Gold Ornaments
-
ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధర!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా బంగారం ధరలు పెరుగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. కనకం ధర పాతికేళ్ల కాలంలో ఊహించని స్థాయిలో పెరిగి కొండెక్కింది. గురువారం మార్కెట్లో మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.79 వేల మార్కును దాటింది. 2000 సంవత్సరంలో తులం బంగారం రూ. 4,400 ఉండగా ఇప్పుడు రూ.79 వేలకు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో ఏ వస్తువుగానీ, లోహం ధరగానీ ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు. భారతీయులకు బంగారమంటే మక్కువ ఎక్కువ. శుభకార్యాలలో ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు ఆభరణాలను ధరిస్తుంటారు. కానుకలుగా బంగారం ఇస్తుంటారు.పెళ్లిళ్లలో అయితే తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5 తులాల బంగారం కట్నంగా పెట్టాల్సిందే. ఐదు తులాలు అంటే ప్రస్తుతం రూ. 4 లక్షలు అవుతుంది. ధర భారీగా పెరగడంతో సామాన్యులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. చాలామంది బంగారు ఆభరణాలను కొనలేని పరిస్థితిలో ఇమిటేషన్ జ్యువెలరీని ఆశ్రయిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలపై కామారెడ్డికి చెందిన మూడు తరాలవారితో ‘సాక్షి’ మాట్లాడింది. ఒక తరంలో ఉన్న ధరకు, తరువాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.నూరు రూపాయలుండే..నా పెళ్లి 1954 సంవత్సరంలో అయ్యింది. అప్పుడు బంగారం తులం నూరు రూపాయలు ఉండేది. అప్పుడు ధర తక్కువే అయి నా సంపాదన కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు ధరలు చాలా పెరిగి పోయాయి. బంగారం ధర వింటేనే భయమేస్తుంది.– పొగాకు నర్సుబాయి, కామారెడ్డితులానికి రూ. 1400 ఉండేది..నా పెళ్లి 1980 లో జరిగింది. అప్పట్ల తులం బంగారం ధర రూ. 1,400 ఉండేది. ఆ ధర ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది కానీ అప్పటిది అప్పుడు, ఇçప్ప టిదిప్పుడు అన్నట్టుగా నే ఉంది. బంగారం ధరలు బాగా పెరిగి, సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితికి చేరింది.– మైలారపు అంజలి, పొగాకు నర్సుబాయి కూతురు, కామారెడ్డితులానికి రూ.5,500 ఎక్కువ అనుకున్నం...నా వివాహం 2003 సంవత్సరంలో జరిగింది. అప్పుడు తులం బంగారం ధర రూ.5,500 ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ అనుకున్నం. తరువాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రూ.79 వేలు అంటుంటే ఆశ్చర్యపోతున్నాం. ఇరవై ఏళ్లల్లో ధర అడ్డగోలుగా పెరిగింది. – ముప్పారపు అపర్ణ, పొగాకు నర్సుబాయి మనవరాలు, కామారెడ్డి -
పూరీలో తెరుచుకున్న.. రత్నభండార్
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు. తరలింపు మరో రోజున‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది. -
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్‌కుమార్, లోక్‌నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
అసలే పెళ్లిళ్ల సీజన్.. బంగారం కొనడం కష్టమే.. ధర ఎంతో తెలుసా..
బంగారం ధర ఎప్పుడూ లేనంతగా రికార్డు గరిష్ఠాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీయ విపణిలో రూ.66,400 దాటింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేసిస్తున్నారు. కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో హెడ్జింగ్ కోసం పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. ధరలు భగ్గుమంటుండటం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది. గురువారం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,440గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,710గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది. -
తిరుమల శ్రీనివాసుడికి ఇన్ఫోసిస్ మూర్తి దంపతుల భారీ కానుకలు
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భారీ కానుకలు సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆదివారం(జూలై 16) తిరుమలకు చేరుకున్న నారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకంగా చేయించిన బంగారు కానుకలను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు గాను బంగారుతో ప్రత్యేకంగా శంఖం, కూర్మ ఆకృతులను తయారు చేయించారు. రెండు కేజీల పరిమాణంతో ఉన్న ఈ స్వర్ణాభరణాల విలువ కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి ➤ ఇన్ఫోసిస్ మూర్తిపై మహాభారత పాత్ర ప్రభావం.. అప్పట్లో కరుడుకట్టిన వామపక్షవాది! తిరుమల వేంకటేశ్వర స్వామిని సుధామూర్తి ఇష్టదైవంగా భావిస్తారు. ఏటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. తొలిసారి తాను 1953లో తిరుమల కొండకు వచ్చానని, అప్పటి నుంచి 70 ఏళ్లుగా తిరుమలకు వస్తున్నానని సుధామూర్తి తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి.. ప్రస్తుతం టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
బెంగళూరులో వర్ష బీభత్సం.. రూ.2 కోట్ల బంగారం కొట్టుకుపోయింది!
