Donald Trump Jr
-
ట్రంప్‌కు బేడీలు
-
ట్రంప్‌నకు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బ
-
కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష: Donald Trump
-
ఇదేందయ్యా ఇది..! మొన్న విషం.. ఇప్పుడేమో కలిసి పంచుకున్నాడు
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు అధిపతిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను నియమించారు. ఈయన అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్‌ను విషంగా అభివర్ణించి, ఇప్పుడు ట్రంప్ పక్కన కూర్చుని ఫాస్ట్ ఫుడ్‌ను తింటున్న ఉదంతానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ షేర్ చేసిన ఫొటోలో ఎలన్ మస్క్, ట్రంప్, యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఉన్నారు. అలాగే ఈ ఫొటోలో కెన్నెడీ జూనియర్ మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను చేతిలో పట్టుకోవడం కనిపిస్తుంది. అక్కడి టేబుల్‌పై కోకా-కోలా బాటిల్ కూడా కనిపిస్తోంది. దీనికితోడు మెక్‌డొనాల్డ్స్ బర్గర్, ఫ్రైస్ ఉన్న ప్లేటు ట్రంప్, మస్క్ ముందు ఉంచారు. ట్రంప్ జూనియర్ ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్ టుమారో స్టార్ట్స్’ అనే క్యాప్షన్‌తో చిత్రాన్ని షేర్ చేశారు. Make America Healthy Again starts TOMORROW. 🇺🇸🇺🇸🇺🇸 pic.twitter.com/LLzr5S9ugf— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 17, 2024ఇటీవల ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో కెన్నెడీ జూనియర్ ట్రంప్ తినేవాటిని ‘విషం’గా అభివర్ణించారు. ప్రచార సమయంలో ఆయన ట్రంప్ చెడ్డ ఆహారం తింటున్నారని పేర్కొన్నారు. ఈయన గతంలో దుకాణాల్లోని షెల్ఫ్‌ల నుండి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లను తొలగించాలని కోరారు. అయితే అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్కున్న ప్రాముఖ్యతను కెన్నెడీ జూనియర్ ఒప్పుకున్నారు.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
30 రాష్ట్రాల్లో ట్రంప్ ప్రభంజనం..
-
ట్రంప్ కే పట్టం కట్టిన అమెరికన్లు
-
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం
-
ట్రంప్ కి మోదీ విషెస్
-
Donald trump: ట్రంప్ ఇక లేరంటూ పోస్ట్.. ఆపై ట్విస్ట్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ కలకలం రేపింది. అదీ ఏకంగా ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సోషల్ మీడియా ఖాతా నుంచే కావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యిందని తర్వాత తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ మరణించారంటూ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎక్స్(ట్విటర్) ఖాతా నుంచి ఈ ఉదయం ఓ పోస్ట్ వచ్చింది. అంతేకాదు 2024 ఎన్నికల్లో ట్రంప్ బదులు అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తాననేది ఆ పోస్టు సారాంశం. అదే ఖాతా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను దూషిస్తూ పలు పోస్టులు కూడా వెలువడ్డాయి. అయితే, ట్రంప్ జూనియర్ అకౌంట్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు తర్వాత గుర్తించారు. కాసేపటికే పాత పోస్టులను తొలగించారు. అయినప్పటికీ సంబంధిత స్క్రీన్‌షాట్ మాత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ట్రంప్ దిగజారితే, కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తండ్రికి ఏమాత్రం తగ్గని రీతిలో అతని కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వ్యవహరిస్తున్నాడనే వార్తలు గుప్పుముంటున్నాయి. తాజాగా అమెరికన్ గాయని ఆబ్రే ఓ డే.. జూనియర్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సుదీర్ఘ కాలంగా జూనియర్ ట్రంప్‌తో తనకు అఫైర్ ఉన్నట్లువస్తున్న ఆరోపణలు ఒక స్వలింగ సంపర్కుల క్లబ్‌లోని బాత్రూమ్లో మొదలయ్యాయన్నారు. పాడ్‌కాస్ట్‌లో వివరాలు వెల్లడి.. మైకేల్ కోహెనెకు చెందిన ‘మేయా కుల్పా’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న 34 ఏళ్ల ఆబ్రే ఓ డే తొలిసారిగా తనకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించింది. తనను జూనియర్ ట్రంప్ వేధించి లైంగికంగా సంబంధం ఏర్పరుచుకున్నాడని ఆరోపించింది. మేము మొదటిసారి ఒక గే క్లబ్‌కు వెళ్లాం. అప్పుడు అతను నా వైపు చెడుగా చూశాడు. ఈ రాత్రికి క్లబ్‌లోనే ఉంటానని అన్నాడు. అది న్యూయార్క్‌లో అతి పెద్ద క్లబ్. దాని భారీ ఎత్తున గే పార్టీలు జరుగుతుంటాయి. ఆబ్రే ఓ డేకు అప్పుడు మరో మార్గం లేదు అని అనుకుంది. అతని ఇన్‌స్టాగ్రామ్‌లో.. పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆబ్రే ఓ తాను అతని ఇన్‌స్టాగ్రామ్‌ని మొదటిసారి చూశానని, దానిలో గే కమ్యూనిటీని కించపరిచే అన్ని రకాల జోక్‌లు ఉన్నాయని తెలిపారు. మేము మొదటిసారిగా గే క్లబ్ బాత్రూమ్లో లైంగిక చర్యలో పాల్గొనడం చాలా సౌకర్యంగా ఉంది అని అతను పేర్కొన్నాడని ఆమె ఆరోపించింది. ఈ జంట శారీరకంగా కలవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, మాజీ డానిటీ కేన్ ఫ్రంట్ వుమన్.. వీరు గతంలోనే బలమైన భావోద్వేగ బంధాన్ని పంచుకున్నారని వెల్లడించింది. ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లోనూ.. ఆబ్రే ఓ డే తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట 2011లో ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లో తొలిసారిగా కలుసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు నవ్వుకున్నారు. పార్టీలో ఏదైనా ఫన్నీగా జరిగిప్పుడు మేము ఒకరినొకరు చూసుకున్నాం. అప్పుడే సన్నిహితులమయ్యాం అని ఆమె తెలిపింది. తాను ఎప్పటికీ అతనిని ప్రేమిస్తూనే ఉంటానని ఆబ్రే ఓ పేర్కొంది. కాగా గత ఏడాది పేజ్ సిక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆబ్రే ఓ తనకు జూనియర్ ట్రంప్‌తో ఉన్నసంబంధం గురించి ప్రస్తావించింది.అయితే జూనియర్ ట్రంప్ దీనిపై స్పందించలేదు. ఇదికూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే.. -
భారత్‌కు ట్రంప్ జూనియర్..రియల్ ఎస్టేట్ రంగంపై కన్ను, వేలకోట్ల పెట్టుబడులు?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రియల్ ఎస్టేట్ రంగంలో తన వ్యాపార కార్యాలపాల్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ డిసెంబర్ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ జూనియర్‌కు చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ ముంబై ట్రిబెకా డెవలపర్స్ భాగస్వామ్యంతో భారత్‌లో పలు నిర్మాణాలు చేపట్టనుంది. ఇప్పటికే ‘ట్రంప్’ బ్రాండ్ పేరుతో దేశీయంగా లగ్జరీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంది. ఇందుకోసం ట్రిబెకా డెవలపర్స్, లోధా గ్రూప్‌తో జతకట్టింది. ఇక, ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్‌లో ఇప్పటివరకు ట్రంప్ టవర్ ఢిల్లీ - ఎన్సీఆర్, ట్రంప్ టవర్స్ కోల్‌కతా, ట్రంప్ టవర్ పూణే, ట్రంప్ టవర్ ముంబై నాలుగు లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను చేపట్టింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రాకపై ట్రిబెకా డెవలపర్స్ ప్రతినిధులు స్పందించారు. తమ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా జూనియర్ భారత్‌కు వస్తున్నట్లు తెలిపారు. భారత పర్యటన నేపథ్యంలో ట్రిబెకా డెవలపర్స్ అధినేత కల్పేష్ మెహత, ట్రంప్ జూనియర్లు వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ట్రంప్ లగ్జరీ ప్రాజెక్ట్‌లు 2014లో ది ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాల్ని ప్రారంభించింది. తొలిసారిగా ముంబైలో లోథా గ్రూప్‌తో ఇంటి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. పూణేలో పంచశీల్ రియాల్టీ సంస్థ భాగస్వామ్యంలో లగ్జరీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసింది. కోల్ కతాలో ట్రంప్ టవర్స్ 140 అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను ప్రారంభించింది. 2018లో గురుగ్రామ్, హర్యానాలలో మరో లగ్జరీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. -
ఆ కారణం వల్లే ట్రంప్ మొదటి భార్య ఇవానా మృతి
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ గురువారం అనుమానాస్పద రీతిలో మరణించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. శరీరంపై మొద్దుబారిన గాయాల ప్రభావం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇవానా ట్రంప్ మన్‌హాటన్‌లోని తన ఇంట్లో మెట్లపైనుంచి కాలుజారి పడటం వల్ల గాయాలపాలై మరణించారని అమెరికా మీడియాలో ప్రచారం జరిగింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఇవానా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆమె ఇంటి అడ్రస్ నుంచి తమకు గురువారం ఫోన్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అక్కడి వెళ్లి చూస్తే ఆమె ఘటనా స్థలంలోనే మరణించి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అక్కడ నేరం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కన్పించలేదని స్పష్టం చేశారు. ఇవానా మరణించిందని గురువారం ట్రుత్ సోషల్ వేదికగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఆమె గొప్ప, అందమైన మహిళ అని పేర్కొన్నారు. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వసమని తెలిపారు. ఆమె పట్ల తామంతా గర్వపడుతున్నామని, ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలని భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు. ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
వచ్చేస్తున్నాడు... డోనాల్డ్ ట్రంప్.. దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా..!
