Dementia
-
మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ న్యూజెర్సీ విభాగం తాజాగా మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సును, డిమెన్షియాపై సర్వే లను నిర్వహించింది. తొలుత నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల రట్గర్స్ యూనివర్సిటీ క్లినికల్ ఇన్స్టక్టర్, పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ లను సభకు పరిచయం చేశారు. ముఖ్యంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యార్ధుల మానసిక సమస్యలను ఎలా కనిపెట్టాలి.? ఎలా పరిష్కరించాలి.? ఒత్తిడిని జయించేలా వారికి ఎలా దిశా నిర్దేశం చేయాలనే అంశాలపై ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. నమి న్యూజెర్సీ ప్రోగ్రామ్ మేనేజర్, సమాజ్ స్టేట్ వైడ్ కో ఆర్డినేటర్, మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ఈ సదస్సులో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై చక్కటి అవగాహన కల్పించారు. డిమెన్షియాపై సర్వేకు నాట్స్ మద్దతుఆసియన్ అమెరికన్ డిమెన్షియా బాధితుల సంరక్షణ ఎలా ఉంది..? డిమెన్షియా బాధితులను సంరక్షించే వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.? ముఖ్యంగా మానసికంగా వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.? అనే అంశాలపై చాంబర్లిన్ విశ్వవిద్యాలయం మరియు మెర్సర్ కౌంటీ కమ్యూనిటీ కళాశాలల విజిటింగ్ ప్రొఫెసర్, రట్గర్స్ యూనివర్సిటీ కి చెందిన పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే ద్వారా డిమెన్షియా బాధితులకు, వారి సంరక్షకులు ఎదుర్కొనే సమస్యలపై కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి నాట్స్ కూడా తన వంతు మద్దతు, సహకారం అందించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, న్యూ జెర్సీ ఛాప్టర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు,రామకృష్ణ బోను, సుధ బిందు, నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ టీమ్ సభ్యురాలు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి పులిపాక తదితరులు ఈ సమావేశం నిర్వహణ బాధ్యత వహించారు. తెలుగు లలిత కళాసమితి ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఊటుకూరు, రాణి ఊటుకూరు, పలువురు న్యూ జెర్సీ ఛాప్టర్ కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు) -
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
వృద్ధుల డిమెన్షియా కోసం స్మార్ట్ వాచ్ ఆలోచన అద్భుతం
హైదరాబాద్: వృద్ధులలో డిమెన్షియా (మతిమరుపు) సమస్య సర్వసాధారణంగా వస్తుందని, కానీ దాన్ని అధిగమించేందుకు తగిన వ్యవస్థలు ఇన్నాళ్లూ సరిగా లేవని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అన్వయ సంస్థ వారికోసం ప్రత్యేకంగా ఒక స్మార్ట్ వాచ్ రూపొందించడం, దానికి పేటెంటు కూడా పొందడం ఎంతో అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. దీనివల్ల వృద్ధులు ఎక్కడున్నా తెలుస్తుందని, అలాగే వారికి ఏం జరిగినా వారి సంరక్షకులకు క్షణాల్లో సమాచారం వెళ్తుందని.. ఇలాంటి పరికరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులందరి సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అన్వయ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం, వ్యవస్థాపకుల దినోత్సవాన్ని బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సంతోష్ మెహ్రా, టెక్ మహీంద్రా హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ వినయ్ అగర్వాల్, టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, ఇండియా-ఇన్ఫర్ సంస్థ ఎండీ రంగ పోతుల, ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ అడ్వైజర్ శక్తిసాగర్, అన్వయకేర్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ దీపికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టార్టప్ ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటున్నాయని, వృద్ధుల సంరక్షణ కోసం ఏఐ ఆధారిత యాప్ తీసుకురావడం, వారి సమస్యలను సమగ్రంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. అన్వయ కేర్ సంస్థ సేవలు మరింతమందికి అందాలని అభిలషించారు. “డిమెన్షియా అనేది వయోవృద్ధులందరిలో చాలా ఎక్కువగా కనపడుతున్న సమస్య. అయితే దీన్ని పరిష్కరించేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రావట్లేదు. అసలు వృద్ధులు అంటే కేవలం ఆరోగ్య సమస్యలే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అన్వయ సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోంది. వాళ్లు ఒక స్మార్ట్ వాచ్ తయారుచేసి, దానికి పేటెంటు కూడా తీసుకోవడం చాలా బాగుంది. యూరోపియన్ దేశాల్లో సైకిళ్లపై వెళ్లేవారు తరచు ప్రమాదాలకు గురవుతారు. వాళ్లు ఆస్పత్రికి వెళ్లేలోపే వాళ్ల వైటల్స్, ఇతర వివరాలు అన్నీ డాక్టర్‌కు చేరిపోతాయి. ఇక్కడ ఈ వాచీని కూడా ప్రమాద బాధితులకు ఉపయోగపడేలా చేయాలి. వాళ్లను అంబులెన్సులోకి ఎక్కించగానే వాచీ పెట్టినా.. ముఖ్యమైన వివరాలన్నీ వైద్యులవద్ద సిద్దంగా ఉండి, వెంటనే చికిత్స ప్రారంభించగలరు. ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చినందుకు ప్రశాంత్‌కు అభినందనలు” అని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, “వయోవృద్ధులకు సేవలు అందించే లక్ష్యంతో మా సంస్థను స్థాపించాం. అనతికాలంలోనే బెంగళూరు, చెన్నై లాంటి 40 నగరాలకూ విస్తరించాం. దీనికిగాను మాకు ఐఐటీ మద్రాస్ నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, హైసియా నుంచి.. ఇలా పలు వర్గాల నుంచి మాకు గుర్తింపు, అవార్డులు వచ్చాయి. కొవిడ్ నుంచి చాలామందిని రక్షించాం. హోం క్వారంటైన్ ఏర్పాటుచేశాం. అన్వయ స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంను ఏర్పాటుచేసి, దానికి పేటెంటు కూడా సాధించాం. డిమెన్షియా కేర్ రంగంలో ఏమీ లేదని, వృద్ధులకు సేవలు అందించాలని గుర్తించాం. అప్పుడే భారతదేశంలోనే తొలిసారిగా ఏఐ ఎనేబుల్డ్ డిమెన్షియా కేర్ ఎట్ హోంను ప్రారంభించాం. ఉద్యోగుల సంరక్షణ కోసం అనన్య నిశ్చింత్ అనే ఏఐ ప్లాట్‌ఫాం తీసుకొచ్చాం. అనన్య కిన్ కేర్ అనే రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టం ప్రవేశపెట్టాం. ఇది రాబోయే 20 ఏళ్లకు సరిపోయే వ్యవస్థ. పెద్దవాళ్లు మనల్ని పెంచి పెద్దచేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వారికి అవసరమైనవి కల్పించడం మన విధి. అందుకే వారికి ఇంటివద్ద నర్సులు, డాక్టర్లను పంపడం, ల్యాబ్ శాంపిళ్లు ఇంటివద్దే సేకరించడంతో పాటు చివరకు ప్లంబర్లను పంపడం, ఉబర్ క్యాబ్‌లు బుక్ చేయడం వరకు అన్నిరకాల సేవలనూ అనన్య సంస్థ అందిస్తుంది” అని వివరించారు. -
బైడెన్‌కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్‌గా మారారు. అలాంటి ట్రంప్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్‌కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్‌ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్‌వెగాస్‌లో ప్రచార ఈవెంట్లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్‌కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు.ట్రంప్‌ను మీరు ఓడించలేరు: పెలోసీ బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్‌ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట. -
అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!
