Deepak Hooda
-
Deepak Hooda: మన ఇంటికి స్వాగతం.. ప్రేయసితో క్రికెటర్ పెళ్లి(ఫొటోలు)
-
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా స్టార్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడినట్లు తెలిపాడు. సోమవారం(జూలై 15) తమ వివాహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించాడు.తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను దీపక్ హుడా షేర్ చేశాడు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు హృదయాలకు మాత్రమే అర్థమవుతాయి. నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్ హుడా తన శ్రీమతిని ఉద్దేశించి భావోద్వేగ క్యాప్షన్ కూడా జతచేశాడు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తెలిపాడు. తమ బంధం ఈరోజుతో శాశ్వతంగా ముడిపడిపోయిందని.. మనసంతా సంతోషంతో నిండిందని పేర్కొన్నాడు.శుభాకాంక్షల వెల్లువఈ నేపథ్యంలో కొత్త జంటకు క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్, ఖలీల్ అహ్మద్ తదితర భారత క్రికెటర్లతో పాటు మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్), లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. దీపక్ హుడా దంపతులను విష్ చేశారు.అయితే, దీపక్ హుడా తన భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా ఐపీఎల్-2024లో దీపక్ హుడా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.అదే ఆఖరుహర్యానాకు చెందిన దీపక్ హుడా కుడిచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. ఐపీఎల్లో సత్తా చాటిన 29 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2022లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా దీపక్ హుడా టీమిండియాకు చివరిసారిగా ఆడాడు.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఆయా ఫార్మాట్లలో 153, 368 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3, 6 వికెట్లు తీశాడు. చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో! View this post on Instagram A post shared by Deepak Hooda (@deepakhooda30) -
ఐర్లాండ్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఐరీష్‌ను చిత్తు చేసి మెగా ఈవెంట్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 3 పరుగులు సాధిస్తే.. టీ20ల్లో ఐర్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులెక్కుతాడు.ఇప్పటివరకు ఐర్లాండ్‌పై రోహిత్ శర్మ 3 మ్యాచ్‌లు ఆడి 149 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా పేరిట ఉంది. దీపక్ హుడా ఇప్పటివరకు ఐర్లాండ్‌పై 2 మ్యాచ్‌లు ఆడి 151 పరుగులు చేశాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ -
IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రమణ్‌దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో దీపక్ హుడా (8) కొట్టిన షాట్‌ను రమణ్‌దీప్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Ramandeep Singh. 🦅pic.twitter.com/3mhPdFNAJc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024 కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్ (10), కేఎల్ రాహుల్ (39), దీపక్ హుడా (8), స్టోయినిస్ (10) ఔట్ కాగా.. బదోని (27), పూరన్ (2) క్రీజ్‌లో ఉన్నారు. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో లక్నో హ్యాట్రిక్ విజయాలు సాధించి (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. -
దీపక్ హుడా సంచలన ఇన్నింగ్స్.. రికార్డులివే! మాక్స్‌వెల్‌తో పాటు..
Deepak Hooda 180- VHT 2023 semi-final: టీమిండియా బ్యాటర్ దీపక్ హుడా దేశవాళీ వన్డే టోర్నీలో దుమ్ములేపాడు. విజయ్ హజారే ట్రోఫీ-2023 సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు. లక్ష్య ఛేదనలో రెండో బ్యాటర్‌గా తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్ తరఫున లిస్ట్- ఏ క్రికెట్లో లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(123 బంతుల్లో 185 పరుగులు- నాటౌట్) తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అదే విధంగా.. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(220), రవికుమార్ సమర్థ్(192), పృథ్వీ షా(185) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపక్ హుడా చరిత్రకెక్కాడు. మాక్స్‌వెల్‌తో పాటు ఆ జాబితాలో అంతేగాక.. లిస్ట్-ఏ చరిత్రలో ఛేజింగ్‌లో నంబర్ 4లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన నాలుగో క్రికెటర్‌గా దీపక్ హుడా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెప్ మాక్స్వెల్(201*), అఫ్గనిస్తాన్ బ్యాటర్ సమీఉల్లా షెన్వారీ(192), బంగ్లాదేశ్‌కు చెందిన రకీబుల్ హసన్(190) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. హరియాణాతో ఫైనల్లో రాజస్తాన్ అమీతుమీ కాగా దీపక్ హుడా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రాజస్తాన్ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకతో రెండో సెమీఫైనల్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కర్ణాటక నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపక్ హుడా (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాజస్తాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కరణ్ లాంబా (73 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి దీపక్ నాలుగో వికెట్‌కు 255 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో హరియాణాతో రాజస్తాన్ తలపడుతుంది. 