dokka manikya varaprasad
-
నవయుగ కవిచక్రవర్తికి జేజేలు!
జాషువ అచ్చమైన జాతీయకవి. విశ్వనరుడి భావన ఆయన సాహిత్య తాత్వికత. తెలుగు నుడి కారం, ఇంపుసొంపులను పద్య లాలిత్యంతో పాఠకునికి అందించిన ‘నవయుగ కవి చక్రవర్తి’. భారతీయ తత్వాన్ని ఆకళించు కున్న కళాప్రపూర్ణుడు. నిరంతరం జాతి పురోగమనాన్ని కాంక్షిస్తూ సంఘంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న ధృడ సంకల్పంతో శక్తిమంతమైన కావ్యాలను రాసిన పద్మ భూషణుడన్న సాహిత్య విమర్శకుని మాటలు మహాకవికి అక్షరాలా అబ్బుతాయి. జాషువ కవిత్వం జాతీయ భావాలతో నిండి, మానవ జాతి శ్రేయస్సునూ, విశ్వకల్యాణాన్నీ కాంక్షిస్తూ చైతన్యశీలంగా ఉంటుంది. ‘భరత ఖండంబు నా పాఠశాల / భాగవతంబు నా బాలశిక్ష’ అని పేర్కొన్న జాషువాకి ఈ దేశ భిన్నసంస్కృతి, సంప్రదాయాల పట్ల అపారగౌరవం వుంది. కాబట్టే ఆయన ‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి, పంజరాన గట్టువడను నేను / నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వన రుడ నే’నని ప్రకటించాడు. దేశం సంస్కృతీ, భిన్న సంప్ర దాయాలను గౌరవిస్తూ అందరూ ఐకమత్యంతో, సహనంతో సహజీవనం చెయ్యాలని కాంక్షించాడు. మనుష్యులంతా సమానమేనని మరణంలేని మానవతను ప్రకటించాడు. ‘సింధు గంగానదీ జలక్షీరమెపుడు / కురిసి బిడ్డల పోషించుకొనుచున్న / పచ్చి బాలెంతరాలు మా భారత మాత / మాతలకు మాత సకల సంపత్సమేత’ అని దేశాన్ని కీర్తించారు. భారతీయ చారిత్రక పురాణ పురుషులనూ, అందు నాయకులనూ వారి ఔన్నత్యాన్నీ బట్టి గొప్ప వ్యక్తు లుగా చిత్రించారు. సగరుడు, మాంధాత్రి వంటి చక్ర వర్తులు మొదలు అశోకుడు, గౌతమ బుద్ధుడు, కర్ణుడు, శివాజీ, మహాత్మాగాంధి, అంబేడ్కర్ వంటి నేటికాల మేధా వుల వరకూ జాషువ రచనల్లో అత్యుత్తమంగా కన్పిస్తారు. మొదటి ఖండికే భారతమాత ప్రశస్తికి అంకితమై దేశానికి నీరాజనం పట్టింది. తరతరాల భారతీయ స్త్రీ, పురుషుల పరాక్రమోన్నతినీ నదుల ప్రాభవాన్నీ, గానం చేసి ‘గొన బుసిరిగల భాగ్యశాలివి నీవు, భారతాంబా మణి నమస్కారమమ్మ’ అని రెండు చేతుల నమస్కరించిన తీరు ఆయన దేశభక్తికీ, జాతీయతకీ నిదర్శనం. స్వాతంత్య్రం సిద్ధించిన పిమ్మట ఆనందాతిశయంతో ‘తల్లి భారతి నేడు దక్కె మాకు / పదియు రెండగు పుణ్య నదులు నదంబులు / చిరకాలమునకు జేజిక్కె మాకు / అమర సన్నుతమైన హస్తినాపుర రత్న పీఠంబు...’ అని హర్షాతిరేకము ప్రకటించారు. చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో వివేకానందుని అద్భుత ప్రతిభాపాటవాలనూ, అహింసాయుధంతో మహాత్మాగాంధీ సాంధించిన స్వాతంత్య్రాన్నీ, తెలుగు వాడైన తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్నూ, విశ్వకవి రవీంద్రునీ కొనియాడారు. అన్ని సంపదలు పుష్కలంగా ఉన్న దేశంలో ప్రజల మధ్య అనైక్యత, ప్రాంతాల వారిగా, మతాలవారిగా విడిపోయి, పరమత సహనం, పరజాతి సహనం లోపించి మానవజాతి సహజ గుణాల్ని కోల్పోయి అసహనంగా తయారయిందని చింతించారు. కులం కారణంగా తనను హీనపరిచారని దేశ ప్రము ఖులను స్తుతిస్తూనే తన నిందను సున్నితంగా చెప్పారు. జాతి సమైక్యత, సహన సహిత జీవనమే మహాకవి కవిత్వ తత్త్వంగా సాగింది. బాపూజీ అంటే జాషువ కవికి అనిర్వచనీయమైన భక్తిభావం. మహాత్ముని నిత్యసత్యవ్రతుడిగా పేర్కొన్నారు. ‘వడికిన నూలుపోగుతో ప్రపంచపు టేనుగు గట్టి అహింసా మార్గాన విరోధి గుండెలో పిడుగులు గుప్పువాడనీ, తన బోసినోట అమృత బిందువులను జిమ్మెడు వక్త’ అనీ మహా త్ముని వ్యక్తిత్వాన్ని గొప్పగా స్తుతించారు జాషువ. ‘మహా త్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్’ అనీ వెల్లడించారు. ‘గోచిపాత గట్టుకొని జాతి మానంబు నిలపినట్టి ఖదరునేతగా, పండ్లు నూరుచున్న బహుమతంబులలోన సహన విద్య నేర్పు సాధకుండనీ, భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవం’ అనీ ‘విశ్వసామరస్య విజ్ఞాన సంధాత’ అనీ బాపూ జీని ప్రస్తుతించారు. నిమ్న జాతుల కంటినీరంబు దుడిచి యాశ్వాసించు నిరుపేద బాంధవుడు అని కొనియాడారు. భారత స్వాతంత్య్ర దీప్తి సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ముగ్ధుడై ‘బోసు చరిత్ర మద్భుతమైనది, ఆయన మహాత్యాగి, మహనీ యునకు కావ్య నమస్కారము చేయక నా చేతులూరు కొనక పోయినవి’ అని ‘నేతాజీ’ కావ్యాన్ని రచించారు. భారతవీరుడు శీర్షికన కర్ణుని గుణగణాలను శౌర్య ప్రతాపాలను వర్ణించారు. కర్ణుని పరాక్రమం, సత్యసంధత కవిని ముగ్ధుని చేశాయి. మనుషుల్లో పెరుగుతున్న అమానవీయ మౌఢ్యాలను ఖండిస్తూ ‘మనుజులార మాది ఘనమైన మతమని / ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది’ అని మహాకవి జాషువ అన్ని మతాల వారినీ ప్రశ్నించారు. మతం కంటే మానవత్వమే గొప్ప దనీ, మానవత్వానికి మకుటధారణ చేయమన్నారు. కుల జాఢ్యాన్ని వదిలి మానవతకు పట్టం కట్టాలని కోరారు. భారత ఇతిహాస యుగం నుండి మొగలాయి యుగం వరకూ, స్వాతంత్య్రోద్యమం నుండి స్వాతంత్య్రానంతరం దేశంలో నెలకొన్న భిన్న సంఘర్షణల వరకూ జాషువ తన కవిత్వంలో బంధించారు. విశ్వమానవ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జాషువ విశ్వకల్యాణానికై తన కవిత్వాన్ని ఆయుధంగా మలిచారు. జాషువ కవిత్వం నేటికినీ ప్రాసంగికతను కలిగి ఉందనటంలో అతిశయోక్తి లేదు. అనేక కష్టాలనూ, అవమానాలనూ ఎదుర్కొన్నప్పటికీ జాషువ మహాకవి మాత్రం భారతజాతి అభివృద్ధికి కులమతాలు లేని సమసమాజాన్ని కాంక్షించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త మాజీమంత్రి (నేటి నుండి 28 వరకూ గుంటూరులో ‘జాషువ జయంతి వారోత్సవాలు’) -
‘బాబుకు ఐటీ నోటీసులు.. తేలుకుట్టిన దొంగల్లా కూర్చోవడం ఏంటి?’