ఇంతవరకు ఎన్నో రకాల డైట్లు చూశాం. ఎవరికి వారు శారీరక సమస్యలు దృష్ట్యా తమకు నచ్చిన డైట్ ఫాలో అవ్వుతారు. చెప్పాలంటే కీటో డైట్, జోన్ డైట్, పాలియా డైట్, వంటి ఎన్నో రకాల డైట్ల ఫాలో అవుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఈ డైటే అత్యుత్తమైనది అంటూ సిఫార్సు చేస్తున్నారు. పైగా ఇది చిత్త వైకల్యం, కేన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలను దరి చేరనివ్వదని చెబుతున్నారు. ఇంతకీ ఆ డైట్ ఏంటి? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషించేది ఆహారమే. మనం తీసుకునే సమతుల్య ఆహారంతోనే అనారోగ్య సమస్య ప్రమాదాన్ని నివారించగలుగుతాం. మనం తినే ఆహారంలో చక్కెర శాతం, సోడియం కంటెంట్ ఎంత మేర తక్కువగా ఉంటే అంత మంచిది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకూడదంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించాలని చెబుతున్నారు. అంతేగాదు తమ పరిశోధనలో అన్నిటికంటే మెడిటేరియన్ డైట్ అత్యుత్తమమైనదని తేలిందని చెబుతున్నారు. ఇది గుండె జబ్బులు, కేన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదని వెల్లడించారు. చాలా వరకు మరణాలకు కారణం.. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమేనని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్ లేదా మధ్యధరా ఆహారంలో పుష్కలంగా గింజలు, చేపలు అదనపు వెర్షన్ ఆలివ్ ఆయిల్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ అధ్యయనం న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. యూకేలో నంబర్ 1 కిల్లర్‌గా ఉన్న డిమెన్షియా(చిత్త వైకల్యం) నివారించగలదని చెబుతున్నారు. దీన్ని చాలామంది పెద్ద సమస్యగా భావించారు. కానీ నిశ్శబ్ద కిల్లర్ అని చెప్పొచ్చు. ఇక మరో మహమ్మారి కేన్సర్ చాలావరకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా వస్తుందని, దీన్ని ఈ డైట్‌తో సమర్ధవంతంగా నియంత్రించగలమని చెప్పారు. అంతేగాదు 30% గుండె ప్రమాదాలను కూడా నివారించగలదని చెబుతున్నారు. వ్యాధులను నివారించడంలో అత్యంత శక్తివంతమైన వైద్య సాధానంగా ఆహారమే కీలకపాత్ర పోషిస్తుందని నొక్కిచెబుతున్నారు. మెడిటేరియన్ డైట్/మధ్యధరా ఆహారం అంటే..ఈ పోషక సమతుల్య ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాలు, పండ్లు, కూరగాయలు ఉంటాయి. ధాన్యాలు, బీన్స్, గింజలు, సీఫుడ్, వర్జిన్ నూనెలను ఉపయోగిస్తారు. గ్రీస్, ఇటలీ, లెబనాన్, క్రొయేషియా, టర్కీ, మొనాకోతో సహా మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న 21 దేశాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది ఈ దేశాల సంప్రదాయ ఆహారం.మెడిటేరియన్ డైట్ ప్రయోజనాలు..గుండె ఆరోగ్యం: ఈ ఆహారం ఆలివ్ ఆయిల్,నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి పెడుతుంది, ఇది చెడు కొలెస్ట్రాల్,రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్,ఇతర హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు నిర్వహణ: ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా,సంతృప్తిగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాధుల ప్రమాదం తగ్గింది: టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్,కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మధ్యధరా ఆహారం సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.కాగ్నిటివ్ హెల్త్: మెడిటరేనియన్ డైట్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక మెదడు పనితీరులో క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబతున్నాయి. (చదవండి: -
అమ్మా... నా పేరు గుర్తుందా?
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు. -
విటమిన్ ‘డి’ లోపం: ఆదిలోనే గుర్తించకపోతే.. డేంజరే!
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న డీ విటమిన్ టోపం. నిజానికి చాలా సులువుగా అతి చౌకగా లభించే విటమిన్ ఇది. సూర్యకిరణాల ద్వారా మనకు విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా మన దేశంలో 70-80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అమెరికాలో దాదాపు 42శాతం మంది పెద్దలకు విటమిన్ డి లోపం ఉంది ఆఫ్రికన్ అమెరికన్ పెద్దలలో 82శాతం మంది ఈ డీ విటమిన్లోపంతో బాధపడుతుండటం డేంజర్బెల్స్ను మోగిస్తోంది. డీ విటమినల్ లోపం డీ విటమిన్ లోపిస్తే.. అలసట, తరచుగా అనారోగ్యం, ఆందోళన, ఎముకల నొప్పులు, గాయాలు తొందరగా మానకపోవడం, నిద్ర లేమి లాంటి సమస్యలొస్తాయి. ఇంకా హైపర్ టెన్షన్, డిప్రెషన్, టైప్-2 మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమసల్యకు దారి తీస్తుంది. అలాగే తీవ్రమైన జుట్టు రాలడానికి కూడా విటమిన్ డీ లోపం కారణమని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. భయపెడుతున్న అల్జీమర్స్ విటమిన్ డి లోపం భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. ఫ్రాన్స్‌లో జరిపిన ఒక అధ్యయనంలో, 50 nmol/L కంటే తక్కువ విటమిన్ డీ అల్జీమర్స్ వచ్చే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. యూకేలో అరవై శాతానికి పైగా ప్రజల్లో దీని కంటే తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నట్లు అల్జీమర్స్ అసోసియేషన్ ప్రచురించిన ఓ జర్నల్ లో పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఈ రోగం బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా. మన శరీరంలో డీ విటమిన్ స్థాయి ఉంటే ఎనర్జీ లెవల్స్, మూడ్‌ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోయి, అది క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియాకు లేదా తీవ్రమైన మతిమరపునకు దారితీస్తుంది. తొలుత జ్ఞాపకశక్తి కోల్పోవడం, చలనశీలత సమస్యలు ముదిరి కాలక్రమేణా డిమెన్షియాకు దారితీస్తుంది. ఫలితంగా మనిషి ఆలోచనా శక్తి నాశనమై పోయి, ఒక్కోసారి తన దైనందిన పనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. తమ సమీప బంధువులకు మర్చిపోతారు. చివరికి తమను తాము, తమ ఇంటిని కూడా గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి బాధితుడితోపాటు సంబంధిత కుటుంబానికి కూడా పెద్ద సమస్యగా మారుతుంది. నిపుణులు ప్రకారం విటమిన్ డీ పుష్కలంగా ఉంటే మెదడు చురుకుగా మారుతుంది. ఉదయం సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంత మొత్తంలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే డీ విటమిన్ సప్లిమెంట్స్తోపాటు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారం పాలు, పెరుగు, గుడ్లు, సోయాబీన్, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా అవసరం. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కేన్సర్ నివారణలో సాయపడుతుంది. -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్‌కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్!
