final year students
-
ఉన్నత విద్యామండలి ‘ఫైనల్’ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ‘ఫైనల్’ నిర్ణయం తీసుకుంది. బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీల ప్రదానం సరికాదన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పరీక్షలు నిర్వహించాల్సిందేనని శుక్రవారం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30లోగా వీలుకాకపోతే యూజీసీ అనుమతితో ఆయా రాష్ట్రాలు తరువాతనైనా నిర్వహించుకోవచ్చని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం వివిధ యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబరు 30లోగా పరీక్షల నిర్వహణకు తాము అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు వర్సిటీలు వెల్లడించాయి. దీంతో పరీక్షల షెడ్యూల్స్‌ను ఒకట్రెండు రోజుల్లో జారీ చేయాలని ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లకు మండలి ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు త్వరలోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రిపరేషన్‌కు 10 నుంచి 15 రోజులు విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 15 నుంచి వార్షిక పరీక్షలను నిర్వహించేలా యూనివర్సిటీలు పరీక్షల షెడ్యూల్స్ సిద్ధం చేసి ప్రకటించాలని శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఆయా పరీక్షల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 3.5 లక్షల మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, సంప్రదాయ డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల ఉత్కంఠకు తెరపడనుంది. మరోవైపు సెప్టెంబరు 16వ తేదీ నుంచి బీటెక్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. బీఫార్మసీ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేయనుంది. ఎంటెక్ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించాలని జేఎన్టీయూ భావిస్తోంది. ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీలు కూడా వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులతోపాటు సంప్రదాయ డిగ్రీ పరీక్షల షెడ్యూలును జారీ యనున్నాయి. పీజీ పరీక్షలను వీలైతే సెప్టెంబరులో, లేదంటే అక్టోబరులో నిర్వహించే అవకాశం ఉంది. అక్టోబరులో బ్యాక్లాగ్ పరీక్షలు.. వివిధ డిగ్రీ కోర్సులు చదివే ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు ఇతర సంవత్సరాలు, ఇతర సెమిస్టర్లకు సంబంధించి ఫెయిలైన సబ్జెక్టులు ఏమైనా ఉంటే(బ్యాక్‌లాగ్స్) వాటి పరీక్షలను అక్టోబరులో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మండలి చైర్మన్ రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకొని వెళతారు కనుక వారు ఆగిపోకుండా బ్యాక్‌లాగ్స్ క్లియర్‌కు అవకాశం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల కోర్సులు పూర్తయినా ప్రస్తుతం పరీక్షలు నిర్వహించకుండానే డిటెన్షన్‌ను ఎత్తివేసి, వారిని ఆపై సంవత్సరానికి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారికి ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ప్రస్తుత సెమిస్టర్/సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను తరువాతే నిర్వహించనున్న నేపథ్యంలో వాటితోపాటు ఈ పరీక్షలను కూడా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. -
ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో జరగాల్సిన ఆఖరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్గదర్శకాల్లో సవరణలు సైతం చేసింది. ఆరు రాష్ట్రాల అభ్యంతరాలపై హెచ్చార్డీ శాఖ అధికారి ఒకరు స్పందిం చారు. విద్యార్థుల ఉన్న త చదువులు, భవిష్యత్తు ఉద్యో గ అవకాశాల దృష్ట్యా ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పా రు. రాష్ట్రాలు తమకు వీలైన సమయంలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని సూచిం చారు. ఆన్లైన్ విధానంలోనూ పరీక్షలు రాసే అవకాశం ఉందని గుర్తుచేశారు. -
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసు (ఐఐటీ– ఎం)లో ఫైనలియర్ విద్యార్థి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళలోని మళప్పురానికి చెందిన షాహుల్ కోర్నాథ్ (23) ఐఐటీ–ఎంలో నేవల్ ఆర్కిటెక్చర్ విభాగంలో బీటెక్– ఎంటెక్ (డ్యూయల్ డిగ్రీ) చదువుతున్నాడు. షాహుల్ శనివారం తన గదిలో సీలింగ్‌కు ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని వెల్లడించారు. హాజరు తక్కువగా ఉండటంతో షాహుల్ కొంత ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోందన్నారు. షాహుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
సంఘాల అంగీకారం తర్వాతే వెబ్‌కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సమ్మతి తీసుకున్న తర్వాతే చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన టీచర్ల బదిలీల అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికీ అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ చేపట్టిందన్నా రు. ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అంగీకరించిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పదో న్నతులు ఇవ్వడం లేదని చెప్పారు. మేనేజ్‌మెంట్లవారీగా బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేద్దామని చెబితే ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్ 6న జీవో 16ను తీసుకొచ్చామన్నారు. సీనియార్టీ విషయంలో కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టా రని తెలిసిన వెంటనే వాటిని సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ వద్దని కొన్ని సంఘాలు అంటుండటం సరికాదన్నారు. కొందరు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతోనూ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 26కి రిజర్వ్ చేశారని, ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామని, వెబ్ కౌన్సెలింగ్‌లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. వెబ్ కౌన్సె లింగ్ వద్దంటూ తన వ్యక్తిగత ఫోన్‌కు వేల మెస్సేజ్ లు, వందల కాల్స్ చేయిస్తున్నారని, ఈ ఎస్సెమ్మెస్ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ౖపై కొంతమంది యూనియన్ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పొరపాట్లు సరిదిద్దారు.. టీచర్ల బదిలీ షెడ్యూల్లో మార్పులు చేసిన విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఆప్షన్ తేదీల గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో పొరపాట్లను సరిదిద్దే చర్యలను విద్యాశాఖ వేగిరం చేసింది. ఇందులో భాగంగా కీలక దశలో ఉన్న వెబ్‌కౌన్సెలింగ్ గడువును పొడిగించి ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం) వెబ్‌కౌన్సెలింగ్ ముగిసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్‌కౌన్సెలింగ్ గడువును ఒకరోజు పెంచింది. ఈ నెల 26 వరకు స్కూల్ అసిస్టెంట్లు వెబ్ఆప్షన్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు) వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ మొరాయిస్తుండటంపై విద్యాశాఖకు ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలను అధిగమించే క్రమంలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్సైట్ మొరాయించడమే కీలక సమస్యగా మారింది. దీంతో ఓటీపీ రావడం, ఆప్షన్ల నమోదు ప్రక్రియ గంటల తరబడి జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సర్వర్ల ఏర్పాటుతో టీచర్లకు ఊరట లభించినట్లైంది. -
చిత్తూరులో మరో ‘ఫాతిమా’!