అమెరికా క్యాపిటల్ హిల్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో యూఎస్ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నిషేధిస్తూ పలు సోషల్ మీడియా సంస్థలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సొంత ప్లాట్‌ఫాంకు ట్రంప్ వడివడిగా అడుగులు వేస్తూ ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్‌పాంను సోమవారం రోజు(ఫిబ్రవరి 21) న లాంచ్ చేయనున్నాడు. సోషల్ మీడియా దిగ్గజాలకు పోటీగా.. సోషల్‌మీడియా దిగ్గజాలపై అక్కసును తెలియజేస్తూ సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌ను డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 21న లాంచ్ చేయనున్నారు. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ట్రూత్ యాప్‌ను ట్రంప్ ఆవిష్కరించనున్నాడు. యూఎస్ ప్రెసిడెంట్ డే సందర్భంగా ట్రూత్ యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ కు సంబంధించి తాజాగా జూనియర్ డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించాడు. నిజనిజాలను ట్రూత్ యాప్ తో వ్యక్తపరచ వచ్చునని అభిప్రాయ పడ్డాడు. ట్రూత్ డెమో ఫోటోల ప్రకారం ట్విటర్ మాదిరిగానే ఈ యాప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రెండింగ్ టాపిక్స్, ట్యాగింగ్ వంటి ఆప్షన్స్‌తో రానుంది. ఇప్పటికే ట్రూత్‌కు సంబంధించిన వివరాలను ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్(టీఎంటీజీ) యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ లిస్టింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. తొలుత ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్స్ లో రిలీజ్ కానుంది. -
జూనియర్ ట్రంప్‌కి కరోనా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని కరోనా వైరస్ వదలడం లేదు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ దంపతులు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తన క్యాబిన్‌లోనే హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘జూనియర్ ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. ప్రస్తుతం ఆయన కోవిడ్-19 మెడికల్ గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ హోం క్వారంటైన్లో ఉన్నారు’ అని తెలిపాడు. జూనియర్ ట్రంప్ కరోనా బారిన పడటంతో ట్రంప్ దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు బారన్, ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు శుక్రవారం, వైట్ హౌస్ సహాయకుడు, ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కుమారుడు ఆండ్రూ గియులియాని తాను కరోనా బారిన పడినట్లు ప్రకటించాడు. (జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా..) ఇక నవంబర్ 3 జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయినట్లు ట్రంప్‌తో పాటు జూనియర్ ట్రంప్ కూడా అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక కరోనా విషయంలో తండ్రికొడుకులిద్దరూ నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు అన్నారు. (కోవిడ్ కష్టాలు విని బైడెన్ భావోద్వేగం) ఇక అమెరికాలో ఇప్పటివరకు 1,22,68,678 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,60,235 మంది మరణించగా, 73,12,279 మంది బాధితులు కోలుకున్నారు. మరో 46,96,164 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 5,78,89,287 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,00,93,744 మంది కోలుకోగా, 1,64,18,785 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 13,76,758 మంది చనిపోయారు. -
నిక్కీ హేలీ ఏం చేస్తున్నారు; మరేం పర్లేదు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే దిశగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న జార్జియా, నెవెడాలోనూ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో మరోసారి అమెరికా పగ్గాలు చేపట్టాలనుకున్న ట్రంప్ ఆశలకు గండిపడినట్లే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయన, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ డెమొక్రాట్లపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, ట్రంప్ అనుకూల వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ కూడా చేదు ఫలితమే ఎదురైంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభిమానులు, ట్రంప్ మద్దతుదారులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ట్రంప్ ఒంటరిగా పోరాడుతున్నారని, మిగిలిన రిపబ్లికన్లు ఎందుకు మాట్లాడటం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీట్ల మోత ఈ క్రమంలో ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ. ‘‘ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం ఇది! ఎవరు గట్టిగా పోరాడుతున్నారు.. ఎవరు పక్కన కూర్చుని చోద్యం చూస్తున్నారు? దశాబ్దాల కాలంగా రిపబ్లికన్లు వీక్‌గానే ఉన్నారు. వామపక్షం ఇలాంటి పనులు చేసేందుకు వారు అనుమతినిచ్చారు. ఇప్పటికైనా ఆ ట్రెండ్‌కు స్వస్తి పలకండి’’అంటూ విరుచుకుపడ్డారు. ఇందుకు స్పందనగా.. ‘‘గొప్పలు చెప్పుకొనే సోకాల్డ్ కురువృద్ధ పార్టీ(జీఓపీ- రిపబ్లికన్ పార్టీ) భవిత్యం ఏమిటి? నిక్కీ హేలీ ఏం చేస్తున్నారు’’అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందుకు బదులుగా.. ‘‘2024 జీఓపీ ఆశావహుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. పోరాటం చేయడానికి, తామేంటో నిరూపించుకోవడానికి వారికి సరైన వేదిక ఉంది. కానీ వాళ్లు మీడియా మూకదాడికి భయపడుతూ వెనక్కి తగ్గుతున్నారు. అయినా మరేం పర్లేదు... డొనాల్డ్ ఒంటరిగానే పోరాడతారు, ఎప్పటిలాగానే వాళ్లు ఊరికే చూస్తూ కూర్చుంటారు’’అంటూ ట్రంప్ జూనియర్, తన తండ్రి ట్రంప్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన నిక్కీ హేలిని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే) కాగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన భారత సంతతి మహిళ నిక్కీ హేలీ, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ బరిలో నిలవనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ పాలనా యంత్రాంగంలో కేబినెట్ ర్యాంక్ దక్కించుకున్న తొలి ఇండో- అమెరికన్‌గా గుర్తింపు దక్కించుకున్న ఆమె, ట్రంప్ తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఇక కౌంటింగ్‌లో అక్రమాలపై ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో.. ‘‘ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి. ఇందుకు ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికా ప్రజలు అన్ని విధాల అర్హులు. చట్టాన్ని గౌరవించాలి. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది’’అంటూ ఆమె ట్వీట్ చేశారు. The total lack of action from virtually all of the “2024 GOP hopefuls” is pretty amazing. They have a perfect platform to show that they’re willing & able to fight but they will cower to the media mob instead. Don’t worry @realDonaldTrump will fight & they can watch as usual! — Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 5, 2020 -
అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఒట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. మంగళవారం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఓ వరల్డ్ మ్యాప్‌ని ట్వీట్ చేశారు. దీనిలో దాదాపు అన్ని దేశాలను రిపబ్లికన్ పార్టీ కలర్ అయిన ఎరుపు రంగులో చూపించారు. అంటే ఈ దేశాలన్ని తన తండ్రి విజయం సాధిస్తాడని నమమ్ముతున్నాయి.. ఆయనకే ఓటు వేస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఎరుపు రంగులో చూపించారు. ఇక ఇండియా, చైనా, లైబేరియా, మెక్సికో వంటి దేశాలను మాత్రం డెమొక్రాట్ పార్టీ రంగు బ్లూ కలర్లో చూపించారు. ఈ దేశాలన్ని జో బైడెన్‌కు మద్దతుదారులని.. ఆయనకే ఓటు వేస్తాయని తెలిపారు. అలానే అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్ వంటి రాష్ట్రాలను కూడా నీలం వర్ణంలోనే చూపించారు. ఒకే చివరకు నా ఎన్నికల మ్యాప్ అంచనా ఇలా ఉంది అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ ట్వీట్లో అతడు జమ్ము కశ్మీర్, లద్దాఖ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు మండి పడితున్నాయి. (చదవండి: ట్రంప్ గెలిస్తే అతనికి 112 కోట్లు) Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb — Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020 మనం స్నేహితుడని భావిస్తే.. ట్రంప్ బుద్ధి చూపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ట్వీట్‌పై స్పందించారు. ‘సీనియర్ ట్రంప్‌తో మనకు ఎంతో స్నేహం. ఇక జూనియర్ ట్రంప్ ఇండియాని జో బైడెన్, కమలా హారిస్ మద్దుతుదారుగా చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారు. ఎవరైనా అతడి కలర్ పెన్సిల్ని లాక్కొండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. So much for the friendship with Trump Senior. Junior has placed India firmly with @JoeBiden & @KamalaHarris though interestingly Jr. believes J&K & the NorthEast go against the rest of India & will vote Trump. Someone needs to take his colouring pencils away. https://t.co/AqVyX4ixdl — Omar Abdullah (@OmarAbdullah) November 3, 2020 అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుకుడు శశి థరూర్ కూడా జూనియర్ ట్వీట్‌పై స్పందించారు. ‘నమో బ్రొమాన్స్‌కు దక్కిన బహుమతి ఇది. డాన్ జూనియర్ భారత్‌లోని జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారు. సెరినేడింగ్ ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసినందుకు దక్కిన ఫలితం ఇది’ అన్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షులెవరో తేలకపోవచ్చు!) The price of Namo’s bromance: Kashmir & the NorthEast cut off from the rest of India, &the whole “filthy" place relegated by Don Jr to the realm of hostiles, along with China&Mexico. So much for the crores spent on obsequious serenading stadium events! https://t.co/fsI53aSkpv — Shashi Tharoor (@ShashiTharoor) November 3, 2020 మరోవైపు భారతదేశానికి మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌ని "ప్రోత్సాహకరంగా"ఉంది అంటూ ప్రశంసించారు. "మంచిది. జమ్మూ కాశ్మీర్‌ని పాకిస్తాన్లో భాగంగా చూపించారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. Good. Jammu and Kashmir is shown as part of Pakistan. Very encouraging. https://t.co/cAwqYniOct — Abdul Basit (@abasitpak1) November 3, 2020 -
ఇది భారత్‌కు మంచిది కాదు: జూనియర్ ట్రంప్
న్యూయార్క్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చైనా పట్ల వ్యవహరిస్తున్న ధోరణి భారత్‌కి అంత మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అన్నారు. లాంగ్ ఐలాండ్‌లో జరిగిన బైడెన్‌పై అవినీతి ఆరోపణల గురించి తను రాసిన 'లిబరల్ ప్రివిలేజ్' పుస్తకం విజయోత్సవ కార్యక్రమంలో జూనియర్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో జూనియర్ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. (ఓడిపోతే.. దేశం విడిచి వెళతానేమో!) 'చైనా ముప్పును మేము అర్థం చేసుకోగలము. బహుశా భారతీయ అమెరికన్లకన్నా దీని గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఈ రేసులో మీరు మా ప్రత్యర్థిని చూసినప్పుడు.. చైనీయులు బైడెన్‌కు ఎన్నికల ప్రచార నిమిత్తం 1.5 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎందుకంటే బైడెన్ గొప్ప వ్యాపారవేత్త. అతడిని ఎలాగైనా తమకు సానుకూలంగా మార్చుకోవచ్చనే చైనా భావిస్తోంది. బైడెన్ వైఖరి కూడా చైనా పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. ఇది భారత్‌కు అంత మంచిది కాదు' అని ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణకు నాయకత్వం వహిస్తున్న కింబర్లీ గిల్ఫోయిల్తో పాటు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ ఆయన ప్రసంగించారు. 42 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన 74 ఏళ్ల తండ్రి ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. కాగా.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3 న జరగనున్నాయి. (ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్) -
డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు షాకిచ్చిన ట్విటర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ట్విటర్ షాక్ ఇచ్చింది. కరోనాపై "తప్పుదోవ పట్టించే , హానికరమైన సమాచారాన్ని" పోస్ట్ చేశారంటూ జూనియర్ ట్రంప్ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన తప్పుడు సమాచారంతో కంపెనీ విధానాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను పోస్ట్ చేశారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ అకౌంట్‌ను 12 గంటల పాటు బ్లాక్ చేసింది. "ఈ ట్వీట్ ఇకపై అందుబాటులో లేదు" అని ట్యాగ్‌ను యాడ్ చేసింది. తమ విధానాల మేరకు ఈ చర్య తీసుకున్నామని ట్విటర్ ప్రకటించింది. అయితే ఇది సస్పెన్షన్ కాదని, సంబంధిత ట్వీట్ తొలగించే వరకు తాత్కాలిక లాకౌట్ కొనసాగుతుందని ట్విటర్ ప్రతినిధి ఇయాన్ ప్లంకెట్ వివరించారు. దీంతో ట్రంప్ జూనియర్ కొత్త సందేశాలను పోస్ట్ చేయడం గానీ, ఇతర ట్వీట్లకు స్పందించడం గానీ చేయలేరు. కోవిడ్-19 దాని చికిత్సలపై అబద్ధాలు సందేహాస్పద వాదనలతో వీడియోను ట్రంప్ జూనియర్ షేర్ చేశారని ట్విటర్ ఆరోపించింది.ప్రధానంగా యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకంపై తప్పుడు సమాచారాన్ని ఈ వీడియోలో పొందుపర్చడం వివాదం రేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధం వినియోగంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో తప్పుడు సమాచారాన్ని అందించారనేది ప్రధాన ఆరోపణ. Disturbing: https://t.co/c9vxjHVn0s — Joe Concha (@JoeConchaTV) July 28, 2020 -
జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని యూఎస్ మీడియా శుక్రవారం వెల్లడించింది. గతంలో ఫాక్స్ న్యూస్ టెలివిజన్‌లో పనిచేసిన 51 ఏళ్ల కింబర్లీ గిల్ఫాయల్.. జూనియర్ ట్రంప్ డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి కింబర్లీ ఈ రోజు(శనివారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి దక్షిణా డకోటాలో ఎన్నికల సభకు హాజరు కావాల్సి ఉండగా, తాజాగా కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్ ప్రస్తుతం ట్రంప్ ప్రచార కమిటీ బృందంలో సీనియర్ ఫండ్ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. (కరోనాపై అలర్ట్ చేసింది చైనా కాదు: డబ్ల్యూహెచ్ఓ) ఈ విషయంపై ట్రంప్ ప్రచార ఫినాన్స్ కమిటీ చీఫ్ స్టాఫ్ సెర్గియో గోర్ మాట్లాడుతూ.. కింబర్లీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఆమెకు కరోనా లక్షణాలు ఏవీ లేనప్పటికి కరోనా పాజిటివ్ తేలినట్లు వెల్లడించారు. మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాబోయే అన్ని బహిరంగ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే జూనియర్ ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. కాగా ట్రంప్ సన్నిహిత వ్యక్తుల్లో కరోనా సోకిన వారిలో కింబర్లీ మూడవ వ్యక్తి. ఇంతక ముందు ట్రంప్ వ్యక్తిగత తోపాటు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ ఉన్నారు. (కరోనాతో తల్లి మృతి.. పీపీఈ లేకుండానే! ) -
బ్లూమ్‌బర్గ్ ‘పిజ్జా’ వీడియో.. ట్రంప్ సెటైర్లు!
వాషింగ్టన్: తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉంటారన్నది తెలిసిన విషయమే. అవకాశం దొరికితే చాలు తన మాటల తూటాలు, సెటైరికల్ ట్వీట్లతో ఎదుటివారిపై విరుచుకుపడతారు. ప్రస్తుతం ట్రంప్‌కు అలాంటి అవకాశమే ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారు డెమొక్రాట్ పార్టీకి చెందిన మైఖేల్ బ్లూమ్‌బర్గ్. పిజ్జా ముక్కను కొరికి తిన్న మైఖేల్... తర్వాత దానిని మళ్లీ బాక్సులో పెట్టిన వీడియోను బ్లూమ్‌బర్గ్ స్నాప్‌చాట్ హ్యాండిల్ షేర్ చేసింది. ఇందులో... పిజ్జాను రుచిచూసిన తర్వాత మైఖేల్ తన ఐదు చేతివేళ్లను నోట్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా జుర్రుకున్నట్లుగా కనిపించింది. (తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్) ఇక ఈ వీడియోపై ట్రంప్ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ‘‘మినీ మైక్.. నీ మురికైన చేతివేళ్లను అలా నోట్లో పెట్టుకోవద్దు. ఇది అపరిశుభ్రం. నీతోపాటు ఇతరులకు కూడా చాలా ప్రమాదకరం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సైతం ఈ వీడియోపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రకంపనలు రేగుతున్న నేపథ్యంలో.. ‘‘ ఇది నిజంగా చెత్త విషయం. బ్లూమ్‌బర్గ్ ఎలాంటి వారో ఇందులో కనబడుతోంది. మైక్ నాకు 1,000,000,000 డాలర్లు పంపించండి. సోషల్ మీడియా ఎలా ఉపయోగించాలో చెప్తా’’ అంటూ కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే విధానం ఇదే అని మైఖేల్ వీడియోను షేర్ చేశారు.(కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని!) కాగా వాణిజ్య సమాచారంతో పాటు వార్తలు అందించడంలోనూ ముందుండే ‘బ్లూమ్‌బర్గ్’ ను స్థాపించి మీడియా మొఘల్‌గా మైఖేల్ బ్లూమ్‌బర్గ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు డెమొక్రాట్ల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించారు. ఇందులో భాగంగా ట్రంప్ విధానాలను ఎండగడుతూ తన ప్రసంగాలతో దూసుకపోయారు. ట్రంప్‌ను ఓడించడమే లక్ష్యంగా పోటీలో దిగినట్లు పేర్కొన్నారు. అయితే బుధవారం నాటితో మైఖేల్ ప్రచారం ముగిసింది. తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఆయన అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొన్నారు. డెమొక్రటిక్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ను అభ్యర్థిగా ప్రతిపాదించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసి.. గెలుపొందే అవకాశాలు బిడెన్‌కే ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 👇JUST WOW👇 Mini Mike is an absolute SLOB. Watch him AWKWARDLY rip a slice of pizza, place it back into the community pizza box, lick his fingers, then put his hands on the box of coffee! pic.twitter.com/zIQP9T6qah — AG William Barr (@AGWilliamBarr) March 3, 2020 -
‘జూలో ఉండే జంతువు ఎవరో కాదు.. ఈ జూనియరే’
వాషింగ్టన్ : శరణార్థులుగా అమెరికాకు వచ్చే వారిని జంతువులతో పోలుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ జాత్యహంకారం ప్రదర్శించారు. జీరో టాలరెన్స్ పేరిట శరణార్థులు, వారి పిల్లలను వేరు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వలసవాదులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన (500 కోట్ల డాలర్ల) డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే కాంగ్రెస్ వాయిదా పడింది కూడా. ఈ క్రమంలో మెక్సికో గోడ నిర్మాణం ఆవశ్యకతను వివరిస్తూ.. ‘ జూలో ఓరోజు మొత్తం ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలుసా. అక్కడ గోడలు ఉంటాయి కాబట్టి’ అని ట్రంప్ జూనియర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.(‘నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు’) కాగా జంతువుల బారి నుంచి ప్రజలను కాపాడాలంటే గోడ కట్టక తప్పదు కదా అనే అర్థం వచ్చేలా ఉన్న జూనియర్ రాతలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘జాతి అహంకారానికి ఇది నిదర్శనం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘జూలో ఉండే జంతువు మరెవరో కాదు ఈ జూనియరే’ అంటూ మరొకరు ఘాటుగా స్పందించారు. గతంలో కూడా ఇదే రీతిలో సిరియా శరణార్థులపై జూనియర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇటీవలే ఆయన తండ్రి ట్రంప్ కూడా వలసవాదుల గురించి ప్రస్తావిస్తూ.. ‘వీళ్లంతా చాలా చెత్త మనుషులు. అయినా వీళ్లని మనుషులు అనకూడదు. జంతువులు అనాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
మా ఆయన యాంకర్‌తో డేటింగ్ చేస్తున్నాడు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫాక్స్ టీవీ హోస్ట్ కింబర్లీ గ్విల్ఫోయెల్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారా? అంటే ఇప్పటివరకు పలు టాబ్లాయిడ్లు ఔననే కథనాలు ప్రచురించాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్ జూనియర్ భార్య ఈ విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరించారు. తొమ్మిది నెలల కిందట భర్త నుంచి విడిపోయి.. ప్రస్తుతం వేరుగా ఉంటున్న వేనెసా ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్లో తెలిపారు. తన భర్త కొత్త ప్రియురాలు, ‘ద ఫైవ్’ కార్యక్రమ యాంకర్ కింబర్లీని సమర్థిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ట్రంప్ తనయుడితో ప్రేమాయణం నడిపిస్తున్న కింబర్లీని ఫాక్స్ చానెల్ ఉద్యోగంలోంచి తొలగించాలని, ఆమెను ఉద్యోగంలో కొనసాగించడం సరికాదని ఓ విమర్శకుడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తప్పుబడుతూ ప్రచురితమైన ఓ ఆర్టికల్ లింక్‌ను పోస్టు చేసిన వేనెసా.. ‘డాన్‌తో డేటింగ్ చేస్తున్నందుకు ఓ మహిళపై ఎంత దిగజారి దాడి చేస్తున్నారో చూడండి’అంటూ పేర్కొన్నారు. డాన్ అంటే ఇక్కడ జూనియర్ ట్రంప్. సాన్‌ఫ్రాన్సిస్కో మేయర్ గేవిన్ న్యూసమ్‌ను గతంలో పెళ్లాడిన కింబర్లీతో తన భర్త డేటింగ్ పట్ల తనకేమీ అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు. ‘మేం తొమ్మిది నెలల కిందట విడిపోయాం. మా ప్రైవసీని, నిర్ణయాలను పరస్పరం గౌరవించుకుంటున్నాం. పిల్లలను పెంచడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టాం. మీడియా కూడా మా ప్రైవసీని గౌరవించి మా వ్యక్తిగత జీవితాల గురించి దృష్టిపెట్టకపోవడం మంచిది’ అని ఆమె సూచించారు. ఈ ట్వీట్‌ను జూనియర్ ట్రంప్ కూడా రీట్వీట్ చేయడం గమనార్హం. -