స్ట్రాబెర్రీ అంటే ఇష్టంగా తినే వాళ్లకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో రోజూ స్ట్రాబెర్రీలు కనీసం ఎనిమిది తింటే డిప్రెషన్, డిమెన్షియా దరిదాపుల్లోకి కూడా రాదని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పరిశోధనలు న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలను సిన్సినాటి యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. వారి పరిశోధనల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలెంటంటే.. సిన్సినాటి యూనివర్సిటీ పరిశోధకుల బృందం సుమారు 50 నుంచి 65 ఏళ్లు ఉన్న వ్యక్తుల సముహాలను రెండు గ్రూప్‌లుగా విడగొట్టారు. ఒక గ్రూప్ మొత్తానికి స్టాబెర్రీలు ఇవ్వగా, ఇంకో గ్రూప్‌కి సాధారణమైన రోజూవారి పళ్లను ఇచ్చారు. అయితే స్ట్రాబెర్రీలు క్రమతప్పకుండా తీసుకున్న గ్రూప్‌లో మెరుగైన జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ఉన్నట్లు గుర్తించారు. అలాగే నిస్ప్రుహ లక్షణాలను అధిగమించినట్లు తెలిపారు. మిగతా సముహంలో మానసిక స్థితి చాలా అధ్వాన్నంగా ఉండటమే గాక డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. మెరుగైన ఫలితాలు కనిపించిన సముహంలో కేవలం ఐదుగురు పురుషులు, సుమారు 25 మంది దాక మహిళలు ఉన్నారని. వారిందరూ మెరుగైన మానసిక స్థితి, మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నారని అన్నారు. 12 వారాల పాటు ఎనిమిది చొప్పున స్ట్రా బెర్రీలు ఇస్తేనే ఇంత మెరుగైన ఫలితం కనిసించిందంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు రోజూ తీసుకుంటే ఇంకెంతో ఫలితం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ డిమెన్షియా అనేది వ్యాధి కాదు. ఇది ఒకరకమైన మానసిక చిత్త వైకల్యం. సింపుల్‌గా చెప్పాలంటే మెమరీ నష్టం అనొచ్చు. మెదడు గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కోల్పోవడం. దీనివల్ల దైనందిన జీవితం గందరగోళంగా మారిపోతుంది. ఇది పార్కిన్సన్, అల్జీమర్స్ లాంటిదే కానీ దీనికి చికిత్స లేదు. జస్ట్ మందులతో నిర్వహించగలం అంతే. ఇది తగ్గటం అంటూ ఉండదు. చివరికి ఒకనొక దశలో ఆయా పేషెంట్లకు తినడం అనేది కూడా కష్టమైపోతుంది. ప్రస్తుతం యూకేలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి 11 మందిలో ఒకరు ఈ డిమెన్షియా బారినపడుతున్నట్లు సిన్సినాటి పరిశోధకుడు రాబర్ట్ క్రికోరియన్ తెలిపారు. అయితే మనకు అందుబాటులో ఉండే ఈ స్ట్రా బెర్రీ పళ్లల్లో విటమిన్ సీ, మాంగనీస్, ఫోలేట్ (విటమిన్ B9), పోటాషియంలు ఉంటాయి. వీటితో మానసిక సమస్యలకు సంబంధించిన రుగ్మతలను నుంచి సునాయసంగా బయటపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మందుల కంటే కూడా ఇలా ప్రకృతి ప్రసాదించినవే ప్రభావంతంగా పనిచేస్తాయని, పైగా మన ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. (చదవండి: ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!) -
సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
విద్యుత్ షాక్‌ని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని శాస్త్రవేత్తలు కొత్తరకం ప్రయోగం చేశారు. హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్స నిర్వహించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి. అల్జీమర్స్ కారణంగా మానసిక, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిజార్డర్ కారణంగా బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. కాలక్రమేణా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్ బారినపడినవాళ్ల లో ఈ కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ చిన్నగా అవుతుంది. అంతేకాదు 'హైపోమెటబాలిజం' ఉంటుంది. అంటే గ్లూకోజ్ తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే. కాకుండా జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. హిప్పోకాంపస్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచేందుకు కొత్త హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ (ICL) శాస్త్రవేత్తల నేతృత్వంలో టెంపోరల్ ఇంటర్ఫెరెన్స్ (TI) బ్రెయిన్ స్టిమ్యులేషన్‌తో మతిమరుపును పోగొట్టచ్చని కనిపెట్టారు. ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ విద్యుత్ కణాలకు బ్రెయిన్‌కు పంపించి జ్ఞాపకశక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుందట. ఇందులో భాగంగా2,000 Hz,2,005 Hz, వద్ద విద్యుత్ కణాలను పంపిస్తాయి. ఇది ఒకరకంగా కరెంట్ షాక్ లాంటిదే. 5-Hz కరెంట్‌తో అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల సెల్-పవర్ చేసే మైటోకాండ్రియాను పునరుజ్జీవింపజేస్తాయని, ఇది మతిమరుపును పోగొడుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో వివరించారు.''ఇప్పటివరకు మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే రోగికి ఎలక్ట్రోడ్లను శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సి వచ్చేది. కానీ ఈ హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఎలాంటి నొప్పిలేకుండా రోగికి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేయొచ్చు.'' అని సైంటిస్ట్ నిర్ గ్రాస్మాన్ తెలిపారు. ఈ టెక్నిక్‌తో సర్జరీ అవసరం లేకుండా మనిషి మెదడులోని కణాలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. -
మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపు వస్తుండటం సహజం. మతిమరపును ఇంగ్లిష్‌లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైంది ‘అల్జైమర్స్’ అయితే... దానితో పోలిస్తే... దానికంటే కొద్దిగా అరుదైనది వాస్క్యులార్ డిమెన్షియా. ఈ సందర్భంగా మతిమరపునకు కారణమయ్యే అల్జైమర్స్ డిమెన్షియా, వాస్క్యులార్ డిమెన్షియాలపై అవగాహన కోసం ఈ కథనం. డిమెన్షియా, అల్జైమర్స్ని ఓ వ్యాధిగా కాకుండా ఓ సిండ్రోమ్‌గా చెప్పవచ్చు. అంటే... నిర్దిష్టంగా ఓ వ్యాధి లక్షణంతో కాకుండా... అనేక లక్షణాల సమాహారంతో కనిపించే ఆరోగ్య సమస్యను సిండ్రోమ్ అనవచ్చు. డిమెన్షియా ఉన్నప్పుడు అది కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు దోహదపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. అల్జైమర్స్ విషయానికి వస్తే ఇది కూడా డిమెన్షియాలో ఒక రకం. అందుకే దీన్ని అల్జైమర్స్ డిమెన్షియా (ఏడీ) అనవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడిది చాలా సాధారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత నలుగురితో కలవకపోవడం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి లాంటి అంశాల కారణంగా అల్జైమర్స్ పెరిగింది. అల్జైమర్స్ డిమెన్షియా: కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలో క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. ఒకసారి అల్జైమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా అయ్యేలా చికిత్స సాధ్యం కాదు. కాకపోతే దీనిలో మరపు అన్నది మొదట్లో తాజా తాజా విషయాలు మొదలుకొని... క్రమంగా పాత విషయాల్ని మరచిపోతుంటారు. తాము ఎంతోకాలంగా నివాసమున్న ప్రదేశాల్నీ, కాలాన్నీ (అది పగలా, రాత్రా అన్నదానితో సహా) మరచిపోతారు. ప్రశ్నలకు సమాధానాలివ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రవర్తనలో మార్పు రావడం... చివరకు సొంత కుటుంబ సభ్యుల్ని సైతం గుర్తుపట్టలేనంతగా మరచిపోతారు. వాస్క్యులార్ డిమెన్షియా మతిమరపులకు ‘వాస్క్యులార్ డిమెన్షియా’ అనేది ‘అల్జైమర్స్ డిమెన్షియా’ కంటే రెండో అతి ముఖ్యమైన కారణం. మెదడుకు క్రమంగా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల వస్తుంది కాబట్టి దీన్ని ‘వాస్క్యులార్ డిమెన్షియా’గా చెబుతారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఫలితంగా అభ్యాస, అధ్యయన, నేర్చుకునే ప్రక్రియలు... ఇలా ఇవన్నీ మరుస్తూపోవడం వల్ల పరిస్థితి అకస్మాత్తుగా దిగజారిపోతుంది. మతిమరుపు, అల్జైమర్స్ తెచ్చి పెట్టే అంశాల్లో కొన్ని... జన్యుపరమైనవి: మతిమరపులో జన్యుపరమైన అంశాలు కీలకమైన భూమిక పోషిస్తాయి. కొందరి కుటుంబాల్లో వంశపారం పర్యంగా కనిపిస్తుంటాయి. ఏపీఓఈ 4 ఎల్లీల్ వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ ముప్పులను పెంచుతాయి. వయసు : పెరిగే వయసు మతిమరపును తెచ్చిపెట్టే అల్జైమర్స్, వాస్క్యులార్ డిమెన్షియాలకు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. పైగా ఇది నిరోధించలేని అంశం. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించని వాళ్లలో అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, పొగ, ఆల్కహాల్ అలవాట్ల వంటì అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో ఈ ముప్పులు ఎక్కువ. దేహంలోని ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు మెదడు పనితీరుపై ప్రతికూలం ప్రభావం చూపి, పరోక్షంగా అల్జైమర్స్, వాస్క్యులార్ అల్జైమర్స్కూ, గురకను కల్పించే స్లీప్ ఆప్నియాకు కారణమవుతాయి. వాతావరణ అంశాలు : వాతావరణ కాలుష్యాలూ, విషపూరిత వ్యర్థాలూ చాలావరకు మతిమరపునకు కారణమవుతాయి. అందుకే వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి. ఆహారం : పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో ఉపయోగించే పసుపు, మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు తోడ్పడతాయి. నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్‌ను ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి. వ్యాయామం : దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ పెరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. దాంతో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మెదడుకు మేత : కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ సాధించడం, మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల అదుపు : డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధులను అదుపులో పెట్టుకోవాలి. నలుగురిలో ఒకరిగా : వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. చికిత్స : అలై్జమర్స్ డిమెన్షియానూ, వాస్క్యులార్ డిమెన్షియానూ పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ‘లెకానిమ్యాబ్’ అనే సరికొత్త మందును ఈ ఏడాదే ఎఫ్‌డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. (చదవండి: మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం) -
మనసుకి వ్యాయామం
శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు. శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే! దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు. ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి. మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు. ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు. ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్ జాగ్రత!! డా‘‘ ఎన్ అనంత లక్ష్మి -
Ashes 2023: ఒకరి జెర్సీని మరొకరు.. 'మతిమరుపు' గానీ వచ్చిందా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అయితే.. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేశారు. కాగా ఆసీస్ కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 75 బంతుల్లో 73 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. స్టోక్స్ కూడా 30 బంతుల్లో 20 పరుగులతో దాటిగా ఆడుతూ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒకరి జెర్సీని మరొకరు ధరించారు. ఇది చూసిన అభిమానులకు కాసేపు అర్థం కాలేదు. ఇంగ్లండ్ ఆటగాళ్లు మరిచిపోయి ఒకరి జెర్సీ ఒకరు వేసుకున్నారేమోనని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా జెర్సీలను మార్చుకోవడానికి ఒక కారణం ఉంది. అల్జీమర్స్(Dementia-మతిమరుపు)వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు మద్దతుగా బెన్ స్టోక్స్ బృందం ఒకరి జెర్సీలు మరొకరు ధరించారు. కెప్టెన్ స్టోక్స్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో జెర్సీ వేసుకున్నాడు. మోయిన్ అలీ మాజీ కెప్టెన్ జోరూట్ జెర్సీతో వచ్చాడు. జేమ్స్ అండర్స్ మరో పేసర్ స్టువార్ట్ బ్రాడ్ జెర్సీతో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఒక్క చోట చేరారు. అల్జీమర్స్ సొసైటీ సభ్యులు ఆలపించిన పాట విన్నారు. ఆ తర్వాత మూడోరోజు ఆటను ప్రారంభించారు. అల్జీమర్స్ అనేది ఒక వృద్దాప్య సమస్య. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో రోజు రోజుకు మతిమరుపు పెరుగుతుంటుంది. దాంతో, వాళ్లు అన్ని విషయాలు మర్చిపోతారు. కుటుంబసభ్యులను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. డిమెన్షియా వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96 — England Cricket (@englandcricket) July 29, 2023 Today is the day! It's the @lv=Men's Ashes Test Match: Day 3 Supporting Alzheimer’s Society. 🏏 Huge thanks to the Kia Oval (@surreycricket) and @englandcricket - and sending lots of luck to our boys! 🤞 Great #CricketShouldBeUnforgettable https://t.co/oFsZXP1wXb pic.twitter.com/vbFrIO8HXj — Alzheimer's Society (@alzheimerssoc) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: గుడ్‌న్యూస్.. ఆగస్టు 10 నుంచి వన్డే వరల్డ్‌కప్ టికెట్లు అందుబాటులో! -
సారీ... మీ పేరు మరచిపోయాను!
ఢిల్లీకి చెందిన 22 సంవత్సరాల శ్రుతి అగర్వాల్ ఒకప్పుడు సినిమా చూస్తే.. ఆ సినిమా గురించి ఆర్డర్ తప్పకుండా సీన్ బై సీన్ చెప్పేది. ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన సినిమా అయినా సరే ఈరోజే చూసినంత ఫ్రెష్‌గా చెప్పేది. అలాంటి శ్రుతికి రెండు వారాల క్రితం చూసిన సినిమా కథ కూడా గుర్తుండడం లేదు అనేది ఒక విషయం అయితే కొత్త వారి పేర్లు త్వరగా మరచిపోవడం మరో విషయం. తనకు మతిమరుపు దగ్గరవుతుంది అని చెప్పడానికి ఈ రెండే కాదు ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.శృతికి ఎలాంటి దురలవాట్లు లేవు. వేళకు నిద్ర పోతుంది. సరిౖయెన ఆహారం తీసుకుంటుంది. మరి ఎందుకు తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతోంది? తనను తాను విశ్లేషించుకునే సమయంలో ఎప్పుడో స్కూల్ రోజుల్లో చదువుకున్న ‘యూజ్ ఇట్ ఆర్ లూస్ ఇట్’ అనే సామెత గుర్తుకువచ్చింది. అందులోనే తన సమస్యకు సగం పరిష్కారం కనిపించింది. స్కూల్, కాలేజీ రోజుల్లో ఏదైనా లెక్క చేయాలంటే మనసులో క్యాలిక్యులేట్ చేసుకోవడమో, కాగితం మీద చేయడమో జరిగేది. ఇప్పుడు మనసుతో పనిలేదు. చిన్నాచితకా లెక్కలకైనా స్మార్ట్‌ఫోన్‌లోని క్యాలిక్యులేటర్‌పై అతిగా ఆధారపడుతుంది. ఒక శుభకార్యం లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఆ తేదీని మదిలో ముద్రించుకునేది.. ఇప్పుడు సెల్‌ఫోన్‌లోని రిమైండర్కు పని చెబుతోంది. తన మెదడును సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే తనకు మతిమరపు దగ్గరవుతోందని గ్రహించిందామె. తనకు ఇప్పుడు కావాల్సింది బ్రెయిన్‌కు ఎక్సర్సైజ్ అనే విషయం అర్థమైంది. దీని గురించిన సమాచార శోధనలో తనను ఆకట్టుకున్నది.... పురాతనమైన మెమోరైజేషన్ స్ట్రాటజీ... మెథడ్ ఆఫ్ లోకి. మెమోరీ కోచ్, అథ్లెట్ బోరిస్ నికోలాయ్ వందల పేర్లను కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో గుర్తు పెట్టుకొని చెబుతాడు. నికోలాయ్ నెదర్లాండ్స్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్ మార్టిన్ డ్రెస్లర్తో కలిసి ఒక అధ్యయనం నిర్వహించాడు. అందులో భాగంగా 20 ఏళ్ల వయసు ఉన్న 51 మందిని మూడు గ్రూప్‌లుగా విభజించారు. మొదటి గ్రూప్ చేత ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాక్టిస్ చేయించారు. రెండోగ్రూప్ చేత షార్ట్‌టర్మ్ మెమొరీ గేమ్స్ ఆడించారు. మూడో గ్రూప్‌కు మాత్రం ఎలాంటి కార్యక్రమం ఇవ్వలేదు. ఆరువారాల తరువాత... మొదటి గ్రూప్ మెమొరీ పవర్ పెరిగింది. రెండు, మూడు గ్రూప్‌లలో పెద్దగా మార్పు కనిపించలేదు. పురాతనమైన ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాధాన్యత కోల్పోలేదు అని చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. అందుకే యూత్ దీనిపై ఆసక్తి కనబరుస్తోంది. ‘ మెథడ్ ఆఫ్ లోకి’ని మెమొరీ జర్నీ, మెమొరీ ప్యాలెస్... మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ‘లోకి’ అనేది ‘లోకస్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం... ప్రదేశం. సమాచారాన్ని మనసులోని ఊహాజనిత ప్రదేశాల్లో స్థిరపరుచుకోవడమే ‘మెథడ్ ఆఫ్ లోకి’ టెక్నిక్.