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో మరో 150 మంది వైద్య విద్యార్థులు వీధిన పడ్డారు. మొన్న ఫాతిమా వైద్య కళాశాల తరహాలోనే నేడు ఆర్వీఎస్(చిత్తూరు) వైద్య కళాశాల కూడా తమను నిండా ముంచిందని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గడువు ముంచుకొస్తున్నా వార్షిక పరీక్షలకు ఇంతవరకు అనుమతి రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. విద్యార్థులు నష్టపోవడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, వైద్య కళాశాలలకు గుర్తింపు ఇవ్వకుంటే తమ పిల్లల్ని అందులో చేర్చేవాళ్లమే కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎసెన్షియాలిటీ ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం : చిత్తూరు సమీపంలో 2016–17లో నెలకొల్పిన ఆర్వీఎస్ వైద్య కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎసెన్షియాలిటీ ఇచ్చింది. అనంతరం భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) 150 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. ఆ ఏడాది కన్వీనర్ కోటా కింద 75 మంది, యాజమాన్య కోటాలో మరో 75 మంది కాలేజీలో చేరారు. మౌలిక వసతులు లేకపోవటంతో ఆర్వీఎస్ వైద్య కళాశాలకు 2017–18 సంవత్సరానికి సంబంధించి సీట్లు మంజూరు కాలేదు. తాజాగా 2018–19కి కూడా అనుమతి రాలేదు. మొదటి బ్యాచ్‌లో చేరిన విద్యార్థులకు రెండో ఏడాది పరీక్షలు జరిగే సమయం ఆసన్నమైనా ఇంతవరకూ అనుమతి రాకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వల్లే నష్టపోయాం : ఆర్వీఎస్ కళాశాల వైద్య విద్యార్థులంతా తల్లిదండ్రులను వెంటబెట్టుకుని బుధవారం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ సీవీ రావ్‌ను కలిశారు. అనంతరం వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ శశాంక్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందటంతో పోలీసులు పెద్దసంఖ్యలో డీఎంఈ కార్యాలయానికి వచ్చారు. తమకు పరీక్షలు రాయడానికి అనుమతి రాలేదని, ల్యాబ్‌లు, అధ్యాపకులు లేరని, ఎలాంటి వసతులు కల్పించకుండా ఆర్వీఎస్ యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వైద్య కళాశాలలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం వల్లే తాము నష్టపోయామన్నారు. -
తెలివైన థామస్
కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లోకి రాగానే చదువుని పక్కన పెట్టేస్తారు. కానీ నివేథా థామస్ సినిమాలను పక్కన పెట్టారు. డిగ్రీ కంప్లీట్ చేయాల్సిందే అనుకున్నారు. ‘నిన్ను కోరి, జై లవకుశ’ సినిమాలతో లాస్ట్ ఇయర్ తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ మలయాళీ కుట్టి కేవలం అందంతోనే కాదు.. అభినయంతోనూ మంచి మార్కులు కొట్టేశారు. ఈ సంవత్సరం మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. దీనికి కారణం ఏంటి? అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ‘‘నా నెక్ట్స్ సినిమా ఏంటీ అని అందరూ అడుగుతున్నారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. ‘జై లవకుశ’ తర్వాత నా గ్రాడ్యుయేషన్ లాస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశా. ఈ గ్యాప్‌లో చాలా స్క్రిప్ట్‌లు చదివాను, విన్నాను. త్వరలోనే ఓ సినిమా డీటైల్స్ షేర్ చేస్తాను’’ అన్నారు నివేథా. చెన్నై ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చినా ‘ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్’ అని డిగ్రీ కంప్లీట్ చేశారంటే నివేథా థామస్ బ్యూటీ విత్ బ్రెయిన్ అనే చెప్పాలి. -
1122 నుంచి 578కి...
