gandra Venkata ramana reddy
-
కేటీఆర్ పర్యటనలో మాజీ స్పీకర్ మదుసుదనాచారికి చేదు అనుభవం!
గణపురం: మంత్రి కేటీఆర్ గణపురం మండల పర్యటనలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసుదనాచారికి చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న క్రమంలో గణపురం ప్రధాన రోడ్డుపై ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాను మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసుదనాచారిని అని తెలపడంతో ఆయన వాహనాన్ని వదిలిపెట్టారు. కానీ ఆయన వెంట వచ్చే నాయకుల వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సిరికొండ వాహనంలో నుంచి దిగి వచ్చి నన్ను, నా వెంట వచ్చే నేతలను అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వాహనాన్ని హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. అక్కడ నుంచి హెలిప్యాడ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన మరో బందోబస్తు వద్ద కూడా సిరికొండ వాహనాన్ని నిలిపి ఆయన అధికార పీఏను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో కావాలనే సిరికొండను అడుగడుగునా అవమానించారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో టీబీజీకేఎస్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో సిరికొండ పేరు లేకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే గండ్ర వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కవిత సమక్షంలోనే సిరికొండ, గండ్ర వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో సిరికొండ వాహనాన్ని పోలీసులు తెలియక అడ్డుకున్నారా? లేక గండ్ర ఆదిపత్య పోరు కోసం చేయించారా? అని సిరికొండ వర్గీయులు, ప్రజలు చర్చింకుంటున్నారు. అంతటా వర్గపోరే.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసాంతం బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కనిపించింది. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. డబుల్ బెడ్ రూంల ప్రారంభోత్సవం, బహిరంగ సభ వద్ద జై సిరికొండ, చారి సాబ్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయగా.. మరికొందరు జై గండ్ర జైజై గండ్ర అంటూ నినదించారు. బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు చాలామంది జై సిరికొండ అంటూ నినాదాలు చేయడంతో.. ‘మీకు దండం పెడతా, ఆపండి.. ఇది మన కార్యక్రమం, సజావుగా జరగనివ్వండి’ అని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా సభలో కూర్చున్న పలువురు ‘భూకబ్జాదారులు.. ఎమ్మెల్యే అనుచరులు’ అంటూ నినాదాలు చేశారు. -
‘డర్టీ డజన్ ఎమ్మెల్యేలు, దొరగాని దొడ్లో పశువులుగా మారారు’
సాక్షి భూపాలపల్లి/మొగుళ్లపల్లి: ‘మేం గెలిపిస్తే.. మా గుండెల మీద తన్ని, ఆస్తుల సంపాదన కోసం కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగాని దొడ్లో పశువులుగా మారారు’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌నుద్దేశించి ’’నక్సలైట్ ఎజెండా అంటివి ఏమైంది? మోసం చేసిన కోవర్టులకే మంత్రి పదవులా..’అంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది. రాత్రి మొగుళపల్లి మండల కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ధరణితో దందాలు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఉపాధి లభించక, కనిపెంచిన తల్లిదండ్రుల బాధలు చూడలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక్క ఇల్లూ ఇవ్వలేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, ముదనష్టపోడు కేసీఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. పసి పిల్లాడిని కుక్కలు పీక్కొని తింటే పట్టించుకోని దుర్మార్గ ప్రభుత్వం ఇదని రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్‌దే స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్‌దేనని అన్నారు. ఆయనను ఎమ్మెల్యేను, చీఫ్‌విప్‌ను చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ విషయాలపై మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం సాక్షిగా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. -
రేవంత్‌రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రగతి భవన్ పేల్చాలన్న వాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ,మండలి మీడియా పాయింట్ల్లో బుధవారం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీతోపాటు పార్లమెంట్ స్పీకర్‌కు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ సంఘ విద్రోహ శక్తులు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. పేల్చేయడం, కూల్చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? దీనితో ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
కవిత సమక్షంలోనే కస్సుబుస్సు.. ‘రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానే..’