1⃣5⃣0⃣ up for Deepak Hooda 👏👏 He brings it up off just 108 balls. He's played some fabulous shots. 👌👌 Follow the match ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/8qJ53nLmA6 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 𝐜𝐫𝐮𝐢𝐬𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 👏👏 A special partnership of 255 between Deepak Hooda (180) & Karan Lamba (73*) helps Rajasthan chase down 283 after being reduced to 23/3 👌 Scorecard ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/CQEIGoErM9 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 -
భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించిన దీపక్ హుడా
కర్ణాటకతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2023 రెండో సెమీఫైనల్లో రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా భారీ సెంచరీతో (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్స్‌కు చేరింది. డిసెంబర్ 16న జరిగే తుది సమరంలో రాజస్థాన్.. హర్యానాతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆరు, ఏడు నంబర్ ఆటగాళ్లు అభినవ్ మనోహర్ (91), మనోజ్ భాండగే (63) రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సమర్థ్ (8), మయాంక్ అగర్వాల్ (13) విఫలం కాగా.. నికిన్ జోస్ (21), శ్రీజిత్ (37), మనీశ్ పాండే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, అరాఫత్ ఖాన్, రాహుల్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్.. ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత వన్‌డౌన్ బ్యాటర్ మహిపాల్ లోమ్రార్ (14) కూడా తక్కువ స్కోర్‌కే ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దశలో బరిలోకి దిగిన దీపక్ హుడా.. కరణ్ లాంబా (73 నాటౌట్) సహకారంతో రాజస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపు ఖాయం అనుకున్న దశలో హుడా డబుల్ సెంచరీ చేరువలో ఔటయ్యాడు. హుడా, కరణ్ చెలరేగడంతో రాజస్థాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, వైశాక్, భాండగే, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు. -
శతక్కొట్టిన దీపక్ హుడా.. చెలరేగిన చాహర్ బ్రదర్స్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. నిన్న (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌ల్లో మయాంక్ అగర్వాల్ (157), దేవ్‌దత్ పడిక్కల్ (71), యుజ్వేంద్ర చహల్ (6/26) వివిధ జట్లపై చెలరేగిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు, రాజస్థాన్ ప్లేయర్స్ దీపక్ హుడా (114, 1/5), దీపక్ చాహర్ (66 నాటౌట్), రాహుల్ చాహర్ (5/34) రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. దీపక్ హుడా, మానవ్ సుథర్ (41), దీపక్ చాహర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో నబమ్ అబో 4 వికెట్లు పడగొట్టగా.. యోర్జుమ్ సెరా 2, అక్షయ్ జైన్, తెచి డోరియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అరుణాచల్ ప్రదేశ్.. రాహుల్ చాహర్, మానవ్ సుథర్ (10-2-36-2), ఖలీల్ అహ్మద్ (7.2-0-44-2), దీపక్ హుడా (2-0-5-1) ధాటికి 46.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. అరుణాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సచిన్ శర్మ (63), అప్రమేయ జైస్వాల్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బోణీ.. జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. మణిపూర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ సరిగ్గా 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ (3/71), రక్షణ్ రెడ్డి (2/28), తనయ్ త్యాగరాజన్ (2/24) రాణించారు. అనంతరం హైదరాబాద్ కేవలం 29.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి నెగ్గింది. హైదరాబాద్ కెపె్టన్ గౌవ్లత్ రాహుల్ సింగ్ (47 బంతుల్లో 70; 13 ఫోర్లు), చందన్ సహని (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (11 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఆంధ్ర పరాజయం.. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర జట్టు పరాజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 47.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (59 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ గోలమారు (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ (78 నాటౌట్; 11 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్‌తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్‌తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్‌దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్‌కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్‌లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా..