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్–11 కోసం వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ శనివారం వెల్లడించింది. మొత్తం 578 మంది క్రికెటర్లు వేలం కోసం అందుబాటులో ఉన్నారు. వీరిలో భారత క్రికెటర్లు 360 మంది కాగా, మరో 218 ఇతర దేశాల ఆటగాళ్లు. ఇందులోంచి గరిష్టంగా 182 మందికి లీగ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. ఐపీఎల్‌కు చెందిన ఎనిమిది జట్లు మొత్తం 18 మంది ఆటగాళ్లను వేలంలోకి రాకుండా తాము అట్టి పెట్టుకున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో ఈ వేలం జరుగుతుంది. ఇటీవల 1122 మంది క్రికెటర్లు తామూ ఐపీఎల్లో భాగం అవుతామంటూ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీల ఎంపిక, ఇష్టా ఇష్టాలననుసరించి ఐపీఎల్ ఈ జాబితాను దాదాపుగా సగానికి కుదించింది. 16 మందిని మార్క్యూ ఆటగాళ్లుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గుర్తించింది. అశ్విన్, ధావన్, డు ప్లెసిస్, గేల్, పొలార్డ్, రహానే, స్టార్క్, స్టోక్స్, బ్రావో, గంభీర్, షకీబ్, మ్యాక్స్‌వెల్, రూట్, హర్భజన్, యువరాజ్, విలియమ్సన్ ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 36 మంది రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నారు. రూ.1.5 కోట్ల కనీస ధర ఉన్న ఆటగాళ్లు 32 మంది కాగా... రూ. 1 కోటి కనీస ధరతో 31 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందుబాటులో ఉన్న క్రికెటర్లలో భారత్‌కు చెందిన 298, ఇతర దేశాలకు చెందిన 34 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఉండగా, అసోసియేట్ దేశాలనుంచి ఇద్దరికి చోటు దక్కింది. ఫ్రాంచైజీల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు 9 మంది క్రికెటర్లను కౌన్సిల్ తుది జాబితాలో చేర్చింది. ఇందులో భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ కూడా ఉండటం విశేషం. అసద్ ఇప్పటివరకు స్థానిక క్లబ్ స్థాయి క్రికెట్ మినహా సీనియర్ స్థాయిలో ఏ జట్టుకూ ఏ ఫార్మాట్లోనూ ఆడలేదు. స్టోక్స్‌కు గ్యారంటీ! స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎంచుకునే విషయంలో గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేక హామీ ఇచ్చింది. ఒకవేళ పోలీసు విచారణ కారణంగా స్టోక్స్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేని పరిస్థితి వస్తే అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవచ్చని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత స్టోక్స్ స్వదేశం వెళితే మాత్రం ఇది వర్తించదని, అతని స్థానంలో మరొకరిని ఎంచుకునే అవకాశం లేదని కూడా జీసీ పేర్కొంది. వేలంలో స్టోక్స్‌కు భారీ డిమాండ్ ఉంది. గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.14.5 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్...తన విలువను నిలబెట్టుకుంటూ పుణేను ఫైనల్ చేర్చడంతో పాటు లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలవడం విశేషం. -
‘ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్’ తుది కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల నియామకాల కోసం గత అక్టోబర్ 22న నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన తుది కీని ఈనెల 5 నుంచి సంస్థ వెబ్సైట్ (www.tspsc.gov.in) లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ సోమవారం తెలిపింది. కీ పై తదుపరి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. -
వెబ్సైట్లో ఎన్టీఎస్ఈ, ఎన్ఎంఎంఎస్ కీ
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 6న నిర్వహించిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ), నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షల ఫైనల్ కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు bsetelangana. gov. in వెబ్సైట్లో కీలను పొందవచ్చని చెప్పారు. -
నేటి నుంచి నామినేషన్లు
► 5న తుది జాబితా ►19న పోలింగ్ ► 22న కౌంటింగ్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం ఈనెల 26వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తమిళనాడులో మూడు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి వచ్చేనెల 19వ తేదీ పోలింగ్ జరుగనుంది. ఈ ఏడాది మేలో జరిగిన తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాలకుగానూ 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి స్థానాల్లో ఓటర్లను మభ్యపెట్టేలా నగదు, చీరలు, పంచెలు, మద్యం బాటిళ్లు సరఫరా జరిగినట్లు ఆరోపణలు రావడంతోపాటు పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అలాగే, మధురై జిల్లా తిరుప్పరగున్రం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే టికెట్‌పై పోటీచేసిన శీనివేల్ గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మూడు నియోజకవర్గాల్లో నవంబర్ 19వ తేదీన పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ పోటీకి దిగుతున్నా ఇంకా అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. ఉప ఎన్నికల్లో భాగంగా ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ 26వ తేదీన ఆరంభం కానుంది. అరవకురిచ్చి నియోజకవర్గ ఎన్నికల అధికారిగా కరూరు జిల్లా సంయుక్త కలెక్టర్ సైబుద్దీన్ నియమితులుకాగా, అరవకురిచ్చి తాలూకా కార్యాలయంలో తాత్కాలిక ఎన్నికల కార్యాలయాన్ని తెరిచారు. తంజావూరు ఎన్నికల అధికారిగా ఇన్నాచ్చిముత్తు