బెంగళూరు: గార్డెన్ సిటీగా పిలుచుకునే బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమానికి తీవ్రంగా నష్టపోయాడు. వివరాల్లోకి వెళితే.. మల్లీశ్వర్‌లోని 9వ క్రాస్‌లోని ఓ నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. కాసేపు తర్వాత అధికంగా వరద నీరు షాపులోకి రావడంతో అక్కడున్న బంగారు నగలు కొట్టుకుపోయాయి. దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే నష్టానికి కారణమని దుకాణం యజమాని ఆరోపిస్తున్నాడు. షాపులోని బంగారు ఆభరణాలు తడిసిపోయాయి.. కార్పొరేషన్‌కు ఫోన్ చేసి సహాయం కోరినా అధికారులు సాయం చేయకపోవడంతో 80 శాతం నగలు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయింది. వానల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోడంతో పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు ఇప్పటివరకు 600 వరకు ఫిర్యాదులు అందాయి. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ఆభరణాల శ్రేణి
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ ‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ఆవిష్కరించింది. భిన్న సమ్మే ళనం, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో రూపొందించిన ఈ ఆభరణ శ్రేణిలో ఉంగరాలు, చెవి రింగులు, బ్రాస్లైట్లు ఉన్నాయి. అరుదైన ఈ కలెక్షన్‌ను లెజెండరీ క్రికెటర్ సచిన్ 50వ సంవత్సరంలో, వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు గుర్తుగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తనిష్క్ రూపొందించిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. -
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్‌నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్‌కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్‌పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
విక్రమార్కుడు సీన్ రిపీట్.. నగలు ఇస్తే పూజలు చేసి ఇస్తామని చెప్పి
సాక్షి, మనోహరాబాద్(మెదక్): ఫకీర్‌లమంటూ వచ్చి మాయమాటలు చెప్పి, మందు చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో షేక్ సాదుల్ల, జరీనాబేగం నివసిస్తున్నారు. షేక్ సాదుల్లా చికెన్ దుకాణ వ్యాపారి. ఈనెల 15వ తేదీ ఉదయం దుకాణానికి వెళ్లాడు. అతను వెళ్లిన కొంతసేపటికి ఇద్దరు ఫకీర్లు వచ్చారు. మీ ఇంటికి నజర్ బాగా ఉంది పోవడానికి రూ.1100 ఇస్తే నజర్ తీసేస్తామంటూ, ఇంట్లోకి బలవంతంగా వచ్చి కూర్చున్నారు. నీ భర్త మరో మూడు రోజుల్లో చనిపోతాడు, అతడికి ఎమీ కావద్దంటే నీ బంగారు ఆభరణాలు ఇవ్వాలని జరీనా బేగంను భయపెట్టారు. నీకు బంగారం ముఖ్యమా? భర్త ఆరోగ్యం ముఖ్యమా? అని కంగారుపెట్టారు. ఆ భయంతో తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారపు నల్లపూసల దండ, తులం బంగారు చెవికమ్మలు, కాళ్లకు పెట్టుకున్న 15 తులాల వెండి పట్టీలు, 8 తులాల వెండిచైన్, 4 తులాల వెండి బ్రాస్లెట్, తులం వెండి ఉంగరాలు ఇచ్చింది. నగలు తీసుకున్న ఫకీర్లు జరీనాపై మందు చల్లడంతో సృహకోల్పోయింది. కొంత సేపటికి సృహ రావడంతో లేచి చూడగా వాళ్లు కనిపించలేదు, నగలు కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కడప కల్చరల్ : శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు...అంటున్నారు పురోహితులు. అవును మరి...వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ఉండవు. అందుకే తల్లిదండ్రులు హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూడక తప్పదు గనుక ఉన్నంతలో ఈ ముహూర్తాలకే తమ బిడ్డల పెళ్లిళ్లు కానిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముమూర్తాలు తక్కువ కావడం...ఉన్నా...కరోనా కారణంగా పెళ్లిళ్లు జరగకపోవడం, నిబంధనల కారణంగా వివాహాల సంఖ్య తగ్గడం, వాయిదాపడటంతో రెండేళ్లుగా పెళ్లి సందడి పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు విరివిగా ఉండడంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మార్మోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి.. జరుగుతున్నాయి.. ఈ నెల (మే) తర్వాత జూన్ మినహా (ఆగస్టులో కొద్దిగా) డిసెంబరు వరకు ముహూర్తాలు లేవు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారు ఆరు నెలలపాటు ఎదురు చూడటం మంచిది కాదన్న ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. పైగా ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా ఈ మధ్య కాలంలో మళ్లీ మన వైపు చూస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతోంది. ఆ.. ఏం కాదు...నిదానమే ప్రధానమని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. కానీ నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పలుచోట్ల డిసెంబరు వరకు కల్యాణ మండపాలు రిజర్వు అయిపోయాయి. డెకరేషన్, కేటరింగ్ తదితరాలకు కూడా టోకన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. గండం దాటుకుంటాం ఐదు నెలలుగా జరుగుతున్న వివాహాల వల్ల జిల్లాలో వ్యాపారాలు జోరందుకున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాక ధరలు రోజురోజుకు పెరుగుతున్నా పెళ్లిళ్ల కారణంగా డిమాండ్ తగ్గడం లేదు. వరుసగా రెండేళ్లపాటు దారుణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ వివాహాల ద్వారా కోలుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారాలు ఈ వివాహాల ద్వారానే జరిగాయి. దీంతో వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భయపెడుతున్న బంగారం రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని పిల్లల పెళ్లిళ్లకు సిద్ధమైన తల్లిదండ్రులు అవసరమైన బంగారం కొంటున్నారు. ప్రస్తుత ధరల్లో తులం బంగారంతో ఆభరణం చేయించాలంటే రూ. 55–60 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కానీ వివాహాలలో బంగారం ప్రధానపాత్ర పోషిస్తుండడంతో దాన్ని కొనేందుకు తల్లిదండ్రులకు తప్పడం లేదు. దీంతో ఇటీవల బంగారం ధర పెరిగినా కొనుగోలు కూడా పెరుగుతోందని వ్యాపారులు తెలుపుతున్నారు. రికార్డు స్థాయిలో గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలపాటు వరుసగా ఉండడంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల 18 వరకు మొత్తం 37 ముహూర్తాలు ఉండగా, జిల్లా వ్యాప్తంగా చిన్న, ఓ మోస్తరు వివాహాలు ఇప్పటివరకు ఐదు వేలు జరగ్గా, భారీ వివాహాలు దాదాపు 1000 వరకు జరిగినట్లు ఆయా వర్గాల సమాచారం. వీటి ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మే 18 నుంచి డిసెంబరు చివరి ముహూర్తంలోపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు వేల చిన్న, పెద్ద వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మరో రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. -
వారసత్వ కళావైభవం
పెళ్లి కుదిరిందంటే చాలు అలంకరణ వస్తువుల ఎంపికలో హడావిడి మొదలవుతుంది. వాటిలో అందమైన దుస్తులదే అగ్రస్థానం. నవ వధువు అన్ని సమయాల్లో అందంగా ఉండటం అంటే ఆమె భావి జీవితం ఆనందంగా ఉండబోతోందనడానికి సూచిక. పెళ్లిరోజు మాత్రమే కాదు ముందు జరిగే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత జరిగే రిసెప్షన్.. ప్రతి వేడుక ఘనంగా ఉండాలని చూస్తారు. అందుకు మరో ఎంపిక అవసరం లేని కళా వైభవాన్ని పంకజ్.ఎస్ డిజైన్లు అందిస్తాయి. రాచకళలో సమైక్యత రాజసం, కవిత్వం, ఆధ్యాత్మికం, కళాత్మకం గురించి ఒకేసారి వివరించాలంటే పంకజ్.ఎస్ డ్రెస్ డిజైన్స్‌ను చూస్తే చాలు. భారతీయ చిత్రకళా సోయగం, కళాకారుల పనితనానికి గౌరవం తన డిజైన్స్ ద్వారా చూపుతారని ఎవ్వరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కృష్ణ సౌందర్యం రాధాకృష్ణుల ప్రణయ సౌందర్యాన్ని డిజైన్స్‌లో రూపుకట్టాలంటే అందుకు ఇతిహాస ఘట్టాలు చాలా ప్రధానమైనవి అంటారు ఈ డిజైనర్. ఢిల్లీలోని నోయిడాలో ఉంటున్న ఈ డిజైనర్ తన డిజైన్స్‌కి ఉదయపూర్‌లోని కళాకారులచే శ్రీకృష్ణుని చిత్రాలను ఫ్యాబ్రిక్‌పై డిజైన్స్‌గా తీసుకున్నారు. రాధాకృష్ణుల నృత్యం, ఆవులు, మర్రి ఆకులు, ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని అంచులుగా కళ్లకు కడతారు. ఈ డిజైన్స్‌లో విలువైన పచ్చలు, ముత్యాలు, జర్దోసి, గోటాపట్టీలు గ్రాండ్‌గా అమరిపోతాయి. కృష్ణుడి గురించి శ్లోకాలను కాలిగ్రాఫిక్ పద్ధతిలో దారంతో తీసుకు వచ్చిన డిజైన్స్ వీటిలో చూడవచ్చు. శ్యామవర్ణంలో గొప్పగా అలంకరించిన బెనారసీ టిష్యూ చీరపైన యమునానది, నాట్యం చేస్తున్న నెమళ్లు, వికసించే తామరల మధ్య వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి చిత్రంతో భారీగా అలంకరించిన పల్లూ ఉంటుంది. బ్లౌజ్ డిజైన్స్ మీద జరీతో చేసిన నవరత్న భూషితమైన ఎంబ్రాయిడరీ నవవధువులను మరింత గ్రాండ్‌గా చూపుతాయి. -
అమ్మ చేసిన అలవాటు.. ఆయన 5 కిలోల ‘గోల్డ్‌మన్’
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఒంటిమీద కిలోలకొద్దీ బంగారం ధరించిన వ్యక్తులను మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వారిని ఆ ప్రాంతంలో గోల్డ్‌మన్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు మన వైజాగ్‌లో కూడా ఒక గోల్డ్‌మన్ ఉన్నాడు. ఆయనే సీతమ్మ ధారకు చెందిన ముక్క శ్రీనివాస్. ఆయన నిత్యం కనీసం కిలో బంగారాన్ని ధరిస్తారు. ఆయన వద్ద మొత్తంగా 5 కిలోల బంగారం ఉందట. చిన్నప్పుడు అతికోపిష్టి అయిన శ్రీనివాస్‌కు కోపం తగ్గాలని వాళ్ల అమ్మ ఆయనకు చైను, రెండు ఉంగరాలు నిరంతరం పెట్టేదట. అప్పటి నుంచి అది అలవాటుగా మారి శ్రీనివాస్ ఇప్పుడు గోల్డ్మన్గా అవతరించాడు. బీచ్‌రోడ్డులో ఓ కార్యక్రమంలో ఆయన్ను సందర్శకులు ఎంతో ఆసక్తితో గమనించారు. చదవండి👉🏻 చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్.. -
భర్త వర్క్ ఫ్రం హోమ్‌లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో.
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ఇంట్లో చొరబడిన ఓ మహిళ బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగిలించగా సీసీ కెమెరాల ఆధారంగా కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఎస్ఐ శ్యాంబాబు వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి ఎల్ఐజీ గృహాల్లో నివాసమండే రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఈ నెల 22న వర్క్ ఫ్రంహోంలో భాగంగా బెడ్రూమ్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. అతని భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. చదవండి: అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మక్కల లక్ష్మి అలియాస్ హలీమా బేగం (36) రాజేశ్వర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఫోన్‌ను దొంగిలించి పారిపోయింది. రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ సి కెమెరాల ఆధారంగా శనివారం లక్ష్మిని అదుపులో తీసుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా అరెస్టయిన లక్ష్మి శేరిలింగంపల్లిలో నివాసముంటూ గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
బంగారంపై జీఎస్టీ తగ్గించండి
ముంబై: ఆభరణాల పరిశ్రమపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రస్తుత 3 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బడ్జెట్ ముందస్తు సిఫారసులు చేస్తూ బంగారం, విలువైన లోహాలు, రత్నాలు అటువంటి వాటితో తయారు చేసిన ఆభరణాలపై ఆదాయ సమానత్వ సూత్రం ఆధారంగా 1.25 శాతం జీఎస్టీ రేటును అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ భారతదేశంలోని అనేక కుటుంబాలు పాన్ కార్డులను కలిగి ఉండవని, ఈ పరిస్థితుల్లో అవసరమైన సమయాల్లో అవసరమైన కనీస ఆభరణాలను పొందడంలో వారు ఇబ్బందుల పడుతున్నారని తెలిపింది. ఈ ఇబ్బందులను ఎదుర్కొనడంలో భాగంగా పాన్ కార్డ్ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని ఆర్థికమంత్రిని కోరింది. ఏ శాఖ అధికారులు ప్రశ్నించకుండా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్) కింద ఒక వ్యక్తి డిపాజిట్ చేయగలిగే బంగారం కనీస పరిమాణంపై తగిన స్పష్టత ఇవ్వాలనీ కేంద్రానికి కోరింది. 22 క్యారెట్ల బంగా రు ఆభరణాల కొనుగోలు కోసం రత్నాలు,ఆభరణాల పరిశ్రమకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (ఈఎంఐ) సౌకర్యాన్ని అనుమతించాలని పరిశ్రమ సంఘం అభ్యర్థించింది. మహమ్మారి నేపథ్యంలో పరిశ్రమ వ్యాపార పురోగతికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. చదవండి: ‘ద్విచక్ర వాహనాలు లగ్జరీ కాదు. జీఎస్టీ తగ్గాల్సిందే’ -
అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పెళ్లికి పిలవడానికి స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లోనే రూ.11 లక్షల విలువచేసే బంగారు నగలను అపహరించిందో యువతి. ఈఘటన జేజే.నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవరజీవనహళ్లి నివాసి అజీరా సిద్దిక్ నిందితురాలు. పాదరాయనపుర నివాసి రోహినాజ్ అనే మహిళ ఇంటికి అజీరా ఈ నెల 14న సోదరుని పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లింది. అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని బీరువా ఉన్న గదిలోకి వెళ్లింది. అక్కడ 206 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేసింది. రోహినాజ్ మరుసటి రోజు చూడగా నగలు కనిపించలేదు. దీంతో జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, అజీరాను గట్టిగా ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. నగలను ఆమె ఇంటిపైన నీటి ట్యాంకర్ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉద్యోగుల ఆందోళన వాయిదా -
పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్
సాక్షి, నరసాపురం (ప.గో): అరబ్ దేశాల్లో తయారయ్యే బంగారు ఆభరణాల డిజైన్లు రోజుల వ్యవధిలోనే పసిడి ప్రియుల కోసం అక్కడి గోల్డ్ మార్కెట్లో రెడీగా ఉంటాయి. జ్యూయలరీ అయినా, గోల్డ్ బిస్కట్లయినా అక్కడి నుంచే రాష్ట్రంలోని చాలా షాపులకు సరఫరా అవుతుంటాయి. అందుకే నరసాపురం గోల్డ్ మార్కెట్ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన జిల్లాలో గోల్డ్ మార్కెట్‌ను శాసిస్తున్న ఈ పట్టణం తెలుగు రాష్ట్రాల్లోనే నాణ్యమైన బంగారం బిజినెస్‌కు పెట్టిందిపేరు.. శతాబ్దం పైనుంచే మేలిమి బంగారాన్ని వినియోగదారులకు అందిస్తున్న ఇక్కడి మార్కెట్ ఉభయ గోదావరి జిల్లాల్లో హోల్‌సేల్ వ్యాపారానికి పేరుపడింది. అందుకే కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం మార్కెట్లో ఇక్కడి వర్తకులు సత్తా చాటుతున్నారు. 1920లలో బంగారం వ్యాపారానికి పునాది దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే నరసాపురం బంగారం వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. 1920 ప్రాంతంలో ఇక్కడ పసిడి మార్కెట్‌ను ప్రారంభించారు. రాజస్థాన్‌కు చెందిన కొన్ని జైన్ కుటుంబాలు బ్రిటిష్ హయాంలో ఇక్కడ స్థిరపడ్డారు. మొదట తాకట్టు వ్యాపారం ప్రారంభించిన జైన్లు తరువాత కాలంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం తరువాత కాలంలో భారీగా విస్తరించింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 400 వరకూ జ్యూయలరీ షాపులు ఉండగా ఒక్క నరసాపురంలోనే 150 వరకూ షాపులు ఉన్నాయి. రిటైల్ వ్యాపారమే కాదు.. ఇక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని షాపులకు హోల్‌సేల్‌గా బంగారం సప్లయ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జ్యూయలరీ షాపులకు కూడా ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు బంగారం, వెండి సప్లయ్ చేస్తారు. ఇందులో బిస్కెట్ల నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఉంటాయి. పలు కార్పొ రేట్ షాపులకు కూడా ఇక్కడి డీలర్లు సప్లయ్ చేస్తుంటారు. నరసాపురం కేంద్రంగా రోజుకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ వ్యాపారం సాగుతుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో వ్యాపారం రోజుకు మరో రూ.2 నుంచి రూ.3 కోట్లు అదనంగా ఉంటుంది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా బ్రిటిష్ వారి హయాంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లో ఉండేది. బంగారు బిస్కెట్ల అమ్మకాలకు కొందరికే అనుమతి ఉండేది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు నరసాపురం వచ్చేవారని చెబుతారు. ముఖ్యంగా జల రవాణా సౌలభ్యం ఉండటంతో వేరే రాష్ట్రాల వ్యాపారులు అక్రమంగా ఇక్కడకు బంగారం తరలించి అమ్మకాలు చేసేవారని ప్రచారం ఉంది. ఆ సమయంలోనే నరసాపురం బంగారం వ్యాపారానికి పేరుపడింది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా ప్రారంభమైంది. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడి వ్యాపారులు అందిపుచ్చుకున్నారు. దుబాయ్, సింగపూర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, అమృత్సర్ ఇలా దేశ, విదేశాల్లో తయారయ్యే అధునాతన డిజైన్లు రోజుల వ్యవధిలోనే ఇక్కడి వ్యాపారులు తయారుచేసేవారు. 30 మంది వరకూ హోల్‌సేల్ వ్యాపారులు.. నరసాపురంలో 30మంది వరకూ హోల్‌సేల్ వ్యాపా రులు ఉన్నారు. వీరికి నరసాపురం కేంద్రంగా ముంబై, చెన్నై, కోల్‌కతాలో అనుబంధ కార్యాలయాలు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని జ్యూయలరీ షాపుల నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు బంగారం, వెండి తెప్పిస్తారు. వెండి ఆభరణాల తయారీకి దేశంలో తమిళనాడులోని సేలం ప్రసిద్ది. తరువాత స్థానంలో నరసాపురం ఉండటం మరో విశేషం. మన రాష్ట్రంలో వెండి హోల్‌సేల్ వ్యాపారం నరసాపురం నుంచే పెద్దస్థాయిలో జరుగుతుంది. గోల్డ్ ఎగ్జిబిషన్లో నరసాపురం స్టాల్స్ ప్రతీఏటా జులై–నవంబర్ మాసాల మధ్యలో ముంబైలో ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు లాటిన్ అమెరికా, జర్మనీ నుంచి కూడా కస్టమర్లు ఇక్కడకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్లో నరసాపురం వ్యాపారుల స్టాల్స్‌కు మంచి క్రేజ్. దీంతో నరసాపురం పసిడి ఖ్యాతి ప్రపంచ గుర్తింపు పొందింది. జిల్లా ప్రజలతో జైన్లు మమేకం బంగారం వ్యాపారం కోసం గణేష్మల్, శాంతలాల్, జోట్మల్ నట్మల్, గులాబ్‌చంద్ కుటుంబాలు వచ్చాయి. ప్రస్తుతం నరసాపురంలో 94 జైన్ కుంటుంబాలు ఉన్నాయి. జిల్లాలోని మరికొన్ని పట్టణాలకు కూడా వీరి వ్యాపారం విస్తరించింది. బంగారంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా వీరు స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్ల కష్టం దాగిఉంది నరసాపురం పేరు చెబితే ఇప్పుడు బంగారం పేరు గుర్తుకువస్తుంది. ఓ వ్యాపారం ద్వారా ఊరికి పేరు రావడం గొప్ప విషయం. దీని వెనుక కొన్ని జైన్ కుటుంబాల సంవత్సరాల కష్టం దాగిఉంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడి ప్రజలతో వారు ఏర్పర్చుకున్న బంధం, సేవా దృక్పథం ఈ ఉన్నతికి కారణం. భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగాలి – సీహెచ్ రెడ్డప్ప ధవేజీ, వ్యాఖ్యాత, నరసాపురం అన్ని డిజైన్లూ దొరుకుతాయి ఏ మోడల్ ఆభరణం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అందుకే దూరప్రాంతాల్లో ఉన్న చుట్టాలు కూడా ఎప్పుడైనా బంగారం కొనాలనుకుంటే ఇక్కడకు వచ్చి మా ఇళ్లలో ఉండి కొనుక్కుని వెళతారు. ఫోన్లు చేసి బంగారం రేటు ఎంతుందో కనుక్కోమంటారు. ఈ ప్రాంతంలోని అందరి ఇళ్లలోనూ ఇవే అనుభవాలు. బంగారానికి మా ఊరు పెట్టిందిపేరు. – మేకల కాశీఅన్నపూర్ణ, గృహిణి, నరసాపురం మా పెద్దల కృషే కారణం నరసాపురం బంగారం వ్యాపారానికి పేరు రావడానికి కారణం మా పెద్దలు చేసిన కృషే. 1980లో రెడీ మేడ్ ఆభరణాల రాకతో వ్యాపారం బాగా పెరిగింది. దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్‌కు చాలాసార్లు వెళ్లాను. మా ఆభరణాలకు అక్కడ మంచి పేరుంది. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
Hyderabad: రెండు కేజీల బంగారు నగల బ్యాగు మిస్సింగ్
హైదరాబాద్: నగరంలో భారీ ఎత్తున్న బంగారం అదృశ్యమైన కేసు నమోదు అయ్యింది. ముంబై నుంచి తీసుకొస్తున్న రెండు కేజీల బంగారు నగల బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ముంబై బోరివాలి(ముంబై) నుంచి ఆభరణాలు ఉన్న బ్యాగుతో సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. అమీర్‌పేట్ వచ్చేసరికి మెలుకువ రావడంతో చూడగా.. బ్యాగ్ కనిపించలేదు. దీంతో విషయాన్ని ముంబైలోని నగలవ్యాపారికి తెలియజేశారు. అతను సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించగా.. కేసును పంజగుట్ట పోలీసులకు బదలాయించారు. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కే నాగయ్య.. బృందాలుగా విడిపోయిన పోలీసులు బోరివాలి-హైదరాబాద్ మధ్య సీసీటీవీఫుటేజీల ఆధారంగా కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. -
‘ఆభార్’ కలెక్షన్‌ను లాంఛ్ చేసిన రిలయన్స్ జువెల్స్
ముంబై: రిలయన్స్ జువెల్స్ 14 వ వార్షికోత్సవ సందర్బంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న జువెలరీ కలెక్షన్‌కు ‘ఆభార్’ ను ఎక్స్‌టెన్షన్‌గా లాంచ్ చేసింది. ఈ కలెక్షన్ లాంచ్‌తో కస్టమర్లకు, ఉద్యోగులకు, కళాకారులకు రిష్తోన్కాధాగా అనే థీమ్‌తో కంపెనీ కృతజ్ఞతలను ప్రకటించింది. ఆభార్ కలెక్షన్లో భాగంగా సరికొత్త జువెలరీ కలెక్షన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఈ కలెక్షన్లో అద్బుతమైన బంగారం, వజ్రాల ఇయర్ రింగ్స్ కొత్త డిజైన్లు కస్టమర్లకు లభించనున్నాయి. రిలయన్స్ జువెల్స్ జూలై 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం మేర స్పెషల్ యానివర్సరీ తగ్గింపును ప్రకటించింది. #RishtonKaDhaga అనే మల్టీ మీడియా క్యాంపెన్తో రిలయన్స్ జువెల్స్ తమ కస్టమర్లకు, ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చింది. ఈ సందర్బంగా రిలయన్స్ జువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ జువెల్స్ను ఆదరిస్తోన్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆభార్ కలెక్షన్‌తో రిలయన్స్ జువెల్స్‌కు, కస్టమర్లకు ఉన్న బంధం మరింత బలపడుతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి సొంతింట్లో లూటీ, టైం చూసి జంప్
