divya
-
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడి ముద్దుల కూతురు
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్(Sathyaraj ) కూతురు దివ్య సత్యరాజ్( Divya Sathyaraj) డీఎంకేలో చేరారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్( M K Stalin) సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వాన్ని ఆమె తీసుకున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ డీఎంకే అని, అందుకే తాను చేరినట్టు దివ్య పేర్కొన్నారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. దివ్య రాజకీయాల్లో రావాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె 2019 డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసిన సందర్భంలోనే ఆపార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. ఇది మర్యాద పూర్వక భేటీ అని ఆమె స్పష్టం చేయడంతో రాజకీయ ప్రచారానికి తెర పడింది. ఆ తదుపరి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత పోస్టులు, పోషకాహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ ప్రభావాల గురించి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. (ఇదీ చదవండి: ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి)ఈక్రమంలో సోషల్ మీడియా పోస్టులు అనేకం వివాదాస్పదమవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను ఆమె కలిశారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో డీఎంకే కోశాధికారి టీఆర్‌బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రూ, చైన్నె తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శి శేఖర్‌బాబు ఆమెకు స్టాలిన్ ద్వారా సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం దివ్య మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పోషకాహార నిపుణురాలు అని పేర్కొంటూ, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకం, అల్పాహార పథకం , మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా మరెన్నో పథకాలకు ఆకర్షిస్తురాలైనట్లు వివరించారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ డీఎంకే అని, అందుకే ఈ పార్టీలో చేరానని పేర్కొన్నారు. తన తండ్రి, స్నేహితులు, అందరూ ఎల్లప్పుడు నా వెన్నంటి ఉంటారని వ్యాఖ్యానిస్తూ ఏ బాధ్యతను తనకు అప్పగించినా శ్రమిస్తానని, కష్ట పడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
Divya Arundati : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్పందించిన నటి!
డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్‌లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
ప్రపంచ మూడో ర్యాంకర్‌గా అర్జున్
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలతో అదరగొట్టిన భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) స్టాండర్డ్ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లోనూ ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు చెందిన అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకోగా... గుకేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌ను అందుకున్నాడు. అర్జున్ ఖాతాలో 2797 ఎలో రేటింగ్ పాయింట్లు, గుకేశ్ ఖాతాలో 2794 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2831 రేటింగ్ పాయింట్లతో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2802 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్–100లో భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 12వ స్థానంలో ఉన్నారు. విదిత్ సంతోష్ గుజరాతి 22వ ర్యాంక్‌లో, అరవింద్ చిదంబరం 33వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 42వ ర్యాంక్‌లో, నిహాల్ సరీన్ 58వ ర్యాంక్‌లో, రౌనక్ సాధ్వాని 66వ ర్యాంక్‌లో, శ్రీనాథ్ నారాయణన్ 95వ ర్యాంక్‌లో, అభిమన్యు పురాణిక్ 98వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్‌వన్‌గా హంపి మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకొని భారత నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. చెస్ ఒలింపియాడ్‌కు హంపి దూరంగా ఉన్నా ఆమె ర్యాంక్‌లో మార్పు రాలేదు. భారత రెండో ర్యాంకర్‌గా మహారాష్ట్రకు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది. ఇన్నాళ్లు భారత రెండో ర్యాంకర్‌గా ద్రోణవల్లి హారిక కొనసాగింది. చెస్ ఒలింపియాడ్‌లో టీమ్ స్వర్ణ పతకంతోపాటు వ్యక్తిగత పసిడి పతకం నెగ్గిన దివ్య నాలుగు స్థానాలు పురోగతి సాధించి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. హారిక 14వ ర్యాంక్‌లో, వైశాలి 15వ ర్యాంక్‌లో, తానియా సచ్దేవ్ 54వ ర్యాంక్‌లో, వంతిక అగరాŠవ్ల్ 58వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 76వ ర్యాంక్‌లో, భక్తి కులకర్ణి 82వ ర్యాంక్‌లో, సవితాశ్రీ 99వ ర్యాంక్‌లో నిలిచారు. -
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన నటి
ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేమంటారు. అలాగే బ్రేకప్, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎందుకు వస్తున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్, నటి దివ్య అగర్వాల్ మనసు రెండేళ్లక్రితమే ముక్కలైంది. ప్రియుడు వరుణ్ సూద్‌తో నడిపిన నాలుగేళ్ల ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టింది. తాను కోరుకున్న విధంగా, సొంతంగా జీవించాలనుకుంటున్నా అని 2022 మార్చి 6న బ్రేకప్ వార్తను బయటపెట్టింది.పెళ్లయి మూడు నెలలు కాలేదుతర్వాత వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరికీ 2022లో నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఓ షోలో కూడా తనను అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ పొంగిపోయింది నటి. కానీ అంతలోనే సడన్ షాకిచ్చింది. పెళ్లయిన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో నుంచి తీసేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నాం..మొన్నే పెళ్లయింది? అంతలోనే ఏంటీ ఘోరం? అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం మొన్నే కదా కలిసి నవ్వుతూ ఫోటోలకు పోజిచ్చారు.. ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు కదా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా? -
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
సినిమాల్లో శృంగార సన్నివేశాలు అనగానే.. హా ఏముంది ఈజీనే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ తెరపై చూసే దానికి తెరవెనక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు. ఇప్పుడు ఆ విషయాల్నే 'మంగళవారం' ఫేమ్ నటి దివ్య పిళ్లై బయటపెట్టింది. అసలు అవి ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అనే వాటి గురించి చాలా ఓపెన్‌గా చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవాల్ని షేర్ చేసుకుంది.'రొమాంటిక్ సీన్ అనగానే ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడమే కదా ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ సెట్స్‌లో అందరిముందు ఈ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే దాదాపు 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకు కనిపించే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మైండ్‌లో వేరే ఆలోచన ఏం ఉండదు' (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'అలానే ముద్దుని భలే ఎంజాయ్ చేయడం లాంటిది కూడా ఏం ఉండదు. దీనిబట్టి ఎంత కష్టం అనేది మీరే ఆలోచించండి. అలానే రొమాంటిక్ సీన్స్ కోసం చాలా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సహ నటుడితో కలిసి ముందు డిస్కస్ కూడా చేసుకోవాలి. సీన్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా సరే ముఖంలో ఆ ఫీలింగ్ చూపించకూడదు' అని దివ్య పిళ్లై చెప్పుకొచ్చింది.దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది. 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సహాయ పాత్రలు చేస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది సూపర్ హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. దీని తర్వాత 'తగ్గేదే లే' అని మరో మూవీ కూడా చేసింది. ప్రస్తుతం 'బజూకా' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) -
వివాహానికి హాజరై తిరిగొస్తుండగా..
శ్రీపొట్టి శ్రీరాములు: రోడ్డు ప్రమాదం పెళ్లింట అంతులేని విషాదాన్ని నింపింది. వివరాలు.. కందుకూరు పట్టణంలోని విప్ప గుంటలో నివాసముంటున్న రాయని అరుణ (50), రమణయ్య భార్యాభర్తలు. రమణయ్య సుమారు 20 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోవూరు రోడ్డులో టిఫిన్ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన ఇద్దరి పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో కుమార్తె స్రవంతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అశేష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పాల్వంచలోని వరుడి ఇంట్లో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అరుణతో పాటు కుమారుడు వేణుగోపాల్, మేనల్లుడు వినోద్, అతని భార్య తల్లపనేని దివ్య (30), వారి కుమారుడు మణి, మరో బంధువు గుళ్లాపల్లి శ్రావణి (22) కలిసి కారులో కందుకూరు బయల్దేరారు. వాహనాన్ని వేణుగోపాల్ నడిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూరారెడ్డిపాళెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో అరుణ, దివ్య, శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్, వినోద్, మణి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అంతలోనే.. అప్పటి వరకు పెళ్లిలో ఆనందంగా గడిపిన వారు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి, బంధువులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసి కొత్త పెళ్లి కూతురు స్రవంతి కన్నీరుమున్నీరయ్యారు. దివ్య భర్త వినోద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త, తన ఐదేళ్ల కుమారుడు మణితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. మేనత్త కుమార్తె వివాహం కావడంతో వినోద్ కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితమే కందుకూరొచ్చారు. అయితే ఊహించని ప్రమాదంలో దివ్య మృతి చెందారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. పెళ్లి కోసమే హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావణి మృతి చెందడం తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మికి మింగుడు పడని ఘటనగా మారింది. శ్రావణి కుటుంబం చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. స్రవంతి పెళ్లి కోసమని శ్రావణి కందుకూరు వచ్చారు. ఇక స్రవంతి సొంత అన్న వేణుగోపాల్ కొద్దిరోజులుగా పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. విశ్రాంతి తీసుకోకుండా అర్ధరాత్రి కారు డ్రైవింగ్ చేస్తూ రావడం.. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అటు తల్లిని కోల్పోయి, ఇటు అన్న హాస్పిటల్ పాలవడంతో స్రవంతి రోదన వర్ణానాతీతంగా ఉంది. మృతదేహాలను గుర్రవారంపాళెం సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున బంధువులు చేరుకున్నారు. ఇవి చదవండి: కట్టేసి, కారం చల్లి.. -
Anny Divya: దివ్యమైన విజయం
స్త్రీల కలలు తరచు సామాజిక నిబంధనల మధ్య పరిమితం అవుతుంటాయి. అలాంటి ప్రపంచంలో అనీ దివ్య అసమానతలను ధిక్కరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో పుట్టి, విజయవాడలో పెరిగిన అనీ దివ్య... బోయింగ్ 777 ను నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్‌గా పేరు పొందింది. ‘మహిళా కమాండర్లలో అతి పిన్నవయస్కురాలిగా చేరాలని కలలు కనలేదు. కానీ, అభిరుచి, అంకితభావం ఆమె కలను సాకారం చేశాయి’ అని చెప్పే ముప్పై ఏడేళ్ల దివ్య... మహిళా శక్తి అంటే ఏమిటో తన విజయగాధ ద్వారా మనకు పరిచయం చేస్తుంది. ‘అమ్మాయిలు పెద్దగా కలలు కనడానికి వీలులేని ప్రదేశం నుండి వచ్చాను’ అని చెప్పే దివ్య 11వ తరగతి వరకు సాధారణ విద్యార్థిని. ఆమె తన కలను సాకారం చేసుకోవడానికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం తప్పనిసరి అని తెలుసుకుంది. అడ్డంకులను అధిగమించాలని నిశ్చయించుకుని, సవాల్‌ను ఎదుర్కొంది. అదే సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. దీంతో ఆమె కలలు స్పష్టంగా ఉన్నాయి అని కుటుంబ సభ్యులకూ అర్ధమైంది. కానీ, ముందుకు వెళ్లే మార్గం సులభంగా లేదు. అందుకు తగినంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. కానీ, ఆమె తండ్రి ఫ్లయింగ్ స్కూల్ ఫీజు కోసం రుణం తీసుకున్నాడు. దీంతో ఆమె అసలు ప్రయాణం మొదలైంది. 17 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చేరింది. 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా నిలిచింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో కో–పైలట్‌గా చేరింది. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్ కోసం లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. పైలట్‌గానే కాదు కెప్టెన్ దివ్య మోటివేషనల్ స్పీకర్ కూడా. విమానయాన రంగంలో తన అనుభవాలు, సవాళ్లను వేదికలపై స్పీచ్లుగా ఇచ్చింది. ముంబై రిజ్వీ లా కాలేజీ నుండి ఎల్ఎల్బీ పట్టా కూడా పొందింది. ఎగతాళి చేసేవారు ‘‘నాన్న ఆర్మీలో ఉద్యోగి అవడంతో మా కుటుంబం పఠాన్‌కోట్‌లో ఉండేది. నేను అక్కడే పుట్టాను. నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు. అలా, నా స్కూల్ చదువు మొత్తం విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక ఉండేది. ఇది తెలిసి ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. పిల్లల్లో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కావా లనే అనుకునేవారు. అదృష్టవశాత్తు నా ఎంపికకు నా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. అయితే, పైలట్ కావాలనే నా నిర్ణయాన్ని బంధువులు, కుటుంబ స్నేహితులు వ్యతిరేకించేవారు. ఇది అమ్మాయిలకు తగిన వృత్తిగా అనుకునేవారు కాదు. సవాల్‌గా తీసుకున్నాను.. ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చు. కానీ, ఇంగ్లీషులో మాట్లాడటం అనేది సమస్యగా ఉండేది. దీంతో ట్రైనింగ్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ తోటి వారి హేళనకు గురయ్యాను. ఒక చిన్న పట్టణం నుండి వెళ్లడం, ఇంగ్లీషులో పట్టులేకపోవడంతో మొదటి రోజు నుండి సవాళ్లు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సీనియర్లు క్లాస్ బయటకు పిలిచి ర్యాగ్ చేసేవారు. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అందుకు సెలవుల్లో నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆంగ్లంలో మాట్లాడటానికి మంచి పట్టు సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి స్కాలర్షిప్ కూడా వచ్చింది. సాధించినప్పుడే మన శక్తి బయటకు తెలుస్తుంది ప్రపంచంలోనే బి777 మహిళా కమాండర్లలో అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. నడిచొచ్చిన దారిని చూసుకుంటే అన్నింటిని ఎలా అధిగమించాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఎవరి ప్రయాణమూ అంత సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మనలోని ఆత్మ విశ్వాసం బయటకు కనిపిస్తుంది. కలలు సామాజిక అంచనాలకు, ఆర్థిక పరిమితులకు పరిమితం కాదని ఆ శక్తి గుర్తు చేస్తుంది. ఒక చిన్న పట్టణం నుండి ఏవియేషన్ కమాండింగ్ ఎత్తుల వరకు ఎదగడంలో నా బలహీనతలపై చాలా పోరాటం చేశాను’’ అని వివరిస్తుంది కెప్టెన్ అనీ దివ్య. -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. ఆ విషయంలో నెటిజన్ల ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో నటి దివ్య అగర్వాల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో నటి ఏడడుగులు నడిచింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ముంబయిలోని చెంబూర్‌లో జరిగిన వివాహా వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. 2022లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి ముందు వేడుకలు కాక్టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. తర్వాత దివ్య అగర్వాల్ మెహందీ, హల్దీ వేడుక చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, నిక్కీ తంబోలి, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. కాగా.. హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్-2 తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు రియాలీటీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఏంటీవీ సీజన్- 10 రన్నరప్, ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్- 1, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచింది. ఆమె గతంలో వరుణ్ సూద్, ప్రియాంక్ శర్మతో రిలేషన్షిప్లో ఉంది. హల్దీ వేడుకపై ట్రోల్స్ దివ్య తన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వేడుకలో ఆమె లుక్ కంటే బ్యాక్‌గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వెనుక భాగంలో లేస్ చిప్స్ పాకెట్స్ దర్శనమిచ్చాయి. ఇది చూసిన కొందరు తక్కువ బడ్జెట్ డెకరేషన్ కోసం ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ రాస్తూ.. 'హల్దీ వేడుక కోసం చిప్స్‌తో అలంకరణ.. బడ్జెట్ అంత తక్కువగా ఉందా?' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
యజమాని వేధింపులు..శానిటైజర్ తాగిన యువతి
-
సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మీర్పేట్ టీచర్స్ కాలనీలోని గత కొంతకాలంగా సెలూన్లో పనిచేస్తున్న దివ్య అనే యువతి (18)పై యజమాని మురళి(35) లైంగిక దాడికి పాల్పడుతుండటంతో ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఓ సెలూన్ లో పని చేస్తున్న దివ్యను యజమాని మురళి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం. మంగళవారం 2024 జనవరి 30న మరళి సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్య(18)ను తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నం చేయగా.. దివ్య బయటికి వచ్చి అరవడంతో మురళి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో పలుమార్లు మురళి దివ్యను లైంగిక దాడి చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
Mangalavaaram: 'మంగళవారం' సినిమాలో ప్రెసిడెంట్ గారి పెళ్లాం ఫొటోలు చూశారా..దివ్యా పిళ్లైకి క్రేజ్ మామూలుగా లేదుగా!
