Elections 2019
-
ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయారు. ఎందుకంటే చంద్రబాబు 2014 జూన్ 8న పదవీ చేపట్టగా, ఎన్నికల్లో ఓడిపోయి 2019 మే 30 కంటే ముందే సీఎం పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎంగా అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా ప్రజలు గమనించారు. అక్రమ కేసులలో ఆయన జైలులో ఉన్నప్పుడు, ఆయన కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.2014 సాధారణ ఎన్నికలలో YSRCP అధికారంలోకి రాలేకపోయినా, గౌరవనీయ సంఖ్యలో విజయాలు సాధించింది. విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో NTR, KCR, YS జగన్మోహన్ రెడ్డిలే సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం YS జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో 2009 లోనే ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్‌గా మారింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తనదైనా పంథాలో ముందుకు సాగారు, గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.మామ ఎన్టీఆర్‌నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలిక కాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు.చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని మాయం చేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పాలి. అంతేకాదు... తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వివరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్‌లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పరిపాలనను తెచ్చి రాష్ట్రాన్ని సరికొత్తగా మార్చగలరని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధి పాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్‌లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా ప్రజల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి పరిపాలనకు సంబంధించిన అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడప వద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్‌ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్‌ను తెలియచేస్తుంది. అభివృద్ది వైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు. తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్‌కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.ఇన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మొదటి దశలో 102 సీట్లు... 2019లో ఎవరు గెలిచారు?
2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19 న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్‌కు ముందు ప్రధాని ఎన్డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు. లోక్‌సభ మొదటి దశ పోలింగ్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని ఐదు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్‌లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్‌లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో మూడు, మణిపూర్‌లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు. -
కోర్టు తీర్పుపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. వారి వల్లే అంటూ..
సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. కాగా, కోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ధర్మం గెలిచింది. గతంలో మంత్రులుగా చెలామని అయ్యి ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వాళ్లు పనిచేసే వాళ్లను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే ఇలాంటి కేసులు వేశారు. బీసీలతోనే బీసీ నాయకత్వాన్ని బలహీన పరుచాలనే దుర్బుద్ధితో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఇద్దరు నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే తలంపుతో ఈ చర్యలకు తెరలేపారు. గతంలో ఈ వ్యక్తుల వల్లే జిల్లా సర్వనాశనం అయ్యింది. ఈరోజు కుల, మతాలకు అతీతంగా అందరికీ అండగా నిలుస్తూ అభివృద్ధిలో జిల్లాను నడుపుతుంటే చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకు పుట్టగతులు లేకుండా పోతాయని వాళ్ళ బంధువులే మాతో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలన్నదే మా అభిమతం. ఇప్పటికైనా మారండి, ప్రజా క్షేత్రంలోకి రండి అంతే కానీ కేసులు వేసి పైశాచిక ఆనందం పొందడం మానుకోండి. ప్రజలే నాకు దేవుళ్లు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆయన ఆశీస్సులతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తాం. నాకు అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్.. -
హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వివరాల ప్రకారం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే, 2018లో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పెద్ద ఊరట లభించింది. మంత్రికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న(సోమవారం) ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 30వ తేదీన ఎన్నికలకు కౌంటిగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది కూడా చదవండి: ఎన్నికల తేదీలు వచ్చాయో లేదో.. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సర్వేల లొల్లి -
టీడీపీ దొంగ ఓట్ల అక్రమాలు
-
నీతాకే మన ఓటు