ఉదాహరణకు...717, 919, 862, 9199.. లను గుర్తు పెట్టుకోవాలనుకుంటే మనసులో సుపరిచితమైన ప్రదేశాన్ని ఆవిష్కరించుకోవాలి. సపోజ్ మన ఇల్లు. ఆ ఇంట్లో కిచెన్‌కు ఒక సంఖ్య, డోర్‌కు ఒక సంఖ్య, విండోకు ఒక సంఖ్య ఇచ్చుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే... ‘మెథడ్ ఆఫ్ లోకి’ని ప్రాక్టీస్ చేసినా, రకరకాల మెమోరీ గేమ్స్ ఆడినా, జ్ఞాపకశక్తికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాలు చదివినా... శక్తిహీనత ప్రమాదం నుంచి బయటపడి జ్ఞాపకశక్తిని పదిలపరుచుకునే ప్రయత్నమే అవుతుంది. మంచిదే కదా! బిల్‌గేట్స్ నుంచి యూత్ వరకు... కోచీ(కేరళ)కు చెందిన 24 సంవత్సరాల కైష తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతున్న సమయంలో చదివిన పుస్తకం ‘మూన్‌వాకింగ్ విత్ ఐన్‌స్టీన్: ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ రిమెంబరింగ్ ఎవ్రీ థింగ్’ ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. జాషువా ఫోయర్ ఎంతో పరిశోధించి, విశ్లేషించి రాసిన ఈ పుస్తకానికి యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బిల్‌గేట్స్‌కు బాగా నచ్చిన పుస్తకం ఇది. 320 పేజీల ‘మూన్‌వాకింగ్ విత్ ఐన్‌స్టీన్’ లో ఫోయర్ రకరకాల నిమానిక్ టూల్స్ (జ్ఞాపక శక్తికి ఉపకరించేవి) నుంచి ఇంగ్లాండ్‌కు చెందిన విద్యావేత్త టోనీ బుజాన్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ వరకు ఎన్నో అంశాలు ప్రస్తావించాడు. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్‌తోపాటు మ్యూజిక్‌ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్‌తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్‌కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్‌నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్‌కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్‌తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్‌టీఏ – వాకా మంజులారెడ్డి. -
డిమెన్షియా డేంజర్ బెల్స్
డిమెన్షియా. మన దేశాన్ని కొత్తగా ఈ వ్యాధి పట్టిపీడిస్తోంది. వాస్తవానికి దీనిని పూర్తిగా వ్యాధి అని కూడా అనలేం. ఇదొక మానసిక స్థితి. వయసు మీద పడిన వారిలో డిమెన్షియా లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనలు లేకుండా స్తబ్దుగా ఉండిపోవడం, రీజనింగ్ కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి మానసిక సమస్యలు ఎవరిలోనైనా కనిపిస్తే దానిని డిమెన్షియా అని పిలుస్తారు. ఈ డిమెన్షియా కేసులపై మొట్టమొదటిసారిగా మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక అధ్యయనం నిర్వహించారు. అంతర్జాతీయ బృందం భారత్‌లో 31,477 మంది వృద్ధులకి సెమీ సూరప్వైజ్డ్ మిషన్ సహకారంతో పరీక్షలు నిర్వహించి ఈ అధ్యయనం చేపట్టింది. యూకేలో యూనివర్సిటీ ఆఫ్ సర్రే, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్, న్యూఢిల్లీలో ఎయిమ్స్‌కు చెందిన పరిశోధనకారులు కృత్రిమ మేధ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలతో సరిసమానమైన డిమెన్షియా కేసులు భారత్‌లో కూడా బయటపడడం ఆందోళనకరంగా మారింది. దీనికి సంబంధించిన నివేదికను న్యూరో ఎపిడిమాలజీ జర్నల్ ప్రచురించింది. దేశంలో 60 ఏళ్ల కంటే పైబడినవారిలో 8.44% మంది అంటే కోటి 8 లక్షల మంది డిమెన్షియాతో బాధపడుతున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడైంది. 2050 నాటికి డిమెన్షియా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతాయని, ఆ సమయానికి దేశ జనాభాలో 19.1శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారి ఉంటారని వారిలో డిమెన్షియా ముప్పు తీవ్రంగా ఉంటుందని ఆ నివేదిక వివరించింది. గతంలో భావించిన దాని కంటే ఈ వ్యాధి వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉందని తేలింది. డిమెన్షియాకు ప్రస్తుతానికైతే చికిత్స లేదు. కొన్ని మందుల వల్ల లక్షణాలన్ని కొంతవరకు తగ్గించగలుగుతారు. వృద్ధాప్యంలో డిమెన్షియా రాకుండా యుక్త వయసు నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. కశ్మీర్లో అధికం మన దేశంలో జమ్మూకశ్మీర్‌లో అత్యధికులు డిమెన్షియాతో బాధపడుతున్నారు. కశ్మీర్‌లోని 60 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్నవారిలో 11% మందికి డిమెన్షియా ఉంది. ఇక ఢిల్లీలో తక్కువగా 4.5% మందిలో ఈ లక్షణాలున్నాయి. డిమెన్షియా అంటే...? డిమెన్షియా అన్న పదం డి, మెంటియా అనే పదాల నుంచి వచ్చింది. డి అంటే వితౌట్ అని, మెంటియా అంటే మనసు అని అర్థం. డిమెన్షియా అనేది సోకితే రోజువారీ చేసే పనులకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొద్ది సేపటి క్రితం ఏం చేశారో వారికి గుర్తు ఉండదు. రోజూ తిరిగే దారుల్ని కూడా మరిచిపోతారు. మాట్లాడడానికి పదాలు వెతుక్కుంటూ ఉంటారు. చిన్న చిన్న లెక్కలు కూడా చెయ్యలేరు. స్థూలంగా చెప్పాలంటే బాధ్యతగా వ్యవహరించలేరు. దీనివల్ల మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. మహిళలే బాధితులు డిమెన్షియా ఎక్కువగా మహిళల్లో కనిపిస్తోంది. చదువు రాని గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళల్లో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయని సర్వే తేల్చింది. మహిళల్లో 9% మందికి ఈ వ్యాధి ఉంటే , పురుషుల్లో 5.8% మందిలో గుర్తించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కూడా అంతరం ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల (5.3%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారు (8.4%) ఈ సమస్యతో అధికంగా బాధపడుతున్నారు. ‘‘భారత్‌లో డిమెన్షియా మీద అవగాహన తక్కువ. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు కిందే దీనిని భావిస్తారు. ప్రభుత్వాలు కూడా ఈ వ్యాధిపై అంతగా దృష్టి సారించడం లేదు. 2050 నాటికి డిమెన్షియా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతాయి. ఆ సమయానికి దేశ జనాభాలో 19.1శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారి ఉంటారు. వారిలో డిమెన్షియా ముప్పు తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వాలు ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధులు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించవచ్చు.’’ –ప్రొఫెసర్ హమియో జిన్, అధ్యయనం సహరచయిత, యూనివర్సిటీ ఆఫ్ సర్రే, యూకే ఒంటరితనంతో డిమెన్షియా ! డిమెన్షియా వ్యాధి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. చిన్నతనం నుంచి మెదడుని చురుగ్గా ఉంచే కార్యక్రమాల్లో ఉండకపోతే పెద్దయ్యేసరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరక్షరాస్యుల్లో ఈ వ్యాధి ఎక్కువ. పొగతాగడం, మద్యపానం, నిద్రలేమి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటివి కూడా మనసుపై ప్రభావాన్ని చూపించి డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు సోకుతాయని ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు ఒంటరితనం కూడా ఈ వ్యాధి సోకడానికి కారణమవుతోందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరి జీవితం గడిపే వారిలో డిమెన్షియా వ్యాధి సోకే ముప్పు 27% అధికంగా ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడు ఎందుకిలా?
