health scheme
-
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి ప్రత్యేక కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పకడ్బందీగా ఆరోగ్య పథకం(హెల్త్ స్కీం) అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య, ఆరో గ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, పెన్షనర్లు మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఉద్యోగుల హెల్త్ స్కీం, ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఖ్యాతి గడించిందని, ఉద్యో గులు, పెన్షనర్ల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. ఈ స్కీమ్ ద్వారా అత్యున్నత వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులోకి వస్తాయ న్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో మొండి వైఖరి ప్రదర్శి స్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభి వృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్దితో ఉన్నార న్నారు. మంత్రిని కలసిన వారిలో రిటై ర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షు డు దామోదర్ రెడ్డి, కార్యదర్శి చంద్ర శేఖర్ తదితరులున్నారు. ఇబ్బందులు తొలగిస్తామన్నారు.. అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత ఈహెచ్ ఎస్ కార్డుల అమలుకు త్వరలోనే కమి టీని ఏర్పాటు చేసి, ఇబ్బందులు తొల గిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ లక్ష్మయ్మ, ప్రధాన కార్యదర్శి సుభాకర్ తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం హరీశ్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. -
ప్రభుత్వ ఉద్యోగుల 341 డిమాండ్లు పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లలో 341 డిమాండ్లను పరిష్కరించామని, మిగతా వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎస్ వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాఖల స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, చాలా వరకు పరిష్కరించినట్లు చెప్పారు. ఆరేడు నెలలుగా ఉద్యోగ సంఘాలతో తరచూ మంత్రివర్గ ఉప సంఘం, అధికారులు సమావేశమై చర్చిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య విధానంలో త్వరలోనే 1042 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగుల వేతన సవరణకు మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12వ పీఆర్సీని కూడా నియమించినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆ శాఖల ఉన్నతాధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్, అజయ్ జైన్, బి.రాజశేఖర్, ఎం.టి. కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శులు చిరంజీవి చౌదరి, జయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాశ్, శ్యామల రావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నుండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎం.కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, సీహెచ్ శ్రావణ్ కుమార్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, ఏపీజీఈఏ జనరల్ సెక్రటరీ జె.ఆస్కార్ రావు, ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు సి.గోపాలకృష్ణ, ఎస్.మల్లేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు వేణుమాధవరావు, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సంఘం అధ్యక్షుడు రజనీష్ బాబు, జూనియర్ వెటర్నరీ అధికారులు, వెటర్నరీ లైవ్‌స్టాక్ అధికారులు సంఘం అధ్యక్షుడు సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం: బండి శ్రీనివాసరావు 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి చాలా గొప్ప జాయింట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం. 40 రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాం. పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరాం. పోలీసులు, ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలు రూ. 800 కోట్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లియర్ చేస్తామన్నారు. యూరోపియన్ ఏఎన్ఎంలను రెగ్యులరైజేషన్, ఎంపీడీవోల ప్రమోషన్లలో మినిస్టీరియల్ సిబ్బందికి 34 శాతం కోటాపై సానుకూలంగా స్పందించారు. 2004 కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ అమలు చేయమని కోరాం. మన్మోహన్ సింగ్ ను పీఆర్సీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం హర్షణీయం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది: వెంకట్రామిరెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్ధీకరణకు ఒకే జీవో ఇస్తామన్నారు. వారు పనిచేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వొద్దని కోరాం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది. జీపీఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరాం. అందుకు సీఎస్ అంగీకరించారు. జగనన్న లే అవుట్లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరగా సీఎస్ అంగీకరించారు. గ్రీవెన్స్ డే నిర్వహించడం సంతోషం: బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇకపై నాలుగు నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటిసారిగా గ్రీవెన్స్ డే నిర్వహించడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. 2014 జూన్ 2 నాటికి ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి. జీతాలు, పింఛన్లు 1వ తేదీన చెల్లించాలని కోరాం. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇవ్వడం సంతోషం. ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు కూడా జీతాలతో కలిపి ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను బలోపేతం చేయాలని, తక్షణమే ట్రస్ట్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని కోరాం. -
301 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న 301 మంది జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ డా.ఎ.మల్లికార్జున తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో అక్రిడిటేషన్ కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు ప్రభుత్వ ఉత్తర్వుల్ని అనుసరించి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులతో పాటు అవసరమైన ధృవపత్రాల కాపీలను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలన్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అక్రిడిటేడ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోర్డినేటర్ డా.రాజేష్‌ని ఆదేశించామన్నారు. ప్రధాన పత్రికలు మినహా ఇతర పేపర్లలో విధులు నిర్వహిస్తున్న నిరుపేద రిపోర్టర్లకు జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌కు అవసరమైన చలానా నగదుని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యుడు, సాక్షి బ్యూరో చీఫ్, కె.రాఘవేంద్రారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డా.మల్లికార్జున హెల్త్‌స్కీమ్ చలానాల్ని సీఎస్ఆర్ నిధుల్లో భాగంగా చెల్లించేందుకు అంగీకరించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం ఆర్టీసీ పాస్ చెల్లుబాటు అయ్యేలా చూడాలని కమిటీ సభ్యులు కోరగా.. ఇప్పటికే దానికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎన్‌ఎస్‌ఆర్‌కే బాబూరావు, చిట్టిబాబు, అనురాధ, డి.రాణి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్, మోహనలక్ష్మి, ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ, కన్వీనర్, మెంబర్ మణిరామ్ పాల్గొన్నారు. -
