన వస్తోంది? ఇంకా నడుస్తుండగా ఆ పరిమళం మరింత హాయిగా, మెత్తగా అతడిని తాకుతోంది. చూస్తే వీధి చివర వున్న చింతచెట్టు కింద నుంచి వస్తోంది. అక్కడ ఒక సన్యాసి కూర్చునివున్నాడు. సన్యాసి మౌనంగా, ధ్యానంగా ప్రార్థిస్తూవున్నాడు. ఆయన పెదవులు చిన్నగా కదులుతున్నాయి. ఆ పరిమళం సన్యాసి నోట్లోంచి వస్తోందని వ్యాపారి తేలిగ్గానే గ్రహించాడు. కానీ అది అతడికి ఆశ్చర్యం కలిగించింది. దాంతో ప్రార్థన ముగించి, కళ్లు తెరిచేవరకూ ఓపిగ్గా వేచివుండి తన సందేహాన్ని సన్యాసి ముందుంచాడు. ‘నా నోట్లోంచి పరిమళమా? నేను సత్యంగా ఉంటాను. మృదువుగా సంభాషిస్తాను. అంతకుమించి నాకేమీ తెలీదు’ అన్నాడు నిరాడంబరంగా సన్యాసి. ‘నాకు అర్థమైంది స్వామీ’ అన్నాడు సాధువుకు వ్యాపారి భక్తిగా నమస్కరిస్తూ. -
పక్కా ప్లాన్‌తో..
సాక్షి, కామారెడ్డి: ‘‘దశాబ్ద కాలంగా చిట్టీలు వేస్తున్నాడు.. నమ్మకంగా డబ్బులిస్తున్నాడు.. అతడిని నమ్మి ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టాం.. ఇలా ముంచి పారిపోతాడనుకోలేదు’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని రాంమందిర్ రోడ్డులో ఫైనాన్స్ నిర్వహిస్తూ ఇటీవల పారిపోయిన వ్యాపారికి సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ‘నట్టేట ముం చేశాడు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.. ఇది జిల్లాలో సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్నవారు సదరు వ్యాపారి నిర్వహించిన ఫైనాన్స్‌ల వద్దకు పరుగులు తీశారు. సదరు వ్యాపారి తమతో ఎంతో నమ్మకంగా మెలిగాడని, ఇంత దగా చేస్తాడని అనుకోలేదని ఓ బాధితుడు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశాడు. ఖరీదైన భవనం.. ఫైనాన్స్‌లో ఉండే డబ్బంతా తన సొంతమే అన్నట్టుగా వ్యవహరించిన సదరు వ్యాపారి.. ఇటీవలే ఖరీదైన భవనం నిర్మించుకున్నాడు. పట్టణంలోని జ్ఞానదీప్ కాలేజీ రోడ్డులో రూ. 16 వేలకు గజం చొప్పున దా దాపు 160 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి, ఆధునిక హంగులతో ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవలే గృహప్రవేశం కూడా చేశాడు. ప్రస్తుతం ఇంటి విలువ రూ.70 లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇంటిపై కూడా బ్యాం కులో హౌసింగ్ లోన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇంటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు, సొంత అవసరాలకు వాడుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో ఉండడంతో డబ్బులను సర్దుబాటు చేయడం ఇబ్బందికరంగా మారడంతోనే పారిపోయేందుకు సిద్ధమై ఉంటాడని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగానే తాను పారిపోయే రోజు వర కు కూడా ఎవరికీ అను మానం రానీయకుం డా మెదిలాడని తెలుస్తోంది. కొత్తగా ఫైనాన్స్‌ల్లో భాగ స్వామ్యం కల్పిస్తానని కొందరి వద్ద డబ్బులు కూడా తీసు కుని వెళ్లినట్టు సమాచారం. అంతటా అదే చర్చ.. కామారెడ్డి పట్టణంలో ఫైనాన్స్ వ్యాపారి పరారీకి సంబంధించిన విషయం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో చాలా మందికి తెలిసింది. కొందరు వ్యాపార భాగస్వాములకు కూడా ఆయన పరారీ సంఘటన తెలియలేదు. మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఎటైనా ఊరికి వెళ్లొచ్చని భావించారు. అయితే ఫోన్లు మొత్తం స్విచ్ఆఫ్ చేసి ఉండడం, ఇంటికి, ఫైనాన్స్‌కు తాళాలేసి ఉండడంతో వారు కంగుతిన్నారు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో అంతటా చర్చ మొదలైంది. ఎవరెవరు ఎంతెంత మోసపోయారో లెక్కలు కట్టుకుంటున్నారు. వ్యాపారి మోసంపై చర్చ జరుగుతోంది. పథకం ప్రకారమే.. ఫైనాన్షియర్ పారిపోయిన తర్వాత మకాం పెట్టేందుకుగాను ముందుగానే ఓ పట్టణంలో ఇళ్లు మా ట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వెళ్లేముందు కామారెడ్డి పట్టణంలో ఓ సూపర్‌మార్కెట్‌కు వెళ్లి రెండు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాడని తెలిసినవారు చెబుతున్నారు. అలాగే బియ్యం షాపునకు వెళ్లి బియ్యం కొన్నాడని, వాటిని ఎక్కడైతే మకాం పెట్టాలనుకున్నాడో అక్కడికి తరలించాడని తెలుస్తోంది. మూడు జిల్లాలవారు.. పారిపోయిన ఫైనాన్షియర్ నిర్వహిస్తున్న ఫైనాన్స్‌లలో కా మారెడ్డితోపాటు సిరిసిల్ల, నిజా మాబాద్ జిల్లాలకు చెందిన వారు భాగస్వాములుగా ఉన్నారు. ఐదు గ్రూపుల్లో దాదాపు వంద మం ది భాగస్వాములు ఉన్నారని సమాచారం. అందులో సదరు ఫైనాన్షియర్ రక్తసంబంధీకులు, బంధువులు, స్నేహితులు కూడా ఉండడం గమనార్హం. ఓ రిటైర్డ్ టీచర్ రూ. 