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవినీతి బండారం బయటపడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముడుపులపై ఐటీ పూర్తి ఆధారాలతో నోటీసులు ఇచ్చిందని, ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘‘నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చింది. ఐటీకి లేఖలు రాసారే తప్ప ఆరోపణలను చంద్రబాబు ఖండించలేదు. ముడుపులు తీసుకోలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు?. మనోజ్ వాసుదేవ్ పార్థసాని చెప్పిన విషయాలపై ఎందుకు మాట్లాడరు?. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా చంద్రబాబే చెబుతారా?’’ అంటూ ఎమ్మెల్సీ డొక్కా దుయ్యబట్టారు. ‘‘ఐటీ శాఖ తన విధులు తాను నిర్వర్తిస్తుంది. ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఐటి శాఖ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించడం లేదు. తాను హరిశ్చంద్రుడినంటూ మాటలు చెప్పే బాబు ఇప్పుడు ఏం చెబుతారు?’’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. చదవండి: ఒక ఐటీ నోటీస్.. 10 ప్రశ్నలు.. ఇవి నిజం కాదా చంద్రాలు..? డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. నైతిక బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు ఐటీ శాఖ (ఆదాయ పన్ను శాఖ) చంద్రబాబుకు జారీ చేసిన నోటీసులపై ఎందుకు నోరు విప్పరని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ఆదాయ పన్ను శాఖ చట్ట ప్రకారమే పనిచేస్తున్నారు. ఏ వ్యక్తి, సంస్థల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో తేడాలుంటే ఐటీ శాఖ నోటీసులు ఇస్తారు. అలా ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. 2014-19లో రూ.118 కోట్లు మనీ ల్యాండరింగ్ ద్వారా చంద్రబాబుకు అందించామని మనోజ్ పార్థసాని చెప్పారని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. సెంట్రల్ ఐటీ శాఖకు విచారణ పరిధి లేదని.. ఫలానా ఆఫీసు చేయాలని టెక్నికల్ ఇష్యూను చంద్రబాబు లేవనెత్తారు కానీ.. సమాధానం ఇవ్వలేదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉంది. కేవలం ఐటీ శాఖకు లేఖలు రాసారే తప్ప ఆరోపణలను చంద్రబాబు ఖండించలేదు.ముడుపులు తీసుకోలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాలి చంద్రబాబును ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం ఆలస్యం అయితే వెంటనే చంద్రబాబును పిలిపించి కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. ఎలా ఈ వేల కోట్ల రూపాయలు మాయం అయ్యాయో విచారించాల్సిన బాధ్యత ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉంది. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుకు చంద్రబాబు ధైర్యంగా వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా. కేంద్రంలో అనేకసార్లు ప్రభుత్వాన్ని నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు. కనీసం ఒక రింగ్ కూడా లేదని హరిశ్చంద్రుడిని అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారు? ఐటీ నోటీసులపై ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు సమాధానం చెబితే.. మంచిది కదా. ప్రజాజీవితంలో ఉన్న మిగిలిన వారికి ఒక ట్రెండ్ సెట్ చేసిన వారు అవుతారు. పైగా నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా చంద్రబాబే చెబుతారా? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. ఒకవేళ విక్కీ జైన్ ఎవరో చంద్రబాబుకు తెలియదని చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. చంద్రబాబు పేరును ఐటీ శాఖకు వాళ్లు చెప్పారు. ఐటీ శాఖ పూర్తిగా దర్యాప్తు చేస్తే మరింత డబ్బు వివరాలు బయటపడతాయి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే... చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకున్నారు. నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ పరిధి గురించి చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఐటీ నోటీసులు జూబ్లిహిల్స్ శాఖ మాత్రమే ఇవ్వాలని, సెంట్రల్ ఆఫీస్ ఎలా ఇస్తుంది అనటం కాదు. ఇది చంద్రబాబు చేయాల్సిన పనికాదు. అవన్నీ చంద్రబాబు కోర్టుల్లో తేల్చుకోవాలి. ప్రజాజీవితంలో ఉన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ప్రజలకు ఐటీ నోటీసులపై వివరణ ఇవ్వాలి. విక్కీ జైన్, మనోజ్ పార్థసాని తెలియదని.. ఆ డబ్బు రాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఎల్లో పత్రికల్లో ఎందుకు రాయరు? చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియాలో ఒక్క పత్రిక రాయదు. ఒక్కరు డిబేట్ చేయరు. చంద్రబాబే నాలుగుసార్లు ఐటీ శాఖకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం మీద చంద్రబాబు ఉలుకుపలుకు లేదు. ఇది అవినీతి సొమ్ము కాదా? దీనిపై ఏచట్టం క్రింద చర్యలు తీసుకోరా? ఐటీ శాఖ తక్షణం ఆ ప్రజాధనాన్ని ట్రెజరీకి అందించటానికి విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి. దీంతో పాటు ఏమేమి జరిగాయో విచారించాలి. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి, బాబు అవినీతి విషయంపై పత్రికలు ఎందుకు దాస్తున్నాయి. పత్రికల్లో రాస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా? ప్రజలకు వాస్తవాలు తెలిస్తే తప్పా? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీకు నచ్చినవే.. రాయటానికి పత్రికల్లో రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలు ప్రజలకు అందివ్వరా? పత్రికలకు కూడా ఇది మంచిపద్ధతి కాదు. రోజుకో అంశం రాస్తున్నారు కదా. ఇది కూడా రాస్తే ప్రజాధనం ఏమైందో... ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏదైనా పథకంలో ఏమైన లోటుపాట్లు ఉన్నాయని కాగ్ లేక కేంద్రమో చెబితే.. గగ్గోలు పెట్టే మీడియా, చర్చలు పెట్టే మేధావులు చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు. కాగ్ ఒక అభ్యంతరం తెలిపితే దోపిడీ అని బ్యానర్ ఐటమ్స్‌తో రాస్తారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన డబ్బు పక్కదారి పడితే ఎందుకు డిబేట్లు పెట్టరు. భారీగా మీడియాలో ఎందుకు రాయరు. చంద్రబాబు, మీడియా తేలుకుట్టిన దొంగల్లా కూర్చున్నారు. 2022లోనే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటం జరిగింది. నాలుగు సార్లు ఐటీ శాఖకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సీక్రెట్ డాక్యుమెంట్స్ సంపాదించి మీడియా వార్తలు రాస్తారు. చంద్రబాబు నోటీసులపై ఎందుకు రాయరు. ఐటీ శాఖ తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని లోతుగా విచారించి ప్రజాధనం ఏమైందో కనుక్కోవాలని డొక్కా డిమాండ్ చేశారు. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. 2023 ఆగస్టు 4న చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చింది . గత రెండేళ్లుగా ఇది జరుగుతోంది. సాక్ష్యాధారాలు లేకుండా ఐటీ శాఖ నోటీసు ఇస్తుందా? ఎలా సాధ్యం అవుతుంది. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. ఐటీ శాఖ ఆధారాలతో సహా నోటీసు ఇచ్చింది. తర్వాత సీబీఐ క్రిమినల్ చార్జిషీటు దాఖలు చేయటం ఆటోమ్యాటిక్‌గా జరుగుతుంది. మేం కూడా సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలి కూడా. ప్రజాధనం దుర్వినియోగం అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్ర సంస్థలు, సీబీఐ, ఐటీ దర్యాప్తు చేయాలి. విక్కీ జైన్, మనోజ్ పార్థసానినితో పాటు దీనివెనుక ఉన్న పెద్దలూ వస్తారు. తద్వారా ప్రజాధనం ఎంత వెనకుందో తెలుస్తుంది. ఎన్టీఆర్ నాణెం విడుదల రోజున చంద్రబాబు పడిన అవస్థలు చూడలేకపోయాం. నడ్డాను బ్రతిమిలాడటానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు -
మాదిగ నేతలు టీడీపీని వీడాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల భయంతో కులాల కుంపట్లు రాజేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటేనని ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, బొమ్మి ఇజ్రాయెల్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవటాన్ని నిరసిస్తూ టీడీపీకి చెందిన మాదిగ నేతలంతా ఆ పార్టీని వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా మాదిగలకు ఒక్కటైనా మేలు చేసిందా? అని ప్రశ్నించారు. మాల మాదిగలను గౌరవిస్తూ, రాజ్యాధికారంలో వాటా కల్పిస్తూ సీఎం జగన్ ఐదు కీలక శాఖలను కేటాయించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలతోపాటు ఉన్నత చదువులు అభ్యసించేలా తోడుగా నిలిచి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దురహంకారంతో మాట్లాడిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఈమేరకు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. దూషించేందుకే ఆ సమావేశం చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మాదిగలకు టీడీపీ చేసిన మేలు ఒక్కటైనా ఉందా? టీడీపీ అధినాయకత్వాన్ని దళితులంతా నిలదీయాలి. టీడీపీకి చెందిన మాదిగ నాయకులంతా సంక్షేమంపై చర్చించకుండా సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషించేందుకే సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏడాది రాగానే కులాల కుంపట్లు రాజేయడం చంద్రబాబుకు అలవాటే. విద్య, సంక్షేమ పథకాలతో దళితుల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారు. ఇద్దరు మాదిగలు, ముగ్గురు మాలలకు కీలక శాఖలు అప్పగించారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 30 లక్షల మందికిపైగా ఉచితంగా ఇళ్ల స్థలాలను అందించారు. అమరావతి ప్రాంతంలో మరో 50 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారు. ఒకేసారి అంతమందికి ఉచితంగా ఇళ్ల స్థలాలిచి్చన పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందా? – డొక్కా మాణిక్య వరప్రసాద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దళిత ద్రోహులంతా టీడీపీలోనే చంద్రబాబు ఆది నుంచీ దళితులకు వ్యతిరేకమే. ఎన్నికల భయంతో మాదిగల ఓట్ల కోసం ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా మాదిగల పట్ల ఎంత నీచంగా వ్యవహరించారో, ఎలా అవమానించారో మాదిగ జాతి మరిచిపోలేదు. మాదిగలు, మాలలకు పెద్దపీట వేస్తూ ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. మాదిగల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యను అభ్యసిస్తున్నారు. దీనిపై కూడా కోర్టులకెక్కి అడ్డుపడ్డ దళిత ద్రోహి చంద్రబాబు. పేదల ఇళ్లను సమాధులతో పోల్చిన వ్యక్తి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉండగా ఏ ఒక్క పేదవాడికైనా సెంటు స్థలమిచ్చారా? దళితులను అవమానించిన ద్రోహులంతా టీడీపీలోనే ఉన్నారు. దళితులంతా సీఎం జగన్ వెంటే నడుస్తారు. –కొమ్మూరి కనకారావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ జగన్ అంటే సోషల్ ఇంజనీరింగ్ పేద బిడ్డలను ప్రోత్సహిస్తూ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తెచ్చిన సమూల మార్పులు టీడీపీ నేతలకు కనపడటం లేదా? దళిత నేతలు ఇప్పటికైనా చంద్రబాబు నైజాన్ని గ్రహించి టీడీపీని వీడి బయటకు రావాలి. సోషల్ ఇంజనీరింగ్ అంటే సీఎం జగన్... జగన్ అంటేనే సోషల్ ఇంజినీరింగ్! సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, ఆర్బీకేలు, అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా లాంటి విప్లవాత్మక చర్యలే ఇందుకు నిదర్శనం. దళితులకు హిందూ దేవాలయాల్లో ప్రవేశం ఎందుకని నాడు ఇదే టీడీపీ పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఆలయాల్లో ప్రవేశాలతోపాటు మాల మాదిగలు, రెల్లి కులస్తులకు ఆలయ పాలకవర్గాల్లో సభ్యులుగా నియమించడంతోపాటు నిర్వహణ బాధ్యత కూడా అప్పగించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏరోజైనా మాల, మాదిగ, రెల్లి, యానాది కులాలకు చెందిన వారిని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీలకు చైర్మన్‌గా నియమించారా? నామినేటెడ్ పనులు, పదవుల దగ్గర్నుంచి ముఖ్యమంత్రికి సలహాదారులుగా మాదిగలు, మాలలు ఉన్న పరిస్థితిని మనమంతా చూస్తున్నాం. హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంటూ ఓ చెత్తబుట్టను ప్రకటించారు. – బొమ్మి ఇజ్రాయెల్, ఎమ్మెల్సీ -
బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై తక్షణమే విచారణ జరపాలని శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మనుషులు డబ్బులిస్తామని ఆఫర్ చేశారని, దానిని తాను తిరస్కరించానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడం, ఇది వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకోవడమే బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయానికి నిదర్శనమన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోనూ చంద్రబాబు ఇలాంటి ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికారని, ఆయన భ్రీఫ్డ్ మీ అనటం విన్నామని చెప్పారు. 1995లో వైశ్రాయ్ నుంచి నిన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు వరకూ బాబుది ఇదే తీరని చెప్పారు. ఈ విషయంలో సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని ఎమ్మెల్యేలు రాపాక, మద్దాళి గిరి కూడా చెప్పారన్నారు. వీటన్నిటిపై సీబీసీఐడీ విచారణ జరిపి, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన ‘ఓటుకు కోట్ల’ కేసును కూడా దీనితో కలిపి విచారించాలన్నారు. ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసింతో ఈడీలాంటి సంస్థలు దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభమైందని, అన్నీ ఒకే సోర్స్ నుంచి జరుగుతున్నాయని అన్నారు. శ్రీదేవి స్క్రిప్ట్ చంద్రబాబుదే శ్రీదేవి అమరావతి అన్నప్పుడే ఆ స్క్రిప్ట్ చంద్రబాబుదని అర్ధమైందన్నారు. వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా, శ్రీదేవి ఒక్కరే అమరావతి నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నించారు. ఆమె బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణ హాని ఉందని అనడం సరైనది కాదని అన్నారు. అంత పెద్ద వారి గురించి, అంతటి పెద్ద పెద్ద మాటలు ఎందుకని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారని, ఎమ్మెల్యే శ్రీదేవిని కూడా సీఎం గౌరవంగా చూసుకున్నారని తెలిపారు. శ్రీదేవికి భయం అక్కర్లేదని, ఆమె ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగొచ్చని చెప్పారు. ఆమెకు ఏం రక్షణ కావాలో ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. శ్రీదేవి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వివాదాలేనని, ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదని తెలిపారు. ఆమె విషయంలో వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ఆమె ఇలాంటి వివాదాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. -
‘ఆ ఘటన వెనుక ఎవరున్నారు?.. వారిద్దరూ ఎందుకు ఖండించలేదు’
సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సామాజిక న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడం దళితులందరికీ ఎంతో గర్వకారణమన్నారు. చదవండి: ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ అల్లర్ల ఘటనను ఇంతవరకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఖండించలేదని దుయ్యబట్టారు. ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగ నిర్మాతను కులాలకు అతీతంగా చూడాలి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తూ ఆయన్ని వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు. అల్లరిమూకలను దూరంగా పెట్టాలని కోనసీమ ప్రజలకు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. -
జాతీయ దృక్పథం గల దళితోద్ధారకుడు
ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్‌రామ్. రాజకీయాల్లో ఆచరణవాది. తండ్రి జీవన తాత్విక బాటలో అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకొని, జాతీయోద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని, దేశ రాజ కీయాల్లో ఒక సరికొత్త నినాదంగా మారిన వ్యక్తి. బ్రిటిషర్స్ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకువస్తున్న సందర్భంలోనే ‘ఆల్ ఇండియా అణగారిన వర్గాల సమాఖ్య’ను ఏర్పాటు చేసి దళిత బహుజన వర్గాలను జాతీయ స్థాయిలో ఐక్యపరచే కార్యాచరణకై ఉద్యమించాడు. బిహార్ అసెంబ్లీకి 1936లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో అణగారిన వర్గాల సమాఖ్య తరపున బరిలోకి దిగి 14 మంది అభ్యర్థులను గెలిపించాడు. జాతీయ దృక్పథంతో పనిచేస్తూనే దళిత బహు జనోద్ధరణకు పూనుకున్న ప్రజ్ఞావంతుడు జగ్జీవన్‌రావ్‌ు. మానవ సమాజమార్పునకు దోహదపడే రాజ్యాంగ మార్గ పద్ధతుల పట్ల బలమైన నమ్మకంతో పనిచేశాడు. రాజ్యాంగ రచనకై ఏర్పాటైన ‘రాజ్యాంగ సభ’ సభ్యు నిగా బిహార్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. 1946లో కేంద్రంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్ర కార్మికాఖ మంత్రిగా పని చేశాడు. 1947లో ఏర్పడ్డ ప్రభుత్వంలో కూడా మరోమారు ఇదే శాఖకు మంత్రి అయ్యాడు. కార్మికులపై జాతీయ కమీషన్‌ను ఏర్పాటు చేసి జస్టిస్ గజేంద్ర ఘట్కర్ వంటి ఉద్దండ న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమించాడు. ఈ కమిటీ నివేదికల ఆధారంగా కార్మిక ప్రజా ప్రయోజనాల కోసం కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సవరణ) చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక ప్రజోపయోగ చట్టా లను రూపొందించాడు. అలాగే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూ రెన్స్ ఫండ్ వంటి చట్టాల ద్వారా సామాజిక భద్రతకు పునా దులు వేశాడు. ఫ్యాక్టరీస్ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయడాన్ని నిషేధించాడు. కార్మికుల పనిగంటలు నిర్ధారించాడు. అదనపు పనికి గానూ అదనపు చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు. కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైల్వే మంత్రిగా చార్జిల పెంపు భారం పేదవాళ్ళపై పడకుండా సంస్కరణలు చేపట్టాడు. భారత సమాజం దళిత అణగారిన వర్గాల పట్ల చూపు తున్న వివక్షలను ‘భారత్‌లో కులం సవాళ్ళు’ (కాస్ట్ ఛాలెం జెస్ ఇన్ ఇండియా) రచన ద్వారా వివరించాడు. అంబేడ్కర్ వంటి మేధావి రాజ్యాంగ రచనా సంఘం బాధ్యతలు చేపట్టేందుకు తన వంతుగా నెహ్రూ, గాంధీ, పటేల్ వంటి జాతీయ నాయకులను ఒప్పించిన రాజకీయ నేర్పరి జగ్జీవన్‌రామ్. బిహార్‌లో భూకంపం సంభవించి నప్పుడు ఆయన చూపించిన చొరవ, సామాజిక విపత్తులు సంభవించి నప్పుడు ఎలా ఎదర్కొనాలో తెలుపుతాయి. ఈ సంఘటన మహాత్మాగాంధీని సైతం ఆకర్షించింది. దేశంలో ఆహార సంక్షోభం సంభవించినప్పుడు హరిత విప్లవానికి నాంది పలికి ఆహారోత్పత్తిని పెంచి, దేశాన్ని సంక్షోభం నుంచి ముందుకు నడిపాడు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరుపేదల ఆకలి తీర్చేందుకు పూనుకున్న దార్శనికుడు. దేశ రక్షణ శాఖ మంత్రిగా ఆయన కార్యసాధన ఎప్పటికీ ఆదర్శనీయమే. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సియాచిన్ పర్వత శ్రేణులలో సైనికులతో కలసి తిరిగాడు. యుద్ధం పాక్ భూభాగంలో మాత్రమే జరగాలనీ, భారత్ భూభాగంలో కాదనీ ఉద్భోధించి, భారత సైన్యాన్ని ఉత్సాహ పరుస్తూ సైనికుల్లో సైనికుడిలా మెలిగిన రక్షణ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. భారత సైన్యం విజయం సాధిం చిన మొదటి యుద్ధం దళితుడైన జగ్జీవన్ రామ్ నాయకత్వాన జరిగినది కావడం ఒక చారిత్రక విషయం. భారత పార్లమెంట్లో 4 దశాబ్దాలపాటు పార్లమెంటే రియన్‌గా మెలిగిన అజాత శత్రువు బాబూ జగ్జీవన్‌రావ్‌ు. దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అన్న పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు బాబూ జగ్జీవన్ రామ్! గొప్ప దేశభక్తుడు, దార్శనికుడు, మానవీయ మూర్తి జగ్జీవన్‌రావ్‌ును ‘భారత రత్న’ వంటి అత్యున్నత పురస్కారంతో దేశం గౌరవించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీ మంత్రి (నేడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి) -
అదే... భరతజాతికి భగవద్గీత!