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్‌తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్‌కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది. డైలాగులు కూడా గుర్తు చేసుకోలేక సీరియల్స్‌కు కూడా దూరం అయ్యింది. తన భర్త మరణించిన తరువాత ఇలా మెమరీ లాస్ అయ్యిందని అనుకొంటోంది. ఏది.. ఏ కారణం చేత జరిగిందో తెలుసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాము. మీకందరికీ పరిచయం ఉన్న నలుగురు మహిళా టీవీ యాంకర్లకు ఇదే సమస్య ఎదురయ్యింది. ఏం చేయాలి? 1 . రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తినాలి. అదే విధంగా పిస్తా, బాదం చెరి నాలుగైదు తినాలి . 2 . మాంసాహారులైతే సముద్రపు చేపలు అప్పుడప్పుడు తినాలి. 3 . కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలి. 4 . పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒంటరి జీవనం కూడదు. 5 . అవిశె, గుమ్మడి ... గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు తరచూ తీసుకోవాలి . 6 . బాగా నిద్ర పోవాలి. లేదంటే డెమెన్షియా! ఇలా చేస్తే ఆమెకైనా, మెమరీ లాస్ అవుతున్న ఎవరికైనా తిరిగీ కొత్తగా రెక్కలు వస్తాయి. లేదంటే డెమెన్షియా. అది ఏ స్థాయిలో ఉంటుందంటే తన పేరు, ఇంటి అడ్రెస్స్ మరచిపోయి ఏదో ఆలోచనలతో ఇంటినుంచి వెళ్లి పోయి తిరిగి రాలేక ఫుట్ పాత్ ల పై అనాథలా బతికి.... తనువు చాల్సించాల్సి వస్తుంది. భయంకరం... చెబితే కొంతమంది ఏడుస్తారు కానీ అండీ ... 78 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యం గా ఒక బృందావనం అంటూ జీవిస్తోన్న ఆ మధుర గాయని ఉన్నట్టుండి కళ్ళుతిరిగి డ్రెస్సింగ్ టేబుల్ పై పడి మరణించడానికి కారణం ఏంటని ఎవరైనా చెప్పారా ? రక్తంలో క్లోట్స్ ఉంటే అది మెదడు పోటుకు దారి తీయొచ్చు. ముందుగా కళ్ళు తిరుగుతాయి. మమూలుగా కళ్ళు తిరగడానికి ఇలా రక్తంలో క్లోట్స్ వల్ల వచ్చిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఆమె అంత బలంగా పడిపోయింది. రక్తంలో క్లోట్స్ ఎందుకు వచ్చాయి? వయసు అయిపొయింది .. వాతావరణ మార్పులు .. చెన్నై చలి .. చెన్నై ఎండలు .. నీరు తాగడం వల్ల.. ఉపవాసం ఉండడం వల్ల .. జింకు పోవడం వల్ల .. చెన్నై పక్కనే సముద్రం ఉండడం వల్ల ..... ఇలా సోది కారణాలు ఎన్నైనా చెబుతారు జనాలు. అది అంతే ! -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు (వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) - ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొమరీ లాస్‌తో బాధపడుతున్నట్లు సీనియర్ నటి భానుప్రియ చెప్పిన విషయం తెలిసిందే! -
విధివంచితులు
వారిదో వింతలోకం.. ఉలుకూ పలుకూ లేని వారు కొందరైతే.. నిస్తేజంగా కనిపించేవారు మరికొందరు.. ఆకలేసినా అన్నం అడగలేనివారు ఇంకొందరు.. వయసు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు బుద్ధి పెరగడం లేదు. ఎదుగూబొదుగూ లేని బుద్ధిమాంద్యం పిల్లలను తల్లిదండ్రులు మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నారు. సరైన వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లలను భవిష్యత్తును తలచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తాడిపత్రి టౌన్: తాడిపత్రి పట్టణంలో దాదాపు 150 మంది బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. వీరిలో చెవిటి, మూగ, అంధులు, శారీరక, మానసిక వైకల్యం కల్గిన చిన్నారులు దుర్భర జీవితం గడుపుతున్నారు. విధివంచితులైన వారిని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూనే ప్రేమతో చూసుకుంటున్నారు. అవ్వ సంక్షరణలో అక్కాతమ్ముడు వడ్లపాలెంకు చెందిన కూలీలు హజీరాని, దస్తగిరి దంపతులు. వీరికి నసృన్ (14), మహమ్మద్ సందానీ ( 15) సంతానం. వీరు పుట్టుకతోనే బుద్ధిమాంద్యులు. రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ జీవితం. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ బాధ్యతను అవ్వ దస్తగిరమ్మ తీసుకుంది. దస్తగిరమ్మ అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలలో కలసి ఉంటోంది. నసృన్, మహమ్మద్ సందానీలకు మతిస్థిమితం లేదు. అన్నం కూడా తినలేని పరిస్థితి. ఆమె ఇంటి వద్దనే చిరువ్యాపారం చేసుకుంటూ.. వచ్చే పింఛన్ డబ్బుతో బతుకు బండి లాగుతోంది. నడవలేస్థితిలో ధరణి, సృజన.. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లలితమ్మ, శివశంకర్ భార్యాభర్తలు. వీరికి ధరణి (15), సృజన (7) పిల్లలు. వీరు పుట్టుకతోనే బుద్ధిమాంద్యులు. శివశంకర్ ఆటోడ్రైవర్. లలితమ్మ పిల్లలను చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటోంది. పిల్లలు నడవలేరు. రోజూ భవిత సాధన ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఆటో సంపాదనతో అతి కష్టం మీద శివశంకర్ కుటుంబం నడుపుతున్నాడు. అధికారులు స్పందించి తమవంతు సాయం చేయాలని వారు కోరుతున్నారు.. తల్లిచాటు బిడ్డ ఫకృద్దీన్ శ్రీనివాసపురానికి చెందిన లారీ డ్రైవర్ వలిబాషా, బీబీ దంపతులు. వీరి కుమారుడు బాబా ఫకృద్ధీన్ (29)కు రెండు, కాళ్లు, చేతులు పని చేయవు. మానసిక స్థితి సరిగా లేదు. దీంతో ఆలనా పాలన తల్లి బీబీ చూసుకుంటోంది. వయసు పెరిగినప్పటికీ ఫకృద్ధీన్ చిన్న పిల్లవాడిగానే ప్రవర్తిస్తుంటాడు. తమ్ముడికి అక్క అండ నందలపాడుకు చెందిన అంకాలమ్మ, గంగయ్య దంపతులకు నలుగురు పిల్లలు. వీరిలో లోకేష్ (24) మానసిక బుద్ధి మాంద్యంతో పుట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం లోకేష్ తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి లోకేష్‌ను అక్క జ్యోతినే సంరక్షిస్తోంది. చివరకు తాను వివాహం కూడా చేసుకోలేదు. తమ్ముడికి వచ్చే పింఛన్ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తుంది. లోకేష్ స్వయంగా నడవలేడు. ఎవరైనా పట్టుకుని నడిపించాల్సిందే. కదల్లేని దీనస్థితిలో ఎందరో.. శ్రీనివాసపురానికి చెందిన హుస్సేన్‌బీ, దస్తగిరి దంపతుల కుమార్తె నూర్జహాన్ (14). నూర్జహాన్ కదలని బొమ్మగా ఉంటుంది. చంటి పిల్లను చూసుకున్నట్టుగా ఆమెను తల్లి చూసుకుంటోంది. పుట్లూరు రోడ్డులోని ఆర్టీటీ కాలనీకి చెందిన ప్రమీణ, రాము భార్యభర్తలు. వీరి కుమారుడు నరసింహులు (13) బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. వీల్‌చైర్‌కే పరిమితం. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన ఆంజనేయులు (18) బుద్ధిమాంద్యం బారినపడ్డాడు. తండ్రి చనిపోవడంతో తల్లి అచ్చమ్మే ఆంజనేయులుకు అన్ని సపర్యలూ చేస్తోంది. బాగా చూసుకుంటున్నాం తాడిపత్రి మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో బుద్ధిమాంద్య పిల్లల కోసం రాçÙ్ట్ర ప్రభుత్వం భవిత సాధన కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ బుద్ధిమాంద్యం పిల్లల కోసం ట్రైసైకిల్, మరికొన్ని ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల బొమ్మలతో పిల్లలు గడిపే విధంగా చూస్తున్నాం. రోజూ 10 నుంచి 20 మంది పిల్లలు భవిత కేంద్రానికి వస్తారు. ఫిజియోథెరపీ వంటి సేవలు కూడా అందిస్తున్నాం. దివ్యాంగుల సర్టిఫికెట్లు ఇప్పించేందుకు సదరం పరీక్షా కేంద్రాలకు పంపుతున్నాం. – నాగరాజు, భవిత కేంద్ర అధికారి, ఎంఈఓ, తాడిపత్రి -
