Dear Comrade
-
ఆ సినిమా నా కెరీర్లో ఎంతో ప్రత్యేకం: రష్మిక
నేషనల్ క్రష్, కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. పార్ట్-1లో శ్రీవల్లిగా మెప్పించిన పుష్ప-2లోనూ టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.అయితే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సరసన సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన డియర్ కామ్రేడ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్‌ను అలరించలేకపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.తాజాగా ఈ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తి కావడంతో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మరిచిపోలేనివని తెలిపింది. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ నన్ను లిల్లీ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. క్రికెట్ ట్రైనింగ్‌లో నెలల తరబడి గాయాల బారిన పడ్డామని ఆ రోజులను గుర్తు చేసుకుంది. అయితే షూటింగ్ రోజు కన్నీళ్లు, నవ్వులు, చెమటతో ఇచ్చిన సంతృప్తి తమ కష్టాన్ని మరిచిపోయేలా చేసిందన్నారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రత్యేకమైందని రష్మిక పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సాయిపల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా?.. అన్ని డిజాస్టర్లే!
దక్షిణాది హీరోయిన్లలో నటి సాయిపల్లవిది ప్రత్యేక శైలి. ఈమె స్వతహాగా వైద్యురాలు. నటనంటే ఇష్టంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అందుకే పెళ్లిని కూడా వాయిదా వేసి తన చెల్లెలి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. సాయిపల్లవి కెరీర్లో మరచిపోలేని చిత్రం ప్రేమమ్. ఆ చిత్రం లేకపోతే ఈమె లేరనే చెప్పవచ్చు. సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె మేకప్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. సాయిపల్లవి చేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి. అందుకే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తారు. అలా ఆమె తిరస్కరించిన చాలా చిత్రాలు అపజయం పాలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల చిరంజీవితో భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని సాయిపల్లవి నిర్భంధంగా తోసి పుచ్చారు. తీరా ఆ చిత్రం విడుదలై బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకు ముందు కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అయితే అందులో ముద్దు సన్నివేశాలు అధికంగా ఉండడంతో అందులో నటించనన్నారట. ఆ తరువాత ఆ పాత్రలో రష్మిక నటించారు. ఆ చిత్రం నిరాశపరచింది. ఇక తమిళంలో అజిత్ సరసన వలిమై చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టినా, పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పారు. ఇటీవల నటుడు విజయ్‌కు జంటగా లియో చిత్రంలోనూ నాయకిగా సాయిపల్లవిని నటింపచేసే ప్రయత్నం జరిగింది. అందులోని పాత్రలో నటనకు అవకాశం లేదంటూ వద్దన్నారు. ఆ చిత్రం భారీ వసూళ్లు రాబట్టినా విమర్శలను ఎదుర్కొంది. ఇక చంద్రముఖి–2 నటి కంగనా రనౌత్ పోషించిన పాత్రలో ముందు సాయిపల్లవిని సంప్రదించారు. ఆ కథ నచ్చకపోవడంతో సారీ చెప్పేశారు. ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఇలా సాయిపల్లవి రిజెక్ట్ చేస్తే.. ఇక అంతే అనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. కాగా ప్రస్తుతం కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. -
హీరోతో లిప్‌లాక్ సీన్.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత టాలీవుడ్, తమిళ్లో వరుస అవకాశాలు అందుకుంది. ఛలో, గీతా గోవిందంతో తెలుగులో గుర్తింపు పొందిన ఆమె పుష్పతో రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో వరుస ప్రాజెక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఆమె నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం గుడ్‌బై విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. చదవండి: ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆందోళన కాగా తన క్యూట్ క్యూట్ స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు ఆకట్టుకుంటున్న రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో.. అలాగే విమర్శించే వారు సైతం ఉన్నారు. అయితే తాజాగా తనపై వచ్చే విమర్శలపై స్పందించింది రష్మిక. డియర్ కామ్రేడ్ సమయంలో విజయ్ లిప్‌లాక్ సీన్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అదే విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంటూ భావోద్వేడానికి గురైంది. ‘ఆ రోజులను నేను ఎప్పటికి మర్చిపోలేను. చెప్పాలంటే అవి నాకు కఠినమైన రోజులు. డియర్ కామ్రేడ్ సినిమాలోని లిప్‌లాక్ సీన్‌పై వచ్చిన ట్రోల్స్ ఎలా అధిగమించానో, ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికి నాకర్థం కావడం లేదు. నేను చాలా సెన్సిటీవ్ పర్సన్‌ని, విమర్శలని అసలు తట్టుకోలేకపోయేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. చదవండి: ‘ఓం రౌత్‌కు రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు అలాగే ‘ఆ సమయంలో కొందరు నాకు ఫోన్ చేసి అంతా సర్దుకుంటుంది.. ఏం కాదు అని ధైర్యం చెప్పేవారు. మరి కొందరు మాత్రం నన్ను దారుణంగా విమర్శించారు. అవి నన్ను తీవ్రంగా బాధించాయి. ఎంతో ఒత్తిడికి గురయ్యా. రాత్రి పడుకుంటే పీడకలలు వచ్చేవి. నేను ఎవరినో వేడుకుంటున్నట్టుగా కలలు వచ్చేవి. అందరు నన్ను దూరంగా పెడుతున్నట్టు, నన్ను అసహ్యించుకుంటున్నట్లు వచ్చేవి. దీంతో మధ్య రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచి ఏడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అవి తలుచుకుంటే ఇప్పటికీ నాకు భయమేస్తుంది’ అంటూ రష్మిక ఎమోషనల్ అయ్యింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప మూవీతో పాటు హిందీలో యానిమల్, తమిళంలో వారీసు చిత్రాలతో బిజీగా ఉంది. -
హిందీలో రీమేక్ కానున్న సౌత్ చిత్రాలు: హీరోలు ఎవరంటే?
దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్? ఆ విషయంలోనే బాలీవుడ్ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్ కపూర్ (నిర్మాత బోనీకపూర్ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్ డియోల్ మెయిన్ లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్ అప్డేట్ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్ గాయత్రి ద్వయమే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారని, ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ‘అంజామ్ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్’ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. కుంచకో బోబన్ నటించిన ‘అంజామ్ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్’ రీమేక్‌కు విశాల్ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్ హిట్ సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
దూసుకుపోతున్న రౌడీ!
విజయ్ దేవరకొండ.. యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. అర్జున్ రెడ్డితో వయొలెంట్‌లా రెచ్చిపోయినా, గీతాగోవిందంలో సైలెంట్ అబ్బాయిలా ఉన్న ఈ హీరో, ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఇతనికి టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. అయితే విజయ్ నటించి తెలుగులో ఘోరంగా విఫలమైన ఆ సినిమా హిందీలో దూసుకుపోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి. . -
రౌడీ క్రేజ్: యూట్యూబ్‌లో ఒక్క రోజులోనే..
విజయ్ దేవరకొండ.. యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. గీతాగోవిందంతో సైలెంట్ అబ్బాయిలా, అర్జున్ రెడ్డితో వయొలెంట్‌లా రెచ్చిపోయిన ఈ హీరో ఏ పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఇతనికి టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. కాగా రౌడీ స్టార్ విజయ్ గతేడాది నటించిన డియర్ కామ్రేడ్ తెలుగులో ఘోరంగా విఫలమైంది. కానీ దీనికి భిన్నంగా హిందీలో మాత్రం ఈ సినిమా ఫెయిల్ కాలేదు. తెలుగులో చతికిలపడ్డ ఈ సినిమాను హిందీ ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో డబ్ చేసి రిలీజ్ చేయగా కేవలం ఒక్క రోజులోనే 12 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టిస్తోంది. హిందీ ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని రౌడీ నటనను కొనియాడుతున్నారు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించిన విషయం తెలిసిందే. చదవండి: రౌడీ.. ఫైటింగ్ షురూ ఫైటర్‌కు జోడి? రౌడీ ఫ్యాన్స్‌కు లవ్‌సాంగ్ గిఫ్ట్ -
ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్!
‘నా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడినా.. ఆడకపోయినా నేను పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను’ అని అంటున్నాడు ‘అర్జున్ రెడ్డి’ స్టార్ విజయ్ దేవరకొండ. ఇటీవల విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా.. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవార’ని తెలిపారు. అలాగే విజయ్ గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘డియర్ కామ్రేడ్ సినిమాపై ఓ చిన్న అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయంలో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి డియర్ కామ్రేడ్‌లోని మొదటి సగ భాగం మాత్రమే తనకు నచ్చిందని రెండవ భాగం నచ్చలేదని చెప్పింది. అది నిజమైన విమర్శ.. అని దానిని తాను అంగీకరిస్తాను. అయితే దానిపై నేను ఎటువంటి విమర్శ చేయను. నేను చేసే సినిమాలను ఇష్టపడతాన’ని తెలిపాడు. సినీ పరిశ్రమల్లో రాజకీయాల గురించి విజయ్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక వ్యాపారం. ఇక్కడ డబ్బు, అధికారం ఇలా చాలా అంశాల ప్రభావం ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికే సినిమాల్లోకి వచ్చాను. నేను సినిమా విజయవంతం అవుతుందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోను. నేను కేవలం మంచి సినిమాలు మాత్రమే చెస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నా చిత్రాన్ని ఇష్టపడకతే.. నేను అంటే ఏంటో నా తరువాతి చిత్రంలో చూపిస్తాను’ అని చెప్పారు. -
వైరల్ : విజయ్ దేవరకొండ న్యూ లుక్
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బిజీగా గడిపేస్తున్నాడు. రీసెంట్గా విజయ్.. ‘డియర్ కామ్రేడ్’ అంటూ పలకరించాడు. అయితే ఈ సినిమాతో దక్షిణాదిన స్టార్‌గా ఎదుగుదామనుకున్న ఈ హీరోకు నిరాశే ఎదురైంది. డియర్ కామ్రేడ్ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా.. విజయ్ మాత్రం తదుపరి సినిమా షూటింగ్‌లతో బిజీగానే గడిపేస్తున్నాడు. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. అయితే తాజాగా విజయ్ న్యూ లుక్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ కొత్త లుక్ తన కొత్త సినిమా కోసమే అయి ఉంటుంది. ఈ కొత్త లుక్‌లో విజయ్ సూపర్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. -
ఆస్కార్స్‌కు గల్లీ బాయ్
