debt burden
-
ఉచితాలు.. శాపాలు!
ఎన్నికలవేళ అధికార, ప్రతిపక్షనేతలు ‘ఉచితాలు’పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటర్లు కూడా దీర్ఘకాలికంగా ఆర్థిక వెసులుబాటు కోసం ఆలోచించకుండా ఈ ‘ఉచితాలు’వైపే మొగ్గుతున్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి అప్పు చేయాల్సి వస్తోంది. పార్టీలకు అతీతంగా గతంలో కంటే మరింత మెరుగైన ‘ఉచిత’ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మ్యానిఫెస్టో తయారు చేయించుకుని ప్రచారాలకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటికోసం తిరిగి అప్పు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విభిన్న పార్టీలకు చెంది వివిధ రాష్ట్రాల్లో పాగా వేసిన కొన్ని ప్రభుత్వాల ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.హిమాచల్ప్రదేశ్హిమాచల్ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా అప్పు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. దీనికి రూ.95,000 కోట్ల అప్పు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలపాటు మంత్రులు తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. సరైన నిధులులేక ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం సవాలుగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మధ్యప్రదేశ్బీజేపీ గతేడాది రాష్ట్రంలో గెలుపొందడానికి ప్రధాన కారణం ‘లడ్లీ బెహనా’ పథకం అని ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఈ పథకం ప్రకారం వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండి 21-65 ఏళ్లు ఉన్న రాష్ట్ర మహిళలకు నెలకు రూ.1,000 నేరుగా తమ బ్యాంకులో జమ చేస్తారు. దీని అమలుకు ఈ ఏడాది రూ.18,984 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఒక్కనెలలోనే ఈ రాష్ట్రం రూ.10,000 కోట్లు అప్పు చేసింది. గతేడాది మొత్తంగా రూ.76,230 కోట్లు అప్పు పోగైంది. గడిచిన బడ్జెట్ సెషన్లో తెలిపిన వివరాల ప్రకారం మొత్తం రాష్ట్ర అప్పులు రూ.4.18 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యకలాపాల కోసం అదనంగా రూ.94,431 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ మోటార్ల కొనుగోలు కోసం రాయితీ రూపంలో రూ.4,775 కోట్లు చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడితే రూ.100 చెల్లించి బిల్లు మాఫీ చేసుకునే పథకానికి రూ.3,500 కోట్లు వెచ్చించాలి. రైతులు వాడే కరెంటు కోసం రూ.6,290 కోట్లు అవసరం అవుతాయి. బాలికల కోసం చేపట్టిన ‘లడ్లీ లక్ష్మీ’ పథకం కోసం రూ.1,231 కోట్లు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, లోన్ల వడ్డీ చెల్లింపు కోసం రూ.1,17,945 కోట్లు అవసరం. ఈ ఏడాది రాష్ట్ర ద్రవ్యలోటు 4.1 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.కర్ణాటకకర్ణాటకలో కాంగ్రెస్ గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చిలో బోస్టన్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకుని అదనంగా రూ.55 వేలకోట్లు-రూ.60 వేలకోట్లు ఎలా సమకూర్చుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికలవేళ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీల అమలు ప్రస్తుతం ఆర్థికభారంగా మారుతుంది. గతేడాది ఐదు గ్యారంటీలకు రూ.36 వేలకోట్లు కేటాయించారు. ఈసారి దీన్ని రూ.53,674 కోట్లకు పెంచారు. కేవలం ‘గృహలక్ష్మీ’ పథకానికి అందులో సగం కంటే ఎక్కువ అంటే రూ.28,608 కోట్లు కేటాయించారు. పథకాల అమలు, ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ఏడాది కర్ణాటక రూ.1,05,246 కోట్ల అప్పు చేయాల్సి ఉంటుంది.పంజాబ్ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్రంలోని రైతులు, గృహావసరాల కోసం రూ.17,110 కోట్లతో విద్యుత్‌ను అందిస్తోంది. మార్చి 2024 వరకు రాష్ట్ర అప్పులు మొత్తం రూ.3,51,130 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ డేటా తెలిపింది. రాష్ట్ర ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంది.ఇదీ చదవండి: ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఏటా అదనంగా రూ.20,378 కోట్లు అవసరం అవుతాయి. రైతు రుణమాఫీ కోసం రూ.15,470 కోట్లు కావాల్సి ఉంది. మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రూ.3,083 కోట్లు అవసరం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం రూ.1,825 కోట్లు కావాలి. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 హామీ ఇంకా అమల్లోకి రాలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల కోసం రూ.5 లక్షలు-రూ.6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. -
TS: భారమైన క్రెడిట్ కార్డు బిల్లు.. దంపతుల ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్: జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి.. కిస్వా జువెల్లరీ దోపిడీ కేసు కొలిక్కి -
అప్పు ప్రమాదఘంటికలివే..