తెలంగాణకు రూ.5,238.93 కోట్లు.. పార్లమెంటులో చెప్పిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ద్వారా ఆరు జాతీయ జలమార్గాలు వెళ్తున్నాయని అందులో గోదావరి– కృష్ణానది మినహా మిగతా ఐదు జాతీయ జలమార్గాలైన భీమా, మంజీరా, పెన్‌గంగ–వార్ధా, తుంగభద్ర, పెన్‌గంగ–ప్రాణహిత నదుల వ్యవస్థ జాతీయ జలమార్గాలు షిప్పింగ్, నావిగేషన్ కోసం సాంకేతిక–వాణిజ్యపరంగా ఆచరణీయం కాదని అధ్యయనంలో తేలిందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ప్రస్తుతం నల్లగొండలోని సిమెంట్ పరిశ్రమల నుంచి సిమెంట్ తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న ముక్త్యాల టెర్మినల్‌ను ఉపయోగించవచ్చా అని బీఆర్ఎస్ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. జాతీయ జలమార్గం–4 ఫేజ్–1లో భాగంగా కృష్ణా నదిపై ముక్త్యాల–విజయవాడ స్ట్రెచ్ (82 కి.మీ.) దశలవారీ పనుల అభివృద్ధికి ఇన్‌ల్యాండ్ భారత జలమార్గాల ప్రాధికార సంస్థ రూ.96 కోట్లు కేటాయించిందని వివరించారు. రాష్ట్రానికి రూ.5,238.93 కోట్లు.. తెలంగాణలో 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.5,238.93 కోట్లు విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. కాగా, రాష్ట్ర వాటాతో కలిపి రూ.8,584.98 కోట్లు వాడినట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 2014లో 668 ఉండగా, 2020లో 863కు చేరిందని బీఆర్ఎస్ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రామ సడక్ యోజన కింద 2,427.50 కి.మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన–3 కింద 2,427.50 కి.మీ రహదారి నిర్మాణానికి కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి తెలిపారు. కాగా ఇందులో డిసెంబర్ 14 నాటికి 2,395.84 కి.మీ పొడవుతో 356 రోడ్డు పనులు ఇప్పటికే రాష్ట్రానికి మంజూరు చేశామని బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్ కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు. 45 దరఖాస్తుల ఆమోదం ఆంధ్రప్రదేశ్ నుంచి 47, తెలంగాణ నుంచి 42 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా అందులో ఏపీకి చెందిన 26, తెలంగాణకు చెందిన 19 దరఖాస్తులను ఆమోదించామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు -
ప్రైవేట్ బీమానా? కార్పస్ ఫండా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య పథకంలో భారీ సంస్కరణలు తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) తీరుపై అసంతృప్తి నేపథ్యంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని యోచిస్తోంది. వైద్య సేవల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ప్రస్తుత నగదు రహిత ఆరోగ్య పథకం స్థానంలో రెండు ప్రత్యామ్నాయ పథకాలపై దృష్టిసారించింది. ఒకటి ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థకు అప్పగించి.. వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించడం. ఇందులో ఎవరికైనా జబ్బు చేస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి నగదు రహిత వైద్య సేవలు పొందేలా చూడాలని భావిస్తోంది. దీనికి ఉద్యోగులు ఏడాదికి రూ.20 వేలు ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రభుత్వం కూడా కొంత చెల్లించాలని యోచిస్తోంది. రెండో ప్రత్యామ్నాయమేంటంటే... ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం. ఉద్యోగులు, ప్రభుత్వం కలిపి ఏడాదికి రూ.700 కోట్లు కార్పస్ ఫండ్ తయారు చేసి, ఉద్యోగ కుటుంబ సభ్యులు వైద్యం పొందిన వెంటనే సంబంధిత ఆసుపత్రులకు సొమ్ము అందించేలా చూడటం. ఆరోగ్యశ్రీకి రీయింబర్స్మెంట్..! ప్రస్తుతం రీయింబర్స్మెంట్ పథకం కూడా ఉన్నా.. డబ్బులు చెల్లించి వైద్య సేవలు తీసుకున్న ఉద్యోగులు రీయింబర్స్మెంట్ పొందడం గగనంగా మారింది. వైద్య విద్యాసంచాలకుల పరిధిలో ఉన్న ఆ వ్యవస్థను ఆరోగ్యశ్రీకి అప్పగించడం ద్వారా సులభతరం చేయాలని కూడా సర్కారు యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆయా పథకాలను అధ్యయనం చేయాలని కూడా నిర్ణయించింది. కీలకమైన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ వైద్య పథకంపై చర్చించనున్నారు. ఇక ఎన్ఏబీహెచ్ ఆసుపత్రుల్లోనే... నగదురహిత వైద్యం అందిస్తున్నా, ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. కార్పొరేట్, ప్రైవే టు ఆసుపత్రులు తమను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద దాదాపు 5.50 లక్షల మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు లాందుతున్నారు. రాష్ట్రంలో 96 ప్రభుత్వ నెట్వర్క్, 236 ప్రైవేటు నెట్వర్క్, 67 డెంటల్ ఆసుపత్రులున్నాయి. వీటిలో ప్రభుత్వం పేర్కొన్నట్లుగా దాదాపు 900 రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. సాధారణ వైద్య సేవలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కేవలం శస్త్రచికిత్సలకే పరిమితమవుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. నగదు రహిత వైద్యం ఉండి కూడా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని, మరోవైపు రీయింబర్స్‌మెంట్‌లో కోత కోస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆరోగ్య పథకంలో సంస్కరణలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కొత్తగా తెచ్చే పథకాన్ని కొన్ని ఆసుపత్రులకే పరిమితం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్)లోనే అమలు చేయాలని యోచిస్తోంది. అంటే కార్పొరేట్, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు అందుతాయన్నమాట. నాలుగు స్థాయిల్లో వాటా! ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కేడర్ వారీగా సొమ్ము వసూలు చేస్తారు. అలాగే రాష్ట్రంలోనూ వేతనాలను బట్టి లెవెల్స్ నిర్ధారించి నాలుగు శ్లాబుల్లో ఉద్యోగుల నుంచి వాటాను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా నిధులు సేకరించి కార్పస్ ఫండ్ తయారుచేస్తారు. తక్కువ వేతనదారుల నుంచి రూ.250, భారీ వేతనం తీసుకునే వారి నుంచి రూ.500–600 వసూలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. తాము నెలకు రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని ఉద్యోగులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అలా చేస్తే ఏడాదికి రూ. 350 కోట్లు వసూలవుతుంది. దానికి ప్రభుత్వం రూ. 350 కోట్లు ఇస్తే, మొత్తం రూ.700 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనివల్ల తమ సమస్యలు తీరుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించే రెండు ప్రత్యామ్నాయాల్లో దేనికైనా తాము సిద్ధమేనని అంటున్నారు. -
Telangana: హెల్త్ ప్రొఫైల్‌కు బ్రేక్.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: హెల్త్ ప్రొఫైల్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించి సర్కారుకు ప్రతిపాదన చేసింది. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్‌కు శ్రీకారం చుట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యధికులకు అనారోగ్య సమస్యలు కనిపించాయి. మరోవైపు తమకు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయా అన్న భయాందోళన బాధితుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వ్యాధులున్న వారందరికీ పరీక్షలు నిర్వహించడం, డాక్టర్ కన్సల్టేషన్ కల్పించడం సవాల్‌తో కూడిన వ్యవహారమే కాకుండా, అందుకు అవసరమైన మందులు సమకూర్చడం కూడా కష్టమనే భావన అధికారుల్లో నెలకొంది. ఫలానా జబ్బు ఉందని తెలియగానే రోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కాలంలో భయం కారణంగా అనేకమంది ఆసుపత్రుల పాలైనట్లుగా, ఇప్పు డు వైద్యపరీక్షలు చేస్తే అవసరమున్నా లేకున్నా, బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీసే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆ రెండు జిల్లాల హెల్త్ ప్రొఫైల్‌లో వెలుగు చూసిన అంశాలు, తదుపరి నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. వచ్చే హెల్త్ ప్రొఫైల్‌లో పరీక్షల సంఖ్య కుదింపు 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వివిధ రకాల టెస్టులు చేయడం ద్వారా ముందస్తుగా ఏమైనా వ్యాధులుంటే వాటికి వైద్యం అందించాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆ వివరాలతో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందనుంది. సిరిసిల్ల, ములుగు కాకుండా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఇప్పటికే హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించాల్సి ఉండగా, తాత్కాలికంగా వాయిదా వేశారు. జనవరి 18 నుంచి ఐదు నెలలపాటు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల సమయం సమీపించే అవకాశముంది. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా 30 టెస్టులు చేశారు. కానీ, రానున్న హెల్త్‌ప్రొఫైల్ కార్యక్రమంలో పరీక్షల సంఖ్యను కుదించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. ఏదో ఒక అనారోగ్యం.. ములుగు జిల్లాలో 1,81,540 మందికి స్క్రీనింగ్ చేయగా 1,10,527 మందికి ఏదో ఒకరకమైన అనారోగ్యం ఉన్నట్లు తేలింది. 11,896 మందికి థైరాయిడ్, 28,281 మందికి లివర్ సమస్యలు, 28,857 మందికి కాల్షియంలోపం, సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్)లో 23,216 మందికి అసాధారణ అనారోగ్య సమస్యలు, లిపిడ్ ప్రొఫైల్‌లో 65,586 మందికి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువమందికి రక్తహీనత ఉంది. 12,186 మందికి కిడ్నీ సమస్యలు, అమైలేస్ ఎంజైమ్ లోపంతో 11,752 మంది, మరో 10,124 మందికి యూరిక్ యాసిడ్, 9,775 మందిలో నియంత్రణలో లేని డయాబెటీస్ ఉన్నట్లు తేలింది. చదవండి: Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. -
Family Doctor: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా
‘ఆకలికి అన్నము వేదనకు ఔషధం’ అనే నానుడి మనకందరికీ తెలిసినదే! శారీరక ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఆనారోగ్య శరీరాలకు ఔషధం అనేది కూడా అంతే ముఖ్యం. కానీ ఔష ధాన్ని నిర్ణయించాల్సింది మటుకు వైద్యులే అనేది జగమెరిగిన సత్యం! రోగిని పరీ క్షించటం, వ్యాధిని నిర్ణయించి తగిన సమయంలో సరియైన మోతాదులలో మందులు వాడటం అనేది వైద్యుల బాధ్యతే. అయితే ‘విత్తం ఉంటేనే వైద్యం’ అనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు ఉండ టంతో సమాజంలోని పేద, మధ్యతరగతి వారు వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వం గ్రామాల్లో స్థిర నివాసం ఉండే వైద్యులు ఉండేవారు. వారికి ఆ ఊళ్లో ఉన్న అన్ని కుటుంబాల ఆరోగ్య స్థితుల పట్ల ఒక అవగాహన ఉండేది. అందువల్ల ఆయా కుటుంబాలకు వైద్య చికిత్స అందించడం తేలికయ్యేది. వారందరినీ ఫ్యామిలీ డాక్టర్లుగా వ్యవహరించడం కద్దు. అయితే ప్రస్తుతం వైద్యుల సంఖ్య పెరుగుతున్నా ఈ ఆధునిక కాలంలో పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ ప్రజలందరికీ డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. ఇందుకు వైద్యం ఖరీదైనదిగా మారటం ఒక కారణమైతే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎక్కువ మంది డాక్టర్లు పెద్ద ఆసుపత్రుల్లో తమ సేవలను అందించడం ఇంకో కారణం. దీంతో ఆయా గ్రామాల్లో కానీ, లేదా పట్టణాల్లోని వార్డుల్లో కానీ జీవించే వారికి ఫ్యామిలీ డాక్టర్ అనదగిన వైద్యుని సేవలు పొందే అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో లభిస్తూనే ఉంటాయి. అలాగే వైద్య సౌకర్యాలు ఫరవాలేదు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. అలాగే రోగం, రొప్పు వస్తే అర్హత గల డాక్టర్ వైద్య సేవలు మృగ్యం. నాసిరకం మందులు, నాటు మందులు మాత్రమే వారికి లభిస్తాయి. మూఢనమ్మకాలతో కూడిన వైద్యం వారిని కాటేస్తున్నది. నాణ్యమైన వైద్యం కావాలంటే... అప్పుల పాలు కావటమో, ఆస్తులు తాకట్టు పెట్టటమో, నగ నట్రా లేదా ఆస్తులు అమ్ముకోవటమో చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా స్త్రీలలో ప్రసవ వేదన సమస్యలు, సాధారణ స్త్రీ ఆరోగ్య సమస్యలు; దీర్ఘకాలిక వ్యాధులున్నవారి సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే సహజమైన ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో కలిగే రుగ్మతలు, పౌష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు వంటి వాటికి చికిత్స పొందే తాహతు పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ చాలా తక్కువ మందికే ఉంది. అందుకే ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయింది. మాటలతో మానసిక భరోసా, అవసరమైన వరకే మందులతో వైద్యం చేసే పరిస్థితి ప్యామిలీ డాక్టర్ విధానంలో ఉంటుంది. నిజంగా ఇది ‘కారుచీకటిలో కాంతి పుంజం’ వంటిదని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ ఆవిష్కరణ మన రాష్ట్రానికే కాదు దేశానికే, ఆదర్శం, హర్షణీయం. ఇదేదో ప్రభుత్వ ఆకర్షణీయ పథకం అనుకుంటే పొరపాటే! ప్రభుత్వం ప్రజలందరి ఆరోగ్య స్థితిగతుల గురించిన సమాచారాన్ని సేకరించి... తగిన విధంగా వైద్య సేవలను అందచేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపక రిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వాలంటరీ వ్యవస్థ, నూతన విద్యా విధానాల వైపు దేశం యావత్తూ ఆసక్తికరంగా చూస్తోంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీసుకువస్తున్న ‘ఫ్యామిలీ డాక్టర్స్’ విధానం మరింతగా దేశ ప్రజలను ఆకర్షించి మంచి ఫలితాలు పొందడానికి మార్గదర్శకమవుతుంది. ఇంగ్లాండ్‌లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. వైద్యునికి రోగికి మధ్య సత్సంబంధాలు మెరుగుపరచటమే కాక.... సకాలంలో సరియైన రీతిలో ప్రజలకు పెద్దగా ఆర్థిక భారం లేని వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి ఈ విధానం దోహదం చేస్తుంది. అందుకే ఈ విధానా నికి ఆహ్వానం పలుకుదాం! ఆరోగ్యకర మైన సమాజాన్ని నిర్మిద్దాం! (క్లిక్ చేయండి: మన మందులు మంచివేనా?) - అమరనాథ్ జగర్లపూడి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
TS: ఈహెచ్ఎస్లో ఉద్యోగుల భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో సమస్యలను పరిష్కరించడం, పథకాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ దృష్టిసారించింది. దీనికి సంబం ధించి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో నిమ్స్ డైరెక్టర్ మనోహర్, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ రెడ్డి, సీఎంవో ప్రత్యేకాధికారి తాడూరి గంగాధర్, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డైరెక్టర్ ప్రీతిమీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈహెచ్ఎస్ అమలు కోసం ఉద్యోగుల మూల వేతనంలో ఒక శాతాన్ని తీసుకోవాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి, పథకాన్ని సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఈహెచ్ఎస్ అమలు పరిస్థితిపై ఉద్యోగులు, పింఛన్ దారులు అసంతృప్తితో ఉన్నారని.. చాలా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. బడ్జెట్లో ఈ పథకానికి రూ.300 కోట్ల మేర కేటాయిస్తున్నా.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ‘‘సరిగా బిల్లులు అందడం లేదని, వివిధ చికిత్సలకు చెల్లించే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రులు అంటున్నాయి. ఈ కారణాలతోనే ఈహెచ్ఎస్ కింద వైద్యచికిత్సలు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఆస్పత్రులపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది..’’అని అధికారులు రిజ్వీ దృష్టికి తీసుకొచ్చారు. గత ఐదేళ్లలో పథకం అమలు గణాంకాలను వివరించారు. దీనిపై స్పందించిన రిజ్వీ.. వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ఉద్యోగులు కోరుతున్నట్టుగా వారి మూల వేతనంలో ఒక శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్‌గా తీసుకుంటే.. సమస్య పరిష్కారమవుతుందా అన్న చర్చ జరిగింది. ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇచ్చాక ఇంకా ప్రభుత్వం ఎంత భరించాల్సి ఉంటుందన్న అంచనాలు వేశా రు. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, తగిన ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
అందరికి ఆరోగ్య రక్ష
-
ఆరోగ్య ధీమా
మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం ఎక్కడా లేకుండా తొలిసారిగా అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల క్యాన్సర్లకూ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో పాటు సీజనల్ వ్యాధులకు కూడా చికిత్స అందిస్తారు. ఈ పథకం కింద శస్త్ర చికిత్స చేయించుకున్న వారు కోలుకునే వరకు రోజుకు రూ.225 చొప్పున, లేదా నెలకు రూ.5 వేలు ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నారు. గత నెల 2వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో 1,42,54,134 కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఈ పథకం వర్తింప చేస్తూ నేడు ఏలూరులో నాంది పలకనున్నారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్ ప్రాజెక్టును తొలుత ఈ జిల్లాలో అమలు చేయనున్నారు. మిగతా జిల్లాల్లో కూడా శుక్రవారం నుంచి 1,259 వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింప చేయనున్నారు. ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఆసుపత్రులతో టై అప్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా క్యాన్సర్ చికిత్సను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు పాత కార్డులు కూడా పని చేస్తాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తొలి రోజు అంటే శుక్రవారం 1.5 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కాగా, గతంలో ఈ పథకం కింద చిన్నారులకు ఒక చెవికి మాత్రమే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు దాన్ని రెండు చెవులకూ వర్తింప చేస్తున్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే వర్తింపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని కొనసాగించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయితే ఈ పథకానికి ప్రాధాన్యతను తగ్గించేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ పథకాన్ని పూర్తిగా నీరుకార్చింది. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం అందక పడుతున్న ఇక్కట్లను అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కళ్లారా చూశారు. యూనివర్సల్ ఆరోగ్య బీమా తీసుకువస్తానని, చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ప్రకటించారు. ఆదాయ పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వర్గాల వారికి ఈ పథకం ఒక వరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించారు. నవంబర్ నెలలో వైఎస్సార్ నవశకం పేరుతో గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారందరినీ అర్హులుగా గుర్తించారు. సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం గ్రామ, వార్డు సభలు నిర్వహించి తుది జాబితా తయారు చేశారు. నాడు వైఎస్ కూడా ఇక్కడి నుంచే.. సాక్షి ప్రతినిధి, ఏలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభిస్తుండటం విశేషం. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టడం పేద, మధ్యతరగతి వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ఔదార్యాన్ని చాటుతోంది. డయాలసిస్ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా అమలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. నాడు వైఎస్ కూడా ఇక్కడి నుంచే.. సాక్షి ప్రతినిధి, ఏలూరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచి ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేసి నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టనున్నారు. డయాలసిస్ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా అమలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. -
కేసీఆర్ కిట్ గ్లోబల్ టెండర్లతో ఆదా
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్ ఆన్లైన్ గ్లోబల్ టెండర్లతో ఈ ఏడాది సర్కారుకు రూ.7 కోట్లు ఆదా అయినట్లు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈసారి టెండర్లలో 8 కంపెనీలు పాల్గొనగా ఎల్–1 వచ్చిన కంపెనీ రూ.1593.97 కోట్ చేసిందని, గతం కంటే ఇది రూ.120 తక్కువ అని తెలిపారు. మొత్తం 6 లక్షల కిట్లకు గాను రూ. 7.14 కోట్లు ఆదా అయిందన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీలో అంతరాయం కలగకుండా ఉండేందుకు బిడ్ చేసిన ధరకే ఎల్–1కు 50 శాతం, ఎల్–2కు 30 శాతం, ఎల్–3కి 20 శాతం కేటాయించినట్లు తెలిపారు. రాబోయే రెండేళ్లలో 6 లక్షల కిట్లు అవసరమవుతాయన్న అంచనా ఉందన్నారు. -
వెల్నెస్ సెంటర్ సిద్ధం
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూర్చేలా..ఎంప్లాయిస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా ఖమ్మంలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వెల్నెస్ సెంటర్‌ను సిద్ధం చేశారు. దీనిని..సోమవారం ఉదయం 11గంటలకు కలెక్టర్ కర్ణన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు పలు జిల్లాల్లో 11 ప్రారంభించగా తాజాగా ఖమ్మంలో 12వది సిద్ధమైంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సల కోసం ట్రామా కేర్ భవనాన్ని ఇందుకు కేటాయించారు. దీనిని నూతనంగా నిర్మించి..ఐదు నెలలు పూర్తయినా వినియోగంలోకి తీసుకురాలేదు. రూ. 7 కోట్ల వ్యయంతో కట్టిన ఈ భవనాన్ని ఇటీవల కలెక్టర్ సందర్శనలో పరిశీలించి..ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పుడు వెల్నెస్ సెంటర్ కోసం ఆ నూతన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను కేటాయించారు. ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉత్వర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాట్లు.. కలెక్టర్ కర్ణన్ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ జేహెచ్ఎస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి మూడు రోజులుగా తిష్ట వేసి..పనులు చేయించారు. ఆస్పత్రికి చెందిన అధికారులు, ఇంజనీరింగ్ వారితో మాట్లాడి ట్రామా కేర్ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను స్వాధీనం చేసుకుని..వెల్నెస్ సెంటర్‌కు కావాల్సిన పరికరాలు, సామగ్రిని హైదరాబాద్ నుంచి తెప్పించి..ఇక్కడ ఏర్పాటు చేయించారు. 24 మంది ఉద్యోగులతో సేవలు.. వెల్నెస్ సెంటర్లో 24 మంది ఉద్యోగుల ద్వారా వైద్యసేవలు అందించనున్నారు. అందుకోసం ఇటీవల వారి నియామకం చేపట్టారు. ఎంబీబీఎస్ డాక్టర్లు 4, బీడీఎస్లు 2, ఫిజియోథెరపిస్ట్‌లు 2, ఫార్మాసిస్ట్లు 3, జీఎన్ఎంలు 3, డెంటిస్ట్‌లు 4, డెంటిస్ట్ అసిస్టెంట్లు 2, వార్డుబాయ్‌లు 3, అబ్డామిన్ స్కానర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1 నియమించారు. వెల్నెస్ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు. ఇక్కడ వైద్యసేవలు పొందాలనుకునేవారు ఎంప్లాయి, జర్నలిస్టు, పెన్షనర్, వారి కుంటుంబ సభ్యులు హెల్త్ కార్డును తీసుకొచ్చి వైద్యసేవలు పొందొచ్చు. ఓపీ మాత్రమే.. నూతనంగా ప్రారంభించనున్న వెల్నెస్ సెంటర్లో ఔట్ పేషంట్ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రాథమిక వైద్యసేవలు నిర్వహించనున్నారు. రోగులకు వైద్య పరీక్ష చేశాక మందులు ఇస్తారు. త్వరలో స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందించనుండగా, అత్యవసర వైద్య సేవల కోసం ఇతర ఆస్పత్రులకు పంపి స్తారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తం గా 250 ఆస్పత్రులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఠీఠీఠీ.్ఛజిట.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో ఆ దవాఖానాల వివరాలు, అందుకు సంబంధిచిన పూర్తి సమాచారం ఉంటుంది. ఈహెచ్ఎస్ ద్వారా 1800 రకాల వైద్య సేవలు అందించనున్నారు. -
‘ఆయుష్మాన్ భారత్’ను వద్దంటున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ : దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అమలవుతోన్న ఈ పథకం 5 బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అమలుకావడం లేదు. తెలంగాణ, ఢిల్లీ, ఒడిషా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు తమ సొంత హెల్త్ స్కీమ్‌ను అనుసరిస్తున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ భారతం కంటే కూడా తమ అమలుచేస్తోన్న హెల్త్ స్కీం ఎంతో బాగున్నట్లు ఆయా రాష్ట్రాలు భావిస్తున్నట్లు సమాచారం. దీని గురించి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పథకం కన్నా తాము రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందని, ఆయుష్మాన్ భారత్ నిబంధనలు కఠినంగా ఉన్నందున రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే ప్రమాదముందని వివరించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంతో పటిష్టంగా అమలవుతోందని, కాబట్టి కేంద్ర పథకంలో చేరబోమని, ఒకవేళ రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. మిగతా రాష్ట్రాలు కూడా తమ తమ అభ్యంతరాలను తెలిపినట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని మోదీ పేదల పాలిట సంజీవనిగా వర్ణిస్తుండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీన్ని ఓ పీఆర్ ఎక్సర్సైజ్ కార్యక్రమం అంటూ విమర్శించారు. -
‘ఆరోగ్యలక్ష్మి’ అభాసుపాలు
తూప్రాన్ (మెదక్): జిల్లాలో గర్భిణులు, బాలంతల సంరక్షణ కోసం ప్రవేవపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం అభాసుపాలవుతోంది. పేద కుటుంబాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, రక్తహీనత నివారణ కోసం ప్రభుత్వం ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందజేస్తుంది. కానీ ప్రస్తుతం ఈ పథకం ద్వారా పంపిణీ చేయాల్సిన పాల సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సమయంలో పాల సరఫరా నిలిచిపోవడంతో బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలల్లో ఉండే పుష్కలంగా పౌష్టిక విలువలతో కూడిన పోషక విలువలు అందకుండా పోతున్నాయి. తూప్రాన్ మండలంలో పది రోజులుగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావల్సిన పాలు అందడం లేదు. ఏజెంట్ నిర్వాకం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, చిలిపిచెడ్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 1,817, బాలింతలు 1,835 ఏడు నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు 1,862, సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 5,991, మూడు సంత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 6,655 మంది ఉన్నారు. కేవలం అన్నం మాత్రమే.. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు 200 మిల్లీలీటర్ల పాలు, 150గ్రాముల అన్నం, రోజుకు ఒక గుడ్డు వడ్డించాలని నిర్ణయించారు. కొన్ని రోజులుగా పాలు లేకుండానే గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు భోజనాన్ని అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ టీచర్లను అడిగితే పైనుంచే సరఫరా కావడం లేదని తమ చేతుల్లో లేదని తెగేసి చెబుతున్నారని వారు వాపోతున్నారు. దీంతో కేవలం అన్నం మాత్రమే తిని ఇళ్లకు వెల్లిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఊదరగొడుతూ ఇటీవల పౌష్టికాహార వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి పౌష్టికాహారం అందకుండా పోవడంలో అధికారులు వైఫల్యం చెందారన్న విషయం ఈ సంఘటనను బట్టిచూస్తే స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పౌష్టిక విలువలు కలిగిన ఆహార పదార్థాలతోపాటు పాలు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పలు చోట్ల అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. దీంతో దొడ్డు బియ్యం తినేందుకు వారు ఇబ్బందులు పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రాల్లోనే గర్భిణులకు, బాలింతలకు భోజనం వడ్డించాలి. కానీ దొడ్డుబియ్యంతో అన్నం తినేవారు లేక కేవలం పాలు,గుడ్లు మాత్రమే ఇళ్లల్లోకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో దొడ్డుబియ్యం తమకు జీర్ణం కాదంటూ కేంద్రాలకే రావడం లేదు. ఇది కేవలం తూప్రాన్ మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రతిరోజు గ్లాసు పాలు ఇవ్వాలి. కానీ పాలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ మాకు మాత్రం అందడం లేదు. అధికారులు వెంటనే స్పందించి తమకు పాలు అందేలా చూడాలి. ఈ విషయమై అధికారులు పట్టించు కోవడం లేదు. –రోజా, బాలింత పది రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు పదిరోజుల నుంచి అంగన్వాడీ కేంద్రంలో పాలు ఇవ్వడం లేదు. కేవలం భోజనం, గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే పైనుంచి పాలు రావడం లేదని చెబుతున్నారు. పాలు కొనుగోలు చేయలేని మాలాంటి వారికి వెంటనే పాలు అందజేయాలి. –ఆకుల కృప ఏజెన్సీ నిర్వాకం వల్లే.. అంగన్వాడీ కేంద్రాలకు టెండర్ల ద్వారా ‘నేహా’ అనే సంస్థ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది. తూప్రాన్ మండలంలో కొన్ని రోజులుగా పాలు సరఫరా కావడం లేదని అంగన్వాడీ టీచర్లు మా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఈ కేంద్రాలు పాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం. –కనకదుర్గ, ఐసీడీఎస్ సీడీపీఓ, నర్సాపూర్ -
‘పీఎంజా’ ఆయుష్మాన్ భవ!
సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ‘ఆయుష్మాన్ భారత్’, నిన్న ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ‘నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్’, నేడు ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్’ ఇలా పేర్లు మార్చుకుంటున్న పేద ప్రజల ఐదు లక్షల జాతీయ ఆరోగ్య భీమా పథకం సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎర్ర కోట వేదిక నుంచే ప్రకటించారు. దేశంలోని పది కోట్ల కుటుంబాలకు, అంటే 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న ఈ పథకం అమలుపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల భారీ మొత్తాన్ని భీమాగా నిర్ణయించడం ఒక్కటయితే, దాన్ని ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించాలా? అన్న ప్రభుత్వ సంశయంపై ఈ అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. 2016లో ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ పేద ప్రజల కోసం లక్ష రూపాయల ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. అదే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018లో వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతూ ఐదు లక్షల రూపాయల భీమాతో కొత్తగా ప్రధాన మంత్రి ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు. ఎన్నికలకు ఏడాది ముందు ఈ పథకాన్ని తీసుకరావడం పట్ల పథకం పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఎంత ? అన్నది ఒక్క అనుమానమైతే, 2009 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ స్వస్త్ భీమా యోజన’ పథకాన్ని చిత్తశుద్ధితో మోదీ ప్రభుత్వం అమలు చేయక పోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది. 25 కోట్ల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని కుటుంబానికి 30 వేల ఆరోగ్య భీమాను కల్పిస్తూ నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ స్వస్త్ భీమా యోజన’ పథకంలో 3.6 కోట్ల మంది పేద ప్రజలు మాత్రమే స్కీమ్‌లో చేరారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రశంసలు అందుకున్న ఈ స్కీమ్ ఇప్పుడు మంచం పట్టింది. ఈ స్కీమ్‌ను ఉపయోగించుకొని అటు ప్రైవేటు భీమా కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రులు లాభ పడుతూ వస్తున్నాయి తప్పా, పేదలకు ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈ పథకానికి కేంద్రం 75 శాతం నిధులు సమకూరుస్తుండగా, 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇప్పుడు ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్’లో 60 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుండగా, 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సొంతంగా పేదల కోసం ఆరోగ్య భీమా స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి. వాటిలో కర్ణాటకలో ‘వాజపేయి ఆరోగ్య శ్రీ, తెలుగు రాష్ట్రాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ, తమిళనాడులో ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య భీమా పథకాలు సవ్యంగానే అమలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహానికి పోటీగా పంధ్రాగస్టు రోజునే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్కాయక్ పేదల కోసం ఐదు లక్షల రూపాయల భీమాతో ‘బిజూ పట్నాయక్ ఆరోగ్య భీమా పథకం’ను ప్రకటించారు. ఆ రాష్ట్ర జనాభాలోని 70 శాతం మంది, అంటే 70 లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య స్కీమ్‌లను కూడా సమీక్షించి కేంద్రం రాష్ట్రాలతో కలిసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సమగ్ర ఆరోగ్య స్కీమ్‌ను తీసుకరావడం మంచిదని ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. ప్రైవేటు భీమా కంపెనీలకు ఆరోగ్య భీమా కింద డబ్బులను కట్టబెట్టడంకన్నా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను అభివృద్ధి చేయడం అవసరమని కూడా వారు చెబుతూ వస్తున్నారు. నరేంద్ర మోదీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలనుకుంటే ప్రైవేటు భీమా కంపెనీలకు కాకుండా ప్రభుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలో అమలు చేయడం మంచిదని జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంద్రానిల్ ముఖో«పాద్యాయ్, నేషనల్ హెల్త్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇందూ భూషణ్‌లు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మోదీ ప్రకటించిన ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ 28 రాష్ట్రాలు సంతకాలు చేయగా, వాటిలో 23 రాష్ట్రాలు భీమా కంపెనీలను వ్యతిరేకిస్తూ ట్రస్టీల వైపు మొగ్గు చూపడం విశేషం. కాకపోతే ఎక్కువ రాష్ట్రాలు స్వచ్ఛంద ట్రస్టుల వైపు మొగ్గు చూపడం విచారకరం. పథకాలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టడం, వాటిని క్లుప్త పదంలో పిలవడం కూడా ముచ్చటగా ఉండాలని మోజుపడే మోదీ, ఆరోగ్య పథకానికి కూడా ‘పీఎమ్‌జా (పీఎంజెఏఏ)’ క్లుప్త పదం వచ్చేలా చూశారు. పీఎమ్‌జా కాస్త అబెఛా! కాకుండా చూసుకోవాలన్నదే ప్రజల కోరిక. చదవండి: ఎవరి ఆరోగ్యం కోసం ఈ స్కీమ్ -
ఆయుష్మాన్ భారత్‌తో ప్రజలకు మేలు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం అమల్లోకి తెస్తున్న పథకం తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద హెల్త్ స్కీం అని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవుతున్న తరుణంలో దీంతో ప్రజలకు ఎంతో మేలు కలగనుందన్నారు. ఆరోగ్యశ్రీలో రూ.2 లక్షల వైద్య సహాయమే ఉండగా, ఇందులో రూ.5 లక్షల వైద్య సహాయం అందుతుందని చెప్పారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేద ని వార్తలు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం చేపట్టిన అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. -
ఎవరి ఆరోగ్యం కోసం ఈ ‘స్కీమ్’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలకు ఆరోగ్య భీమాను కల్పించేందుకు ఉద్దేశించిన ‘జాతీయ ఆరోగ్య భద్రతా పథకం (ఎన్హెచ్స్కీ)’ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు పంధ్రాగస్టు సందర్భంగా ప్రారంభిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమాను కల్పించే ఈ పథకానికి ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా దేశంలోని పది వేల కుటుంబాలకు, సరాసరి సగటున కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటారనుకుంటే యాభై కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకం చుట్టూ ఇప్పటికే పలు అనుమానాలు ముసురుకొని ఉన్నాయి. ‘ఆయుష్మాన్ భారత్’లో భాగమైన ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఇంతవరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆమోదించగా ఇంకా పలు రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు వివిధ పద్ధతుల్లో ఆరోగ్య భీమా పథకాలకు ఫలప్రదంగానే అమలు చేస్తుండడం వల్ల ఈ పథకాన్ని తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలో అర్థంకాక తికమక పడుతున్నాయి. 2008 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రీయ స్వస్థత ఆరోగ్య భీమా పథకాన్ని’ అమలు చేస్తోంది. ప్రతి పేద కుటుంబానికి 30 వేల వరకు ఆరోగ్య భీమాను కల్పిస్తున్న ఈ పథకానికి 750 రూపాయలను ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద కేంద్రం 75 శాతం వాటా నిధులను భరిస్తుంటే రాష్ట్రం 25 శాతం నిధులను భరిస్తోంది. ఐదులక్షల రూపాయల కవరేజ్ గల కొత్త పథకం వచ్చాక ఈ పాత పథకాన్ని రద్దు చేస్తారా, లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ రాష్ట్రీయ స్వస్థత ఆరోగ్య భీమా పథకాన్ని మాత్రమే ఉత్తరాది రాష్ట్రాలు, అది కూడా అరకొరగా అమలు చేస్తుంటే, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు సవ్యంగా అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు సొంత ఆరోగ్య పథకాలతో మిలితం చేసి మరింత పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు భీమా కవర్‌తో ఆరోగ్య శ్రీ, పేదల ఆరోగ్య భీమా పథకాలను అమలు చేస్తున్నాయి. కేంద్రం కొత్త పథకాన్ని స్వీకరించి ఇప్పటి వరకు తాము అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను మూలన పడేయాలా? అన్న సందిగ్ధంలో ఈ రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్ర ప్రతిపాదిత ఐదు లక్షల ఆరోగ్య భీమాకు 1,082 రూపాయలను కేంద్రం ప్రీమియంగా నిర్ణయించింది. అయితే ఏ భీమా కంపెనీ ఈ ప్రీమియంకు ఒప్పుకోదని, ప్రీమియంగా ఇంతకన్నా 63 శాతం ఎక్కువగా అంటే, 1,765 రూపాయలను చెల్లించాల్సి వస్తుందని ‘క్రిసిల్’ ఓ నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే జాతీయ ఆరోగ్య భద్రతా పథకంలో కేంద్రం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాలన్నది తెల్సిందే. ఈ అదనపు ప్రీమియం కూడా రాష్ట్రాలే భరించాల్సి రావచ్చు. కేరళలో 41 లక్షల మంది పేదలకు ప్రస్తుతం ఆరోగ్య భీమాను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌లో అక్కడ 22 లక్షల మంది పేదలకు మాత్రమే ఈ స్కీమ్‌ను అమలు చేయాలని సీలింగ్ పెట్టారు. ఈ లెక్కన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 41 లక్షల మందికి కొత్త పథకాన్ని అమలు చేయాలంటే 19 లక్షల మందికి స్వయంగా ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. 25 కోట్లకుగాను, 3.6 కోట్ల మందికే కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ స్వస్థత భీమా యోజన’ను దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 3.6 కోట్ల మందికి మాత్రమే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికే కాకుండా రోజువారి దినసరి కూలీలు, ఇంటి పనివాళ్లు, భవన నిర్మాణ కూలీలు, వీధుల్లో వ్యాపారం చేసుకునేవారు, రైల్వే పోర్టర్లు, బీడి కార్మికులు, పారిశుద్ధ పనివాళ్లు, రిక్షా కార్మికులు....ఇలా అసంఘటిత రంగానికి చెందిన ప్రతి ఒక్కరు అర్హులైనప్పటికీ 3.6 కోట్ల మందికి మించి అమలు జరగడం లేదు. ఇప్పుడు దారిద్య్ర రేఖకు దిగువనున్న పది కోట్ల మందికి మాత్రమే అమలు చేయాలనుకుంటున్న కొత్త ఆరోగ్యం పథకం రెండు కోట్ల మందికి దాటటం కూడా మహా ఎక్కువన్నది నిపుణుల అంచనా. కార్పొరేట్ ఆస్పత్రలు కోసమే ఉత్తరాదిలో కార్పొరేట్ వైద్యం అంతగా విస్తరించలేదు. అక్కడ ఆరోగ్య భీమా పథకాలు అంతంత మాత్రమవడం కూడా ఒక కారణం. ఇటు దక్షిణాదిలో కార్పొరేట్ ఆస్పత్రులు విస్తరించినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు అవి ఇప్పటికీ దూరంగా ఉన్నాయి. కార్పొరేట్ వైద్యం ఖరీదవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అవి నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన ఐదు లక్షల భద్రతా పథకం వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాలకు దూసుకుపోతాయని, అందుకోసమే మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొస్తున్నదని బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్ ఎన్. దేవదాసన్ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. మూడు లక్షలు చాలు తమిళనాడులో ఏటా 72 వేల రూపాయలకన్నా తక్కువ ఆదాయం కలిగిన పేద ప్రజల కోసం రెండు రకాల ఆరోగ్య భీమా పథాన్ని అమలు చేస్తున్నారు. 1205 రకాల వైద్యానికి లక్ష రూపాయలు, 254 రకాల వైద్యానికి రెండు లక్షల రూపాయలను అమలు చేస్తున్నారు. 2009 నుంచి ఈ పథకం సవ్యంగా అమలు జరుగుతున్నది. మహారాష్ట్రలో ఒకటిన్నర లక్షల రూపాయను, రాజస్థాన్‌లో మైనర్ వైద్యానికి 30 వేల రూపాయలను మేజర్ వైద్యానికి మూడు లక్షల రూపాయలను బీమాను అమలు చేస్తున్నారు. ఈ లెక్కన మోదీ ప్రారంభిస్తున్న జాతీయ ఆరోగ్య భీమా స్కీమ్ కింద మూడు లక్షల రూపాయల భీమాను కల్పిస్తే సరిపోతుందని జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలోని ‘స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ’ అసోసియేట్ ప్రొఫెసర్ ఇంద్రానిల్ ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. క్యాన్సర్, అవయవ మార్పిడి కాస్ట్లీ..! క్యాన్సర్, గుండె, కిడ్నీల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలకే ఐదు లక్షల రూపాయలకు మించి ఖర్చు అవుతుంది. మిగితా జబ్బులన్నింటికి మూడు లక్షల కవరేజ్తోని వైద్యం చేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎక్కువ ఖర్చయ్యే వైద్యం కోసం ఎక్కువ కవరేజీ, తక్కువ ఖర్చయ్యే వాటికి తక్కువ కవరేజ్‌తో భీమా పథకాలను అమలు చేయడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ కవరేజీ వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు లాభ పడడమే కాకుండా అనవసరమైన పరీక్షలు, చికిత్సలు చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘రాష్ట్రీయ స్వస్థత భీమా యోజన’ కింద 2011లో బీహార్‌లో 700 మంది మహిళలకు అనవసరంగా కార్పొరేట్ ఆస్పత్రులు శస్త్ర చికిత్సలు చేసి గర్భసంచులు తొలగించారు. ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గ«ఢ్లలోనూ వెలుగు చూశాయి. 1996 నుంచి 2014 మధ్య కార్పొరేట్ వైద్యం మరీ ఖరీదై పోయిందని ఓ ఆధ్యయనం తెలియజేయగా, ఏటా ఎనిమిది శాతం మంది మధ్య తరగతి ప్రజలు వైద్యం కారణంగా పేదవారుగా మారిపోతున్నారని మరో అధ్యయనం వెల్లడించింది. -
రోగమొస్తే గందరగోళమే
లింగయ్యకు హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. ప్రభుత్వ ఆరోగ్య పథకం ఉంది కదా అనే ధీమాతో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే, పథకం వర్తించదు అని చల్లగా చెప్పారు. భార్యాపిల్లలు రోగిని గబగబా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే నర్సులు గ్లూకోజ్ ఎక్కించారు. పెద్ద డాక్టర్లు వచ్చేదాకా నిరీక్షించాలని చెప్పారు. ఈలోగా రోగి పరిస్థితి విషమించింది.... ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోఅక్కడడక్కడా జరుగుతున్నాయి. బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆరోగ్య చికిత్సల పథకాలను విలీనం చేసి అమలు చేసిన ఆరోగ్య కర్ణాటక పథకం గందరగోళంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పథకం అమల్లోకి వచ్చి వారాలు గడిచినప్పటికీ అనేక లోటుపాట్లు ఎదురవుతున్నాయి. యశస్వినితో పాటు పాత పథకాల లబ్ధిదారులు చికిత్సకోసం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నారు. సమాచార లోపంతో లబ్ధిదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యశస్విని పథకం కింద వైద్య సౌలభ్యాలు ప్రజలకు సులభంగా అందేవి. కానీ దానిని కొత్త పథకంలోకి కలిపేశాక అనేకమంది రోగులకు సకాలంలోచికిత్సలు అందడం లేదు. కొత్త పథకం కింద సేవలు పొందడానికి రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో తక్షణమే అత్యవసర చికిత్సలు చేయించుకునే వెసులుబాటు లేదు. ఆరోగ్య సమస్యలు ఉంటే మొదట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి, అక్కడ ఆరోగ్య సేవలు అందుబాటులేని తరువాతనే వైద్యులు రిఫర్ చేస్తే చేస్తే మాత్రమే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. కానీ ప్రైవేటు ఆసుపత్రి కూడా ఆరోగ్య కర్ణాటక పథకం కింద సేవలు అందించడానికి నమోదు చేసుకుని ఉండాలి. కానీ ఈ సమాచారం తెలియని యశస్విని పథకం కార్డులు పొందిన గ్రామీణ, నగర ప్రదేశ ప్రజలు కార్డుపట్టుకుని ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్సకోసం వెళుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో గొడవలు యశస్విని కార్డు చెల్లదని చెప్పడంతో గొడవలకు ది గుతున్న సంఘటనలు చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి. ఒక్కో ఆసుపత్రిలో నిత్యం 10 నుంచి 20 రోగులు యశస్విని కార్డులు పట్టుకుని వెళుతున్న దృశ్యాలు సర్వ సాధారణంగా మారింది. కానీ ప్రభుత్వ ఆసుపత్రి రెఫర్ చేయనిదే ప్రైవేటు ఆ సుపత్రుల్లో ఉచితంగా సేవలు అందించడం సాద్యంకాదని ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది అంటున్నారు. యశస్విని ఎంతో బాగుండేది యశస్విని పథకంలో ఏపీఎల్, బీపీఎల్ కార్డుదారులకు ఒకేవిధంగా వైద్యసేవలు అందుబాటులో ఉండేవి. ఈ పథకం కింద ప్రతిరోగికి రూ.2 లక్షల వరకు చికిత్స అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరించేది. కానీ ఆరోగ్యకర్ణాటక లో బీపీఎల్ కార్డుదారులకు మాత్రమే ఉచిత చికిత్స పొందవచ్చు. ఏపీఎల్ కార్డుదారులు (5 మంది ఉన్న కుటుంబం) ఏడాదికి రూ.1.5 లక్షల వరకు చికిత్స పొందే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్కరికి చికిత్స వ్యయం 30 శాతం మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. దీంతో మిగతా ఖర్చును రోగులే నెత్తినేసుకోవాలి. అందరికీ చికిత్స లభిస్తోంది ‘అందరికీ చికిత్స అందిస్తున్నాం. ఎవరినీ వెనక్కి పంపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వచ్చిన తరువాత చికిత్స అందించడం గురించి పూర్తి సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉంది’అని పీఎంఎస్ఎస్వై డైరెక్టర్ డాక్టర్ గిరిష్ తెలిపారు. ‘ఆరోగ్య కర్ణాటక పథకంలో చాలా గందరగోళం ఉంది. దీని పట్ల ప్రైవేటు ఆసుపత్రులకు ఇంకా స్పష్టత లేదు’ అని ఫనా మాజీ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్రస్వామి అన్నారు. -
హెల్త్‌స్కీం రీయింబర్స్మెంట్ పద్ధతి పొడిగింపు
హైదరాబాద్ : ఉద్యోగుల హెల్త్ స్కీం రీయింబర్స్మెంట్ పద్ధతిని తెలంగాణ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఈ ఏడాది జూన్ 30 వరకు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ ఉంటుంది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మరోసారి మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ని పొడిగించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. -
పాత్రికేయులకు పెన్నిధి
సాక్షి,సిటీబ్యూరో: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా , ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన జర్నలిస్ట్‌ల హెల్త్‌స్కీమ్(జేహెచ్ఎస్) పాత్రికేయులకు వరంగా మారిందని సీఈవో కె. పద్మ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించి 13 నెలలు గడిచిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అర్హులైన జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగదు రహిత వైద్యం వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ‘ క్యాస్‌లెస్ ట్రీట్మెంట్’ అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 జూలై 22న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద పాత్రికేయులకు వెల్నెస్ సెంటర్ల ద్వారా ఔట్ పేషెంట్ చికిత్స, నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఇన్ పేషెంట్ చికిత్స అందజేస్తున్నాం, ఉచితంగా మందులను, వైద్య పరీక్షలు, వైద్యానికి సంబంధించి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 8,100 మంది జర్నలిస్టులు, 25869 మంది జర్నలిస్టుల కుటుంబసభ్యులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోగా వారందరికీ హెల్త్‌కార్డులు పంపిణీ చేశాం. ‘వెల్నెస్’ సేవలివీ... వెల్నెస్ సెంటర్లల్లో ల్యాబ్లెటరీ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. 2016 డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు 42,252 మంది ఉద్యోగులు, 44128 మంది పెన్షనర్లు, 1778 మంది జర్నలిస్టులు ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్నారు 22 వేలకుగాను 6 వేల మంది... రాష్ట్రంలో 22 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉండగా అందులో 6 వేల మంది మాత్రమే హెల్త్‌కార్డులు పొందారు. కార్డులు పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 వేల హెల్త్‌కార్డులు జారీ చేశాం. జర్నలిస్టులంతా హెల్త్‌కార్డులు తీసుకొంటే వారి కుటుంబసభ్యులతో కలుపుకొంటే 50 వేల మందిపైగా ప్రయోజనం కలుగుతుంది. అన్ని రకాల వ్యాధులకూ వర్తింపు.. అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నాం. జనరల్ చికిత్స, కార్డియాలజీ, చెస్ట్, నెఫ్రాలాజీ, న్యూరో సర్జరీ, కేన్సర్, మెదడుకు సంబంధించిన సమస్యలతో పాటు మహిళలకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకు, ముఖ్యంగా దంత సమస్యలకు అధునాతన చికిత్స లభిస్తుంది. ఫిజియోథెరఫీ సేవలు సైతం అందజేస్తున్నాం. వెల్నెస్ సెంటర్లలోనే ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రా స్కానింగ్‌తో పాటు అన్ని రకాల స్కానింగ్‌లు తీస్తారు. సీఎం ప్రత్యేక శ్రద్ధ: జర్నలిస్టుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏదైనా మీటింగ్‌లో తారసపడితే ముఖ్యమంత్రి జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇచ్చారా.. వాటి పురోగతిపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి జర్నలిస్టులు ఎప్పుడు సమాజం గురించే ఆలోచిస్తూ, వారి కుటుంబం గురించి పట్టించుకోరు. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే వారికి హెల్త్‌కార్డు గుర్తుకు వస్తుంది. చివరి క్షణంలో మాపై హెల్త్‌కార్డుల కోసం ఒత్తిడి చేస్తారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు, ప్రెస్క్లబ్స్లు, ప్రెస్ అకాడమీతో చర్చించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందరూ కార్డులు పొంది ప్రాథమిక దశలోనే వ్యాధులకు చికిత్స చేయించుకుంటే మేలు. రూ. 500 కోట్లతో ప్రాజెక్టు అమలు... ఏ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు, ఉద్యోగులు ఇలాంటి ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ప్రాజెక్ట్‌లు అమలు చేయడం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇది విజయవంతమయ్యేందుకు జర్నలిస్టులు సహకరించాలి. అందుకే ‘ఓ జర్నలిస్టు ఆలోచించు... స్పందించు.. నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో’ అని కోరుతున్నాం. పత్రిక యాజమాన్యాలు కూడా అక్రిడిటేషన్లు లేని, హెల్త్‌కార్డులు పొందని వారిని గుర్తించాలి. హెల్త్‌కార్డులు ఉంటేనే ఉద్యోగులుగా కొనసాగిస్తామనే నిబంధన విధించాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే 12 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల కోసం... నాన్ అక్రిడిటేషన్ జర్నలస్టులకు కూడా జేహెచ్ఎస్ కింద హెల్త్‌కార్డులు జారీ చేయాల్సి ఉంది. డెస్కు జర్నలిస్టులు, కాపీ రైటర్స్, పేజ్ మేకర్స్ ఈ విభాగంలోకి వస్తారు. దాదాపు ఆరు వేల మందికి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వెల్నెస్ సెంటర్లు ఇవీ జర్నలిస్టులకు చికిత్స అందించేందుకు ఖైరతాబాద్, వనస్థలిపురం, ఏరియా ఆస్పత్రుల్లో, హన్మకొండ మెటర్నిటీ ఆస్పత్రిలో ఇప్పటికే వెల్నెస్ సెంటర్లు ప్రారంభించాం. సంగారెడ్డిలో అత్యాధునిక వసతులతో కొద్దిరోజుల క్రితమే వెల్నెస్ సెంటర్ ప్రారంభించాం. త్వరలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట్, ఖమ్మం, హైదరాబాద్‌లో మరో రెండు ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించబోతున్నాం. కూకట్‌పల్లిలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోజుకు 800 నుంచి 1000 వరకు, వనస్థలిపురంలో 500 నుంచి 600 వరకు ఓపీ వైద్యసేవలు పొందుతున్నారు. ‘సాక్షి’తో హెల్త్‌స్కీమ్ సీఈవో డాక్టర్ పద్మ -
మోదీ కేర్‌కు లక్ష కోట్లు కావాలి
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్లో భారీ స్థాయిలో ప్రకటించిన జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం(మోదీ కేర్) అమలుకు ఏడాదికి రూ. లక్ష కోట్లు అవసరమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. బీమా మొత్తంలోని 2 శాతాన్ని ప్రీమియంగా వసూలు చేసినా.. పథకం అమలుకు ఏడాదికి రూ. లక్ష కోట్లు అవసరమని అధ్యయనం తేల్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(ఎన్ఐపీఎఫ్పీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మితా చౌదురీ రూపొందించిన ఈ పత్రంలో.. ‘మోదీ కేర్ పథకం వల్ల రాష్ట్రాలు తమ సొంత ఆరోగ్య పథకాల్ని అమలు చేసుకునే స్వేచ్ఛ తగ్గవచ్చు’ అని ఆందోళన వెలిబుచ్చారు. ‘మోదీ కేర్’ అమలుకు ఏడాదికి రూ. 10 నుంచి 12 వేల కోట్లు సరిపోతాయని నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ విశ్లేషించిన నేపథ్యంలో పరిశోధన పత్రంలోని అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘60 శాతం నిధుల్ని కేంద్రం, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని నిర్ణయించారు. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 60 వేలకోట్లు సమకూర్చాలి’ అని పరిశోధన పత్రంలో తెలిపారు. మోదీ కేర్‌పై విమర్శల్ని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. అదనంగా వసూలు చేసే 1% సెస్ నిధులు ఈ పథకం అమలుకు సరిపోతాయన్నారు. -
త్వరలో భారీ ఆరోగ్య పథకం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారీ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనుంది. అంటువ్యాధులు కాని ఐదు ఉమ్మడి వ్యాధుల నియంత్రణకు సంబంధించి ఓ భారీ ఆరోగ్య పథకాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో మార్చి 31 లోగా దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఐదు ఉమ్మడి వ్యాధుల్లో అధిక రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ ఆరోగ్య పథకం కింద జనాభా ఆధారంగా వ్యాధి నివారణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నియంత్రణ చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాన్ని వచ్చే నెల 4 తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 2012 నుంచి 2030 వరకు ఈ ఐదు రోగాలకు భారత్ రూ. 311.94 లక్షల కోట్ల వ్యయాన్ని కోల్పోనుంది. -
ఓపీ సేవలపై ఉద్యోగుల అనాసక్తి!
♦ 20 లక్షల మందికిగాను సేవలు పొందింది 2,393 మందే ♦ స్పెషలిస్టులు లేక వెలవెలబోతున్న ప్రభుత్వాసుపత్రులు ♦ అగమ్యగోచరంగా మారిన హెల్త్ కార్డుల పథకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హెల్త్‌కార్డుల పథకం కింద.. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీర్ఘకాలిక వ్యాధుల ఓపీ(ఔట్ పేషెంట్) సేవలను తప్పనిసరిగా ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందాలనే నిబంధన ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఓపీ సేవలు అందించడానికి ప్రత్యేక వేళల్లో వైద్యులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కానీ, ఉద్యోగులు మాత్రం సర్కారు ఆసుపత్రులకు వెళ్లడానికి ససేమిరా అంటుండడం గమనార్హం. సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పొందిన వారి వివరాలను ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ అధికారులు సేకరించారు. ఈ ఏడాది కాలంలో 2,393 మందే ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలను వినియోగించుకున్నారని తేలింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికిపైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు హెల్త్‌కార్డుల పథకం కింద వైద్య సేవలు పొందడానికి అర్హులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, ఔషధాలను అందించడానికి ప్రభుత్వం రూ.46.748 లక్షలు ఖర్చు చేసింది. స్పెషలిస్టులు ఎక్కడ?..: దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రుల్లోనే ఔట్‌పేషెంట్ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టులు అందుబాటులో లేరు. జనరల్ మెడిసిన్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ వంటి స్పెషలిస్టులు ఏ ఆస్పత్రిలోనూ లేరు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తామని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా వైద్యులు రావడం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు 20 లక్షలకు పైగా ఉంటే కేవలం 2,393 మందే ప్రభుత్వాసుపత్రుల మెట్లు ఎక్కడం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఔట్‌పేషెంట్ సేవలు సక్రమంగా అందడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. -
'హెల్త్‌కార్డులకు ఆన్లైన్లోనే దరఖాస్తు'
చిట్యాల: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అందులో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో త్రిబుల్ బెడ్రూం కాలనీలు నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెల్త్ కార్డుల కోసం రెండు వేల మందికి మాత్రమే ఆమోదం లభించిందని, మిగిలిన 24 వేల మంది జర్నలిస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే డీపీఆర్వోలను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్, క్రాంతి, యూసూఫ్బాబులు పాల్గొన్నారు.