grants
-
నెల రోజుల్లో పరిశీలన.. ఆపై ఉపకారవేతనాలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మార్చి 31తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా... మొత్తం 12,59,812 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో రెన్యువల్స్ 7,36,799 కాగా, ఫ్రెషర్స్ దరఖాస్తులు 5,23,013 ఉన్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గత సెపె్టంబర్లో ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ... డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావడంలో తీవ్ర జాప్యం జరగడంతో జనవరి 31 వరకు గడువు పొడిగించారు. కానీ అప్పటివరకూ అడ్మిషన్లు కొనసాగుతుండటంతో చివరి అవకాశం కింద మార్చి 31 వరకు గడువు పొడిగించారు. ఇప్పుడు దరఖాస్తుల గడువు ముగియడంతో అధికారులు వాటి అర్హత నిర్ధారణపై దృష్టి సారించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే సంక్షేమ శాఖలు అందుబాటులో ఉన్న నిధులను ముందుగా ఉపకారవేతనాలు విడుదల చేసి, ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. నెలరోజుల్లో పరిశీలన పూర్తి... ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలనకు సంక్షేమ శాఖలు నెలరోజుల గడువును నిర్దేశించుకున్నాయి. ఏప్రిల్ ఆఖరు కల్లా వీటిని పరిశీలించి అర్హులను నిర్ధారించాలని నిర్ణయించాయి. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ , వికలాంగుల సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు ముందుగా సంబంధిత కాలేజీ యాజమాన్యం యూజర్ ఐడీకి చేరతాయి. కళాశాల ప్రిన్సిపల్ దరఖాస్తులను పరిశీలించి వాటిని సంక్షేమాధికారికి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులను నిర్ధారిస్తారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి విద్యార్థి మీసేవా కేంద్రాల్లో వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తయ్యాక సంక్షేమ శాఖలు సదరు దరఖాస్తును ఆమోదిస్తాయి. ఈ ప్రక్రియ కోసం సంక్షేమ శాఖలు నెలరోజులు గడువు నిర్దేశించుకున్నప్పటికీ మరింత ఎక్కువ సమయం పడుతుందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. పరీక్షలు, ప్రిపరేషన్ నేపథ్యంలో విద్యార్థులు వేలిముద్రలు సమర్పించడంలో జాప్యం జరుగుతుందని, ఏటా ఇదే జాప్యం వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. -
Union Budget: కర్ణాటకకు కేంద్ర బడ్జెట్లో పెద్ద పీట
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు పెద్ద పీట వేసింది కేంద్రం. బడ్జెట్-2023లో వరాలు జల్లు కురిపించింది. కర్ణాటకలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు రూ.5,300 కోట్ల కేటాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగించారు. భద్ర ఎగువ తీర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల గ్రాంట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ప్రాజెక్టును మరింత బలోపేతం చేస్తుందని, చిత్రదుర్గతో సహా మధ్య కర్ణాటకలోని అనేక వర్షాధార వ్యవసాయ జిల్లాలకు వరం అవుతుందని, పైగా.. ప్రాజెక్టును త్వరగా, సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికలు ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. దీనికి కొనసాగింపుగా కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు వస్తాయని అంచనా వేయగా.. అందుకు తగ్గట్టుగానే వరాలు కురుస్తున్నాయి. -
Kurnool District: గ్రామీణ ప్రాంతాల్లో మందగించిన పన్ను వసూళ్లు
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులను సమీకరించుకోవడం, పన్ను వసూళ్లు, ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించిన నిధుల పరిపుష్టితోనే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుత పాలకవర్గాలు ఆ దిశగా అడుగులు వేయకుండా, కేవలం ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతుండటంతో అభివృద్ధి నిదానించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులకు తోడుగా.. గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరములపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నులు, పన్నేతరములకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండున్నర నెలలు మాత్రమే ఉండడంతో పన్నుల వసూలు వేగం పుంజుకుంది. సర్పంచుల పాత్ర కీలకం గ్రామ పంచాయతీ పరిధిలో పన్ను వసూలు చేయడం, వాటిని అభివృద్ధి పనులకు వెచ్చించుకునే విషయంలో గ్రామ సర్పంచులది కీలకపాత్ర. ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా గ్రామాభివృద్ధి కోసం వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. అయినా వివిధ గ్రామాల సర్పంచులు పన్ను వసూళ్లపై పెద్దగా దృష్టి సారించనట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం, ఇతర గ్రాంట్ల పైనే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దృష్టి కేంద్రీకరించాయే తప్ప స్థానిక వనరుల నుంచి పంచాయతీలకు వచ్చే ఆదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో పన్నులు(ఇంటి పన్ను, లైబ్రరీ సెస్సు, కుళాయి పన్ను ), పన్నేతరముల (మార్కెట్ వేలాలు, షాపింగ్ అద్దెలు, లైసెన్స్ ఫీజులు, కుళాయి ఫీజులు, భవన నిర్మాణ ఫీజులు) రూపంలో సొంత వనరులను సమీకరించుకోవడంలో సర్పంచులు తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ఆదాయాన్ని పెంచేందుకు సమష్టి కృషి గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని పెంచుకునే అంశంలో క్షేత్ర స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక గ్రామ పంచాయతీల్లో దశాబ్దం క్రితం ఉన్న ఇళ్ల సంఖ్యనే నేటికీ లెక్కల్లో చూపుతున్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో దాదాపు 50 శాతం గ్రామ పంచాయతీలు భౌగోళికంగా విస్తరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామ పంచాయతీల్లో కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. అయితే కొత్తగా గ్రామ శివారుల్లో ఏర్పాటవుతున్న కాలనీలు, కొత్త ఇళ్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యక్షంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. డివిజన్ల వారీగా లక్ష్యాలు పన్నుల వసూళ్లకు సంబంధించి డివిజన్ల వారీగా లక్ష్యాలను నిర్ణయించాం. ఒక్కో డివిజన్ వారానికి రూ.కోటి వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశాం. అలాగే ముగ్గురు డీఎల్పీఓలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వసూళ్లకు సంబంధించి ప్రతి రోజు జిల్లా కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయిలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులను కోరుతున్నాం. – టి.నాగరాజునాయుడు, జిల్లా పంచాయతీ అధికారి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు గ్రామాల్లో పన్నులు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాము విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా పంచాయతీ కార్యాలయానికి వచ్చి చెల్లిస్తున్నారు. అలాగే డివిజన్, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేస్తాం. – గురుస్వామి, అధ్యక్షులు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం -
AP: వివిధ పథకాలకు గ్రాంటుగా రూ.38 వేల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు పైబడి ఉన్న వివిధ ప్రధాన పథకాలకు మొత్తం రూ.38,014.57 కోట్లను గ్రాంటు రూపంలో ఇచ్చినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంఘాలకు ఆర్థిక సహకారంగా రూ.9,155.81 కోట్లను గ్రాంటుగా ఇచ్చినట్లు ఆ నివేదికలో తెలిపింది. అలాగే, వైఎస్సార్ రైతుభరోసా కోసం రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు కాగ్ పేర్కొంది. -