డబ్బు.. మనిషిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది.. పతాలానికి తోసేస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పుల మూటలు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీతం వస్తున్న వారు నిత్యం ఏదో రూపంలో అప్పులు తీసుకుంటారు. అప్పుల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. అప్పుచేసి ఆ సొమ్మును మరింత పెంచేలా ఎక్కడైనా పెట్టుబడిపెడితే అది మంచి అప్పు. అదే అప్పు విలాసాలకు వాడితే దాన్ని చెడు అప్పు అంటారు. తీసుకునే అప్పుపై సరైన అవగాహన లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి వారు తీసుకున్న అప్పుతో మరింతో లోతుల్లోకి వెళుతున్నామని తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వస్తువలు కొనాలంటే సరిపడా డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటివల్ల ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి. అయితే చాలా మంది ఈజీ ఈఎంఐలు, తగ్గింపులు, సేల్స్ ఆఫర్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కనీస అవసరాలను తీర్చుకోవడానికి తరచు అప్పు తీసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులతోపాటు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లు సైతం క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది తమకున్న అప్పులు తీర్చడానికి క్రెడిట్‌కార్డులను తీసుకుంటుంటారు. కానీ అప్పులు తీర్చడానికి తిరిగి క్రెడిట్ కార్డ్ రూపంతో అధిక వడ్డీలకు అప్పుచేయడం దారుణం. దాంతో ఆ క్రెడిట్ కార్డ్ బకాయిలను సైతం తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితి శ్రుతిమించితే తీసుకున్న అప్పులను రోల్ఓవర్ చేయాడానికి సైతం వెనుకాడరు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో తిరిగి అప్పు పుట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి. ఇదీ చదవండి: ఆగిపోతున్న సరకు రవాణా..! అప్పు తీసుకోడదా..? అంటే తీసుకోవాలి. కానీ అది మన ఆర్థిక పరిధిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ, ఈఎంఐలను లెక్కించేటప్పుడు అన్ని కనీస అవసరాలుపోను జీతం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుమించి దాదాపు ఆరు నెలలకు సరిపడే అత్యవసర నిధిను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రుణభారాన్ని తగ్గించుకునేందుకే ప్రయత్నిస్తున్నాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ద్రవ్య లోటును కట్టడి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భవిష్యత్ తరాలపై రుణాల భారం మోపకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకుంటోందని ఆమె వివరించారు. కౌటిల్య ఆర్థిక సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించుకునేందుకు తోడ్పడే చర్యలన్నింటినీ పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ’దేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలు, అలాగే ద్రవ్య నిర్వహణపరమైన బాధ్యతల గురించి, నేడు తీసుకునే నిర్ణయాల ప్రభావం భవిష్యత్ తరాలపై ఎలా ఉంటుందనే అంశం గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. తదనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే ప్రభుత్వ రుణభారం మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ, దాన్ని కూడా తగ్గించుకునే క్రమంలో మిగతా దేశాలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాయనేది పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. డిజిటల్ ఎకానమీ ద్వారా దేశీయంగా మరింత పారదర్శకత పెరుగుతోందని మంత్రి చెప్పారు. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంలో జన్ ధన్ ఖాతాలు కీలక సాధనాలుగా మారాయని వివరించారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు బోలెడన్ని సందేహాలు వ్యక్తమయ్యాయని, ఆ ఖాతాల్లో పైసా కూడా ఉండకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిర్వహణపరంగా భారమవుతాయనే విమర్శలు వచ్చాయని ఆమె చెప్పారు. అయితే, నేడు జన్‌ధన్ ఖాతాల్లో మొత్తం రూ. 2 లక్షల కోట్ల పైగా బ్యాలెన్స్ ఉందని మంత్రి తెలిపారు. కోవిడ్ పరిస్థితుల్లో నిరుపేదలు ఈ ఖాతాల ద్వారానే ప్రభుత్వం నుంచి నిధులు పొందగలిగారని వివరించారు. ‘ఉగ్ర’ ముప్పును కూడా పరిగణనలోకి తీసుకున్నాకే పెట్టుబడులు.. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంతర్జాతీయంగా ఉగ్రవాద ముప్పు ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వ్యాపారవర్గాలకు నిర్మలా సీతారామన్ సూచించారు. ఉగ్రవాదం ప్రస్తుతం యావత్ ప్రపంచంపైనా ప్రభావం చూపుతోందని, ఏ ఒక్క ప్రాంతమూ మినహాయింపుగా లేదని ఆమె పేర్కొన్నారు. వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భారీ స్థాయి రిస్కులు నెలకొన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. -
ఐపీవోకి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు
బెంగళూరు: మోయలేని రుణ భారం దెబ్బకు పలు వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా ఇది ప్రమాద సంకేతమేనన్నారు. శుక్రవారం బెంగళూరులో మొదలైన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండు రోజుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. మితిమీరిన అప్పులకు కరోనా కల్లోలం వంటివి శ్రీలంక దివాలా తీయడం, పాకిస్తాన్ కూడా అదే బాటన ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి స్థిరత్వంతో కూడిన వృద్ధి బాట పట్టించడం, దానిపై విశ్వాసం పాదుగొల్పడం సంపన్న దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బాధ్యతేనని ఆయన హితవు పలికారు. ‘‘ఇదంత సులభం కాదు. కానీ నిర్మాణాత్మక ప్రయత్నం జరిగి తీరాలి. అయితే కాలానుగుణంగా సంస్కరించుకుని మారడంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వెనకబడటంతో వాటిపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనిపైనా దృష్టి పెట్టాలి’’ అని అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పుల విపత్తునూ సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో పలుచోట్ల భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కనీస సౌకర్యాలకూ నోచుకోక అలమటిస్తున్న దుర్బల ప్రజానీకాన్ని ఆదుకోవడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆశాదీపంగా భారత్: కరోనా కల్లోలం దెబ్బ నుంచి కోలుకోవడానికి వర్ధమాన దేశాలు ఇంకా పోరాడుతూనే ఉన్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత పనితీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. డిజిటల్ కరెన్సీలు, పేమెంట్లు, ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతతో పాటు కీలకమైన పర్యావరణ మార్పుల సమస్యను ఎదుర్కోవడంపై కూడా సదస్సులో చర్చించే అవకాశముంది. వ్యవసాయ కేటాయింపులు ఐదింతలు న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ రంగ వార్షిక బడ్జెట్ కేటాయింపులు 2014తో పోలిస్తే ఐదింతలు పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వం సాగు రంగం పురోగతిపై దృష్టి సారించి, వంటనూనెలు వంటి ఆహార వస్తువుల దిగుమతులను తగ్గించేందుకు కృషి చేస్తోందన్నారు. ‘వ్యవసాయం–సహకారరంగం’పై పోస్ట్–బడ్జెట్ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో నిర్ణయాల సమర్థ అమలుకు సలహాల నిమిత్తం కేంద్రం ఈ వెబినార్లను నిర్వహిస్తోంది. -
ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ స్థలం విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన విశాఖపట్నం యూనిట్లో కార్యకలాపాలను కొనసాగించరాదని సాగర్ సిమెంట్స్ బోర్డు నిర్ణయించింది. నగర పరిధిలోకి ఈ యూనిట్ రావడమే కంపెనీ నిర్ణయానికి కారణం. విశాఖ యూని ట్ 107 ఎకరాల్లో విస్తరించింది. ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ యూనిట్ స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలను చేస్తామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి ఇన్వెస్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో వెల్లడించారు. రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ తాజాగా సాగర్ సిమెంట్స్ పరం అయిన సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ.922 కోట్లు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అమరావతి బెంచ్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. జేపీ గ్రూప్‌నకు చెందిన ఆంధ్రా సిమెంట్స్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లిలో క్లింకర్, సిమెంట్ ప్లాంటు, విశాఖపట్నం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఉంది. -
వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి వాటా
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో ప్రభుత్వం వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. షేరు విలువ రూ. 10 లేదా ఆపై స్థిరత్వాన్ని సాధిస్తే వాటాను పొందనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 10 ముఖ విలువకే ప్రభుత్వానికి వాటాను ఆఫర్ చేసింది. ముఖ విలువకే షేర్లను పొందేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. షేరు ధర రూ. 10 లేదా అపై స్థిరత్వాన్ని సాధించాక టెలికం శాఖ(డాట్) ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి షేరు రూ. 10 దిగువనే కదులుతోంది. తాజాగా 0.5% నీరసించి రూ. 9.70 వద్ద ముగిసింది. జూలైలోనే...: వీఐఎల్‌లో ప్రభుత్వం వాటాను సొంతం చేసుకునేందుకు జూలైలోనే ఆర్థిక శాఖ ఆమోదించింది. రూ. 16,000 కోట్లమేర వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి కేటాయించేందుకు వీఐఎల్ ఇప్పటికే నిర్ణయించుకుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. వెరసి వీఐఎల్‌లో ప్రమోటర్ల వాటా 74.99 శాతం నుంచి తగ్గి 50 శాతానికి పరిమితంకానుంది. ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్ చెల్లింపులకు సంబంధించి వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు టెలికం కంపెనీలకు ప్రభుత్వం అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి జూన్ చివరికల్లా స్థూలంగా రూ. 1,99,080 కోట్ల రుణ భారముంది. -
కంపెనీల సమస్యాత్మక రుణాలు రూ.60 వేల కోట్లు అధికం!