నీతా శోధ.. పద్దెనిమిదేళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఎందుకు వచ్చిందో ఇండియాలో ఆమెను ఎవరూ అడగలేదు. ఆనాటి నుంచీ ఆమె ఇండియాలో పౌరసత్వం లేకుండానే ఉంది. పౌరసత్వం ఉందా లేదా అని ఎవరూ ఆమెను అడగలేదు. పౌరసత్వం ఎవరు ఇస్తారో, ఎలా ఇస్తారో, ఎందుకు తీసుకోవాలో తెలియక కావచ్చు.. ఆమె కూడా పౌరసత్వం గురించి ఆలోచించలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చి, రాజస్థాన్‌లో ఉండిపోయింది. నాలుగు నెలల క్రితం (ఈ పౌరసత్వ గొడవ మొదలు కాకముందు) స్థానిక అధికారులు తమ పని తాము చేసుకుపోతున్న క్రమంలో.. ఏనాడో వలస వచ్చిన నీతా శోధాకు భారత పౌరసత్వం (బర్త్ సర్టిఫికెట్) వచ్చింది. ఆ అర్హతతో ఇప్పుడామె రాజస్థాన్‌లోని నట్వారా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు! గెలిస్తే దేనికోసం కృషి చేస్తారు అనే ప్రశ్నకు.. ఆమె చెప్పిన సమాధానం.. గ్రామంలో అంతా చక్కగా చదువుకోవాలి. స్త్రీలకు ఏదైనా సంపాదన ఉండాలి. మొదట ఈ రెండిటి కోసం పని చేస్తాను.. అని. భారతదేశంలోని గ్రామాలకు ఇప్పుడు కావలసినవి కూడా ఇవే. -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
పుర పోరు.. పారాహుషారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. పురపాలక ఎన్నికలకు త్వరలోనే నగారా మోగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కదలిక షురూ అయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న పట్టణ స్థాయి ఔత్సాహికులు గతంలోనే రంగంలోకి దిగినా.. తాజా పరిణామాల నేపథ్యంలో తమ కసరత్తును ముమ్మరం చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేలతో కొంత వెనక్కు తగ్గినా.. ఇటీవల ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ, ఎన్నికల కమిషన్లు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో వారంతా వార్డుల బాట పట్టారు. రాష్ట్రంలో మొత్తం 129 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగాల్సి ఉండగా.. 77 మున్సిపాలిటీల విషయంలో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. అయితే, వీటిపై సానుకూల తీర్పు వెలువడి, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ఆశావహులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. రిజర్వేషన్లు, స్టేలపైనే ఉత్కంఠ.. ఓటర్ల జాబితాలో అవకతవకలు, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం వార్డుల పునర్విభజన అంశాల్లో గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీలపై సోమవారం హైకోర్టు విచారించనుంది. విచారించాల్సిన కేసుల జాబితాలో దీనిని కూడా చేర్చినా.. సోమవారం విచారణకు వస్తుందా.. లేదా మళ్లీ వాయిదా పడుతుందా.. ఒకవేళ విచారణ జరిగితే ఏం తీర్పు వస్తుంది అనే లెక్కల్లో స్థానిక రాజకీయ యంత్రాంగం నిమగ్నమైంది. దీనికి తోడు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే రిజర్వేషన్లు రెండు, మూడు రోజుల్లోనే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందన్న దానిపైనా రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలపై ఈ రిజర్వేషన్ల అంచనాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పాత మున్సిపాలిటీల విషయానికి వస్తే గతంలో ఎప్పుడు ఏ వర్గానికి రిజర్వ్ అయింది? ఈసారి ఎవరికి అవకాశం ఉందన్న దానిపై మాజీ కౌన్సిలర్లు, కొత్తగా కౌన్సిలర్లు కావాలనుకుంటున్న వారు లెక్కలు వేసుకుంటున్నారు. తమ వర్గానికే రిజర్వ్ అవుతుందా లేదా తమ వర్గానికి చెందిన మహిళకు రిజర్వ్ అవుతుందా.. అలా అయితే తాను కాకుండా తన భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులను రంగంలోకి దింపాలా అనే తర్జనభర్జనలు పడుతున్నారు. ఒకవేళ తాము ఆశించిన వార్డులో రిజర్వేషన్ రాకపోతే తమకు అనుకూల రిజర్వేషన్ వచ్చే వార్డులు ఏమున్నాయి.. అక్కడ పోటీ చేయాలా వద్దా అనే అంశాలపై కూడా నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. అప్పుడే వార్డుల బాట కోర్టు తీర్పులు, రిజర్వేషన్లు ఎలా ఉన్నా స్థానిక ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఔత్సాహికులు అప్పుడే వార్డుల బాట పట్టారు. తమకు అందుబాటులో ఉన్న ఓటరు జాబితాలను తీసుకుని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తమకు అనుకూలంగా ఉన్న ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఫలానా వార్డులో ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వార్డుల పునరి్వభజన జరిగిన తర్వాతి పరిస్థితేంటి? తమకు కలిసి వచ్చే అంశాలేంటి? ఇతర పారీ్టల నుంచి టికెట్లు ఆశిస్తున్నావారెవరు? ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉందన్న దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ఇక, ఇతర స్థానిక సంస్థలతో పోలిస్తే నిధులకు ఇబ్బంది లేని నగర, పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రధాన రాజకీయ పక్షాలకు తలనొప్పి కలిగించబోతోందని అంటున్నారు. ప్రసన్నం చేసుకుందాం.. పద ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో 80 శాతం మంది మళ్లీ సిద్ధపడుతున్నట్టు సమాచారం. వీరికి తోడు కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వారి జాబితా కూడా పెద్దగానే ఉండడంతో ఒక్కో వార్డులో వివిధ పారీ్టల నుంచి ఇద్దరు నుంచి 8 మంది వరకు అభ్యర్థులు పోటీ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అలాంటివారంతా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అగ్రనాయకత్వం వద్ద తమ అభ్యరి్థత్వం కోసం అప్పుడే పైరవీలు కూడా మొదలుపెట్టారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకత్వం వద్దకు వెళ్లి తమకు ఈసారి టికెట్ ఇప్పించాలంటూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. వీరితో పాటు స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరంతా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి పురపోరు రసవత్తరంగా సాగబోతోందని స్థానిక రాజకీయ పరిస్థితులు చెబుతున్నాయి. తప్పులు సవరిస్తే బాగుంటుంది మున్సిపాలిటీ ఎన్నికల కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీల్లో జరిగిన తప్పులు సవరించాల్సి ఉంది. అలాగే వార్డులను ఎల్ ఆకారంలో, జెడ్ ఆకారంలో నిర్ధారించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అంతా సర్దుబాటు అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. స్టేలు వచి్చన మున్సిపాలిటీలపైప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్ వేయాలి. – బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్, నల్లగొండ -
మోగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా
-
‘సరిహద్దు’లో ఎన్నికలు
సాక్షి, కెరమెరి(ఆదిలాబాద్) : రెండు రాష్ట్రాలు.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర.. ఈ రెండు ప్రభుత్వాలు కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని సరిహద్దున ఉన్న వివాదాస్పద 14 గ్రామాలను ఏళ్లతరబడి పాలిస్తున్నాయి. కాని ఆ గ్రామాల్లో కనీసం తాగునీటి సమస్యను కూడా తీర్చని పరిస్థితి. ప్రతీ గ్రామాన్ని కదిలించిని క‘న్నీటి’ గాథలే దర్శనమిస్తున్నాయి. ఈ నెల 21న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూర నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మండలానికి చెందిన 2800 మంది ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకోనున్నారు. పుడ్యాన్ మొహదా, వనీ, నోకేవాడ, పరందోలి, కుంభేఝరి, భొలాపటార్ గ్రామాల్లో పోలింగ్ బూత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామాలు.. పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకదంగూడ గ్రామ పంచాÄ ¶æుతీల్లోని పరంధోళి, కోటా, పరందోళి తాండ, ముకద్దంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఎసాపూర్, నారాయనగూడ, భోలాపటార్, లేం డిగూడ, గౌరి ఉన్నాయి. ఐదు గ్రామపంచాయతీల్లో 14 వివాదాస్పద సరిహద్దు గ్రామాలు మహారాష్ట్రలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి. అందులో పరంధోళిలో గ్రామ పంచాయతీలో ముకదంగూడ, కొటా, పరందోళి, లేండిజాల గ్రామాలు ఉండగా.. పుడ్యాన్ మొహదాలో శంకర్‌లొద్ది, ఇంద్రానగర్, అంతాపూర్, పద్మావతీ, నోకేవాడలో మహారాజ్‌గూడ, కుంభేఝరిలో నారాయణగూడ, ఎసాపూర్, భోలాపటార్, లేండిగూడ, చిక్లి గ్రామ పంచాయతీల్లో గౌరి గ్రామాలు ఉన్నాయి. సాగుపట్టాలే ప్రధాన సమస్య! ఏళ్లుగా ఆయా గ్రామాల ప్రజలకు ప్రధాన సమస్య సాగుభూములకు పట్టాలివ్వడం. ఆయా గ్రామాల్లో వేల ఎకరాల్లో సాగు భూమి ఉన్నప్పటికీ 80 శాతం రైతులకు పట్టాలు లేవు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం పట్టాలివ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతిసారి ప్రచారం కోసం వచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే పట్టాలిప్పిస్తామని హామీ ఇవ్వడం పరిపాటిగా మారింది. రెండు ప్రభుత్వాలున్నా.. అభివృద్ధి శూన్యమే రెండు ప్రభుత్వాలున్నా ఎలాంటి అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. రెండు రాజ్యాలకు చెందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు ఆ గ్రామాల్లో ఉన్నా ప్రతి ఒక్కరికీ రెండేసి రేషన్‌కార్డులు, రెండేసి ఓటరు కార్డులున్నాయి. రెండు పాఠశాలలు, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అంగన్వాడీ కేంద్రాలు, ఇరువైపులా ప్రభు త్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న అవి వీరి దరిచేరడం లేదు. ముగిసిన ప్రచారం.. వారం రోజులుగా హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో 5గంటలతో ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తప్ప స్వతంత్ర అభ్యర్థులు పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. పోటీ మాత్రం సేత్కారి సంఘటన అభ్యర్థి వామన్‌రావు చటప్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రావు ధోటే మధ్యలోనే ఉంటుందని చెబుతున్నారు. సరిహద్దు గ్రామాలు 14 పోలింగు కేంద్రాలు 06 ఓటర్లు 2803 పోలింగ్ తేదీ ఈ నెల 21 సమయం ఉ: 7:30 గం నుంచి సా: 5:00 గం వరకు పోటీ చేసే అభ్యర్థులు :12 మంద పని చేసే వారికే పనిచేసే వారికే ఓటు వేస్తాం. ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఎవ్వరూ వచ్చినా సమస్యలు తీర్చుతామంటున్నారు. కానీ తరువాత మర్చిపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు చాలా తక్కువగా ఉంటాయి. – కాంబ్డె లక్ష్మణ్, సర్పంచ్ పరంధోళి (మహారాష్ట్ర) పట్టాలివ్వాలి మేము గడిచిన 40 సంవత్సరాల నుంచి భూములను సాగుచేస్తున్నప్పటికీ నేటికీ సాగుభూములకు పట్టాలులేవు. ఇరు ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇవ్వక పోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. -
‘ఎన్నికలొస్తే సర్జికల్ స్ట్రైకులొస్తాయ్’
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలొచ్చినప్పుడే.. సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైకులొస్తున్నాయని.. వాస్తవ సమస్యలను మరుగుపరిచేందుకే బీజేపీ సైనికులను అడ్డుపెట్టుకుని ఆటలాడుతోందని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, హరియాణా ఎన్నికలకు ఒక్కరోజు ముందే ఈ దాడులు బయటకు రావడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్స్ కనిపించడం మోదీ ప్రభుత్వంలో సర్వసాధారణమైందని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి మాత్రం భారత సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. సైనికుల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. -
మహారాష్ట,హరియాణాలో ఎన్నికల ప్రచారానికి తెర
-
కాంగ్రెస్ దేశభక్తులను అవమానించింది
-
హరియాణాలో డేరా రాజకీయం