6 లక్షలు పెట్టినట్టు తెలుస్తోంది. ఓ చిరు వ్యాపారి తాను కష్టపడి జమ చేసుకున్న రూ.2 లక్షలు, మరో వ్యాపా రి రూ.4 లక్షలు, ఇంకో వ్యాపారి రూ. 17.50 లక్షలు, మరొకరు రూ.6.50 లక్షలు ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఇంకో వ్యాపారి రూ. 10 లక్షలు, ఓ రైతు నెల క్రితమే ఒక షేర్ కింద రూ.2 లక్షలు పెట్టారు. ఇలా దాదాపు వంద మందికిపైగా బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్‌లో భాగస్వామ్యం, చిట్టీలకు సంబంధించి దాదాపు రూ. 2.50 కోట్ల దాకా పెట్టు బడులు ఉన్నట్లు సమాచారం. -
నీలి కిరోసిన్ పట్టివేత
డోన్ టౌన్ : పట్టణంలోని కేవీఎస్ పెట్రోల్ బంకు వెనుకాల గల గోడౌన్‌పై సోమవారం తహసీల్దార్ మునికృష్ణయ్య ఆకస్మిక దాడులు జరిపి అక్రమంగా నిల్వ ఉంచి, లెక్కచూపని 10, 280 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కిరోసిన్ హోల్‌సేల్ డీలర్.. కేవీఎస్ కంపెనీ వారికి జనవరి నెలలో 67 వేల లీటర్ల కిరోసిన్‌ను కేటాయించగా.. 54వేల లీటర్లను మాత్రమే పంపిణీ చేశారని తహసీల్దార్ తెలిపారు. అక్రమంగా 10,280 లీటర్ల కిరోసిన్‌ను గోడౌన్లో నిల్వచేయగా దాడులు జరిపి గోడౌన్‌ను సీజ్ చేశాన్నారు. మిగిలిన 2,720 లీటర్ల కిరోసిన్ ఏమయిందనే విషయంపై సరైన రికార్డులను కేవీఎస్ కంపెనీ చూపలేకపోయిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు సమగ్ర నివేదిక పంపినట్లు తహసీల్దార్ స్పష్టం చేశారు. -
వెంకటేష్‌గౌడ్ హత్య కేసులో మరొకరు అరెస్టు
కర్నూలు: మద్దూరు నగర్లో జనవరి 24వ తేదీన హత్యకు గురైన డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్ హత్య కేసులో సూత్రధారిగా భావిస్తున్న కల్లూరుకు చెందిన మాజీ డీలర్ కాంతారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జనవరి 31వ తేదీన ఎరుకలి శ్రీనివాసులు, ఎరుకలి రాము, చిన్న మౌలాలీ అలియాస్ గిడ్డు, దేవాయత్తు శివుడు నాయక్‌ను అరెస్టు చేయగా, ఈనెల7వ తేదీన సూత్రధారిగా భావిస్తున్న జలంధర్‌గౌడ్, షేక్ ఉస్మాన్గనిబాషా, అలియాస్ టోపీబాషా, గువ్వల గిడ్డయ్య, పుల్లకూర పక్కీరయ్యను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9 మందిపై కేసు నమోదు కాగా, చివరి నిందితుడిగా భావిస్తున్న కాంతారావును శుక్రవారం కల్లూరులోని ఆయన ఇంటికి ఎదురుగా ఉన్న నీలకంఠేశ్వర దేవాలయంలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. -
నమ్మిన బంటే హంతకుడు
– ప్రాణం తీసిన ఈ- పాస్ కుంభకోణం – వెంకటేష్ గౌడ్ హత్యకు కారణం ఆర్థిక లావాదేవీలు – విజిలెన్స్, సీసీఎస్‌కు సమాచారం ఇచ్చాడని కక్ష – విచారణలో తేల్చిన పోలీసులు – నలుగురు నిందితుల అరెస్టు.. ఎస్పీ ఎదుట హాజరు – మరో ఐదుగురి కోసం ముమ్మర గాలింపు కర్నూలు : డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ దారుణ హత్య వెనుక కారణాలు ఆర్థిక లావాదేవీలేనని పోలీసులు విచారణలో తేల్చారు. దారుణానికి ఒడిగట్టిన శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులు, ఎరుకలి రాము, సయ్యద్ చిన్న మౌలాలి అలియాస్ గిడ్డు, దేవావత్ శివుడు నాయక్‌లను పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావుతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఏడాది కాలంగా వెంకటేష్ గౌడ్‌కు రక్షణ కవచంగా ఉన్న ఎరుకలి శ్రీనివాసులు మరి కొందరి సహకారంతో అతిదారుణంగా వేట కొడవళ్లతో నరికి హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ-పాస్ కుంభకోణం సమాచారం లీక్ చేశాడని కక్ష ఈ-పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి రేషన్ బియ్యాన్ని స్వాహా చేసిన ముఠాలోని కొంతమంది డీలర్ల ప్రోత్సాహానికి తోడు డీలర్షిప్ ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో ఎరుకలి శ్రీనివాసులు.. వెంకటేష్ గౌడ్‌పై కక్ష కట్టాడు. డీలర్ల సంక్షేమ సంఘం ఏర్పాటులో కొంతమంది డీలర్లతో వెంకటేష్‌గౌడ్‌కు విభేదాలు ఉన్నాయి. కొంతమంది డీలర్‌షిప్‌లను తీయించాడని అతనిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులును చేరదీసి డీలర్షిప్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి, ప్రత్యర్థుల నుంచి ముప్పు లేకుండా రక్షణ కవచంగా వినియోగించుకున్నాడు. ఈ-పాస్ కుంభకోణంలో భాగంగా నగరంలో సుమారు 100 మందికిపైగా డీలర్‌షిప్‌లు రద్దు అయ్యాయి. అందులో ఎరుకలి శ్రీను స్వయాన సోదరుడైన చంద్రశేఖర్ పేరుతో ఉన్న డీలర్షిప్ కూడా రద్దు అయింది. కొత్తగా డీలర్షిప్ ఇప్పిస్తానని చెప్పి రూ.2.50 లక్షలు శ్రీను వద్ద నుంచి వెంకటేష్‌గౌడ్ తీసుకున్నాడు. డీలర్షిప్ కోసం తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరుతూ హత్యకు పది రోజుల ముందు కలెక్టర్ ఆఫీసులో ఇరువురు గొడవపడ్డారు. డబ్బులు ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ తెగేసి చెప్పడంతో వివాదం ముదిరింది. వారం రోజుల పాటు రెక్కీ.. డీలర్షిప్ కోసం డబ్బులు తీసుకోవడమే కాక సంవత్సరం పాటు తన సహకారం తీసుకొని నిర్లక్ష్యం చేయడంతో ఎరుకలి శ్రీను.. వెంకటేష్ గౌడ్‌ను హత్య చేసేందుకు మేనమామ ఎరుకలి రాము, అతని బావమరిది చిన్న మౌలాలి, ఆటో డ్రైవర్ శివుడు నాయక్‌తో కలిసి రెక్కీ నిర్వహించారు. వారం రోజుల పాటు గౌడు కదలికలపై నిఘా వేసి హత్య చేశారు. వెంకటేష్ గౌడ్‌కు ఇద్దరు భార్యలు. రెండో భార్య కర్నూలు శివారుల్లోని జొహరాపురంలో ఉంటుంది. ఇంటి నుంచి ప్రతి రోజు లక్ష్మి గార్డెన్ మీదుగా కర్నూలులోని మొదటి భార్య ఇంటికి వస్తుంటాడు. ఇందులో భాగంగా 24వ తేదీ హత్య చేసేందుకు ఎరుకలి శ్రీను పతకం రచించాడు. జొహరాపురంలోని లక్ష్మిగార్డెన్ వద్ద మౌలాలి, రాము, డ్రైవర్ శివుడుతో కలిసి ఏపీ 21 టీయూ 9180 ఆటోలో మాటు వేశారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటేష్‌గౌడ్ మోటర్ సైకిల్‌పై అటుగా అదే మార్గం గుండా కర్నూలులోకి వెళ్లాడు. డీలర్ జలంధర్‌గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆటోలో అతన్ని అనుసరించి మద్దూరునగర్‌లోని జిరాక్సు సెంటర్ వద్ద కాపుకాశారు. స్టూలుపై కూర్చొని ఉన్న అతనిపై నలుగురు ఒకే సారి వేట కొడవళ్లతో దాడి చేసి నరికి హత్య చేశారు. అక్కడి నుంచి కల్లూరు ఎస్టేట్, చెన్నమ్మ సర్కిల్ మీదుగా ఆటోలో వెళ్లి రాము ఇంటి వద్ద రక్తపు మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని, వేట కొడవళ్లను ఇంట్లో దాచిపెట్టి పరారయ్యారు. హతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి, నిందితుల కోసం గాలిస్తుండగా శ్రీనివాసులుతో పాటు, మిగిలిన ముగ్గురు నిందితులు కల్లూరు తహసీల్దారు ఎదుట లొంగిపోయారు. నిందితుల స్టేట్మెంటును రికార్డు చేసి, వారిని పోలీసు స్టేషన్లో హాజరు పరిచారు. వారి ఒప్పందం మేరకు పంచనామా రికార్డు చేసి రాము ఇంటి వద్ద ఉన్న ఆటోను, రక్తపు మరకలు గల బట్టలను, వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హత్యకు ప్రోత్సహించిన రేషన్ డీలర్లు జలంధర్‌గౌడ్, గనిబాషా అలియాస్ టోపి బాషా, గిడ్డయ్య, పక్కీరయ్య, మాజీ డీలరు కాంతారావు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులు లొంగిపోయేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ మధుసూదన్‌రావు, ఎస్ఐలు శ్రీనివాసులు, మల్లికార్జున, ఏఎస్ఐ భాస్కర్, హెడ్ కానిస్టేబుళ్లు దైవప్రసాద్, శంకర్‌నాయక్, కానిస్టేబుళ్లు దేవదాస్, కిషోర్, విశ్వనాథ్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
పోలీసుల అదుపులో డీలర్ హత్యకేసు నిందితులు