ముంబై: ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రేట్ల విషయంలో మారనున్న ఆర్బీఐ కఠిన వైఖరి, బలహీన రూపాయి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక రుణాలు (రిస్కీ డెట్) రూ.60,000 కోట్ల మేర పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది. కంపెనీల నిర్వహణ లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5 రెట్లకు మించిన మొత్తాన్ని రిస్కీ డెట్‌గా పేర్కొంటారు. తాజా సంక్షోభం, అస్థిరతలతో ఈ తరహా రుణాలు 2022–23 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.6.9 లక్షల కోట్లకు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఇవి రూ.6.3 లక్షల కోట్ల స్థాయిలోనే ఉండేవని తెలిపింది. 1,385 కంపెనీలను ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది. యుద్ధ సంక్షోభం నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గడానికితోడు.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో లాభాల మార్జిన్లు తగ్గిపోతాయని అంచనాకు వచ్చింది. రూపాయి బలహీనత వల్ల రుణాలపై వడ్డీ భారం ఒక శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. కమోడిటీలను మడి సరుకులుగా వినియోగించుకునే కంపెనీల మార్జిన్లు 3 శాతం వరకు క్షీణిస్తాయని అంచనా వేసింది. -
బతుకు బాటలో కలిసి నడిచి.. కష్టంలోనూ ఒక్కటిగా
సాక్షి, శ్రీకాకుళం(పాలకొండ రూరల్): రెక్కల కష్టం నమ్ముకొని జీవించే కుమ్మరి దంపతుల కుటుంబం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. కరోనా కష్ట సమయంలో తాము నమ్ముకున్న ఇటుక బట్టీ నడవక పోవటంతో దొరికిన చోటల్లా అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టినా వారు చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. ఇటుకల బట్టీ సక్రమంగా నడవకపోవటంతో అప్పు ఇచ్చినవారికి ముఖం చూపించలేని పరిస్థితి దాపురించింది. ఏమి చేయాలో పాలుపోక చావే శరణ్యమని భావించారు. గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టారు. బతుకు బాటలో కలిసి నడిచిన వారు కష్టంలోనూ ఒక్కటిగా తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా భార్య మృత్యువుతో పోరాడుతోంది. ఈ సంఘటన పాలకొండ మండలం చిన్నమంగళాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగవరపు రామారావు (47), తవిటమ్మ దంపతులు. వృత్తిరీత్యా కుమ్మరులు కావటంతో గ్రామ సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు గౌరితో కలసి ఉంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇటుకల తయారీ పనులు నిలిచిపోవడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. దీంతో చేసేది లేక తెలిసిన వారివద్ద, దొరికినచోటల్లా అప్పులు చేసి కాలం నెట్టుకొచ్చారు. అయితే పనుల్లేక.. చేసిన అప్పులు తీర్చే దారిలేక లోలోన కుంగిపోయారు. చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అందరితో కలివిడిగా ఉన్న వీరు ఆ రాత్రి గడ్డి నివారణకు వాడే మందును ఇంట్లోనే తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో కుమారుడు గౌరి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లగా తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు. చదవండి: (విషాదం: బిడ్డ మరణాన్ని తట్టుకోలేక...) చుట్టపక్కల వారికి తెలియజేయటంతో వారు వచ్చి రామారావు, తవిటమ్మలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రామారావు మరణించగా తవిటమ్మ మృత్యువుతో పోరాడుతోంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం వైద్యులు శ్రీకాకుళం రిఫర్ చేయగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై సీహెచ్ ప్రసాద్‌లు మంగళవారం చిన్నమంగళాపురం వెళ్లి దర్యాప్తు చేపట్టారు. రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుమారుడు గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తవిటమ్మ వద్ద వీడియో రూపంలో వాంగ్మూలం సేకరించగా అప్పులు బాధలే కారణమని ఆమె తెలిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు తీసుకున్న నిర్ణయంతో చిన్నమంగళాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
బీమా నుంచి ఫ్యూచర్ గ్రూప్ ఔట్!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ తాజాగా బీమా రంగం నుంచి బయటపడే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. సమయానుగుణంగా భాగస్వామ్య సంస్థ(జేవీ) ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో తమకు గల వాటాను విక్రయించాలని భావిస్తోంది. ఈ జేవీలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్‌నకు 49.91 శాతం వాటా ఉంది. దీనిలో 25 శాతం వాటాను జేవీలో మరో భాగస్వామి నెదర్లాండ్స్‌కు చెందిన జనరాలి పార్టిసిపేషన్స్కు విక్రయించనున్నట్లు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. దాదాపు రూ. 1,253 కోట్ల విలువలో నగదు రూపేణా వాటాను విక్రయించనున్నట్లు తెలియజేసింది. -