ప్రపంచంలో నేను ఒంటరి వాడినైనప్పటికీ నేను ప్రాణప్రదంగా విశ్వ సించే కొన్ని సిద్ధాంతాలకు ప్రమాదం ఉండదని భావి స్తున్నాను. నేను ప్రేమించే సిద్ధాంతాలు, ఆదర్శాలు వ్యాప్తిలో ఉన్నంత కాలం మరణానంతరం సైతం సమాధిలోనే జీవిస్తాను. మరోమాటలో చెప్పా లంటే సమాధి నుండి సందేశం వినిపిస్తాను అన్న మహాత్ముడి మాటలు నేటికి అక్షర సత్యాలుగా మారాయి. ప్రజలను సమీకరించడం గాంధీజీ రాజకీయ వ్యూహాల్లో ఒక అంశం. వలస పాలకుల్లో కొందరినైనా తటస్థు లుగా మార్చడం; హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను తీసుకు రావడం. అంటరానివారుగా ఉన్న హరిజనులను (దళితులను) ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకు రావడం ఆయన వ్యూహాల లక్ష్యాలు. తన సిద్ధాంతానికి ముఖ్య భూమికగా వున్న ‘హింద్ స్వరాజ్’లో తను కోరుతున్న సమాజాన్ని ఆవిష్కరించి చూపాడు. ఈయన తాత్విక నేపథ్యా నికి మూలాలు అహింస, ప్రేమలో ఉన్నాయి. జీవితాంతం వ్యక్తులతో సమాజంతో చర్చోప చర్చలు చేస్తూ సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సత్యమే భగవంతుడు అని ప్రకటించారు. గాంధీ జీవిత కాలంలో రెండు విషయాల పట్ల చాలా ప్రస్ఫుటంగా వ్యధ చెందారు. ఒకటి మత సామరస్యం, రెండవది కుల నిర్మూలన. కుల నిర్మూలనకై గాంధీ చేసిన కృషి అనితర సాధ్యమైంది. అస్పృశ్యతను నివారించి నట్లయితే కులాల మధ్య ఉండే అంతరాలు తగ్గుతాయని భావించారు. 1921లోనే అస్పృశ్య తను పాటించడం హిందూ మతానికి మచ్చ అన్నారు. ‘మతం’, అంటే ‘మూఢనమ్మకాలు, దుష్ట ఆచారాలు, మనిషికీ మనిషికీ మధ్యన నిర్మించబడ్డ అంతరాలు కాదు; మతం, రాజకీ యాలు, నైతిక సూత్రాలు, పరిశుద్ధ ప్రవర్తన... ఇవన్నీ పర్యాయ పదాలు అని గాంధీ ప్రకటిం చారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటును అందిస్తూ, వారి అభివృద్ధిని కాంక్షించే దిగా మతాన్ని పేర్కొ న్నారు. నేడు గాంధీ చెప్పిన సిద్ధాంతాలు తల కిందులయ్యాయి. గాంధీ రామరాజ్యం స్థాపిం చాలని కాంక్షించారు. అయినా మతాలనూ సమానంగా దర్శించిన దేశీయ తాత్వికమూర్తి. ఈయన సైద్ధాంతిక భావజాలాన్ని పసి గట్టిన మతోన్మాదులే ఆయన్ని హత్యగావించారు. గాంధీ మత సామరస్యం కోసమే ప్రాణత్యాగం చేశారు. సత్యం, సత్ప్రవర్తనలకు మించిన మతం లేదు అన్నారు. ప్రజలందరికీ సమానహక్కులు లభించే భారత దేశం అనే భావనను వ్యతిరేకించే భావజాలం ఉన్న వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా గాంధీపై దాడి చేస్తూనే ఉన్నారు. గాంధీయిజాన్ని తమ మార్గానికి అవ రోధంగా భావిస్తున్న వారే జనవరి 30, 1948న మహాత్ముడిని హత్య చేశారు. ఆయన చూపిన అహింసా మార్గమే భరతజాతికి భగవద్గీత! -డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ (నేడు గాంధీ వర్ధంతి) -
రాయలసీమ ప్రాజెక్టులపై నీ వైఖరేంటి బాబూ?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు మేలు జరుగుతుంటే అడ్డుకోవడమే చంద్రబాబు పని అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ముందు రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ స్టాండ్ ఏమిటో చంద్రబాబు నోరువిప్పి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన వైఖరిని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జలాలపై మన రాష్ట్రానికి ఉన్న నీటి హక్కులను సాధించి, రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులపై, కృష్ణాజలాలపై బ్రిజేష్‌కుమార్, బచావత్ తీర్పులకు అనుగుణంగా, న్యాయపరంగా వచ్చే ప్రతి చుక్క నీటిని సాధించి తీరతామని స్పష్టం చేశారు. న్యాయపరంగా మన వాటా ప్రకారం ఎంత నీరు రావాలో అంత తీసుకుంటామని, ఇందులో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. కడుపుమంటతో దుష్ప్రచారం ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుడికి ప్రయోజనం అందుతోందని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితులోనూ అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా కనిపిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా పేదలకు రూ.లక్ష కోట్లకు పైగా డీబీటీ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసిన ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డేనని చెప్పారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో స్థిరమైన నాయకత్వం బలపడుతుందనే దుగ్ధ, చరిత్రలో ఎప్పుడూ జరగని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయనే కడుపుమంటతో చంద్రబాబు, టీడీపీ నేతలు, వారికి వత్తాసు పలికే మీడియా నిత్యం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారని, పక్కా ఇళ్ల నిర్మాణం మహాయజ్ఞంలా జరుగుతోందని చెప్పారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విద్య, వైద్యం, రైతులు, హౌసింగ్‌తో పాటు, మహిళలు, దళితులకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అధి కారం చేపట్టిన రెండేళ్లలోనే నాడు–నేడు ద్వారా విద్య, వైద్యరంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సాధన దీక్ష’ పేరుతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. ఆయన దీక్ష చేసింది 3 గంటలు, తిట్ల దండకం 4 గంటలు అని మాణిక్యవరప్రసాద్ ఎద్దేవా చేశారు. -
దీక్ష పేరుతో చంద్రబాబు తప్పుడు ప్రచారం..