-
మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే?
ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తనకు అచొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్‌ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్‌పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. పాయల్ రాజ్‌పుత్ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దివ్య ప్రస్థానం ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా.. దుబాయ్‌లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్‌లైన్స్.. అరబ్ ఎమిరేట్స్‌లో ఉద్యోగం వచ్చింది. కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి ఎయిర్‌లైన్ సిబ్బందిగా తన కెరీర్‌ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్‌లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్‌లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్, పలు షోలలో కనిపించింది. మంగళవారం కథేంటంటే? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. -
'నటితో అసభ్య ప్రవర్తన.. ఎయిర్పోర్ట్ అధికారులపై తీరుపై ఆగ్రహం'
ప్రస్తుత కాలంతో మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు సైతం బాధితులవుతున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి కొచ్చిన్ వెళ్తుండగా తన పక్కనే ఉన్న ప్రయాణికుడు వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 10న మంగళవారం జరగ్గా.. తాజాగా నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: ‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!) ఇన్‌స్టాలో దివ్య ప్రభ రాస్తూ.. 'ప్రియమైన మిత్రులారా.. నేను ముంబయి నుంచి కొచ్చికి ఎయిరిండియా ఫ్లైట్‌లో వచ్చా. ఈ ప్రయాణంలో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఫ్లైట్‌లో తోటి ప్రయాణీకుడు తాగిన మత్తులో నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌కు చెబితే.. టేకాఫ్‌కు ముందు నా సీటును మాత్రమే మార్చారు. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత సమస్యను ఎయిర్పోర్ట్ అధికారులకు వివరించాను. వారు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు సహాయ పోస్ట్‌కు వెళ్లమని సలహా మాత్రమే ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశా. ప్రయాణీకుల భద్రత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకుందాం. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిద్దాం. ఈ విషయంలో మీ సపోర్ట్ కావాలి' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్! ) ఈ వేధింపులకు సంబంధించి కంప్లైంట్‌తో పాటు ఎయిరిండియా ప్లైట్ టికెట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని.. అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బంది, అధికారుల స్పందన తనను నిరాశకు గురిచేసిందని దివ్య ప్రస్తావించారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ దివ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. మలయాళ నటి అన్నా బెన్ దివ్యకు మద్దతుగా పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Divyaprabha (@divya_prabha__) -
రొటీన్‌కి భిన్నంగా..! ఆనంద్ మహీంద్రా కూతుళ్ల గురించి తెలుసా?
Anand Mahindra daughters: ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన పూర్తి పేరు ఆనంద్ గోపాల్ మహీంద్రా. ఎయిర్‌క్రాఫ్ట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, విడిభాగాలు , నిర్మాణ పరికరాలు, రక్షణ, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ తదితర అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. మహీంద్రా & మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా వారసుడు ఆనంద్ మహీంద్రా. ఫోర్బ్స్ 2023 నివేదిక ప్రకారం.. ఆయన నెట్‌వర్త్ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 21 వేల కోట్లకుపైనే). జర్నలిస్టు అనురాధను పెళ్లాడిన తర్వాత ఈ దంపతులకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినప్పటికీ పలు విభిన్న అంశాలపై స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఆయన కుమార్తెలు మాత్రం ప్రచారాలకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మందికి వీరి గురించి పెద్దగా తెలియదు. రొటీన్‌కి భిన్నంగా.. సాధారణంగా పారిశ్రామికవేత్త పిల్లలు తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాల్లో పాలుపంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆనంద్ మహీంద్రా కుమార్తెలు మాత్రం వారి తల్లికి చెందిన మ్యాగజైన్లో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సతీమణి అనురాధ వెర్వ్, మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్లకు ఎడిటర్‌గా ఉన్నారు. వివాహానికి ముందే ఆమె వెర్వ్ పత్రికను స్థాపించారు. వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివారు. 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె వివిధ సంస్థలలో ఫ్రీలాన్సర్‌గా, పార్ట్ టైమ్ ఉద్యోగిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో ఆమె వెర్వ్ మ్యాగజైన్లో ఆర్ట్ డైరెక్టర్‌గా చేరారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా వెర్వ్ మ్యాగజైన్లో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లుళ్లిద్దరూ విదేశీయులే.. ఆనంద్ మహీంద్రా పెద్ద కుమార్తె దివ్య న్యూయార్క్‌లో మెక్సికన్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకున్నారు. అలాగే రెండవ కుమార్తె ఆలికా కూడా ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా పూర్తిగా భిన్నమైన సంస్కృతులలో జరిగిన వీరి వివాహాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. -
టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్‌ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్‌లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. జు వెన్జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్‌గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
రైలు నుంచి పడి ట్రాన్స్‌జెండర్ దుర్మరణం
జనగాం : రైలు నుంచి జారి పడి ఓ ట్రాన్స్‌జెండర్ దు ర్మరణం చెందిన సంఘటన రఘునాథపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగెం మండలం ఎల్గూరుస్టేషన్ తూర్పుతండాకు చెందిన ట్రాన్స్‌జెండర్ బాదావత్ అనిల్ అలియాస్ దివ్య (25) సికింద్రాబాద్ నుంచి శాతవాహన రైలులో కాజీపేటకు వస్తుంది. దివ్య రఘునాథపల్లి రైల్వేస్టేషన్ రెండోప్లాట్‌ఫాంపై చేరుకోగానే నెమ్మదిగా రైలు వెళ్తున్న క్రమంలో కిందికి దిగబో తూ ప్రమాదవశాత్తు కాలుజారి రై లు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే రైలులో ప్ర యాణిస్తున్న మృతుడి స్వగ్రామానికి చెందిన బాలు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి
కోలీవుడ్‌లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్‌తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్‌పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్‌పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్‌పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) -
నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి
తమిళ సీరియల్స్‌తో కన్నా వివాదాలతోనే బాగా ఫేమసయ్యాడు నటుడు అర్ణవ్. సహనటి దివ్య శ్రీధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి అర్ణవ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు గుంచి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది. 10 ఏళ్ల క్రితమే ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్‌ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ ఆడియో క్లిప్పింగ్స్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి విషయం దాచిన నటి కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది. ఒకరిపై మరొకరు నిందారోపణలు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి దివ్య గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్ణవ్. అటు దివ్య కూడా తన భర్తకు వేరే నటితో సంబంధం ఉందని తెలిసి, షూటింగ్ స్పాట్‌కు వెళ్లి నిలదీస్తే కొట్టిందని, భర్త కూడా తనపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. చదవండి: వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు చూశారా? గ్లామర్‌కు నో చెప్పను, కానీ వల్గారిటీ మాత్రం.. -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్‌మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
దివ్యమైన ఐడియా సుమీ!
అమెరికాలో నివసిస్తున్న దివ్య మయ్యా చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ ఇంటర్నెట్ మినీ సెలబ్రిటీగా మారింది. ‘స్కీయింగ్‌కు చీర ధరించడమే కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అది భారతీయతను ప్రతిఫలించే ప్రతీక మాత్రమే’ అంటుంది దివ్య. దివ్య వీడియోల పుణ్యమా అని ఎంతోమంది మహిళలు చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ, భారతీయతను చాటుకుంటూ ‘భేష్’ అనిపించుకున్నారు. చీరె ధరించి స్కీయింగ్ చేయడానికి సంబంధించిన సలహాలు దివ్యను అడుగుతుంటారు. తన ఛాయిస్ మాట ఎలా ఉన్నా... హెల్మెట్, గ్లోవ్స్‌లాంటి సేఫ్టీలను ధరించడం మాత్రం దివ్య మరవదు. చీర ధరించే కాదు లెహెంగా ధరించి కూడా స్కీయింగ్ చేయగలను అంటూ చేసిన వీడియో వైరల్ అయింది. -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్‌టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్‌ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్‌తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
భర్తకు విడాకులు.. పాపకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్-దివ్యలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అర్ణవ్‌ను అరెస్ట్ చేయించింది దివ్య. గర్భంతో ఉండగా తన కడుపుపై తన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది. 'ఈ ఎదురుచూపులు ఎంతో ప్రత్యేకమైనవి. గతంలో ఏం జరిగిందనేదానికంటే ఇకమీదట ఎలా ఉండబోతుందనేది నాకు ముఖ్యం. నువ్వు నాకిచ్చిన ప్రేమ, బలం, సపోర్ట్.. అన్నీ అడగకముందే ఇచ్చావు. నాలో భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికీ నేను నీదాన్నేనని మాటిస్తున్నాను. ఎన్నటికీ నీవెంటే ఉంటాను. నా అందమైన చిట్టిత్లలి.. లవ్యూ డార్లింగ్. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. కాగా సెవ్వంధీ అనే తమిళ సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది దివ్య శ్రీధర్. తొలి సీరియల్‌తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందు 2012లోనే దివ్యకు పెళ్లై, పాప కూడా ఉంది. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో అర్ణవ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ గతేడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు గతంలో పెళ్లై, పాప కూడా ఉందన్న అర్ణవ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. మరోపక్క అర్ణవ్ సహనటితో సంబంధం వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు చేసింది దివ్య. ఇందుకు సంబంధించిన ఆడియోకాల్ కూడా లీకవగా అది సోషల్ మీడియాలో వైరలయింది. View this post on Instagram A post shared by Divya Shridhar (@divya_shridhar_1112) -
'నిద్రపోతుంటే నా నడుము తడిమాడు'.. బుల్లితెర నటి
తమిళ నటి దివ్య గణేశ్ టాలీవుడ్‌కు అంతగా పరిచయం లేదు. తమిళంలో బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆమె సన్ టీవీలో ప్రసారమైన కేలాడి కన్మణి అనే సీరియల్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లక్ష్మీ వందచూ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించారు. కేవలం సీరియల్స్‌లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా ఆమె నటించారు. ప్రముఖ సీరియల్ సుమంగళిలో అను సంతోష్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె 2019లో విడుదలైన అట్టు అనే తమిళ చిత్రంలో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తనకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. దివ్య మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్‌లో బయలుదేరా. అప్పుడు విమానంలో ప్రయాణికులు కొద్దిమందే ఉన్నారు. నేను చివర్లో కూర్చుని నిద్రపోతూ ఉన్నా. ఆ సమయంలో నా నడుము దగ్గర ఏదో తగులుతున్నట్లు అనిపించింది. మొదట నేను దాని గురించి నేను పట్టించుకోలేదు. పదే పదే అలా అవుతుంటే ఏంటా అని చూశా. నా వెనకాలే కూర్చున్న వ్యక్తి నడుమును తడుముతూ ఉన్నాడు. మొదట నేను ఏదైనా పురుగేమో అనుకున్నా. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ తిన్నా. దీంతో వెంటనే పైకి లేచి అతడి చెంపపై చెల్లుమనిపించా.' అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే మహిళల పట్ల జరిగే వేధింపులకు అస్సలు భయపడకూడదన్నారు దివ్య గణేశ్. కాగా.. 2022లో దివ్య విజయ్ టీవీలో ప్రసారమయ్యే బాకియలక్ష్మి సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by divyaganesh (@divya_ganesh_official) -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
ఉదయ్ కిరణ్ చిత్రంతో ఎంట్రీ.. తీవ్ర గాయాలపాలైన హీరోయిన్
టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ పేరు తెలియని వారు ఉండరు. అప్పట్లో యంగ్ హీరో తన సినిమాలతో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆయన తన కెరీర్‌ను ముగించారు. ఉదయ్ కిరణ్ కెరీర్లో 2004లో నటించిన చిత్రం 'లవ్ టుడే'. ఈ సినిమాలో ఉదయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా నటించింది. తన కెరీర్లో టాలీవుడ్ సినిమాతోనే సినీరంగంలో ప్రవేశించింది బాలీవుడ్ భామ. తీవ్ర గాయాల పాలైన నటి ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోన్న బాలీవుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ మూవీ షూటింగ్లో పాల్గొన్న దివ్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇవీ చూసిన ఆమె అభిమానులు 'గెట్ వెల్ సూన్' అంటూ పోస్టులు పెడుతున్నారు. దివ్య ఖోస్లా ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..' నా రాబోయే చిత్రంలో ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు నా ముఖంపై తీవ్రమైన గాయమైంది. కానీ షూటింగ్ మాత్రం కొనసాగాలి. నేను త్వరగా కోలుకోవడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. ' అంటూ పోస్ట్ చేశారు. జాన్ అబ్రహంతో ప్రేమ పాట చిత్రీకరించినప్పుడు భర్త భూషణ్ కుమార్ సెట్లో ఉన్నారని దివ్య ఖోస్లా కుమార్ చెప్పారు. కాగా.. దివ్య ఖోస్లా తన తదుపరి చిత్రం యారియాన్ -2లో కనిపించనుంది. ఇది దివ్య ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన హిమాన్షు కోహ్లీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రానికి సీక్వెల్. మీజాన్ జాఫ్రీ, యష్ దాస్ గుప్తా ప్రధాన పాత్రలలో దివ్య నటించారు. వారినా హుస్సేన్, ప్రియా వారియర్, పెరల్ వి పూరి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) -