మున్సిపల్ గ్రాంట్లు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలకు గ్రాంట్ల కింద విడుదల చేయాల్సిన మొత్తాల్లో కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.581.60 కోట్ల త్వరితగతిన విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను ఏపీలోని మున్సిపాలిటీలకు రూ. 3,635.80 కోట్ల గ్రాంట్లుగా అందించాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసిందని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. మొత్తం నిధులను పట్టణాలు, నగరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల సంరక్షణ, ఆట స్థలాల అభివృద్ధి వంటి పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సించి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం మంజూరు చేసిన మొత్తం గ్రాంట్లలో ఇప్పటి వరకు రూ.3054.20 కోట్లు విడుదలైనట్లు ఆయన తెలిపారు. తదుపరి గ్రాంట్ల విడుదలకు అవసరమైన అన్ని నియమ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన గ్రాంట్లకు సంబంధించి వినిమయ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందన్నారు. అలాగే ఆర్థిక సంఘం నిర్దేశించిన మూడు ప్రధాన సంస్కరణలు సైతం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేసిన వార్షిక అకౌంట్లను సమర్పించిందని వివరించారు. మున్సిపాలిటీల ఆదాయ వనరులను పెంపొందిచేలా పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. నిర్దేశిత స్థాయిలో పౌర సేవల ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పౌర సేవలు నిరాటంకంగా కొనసాగించేందుకు, వారికి కనీస సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రూ. 581.60 కోట్ల మున్సిపల్ గ్రాంట్లను త్వరితగతిన విడుదల చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన గ్రాంట్లను సకాలంలో విడుదల చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని లేఖలో ప్రస్తావించారు. -
‘బడి’కి రూ.19.11 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ గ్రాంట్‌ను 2020–21 విద్యా సంవత్సరానికి విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 28,645 పాఠశాలలకు రూ. 19,11,50,000 విడుదల చేశారు. ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. కాగా, 15మందిలోపు విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్య ఈసారి(2019–20) పెరిగింది. గతం (2018–19)లో 3,500 వరకు ఉండగా.. ఈసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత కేటగిరీలో 4,178, ఉన్నత పాఠశాలల కేటగిరీలో 23 స్కూళ్లు ఉన్నాయి. ఇక 1,000 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ స్కూళ్లు రాష్ట్రంలో 38 ఉన్నట్లు విద్యా శాఖ లెక్కలు వేసింది. స్కూల్ గ్రాంట్ విడుదల కోసం విద్యాశాఖ ఈ లెక్కలను ప్రాజెక్టు అప్రూవల్ బోర్డుకు పంపించింది. -
పోలవరం బకాయిలు విడుదల చేయాలి: విజయసాయిరెడ్డి
-
'రూ. 3,805 కోట్లు వెంటనే విడుదల చేయాలి'
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,805 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా మంగళవారం విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతంగాఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందన్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. వెంటనే పోలవరంకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్ధిక మంత్రితో బకాయిల చెల్లింపులపై చర్చలు జరుపుతున్నామన్నారు. కాగ్ సర్టిఫికేషన్ వల్ల నిధుల విడుదల ఆలస్యమైందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం బకాయిలను విడుదలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.(చదవండి : పోలవరం.. మీ సహకారంతో సాకారం) -
‘ప్రణాళిక’ సరే..పైసలేవి?
బజార్హత్నూర్ మండలం భూతాయి(బి) గ్రామ జనాభా 1200. ఈ లెక్కన పంచాయతీ కి కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి ఏడాదికి రూ.19. 34 లక్షలు రావాలి. మూడు నెలకోసారి నిధులు విడుదల చేసినా రూ.4.83 లక్షలు కేటాయించాలి. అయితే ఈ గ్రామానికి ప్రస్తుతం రూ.1.62 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ నెల 6న గ్రామంలో ప్రారంభించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అనేక సమస్యలు గుర్తించారు.. పిచ్చిమొక్కలు తొలగించడం, గుంతలు మొరంతో పూడ్చడం, డ్రెయినేజీలు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు మాత్రమే ప్రస్తుతం మంజూరైన నిధులు సరిపోయేలా ఉన్నాయి. మరి గుర్తించినటువంటి పెద్ద పనుల పరిస్థితి ఏమిటో?. సాక్షి, ఆదిలాబాద్ : జనాభాలో అత్యధిక ప్రజలు నివసించేది గ్రామీణ ప్రాంతాల్లోనే. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. తలసరి ఒకరికి రూ.806 చొప్పున కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. దానికి అదనంగా తలసరి ఒకరికి రూ.806 చొప్పున జోడించి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ లెక్కన రెండు కలిపి తలసరి ఒకరికి రూ.1612 కేటాయిస్తారు. జనాభా ఆధారంగా ఈ నిధులను జీపీలకు మంజూరు చేస్తారు. జిల్లాలోని గ్రామీణ జనాభా ప్రకారం ఈ రెండు కలిపి ఏడాదికి రూ.87.24 కోట్లు జిల్లాకు కేటాయించాలి. ఈ నిధుల వంతుల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి మంజూరవుతాయి. ఈ లెక్కన జిల్లాకు రూ.21.81 కోట్లు మొదటి విడత మంజూరు కావాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని చెప్పింది. ఇటీవల జిల్లాకు ఈ రెండు నిధులు కలిపి రూ.8.96 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాలేదు. అరకొరగా వచ్చిన నిధులతో ప్రస్తుతం చిన్నపాటి పనులే చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన గ్రామ కార్యాచరణలో భాగంగా ఈ 30 రోజుల్లో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, హరితహారం వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. మిగతా సమస్యలను గుర్తిస్తున్నారు. వాటి పరిష్కారం ఎలా? జీపీలకు మంజూరైన ఈ నిధుల్లో పారిశుధ్యం కోసం 15 శాతం, హరితహారానికి 10 శాతం, విద్యుత్ అవసరాలకు 10 శాతం, కార్యాలయ నిర్వహణకు 5 శాతం, ఇతర ఖర్చులకు 10 శాతం నిధులను కేటాయించినట్లు క్షేత్రస్థాయిలో అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 50 శాతం నిధులను అభివృద్ధి పనులకు కేటాయించాలి. ప్రస్తుతం గ్రామాల్లో గుర్తించిన సమస్యలకు సంబంధించి ఏటా.. ఐదు సంవత్సరాలకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. వార్షిక ప్రణాళికలో ఖర్చు చేయగా మిగిలిన నిధులను వచ్చే వార్షిక ప్రణాళికకు బదిలి చేయాలి. అయితే ప్రస్తుతం కార్యాచరణలో భాగంగా ప్రధానంగా కొత్త గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేవు. వాటి కోసం స్థలాలను గుర్తిస్తున్నారు. ఏదైనా పంచాయతీలో శ్మశానవాటిక లేకపోతే దానికోసం స్థలాలను గుర్తిస్తున్నారు. చెత్త తరలింపు కోసం డంపింగ్ యార్డు స్థలాన్ని కూడా గుర్తిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు భవనం లేకపోతే దానికి కూడా స్థలం గుర్తిస్తున్నారు. ఇలా పలు సమస్యలకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే 50 శాతం నిధులతో ఈ పనులను చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులకు సంబంధించి ఈజీఎస్‌లో చేపడుతున్నారు. తద్వారా వాటికి ఇక ఆ నిధులే శరణ్యం. కొత్త పంచాయతీలకు భవనం కోసం నిధులు పీఆర్ ద్వారా కేటాయిస్తారా?.. ఎలా అన్నది అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక నర్సరీలకు స్థలం కేటాయింపు విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇదిలా ఉంటే హరితహారంలో భాగంగా పంచాయతీలో మొక్కలు నాటుతున్నా వాటి సంరక్షణ కోసం ట్రీగార్డులు కేటాయించకపోగా ముళ్ల కంచెలనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం ఏవిధంగా సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. పలు గ్రామాల్లో ప్రస్తుతం ముళ్ల కంచెలు లభించడం లేదు. దీంతో గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు దాతల వైపు చూస్తున్నారు. అయితే ప్రతీచోట దాతల ఉదారత కనిపించడం లేదు. మరోపక్క విద్యుత్ సమస్యలు ఈ కార్యాచరణలో పరిష్కారానికి నోచుకుంటున్నాయి. అయితే విద్యుత్‌శాఖ ద్వారా పవర్ వీక్ నిర్వహించినప్పుడు పూర్తిసా ్థయి సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన గ్రామపంచాయతీల్లో నెలకొంది. మండలానికో ప్రత్యేకాధికారి ముపై రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో మండలానికో ప్రత్యేక అధికారిని కలెక్టర్ దివ్యదేవరాజన్ నియమించారు. కలెక్టర్ కూడా మావల మండలాన్ని ఎంచుకోవడం గమనార్హం. తద్వారా మిగతా అధికారులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జేసీ సంధ్యారాణి, ఇతర జిల్లా అధికారులు కూడా ఒక్కో మండలానికి ప్రత్యేక అధికారులుగా ఈ కార్యాచరణలో భాగస్వాములు అయ్యారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. -
కదిలించిన పిల్లాడి వీడియో
సోషల్ మీడియా.. ఎలాంటి పోరాటానికైనా ఇప్పుడు అదో ఆయుధంగా మారిపోయింది. పోస్టులు, ఫోటోలు, వీడియోలు... ఇలా ఏదైనా సరే చిన్నగా మొదలై పెను ఉద్యమ రూపుదాలుస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ బాలుడి వీడియో.. సోషల్ మీడియాను ఉపేసింది. ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామినే ఉక్కిరి బిక్కిరి చేసేసింది. బెంగళూరు: భారీ వర్షాలతో కొడగు జిల్లా అంతా అతలాకుతలంగా మారిపోయింది. దీంతో ఎనిమిదో తరగతి చదువుతున్న కలేరా ఫతే అనే పిల్లాడు.. బడ్జెట్లో తమ(కొడగు) ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ ఓ వీడియో చేశాడు. ‘కావేరీ జన్మస్థలం కొడగు. భారీ వర్షాలు పడితే కావేరీ జలాలతో మాండ్యా, మైసూర్, చివరకు మద్రాస్ సహా అన్నీ ప్రాంతాలు లాభపడతాయి. అలాంటిది కొడగునే మీరు(కుమాస్వామిని ఉద్దేశించి..) అనాథలా వదిలేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇక్కడ పంటలు నీట మునిగాయి. ఏనుగులు అడవులు దాటి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రోడ్లు చిధ్రం అయిపోయాయి. కానీ, మీరు చేసింది మాములు మోసం కాదు. బడ్జెట్లో ఎలాంటి గ్రాంట్లు ఇవ్వలేదు. ఇది మమల్ని దారుణంగా నిరాశపరిచింది’ అంటూ వీడియోను రూపొందించాడు. యెడ్డీని వదల్లేదు... ఇదే వీడియోలో కలేరా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను కూడా ఏకీపడేశాడు. ‘యడ్యూరప్పగారు.. మీరు విధాన సభ లోపల, బయట ప్రభుత్వంపై అరవటం కాదు. సమస్యను ఢిల్లీకి తీసుకెళ్లండి. ప్రధాని మోదీని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయండి’ అంటూ పేర్కొన్నాడు. వర్షంలో ఓ గొడుగుతో నది ఒడ్డున్న ఉండి చేసిన కలేరా చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్పందించిన కుమారస్వామి.. ఇదిలా ఉంటే వైరల్ అయిన ఈ వీడియో గురించి మీడియా సీఎం కుమారస్వామి వద్ద ప్రస్తావించింది. ‘ఇది 70 ఏళ్ల సమస్య. రెండు నెలల క్రితమే మొదలైందా? నేను సీఎం బాధ్యతలు స్వీకరించగానే గుర్తొచ్చిందా? విమర్శలను మా ప్రభుత్వం పట్టించుకోదు. కానీ, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇలాంటివి చూపించి ఎంత కాలం నన్ను నిరుత్సాహపరుస్తారు?. నన్ను మొదలుపెట్టనివ్వండి. నేనేం అసెంబ్లీలో ఖాళీగా కూర్చోట్లేదు. ప్రజల మధ్యే సమయం గడిపేందుకు యత్నిస్తా. త్వరలోనే కొడగును సందర్శిస్తా. స్థానిక ఎమ్మెల్యేతో ఇప్పటికే ఈ విషయంపై చర్చించా. కావాలంటే రెండురోజులు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తా’ అని కుమారస్వామి పేర్కొన్నారు. -
చాక్‌పీస్‌కు దిక్కులేదు
► ఏది కొనాలన్నా కష్టమే! ► పాఠశాలలకు విడుదల కాని గ్రాంటు ► ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందులు పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. విద్యార్థులకు గుణాత్మక విద్యనందిస్తాం. అందరూ ప్రభుత్వ పాఠ«శాలల్లో చేరండని ప్రభుత్వం ఆర్భాటాలు చేసింది. అయితే వీటి నిర్వహణకు సంబంధించిన నిధులను ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పాఠశాలలు పునఃప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఇటీవల బడిపిలుస్తోంది, అమ్మఒడి వంటి కార్యక్రమాల కోసం రూ. లక్షలు నిధులు వెచ్చించి ప్రచారం నిర్వహించింది. కానీ పాఠశాలల్లో సౌకర్యాల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. పిల్లలకు పాఠ్యాంశాలను బోర్డులపై రాసి చూపించా లంటే చాక్‌పీస్ కావాలి.వీటిని కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు లబోది బోమంటున్నారు. స్కూళ్లు తెరవగానే నిధులు మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని అయ్యవార్లు అంటున్నారు. ప్రభుత్వం స్పందించేదెప్పుడో.. నిధులు మంజూరు చేసేదెన్నడో అని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లాలో 2578 ప్రాథమిక, 295 ప్రాథమికోన్నత, 375 జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి రెండు లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గ్రాంట్ వివరాలు : ప్రభుత్వం ప్రతి ఏటా పాఠశాలల నిర్వహణకు గ్రాంటును మంజూరు చేస్తుంది. స్కూల్ గ్రాంటు, ఎమ్మార్సీ, టీచర్ గ్రాంటు విడుదల చేస్తుంది. ఇందులో ప్రాథమిక పాఠశాలలకు పాఠశాల గ్రాంట్ కింద రూ. 5 వేలు, అప్పర్‌ప్రైమరీ స్కూళ్లకు రూ. 12 వేలు, జెడ్పీకి రూ. 7 వేల చొప్పున ఇస్తుంది. ఎమ్మార్సీ గ్రాంటు కింద ప్రతి ఏమ్మార్సీకి రూ. 80 వేల చొప్పున, టీచర్ గ్రాంటు కింద ప్రతి టీచర్‌కు రూ 5 వందల చొప్పున ఇస్తుంది. చాక్‌పీసులు, పుస్తకాలు, దినపత్రికల కొనుగోలుకు, పాఠశాలల్లో కరెంటు బిల్లులు, చిన్నచిన్న మర మ్మతుల కోసం ఈ నిధులు ఖర్చు చేయవచ్చు. ప్రçస్తుతం డబ్బులు రాకపోవడంతో పనులన్నీ ఆగిపోయాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నిధులు వచ్చాయి..పంచడం లేదు పాఠశాల నిర్వహణకు సంబంధించిన గ్రాంటును ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏకి రెండు రోజుల కిందట విడుదల చేసినట్లు తెలిసింది. కానీ సంబంధిత గ్రాంటును మాత్రం ప్రస్తుత ఉపాధ్యాయుల బదిలీలు అయ్యేవరకూ పాఠశాలలకు ఇవ్వద్దని ఎస్పీడీ కార్యాలయం అనధికారికంగా లింక్ పెట్టినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల బదిలీలు అయ్యేవరకూ అయ్యవార్లు నిధుల కోసం ఎదురుచాడాల్సిందే. నిధులు త్వరలో జమ చేస్తాం పాఠశాలలకు సంబంధించిన గ్రాంటు త్వరలో ఆయా ఖాతాల్లో జమచేస్తాం. నిబంధనల మేరకు మాత్రమే నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. – పొన్నతోట శైలజ, ఎస్ఎస్ఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
-
ఉరుకులు.. పరుగులు
