GVK
-
డిజిటల్ పత్రాలకు కొత్త ప్లాట్‌ఫామ్ ‘ఈక్వల్’.. ఆవిష్కరించిన జీవీకే
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి కుమారుడు కేశవ్ రెడ్డి కొత్తగా ఈక్వల్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా స్టాక్ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. యూజర్లు తమ డిజిటల్ పత్రాలను భద్రపర్చుకునేందుకు, ఒక్క క్లిక్‌తో సురక్షితంగా, నిరాటంకంగా షేర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 10 లక్షల బీటా యూజర్లు ఉన్నారని కేశవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి వెంచర్స్, అరాజెన్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఫౌండేషన్ జీవీకే ఏఎంఆర్ఐ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. -
మళ్లీ జీవీకే చేతికి ‘108’.. మండలానికో అంబులెన్సు..
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’వాహన టెండర్‌ను మళ్లీ జీవీకే సంస్థే దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో జీవీకేతోపాటు మరో కంపెనీ పాల్గొంది. చివరకు జీవీకే సంస్థకే టెండర్ దక్కినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఈసారి 102 అమ్మ ఒడి, 104, ప్రభుత్వ ఆసుపత్రులనుంచి పేదల శవాలను వారి సొంతూళ్లకు ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాల బాధ్యత కూడా జీవీకేకే అప్పగించారు. ప్రస్తు తం 50 వాహనాలు పేదల శవాలను ఆసుపత్రుల నుంచి సొంతూళ్లకు ఉచితంగా తీసుకెళ్తున్నాయి. ఈ నాలుగు సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం 358 వాహనాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘108’అత్యవసర అంబులెన్స్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అకస్మాత్తుగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. ప్రస్తుతం 358 వాహనాలు ‘108’అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలిన వాటిని రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను గిఫ్ట్ ఎ స్మైల్ కింద రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అధికారులు చెపుతున్నారు. ఫోన్ చేసిన దాదా పు 20 నిమిషాల్లో అంబులెన్స్ బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన. ఈ అంబులెన్స్ సరీ్వసులను ప్రస్తుతం కూడా జీవీకే సంస్థనే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 108 వాహనాల నిర్వహణకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈసారి ఎంతకు ఖరారు చేశారన్న దానిపై స్పష్టత లేదు. పలు మార్పులకు శ్రీకారం.. ప్రస్తుతమున్న ‘108’అంబులెన్స్ సేవల్లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు జీవీకే సంస్థ ఏర్పాట్లు చేసే అవకాశముంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమాటిక్‌గా నడిపిస్తారు. ఆటోమాటిక్ కాల్ డి్రస్టిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోనీ ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు. ఈ వ్యవస్థ ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాక దీనిని విపత్తు నిర్వహణ విభాగానికి అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సరీ్వసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మండలానికో ’108’వాహనం.. ఇకపై ప్రతీ మండలానికి ఒక ‘108’ వాహనాన్ని సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుకలుగుతుందని, అనేకమందిని ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చనేది ప్రభు త్వ ఆలోచన. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి కేటాయించడం ద్వారా ప్రతీ 70 వేల జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. చదవండి: ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్ ట్రాకింగ్ -
కరోనా తర్వాత నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది: సంజనా
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “మణిశంకర్”.ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. 'ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు. చాలా త్వరగానే సినిమాను పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమాను నిర్మించాను. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు సంగీతం అందించాడు' అన్నారు. డైరెక్టర్ జి. వెంకట్ కృష్టణ్ మాట్లాడుతూ.. 'సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. ఇదే టీంతో మళ్లీ ఇంకో సినిమా చేస్తున్నా. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి' అన్నారు. సంజన గల్రానీ మాట్లాడుతూ.. 'కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు' అన్నారు. చదవండి: షూటింగ్‌కు అస్వస్థతకు లోనైన కన్నడ స్టార్ ఓటీటీలో నవీన్ చంద్ర రిపీట్ -
భారీగా తగ్గిన జీవీకే పవర్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.2,395 కోట్ల నుంచి రూ.154 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.182 కోట్ల నుంచి రూ.840 కోట్లకు పెరిగాయి. టర్నోవర్ రూ.94 కోట్ల నుంచి రూ.1,012 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో జీవీకే పవర్ షేరు ధర శుక్రవారం 1.43% పెరిగి రూ.2.84 వద్ద స్థిరపడింది. -