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు. ఆ ముగ్గురే అద్భుతంగా ఐపీఎల్-2023లో లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో 8 గెలిచిన లక్నో టాప్-3లో నిలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్‌లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్, నికోలసన్ పూరన్, మార్కస్ స్టొయినిస్లే కీలక పాత్ర పోషించారు. హుడా దారుణంగా మార్కస్ స్టొయినిస్ మొత్తంగా సీజన్లో 15 మ్యాచ్‌లలో 408 పరుగులతో లక్నో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 13 మ్యాచ్‌లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్ 15 మ్యాచ్‌లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో మేయర్స్ 18 పరుగులకే పెవిలియన్ చేరగా.. కృనాల్ 8 రన్స్ మాత్రమే చేశాడు. పాపం స్టొయినిస్ ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్‌కు బలైపోయేలా చేసిన దీపక్ హుడా(15) తాను కూడా రనౌట్ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది. కనీసం వచ్చే సీజన్లో అయినా ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్ షోలో భారత మాజీ బౌలర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో స్టొయినిస్ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్‌లో పూరన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. చదవండి: ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్.. వీడియో వైరల్ 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 -
#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్‌ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. Run out ka Mahual!! Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A — cricketinsideout (@Cricketinout) May 24, 2023 చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా -
పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి దిశగా సాగుతుంది. అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్లు చేజార్చుకుంటున్న లక్నో వరుసగా రెండో సీజన్లోనూ ఎలిమినేటర్‌లోనే ఇంటిబాట పట్టేలా ఉంది. ఇక స్టోయినిస్ రనౌట్ అయిన తీరు అయితే లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో గ్రీన్ వేసిన ఐదో బంతిని స్టోయినిస్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. రిస్క్ అయినా రెండు పరుగులు తీసే అవకాశం ఉండడంతో ఇద్దరు వేగంగానే పరిగెత్తారు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు వస్తున్న యత్నంలో అటు దీపక్ హుడా.. ఇటు స్టోయినిస్ ఇద్దరు బంతిపై దృష్టి పెట్టి తమకు తెలియకుండానే ఒక లైన్లో పరిగెత్తి ఎదురుపడ్డారు. దీంతో మిడిల్పిచ్లోకి రాగానే ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పటికే బంతిని అందుకున్న టిమ్ డేవిడ్ నేరుగా ఇషాన్ కిషన్‌కు త్రో వేయడం.. వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ స్టోయినిస్ బంతిపై దృష్టి పెట్టకుండా పరుగు తీసి ఉంటే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో. The collision sums up the game for LSG😵#MarcusStoinis #LSGvsMI #IPL2023 #Cricket pic.twitter.com/kMejyL51Jy — Wisden India (@WisdenIndia) May 24, 2023 When Cricketers turn into Actors 😂#LSGvMI #owned #fixing #runout #stoinis #MumbaiIndians #LucknowSuperGiants pic.twitter.com/wOmYcjNO9J — Sai Teja Kolagani (@SaitejaKolagani) May 24, 2023 చదవండి: ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు -
'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్'
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఐదు పరుగులు మాత్రమే చేసి బెహండార్ఫ్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన హుడా 6.9 సగటుతో కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా ఫామ్‌లో లేని ఆటగాడు అసలు జట్టులో ఆడడమే వ్యర్థం. అలాంటిది కైల్ మేయర్స్ లాంటి స్టార్ ఓపెనర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసి అతని స్థానంలో దీపక్ హుడాకు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. అసలు కృనాల్ పాండ్యా ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది. వాస్తవానికి కైల్ మేయర్స్ ఈ సీజన్లో మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేసిన మేయర్స్ ఖాతాలో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. మేయర్స్ జోరుతో డికాక్ తుదిజట్టులోకి రాలేకపోయాడు. అయితే కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడంతో డికాక్‌కు అవకాశం వచ్చింది. ఇద్దరు కలిసి లక్నోకు రెండు మ్యాచ్‌ల్లో మంచి శుభారంబాలు అందించారు.ప్లేఆఫ్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మేయర్స్‌ను పక్కనబెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతనికి గాయం అనుకున్నా.. మరి కృనాల్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేయడమేంటని వాపోయారు. ఈ నేపథ్యంలో పలు చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. ఐపీఎల్లో 10 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడి అత్యంత చెత్త బ్యాటింగ్ యావరేజ్ మూటగట్టుకున్న ఆటగాడిగా హుడా నిలిచాడు. హుడా ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 6.90 సగటు నమోదు చేశాడు. హుడా తర్వాత నికోలస్ పూరన్ 2021లో 7.73, 2016లో మళ్లీ దీపక్ హుడా 10.29, 2021లో ఇయాన్ మోర్గాన్ 11.08 సగటు నమోదు చేశారు. ఇక ఐపీఎల్లో దీపక్ హుడా తను ఎదుర్కొన్న తొలి 10 బంతుల వ్యవధిలో ఓటవ్వడం ఇది ఏడోసారి.. ఈ క్రమంలో సాహాతో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆండ్రీ రసెల్, రోహిత్ శర్మ, సునీల్ నరైన్‌లు ఆరేసి సార్లు ఔటయ్యారు. Two in two for Behrendorff 🔥 Deepak Hooda fails yet again!#LSGvMI #IPL2023 #LucknowSuperGiants pic.twitter.com/8bkggkEvTK — OneCricket (@OneCricketApp) May 16, 2023 Ireland basher Deepak hooda in IPL 2023 Inning - 11 Run - 69 Average - 6 🤢 Strike rate - 89 🤧 this fraud played ahead of Shreyas Iyer in T20 worldcup 😶 pic.twitter.com/JjZ8ONzaMD — , (@AltofLeg) May 16, 2023 చదవండి: గుజరాత్ గెలిచినా.. నెహ్రాలో కనిపించని సంతోషం -
అతడిని ఎందుకు బ్యాటింగ్‌కు పంపారో తెలియదు? లక్నో నిర్ణయంపై సెహ్వాగ్ ఫైర్!