* మార్చి 31తో మురిగిపోనున్న సబ్‌ప్లాన్ నిధులు * ఆఘమేఘాలపై పనులకు ప్రతిపాదనలు * గుంటూరులోని ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు బాపట్ల: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మార్చి 31వ తేదీతో మురిగిపోనున్న నేపథ్యంలో ఆ నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు ఉరుకులు, పరుగులు మొదలెట్టారు. మున్సిపాల్టీల్లో పాలకపగ్గాలు చేపట్టిన తరువాత ఒక పని కూడా చేయలేకపోయామనే అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాను పనులతోనైనా సంతృప్తి పరిచేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 12 మున్సిపాల్టీలో మార్చి 31లోపు చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రతిపాదనల చిట్టా తీసుకుని అధికారయంత్రాంగం గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఒక్కొక్క కౌన్సిలర్ కనీసం వార్డులో రెండు, మూడు పనులు చేపట్టుకునేందుకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు వార్డులో లేకపోతే ఆ వార్డులకు ఈ నిధులు వచ్చే అవకాశం లేకపోవటంతో ఆయా వార్డుల్లో కనీసం తాగునీటి పైపులైన్లు అయినా ప్రతిపాదించాలనే తలంపులో అధికారగణం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. నామినేషన్ పద్ధతిపైనే పనులు.. మార్చి 31లోపు సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జిల్లాలోని మున్సిపాల్టీలో ఆఘమేఘాలపై ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిగిలిన నాలుగు జిల్లాలో మాత్రమే ఈ నిధులు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మున్సిపాల్టీలు ఈ నిధులను దక్కించుకునేందుకు చూస్తున్నాయి. గతంలో మున్సిపాల్టీకి రూ.50లక్షలు మాత్రమే ఇచ్చే ఈ నిధులు మార్చినెలాఖరుతో మురిగిపోనుండటంతో ఎన్ని పనులకైనా అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్క మున్సిపాల్టీలో రూ.5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిపై పనులు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. రోడ్లు, పైపులైన్లు, డ్రైనేజీలతోపాటు దళితవాడలు, వాటికి అనుసంధానంగా ఉండే వార్డుల్లో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాపట్ల మున్సిపాల్టీలో రూ.10 కోట్లతో 200 పనులకు పైగా ప్రతిపాదనలు సిద్ధంగా చేయగా మిగిలిన మున్సిపాల్టీల్లో వారి స్థాయిని అనుసరించి రూ.2 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తంగా జిల్లాలో వెయ్యి పనులకుపైగా చేపట్టాలనే ఉద్దేశంతో ఫైల్స్ తీసుకుని అనుమతులు కోసం గుంటూరు ప్రధాన కార్యాలయాల చుట్టూ మున్సిపల్ యంత్రాంగం తిరుగుతోంది. మున్సిపాల్టీల్లో ప్రత్యేక సమావేశాలు.. గుంటూరులోని ప్రధాన కార్యాలయాల నుంచి ప్రతిపాదనలకు అనుమతులు రావటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాల్టీల్లో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు ఆఘమేఘాలపై ప్రయత్నాలు మొదలు పెట్టారు. గడిచిన పదిరోజులుగా చేపట్టాల్సిన పనులపై సర్వేలు నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటికప్పుడు తయారుచేసిన ఫైల్స్‌ను తీసుకొని గుంటూరులోని కార్యాలయాలకు పయనమవుతున్నారు. -
నల్లమడ.. గుండె దడ
* అధికారుల లోపాలు.. అన్నదాతలకు శాపాలు * డిజైన్‌లో లోపాల వల్లే వరదల్లో నాలుగుచోట్ల గండ్లు * ఇప్పుడు శాశ్వత మరమ్మతులు చేపట్టాలంటే రూ.500 కోట్లు అవసరం పంట పసిపాపలా పచ్చగా నవ్వుతున్న వేళ వరద ముంచెత్తి కాలువ కట్టలను తెంచుకుంటూ రైతు నుదుట దుఖాఃన్ని పులుముతోంది. ప్రకృతి ప్రకోపించినా, పాలకులు ఆదమరిచినా భూమాతకు పచ్చబొట్టు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకునే రైతు కష్టం.. అధికారుల అలసత్వానికి నిలువునా తుడిచిపెట్టుకు పోతోంది. కన్న తండ్రిలా పంటకు ప్రాణంపోసే కాలువలు.. డిజైన్ల నిర్మాణ లోపంతో గండ్లు పడి రైతుల పాలిట శాపాలై కన్నీటి సుడిగుండాలు మిగిలిస్తున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: నల్లమడ డ్రెయిన్ పొంగి పంట పొలాలను ముంచెత్తుతోంది. అధికారులు డిజైన్స్‌లో చేసిన లోపాలు అన్నదాతలకు శాపాలుగా మారాయి. కొండపాటూరు, గార్లపాడు, నాగులపాడులవద్ద వంతెనల నిర్మాణాలు 500 సీ డిజైన్‌తో రూపొందించడంతో అక్కడ నుంచి నీరు సరిగా వెళ్లక గండ్లు పడి పంట పొలాలను మునిగిపోతున్నాయి. కొన్ని చోట్ల మట్టి మేటలు వేసి, మరికొన్ని చోట్ల భూమి కోతకు గురవుతుంది. ఈ ఏడాది కాలువ పరిధిలో 25,000 ఎకరాలకుపైగా పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. తుఫానుకు 36 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. నల్లమడ డ్రెయిన్‌పై నిర్మిస్తున్న మూడు బ్రిడ్జిలు 500సీ మేర డిజైన్ చేశారు. అక్కడ వాగుకు 300సీకి మాత్రమే దాదాపు 20 వేల క్యూసెక్కుల నీరు వెళ్లే విధంగా డిజైన్ చేసి ఉండటంతో నీరు బయటకు వెళ్లలేక కాలువకు ఇరువైపులా గండ్లు పడుతున్నాయి. దీనికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ3.75 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతుల కోసం దాదాపు రూ.500 కోట్లలకుపైగా అవుతుందని, 1000 ఎకరాలకుపైగా భూసేకరణ చేయాల్సి వస్తుందని నిర్ధారించారు. అయితే ఇంకా తాత్కాలిక పనులు కూడా ప్రారంభం కాలేదు. వర్షం వస్తే డ్రెయిన్ నీటితో పంట పొలాలు కోతకు గురవుతాయని రైతులు హడలిపోతున్నారు. కొమ్మూరు కెనాల్‌కు ముప్పు.. నల్లమడ డ్రెయిన్‌కు గండ్లు పడుతుండటంతో దాని ప్రభావం కొమ్మూరు కెనాల్‌పై పడుతోంది. నల్లమడ వాగు దిగువన పెదనందిపాడు బ్రిడ్జిపై నుంచి ఓగేరు, కుప్పగంజి వాగు, నక్కల వాగుతోడై కొమ్మూరు కెనాల్లోకి నీరు వస్తుంది. దీంతో అప్పాపురంపైన దిగువన నాలుగు చోట్ల పెద్ద గండ్లు పడటంతోపాటు మొత్తం 86 చోట్ల కొమ్మూరు కెనాల్ తెగిపోయింది. దీని తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.3.23 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారు. కాలువ కింద వేసిన వరి పంట దెబ్బతినకుండా మరమ్మతులు చేస్తున్నారు. బాదులు, ఇసుక బస్తాలు వేస్తున్నారు. చెరువులకు గండ్లు... జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు 12 మైనర్ ఇరిగేషన్ చెరువులు తెగిపోయాయి. తాడిపూడి చెరువు, మాదాల చెరువు, దామాయపాడు చెరువు, దాసబందం చెరువు, కల్లూరివాని చెరువు, జానపాడు చెరువు, పిన్నెల్లి చెరువు, ఎమడాల చెరువు, గణేష్ చెరువు, పంట చెరువుకు రెండు చోట్ల గండ్లు పడ్డాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ 53.80 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తాత్కాలికంగా గండ్లు పూడ్చే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అంచనాలు రూపొందించడంలో... వర్షాలు వస్తే మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నదాతలు అందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ ఎస్ఈ కేవీఎల్ఎంపీ చౌదరి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ సిబ్బంది అంచనాలు రూపొందిస్తున్నారు. నల్లమడ డ్రెయిన్‌కు సంబంధించి ఇంకా తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం కాలేదు. -
నల్లమడ అభివృద్ధికి రూ.240 కోట్లు
డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడి ప్రత్తిపాడు: నల్లమడ వాగు అభివృద్ధికి ’240 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమడ వాగు పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. వరద పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు డీపీవో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. వరదసహాయక చర్యల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. నల్లమడ మూడు నియోజకవర్గాల్లో నుంచి వెళుతుందని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రతిపాదనలు తయారు చేశారంటూ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డ్రెయినేజీ అధికారులను ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పూర్తి వివరాలతో అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తారన్నారు. సమావేశంలో నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, వివిధ విభాగాల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