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో అధికార పార్టీ నాయకులు బజారున పడ్డారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మంత్రి సత్యవతి రాథోడ్, సీఎం కేసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే బహిర్గతమయ్యాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవనం ప్రారంబోత్సవానికి హాజరైన మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి బలప్రదర్శనకు దిగారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానేనని చాటిచెప్పేందుకు ఇదదరూ తీవ్రంగా ప్రయత్నించారు. అనుచరగణాన్ని రెచ్చగొట్టి వారిమధ్య ఉన్న వైరాన్ని బహిర్గతం చేసుకున్నారు. పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేశారు. ఎవరి గోల వారిదే బిఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవన శిలాఫలకం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. శిలాఫలకంపై ఎమ్మెల్సీ మదుసూధనాచారి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి పేరు లేకపోవడంతో వారిద్దరి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీ చారికి, జడ్పీ చైర్మన్ శ్రీహర్షిణికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తామేమి తక్కువ కాదన్నట్లు గండ్ర అనుచరులు సైతం నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంత ఇరువర్గాల నినాదాలు, గోలతో కార్మికసంఘ భవనం వర్గపోరుకు వేదికలా మారిపోయింది. వేదికపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసిఆర్ తనయ కవిత అవాక్కయ్యారు. ఘర్షణ పడుతున్నవారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నివురు గప్పిన నిప్పు వాస్తవానికి భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనాచారిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చేయిచ్చి కేసిఆర్ సమక్షంలో కారెక్కారు గండ్ర వెంకటరమణారెడ్డి. రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అంతర్గత విబేధాలు మాత్రం అలానే ఉన్నాయి. గులాబీ దళపతి ఎవ్వరిని తక్కువ చేయకుండా ఓడిపోయిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో బయటపడడం పార్టీలో కలకలం సృష్టించింది. వీరి గొడవ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. కారులో అసంతృప్తి ఎమ్మెల్యే గండ్ర మీద జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనను భూపాలపల్లికి చెందిన పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆమె బాహాటంగానే విమర్శలు చేశారు. భూపాలపల్లికి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి అయితే వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చి స్థానికులకు ప్రాధాన్యత లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇంఛార్జీ పుట్ట మధు అనుచరురాలుగా ముద్రపడ్డ శ్రీహర్షిణికి భూపాలపల్లిలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే చర్చ సాగుతోంది. భూపాలపల్లి బీఆర్ఎస్లో విబేధాలకు రాబోయే ఎన్నికలే కారణంగా జనం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గండ్ర బిఆర్ఎస్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతుండగా ఎమ్మెల్సీ చారి సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరిపై మరొకరిపై చేయి సాధించేందుకు పోరు సాగిస్తున్నారట. ఇప్పటికే సిట్టింగ్‌లకే టిక్కెట్ ఇస్తామని గులాబీ దళపతి ప్రకటించడంతో ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని టిక్కెట్ పొందే పనిలో చారి ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబం నుంచి భూపాలపల్లి చేజారిపోకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే...తన భార్య గండ్ర జ్యోతిని బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కవిత సమక్షంలో బయటపడ్డ బీఆర్ఎస్ వర్గపోరు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు విబేధాలతో రచ్చకెక్కారు. మధుసూదనాచారి, గండ్ర మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల సాక్షిగా బయటపడింది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత పర్యటనలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో.. కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అయితే.. జిల్లాకు చెందిన నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణరెడ్డిలు బలప్రదర్శనలు దిగారు. ఈ క్రమంలో శిలాఫలకం మీద మధుసూదనాచారి పేరు లేదని ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈలోపు గండ్ర వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. ఆపై తోపులాటకు దిగాయి. దీంతో పోలీసులు, ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దే యత్నం చేశారు. -
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్.. మాజీ స్పీకర్ VS సిట్టింగ్ ఎమ్మెల్యే
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్ మొదలైందా? మాజీ స్పీకర్‌కు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య పోరు షురూ అయిందా? టీఆర్ఎస్ నాయకత్వం ఎవరికి మద్దతిస్తోంది? భూపాలపల్లిలో అధికార పార్టీ తరపున పరీక్ష రాసేదెవరు? సీటు రానివారి పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లిలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లిలో అధికార పార్టీలో సెగలు మొదలయ్యాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సిటింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య సీటు కోసం పంచాయతీ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఎమ్మెల్సి మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. సారు రావాలి.. మీరు కావాలి అంటూ ఆయన అనుచరులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరపడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మధుసూదనాచారి భూపాలపల్లి నుండి మళ్ళీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సూచనల ప్రకారమే చారి మళ్ళీ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి? 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోవడం, తర్వాత గండ్ర అధికార పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో చారి భూపాలపల్లి నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి, ముఖ్యమంత్రి మాట మేరకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ మాట జవ దాటకుండా ఉండి మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి పదవి పొందారు. భూపాలపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ చేయించిన సర్వేలో వెల్లడైందన్న వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి. బర్త్‌డే పాలిట్రిక్స్? మాజీ స్పీకర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆలోచన ప్రజల్లో మొదలైనట్లుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో చారీ పట్ల మళ్ళీ ఆదరణ మొదలైందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే మధుసూదనాచారి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం...ఎమ్మెల్సీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుతుండటంతో ఆయన వర్గం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నియోజకవర్గ వ్యాప్తంగా మధుసూదానాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటంతో భూపాలపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో మధుసూదనాచారి మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే చేస్తున్న వాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే పరీక్ష రాయబోతున్న మీ సహాయ సహకారాలు కావాలి అనడం, ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదే అని మాట్లాడుతుండటంతో భూపాలపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. స్థానికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మొదలవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మధుసూదనాచారి మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల పరీక్షలో రాసేదెవరో.. ఉత్తీర్ణులయ్యేదెవరో అన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా జరుగుతోంది. -
నేనేమైనా వృద్ధుడినా.. సీటు నాదే.. గెలుపు నాదే..