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో లక్నో పరాజయం పాలైంది. 228 పరుగల భారీ లక్క్ష్య ఛేదనలో లక్నోకు ఓపెనర్లు డికాక్, కైల్ మైర్స్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. అయినప్పటికీ మిడిలార్డర్లో బ్యాటర్లు రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకే లక్నో పరిమితమైంది. ఇక లక్నో ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వాఖ్యలు చేశాడు. లక్నో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే పరాజయం పాలైంది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. దీపక్ హుడాకు బదులుగా మూడో స్థానంలో ఇన్-ఫామ్ బ్యాటర్‌ను పంపి ఉండాల్సిందని సెహ్వాగ్ తెలిపాడు. "10 ఓవర్లకు లక్నో కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 102 పరుగులతో పటిష్టంగా కన్పించారు. ఇటువంటి స్థితిలో ఉన్న లక్నో ఇంత భారీ తేడాతో ఓడిపోతుందని అస్సలు ఊహించలేదు. మొదటి వికెట్ తర్వాత ఫామ్‌లో ఉన్న బ్యాటర్ రావల్సింది. పూరన్, మార్కస్ స్టోయినిస్, కెప్టెన్ కృనాల్ పాండ్యా వచ్చినా బాగుండేది. అదే విధంగా వారి ఆఖరి మ్యాచ్‌లో చెన్నైపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ బదోని అయినా పంపాల్సింది. కానీ లక్నో మాత్రం వీరివ్వరూ కాకుండా దీపక్ హుడాను బ్యాటింగ్‌కు వచ్చాడు. అస్సలు హుడాను ఎందుకు పంపారో ఆర్ధం కావడం లేదు. అదే వాళ్ల కొంపముంచింది" అని క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ పేర్కొన్నాడు. చదవండి: WTC FInal 2023: రుత్‌రాజ్ గైక్వాడ్‌కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో! -
LSG Vs RCB: ఎందుకు వస్తున్నాడో తెలియదు..చెత్త బ్యాటింగ్! ఇంకా జట్టులో అవసరమా?తీసిపడేయండి
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. లక్నో కేవలం 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో దీపక్ హుడా క్రీజులో వచ్చాడు. ఈ సమయంలో ఎంతో బాధ్యతయుతంగా ఆడిల్సిన అతడు.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో మాత్రం హుడా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. 17, 2, 7, 9, 2, 2, 2, 11, 1 ఇవి అతడు తన ఆఖరి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు. ఇక వరుసగా విఫలమవుతున్నప్పటికీ అతడికి అవకాశం ఇస్తున్న లక్నో మేనెజ్మెంట్పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చెత్త ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇంకా జట్టులో చోటు అవరసరమా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి కొంత మంది హుడా తప్ప ఇంకా ఎవరూ జట్టులో లేరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. చదవండి: #Kohli Vs Naveen-ul-Haq: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్ -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్‌ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్‌ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్‌సెంచరీ), వన్ డౌన్లో సన్‌రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్‌ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్‌లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి..
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి హుడా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదుర్కొన్న దీపక్.. కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన హుడా 6.50 సగటుతో కేవలం 39 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 17 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉన్నాయి. గతేడాది సీజన్లో మాత్రం హుడా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో మాత్రం తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హుడా నెటిజన్లు మండిపడుతున్నారు. అదే విధంగా వరుసగా విఫలమవతున్నప్పటికీ హుడాకు.. లక్నో ఎందుకు ఛాన్స్‌లు ఇస్తుందో ఆర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది.. అతడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ప్రతీ మ్యాచ్‌లో ఒకటే ఆటతీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ రాయల్స్‌పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం సాధిచింది. ఈ ఏడాది సీజన్లో లక్నోకు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: Sanju Samson: 'గెలవాల్సిన మ్యాచ్‌ను పోగొట్టుకున్నాం.. ఇదో గుణపాఠం' #KLRahul: 'డికాక్‌ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' -
Ind Vs SL: హుడా.. మరీ ఇంత అసభ్యంగా మాట్లాడతావా? ఇది ఊహించలేదు!