ట్రంప్ కుటుంబంలో కలకలం
న్యూయార్క్ : ప్రపంచానికి పెద్దన్నలాంటి డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడి పెద్దకొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భార్య వనెస్సా.. తక్షణమే విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జూనియర్ ట్రంప్ అసలు కుటుంబానికి సమయం కేటాయించడంలేదని భార్య ఆరోపించారు. పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల పరిష్కారం కంటే ముందే తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. 12 ఏళ్ల బంధం..5గురు సంతానం : పెద్ద ట్రంప్ మొదటి భార్య ఇవానాకు జన్మించిన తొలి సంతానం డొనాల్డ్ ట్రంప్ జూనియర్. ఇతను కూడా తండ్రి లాగే అమెరికాలో పేరు మోసిన బిజినెస్‌మేన్. టెలివిజన్ రంగంలోనూ రాణించారు. 2005లో వనెస్సాను పెళ్లాడారు. వీరికి ఐదుగురు పిల్లలు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఆయన వ్యాపార సమ్రాజ్యాన్నిపిల్లలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ట్రంప్ కుటుంబానికంటే వ్యాపారానికే ఎక్కువ సమయం కేటాయించాల్సివస్తున్నదని, అందుకే వనెస్సా అసంతృప్తికి లోనైఉంటారని అమెరికన్ మీడియా పేర్కొంది. కాగా, కొడుకు-కోడలి మధ్య తలెత్తిన అంతరాలు, విడాకుల దరఖాస్తుపై ట్రంప్ కుటుంబం ఇప్పటిదాకా అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. జూనియర్ ట్రంప్ ఫ్యామిలీ ఫొటో -
ట్రంప్ కుమారుడికి పార్శిల్.. నిందితుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ఇటీవల ఓ అనుమానాస్పద పార్శిల్ పంపి కలకలం రేపిన వ్యక్తిని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మసాచుసెట్స్‌కు చెందిన డానియల్ ఫ్రిసెల్లో అని అతడు డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త అని, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత నెలలో డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ఓ పార్శిల్ వచ్చింది. ఓపెన్ చేసిన చూడగా అందులో వైట్ పౌడర్ ఉండటం కలకలం రేపింది. నిందితుడు ఫ్రిసెల్లో గతంలోనూ పలు చిన్న చిన్న తప్పిదాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు పౌడర్ పార్శిల్ పంపిన అదే నిందితుడు మరో నలుగురు వ్యక్తులకు ఇలాగే పార్శిల్స్ పంపి హెచ్చరికలు జారీ చేశాడు. కాలిఫోర్నియాకు చెందిన ఓ లాయర్, లా ప్రొఫెసర్, ఓ సెనెటర్, నటుడు ఆంటోనియా సబాటోలకు మెయిల్స్ పంపినట్లు పోలీసుల తమ విచారణలో తెలుసుకున్నారు. నిందితుడు ఫ్రిసెల్లోని అతడి ఫేస్బుక్ అకౌంట్ ఆధారంగానే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రంప్ జూనియర్‌కు పంపిన పౌడర్ పార్శిల్ కవర్‌ను తన ఎఫ్బీలో ఫ్రిసెల్లో ఫిబ్రవరి 12న పోస్ట్ చేశాడు. దాంతో పాటుగా ఓ బాంబు పార్శిల్ సందర్భంగా తన అసలుపేరును నిందితుడు రాయడం కేసును ఈజీగా ఛేదించేందుకు ఉపయోగపడిందని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో ట్రంప్ వ్యతిరేక పోస్టులు చాలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
‘అదే భారత్ విలక్షణత’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పేదరికంలో మగ్గే ప్రజలు సైతం సంతోషంగా నవ్వగలగడం తనను అబ్బురపరిచిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ అన్నారు. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ భారత్‌లో పలువురు ఇన్వెస్టర్లతో భేటీ అవుతారు. దేశంలోని పలు నగరాల్లో చేపట్టిన ట్రంప్ టవర్స్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతారు. జూనియర్ ట్రంప్ భారత్ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనని, ప్రైవేట్ సిటిజన్‌గా పర్యటన కొనసాగిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హెతర్ నౌర్ట్ చెప్పారు. ఎలాంటి అధికారిక హోదాలో ట్రంప్ పర్యటించడంలేదని స్పష్టం చేశారు. భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు జూనియర్ ట్రంప్ హాజరవనున్నారు. మరోవైపు దేశరాజధానిలోని ఓ స్టార్ హోటల్లో ట్రంప్ రియల్ఎస్టేట్ డెవలపర్లతో భేటీ అయ్యారు. కోల్‌కతా, ముంబయి, పూణే, గుర్గావ్ తదితర నగరాల్లోనూ భారత ఇన్వెస్టర్లు, బిజినెస్ లీడర్లతో ఆయన సమావేశమవుతారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.