ముంబై ఎయిర్‌పోర్టు : అదానీకే మెజారిటీ వాటా
సాక్షి,ముంబై: అంచనాలకు అనుగుణంగానే గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ముంబైలో భారతదేశపు రెండవ అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (మియాల్)లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అదానీ రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. ఈ లావాదేవీ కింద ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీవీకె గ్రూపులో 50.5 శాతం వాటాతోపాటు, మైనారిటీ భాగస్వాములైన ఎయిర్పోర్ట్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఎసిఎస్ఎ) 10 శాతం, బిడ్వెస్ట్ 13.5 శాతంవాటా, మొత్తం 23.5 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. మరో 26 శాతం ఎయిర్‌ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఈ వాటా అమ్మకాల ప్రయత్నాలను అడ్డుకోవాలని చూసిన ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే కోర్టును ఆశ్రయించింది. కానీ రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో చిక్కుల్లో పడ్డ జీవీకే నిధులను సమకూర్చుకోలేక వైఫల్యం చెందింది. కాగా పారిశ్రామిక దిగ్గజంగా వెలుగొందుతున్నఅదానీ గ్రూప్ ‘భారతదేశపు ప్రముఖ విమానాశ్రయ ఆపరేటర్’ కావాలనే ప్రణాళికలను బహిరంగంగా వెల్లడించిన అదానీ ఆవైపుగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే లక్నో, జైపూర్, గౌహతి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరుల్లో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అమెరికా తరహాలో ‘108’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో ‘108’అత్యవసర వైద్య సేవలను రాష్ట్రంలోని ప్రజలకు అందజేస్తామని అరబిందో ఫార్మా ఫౌండేషన్ వెల్లడించింది. తమకు ‘108’అత్యవసర వైద్య సేవలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. జీవీకే–ఈఎంఆర్‌ఐల కాలపరిమితి ముగిసినందున ఈ విన్నపం చేసింది. నామినేషన్ పద్ధతిలో తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ‘108’సేవలను నిర్వహించే సత్తా తమకుందని తెలిపింది. తమకు ఈ రంగంలో ఎంతో అనుభవం ఉందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది. దాంతోపాటు ‘108’సేవలను ఏవిధంగా అత్యంత మెరుగ్గా అందజేస్తామన్న వివరాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనా నివేదికను వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది. అమెరికాలో అత్యవసర వైద్య సేవలు అందించే ‘911’మాదిరిగానే తెలంగాణలోనూ నిర్వహిస్తామని, తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేసింది. దాంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ)లను కూడా మెరుగుపరుస్తామని తెలిపింది. ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేలా కృషిచేసి మాతాశిశు మరణాల రేటును తగ్గిస్తామని పేర్కొంది. ప్రాంతాల వారీగా జబ్బులను సూక్ష్మంగా పరిశీలించి సమగ్ర డేటా సేకరిస్తామని తెలిపింది. ప్రస్తుతమున్న అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచే నూతన మోడల్ ఏవిధంగా ఉంటుందో ఆ నివేదికలో తెలిపింది. ఇదిలావుండగా గతంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అరబిందోకు ‘108’ను ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖకు, నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘108’ను జీవీకే నుంచి అరబిందోకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్ రూపకల్పన.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, అత్యంత సమర్థవంతంగా, నాణ్యమైన సేవలు అందిస్తా మని అరబిందో ముఖ్యమంత్రికి పంపిన లేఖలో నూ, వైద్య ఆరోగ్య శాఖకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. వాటిల్లో ఇంకా ఏముందంటే.. ప్రస్తుతమున్న ‘108’అత్యవసర అంబులెన్సులను ఉప యోగించుకుంటూ, వాటిల్లో అనేక మార్పులు చేర్పులూ చేస్తారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమేటిక్‌గా నడిపిస్తారు. ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోని ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ను రూపొందిస్తారు. ఇది ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని ఆలోచన. అంతేకాదు ఈ అప్లికేషన్‌ను విపత్తు నిర్వహణకు అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సర్వీసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యంత సమర్థులైన శిక్షణ కలిగిన సిబ్బందిని నియమిస్తారు. మెడికల్, పోలీస్, ఫైర్ ఎమర్జెన్సీలకు సంబంధించి కీలకమైన ఏరియాలు, సంఘటనలు పరిశోధించి సమగ్ర డేటా సేకరిస్తారు. అత్యవసర సంఘటనలకు సంబంధించిన అంశాలను విశ్లేషిస్తారు. ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఎన్జీవోలతోనూ అనుసంధానం చేయనున్నారు. పారదర్శకంగా సేవలు... అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ‘108’అత్యవసర సేవలను అందిస్తామని అరబిందో హామీ ఇచ్చింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని అత్యంత వేగంగా (ర్యాపిడ్) గుర్తించి, తక్కువ సమయంలో బాధితుడిని చేరుకుంటామని తెలిపింది. అలాగే బాధితుడిని తీసుకెళ్లే ఆస్పత్రికి ముందస్తు సమాచారం ఇస్తామని వివరించింది. భవిష్యత్‌లో అన్ని గ్రామాల్లో ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అన్ని కార్పొరేట్ కంపెనీల్లోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తారు. శాటిలైట్ ట్రామా సెంటర్లను రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేస్తారని ఆ నివేదికలో అరబిందో వెల్లడించింది. -
నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు రూ.8,500 కోట్లు
హైదరాబాద్: నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు తొలి దశకు జీవీకే గ్రూప్ రూ.8,500 కోట్లు వెచ్చించనుంది. తొలి దశ పూర్తి అయితే ఏటా ఒక కోటి మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలవుతుంది. బుధవారం ఇక్కడ జరిగిన జీవీకే పవర్, ఇన్ఫ్రా వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు జీవీకే గ్రూప్ చైర్మన్ జి.వి.కె.రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. మరో రూ.2,500–3,000 కోట్లు వ్యయం చేయడం ద్వారా సామర్థ్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. మొత్తం 1,160 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 6 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మరో భాగస్వామి అయిన బిడ్వెస్ట్ నుంచి 13.5 శాతం వాటాను కొనుగోలు చేయాలని జీవీకే నిర్ణయించింది. కాగా, పంజాబ్‌లో 540 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు తాలూకు రూ.3,510 కోట్ల రుణాల బదిలీకి డాయిష్ బ్యాంకుతో చర్చిస్తోంది. -
నవీ ముంబై విమానాశ్రయ పనులు ఎల్అండ్టీ చేతికి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే అనుబంధ కంపెనీ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టును ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్కు అప్పగించింది. ఇందులో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రన్‌వే, డిపార్చర్, అరైవల్ టెర్మినల్, అప్రాన్ సిస్టమ్స్, ట్యాక్సీవే సిస్టమ్స్, ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, యుటిలిటీస్ తదితర పనులను ఎల్అండ్టీ చేపడుతుంది. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ పనులను జహా హాదిద్ ఆర్కిటెక్ట్స్ దక్కించుకుంది. -
ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంచుకున్న జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్) జీవీకే గ్రూప్ తన వాటాను పెంచుకుంది. ఎంఐఏఎల్‌లో తమ అనుబంధ కంపెనీ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 10 శాతం వాటాకు సమానమైన 12 కోట్ల షేర్లను రూ.924 కోట్లు వెచ్చించి ఏసీఎస్ఏ గ్లోబల్ నుంచి దక్కించుకున్నట్టు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శుక్రవారం తెలిపింది. ఇటీవల బిడ్వెస్ట్ నుంచి కొనుగోలు చేసిన 13.5 శాతం వాటాతో కలిపి ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్ వాటా తాజా డీల్‌తో 50.5 శాతం నుంచి 74 శాతానికి ఎగసింది. -
అప్పుల కుప్పలు... ఈ పవర్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. వీటిలో ల్యాంకోకి చెందిన ప్రాజెక్టులు 4, జీఎంఆర్ ఎనర్జీకి చెందినవి మూడు, జీవీకే ఇండస్ట్రీస్ ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులపై పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్టాండింగ్ కమిటీ (విద్యుత్ రంగం) ఈ విషయాలు పొందుపర్చింది. 2017 జూన్ నాటికి ఆర్బీఐ గణాంకాల ప్రకారం వీటి విలువ సుమారు రూ. 1.74 లక్షల కోట్లుగా ఉంది. అదానీ, ఎస్సార్, జేపీ ప్రాజెక్టులు కూడా వీటిలో ఉన్నాయి. నివేదిక ప్రకారం ల్యాంకోకి చెందిన అమర్ కంటక్ ప్రాజెక్టు రుణ బకాయి రూ.8,782 కోట్లు, అన్పారా (రూ. 3,071 కోట్లు), విదర్భ (రూ. 4,762 కోట్లు), బాబంధ్ రుణాలు రూ. 6,976 కోట్లు మేర ఉన్నాయి. అటు జీఎంఆర్ ఎనర్జీ వరోరా ప్రాజెక్టు రుణభారం రూ. 2,905 కోట్లు, రాయ్ఖేడా (రూ. 8,174 కోట్లు), కమలాంగా ప్రాజెక్టు రుణం రూ. 4,100 కోట్లుగా ఉంది. జీవీకే ఇండస్ట్రీస్‌కి చెందిన గోయింద్వాల్ సాహెబ్ ప్రాజెక్టు బకాయిలు రూ. 3,523 కోట్ల మేర ఉన్నాయి. కేఎస్కే మహానది పవర్ కంపెనీకి చెందిన అకల్తారా ప్రాజెక్టు రుణభారం ఏకంగా రూ. 17,194 కోట్లు ఉంది. అదానీ గ్రూప్, జేపీ గ్రూప్‌కి చెందిన కొన్ని ప్రాజెక్టుల రుణ బాకీలు రూ. 11,000 కోట్ల పైగా ఉన్నాయి. -
జీవీకే, జీఎంఆర్ విమానాశ్రయాలకు అవార్డులు
న్యూఢిల్లీ: జీవీకే, జీఎంఆర్‌కు చెందిన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు పలు విభాగాల్లో ప్రపంచంలోనే మేటి ఎయిర్‌పోర్టులుగా నిలిచి ‘ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డులను’ సొంతం చేసుకున్నాయి. ఇందులో జీవీకే గ్రూపు ఆధ్వర్యంలోని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సీఎస్ఐఏ) ‘కస్టమర్ల అనుభవం’లో ప్రపంచంలోనే మేటి విమానాశ్రయంగా నిలిచింది. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ఏసీఐ) నిర్వహించిన సర్వేలో లక్షల మంది ప్రయాణికులు ఈ విషయంలో సీఎస్ఐఏకు ఓటేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలిలో 176 దేశాలకు చెందిన 1,953 విమానాశ్రయాలకు సభ్యత్వం ఉంది. 4 కోట్లకు పైగా ప్రయాణికులు.. ఢిల్లీ నెంబర్ 1 జీఎంఆర్ గ్రూపు నిర్వహణలోని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఐజీఐఏ) ఏటా 40 మిలియన్లకు పైగా ప్రయాణికుల రాకపోకలతో... ఈ విభాగంలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు సొంతం చేసుకున్నట్టు జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలిపింది. కోటిన్నర లోపు ప్రయాణికులు... శంషాబాద్‌కే ఓటు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ప్రపంచ అత్యుత్తమ ఎయిర్‌పోర్టు అవార్డును దక్కించుకుంది. ఏటా ఐదు నుంచి పదిహేను మిలియన్ల ప్రయాణికుల విభాగంలో అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించింది. -