నియమితులయ్యారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఈనెల 26వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. శని, ఆదివారాల్లో సెలవు. నవంబరు 3వ తేదీ నామినేషన్ల పరిశీలన, 5వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణ, అదే రోజు ఉప ఎన్నికల రంగంలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 19వ తేదీన పోలింగ్, 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పుదుచ్చేరిలో ఒక స్థానం: కాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కోసం నెల్లితోప్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుండగా, 26వ తేదీ నుంచే నామినేషన్లను స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణస్వామి, అన్నాడీఎంకే అభ్యర్థిగా ఓంశక్తిశేఖర్ ప్రధాన అభ్యర్థులుగా తలపడుతున్నారు. -
అక్టోబర్ 23న కానిస్టేబుల్ తుది పరీక్ష
- పోస్టులు 9,613 - పరీక్షకు హాజరయ్యేవారు 81,000 - వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన టీఎస్ఎల్పీఆర్బీ సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ తుది రాత పరీక్షను అక్టోబర్ 23న నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నిర్ణయించింది. అక్టోబర్ 23 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పోలీసు విభాగాల్లోని సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్ఏఆర్, ఫైర్ సర్వీసెస్‌లలో ఖాళీల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు గతేడాది డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. మొత్తం 9,613 పోస్టులకుగాను 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రిలిమినరీ రాత పరీక్ష అనంతరం 1.92 లక్షల మంది పోటీలో నిలిచారు. దేహదారుఢ్య పరీక్షల అనంతరం తుది రాత పరీక్షకు 81 వేల మంది అభ్యర్థలు అర్హత సాధించారు. మొత్తంగా ఒక్కో పోస్టుకు 8 మంది పోటీలో నిలిచారు. తుది పరీక్షకు సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకుంది. ఇప్పటికే అభ్యర్థుల వేలిముద్రలు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను సిద్ధంగా ఉంచుకుంది. అభ్యర్థుల వేలిముద్రలను పరిశీలించాకే అనుమతించేలా చర్యలు చేపట్టింది. మరోవైపు ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షను నవంబర్‌లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యాక ఎస్సై పోస్టులకు తుది పరీక్ష నిర్వహించనుంది. -
రాఖీతో అన్నకు అంతిమ వీడ్కోలు
చిప్పగిరి: మృతిచెందిన అన్నకు రాఖీ కడుతున్న ఈ దశ్యం ఎంతో హదయ విదారకంగా ఉంది కదూ! అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రక్షాబంధన్ రోజు నేమకల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నేమకల్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మాల పెద్దలక్ష్మన్న(62) కొన్ని నెలలుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రయివేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మతిచెందాడు. ఇతనికి యశోదమ్మ, ఈరమ్మ, నరసమ్మ అనే ముగ్గురు చెల్లెలు. ఉదయం వెళ్లి అన్నకు రాఖీ కట్టాలనుకున్న వీరికి పెద్దలక్ష్మన్న మతి విషయం తెలిసింది. కష్టసుఖాల్లో తోడుగా ఉండే అన్న ఇక లేడని విషాదాన్ని దిగమింగుతూ రాఖీ కట్టి అంతిమ వీడ్కోలు పలికారు. అన్నాచెలెల్ల అనుబంధం గొప్పతనాన్ని చాటారు. -
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే
సాక్షి, హైదరాబాద్: వ్యవ సాయ శాఖలో ఖాళీగా ఉన్న 1000 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులేనని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టుల కోసం ఈనెల 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చినందున వారు దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో (www.tspsc.gov.in) పొందవచ్చని వివరించారు. -
రికార్డు సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థిని
హైదరాబాద్: ఓ పక్క రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(యూవోహెచ్) వివాదాలకు వేదికగా మారి చర్చనీయాంశంకాగా.. అదే వర్సిటీ, అందులోని విద్యార్థులు విద్యాపరంగా రికార్డులను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల సరసన చేరిన ఈ వర్సిటీ అంతే స్థాయిలో ఉత్తమ విద్యార్థులను కూడా అందించగలదని నిరూపించింది. అవును.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీ ప్రసూన అనే ఇంటిగ్రేటెడ్ విద్యార్థి సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఆలిండియా నంబర్ 1 ర్యాంకును సాధించి రికార్డు సృష్టించింది. స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిగా అడుగుపెట్టి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్న ఆమె 200 మార్కులకుగాను 158 మార్కులు సాధించింది. వచ్చే జూలై నెలలో ఆమె టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) లో పీహెచ్డీ ప్రవేశం పొందనుంది. ముందునుంచే పుస్తకాలంటే ఎంతో మక్కువ చూపే ప్రసూన ప్రతి అకాడమిక్ ఇయర్లో రాణించేందుకు తోటి విద్యార్థులతో మమేకమవుతూ ప్రణాళిక బద్దంగా చదివినట్లు తెలిపింది. తన డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు, వర్సిటీ అందించిన సహకారం ఎంతో గొప్పదని కొనియాడింది. వర్సిటీలో బోధన, పరిశోధన ఎంతో ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పరిశోధన రంగంవైపు వెళ్లేందుకే తాను ఈ వర్సిటీని, ఈ కోర్సును ఎంచుకున్నట్లు వివరించింది. -
తిరుపతికి స్మార్ట్ కల చెదిరింది...