‘అప్నా టైమ్ ఆయేగా!’... గల్లీ బాయ్ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. అంటే ‘మన టైమ్ కూడా వస్తుంది’ అని అర్థం. ప్రఖ్యాత ర్యాప్ సింగర్ కావాలని కలలు కంటాడు ముంబై మురికివాడల్లో నివసించే మురాద్ అనే సాధారణ గల్లీ బాయ్. మురాద్ అంటే కోరిక అని అర్థం. తను బలంగా కోరుకున్నదాని కోసం కష్టపడి శ్రమిస్తాడు. ఏదో రోజు తన టైమ్ కూడా వస్తుందని నమ్ముతాడు. తను కలలు కన్నట్టే, కోరుకున్నట్టే టైమ్ వస్తుంది. ‘గల్లీ బాయ్’ పేరుతో ఫేమస్ ర్యాపర్ అవుతాడు. ఇప్పుడు ఆ గల్లీ బా యే 92వ ఆస్కార్‌కు మన దేశం తరఫున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఎంపిక అయ్యాడు. ఇ ప్పుడు ఆ గల్లీ బాయే ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన ఆస్కార్‌ను మనకు తీసుకురావాలని చాలామంది మురాద్. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ బాయ్’. ఆలియా భట్ కథానాయిక. 18 పాటలున్న ఈ సినిమా ఆల్బమ్‌లో దాదాపు 7 పాటలు రణ్వీర్ సింగ్ పాడటం (ర్యాప్ చేయడం) విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 92వ ఆస్కార్ అవార్డులకు రేస్ మొదలైంది. ఆస్కార్స్‌కు పంపబోయే చిత్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు అందరూ. మన దేశం నుంచి ఈ ఏడాది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి పోటీపడే చిత్రానికి కోల్‌కత్తాలో ఎంపిక జరిగింది. 28 చిత్రాలు పోటీపడగా, ‘గల్లీ బాయ్’ ఫైనల్‌గా నిలిచింది. నటి, దర్శకురాలు అపర్ణా సేన్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరిగింది. పోటీపడ్డ చిత్రాలు: హిందీ చిత్రాలు ‘అంధాధూన్, ఆర్టికల్ 15, బదాయి హో, బద్లా, కేసరి, గల్లీ బాయ్, ద తస్కెన్ట్ ఫైల్స్, ఉరి : ద సర్జికల్ స్ట్రయిక్, గోదే కో జలేబీ కిలానే లే జా రియా హూ, తెలుగు చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మలయాళ చిత్రాలు ‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ.., ఉయిరే, ఒలు, తమిళ సినిమాలు ఒత్త సెరుప్పు సైజ్ 7, వడ చెన్నై, సూపర్ డీలక్స్, మరాఠీ చిత్రాలు బాబా, ఆనంది గోపాల్, బందీషాలా, మై గాట్ : క్రైమ్ నెం 103/2005, అస్సామీ చిత్రం బుల్ బుల్ కెన్ సింగ్, గుజరాతీ చాల్ జీవీ లాయియే, గుజరాతీ సినిమా హెల్లోరి, కురుక్షేత్ర (కన్నడ), నేపాలీ చిత్రం పహూనా: ద లిటిల్ విజిటర్స్, బెంగాలీ చిత్రాలు తరీఖ్ : ఏ టైమ్‌లైన్, కోంతో, నగర్కీర్తన్లను పరిశీలనలోకి తీసుకున్నారు. బుధవారం మొదలైన ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం వరకూ సాగింది. ఈ 28 సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు (అంధాధూన్, బదాయి హో, ఆర్టికల్ 15) ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ‘అంధాధూన్’, ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానా జాతీయ అవార్డుకి ఎంపిక అయ్యారు. తెలుగు నుంచి కామ్రేడ్ ఒక్కడే గత ఏడాది తెలుగు నుంచి ‘రంగస్థలం, మహానటి’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రానికి ఎంపికవ్వడం కోసం పోటీ పడ్డాయి. ఈసారి తెలుగు నుంచి ‘డియర్ కామ్రేడ్’ ఒక్క సినిమానే ఈ 28 సినిమాల్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించాయి. -
ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియర్ కామ్రేడ్’
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలను ఈ జాబితాలోకి ఎంపికయ్యాయి. ఈ చిత్రాలన్నింటినీ స్క్రీనింగ్ చేసి, వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు. `డియర్ కామ్రేడ్` మాత్రమే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. వీటిలో ఉత్తమ చిత్రాన్ని ప్రకటిస్తారు. ప్రముఖ ఫిలిం మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మించాయి. -
ఇస్మార్ట్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ
‘ఇస్మార్ట్ శంకర్’తో తిరిగి ఫామ్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా హీరోకు క్రేజీ హీరోను ఎంచుకున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ అండ్ క్రేజీ హీరో విజయ దేవరకొండతో కలిసి పూరి ఓ సినిమాను పట్టాలెక్కించునున్నాడు. ఈ విషయాన్ని నటి, నిర్మాత చార్మీ కౌర్ అధికారికంగా ప్రకటించారు. డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహపరిచినప్పటికీ.. నటన, లుక్స్ పరంగా విజయ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇప్పటికే బ్లాక్ బస్టర్ సాధించి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో దించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డియర్ కామ్రేడ్‌తో నిరుత్సాహపరిచిన విజయ్, పూరి సినిమాతో ఆ లోటును భర్తీ చేయాలని ఆశిస్తున్నాడు. ఇక ఇస్మార్ట్ ఊపులోనే మరో హిట్ కొట్టాలని పూరి అండ్ టీమ్ తెగ ఆరాటపడుతోంది. -
‘డియర్ కామ్రేడ్’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. స్లో నేరేషన్ సినిమాకు మైనస్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ రీమేక్ హక్కులను తీసుకున్నట్టుగా కరణ్ జోహర్ ప్రకటించారు. ఈ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా షాహిద్ డియర్ కామ్రేడ్లో నటించబోనని తేల్చి చెప్పేశారట. ఇప్పటికే అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటించిన షాహిద్, డియర్ కామ్రేడ్ రీమేక్‌లోనూ నటిస్తే రొటీన్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. -
రష్మిక కోరికేంటో తెలుసా?
చెన్నై : ఆశ పడవచ్చు. అత్యాసకు పోకూడదు అన్నది పెద్దల మాట. అయినా అతిగా ఆశ పడిన ఆడది..అంత పెద్ద డైలాగులు వద్దు గానీ, నటి రష్కిక కోరిక చూస్తుంటే ఎవరికైనా అలా అనాలనిపిస్తుంది. అయినా అదృష్టం అందలం ఎక్కిస్తుంటే రష్కికనే కాదు ఎవరికైనా అలాంటి కోరికలే పుడతాయేమో. 2016లో కిరాక్కు పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక. తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అ బ్యూటీ వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అక్కడ నటించిన తొలి చిత్రం ఛలో చిత్రం సక్సెస్‌నిస్తే, ఆ తరువాత విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేసిన గీతగోవిందం సంచలన విజయాన్ని అందించింది. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఇక్కడ నటుడు కార్తీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతే కాదు దళపతి విజయ్‌తో జతకట్టే అవకాశం రష్కికను వరించిందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇక ఇటీవల తెరపైకి వచ్చిన తెలుగు చిత్రం డియర్ కామ్రేడ్ చిత్రం మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక ప్రస్తుతం తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో అల్లుఅర్జున్తోనూ రొమాన్స్ చేయబోతోంది. ఇలా చాలా వేగంగా నటి రష్మిక సక్సెస్ గ్రాఫ్ పెరుగుతూ పోతోంది. దీంతో ఈ అమ్మడి భావాలకు, కోరికలకు పగ్గాలు ఉంటాయని భావించలేం. ఇంతకీ ఈ అమ్మడు ఏమంటుందో చూద్దాం. నటించడానికి వచ్చిన ప్రారంభంలో నా ముఖాన్ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు. ప్రయత్నం చేద్దాం అని సినీ జీవితాన్ని ప్రారంభించాను. అలా తొలి చిత్రమే విజయాన్ని అందించింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు ముంగిట వచ్చి వాలుతున్నాయి. అయితే ఇలా వేగంగా ఎదిగి, వెంటనే పడిపోకూడదు. అందుకే ప్రతి చిత్రాన్ని చాలా జాగ్రతగా ఎంపిక చేసుకుంటున్నాను. వాటి నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఒకరు నచ్చితే ఆ వ్యక్తికి గుడి కట్టించే అభిమానులు ఇక్కడ ఉంటూనే ఉంటారు. మా నాన్న నటి కుష్భూకు గుడి కట్టించిన విషయాన్ని చెబుతూనే ఉంటారు. ఆ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. అయితే ఇప్పుడు నాకూ గుడి కట్టిస్తే బాగుంటుందని బావిస్తున్నాను అని నటి రష్మిక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీన్నేమంటారు ఆశ అంటారా? అత్యాశ అంటారా? -
‘డియర్ కామ్రేడ్’కు నష్టాలు తప్పేలా లేవు!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. సాగతీత సన్నివేశాలు ఎక్కువ కావటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రీ ఎడిట్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తొలి మూడు రోజుల్లో 18 కోట్ల వసూళ్లు సాధించిన కామ్రేడ్, వీక్ డేస్‌లో డీలా పడిపోయాడు. తొలివారం ఈ సినిమా కేవలం 21 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ వారం రిలీజ్ అయిన రాక్షసుడు, గుణ 369 సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో ఇక కామ్రేడ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపించటం లేదు. డియర్ కామ్రేడ్ దాదాపు 34 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే కనీసం 34 కోట్ల వసూళ్లు సాధించాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు. దాదాపు అన్ని ఏరియాల్లో కామ్రేడ్ నష్టాలనే మిగల్చనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
‘‘డియర్ కామ్రేడ్’ విజయం సంతోషాన్నిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: డియర్ కామ్రేడ్ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు హీరోయిన్ రష్మిక మందన్న. బేగంపేట భారతీ ఎయిర్టెల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె సందడి చేశారు. ఈ సందర్భంగా రష్మిక ‘డియర్ కామ్రేడ్’ కాంటెస్ట్ విజేతలను కలిసి ముచ్చటించారు. సినిమా విడుదలకు ముందే ఎయిర్టెల్.. ఏపీ, తెలంగాణల్లోని తన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ‘డియర్ కామ్రేడ్’ సినిమాపై ఓ కాంటెస్ట్ నిర్వహించింది. దానిలో గెలుపొందిన 40 మంది విజేతలు నేడు బేగంపేట ఎయిర్టెల్ కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ సంస్థ సీఈవో అవ్నిత్ సింగ్ విజేతలను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ సంస్థ నిర్వహించిన కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలను కలవడం చాలా సంతోషంగా ఉంది. గత నెల 26న విడుదలయిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాను తెలుగు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది’ అన్నారు. -
‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనందపడ్డా’