వివిధ కోణాల్లో కొనసాగుతున్న విచారణ కర్నూలు : డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌గౌడు దారుణ హత్యకు కారకులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులు, ఎరుకలి రాము, శివనాయక్, చిన్నమౌలాలి అలియాస్ కిట్టు తదితరులను ఐదు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని కర్నూలు శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలోని ఒక ప్రత్యేక గదిలో ఉంచి విచారిస్తున్నారు. 137వ చౌక డిపో డీలర్ ఎరుకలి చంద్రశేఖర్‌కు ఎరుకలి శ్రీను సమీప బంధువు. 109వ నెంబర్ చౌకడిపో డీలర్ కళావతి రాజీనామా చేయడంతో చంద్రశేఖర్ పేరుతో ఇన్చార్జి వేయించుకుని ఎరుకలి శ్రీను కూడా బినామి డీలర్‌గా వ్యవహరిస్తున్నాడు. సొంతంగా డీలర్షిప్ సంపాధించుకునేందుకు వెంకటేష్ గౌడును ఆశ్రయించాడు. ఏడాది కాలంగా వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారు. అధికారులతో మాట్లాడి 109వ చౌకడిపోను ఇప్పిస్తాను.. అందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పి ఎరుకలి శ్రీను దగ్గర వెంకటేష్‌గౌడు డబ్బులు తీసుకున్నాడు. నెలలు గడచిపోతున్నా డీలర్షిప్ దక్కకపోవడంతో డబ్బుల విషయంలో వీరి మధ్య వివాదం చోటు చేసుకుంది. హత్య జరిగిన 24వ తేదీకి వారం రోజుల ముందు కూడా కలెక్టరేట్లో తీవ్రస్థాయిలో డబ్బుల కోసం వారిద్దరు గొడవ పడినట్లు పోలీసు విచారణలో వెలుగుచూసింది. హత్య జరిగిన మరుసటిరోజు నుంచి ఎరుకలి శ్రీను సెల్‌ఫోన్ స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతనిపై ప్రత్యేక దృష్టి సారించి ఐదు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. హత్యలో డీలర్ల పాత్ర ఉందా? నగరంలోని 121, 148, 95 చౌక డిపోలు హతుడు వెంకటేష్‌గౌడ్ బంధువుల పేరుతో ఉన్నాయి. 163వ చౌక డిపోకు కూడా వెంకటేష్‌గౌడ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఈ–పాస్ కుంభకోణంలో జిల్లా వ్యాప్తంగా 161 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారు. ఈ–పాస్ మిషన్‌ను ట్యాంపరింగ్ చేసి నిత్యావసర సరుకులను పక్కదారి పట్టించిన డీలర్ల వివరాలను వెంకటేష్‌గౌడు విజిలెన్స్ అధికారులకు, సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న కసితో కాంట్రాక్టు హత్య చేయించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు నగరంలోని చౌక డిపో డీలర్లు హనుమంతయ్య, పక్కీరప్ప, గనిబాషా, నూర్ బాషా, లక్ష్మన్న, ప్రమీలమ్మ, వడ్డెగేరి రమేష్, ఎరుకలి శ్రీను తదితరులే ఈ దారుణానికి ఒడిగట్టారని హతుని భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులోని డీలర్లను కూడా పోలీసులు పిలిపించి తమదైన శైలిలో విచారించారు. హత్య సంఘటన వెనుక డీలర్ల పాత్ర ఉందా లేక డీలర్షిప్ ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేసినందుకే ఎరుకలి శ్రీను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
డీలర్లు.. వేషాలు
సరుకుల పంపిణీలో అక్రమాలు - ప్రదక్షిణలు చేస్తున్న కార్డుదారులు - సరుకులు అయిపోయాయనే సమాధానంతో సరి - 15 వరకు షాపులు తెరవాలనే నిబంధనకు పాతర - ప్రజాపంపిణీలో యథావిధిగా దందా కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడని పరిస్థితి. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో డీలర్లు చేతివాటం చూపుతున్నారు. చౌక దుకాణాలను ప్రతి నెలా 15 వరకు తెరిచి ఉంచాలనే నిబంధనను గాలికొదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డుదారులు రేషన్ షాపులు చుట్టూ తిరుగుతున్నా సరుకులు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది కార్డుదారులు డీలర్ల నిర్లక్ష్యంతో రేషన్ సరుకులు పొందలేకపోయారు. కర్నూలులోనే వందలాది మంది కార్డుదారులు డీలర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంలోనూ ఇదే పరిస్థితి. కానుకల పంపిణీకి మొదట ఈ నెల 12 వరకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే చాలా మంది కార్డుదారులు పొందలేకపోవడంతో ఈ నెల 15 వరకు పంపిణీ చేసేలా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు వందలాది షాపుల్లో అమలుకు నోచుకోలేదు. కొత్త కార్డులకు కానుకలు ఇవ్వాల్సి ఉండగా 30శాతం కార్డుదారులకు నిరాశే మిగిలింది. ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ–పాస్ మిషన్లను తీసుకొచ్చినా యథావిధిగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 149 మంది డీలర్లు ఈ–పాస్ మిషన్లనే బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టారు. ఇలాంటి డీలర్లు కర్నూలులోనే 100 మంది ఉన్నారు. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసిన కుంభకోణంలో 149 మంది డీలర్లను సస్పెండ్ చేసి వారి స్థానాల్లో ఇన్చార్జి డీలర్లను నియమించినా అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. సర్వర్‌కు లాక్ చేశారు.. ఇక అక్రమాలకు తావుండదని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కార్డుదారులు ఏ చౌకదుకాణం నుంచి అయిన సరుకులు తీసుకోవచ్చు. దీనినే పోర్టబులిటీగా వ్యవహరిస్తారు. చౌక దుకాణాలకు సరకులను కార్డుల సంఖ్యను బట్టి కేటాయిస్తున్నారు. పోర్టబులిటీ ప్రకారం డీలర్లకు సరుకులు ఇవ్వడం లేదు. నిబం«ధనల ప్రకారం ఈ నెల 15 వరకు షాపులను తెరచి ఉంచి కార్డులన్నింటికీ సరుకులు ఇవ్వాల్సి ఉంది. 15వ తేదీ వరకు సరుకులు ఇస్తారు కదా అని.. వారం, 10 రోజుల తర్వాత వెళ్లిన కార్డుదారులకు డీలర్లు మొండిచెయ్యి చూపుతున్నారు. సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపుతుండటం గమానార్హం. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత బియ్యం సరుకులు అయిపోయాయి అనే ప్రశ్నే రాదు. 15 వరకు సరకులు అలాగే ఉంచాలి. తర్వాత బ్యాక్లాగ్ చూపాల్సి ఉంది. కొందరు డీలర్లు పోర్టబులిటీ పేరుతో అదే షాపు పరిధిలోని కార్డుదారులకు మొండి చేయి చూపుతుండగా, మరికొందరు పోర్టబులిటీతో సంబంధం లేకుండానే సరకులు లేవు.. అలస్యంగా వచ్చారు.. అయిపోయాయి.. అంటూ వెనక్కి పంపుతుండటంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. షాపునకు ఉదయం పోతే సాయంత్రం రమ్మని, సాయంత్రం పోతే ఉదయం రమ్మని ఇలా రెండు మూడు రోజులు తిప్పుకొని తీరా సరకులు లేవు.. అయిపోయినాయని చెబుతుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసే అక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. అధికారికంగా పోర్టబులిటీ లేదు. ఉంటే ఆ విధంగా షాపులకు సరకులు కేటాయిస్తారు. జిల్లాలో ఏ షాపునకు పోర్టబులిటీ ప్రకారం సరకులు ఇవ్వడం లేదు. కానీ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కార్డుదారులను తిప్పుకొని చివరికి డీలర్లు చేతులెత్తేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమాల్లో కొన్ని... – కర్నూలు నగరానికి చెందిన షేక్ మహమ్మద్‌కు ఆర్ఏపీ 138210834806 నెంబర్ రేషన్ కార్డు ఉంది. అయితే 130వ షాపు దగ్గరగా ఉండటంతో పోర్టబులిటీ కింద ఈ షాపులో సరకులు తీసుకుంటున్నారు. సరుకుల కోసం కార్డుదారుడు ఈ షాపు చుట్టూ తిరిగినా చివరకు సరుకులు అయిపోయినాయంటూ వెనక్కి పంపారు. 108వ షాపునకు సరుకుల కోసం వెళ్లగా అక్కడా మొండి చేయి చూపారు. ఇలా ఆయన జనవరి నెల సరుకులను కోల్పోయారు. – కర్నూలుకు చెందిన ఈడిగ రేవతికి 129వ షాపులో కార్డు ఉంది. కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ 1382129బి0045. జనవరి నెల సరుకుల కోసం 129-2 షాపులోను, అటు పోర్టబులిటీ కింద సరుకులు తీసుకునేందుకు 130 షాపునకు వెళ్లారు. పలు సార్లు తిప్పుకున్నా చివరకు సరుకులు అయిపోయాయంటూ వెనక్కు పంపించారు. – కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వీరన్నగౌడుకు జేఏబీ 131803500036 నెంబర్ కార్డు ఉంది. అయితే పోర్టబులిటీ కింద కర్నూలులో సరుకులు తీసుకుంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలను పోర్టబులిటీ కింద తీసుకునే అవకాశం లేదు. ఎక్కడ కార్డు ఉంటే అక్కడే కానుకలు తీసుకోవాల్సి ఉంది. కానుకల కోసం పెద్దపాడులోని డీలరు షాపునకు వెళితే నిరాకరించారు. -
నేటి నుంచి కార్డుదారులకు అప్పుపై సరుకులు
–జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబరు నెల సరుకులను శనివారం నుంచి కార్డుదారులకు అప్పు ప్రాతిపదిక పంపిణీ చేయనున్నట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులతోను శుక్రవారం.. జేసీ సమీక్ష నిర్వహించారు. నగదు కొరత ఉన్నందును కార్డుదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. అప్పుపై అన్ని రకాల సరుకుల పంపిణీ తక్షణం అమలులోకి వస్తుందన్నారు. ఇంతవరకు సరుకలు తీసుకోని కార్డుదారులందరూ నేటి నుంచి నగదు చెల్లించకుండానే సరుకులు పొందవచ్చని తెలిపారు. డీలర్లు కూడ ఎట్టి పరిస్థితుల్లోను కార్డుదారులను నగదు అడుగరాదని