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
తగ్గేదే లే సినిమా హీరోయిన్ దివ్యా పిళ్లై (ఫోటోలు)
-
UP Board 12th Result 2022: ముందు అక్క, తర్వాత చెల్లి.. యూపీలో ఇంటర్ టాపర్లుగా కవలలు
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్‌గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో. మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్‌గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్‌కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి. -
నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ, పెళ్లి
బుల్లితెర నటులు దివ్య, అర్నవ్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తనని మోసం చేశాడంటూ అర్నవ్‌పై దివ్య ఇటీవల ఆరోపణలు చేయగా.. తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా దివ్య కంటే ముందు అర్నవ్ తనని పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియదర్శిని అనే ట్రాన్స్‌జెండర్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: భర్త జయంతి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నటి మేఘన ఈ మేరకు ఆమె ఓ ఆడియో రికార్డ్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళంలో ఉన్న ఈ ఆడియోలో ప్రియాంక ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘నాకు, అర్నవ్‌తో టీ నగర్లో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల పాటు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఉన్నట్టుండి అర్నవ్లో సడెన్‌గా మార్పు వచ్చింది. తరచూ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడికి మరో మహిళతో పరిచయం వల్లే నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు. నన్ను తీవ్రంగా హింసించాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. అర్నవ్ ఓ సైకో’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు ఇక అతడి వేధింపులు తట్టుకోలేక తాను అర్నవ్ నుంచి విడిపోయానంటూ ప్రియదర్శిని తెలిపింది. ఇదిలా ఉంటే కేలాడి కన్మణి అనే సీరియల్ షూటింగ్లో సమయంలో నటి దివ్య, అర్నవ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2022 జూన్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భంగా దాల్చింది. ఇప్పుడు అర్నవ్ తనని వదిలేసి మరో నటితో క్లోజ్‌గా ఉంటున్నాడంటూ దివ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
దివ్య భర్తపై ముద్దుల వర్షం.. నటి అన్షిత ఆడియో కాల్ లీక్
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్- దివ్యల వివాదం మరింత ముదురుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ దివ్య శ్రీధర్.. అర్ణవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. 'చెల్లమ్మ' సీరియల్ నటి అన్షిత.. దివ్యపై ఫైర్ అయిన ఆడియో కాల్ నెట్టింట లీక్ అయింది. ఇందులో దివ్యను రెచ్చగొట్టేలా ఆమె అర్ణవ్‌కు ప్రపోజ్ చేస్తూ ముద్దులు పెట్టింది. ఆ ఆడియో కాల్లో అన్షిత మాట్లాడుతూ.. నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తా. మీ జీవితాల్లోకి నేను రావాలనుకుంటున్నావా? అని అడిగింది. అందుకు దివ్య.. నువ్వొక ఆడదానివేనా? ఇంకో ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అని ప్రశ్నించగా.. నిన్ను కొట్టి చంపాలన్నంత కోపం ఉందని బదులిచ్చింది అన్షిత. నీవల్ల నా భర్త జీవితం ఇబ్బందుల్లో పడుతుందని తెలిసినప్పుడు ఒక స్నేహితురాలిగానైనా అతడి లైఫ్ నుంచి పక్కకు తప్పుకోవచ్చు కదా అని కోరింది దివ్య. అలా ఇద్దరూ వాదులాడుకుంటున్న సమయంలో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న అర్ణవ్‌కు అన్షిత ఏకంగా ప్రపోజ్ చేసింది. అర్ణవ్, ఐ లవ్ యూ సో మచ్.. అంటూ అతడికి ఫోన్లోనే ముద్దుల వర్షం కురిపించింది. నీ ముందే నీ భర్తకు ముద్దు పెట్టా, ఇప్పుడేం చేస్తావ్? అని రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ ఆడియోకాల్ వైరల్‌గా మారింది. కాగా దివ్యకు 2012లోనే ఓ వ్యక్తితో పెళ్లై పాప కూడా ఉంది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. ఆ సమయంలో ఆమెకు గతంలో పెళ్లై పాప కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మరోవైపు అర్ణవ్ వేరే నటితో సంబంధం పెట్టుకున్నాడని దివ్య ఆరోపిస్తోంది. ఈ విషయంపై దివ్య అటు పోలీసులకు ఇటు కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసింది. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం, హీరో అరెస్ట్ బిగ్‌బాస్ షో నుంచి అతన్ని తీసేయండి -
వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసే ప్రయత్నం చేసింది: అర్ణవ్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తపై బుల్లితెర నటి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య (35) చెన్నైలో నివసిస్తోంది. ఈమెకు 2012లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. అయితే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. టీవీ సీరియళ్లలో నటిస్తున్న క్రమంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. దివ్య ఇస్లాం మతం తీసుకుని ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లయిందని, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దివ్య తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. వాటిని డిలీట్ చేయమని అర్ణవ్ ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు దివ్య నిరాకరించడంతో ఆమెపై ఆవడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య తనకు తెలియకుండానే వేరే వ్యక్తితో కలిసి గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి దివ్య గురువారం రాత్రి చెన్నై కమిషనర్ కార్యాలయంలో తన భర్తపై ఫిర్యాదు చేసింది. అందులో తాము చట్ట ప్రకారం భార్యభర్తలుగా కాపురం చేస్తున్నామని అయితే తన భర్తకు వేరే నటితో సంబంధం ఉన్న విషయం తెలిసి తాను ఆమె నటిస్తున్న షూటింగ్ స్పాట్‌కి వెళ్లి నిలదీశానని, దీంతో ఆమె తనను వాటర్ బాటిల్‌తో కొట్టిందని పేర్కొంది. తన భర్త కూడా తనపై దాడిచేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. -
మరో నటితో భర్త వివాహేతర సంబంధం, పోలీసులను ఆశ్రయించిన నటి దివ్య
భర్త తనని మోసం చేశాడంటూ ప్రోలీసులను ఆశ్రయించింది బుల్లితెర నటి దివ్వ శ్రీధర్. మరో నటితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని కూడా తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సన్‌టీవీలో ప్రసారమయ్యే తమిళ సీరియల్ సెవ్వంధీతో దివ్వ శ్రీధర్ నటిగా గుర్తింపు పొందింది. చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు ఆ తర్వాత కేలడి కన్మణి సీరియల్లో తన సహానటుడైన ఆర్నవ్తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొద్ది రోజులు రిలేషన్షిప్ ఉన్న అనంతరం సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. అయితే తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించవద్దని ఆర్నావ్ దివ్యను కోరిటన్లు ఆమె పోలీసులకు పేర్కొంది. అదే సమయంలో అతడు మరో నటితో ప్రేమలో ఉన్నాడని, దీంతో తాను భర్తను నిలదీసి అందరి సమక్షంలో తనని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ పెళ్లి చేసుకున్నామని ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్ ప్రస్తుతం తాను గర్భవతి అని, అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. తనతోపాటు పుట్టబోయే బిడ్డకు ఆర్నావ్ వల్ల ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అంతేకాదు ఆర్నవ్ బలవంతంగా తనకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. తనకి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. అంతేకాదు ఈ విషయమై ఆమె కమిషనర్‌ను కూడా ఆశ్రయించినట్లు చెప్పింది. -
సృజన: తెలుగింటి బార్బీ
పట్టులంగా, ఓణీ కట్టిన బొమ్మలు కాళ్లకు పారాణి, నుదుటన బాసికం కట్టిన బొమ్మలు, పసుపు కొట్టే బొమ్మలు.. పందిట్లో బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, అబ్బురపరిచే బొమ్మలు.. చిందేసే బొమ్మలు.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే బొమ్మలు ..,ఎవ్వరి చూపులనైనా కట్టిపడేసేలా ఉండే బొమ్మలేవీ అంటే.. అవి దివ్య తేజస్వి చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలై ఉంటాయి. వెస్ట్రన్ బార్బీ డాల్‌ను ఇండియన్ డాల్‌గా మార్చేసి, వాటిని మన సంప్రదాయ వేడుకలకు అనువుగా మార్చేసింది హైదరాబాద్ ఎఎస్‌రావు నగర్‌కు చెందిన దివ్య తేజస్వి. అమ్మాయి పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు ప్రతి వేడుకను బొమ్మల్లో అందంగానూ, అర్థవంతంగానూ చూపుతూ పది మందికి ఉపాధి కల్పిస్తోంది. భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్న దివ్య ఈ అందమైన బొమ్మల రూప కల్పన గురించి అడిగితే ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, పదిమందికి ఆదాయవనరుగా ఎలా మారిందో నవ్వుతూ వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘దసరా వచ్చిందంటే బొమ్మల కొలువు గురించి ఆలోచన చేయకుండా ఉండరు. అలాగే, ఒక బొమ్మనైనా ఇంటికి తెచ్చుకుంటారు. నేను ఇంట్లోనే బొమ్మల తయారీ మొదలుపెట్టాను. పాప ముచ్చట తీర్చిన బొమ్మ అమ్మానాన్నలది వెస్ట్ గోదావరి. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. బయోకెమిస్ట్రీ చేశాను. జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్లాను. అక్కడ టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. మాకు ఓ పాప. హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అనుకున్న సమయంలో కరోనా మా జీవితాలను దెబ్బతీసింది. మా ఉద్యోగాలు పోయాయి. అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఓరోజు మా పాప తన బొమ్మకి డ్రెస్ వేసివ్వమంటే, నా చీర అంచుతో చీరకట్టి, అలంకరించి ఇచ్చాను. దాన్ని ఫొటో తీసి ఇన్‌స్టా పేజీలో పెట్టాను. ఆర్డర్లు తెచ్చిన బొమ్మలు నేను పెట్టిన బొమ్మ ఫొటో నచ్చి అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు. ‘నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. మా అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఉంది. వచ్చినవారికి రిటన్‌గిఫ్ట్ ఇవ్వాలి. నాకు అలాంటి బొమ్మలు ఒక పదిహేను కావాలి. చేసిస్తారా..’ అంది. నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. ఆ నెల రెంట్ ఇవ్వకుండా ఓనర్‌తో మాట్లాడి, ఆ డబ్బుతో బార్బీ బొమ్మలు, వాటికి కావల్సిన మెటీరియల్ తీసుకొచ్చాను. వ్యాపారం అనుకోలేదు. కానీ, ముందు గణేషుడి బొమ్మ తయారు చేశాను. ఆ ముద్దు వినాయకుడిని చూసి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక వెస్ట్రన్ కల్చర్‌తో ఉండే బార్బీ బొమ్మను తెలుగింటి సంప్రదాయం అద్దుకునేలా తయారు చేయడానికి చాలా ప్రయోగాలే చేయాల్సి వచ్చింది. జుట్టు రంగు, స్కిన్కలర్, కళ్లు.. వీటితో పాటు డ్రెస్సింగ్.. చాలా సమయమే తీసుకుంది. కానీ, ఒక్కో బొమ్మ తయారు చేసి, అనుకున్న సమయానికి పంపాను. ఆ ఆర్డర్ తర్వాత మరో ఆర్డర్ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాం. సందర్భానికి తగిన కానుకలు మా అమ్మనాన్నలకు నేను, చెల్లి సంతానం. మా చిన్నప్పుడు మేం ఆడుకోవడానికి మా అమ్మ క్లాత్‌తో బొమ్మలు కుట్టి, చీరలు కట్టి, వాటికి పూసలతో అలంకారం చేసేది. నాకు అదంతా గుర్తుకువచ్చింది. మన సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. వాటిని ఉదాహరిస్తూ బొమ్మలు తయారు చేసేదాన్ని. మొదట్లో అంతగా గుర్తింపు లేదు కానీ మెల్ల మెల్లగా గుర్తింపు రావడం మొదలైంది. పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు అమ్మాయి పుట్టిన నాటి నుంచి ప్రతీది వేడుకలాగే సాగుతుంది ఆమె జీవితం. ఒక ఆర్డర్ అయితే వాళ్లమ్మాయి మొదటి రోజు స్కూల్‌కి వెళుతోంది, ఆ రోజును పురస్కరించుకుని బొమ్మ కావాలని అడిగారు. ఉయ్యాల నుంచి విద్యాభ్యాసం, ఓణీ ఫంక్షన్, పెళ్లి, సీమంతం, గృహప్రవేశం, షష్టిపూర్తి ... వరకు ఇలా ప్రతి దశలోనూ జరిగే వేడుక సందర్భాన్ని తీసుకొని, దానికి అనుగుణంగా బొమ్మల సెట్స్‌ను తయారుచేయడం ప్రారంభించాను. ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాతోపాటు నాకు తెలిసిన స్నేహితులు జత కలిశారు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకరు డ్రెస్ కుడతారు, మరొకరు హెయిర్ బ్లాక్‌గా రావడానికి, ఇండియన్ స్కిన్ కలర్‌కి తేవడానికి, కళ్లు డిజైన్ చేయడానికి కష్టపడతారు. మొదట్లో నాకు ఒక్క బొమ్మ చేయడానికి రోజు మొత్తం పట్టేది. ఇప్పుడు 2–3 గంటలు పడుతుంది. నేను చేసిన విధానం నేర్పించి, నా పనిలోకి తీసుకున్నవారిలో కాలేజీ అమ్మాయిలు, గృహిణిలు ఉన్నారు. వాళ్ల ఇంటి వద్దే వర్క్ చేసిచ్చేవారున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మ, చెల్లెలు కూడా ఈ బొమ్మల తయారీలో భాగమయ్యారు. మా అమ్మ, మా చెల్లెలు బొమ్మలకు జడలు, పువ్వులు కుట్టి, పంపుతారు. మా వారు షాపింగ్ చేసుకొస్తారు. ఆన్లైన్లో చూసి, నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలు అలంకరణలో మార్పులు చేర్పులు, ప్యాకింగ్‌లో సాయం చేస్తుంటారు. మా చెల్లెలు ‘లలిత డాల్స్’ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా పేజీలో ఫొటోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇలా కొందరి చేయూతతో నా బొమ్మలు మరింత అందంగా రూపుకడుతున్నాయి. బడ్జెట్‌కు తగినట్టు.. ఒక బొమ్మ రూ. 200 నుంచి ధర ఉంది. వెడ్డింగ్ సెట్ అయితే రూ. 15000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో సెట్ కావాలంటే అందుకు తగినట్టు కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. ఇది దసరా సమయం కాబట్టి, అమ్మవారి బొమ్మలు, బతుకమ్మ ఆడుతున్న మహిళల బొమ్మల సెట్.. తయారుచేశాను. హైదరాబాద్‌లోని ఎఎస్‌రావునగర్‌లో ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాం. అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో పాటు పౌరాణిక గాధలు కూడా ఈ బొమ్మల ద్వారా చూపుతున్నాను’’ అని వివరించింది ఈ కళాకారిణి. – నిర్మలారెడ్డి -
ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి
‘మా అమ్మ ముగ్గురు పిల్లలను పెంచింది. ముగ్గురం ఐఐటి చదివాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని ఉత్తమమైన సంతానంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేను తెలుసుకున్నవి మీకు చెబుతాను. పనికొస్తాయేమో చూడండి’ అంటూ ఉత్తర ప్రదేశ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్ రాసిన ట్విట్టర్ పోస్టు వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె చెప్పిన పాఠాలు ఏమిటి? ‘మా అమ్మ నుంచి నేను పిల్లల పెంపకం నేర్చుకున్నాను. మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచింది. ముగ్గురం ఐ.ఐ.టికి వెళ్లాం. నేను ఐ.ఐ.ఎంలో కూడా చదివాను. ఆ తర్వాత 2013 కేడర్‌లో ఐ.ఏ.ఎస్ అయ్యాను. నా ఇద్దరు తోబుట్టువులు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఇదంతా మంచి పెంపకం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని నేను బాగా పెంచాలి. మా అమ్మ నుంచి నేర్చుకున్నవి, నాకు నేనై గ్రహించినవి మీకు చెప్తాను. ఉపయోగపడితే చూడండి’ అని ఉత్తరప్రదేశ్ ఐ.ఏ.ఎస్ అధికారి దివ్య మిట్టల్ రాసిన ట్విటర్ పోస్టు (వరుస) ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువ మంది మెచ్చిన పోస్ట్‌గా గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న దివ్య మిట్టల్ అప్పుడప్పుడు ట్విటర్ ద్వారా నలుగురికీ ఉపయోగపడే కిటుకులు, స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తుంటుంది. ఇటీవల ఆమె పేరెంటింగ్ గురించి రాసిన పోస్టు కూడా అలాంటిందే. ఆమె నమ్మి చెప్పిన విషయాలు చాలామందికి నచ్చాయి. అయితే వీటితో విభేదించేవాళ్లు ఉండొచ్చు. ఉంటారు కూడా. కాని ఎక్కువమంది ఇలాగే పెంచాలని భావిస్తారు కాబట్టి దివ్యను మెచ్చుకుంటూ పోస్ట్‌ను వైరల్ చేశారు. దివ్య చెప్పిన పెంపకం పాఠాలు ఇలా ఉన్నాయి. ఏదైనా చేయగలరు అని చెప్పండి: పిల్లలకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా చేయగలవు అనే భావన వారిలో కల్పించాలి. నిన్ను నువ్వు నమ్ము అని తల్లిదండ్రులు పిల్లలకు తరచూ చెప్పాలి. ఆత్మవిశ్వాసమే వారిని లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో చేరుకోవడంలో సాయం చేయగలదు. పడనివ్వండి పర్వాలేదు: పిల్లలకు చిన్న నొప్పి కూడా కలగకుండా పెంచాలని చూడొచ్చు. జీవితం పూలపాన్పు కాదు. పరిష్కార పత్రాలతో అది సమస్యలను తేదు. పడి లేచి అందరూ ముందుకెళ్లాల్సిందే. అందుకే పిల్లల్ని బాగా ఆడనివ్వండి. పడనివ్వండి. లేవనివ్వండి. వాళ్లు పడగానే పరిగెత్తి పోకండి. విఫలమైనప్పుడు లేవడం వారికి తెలియాలి. లేచాక సరే.. పద అని వారితో పాటు ముందుకు పదండి. పోటీ పడాలి: వాళ్లను రకరకాల పోటీలలో పాల్గొనేలా చేయండి. గెలవడానికి మాత్రమే కాదు. ఓటమితో తగినంత పరిచయం ఏర్పడటానికి, ఓటమి కూడా ఉంటుందని తెలియడానికి వారు పాల్గొనాలి. ఓటమి కంటే ఓడిపోతామనే భయం ఎక్కువ ప్రమాదకరమైనది. ఓడినా పర్వాలేదు... పోటీ పడాలి అనేది నేర్పించాలంటే ఈ పని తప్పనిసరి. రిస్క్ కూడా ముఖ్యమే: పిల్లలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి సమయాలలో తప్పనిసరి పర్యవేక్షణ చేయండి. అంతే తప్ప అసలు రిస్కే వద్దు అనేలా ఉండొద్దు. అడ్వంచర్ స్పోర్ట్స్ ఆడతానంటే ఆడనివ్వండి. చెట్టు ఎక్కుతానంటే దగ్గరుండి ఎక్కించండి. అలాంటి సమయాలలో ప్రమాదం ఉందనిపిస్తే పిల్లలు జాగ్రత్త పడతారు. ప్రమాదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ అనుభవం వారికి నేర్పుతుంది. బోలెడన్ని అవకాశాలు: మా చిన్నప్పుడు ఇంత పేదగా ఉన్నాం... అంత పేదగా ఉన్నాం... కాబట్టి నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి... ఇలా కొందరు తల్లిదండ్రులు చెబుతుంటారు. అలా చెప్పక్కర్లేదు. ఈ లోకం చాలా పెద్దది... ఎక్కడ చూసినా అవకాశాలు ఉంటాయి... బోలెడంత సంపద ఉంది... నేర్చుకున్న విద్యకు విలువ ఉంటుంది... ఏదో ఒకటి సాధించడం కష్టం కాదు. కాని ఆ సాధించేదేదో పెద్దదే సాధించు అనే విధాన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. మీరే ఆదర్శం: పిల్లలకు తల్లిదండ్రులకు మించి రోల్‌మోడల్స్ ఉండరు. వారికి మీరే ఆదర్శంగా ఉండండి. మీరు ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటే పిల్లలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియక బాధ పడతారు. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో మీరు వారి ఎదుట అలా ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందలించండి: పిల్లలు తప్పు చేస్తే మందలించండి. ఇది సరిౖయెన పని కాదు అని గట్టిగా చెప్పండి. తప్పు లేదు. మంచి నడవడిక అంటే ఏమిటో వారికి తెలియాలి. వారిని నమ్మండి: మీ అంచనాకు తగినట్టుగా పిల్లలు లేకపోతే నిరాశ చెందకండి. ‘నీ మీద నమ్మకం పోయింది’ అని పిల్లలతో పొరపాటున కూడా అనకండి. మీరే వారిపై నమ్మకం పోగొట్టుకుంటే ఇక వారిని నమ్మేదెవరు. పిల్లలు కుదేలైపోతారు. అందుకని వారికి అవకాశం ఇవ్వండి. ‘నిన్ను నమ్ముతున్నాం. నువ్వు చేయగలవు. పర్వాలేదు. మళ్లీ ప్రయత్నించు’ అని చెప్పండి. భిన్న అనుభవాలను ఇవ్వండి: మీ పిల్లలకు లోకం చూపించండి. ఊళ్లు, కొత్త ప్రదేశాలు, అనాథ గృహాలు, సైన్స్ ల్యాబ్‌లు, భిన్న రంగాల పెద్దలు ఇలా మీకు వీలైనచోటుకు తీసుకెళ్లి వీలైన వారితో పరిచయం చేయించండి. తిరిగొచ్చేప్పుడు వారితో ఆ విషయాలను మాట్లాడండి. మీ పనుల్లో మీరు ఉండకండి. వారు చెప్పేది వినండి: పిల్లలు ఏదైనా చెప్పడం మొదలెట్టగానే నోర్మూయ్ నీకేం తెలియదు అనకండి. వాళ్లు శుంఠలనే భావన తీసేయండి. ముందు వారు చెప్పేది పూర్తిగా వినండి. వెంటనే రియాక్ట్ కావద్దు. ఆలోచించి అప్పుడు మాట్లాడండి. తాము చెప్పేది తల్లిదండ్రులు వింటారు అనే నమ్మకం పోతే పిల్లలు చెప్పడం మానేస్తారు. పోల్చకండి: మీ పిల్లలను ఇతర ఏ పిల్లలతో పోల్చకండి. అలాగే వారి తోబుట్టువులతో కూడా పోల్చకండి. మీరు మీ పిల్లల్లో ఒకరిని గారాబం చేస్తే వారు లోకంలో అంతా ఇంతే సుఖంగా ఉంటుంది అనుకుంటారు. ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే వారు గుర్తింపు కోసం, అంగీకారం కోసం పాకులాడే స్థితికి వెళతారు. కాబట్టి రెండూ వద్దు. ఇవీ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ చెప్పిన పెంపకం పాఠాలు. ఇక నిర్ణయం మీదే. -
సివిల్స్ కోచింగ్ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఉన్నత లక్ష్యంతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారుల వైపు అడుగుల వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళాయి దివ్య(22) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్ కోచింగ్ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కోచింగ్‌కు వెళుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తొలుత స్నేహితులుగా వ్యవహరించిన వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వరరెడ్డి ఊర్లోని, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా కోచింగ్ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. అతని మాయమాటలు నమ్మిన దివ్య పూర్తిగా అతని ఊబిలో కూరుకుపోయింది. లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో కూతురిని ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్న తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను మోసగించింది. వివిధ అవసరాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేసింది. ‘మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ వెంకటేశ్వరరెడ్డి మరికొంత డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో దివ్య తన మేనమామకు ఫోన్ చేసి రూ.లక్ష కావాలని కోరింది. అయితే అతనికి అనుమానం రావడంతో ఎందుకూ.. అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉదయం విశాఖ వచ్చి ఇస్తానని బదులిచ్చారు. దీంతో అప్పటికే తల్లిదండ్రులు, బంధువుల వద్ద అప్పులు చేసిన దివ్య తన వ్యవహారం బయట పడుతుందేమోనని ఆందోళనకు గురైంది. బుధవారం ఉదయం తన మేనమామ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున 3 గంటలకే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో పాటు తనకు వెంకటేశ్వరరెడ్డితో ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా లెటర్లో రాసి సూసైడ్ చేసుకోనున్నట్లు వెల్లడించి తన కజిన్‌తో పాటు తల్లిదండ్రులకు వాట్సప్ సందేశం పంపించింది. ‘కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: (పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య) మిస్సింగ్ కేసుతో వెలుగులోకి.. దివ్య రాసిన సూసైడ్ నోట్‌తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గురువారం ఎంవీపీ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రుషికొండ తీరానికి ఓ గుర్తుతెలియని యువకుడి మృత దేహం కొట్టుకొచ్చిన అంశంపై దృష్టిసారించారు. దీనిపై గురువారం ఆరిలోవ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించడంతో పాటు దివ్యతో సాన్నిహిత్యం ఉన్న వెంకటేశ్వరరెడ్డిగా నిర్ధారించారు. దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గురువారం రాత్రి సాగరతీరంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పోలీసులు ఊహించినట్లుగానే దివ్య మృతదేహం శుక్రవారం ఉదయం భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అయితే తొలి నుంచి వెంకటేశ్వరరెడ్డికి జల్సాలు అలవాటు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసిగిపోవడంతో పాటు అతని అప్పుల కారణంగా మూడెకరాలు పొలం కూడా అమ్మేసినట్లు తెలిపారు. దీంతో ఐదేళ్లుగా వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా ఘర్షణ జరిగి మత్స్యవాత పడ్డారా? అనే అనుమానం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్‌ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు కంఠెవరం బాలిక
సాక్షి, తెనాలి: అనతికాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుని అందరి ప్రశంసలూ అందుకుంటుంది కంఠెవరం బాలిక నాగం జ్ఞాన దివ్య. త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ మెరవనుంది. ఫిట్నెస్ కోసమని సాధన ప్రారంభించిన ఏడాదిలోనే టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరగనున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ విభాగంలో సత్తా చాటనుంది. కుటుంబ నేపథ్యం ఇదీ.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరంలోని కేబుల్ ఆఫీసులో పనిచేసే నాగం వెంకటేశ్వరరావు, సుధారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూజిత బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. రెండో కుమార్తె జ్ఞానదివ్య గత మార్చిలో ఇంటర్ పూర్తిచేసింది. దివ్య ఫిట్నెస్ కోసమని గ్రామంలోని మాతృశ్రీ వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీలో ఏడాది కిందట చేరింది. నిత్యం సాధన చేసింది. ఆమె ఆసక్తిని గమనించిన ఫవర్ లిఫ్టర్ కొల్లిపర నాగశిరీష దివ్యను ప్రోత్సహించారు. పవర్‌లిఫ్టింగ్‌లో మెళకువలు నేర్పారు. నందివెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నాగశిరీష పవర్‌లిఫ్టింగ్‌లో నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్. తనలాగే జ్ఞాన దివ్య కూడా జాతీయస్థాయిలో సత్తా చాటాలనే ఉద్దేశంతో చక్కని తర్ఫీదునిచ్చారు. నాగశిరీష, ఆళ్ల వెంకటరెడ్డి, సోమిశెట్టి కోటేశ్వరరావు, సుభాన్‌వలి తదితర లిఫ్టర్ల సలహాలతో దివ్య అనేక పతకాలు సాధించింది. దివ్య విజయాలు ఇవీ.. ► 2021 నవంబరు 21, 22 తేదీల్లో జగ్గయ్యపేటలో జరిగిన స్టేట్‌మీట్ క్లాసిక్ కేటగిరీలో బంగారు పతకం. ► కేరళలోని అలప్పుజలో జరిగిన జాతీయస్థాయి 84 ప్లస్ కేటగిరీలో బంగారు పతకం. ► అనకాపల్లిలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో ఎక్విప్డ్ విభాగంలో రజతం. ► మంగళగిరిలో గత జూన్ 9న జరిగిన స్టేట్‌మీట్ ఎక్విప్డ్‌లో 84 ప్లస్ విభాగం స్క్వాడ్‌లో 187.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 160 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 55 కిలోల బరువులనెత్తి బంగారు పతకాలు కైవసం. ► హైదరాబాద్‌లో ఈనెల 5న జరిగిన నేషనల్ సెలక్షన్స్‌లో స్క్వాడ్‌లో బంగారు, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో రజత పతకాలు. ► ఈనెల 16న విశాఖపట్టణంలో జరిగిన 9వ రాష్ట్రస్థాయి క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం. ► ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కేరళలో జరగనున్న నేషనల్స్‌కు అర్హత. ► ఆగస్టు ఆఖరు నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక. (క్లిక్: సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!) -
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బిగ్‌బాస్ విన్నర్.. షాక్‌లో అభిమానులు
టెలివిజన్ నటి, మోడల్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విజేత దివ్య అగర్వాల్ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ప్రియుడు వరుణ్ సూద్‌తో 4 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫోటోను షేర్ చేస్తూ ఆదివారం ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘జీవితం సర్కస్ లాంటిది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరి నుంచి ఏదీ ఆశించొద్దు. అదే నిజం. సెల్ఫ్ లవ్ తగ్గిపోవడం మొదలైనప్పుడు ఏమి జరుగుతుంది ? నా జీవితంలో జరుగుతున్న దేనికి నేను ఎవరినీ నిందించను. అదే మంచిది. నా కోసం నేను బతకాలనుకుంటున్నాను. నేను కోరుకున్న విధంగా సొంతంగా జీవించాడానికి సమయం వెచ్చించాలనుకుంటున్నాను అని అధికారికంగా ప్రకటిస్తున్నాను. చదవండి: ప్రభాస్ సినిమాకి టైటిల్ మారనుందా? త్వరలోనే అప్డేట్ ఒక నిర్ణయం తీసుకోడానికి పెద్ద పెద్ద కారణాలు, సాకులు అవసరం లేదు. దీని నుంచి బయటపడటానికి ఇది నేను తీసుకున్న నిర్ణయమే. తనతో గడిపిన క్షణాలన్నీ సంతోషకరమైనవే. అతను గొప్ప వ్యక్తి. తనెప్పుడూ నాకు మంచి స్నేహితుడే. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి.’ అంటూ ప్రియుడు వరుణ్‌తో బ్రేకప్ గురించి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) కాగా టెలివిజన్ సిరీస్ ఏస్ ఆఫ్ స్పేస్‌లో పాల్గొనడానికి ముందే వరుణ్, దివ్య స్నేహితులు. అక్కడి నుంచి వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వరుణ్ దివ్యకు ప్రపోజ్ చేయడంతో వీరిద్దరి లవ్ ట్రాక్ ఆఫీషల్ అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. అయితే ఇలా అనుకోకుండా వరుణ్, దివ్య విడిపోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. చదవండి: చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ -
బుల్లెటు బండెక్కి డుగ్గుడుగ్గుమని వచ్చేత్తపా... వచ్చేత్తపా
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్‌గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు. ‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత: ‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’ ‘ఈ పాప బుల్లెట్‌బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’ ‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’ కొద్దిసేపటి తరువాత.... ‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్నేమ్’ కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్‌హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్‌లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది? తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు. మెకానిజం అంటే ఆమెకు పాషన్! నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్‌షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది. యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది. ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది. శభాష్ దివ్యా! -
విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..
సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లు. మంచి చెడులు ఆలోచించగల విచక్షణ ఉన్నవారు. కష్టాలు కలకాలం ఉండవనే నిజం తెలిసిన వారే. అయినా క్షణికావేశానికి గురయ్యారు. పెళ్లి విషయంలో ధైర్యం చూపిన ఈ దంపతులు.. బతికే విషయంలో మాత్రం తెగువ చూపలేకపోయారు. రేగిడి మండలంలోని తునివాడకు చెందిన నవ దంపతులు పల్లి హరీష్(29), రుంకు దివ్య(20) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణం వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు) వివరాలు సేకరిస్తున్న ఎస్.ఐ షేక్ మహమ్మద్ ఆలీ మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్ ఎంసీఏ చదివాడు. అదే గ్రామానికి చెందిన రుంకు దివ్య డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఒకే గ్రామం, ఒకే సా మాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నేహి తుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖలో కొత్త కాపురం పెట్టారు. ఇద్దరూ ఉద్యోగాల వేటలో పడ్డారు. రెండు రోజుల కిందటే ఊరికి వచ్చిన ఈ దంపతులు అబ్బాయి ఇంటిలో ఉన్నారు. బుధవారం ఏమైందో గానీ ఇద్దరూ ఇంటిలో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవులయ్యారు. కేసు నమోదు విషయం తెలిసిన వెంటనే సీఐ జి.శంకరరావు, ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తునివాడ గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని, ఇంటిని పరిశీలించా రు. వీరితో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అనంతరం శవ పంచనామా చేసి రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు. చదవండి: (కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం) -
బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌గా దివ్య, ఎంత గెలుచుకుందంటే?
బిగ్‌బాస్ ఓటీటీ షో గ్రాండ్‌గా ముగిసింది. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో బుల్లితెర నటి దివ్య అగర్వాల్ విజేతగా అవతరించింది. శనివారం(సెప్టెంబర్ 18)న జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో దివ్య బిగ్‌బాస్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. నిషాంత్ భట్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. షమితా శెట్టి, రాకేశ్ బాపత్, ప్రతీక్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ స్పెషాలిటీ ఏంటంటే? హిందీలో బిగ్‌బాస్ 14 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో 15వ సీజన్ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సీజన్ రావడానికి ముందే ప్రయోగాత్మకంగా బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ వూట్లోనే ప్రసారమైంది. ఏడు వారాలపాటు ప్రసారమైన ఈ షోను మినీ బిగ్‌బాస్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో బిగ్‌బాస్ ఓటీటీ టైటిల్ గెలుచుకున్న దివ్య బిగ్‌బాస్ 15వ సీజన్లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అదే సమయంలో ప్రతీక్.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 15వ సీజన్లో పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎవరీ దివ్య అగర్వాల్ దివ్య అగర్వాల్ విషయానికొస్తే ఆమె నటి, డ్యాన్సర్. MTV స్ప్లిట్స్‌విల్లా 10వ సీజన్లో పాల్గొన్నప్పుడు ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతేకాదు, ఈ సీజన్లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. MTV ఏస్ ఆఫ్ స్పేస్ 1లో పాల్గొని విజేతగా అవతరించింది. రియాలిటీ షోస్ క్వీన్ దివ్య ద ఫైనల్ ఎగ్జిట్ అనే సినిమాలోనూ నటించింది. గతంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక శర్మతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంతో ఆమె మరింత హైలైట్ అయింది. ప్రస్తుతం ఆమె ఖత్రోన్ కీ ఖిలాడీ 11వ సీజన్ ఫేమ్ వరుణ్ సూద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు భోగట్టా! View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
దివ్యమైన కల
అమ్మాయిలందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. ముంబైకు చెందిన దివ్య పెరియసామి ఆచార్యకు మాత్రం అతివలను మరింత అందంగా తీర్చిదిద్దడమంటే ఎంతో ఇష్టం. దీంతో బ్యూటిషియన్ కావాలని కలలు కనేది. కానీ సంప్రదాయ కుటుంబంలో పుటి ్టపెరిగిన దివ్య బ్యూటిషియన్ కావడం కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు. ఆమె కోరికను వారు వ్యతిరేకించేవారు. అయినా దివ్య మాత్రం తన కలను నిజం చేసుకునే మార్గాలను వెదికేది. ఈ క్రమంలో 2018లో ‘సలాం బాంబే ఫౌండేషన్’(ఎస్బీఎఫ్) వారు ‘స్కిల్స్ ః స్కూల్’ పేరిట శిక్షణ ఇస్తున్నట్లు దివ్యకు తెలిసింది. వెంటనే బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్‌లో చేరి బ్యూటిషియన్ కోర్సుకు సంబంధించిన అన్ని రకాల శిక్షణలు తీసుకుని, తరువాత ఓ పార్లర్లో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. పట్టుదలతో స్కిల్స్ నేర్చుకుని పార్లర్ పెట్టుకునే స్థాయి ఎదగడంతో తల్లిదండ్రుల మనసు కరిగి సంతోషంతో ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఇంటిదగ్గరే ‘దివ్యాస్ బ్యూటీ పార్లర్’ పేరిట పార్లర్‌ను ప్రారంభించి వివిధ రకాల బ్యూటీ సర్వీసులు, ఫేషియల్, మెనిక్యూర్, పెడిక్యూర్, మేకప్, మెహందీ డిజైన్స్ వంటి వాటన్నింటిని కస్టమర్లకు అందిస్తోంది. ‘‘పదిహేడేళ్ల అమ్మాయిగా ప్రభుత్వ పథకాలు పొందడం చాలా కష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకాలైనా 18 ఏళ్లు పైబడిన వారికే వర్తిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్బీఎఫ్ 16–20 ఏళ్లలోపు వారికి అందించే వొకేషనల్ శిక్షణ కార్యక్రమం నా కలను నిజం చేసింది. బడ్జెట్ నిర్వహణ, కస్టమర్లతో ఎలా మెలగాలి, సౌందర్య సాధనాల కొనుగోలు, వాడకం వాటిæరికార్డులు ఎలా నిర్వహించాలి అన్న అంశాలతోపాటు కొత్తరకం వ్యాపార అవకాశాల గురించి తెలుసుకున్నాను. గూగుల్ బిజినెస్, వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు ఎలా తెరవాలో నేర్చుకుని సొంతంగా నేనే బ్యానర్, విజిటింగ్ కార్డును రూపొందించుకున్నాను. ఇప్పుడు బ్యూటీపార్లర్ నడుపుతూనే, సొంతఫార్ములాతో హెయిర్ ఆయిల్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాను. బ్యూటిషియన్ కావాలన్న నా కలను ప్రారంభంలో కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటలు పట్టించుకోకుండా బ్యూటì షియన్ కోర్సుపై దృష్టిపెట్టి పార్లర్ పెట్టే స్థాయికి ఎదగడంతో అమ్మ వాళ్లు కూడా మనస్పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో సొంతంగా స్టూడియో పెట్టుకుని నాలాంటి మరి కొంతమంది అమ్మాయిలను బ్యూటిషియన్‌గా తీర్చిదిద్ది, ఉపాధి కల్పిస్తాను’’ అని దివ్య చెప్పింది. -
టాలీవుడ్లోకి కోడి రామకృష్ణ కూతురు ఎంట్రీ.. హీరో ఎవరంటే..
లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంటిమెంట్ – భక్తికి గ్రాఫిక్స్ జోడించి ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడాయన. అమ్మోరు, దేవి, అరుంధతి చిత్రాలు ఆ కోవలోకి వచ్చినవే. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలు రూపొందించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసురాలు సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. తొలి చిత్రానికి గాను కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు దివ్య అవకాశం ఇచ్చారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. KODI RAMAKRISHNA presents ! Kodi RamaKrishna's elder daughter @kodidivya announces her new production @KodiDivyaaEnt 's venturing into Production with @KiranAbbavaram 's #KA5 💥 A #ManiSharma Musical 🎹 Directed by #KaarthikShankar 🎬 pic.twitter.com/dgfnUkrFRg — Haricharan Pudipeddi (@pudiharicharan) July 15, 2021 -
Divya Gokulnath: ఆన్లైన్ టీచర్
టీచర్ కావాలన్నది ఆమె ఆశయం. అదొక్కటే కాదు, జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా వెళ్లలేదు. తన సొంత దేశస్థులకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నారు. బైజూస్ కో ఫౌండర్ అయ్యారు. ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. శక్తిమంతమైన ఎంట్ర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు బెంగళూరుకు చెందిన దివ్య గోకుల్‌నాథ్. భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్ – టెక్ కంపెనీ బైజూస్. ఈ యాప్‌కి ఎన భై మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఏడాదిన్నరగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ‘బైజూస్’ టీమ్ కొత్త కొత్త ప్రోడక్ట్స్‌ని తీసుకు వచ్చింది. ఉద్యోగులంతా వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ ఈ ఏడాది కాలంలో పనులు చేస్తూ ఎన్నో విజయాలు సాధించేలా చేశారు ఈ సంస్థ కో ఫౌండర్ దివ్య గోకుల్‌నాథ్. విద్యార్థిగా చేరి... బైజూస్‌లో ఒక స్టూడెంట్‌గా చేరి కో ఫౌండర్ స్థాయికి ఎదిగారు. తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయటం వల్ల ఈ అద్భుత విజయం సాధించగలిగారు. చదువుకునే రోజుల్లోనే దివ్య ఆల్‌రౌండర్‌గా ఎదగాలనుకున్నారు. ‘‘నేను బయో టెక్నాలజీ చదువుకునే రోజుల్లో మాకు సరైన అధ్యాపకులు లేకపోవటంతో, చాలా ఇబ్బంది పడ్డాం. ఒకరితో ఒకరు చర్చించుకుంటూ పాఠాలు నేర్చుకునేవాళ్లం. పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేలా ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చాను’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్. టీచర్‌గా మొదటి రోజు.. బైజూలో విద్యార్థిగా చేరి, ఆ తరవాత అక్కడ టీచర్ని అయ్యాను. నేను టీచర్ కావాలనుకున్న నా కల అలా నెరవేరింది. మొదటి రోజు క్లాసు తీసుకున్నప్పుడు క్లాసులో వందమంది విద్యార్థులు ఉన్నారు. వారంతా నా కంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నవారు. నేను టీచర్లా కనిపించటం కోసం ఆ రోజున క్లాసుకి చీర కట్టుకుని వెళ్లాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఆ రోజు పాఠం చెబుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపించింది’ అంటారు దివ్య టీచర్‌గా తన మొదటి అనుభవం గురించి. విదేశాలలో పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఇంజినీరింగ్ చదివేటప్పుడు బయోటెక్నాలజీ చెప్పడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకపోవటంతో పడిన ఇబ్బందులను దివ్య గోకుల్‌నాథ్ మరచిపోలేదు. తనలా ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదనుకున్నారు. ‘ఆఫ్‌లైన్ టెస్ట్ ప్రిపరేషన్ క్లాసులు మానేసి, ఆన్లైన్ క్లాసులను దేశంలోని మారుమూలలకు సైతం తీసుకువెళ్లాలని మా బైజులో నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. 2015లో యాప్ లాంచ్ చేశాం. ఇందులో ర్యాంకులు, క్లాసులో టాపర్లు వంటివి ఉండవు. ఇందులో విజయం సాధించగలమని, మా ప్రోడక్టు మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంది’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్. చిత్తశుద్ధి ఉండాలి.. స్టార్టప్‌లకు కావలసింది చిత్తశుద్ధి. ఏ స్టార్టప్ అయినా, కస్టమర్‌కి చాలా వేగంగా స్పందించడం ముఖ్యం. తొలిదశలో ఎంతమంది ఆదరిస్తున్నారనేది కాదు. పనిలో శ్రద్ధ చూపిస్తే విజయం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవటం, ఆచరణలో పెట్టడం వెంట వెంటనే జరిగి పోవాలి. ఆలస్యం చేస్తే నిరుపయోగం.. అని నమ్ముతారు దివ్య గోకుల్‌నాథ్. ‘‘నేను, బైజు... మా ఇద్దరి దార్శనికత, ప్రాధాన్యతలు ఒకేలా ఉంటాయి. మా విజయం వెనుక ప్లేబుక్ ఏమీ లేదు. ఈ పాండమిక్ సమయంలో, కేవలం ఆరు మాసాల వ్యవధిలో సుమారు 35 మిలియన్ల మంది మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. మేం ఒక్కో అడుగు ఎదుగుతున్నాం’’ అంటూ తమ విజయం గురించి చెబుతారు దివ్య గోకుల్‌నాథ్. ఎన్నో ఆశయాలు, ఆలోచనతో కృషి చేస్తున్న దివ్య గోకుల్‌నాథ్... భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తమ సేవలు విస్తరించాలనుకుంటున్నారు. -
‘బెల్ట్ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’
ముంబై: దివంగత నటి దివ్యా భట్నాగర్ భర్త గగన్ గబ్రూకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారమే తనను నమ్మించి మోసం చేశాడంటూ దివ్య గతంలో చేసిన చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో సెటిల్ అయ్యేందుకే గగన్ తనను ప్రేమించినట్లు నాటకమాడాడని, పెళ్లైన తర్వాత రోజూ చిత్రహింసలు పెట్టేవాడని ఆమె తన ఫ్రెండ్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మాట మాటకి బెల్ట్ తీసి కొట్టేవాడు. వేళ్లు విరిచేవాడు. గగన్ మాత్రమే కాదు వాళ్ల కుటుంబం మొత్తం మోసగాళ్లే. నన్ను పెళ్లిచేసుకునేందుకు చేసిన కుట్రలో గగన్ వాళ్లమ్మ ప్రమేయం కూడా ఉంది. నాలాగే ఎంతో మందిని మోసం చేశారు. ఆ అమ్మాయిల వివరాలు తెలుసుకునేందుకు నేను ప్రయత్నించా. ప్రతీ పనిని పక్కాగా చేయడం వాళ్లకు అలవాటు. అందుకే నాకు మొదట అనుమానం రాలేదు’’అంటూ భర్త, అతడి కుటుంబం తన పట్ల ప్రవర్తించిన తీరు గురించి దివ్య చాట్‌లో ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దివ్య సోదరుడు దేవాశిష్ భట్నాగర్ ఆమె(దివ్య) ఇన్‌స్టా అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. తనకు ముందే తెలిసి ఉంటే ఆ దెయ్యం నుంచి దివ్యను కాపాడుకునే వాడినంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా వారిని ఎదిరించి మరీ దివ్య ఏడాది క్రితం గగన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇటీవల కరోనా బారిన పడిన దివ్యను గగన్ పట్టించుకోకపోవడం వల్లే ఆమె అర్ధాంతరంగా తనువు చాలించిందని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ‘యే రిష్తా క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్ గయి తో పియా మోరే’ వంటి హిందీ సిరీయల్స్‌లో దివ్య నటించారు.(చదవండి: ప్రేమ పెళ్లి: దారుణంగా హింసించేవాడు..) -
శారీరకంగా, మానసికంగా హింసించేవాడు..