► 3.07 మార్కుల తేడాతో చేజారిన అవకాశం ► మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం ►మార్చి మొదటి వారం నుంచి రెండో దశ ► సక్సెస్ సాధించిన కన్సల్టెన్సీ వైపు కమిషనర్ ఆసక్తి తిరుపతి: దేశంలో వంద స్మార్ట్ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న తిరుపతి, తొలిదశలో అభివృద్ధి చేయనున్న టాప్ 20 నగరాల జాబితాలో స్థానం కోల్పోయింది. ఇప్పుడు తాజాగా మలి దశ పోటీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గత ఏడాది దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా, 98 నగరాల జాబితాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఏడాది వ్యవధిలో మూడు పర్యాయాల్లో వీటిని అభివృద్ధి చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో తొలిదశలో 20 నగరాలు, మలిదశలో 40, ఆ తరువాత మిగిలిన నగరాలకు నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏపీలో తిరుపతితో పాటు విశాఖ, రాజమండ్రి నగరాలను ఎంపిక చేశారు. ఈ నెల 28న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టాప్- 20 నగరాల జాబితాను ప్రకటించారు. ఆధ్యాత్మిక నగరం కావడంతో తిరుపతికి చోటుఖాయంగా భావించారు. కానీ తిరుపతి వాసులకు నిరాశ మిగిలింది. విశాఖ, రాజమండ్రి నగరాలు మాత్రమే రాష్ట్రం నుంచి తొలి జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తేడా 3.07 మార్కులే టాప్-20 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసేందుకు కేంద్రం వివిధ మార్గదర్శకాలతో కఠిన నిబంధన పెట్టింది. తాగునీరు, రవాణా, డ్రైనేజీ, స్వచ్ఛభారత్, పన్నుల వసూళ్లు, ఆదాయం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో నగరాల పనితీరు, చేపట్టబోయే పనులు వంటి వాటి ఆధారంగా మార్కులను కేటాయించారు. ఈ మార్గదర్శకాల ఆధారంగా ఆయా నగరాలు కన్సెల్టెన్సీల ద్వారా తయారుచేసిన డీపీఆర్‌ను కేంద్రానికి అందజేశాయి. వాటిని బేరీజువేసి ఆయా నగరాలకు మార్కులను కేటాయించారు. ఈ మార్కుల ఆధారంగా టాప్ 20 నగరాలను ప్రకటించారు. ఇందులో తిరుపతికి చోటు దక్కలేదు. సరైన డీపీఆర్‌ను అందించలేకపోవడంతో 51.78 మార్కులు వచ్చాయి. 20వ నగరంగా ఎంపికైన భోపాల్ నగరానికి 55.45 పాయింట్లు వచ్చాయి. 3.07 మార్కులతో తిరుపతి టాప్ 20లో స్థానం దక్కించుకోలేకపోయింది. మరో అవకాశం టాప్-20 స్మార్ట్ నగరాల్లో తక్కువ మార్కులతో వెనుకంజలో ఉన్న నగరాలకు కేంద్రం నిబంధనలను సడలించి సత్వరమే మలి దశకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మరో ఏడాది తరువాత 40 నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా మలిదశ ఎంపికను ఈ యేడాది ఆగస్టు కల్లా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజుల క్రితం కేంద్రం ఇందుకు సబంధించిన మార్గదర్శకాలను విడుదలచేసి వెబ్సైట్లో ప్రవేశపెట్టింది. మార్చి మొదటి వారంలో స్మార్ట్ ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుంచి జూన్ 30 వరకు అన్నివిధాలా నివేదికలను సిద్ధం చేసి కేంద్రానికి అందించాలి ఉంది. ఆగస్టు మొదటి వారంలో మలి దశలో టాప్ 40 స్మార్ట్ నగరాలను కేంద్రం ఎంపిక చేయనుంది. టాప్ 40లో తిరుపతిని నిలబెడతాం స్మార్ట్ నగరాల ఎంపికలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే డ్రాప్టింగ్‌లో కేంద్రాన్ని సంతృప్తి పరచలేకపోయాము. కారణాలు ఏమైనా మలిదశ పోటీకి పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉన్నాము. గత అనుభవం నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకుని మలిదశ లో తిరుపతిని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. - వినయ్‌చంద్, కమిషనర్ -
ఐఐటి ఖరగ్ పూర్ విద్యార్థికి బంపర్ ఆఫర్
మరో ఐఐటీ విద్యార్థి బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నాడు. బీహార్ ఖగరియాకి చెందిన వాత్సల్య సింగ్ చౌహాన్ (21) ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అతనికి మైక్రోసాఫ్ట్ సంస్థ సంవత్సరానికి కోటీ రెండు లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. మధ్యతరగతి కుటుంబానికి వాత్సల్స సింగ్ చౌహాన్ తండ్రి వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండడం విశేషం. కాగా వాత్సల్య సింగ్ ఐఐటీ-జేఈఈలో ఆలిండియా స్థాయిలో 382వ ర్యాంకు సాధించి.. ప్రస్తుతం ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభతో రాణించాడు. దాంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాత్సల్య సింగ్‌కు ఏడాదికి కోటి రెండు లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. విద్యా సంవత్సరం అనంతరం అతను ఉద్యోగంలో చేరనున్నాడు. ఐదు రౌండ్ల ఇంటర్వ్యూ అనంతరం తాను ఉద్యోగానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని వాత్సల్య తెలిపాడు. ఈ విషయాన్ని మొదట తాను, తన కుటుంబం నమ్మలేకపోయామని చెప్పాడు. కాగా చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న వాత్యల్యను పెద్ద చదువులు చదివించేందుకు కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు. పదో తరగతి వరకు హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాత్సల్య ఇంటర్లో 75శాతం మార్కులు సాధించాడు. ఐఐటీలో చోటు సంపాదించుకొనేందుకు రాష్ట్రంలోని కోట పట్టణంలోని ప్రముఖ కోచింగ్ సంస్థలో కోచింగ్ తీసుకున్నాడు. వాత్సల్యకు మైక్రో సాఫ్ట్ జాబ్ రావడంపై తండ్రి చంద్రకాంత్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కొడుకు చదువు నిమిత్తం మూడున్నర లక్షలు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నానని.. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. అయితే ఎక్కువగా స్కాలర్ షిప్ లమీద ఆధారపడే చదువుకున్నాడని , అతని ఉపాధ్యాయులు కూడా చాలా సహాయం చేశారంటూ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య
తాళ్లురు : బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లురు మండలం కొత్తపాలెంలో ఆదివారం జరిగింది. మృతురాలు అనూషగా పోలీసులు గుర్తించారు. అయితే అనూష ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. -
ఫైనల్ ఇయర్‌కు ముందుగా!