స్టార్టప్‌లతో అభివృద్ధి
రెడ్ మాడ్ లెర్నింగ్ సంస్థ వ్యవస్థాపకుడు మాధవ రెడ్డి ఏఎన్‌యూ: స్టార్టప్‌ల ద్వారా సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని రెడ్ మాడ్ లెర్నింగ్ సంస్థ వ్యవస్థాపకుడు మాధవ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ సీఈడీ (సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్) అధ్వర్యంలో బుధవారం‘ స్టార్టప్ పథకం’పై జరిగిన సదస్సులో మాధవ రెడ్డి ప్రసంగించారు. సామాజిక ప్రగతికి సమాజంలో నెలకొన్న విభిన్న ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి పరిశ్రమలే ఉత్తమ పరిష్కారాన్ని చూపుతాయన్నారు. స్టార్టప్‌ను ప్రారంభించటానికి వయస్సు, నిధులు ఆటంకం కాదని వినూత్న ఆలోచనలు, పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమవుతాయన్నారు. నిధుల దుర్వినియోగం, మార్గదర్శకులు లేకపోవటమే అధిక శాతం పరిశ్రమలు మూతపడటానికి కారణమన్నారు. విద్యార్థులు నూతన ఆలోచనలతో పరిశ్రమల స్థాపకు ముందుకు రావాలని సూచించారు. వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ శ్రద్ధచూపి, కొద్దిపాటి కష్టాన్ని తీసుకోవటానికి సిద్ధపడితే పరిశ్రమల స్థాపన, వాటిని విజయపథంలో నడపటం సాధ్యమవుతుందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విడ్రీమ్ ఎల్యూషన్స్ డైరెక్టర్లు నజీర్‌బాషా, మధు మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని అంశాలపై శిక్షణ, అవగాహన ఇవ్వటానికి ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో స్టార్టప్ జాతీయ సదస్సు నిర్వహిస్తోందనానరు. ఏఎన్‌యూ సీఈడీ డైరెక్టర్ ఆచార్య అబ్ధుల్ నూర్భాషా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కామర్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీఎల్పీ నిధులు పక్కదారి
* అవినీతి ఊబిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం * పిల్లలసంఖ్యను అధికంగా చూపి సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు * పట్టించుకోని ఉన్నతాధికారులు బాలకార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో అవి పక్కదారి పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ నేరుగా సమీక్షించాల్సిన జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం (ఎన్సీఎల్పీ) జిల్లాలో అవినీతిమయంగా మారింది. ఎవరికి వారు అందినకాడికి దండుకుంటూ పిల్లల నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు. ఈ విధంగానైతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుంటూరు వెస్ట్ : జాతీయ బాలకారిృక వ్యవస్థ నిర్మూలన పథకం(ఎన్సీఎల్పీ)లో భాగంగా జిల్లాలో నడుస్తున్న శిక్షణ కేంద్రాలు అవినీతిమయంగా మారాయి. జిల్లాలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. పిల్లల సంఖ్యను అధికసంఖ్యలో చూపించి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రాజñ క్టు అమలు బాధ్యతలు రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. తమను ప్రశ్నించేవారే లేరనే ధీమాతో సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 22 శిక్షణ కేంద్రాలు... జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథకం(ఎన్సీఎల్పీ) జిల్లాలో 1996 నుంచి అమలులో ఉంది. కేరళ మినహా దేశవ్యాప్తంగా 272 జిల్లాలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ పీడీ సెక్రటరీగా ఉండే ఈ పథకం ముఖ్య ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన. జిల్లా వ్యాప్తంగా వినుకొండ, గుంటూరు, మంగళగిరి, నిజాంపట్నం, పిడుగురాళ్ల, తెనాలి, రెంటచింతల, సత్తెనపల్లి, రాజుపాలెం, బొల్లాపల్లి తదితర మండలాల్లో 22 శిక్షణా సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో 1,112 మంది పిల్లలు ఉన్నట్లు పథకం నిర్వాహకులు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఒక్కొక్క సెంటర్లో ఇద్దరు శిక్షకులు, అకౌంటెంట్, ఆయా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడుసెంటర్లకు కలిపి ఒక ఒకేషనల్ శిక్షకుడు ఉంటున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో సెంటర్లో 50 నుంచి 60 మంది పిల్లలు ఉంటున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు నగరంలో ఐదు సెంటర్లు ఉండగా పొన్నూరు రోడ్డులోని సాయిబాబా కాలనీలో మినహా ఏ ఒక్క సెంటర్లో కూడా పిల్లలు లేక సెంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నల్లచెరువు 23వ లైన్‌లోని శిక్షణా కేంద్రంలో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవంగా అక్కడ 20 మందికి మించి పిల్లలు లేకపోవడం గమనార్హం. ఇటువంటి పరిస్థితులే జిల్లాలోని అన్ని సెంటర్లలో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్న భోజనం మినహా సౌకర్యాలు శూన్యం.. 1,112 మంది పిల్లలకు సై్టఫండ్ నిమిత్తం నెలకు రూ.1.66 లక్షలు అందిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా అదే సంఖ్యలో పిల్లలకు వడ్డిస్తున్నట్లు లెక్కలు తయారుచేస్తూ నిధులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. విద్యార్థులకు యూనిఫాం కూడా ఇంతవరకు అందించిన దాఖలాలులేవు. మధ్యాహ్న భోజనం మినహా ఇతర సౌకర్యాలేవీ పిల్లలకు కల్పించలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. శిక్షణా కేంద్రాలకు సమీపంలోని పిల్లలను పిలిచి మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎన్సీఎల్పీ జాతీయ కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని కోరుతున్నారు. తెనాలిలో.... తెనాలి ఐతానగర్లోనూ ఎన్సీఎల్పీ కేంద్రం ఉంది. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలను ఎన్సీఎల్పీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు వయస్ను 50 మంది విద్యార్థులు ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు రికార్డుల్లో చూపెడుతున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవానికి అక్కడ విద్యనభ్యసిస్తున్న సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులు కేటాయింపులు జరిపిందని, జాతీయస్థాయి విద్య, వైద్య సంస్థలను మంజూరు చేసిందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ చెప్పారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటే వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్ఐటీలు మంజూరు చేశామని కేంద్ర మంత్రులు, తాము రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నామని టీడీపీ, బీజేపీ ఎంపీల ప్రకటనల్లో నిజం లేదని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దశాబ్దాల క్రితమే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్‌ను నెలకొల్పగా.. విభజన జరిగిన తరువాత కొత్తగా ఏపీకి ఆయా సంస్థలను మంజూరు చేశారని తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు అన్ని రాష్ట్రాలతోపాటే మంజూరు చేస్తారన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. -
పెట్టు‘బడి’కష్టమే..!