India vs Sri Lanka, 1st T20I- Deepak Hooda: స్వదేశంలో.. కొత్త సంవత్సరం శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్... రాణిస్తారనుకున్న వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడం.. 11–15 ఓవర్ల మధ్య కేవలం 26 పరుగులే! అప్పటికే నాలుగు వికెట్లు చేజారాయి.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకుంటాడనుకుంటే.. 29 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌ను దిల్షాన్ మధుషంక పెవిలియన్‌కు పంపాడు. హుడా, అక్షర్ సూపర్ అప్పటికి టీమిండియా స్కోరు 94/5. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్పిన్ ఆల్‌రౌండర్లు దీపక్ హుడా, అక్షర్ పటేల్ కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 23 బంతుల్లో హుడా 41 పరుగులతో, 20 బంతుల్లో 31 పరుగులతో అక్షర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 162 పరుగుల స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంక ఆఖర్లో తడబడటంతో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ హుడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవసరమైన సమయంలో జట్టును ఆదుకుని అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. That's that from the 1st T20I.#TeamIndia win by 2 runs and take a 1-0 lead in the series. Scorecard - https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/BEU4ICTc3Y — BCCI (@BCCI) January 3, 2023 మరీ ఇంత నీచంగా మాట్లాడతావా? అయితే, అదే సమయంలో అంపైర్‌తో అనుచిత ప్రవర్తన కారణంగా దీపక్ హుడాపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదని, అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఇదే నేర్పించారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో కసున్ రజిత ఐదో బంతిని అవుట్‌సైడ్ దిశగా వేయగా.. తొలుత షాట్ ఆడాలనుకున్న హుడా.. దానిని వదిలేశాడు. ఈ బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటిస్తాడనుకున్నాడు. కానీ అలా జరుగలేదు. అప్పటికే లో స్కోరింగ్ (133-5)నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న హుడా.. అంపైర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడాడు. అతడితో వాదనకు కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో హుడా ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు మాత్రం అంపైర్ ఇందుకు అర్హుడే అంటూ విపరీత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్‌ను కూడా! Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు.. పీలే అంత్యక్రియలు పూర్తి Deepak Hooda abused the umpire for not giving wide 😂 he said 'BKL' . Man is turning furious in every way #INDvSL pic.twitter.com/COV1IArJ0f — Akshat (@AkshatOM10) January 3, 2023 -
విజయంతో మొదలు...
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని టీమిండియా కొత్త ఏడాదిని విజయంతో మొదలు పెట్టింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైనా చివరకు ఉత్కంఠను అధిగమించి దానిని కాపాడుకోగలిగింది. ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సిన లంక సింగిల్ మాత్రమే తీయడంతో గెలుపు టీమిండియా పరమైంది. బ్యాటింగ్‌లో దీపక్ హుడా ఆదుకోగా, తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన శివమ్ మావి ఓవర్‌కు ఒక్కో వికెట్ చొప్పున నాలుగు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముంబై: శ్రీలంకతో టి20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచి 1–0తో ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ హుడా (23 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (20 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం లంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షనక (27 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, శివమ్ మావి (4/22) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రెండో టి20 రేపు పుణేలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... రజిత వేసిన తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టగా, మొత్తం 17 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లంక బౌలర్లు చక్కటి బంతులతో భారత్‌ను కట్టిపడేశారు. అరంగేట్ర మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ (7) విఫలం కాగా, సూర్యకుమార్ (7), సంజు సామ్సన్ (5) విఫలమయ్యారు. పవర్‌ప్లేలో జట్టు 41 పరుగులకే పరిమితమైంది. మరోవైపు రజిత ఓవర్లోనే వరుస బంతుల్లో 6, 4 కొట్టిన కిషన్ మళ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. 11–15 ఓవర్ల మధ్య 26 పరుగులే చేయగలిగిన భారత్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్ కూడా చేజార్చుకుంది. అయితే చివర్లో హుడా దూకుడు టీమిండియాకు మెరుగైన స్కోరు అందించింది. తీక్షణ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన హుడా... హసరంగ, రజిత ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. మదుషంక ఓవర్లో అక్షర్ కూడా సిక్స్, ఫోర్‌తో తన వంతు సహకారం అందించాడు. హుడా, అక్షర్ ఆరో వికెట్‌కు అభేద్యంగా 35 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. షనక మినహా... తన తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే వికెట్‌తో మావి ఆకట్టుకున్నాడు. నిసాంక (1)ను బౌల్డ్ చేసిన అతను, తన తర్వాతి ఓవర్లో ధనంజయ (8)ను వెనక్కి పంపాడు. మొదటి 6 ఓవర్లలో లంక 32 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయిన లంక సగం ఓవర్లు ముగిసేసరికి 66 పరుగులకే పరిమితమైంది. అయితే కెప్టెన్ షనక, హసరంగ దూకుడుతో జట్టు కొంత పోరాడగలిగింది. చహల్ ఓవర్లో హసరంగ వరుసగా రెండు సిక్సర్లు బాదగా, హర్షల్ ఓవర్లో షనక 6, 4 కొట్టాడు. అయితే 21 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో షనకను ఉమ్రాన్ అవుట్ చేయడంతో లంక గెలుపు ఆశలు కోల్పోయింది. మావి, గిల్ అరంగేట్రం తొలి టి20 ద్వారా భారత్ ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అర్‡్షదీప్ అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో పేసర్ శివమ్ మావి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌తో శుబ్‌మన్ గిల్ కూడా అంతర్జాతీయ టి20ల్లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటికే 13 టెస్టులు, 15 వన్డేలు ఆడిన గిల్‌కు ఇదే తొలి టి20 మ్యాచ్. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) ధనంజయ (బి) హసరంగ 37; గిల్ (ఎల్బీ) (బి) తీక్షణ 7; సూర్యకుమార్ (సి) రాజపక్స (బి) కరుణరత్నే 7; సామ్సన్ (సి) మదుషంక (బి) ధనంజయ 5; హార్దిక్ (సి) మెండిస్ (బి) మదుషంక 29; హుడా (నాటౌట్) 41; అక్షర్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–46, 4–77, 5–94. బౌలింగ్: రజిత 4–0–47–0, మదుషంక 4–0–35–1, తీక్షణ 4–0–29–1, కరుణరత్నే 3–0–22–1, ధనంజయ 1–0–6–1, హసరంగ 4–0–22–1. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) మావి 1; మెండిస్ (సి) సామ్సన్ (బి) హర్షల్ 28; ధనంజయ (సి) సామ్సన్ (బి) మావి 8; అసలంక (సి) కిషన్ (బి) ఉమ్రాన్ 12; రాజపక్స (సి) హార్దిక్ (బి) హర్షల్ 10; షనక (సి) చహల్ (బి) ఉమ్రాన్ 45; హసరంగ (సి) హార్దిక్ (బి) మావి 21; కరుణరత్నే (నాటౌట్) 23; తీక్షణ (సి) సూర్యకుమార్ (బి) మావి 1; రజిత (రనౌట్) 5; మదుషంక (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 160. వికెట్ల పతనం: 1–12, 2–24, 3–47, 4–51, 5–68, 6–108, 7–129, 8–132, 9–159, 10–160. బౌలింగ్: హార్దిక్ 3–0–12–0, శివమ్ మావి 4–0–22–4, ఉమ్రాన్ 4–0–27–2, చహల్ 2–0–26–0, హర్షల్ 4–0–41–2, అక్షర్ 3–0–31–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దీపక్ హుడా, అక్షర్ సూపర్ ఇన్నింగ్స్.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు
ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పర్వాలేదనిపించింది. దీపక్ హుడా(41), ఇషాన్ కిషన్(37), అక్షర్ పటేల్(31) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నస్టానికి 162 పరుగులు చేసింది. కాగా హుడా, అక్షర్ పటేల్ కలిసి 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక టీ20లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్(7) నిరాశపరిచాడు. అదే విధంగా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(7) కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 29 పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో మధుషంక, థీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలా వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు? -
శతక్కొట్టిన దీపక్ హుడా.. 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో..!
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో టీమిండియా పరిమిత ఓవర్ల బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ సాయంతో 90 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. కేరళతో ఇవాళే (డిసెంబర్ 20) మొదలైన మ్యాచ్‌లో రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హుడా (187 బంతుల్లో 133; 14 ఫోర్లు, సిక్స్) సెంచరీతో విరుచుకుపడ్డాడు. గత కొంతకాలంగా టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో చెలరేగిపోతున్న ఈ ఇద్దరూ.. రంజీల్లోనూ తమ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. సూర్యకుమార్, దీపక్ హుడా రాణించడంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించాయి. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. హూడా సెంచరీతో, యశ్ కొఠారీ (58), సల్మాన్ ఖాన్ (62 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 2 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ థంపి, ఫజిల్ ఫనూస్, సిజోమోన్ జోసఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తొలి ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 457 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ (90) పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. యశస్వి జైస్వాల్ (162), కెప్టెన్ అజింక్య రహానే (139 నాటౌట్) సెంచరీలతో విజృంభించారు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీకేయ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా..
India tour of New Zealand, 2022 : న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా విస్మయం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని.. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని విమర్శించాడు. తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు విమర్శలు చేశాడు. దీపక్ బౌలింగ్ ఆప్షన్ కాదు! కాగా కివీస్‌తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్ సంజూ శాంసన్, బౌలర్ శార్దూల్ ఠాకూర్లను ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ స్థానంలో దీపక్ హుడా, శార్దూల్ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో చర్చలో పాల్గొన్న ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగడం మనం చూశాం. దీపక్ హుడాను బౌలింగ్ ఆప్షన్‌గా తీసుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. నిజానికి అతడు వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్లు తీసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కదా! నిజానికి వాళ్లకు దీపక్ హుడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావొచ్చు. కానీ మరీ అంత గొప్ప ఆల్‌రౌండర్ ఏమీ కాదు. చహర్ బెటర్.. అయినా శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్‌లో బాగా ఆడలేదని కాదు.. అయితే తనకంటే దీపక్ చహర్ బెటర్. అయినా మొదటి మ్యాచ్‌లో చహర్‌ను కాదని ఠాకూర్‌ను ఆడించారు. కానీ.. ఆ మరుసటి మ్యాచ్‌కే ఠాకూర్‌ను తప్పించారు. ఇది సరికాదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్ గురించి స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను సెలక్టర్‌గా ఉంటే.. సంజూను కాదని హుడానే ఆడించేవాడిని. హుడా కోసం సంజూను బలి చేయాలా? అయితే, ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా మాత్రం కాదు’’ అంటూ హుడాకు మద్దతుగా నిలవడం గమనార్హం. అయితే, చర్చలో భాగంగా ఇందుకు స్పందించిన మరో మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్.. ‘‘ఆశిష్ అన్నట్లు హుడాను బ్యాటర్‌గా ఎంపిక చేయడం వరకు ఒకే! బౌలింగ్ ఆప్షన్‌గా కూడా వాడుకోవడం మంచి విషయమే. హుడా తుది జట్టులోకి రావడం కోసం మరొకరిని పక్కన పెట్టడం సరికాదు. నిజానికి, సంజూ శాంసన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడేమో ఇలా ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు’’ అని సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కావాలనే చేశారు! అదేం కాదు.. మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్ 