రీయింబర్స్‌మెంట్‌కు రూ.300 కోట్లు.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత చదువులకు ఆటంకం లేకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులన్నింట్లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫీజును ముందుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకట్రెండు రోజుల్లోనే అందుకు సంబంధించి రూ. 300 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఒత్తిళ్లు తగ్గిపోతాయని, తదుపరి విడతల్లో మిగతా విద్యార్థుల రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల యాజమాన్యాలు.. ఫీజులు చెల్లించేంత వరకు సర్టిఫికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని మొండికేస్తున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. రీయిం బర్స్మెంట్ జాప్యం కావటంతో సర్కారు తీరును నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఇలా క్షేత్రస్థాయి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రాధాన్యక్రమంలో బకాయిలను చెల్లించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.300 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.2,500 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి విభాగాలకు విడివిడిగా ఈ నిధులు విడుదల చేస్తారు. మార్చి నుంచి ఇప్పటివరకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ కింద రూ.974.36 కోట్లు విడుదల చేసింది. ఇవన్నీ 2013-14 సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజుల బకాయిలకు సరిపోయాయి. దీంతో 2015-16 స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ పథకాన్ని కొనసాగించే నిర్ణయం ఆలస్యం కావటం.. పాత బకాయిల భారం కారణంగా మొత్తం ప్రక్రియ ఆలస్యమైంది. -
భారత విద్యార్థుల గమ్యస్థానం.. ఆస్ట్రేలియా
మెల్బోర్న్: ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. చైనా తర్వాత భారత్ నుంచే అధిక సంఖ్యలో విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 48వేల మంది పైగా భార త విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 11వేలు అధికం. ఈ ఏడాది జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో 48,311 మంది ఆస్ట్రేలియా బాట పట్టగా గతేడాది ఇదే సమయానికి 36,964 మంది వెళ్లారు. వీరిలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లిన వారు 25,439 మంది. వొకేషనల్ విద్య కోసం వెళ్లిన వారు 18,350 మంది. గతేడాది ఉన్నత విద్య కోసం 17,694 మంది వెళ్లగా, వొకేషనల్ విద్య కోసం 16,772 వెళ్లారు. ఆస్ట్రేలియాలోని నగరాల్లో విక్టోరియాకే ఎక్కువ మంది భారత విద్యార్థులు ఓటేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో న్యూ సౌత్‌వేల్స్ ఉంది. జనవరి- ఏప్రిల్ మధ్యకాలంలో 11వేల మంది విద్యార్థులు విక్టోరియాకు వెళ్లారు. విద్యారంగంలో భారత్- విక్టోరియాల మధ్య వాణిజ్యం సానుకూలంగా సాగుతోందని భారత కాన్సుల్ జనరల్ మోనికా జైన్ తెలిపారు. స్టూడెంట్స్ వీసా నిబంధనలు సరళీకృతం చేయడంతో పాటు ‘పోస్ట్ స్టడీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ’ పేరిట కోర్సు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోనే రెండేళ్లు ఉద్యోగం చేసే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది. అదేవిధంగా అభ్యర్థులు చూపించాల్సిన ఆర్థిక మొత్తాన్ని కూడా కొంత తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించడం.. విద్యార్థులు ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమని ఓ ప్రైవేట్ ట్రైనింగ్ కాలేజ్ యజమాని తెలిపారు. -
విద్యుదాఘాతంతో వైద్య విద్యార్థి మృతి
నెల్లిమర్ల (విజయనగరం) : హోమియో వైద్య విద్యార్థి ఒకరు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో వంశీకుమార్ అనే యువకుడు హోమియో ఫైనలియర్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కళాశాలకు సమీపంలోనే ఉండే తన గదిలో స్నానం చేయడానికి నీటి వాల్వ్ తిప్పగా దానికి కరెంట్ ఎర్త్ అయి షాక్‌తో పడిపోయాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్థారించారు. కాగా వంశీకుమార్ హైదరాబాద్ వాసి అని తెలిసింది. -
నాగార్జున వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్‌లో జరిగిన ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలుగో సెమిస్టర్ ఫరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు చీఫ్ ఎగ్జామినర్ ఎం.సాయిబాబా తెలిపారు. ఫలితాలను www.anu.ac.in వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. జూన్ 3వ తేదీలోపు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
'రామకృష్ణ' డిగ్రీ కళాశాల పరీక్ష ఫలితాలు విడుదల