మతిమరుపు బాధితులకు ‘లెసానెమాబ్’
లండన్: మనుషుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు (అల్జీమర్స్) తలెత్తడం సహజం. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా దీనితో బాధపడుతున్నారని అంచనా. బ్రిటన్‌లోని అల్జీమర్స్ రీసెర్చ్ సంస్థ లెసానెమాబ్ పేరుతో నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనితో మతిమరుపు పెరుగుదల నెమ్మదిస్తుందని సైంటిస్టులు చెప్పారు. అల్జీమర్స్ చికిత్సలో ఇదొక కీలక మలుపన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో 1,795 మందిపై సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. వారికి 18 నెలలపాటు చికిత్స అందిస్తే మతిమరుపు పెరుగుదల నాలుగింట మూడొంతులు తగ్గిపోతుందని చెప్పారు. అల్జీమర్స్‌కు ప్రధాన కారణమైన బీటా–అమైలాయిడ్ అనే ప్రొటీన్‌ను ఈ ఔషధం కరిగించేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన అల్జీమర్స్ చికిత్సల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని, ఈ దిశగా లెసానెమాబ్ డ్రగ్ ఒక ఉత్తమమైన పరిష్కారం అవుతుందని పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ హర్డీ తెలియజేశారు. -
Covid-19: దిమాక్ ఖరాబ్ చేస్తున్న కరోనా
లండన్: కరోనా వచ్చి పోయింది, మానసికంగా ఒడిదుడుకులకు గురైనా పర్వాలేదుగానీ ఓ గండం దాటేశాం అనుకుంటున్న వాళ్లకు.. కొత్త కొత్తగా వస్తున్న నివేదికలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శ్వాస కోశ వ్యవస్థ.. అంతర్గత అవయవాల పని తీరును డ్యామేజ్ చేయడం వరకే వైరస్ ప్రభావం ఆగిపోలేదు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్.. మెదడుపైనా దీర్ఘకాలం ప్రభావం చూపెడుతోందని తాజా అధ్యయనాల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వివిధ దేశాల నుంచి సుమారు పన్నెండున్నర లక్షల మంది పేషెంట్ల ఆరోగ్య నివేదికల ఆధారంగా.. లాన్సెట్ సైకియాట్రీ జర్నల్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంత భారీ సంఖ్యలో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఇదే మొదటిది. వీళ్లలో శ్వాస కోశ, హృదయ, ఎముకల సంబంధిత సమస్యల కంటే.. మెదడు మీదే కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రాణాలతో బయటపడినవారు నాడీ సంబంధిత, సైకియాట్రిక్ సమస్యల బారినపడుతున్న ప్రమాదం ఎక్కువగా ఉందని ఆధారాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెయిన్ ఫాగ్.. ఇబ్బందికర పరిస్థితి. పనుల మీద దృష్టిసారించకపోవడం. విషయాల్ని గుర్తుంచుకోకపోవడం. చుట్టూ ఉన్న విషయాలను పట్టించుకోకపోవడం.. మీ మీద మీకే విరక్తి కలగడం. ఎపిలెప్సీ.. బ్రెయిన్ యాక్టివిటీ అబ్నార్మల్గా ఉండడం. అసాధారణ ప్రవర్తన. వీటితో పాటు మూర్ఛ సంబంధిత సమస్యలూ వెంటాడుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ రూపంలో స్థిమితంగా ఉండనివ్వడం లేదు. వైరస్ బారినపడి కోలుకున్నవాళ్లలో.. ఆరు నెలల నుంచి రెండేళ్లపాటు మానసిక రుగ్మతలు కొనసాగడం గుర్తించినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పౌల్ హారిసన్ వెల్లడించారు. కొవిడ్-19 తర్వాతే ఎందుకిలా జరుగుతుంది?.. ఇది ఇంకెంత కాలం సాగుతుంది?.. సమస్యలను అధిగమించడం ఎలా? అనే వాటిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: షియోమి వారి కుంగ్ ఫూ రోబో! -
వ్యాధి గురించి బయటపెట్టిన రణ్‌బీర్ కపూర్
కరీనా కపూర్ తండ్రి, బాలీవుడ్ నటుడు రణ్‌ధీర్ కపూర్ ప్రస్తుతం మతిమరుపుతో బాధపడుతున్నట్లు హీరో రణ్‌బీర్ కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నారని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. షర్మాజీ నమ్కిమ్ సినిమా చూసిన తర్వాత రణ్‌ధీర్ అంకుల్ నా దగ్గరకు వచ్చి, ఆ సినిమాలో మీ నాన్న అద్భుతంగా నటించాడు. అతను ఎక్కడ ఉన్నాడు? నేను అతడితో మాట్లాడాలి ఫోన్ చెయ్ అని అడిగాడు. నాన్న చనిపోయారన్న సంగతి అంకుల్ మర్చిపోయారు. ఇప్పుడిప్పుడే ఆయనకు వ్యాధి ప్రారంభమైంది అంటూ వివరించాడు. కాగా దిగ్గజ నటుడు రాజ్‌కపూర్‌కు రణ్‌ధీర్, రాజీవ్, రిషి కపూర్లు కుమారులన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం రణ్‌బీర్ తండ్రి, రిషి కపూర్ చనిపోయారు. -
టీ, కాఫీతో మతిమరుపుకు చెక్ పెట్టొచ్చిలా..! పక్షవాతం, స్ట్రోక్ కూడా..
Are You Drinking More Coffee And Tea A Day Must Know These Shocking Health Benefits: ప్రతి రోజూ రెండు కప్పుల టీ, అలాగే రెండు కప్పుల కాఫీ తాగేవారికి మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరుపు రావడం అన్నది... అలా తాగని వారితో పోల్చినప్పుడు దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు డాక్టర్ యువాన్ ఝాంగ్, అతని బృందం. ఒక్కరూ ఇద్దరూ కాదు... దాదాపు అయిదు లక్షల మందిపై పదేళ్ల పాటు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా కాఫీ, టీ తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) మాత్రమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ జర్నల్ ‘ప్లాస్ మెడిసిన్’ (PLoS Medicine)లో ప్రచురితమయ్యాయి. అయితే ఇలా కాఫీ, టీల మీద పరిశోధనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివే చాలా సాగాయి. దాంతో ఈ ఫలితాల మీద కొంత ఎదురుదాడి కూడా జరుగుతోంది. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ఇలాంటి పరిశోధనలు గతంలోనూ జరిగిన మాట వాస్తవమేననీ, అయితే మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే దోహద పడి ఉండకపోవచ్చనీ, ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేకపోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు సైతం ఈ పరిశోధన ఫలితాల వెల్లడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుండే మాట వాస్తవమే. అయినప్పటికీ వాటిని పరిమితికి మించి తీసుకుంటూ ఉంటే కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53%మందికి డిమెన్షియా వస్తుందని తేలిన ఫలితాలను వారు ఉటంకిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘రెండంటే రెండే’’ అన్న పరిమితికి కట్టుబడాలంటూ గట్టిగా చెబుతున్నారు. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! -
వృద్ధాప్యంలో డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసా?