జయశంకర్ భూపాలపల్లి: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. నేనే గెలుస్తా.. సీటు నాదే.. గెలుపు నాదే.. ఇక చర్చలు ఆపండి.. నేనేమైనా వృద్ధుడినా, మంచి ఆరోగ్యంగా ఉన్నాను. చక్కగా ప్రజలకు సేవలు అందించగలిగే సామర్థ్యం, ఓపిక ఉంది.. నన్ను ఒక్కడిని గెలిపిస్తే.. నేను, నా సతీమణితో పాటు జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నాం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నంటిని నెరవేరుస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని అన్నారు. త్వరలోనే గోరికొత్తపల్లి మండలంగా ఏర్పడబోతుందని తెలిపారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.168కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఇందుకు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వంద పడకల ఆస్పత్రిలో 71పోస్టుల మంజూరుకి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అంగీకరించారని, త్వరలోనే నియామకాలు జరుగుతాయని తెలిపారు. భూపాలపల్లిని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. చెల్పూరు నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబులగడ్డ వరకు జాతీయ రహదారి విస్తరణ, సైడ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.15కోట్లతో చేపట్టిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు. వర్షాలు తగ్గాక భూపాలపల్లికి వస్తానని సీఎం కేసీఆర్ చెప్పాడని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సుమారు రూ.3కోట్లతో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టగా కొందరు కావాలని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేవుడి గుడి నిర్మించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు, జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు కొక్కుల తిరుపతి, నూనె రాజు, క్యాతరాజు సాంబమూర్తి, ముంజాల రవీందర్, పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, మాడ హరీశ్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘కేసీఆర్ రైతుబంధు’గా పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పంట సీజన్ రాగానే రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మానేశారని, వ్యవసాయాన్ని వదిలేసిన వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో ఆలోచించి ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చిందన్నారు. ఇలా దేశానికి స్ఫూర్తిదాయకమైన ఈ పథకానికి ‘కేసీఆర్ రైతుబంధు’గా నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు కావడంతో తమ నియోజకవర్గమైన భూపాలపల్లికి 31 ఏళ్ల కిందట కాలువలు తవ్వినా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో 150 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయన్నారు. విమర్శలు చేసే వారంతా ఈ ప్రాజెక్టును చూస్తే వారి అభిప్రాయం మారిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఓసారి ప్రాజెక్టును చూసి రావాలని సూచించారు. ధాన్యం ఇతర పంటలను ఎక్స్‌పోర్టు చేసేందుకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిశాక కూడా కొత్త పథకాలు బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని, పట్టణాభివృద్ధికి చర్యలు వేగవంతం చేశారన్నారు. వరంగల్ లాంటి పట్టణాల్లో ఐటీ విస్తరణకు మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా ఎన్నికల ముం దు పథకాలు తీసుకురావడం సాధారణమని, కేసీఆర్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక కూడా కొత్తపథకాలు తెస్తున్నారన్నారు. సరిపడా విద్యుత్, నీరు అందుబాటులో ఉండటం వల్ల భూములు అమ్మకుండా వ్యవసాయం చేస్తు న్నారని పేర్కొన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూమి లభించట్లేదన్నారు. -
అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కింద ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో లేని మాంద్యం ఇప్పుడెలా వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో ఎక్కడా మాంద్యం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కానీ ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం 15 నెలల నుంచి మాంద్యం ఉందని చెప్పి బడ్జెట్‌కు కోత పెట్టారని విమర్శించారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు 30 శాతం తగ్గాయని చెబుతున్నారని, కానీ మాంద్యానికి ఇది ప్రామాణికం కాదని తెలిపారు. రెవెన్యూ మిగులు ఉన్న సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో కీలకమైన విద్యా శాఖకు 24 శాతం, వైద్యానికి 25 శాతం, గ్రామీణాభివృద్ధికి 32 శాతం తక్కువగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం చూసే చేరాం: ఎమ్మెల్యే గండ్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచారని తెలిపా రు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోందని, దాన్ని చూసే 12 మంది కాంగ్రెస్ సభ్యులం టీఆర్ఎస్లో చేరామన్నారు. -
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..
సాక్షి, నాగర్ కర్నూల్/నిజామాబాద్/భూపాలపల్లి : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో కొద్దిపాటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమకు కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారంటూ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు పార్టీని వీడతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీంతో కొందరు నేతలు మీడియాకు ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తుచేశారు. తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాంటి ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉంది.. తనకు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి రానందకు అసంతృప్తి లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తాను ఎవరిని నమ్ముతానో వారితోనే చివరి వరకు ఉంటానని తెలిపారు. టీఆర్ఎస్లో పదవుల కోసం చేరలేదు : గండ్ర మంత్రివర్గ ఏర్పాటుపై తాను అసంతృప్తితో ఉన్నట్టు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పదవుల కోసం రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై పట్ల నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్టు చెప్పారు. పదవుల కన్నా పార్టీని బలోపేతం చేయడంపై తన దృష్టి ఉందని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సుల వల్లే తన కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు. తను అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. భూపాలపల్లి బస్‌డిపోకు నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సును నడిపి ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా నివ్వెరపోయారు. అందరూ బస్సు వద్దకు వచ్చి చూడ సాగారు. పచ్చడి బాగుందే అక్కా.. బాగున్నారా? అందరూ పచ్చడే తెచ్చుకున్నారా? మీతో నాకూ కాస్త వడ్డించండి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరి నాటు కూలీలతో కలసి రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. బుధవారం ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కూలీలు రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వారిని చూసిన ఎమ్మెల్యే కారు ఆపి కూలీలతో మాట్లాడారు. మీతోపాటు నాకూ వడ్డించండి అని కూలీలతో కలసి భోజనం చేశారు. పచ్చడి బాగుందంటూ కితాబిచ్చారు. -
జయశంకర్ సార్ యాదిలో..
సాక్షి, భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ తన గురువని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఎప్పుడూ చెప్పేవారని, ఆయన సూచనల మేరకే తాను టీఆర్ఎస్లో చేరానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ తన తండ్రి క్లాస్మేట్ అని, సార్ వద్ద తాను కొద్ది రోజులు చదువుకున్నానని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. సీఎం కే.చంద్రశేఖర్‌రావుకు కుడి భుజంలా ఉండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని గుర్తు చేశారు. సార్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారన్నారు. జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. మొక్కలు నాటాలి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మంజూర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్ ఎకో పార్కు పనులను పరిశీలించారు. అనంతరం పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ పార్కులో మంచి సౌకర్యాలు కల్పించి భూపాలపల్లి వాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. వానలు సమృద్ధిగా కురువాలంటే ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పచ్చని వాతావరణం నెలకొనేలా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం తెలంగాణకు హరితహారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీ జాబితా 2019 బుక్‌లెట్‌ను మంత్రి దయాకర్‌రావు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ ప్రదీప్‌కుమార్‌శెట్టి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, ఎఫ్డీఓ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొత్త హరిబాబు, కటకం జనార్దన్, పైడిపెల్లి రమేష్, శిరుప అనిల్, పిల్లలమర్రి నారాయణ, ముంజాల రవీందర్, మంథెన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
కారెక్కుతున్న మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అయిదు నెలలు అవుతున్నా టీఆర్ఎస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సగం ఖాళీ అవగా...తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో కారెక్కనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 24న వీరంతా టీఆర్‌ఎస్‌లోచేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తాజా చేరికలతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ ముగ్గురు చేరికతో ఇక కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది. -
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డిపై విజయలక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ మహిళ విభాగం ఖండించింది. దీనిపై సోమవారం వారు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గండ్రను రాజకీయంగా ఎదుర్కొలేక.. టీఆర్ఎస్ అతని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విజయలక్ష్మి అసత్య ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము డీజీపీని కలువనున్నామని తెలిపారు. 2019లో గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ టార్గెట్ చేసి రాజకీయంగా బలహీన పరచాలని చూస్తోందని ఆరోపించారు. నీచ రాజకీయాలకు మహిళలను వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. గండ్ర సతీమణి జ్యోతి మాట్లాడుతూ.. తన భర్తపై అసత్య ప్రచారం చేయడం ద్వారా ఆయన గెలుపు అవకాశాల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఆడంగి రాజకీయాలు చేయకుండా.. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కొవాలని సవాలు విసిరారు. ఓ మాయ లేడీ మాటలు నమ్మి, మమల్ని నిందిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లాయర్ సునీతా రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని గెలుపు గుర్రాలను అడ్డుకునేందుకే టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించని టీఆర్ఎస్ వారిని ఇలాంటి వ్యవహారాల్లో వాడుకుంటుందన్నారు. విజయలక్ష్మీపై కేసు నమోదు తనపై విజయలక్ష్మీ చేసిన ఆరోపణలను గండ్ర ఖండించారు. ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, వేధింపులకు గురి చేస్తుందని గండ్ర పేర్కొన్నారు. దీనిపై ఆయన ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గండ్ర ఫిర్యాదు మేరకు పోలీసులు 384, 506 సెక్షన్ల కింద విజయలక్ష్మీపై కేసు నమోదు చేశారు. ‘గండ్ర’పై విజయలక్ష్మీ ఆరోపణలు -
‘సింగరేణి ఎన్నికల్లో నైతిక విజయం మాదే’
-
‘సింగరేణి ఎన్నికల్లో నైతిక విజయం మాదే’
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... బలుపును చూసి వాపు అనుకోవడం పొరపాటు అని అన్నారు. గనుల్లో టీబీజీకేఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని గండ్ర ఆరోపించారు. కొన్నిచోట్ల బెదిరింపులకు పాల్పడిందని, అధికార దుర్వినియోగంపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన అన్నారు. కాగా సింగరేణి ఎన్నికల్లో మొత్తం 17 కార్మిక సంఘాలు పోటీ పడగా, టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సీపీఐ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ల మధ్యే ప్రధాన పోటీ ఏర్పడింది. 11 డివిజన్లకుగానూ 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకుంది. ఏఐటీయూసీ రెండు డివిజన్లతో సరిపెట్టుకుంది. -
ఆ నలుగురే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు
► మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి రామగుండం(పెద్దపల్లి జిల్లా): తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్‌రావు మాత్రమే పాలిస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, అవి అటకెక్కడానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో మిగిలిన ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రిడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. -
అభివృద్ధిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: గండ్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, కలెక్టర్లతో జరిగిన సమీక్షాసమావేశమే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ నేత, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మన ఊరు– మన ప్రణాళిక అని.. గతంలో పట్టించుకోకుండా పక్కనబెట్టిన పాత ముచ్చటనే ఇప్పుడు కలెక్టర్లకు చెప్పార న్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారని, ఆ సంగతిని మరిచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విషజ్వరాలు, ఆరోగ్య సమస్యలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలో మందులు లేక గర్భిణులు చనిపోవడం బాధాకరమ న్నారు. వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
'కేసీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు. కేసులకు తాము భయపడేది లేదని, ఇప్పటికైనా కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆయన గురువారమిక్కడ హితవు పలికారు. తెలంగాణ వద్దు...ప్యాకేజీ ముద్దు అని తాము ఎన్నడు అనలేదని గండ్ర పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు సన్నాసులంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
రుణమాఫీపై కేసీఆర్ నిర్లక్ష్యం:గండ్ర
సాక్షి, హైదరాబాద్ : వర్షాలు కురుస్తున్నా, ఖరీఫ్ పనులు ప్రారంభమైనా పంట రుణాలను మాఫీ చేయడంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తక్షణమే రూ.6 వేల కోట్ల రుణ బకాయిలను విడుదల చేసి, రైతులను రుణ విముక్తులను చేయాలని, మెడిసిన్ ఎంట్రన్స్ పేపర్ లీక్ అయిందని వస్తున్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘గండ్ర’వి దివాళాకోరు రాజకీయాలు