నంద్యాల (కర్నూలు) : స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల మూడో సంవత్సరం పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అటానమస్ కళాశాల కావడంతో రాయలసీమ యూనివర్శిటీ ఆదేశాల మేరకు ఫలితాలను ప్రకటించినట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ కళాశాలలో మొత్తం ఏడు కోర్సుల్లో 651మంది పరీక్షలకు హాజరు కాగా 575మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 135మంది డిస్టింక్షన్లో 325మంది, ప్రథమ శ్రేణిలో 77మంది, తృతీయ శ్రేణిలో ఉతీర్ణత సాధించినట్లు తెలిపారు. బీఏ, బీబీఎంలో 100శాతం ఉత్తీర్ణత సాధించగా బీఎస్సీలో ఎంఎస్సీఎస్, ఎంఈసీఈసీలలో 90శాతం, ఎంపీసీలో 94శాతం, బీకాం కంప్యూటర్స్‌లో 86శాతం, జనరల్‌లో 71శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. కళాశాలలోని అన్ని గ్రూప్‌లపై అత్యధిక మార్కులను ఎంపీసీఎస్ బ్రాంచ్‌కు చెందిన పి.బేబిఆశ (92.19శాతం) ప్రథమ స్థానంలోను నిలిచి బంగారు పతకాన్ని సాధించినట్లు తెలిపారు. అలాగే ఎంపీసీఎస్‌కు చెందిన కె.విజయలక్ష్మి(91.42), ఎంఎస్‌సీఎస్‌కు చెందిన కిరణ్‌కుమార్(90.62)లు ద్వితీయ, తృతీయ శ్రేణిలో నిలిచారన్నారు. ఒక సబ్జెక్టులో 6వ సెమిస్టర్లో 50మంది ఫెయిల్ అయ్యారని వారికి, మూడు సంవత్సరాల్లో ఒకటి, రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారికి పదిరోజుల్లో పరీక్షలను నిర్వహించి ఏడాది వృథా కాకుండా అవకాశం కల్పిస్తామన్నారు. కవల పిల్లల అద్భుత ప్రతిభ.. కళాశాలలో బీఏ చదువుతున్న ఇద్దరు కవల విద్యార్థినులు అద్భుత ప్రతిభను చూపారు. వ్యవసాయ కార్మిక కుటుంబానికి చెందిన సుజాత, సునీతలది కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల గ్రామం. 18-05-95లో ఎర్రగడిండ్ల శివుడికి కవల పిల్లలుగా జన్మించారు. వీరు బీఏలో చేరి కళాశాల టాపర్స్‌గా నిలిచారు. సుజాతకు మూడు సంవత్సరాల్లో 2209మార్కులు సాధించగా సునీత 2108మార్కులు సాధించి ఇరువురు డిస్టింక్షన్లో నిలిచారు. ఇంటర్మీడియెట్‌లో కూడా వీరి ఇరువురు కోవెలకుంట్ల గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివి సుజాత 886, సునీత 786మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. సివిల్సే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు. -
ఒత్తిడికి ఎగ్జామ్పుల్
ఎండలు మండే ముందే వేడి పెరిగే కాలం ! ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ చేయడానికి భయపడే కాలం ! కేబుల్ కనక్షన్లు కట్ అయ్యే కాలం..! తల్లిదండ్రులకు టెన్షన్ కాలం..! అదే పిల్లల పరీక్షా కాలం.. !! సాయంత్రం వేళల్లో ఇంట్లో ఉంటే నాకు అన్నింటికంటే ఇష్టమైన వ్యాపకం.. బాల్కనీలో కూర్చుని, కింద వీధిలో ఆడుకుంటున్న పిల్లలను చూడటం. కానీ గత వారం నుంచి పిల్లల సందడి లేక వీధంతా బోసిపోయింది. నాకు ఖాళీ దొరికిందని పిల్లలు కేరింతలు విందామనుకుంటే సరా..! పిల్లలకు తీరిక ఉండొద్దూ. ఆడుకుందామని ఉన్నా, పెద్దలు ఒప్పుకోవద్దూ..!. చిన్నాపెద్దా తేడా లేదు మార్చి వచ్చిందంటే అందరికీ పరీక్షా కాలం. ఈ కాలంలో ఆటలు కట్.. కేబుల్ ఫట్.. పరీక్షలు రాసేంత వరకూ పిల్లలకు.. మార్కులు వచ్చే వరకు పెద్దలకు టెన్షన్.. టెన్షన్. మార్కులే మనకు ముఖ్యం.. ‘కొండలా కోర్సు ఉంది ఎంతకీ త రగనంది’ అంటూ సాగే పాటలా సిలబస్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. పుస్తకాలతో దోస్తీ పోయి కుస్తీపట్లు పెరిగిపోతున్నాయి. సంవత్సరమంతా నేర్చుకున్నది ఎంత అని పరీక్షించేందుకే ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, నేర్చుకున్నది ఇంతే అని చెప్పేందుకు కాదని నా అభిప్రాయం. రెండొందల పైచిలుకు రోజుల చదువు రెండు గంటల్లో పరీక్షించి రెండు మార్కులు తగ్గితే పనికిరావని సెలవిచ్చే విధానంలో మార్పు రావాలి. ఈ మధ్య కాలంలో ఎవరూ ఫెయిల్ అనే మాట గురించి బాధ పడట్లేదు. ఇప్పుడు సమస్యల్లా.., తొంభైలపైనే ఉంటూ ర్యాంకు సంపాదించడం గురించే. హైదరాబాద్ మహానగరంలో గల్లీకో స్కూలు.. ర్యాంకులు, మార్కులు.. ఫొటోలతో సహా ఫ్లెక్లీలపైకి ఎక్కించేసి మరీ అడ్మిషన్స్ అమ్మి సొమ్ము చేసుకుంటోంది. పరీక్షానాం అనేకం.. ఇక తల్లిదండ్రుల ఆరాటం కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది. ర్యాంకు రావడం, సీటు సాధించడం.. ఇవి ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారిపోయాయి. అందుకే పరీక్షల కాలం అంటే పిల్లలకు హడల్. ఒకటా రెండా ఎన్ని పరీక్షలో. ఒక్కో పరీక్షదీ ఒక్కో తీరు. ముఖ్యంగా టెన్త్ నుంచి పరీక్షల సీజన్ మొదలైనట్టే. ర్యాంకుల పర్వంలో పద్మవ్యూహంలాంటి ఎంట్రెన్స్‌లు ఛేదించడానికి పిల్లలు సదా సిద్ధంగా ఉండాలి. ఒక్క పరీక్ష రాసి ప్రతిభ నిరూపించుకోవచ్చు అనే భరోసా లేదు. ఇంటర్ తర్వాత ఎంసెట్, జేఈఈ.. ఇవి రావేమోనని ఇతర వర్సిటీల సొంత ఎంట్రెన్స్‌లు.. ఇలా ఎవరికి ఎన్ని వీలైతే అన్ని పరీక్షలు రాసుకోవచ్చు. ఇందు మూలంగా ఏం చెప్పదలుచుకున్నారయా అంటే.. పక్కోడి పరీక్ష వేస్టు.. మా పరీక్ష బెస్ట్ అని. ఇలా టెస్ట్ టెస్ట్‌కీ మధ్య రోస్టు అయిపోవడం స్టూడెంట్స్ వంతు. ఇన్ని పరీక్షల్లో టెన్షన్స్‌తో వెనుకపడిపోతే ఆ ఫెయిల్యూర్స్ విద్యార్థిది కాదు, పరీక్షల విధానం మార్చలేని మన విద్యావ్యవస్థదే. తొంభై శాతం మార్కలు వచ్చే విద్యార్థులు తొంభై శాతం ఉన్నా.. అంత సాధించిన తర్వాత కూడా పనికిరాలేదంటే ఆ బాధ్యత ముమ్మాటికీ వ్యవస్థదే. మార్పులు కావాలి తథ్యం.. ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు పరీక్షలంటే ఒత్తిడి పెంచే ప్రక్రియలా మారిపోయింది. మన దేశంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు, రిజల్ట్స్ సమయాల్లో పిల్లలు ఆత్మహత్యల గురించి వార్తలు వినిపిస్తున్నాయంటే దాని వెనుక కారణం ప్రభుత్వాలకు అర్థం కావడం లేదెందుకని. తల్లిదండ్రులు సైతం కార్పొ‘రేటు’ విద్యని కళ్లకద్దుకుని పిల్లలపై ఒత్తిడి పెంచుకుంటుంటే కారణం పర్సనల్ రీజన్స్ అని వదిలేద్దామా..! మార్పు రావాలి. మన విద్యావిధానంలో సమూలంగా ప్రక్షాళన జరగాలి. ‘వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్.. వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ.. ’ అన్న రవీంద్రుని కలలు నిజమవ్వాలి. పరీక్షల్లో ఒత్తిడి లేకపోతేనే పిల్లలు బాగా పెర్ఫార్మ్ చేయగలరు. అందుకే ముందు రియలైజ్ అవ్వాల్సింది పెద్దలే. పిల్లలను ఎగ్జామ్స్ ఎంజాయ్ చేయనివ్వండి. ఆల్ ద బె స్ట్. -
కోల్‌కతా ఐఐఎంలో కొలువుల జాతర
కోల్‌కతా: ఈ సంవత్సరంలో ఈ-కామర్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఐఐఎం కోల్ కతాలో నిర్వహించబోయే క్యాంపస్ ప్లేస్ మెంట్ విభాగంలో మరో రెండున్నర రోజుల్లో 2013-15 బ్యాచ్ ఈ-కామర్స్ విద్యార్థులకు 100 శాతం ప్లేస్ మెంట్లు రాబోతున్నాయి. మొత్తం 438 సీట్లున్న ఈ-కామర్స్ విభాగంలో 47 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మందికి క్యాంపస్ ప్లేస్ మెంట్లు దక్కనున్నాయని కోల్ కతా ఐఐఎం ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్, స్పాన్ డీల్, ఫ్లిప్ కార్ట్, ఓలాకేబ్స్, గ్రూప్ ఆన్, క్వికర్, అర్బన్ లాడర్, కార్ ట్రేడ్ వంటి పలు కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్లు నిర్వహించనున్నాయి. ఒక్క ఫైనాన్స్ విభాగంలోనే 100కు పైగా విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందనున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, గోల్డ్ మేన్ సాచ్స్, సిటీబ్యాంక్, బిఎన్పీ పరిబాస్, డచ్ బ్యాంక్, అవెండస్ కాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఐబీడీ, ఎడెల్వీస్, అలీగ్రో అడ్వైజర్స్ ఇంకా మరికొన్ని ఫైనాన్స్ సంస్థలు మొదటి రోజు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయని ఐఐటీ కోల్ కతా ప్రకటించింది. ఒక్క కన్సల్టింగ్ విభాగంలోనే దాదాపు 20 శాతం మంది ఉద్యోగాలు పొందనున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బైన్ అండ్ కో, మెక్కిన్సే, ఏటీ కియర్నీ, అసెంచర్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ కంపెనీలు ఈ విభాగంలో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం 18 ఆఫర్లలో అసెంచర్ దే అగ్రభాగం. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలు 19 శాతం ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. పి అండ్ జీ, రెకిట్ బెన్ కిసర్, కెలాగ్స్, ఐటీసీ, ఫిలిప్స్, కోకాకోలా, పెప్సికో, మాండెలెజ్, డాబర్, అల్షాయా రిక్రూటెడ్ పీపీఓ కంపెనీలు ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. -
కాలేజ్ స్టాఫ్ తో అసభ్య ప్రవర్తన:విద్యార్థుల సస్పెన్షన్
జోథ్ పూర్(రాజస్థాన్): మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసిన ఘటన జోథ్ పూర్ లోని ఎంబీఎమ్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. ఆ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న ముగ్గురు వేర్వేరు బ్యాచ్ లకు చెందిన విద్యార్థులు మహిళా ఉద్యోగినితో పాటు కొంతమంది విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేస్తూ పట్టుబట్టారు. దీనిపై స్పందించిన కళాశాల యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. కళాశాల నుంచి బహిష్కరించబడిన వారిలో కేమ్ రాజ్ మీనా(ఎలక్ట్రానిక్స్), మోహిత్ కుమార్(సివిల్), శైలేష్ మీనా(మెకానికల్) విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనపై వారి తల్లి దండ్రులకు సమాచారం అందివ్వడమే కాకుండా, పోలీస్ ఫిర్యాదు చేసినట్లు కళాశాల క్రమశిక్షణా కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు పోలీసుల అదుపులో ఉండగా.. మరో విద్యార్థి ఆ కేసును బయటపడేందకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.