ముంబై: ‘‘గగన్.. దివ్యను మానసికంగా, శారీరకంగా దారుణంగా హింసించాడు. పెళ్లైన కొన్ని రోజులకే తనకు నరకం చూపించేవాడు. భర్త తనను వేధించిన విధానం గురించి దివ్య నవంబరు 7న ఓ నోట్ రాసింది. నిన్న తన కబోర్డు తెరచి చూడగా అది మా కంటపడింది. నిజానికి తను పోలీసులను కూడా ఆశ్రయించింది. నవంబరు 16న ఫిర్యాదు చేసింది. గృహహింస కేసు పెట్టాలనుకుంది. తను ఆస్పత్రిలో ఉన్నపుడు నేను చూడటానికి వెళ్లాను. ఈ విషయాలను నాతో పంచుకుంది. తనను కాపాడుకోలేకపోయాం’’ అని దివంగత టీవీ నటి దివ్యా భట్నాగర్ సోదరుడు దేవాశిష్ ఆవేదన వ్యక్తం చేశాడు. భర్త గగన్ కారణంగా తన సోదరి ఎన్నో ఇబ్బందులు పడిందని, తనను పట్టించుకోనందు వల్లే ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు.(చదవండి: తన బంగారాన్ని దొంగిలించాడు: నటి) కాగా ‘యే రిష్తా క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్ గయి తో పియా మోరే’ వంటి హిందీ సిరీయల్స్‌లో నటించిన దివ్య(34) కరోనాతో సోమవారం కన్నుమూసిన విషయం విదితమే. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో దివ్య భర్త గగన్ గబ్రూ నిర్లక్ష్యమే ఆమె మరణానికి కారణమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన తల్లిదండ్రులను ఎదిరించి మరీ దివ్య ఏడాది క్రితం గగన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా భర్తతో కలిసి ఉంటున్న క్రమంలో ఆమెకు ఇటీవలే కోవిడ్ సోకింది. దీంతో అతడు ఆమెను వదిలేసి దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులే ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఇక దివ్య బెస్ట్ ఫ్రెండ్, నటి దేవోలినా భట్టాచార్య సైతం గగన్ గబ్రుపై ఇదే రకమైన ఆరోపణలు చేశారు. దివ్య కుటుంబం, స్నేహితుల గురించి మాట్లాడే అర్హత తనకు లేదంటూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. -
నాగేంద్రకు 14 రోజులు రిమాండ్
సాక్షి, విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్యకేసులో అరెస్టైన నిందితుడు నాగేంద్రను మొదటి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు నేడు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్. కమలాకర్‌రెడ్డి అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నాగేంద్రను మచిలీపట్టణం సబ్ జైలుకు తరలించారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. కాగా కోర్టులో హాజరుపరచడానికి ముందు నాగేంద్రకు ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్, ఈసీజీతో పాటు కోవిడ్-19 టెస్టు కూడా చేయించారు. ఇక దివ్య తేజస్విని హత్య సమయంలో తాను గాయాలపాలైన విషయాన్ని నాగేంద్ర ఈ సందర్భంగా వైద్యులకు చెప్పాడు. (చదవండి: ప్రేమోన్మాది నాగేంద్రబాబు అరెస్ట్) కాగా విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22)ని అదే ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు కత్తితో పొడిచి హతమార్చిన విషయం విదితమే. దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దిశ పోలీసులు పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. నాగేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, అతడి ఆరుగురు స్నేహితులను కూడా ప్రత్యేక బృందం విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. -
దివ్య హత్యకేసు: ప్రేమోన్మాది అరెస్ట్
సాక్షి, అమరావతి: ప్రేమోన్మాదంతో విచక్షణా రహితంగా తన ప్రియురాలిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన నాగేంద్రబాబును దిశ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ప్రియురాలిపై కత్తితో దాడి చేశాక.. తానూ ఆత్మహత్యాయత్నం చేసుకొని చావుబతుల్లో ఉన్న నాగేంద్రబాబును గత నెల 15న పోలీసులు గుంటూరు ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. 21 రోజులపాటు చికిత్స పొందిన నాగేంద్రబాబుకు ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు అతడిని శుక్రవారం డిశ్చార్జి చేశారు. ఆ వెంటనే విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22)ని అదే ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దిశ పోలీసులు పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. నాగేంద్ర వెల్లడించిన ఆరుగురు స్నేహితులను కూడా ప్రత్యేక బృందం ఇంటరాగేట్ చేయనుంది. హత్య కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. నేడు మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచనున్నారు. సమగ్ర విచారణ కోసం పోలీసులు వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం ఉంది. -
దివ్య హత్య కేసు: దిశా పోలీస్ స్టేషన్‌కు నాగేంద్ర
సాక్షి, విజయవాడ: దివ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్రను జీజీహెచ్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచడానికి 24 గంటల సమయం ఉండటంతో పోలీసులు నిందితుడిని దిశ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. దీంతో దిశా టీమ్ నాగేంద్ర నుంచి వాస్తవాలు రాబట్టే పనిలో పడ్డారు. గత రెండు గంటల నుంచి హత్యకు గల కారణాలపై పోలీసులు నాగేంద్ర నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు. కోర్టు సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇంటివద్దే నాగేంద్రను హాజరు పరిచే అవకాశం ఉంది. అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేసి నాగేంద్రను పోలీసులు కస్టడీకి కోరనున్నారు. (దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు) -
నాగేంద్ర అరెస్ట్‌కు కౌంట్‌డౌన్ మొదలు
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్ర అరెస్ట్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. 45 మందిని విచారించిన పోలీసులు వారం క్రితమే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసారు. అరెస్ట్‌కు వైద్యపరమైన చిక్కులు ఎదురవడంతో ఆటంకం ఏర్పడింది. వైద్యుల నుంచి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉండటంతో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు డీసీపీ హర్షవర్ధన్ సాక్షి టీవీతో మాట్లాడారు. వైద్యులు క్లారిటీ ఇచ్చిన వెంటనే నాగేంద్రను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు. కస్టడీకి తీసుకొని హత్యకు గల కారణాలు రాబడతామని డీసీపీ పేర్కొన్నారు. చదవండి: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే అరెస్ట్ చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు -
నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం
-
దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య హత్య కేసులో చిక్కుముడులు వీడాయి. నిందితుడు నాగేంద్ర వాదనలో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. దీనిపై సీపీ బత్తిన శ్రీనివాసులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దివ్య తేజస్విని హత్య కేసులో విచారణ పూర్తి చేశాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాము. ఫోరెన్సిక్, మెడికల్ రిపోర్టులు కూడా వచ్చాయి. దివ్య.. నిందితుడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమె చేతులకు కత్తిగాట్లు పడ్డాయి. ( వాడికి బతికే అర్హత లేదు ) గొంతు కోసి, కడుపులో బలంగా పొడవటం వల్లే దివ్య చనిపోయింది. శాస్త్రీయ ఆధారాలు నివేదికల్లో ఉన్నాయి. కత్తి పోట్లపై నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాము. నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందు వల్ల అరెస్ట్ చేయలేకపోతున్నాం. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, డిశ్చార్జ్ అవగానే అరెస్ట్ చేస్తాము. కోర్టులో హాజరు పరిచాక న్యాయమూర్తి అనుమతితో కస్టడీలోకి తీసుకొని వివరాలు రాబడతామ’’న్నారు. -
వాడికి బతికే అర్హత లేదు
సాక్షి, విజయవాడ: తమ ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఉన్మాది నాగేంద్రకు బతికే అర్హతలేదని, నేరాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించి అతడికి ఉరిశిక్ష పడేలా చూడాలని దివ్య తేజస్విని తల్లితండ్రులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా దివ్య తల్లితండ్రులు శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నిజం నిప్పులాంటిదని దాన్ని బయటకు రాకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర) తమ బిడ్డను కిరాతకంగా హత్య చేయటమే కాక మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అందరినీ నాగేంద్ర తప్పుదారి పట్టించాడని వాపోయారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో దివ్యది హత్యే అని తేలిందని, తాము మొదటినుంచీ చెబుతున్నదే నిపుణుల రిపోర్టులో వచ్చిందని తెలిపారు. అబద్దం చెప్పి తప్పించుకొనేందుకు నాగేంద్ర కట్టుకథలు చెబుతున్నాడన్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న దివ్య తేజస్విని ఈ నెల 15న నాగేంద్ర జరిపిన కత్తి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నాగేంద్ర తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. అయితే దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామన్నాడు. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికలు రావడంతో అతడు చెప్పింది అబద్ధమని తేలిపోయింది. చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు -
దివ్యది హత్యే..
-
దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు విచారణ పూర్తి అయ్యింది. దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా హత్యగా తేల్చారు. దివ్య ఒంటిపై గుర్తించిన కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని, నిందితుడు నాగేంద్రనే హత్య చేసినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, దివ్యను తాను హత్య చేయలేదని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు. కేసుకు సంబంధించి దిశా పోలీసులు ఈనెల 28న ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. (సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) అలాగే ఆసుపత్రి నుంచి నిందితుడు నాగేంద్ర డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకొని విచారించి మరికొన్ని విషయాలను రాబట్టనున్నారు. మరోవైపు ఇరువురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ కావడంతో వాటి ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు హోంమంత్రి సుచరిత పలువురు మంత్రులు పరామర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
దివ్య తల్లిదండ్రులకు రూ.10 లక్షల చెక్కు అందజేత
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దివ్య కుటుంబసభ్యులకు పది లక్షలు చెక్కును అందజేశారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. హామీ ఇచ్చిన 48 గంటల్లోనే దివ్య తల్లిదండ్రులకు ప్రభుత్వం చెక్కును అందజేసింది. చక్కగా చదువుకునే దివ్య జీవితం నాశనం చేసిన నాగేంద్రకు కఠిన శిక్ష పడుతుందని దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ దివ్య తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారని, ప్రభుత్వం తరపున , పార్టీ తరపున వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) సీఎం వైఎస్ జగన్ సహాయం మరవలేనిదని దివ్య తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. మా బాధను విని సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చారని, ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారని తెలిపారు. ఆర్థిక సహాయం చేస్తారని ఊహించలేదని, మా కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జగన్‌కి రుణపడి ఉంటామన్నారు. ఈ కేసులో తమ బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. (సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) -
దివ్యతేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల సహాయం
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దివ్యతేజస్విని కుటుంబసభ్యులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి వారిని ఓదార్చారు. చలించిపోయిన సీఎం దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారని, ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పారన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్ ముఖ్య మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం దివ్యతేజస్విని తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రి సుచరిత సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ప్రేమోన్మాది నాగేంద్రబాబు కోలు కోగానే అదుపులోకి తీసుకుని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగేంద్రబాబు పూర్వ పరిచయాన్ని అడు ్డపెట్టుకుని దివ్యతేజస్వినిని వేధించాడన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వేధింపులపై మహిళలు, యువతులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ దివ్యతేజస్విని కుటుంబసభ్యులు కోలుకునే వరకు పార్టీపరంగా కూడా అండగా ఉండాలని సీఎం జగన్ తమకు సూచించారని చెప్పారు. దివ్యతేజస్వినిని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ మాట్లాడుతూ నాగేంద్రబాబుకు ఉరిశిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. నిందితుడి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని చెప్పారు. -
సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
-
సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
సాక్షి, విజయవాడ : బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాశ్‌లు దివ్య తల్లిదండ్రులైన జోసెఫ్, కుసుమ, దివ్య సోదరుడు దినేష్‌లను స్వయంగా సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.కాగా సీఎం జగన్ దివ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని హోంమంత్రికి సూచించారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి మాకు న్యాయం చేయాలని కోరామన్నారు. తమ మాటలకు చలించిపోయిన సీఎం తప్పకుండా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆడపిల్లల ఎదుగుదలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని.. తమ కూతురు లాంటి వారు ఎందరో ఆ పథకాలతో ఎంతో ఉన్నతికి వస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ ఆ కిరాతకుడు మా కూతురుని పొట్టన పెట్టుకున్నాడని దివ్య కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.(చదవండి : బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ.. సీఎం జగన్ చాలా బాగా స్పందించారు. దివ్య తేజస్విని విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి దివ్య కుటుంబసభ్యుల బాధను పూర్తిగా విన్నారని.. వెంటనే వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కూడా చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని.. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని సుచరిత వెల్లడించారు. దివ్య తేజస్విని కుటుంబానికి తాము అండగా ఉంటామని సీఎం జగన్ పేర్కొన్నారని దేవినేని అవినాశ్ తెలిపారు. ఇలాంటి సంఘటనల్లో పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని.. తమ పార్టీ, ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉంటుందని అవినాశ్ తెలిపారు.కాగా మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి : దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్) -
దివ్యకేసు: పురోగతి సాధించిన పోలీసులు
సాక్షి, విజయవాడ: బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దివ్యను హత్య చేసినట్టు నిర్దారణ అయ్యింది. నిందితుడు నాగేంద్ర కాల్‌డేటాను పోలీసులు పరీశీలించారు. హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు నాగేంద్ర తన స్నేహితుడికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నాగేంద్ర స్నేహితుడు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దివ్య హత్యకేసును దిశా పోలీసులు విచారిస్తున్నారు. దివ్య కుటుంబ సభ్యులతో పాటు, చుట్టు పక్కల వారిని దిశా టీం విచారిస్తోంది. డీజీపీ ఆదేశాలతో దిశ టీం శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. 7 రోజుల్లో చార్జిషీటు: డీజీపీ సవాంగ్ దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారని చెప్పారు. హోంమంత్రి సుచరిత.. దివ్య కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 7 రోజుల్లో ఘటనపై చార్జిషీటు దాఖలు చేస్తామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్ -
సీఎం జగన్‌ను కలవనున్న దివ్య పేరెంట్స్
సాక్షి, గుంటూరు: విజయవాడలో ప్రేమోన్మాది నరేంద్రబాబు చేతిలో హతమైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా, తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను కలవటానికి హోంమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా దివ్య తేజస్విని కుటుంబసభ్యులు సాక్షి టీవీతో మాట్లాడారు. 'సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం మా అదృష్టం. మహిళా పక్షపాతిగా ఉండే సీఎం మాకు అవకాశం కల్పిస్తారని తెలుసు. మాకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్‌కు వివరిస్తాం. నిందితుడు నాగేంద్రను ఉరితీయాలని కోరతాం' అని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) -
నిలకడగా నాగేంద్రబాబు ఆరోగ్యం
సాక్షి, గుంటూరు: దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు అనంతరం ఆత్మహత్యకు యత్నించి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్ చేసిన అనంతరం వైద్యులు నాగేంద్ర బాబును పోస్టు ఆపరేటివ్ ఐసీయూ వార్డుకు మార్చారు. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్ఎంఓ సతీష్ ఆదివారం తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు పరీక్షించిన అనంతరం తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు. ('7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో') -
'హోంమంత్రి భరోసాతో ధైర్యంగా అనిపిస్తుంది'
విజయవాడ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని, దివ్యను హత్యచేసిన ఉన్మాదిని శిక్షించి న్యాయం చేయాలని ఆమె తల్లి కుసుమ విన్నవించుకున్నారు. స్వయంగా రాష్ర్ట హోం మంత్రే తమ ఇంటికి రావడంతో భరోసాగా ఉందని దివ్య తండ్రి జోసెఫ్ అన్నారు. కోర్టుల చుట్లూ తిరగలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తమకు హోంమంత్రి భరోసా ఇవ్వడం చాలా ధైర్యంగా అనిపిస్తుందన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగేలా మంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) తాను సీఎం వైఎస్ జగన్‌కు వీరాభిమానినని , తన చెల్లికి తక్షణమే న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అని దివ్య సోదరుడు దినేష్ అన్నారు. ఈ ఘటనను సామాజిక దారుణంగా చూడాలని, ఇంట్లో ఉన్నా రక్షణ లేకపోవడం అన్నది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమన్నారు. దేశంలో ప్రతీ రెండు రోజులకు ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు జరుగతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా! ) -
అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. దివ్యను దారుణంగా చంపిన ఉన్మాదికి విధించే శిక్ష రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలి కోరారు. ఆడపిల్లలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్ష ఉండాలని లేఖలో పేర్కొన్నారు. మా పాపకు తక్షణ న్యాయం జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీస్తురాజపురంలో చాలామంది గుట్కా, గంజాయి, మద్యానికి బానిసలై ఉన్మాదులుగా మారుతున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి శనివారం రాసిన లేఖలో కోరారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్) దివ్య కుటుంబాన్ని పరామర్శించిన సుచరిత దివ్య తల్లిదండ్రులకు శనివారం సాయంత్ర సుచరిత పరామర్శించారు. దివ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భగా తమకు న్యాయం చేయాలని కోరుతూ లేఖను హోంమంత్రికి అందించారు. బాధితు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని సుచరిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘దివ్య ఘటన బాధాకరం. ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివ్య కుటుంబానికి అండగా ఉంటాం. తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. నిందితుడిపై ఎస్సీఎస్టీ, 302 కేసు నమోదు చేశాం. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులకు చెప్పాలి. 100కు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి:’ అని పేర్కొన్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
దివ్య ఎంత క్షోభ అనుభవించిందో
-
అసలేం జరిగింది?