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. డేరాలు, బాబాల చుట్టూ తిరుగుతూ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. హరియాణాలో ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై విపరీతంగా ఉంటుంది. తమ ఆ«ధ్యాత్మిక గురువులు ఏ పార్టీకి ఓటు వెయ్యమని చెబితే వారికే గుడ్డిగా ఓటు వేసే అనుచరగణం అధిక సంఖ్యలోనే ఉంది. అందుకే రాజకీయాలన్నీ డేరాల చుట్టూ తిరుగుతున్నాయి. డేరా సచ్చా సౌదా గురువు: గుర్మీత్ రామ్ రహీమ్ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ డేరాలో 15 మంది సభ్యులతో కూడిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశాల్లో వచ్చే ఫలితాలకనుగుణంగా ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామని కమిటీ సభ్యుడు జోగిందర్ సింగ్ చెప్పారు. డేరా సచ్చా సౌదా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ఉంది. సత్లోక్ ఆశ్రమ్స్ గురువు: రామ్‌పాల్ ఈ డేరా గురు రామ్‌పాల్ కూడా 2014 నవంబర్ నుంచే జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌పాల్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో అన్న మీమాంసలో ఉన్నారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాల్లో చాలా తేడా ఉంది. అక్టోబర్ 15న సర్వసభ్య సమావేశంలో చర్చించి ఏ పార్టీకి మద్దతునివ్వాలో తేల్చుకుంటాం‘‘అని గురు రామ్‌పాల్ డేరా మీడియా ఇన్చార్జ్ చాంద్ రథి వెల్లడించారు. రోహ్తక్ చుట్టుపక్కలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురు రామ్‌పాల్ డేరా ప్రభావం ఎక్కువగా ఉంది. డేరా బాబా శ్రీ బాలక్ పురి గురువు: కరణ్ పురి ఈ సారి ఎన్నికల్లో కరణ్ పురి డేరా ఎన్నికలకు దూరంగా ఉండా లని నిర్ణయించుకుంది. హరియాణా లో నివసిస్తున్నా పంజాబీల్లో అధిక ప్రభావం కలిగిన ఈ డేరా తమ అనుచరులకు ఎలాంటి పిలుపు ఇవ్వడం లేదు. అయితే ఈ డేరాను బీజేపీ నాయకులు అత్యధికంగా సందర్శిస్తున్నారు. డేరా గౌకరణ్ ధామ్ గురువు: కపిల్ పురి కాంగ్రెస్‌కు కపిల్పురి మద్దతుదారు. కాంగ్రెస్ నేత భూపీందర్ హూడాకు అనుకూలం. ఈ సారి ఎన్నికల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ గౌకరణ్ ధామ్ డేరా తమ అనుచరగణానికి సంకేతాలు పంపుతోంది. -
జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
-
గులాబీ జెండా ఎగరాలి
కంటోన్మెంట్: త్వరలో జరగనున్న బోర్డు ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని, ఈ మేరకు కృషి చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ కంటోన్మెంట్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న, సీనియర్ నేత మర్రి రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, టీఎస్టీఎస్ చైర్మన్ బోర్డు సభ్యులు కేశవరెడ్డి, పాండుయాదవ్, లోకనాథం, బోర్డు మాజీ సభ్యులు వెంకట్రావు, ప్రభాకర్, జీహెచ్ఎంసీ కో– ఆప్షన్ సభ్యుడు నర్సింహ ముది రాజ్, కార్పొరేటర్ లాస్య నందిత, మోండా డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరి కృష్ణ, పార్టీ సీనియర్ నేతలు టీఎన్ శ్రీనివాస్, పిట్ల నాగేశ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాలుగు నెలల్లో జరగనున్న బోర్డు ఎన్నికలకు నేతలు సర్వసన్నద్ధం కావాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల ను పక్కనపెట్టి ఐకమత్యంతో ముందుకెళ్లాలన్నారు. బహిరంగ వేదికల్లో బోర్డు సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలని సూచించారు. గత బోర్డు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవగా, ఎన్నికల అనంతరం మిగతా నలుగురు సైతం పార్టీలోనే చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచేలా తగి న వ్యూహాలు రూపొందించాలని సాయన్నకు సూచించారు. ఈ మేరకు గురువారం స్థానిక టీఆర్ఎస్ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పార్టీ గుర్తులతో ఎన్నికలకే మొగ్గు! బోర్డు ఎన్నికల్లో ఈసారి పార్టీ గుర్తులతోనే ఎన్నికలు జరిగేలా చూడాలని కొందరు నేతలు ప్రస్తావించగా, ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే నెల 13న ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయంలో జరగనున్న సమావేశంలో బోర్డు ఎన్నికల అంశంపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. బోర్డు ఎన్నికల్లో పార్టీ గుర్తులతో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌కు బీజేపీ కూడా సానుకూలంగా వ్యవహరించే అవకాశముందని స్థానిక టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో అన్నారు. బోర్డు అధికారుల అలసత్వంతోనే.. కంటోన్మెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, బోర్డు అధికారుల అలసత్వం వల్లే ఆయా సమస్యలు పెండింగ్‌లో పడుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటోన్మెంట్ జనలర్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మూడేళ్లుగా చెబుతున్నప్పటకీ బోర్డు అధికారులు తమ సంసిద్ధతను రాతపూర్వకంగా అందజేయడం లేదన్నారు. ఇక రూ.40 కోట్లు దాటిన టీపీటీ బకాయిల్లో కనీసం సగం తక్షణం విడుదలయ్యేలా చూడాలని బోర్డు సభ్యులు కోరారు. వెంటనే సంబంధిత అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న కేటీఆర్ ఇటీవలే రూ.8 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో మరో రూ.12 కోట్లు విడుదలవుతాయిన చెప్పారు. రామన్నకుంట సమస్య పరిష్కారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్నారు. బోర్డు సభ్యులు ప్రత్యేక చొరవతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తూ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. -
ఆ రూ.1.92 కోట్లు నావే: మాగంటి బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనదేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. ఆ మొత్తాన్ని రిలీజ్ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు మాగంటి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఏప్రిల్ 10వ తేదీన సిమెంట్ లోడు లారీలో తరలిస్తున్న రూ.1,92,90,500 నగదును విజయవాడ పటమట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట నుంచి ఏలూరు వెళ్తున్న లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. అందులో సిమెంట్ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండటాన్ని గమనించి వాటిని తెరిచి చూడగా.. భారీ నగదు కనిపించింది. ఈ సమయంలో అదే లారీలో ప్రయాణిస్తున్న మాగంటి అనుచరుడు పరారయ్యాడు. డ్రైవర్ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బును ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్టు తనతోపాటు లారీలో వచి్చన యువకుడు చెప్పాడని డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ మొత్తాన్ని అప్పట్లో విజయవాడ నగర పోలీసులు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్‌ను కలిసిన మాగంటి బాబు ఆ సొమ్ము మొత్తం తనదేనని, చేపల్ని విక్రయించగా సమకూరిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీ పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపగా రూ.64 లక్షల పన్ను విధించారని వివరించారు. పన్ను చెల్లించిన దృష్ట్యా సీజ్ చేసిన డబ్బును తనకు ఇప్పించాలని కోరారు. మాగంటి బాబు చెబుతున్నట్టుగా ఆ డబ్బు సక్రమంగా సంపాదించిందే అయితే రూ.64 లక్షలను ఆదాయ పన్ను, అపరాధ రుసుంగా ఎందుకు చెల్లించాల్సి వచి్చందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపల విక్రయం ద్వారానే అంత ఆదాయం వచి్చనా.. పన్నులేవీ చెల్లించకుండా రహస్యంగా ఎందుకు తరలించాల్సి వచి్చందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. పోలీసులు కనబడగానే మాగంటి అనుచరుడు పరారవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. -
కన్నారంపై కమలం కన్ను
సాక్షి, కరీంనగర్ : పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయాలతో పట్టణాల్లో పాగా వేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించడానికి కారణమైన అసెంబ్లీ సెగ్మెంట్లలోని పురపాలికలను తొలుత బీజేపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. పట్టణాల్లో బీజేపీకి అంతో ఇంతో బలం ఉండడం, తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో ‘పువ్వు’ గుర్తు జనాల్లోకి వెళ్లడంతో పురపాలక సంఘాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. దీనికి తోడు కరీంనగర్ నుంచి విజయం సాధించిన ఎంపీ బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు పార్లమెంటు పరిధిలోని మెజారిటీ మునిసిపాలిటీల్లో కాషాయజెండా ఎగురవేయించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తొలుత కరీంనగర్ కార్పొరేషన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన చొప్పదండి, కొత్తపల్లి, వేములవాడ మునిసిపాలిటీల్లో సానుకూల ఫలితాలు పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మునిసిపాలిటీల్లోని వార్డుల్లో గెలిచే స్థాయి నాయకులు ఎంత మేరకు ఉన్నారనేది ఇప్పుడు పార్టీ నేతలను తొలుస్తున్న ప్రశ్న. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంటతోపాటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినా, ఇక్కడ కూడా అభ్యర్థులను నిలిపి బలం పెంచుకునే ఆలోచనతో ఉన్నారు. కరీంనగర్ బల్దియాపై కాషాయమే లక్ష్యంగా.. మైనారిటీ వర్గాల ప్రభావం అధికంగా ఉన్న కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. కొత్తగా కలిసిన 8 గ్రామాలతో పది వార్డులు పెరిగాయి. అదే సమయంలో మైనారిటీ వర్గాల ప్రభావం ఉన్న డివిజన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ మెజారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేయడం వల్ల కరీంనగర్ ఇమేజ్ దెబ్బతింటుందని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని విభిన్న రీతుల్లో ప్రచారం చేసి ధర్మం పేరుతో ‘హిందుత్వ’ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈసారి కూడా ఇదే అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీ ప్రచార అస్త్రంగా... కరీంనగర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే స్మార్ట్‌సిటీగా ప్రకటించిందని, నిధులను సక్రమంగా వెచ్చించడంలో ఇప్పటివరకు బల్దియాను ఏలిన టీఆర్ఎస్ విఫలమైందనే ప్రచారానికి బీజేపీ తెరలేపింది. కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంటే మరిన్ని నిధులు తీసుకురావడంతోపాటు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సంజయ్ తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ఒక రకంగా రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందన్న మాట. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ వల్లనే కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కమలాకర్ ఓ అడుగు ముందుకేసి ‘పేరుకే స్మార్ట్‌సిటీ తప్ప రూపాయి రావడం లేదు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు’ అని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా టీఆర్ఎస్ను టార్గెట్ చేయాలని వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. పట్టణాల్లో బీజేపీకి గెలిచే కేడర్ ఎక్కడ..? కరీంనగర్లో సంజయ్ ఇమేజ్‌కు తోడు మోదీ హవాతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ ప్రభావం కొంత మేర పట్టణాల్లో ఇప్పటికి ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించే స్థాయిలో పనిచేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరీంనగర్లో గత మునిసిపల్ ఎన్నికల్లో సంజయ్‌తోపాటు విజయ మాత్రమే బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఇప్పుడు కరీంనగర్ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలంటే కనీసం 31 మంది కార్పొరేటర్లు గెలవాలి. కరీంనగర్లో కొంత మేర సంజయ్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉన్నా, మిగతా మునిసిపాలిటీల్లో పరిస్థితి అంత ఈజీగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో మంత్రి ఈటల ప్రభావం ఎక్కువగా ఉంది. సిరిసిల్ల మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న చేసిన అభివృద్ధి పనులే అడుగడుగునా కనిపిస్తున్నాయి. చొప్పదండి, కొత్తపల్లి కొత్త మునిసిపాలిటీలే. వేములవాడ మునిసిపాలిటీలో మాత్రం ఈసారి బీజేపీ బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు సభ్యత్వంతోపాటే ఎన్నికల సందడి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. కరీంనగర్లో ఆదివారం సభ్యత్వ నమోదుకు ఎంపీ సంజయ్‌కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ ముహూర్తం నిర్ణయించారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అనంతరం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బల్దియా ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ యంత్రాంగానికి వివరించనున్నారు. -
వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్ ఆనంద్, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
ఇక పురపోరు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన యంత్రాంగం త్వరలో మున్సిపల్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పురపాలిక ఎన్నికల ప్రస్తావన వచ్చింది. దీంతో వచ్చే నెలలోనే ఎన్నికలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం జూలై 3వ తేదీతో ముగియనున్నాయి. గతంలో విలీన గ్రామాలపై కొంత వివాదం నెలకొన్నా హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సమస్య పరిష్కారం కావడంతో పురపాలిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేవు. జిల్లాలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట మున్సిపాలిటీలు ఉన్నా.. అచ్చంపేటలో మార్చి 2016లోనే ఎన్నికలు జరగడంతో అక్కడి పాలకవర్గానికి ఇంకా రెండేళ్ల గడువు ఉండడంతో మిగిలిన మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో మున్సిపాలిటీల్లో 13 పంచాయతీలను విలీనం చేయడంతో.. కొన్ని గ్రామాలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయడంలో ఆలస్యమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వార్డుల పునర్విభజనపై ఉత్కంఠ మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల పునర్విభజన కీలకం కానుంది. అయితే వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్నట్లు ప్రకటిస్తుండటంతో అంత తక్కువ సమయంలో వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే అధికారులు వార్డుల విభజన చేపట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వార్డుల విభజన సరిగ్గా లేకపోవడంతో కొన్ని వార్డులలో ఓటర్ల సంఖ్య హెచ్చు తగ్గులయ్యాయి. కొన్ని వార్డుల్లో 800 ఓటర్లు ఉంటే కొన్ని వార్డుల్లో 1,600 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే వార్డుల విభజన పూర్తి అయినా వార్డుల పెంపుపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. గతంలో నగరపంచాయతీలు ఉన్నప్పుడు ఎన్ని వార్డులు ఉన్నాయో మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన తరువాత కూడా 20వార్డులనే కొనసాగిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. నాగర్‌కర్నూల్‌లో ఎండబెట్ల, నాగనూలు, దేశిటిక్యాల, ఉయ్యాలవాడ, కొల్లాపూర్ పరిధిలో చుక్కాయిపల్లి, చౌటబెట్ల, తాళ్ల నర్సింగాపురం, నర్సింగరావుపల్లి, కల్వకుర్తి పరిధిలో సంజాపూర్, తిమ్మరాసిపల్లి, కొట్రతండా గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అయితే విస్తీర్ణం పెరగడంతో వార్డుల సంఖ్య కూడా పెంచాలని కొందరు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. తొలగిన అడ్డంకులు నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో ఒకటైన ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వారు మున్సిపాలిటీల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయలేదు. కొల్లాపూర్ నగరపంచాయతీగా అవతరించి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. నర్సింగారావుపల్లి గ్రామస్తులు కోర్టులో కేసు వేయడంతో అక్కడ కూడా ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. అయితే హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో ఆ ప్రక్రియకు కూడా అడ్డంకులు తొలగిపోయాయి. మూడు మున్సిపాలిటీలలో బీసీ గణన కూడా పూర్తయింది. మూడు మున్సిపాలిటీలలో కలిపి ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం 43,684మంది బీసీ ఓటర్లు, 9,182మంది ఎస్సీ ఓటర్లు, 1912 మంది ఎస్టీ ఓటర్లు, 11,026 మంది ఇతర ఓటర్లు మొత్తం 65,802 మంది ఓటర్లు ఉన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ లెక్కల ప్రకారం ఓటర్లు 27,021 ఉండగా ఇందులో బీసీలు 18,007, ఎస్సీలు 3,885, ఎస్టీలు 238, ఇతరులు 4,891 ఉన్నారు. కల్వకుర్తిలో మొత్తం 19,918 మంది ఓటర్లు ఉండగా బీసీలు 11,998, ఎస్సీలు 2,167, ఎస్టీలు 1422, ఇతరులు 4331 మంది ఓటర్లు ఉన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 18418 మంది ఓటర్లు ఉండగా బీసీలు 13,492, ఎస్సీలు 3,130, ఎస్టీలు 252, ఇతరులు 1,544 మంది ఉన్నారు. అయితే గతంలో జరిగిన బీసీ ఓటర్ల గణన ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారా లేక కొత్త చట్టంతో ఏవైన మార్పులు చేర్పులు జరుగుతాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనా, పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. ప్రత్యక్ష పద్ధతిలో అయితే బడానేతలంతా రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆశావహుల ఎదురుచూపు మున్సిపల్ ఎన్నికల విధివిధానాలు ఖరారు ఎప్పుడవుతుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్లు తమకు మరోసారి రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు పార్టీలు సైతం చైర్మన్‌కు సంబంధించి ఏ రిజర్వేషన్ వస్తుంది, ఎవరిని పోటీలో ఉంచాలనే అంశంపై కసరత్తులు ప్రారంభిస్తున్నారు. ఆశావహులు తమ వార్డులలో జనాన్ని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలకు చెందిన నేతలతో ఇప్పటికే తాను అభ్యర్థిగా పోటీలో ఉంటాననే సంకేతాలు అందిస్తున్నారు. వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో పట్టణాల్లో రాజకీయాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇదివరకే మున్సిపాలిల్లో బీసీ ఓటర్ల గణన పూర్తయింది. దీంతో చైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలింది. సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఒకవేళ ఏవైనా ఆదేశాలు వస్తే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – జయంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్ -
రాజీనామా యోచనలో సురవరం!