మనిషి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు సహజం. వృద్ధాప్యమంటే మరోమారు బాల్యదశకు చేరినట్లేనని పెద్దలు చెపుతుంటారు. వయసు పెరిగి వృద్ధాప్యం ముదిరేకొద్దీ వారిని పసిపిల్లల్లాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వయసుపైబడుతున్న కొద్దీ ప్రతి జీవిలో అనేక జైవిక మార్పులు జరుగుతుంటాయి. మనుషుల్లో వయసు మీరే కొద్దీ జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడడం, మతిమరుపు పెరగడం వంటివి గమనించవచ్చు. వృద్ధాప్యం ముదిరే కొద్దీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మెరుగైన ఆరోగ్య విధానాలు అందుబాటులోకి రావడంతో మనిషి జీవన ప్రమాణం పెరుగుతోంది. అదేవిధంగా వృద్ధాప్య సమస్యలకు పరిష్కారాలు కూడా పెరిగాయి. ఇప్పటికీ సమాజంలో వృద్ధుల పట్ల ఈసడింపు, చీదర ఎక్కువగానే గమనించవచ్చు. కానీ ప్రతిఒక్కరూ ఆ దశకు చేరుకోవాల్సిన వాళ్లేనని గుర్తించి పెద్దలపై, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజ విచ్ఛిన్నం జరుగుతుందని మానవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధులను భారంగా పరిగణించేవారు అసలెందుకు వృద్ధాప్యంలో సమస్యలొస్తాయో అవగాహన పెంచుకోవడం అవసరమన్నది నిపుణుల మాట. అలాగే ఎవరమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు సైతం ఈ అవగాహన ఉపయుక్తంగా ఉంటుంది. సో, జీవన సంధ్య వేళ సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం! వయోవృద్దుల్లో జీర్ణక్రియ మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోతుంటారు. ఇది క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణతకు, కండరాల బలహీనతకు, అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే తినేది కొంచమైన పౌష్టికాహారం తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ తినలేకపోతే, కొద్దికొద్దిగా పలుమార్లు ఆహారం తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. దైనందిన ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, సాల్ట్, ఫ్యాట్ కలిగిన ఆహారాలను తగ్గించాలి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు సాధారణంగా వృద్ధాప్యంలో డిప్రెషన్ వస్తుంది. అంతవరకు ఎంతో చురుగ్గా తిరుగుతూ అందరినీ శాసించినవారు క్రమంగా నిస్సహాయత ఆవరించడంతో ఏపని చేసుకోలేక డిప్రెషన్ బారిన పడుతుంటారు. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నిరశా నిస్పృహలకుదారి తీస్తాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, కుటుంబం, స్నేహితుల సాయంతో ఉల్లాసంగా గడపడం, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్ ఛాయలు మనసులోకి రాకుండా చూసుకోవడం చేయవచ్చు. ఫుల్స్టాప్ పెట్టాలి. చిన్నప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తూ వచ్చిన చెవులు, కళ్లు, నోరు వయసు ముదిరేకొద్దీ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. దీంతో చెవుడు, చూపు మందగించడం, పంటి సమస్యలు ఎదురవతుంటాయి. కళ్లజోడు, హియరింగ్ ఎయిడ్స్‌తో ఈ సమస్యలను అధిగమించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వినికిడి, దృష్టి లోపాలను ముందస్తుగానే గుర్తించవచ్చు. అదేవిధంగా పెద్దయ్యేకొద్దీ వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం, ఇతర రకాల అనారోగ్య సమస్యలతో పళ్లు దెబ్బతినడం, నోరు పొడిబారడం, చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల మొదటి నుంచి డెంటల్కేర్పై దృష్టి సారించాలి. ధూమపానం, పాన్ పరాగ్, తంబాకు వంటి అలవాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలి. మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. -
అసహాయురాలిపై అత్యాచారం
అనంతపురం, గుంతకల్లు: అసహాయురాలిపై ఇద్దరు మృగాళ్లు తెగబడ్డారు. బుద్ధిమాంద్య వికలాంగురాలిని ఆదరించే పేరుతో సమీప బంధువు ఒకరు లోబర్చుకుని తల్లిని చేశాడు. ఆ తర్వాత మరొకరు ఆమెకు సహాయం చేస్తున్నట్టుగా దగ్గరికి చేరి తనూ కామవాంఛ తీర్చుకున్నాడు. దిక్కూమొక్కూలేని ఆమె తమ మధ్య జీవించడానికి వీలు లేదని తండావాసులు గెంటేశారు. వీరి దీనస్థితి తెలుసుకున్న పాత్రికేయులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించి బాధితులను వృద్ధాశ్రమంలో చేర్పించారు. వివరాల్లోకెళ్తే... గుంతకల్లు మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తి కుమార్తె పుట్టకతోనే బుద్ధిమాంద్య వికలాంగురాలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన ఈమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆదరించేవారు లేకపోవడంతో యాచించుకుని పొట్టపోసుకునేది. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంతకల్లులో యాచన చేసి రాత్రికి ఇంటికి చేరుకునేది. ఈ క్రమంలోనే వరుసకు బాబాయ్ అయ్యే ఓ వ్యక్తి ఆమె పాలిట రాబందువయ్యాడు. మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఫలితంగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తదనంతర క్రమంలో నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్ను ఆమెపై పడింది. సహాయం పేరిట ఆమె వద్దకు వచ్చే ఆ వ్యక్తి తరచూ లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. అలా సమీప బంధువు, పరాయి వ్యక్తి చేతిలో మోసపోయింది. ఇటువంటి మహిళ తండాలో ఉండేందుకు వీలు లేదంటూ స్థానికులు గ్రామబహిష్కరణ చేశారు. తననెందుకు చీదరించుకుంటున్నారో.. తను చేసిన తప్పేమిటో కూడా తెలియని రేణుక గుంతకల్లు మున్సిపల్ కార్యాలయ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మెట్లపై కుమారుడితో కలిసి దిగాలుగా కూర్చుండిపోయింది. సొంతూరికి వెళ్లలేక.. నిలువ నీడలేక చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వారు తల్లీకుమారుడిని వృద్ధాశ్రమంలో చేర్చారు. -
అల్జీమర్స్‌కు అద్భుత ఔషధం
న్యూఢిల్లీ : అల్జీమర్స్ వ్యాధి గురించి నేడు అందరికి తెల్సిందే. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు భారతీయుల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ జబ్బు ప్రధాన లక్షణం. అతి మతి మరుపు. తన ఇంటివారు, ఇరుగు పొరుగు, పరిసరాలను ఎప్పటికప్పుడు మరచిపోవడమే కాకుండా తన గురించి తాను మరచిపోవడాన్ని ‘అల్జీమర్స్’ లక్షణాలుగా వైద్యులు చెబుతారు. ఈ వ్యాధి సోకిన వారు బయటకు వెళితే మళ్లీ వారంతట వారు ఇంటికి వచ్చే అవకాశం లేదన్న కారణంగా చాలా మంది వ్యాధిగ్రస్థులను ఇంటికో, ఇంట్లోని ఓ గదికో పరిమితం చేస్తారు. డిమెన్షియా వ్యాధి ముదురితే అల్జీమర్స్ వస్తుంది. డిమెన్షియా వ్యాధి వచ్చినవారు ఇతరులు, పరిసరాల గురించి మరచి పోతారు గానీ, తన గురించి జ్ఞాపకం ఉంటుంది. తన గురించి కూడా మరచిపోవడాన్ని అల్జీమర్స్‌గా పేర్కొంటారు. డిమెన్షియా వ్యాధికి తాము ఔషధాన్ని కనిపెట్టామని, తద్వారా అల్జీమర్స్ వ్యాధిగా అది ముదరకుండా నిరోధించగలమని అమెరికాకు చెందిన ఆలోపతి మందుల దిగ్గజ సంస్థ ‘బయోజెన్ ఇన్కార్పొరేషన్’ సోమవారం రాత్రి వెల్లడించింది. ఈ ఔషధ మాత్రల కోసం వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్, జపాన్ దేశాల్లో లైసెన్స్‌కు దరఖాస్తు చేస్తామని, అల్జీమర్స్‌కు సంబంధించి అదే ఓ గొప్ప విప్లవం అవుతుందని, తాము ఈ పరిశోధనల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించామని, మరే సంస్థ ఇంతగా ఖర్చుపెట్టలేదని, లైసెన్స్ దరఖాస్తు కోసం కనీసం ముందుకు వచ్చే అవకాశం లేదని కంపెనీ సీఈవో మైఖేల్ వోనత్సోస్ వ్యాఖ్యానించారు. అల్జీమర్స్‌కు ఇదో అద్భుత ఔషధమని చెప్పవచ్చని ఆయన అన్నారు.