కాంగ్రెస్‌లో ఉనికి కోసమే వెంకటరమణారెడ్డి ఆరోపణలు తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైంది టీఆర్ఎస్ జల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు గండ్ర సత్యనారాయణరావు, గండ్ర వెంకటరమణారెడ్డి, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగంతో అక్రమాలకు పాల్పడిన గండ్ర వెంకటరమణారెడ్డి ఉనికి కోసం స్పీకర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారాల్లో లబ్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు తక్కెళ్లపల్లి రవీందర్రావు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి అక్రమ వ్యాపారాల గు రించి జిల్లా ప్రజలందరికీ తెలుసని, ఆయ న చేసిన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హ యాంలో గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి ఆయనకు ఇప్పుడూ గుర్తుకువస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశా రు. తెలంగాణలో టీడీపీ ఎప్పుడో భూస్థాపితమైందని పేర్కొన్నారు. ఉనికిలేని టీడీపీకి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాటల్లో వాస్తవాలు లేవని అన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్, టీడీపీలు కలిసి చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్పీకర్ మధుసూదనాచారి నిత్యం ప్రజలకు అందుబాటు ఉం టూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం కృషి చేస్తున్న స్పీకర్‌పై, స్పీకర్ కుటుంబంపై దిక్కుతోచని స్థితిలో ఇద్దరు నేతలు విమర్శలు చేస్తున్నారని అ న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్ష నేతల మాటలను పట్టించుకోవడం లేదన్నారు. -
తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి
4.5 కోట్ల మంది ప్రజలను ఆయన మోసం చేశారు: గండ్ర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసగించినందుకు తలసానిపై సుమోటోగా చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర మీడియాతో మాట్లాడుతూ తలసాని రాజీనామాకు సంబంధించి తమకు మొదటి నుంచి అనుమానం రావడంతో ఆర్టీఐ ద్వారా వివరాలు కోరగా అసలు విషయం బయటపడిందన్నారు. రాజీనామా లేఖ ఇవ్వకుండానే, ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. తలసాని మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున గవర్నర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి చేత రాజీనామా చేయించకుండానే మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఏ రకమైన ఆదర్శ పాలనవుతుందని ఎద్దేవా చేశారు. తలసానిపై 420 కేసు పెట్టాలి: షబ్బీర్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు మంత్రి తలసానిపై తక్షణమే సుమోటోగా 420 కేసు నమోదు చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీని తలసాని అవమానపరిచారని మండిపడ్డారు. తలసాని దుశ్చర్యపై పార్లమెంటులో తమ పార్టీ తరఫున చర్చకు పట్టుబడుతామన్నారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో షబ్బీర్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతనే లేదని ధ్వజమెత్తారు. సీఎం ఓవైపు నీతి వాక్యాలు వల్లిస్తూ మరోవైపు రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్ నరసింహన్ పాత్రపైనా అనుమానం కలుగుతోందని షబ్బీర్ పేర్కొన్నారు. తలసాని రాజీనామా చేశారా లేదా అని గవర్నర్ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌కు నిజాయితీ ఉంటే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగరాదన్నారు. ఆయనకు పదవిలో ఉండే అర్హత లేదన్నారు. -
'ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేయలేదు'
-
కాంగ్రెస్‌కు క్రెడిట్ దక్కుతుందనే కేసీఆర్ ఆందోళన
హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదాల్చిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. అలాంటి ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ పనికిరాదనడం రాజకీయ దురుద్దేశమేనని గండ్ర వ్యాఖ్యానించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్‌కు క్రెడిట్ దక్కుతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని గండ్ర అన్నారు. అందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి కుట్రలు పన్నుతున్నారని, మహారాష్ట్ర సర్కార్ ప్రాణహిత చేవెళ్లకు గతంలోనే అంగీకరించిందని, ఇప్పుడక్కడ అధికారంలోకి వచ్చిన బీజేపీ వ్యతిరేకిస్తుందనడంతో కేసీఆర్ రాజీ పడుతున్నారని మండిపడ్డారు. తన కూతరు కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం బీజేపీతో కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారని గండ్ర ఆరోపించారు. -
'కమీషన్ కాకతీయగా మారింది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన మిషన్ కాకతీయ.. కమీషన్ కాకతీయగా మారిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ లో ఎన్ని పనులు జరిగాయో వెల్లడించాలని గండ్ర డిమాండ్ చేశారు. మొక్కుబడిగా పనులు చేసి కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 'మిషన్ కాకతీయ'పై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇద్దరు సీఎంలు ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారని గండ్ర వెంకట రమణారెడ్డి దుయ్యబట్టారు.