తాడిపత్రి : బంగారం అపహరణ కేసులో మిస్టరీని తాడిపత్రి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య వెల్లడించారు. తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు సమీపంలో పక్కపక్క ఇళ్లలో సోదరులు హాజీవలి, షాజహాన్ నివాసముంటున్నారు. ఈ ఏడాది మే 22న ఈ రెండు ఇళ్లలో రూ.7.50లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సొంతింటికే కన్నం షాజహాన్ భార్య షాహీనా. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికంగా ఉండే బాలబ్రహ్మయ్యతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉండాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం మే 22న తన ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పొరుగున ఉన్న తన బావ ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలను బ్రహ్మయ్యకు అందజేసి, ఏమీ తెలియని దానిలా ఇంటిలోనే ఉండిపోయింది. ఈ కేసు విచారణ దశలో ఉండగానే.. అదే నెల 28న కుమార్తెతో కలిసి షాహీనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో భార్య కనిపించడం లేదంటూ షాజహాన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడిన చిక్కుముడి షాహీనా కనిపించడం లేదంటూ భర్త షాజహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ ఖాజాహుస్సేన్ అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన చోరీకి, ఆమె కనించకుండా పోవడానికి కారణాలను అన్వేషిస్తూ వెళ్లారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఆమె ఆచూకీ పసిగట్టారు. ఈ నెల 23న మార్టూరుకు చేరుకుని షాహీనాతో పాటు ఆమె ప్రియుడు బాలబ్రహ్మయ్యను అరెస్ట్ చేసి తాడిపత్రికి పిలుచుకువచ్చారు. చోరీ చేసుకెళ్లిన 16 తులాల బంగారు నగలతో పాటు 600 గ్రాముల వెండి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.50 లక్షలుగా ఉంటుంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, కేసులో మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు. -
24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్ మార్కింగ్‌కు ఎంపిక జరిగింది. జూన్ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ల్లో 19 జిల్లాల చొప్పున హాల్ మార్కింగ్ అమలవుతోంది. ► ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు. ► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది. ► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు. ► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్‌మార్కింగ్‌తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు. ► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్ మార్కింగ్ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు. ► నిజానికి 2000 ఏప్రిల్ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ స్కీమ్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండెర్డ్స్) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్‌మార్కింగ్ అమలు జరుగుతోంది. ► భారత్‌లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేసినవారు. ► భారత్ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి 34.6 బిలియన్ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి. ► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు భారీగా పెరిగి 6.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599 కోట్లు. ► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్, మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్ డాలర్లకు చేరింది. -
మూడు వారాల కింద పెళ్లి.. పాలల్లో మత్తు మందు కలిపి
లక్నో: పెళ్లి జరిగిన మూడు వారాలకు కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తు మందు ఇచ్చిన కొత్త కోడలు పట్టుచీరలు, నగలతో పరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని బాహ్ సిటీలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు ఈ నెల 7న శాలిని (20)తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన మూడు వారాల పాటు శాలిని తన భర్త, అత్తింటి వారితో బాగానే కలిసిపోయినట్లు నటించింది. కాగా సోమవారం రాత్రి భర్తకు, అత్తమామలకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చింది. వాళ్లు ఆ పాలు తాగి మత్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన నగలు, బట్టలు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. కాగా ఉదయం నిద్ర లేచి చూసేసరికి శాలిని ఇంట్లో కనిపించలేదు.దీంతో ఉపేంద్ర, అతని తల్లిదండ్రులు ఇళ్లుతో పాటు చట్టుపక్కల వెతికినా ఆమె జాడ తెలియలేదు. అనుమానం వచ్చి ఇంట్లోని బీరువా తీసి చూడగా అందులోని విలువైన నగలు, చీరలు మాయమయ్యాయి. దాంతో కొత్త కోడలే ఈ పని చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు -
జూన్ నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్ 1 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. విలువైన మెటల్‌కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెర్చువల్‌గా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వినియోగ వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం, పసిడి ఆభరణాలు, కళాఖండాలపై 2021 జనవరి 15 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్కింగ్ విధానంలోకి మారడానికి, ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ (బీఐఎస్)తో తమకుతాము రిజిస్ట్రర్ కావడానికి ఆభరణాల వర్తకులకు ఏడాదికి పైగా సమయం ఇచ్చింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో హాల్‌మార్కింగ్ విధానం అమలుకు వర్తకులు చేసిన విజ్ఞప్తి చేశారు. -
బంజారాహిల్స్‌లో పని మనిషి అరెస్టు
బంజారాహిల్స్: నమ్మకంగా పని చేస్తున్నట్లు నటించి ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన ఘట నలో నిందితురాలిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14 లోని ఇన్కమ్ ట్యాక్స్ క్వార్టర్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే ఉదయ్‌భాస్కర్ అనే అధికారి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన సరోజ అనే మహిళ కొంత కాలంగా పని చేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలపై ఆమె కన్ను పడింది. యజమాని లేని సమయంలో తొమ్మి ది తులాల బంగారు ఆభరణాలు తస్కరించి ఆ రోజు నుంచి పనికి రావడం మానేసింది. విషయం తెలుసుకున్న ఉదయ్‌భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు అనుమానితురాలు సరోజను తమదైన శైలిలో విచారించడంతో దొంగిలించిన సొమ్ము గురించి ఒప్పుకుంది. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఎస్ఐ భరత్ భూషణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా హైదరాబాద్‌లో దారుణం: సోదరిపై అత్యాచారం -
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటేసి వచ్చేసరికి ఇల్లు గుల్ల
బాలానగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇల్లుగుల్ల చేసిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ. వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ –1 లో ముక్కు పద్మ దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 11న బీరువాలో 5.5. తులాల బంగారు ఆభరణాలు దాచి పెట్టారు. అయితే.. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి వచ్చి బీరువా తెరచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.20లక్షల నగల్ని..
చెన్నై : ఆటోలో పోగొట్టుకున్న 50 సవర్ల నగలను తిరిగి సొంతదారునికి అప్పగించి తన నిజాయితీని ఆటో డ్రైవర్ చాటుకున్నాడు. ఈ ఘటన చెన్నై, క్రోంపేట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. క్రోంపేటకు చెందిన ఆల్బ్రైట్ వ్యాపారుల సంఘం నేత. ఇతని కుమార్తెకు గురువారం ఉదయం అదే ప్రాంతంలో వున్న చర్చిలో వివాహం జరుగనుంది. దీ నిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం రిసెప్షన్ జరుగనుంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చర్చి నుంచి ఆటోలో ఆల్బ్రైట్ ఇంటికి వెళ్లాడు. రూ. 20 లక్షల రూపాయలు విలువ చేసే 50 సవర్ల నగల సంచిని ఆటోలో పెట్టి మరిచి దిగి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తరువాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్బ్రైట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆటోలో నగల సంచి ఉండడం గమనించిన ఆటో డ్రైవర్ శరవణకుమార్ (30) ఆ నగలను తీసుకుని క్రోంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. నగలను పోలీసు లు సరి చూసి ఆల్బ్రైట్ నిర్ధారణ చేసిన తరువాత అతని చేతికి అందించారు. 50 సవర్ల నగలు తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్న శరవణ కుమార్‌కు పోలీసులు అభినందించారు.