ఆదేశించారు. జిల్లాలో 10.75లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండగా శుక్రవారం నాటికి దాదాపు 40శాతం పంపిణీ పూర్తి అయింది. మిగిలిన 60శాతం కార్డుదారులు అప్పుపై సరుకులు పొందాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, నందికోట్కూరు స్టాక్ పాయింట్ల పరిధిలో ఈ నెలలోనే త్వరలో అదనపు సరుకులు కందిపప్పు పెసరపప్పు, వేరుశనగ విత్తనాలు కిలో ప్యాకెట్లు మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు ఇస్తున్నామన్నారు. వీటిని కూడ అప్పుపై తీసుకోవచ్చని సూచించారు. అయితే జనవరి నెల సరకులు తీసుకునే సమయంలో ఈ బకాయిని చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. కార్డుదారుల నుంచి డబ్బులు తీసుకోకపోతే వచ్చే నెల డీడీలు కట్టడం కష్టం అవుతుందని డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలపగా.. ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జేసీ చెప్పారు.కార్యక్రమంలో డీఎస్ఓ తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు కేసుల్లో ఇద్దరి అరెస్టు
పంజగుట్ట: రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు ఒకరి నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, మరో నిందితుని నుంచి రూ.5.85 లక్షల నగదు స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల పక్రారం ఆసీఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (38) అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తుండేవాడు ఇతను చిల్లర దొంగతనాలు చేస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కాడు. ఎరమ్రంజిల్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పద్మావతికి వైజాగ్‌కు బదిలీ కావడంతో ఇంటికి తాళం వేసి వైజాగ్ వెళ్లింది. ఈ నెల 12న ఇంటికి వచ్చిన ఆమెకు ఇంట్లోని 15 తులాల బంగారం, 40 వేల నగదు, ఒక టీవీ, సిలిండర్ కనిపించకపోవడంతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో ఇస్మాయిల్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి 7 తులాల బంగారం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి దొంగ అరెస్టు పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేసిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని రూ. 5.85 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అశోక్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఉత్తమ్ అనే వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత శనివారం ఉత్తమ్ తన ఇంట్లోని బీరువాలో రూ. 6 లక్షల నగదు ఉంచడాన్ని గమనించిన అశోక్ వాటిని కాజేసి మహబూబ్‌నగర్ వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. తన సోదరుడికి కాలు విరిగినందున, ఆసుపత్రిలో పాత నోట్లు తీసుకుంటున్నట్లు తెలిసి ఆపరేష¯ŒS చేయించేందుకు డబ్బులు కాజేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. -
149 మంది డీలర్ల సస్పెన్షన్
కర్నూలు(అగ్రికల్చర్) : ఈపాస్ మిషన్లను బైపాస్ చేసి సరుకులను కొల్లగొట్టిన 149 మంది డీలర్లను ఆర్డీఓలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరిపై క్రిమినల్కేసులు నమోదు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లకు, అర్బన్ ప్రాంతాల్లో ఏఎస్‌ఓలకు ఆర్డీఓలు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి నగరంలోని వందమంది డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని నాలుగు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. కర్నూలు నగరంలో మొత్తంగా 162 మంది డీలర్లు ఉన్నారు. ఒకేసారి ఈపాస్ కుంభకోణంలో 100 మంది డీలర్లకు సంబంధం ఉండడం, వారిని సస్పెండ్ చేయంతో డిసెంబర్ నెల ప్రజాపంపిణీ ప్రశ్నార్థకం కానునుంది. డిసెంబర్లో ప్రజా పంపిణీని కర్నూలు నగరంలో ఎలా చేపట్టాలనే దానిపై పౌర సరఫరా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉన్న డీలర్లకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించడం, ఇలా సాధ్యం కాకపోతే పట్టణ మహిళా సమాఖ్యల ద్వారా పంపిణీ చేయడం తదితర మార్గాలను అన్వేషిస్తున్నట్లు డీఎస్ఓ తిప్పేనాయక్ వివరించారు. -