సాక్షి, అమరావతి: దళారులు లేకుండా నేరుగా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీక్ష పేరుతో ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. తన హయాంలో పేదలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ‘‘పేదలకు మేలు జరుగుతుంటే అడ్డుకోవడమే చంద్రబాబు పని. సీఎం వైఎస్ జగన్.. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఆ ఆలోచన చేశారా?’’ అంటూ డొక్కా మాణిక్య వరప్రసాద్ దుయ్యబట్టారు. -
జగ్జీవన్‌రామ్.. నవభారత క్రాంతదర్శి
జగ్జీవన్‌రామ్ దేశ ప్రజానీకానికి ‘బాబూజీ’గా సుపరిచితుడు. బాల్యం, విద్యాభ్యాసం బిహార్‌లోని ‘అర్రా’లో కొనసాగాయి. ఇక్కడే ఆయనకు మదన్ మోహన్ మాలవీయ వంటి ఉద్దండు లతో పరిచయం ఏర్పడింది. ఉన్నత విద్యాభ్యాసానికి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి ఆహ్వానించాడు మాల వీయ. కలకత్తాలో చదువుకునే రోజుల్లో కార్మిక సభకు నాయకత్వం వహించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి పెద్దల దృష్టిని ఆకర్షించాడు. 1934లో బిహార్‌లో సంభ వించిన తీవ్ర భూకంప అనంతర కార్యక్రమాల వల్ల మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. రైతుల హక్కులకు మద్దతుగా ఆనాడే కేతిహార్ మజ్దూర్ సభను స్థాపించాడు. ‘ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్’ ద్వారా దళిత బహుజనుల హక్కుల కోసం ఉద్యమించాడు. 1935లో హమాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ‘డీలిమిటేషన్’ కమిటీ ముందు హాజరై దళితులకు ఓటు హక్కు కావాలని నినదించాడు. రాజ్యాంగ రచనా సంఘ సభ్యునిగా బిహార్ నుండి ఎంపిక య్యాడు. రాజ్యంగసభ మైనార్టీ హక్కుల సబ్ కమీటికి ఎంపికై సభలో వారి హక్కుల రక్షణకై మట్లాడాడు. అంటరానితనం నిర్మూలనకు, వెనుకబడిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వే షన్లు పొందేందుకు ఎస్సీ, ఎస్టీలకు చట్ట సభల్లో సీట్లు రిజర్వు కావడానికి విజయవంతమైన పాత్ర పోషించాడు. భారత పార్లమెంటుకు దాదాపు నాలుగు దశాబ్దాలు పార్లమెంటేరియన్‌గా కొనసాగాడు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా కనీస వేతన చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సవరణ) చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేశాడు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి చట్టాల ద్వారా ‘సామాజిక భద్రత’ అంశానికి పునాది వేశాడు. ఫ్యాక్టరీస్ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో, వృత్తుల్లో పని చేయడాన్ని నిషేధించాడు. కార్మికుల పనిగంటలు నిర్ధారించాడు. అదనపు పనికిగాను అదనపు చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు. కాంట్రాక్ట్ లేబర్ సంక్షేమ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కార్మికుల కోసం ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ గజేంద్ర గట్కర్‌ను అధ్యక్షుడిగా నియమించాడు. రైల్వేశాఖా మంత్రిగా రైల్వేలను ఆధునీకరించి చార్జీల భారం పేద ప్రజానీకంపై పడకుండా సంస్కరణలు చేపట్టాడు. ఇక దేశ రక్షణ మంత్రిగా ఆయన చూపిన దీక్షా దక్షతలు నేటికీ ఆదర్శ నీయమే. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సియాచిన్ పర్వత శ్రేణులలో సైనికులతో కలసి తిరిగాడు. ‘యుద్ధం పాకి స్తాన్ భూభాగంలో మాత్రమే జరగాలి’, భారత్ భూభాగంలో కాదని భారత సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. భారత సైన్యం విజయం సాధించిన మొదటి యుద్ధానికి జగ్జీవన్ నాయకుడిగా ఉండటం ఒక చారిత్రక విషయం. వ్యవసాయశాఖా మంత్రిగా హరిత విప్లవానికి నాంది పలికాడు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి నిరు పేదల ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టాడు. స్వామినాథన్ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ‘జగ్జీవన్‌రామ్ గొప్ప దార్శనికుడు. ఆహార సమస్యను తీర్చేందుకు ఆయన చూపిన చొరవ, అనుసరించిన శాస్త్రీయ పద్ధతులు’ తనకు గొప్ప స్ఫూర్తి నిచ్చాయని పేర్కొ నడం బాబుజీ దార్శనికతకు నిదర్శనం. ఈ దేశ ప్రజల చేత ‘బాబూజీ’ అని పిలిపించుకున్న గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు జగ్జీ వన్‌రామ్. గొప్ప దేశభక్తుడు, జాతీయ నాయకుడు, మానవీయ మూర్తి, భారతమాత ముద్దుబిడ్డ అయిన బాబూ జగ్జీవన్‌రావ్‌ును ‘భారతరత్న’గా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. - డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, మాజీమంత్రి -
పోలవరం పరుగులు: ఎమ్మెల్సీ డొక్కా
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు భయపడుతున్న రోజుల్లో ప్రజల అవసరాల దృష్ట్యా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం పనులను ప్రారంభించారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే కుడి ఎడమ కాల్వల పనులు 80 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పోలవరం ప్రాజెక్ట్‌ను కేవలం ప్రచారానికి వాడుకున్నారు తప్ప.. ప్రాజెక్టు పనులను పూర్తిస్థాయిలో చేయలేకపోయారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పోలవరం పనులు పరుగులు పడుతున్నాయన్నారు. (చదవండి: ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం: సీఎం జగన్) పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రాజెక్టుకు ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు’గా నామకరణం చేసి వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బృందంతో కలిసి పరిశీలించారు. ముందుగా ప్రాజెక్ట్ పై ఉన్న గడ్డల నిర్మాణాన్ని పరిశీలించిన ఆయనకు గడ్డల నిర్మాణం వివిధ అంశాలపై అధికారులు ఫోటో గ్యాలరీతో వివరించారు. అనంతరం స్పిల్ వే పనులు కాపర్ డ్యాం పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా మార్చి లక్షలాది మంది జనాన్ని తరలించి ప్రచారం చేయించుకున్నారు తప్ప.. పనులు మాత్రం చేయలేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక టూరిజం హబ్ గా మార్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: 'ఇద్దరూ తలుపులు బిగించుకొని ఇంట్లో దాక్కున్నారు') -
వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది..
సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా హిమని సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ్ రెడ్డి, యేసురత్నం తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గాంధీ ఆలోచనలు నేడు దేశానికి అవసరం. మత సహనం,దళితుల, ముస్లింలు, పేదలపై దాడులను గాంధీజీ ఖండించారు. అన్నీ కులాలను కలుపుకుని ముందుకు నడిపిన సమగ్ర నాయకత్వం ఆయన సిద్దాంతాలలో ఉంది. దళితులు, దేవాలయాలపై దాడులు దేశానికి మంచిది కాదు. గాంధీజీ ఆలోచనలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. యుపిలో దళిత మహిళను రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అన్నారు. (చదవండి: మహాత్ముడికి సీఎం జగన్ నివాళి) ‘నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తోంది. ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి దక్కుతుంది. మా ప్రభుత్వం వచ్చాక అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. వారిలో 85 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ దళితులపై ఏదో ప్రేమ ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. వారి హయాంలో దళితులపై దాడి జరిగితే చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. జగన్ సీఎం అయ్యాక చట్టపరంగా సీఐ, ఎస్సై స్థాయి వారిపైనా చర్యలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు, పార్టీలు దళిత ఎజెండాను అమలు చేస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ ఆందోళన చేసింది. వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వానికి అండగా ఉన్న దళితులను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దళిత సంఘాలు వారి మాటలు నమ్మొద్దు. మీకు అండగా ఉండేది మా ప్రభుత్వం. ఆర్థిక వేత్తలు చెప్తున్న ప్రజల్లోకి మనీ ఫ్లో అనే సూత్రాన్ని ఒక్క జగన్ గారు అమలు చేస్తున్నారు’ అని మాణిక్య వరప్రసాద్ అన్నారు. ‘వైఎస్సార్ కుటుంబానికి కులం లేదు.. మతం లేదు. ప్రతిపక్షానికి దేవాలయాలపై, దళితులపై మీకు ప్రేమ లేదు. దళితులను రెచ్చగొట్టడం, మత కలహాలు సృష్టించడమే పని. ప్రభుత్వాన్ని, జగన్‌ను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా అతని ఎజెండా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎజెండా నుంచి జగన్ ఎప్పుడూ పక్కకి వెళ్ళారు. ఆయా వర్గాలన్నీ జగన్ వెనుకనే ఉన్నాయి. చిత్తూరు సంఘటనలో ప్రభుత్వం చక్కగా పని చేస్తోంది. కొన్ని దళిత సంఘాలు వాస్తవాలను తెలుసుకోవాలి. పేదలకు, దళితులకు ఇల్లు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తులెవరో అందరికీ తెలుసు. ఏదయినా సంఘటన జరిగినా రాజకీయాలకు అతీతంగా దళిత సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. (చదవండి: ‘ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది’) అలానే ‘కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయ స్థానాలపై ఉంది. న్యాయ పరిపాలనను వదిలేసి ప్రజా పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది. కోర్టులు న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకు న్యాయం అందించాలి. కాని కోర్టు పరిపాలన చేస్తామంటే రాజ్యాంగం అనుమతించదు. కోర్టుకు అలాంటి పోకడలు మంచిది కాదు గాంధీజీ విలువలకు అది విరుద్దం. మహానుభావులు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కోర్టులు పని చేయాలి. హైకోర్టులో జరుగుతున్న ఘటనలు ప్రజలను కలచి వేస్తున్నాయి. ప్రభుత్వంలో జోక్యం చేసుకునే న్యాయ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదు. పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగం ఉద్దేశాలే కనుమరుగవుతాయి. దీనిపై న్యాయ వ్యవస్థలు ఆలోచనలు చేయాలి. కోర్టులు కూడా సహనం కోల్పోవడం సరికాదు ఓర్పుతో వ్యవహరించాలి’ అని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. -
అమరావతి రైతులకు అండగా ఏపీ సర్కార్
సాక్షి, తాడేపల్లి : అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ట్రాప్‌లో పడొద్దని అమరావతి రైతులకు సూచించారు. స్థానిక రైతులను అండగా ప్రభుత్వం ఉంటుందని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ప్రభుత్వంతో చర్చించవచ్చని తెలిపారు. రాజధాని ప్రాంతంలో జరిగే ఉద్యమానికి దళితులకు సంబంధం లేదని స్పష్ట చేశారు. రాజధాని భూములపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ నేతలు విమర్శించడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (అవినీతి చేయాలంటే భయపడాలి: సీఎం జగన్) తాడేపల్లిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా మణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ.. దళితులకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అమరావతిలో దళితులకు 52 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు. కేసులు వేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కోర్టు సుమోటుగా స్వీకరించి విచారణ జరపాలని ఆయన కోరారు. -
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన డొక్కా
-
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన డొక్కా
సాక్షి, అమరావతి: డొక్కా మాణిక్య వరప్రసాద్ మంగళవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారన్నారు. అంతకు ముందు ఆయన తెలుగుదేశం నుంచి గెలిచి తర్వాత వైసీపీలో చేరారని తెలిపారు. అయితే వైసీపీలో చేరే ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారన్నారు. ఆ తర్వాత ఆయన స్థానానికి వైసీపీ మళ్లీ ఆయన్నే నిలబెట్టిందన్నారు. టీడీపీ పదవులు వదిలేసి వైసీపీ టికెట్‌పై గెలిచిన మొదటి వ్యక్తి డొక్కా అని ప్రశంసించారు. రాజీనామా చేస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అని చెప్పిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. తమ పార్టీ నైతిక విలువలకు ఇదే నిదర్శనం అని అంబటి స్పష్టం చేశారు. నా రాజీనామాకు అదే కారణం: డొక్కా అనంతరం డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చట్టసభలు అత్యధిక ప్రమాణాలతో ఉండాలని భావిస్తానన్నారు డొక్కా. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా తాను సభకు ఆబ్సెంట్ అవ్వలేదని తెలిపారు. అలాంటిది మండలిలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయాలు గౌరవించాలని సూచించారు. శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూడటం బాధ కలిగించింది అన్నారు. తాను రాజీనామా చేయడానికి ఇది ఒక కారణమని చెప్పుకొచ్చారు. మండలి అంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలా ఉండాలన్నారు. మండలి చైర్మన్‌కు కొందరు తప్పుడు గైడెన్స్ ఇచ్చారని డొక్కా ఆరోపించారు. -
టీడీపీకి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి డొక్కా
-
టీడీపీకి భారీ షాక్; మాజీ మంత్రి రాజీనామా
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అధిష్ఠానం వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కార్యకర్తలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టీడీపీ నేతల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందన్నారు. ('కుల మేధావి కిరసనాయిలు సలహా తీసుకో') వైఎస్సార్సీపీకి మానసికంగా దగ్గరయ్యా.. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైఎస్సార్సీపీకి మానసికంగా దగ్గరయ్యానని..అయితే వైఎస్సార్సీపీ నాయకత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. (చక్ర బంధంలో చంద్రబాబు!) -
‘కాల్‌మనీ నిందుతులకు ప్రమోషన్ ఇచ్చిన ఘనత టీడీపీదే’
సాక్షి, గుంటూరు : బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత లక్ష్మీపతి రాజు ఖండించారు. కాంగ్రెస్‌లో అలవాటైన శవ రాజకీయాలను ఎమ్మెల్సీ డొక్కా కొనసాగించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఆకస్మిక ప్రమాదాన్ని ఆసరా చేసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత జీవీఎల్ చాలాసేపు సంఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొన్నారు. జీవీఎల్ చట్టసభల సభ్యత్వంపై టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఘాటుగా స్పందించారు. కాల్‌మనీ నిందుతులకు ప్రమోషన్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని ఎద్దేవా చేశారు. -
ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పలు నామినేటెడ్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసింది. చాలాకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన నామినేటెడ్ పోస్టులను సర్కార్ గురువారం శ్రీకారం చుట్టింది. టీడీపీ ఆశావాహులు నామినేటెడ్ పోస్టులపై కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. విజయవాడ దుర్గగుడి చైర్మన్ గా యలమంచిలి గౌరంగబాబు (కృష్ణా) ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మహముద్ హిదాయత్ (గుంటూరు) ఏపీ మేదర కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా ఎం. సుందరయ్య (చిత్తూరు) ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జయరామిరెడ్డి (చిత్తూరు) ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పాలి ప్రసాద్ (పశ్చిమ గోదావరి) ఏపీ కనీస వేతనాలు బోర్డు చైర్మన్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ (గుంటూరు) కృష్ణ బలిజ, పూసల కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ గా కావేటి సామ్రాజ్యం (గుంటూరు) ఏపీ గీత కార్మికుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తోట జయప్రకాశ్ నారాయణ (గుంటూరు) -
రాజధానిపై అనుమానాలు రేకెత్తించొద్దు
అమరావతి : అమరావతిపై మీడియూలో కథనాలలతో అనుమానాలు రేకిత్తించవద్దని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సోమవారం శ్రీహిత డెవలపర్స్ అధినేత, టీడీపీ మండల నాయకుడు ఆలోకం సుధాకర్‌బాబు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానిపై కొన్ని పత్రికలు, రాజకీయ పార్టీలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రాజధాని భూ సమీకరణపైనా, భూముల కొనుగోలుపై వింత బాష్యాలు చెప్పడం సరికాదని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై దుమ్మెత్తిపోయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసైన్ట్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు. రైతులు, కూలీల్లో ఉన్న అనుమానాలు పోగొట్టేందుకు త్వరలో రాజధానిలో పర్యటిస్తానన్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు. -
డొక్కాలో కాంగ్రెస్ వాసన పోలేదు
గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య సాక్షి, విజయవాడ బ్యూరో: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరినా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిని వదిలించుకోలేక పోతున్నారని, ఆ వాసన ఆయనలో ఇంకా పోలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. శనివారం సీఎం కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలకు కృష్ణమాదిగే నాయకుడని ఆయన వ్యాఖ్యానించడం సరికాదని, దీనిపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. టీడీపీలో ఎలా పనిచేయాలో ఆయన ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు చూసుకుంటారని దానిపై కృష్ణమాదిగ తమకు చెప్పాల్సిన పనిలేదన్నారు. -
మంత్రి పుల్లారావుపై డొక్కా ఫైర్
గుంటూరు : గుంటూరు జిల్లాలో అధికార టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంపై మంత్రి పుల్లరావు వ్యాఖ్యలు సరికావని, పుల్లారావుతో సహా మంత్రులు ఎవరైనా అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. మంత్రి పుల్లారావు తాను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖపై పూర్తి స్థాయిలో దృష్టిపెడితే మంచిదని సూచించారు. సున్నితమైన అంశాన్ని మాటల ద్వారా జటిలం చేయడం సరికాదని హితవు పలికారు. మాదిగలకు మంద కృష్ణనే నాయకుడని, మందకృష్ణ నాయకత్వానికి పుల్లారావు సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. ఎస్పీ వర్గీకరణ అంశంపై ఆదివారం మంద కృష్ణ సహా మాదిగ నేతలతో సమావేశమవుతానని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని డొక్కా తెలిపారు. -
ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ అవసరం
మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ కొరిటెపాడు(గుంటూరు) : నవ్యాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీకూడా ఎంతో అవసరమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు స్పష్టం చేశారు. స్థానిక అరండల్‌పేటలోని హోటల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబునాయుడుకు మాత్రమే వుందన్నారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ చాలా ఉపయోగకరమన్నారు. ప్రత్యేక హోదా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఉపయోగకరమని పేర్కొన్నారు. నూతన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతిపక్షాలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన పేద వర్గాలకు భూములు పంచితే స్థిరమైన ఉపాధి ఉంటుందని, వారికి తప్పక భూములు ఇవ్వాలని కోరారు. పదవులు ఆశించి తాను టీడీపీలో చేరలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం ముఖ్యమంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ యం.డి.హిదాయత్, టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘వంద గొంతులు ఒక్కటై..’
గుంటూరువెస్ట్ : తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని అగ్రహారాల నుంచి పల్లెలకు తీసుకువచ్చిన ఘనత గుర్రం జాషువాకే దక్కుతుందని ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ అన్నారు. సాహిత్యం సామాన్యుడిదని వెలుగెత్తిచాటాడని, ఆయన సాహిత్యం, కవిత్వం విశ్వజనీయమని ఇనాక్ కొనియాడారు. గుర్రం జాషువా 120వ జయంతోత్సవం సందర్భంగా జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో గుంటూరులోని పోలీసు కల్యాణ మండపంలో ఆదివారం ‘వంద గొంతులు ఒక్కటై.. జాషువా కోసం’ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ తెలుగు కవితా ప్రపంచం జాషువాను స్మరించుకోకుండా ఉండలేదన్నారు. ఆయనను స్మరించుకోవడం అంటే మన ఉనికిని మనమే గుర్తుంచుకోవడమని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో జాషువా పుస్తకాలు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, కార్యక్రమ నిర్వాహకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో జాషువా పుస్తకాలు ఉంటేనే ఆయనను గౌరవించినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. నూతన రాష్ట్రంలో తెలుగు సాహిత్యాన్ని, భాషను నిలుపుకోవడం జాషువా రచనలు ద్వారానే సాధ్యమన్నారు. తెలుగు సాహిత్యం, తెలుగు వాళ్ల మధ్య ఐక్యత రావటానికి జాషువా రచనలు దోహదం చేస్తాయన్నారు. గుంటూరు జిల్లాకు జాషువా పేరు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకుడు, కవి డాక్టర్ కత్తి పద్మారావు పంచకవుల కంటే జాషువా గొప్పవాడని కొనియాడారు. జాషువా విశ్వకవి అని, ఆయన పేరును గుంటూరు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్లు చల్లపల్లి స్వరూపరాణి, సంజీవరావు(శిఖామణి) మాట్లాడుతూ జాషువా రచనలను ఇంగ్లీష్, హిందీ బాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు సాహిత్యానికి జాషువా ప్రాణం పోశారని అన్నారు. తరలివచ్చిన కవులు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన కవులు జాషువాపై రచనలను చదివి సభికులను ఉర్రూతలూగించారు. జాషువా రచనల గొప్పతనాన్ని, తెలుగుభాషకు ఆయన చేసిన సేవలు, ఆయన ఔనత్యాన్ని స్పురించే విధంగా ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా, ఆహ్లాదపూరితంగా కొనసాగింది. ప్రముఖ కవులు ఎండ్లూరి సుధాకర్, కోయి కోటేశ్వరరావు, వి.సాంబశివరావు, ఎలీషా, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు(వెకై), సాహితీవేత్త బొమ్మిడాల కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, దశరథ్, పాలేటి జాన్సన్, పెద్దింటి యోహాను తదితరులు పాల్గొన్నారు. తొలుత నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కవులకు శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ప్రజానాట్య మండలి కళాకారులు గని, పివి రమణ బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. -
సింగపూర్ అమరావతిని తట్టుకోలేం
గుంటూరు: ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నిర్మించనున్న నూతన రాజధాని సింగపూర్ అమరావతిని మన ప్రజలు తట్టుకోలేరని రాష్ట్ర మాజీ మంత్రి డొక్కామాణిక్య వరప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం గుంటూరులో సాక్షి ఆధ్వర్యంలో జరిగిన ర్యాగింగ్‌పై రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన స్వచ్చందంగా పాల్గొని మాట్లాడారు. అలా నిర్మిస్తే ఒక్కసారిగా వచ్చి పడిన ప్రశ్చాత్య పోకడలను తట్టుకోలేక రిషితేశ్వరి ఘటన మాదిరిగానే ఇక్కడ జరిగే ప్రమాదం ఉందన్నారు. రిషితేశ్వరి సంఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మంచి పౌరులుగా తయారు అవ్వాలని కలలు కంటూ యూనివర్సిటీలకు వస్తున్న విద్యార్థినులు అర్ధాంతరంగా తనువు చాలించాల్సిన దుస్థితి దాపురించిందని ఆయన చెప్పారు. ప్రిన్సిపాల్‌తో కొందరు ఉద్యోగులు విసృంఖలత్వానికి ప్రతినిధులుగా మారారని మండిపడ్డారు. రిషితేశ్వరి ఘటనలో బాబూరావుపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి కేసు విచారణ పక్కదోవ పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సందేశం ఇవ్వాలని, అది దీర్ఘకాలిక ప్రణాళికతో ఉండాలని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఫీజులు కట్టలేక వారు టార్చర్ భరించలేక తీవ్రమనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓ కళాశాలలో జరిగిన సంఘటనను విచారించి ఆ కళాశాలపై నిషేధం విధించానని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ విద్యాసంస్థలను బ్యాన్చేయాలని డొక్కా స్పష్టం చేశారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రభుత్వమే విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలని డొక్కా సూచించారు.