ఉపా«ధ్యాయుల అవస్థలు పంపిణీకి నోచుకోని పాఠశాల, నిర్వహణ నిధులు విద్యా కమిటీల కోసం నిలిపివేత సుద్దముక్కలు కూడా కరువే.. పిఠాపురం : విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలల నిర్వహణకు గతేడాది ఒక్కరూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వం.. ఆ నిధులను ఈ ఏడాది విడుదల చేసినట్లు చెబుతున్నా పంపిణీ మాత్రం జరగలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాఠశాలల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. రాష్రీ్ట్రయ మాథ్యమికశిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ)కు సంబంధించిన పాఠశాలల నిర్వహణ ఖర్చులు విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయులు గగ్గోలుపెడుతున్నారు. బోధనోపకరణాల కోసం ఉపాధ్యాయులకు ఇచ్చే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) నిధులు సైతం విడుదల కాకపోవడంతో ప్రాథమిక పాఠశాలల్లోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో పాఠశాలలు జిల్లాలో 4,412 పాఠశాలలు ఉండగా ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కొ ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున విడుదల కావాల్సి ఉంది. ఆ సొమ్ముతో సుద్దముక్కలు, ఇతర అవసరాలను తీర్చుకుంటారు. కానీ రెండేళ్లుగా ఈ నిధులు ఇవ్వడం లేదు. వీటితో పాటు పాఠశాలల నిర్వహణ ఖర్చుల కింద అదనపు వనరులు సమకూర్చుకోవడానికి ఒక్కొక్క పాఠశాలకు రూ.5 వేలు విడుదల కావాల్సి ఉంది. మూడు గదులున్న పాఠశాలలకు రూ.5 వేలు, అంతకంటే ఎక్కు వ ఉన్న పాఠశాలలకు రూ.10 వేలు కేటాయించారు. కానీ ఆ నిధులు విడుదల కాలేదు. నిధుల వినియోగం ఇలా.. ఉన్నత పాఠశాలలకు సంబంధించి గతంలో ఒక్కొక్క పాఠశాలకు రూ.12 వేలు ఉండగా, వాటిని రూ.34 వేలకు పెంచారు. వీటిలో రూ.17 వేలును ఆయా పాఠశాలల తరగతి గదుల మరమ్మతులకు, రూ.12 వేలు సైన్స్ పరికరాలు, ల్యాబ్ నిర్వహణకు వినియోగించాలి. రూ.1000 అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, రూ.2 వేలు ఆయా పాఠశాలల విద్యుత్ బిల్లులకు వినియోగించుకునేందుకు నిర్ణయించారు. ఏటా జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఉన్న విద్యా సంవత్సరంలో జూన్ నెలలోనే పాఠశాల ప్రారంభ దశలోనే ఈ నిధులు విడుదల కావల్సి ఉంది. గత 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 4412 పాఠశాలలకు రూ.17 వేల చొప్పున నిర్వహణ ఖర్చులకు మాత్రమే (మరో రూ 17 వేలు భవనాల మరమ్మతులకు నిధులు విడుదల కాలేదు) రూ 7.50 కోట్లు ఈ ఏడాది మంజూరైంది. కానీ ఆ నిధులు ఆయా ఉపాధ్యాయుల ఖాతాల్లో వేయలేదు. 2016–17కు సంబంధించి స్కూలు గ్రాంటు, స్కూలు మేనేజ్మెంటు గ్రాంటు, పాఠశాల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులకు రూ.200 కోట్లకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గత ఏడాది నిధులే ఇప్పటి ఇవ్వక పోగా ఈ ఏడాది నిధులు ఎప్పుడు వస్తాయో అసలు ఇస్తారో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కొత్త విద్యాకమిటీల కోసమేనా! ఈ నిధులన్ని ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల బ్యాంకుఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త కమిటీలు వచ్చిన వెంటనే ఆ నిధులు వారి జాయింట్ ఎక్కౌంటు ద్వారా వేయడానికి తద్వారా ఆనిధుల వినియోగంపై కమిటీలకు పెత్తనం కట్టబెట్టడానికి ప్రభుత్వం నిధుల పంపిణీని నిలిపివేసినట్లు సమాచారం. గత ఏడాది పాఠశాల నిర్వహణకు పెట్టుబడి తాము పెడితే నిధులు విద్యాకమిటీల ద్వారా ఇవ్వడమేమిటని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల జేబులకు చిల్లులు ఈ ఏడాది ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పలు పాఠశాలల్లో సుద్ద ముక్కలుకూడా కరువయ్యాయి. ఉపాధ్యాయులే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం కాగితం కావాలన్నా వారి జేబుల్లోంచి డబ్బులు తీయాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో బిల్లులు చెల్లించక విద్యుత్ కనెక్షన్లు కట్ అవుతున్నాయి. సైన్స్ ల్యా»Œ ల్లో పరికరాలు లేక ప్రయోగాలు చేసే అవకాశం లేకుండా పోతోంది. దీనిపై సర్వశిక్షా అభియాన్ పీఓ టీవీజే కుమార్‌ను వివరణ కోరగా త్వరలోనే నిధుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
నిధులు స్వాహా చేసింది జూనియర్ అకౌంటెంటే
తెనాలిరూరల్: తెనాలి సబ్ ట్రెజరీలో నిధుల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 1,10,46,847 నిధులు గోల్మాల్ కాగా, రూ. తొమ్మిది లక్షలను రికవర్ చేయగలిగారు. సబ్‌ట్రెజరీలో నిధులు గోల్మాల్ అయిన సంగతి జూన్ 20వ తేదీన వెలుగులోకి వచ్చింది. సుమారు 12 రోజుల పాటు శాఖాపరంగా విచారించిన ఖజానా శాఖ అధికారులు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ బెల్లంశ్రీనివాసరావు వివరా లు వెల్లడించారు. ఖజానా శాఖ డిప్యూ టీ డైరెక్టర్ కె.సురేంద్రబాబు గత నెల 29వ తేదీన నిధుల గల్లంతుపై తమకు ఫిర్యాదు చేశారని, కేసును దర్యాప్తు చేసి నిందితుడిని సబ్ ట్రెజరీ కార్యాలయ జూనియర్ అకౌంటెంట్ తాడికొండ వరుణ్‌బాబుగా గుర్తించి అరెస్ట్ చేసినట్టు వివరించారు. ఏడాది పాటు 59 ట్రాన్సాక్షన్లలో నిధులను తన ఖాతా, తన తమ్ముడు వరసయ్యే రాజ్‌కుమార్‌దత్ ఖాతాల్లోకి మళ్లించాడని దర్యాప్తులో వెల్లడైనట్టు చెప్పారు. రూ. 90 లక్షలను వరుణ్‌బాబు తన సొంత బ్యాంకు ఖాతాలోకి, రూ. 20.46 లక్షలను రాజ్‌కుమార్‌దత్ ఖాతాల్లోకి మళ్లించాడని తెలిపారు. ఇందు కోసం నకిలీ బిల్లులు, ఆన్లైన్లో ఈ–చెక్‌లను సృష్టించి టోకెన్ నంబర్లు కేటాయించాడని, కార్యాలయ అధికారుల పాస్వర్డ్లు తెలియడంతో నిధుల ను మళ్లించడం సులువయిందని చెప్పా రు. దారిమళ్లించిన నిధులతో నాలుగు లగ్జరీ కార్లు, మూడు ఖరీదైన మోటారుసైకిళ్లు కొనుగోలు చేసి, హెచ్చు శాతం నిధులను స్నేహితులతో కలసి అనేక ప్రదేశాలు తిరిగి రావడం, విమాన ప్రయాణాలు వంటి విలాసాలకు ఖర్చు చేసి, కొద్ది మొత్తాన్ని బంధువులకు ఇచ్చినట్టు చెప్పారు. సబ్ ట్రెజరీకి సంబంధించి కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలో నిధులు తగ్గడంతో మూడుసార్లు మున్సిపాలిటీకి సంబంధించిన నకిలీ బిల్లులను సృష్టించి నిధులు జమ అయ్యేలా చేశాడని, అయితే వార్షిక తనిఖీల్లో నిధులు గోల్మాల్ అయినట్టు బయటపడడంతో విచారించిన ఖజానా శాఖ అధికారులు వరుణ్‌బాబు పనే అని నిర్ధారించినట్టు తెలిపారు. ఇప్పటికి రూ. తొమ్మిది లక్షలు రికవర్ చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వరుణ్‌బాబుతో పాటు నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి రాజ్‌కుమార్‌దత్, ఇతరుల పాత్రపై విచారణ జరుగుతోందని, వారిపైనా చర్యలుంటాయని సీఐ స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్ఐలు జి. అసన్, కె. వెంకటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. -
పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్..
-
పుట్టింగళ్ నిందితులకు హైకోర్టు బెయిల్..
తిరువనంతపురంః వందేళ్ళ చరిత్ర కలిగిన పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కేరళ హైకోర్టు 43 మందికి బెయిల్ మంజూరు చేసింది. దేవీ ఉత్సవాల సమయంలో బాణసంచా పేలి జరిగిన ఘోర ప్రమాదంలో అప్పట్లో సుమారు 114 మంది చనిపోగా 383 మంది వరకూ గాయపడ్డవిషయం తెలిసిందే. పుట్టింగళ్ దేవీ ఆలయ ఆగ్నిప్రమాదంలో నిందితులైన వారందరికీ కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో సుమారు మూడు నెలలు గడిచిన అనంతరం కోర్టు..నిందితులుగా ఉన్న మొత్తం 43 మందికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఆలయ ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో తీవ్ర విపత్తును సృష్టించింది. కంబాపురాలో బాణాసంచా భద్రపరిచిన గోడౌన్ అంటుకోవడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అంటుకున్న నిమిషాల్లోనే కాంప్లెక్స్ మొత్తం వ్యాపించడంతో అక్కడే ఉన్న భక్తులు కొందరు అగ్నికి ఆహుతైపోగా, మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో సంభవించిన పేలుళ్ళతో ఆలయం గోడలు, సమీప కాంక్రీట్ భవనాలు కూలడంతో శిథిలాలకింద పడ్డ భక్తులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం సందర్భంలో పోలీసులు ఆరుగురిపై హత్యాయత్నం, ఇతర నేరాలతోపాటు, ప్రమాదానికి కారణమైన ఆలయ అధికారులు, బాణాసంచా కాంట్రాక్టర్లు పలువురిపై కేసులు నమోదు చేశారు. -
ఎయి‘డెడ్’ భవనాలు
చిత్రంలో కనిపిస్తున్న భవనం బుధవార పేటలోని జంపాలగట్టయ్య ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాల. ఇందులో నాలుగు గదులు ఉన్నాయి. అందులో రెండు గదులు ఇప్పటికే కూలీ పోయాయి. మిగిలిన రెండు గదులు చిన్నపాటి వర్షానికే చిత్తడిచిత్తడిగామారుతున్నాయి.ఒకప్పుడు 200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. నేడు 30 మంది కూడా లేని పరిస్థితినెలకొంది. ఇది ఒక్క జంపాలగట్టయ్య పాఠశాల దుస్థితే కాదు. జిల్లాలోని అన్ని ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉంది.ఎప్పుడూ కూలుతాయో తెలియడం లేదు. అయినా ప్రభుత్వం కాని, ఆయా పాఠశాలల యాజమాన్యాలు కాని కనీసం మరమ్మతులు చేపడుదామనే ఆలోచన చేయడం లేదు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 110 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 41 ఉన్నత ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలలకు పక్కా భవనాలు, ఆట స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి భవనాలు. అప్పట్లో మేనేజ్మెంట్లు ఆర్థికంగా ఉండడంతో ఏమైన మరమ్మతులు వస్తే వెంటనే చేయించేవారు. ఇందుకు ప్రభుత్వం కూడా చేయూతను ఇచ్చేది. అయితే ఇరవై ఏళ్ల నుంచి చాలా పాఠశాలల మేనేజ్మెంట్లు నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలపై సవతి ప్రేమను చూపుతోంది. దీంతో భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం మానేశారు. జిల్లాలో దాదాపు 80 ప్రైమరీ పాఠశాలలకు సరైన పక్కా భవనాలు లేవు. వీటిలో ఇప్పటికే కొన్ని కూలీపోవడంతో ఆయా స్కూళ్లను ఉపాధ్యాయులే అద్దె భవనాల్లో సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. అక్కడ చాలా ధీనమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. బాతురూంలు లేని పాఠశాలలు కూడా ఎయిడెడ్ విభాగంలోనే ఉన్నాయి. ఇక పక్కాభవనాలు ఉన్నా మరమ్మతులకు గురైన పాఠశాలలే దాదాపుగా 60కు పైగా జిల్లాలో ఉన్నాయి. వీటి మరమ్మతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మైనర్ రిపేరిల కోసం ఒక్క రూపాయిని విడుదల చేయడం లేదు. కేవలం స్కూల్ గ్రాంట్‌ను మాత్రమే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 5 నుంచి 7 వేల వరకు విడుదల చేస్తుంది. స్పెషలాఫీసర్లుగా డీవైఈఓలు, ఎంఈఓలు జిల్లాలో చాలా ఎయిడెడ్ పాఠశాలలకు మేనేజ్మెంట్ కమిటీలు లేవు. దీంతో వాటి స్థానంలో ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు డీవైఈఓలు, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు ఎంఈఓలను స్పెషలాఫీసర్లుగా నియమించింది. అయితే వారు కూడా పాఠశాలల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. ఈనేపథ్యంలో మర్మతులకు గురైన పాఠశాలలు కూలీపోతున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకుంటే ఉన్న పాఠశాలల్లో మరికొన్ని కూలీపోయి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. మరమ్మతుల కోసం నిధులు ఇవ్వం ఎయిడెడ్ పాఠశాలల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏమి నిధులను ఇవ్వదు. నిర్వహణ కోసం మాత్రం స్కూల్ గ్రాంటును ఇస్తుంది. ఐదు వేల కంటే ఏ పాఠశాలకు ఎక్కువగా రాదు. వాటితో చాక్‌పీసులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంది. - వై. రామచంద్రారెడ్డి, పీఓ, ఎస్ఎస్ఏ ఎయిడెడ్ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర ఎయిడెడ్ పాఠశాలపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. మేనేజ్మెంట్లు పాఠశాలల స్థలాలపై కన్నేసి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నాయి. ఎయిడెడ్ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. నిర్వహణ గ్రాంటును ఎయిడెడ్ పాఠశాలలకు ఇవ్వాలి. - విక్టర్ ఇమ్మానుయేల్, ఏపీటీజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సీఎస్ దత్తత గ్రామానికి ఎంపీ వైవీ నిధులు