హైదరాబాద్‌లో కెవెంటర్స్ ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ డెయిరీ బ్రాండ్ కెవెంటర్స్... హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించింది. తొలుత సుజనా ఫోరం, జీవీకే, ఇనార్బిట్లలో మూడు ఔట్లెట్లను ప్రారంభించిన ఈ సంస్థ... 2019 చివరి నాటికి నగరవ్యాప్తంగా 32 స్టోర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, డైరెక్టర్ షోరభ్ సీతారామ్ మాట్లాడుతూ.. థిక్, క్లాసిక్, ఫ్రూటీ షేక్స్లలో 27 రకాల పానీయాలను అందుబాటులో ఉంచామని, వీటి ధరలు రూ.99 నుంచి 250 వరకు ఉంటాయని తెలిపారు. ‘‘ప్రస్తుతం దేశంలో 30 ప్రాంతాల్లో 170, నేపాల్, యూఏఈ దేశాల్లో 12 ఔట్‌లెట్లున్నాయి. వీటిల్లో 20 శాతం మాత్రమే సొంతవి. మిగిలినవన్నీ ఫ్రాంచైజీ విధానంలో ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. 2019 ముగింపు నాటికి దేశ, విదేశాల్లో కలిపి వీటి సంఖ్యను 1,500లకు చేర్చాలని లకి‡్ష్యంచినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కెవెంటర్స్ స్టోర్లకు పాల ఉత్పత్తుల సరఫరా కోసం మదర్ డెయిరీతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.32 కోట్ల వ్యాపారాన్ని చేశామని, ఈ ఏడాది రూ.75 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచామని తెలిపారు. -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు జీవీకే టాటా
♦ మిగిలిన 10 శాతం వాటాలు కూడా విక్రయం ♦ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు విక్రయం; విలువ రూ.1,290 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి పూర్తిగా వైదొలిగింది. ఇందులో మిగిలి ఉన్న 10 శాతం వాటాను కెనడాకి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త ప్రేమ్‌వత్స సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్‌కు రూ.1,290 కోట్లకు విక్రయించింది. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో వత్స వాటాలు 48 శాతానికి పెరిగాయి. ఇంకా సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్‌కి 26 శాతం, ఎయిర్పోర్ట్ అథారిటీ.. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెరి 13 శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం రుణభారాన్ని తగ్గించుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు విమానాశ్రయం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నామని జీవీకే గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే, విమానాశ్రయాల వ్యాపార విభాగం తమకు కీలకంగానే కొనసాగుతుందని ఆయన తెలియజేవారు. ముంబై విమానాశ్రయంతో పాటు ఇటీవలే బిడ్డింగ్‌లో దక్కించుకున్న నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారాయన. ముంబై ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు. దాదాపు రూ. 22,000 కోట్ల మేరకు పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో జీవీకే గ్రూప్ పలు ఆస్తుల విక్రయానికి ప్రయత్నాలు చేస్తోంది. రద్దీ విమానాశ్రయాల్లో మూడోది బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నిర్మించింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మూడోది. గతేడాది మార్చిలో ఈ ఎయిర్పోర్ట్ విలువ రూ.6,500 కోట్లుగా లెక్కగట్టారు. 10% వాటా, యాజమాన్య నియంత్రణనను తన దగ్గరే అట్టి పెట్టుకుని, రూ.2,202 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 33% వాటాను విక్రయించేట్లుగా జీవీకే విక్రయించింది. దీంతో పాటు ఫ్లూగాఫెన్ జ్యూరిక్ ఏజీ నుంచి మరో 5 శాతం వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ప్రేమ్ వత్స బెంగళూరు విమానాశ్రయంలో తన వాటాలను 38 శాతానికి పెంచుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు మిగిలి ఉన్న 10 శాతం వాటాలను, యాజమాన్య నియంత్రణను కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియాకి విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు జీవీకే జూన్‌లో ప్రకటించింది. -
రెండింతలైన జీవీకే నష్టం
జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నష్టాలు దాదాపు రెండింతలయ్యాయి. మార్చి త్రైమాసికంలో నికర నష్టం క్రితంతో పోలిస్తే రూ.105 కోట్ల నుంచి రూ.206 కోట్లకు ఎగబాకింది. టర్నోవరు రూ.17 కోట్ల నుంచి రూ.26 కోట్లకు చేరింది. 2016–17లో నికర నష్టం రూ.123 కోట్ల నుంచి రూ.271 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.67 కోట్ల నుంచి రూ.79 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలియజేసింది. -
‘నవీ ముంబై’.. జీవీకేదే!
చేజిక్కిన ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు ♦ చివరి వరకు ప్రయత్నించిన జీఎంఆర్ ♦ ప్రాజెక్టు విలువ రూ.16,000 కోట్లు ♦ 2019 నాటికి అందుబాటులోకి.. సాక్షి, బిజినెస్ ప్రతినిధి: నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును తెలుగు రాష్ట్రానికి చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే గ్రూపునకు చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్(ఎంఐఏఎల్)తో పాటు జీఎంఆర్, టాటా రియల్టీ, హిరానందని డెవలపర్స్ వంటి సంస్థలు పోటీపడినా చివరకు జీవీకే, జీఎంఆర్‌లు మాత్రమే ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. జీఎంఆర్ కంటే జీవీకే ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు రావడంతో జీవీకేకి కాంట్రాక్టు పనులు అప్పచెప్పినట్లు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ప్రకటించింది. ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేయడానికి సోమవారం ఆఖరి రోజు కాగా కేవలం రెండు బిడ్లు మాత్రమే వచ్చాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదాయంలో 12.60 శాతం వాటా ఇవ్వడానికి జీవీకే ముందుకు రాగా, జీఎంఆర్ 10.44 శాతం ఆఫర్ చేసింది. ఇప్పటికే జీవీకే ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను, జీఎంఆర్ ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ముంబై ఎయిర్‌పోర్టు సామర్థ్యం నిడిపోవనుండటంతో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నవీ ముంబైలో కొత్త ఏయిర్పోర్టు నిర్మించాలని తొలుత 1997లో ప్రతిపాదించగా, దీన్ని 2007లో ప్రభుత్వం ఆమోదించింది. అప్పటి నుంచి భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి అనేక అవాంతరాలను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టు చివరకు సోమవారం బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. 2019 డిసెంబర్ నాటికీ ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవీకే సమర్పించిన బిడ్డింగ్‌కు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఆమోదం తర్వాత అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సిడ్కో అధికారులు తెలిపారు. 2,867 ఎకరాల్లో 5,23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు రన్‌వేలతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే నిర్మించనుంది. ముంబైలోని ఛత్రపతి శివాజి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్టు సామర్థ్యం 4.5 కోట్లకు చేరుకోగా, వచ్చే రెండేళ్లలో ఇది 5.5 కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుత ఎయిర్‌పోర్టు నవీ ముంబైకి దూరంగా ఉన్న దృష్ట్యా నవీ ముంబైలో కొత్త ఎయిర్‌పోర్టుకు ఓకే చెప్పారు. గర్వకారణం: జీవీకే రెడ్డి నవీ ముంబై ప్రాజెక్టు దక్కించుకోవడం తమకు గర్వకారణమని, సంక్లిష్టమైన ముంబై విమానాశ్రయంలో టెర్మినల్ 2ను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమ సమర్ధతకు ఇది తార్కాణమని జీవీకే గ్రూప్ వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి పేర్కొన్నారు. 15 ఏళ్ల సాఫ్ట్‌లోన్: ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి అయ్యే ప్రీడెవలప్మెంట్ వ్యయాన్ని సిడ్కో సాఫ్ట్ లోన్‌గా ఇవ్వనుంది. రుణ కాలపరిమితిని తొలుత 11 ఏళ్లుగా నిర్ణయించగా ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకు పొడిగించారు. అసలు వ్యయంతో సం బంధం లేకుండా ప్రీడెవలప్మెంట్ వ్యయాన్ని రూ. 3,500 కోట్లకు పరిమితం చేశారు. 3,420 కోట్లను 11వ ఏడాది నుంచి ప్రతీనెలా చెల్లించాలి. రూ.430 కోట్లను సిడ్కో ఈక్విటీగా పరిగణిస్తారు. -
20లోగా కౌంటర్ దాఖలు చేయండి...
- హైకోర్టు ఆదేశం -108 ఉద్యోగులకు సెప్టెంబర్ వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు సాక్షి, హైదరాబాద్ 108 అంబులెన్సులు నిర్వహణ దక్కించుకున్న యుకెఎస్‌ఎఎస్-బీవీజీ కన్సార్టియంపై జీవీకే సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సర్కారు ఏంచేయాలో పాలుపోవడం లేదు. టెండరు నిబంధనల ప్రకారం ఈ రెండు సంస్థల కన్సార్టియంకు అర్హత లేదని జీవీకే సంస్థ కోర్టుకు పత్రాలను దాఖలు చేసింది. దీంతో 108 అంబులెన్సులను తక్షణమే ఆ సంస్థలకు ఇవ్వకుండా ఉపసంహరించుకోవాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థలకు అర్హత ఉందని ఎలా చేయాలో కసరత్తు చేస్తోంది. కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కౌంటర్ దాఖలు చేయడంలో భాగంగా టెండరు దక్కించుకున్న సంస్థల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో కాల్ సెంటర్‌గానీ, అంబులెన్సులు నిర్వహించిన అనుభవం గానీ ఈ సంస్థలకు లేదని జీవీకే హైకోర్టుకు చెప్పింది. సెప్టెంబర్ జీతాలు ఇప్పటికీ లేవు అక్టోబర్ నెల ముగుస్తున్నా 108 ఉద్యోగుల నిర్వహణకు ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉద్యోగులకు తామే సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని, సర్కారు నుంచి తమకు రావాల్సిన వేతనాలు ఇంకా రాలేదని జీవీకే సంస్థ ప్రతినిధులు చెప్పారు. సుమారు రూ.7 కోట్ల బకాయిలు ఉన్నాయని, నిధులు తక్షణమే చెల్లించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 6 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన వాహనాలన్నీ మరమ్మతులతో ఆగిపోతున్నాయని, దీంతో ఎమర్జెన్సీ కాల్స్‌కు సకాలంలో హాజరు కాలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. 108 అంబులెన్సుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుగుతోంది. -
వేలంలోనే బొగ్గు కొనుక్కోండి..
జీవీకే ‘పంజాబ్’ ప్లాంటుకు కేంద్రం సూచన హైదరాబాద్: పంజాబ్‌లోని గోయింద్వాల్ సాహిబ్ విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును ప్రత్యేక ఈ-వేలం ద్వారా కొనుగోలు చేసుకోవాలని జీవీకే పవర్‌కు అంతర్మంత్రిత్వ శాఖల బృందం సూచించింది. బొగ్గు సరఫరాకు సంబంధించిన అవగాహన ఒప్పందం గడువు ఈ ఏడాది జూన్ 30 నాటికే పూర్తయ్యిందని, దీన్ని పొడిగించబోవడం లేదని స్టాండింగ్ లింకేజ్ కమిటీ స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గోయింద్వాల్ సాహిబ్ వద్ద ఏర్పాటైన 540 మె.వా. థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనిట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 6న, యూనిట్ 2 ఏప్రిల్ 16న అందుబాటులోకి వచ్చాయి. అయితే, యూనిట్ 1లో బొగ్గు లభ్యత లేకపోవడం వల్ల ఏప్రిల్ 22 నుంచి ఉత్పత్తి నిల్చిపోయింది. ప్లాంటు నిరుపయోగంగా పడి ఉన్నందున బొగ్గు సరఫరా కల్పించాలంటూ జీవీకే కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
రుణభారం తగ్గుదలపై జీవీకే కసరత్తు
మరిన్ని ఆస్తుల అమ్మకంపై దృష్టి రాజస్థాన్‌లో రహదారి ప్రాజెక్టు విక్రయంపై చర్చలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా మరిన్ని ఆస్తుల విక్రయంపై జీవీకే పవర్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఒక రహదారి ప్రాజెక్టు విక్రయించడంపై దృష్టి పెట్టింది. డియోలీ-కోటా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు దాదాపు తుది దశలో ఉన్నట్లు వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సంస్థ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 332.16 కి.మీ. మేర ఉన్న ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు గతేడాది ఆగస్టులో పాక్షికంగా ప్రారంభమయ్యాయి. మార్చి 31 నాటికి ఇది రూ. 28 కోట్ల ఆదాయం ఆర్జించింది. మరోవైపు, జీవీకే కన్సార్షియం సారథ్యంలోని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్).. స్థానిక జీవీకే స్కైసిటీలో అయిదు ప్లాట్లను లీజుకిచ్చే దిశగా బిడ్లను ఆహ్వానించింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, హోటళ్లు తదితరాలతో పదేళ్లలో 20 మిలియన్ చ.అ. మేర స్కైసిటీని వ్యాపార సముదాయంగా తీర్చిదిద్దాలని ఎంఐఏఎల్ యోచిస్తోంది. ఈ క్రమంలో స్థలాల లీజుకు సంబంధించి డిపాజిట్లు, రెంటు మొదలైన వాటి ద్వారా కంపెనీకి కనీసం రూ.1,500 కోట్ల మేర రాగలవని ఎస్టేట్ కన్సల్టెంట్ల అంచనా. దాదాపు రూ. 22,500 కోట్ల మేర ఉన్న రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొన్నాళ్ల క్రితమే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజారిటీ వాటాలను ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్‌కు సుమారు రూ.2,100 కోట్లకు సంస్థ విక్రయించింది. -
బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే వాటా విక్రయం
♦ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 33 శాతం వాటా అమ్మకం ♦ డీల్ విలువ రూ. 2,149 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతిపెద్ద డీల్‌కు తెరలేపింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (బీఐఏఎల్) 33 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ గ్రూప్‌నకు రూ.2,149 కోట్లకు విక్రయిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ ద్వారా జీవీకే రూ.2,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. అలాగే ఏటా రూ.300 కోట్ల వడ్డీ ఆదా చేసుకోనుంది. జూన్-జూలైకల్లా లావాదేవీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. రుణ భారం నుంచి బయట పడేందుకు విమానాశ్రయ వ్యాపారంలో వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నట్టు జీవీకే 2014లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అతిపెద్ద సంస్థతో చేతులు కలిపింది. ఫెయిర్‌ఫ్యాక్స్ భాగస్వామ్యంతో విమానాశ్రయంలో కొత్త టెర్మినల్తోపాటు రన్‌వేను ప్రపంచ స్థాయిలో విస్తరిస్తామని జీవీకే గ్రూప్ ఫౌండర్ చైర్మన్, ఎండీ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వాటాదారులు వీరే.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీవీకేకు 43 శాతం వాటా ఉంది. అలాగే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కర్ణాటక ప్రభుత్వం, జ్యూరిచ్ ఎయిర్పోర్ట్, సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్ ఇతర వాటాదారులుగా ఉన్నాయి. బీఐఏఎల్‌లో జీవీకే 2009లో 12 శాతం వాటాను రూ.485 కోట్లకు తీసుకుంది. అదే ఏడాది రూ.686 కోట్లు చెల్లించి 17 శాతం వాటా పొందింది. 2011లో 14 శాతం వాటాను రూ.614 కోట్లతో దక్కించుకుంది. మొత్తంగా 43 శాతం వాటా కోసం జీవీకే రూ.1,785 కోట్లు వ్యయం చేసింది. బీఐఏఎల్ ఎండీగా జీవీ సంజయ్‌రెడ్డి, సహ చైర్మన్‌గా జీవీకే రెడ్డి కొనసాగుతారని ఫెయిర్‌ఫ్యాక్స్ చైర్మన్ ప్రేమ్ వత్స వెల్లడించారు. భారత సంతతికి చెందిన.. కెనడాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌ను భారత్‌లో పుట్టిన ప్రేమ్ వత్స స్థాపించారు. మారిషస్‌లో ఉన్న అనుబంధ కంపెనీల ద్వారా బీఐఏఎల్‌లో వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ కైవసం చేసుకోనుంది. బీఐఏఎల్‌లో వాటా కొనుగోలు చేయడం భారత్‌లో ఫెయిర్‌ఫ్యాక్స్‌కు అతిపెద్ద డీల్. ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్, నేషనల్ కొలాటెరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఫెయిర్‌ఫ్యాక్స్‌కు వాటా ఉంది. అలాగే అనుబంధ కంపెనీలైన థామస్ కుక్, క్వెస్ కార్ప్ ద్వారా భారత్‌లోని ఇతర కంపెనీల్లోనూ వాటా పొందింది. -
జీఎంఆర్, జీవీకే, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్
పీఎస్డీఎఫ్ స్కీమ్ కింద ఈ-వేలంలో కేటాయింపు న్యూఢిల్లీ: గ్యాస్ సరఫరా లేక నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రభుత్వం తాజాగా దిగుమతయ్యే గ్యాస్‌ను కేటాయించింది. ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ లిమిటెడ్ వెబ్సైట్ ద్వారా నిర్వహించిన ఈ-వేలంలో రోజుకు 7.72 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) రీ-గ్యాసిఫైడ్ సహజ వాయువు(ఆర్-ఎల్ఎన్జీ)ను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ గ్యాస్ సరఫరా జరుగుతుంది. దీనిద్వారా 6.79 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం కానుంది. బిడ్డింగ్‌లో రత్నగిరి గ్యాస్ అండ్ పవర్(దబోల్ ప్రాజెక్టు)కు అత్యధికంగా 2.35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ దక్కింది. కేటాయింపులు జరిగిన ఇతర సంస్థల్లో ల్యాంకో కొండపల్లి పవర్(1.58 ఎంఎంఎస్‌సీఎండీ), జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ(1.09), కోనసీమ గ్యాస్ పవర్(0.71), పయనీర్ గ్యాస్ పవర్(0.55), జీఎంఆర్ వేమగిరి పవర్(0.52), గామా ఇన్ఫ్రాప్రాప్(0.35), జీవీకే ఇండస్ట్రీస్(0.32), స్రవంతి ఎనర్జీ(0.25), ఉన్నాయి. బిడ్డర్లు నెగటివ్ సబ్సిడీ లేదా ఒక్కో యూనిట్‌కు 3 పైసల వరకూ ప్రీమియం రేటును బిడ్ చేయడంతో ప్రభుత్వానికి ఈ-వేలం ద్వారా రూ.18 కోట్ల మేరకు సబ్సిడీ భారం తగ్గనుంది. పవర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫండ్(పీఎస్డీఎఫ్) కింద నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు దిగుమతయ్యే గ్యాస్ కొనుగోళ్ల కోసం ఆర్థిక సహకారం అందుతుంది. 2015-16లో రూ. 3,500 కోట్లు, 2016-17లో రూ.4,000 కోట్ల చొప్పున ఈ ఫండ్ నుంచి నిధులను కేటాయించారు. -
జీవీకే బయోసెన్సైస్‌కు చుక్కెదురు
54 డ్రగ్స్ మార్కెటింగ్‌ను నిషేధించిన జర్మనీ బెర్లిన్: జీవీకే బయో సెన్సైస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన 54 మెడిసిన్స్‌ను మార్కెటింగ్ చేయకూడదని జర్మనీ డ్రగ్స్ రెగ్యులేటర్ ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ 700 జెనరిక్ డ్రగ్స్‌పై నిషేధం విధించటం తెలిసిందే. ఈయూ నిర్ణయంలో భాగంగా దేశంలోని సప్లై చైన్ నుంచి మరిన్ని ఔషధాలను తొలగించి కొత్త జాబితాను ప్రచురించామని జర్మన్ మెడిసిన్స్, మెడిసిన్ పరికరాల పెఢ రల్ ఇన్స్టిట్యూట్(బీఎఫ్ఏఆర్ఎం) పేర్కొంది. జీవీకే బయో వైద్య పరిశోధనల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. జీవీకే వైద్య పరిశోధనలు నిర్వహించిన ఔషధాల వినియోగం వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంచేసింది. జీవీకే 2004-14 మధ్యకాలంలో చేసిన బయో-ఈక్వలెన్స్ స్టడీస్ దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బీఎఫ్ఏఆర్ఎం పేర్కొంది. -
తగ్గిన జీవీకే నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవికే ఇన్ఫ్రా మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 865 కోట్ల ఆదాయంపై రూ. 109 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 716 కోట్ల ఆదాయంపై రూ. 235 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఎయిర్పోర్ట్ విభాగం రూ. 219 కోట్ల లాభాలను అందించడం నష్టాలు తగ్గడానికి ప్రధాన కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఏడాది మొత్తం మీద జీవీకే ఇన్ఫ్రా రూ. 3,050 కోట్ల ఆదాయం పై రూ. 835 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2013-14లో కంపెనీ రూ. 2,821 కోట్ల ఆదాయంపై రూ. 369 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. -
ఆగిన 108
సమ్మెలోకి ఉద్యోగులు నిలిచిపోయిన సర్వీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం ఆపదలో ఉన్నవారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించే అపర సంజీవని ఆగిపోయింది. 108 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని, గత సమ్మెకా లంలో తొలగించిన ఉద్యోగు లను తిరిగి విధుల్లోకి తీసుకో వాలని తదితర డిమాండ్లతో సిబ్బంది సమ్మెకు దిగారు. నల్లగొండ టౌన్ ఆపదలో ఉన్నవారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించే అపర సంజీవని ఆగిపోయింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. జీవీకే యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకకించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 36 అంబులెన్స్‌లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 108 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని, గతంలో సమ్మెకాలంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలని, కనీసం వేతనం చట్టాన్ని అమలు చేస్తూ నెలకు రూ.20 వేతనాలను చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిగంటల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అయితే జిల్లాలోని 36 అంబులెన్స్‌లకు సంబంధించిన టెక్నీషియన్లు, పెలైట్లు కలిపి 144 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవలకు అంతరాయం లేదు 108 ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి వె ళ్లనప్పటికీ అత్యవసర సేవలకు అంతరాయ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అంబులెన్స్‌లను నడిపిస్తున్నామని 108 సేవలను జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమ నాగేందర్ తెలిపారు. గతంలో శిక్షణ పొందిన డ్రైవర్లు, 104 వాహనాల డ్రైవర్లను, వైద్య ఆరోగ్య శాఖ పారామెడికల్ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటున్నాము. అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము. 108 ఉద్యోగుల ర్యాలీ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లిన తమకు అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు మద్దతు తెలపాలని కోరుతూ గురువారం స్థానిక గడియారం సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 108 ఉద్యోగులు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తొంట భాస్కర్ మాట్లాడుతూ తాము సమ్మెలోకి వె ళ్లడడంతో అనుభవం లేని డ్రైవర్లు, సిబ్బందితో వాహనాలను నడిపించడం దారుణమన్నారు. పేదల జీవితాలతో చెలగాటమాడడం మానుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నగేష్, రాజు, సత్యనారాయణ, కోటేష్, చంద్రమోహన్, వెంకన్న, మల్లేష్, చారి, సరేష్, సతీష్, రమేష్, సంజీవరెడ్డి, సైదులు, నిరంజన్, శ్రీను, పవన్, వెంకట్రాములు, నరేష్, స్టాలిన్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. -
‘108’ సమ్మె షురూ!
సాక్షి, హైదరాబాద్: ‘108’లో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ కార్మిక శాఖ చొరవ చూపినా ఫలితం లేకుండా పోయింది. రెండోసారి కూడా చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల మొదటి దఫా చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘108’ యాజమాన్యం జీవీకే-ఈఎంఆర్ఐ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం కార్మికశాఖ చర్చలు నిర్వహించింది. ఉద్యోగుల 15 డిమాండ్లలో ఒక్కదానిని కూడా ఆమోదించకపోవడంతో అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ‘108’ అత్యవసర వైద్యసేవలు స్తంభించే అవకాశముంది. కార్మికశాఖ కమిషనర్ డి.అజయ్ ఆధ్వర్యంలో రెండోసారి జరిగిన చర్చల్లో ఉద్యోగుల పక్షాన టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రూప్సింగ్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, సలహాదారుడు జూపల్లి రాజేందర్, ప్రధానకార్యదర్శి జువ్వాడి శ్రీనివాస్, జీవీకే-ఈఎంఆర్ఐ జాతీయ ప్రతినిధి శ్రీనివాస్, రామచంద్రరాజు పాల్గొన్నారు. చర్చల్లో తెలంగాణ ‘108’ ఉద్యోగ నేతలెవరూ పాల్గొనకపోవడం గమనార్హం. సమస్యల పరిష్కారానికి యాజ మాన్యం ముందుకు రాలేదని ‘108’ ఉద్యోగుల సంఘం నేత పల్లి అశోక్ వెల్లడించారు. కాలయాపన కోసం ఒక కమిటీ వేయాలని యాజమాన్యం కోరిందన్నారు. తొలగించిన ఉద్యోగులను తీసుకోబోమని జీవీకే స్పష్టం చేసినట్లు సమాచారం. 1800 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని, ‘108’ అంబులెన్స్ వాహనాలు 300 వరకు నిలిచిపోతాయని, అందరూ సహకరించాలన్నా రు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని జీవీకే యాజమాన్యం అన్నట్లు సమాచా రం. కొంతమందే సమ్మెకు : మంత్రి ‘108’ సమ్మెలో కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని, మెజారిటీ ఉద్యోగులు పాల్గొనడంలేదని, అందువల్ల సమ్మె ప్రభావం పెద్దగా ఉండద ని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
ఐపీవోకి జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్
ముంబై: ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగమైన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సన్నద్ధమవుతోంది. సుమారు 250 మిలియన్ డాలర్లు సమీకరించేందుకు త్వరలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు సమాచారం. ఇష్యూ బాధ్యతలను సిటీగ్రూప్, యాక్సిస్ క్యాపిటల్ తదితర సంస్థలకు అప్పగించినట్లు తెలిసింది. ఇదే జరిగితే దేశీయంగా లిస్టయిన తొలి విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీవీకే ఎయిర్‌పోర్టే కానుంది. ఐపీవో నిధుల్లో కొంత భాగాన్ని కంపెనీ రుణభారం తగ్గించుకునేందుకు, విస్తరణ కార్యకలాపాలకు ఉపయోగించుకోనుంది. జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ ప్రస్తుతం దేశీయంగా ముంబై, బెంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.