న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జూతై 19, 20 తేదీల్లో ఢిల్లీలో జరిగే సీపీఐ జాతీయ మండలి సమావేశాల్లో ఆయన రాజీనామా సమర్పిస్తారని వెల్లడించాయి. ఈ విషయమై ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ...‘సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ కేవలం రెండు లోక్‌సభ స్థానాలకు పరిమితం కావడంతో పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ సుధాకర్‌రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించారు. పార్టీ కోసం పనిచేసేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని, ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు’ చెప్పారు. -
ఎన్నికలలో ఖాకీల పైసా వసూల్
సాక్షి, కర్నూలు: ఎన్నికలు ఓటర్లకే కాదు..పోలీసులకూ పండుగగా మారాయా? సహకారం పేరిట భారీగా వివిధ పార్టీల నేతల వద్ద మామూళ్లు తీసుకున్నారా? ఏకంగా ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి కోటి రూపాయలకుపైగా వసూలు చేశారా? అనే విచిత్ర ప్రశ్నలకు అంతే చిత్రంగా అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎన్నికల సమయంలో స్టేషన్ల వారీగా పోలీసులు ఎంత మొత్తాన్ని వివిధ పార్టీల నుంచి తీసుకున్నారంటూ సేకరించిన వివరాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకూ వివిధ పార్టీ నేతల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వివరాలను పోలీసు ఉన్నతాధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్లో ఒక్కో కథ బయటకు వచ్చినట్టు సమాచారం. అయితే, బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి కోటి రూపాయల మేర తీసుకున్నట్టు తేలడంతో ఉన్నతాధికారులే నోరెళ్లబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ స్టేషన్‌లోని పోలీసు సిబ్బందికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి భారీగా నగదు ముట్టినట్టు విచారణలో తేలింది. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా కూడా ఇందుకు అనుగుణంగా సదరు అభ్యర్థికి సహకరించారు. వీరంతా ఎన్నికల ఫలితాల తర్వాత బాధపడినట్టు కూడా సమాచారం. ఇక జిల్లాల్లో కొన్ని మినహా మెజార్టీ స్టేషన్లలో ఈ మేరకు వసూళ్ల పర్వం నడిచినట్టు తేలింది. ఈ నివేదికను ఉన్నతాధికారులకు జిల్లా పోలీసు యంత్రాంగం రహస్యంగా అంజేసింది. ఇందుకు అనుగుణంగా సదరు అధికారులపై చర్యలుండే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడే అత్యధికం...! వాస్తవానికి ఎన్నికలు అంటేనే కోట్ల రూపాయలు డబ్బు వరదలా పారే పరిస్థితి నడుస్తోంది. అందులోనూ అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దోచుకున్న కోట్ల డబ్బును ఖర్చు చేసి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఓటర్లతో పాటు పోలీసులకు కూడా భారీగా డబ్బును వెదజల్లారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఏయే డీఎస్సీ, సీఐ, ఎస్ఐలు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇందులో ఆశ్చర్యకరంగా బనగానపల్లె నియోజకవర్గంలోని పోలీసు అధికారులు ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి ఏకంగా రూ.కోటి మేర మామూళ్లు తీసుకున్నట్టు తేలింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల్లో కూడా విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ముగ్గురు డీఎస్పీలు మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో పాటు తమ విధులను నిర్లక్ష్యం చేశారన్న నివేదికలు కూడా పోలీసు ఉన్నతాధికారులు చేరాయి. మొత్తం మీద ఎన్నికల ఫలితాల కంటే ఇప్పుడు ఈ వసూళ్ల ఫలితాలే పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు. -
పెద్దపల్లిలో.. ఇక పురపోరు
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీతో మొదలైన ఓట్ల జాతర ఆరు నెలలుగా కొనసాగుతునే ఉంది. సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ పోలింగ్, కౌంటింగ్ సైతం ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు ఎన్నికల్లో పోటీకి దిగాయి. ప్రాదేశిక ఫలితాల్లో కారు హవా కనిపించింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. మంథని మాత్రం కాంగ్రెస్ ఖాతాలో కొనసాగుతుంది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇకమిగిలిన మున్సిపాలిటీ గురించి రాజకీయ సమీకరణలకు అధికారపార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెరతీశాయి. నాలుగు మున్సిపాలిటీలు జిల్లాలోని రామగుండం మున్సిపల్కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో పట్టణాలు, నగరాల్లోపాగా వేసేందుకు ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయిననా ఎన్నికల కోసం ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పట్టణాల పైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో నిన్నటి రాజకీయ బలాబలాలు పరిశీలిస్తే రామగుండంలో ప్రస్తుతం టీఆర్ఎస్ మేయర్ రాజమణి కొనసాగుతున్నారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య ఉన్నారు. మంథనిలో నిన్నటివరకు పుట్టమధు భార్య పుట్ట శైలజ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో మంథనిలో ఎన్నికలు నిలిచిపోయాయి. సుల్తానాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన కాలంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో నాలుగుచోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వం నుంచి ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఖరారుపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కొ స్థానంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున నాయకుల పేర్లను పరిశీలనకు తీసుకుని వారికి సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక బలాలపై లెక్కలు కడుతున్నారు. వార్డుల విభజనకు కసరత్తు మున్సిపల్‌వార్డుల విభజన, రిజర్వేషన్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందడమే తరువాయిగా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మున్సిపల్ అధికారులు ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి నగరపంచాయతీ నుంచి పూర్తిస్థాయి మున్సిపాలిటీగా ఏడాది క్రితమే అవతరించింది. 29,604 ఓటర్లు, 41,171 జనాభా కలిగిన పెద్దపల్లిలో రంగంపల్లి, బందంపల్లి, చందపల్లి గ్రామాలను ఏడాదిక్రితం ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్లో సైతం సమీప గ్రామాలను విలీనం చేశారు. ఇక్కడ కూడా డివిజన్ల సంఖ్య పెరుగనుంది. కొత్త చట్టంపై సందిగ్ధం మున్సిపాలిటీల గడువు జూన్ మొదటివారంతో ముగుస్తుంది. ఇప్పటికే జిల్లాలో మంథని, సుల్తానాబాద్ స్పెషల్ ఆఫీసర్లపాలనలో ఉన్నాయి. ఇక పెద్దపల్లి, రామగుండంలో జూన్మొదటివారంతో మున్సిపాలిటీ పదవీకాలం ముగుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విధానం ప్రత్యక్షమా.. పరోక్షమా.. మున్సిపల్ చట్టాల్లో చేయాల్సిన మార్పులపై తర్జనబర్జన పడుతున్నారు. దీంతో గడువులోగా ఎన్నికలు జరుగకపోవచ్చని అంటున్నారు. మున్సిపల్ గడువు ముగిసి స్పెషల్ ఆఫీసర్ల చేతిలో మరో మూడు, నాలుగు నెలలు పాలన ఉండవచ్చని అప్పటిలోగా కొత్త చట్టాన్ని రూపొందించి దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు 20.. విభజనతో 34.. పెద్దపల్లిలోని మున్సిపాలిటీలో రోడ్లను, వీధులను బట్టి వార్డులను నిర్ణయించారు. కొన్ని వార్డుల్లో 1300 ఓటర్లు, కొన్ని వార్డులో 1800 ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి అన్ని వార్డులకు సమాన ఓటర్లు సూత్రంగా వార్డులను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 1200ల నుంచి 800 ఓటర్లకు తగ్గించి వార్డులను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లిలో ప్రస్తుతం 20 వార్డులు ఉండగా పెరిగిన ఓటర్లు.. పునర్విభజనతో సంఖ్య 34కు పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లనే కొనసాగించడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అంతకు మించి డివిజన్‌ను పెంచే అవకాశం లేదంటున్నారు. సుల్తానాబాద్, మంథనిలో ప్రస్తుతం ఉన్న వార్డులను కొనసాగించనున్నారు. -
కోడ్ ముగిసింది!
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో పది నెలలుగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) శనివారంతో ముగిసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ సర్క్యూలర్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం అందించారు. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ, జనవరిలో పంచాయతీ, మార్చిలో ఎమ్మెల్సీ, ఏప్రిల్‌లో లోక్‌సభ, మే నెలలో పరిషత్ ఎన్నికలు జరిగాయి. వరుస ఎన్నికలు ఉండడంతో కోడ్ అమల్లో ఉంది. అన్నీ రాష్ట్రాల్లో లోక్‌సభ ఫలితాల తర్వాత కోడ్‌ను ఎత్తివేయగా, మన రాష్ట్రంలో పరిషత్ ఫలితాలు లోక్‌సభ ఫలితాల అనంతరం వెలువడడంతో కోడ్ కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఫలితాలు వెలువడి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక కూడా జరిగింది. దీంతో కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈసారి వరుస ఎన్నికలు రావడంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటికి సంబంధించిన నిధుల విడుదల వెనుకబడిపోయింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, పథకాలతో ప్రజలకు చేకూర్చే లబ్ధి గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిందని చెప్పవచ్చు. 2018 సెప్టెంబర్ 6న సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న రాష్ట్రంలో పాక్షికంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సుమారు 251 రోజులు జిల్లాలో కోడ్ అమల్లో కొనసాగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో జిల్లాలో పనులకు, నిధుల విడుదలకు లైన్‌క్లియరైంది. రెండేళ్లుగా అందని రుణాలు... గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటనలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. శనివారం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగడంతో జిల్లాలో కోడ్ పరిసమాప్తమైంది. కోడ్ అమలులో ఉండడంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన వ్యక్తిగత రుణాలు, గ్రూపుల వారీ రుణాల విడుదల రెండేళ్లుగా అందడం లేదు. 2017–18 సంవత్సరంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రెండేళ్లు దాటిన ఇంత వరకు చెక్కులు గానీ, డబ్బులు గానీ చేతికి అందడం లేదు. ప్రభుత్వఉద్యోగం రాకపోయిన కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో 2017–18 సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా సాయం పొందేందుకు దాదాపు పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంత వరకు సగం మందికి రుణాలు అందలేదు. ఇప్పుడు కోడ్ ముగియడంతో లబ్ధిదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. నిలిచిన నిధులు.. పనులు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆరు నెలలుగా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, పనులు గానీ ప్రారంభించకపోగా, 2019–20 ఆర్థిక యేడాదిలోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటివి చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అంటే సుమారు ఎనిమిది నెలలుగా వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు విడుదల నిలిచిపోగా, ఆయా పనులు సైతం ఆగిపోయాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖ ద్వారా అందజేసే రైతుబంధు (పెట్టుబడి సాయం) జిల్లాలో ఇంకా రైతులకు అందలేదు. ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌కు ముందు రైతుల చేతికి అందించాల్సి ఉండగా, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న ఇంత వరకు పెట్టుబడి సాయం చేతికి అందలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కోడ్ తొలగిపోవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా కళ్యాణలక్ష్మి పథకానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకాలకు ఎన్నికల కోడ్‌తో ఏలాంటి సంబంధం లేకపోయినా.. కోడ్ అమలులో నేపధ్యంలో పథకాలకు నిధుల విడుదల సమస్యగా మారింది. గత పక్షం రోజుల కిందట నిధులు విడుదలైన అధికారులు ఎన్నికల పనుల్లో బీజీగా ఉండడంతో లబ్ధిదారుల చేతికి అందలేదు. దీంతో పథకం అమలు మందగించిందని చెప్పొచ్చు. -
ఎన్నికల ఖర్చు అక్షరాలా 60వేల కోట్లు