బిజినెస్ కరస్పాండెంట్లుగా డీలర్లు
– ఈ– పాస్ మిషన్ల ద్వారా డిబెట్ కార్డులతో నగదు బదిలీ – కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): చౌక ధరల దుకాణాల డీలర్లందరు వారం రోజుల్లో బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్లుగా రిజిస్టర్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. ప్రతి రోజు ఎంత మంది డీలర్లు రిజిష్టర్ చేసుకున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలని డీఎస్ఓ తిప్పేనాయక్ కు సూచించారు. గురువారం కాన్ఫరెన్స్ హాల్లో డీలర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీలో ఎలక్ట్రానిక్ లావాదేవీలను చేపట్టాలని నిర్ణయించిందన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లుగా మారుతున్న డీలర్లు గ్రామ స్థాయిలో బ్యాంకు చేసే అన్ని కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు కమీషన్ అందజేయనున్నట్లు చెప్పారు. ప్రతి డీలరుకు బ్యాంకులు ఈ–పాస్ మిషన్లు ఇస్తుందని దీని ద్వారానే ఎలక్ట్రానిక్ లావాదేవీలు నిర్వహించాలన్నారు. డెబిట్, రూపే కార్డుల ద్వారా కార్డుదారుల ఖాతాల నుంచి సరుకులకు అయ్యే మొత్తాన్ని తమ ఖాతాలకు బదిలీ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే సరుకులే గాక ఇతర సరకులు అమ్మకోవచ్చన్నారు. జిల్లాలో అనేక మందికి జన్«ధన్ ఖాతాలు ఉన్నాయని, వీటిని యాక్టివేట్‌లోకి తెస్తున్నామన్నారు. çహోటళ్లు, బస్సుల్లోను ఈ –పాస్ మిషన్ ద్వారా నగదు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామనన్నారు. సమావేశంలో కర్నూలు అర్బన్ ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, సీఎస్డీటీలు పాల్గొన్నారు. -
గుట్టు రట్టు
- 'రేషన్ బియ్యం’ పంపిణీలో అక్రమాలు – క్లోజింగ్ బ్యాలెన్స్‌లో మాయాజాలం – కంప్యూటర్ ఆపరేటర్ల చేతివాటం – ఈ–పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి సరుకులు స్వాహా – ఈ స్కామ్ ముద్దుపేరు 'స్కీమ్' – ముగ్గురు డీలర్లు, ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, డీఎస్ఓ కార్యాలయం మాజీ ఆపరేటర్ అరెస్ట్ కర్నూలు: చౌక ధరల దుకాణాల్లో అక్రమాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ–పాస్ యంత్రాలను బైపాస్ చేసి సరుకులను స్వాహా చేసి సొమ్ము చేసుకున్న ముఠా గుట్టు రట్టయ్యింది. డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందించాల్సిన సబ్సిడీ సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. శ్రీశైలంలో తీగ లాగితే కర్నూలులో డొంక కదిలింది. శ్రీశైలానికి చెందిన చౌక డిపో డీలర్ చెరుకూరి మల్లికార్జున డీఎస్ఓ కార్యాలయ ఆపరేటర్ లావణ్య మొదటగా ఈ స్కామ్‌కు తెర తీశారు. ఈ–పాస్ యంత్రాల ద్వారా సరుకు బోగస్ లావాదేవీల గురించి డీఎస్ఓ తిప్పేనాయక్ ప్రాథమిక విచారణ జరిపి ఈనెల 3వ తేదీన శ్రీశైలం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీసీఎస్ డీఎస్పీ హుసేన్‌పీరా నేతృత్వంలో దర్యాప్తు చేసి అందుకు బాధ్యులైన శ్రీశైలానికి చెందిన ముగ్గురు డీలర్లు సి.హెచ్.మల్లికార్జున, మిద్దె నాగమల్లయ్య, ఎర్ర చిన్నమల్లికార్జున, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ, హైదరబాదు) సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మువ్వ స్వప్న, డీఎస్ఓ కార్యాలయం మాజీ కంప్యూటర్ ఆపరేటర్(కర్నూలు అశోక్‌నగర్) ఎస్.లావణ్య తదితరులను అరెస్టు చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరాతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను ఎస్పీ వెల్లడించారు. అక్రమాలు ఇలా.. హైదరాబాదులోని ఎన్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న స్వప్న డీఎస్ఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లావణ్య డీలర్లతో కుమ్మక్కై ఈ స్కామ్ వ్యవహారం నడిపించారు. శ్రీశైలానికి చెందిన చెరుకూరి మల్లికార్జున ఇందుకు ప్రధాన సూత్రధారి. కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు, వైజాగ్‌లో 12 మంది డీలర్లు ఈ స్కీమ్‌లో చేరి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఒక్కొక్క