36 పరుగులతో రాణించాడు. అయితే, గత కొంతకాలంగా విఫలమవుతున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం మరోసారి తక్కువ స్కోరు(15)కే పెవిలియన్ చేరాడు. దీంతో సంజూను వివక్షపూరితంగానే పక్కన పెట్టారంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేశారు. ఇక ఈ మ్యాచ్ వర్షార్పణమైన తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆరో బౌలర్ అవసరమైనందు వల్లే సంజూకు బదులు హుడాను తీసుకున్నామని తెలిపాడు. అదే విధంగా పిచ్ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించి ఠాకూర్‌ను తప్పించి చహర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. సంజూ అభిమానులు మాత్రం స్పిన్ బౌలింగ్ చేయగల హుడాను తీసుకున్నప్పటికీ.. వికెట్ కీపర్‌గా పంత్‌ను కాదని శాంసన్‌కు అవకాశం ఇవ్వొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..? IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
NZ vs IND: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. పంత్‌కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హామిల్టన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే హామిల్టన్‌కు చేరుకున్న ధావన్ సేన నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. ఇక తొలి వన్డేలో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. తొలి పవర్ ప్లేలో భారత బౌలర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పంత్‌కు నో చాన్స్.. ఇక కీలకమైన రెండో వన్డేలో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న పంత్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఒక వేళ పంత్ మ్యాచ్‌కు దూరమైతే ధావన్ డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా తొలి వన్డేలో దారుణంగా విఫలమైన యుజువేంద్ర చాహల్ స్థానంలో చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా తొలి వన్డేలో చాహల్ తన 10 ఓవర్ల కోటాలో వికెట్లు ఏమీ సాధించకుండా 67 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు దీపక్ చాహర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. వర్షం ముప్పు భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం హామిల్టన్‌లో 91 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది చదవండి: Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు! -
దీపక్ హుడా సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 65 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 126 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపక్ హుడా నాలుగు వికెట్లతో చెలరేగగా.. చాహల్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో విలియమ్సన్ఒక్కడే 61 పరుగులతో రాణించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. దీపక్ హుడా అరుదైన రికార్డు ఇక నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ హుడా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన హుడా 4వికెట్లు పడగొట్టి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. చదవండి: IND vs NZ: పాపం శ్రేయస్ అయ్యర్.. అసలు ఊహించి ఉండడు! వీడియో వైరల్ -
T20 WC: 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. గట్టి సవాల్! ఎట్టకేలకు టీమిండియా..
T20 World Cup 2022 India First Practice Match- Ind Vs WA XI: వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ అర్ధ శతకంతో రాణించగా.. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. దీంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా పెర్త్ వేదికగా ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్ చుక్కలు చూపించారు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసే సరికి కేవలం 29 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో కూరుకుపోయిన జట్టును సామ్ ఫానింగ్ ఆదుకున్నాడు. 59 పరుగులు సాధించి టీమిండియాకు సవాల్ విసిరాడు. అయితే, మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 145 పరుగులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా కథ ముగిసింది. వారెవ్వా.. అర్ష్‌దీప్ సింగ్ భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు(3/6), చహల్‌కు రెండు(2/15), భువనేశ్వర్ కుమార్‌కు రెండు(2/26) వికెట్లు, హర్షల్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి. 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడంటూ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మరోవైపు భువీ సైతం ఫామ్‌లోకి వచ్చాడని.. అసలైన పోరులో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. వాళ్లిద్దరూ తుస్సుమన్నారు.. అయినా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(3)కు జోడీగా రిషభ్ పంత్(9) ఓపెనర్‌గా వచ్చాడు. వీరిద్దరు పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ దీపక్ హుడా 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. సూర్య నాలుగో స్థానంలో వచ్చి 35 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. హార్దిక్‌పాండ్యా 27, దినేశ్‌కార్తిక్ 19(నాటౌట్), అక్షర్ పటేల్ 10, హర్షల్ పటేల్ 5 పరుగులు చేశారు. కాగా అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఐసీసీ ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. టీమిండియా వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్: డీ ఆర్సీ షార్ట్, ఆరోన్ హార్డీ, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(వికెట్ కీపర్), అష్టన్ టర్నర్(కెప్టెన్), సామ్ ఫానింగ్, హమీష్ మెకెంజీ, జై రిచర్డ్సన్, ఆండ్రూ టై, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, మాథ్యూ కెల్లీ, నిక్ హాబ్సన్. చదవండి: Ind Vs SA: టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు.. ఇతర జట్లకు అందనంత దూరంలో! ఇక అయ్యర్.. టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి T20 WC 2022 Final: ఈసారి ఫైనల్లో వెస్టిండీస్‌తో పోటీపడేది ఆ జట్టే! ఇంకా.. That's that from the practice match against Western Australia.#TeamIndia win by 13 runs. Arshdeep Singh 3/6 (3 overs) Yuzvendra Chahal 2/15 Bhuvneshwar Kumar 2/26 pic.twitter.com/NmXCogTFIR — BCCI (@BCCI) October 10, 2022 -
T20 WC 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు..