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్.భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇటీవల విడుదలైంది. కాగా, ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో రాజ్ అర్జున్ అనే బాలీవుడ్ నటుడు నటించారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావటం పట్ట ఆనందం వ్యక్తం చేసిన రాజ్ అర్జున్, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. మీ సినీ రంగప్రవేశం ఎలా జరిగింది? భోపాల్ మా సొంత ఊరు. చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే చాలా ఇష్టం. స్టేజ్ ఆర్టిస్ట్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఆ తర్వాత ముంబయిలో పదిహేను సంవత్సరాలు ఉన్నాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాను కాని నాకు అమీర్‌ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్స్టార్లో విలన్ క్యారెక్టర్లో చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ పాత్రతో నాకు ఒక యాక్టర్‌గా మంచి పేరు వచ్చింది. డియర్ కామ్రేడ్లో అవకాశం ఎలా వచ్చింది? దర్శకుడు భరత్ కమ్మ సూపర్ సీక్రెట్ సినిమా చూశారు. అందులో నా పెర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఫోన్ చేసి పిలిపించారు. అలా ఆ సినిమా ద్వారా నాకు డియర్ కామ్రేడ్ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో మహిళలను వేధించే పాత్రలో నటించారు. .. నిజ జీవితంలో అలాంటివి ఎప్పుడైనా చూశారా? ఇటువంటివి బయట నేను చాలానే చూశాను. ప్రస్తుతం మన సొసైటీలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ఇంకా చాలా విన్నాను. బట్ నాకు పర్సనల్‌గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. సినిమాల్లోకి రాకముందు మీరు ఏమి చేసేవారు? నేను భూపాల్‌లో ఉంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేవాడ్ని. ఇప్పటికీ ఆ బిజినెస్ ఉంది మా అన్నయ్య అవన్నీ చూసుకుంటున్నారు. విజయ్ దేవరకొండతో పని చేయడం ఎలా అనిపించింది? చాలా బావుంది. విజయ్ చాలా మంచి వాడు. ఎలాంటి వారినైనా గౌరవిస్తాడు. చిన్నా, పెద్దా అని చూడడు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు. సెట్స్‌లో కూడా అందరితో బాగా కలిసిపోతాడు. షూటింగ్‌కి కూడా చాలా డెడికేటెడ్‌గా టైమ్‌కి వస్తాడు. ఒక్కోసారి తన పంచువాలిటీ చూస్తే నాకే ఆశ్చర్యమేసేది. అతనికి మధ్యతరగతి విలువలు బాగా తెలుసు. అందరినీ తన వారిలో చూస్తాడు. నాకు ఎక్కడా నేను ఒక పెద్ద హీరోతో నటిస్తున్నాను అన్న ఫీలింగ్ కలగలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. రష్మిక క్లైమాక్స్‌లో మీ చెంప చెల్లుమనిపించింది కదా అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫీలయ్యానండి. చాలా ఆనందంగా ఫీలయ్యా. ఎందుకంటే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో నేను చాలా ఇబ్బంది పెట్టా, చాలా టార్చర్ కూడా పెట్టాను. నటనలో భాగంగానే మెంటల్‌గా, ఫిజికల్‌గా తనను చాలా ఇబ్బంది పెట్టాను. తను సీన్ అయిపోయాక కూడా అరగంట వరకు ఏడ్చేది. నేను మళ్ళీ తన దగ్గరకు వెళ్ళి చాలా సేపు మంచిగా మాట్లాడేవాడ్ని అవి కేవలం సీన్స్ మాత్రమే నువ్వు బాధపడివుంటే నన్ను క్షమించు. బాధపడొద్దు అని చెప్పేవాడ్ని. ఆఖరికి తను నన్ను కొట్టినప్పుడు చాలా ఆనందపడ్డాను. హమ్మయ్య.. తన కోపం అంతా పోయింది కదా అని. ఎక్కడా కూడా ఒక విలన్, హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ అవ్వరు. కానీ ఈ సినిమాతో మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. విజయ్, రష్మిక నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇండస్ట్రీ నుంచి మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్? తమిళ , తెలుగు ఇండస్ట్రీల నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. తమిళ డైరెక్టర్ విజయ్, నటుడు కృష్ణ చాలా బాగా చేశారని అభినందించారు. అలాగే సినిమా అయిపోయాక కొంత మంది థియేటర్లో నన్ను చూసిన ఆడపిల్లలు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా కొందరు భయపడ్డారు. నేను ఆ పాత్రకు తగ్గట్టే ఉన్నానని. కొంతమంది నన్ను క్రూయల్ మెంటాలిటీ అని అనుకుంటున్నారు. దాదాపుగా ఈ మధ్య నేను నటించిన మూడు చిత్రాలు కూడా అలా నెగిటివ్ క్యారెక్టర్స్ కావడంతో అలా అనుకుంటున్నారు. మీకు తమిళ, తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో ఏది కంఫర్ట్‌గా ఉంది? రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన షాభీ చిత్రం మంచిగా అనిపించింది. ఆ తర్వాత సూపర్ సీక్రెట్ కూడా ఓకే. కాకపోతే నా వరకు డియర్ కామ్రేడ్ తెలుగు ఇండస్ట్రీ కంఫర్ట్ అనిపించింది. ప్రొడ్యూసర్ మంచి వారు. పెద్ద బ్యానర్ నాకు భాష రాకపోయినా ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బావుంది. హైదరాబాద్ నాకు నా సొంత ఇల్లులా అనిపించింది. నా వరకు అయితే తెలుగు ఇండస్ట్రీ కంఫర్ట్. మీ తర్వాత నటించే చిత్రాలు? హిందీ షీర్షా అనే చిత్రంలో నటిస్తున్నాను. కెప్టెన్ విక్రమ్ బాత్రా కార్గిల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. అందులో నేనొక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాను. కరణ్ జోహర్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అని ప్రత్యేకించి ఏమీ లేదు. కాని నేను నటించే పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. కథ నచ్చి నా పాత్రకి ప్రాముఖ్యత ఉంటే ఏ పాత్రలోనైనా నటిస్తా. మీకు తెలుగు రాదు కదా ఏమైనా ఇబ్బంది అయిందా? లేదండి. నా డైలాగ్స్ అన్నీ ముందుగానే న్యారేట్ చేసేవారు. రాము డైలాగ్స్‌కి హెల్ప్ చేశారు. దాని పై చాలా పెద్ద హోమ్ వర్క్ చేసేవాడ్ని భాష గురించి ఎప్పుడూ అంతగా ఇబ్బంది కలగలేదు. -
అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక
చెన్నై : తరువాత బాధ పడదలుచుకోలేదు అంటోంది నటి రష్మిక మందన. అసలీ జాన బాధేంటో చూస్తే పోలా.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌హాట్‌గా వినిపిస్తున్న పేరు రష్మిక. శాండిల్‌వుడ్‌కు చెందిన ఈ అమ్మడి పేరు టాలీవుడ్లో గీతాగోవిందం చిత్రంతో మారుమోగిపోయింది. అంతే అక్కడ క్రేజీ నటి అయిపోయింది. తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంతో మరోసారి లైమ్‌టైమ్‌లోకి వచ్చింది. కారణం గీతాగోవిందం చిత్ర కాంబినేషన్ రిపీట్ కావడం, చిత్రం టాక్‌కు సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించడం, చిత్రంలో ఘాటుఘాటు చుంబన దృశ్యాలు చోటుచేసుకోవడం వంటి అంశాలు రష్మికను మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఇక ఈ బ్యూటీ క్రేజ్ కోలీవుడ్ వరకూ పాకేసింది. ఇప్పటికే నటుడు కార్తీకి జంటగా నటిస్తోంది. ఇక దళపతి విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఆయన 64వ చిత్రంలో ఎదురుచూస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇక తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్న లక్కీ నటి రష్మిక. ఇలా ఒక రేంజ్లో ఖుషీ అవుతున్న ఈ బ్యూటీకి వాయిస్ పెరగడంలో ఆశ్చర్యం ఏం ఉంటుంది. అదే చేస్తోందీ అమ్మడు. అసలేమంటోందీ ముద్దుగుమ్మ చూద్దామా..తమిళంలో కమర్శియల్ చిత్రాల్లో నటించమని చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిని నేను అంగీకరించడం లేదు. సత్తా లేని పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కాలాన్ని వృథాచేయడం నాకిష్టం లేదు. ఇకపోతే ఈగో అన్నది అందరికీ ఉంటుంది. నేను కమర్శియల్ చిత్రాల్లో నటించనని చెప్పడం దర్శకులకు కచ్చితంగా నచ్చదు. అయితే వారికి నా స్థానంలో ఉండి చూస్తే నేనెందుకు అలా అంటున్నానన్నది అర్థం అవుతుంది. నేను బొమ్మను కాను. కమర్శియల్ చిత్రాల్లోనే నటించుకుంటూపోతే నిర్ణీత కాలమే ఇక్కడ నిలబడగలను. ఎన్నేళ్లు ఈ రంగంలో ఉన్నానన్నదానికంటే నేను నటించిన చిత్రాలను చేసి గర్వపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి కమర్శియల్ చిత్రాల్లోనే నటించి ఆ తరువాత కాలంలో బాధ పడదలచుకోలేదు. ఒక చిత్రానికి హీరో, హీరోయిన్ ఇద్దరూ ముఖ్యమే. హీరో, హీరోయిన్ ఒకే లాగా శ్రమించి నటించినా, హీరోయిన్లు ఎక్కువ కాలం నిలబడడంలేదు. హీరోయిన్లు 15 ఏళ్ల పాటు ఈ రంగంలో కొనసాగినా, ఒకే లాగా ఉండదు అని రష్మిక పేర్కొంది. -
‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా కూడా ఏదోరకంగా విజయ్ పేరు సోషల్ మీడియాలో నానుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్న విజయ్.. డియర్ కామ్రేడ్‌తో దక్షిణాదిన పాగా వేసేందుకు స్కెచ్ వేశాడు. అయితే డియర్ కామ్రేడ్ అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్చేసిన విజయ్.. బాలీవుడ్‌లోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. అక్కడ ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయిన ఈ చిత్రంతో షాహిద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. నటనలో మాత్రం విజయ్‌తో పోలిక తప్పలేదు. ఇక షాహిద్ పేరు కంటే బాలీవుడ్లో విజయ్ పేరే ఎక్కువగా వినపడింది. దానికి తోడు విజయ్ కూడా బాలీవుడ్ వెళ్లేందుకు సుముఖత చూపినట్లు తెలుస్తోంది. అందుకే డియర్ కామ్రేడ్ చిత్రాన్ని కరణ్ జోహార్‌కు ప్రత్యేకంగా ప్రదర్శించి బాలీవుడ్లో రీమేక్ చేసేట్లుగా ఒప్పించాడు. ఇక ఈ రీమేక్‌లో విజయ్ నటిస్తున్నాడు అని ప్రచారం జరిగినా.. అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఇలా బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిన విజయ్.. తాజాగా ఓ అభిమానిని ఓదారుస్తూ వైరల్ అయ్యాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ అభిమాని సడెన్‌గా వచ్చి తోయడంతో కిందపడిపోయాడు.. వెంటనే లేచిన విజయ్.. ‘మీరు ప్రేమ చూపిస్తున్నారా? లేక నాపై దాడి చేస్తున్నారా’ అని సరదాగా అడగడం.. అటుపై ఆ అభిమానిని ఏమి అనొద్దని సైగలు చేయడం.. దీంతో విజయ్‌కు తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటడం ఇలా ప్రతీ విషయంలోనూ విజయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌తో తీయబోతోన్న చిత్రంతో బిజీకానున్నాడు. -
‘కామ్రేడ్’ని కాపాడే ప్రయత్నం!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ముఖ్యంగా సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి ఎడిటింగ్ చేసే పనిలో పడ్డారన్న టాక్ వినిపించింది. తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘డియర్ కామ్రేడ్ టీం మీకు థియేటర్లో సర్ప్రైజ్ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మీ సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంతకు మించి నేనేం చెప్పలేను’ అంటూ ట్వీట్ చేశారు రష్మిక. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ తొలి మూడు రోజులు సెలవుల కావటంతో మంచి వసూళ్లు సాధించింది. సోమవారం కూడా తెలంగాణలో బోనాలు సెలవు ఉండటంతో ఇక్కడ మంచి కలెక్షన్లు వచ్చినా ఆంధ్రాలో మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిలో చిత్రయూనిట్ చేసిన మార్పులు సినిమాను ఎంతవరకు కాపాడతాయో చూడాలి. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించాడు. LISTEN!!🔊 We DEAR COMRADE team have a surprise for all of you in the theatres😉 I won't let you know what exactly it is- I want you all to experience it. We've taken into consideration all your feedback and more than this I won't give you any clues. Now go go!! see see!!😉💃🏻 — Rashmika Mandanna (@iamRashmika) July 29, 2019 -
కరెక్ట్ టైమ్‌లో చెప్పిన కథ ఇది
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్, యశ్ రంగినేని నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌తో ప్రదర్శింపబడుతోందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ 21 కోట్లు వచ్చింది. పెట్టినదానికి 80శాతం రికవరీ అయింది. గురువారంతో 100 శాతం రికవరీ అవుతుంది. సినిమాను కొన్న అందరూ లాభాల్లో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఓ 5 శాతం ఎఫెక్ట్ సినిమా మీద ఉంటుంది. ఓపెనింగ్స్ బావున్నాయి. కొంచెం స్లోగా ఉంది అనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. వెంటనే పదమూడు నిమిషాలు తగ్గించాం. క్యాంటీన్ సాంగ్ చాలా పాపులర్ అయింది. దాని రన్‌టైమ్ ఎక్కువైందని తీశాం. ఇప్పుడు కలిపాం. బుక్ మై షోలో కూడా సెకండ్ డేలా బుకింగ్స్ జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళలో కూడా మంచి రన్ ఉంది. సక్సెస్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ ఓ సోషల్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. అమ్మాయిలకు పని చేసే చోట వేధింపులు ఉండటంతో పాటు ఇంట్లో ఒత్తిడి వల్ల నచ్చిన పనిని కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని మా సినిమాలో చూపించాం. ప్రస్తుతం ‘మీటూ’ మూమెంట్ జరుగుతోంది. కరెక్ట్ టైమ్‌లో చెప్పిన కథ ఇది. కొందరు సినిమా ల్యాగ్ ఉంది అంటున్నారు. ట్రిమ్ చేసిన వెర్షన్ చూస్తే చాలా నచ్చుతుంది. ఫ్యామిలీలు, స్త్రీలు, యూత్ అందరికీ నచ్చే సినిమా ఇది. ‘అర్జున్ రెడ్డి’కి ముందు ఓకే చేసిన కథ అయినప్పటికీ కథలో మార్పులు చేయలేదు. ముందు అనుకున్నదాని కంటే పెద్ద స్కేల్లో తీయాల్సి వచ్చింది. విజయ్ తన ఇమేజ్‌ని పట్టించుకోడు. మంచి కథలను చెప్పాలనుకుంటాడు’’ అన్నారు యశ్ రంగినేని. ‘‘విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘హీరో’ సినిమా ఆగిపోలేదు. బైక్ రేసింగ్‌తో కూడుకున్న సినిమా కాబట్టి రేస్ ట్రాక్ మీద నచ్చిన సమయంలో షూట్ చేయడానికి వీలుపడదు. వాళ్లు అనుమతించినప్పుడే షూట్ చేయాలి’’ అన్నారు రవి శంకర్. -
నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక
చెన్నై : నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేం. నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. అత్యుత్సాహం ఒక్కోసారి చిక్కుల్లో పడేస్తుంది. ముఖ్యంగా బహిరంగ వేదికల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే నటి రష్మిక బుక్కయ్యింది. గీతాగోవిందం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ చిత్ర అనూహ్య విజయంతో అనుకోకుండా స్టార్ అయిపోయిన కన్నడ నటి రష్మిక మందనా అన్న విషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాత టాలీవుడ్లో అవకాశాలు వరుసకడుతున్నాయి. గీతాగోవిందం చిత్ర హీరో విజయ్‌దేవరకొండతోనే మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో జత కట్టింది. అంతే కాదు ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో జతకట్టే అవకాశాన్ని కొట్టేసింది. ఇక కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తోంది. ఇలా కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలను దక్కించుకుంటున్న రష్మిక పనిలో పనిగా తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయం అటుంచితే ఈ అమ్మడు విజయ్‌దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఇటీవల తెరపైకి వచ్చింది. మిశ్రమ స్పందనతో చిత్రం ప్రదర్శింపబడుతోంది. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్ కోసం రష్మిక విజయ్‌దేవరకొండ, చిత్ర యూనిట్‌తో కలిసి నాలుగు రాష్ట్రాల్లోనూ చుట్టేసింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నారు. ఏ భాషలో నటించడం కష్టం అనిపిస్తోందన్న మీడియా వాళ్ల ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా కన్నడ భాషలో మాట్లాడి నటించడం కష్టం అనిపిస్తోందని టక్కున చెప్పింది. అంతే బుక్కయ్యిపోయింది. అలా చెప్పి సొంత రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. మాతృభాషను మాట్లాడడం కష్టంగా ఉందంటావా అంటూ కన్నడ సంఘాలు రష్మికపై మండిపడుతున్నారు. అంతే కాదు బాయ్‌కాట్ డియర్ కామ్రేడ్ అంటూ ఈ అమ్మడి చిత్రాలపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీనికి నటి రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే విజయ్‌కు క్రేజ్ ఎక్కువ. అయితే తాజాగా ఓ మహిళా అభిమాని విజయ్ను చూడటంతో ఎమోషన్ అయ్యారు. తన అభిమానాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆనందంతో బోరున విలపించారు. ఇది గమనించిన విజయ్ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన కొద్ది రోజుల క్రితమే జరిగినప్పటికీ.. ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు. విజయ్ తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ ప్రమోషన్లో భాగంగా చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లలో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించారు. అప్పుడే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. -
విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. అయితే వీకెండ్ తరువాత సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందన్న టెన్షన్లో ఉన్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ హీరో నటిస్తున్న తదుపరి చిత్రం ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాల్లో నటిస్తున్నాడు. హీరో సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ను ఢిల్లీలో చిత్రకరించారు. అయితే ఈ సన్నివేశాలపై చిత్ర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో తెరకెక్కించిన రేసింగ్ సీన్స్ ఆకట్టుకునేలా లేకపోవటంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
నా కామ్రేడ్స్ అందరికీ థ్యాంక్స్
‘‘డియర్ కామ్రేడ్’ నాకు చాలా పర్సనల్ ఫిల్మ్. చాలా స్పెషల్ ఫిల్మ్. సంవత్సరం నుంచి మా ఎమోషన్స్ అన్నీ ఇందులో పెట్టాం. బాబీ, లిల్లీ అనే రెండు పాత్రల ప్రయాణం, కలలు, కష్టాలు, వాళ్ల ఫైట్ నాకు పర్సనల్. మా ఫ్రెండ్స్ అందరూ ఊరికే ఏడుస్తున్నావ్ ఏంటి? అని అడుగుతున్నారు. ఈ సినిమా తర్వాత నేను ఎమోషనల్‌గా మారిపోయాను’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్, యష్ రంగినేని నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో నడుస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. మొదటిరోజు 11.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. సోమవారం–మంగళవారంలోపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది’’ అన్నారు. ‘‘యూత్, స్త్రీలు, ఫ్యామిలీ అందరూ ఎంటర్టైనర్ అవుతున్నారు. ఇదే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు యష్. ‘‘సొసైటీలో ఉన్న సీరియస్ ఇష్యూను బాగా డీల్ చేసిన సినిమా ఇది’’ అన్నారు చెర్రీ. ‘‘నిజాయితీతో చేసిన ఈ ప్రయత్నమిది. నిన్న కొన్ని థియేటర్స్ సందర్శించాం. సినిమా పూర్తయిన తర్వాత నిలబడిని చప్పట్లు కొడుతున్నారు. చూసిన వాళ్లందరూ ఎమోషనల్ అవుతున్నారు’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఫస్ట్ నుంచి చెబుతున్నట్టుగానే ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. ‘మేం చాలా కనెక్ట్ అయ్యాం’ అని అంటున్నారు’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘నాకు కలెక్షన్స్ సరిగ్గా అర్థం కావు కానీ మా సినిమాను చాలామంది చూశారు, ఇంత ప్రేమను మాకు అందించారు. అందరికీ థ్యాంక్స్. నాలుగు భాషల్లో ఈ సినిమా చేశాం. థియేటర్స్‌కు ప్రేక్షకుల్ని తీసుకురావడం నా బాధ్యత. చాలా మందికి రీచ్ అయింది. థియేటర్స్‌ను నింపిన నా కామ్రేడ్స్ అందరికీ థ్యాంక్స్. అన్ని రకాల ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటున్నాం. స్లోగా ఉంది అంటున్నారు, టచ్ చేశావ్ అంటున్నారు. ఈ కథను ఇలానే చెప్పాలి. స్లోగా ఉన్నా ఎంజాయ్ చేస్తారు. మా టీమ్‌ను చూసి గర్వంగా ఉంది. అన్నీ కుదిరితే సక్సెస్‌మీట్ కాకినాడలో చేస్తాం’’ అన్నారు విజయ్ దేవరకొండ. -
‘ఎక్కడ మాట్లాడినా ఏడుపొచ్చేస్తుంది’
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు భరత్ కమ్మ, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా పర్సనల్. బాబీ క్యారెక్టర్లో నటించిన తరువాత నేను కూడా చాలా ఎమోషనల్ పర్సన్ అయ్యాను. అందుకే మా తమ్ముడు (ఆనంద్ దేవరకొండ) సినిమా ఫంక్షన్లో కూడా ఏడ్చేశా. ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా ఏడుపొస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. ఈ సినిమాలో చేసిన ఎమోషనల్ సీన్స్, ఆ జర్నీ కారణంగా నేను మారిపోయా. డియర్ కామ్రేడ్ అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించటం ఆనందంగా ఉంది. డియర్ కామ్రేడ్ టీంను మిస్ అవుతున్నా’ అన్నారు.