డీలర్ నుంచి రూ.10 వేల అడ్వాన్స్, నెలకు రూ.5 వేలు మామూళ్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని 2016 ఏప్రిల్ నుంచి జులై దాకా 'బోగస్' వ్యవహారాన్ని నడిపించారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం(ఎన్ఐసీ)లో పనిచేస్తున్న డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న ఆన్లైన్లో క్లోజింగ్ బ్యాలెన్స్‌ను తగ్గించి చూపించి సరుకు పంపిణీ అయినట్లుగా డేటాను సర్దుబాటు చేసి అందుకు భారీగా మామూళ్లు దండుకుంది. సర్దుబాటు చేసిన సరుకుల్లో 50 శాతం వాటా డబ్బులు ఇచ్చే విధంగా మాట్లాడుకుని డీలర్ మల్లికార్జున ఆపరేటర్ లావణ్య ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించారు. మొత్తం 18 దుకాణాల్లో ఈ–పాస్ మిషన్లు బైపాస్ చేసి సరుకులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెలుగు చూసింది. బయటపడింది ఇలా.. శ్రీశైలానికి చెందిన డీలర్ మల్లికార్జున ఈ స్కీమ్‌లో చేరిన మిగిలిన డీలర్లతో నెలనెలా వసూలు చేసిన డబ్బులను లావణ్య అకౌంట్‌కు జమ చేశారు. అందులోనుంచి ఎన్ఐసీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న సోదరుని అకౌంట్‌కు ఒకసారి రూ.3 లక్షలు, రెండవసారి రూ.3 లక్షలు నగదు రూపేణ జమ చేసినట్లు బయటపడింది. రెండు నెలల క్రితమే విషయం వెలుగులోకి రావడంతో లావణ్య ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండే (ఉత్తరప్రదేశ్ వాసి)తో పరిచయం పెంచుకుని తెర వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపించింది. సంవత్సరానికి అడ్వాన్స్‌గా రూ.9,60,000 పాండే బ్యాంక్ అకౌంట్‌కు 'ఎన్ఈఎఫ్టీ' ద్వారా నగదు పంపినట్లు పోలీసు విచారణలో బయటపడింది. లావణ్య పంపిన డీలర్ల వివరాల మేరకు ఆన్లైన్లో వారి క్లోజింగ్ బ్యాలెన్స్‌ను సర్దుబాటు చేసి సరుకులను మిగిల్చి లాభం చేకూర్చారు. కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 'బోగస్' లావాదేవీల వ్యవహారం పెద్ద ఎత్తున జరిగినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది: ఎస్పీ ఈ–పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి రేషన్ బియ్యాన్ని స్వాహా చేసిన ముఠా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. కార్డుదారులకు పంపిణీ చేయగా మిగిలిన సరుకుల(క్లోజింగ్ బ్యాలెన్స్)ను ఆన్లైన్లో సర్దుబాటు చేసి డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సగంసగం పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ బోగస్ వ్యవహారం జిల్లాలో పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమికంగా సమాచారముంది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో రూ.20 లక్షలకు పైగా చేతులు మారాయి. ఇందుకు బాధ్యులైన ఆరుగురిపై ఐపీసీ 420, 409, ఐటీ యాక్ట్ 66 కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపాం. ప్రజల సొమ్మును దోచుకుంటే ఎవరినీ వదిలేది లేదు. డీఎస్పీ స్థాయి అధికారి బోగస్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం త్వరలో బయటపడుతుంది. కర్నూలు జిల్లాలో సుమారుగా మూడు వందల మందికి పైగా డీలర్లు ఈ స్కామ్‌లో చేరినట్లు ప్రాథమికంగా సమాచారముంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈ స్కీమ్ వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. -
15 నుంచి రవాణా శాఖలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
– నేటి నుంచి వాహన డీలర్లకు అవగాహన కార్యక్రమాలు కర్నూలు: రవాణా శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాహనాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఈనెల 15న కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా రవాణా శాఖ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇందుకు సంబంధించి వాహన డీలర్లు, సిబ్బందికి స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 13, 14వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశం వాహన డీలర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ ఉపకమిషనర్ బి.ప్రమీల విజ్ఞప్తి చేశారు.