యస్ బ్యాంక్.. 80 % జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 266 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే లాభం ఏకంగా 80 శాతం ఎగిసింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ గణనీయంగా తగ్గడం ఇందుకు తోడ్పడింది. నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం వృద్ధి చెంది 2.4 శాతానికి పెరిగినప్పటికీ .. రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 31 శాతం క్షీణించి రూ. 1,764 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో రుణ వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్యూ3లో ప్రొవిజనింగ్ రూ. 2,089 కోట్ల నుంచి ఏకంగా 82 శాతం తగ్గింది. రూ. 375 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. భారీ విలువ రుణాలను తగ్గించుకోవడంతో పాటు కార్పొరేట్లు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి గైడెన్స్‌ను 10 శాతానికి కుదించుకున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఇది 15 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్‌గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
సంచలనంగా మారిన రామకృష్ణ సెల్ఫీ వీడియో
-
ఏ భర్తకూడా వినకూడని మాటలు విన్నాను..
సాక్షి, ఖమ్మం: పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన సోదరుడు, అక్క కూడా ఇబ్బందిపెట్టారన్నారు. వనమా.. నా భార్యను హైదరాబాద్ తీసుకొస్తేనే నా సమస్యను పరిష్కారిస్తానని నీచంగా మాట్లాడాడు. వీరివల్ల మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులు వనమా ఇంటిని ముట్టడించారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? -
గతేడాదే కూతురు పెళ్లి.. అప్పు తీర్చలేక
సాక్షి, బల్మూర్(మహబూబ్‌నగర్): వ్యవసాయంతో పాటు కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌కు చెందిన ఏడుపుల లక్ష్మయ్య (45) శివారులో పదెకరాలు కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు. రెండేళ్లుగా సరైన దిగుబడి లేదు. గతేడాదే కూతురు పెళ్లి చేశాడు. సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేయగా ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి -
తనయుడిని హత్య చేసి దంపతుల ఆత్మహత్య
తిరువొత్తియూరు: అప్పుల బాధ కారణంగా కుమారుడిని హత్య చేసి భార్య, భర్త ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త చాకలిపేటలో సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లాకు చెందిన శివాజీ (45), అతని భార్య వనిత (32). వీరికి వెట్రివేల్ (10) అనే కుమారుడు ఉన్నాడు. శివాజీ చాకలిపేటలో వెంకటేశం వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇతను కుటుంబ ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ శివాజీ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. ఆ సమయంలో శివాజి, వనిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్తచాకలిపేట ఇన్స్పెక్టర్ చిదంబర భారతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సృహ తప్పి పడి వున్న బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఘటనలో సహకార సంఘం కార్యదర్శి ఆత్మహత్య పుదుకోట్టై జిల్లా కీరానూరుకు చెందిన నీలకంఠన్ (52). కీరనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో కార్యదర్శిగా పని చేస్తున్నా డు. ఇతను నగలపై రుణాలు ఇవ్వడంలో 1.08 కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. అధికారులు నీలకంఠను అతనికి సహాయపడిన బ్యాంకు సూపర్వైజర్ శక్తివేల్‌ను తాత్కాలికంగా పని నుంచి తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈ క్రమంలో కీరనూరులో నివాసం వుంటున్న నీలకంఠన్ ఇంటిలో బుధవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: Punjab: ఫోన్ సంభాషణల ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కుదరదు! -
వేర్వేరు కుటుంబాలకు చెందిన ఆరుగురు బలవన్మరణం
సాక్షి, చెన్నై(తమిళనాడు): అప్పుల భారంతో వేర్వేరు చోట్ల రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటనల వివరాలు... తంజావూరు జిల్లా రెడ్డియార్ పాళయానికి చెందిన రాజ (38) రియల్ ఎస్టేట్ వ్యాపారి. భార్య కనకదుర్గా(33), కుమారుడు శ్రీవత్సన్ (11) ఉన్నారు. రెండేళ్లుగా వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి కుమారుడిని హతమార్చి, దంపతులు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాణిపేటలో మరో కుటుంబం రాణిపేట జిల్లా కావేరిపాక్కం సుబ్బమ్మాల్ మొదలియార్‌వీధికి చెందిన రామలింగం(66) ఆరోగ్య శాఖలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఓ ప్రైవేటు కళాశాలలో పార్ట్‌టైం తమిళ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్య అనురాధా(57), కుమారులు విష్ణు(25), భరత్(22) ఉన్నారు. విష్ణుకు వివాహం కావడంతో బెంగళూరులో ఉంటున్నాడు. భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. రామలింగం చేపల చెరువు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. ఇచ్చిన వారి నుంచి వేధింపులు అధికం కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదివారం రాత్రి రామలింగం, అనురాధా, భరత్ వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టాటా గూటికి మహారాజా!!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దశాబ్దాల క్రితం తాను నెలకొల్పిన విమానయాన సంస్థను తిరిగి దక్కించుకోవడానికి చేరువలో ఉంది. రుణభారంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్‌గా టాటా గ్రూప్ నిలి్చనట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ (ఏఐఎస్ఏఎం) ఈ బిడ్‌పై ఆమోదముద్ర వేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, టాటా గ్రూప్ దాఖలు చేసిన ఆర్థిక బిడ్లను డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన కార్యదర్శుల కీలక బృందం బుధవారం పరిశీలించిందని వారు వివరించారు. నిర్దేశించిన రిజర్వ్ ధరతో పోల్చి చూసినప్పుడు టాటా గ్రూప్ అత్యధికంగా కోట్ చేసిన సంస్థగా నిలి్చందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రతిపాదనను ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే, ఇటు ఆర్థిక శాఖ అటు టాటా సన్స్ దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఏఐఎస్‌ఏఎంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. మరోవైపు, ఎయిరిండియా ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించేసిందంటూ వచి్చన వార్తలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తోసిపుచ్చారు. ‘ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ అంశంలో ఆర్థిక బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు సరి కావు. ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీడియాకు తెలియజేస్తాం’ అని ట్వీట్ చేశారు. టాటా గ్రూప్‌నకు ఇప్పటికే ఎయిర్‌ఏíÙయా ఇండియాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఇక, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా అనే జాయింట్ వెంచర్ నిర్వహిస్తోంది. 2017 నుంచి అమ్మకానికి ప్రయత్నాలు.. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నాక 2007 నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. 2020 జనవరిలో దీపం జారీ చేసిన ఈవోఐ ప్రకారం 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇందులో దాదాపు రూ. 23,286.5 కోట్ల భారాన్ని కొత్త ఇన్వెస్టరు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతాది ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్) పేరిట ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్‌కి బదలాయిస్తారు. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు దేశీ ఎయిర్‌పోర్టుల్లో 4,400 దేశీ, 1,800 అంతర్జాతీయ సర్వీసుల విమానాల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. అలాగే విదేశీ ఎయిర్‌పోర్టుల్లో 900 పైచిలుకు స్లాట్లు దక్కుతాయి. అలాగే చౌక విమాన సేవల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, దేశీయంగా ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలు లభిస్తాయి. 1932లో మహారాజా ప్రస్థానం ప్రారంభం... మహారాజా మస్కట్‌తో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్‌లైన్స్ గా ప్రారంభమైంది. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సరీ్వసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. సం స్థ ప్రకటనల్లో అప్పటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులు దర్శనమిచ్చేవారు. విమానంలో ప్రయాణించే వారికి ఖరీ దైన షాంపేన్, ప్రసిద్ధ చిత్రకారుడు శాల్వడోర్ డాలీ గీసిన చిత్రాలతో రూపొందించిన పోర్సెలీన్ యాష్ట్రేలు వంటి విలాసాలు అందుబాటులో ఉండేవి. 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్‌కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సరీ్వసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. -