-
'7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో'
సాక్షి, విజయవాడ: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసులో నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు దివ్య తల్లిదండ్రులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'దివ్యను నాగేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. నాగేంద్ర తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడు. పోలీసులకు వివరాలు చెప్పాం. దివ్య పెళ్లి ఇతర విషయాలు నిజం కాదు. ఏడు నెలలుగా మా బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో సెల్ఫీ వీడియో చూసేదాకా మాకు తెలీదు. సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది. నా కూతర్ని అత్యంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలి' అని దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్) పోలీసుల విచారణలో కొత్త విషయాలు దివ్య తేజస్విని హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. దివ్య, నాగేంద్ర వివాహంపై పోలీసుల విచారణలో ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. అయితే 2018 మార్చిలో మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి దివ్య, నాగేంద్ర వెళ్లారు. అక్కడ వారికి వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందకు పోలీసులు బృందం విష్ణు కాలేజీకి వెళ్లింది. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం నాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న చివరిసారిగా నాగేంద్రకు దివ్య కాల్ చేయగా.. ఏప్రిల్ 2న దివ్యకు నాగేంద్ర నుంచి చివరి కాల్ వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసును బెజవాడ పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం జీజీహెచ్ సర్జికల్ వార్డులో నాగేంద్రబాబుకు చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి అన్నారు. నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి. అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి. వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే అతను సాధారణ స్థితికి రావడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది' అని ఆమె వెల్లడించారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!) -
అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!
సాక్షి, అమరావతి : ఇద్దరం ఇష్టపడ్డాం.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు కలిసి బతకలేకపోయాం.. అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా’నంటూ నిందితుడు నాగేంద్రబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజుపురంలో గురువారం ప్రేమోన్మాదంతో నాగేంద్రబాబు తన ప్రియురాలి దివ్య తేజస్వినిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు పోలీసులకు, మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పెళ్లి చేసుకున్న తాము కలిసి బతకలేక పోతున్నామని.. ఇక కలిసే పరిస్థితి లేకపోతే ఇద్దరం ఇష్ట ప్రకారమే చనిపోదామన్న దివ్య సలహా మేరకు ఆమె ఇచ్చిన కత్తితోనే హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని నాగేంద్రబాబు పోలీసులకు వెల్లడించాడు. దివ్య హత్యకు ఆమె తల్లిదండ్రులే కారణమని ఆరోపించాడు. చదవండి: దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు మంగళగిరిలో మంగళసూత్రం కట్టా.. దివ్యతో తనకు పదమూడేళ్ల నుంచి పరిచయముందని, అది ప్రేమగా మారి, ఇద్దరి ఇష్ట ప్రకారమే గత ఏడాది మంగళగిరిలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నట్టు నాగేంద్రబాబు స్పష్టం చేశాడు. ఈ విషయం ఇరువురి పెద్దలకు తెలుసని, ఆమె తల్లిదండ్రులు తామిద్దరినీ వేరు చేశారని చెప్పాడు. దివ్య లేకుండా తాను ఉండలేకపోతున్నానని, కాపురానికి తనతో తీసుకువెళతానని పలుమార్లు దివ్య తండ్రి జోసెఫ్‌తో గొడవ పడినట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అసలు నాగేంద్రబాబు ఎవరో తమకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని దివ్య తల్లిదండ్రులు చెబుతున్నారు. నిష్కారణంగా తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని ఆవేదన చెందుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న తమ కూతురు ఓ ప్రేమోన్మాది చేతిలో బలైపోయిందంటూ దివ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో గారాబంగా పెంచుకున్న తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని రోదిస్తున్నారు. విషణ్ణ వదనాలతో శుక్రవారం దివ్యకు అంత్యక్రియలు జరిపించారు. చదవండి: దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్ ‘దిశ’ ప్రత్యేకాధికారుల పరామర్శ హత్యకు గురైన దివ్య తేజస్విని కుటుంబాన్ని ‘దిశ’ ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌లు శుక్రవారం పరామర్శించారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దివ్య కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. -
దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేస్తారని దిశ ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, దీపికా పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వారు విజయవాడలోని దివ్య తేజశ్విని కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాం. ► మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ► ఈ కేసులో నిందితుడిపైన దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తాం. ► ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100, డయల్ 112, డయల్ 181 ద్వారా పోలీసుల సహాయం కోరాలి. దిశ యాప్, పోలీస్ సేవ యాప్ అందుబాటులో ఉన్నాయి. -
దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాదానికి బలైపోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్రతో బాధితురాలు మాట్లాడిన ఫోన్ కాల్స్ లీకవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వారిద్దరికీ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన ఆడియోలో పెళ్లి విషయం దాచిపెట్టలేక తీవ్ర సంఘర్షణకు గురైనట్లు దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందులా అందరితో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నా అని, మానసిక కుంగుబాటుకు గురవుతున్నా అని నాగేంద్రతో తన బాధను పంచుకున్నారు. తాను త్వరగా అప్సెట్ అవుతున్నాఅని, ఇలా ఎందుకు ఉంటున్నానో తనకు అర్థం కావడంలేదని ఫోన్లో విలపించారు. తనకు నాగేంద్రతో పాటు భవిష్యత్ కూడా ముఖ్యమేనని చెప్పారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర) తనలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయని, ఎవరితో మాట్లాడాలి, ఎవరి సలహాలు తీసుకోవాలో కూడా అర్థంకావడంలేదని దివ్య వాపోయారు. అంతేకాకుండా వివాహం అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎవరితోనూ చర్చించలేకపోతున్నా అని నాగేంద్రతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. తాజాగా తేజస్వినికి చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా మరికొన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. నాగేంద్రతో రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో కొనసాగానని, ఆ తరువాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని దివ్య తెలిపారు. ఓ మహిళ కారణంగా తను మోసపోయానని వీడియో వెల్లడించారు. తాను చేసిన తప్పిదాల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాఅని, తన జీవితం ఏటు పోతుందో కూడా అర్థకావడంలేదని పేర్కొన్నారు. తనకు బెదింపు కాల్స్, మెస్సెజ్‌లు వస్తున్నాయని వీడియో ద్వారా రికార్డు చేసుకున్నారు. (మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర) మరోవైపు తామిద్దరం వివాహం చేసుకున్నామని, అది వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నిందితుడు నాగేంద్ర చెబుతున్నాడు. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫోన్‌కాల్స్ రికార్డులు లీకవ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. లీకైన ఆడియోలు, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. -
ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర
సాక్షి, విజయవాడ: ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామని నాగేంద్ర తెలిపాడు. నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం దివ్య నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. దివ్య బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా. ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని దివ్య చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు’అని నాగేంద్ర పేర్కొన్నాడు. (చదవండి: మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర) కాగా, నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తనను దివ్య దూరం పెట్టిందని నాగేంద్ర చెప్తుండగా.. అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నాగేంద్ర పెయింటర్. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం) ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దివ్య తేజస్విని అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వ్యవహారంపై దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. దివ్యతో నాగేంద్రకు రహస్య వివాహం జరిగిందన్న నిందితుడి వాదనలో నిజం లేదు. నాగేంద్ర ఇంటిపై మేము దాడి చేసామన్న ఆరోపణలు కూడా సత్యదూరం. అతడి మాటల్లో దివ్యపై ప్రేమ ఉంటే అంత కిరాతకంగా ఎలా చంపాడు..?. వాట్సాప్ చాటింగ్‌లు, ఫొటోలు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవన్నీ కూడా మార్ఫింగ్ ఫొటోలని దివ్య తల్లి కుసుమ కొట్టిపారేసింది. -
మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర
సాక్షి, విజయవాడ: బెజవాడలో కలకలం రేపిన దివ్య తేజస్విని హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. దివ్యతో తనకు పెళ్లి జరిగినట్లు నిందితుడు నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మంగళగిరిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఆమె తండ్రి వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపిస్తూ స్పృహ కోల్పోయాడు. దీంతో స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక నిందితుడి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. (చదవండి: గంజాయి తాగుతాడు, పనికిరాని వాడు: దివ్య తల్లి) మరోవైపు.. నాగేంద్ర చెబుతున్నవన్నీ అసత్యాలని, ఇంజనీరింగ్ చదువుతున్న తమ కూతురు అలాంటి పనికిరాని వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుందని దివ్య తల్లి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. దివ్య తేజస్విని హత్య కేసులో మాచవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 449, 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) ఎవరికీ చెప్పలేదని చెప్పాడు: నాగరాజు గుంటూరు: దివ్య తేజస్వినిని పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర తనకు చెప్పాడని అతడి సోదరుడు నాగరాజు మీడియాకు తెలిపాడు. ఈ విషయం గురించి రాత్రి దివ్య ఇంటికి వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడానని, ఆయన ఇందుకు ఒప్పుకోలేదని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. బెజవాడలో గురువారం చోటుచేసుకున్న దివ్య హత్యోదంతం గురించి నాగరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన జరగగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నాగేంద్ర కోసుకున్నాడు అని చెప్పారు. నేను పని దగ్గర నుంచి డైరెక్ట్‌గా ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాను. అక్కడే నా సోదరుడితో మాట్లాడాను. దివ్య, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకున్నామని నాగేంద్ర చెప్పాడు. అంతేకాదు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అని కూడా అన్నాడు. ఏం జరిగిందో క్లారిటీ లేదు. జరిగిన విషయాన్ని కరెక్టుగా చెప్పలేదు. పెళ్లి చేసుకున్న అని మాత్రం చెప్పాడు’’ అని తెలిపాడు. -
‘ఆ తిరుగుబోతును ఎందుకు పెళ్లి చేసుకుంటుంది’
సాక్షి, విజయవాడ: ‘‘కావాలనే నా కుమార్తె గురించి ప్రేమ, పెళ్లి అని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా దివ్య భీమవరంలోని మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. నా బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. అపురూపంగా చూసుకున్నాం. ఆ నాగేంద్ర పెయింటింగ్ పని చేస్తాడు. గంజాయి తాగి తిరుగుతూ ఉంటాడు. అలాంటి తిరుగుబోతుకు, దివ్య పేరుతో సంబంధం కలుపుతున్నారు. ఎందుకు పనికిరానివాడిని తను ఎందుకు పెళ్లిచేసుకుంటుంది? ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు’’అంటూ ఉన్మాది స్వామి చేతిలో బలైపోయిన దివ్య తేజస్విని తల్లి కుసుమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది) తన కూతురు గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిని ప్రేమ పేరుతో వేధించిన నాగేంద్ర బాబు అలియాస్ స్వామి, గురువారం ఆమెపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దివ్య మృతి చెందిన విషయం విదితమే.(చదవండి: దివ్య, స్వామి మంచి స్నేహితులు) ఈ ఉన్మాదం ఇంకెంతకాలం: వాసిరెడ్డి పద్మ నగరంలో చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర ఘటనను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంట్లోకి చొరబడి, నిద్రపోతున్న అమ్మాయిపై దాడి చేయడం దారుణం. తన గొంతు కోసి అమానుషంగా ప్రవర్తించాడు. మంచం మీద నిద్ర పోతున్న పిల్ల.. మార్చురీకి వచ్చి చేరింది. ఇటువంటి ఆగడాలను అరికట్టాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టం తెచ్చారు. ఇటువంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి. ‘‘నేను ప్రేమిస్తే.. నాకే దక్కాలి’’ అనే ఉన్మాదం ఎంతకాలం? ప్రేమించకపోతే మరణ శాసనం రాస్తారా..? చంపేస్తారా?’’ అని ప్రశ్నించాలి. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసేవిధంగా, కేంద్రం కూడా దిశ లాంటి చట్టానికి వెంటనే ఆమోదం తెలపాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. యేళ్ల తరబడి కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ ఘటనలు పెరుగుతున్నాయి. మనోవర్తి కేసులపై కూడా న్యాయ వ్యవస్థ ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. శిక్షలు పడేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఆడ పిల్లలు మా ప్రాణం, మా ప్రాధాన్యత అనేలా అందరూ ఆలోచించాలి. ప్రేమ పేరుతో ఉన్మాదం, దారుణాలకు పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడాలి’’అని పేర్కొన్నారు. -