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రకాశం జిల్లాలో దత్తత తీసుకున్న గ్రామానికి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తన ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేశారు. తన స్వగ్రామమైన పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామాన్ని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు దత్తత తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో సామాజిక భవన నిర్మాణానికి ఎంపీ నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఇటీవల ఎంపీని కోరారు. సామాజిక భవన నిర్మాణానికి రూ.4.5 లక్షలను విడుదల చేస్తూ అంగీకార పత్రాన్ని మంగళవారం ప్రకాశం భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. కలెక్టర్‌కు అందజేశారు. -
పంచాయతీలకు షాక్ !
చిలకలూరిపేటరూరల్: గ్రామాల పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఈనెల మూడవ తేదీన ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామస్తులు, సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 1011 గ్రామ పంచాయతీలకు 112 మేజర్, 899 మైనర్‌గా ఉన్నాయి. అన్ని పంచాయతీలకు ప్రతి ఏటా రెండు విడతలుగా జనాభా ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సి వుంది. 13వ ఆర్థిక సంఘం నిధులు ఇలా... గ్రామ పంచాయతీలకు విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అంతర్గత రోడ్లు, వీధి లైట్ల ఏర్పాటు, పంచాయతీ భవనం, మంచినీటి పథకాల నిర్వాహణ నిర్వహించాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపాదికన ఒక్కరికి రూ. 400 వంతున జిల్లాలోని 32,02,477 లక్షల మందికి నిధులను విడుదల చేస్తోంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 128 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటై ఏడాది గడిచింది. ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం, స్టేట్‌ఫైనాన్స్ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతోంది. ఈ నిధుల్లో కోతలు విధించినా, దారి మళ్లించినా అభివృద్ధి ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంపై పంచాయతీ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి పంచాయతీ నిధుల నుంచి 15 శాతం మాత్రమే విద్యుత్ అవసరాలకు వినియోగించాలి. అలా కాకుండా ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలని ఆదేశించడంపై అధికారులు తటపటా ఇస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లు, మంచినీటి సరఫరా అవసరాలకు విద్యుత్ వినియోగంతో అక్టోబర్ చివరి వరకు రూ. 55.85 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. బకాయిలు వెంటనే చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, అయితే ప్రజల అవసరాల మేరకు ఇప్పటి వరకు కొనసాగించామని పేర్కొంటున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొలి విడతగా రూ. 25 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. గత నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలను చెల్లించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పై నుంచి ఆదేశాలు జారీ చేశారు. - గ్లోరియా, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి, గుంటూరు ఇదీ బాబు భాష్యం... గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను త్వరలో కేంద్రప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులతో చెల్లించాలి. మిగిలిన వాటితో ప్రతి పంచాయతీలో ఒక్కో సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ నిధులు పూర్తిస్థాయిలో సమకూరని పక్షంలో కేంద్ర ప్రభుత్వ ఉపాధిహామీ పథకంతో నిర్వహించాలి. - ఇటీవల గ్రామ పంచాయతీ అధికారులతో రాష్ట్ర సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలివి.. వాస్తవంగా ఇలా చెల్లించాలి.. గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు విద్యుత్ బకాయిలను పంచాయతీ అధికారులు పన్నులు వసూలు చేసి చెల్లించేవారు. ఇంటి పన్నుల వసూలులోనే వీధి దీపాల పన్ను ఉంటుంది. ఇంటి పన్నుల సమయంలోనే మంచినీటి కుళాయిల పన్నుల చెల్లింపులు ఉంటాయి. మంచినీటి సరఫరా అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామీణ మంచినీటి సరఫరా పథకం (ఆర్‌డబ్లుఎస్) అధికారులే నిధులు మంజూరు చేస్తారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వసూలు చేసిన నీటి కుళాయిల పన్నులను విద్యుత్ బకాయిలకు చెల్లించేవారు. బకాయిలు అధికంగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల నుంచి సర్దుబాటు చేస్తారు. ఉన్న నిధులన్నీ విద్యుత్ బకాయిలకేనా ? మైనర్ పంచాయతీగా ఉన్న మద్దిరాల గ్రామానికి 13వ ఆర్థిక సంఘం ద్వారా కేవలం లక్ష రూపాయలు మాత్రమే మంజూరవుతాయి. అందులో నుంచి విద్యుత్ బకాయిలు రూ. 52,912 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన కొద్దిపాటి నిధులతో గ్రామంలో అభివృద్ధి సాధ్యమవుతుందా. ప్రత్యేక నిధులు కేటాయించకుండా ఉన్న నిధులను వీటితో వినియోగించటం భావ్యమేనా. - మాలెంపాటి త్రిపురాంబ, సర్పంచ్, మద్దిరాల బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి పేరుకు మేజర్ పంచాయతీ అయి నా అభివృద్ధి కార్యక్రమాలకు అదే తరహాలో నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎన్నికై సంవత్సరం పూర్తయినా అరకొర నిధులే వస్తున్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి జనాభా ప్రాతిపాదికన రూ 6.50 లక్షలు విడుదలవుతాయి. ఇప్పటి వరకు విద్యుత్ బకాయిలు రూ 7.68 లక్షలు ఉన్నాయి. ఆ నిధులతో బకాయిలు చెల్లిస్తే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేదెలా.బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తే పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమే. - కొమ్మనబోయిన దేవయ్య, సర్పంచ్, మురికిపూడి