భారత్ విదేశీ రుణ భారం 570 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్ డెట్ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్ డాలర్లకు చేరింది. నాన్ సావరిన్ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. నాన్ సావరిన్ డెట్‌లో వాణిజ్య రుణాలు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, స్వల్ప కాలిక వాణిజ్య రుణ అకౌంట్ వెయిటేజ్ 95 శాతం కావడం గమనార్హం. ఎన్ఆర్ఐ డిపాజిట్లు వార్షికంగా 8.7 శాతం పెరిగి 141.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య రుణాల విలువ 0.4 శాతం తగ్గి 197 బిలియన్ డాలర్లకు చేరింది. స్వల్పకాలిక వాణిజ్య రుణ అకౌంట్ 4.1 శాతం తగ్గి 97.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి నాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది దాటి వాస్తవ మెచ్యూరిటీ ఉన్నవి) 468.9 బిలియన్ డాలర్లు. వార్షికంగా ఈ విభాగంతో 17.3 బిలియన్ డాలర్లు పెరిగింది. -
కరస్పాండెంట్ దంపతులను కాటేసిన అప్పులు
కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): అప్పులు తీర్చే మార్గం కానరాక కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్‌ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన రాధాకృష్ణమూర్తి స్థానిక వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఎనిమిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. ఈయన కుమారుడు సుబ్రమణ్యం ఇదే కళాశాలలో కొంతకాలం కాంట్రాక్ట్ బేసిక్‌పై కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టణంలో 2017 నుంచి సొంతంగా ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 2.50 కోట్ల అప్పులు చేశాడు. కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాల సక్రమంగా నడవకపోవడంతో అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పుదారులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి భార్య స్వగ్రామమైన ఆత్మకూరుకు బయలుదేరారు. అప్పుదారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మార్గమధ్యలో వాట్సాప్ స్టేటస్ పెట్టి మొబైల్ ఫోన్స్ స్విచ్ఆఫ్ చేసుకున్నారు. ఆత్మకూరు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అటుగా వెళుతున్న వ్యక్తులు గమనించి ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మృతి చెందాడు. రోహిణికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది. విషయం తెలియడంతో మృతుని తండ్రి, బంధువులు హుటాహుటినా ఆత్మకూరుకు బయలుదేరి వెళ్లారు. -
భర్త చేసిన పనికి భార్య పుస్తెల తాడు తీసిచ్చింది.. చివరకు..
సాక్షి, నిజామాబాద్: రుణ దాత అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా భార్య మెడలోంచి పుస్తెల తాడు తీసిచ్చింది. అవమానం భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన నవతే నాగరాజు గంజ్‌లో గుమాస్తాగా పనిస్తాడు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రూ. లక్ష 20 వేలు అప్పుగా తీసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా వ్యాపారం సరిగా నడవకపోవడంతో నష్టాల పాలయ్యాడు. అప్పు ఇచ్చిన శ్రీనివాస్ డబ్బులు చెల్లించాలంటూ నాగరాజ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ.. పలుసార్లు ఇంటికి వెళ్లి నిలదీశాడు. నాగరాజు బైక్‌ను కూడా లాక్కొని వెళ్లాడు. బుధవారం శ్రీనివాస్ మరొకరితో కలిసి డబ్బులు చెల్లించాలని నాగరాజును ఇంటి వద్ద నిలదీశాడు. దీంతో నాగరాజు భార్య అఖిల తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన మెడలోని బంగారు గొలుసు పుస్తెల తాడును తీసి శ్రీనివాస్‌కు ఇచ్చింది. అతను పూస్తెలతాడును తీసుకెళ్లాడు. దీంతో నాగరాజు తీవ్ర మనస్తాపం చెంది బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో భార్య అఖిల ఇంటి యజమానిని తీసుకువచ్చి తలుపులు పగులగొట్టించింది. నాగరాజు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఆగ్రహం చెందిన మృతుని బంధువులు అప్పుల పేరిట వేధించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. -
జార్ఖండ్: హేమంత్ సొరేన్ ముందున్న సవాళ్లు
రాంచీ: జార్ఖండ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, పెట్రేగుతున్న మావోయిస్టు కార్యకలాపాలు, వేధిస్తున్న ఆహార కొరత, రాష్ట్రం పేరిట ఇప్పటికే ఉన్న రుణభారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యత కాబోయే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌పై ఉంది. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పెను సవాళ్లతో సతమతం అవుతున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ప్రజల అంచనాలను అందుకుంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. రూ. 85 వేల కోట్ల రుణభారం: జార్ఖండ్ ప్రభుత్వంపై ఇప్పటికే రూ. 85 వేల కోట్ల రుణభారం ఉంది. గతంలో రఘుబర్‌దాస్ ప్రభుత్వం కొలువుదీరక(2014) ముందు రూ. 37,593 కొట్ల అప్పు ఉండేది. అయితే రఘుబర్‌దాస్ ప్రభుత్వం హయాంలో అదికాస్త గణనీయంగా పెరిగింది. దీంతో రుణభారం తగ్గించే పని హేమంత్ సొరేన్ భుజ స్కంధాలపై పడింది. కాగా రాష్ట్రంలోని రైతులు సుమారు రూ. 6వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం రైతుల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పేరు తప్పిస్తారా? దేశంలో పేద రాష్ట్రంగా ముద్ర పడిపోయిన 'బిహార్'.. ఆ ట్యాగ్‌ను 2000 సంవత్సరం నుంచి తొలగించుకొంది. తరువాత నుంచి ఛత్తీస్‌గఢ్ 'పేద రాష్ట్రం'గా కొనసాగుతుంది. పేదరికం నుంచి కాస్త మెరుగుపడుతున్నా.. బీద రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. జార్ఖండ్‌కు ఉన్న 'బీద' రాష్ట్రమనే పేరును తప్పించడం కూడా హేమంత్ సొరేన్ ముందున్న సవాలు. ఆహార కొరత: ఆకలి చావుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఇదే రాష్ట్రంలోని సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏళ్ల అమ్మాయి ఆకలితో మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌కు ప్రతియేటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఖాళీని పూరించడం హేమంత్ సొరేన్ ముందున్న మరో సవాలు. మావోయిస్టుల కట్టడి, శాంతి భద్రతలు: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఇప్పటికే మావోయిస్టులను అదుపు చేస్తున్నా.. ఇంకా 13 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అందులో ఖుంతి, లాతేహర్, రాంచీ, గుమ్లా, గిరిదిహ్, పలాము, గర్హ్వా, సిమ్దేగా, డుమ్కా, లోహర్దగా, బోకారో, ఛత్రా జిల్లాలు ఉన్నాయి. వీటిని మావోయిస్టు రహితంగా మలచడం హేమంత్ సోరెన్‌కు కత్తి మీద సామే. మూకదాడులతో రాష్ట్రానికి మచ్చ: పెరుగుతున్న మూకదాడుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం అపకీర్తిని మూట కట్టుకుంది. ఇక ఆ మచ్చను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ సమస్యను అధిగమిస్తారా? దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో జార్ఖండ్ ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 2018-19లో నిర్వహించిన ఎకనమిక్ సర్వే ప్రకారం, సుమారు లక్షమందికి పైగా యువతకు ప్రభుత్వం ఉపాధి పథకాల కింద శిక్షణ ఇచ్చినా.. ప్రతి పదిమంది యువతలో ఎనిమిది మంది ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగం అనే కష్టతరమైన సవాలును ఎదుర్కొని రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వాగ్దానాలను నిలబెట్టుకుంటారా? 'రాష్ట్రంలో నిరుద్యోగమనేది దీర్ఘకాలిక వ్యాధి, మహమ్మారిలా వ్యాపించి మితిమీరుతుంది' అని హేమంత్ తన ఫేసుబుక్‌లో చెప్పుకొచ్చారు. 'దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.2 శాతం ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం 9.4 శాతంగా ఉంది. రఘుబర్‌దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, సుమారు నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులు అధికారికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. వంద శాతం నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. -
'అప్పులు చేయడం ఆపితే భారం తగ్గుతుంది'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం ఆపితే ప్రజలపై భారం తగ్గుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వెంటనే బెల్ట్ షాపులు, పర్మిట్ రూల్స్, హైవేలపై మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేయడంతో రాష్ట్రం పై భారం పడుతుందని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలపై మద్య రూపంలో రుద్దుతుంది. మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులను మద్యం ద్వారా వచ్చే ఆదాయం వల్ల కేసీఆర్ పాలన చెయ్యాలని చూస్తున్నారు. సామాన్యుల నుంచి మద్యం పై ఏడాదికి దాదాపు 25వేల కోట్లు రాబడి వస్తుందని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలను మద్యానికి బానిసగా చేసేందుకు విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి.ఇప్పటికైనా మద్యంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని భట్టి హెచ్చరించారు. -
ఆర్‌కామ్ ఆస్తుల రేసులో ఎయిర్టెల్, జియో
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్) అసెట్స్‌ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్ డేటా సెంటర్, ఆప్టికల్ ఫైబర్ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థ.. అసలు బిడ్ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. ఆర్‌కామ్ సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్‌ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్‌కామ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) ఆర్‌కామ్ వ్యవహారం చేరింది. ఎన్సీఎల్టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. స్టాక్ .. అప్పర్ సర్క్యూట్.. బిడ్డింగ్ వార్తలతో సోమవారం ఆర్‌కామ్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్ఈలో ఆర్‌కామ్ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది.