Harika
-
వాళ్లతో కలిసి తిరుమల శ్రీవారి దర్శించుకున్న బిగ్‌బాస్ హారిక (ఫొటోలు)
-
Atchutapuram: ఒక్కరోజు ఆగినా బతికేది!
సాక్షి, కాకినాడ: సోదరుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన హారిక మరొక రోజు కాకినాడలోనే ఉండి ఉంటే మృత్యువు ఒడికి ఆమె చేరి ఉండేది కాదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ఎవరికైనా గుండెలు పిండేసే విధంగా ఉంటుంది.కడు పేదరికంలో పుట్టి చదువుల తల్లిగా ఎదిగి ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందిన హారిక కు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తల్లి అన్నపూర్ణ, నానమ్మ సంరక్షణలో పెరిగింది.చక్కటి విద్యాభ్యాసంతో మెరిట్ విద్యార్థినిగా పేరు గడించింది. రాఖీ సందర్భంగా పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది , మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది. -
ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ
⇒ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించిన నేను ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్న టైమ్‌లో అంకిత్ ద్వారా ‘కమిటీ కుర్రోళ్ళు’ కథ నా వద్దకు వచ్చింది. ఈ కథ నాకు, మా నాన్నకి బాగా నచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర అనుభూతిని పొందలేదు. ఈ కథలో నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. అందుకే ఈ కథతో ఎలాగైనా సినిమా నిర్మించాలని ఫిక్స్ అయి, తీశాను. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాశాడు వంశీ. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. నాకు నటించడమే ఇష్టం. నిర్మాత కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘ముద్దపప్పు ఆవకాయ్’ టైమ్ నుంచి అలా జరిగిపోయిందంతే. ⇒ ప్రతిభ ఒక్కటే కాదు... క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతామని చిరంజీవిగారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ వంశీలో చూశాను. ఈ చిత్రంలోని పదకొండు మంది అబ్బాయిల పాత్రల్లో నన్ను నేను ఊహించుకున్నాను. ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తాడు. ⇒ నా గురించి బయటివారు చేసే విమర్శలు, పొగడ్తల్ని పట్టించుకోను. నా గురించి నిజాయతీగా ఉన్నది ఉన్నట్లు (పొగడ్త అయినా, విమర్శ అయినా) చెప్పేది మా అమ్మానాన్న (పద్మజ, నాగబాబు), అన్నయ్యే (వరుణ్ తేజ్). ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాని మా అన్నయ్య, వదిన (లావణ్య త్రిపాఠి) చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేశాను. ‘‘మంచి కథలకే తొలిప్రాధాన్యం ఇస్తా. కథ బాగుండి నా పాత్రకిప్రాధాన్యం ఉంటే మిగతా అంశాలను పట్టించుకోను. చిన్న పాత్ర, చిన్న హీరో అని కూడా ఆలోచించను. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే ఆలోచన వల్లో.. వేరే ఏదైనా కారణమేమో తెలియదు కానీ తెలుగు దర్శకులు ఎక్కువగా నన్ను సంప్రదించడం లేదు. అయితే నాకు సౌకర్యంగా అనిపిస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ’’ అని నటి, నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల చెప్పిన విశేషాలు. -
Gachibowli: అక్కాతమ్ముడి అదృశ్యం.. మా కోసం వెతికితే..
గచ్చిబౌలి: ఇంట్లో చెప్పాపెట్టకుండా అక్కాతమ్ముడు అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ మసీదుబండలోని ప్రభుపాదకాలనీలో నివాసముండే అడ్డాల నరేష్ డ్రైవర్. 2022 ఫిబ్రవరి 10వ తేదీన తన మేనకోడలైన హారిక(20)ను వివాహం చేసుకున్నాడు. ఇంట్లో హారికతో పాటు ఆమె తమ్ముడు ఫణీంద్ర(19) కూడా ఉంటున్నాడు. గత ఫిబ్రవరి 20వ తేదీన హారిక, ఫణీంద్ర ఇద్దరూ ఇంట్లో చెప్పకుండానే బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తమ కోసం వెతికితే చనిపోతామని హారిక లేఖ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయింది. ఆమె భర్త నరేష్ కొంతకాలం వారి గురించి పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. హారిక తల్లిని సంప్రదిస్తే తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. కాగా ఐదు నెలల తర్వాత ఆలస్యంగా మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి హారిక మృతి
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో, ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు హారిక మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.వివరాల ప్రకారం.. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక మృతి చెందింది. హారిక అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డి మరణించారు. కాగా, హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఇంతలోనే ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.ఇక, ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. జెట్టి శ్రీనివాస్ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
లైవ్‌లో హారికా నారాయణ్ స్వరాలు..
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హారికా నారాయణ్ తన స్వరాలతో సంగీత ప్రియులను హోరెత్తించనున్నారు. నగరంలోని ఓడియం ప్రిజమ్ వేదికగా ఈ నెల 6న నిర్వహించనున్న లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌లో హారికా విభిన్న పాటలతో అలరించనుంది. హారిక ఆర్ఆర్ఆర్ సినిమాతో సింగర్‌గా మరింత క్రేజ్ సంపాదించుకున్న విషయం విధితమే. నగరంలో మొదటిసారి లైవ్ ఈవెంట్లో పాడనుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ లైవ్ కన్సర్ట్‌లో సంగీత ప్రియులకు ఆÔ్చర్యాన్ని కలిగించే అంశాలు ఉన్నట్లు తెలిపారు.శనివారం రాత్రి 8 గంటల నుంచి ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్ హారిక నారాయణ్ (ఫోటోలు)
-
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ఈ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్ యువ సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లకు దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతంగా రూపొందించారు. రెండింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు.కొన్న గంటల్లో రాష్ట్ర ప్రజలు ఈ గీతాన్ని వినబోతున్నారు. అయితే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కీరవాణి బృందం కలిసింది. అందులో సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లు ఉన్నారు. ఇంతటి సంతోష సమయంలో సింగర్ హారిక ఇలా చెప్పుకొచ్చింది. 'తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అంశం. ఈ గీతాన్ని రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం విశేషం. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నన్ను చేర్చుకున్నందుకు కీరవాణి సార్‌కి, అందె శ్రీ గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని సాధ్యం చేసినందుకు మా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్‌కి నా ధన్యవాదాలు. ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు, అంటే జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది. అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన సింగర్ హారికా నారాయణ్ (ఫొటోలు)
-
ప్రియుడిని పరిచయం చేసిన సింగర్ హారికా నారాయణ్.. త్వరలో పెళ్లి
టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్ త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఆమె అధికారికంగా తెలిపారు. వరుస స్టేజ్ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్లో దూసుకెళ్తోన్న హారికా పలు పాటలతో లక్షలమందిని ఉత్సాహపరిచారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన హారిక అనుకుంటే హీరోయిన్గా కూడా రాణించవచ్చు.. ఎందుకంటే హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం. తాజాగా హారికా నారాయణ్ తన స్నేహితుడు అయిన పృధ్వినాథ్ వెంపటితో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపారు. వారిద్దరి మధ్య స్నేహంగా ఏర్పిడిన పరిచయం ఆపై ప్రేమగా మారిందని తెలిపిన ఆమె ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగినట్లు చెప్పారు. వారిద్దరు ఉంగారులు మార్చుకుంటున్న ఫోటోను హారికా షేర్ చేశారు. కానీ తనకు కాబోయే భర్త గురించి ఆమె ఎలాంటి వివరాలు షేర్ చేయలేదు. తూర్పు గోదావారి జిల్లా రాజోలులో జన్మించిన హారిక.. తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆమె ఉత్తరాదిలో పెరిగారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కాకపోతే, అనుకోని విధంగా గాయనిగా మారి నేడు తన గాత్రంతో అందర్నీ మెప్పిస్తుంది. ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటాంబానికి హారిక దగ్గరి బంధువు కావడం విశేషం. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమెకు మొదట నిహారిక కథానాయికగా నటించిన 'సూర్యకాంతం'తో ప్లేబ్యాక్ సింగర్‌గా మారారు'. ఆ తర్వాత 'నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్ రోజ్)' సాంగ్‌తో యూత్‌కు కనెక్ట్ అయ్యారు. విభిన్నమైన వాయిస్‌తో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక.. 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. హారికకు హీరో మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చనే 'బ్రహ్మోత్సవం'లో నటించినట్లు గతంలో ఆమె తెలిపారు. తన అభిమాన హీరో సినిమా అయిన 'సర్కారువారి పాట'లో టైటిల్ ట్రాక్ పాడి దుమ్మురేపారు. View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) -
అర్జున్ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు విశేషంగా రాణించినా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అత్యుత్తమంగా ఆరో స్థానాన్ని సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత అర్జున్ 14 పాయింట్లతో మరో ముగ్గురితో (నెపోమ్నిషి, లెవాన్ అరోనియన్, డెనిస్ లాజావిక్) కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా నెపోమ్నిషికి ఐదో ర్యాంక్, అర్జున్‌కు ఆరో ర్యాంక్, అరోనియన్‌కు ఏడో ర్యాంక్, డెనిస్‌కు ఎనిమిదో ర్యాంక్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఇతర గ్రాండ్‌మాస్టర్లు అరవింద్ చిదంబరం 14వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 28వ ర్యాంక్‌లో, నారాయణన్ 35వ ర్యాంక్‌లో, గుకేశ్ 38వ ర్యాంక్‌లో నిహాల్ సరీన్ 43వ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో ఏడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. హారికతోపాటు మరో ఎనిమిది మంది క్రీడాకారిణులు కూడా 11 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హారికకు ఏడో ర్యాంక్ దక్కింది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 13వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 17వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 27వ ర్యాంక్‌లో, వైశాలి 36వ ర్యాంక్‌లో, ప్రియాంక నూతక్కి 46వ ర్యాంక్‌లో నిలిచారు. -
Dethadi Harika House Warming Pics: ఘనంగా దేత్తడి హారిక నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
అర్జున్ విజయం హారిక ‘డ్రా’
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు ఇరిగేశి అర్జున్ కీలక విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి రౌండ్లో నల్ల పావులతో ఆడి అర్జున్ గెలుపు నమోదు చేయడం విశేషం. ఈ గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్ను ఓడించాడు. నేడు జరిగే రెండో రౌండ్‌ను అతను ‘డ్రా’గా ముగించినా సరే క్వార్టర్ ఫైనల్ చేరతాడు. మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌ను నల్లపావులతో ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాకినా (రష్యా)తో జరిగిన ఈ పోరును 48 ఎత్తులో హారిక ముగించింది. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడి డి.గుకేశ్ కూడా విజయాన్ని అందుకున్నాడు. గుకేశ్ 38 ఎత్తుల్లో వాంగ్ హావో (చైనా)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్ మ్యాచ్‌లలో ఫెరెన్స్ బెర్క్స్ (హంగేరీ)– ప్రజ్ఞానంద (45 ఎత్తుల్లో)...ఇయాన్ నెపొమినియాచి (రష్యా)– విదిత్ గుజరాతీ మధ్య (31 ఎత్తుల్లో) జరిగిన తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
మంచిర్యాల: మమ్మీ.. నా రోగం ఎంతకీ తగ్గదేమోనే!
మంచిర్యాల రూరల్(హాజీపూర్): మాయదారి జబ్బు.. నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక అమ్మాయి జీవితాన్ని బలిగొంది. అదేం జబ్బో అర్థంకానీ తల్లిదండ్రులు.. ఎంతకీ తగ్గదేమో అనే దిగులుతో.. ఆ కుటుంబం వేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయిన ఆ టీనేజర్ చివరకు ప్రాణం తీసుకుంది. హాజీపూర్ మండలంలోని దొనబండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రచన, సత్తయ్య దంపతుల కుమార్తె కోట హారిక (19). మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హారిక డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు పలు ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స కోసం ఎంత ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హారిక బాబాయ్ కోట స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అయ్యో.. హారిక..! కన్న తండ్రి భుజాలపై మోసుకెళ్లినా..
తాండూరు రూరల్ (వికారాబాద్): పదకొండేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. జ్వరంతో ఆరోగ్యం విషమించడం.. ఊరు చుట్టూ వాగు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో బాలిక మృతిచెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బొంకూరుకు చెందిన హరిజన్ బాలప్ప, అమృతమ్మల కుమార్తె హారిక (11) ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల స్కూల్‌కు వెళ్లి పుస్తకాలు తెచ్చుకుం ది. పాఠశాలలు తెరుచుకోవడంతో స్నేహితులతో కలిసి వెళ్లాలనుకుంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొంకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి. (చదవండి: బంజారాహిల్స్: ఓయో రూమ్స్‌లో అవసరమైన వారికి..) రెండు రోజుల క్రితం జ్వరం.. హారికకు 2రోజుల క్రితం తీవ్రజ్వరం వచ్చింది. వాగు ఉధృతి కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి. శుక్రవారం సాయంత్రం జ్వరం తీవ్రం కావడంతో హారికను భుజాలపై ఎత్తుకుని బొంకూర్ నుంచి పొలాల వెంట ఖాంజాపూర్ వెళ్లారు. అక్కడి నుంచి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక కన్నుమూసింది. బొంకూర్ నుంచి తాండూరుకు వెళ్లాలంటే బొంకూర్ వాగుపై వంతెన నిర్మించాలి. తమ సమస్యను అరవై ఏళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి ఉంటే హారికను జ్వరం వచ్చిన రోజే ఆస్పత్రికి తీసుకెళ్లేవారమని తల్లిదండ్రులు రోధిస్తూ పేర్కొన్నారు. (చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పిన సిబ్బంది’) -
హారిక మృతి కేసు: విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్
వంగర: శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి నీలయ్యవలస సమీపంలో బేతిన్ గ్రానైట్ క్వారీ ప్రదేశాన్ని పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్.జి.కుమార్, డీఎస్పీ మల్లంపాటి శ్రావణి గురువారం పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన దుస్తులు ఉతికేందుకు తల్లి తొగరాపు సంతోషికుమారితో వెళ్లిన కుమార్తె హారిక క్వారీ గొయ్యిలో పడి మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై సమగ్ర సమాచారం సేకరణకు క్వారీ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. క్వారీ లీజు సమయం, నిర్వహణ కాలం, ఎప్పటి నుంచి మూసివేశారు, హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు వంటివి తనిఖీ చేశారు. క్వారీకి సంబంధించి సమగ్ర సమాచారంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ డి.ఐజాక్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై డీఎస్పీ ఆరా తీశారు. రాజాం రూరల్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై సంచాన చిరంజీవి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన) రూ.25 లక్షలు చెల్లించాలి.. హారిక కుటుంబానికి క్వారీ యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు సర్పంచ్ ప్రతినిధి చింతగుంట రామారావు, పలు పార్టీలకు చెందిన నాయకులు బెజ్జిపురం రవి, ఉత్తరావెల్లి మోహనరావు, మజ్జి గణపతిరావు డిమాండ్ చేశారు. హారిక కుటుంబ సభ్యులను క్వారీ యాజమాన్య ప్రతినిధులు కనీసం ఓదార్చలేదని, ఇప్పటివరకు పరామర్శించలేదని మండిపడ్డారు. క్వారీ గుంత వద్ద హారిక మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి, కుటుంబసభ్యులు (ఫైల్) -
ప్రత్యేకత ఏంటో చెప్పిన చిరు.. ధన్యవాదాలు తెలిపిన హారిక
హనుమంతుడు మనవాడే అంటూ భార్య సురేఖతో కలిసి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్న హారిక పెళ్లికూతురిగా ముస్తాబైన నిత్యామీనన్, చూస్తే వావ్ అనాల్సిందే మెంటల్ హెల్త్‌పై ఫోకస్ పెట్టండి అంటున్న రష్మీ గౌతమ్ చంద్రుడి సోదరిని అంటూ నటి శోభిత దూళిపాళ్ల ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
సోషల్ హల్చల్: ఈషా కవ్వింపు..చెమటలు పట్టిస్తున్న జాన్వీ
♦ ఐదేళ్ల క్రితం సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేను.. అప్పుడు ఈ పిక్ షేర్ చేశానో లేదో గుర్తులేదని ఓ ఫోటోని షేర్ చేసిన అదా శర్మ ♦ బ్లాక్ సారీ ఫోటో షేర్ చేసి చూపులతో చంపేస్తున్న ఈషా రెబ్బా ♦ బ్యాక్‌లెస్ టాప్.. టైట్ పాయింట్ ధరించి కిల్లింగ్ లుక్స్‌తో చెమటలు పట్టిస్తున్న జాన్వీ ♦ సోఫాలో వాలిపోయి లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి ♦ హాఫ్ సారీలో అదరగొడుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ హారిక View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
చిరంజీవిని కలిసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటుడు
-
‘బిగ్‌బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్ సీజన్ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని ఒడిదొడుకులను చిన్ననాటి నుంచీ చూస్తూ పెరిగారు. జీవితం నేర్పిన పాఠాలతోనే తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా ముందుకు సాగాలనుకున్నారు. నవతరం అమ్మాయిలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ►‘దేత్తడి’ అంటూ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అలేఖ్య హారిక. డిగ్రీ చదువుతూ పాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేసింది. జాబ్ పోతే ఎలా అనే ఆలోచనతో కొత్త ఆలోచనలకి పదును పెట్టింది. ►యాంకరింగ్ ద్వారా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా గ్లోరీ. కాలేజీ రోజుల నుంచే యాంకరింగ్ అంటే ఇష్టం పెంచుకుని తనకు అభిరుచి ఉన్న రంగం వైపే అడుగులు వేసింది. కొద్ది రోజుల్లోనే కుటుంబం మెప్పుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్నీ పొందుతోంది. ఇంటిని వదిలి 105 రోజులు వేరే చోట ఉన్నారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? హారిక: ఎలా వచ్చిందో నాకూ తెలియదు. ముందు మా అమ్మ, అన్న కోసం ఒప్పుకున్నాను. మా ఇంటి నుంచి బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టాక అక్కడంతా వేరే ప్రపంచం. వెళ్లకముందు కొంత భయం అనిపించింది. వెళ్లాక, అక్కడున్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశాను. ఒక నిర్ణయానికి వచ్చామంటే ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నానా అనిపించినప్పుడు కళ్లు మూసుకొని రెండు నిమిషాలు కూర్చొనేదాన్ని. ‘మా అమ్మ, అన్నయ్య కళ్లముందు కనిపించేవారు. హారికా.. డౌన్ అయిపోవద్దు. ఏదైనా నీకు అండగా కుటుంబం ఉంది. ఇది కేవలం ఒక గేమ్. లాక్డౌన్ టైమ్‌లో నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. దీనిని బాగా ఉపయోగించుకో..’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని. మా అమ్మ సమస్యలను ఎదుర్కొన్న విధానం వల్ల కూడా నాకు ధైర్యం వచ్చి ఉంటుంది. అరియానా: చిన్నప్పటి నుంచీ నేనూ, చెల్లి ఏ సమస్య అయినా ఫేస్ చేసేవాళ్లం. మా మమ్మీ జాబ్ చేసేది. తను వెళ్లిపోయాక మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్లం. తనకూ క్లాస్ ఉంటే నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. నేను బయటకు వెళితే చెల్లి కూడా అంతే. అలా ఇండిపెండెంట్‌గా ఉండటం మాకు ఎప్పుడో అలవాటైపోయింది. హౌజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి 104 జ్వరం వచ్చింది. తట్టుకోలేక ఏడ్చేశాను. అక్కడ అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కి కూడా చెప్పాను. నాకు ఒంట్లో బాగోలేదు, ఇంటికి పంపించేస్తే మా ఇంటి ఫుడ్ తిని, త్వరగా కోలుకుంటాను అని. కానీ, బిగ్‌బాస్ ‘స్పెషల్ కేర్ తీసుకుంటామ’ని చెప్పారు. అవినాష్ నన్ను బాగా చూసుకున్నారు. ఆ వారం రోజులు మాత్రం కొంచెం లోన్లీగా అనిపించింది. బిగ్‌బాస్ హౌస్‌లో మీ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది? హారిక: బయట రంగులరాట్నంలో తిరిగితే ఎంత సంబరంగా ఉంటుందో బిగ్‌బాస్ హౌజ్‌లో అలాంటి ఎక్స్‌పీరియెన్స్. భలేగుంది. ముందు భయపడ్డా... ఎలా ఉంటుందో ఏమో అని. కానీ, లోపలకు వెళ్లినప్పుడు చిల్... మస్తుంది. టాస్క్ మీదనే నా దృష్టి అంతా. ఇదో హ్యూమన్ ఎక్స్పరిమెంట్. టైమ్ కనుక్కోకముందు సూర్యుడిని చూసి పాతకాలం నాటి వాళ్లు ఎలా అంచనా వేసుకునేవారో మేం అలా చేసేవాళ్లం. ఫోన్లు లేవు, టీవీ లేదు, వాచీలు లేవు. అదో లోకం.. ఆ లోకంలో అడుగుపెట్టడం చాలా థ్రిల్లింగ్‌గా భావిస్తాను. అరియానా: బిగ్‌బాస్ సీజన్ 4 అంతా రికార్డ్ చేసి పెట్టి, భవిష్యత్తులో నా పిల్లలకు చూపిస్తాను. అన్ని రోజుల పాటు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎప్పుడెలా ఉన్నానో నాకే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటోంది. కోపం వస్తే ఎలా ఉంటాను, బాధ వస్తే, సంతోషం కలిగితే ఎలా ఉంటాను.. అనేవన్నీ నాకు నేనే ఎక్స్‌పీరియెన్స్ చేశాను. బిగ్‌బాస్ తర్వాత మీకు మీరుగా మార్చుకోవాలనుకున్నవి? హారిక: సహజంగా నాకు కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి బాగా చిరాకుపడేదాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో కోపం చూపాలి... ఎలాంటి స్థితిలో మౌనంగా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అరియానా: ముక్కుమీది కోపం. చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. మా చెల్లితో అలాగే గొడవ పడేదాన్ని. అదే, పెద్ద పెద్ద విషయాల్లో అయితే మౌనంగా ఉండిపోతాను. బిగ్‌బాస్‌లో బాధ కలిగించినది... అత్యంత సంతోషాన్నిచ్చిన ఇన్సిడెంట్స్..? హారిక: అన్ని రోజులు కెప్టెన్సీకి వర్క్ చేసినా బెస్ట్ కెప్టెన్సీ రాలేదు. అది చాలా బాధ అనిపించింది. హాపీ మూమెంట్స్ అయితే లెక్కలేనన్ని. నాకెవ్వరితోనూ లొల్లి లేదు. పర్సనల్‌గా ఎవ్వరిమీదా కోపం లేదు. అంతా హ్యాపీ. అరియానా: మా ఫ్రెండ్స్ ఎలిమినేట్ అవడం బాధగా అనిపించింది. ఒకసారి గిఫ్ట్‌లు ఎవరికి ఇవ్వాలో నోట్ చేయమన్నారు. అందులో ఇద్దరికి రాయాలనుకున్నాను. కానీ, ఎవరికి రాయాలి..? అనేది సందేహం. దాంతో ఎవరికీ రాయలేదు. నాకూ ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు. అయినా ఏమీ బాధనిపించలేదు. అప్పుడు బిగ్‌బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కన్సర్న్కి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి ఆనందంతో. రూమర్స్ గురించి.. ఏమనుకుంటారు? హారిక: వాటి గురించి పట్టించుకుంటే మనం అస్సలు నడవను కూడా నడవలేం. అరియానా: ఏం వచ్చినా పట్టించుకోను. నాది నాకు తెలుసు. అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేం. అందరూ ఫ్రెండ్స్‌గా ఉంటారు. కానీ, ఒక పర్సన్‌కే కనెక్ట్ అవుతాం. నా సిచ్యుయేషన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి పట్టించుకోను. సింగిల్ పేరెంటింగ్‌లో పెరిగినట్లున్నారు కదా... మీకు ఎలా అనిపించింది? హారిక: పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటే బాధ్యత రాకపోవచ్చు. అలా లేకపోవడం వల్లే నాలో ఒక బాధ్యత పెరిగిందనుకుంటాను. అమ్మ బొటీక్ ద్వారా కష్టపడుతుంది... తనను డబ్బులు అడగకూడదు అనుకున్నాను. అమెజాన్‌లో పార్ట్‌టైమ్‌గా జాబ్‌లో చేరాను. ‘కానీ, ఈ రోజున్న జాబ్ రేపు ఉండకపోవచ్చు. ఇంకేదైనా చేయాలి..’ అనుకున్నాను. అప్పుడే ఫ్రెండ్ ద్వారా క్రియేటివ్ థాట్స్‌ని మీడియా ద్వారా చూపవచ్చు అని తెలిసింది. అప్పటికి ఫుల్‌టైమ్ జాబ్ చేస్తున్నా. వీకెండ్లో స్కిట్లు ప్లాన్ చేసుకున్నా. ఎలాగైనా ఫర్వాలేదు.. అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా బతికేయాలని డిసైడ్ అయ్యాను. అరియానా: లైఫ్‌లో భార్య, భర్త, పిల్లలు అనే బంధం ఉండాలి. దీనితో పాటు మనకు మనంగా లైఫ్‌లో ఏదో సాధించాలనే పట్టుదల కూడా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అమ్మాయిల్లో టు షేడ్స్ ఉండాలి. కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా వ్యక్తిగతంగా ఏం సాధించాలనుకుంటామో ఆ దిశగా ప్రయత్నాలూ చేయాలి. కుటుంబం కుటుంబమే. నాకు నేనుగా ఎదగడమూ ముఖ్యమే. వర్క్‌లో అధిగమించిన సమస్యల గురించి.. హారిక: నాకు జీవితంలో ఎదిగే అవకాశం ఇచ్చింది ‘దేత్తడి.’ దేవుడు.. పాపా నువ్వు ఇందులో ఉంటే సెట్ అవుతావు. నీ కుటుంబానికి హెల్ప్ అవుతావు.. అని పెట్టాడేమో అనిపిస్తుంది. ముందు 7–8 వీడియోలు చేసేవరకు నాకు వాటిలో చాలా విషయాలు తెలియవు. తర్వాత అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులను పిక్ చేసుకోవడానికి టైమ్ పట్టేది. ఆర్టిస్టుల కోసం టిక్‌టాక్ వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పదిమందిని కాంటాక్ట్ చేశాను. ఎడిటింగ్, డబ్బింగ్ అంటూ స్టూడియోలు వెతుక్కొని వెళ్లాను. రిలీజ్ అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. మంచి రిజల్ట్ వచ్చింది. ముందు దీనిలో ఓనమాలు తెలియవు. అందుకే, జాబ్ చేస్తూనే ఈ వర్క్ వీకెండ్లో చేసేదాన్ని. ఆఫీస్ షూట్.. షూట్.. ఆఫీస్ అన్నట్టుగా చేసేదాన్ని. అరియానా: కాలేజీ రోజుల నుంచి ఒకే ఆలోచన.. ఒక్కరోజు టీవీలో కనిపించినా పాప్యులర్ అయిపోతాను అనుకునేదాన్ని. చాలా ప్రయత్నాలు చేశాను. అమ్మ వద్దంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఓ మెయిల్ క్రియేట్ చేసి, టీవీలకి బోలెడన్ని ఫొటోలు పంపించాను. తర్వాత అడిషన్స్‌కి వెళ్లాను. సెలక్ట్ అయ్యాను. ఐదేళ్లుగా యాంకరింగ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ చేశాను. మొదట్లో ఏవీ తెలియవు. అన్నీ తెలుసుకుంటూ వెళ్లడమే. నేను యాంకర్ కావాలి అనుకున్నాను. నేర్చుకునే క్రమంలో ప్రతిచోటా ప్రతిరోజూ ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. మీ ముందున్న లక్ష్యం? హారిక: గొప్ప నటిగా ఎదగాలి. క్రేజీ క్యారెక్టర్ చేయాలి. అది సినిమా లేదా వెబ్‌సీరీస్. సినిమా ఏది వస్తుందో తెలియదు. ఇంట్లో టీవీలో సినిమా చూస్తున్నప్పుడు అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి మాట్లాడుతుంటాం. అలా నా యాక్టింగ్ గురించి కూడా చాలా మంది మెచ్చుకోవాలని ఉంది. అలా నేనూ చేయాలి అదే నా యాంబిషన్. అరియానా: మంచి యాంకర్ అవ్వాలి. క్రికెట్లో కామెంటరీ చేయాలి. ఒక పెద్ద నేషనల్ ఛానెల్లో ఇంటర్వ్యూస్ చేయాలి. ఈ అమ్మాయి ఎవరో భలే మాట్లాడింది.. అనుకోవాలి. ఆ రోజు రావడానికి టైమ్ పట్టచ్చు. కానీ, తప్పక వస్తుంది అనుకుంటాను. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈసారైనా దక్కుతుందా.. బిగ్‌బాస్ ఎవరు?
పోటీలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. నాలుగో సీజన్ ఇది. మూడు సీజన్లనూ అబ్బాయిలే తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్ ఉందా? 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన షో ఈరోజు ముగుస్తోంది. భావోద్వేగాల కేంద్రంగా సాగే ఈ షోలో అన్ని రకాల వొత్తిళ్లను అమ్మాయిలు దాటగలిగారు. టైటిల్ చేజిక్కించుకోగలరో లేదో చూద్దాం. ఒక అంచనా. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా నిర్వహించే హిందీ బిగ్‌బాస్‌లో ఇప్పుడు 14వ సీజన్ నడుస్తోంది. పూర్తయిన 13 సీజన్లలో ఐదు మంది మహిళా విజేతలు ఉన్నారు. పురుషులకే ఎక్కువగా ఓటింగ్ జరిగే క్రేజ్ ఉన్నచోట ఒకరకంగా పెద్ద నంబర్. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మహిళలే ఉత్తమ మానవ ప్రవర్తనను ప్రదర్శించారని దీనిని బట్టి రుజువైంది. ఎందుకంటే బిగ్‌బాస్ షో వ్యక్తుల బలాబలాలు, శక్తి సామర్థ్యాలను కాక మానవ ప్రవర్తనలను ప్రేక్షకుల ముందు పెట్టి ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది. మానవ ప్రవర్తనను బయటకు తేవడానికి బిగ్‌బాస్ హౌస్‌లో రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. ఎత్తుకు ఎదగడానికి, పతనం కావడానికి కూడా సమాన అవకాశం ఉంటుంది. అలాంటి షోలో ఐదు మంది స్త్రీలు గెలిచి తాము మెరుగైన మానవులం అని చెప్పారు. కాని తెలుగులో కూడా అంతటి ప్రతిభావంతంగా రాణించినా పురుషులకు దీటుగా నిలిచినా స్త్రీలకు గత మూడు సీజన్లలో టైటిల్ దక్కలేదు. ఈసారైనా దక్కుతుందా... తెలియదు. మిస్సయిన శ్రీముఖి, గీతా మాధురి తెలుగు బిగ్‌బాస్ 1,2,3 సీజన్లలో మహిళా కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చారు. సీజన్ 1లో నటి హరితేజ , నటి అర్చన చివరివరకూ నిలిచారు. సీజన్ 2లో గాయని గీతామాధురి రన్నర్ అప్‌గా నిలిచారు. నటుడు కౌశల్ ఆ సీజన్‌కు విన్నర్ అయినా గీతా మాధురి గెలుస్తుందని చాలామంది భావించారు. సీజన్ 3 లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నారు. విజేత ఓటింగ్ ద్వారా నిర్ణయం అవుతారని నిర్వాహకులు చెబుతారు. కాని ఓటింగ్ సరళి పురుషుల ఫేవర్లో వెళుతోంది. స్త్రీలను విజేతలకు నిలబెట్టడానికి బయట సరైన బృందాలు పని చేయడం లేదనే భావన కూడా ఉంది. ఈసారి అరియానా, హారిక బిగ్‌బాస్ 4 సీజన్ కరోనాకు వెరవక అట్టహాసంగా సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం 105 రోజుల ఈ షోలో చివరి రోజు ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో 10 మంది స్త్రీలు ఉన్నారు. సీజన్‌కు అట్రాక్షన్‌గా నిలుస్తుంది అనుకున్న గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్ వరకూ వెళుతుందనుకున్న లాస్య 77వ రోజున నిష్క్రమిస్తే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ చివరి వారంలో ఎవిక్ట్ అయ్యింది. చివరి ఐదుమంది పోటీదారుల్లో టెలివిజన్ యాంకర్ అరియానా, యూ ట్యూబ్ స్టార్ హారికా మిగిలారు. అమ్మాయిలు గెలుస్తారా? ఓటింగ్ సరళిని, హౌస్‌లో అరియానా, హారికల గేమ్ తీరును, ప్రవర్తనను గమనించిన పరిశీలకులు చాలామంది ఈసారి బిగ్‌బాస్ టైటిల్ గెలిచేంత గట్టిగా వీరిరువురు లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా ప్రవర్తన నిక్కచ్చిగా ఉండటం ఆమెకు మైనస్ అయ్యింది. ఒక దశలో హౌస్మేట్స్ అందరూ ఆమెను ఎలిమినేట్ చేయాలనే వరకూ వెళ్లారు. ఇక హారికా పట్ల అభ్యంతరాలు లేకున్నా ఆమె గట్టిగా ఒక అభిప్రాయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక యాటిట్యూడ్‌ని చూపలేకపోయింది. మరోవైపు పురుష కంటెస్టెంట్లు అభిజిత్, సొహైల్, అఖిల్ తమ సొంత తీరుతో ఓట్లను నిలబెట్టుకున్నారు. 50 లక్షలు ప్రైజ్ బిగ్‌బాస్ 4 విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఇప్పుడు పోటీలో నిలుచున్న ఐదుగురూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అభ్యర్థులే. ఈ మొత్తం చాలా పెద్దది తమ దృష్టిలో అని వారే చెప్పుకున్నారు. అందరికీ సొంతింటి కలే లక్ష్యంగా ఉంది. ఈ 50 లక్షల కోసం బిగ్‌బాస్‌లో గత 100 రోజులుగా అభ్యర్థులు అనేక అగ్నిపరీక్షలకు లోనయ్యారు. హారికా, అరియానాలు కూడా ఎన్నోసార్లు గట్టి దెబ్బలు తిన్నా తట్టుకుని నిలుచున్నారు. హారికాకు సొహైల్‌కు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచాయి. అరియానా సొహైల్‌కు మధ్య కూడా యుద్ధాలే జరిగాయి. హారికా అభిజిత్ ఒక జట్టు కడితే సొహైల్– అఖిల్ ఒక జట్టుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. అయితే బయట ప్రేక్షకులలో అరియానా మద్దతుదారులు గట్టిగానే ఉన్నారు. ఎవిక్ట్ అయ్యి వెళ్లే ముందు మోనల్ గజ్జర్ విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదు అని చెప్పి వెళ్లింది. కాని ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిల వైపు మొగ్గితే ఇద్దరిలో ఒకరు గెలిచి మహిళా విజేతల ఖాతా తెరుస్తారు. నేడే ఫైనల్స్ నేడు మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్‌లో విజేత ప్రకటన వెలువడుతుంది. చీఫ్‌గెస్ట్‌గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో వెంకటేశ్ హాజరయ్యారు. అంతకు ముందు సీజన్ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చు అంటున్నారు. ఏమైనా లాక్డౌన్ కాలంలో మొదలైన ఈ షో పెద్ద ఆటంకాలు లేకుండా చివరి అంకానికి చేరడం వెనుక టీమ్ కష్టం ఎంతో ఉంటుంది. వారికి మెచ్చుకోళ్లు చెప్పక తప్పదు. విజేత ప్రకటన కోసం ఎదురు చూద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
ఆ అలవాటు మాత్రం పోలేదు: హారిక తల్లి
జ్యోతిని ‘స్టార్’ మదర్ అని గానీ.. ‘బిగ్’ మదర్ అని గానీ.. అనాలి! ఆమె కూతురు హారిక యూట్యూబ్ స్టార్. అందుకే ఆమె స్టార్ మదర్. హారిక ప్రస్తుతం బిగ్‌బాస్ కంటెస్టెంట్.అందుకే ఆమె బిగ్ మదర్. సింగిల్ మదర్‌గా అయితే మాత్రం.. జ్యోతిని బిగ్ స్టార్ మదర్ అనాలి! ధైర్యంగా నిలబడ్డారు. పిల్లల్ని తన సమాధానంగా పెంచారు. ‘‘నా కూతురు అని చెప్పుకోవడం కాదు గానీ ఎంత క్రియేటివ్‌గా ఆలోచిస్తుందో.. అంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంటి పరిస్థితులను, నన్ను బాగా అర్ధం చేసుకుంటూ పెరిగింది. ఎవరైనా ఏ కొంచెం తనను ఇన్సల్ట్ చేసినా గెలిచి చూపాల్సిందే అని పట్టుపడుతుంది’’ అని కూతురు హారిక గురించి చెబుతూ మురిసిపోయారు జ్యోతి. ఆమె సింగిల్ మదర్. కూతురు అలేఖ్య హారిక, కొడుకు వంశీ కార్తీక్‌తో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రధానంగా సింగిల్ మదర్‌గా ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు, పిల్లల పెంపకం గురించి ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించింది. చదువు గురించే ఆలోచన ‘‘పిల్లలకు డబ్బు విలువ బాగా తెలుసు. అమ్మ కష్టపడుతుంది. మనం ఇంకా ఎక్కువ కష్టపెట్టకూడదు అనేది ఇద్దరూ చిన్నతనం నుంచీ అర్ధం చేసుకున్నారు. పిల్లలు చదివే స్కూల్లోనే టీచర్‌గా చేశాను. బ్యాంక్ ఉద్యోగిగా కొన్నాళ్లు పనిచేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. కుటుంబ పెద్ద ఇంటిని పట్టించుకోకపోతే ఎలాంటి అవస్థలు ఎదుర్కోవలసి వస్తుందో అన్నీ ఎదుర్కొన్నాను. తప్పనిసరై తొమ్మిదేళ్ల క్రితం ఓ రోజు పిల్లల్తో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ సమయంలో మొదటగా ఆలోచించింది వాళ్ల చదువులు, వాళ్ల ఫీజుల గురించే. గతమేదైనా అది పిల్లల చదువులపై ప్రభావం పడకూడదు అని ఆ రోజే గట్టిగా అనుకున్నాను. వేలెత్తి చూపినవారే..! ‘‘నా చేతిలో ఎం.ఏ సర్టిఫికెట్ తప్ప మరే ధైర్యమూ లేదు. ఎవరి సాయమూ లేదు. రెండు మూడేళ్లు చిన్నా చితకా ఉద్యోగాలు చేశాను. దగ్గర ఉన్న కొంత బంగారం కొన్ని రోజులు ఆదుకుంది. సింగిల్ మదర్‌గా సమాజంలో వివక్షను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆ కష్టం అద్దె ఇంటిని వెతుక్కోవడంతో మొదలైంది. ఎవరో ఒకరి రికమెండేషన్ ఉంటే తప్ప ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. పిల్లలు ఎదిగే సమయంలో వేరుపడి బయటికి రావడం అవసరమా అని అన్నవాళ్లూ ఉన్నారు. ఆ మాటలన్నీ పడుతూ కుమిలిపోతుంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారని అనిపించింది. ఎంత కష్టమొచ్చినా పిల్లల కోసం నిలబడాలని బలంగా అనుకున్నాను. గతంలో చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు బొటిక్ పెట్టుకోడానికి ఉపయోగపడింది. ఆరేళ్లుగా బొటిక్ నడుపుతున్నాను. మొదట్లో వేలెత్తి చూపినవారే.. ఇప్పుడు ‘మా వాళ్లు’ అని మాట్లాడుతుంటారు. సమాజం నన్ను అన్న మాటలన్నిటికీ నా పిల్లలు సరైన సమాధానం ఇచ్చారు అనుకుంటాను. నా ధైర్యమే వచ్చింది ‘‘ఈ పనే చేయాలి, ఇది చేయకూడదు.. అని నేనెప్పుడూ పిల్లలకు ఆంక్షలు పెట్టలేదు. వాళ్లు అడిగినవన్నీ ఇవ్వగలిగాను. ఏదైనా నా శక్తికి మించినది, అంతగా అవసరం లేదని అనుకున్నదీ అడిగినప్పుడు మాత్రం వాళ్లకు నచ్చచెబుతాను. లేదంటే, వాయిదా వేస్తాను. మెల్లగా వాళ్లే అర్ధం చేసుకుంటారు. స్నేహితుల ఎంపికలోనూ వాళ్లకు కండిషన్స్ పెట్టలేదు. వంశీకన్నా హారికకు స్నేహితులు ఎక్కువ. అందరితోనూ బాగుంటుంది. ఈ కాలం పిల్లలు చాలా బాలెన్సింగ్‌గా ఉంటున్నారు. తనూ అలాగే ఉంటుంది. నా బిడ్డలపై అపోహలు, అపనమ్మకాలు, భయాలు.. ఏవీ పెట్టుకోను. ఏ వర్క్ చేయాలన్నా ధైర్యంగా మొదలు పెట్టమంటాను. వాళ్లు కూడా నాలాంటి వాళ్లే. ఒకటి అనుకుంటే వెనుకంజ వేయరు. (నవ్వుతూ). హారిక సర్ప్రైజ్ హారిక బిబిఎ మొదటి సంవత్సరంలో ఉన్నప్పటి నుంచీ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ వచ్చింది. తనకు నెలకు ఏడు వేల రూపాయలు వచ్చేవి. అందులో రెండు వేలు తను పాకెట్‌మనీగా పెట్టుకొని ఐదు వేలు ఇంటికి ఇచ్చేది. ఆ రెండువేలను కూడా పొదుపు చేసి నా బర్త్‌డేకి ఏదో ఒక బహుమతి తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేసేది. ఇప్పటికీ అదే అలవాటు ఉంది తనకు. నా కూతురే నాకు నటనలో ఓనమాలు నేర్పింది. నిజానికి తను కూడా ఎక్కడా యాక్టింగ్ క్లాస్‌కు వెళ్లింది లేదు. చిన్నప్పుడు కొంత వరకు సంగీతం నేర్చుకుంది. మోడ్రన్ డ్యాన్సులంటే తనకు బాగా ఇష్టం. ఆరేడు గంటలు విరామం లేకుండా డ్యాన్స్ చేయమన్నా చేస్తుంది. ఎక్కువ సమయం పిల్లలతో ఉంటుంటాను కాబట్టి ఇద్దరూ వాళ్ల వర్క్‌లో నన్నూ ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఆ విధంగానే హారిక తను చేసే స్కిట్లలోకి నన్నూ తీసుకుంది. వంశీని కూడా. వంశీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హారిక క్రియేటివ్ సైడ్ ఎంచుకొని వెళుతోంది. ‘‘ఇంక వర్క్ చేయకమ్మా! నీకేం కావాలో చెప్పు.. రెస్ట్ తీసుకో’’ అని పిల్లలు అంటుంటారు. ‘‘నేను డిజైన్ చేసే దుస్తుల్లో నువ్వింకా మెరవాలి కదా! అప్పుడే రెస్ట్ ఎందుకు?’’ అని హరికతో అంటూ నవ్వేస్తాను. పిల్లల పెళ్లిళ్లు గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. తమను అర్ధం చేసుకున్నవాళ్లు, అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా కొనసాగడానికి ఇష్టపడేవారైతే నెక్ట్స్ స్టెప్ అంటుంటారు పిల్లలిద్దరూ. ఇద్దరూ వారు ఎంచుకున్న రంగంలో వృద్ధిలోకి రావాలన్నదే నేను కోరుకునేది’’ అని ముగించారు జ్యోతి. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బిగ్‌బాస్: షటప్ అంటూ అభిపై హారిక సీరియస్
బిగ్‌బాస్ అంటేనే వివాదాలు, కాంట్రవర్సీలు, ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని ట్రై చేసిన కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టడమే బిగ్‌బాస్ పని. అయితే ఈ చిచ్చులకు పునాది వేదేది మాత్రం ప్రతి సోమవారమే. అవును ఆ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. దీంతో ఆ రోజంతా హౌస్మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, అలగడాలు ఉంటాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌ని జతలుగా విడదీసి, ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పి వారిపై రంగు నీళ్లు పోయాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించారు. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే అభిజిత్-హారిక, అవినాష్-సోహైల్, మోనాల్-అఖిల్, అరియానా-మెహబూబ్, లాస్య-దివిలను జంటలుగా విడిపోయారు. ఇక కెప్టెన్ కారణంగా నోయల్, నాగార్జున ఇచ్చిన ఆఫర్‌తో రాజశేఖర్ మాస్టర్ ఈ నామినేషన్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. ఇక తాజా ప్రోమో చూస్తే.. అభిజిత్- హారిక మధ్య పెద్ద గొడవే జరిగినట్టు ఉంది. త్యాగాలు, సర్దుబాట్లు చేసుకునే వారం కాదు ఇది అంటూ హారిక అభికి హారిక సలహా ఇచ్చింది. అయితే ఎక్కువగా నేను నామినేట్ అయ్యానని, ఈ వారం తనను సేవ్ చేయాలని హారికను అభి కోరాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ హారిక మాత్రం మాఇద్దరిది అన్పేయిర్ అని, షటప్ అంటూ అభిపై సీరియస్ అయింది. ఇక అరియానా- మెహబూబ్, అవినాష్-సోహైల్ కూడా నేనే ఉంటా అంటే నేనే ఉంటా అంటూ గొడవకు దిగారు. మరి ఈ వారం ఎవరెవరిపై రంగుపడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఒంటి మీద బట్టలు చింపుకున్న కుమార్ సాయి
-
బిగ్ బాస్ : అభిజిత్ మైండ్ గేమ్.. భోరుమన్న హారిక
బిగ్‌బాస్ హౌస్‌లో వినోదాత్మకంగా మొదలైన బీబీ హోటల్ టాస్క్ కాస్త సీరియస్‌గా మారింది. అతిథుల మెప్పు కోసం సిబ్బంది నానా కష్టాలు పడింది. ముఖ్యంగా అవినాష్ సీక్రెట్ టాస్క్‌తో హౌస్‌లో ప్రకంపనలు చెలరేగాయి. మోనాల్‌పై అఖిల్ సీరియస్ అయ్యాడు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ స్వీమ్మింగ్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేశాడు. ముఖ్యంగా అభిజిత్ మైండ్ గేమ్, హారిక ఏడుపు, మెహబూబ్‌పై అవినాష్ ఫైర్ లాంటి సన్నివేశాలు నేటి ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారాయి. ఇంకా ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌లో ఏమేం జరిగాయో డిటైల్డ్‌గా చూసేద్దాం.. పిన్ను పెట్టిన చిచ్చు తనకు మటన్ బిర్యానీ కావాలని సోహైల్ ఆర్డర్ ఇవ్వగా.. హోటల్ సిబ్బంది కష్టపడి వండింది. అయితే దాంట్లో పొరపాటున చిన్న వెంట్రుక వచ్చింది. ఇంకేముంది సోహైల్ రెచ్చిపోయాడు. వెంటనే సిబ్బంది అంతా వచ్చి క్షమాపణలు చెప్పింది. ఇక సోహైల్ తీరును అమ్మ రాజశేఖర్ తప్పుపట్టాడు. కష్టపడి వండితే.. గుర్తింపులేదని అసహనానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్ సోహైల్‌కి పెట్టిన పుడ్‌లో హెయిర్పిన్ను ను పెట్టాడు. అయితే ఆ పిన్ను హోటల్ సిబ్బందే పెట్టిందని సోహైల్ ఫైర్ అయ్యాడు. అయితే సోహైలే పిన్ను పెట్టి తమను బ్లేమ్ చేస్తున్నాడని హోటల్ సిబ్బంది అనుమానించింది. దీంతో సోహైల్ ఒట్టుపెట్టుకొని మరీ నేను పెట్టలేదని చెప్పాడు. దీంతో అయోమయానికి గురైన సిబ్బంది... పొరపాటు పడి ఉండవచ్చని సోహైల్‌కి క్షమాపణలు చెప్పారు. అలకెందుకని అఖిల్‌ని నిలదీసిన మోనాల్ నామినేషన్ ప్రక్రియ రోజు జరిగిన గొడవతో తనకు దూరంగా ఉంటున్న అఖిల్‌ను కూల్ చేసే ప్రయత్నం చేసింది మోనాల్. రిసెప్షన్లో ఉండి ఫోన్ మాట్లాడుతూ అఖిల్‌ని చూసి మెలికలు తిరుగుతూ..ఎందుకు మాట్లాడటం లేదని అని అఖిల్‌ని ప్రశ్నించింది. అయినప్పటికీ అఖిల్ స్పందించకపోవడంతో పరుగున వచ్చి అఖిల్‌ని వెనుక నుంచి వాటేసుకుంది. దూరంగా ఉండటానికి గల కారణమేంటని అడగ్గా.. తాను ఎవరితో మాట్లాడతలేనని అఖిల్ చెప్పాడు. ఇక టిప్ కావాలంటే తన బెడ్‌ను రెండు నిమిషాల్లో సర్ధాలని హారిక సూచించగా..నోయల్ ఆ పనిచేశాడు. దీంతో నోయల్‌కు 2500 టిప్పు దొరికింది. సొమ్మసిల్ల పడ్డ రాజశేఖర్ మాస్టర్ ఇక రిచ్మేన్లుగా ఉన్న మెహబూబ్, సోహైల్ అయితే హోటల్ సిబ్బందికి చుక్కలు చూపించారు. హోటల్ టీంలో ఉన్న రాజశేఖర్ మాస్టర్‌కు 100 సార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని టాస్క్ ఇచ్చారు. ఆయాసం వచ్చినప్పటికీ మాస్టర్ స్విమ్మింగ్ పూల్‌లో దూకుతూ లేస్తూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. టాస్క్‌ని విజయవంతంగా కంప్లీట్ చేసిన మాస్టర్.. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి కిందపడిపోయాడు. రాజశేఖర్ మాస్టర్ హార్డ్‌వర్క్ చూసి 3000 రూపాయల టిప్ ఇచ్చాడు మెహబూబ్. ఇక అఖిల్‌కి 150 పుష్అప్లు చేయాలని టాస్క్ ఇచ్చారు గెస్ట్‌లు.. అయితే అఖిల్ అతి కష్టం మీద 75 మాత్రమే తీయగలిగాడు. ఆ తరువాత అభిజిత్‌తో 20 కేజీలు ఎత్తించి 59 పుష్ అప్లు తీయించారు. ఈ క్రమంలో అభిజిత్ కూడా కిందపడిపోయాడు. అయితే అభిజిత్ కష్టపడుతుంటే సుజాత తెగ ఫీల్ అయిపోయింది.. ఏడుస్తూ వీళ్లను చూస్తుంటే భయంగా ఉంది అంటూ బాధపడింది. లాస్య ఆమెను ఓదార్చింది. అభి.. టాస్క్‌ను కంప్లీట్ చేయనప్పటికీ.. సోహైల్ 1000 రూపాయల టిప్పు ఇచ్చాడు. ఒక్క మాట తేడా వచ్చినా.. పుచ్చెలు ఎగిరిపోతాయి : మెహబూబ్ తనకు సర్వీస్ సరిగా అందించడంలేదని పదే పదే చెప్పడంతో మెహబూబ్‌పై హోటల్ సిబ్బంది అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మెహబూబ్ సీరియస్ అయ్యాడు. ఒక్క మాట తేడా వచ్చినా... పుచ్చు పగిలిపోతుంది అంటూ హోటల్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైనా అఖిల్.. మెహబూబ్‌పై విరుచుకుపడ్డాడు. రౌడీయిజం ఊర్లో చేస్కో.. అవినాష్ మెహబూబ్ అలాగే రెచ్చిపోతుండటంతో అవినాష్ రంగంలోకి.. రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో.. ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ చేసుకుంటే వేరేలా ఉంటుందంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మధ్యలో ఇంటి సభ్యులు వచ్చి సముదాయించడంతో అక్కడితో గొడవ ఆగింది. తర్వాత మెహబూబ్ ఒక్కరికి సారీ చెబుతూ వచ్చాడు. ఇక అవినాష్‌కు సారీ చెప్పడమే కాకుండా.. సర్వీస్ నచ్చిందంటూ టిప్పు కూడా ఇచ్చాడు. ఇక గంగవ్వ తనకు సర్వీస్ బాగా చేసిన వాళ్లకి వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే.. మెహబూబ్ సీరియస్ అయ్యాడు. అలా డబ్బులు ఇవ్వొద్దు అవ్వా.. నీ దగ్గర ఇంకా ఎంత ఉన్నాయ్.. ఆ మిగిలిన డబ్బులు నాకు ఇచ్చెయ్ అని తీసేసుకున్నాడు. అయితే గంగవ్వ ఇచ్చినట్టే ఇచ్చి నాకు ఎవరితోనూ పనిలేదు. రూపాయి కూడా ఇవ్వను అంటూ తిరిగి తీసేసుకుంది. హారిక- అభిజిత్ చిలిపి ముచ్చట్లు అభిజిత్-హారికలు వేరు వేరు టీంలలో ఉన్నందుకు తెగ ఫీలైపోయారు.నాకు ఏ సర్వీస్ కావాలన్నా నీ ద్వారా చేపించుకోవచ్చు.. అంటూ అభి కళ్లలోకి కళ్లు పెట్టు చూసిన హారిక.. బిగ్ బాస్ మా ఇద్దర్నీ ఇలా ఆపోజిట్ టీంలో ఎందుకు వేశావ్ చెప్పు.. దొంగ అంటూ తెగ సిగ్గు పడిపోయింది. ఆ తరవాత అభి సేవల్ని ఉపయోగించుకుంటూ అతనితో మసాజ్ చేయించుకుంది. టిప్ కోసం అభి.. అమ్మల లొల్లి అతిథులు ఇచ్చే టిప్ విషయంలో అభిజిత్, రాజశేఖర్ మాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. వచ్చిన దాంట్లో సగం టిప్ తనకు ఇవ్వాలని మాస్టర్‌ను అభి అడగ్గా.. ఇవ్వనని రాజశేఖర్ మాస్టర్ ముఖం మీదే చెప్పే చేశాడు.దీంతో అభిజిత్ మరోసారి మైండ్ గేమ్ ఆడుతూ.. నేను మేనేజర్ని..సర్వీస్ చేయడం మానేయమని చెప్తుంటే నువ్వు ఎందుకు వినవు.. అంటూ అభి మాస్టర్‌పై ఫైర్ కాగా, నువ్ చెప్తే నేను వినాలా? నేను వాళ్లకి చేసి పెడతా అంటూ గెస్ట్‌లకు పుడ్ ఇచ్చి టిప్ సంపాదించాడు రాజశేఖర్ ఇక మోనాల్‌తో మసాజ్ చేయించుకుని గోర్లు కట్ చేయించుకున్నాడు సొహైల్. అతనికి మసాజ్ చేస్తూ పాట కూడా పాడిన మోనాల్.. ఆ తరువాత అభిజిత్‌తో మాట్లాడుతూ.. దివి కోసం మాస్టర్ ఆడుతున్నాడని.. ఆమెను కెప్టెన్ చేయడానికి మాస్టర్ చాలా కష్టపడుతున్నాడని చెప్పింది. నిజమే అన్నట్లు తల ఊపిన అభి.. కెప్టెన్సీ టాస్క్‌లో నాకు హెల్ఫ్ చేస్తానని మాట తప్పారని మాస్టర్‌పై అసంతృప్తిని వెల్లగక్కాడు. అఖిల్ మైండ్ గేమ్.. హారిక కంటతడి ఇక హోటల్ సిబ్బంది సర్వీస్‌కు మెచ్చి హారిక ఒక స్టార్ ఇవ్వడానికి ముందుకు రాగా, అది ఆమె వ్యక్తిగతం అని మెహబూబ్ చెప్పాడు. అయితే అప్పటికే 5 స్టార్లను దొంగిలించిన అఖిల్.. హారికకు ఈ విషయం చెప్పాడు. అయితే తన స్టార్ తనకు ఇస్తే తిరిగి ఇస్తానని హారిక చెప్పగా.. అభిజిత్ తెలివిగా 5 స్టార్లను తన చేతిలో పెట్టి..తిరిగి తీసుకున్నాడు. దీంతో 5 స్టార్లు అతిథులు ఇచ్చినట్లే అని అభి చెప్పగా.. లేదు లేదు నేను ఒక్కటే స్టార్ ఇచ్చానని హారిక చెప్పింది. అయినప్పటికీ గేమ్ ప్రకారం 5 స్టార్లు నువ్వే నా చేతికి ఇచ్చావని చెప్పడంతో బిత్తిరి ముఖం వేసింది. పదే పదే బిగ్‌బాస్ కెమెరా ముందుకు వచ్చి నేను ఒకటే స్టార్ ఇచ్చాను. ఐదు స్టార్స్ ఇవ్వలేదని కంటతడి పెట్టింది.