దివ్య, స్వామి మంచి స్నేహితులు
సాక్షి, విజయవాడ : నగరంలో చోటు చేసుకున్న ప్రేమోన్మాదం ఘటనపై బాధితురాలి సోదరుడు స్పందించాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి తమకు చిన్నప్పటి నుంచి తెలుసునన్నాడు. దివ్య, చినస్వామి మంచి స్నేహితులని, అతడెందుకు ఉన్మాదిలా ప్రవర్తించాడో తెలియడం లేదన్నాడు. తన చెల్లెలి చావుకు కారణమైన స్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నాం: సీపీ నగర కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకి చేరుకుని బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. వారి వద్దనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘11.30 మధ్య దాడి జరిగిందని సమాచారం వచ్చింది. నిందితుడు నాగేంద్రబాబు అలియాస్ స్వామి దివ్య తేజస్విని గొంతుపై కత్తి దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆసుపత్రిలో చనిపోయింది. అతడు కూడా కత్తితో పొడుచుకోవటంతో పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఎవరూ లేరు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నా’’మని తెలిపారు. ( బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది ) దివ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ప్రేమోన్మాది దాడిలో బలైన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర వారిని కలిసి మాట్లాడి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
నవ వధువు బలవన్మరణం
పెగడపల్లి(ధర్మపురి): వరకట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వి వాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బతికపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ స భ్యులు, పోలీసులు తెలిపిన వివరాలప్ర కారం..గ్రామానికి చెందిన ఐలేని అంజి రెడ్డి–శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్య(22) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ది వ్యకు అదే గ్రామానికి చెందిన పెయ్యాల రాజిరెడ్డి–అంజలి దంపతుల కుమారుడు ప్రవీన్రెడ్డితో 2020 ఫిబ్రవరి 22న వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.10 ల క్షల నగదు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నం కింద ముట్టజెప్పారు. ఈనేపథ్యంలో దివ్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా ప్రవీన్‌రెడ్డి స్థానికంగా వ్యవసాయం చేస్తున్నాడు. (ప్రేమజంట ఆత్మహత్య) కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని లేదా కట్నం కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాలని అత్త, మామ రాజిరెడ్డి, అంజలిలతో పాటు భర్త వేధిస్తున్నారు. అంతే కాకుండా ప్రవీన్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా దివ్యను ఇబ్బందులను గురి చేయడంతో పాటు వాట్సప్ ద్వారా అసభ్యకరమైన మెస్సెజ్‌లు పంపించేవాడు. నాలుగు రోజులు క్రితం హైదరాబాద్ నుంచి తల్లి గారింటికి వచ్చిన దివ్య అత్తింటి పోరును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. దీంతో మంగళవారం ఉదయం దివ్యను ఆమె తల్లిదండ్రులు అత్తారింటికి తీసుకు వచ్చి వారితో మాట్లాడుతుండగా తిరిగి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన దివ్య ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని తన తల్లిగారి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక తమ కూతరు ఆత్మహత్య చేసుకుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఎస్సై నవతలు ఘటనా స్థలాన్ని సందర్శించి శవ పంచనామ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సోను నిగమ్‌పై వీడియో ద్వారా ప్రతిదాడి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మాటల దాడులు కొనసాగుతున్నాయి. ఆరోపణలూ ప్రత్యారోపణలు వేడి మీద ఉన్నాయి. ‘నెపొటిజమ్’ (పక్షపాతం) ఎవరు ఎవరి పట్ల వహిస్తే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు సోనూ నిగమ్ ‘ఆత్మహత్యలు నటీనటుల్లోనే కాదు ఇక మీదట గాయకుల్లో, సంగీత దర్శకుల్లో కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆడియో కంపెనీల నిరంకుశ వైఖరి ఇందుకు కారణం’ అని కామెంట్ చేశాడు. ఇది ‘టి సిరీస్’ సంస్థను, దాని అధిపతి అయిన భూషణ్ కుమార్‌ను ఉద్దేశించినది. సోను నిగమ్ అంతటితో ఆగకుండా ‘భూషణ్ 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షించమని కూడా వచ్చాడు’ అన్నాడు. టి. సిరీస్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలో హతమయ్యాడు. అప్పటికి ఆయన కుమారుడైన భూషణ్ వయసు 18 సంవత్సరాలు. అయినప్పటికీ భూషణ్ సంస్థ పగ్గాలు చేపట్టాడు. సంస్థను నిలబెట్టాడు. పెద్ద నిర్మాతగా కూడా ఉన్నాడు. సోను నిగమ్ ఆరోపణలకు భూషణ్‌కుమార్ బదులివ్వలేదు. కాని అతని భార్య దివ్యా ఖోస్లా కుమార్ మాత్రం ఆగ్రహంతో అపర కాళిగా మారింది. తన భర్త మీద ఆరోపణలు చేసిన సోను నిగమ్ మీద వీడియో ద్వారా ప్రతిదాడికి దిగింది. ఒక వేడుకలో గాయకుడు సోను నిగమ్, టి సిరిస్ అధినేత భూషణ్ కుమార్, దివ్యా ఖోస్లా ‘సోనూ నిగమ్ గారూ. టి సిరీస్ సంస్థ ఎందరో గాయకులకు, సంగీత దర్శకులకు బ్రేక్ ఇచ్చింది. ఢిల్లీలో మీరు ఐదు రూపాయలకు కచ్చేరి ఇస్తున్న రోజుల్లో మా మామగారు గుల్షన్ కుమార్ గారు మిమ్మల్ని స్పాట్ చేసి బాంబే పిలిపించి గాయకుడిగా అవకాశం ఇచ్చారు. కాని ఆయన చనిపోయినప్పుడు సంస్థ మునిగిపోతుందని భావించిన మీరు టి సిరీస్‌తో కాకుండా మరో మ్యూజిక్ కంపెనీతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. ఇదా మీరు చేయాల్సింది. అసలు మీరు ఇంత పెద్ద గాయకులు అయ్యారు కదా మీరు ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు? మిమ్మల్ని మీరు చూసుకోవడం తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు. ఇక మీరు అండర్ వరల్డ్ ప్రస్తావన తెచ్చారు. మావారు మీ దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షణ కోసం వచ్చారని చెబుతున్నారు. అంటే మీకు అండర్ వరల్డ్‌తో లింక్స్ ఉండేవా? దీనిమీద ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నాను. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల సోషల్ మీడియాలో నా భర్త మీద, నా మీద, నా సంతానం మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇది చాలా తప్పు. అవకాశాలు అందరికీ ఇవ్వలేము. అవకాశాలు దొరకని వాళ్లు ఆరోపణలకు దిగితే ఎవరూ మిగలరు. ఇక మీదటైనా మీ ఆరోపణలు బంద్ చేసుకోండి’ అని గట్టిగా హెచ్చరించింది దివ్యా ఖోస్లా. ఈ భార్య చెప్పిన బదులు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) on Jun 24, 2020 at 7:23am PDT -
దివ్య హత్య కేసులో షాకింగ్ నిజాలు
సాక్షి, విశాఖటపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన దివ్య హత్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య కేసును విచారిస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతవారం అరెస్ట్ చేసిన నిందితులలో దివ్య పిన్ని కాంతవేణితో పాటు మరికొందరిని పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. రెండేళ్ల క్రితం దివ్య అమ్మమ్మ, తల్లి, సోదరుడు అనుమానస్పదంగా మృతి చెందారు. ఇందులో అమ్మమ్మ మృతదేహం మాత్రమే గోదావరిలో శవమై కనిపించగా మిగిలిన ఇద్దరివీ ఇప్పటికీ ఆచూకి లభించలేదు. ఆ సమయంలో అనాథగా మారిన దివ్యను సొంత పిన్ని కాంతవేణి చేరదీసింది. అప్పడికే వ్యభిచార వృత్తిలో ఉన్న పిన్ని కాంతవేణి దివ్య ద్వారా కూడా డబ్బులు సంపాదించాలని భావించింది. ఇందులో భాగంగా దివ్యను బలవంతంగా ఒత్తిడి చేసి వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా తనకి పరిచయమున్న వ్యభిచార నిర్వహకురాలు గీతకి దివ్యను లక్ష రూపాయిలకి ఆమె పిన్ని కాంతవేణి అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (దివ్య చుట్టూ రక్కసి మూక!) కాంతవేణి సహజీవనం చేస్తున్న కృష్ణ బ్యాంకు అకౌంట్ లోకి గత ఏడాది సుమారు లక్ష రూపాయిలు గీత అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ కావడాన్ని పోలీసులు గుర్తించి ఆరా తీయగా దివ్యను గీతకి అమ్మేసిన వైనం బట్టబయలైంది. దివ్యను కొనుక్కున్న గీత కొన్ని రోజుల పాటు తన వద్దే ఆశ్రయం ఇచ్చి దివ్యను విటుల వద్దకి పంపి డబ్బులు సంపాదించేది. ఆ తర్వాత పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో దివ్యను తాత్కాలింగా మరో వ్యభిచార నిర్వహకురాలు వసంత వద్దకి గీత పంపింది. ఇక అప్పటి నుంచి దివ్య వసంత ఇంటి వద్దే ఉంటూ వసంత చెప్పినట్లుగా వ్యభిచారాన్ని నిర్వహించేది. దివ్య ద్వారా ఆదాయం బాగానే వస్తుండటంతో దివ్యను తన దగ్గరే ఉంచుకోవాలని వసంత భావించింది. ఇందులో భాగంగా మధ్యలో ఒకసారి గీత దివ్యను వెనక్కి పంపేయాలని వసంతపై ఒత్తిడి తీసుకురాగా తన దగ్గర నుంచి వెళ్లిపోయిందని అబద్దం చెప్పింది. గీత ఒత్తిడి తగ్గడంతో వసంత దివ్య ద్వారా బాగా డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. దివ్య ద్వారా రోజుకి వేలాది రూపాయిలు వస్తుండటంతో వసంత దివ్యను బంగారుబాతులా భావించింది. (దివ్య హత్య కేసులో కొత్త కోణాలు) దివ్య సొంతపిన్ని కాంతవేణి చాలా పకడ్బందీగా దివ్యను వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నేరుగా వ్యభిచారంలోకి దింపితే తనకి ఇబ్బంధి అవుతుందని భావించి తాను సహజీవనం చేస్తున్న కృష్ణ దగ్గర బందువు వీరబాబుతో 2018 లోనే పెళ్లి జరిపించింది. భర్త వీరబాబు, కృష్ణల సాయంతో పిన్ని కాంతవేణి దివ్యపై ఒత్తిడి తీసుకువచ్చి వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే భర్త వీరబాబు ఆమె పూర్తిగా వ్యభిచారంలోకి దిగేలా పిన్ని కాంతవేణికి సహకరించినట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాతే దివ్యను గీతకి అమ్మేసినట్లు తెలుస్తొంది. ఈ మొత్తం ఆధారాలను సేకరించిన విశాఖ పోలీసులు కాంతవేణితో సహజీవనం చేసిన కృష్ణ, దివ్య భర్త వీరబాబులను సైతం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దివ్యతో గత కొన్ని రోజులగా ఆర్ధిక పరమైన వివాదాలే హత్యకి కారణాలగా పోలీసులు గుర్తించారు. దివ్యపై వసంత అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రోజూ విటుల వద్దకి బలవంతంగా పంపడం వేలాది రూపాయిలు వస్తున్నా దివ్యకి రూపాయి కూడా ఇవ్వకపోవడం, ఆఖరికి దివ్య వద్ద ఫోన్ కూడా ఉండకుండా చేయడంతో గత కొద్ది రోజులుగా దివ్యకి, వసంతకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వసంత దగ్గర నుంచి దివ్య బయటకి వెళ్లిపోవాలని భావించింది. దీంతో తన దగ్గర నుంచి దివ్య వెళ్లిపోతే వేలాది రూపాయిల ఆదాయం పోతుందని వసంత భావించి ఆమెను అందవి హీనంగా చేయాలని మొదట భావించింది. ముందుగా దివ్య కాళ్లూ చేతులు కట్టి గదిలో బంధించి గుండు కొట్టించి, కనుబొమ్ముల సైతం పూర్తిగా కత్తిరించి అందవిహీనంగా తయారు చేసింది. అప్పటికీ కక్ష తీరక క్రూరాతి క్రూరంగా పెద్ద అట్ల కాడను బాగా కాల్చి శరీరంలోని ప్రతీ భాగంపై వాతలు పెట్టింది. నాలుగైదు రోజులపాటు భోజనం కూడాపెట్టకుండా... రోజూ వాతలు పెట్టడంతో దివ్య శరీరం కుళ్లిపోయింది. ఆకలికి తట్టుకోలేక... రోజూ పెడుతున్న వాతలు తట్టుకోలేక దివ్య ఎంత ప్రాధేయపడ్డా వసంత కరగలేదు. నాలుగైదు రోజుల పాడు ఇదే విధంగా దివ్యను క్రూరంగా హింసించడంతో ఆమె చనిపోయింది. దివ్య హత్యను సైతం కప్పిపుచ్చడానికి వసంత ప్రయత్నించింది. దహన సంస్కారాలకి ఉపయోగించే వాహనంలో దివ్య మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలని వసంత ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి పోలీసులకి పట్టించింది. దివ్య మృతదేహంపై గాయాలను వ్యాన్ డ్రైవర్ గుర్తించకపోయినట్లైతే వసంత గ్యాంగ్ తప్పించుకునేవారు. చివరి నిమిషంలో దివ్య శరీరంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేసిన డ్రైవర్ వెనక్కి వెళ్లిపోయి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దివ్య హత్య ఉదంతం పూర్తిగా బయటపడింది. దివ్య హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
దివ్య హత్య కేసు: కృష్ణ అకౌంట్లో డబ్బులు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో కీలక సమాచారం వెల్లడైంది. బాబాయ్ కృష్ణ అకౌంట్లో దివ్య సంపాదన లక్ష రూపాయలు డిపాజిట్ అయినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. కృష్ణ ఖాతాలో వసంత, గీతలు దఫదఫాలుగా ఈ సొమ్ము జమచేసినట్టు తేలింది. కాగా, దివ్య భర్త వీరుబాబు, బాబాయ్ కృష్ణను విశాఖ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (వైజాగ్ యువతి హత్యకేసులో రౌడీషీటర్ హస్తం! ) దివ్యను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలోనే వీరుబాబు, కృష్ణపై కేసు నమోదైంది. వీరితో కలిపి దివ్య హత్యకేసులో అరెస్టైనవారి మొత్తం సంఖ్య 8కి చేరింది. నిందితులకు వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా, 2018 డిసెంబర్లో వీరుబాబుతో దివ్యకు వివాహమైంది. మేనల్లుడు వీరబాబుతో దివ్యకు కృష్ణ వివాహం చేయించాడు. (చదవండి: దివ్య చుట్టూ రక్కసి మూక!)