T20 World Cup 2022- Indian Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం సెప్టెంబరు 12న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. నలుగురిని స్టాండ్ బైగా ఎంపిక చేసింది. ఇక వరల్డ్‌కప్ కంటే ముందు రోహిత్ సేన స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అయితే, 2-1తో ట్రోఫీ కైవసం చేసుకున్నప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలు కలవరపెట్టే అంశాలుగా పరిణమించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైన కొంతమంది క్రికెటర్ల ఆట తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ ఎందుకు సెలక్ట్ చేసిందా? అని చాలా మంది పెదవి విరుస్తున్నారు. యజువేంద్ర చహల్ టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అతడు 9.12 ఎకానమీతో బౌలింగ్ చేసి.. రెండే రెండు వికెట్లు తీశాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీలోనూ సూపర్-4లో శ్రీలంకతో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం మినహా తన స్థాయికి తగ్గట్లు రాణించలేక నిరాశపరిచాడు యుజీ. ముఖ్యంగా స్లోగా బంతులు వేయడంలో విఫలమవుతున్నాడు. సమకాలీన లెగ్ స్పిన్నర్లు ఆస్ట్రేలియాకు చెందిన ఆడం జంపా, అఫ్గనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ మాదిరి రాణించలేకపోతున్నాడు. దీంతో.. అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయిని ప్రధాన జట్టుకు ఎంపిక చేసినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అనుభవం దృష్ట్యా యుజీకి ఓటు వేయడమే సబబు అంటున్నారు అతడి ఫ్యాన్స్. భువనేశ్వర్ కుమార్ టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తేలిపోయాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ స్పీడ్‌స్టర్ 91 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది వరకు టీమిండియా టీ20 అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనసాగిన ఈ స్వింగ్ సుల్తాన్.. గాయం కారణంగా కొన్నిరోజులు జట్టుకు దూరమయ్యాడు. అయితే, తిరిగి జట్టులోకి వచ్చినా అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్‌ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేక విఫలమవుతున్నాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ, ఆసీస్‌తో సిరీస్‌లో డెత్ ఓవర్లలో అతడి వైఫల్యం కనబడింది. నకుల్ బాల్స్, కట్టర్లు వేయడంలో దిట్ట అయిన భువీ ప్రస్తుతం ఫామ్‌లేమితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వెటరన్ పేసర్‌కు బదులు స్టాండ్ బైగా ఉన్నా దీపక్ చహర్‌ను ఎంపిక చేసినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపక్ హుడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న దీపక్ హుడా.. ఆసీస్‌తో సిరీస్‌కు సైతం ఎంపికయ్యాడు. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. దీంతో.. ప్రపంచకప్ స్టాండ్ బై ప్లేయర్లలో ఒకడిగా ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో దీపక్ స్థానాన్ని భర్తీ చేశారు. నిజానికి దీపక్ టాపార్డర్‌లో మెరుగ్గా రాణించగలడు. అవసరమైనపుడు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్ ఆరంభ సమయానికి అతడు అందుబాటులో ఉన్నా.. అతడు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా.. ఈ ఐదుగురు కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. కాబట్టి టాపార్డర్‌లో దీపక్ హుడాతో పనిలేదు. ఇక బౌలింగ్ కారణంగా ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనుకున్నా.. అక్షర్ పటేల్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అదీ అసాధ్యంగానే కనిపిస్తుంది. అందుకే హుడాను ప్రపంచకప్‌నకు సెలక్ట్ చేసి కూడా పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బ్యాకప్ బ్యాటర్ కావాలనుకుంటే లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్ లేదంటే విలక్షణమైన బ్యాటర్‌గా పేరొందిన సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినా బాగుండేదంటున్నారు విశ్లేషకులు. జట్టులో మార్పునకు సమయం ఉన్న తరుణంలో ఇప్పటికైనా మార్పులుచేర్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: Sandeep Lamichhane: స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు