Hero Suman
-
మా సినిమా కలెక్షన్స్‌లో 20% వారికే ఇస్తాం: సముద్రుడు టీమ్
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సముద్రుడు. నగేష్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బధావత్ కిషన్ నిర్మిస్తున్నారు. హీరో సుమన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. దర్శకుడు నగేష్ నన్ను చూసి సముద్రుడు అనే టైటిల్ పెట్టాడు. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాట నేడు నిజమైంది అన్నారు.మొదటి వ్యక్తి నేనేహీరో సుమన్ మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటుడినయ్యాను. మొట్టమొదట చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వ్యక్తిని నేనే! అన్నమయ్య, రామదాసు సినిమాల తర్వాత చేసిన పాత్రలే చేయడం ఎందుకని దేవుడు పాత్రలు చేయడం మానేశాను. కానీ నగేష్ చెప్పిన కథ నచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్రలో నటించాను.ఛత్రపతిలా పెద్ద హిట్నేను చేసిన 750 సినిమాల్లో చెప్పుకోదగ్గవాటిలో ఇదీ ఒకటి. అలాంటి మంచి కథను తీసుకొచ్చిన వ్యక్తి దర్శకుడు నగేష్. ఇప్పుడాయన జాలర్ల జీవితాలపై సముద్రుడు తీశాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. ఛత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.20 శాతం వారికే..దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. సముద్రం దగ్గర ఉండే జాలర్లు చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని సినిమాలో చూపించాం. ఒక మంచి పాత్రలో అడగ్గానే ఒప్పుకుని నటించిన మా అన్న సుమన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద హీరో అవుతాడు అన్నారు. ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ నుంచి 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందజేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. -
సుమన్ చేతుల మీదుగా ఝాన్సీ ఐపీఎస్ ట్రైలర్ రిలీజ్
లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఝాన్సీ ఐపీఎస్. గురుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ, కన్నడ భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. సోమవారం నాడు ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను హీరో సుమన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు.లక్మీ రాయ్ కెరీర్లో హైలైట్ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. లక్ష్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి.నట విశ్వ రూపంవిద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసే డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్‌గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు.థియేటర్స్ దొరకాలిహీరో సుమన్ మాట్లాడుతూ.. లక్మీ రాయ్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఫైట్స్ ఆదరగొట్టారు. ఇలాంటి చిత్రాలకు మంచి థియేటర్స్ దొరకాలి. తెలుగులో కూడా ఈ మూవీ ఘన విజయం సాధించాలి అన్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హర ఓం హర’
కనిక, ఆమని, రవిశర్మ, జ్యోతిరెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హర ఓం హర’. షేర్ దర్శకత్వంలో దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మంచి విజయం సాధించాలి. దర్శకుడు షేర్ కెరీర్ ఈ చిత్రంతో మరో స్థాయికి వెళ్లాలి’’ అన్నారు. ‘‘మాది సినిమా కుటుంబం కాకపోవడంతో కెరీర్ స్టార్టింగ్‌లో కష్టాలు పడ్డాను. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర కూడా చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు షేర్. ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్ నాగ్, షేర్ వంటి వారు నటిస్తున్నారు. -
2 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణలు.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు
ఆడియో ఫంక్షన్‌కు రావాలని పిలిస్తే రూ.2 లక్షలు డిమాండ్ చేశాడంటూ సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే! తాజాగా అతడు ఈ వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. ‘నటరత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్ వేదికగా సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు శివనాగు క్షమాపణ తెలిపారు. దీనిపై అసలేం జరిగిందో క్లారిటీ ఇస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో శివనాగు మాట్లాడుతూ ‘‘సుమన్‌గారు నా కుటుంబానికి ఎంతో కావాల్సిన వ్యక్తి. ఆయనతో మూడు సినిమాలు చేశాను. నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న ‘నట రత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నాను. ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్ టెన్షన్లో ఉండి సుమన్‌గారిపై ఆరోపణలు చేశాను. దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు గానీ నేను పొరపాటు మాట్లాడానని గమనించలేదు. మీడియా ముఖంగా సుమన్‌గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా’’ అని అన్నారు. చదవండి: 48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్ -
ఆదిపురుష్‌పై సుమన్ రివ్యూ.. ప్రభాస్‌కు హ్యాట్సాఫ్.. కానీ..
ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి మూడు రోజులు భారీ లెవల్లో కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా వెనకబడింది. ఇకపోతే శ్రీరామదాసులో రాముడిగా నటించిన సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఆదిపురుష్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'రావణుడు సీతను ఎత్తుకుపోవడం నుంచి ఆమెను రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్ తీశారు. మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో రాముడిని నీలిరంగులోనే చూశాం. అలాగే రాముడికి మీసాలు, గడ్డాలు కూడా ఉండవు. కానీ ఇందులో రాముడిని సాదాగా చూపించారు. అది చాలా పెద్ద రిస్క్. అయినా రెండున్నరేళ్లపాటు ప్రభాస్ ఆ బాడీని మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. అందుకు అతడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. రావణుడికి మోడ్రన్ హెయిర్ కట్ చేశారు. వేషధారణ మార్చారు. అది చాలా తప్పు. ఇలా డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు సినిమాలో ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ బాగున్నాయి. మరికొన్నిచోట్ల గ్రాఫిక్స్ పాతదానిలా ఉన్నాయి. చదవండి: ఆదిపురుష్ 5 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా? పాటలు నచ్చాయి. కృతీ సనన్ సీత క్యారెక్టర్లో బాగా చేసింది. ఈ సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. చాలా చోట్ల సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను గుర్తుకు తెచ్చాయి. ఈ తప్పులు చేయకపోయి ఉంటే ఇది అంతర్జాతీయ సినిమా అయి ఉండేది. ఆదిపురుష్ అనేది పవర్ఫుల్ టైటిల్.. కానీ సినిమా చూసి నిరాశ చెందాను. మైథాలజీ సినిమాలను దక్షిణాదివాళ్లే బాగా హ్యాండిల్ చేస్తారు' అని చెప్పుకొచ్చాడు సుమన్. చదవండి: ప్రేమలో అబద్ధాలు, మోసాలు నచ్చవు: రకుల్ ప్రీత్ సింగ్ -
స్టార్ హీరో ఇంటికి కోడలిగా సుమన్ కూతురు?
నీచల్ కులమ్(తమిళ) సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన సుమన్ సుమారు 45 ఏళ్లుగా నటుడిగా సత్తా చాటుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర నటుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. 90ల్లో అగ్ర హీరోగా రాణించిన సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతోనూ మెప్పించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో జైలు జీవితం గురించి, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నా కూతురు గోల్డ్ మెడలిస్ట్ 'నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసు. ఆ కేసులో నా ప్రమేయం లేకపోయినా నన్ను లోపలేశారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత నాకు సపోర్ట్‌గా మాట్లాడారు. సుమన్ ఇలాంటి చీప్ పనులు చేయడని స్టేట్మంట్ ఇచ్చారు. అది నాకు బాగా సాయపడింది. నా కూతురు అఖిలజ ప్రత్యూష విషయానికి వస్తే తనకు యాక్టింగ్ మీద ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనిటిక్స్‌లో గోల్డ్ మెడల్ సంపాదించింది. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో ఇంటికి నా కూతురు కోడలిగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే పెళ్లిపై దృష్టి పెడతాం' అన్నారు సుమన్. జైలు జీవితం గడిపిన సుమన్ కాగా 1985లో సుమన్ జైలుపాలయ్యారు. సుమన్ స్నేహితుడు దివాకర్‌కు క్యాసెట్ రెంట్‌కు ఇచ్చే షాపు ఉంది. ఆయన దగ్గర సుమన్ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్లు తీసుకునేవారు. దివాకర్ తన స్నేహితుడే కావడంతో ఓసారి కారు అడిగితే ఇచ్చారు సుమన్. దాన్ని దివాకర్ నీలి చిత్రంలో వాడాడట. దీంతో ఇందులో సుమన్ హస్తం కూడా ఉందని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ అప్పటికే హీరోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమన్ జైలు నుంచి బయటకు వచ్చాక రచయిత డీవీ నరసరాజు మనవరాలు శిరీషను పెళ్లాడారు. చదవండి: ఆ క్రికెటర్‌ను ప్రేమించా, కానీ..: హీరోయిన్ -
కృష్ణ మృతి పట్ల నటుడు సుమన్ సంతాపం
-
విషమంగా హీరో సుమన్ ఆరోగ్యం?!.. క్లారిటీ ఇచ్చిన నటుడు
సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొద్ది రోజులుగా పలు యూట్యూబ్ చానళ్లో వీడియో దర్శనిమిస్తున్నాయి. ఇక పలు ఉత్తరాది యూట్యూబ్ చానల్స్ అయితే ఏకంగా ఆయన ఇకలేరంటూ వీడియోలతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. అదేంటి ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఏంటని, ఇది నిజమా? కాదా? అంటూ తెలుగు రాష్ట్రాల అభిమానులంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్ ఈ వార్తలపై స్పందించారు. చదవండి: వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి తాను పూర్తి ఆరోగ్యం ఉన్నానని, తన గురించి, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తమిళ మీడియా ద్వారా ఆయన ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల వస్తున్న పూకార్లపై ఆయన మండిపడ్డారు. ‘నేను పూర్తి ఆరోగ్యం ఉన్నా. సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం బెంగళూరులో నా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో నా ఆరోగ్యంపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నా సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. అందుకే ఇలా నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది’ అని సుమన్ అన్నారు. చదవండి: హీరోయిన్ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు! అనంతరం తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన సదరు యూట్యూబ్ చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ సుమన్ ధ్వజమెత్తారు. కాగా నాలుగు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు, తమిళంలో హీరోగా, సహానటుడిగా ఎన్నో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన మలయాళం, కన్నడలో సైతం పలు చిత్రాల్లో నటించారు. తన సినీ కెరీర్లో సుమన్ దాదాపు 150పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు. -
కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొడుకు పుట్టాక ఆయన భార్య తేజస్వినితో కలిసి తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబర్ 10, 2020న అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దిల్‌రాజు, తేజస్వినిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే దిల్‌రాజు మరోసారి తండ్రి అయ్యారు. దీంతో కొడుకుతో సహా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.కాగా ఈ సందర్భంగా సినిమా షూటింగ్స్ నిలిపివేయడంపై సుమన్ మాట్లాడిన తీరుపై రిపోర్టర్స్ స్పందించగా సినిమాకు సంబంధించిన విషయాలు అక్కడ ప్రస్తావించనన్నారు. దేవుడి సన్నిధిలో వాటి గురించి చర్చించనంటూ పేర్కొన్నారు. కాగా ఆగస్ట్ 1 నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని ప్రొడ్యుసర్స్ గిల్డ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. -
షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు ఫిలిం చాంబర్ సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రొడ్యుసర్స్ గిల్డ్ కూడ అంగీకారం చెప్పడంతో నేటి నుంచి షూటింగ్‌లు నిలిచిపోయాయి. తాజాగా షూటింగ్‌ల బంద్‌పై సీనియర్ నటుడు సమమన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదన్నారు. దీనివల్ల ఓటీటీకి ఏమౌతుందని, ఏం కాదంటూ వ్యాఖ్యానించారు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ‘ఇండస్ట్రీలోని సమస్యలను చర్చించుకోవడానికి షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవలానడం సబబు కాదు. క్రేజ్ ఉన్నప్పుడే హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే డిమాండ్ అండ్ సప్లై’ అన్నారు. అనంతరం షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలని నిర్మాతలకు సూచించారు. ‘షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలి. రెండు రోజుల చేసే వర్క్‌ని ఒక రోజులో చేయండి. అవసరం మేరకే కాల్షీట్ తీసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ కాల్షీట్ తీసుకోవాలి. వర్క్ ఫాస్ట్‌గా చేయాలి. అంతేకాని రేట్స్ తగ్గించకోండి. రెమ్యునరేషన్ తగ్గించుకోండనడం కరెక్ట్ కాదు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై వారు మాకు క్లోజ్ అని, మా ఫ్యామిలీ అంటూ కొందరు చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్లు వెళ్లి మాట్లాడండి. దీంట్లో రిలేషన్ షిప్ అనేది ఏం ఉండదు. డబ్బు ఇస్తున్నారు కదా తొందరగా రావాలని గట్టిగా చెప్పండి. మేనేజర్లు అక్కడ పెట్టడం కాదు. ఇవన్ని స్వయంగా నిర్మాతే చూసుకోవాలి. మా టైంలో అవుట్ డోర్ షూటింగ్ అంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసే వాళ్లం. అదే ఇప్పడు 9 గంటలకు వస్తున్నారు. 6 గంటలకే ప్యాకప్ చెప్పేస్తున్నారు. ఇలా అయితే ఖర్చు పెరగదా. ఒకప్పుడ. లేట్ అయితే అడగాలి. వర్క్ షాప్ చేయాలి. ఒకప్పుడ భయ్యర్ సినిమా కోనేవాడు. సినిమ ఫ్లాప్ అయితే అతడిని ఎవరు పట్టించుకోరు. రెట్స్ తగ్గించుకోమ్మంటున్నారు. మరి భయ్యర్ పరిస్థితేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. -
Hero Suman: షూటింగ్‌లతో బిజీ.. రాజకీయాల్లోకి..?
విశాఖపట్నం (భీమిలి): ‘తరంగణి’ సినిమాతో తెలుగులో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తిరుగులేని కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందాల నటుడు సుమన్. సుమన్‌గా సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ్, కన్నడ, ఆంగ్ల, ఒడియా తదితర భాషల్లో నటించారు. కరాటేలో నిష్ణాతుడైన సుమన్ తెలుగులో పెద్ద యాక్షన్ హీరో. లవర్‌బాయ్, కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అన్నమయ్య సినిమాలో పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు చిత్రంలో పోషించిన రాముడి పాత్ర మరపురానివి. పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయనతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: చిరంజీవికి మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? సుమన్: చిరంజీవికి నాకు విభేదాలు ఉన్నాయని అనుకోవడం పొరపాటే. మేమంతా ఒకే కుటుంబం. అదే సినీ కుటుంబం. నాకు ఎవ్వరితోనూ విభేదాలు లేవు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1980 బ్యాచ్ అంటే చిరంజీవి, వెంకటేష్ రజినీకాంత్, భానుచందర్, సుహాసిని, సుమలత, రాధిక తదితర నటులందరం కలుసుకుంటాం. ఇక్కడ అందరం స్నేహ పూర్వకంగానే ఉంటాం. సాక్షి: సినీ ఇండస్ట్రీ వైజాగ్‌కు ఎప్పుడు వస్తుంది? సుమన్: సినీ పరిశ్రమ ఎక్కడ ఉన్నా.. ఎంత పెద్ద సినిమా అయినా.. సినిమా చిత్రీకరణలో విశాఖ ఒక భాగంగా మారింది. సినీ పరిశ్రమకు వైజాగ్ అనుకూలం. అరకు, బీచ్‌రోడ్డు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ సహజ వనరులు ఉన్నప్పటికీ సినిమా నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరించే వారికి రాయితీ అందించాలి. వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించాలని సినీ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వనించారు. ఇక్కడ ఫిల్మ్ స్టూడియోలు నిర్మించినప్పుడే.. సినీ ఇండస్ట్రీ వైజాగ్‌కు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాక్షి: తెలుగులో ఏ సినిమాతో మీరు అరంగేట్రం చేశారు? సుమన్: 1978లో నేను సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. తమిళ్లో నా ఫస్ట్‌మూవీ స్విమ్మింగ్‌పూల్(నీచల్ కులం). 1982లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాను. తరంగణి నా మొదటి తెలుగు సినిమా. సాక్షి: మీ 44 ఏళ్ల సినీ ప్రయాణం ఎలా సాగింది? సుమన్: ఈ 44 ఏళ్లలో ఎన్నో అవాంతరాలు, కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక్కసారిగా హీరో నుంచి జీరో స్థాయికి చేరుకున్న సందర్భం కూడా ఉంది. భగవంతుడి దయతో మరల హీరో స్థాయికి చేరుకున్నాను. అగ్రకథానాయకులు రజినీకాంత్, కమల్‌హాసన్ వంటి నటులతో నటించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ ప్రయాణంలో ఒడిదొడుకులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడిన నాడే నిజ జీవితంలో హీరోగా నిలుస్తాం. సాక్షి: ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు? సుమన్: హీరోగా, విలన్‌గా 10 భాషల్లో 600లకుపైగా సినిమాల్లో నటించాను. సాక్షి: తెలుగులో మళ్లీ హీరోగా చేస్తున్నారా? సుమన్: సినిమాలో కథ, కథనం బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగులో హీరోగా 101వ సినిమా సంగప్పలో నటిస్తున్నాను. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో సినిమా సిద్ధన్నగట్టులో నటిస్తున్నాను. సాక్షి: అప్పట్లో ఒక హీరో ఏడాదికి 10 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఎందుకని? సుమన్: నిజమే. హీరోగా నేను అప్పట్లో ఒక్క ఏడాదిలో 11 సినిమాలు చేశాను. అప్పట్లో అవుట్‌డోర్‌లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఇండోర్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు కష్టపడేవాళ్లం. షెడ్యూల్‌ను సర్దుబాటు చేస్తూ సినిమాల్లో నటించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఒక సినిమాలో నాలుగు సీన్లు తీస్తే ఓ రోజు అయిపోతుంది. ఈ రోజుల్లో కనీసం రోజుకు 12 గంటలు కష్టపడితే .. ఏడాదికి ఐదు సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. సాక్షి: నేడు సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. దీనికి కారణం? సుమన్: ఏ సినిమాకైనా ప్రస్తుతం కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గించుకుంటే సినిమా కొనుగోలుదారులకు సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా కాస్త ఊరట కలుగుతుంది. కథకు మించి నటులను పెట్టడం.. దేశ, విదేశాల్లో చిత్రీకరణ వలన నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. సాక్షి: చిన్న సినిమా వాళ్ల పరిస్థితి ఏంటి? సుమన్: చిన్న బడ్జెట్‌తో కొత్త నటీనటులతో తీసే సినిమాలను ప్రోత్సహించాలి. చిన్న సినిమా వాళ్లకు ఎక్కడ రిలీజ్ అయినా రాయితీ, పరి్మషన్లు ఇచ్చినట్లయితే.. వారికి ఇబ్బందులు తొలుగుతాయి. సాక్షి: ప్రస్తుతం మిగతా భాషల్లో నటిస్తున్నారా? సుమన్: ప్రస్తుతం కన్నడలో 3, తమిళంలో 1 హీరో, విలన్ పాత్రల్లో నటిస్తున్నాను. సాక్షి: మీ వారసులు సినీ పరిశ్రమ వైపు ఎందుకు రాలేదు? సుమన్: నాకు ఒక అమ్మాయి. పేరు ప్రత్యూష. తను వైద్య రంగంలో మంచి స్థాయిలో ఉంది. హ్యూమన్ జెనిటిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. సినీ పరిశ్రమ వైపు తనకు ఆసక్తి లేకపోవడంతో వైద్య రంగం వైపు అడుగులు వేసింది. సాక్షి: రాష్ట్రంలో ప్రభుత్వపాలనపై మీ అభిప్రాయం? సుమన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు తీరు బాగుంది. ప్రభుత్వం వారికి ఆసరా అందిస్తోంది. సాక్షి: మీరు రాజకీయాల్లోకి వస్తారా? సుమన్: కళామతల్లి ఆశీస్సులతో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పటివరకు లేదు. -
అలాంటి వాటికి నేనెప్పుడూ సహకరిస్తా: సుమన్
అనకాపల్లి: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాసే సైనికులకు మనందరమూ రుణపడి ఉండాలని, మన స్వేచ్ఛకోసం వారు పాటుపడుతున్నారని సినీ హీరో సుమన్ అన్నారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న రెండో దక్షిణ భారత్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ డీవీఆర్కప్–2022 పోటీల్లో విజేతలకు శుక్రవారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ త్వరలోనే కరాటే అకాడమీని ప్రారంభిస్తానన్నారు. కరాటే ఆత్మరక్షణ కోసమే కాదని, వ్యాయామంగానూ పరిగణించాలన్నారు. ఇటువంటి క్రీడా పోటీలకు తానెప్పుడూ సహకరిస్తానన్నారు. నిర్వాహకుడు కాండ్రేగుల శ్రీరాంను అభినందించారు. ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. పురుషులతోపాటు మహిళలూ స్వీయరక్షణ కోసం కరాటే శిక్షణ పొందాలన్నారు. దిశ వంటి చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం మహిళలకు అండగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లిలో నిర్వహించిన పోటీలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఓవరాల్ చాంపియన్ ఏపీ... ఐదు రాష్ట్రాలు పాల్గొన్న ఓపెన్ కరాటే పోటీల్లో చాంపియన్‌షిప్‌ను ఏపీ జట్టు కైవసం చేసుకుంది. గెలుపొందిన క్రీడాకారులకు సినీ హీరో సుమన్, ఎంపీ సత్యవతి, దాడి రత్నాకర్ బహుమతులు అందజేశారు. సినీ నటుడు ప్రసన్నకుమార్, కార్పొరేటర్లు కొణతాల నీలిమ భాస్కర్, పీలా లక్ష్మీసౌజన్య రాంబాబు, నేషనల్ బాడీబిల్డర్ శిలపరశెట్టి బాబీ, డాక్టర్ విష్ణుమూర్తి, డి.ఈశ్వరరావు, కోరిబిల్లి పరి, భీశెట్టి కృష్ణ అప్పారావు పాల్గొన్నారు. అనకాపల్లి విద్యార్థికి రజత పతకం అనకాపల్లి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో దక్షిణ భారత ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో అండర్–10 కేటగిరీ విభాగంలో పి.వరుణ్సూర్యదేవ్ రజత పతకాన్ని సాధించాడు. పట్టణంలో ఏడీ పాఠశాలలో చదువుతున్న బాలుడిని పాఠశాల డైరెక్టర్ అనూషసుబ్రహ్మణ్యం శుక్రవారం అభినందించారు. (క్లిక్: సాఫ్ట్‌బాల్‌లో సిక్కోలు ఆశాకిరణం) -
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(మే 30) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. చదవండి: అదిరిపోయిన అనన్య, విజయ్ హుక్ స్టెప్, వీడియో చూశారా? ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారని గుర్తు చేశారు. ‘ముఖ్యంగా ఆయన బయ్యర్స్ గురించి ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్‌ను కాపాడేవారు. కానీ ప్రస్తుత నిర్మాతలు బయ్యర్స్ గురించి ఆలోచించడం లేదు. మేకర్స్ వల్ల బయ్యర్స్ నష్టపోతున్నారు. వారి తీరుతో బయ్యర్స్ సంతోషంగా ఉండటం లేదు. కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది వారే. అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరు. సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ ఉన్నారు. ఇది నేను ఆవేశంతో మాట్టాడుతున్నాను అనుకున్నా.. ఇది మాత్రం నిజం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సుమన్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. -
తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్: హీరో సుమన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మల హృదయ భవన్లో మానసిక వికలాంగులు, పేదలకు.. పండ్లు , స్వీట్స్ , దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్ పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి: శ్రీరంగనాథరాజు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరుకూ పలు ముఖ్యమంత్రుల పనితీరు పరిశీలించానని.. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ, సీఎంగా వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబంపై దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు.పెదకూర పాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, వైఎస్సార్ తాను అమలు చేసిన పథకాలతో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అందకంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. -
ఆర్టిస్టులకు లోకల్, నాన్ లోకల్ ఉండదు: సుమన్
MAA Elections 2021:మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపై జరుగుతున్న పరిణామాలపై హీరో సుమన్ మాట్లాడారు. విశాఖలోని గాజువాక వాడ్కాయ్ కరాటే చాంపియన్ షిప్ పోటీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో స్థానిక, స్థానికేతరులు అనడం సరికాదని, సినీ ఆర్టిస్టులకు లోకల్, నాన్ లోకల్ ఉండదు అని పేర్కొన్నారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు భారతదేశంలో పుట్టిన వాళ్లందరూ లోకలే. ఆఫర్లు వస్తే ఏ రాష్ట్రంలో అయినా పనిచేస్తాం. అందరం ఒక్కటే. ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూనియర్, సీనియర్ ఆర్టిస్టులకు ఓల్టేజ్ హోంను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం బీపీ, షుగర్ మందులు కొనుక్కునే స్తోమత లేని ఆర్టిస్టులు ఉన్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లు అలాంటి వాళ్లను ఆదుకునే ప్రయత్నం చేయాలి. మా ఎన్నికల్లో గెలిచిన వారు 'మా' అభివృద్ధికి కృషి చేయాలి అని సుమన్ అన్నారు. 'మా'ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే... -
దిశ ఘటన ఎవరు ఊహించనిది: సుమన్
సాక్షి, విజయవాడ: ఆడపిల్లలకు విద్యతో పాటు ఆత్మరక్షణ శిక్షణ కూడా చాలా అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడలోని ఓ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరికి కరాటే ఎంత అవసరమో దిశ ఘటనతో అర్థం అయ్యిందని వాఖ్యానించారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ.. దిశ ఘటన ఎవరు ఊహించనిది అని, మహిళలకు ఆత్మ రక్షణ అవసరమని గత ముప్ఫై ఏళ్లుగా ప్రతి కార్యక్రమంలో చెప్పుకొస్తున్నామన్నారు. వారంలో రెండు రోజులు మహిళలకు ఆత్మరక్షణ క్లాసులు పెట్టాలని, విద్యార్థినిలకు కూడా 6వ తరగతి నుంచే ఈ క్లాసులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పాఠశాలల్లో ఆత్మరక్షణ క్లాసుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అయిదుగురికి డిప్యూటీ సీఎం పదువులు ఇచ్చారని, అలాగే మహిళలకు ప్రాధాన్యతనిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అన్నారు. భారతదేశంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయని, చట్టాలను పటిష్ట పరచాలని ఆయన వ్యాఖ్యానించారు. -
నవ్వు కోసం పరుగు
యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరారి’. ‘రన్ ఫర్ ఫన్ ’ అనేది ఉపశీర్షిక. గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి వి.వి.గిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత సి.కల్యాణ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘యోగేశ్వర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథని ఎంచుకున్నాడు. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్ లేకుండా చాలా ఈజ్‌తో నటించాడు. సాయి శివాజీ డ్యాన్స్ మాస్టర్‌గా నాకు పరిచయం. మంచికథను ఎంచుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు’’ అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ– ‘‘గిరి చాలా సంవత్సరాలుగా నా అభిమాని. వారి అబ్బాయితో ఓ సినిమా చేయాలని అంటుంటే నేనే వాయిదా వేస్తూ వచ్చాను. కానీ, ఆయనలో పట్టుదల చూసి మంచి కథను ఎన్నుకుని ఈ చిత్రం చేశాం. ఇందులో నేనూ ఒక ముఖ్య పాత్ర పోషించాను’’ అన్నారు. ‘‘పరారి’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో జరిగింది. ఒక పాట మినహా సినిమా పూర్తయింది’’ అన్నారు వి.వి. గిరి. ‘‘హీరోగా నాకు తొలి చిత్రమైనా సహ నటుల నుంచి ఎంతో నేర్చుకున్నా. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు యోగేశ్వర్. ‘‘వినోదానికి ప్రాధాన్యతనిస్తూ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిస్తోన్న చిత్రమిది’’ అన్నారు సాయి శివాజీ. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్, నటులు శ్రవణ్, గౌతమ్‌రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి. -
‘రికార్డు’ నృత్యం
కామారెడ్డి టౌన్ : కామారెడ్డికి చెందిన ప్రముఖ నృత్యకారుడు ప్రతాప్‌గౌడ్ వరల్డ్ రికార్డు కోసం బుధవారం సాయంత్రం స్థానిక సత్యగార్డెన్‌లో తెలంగాణ కళావీణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటుడు సుమన్, అతిథులుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత హాజర య్యారు. ప్రతాప్ గౌడ్ భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, మోహిని అట్టం తదితర ప్రముఖ కళా నృత్య రీతులలో ప్రదర్శన ఇచ్చారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్, గోల్డెన్ వరల్డ్ రికార్డుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రతాప్‌గౌడ్ తెలిపారు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి బింగి నరేశ్ పాల్గొని వివరాలు నమోదు చేశా రు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విచ్చేసిన ప్రము ఖ యాంకర్లు అభి, సుదీపలు తమ యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతాప్‌గౌడ్ శిష్యులు తెలంగాణ ఉద్యమం, మిషన్ భగీరథ, రైతుల కష్టాలు తదితర అంశాలపై నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ వెంకటేశ్ ధోత్రే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్‌గౌడ్, కౌన్సిలర్ సంగిమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
షాబాద్‌లో ‘తెలంగాణ దేవుడు’ సందడి
షాబాద్(చేవెళ్ల) : షాబాద్ మండలంలో తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మ్యాక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాతగా, హరీష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో జరుగుతోంది. 1969 నుంచి 2018 వరకు తెలంగాణ చరిత్రే సినిమా కథ. ఇందులో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ పాత్రలో సినీ హీరో సుమన్, చిన్నతనంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రలో నిర్మాత కుమారుడు జీషాన్ ఉస్మాన్ నటిస్తున్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కేసీఆర్ పాత్రలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేలా చిత్ర నిర్మాణం జరుగుతోందని నిర్మాత చెప్పారు. పోతుగల్ గ్రామంలో, ప్రభుత్వం పాఠశాలలో, గిరిజన తండాలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు. తెలంగాణ దేవుడు సినిమా షూటింగ్ స్పాట్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డిలు సందర్శించారు. సినిమా విశేషాలను హీరో సుమన్, చిత్రయూనిట్‌ను అడిగి తెలుసుకున్నారు. -
కరాటే పరశురాం..
పెద్దశంకరంపేట(మెదక్): ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు పేట మండలానికి చెందిన యువకుడు పరశురాం. ఓ వైపు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ, మరో వైపు కష్టపడి కరాటేలో రాణిస్తూ అనేక మంది మన్ననలు పొందుతున్నాడు మండల పరిధిలోని జూకల్ గ్రామానికి చెందిన ఈ యువకుడు. చూడడానికి వెళ్లి.. ఒకసారి మెదక్‌లో జరుగుతున్న కరాటే పోటీలను పరశురాం చూడడానికి వెళ్లాడు. అక్కడే ఉన్న కరాటే మాస్టర్ నగేష్‌ను కలిసి తన అభిమతం చెప్పాడు. అతని సహాయంతో ఆటో నడుపుతూనే కరాటే నేర్చుకున్నాడు. ఇలా ఏడేళ్లుగా కరాటేలో శిక్షణ పొందుతూ పలు రాష్ట్ర, అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. గతేడాది బ్లాక్‌బెల్టు సాధించి ప్రముఖ సినీనటుడు సుమన్ చేతుల మీదుగా బెల్టు, ప్రశాంసా పత్రాన్ని అందుకున్నాడు. పట్టుదలే లక్ష్యంగా... జూకల్కు చెందిన పుట్ల బాలయ్య, మాణమ్మల కుమారుడు పరుశురాం. ఆరేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాడు. మణమ్మ వారికి ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ కుమారుడిని చదివించింది. ప్రస్తుతం పరుశురాం పేటలో డీగ్రీ చదువుతూ ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అనేక పతకాలు పరశురాం సొంతం.. గతేడాది ముంబాయిలో జరిగిన 22వ అంతర్జాతీయ ఏషియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో 13 దేశాలకు చెందిన వారు పాల్గొనగా అండర్-20 స్పారింగ్ బ్లాక్ బెల్ట్ విభాగంలో పరశురాం కాంస్య పతకం సాధించాడు. వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం పాల్గొని పతకం సాధించాడు. ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శం.. తనకు వచ్చిన కరాటే విద్యను పరుశురాం తన సొంత గ్రామమైన జూకల్‌లో గ్రామస్థులకు, పేటలోని పలువురు విద్యార్థులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు పరశురాం. ఇతని దగ్గర శిక్షణ పొందిన 14 మందిలో ఐదుగురు స్వర్ణపతకాలు సాధించడం విశేషం. దీంతో పాటు పేటలోని పలు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినిలకు సైతం పరశురాం కరాటే శిక్షణ ఇస్తున్నాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పాల్గొని గ్రామానికి పేరు తేవడమే తన లక్ష్యమని పరుశురాం చెబుతున్నాడు. -
డ్రగ్స్ నియంత్రణకు కఠినచట్టాలు అవసరం: హీరో
దానవాయిపేట: చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర సేవా సంస్థకు గౌరవ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సుమన్ గురువారం ఆ సంస్థ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. డ్రగ్స్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి ఉన్న లింకులపై మీ అభిప్రాయం? బాలీవుడ్లో ఉండే డ్రగ్స్ సంస్కృతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాకింది. ముంబై, కేరళ, గోవా వంటి ప్రదేశాల్లో ఉన్న డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్‌ను కూడా కేంద్రంగా చేసుకుని కార్యకాలాపాలు సాగిస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో ఇతర దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. మరణశిక్షలు సైతం విధిస్తున్నాయి. అటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తేవాలి. ప్రస్తుతం ఆధ్యాత్మిక చిత్రాలపై ప్రజలకు మక్కువ తగ్గిందనుకుంటున్నారా? ఆధ్యాత్మిక చిత్రాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. ఐతే సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా దర్శకులు కూడా అటువంటి సినిమాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. మొన్నటి వరకు కామెడీ, హర్రర్ కామెడి సినిమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి-2' వంటి సినిమాల హవా నడుస్తోంది. ప్రస్తుతం మీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు? తెలుగులో 'మామ ఒక్క చందమామ'తో పాటు ఒక ముస్లిం ఇతివృత్తంగా సాగే సినిమాలో నటిస్తున్నాను. ఇవికాక తమిళ, కన్నడ భాషల్లో మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను. మీరు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. నిజమేనా ? రాజకీయాలపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పష్టతా లేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్‌లో నా రాజకీయ ప్రవేశంపై ఒక స్పష్టత వస్తుంది. -
అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడు
గుంటూరు (అరండల్‌పేట): యువత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సినీహీరో సుమన్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో కలాం 85వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం వంటి వ్యక్తి మన దేశంలో జన్మించడం దేశ ప్రజల అదృష్టమన్నారు. విద్యార్థులు, యువత ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని అబ్దుల్‌కలాం జీవితాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. చివరి వరకు దేశసేవ కోసం ఆయన పరితపించారని పేర్కొన్నారు. కలలు కనండి. సాకారం చేసుకోండి అంటూ యువతకు ఆయన చ్చిన సందేశాన్ని అందరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి యామ మురళీ, పోతురాజు శ్రీనివాస్, టి.శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. -
ఇది మూడోసారి
శ్రీకాకుళం కల్చరల్: ప్రముఖ సినీనటుడు, హీరో సుమన్ ఆదివారం ఆదిత్యుని దర్శించుకున్నారు. తొలిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు అనివెట్టి మండపంలో సుమన్‌కు మహాదాశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సుమన్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు రావడం ఇది మూడోసారని అన్నారు. ఈ ప్రాంతంలో షూటింగ్‌లు జరగనందున రావడం లేదని పేర్కొన్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి, లక్ష్మీనరసింహుని వేషం వేస్తానని చెప్పారు. బీసీల సంక్షేమం కోసం పోరాడుతానని అన్నారు. బీసీలకు ప్రభుత్వం లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని సుమన్ కోరారు. దర్శకత్వంపై నాకు ఆసక్తి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సినీ పరిశ్రమ ఇప్పట్లో విశాఖకు వచ్చే అవకాశం లేదు.. చెన్నై నుంచి వచ్చేందుకు చాలా ఏళ్లు పట్టింది.. అప్పట్లో ప్రభుత్వం భూములు తక్కువ ధరకు అందించింది.. నేడు భూముల ధరలు విపరీతంగా ఉన్నాయని సుమన్ పేర్కొన్నారు. తాను 37 ఏళ్లుగా సినీపరిశ్రమంలో ఉన్నట్టు చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో 5 భాషలలో నిర్మిస్తున్న గబ్బర్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నానని వెల్లడించారు. పోటెత్తిన భక్తులు ఆదిత్యుని దర్శించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సూర్యనారాయణస్వామికి ప్రీతి అయిన రోజు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలొచ్చారు. తెల్లవారి జామున 5 గంటల నుండే ఆలయం వద్ద బారులు తీరారు. రావిచెట్టుకు, గోశాలకు ప్రత్యేక పూజలు చేసి, దీపాలు వెలిగించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం ఇన్చార్జ్ ఈవో ఆర్.పుష్పనాథం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి వద్ద భక్తులు స్నానాలు ఆచరించారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. -
పంచ్ తంత్రం
త్రేతాయుగంలో వానరయోధులు మార్షల్‌ఆర్ట్స్‌లో మహామహులే. ముష్టిఘాతాలతో రావణసేనకు ముచ్చెమటలు పట్టించిన వారే. యుగాల ప్రవాహంలో ఈ యుద్ధకళ.. సరికొత్త హంగులను అందిపుచ్చుకుని ఆత్మరక్షణ మంత్రంగా ఉన్న ఈ కళగానే కాదు ఆత్మవిశ్వాసం అందించే ‘పంచ్’తంత్రంగా మారింది. అందుకే ఈ కరాటే క్లాస్‌లకు అబ్బాయిలు, అమ్మాయిలు క్యూ కడుతున్నారు. కుంగ్‌ఫూతో అదరగొడుతున్న పిల్లలను సిటీప్లస్ తరఫున సినీ నటుడు సుమన్ పలకరించారు. సుమన్: మార్షల్ ఆర్ట్స్ ద్వారానే నేను సినిమాల్లోకి వచ్చాను. ఈ రోజుకీ నేను ఫిట్‌గా ఉండగల్గుతున్నానంటే మార్షల్ ఆర్ట్స్ వల్లే. ఈ కళ గురించి, దాని ప్రాధాన్యం గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉంది..! చెప్పండి కరాటే టీమ్‌తో ఉన్నట్టున్నారు? ప్రశాంత్: అవును సార్. డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో మాస్టర్‌గా చేస్తున్నాను. మాలాంటి వారికి ఇన్స్పిరేషన్ మీరే. 12 ఏళ్లప్పటి నుంచే కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టాను. గ్రాండ్ మాస్టర్ సత్యశంకర్ గారి స్టూడెంట్‌ని. టెన్త్‌లో ఉండగా బ్లాక్‌బెల్ట్ సాధించాను. కరాటే మాస్టర్‌గా జీవనం సాగిస్తున్నాను. సుమన్: గుడ్. మీరు చెప్పండి, మీతో ఉన్న వారంతా కుంగ్‌ఫూ టీమ్‌లా ఉంది? కల్యాణ్: అవునండి. కె.కె మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించాను. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మా గురువుగారు నాకు ఉచితంగా నేర్పించారు. ఇప్పుడు నేను కూడా అనాథ బాలికలకు ఉచితంగానే నేర్పిస్తున్నాను. సుమన్: గుడ్. ఇక్కడ సీనియర్ స్టూడెంట్ ఎవరు? నేనే సార్ అంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు సుమన్: నీ పేరు? స్టూడెంట్: మీ పేరే సార్.. సుమన్. సుమన్: ఓ (నవ్వుతూ...) ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? సుమన్ (స్టూడెంట్): నాలుగేళ్ల నుంచి కుంగ్‌ఫూలో శిక్షణ తీసుకుంటున్నాను. సుమన్: ఇది నేర్చుకోవడం వల్ల నువ్వు పొందిన లాభం ఏంటి? సుమన్ (స్టూడెంట్): ధైర్యం పెరిగింది. చదువులో కూడా స్ట్రెస్ అనే మాట లేదు సార్. సుమన్: వెరీ గుడ్. గర్ల్స్‌లో సీనియర్ ఎవరిక్కడ? షిఫా: నేను సార్. రెండేళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. మా మాస్టర్ మాకు రెగ్యులర్ క్లాసులతో పాటు ప్రత్యేకంగా సెల్ఫ్‌డిఫెన్స్ క్లాసులు చెబుతారు. సుమన్: అవును. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. కుంగ్‌ఫూతో మీరే ఆయుధంగా మారొచ్చు. నువ్వు కరాటే నేర్చుకుంటానంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? షిఫా: వెంటనే ఒప్పుకున్నారు సార్. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటానికి మార్షల్ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుంది. సుమన్: పిల్లలకు చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ ముఖ్యమని గమనించి ప్రోత్సహిస్తున్న పేరెంట్స్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నీ గురించి చెప్పమ్మా..? మధుస్మిత: నేను ఆర్ఫన్ని సార్. బాలసదన్‌లో ఉంటాను. అక్కడ మా బాగోగులు చూసే లక్ష్మీకుమారి మేడమ్ ప్రోత్సాహంతో ఓ పది మంది అమ్మాయిలం కుంగ్‌ఫూ నేర్చుకుంటున్నాం. సుమన్: నువ్వు నేర్చుకున్న ఈ విద్య.. నిజజీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడిందా..? మధుస్మిత: అవును సార్. ఒకసారి నేను స్కూల్ నుంచి వస్తుంటే ఒకబ్బాయి వెనుకే నడుస్తూ కామెంట్ చేశాడు. మాటిమాటికీ రిపీట్ చేయడంతో నా స్టంట్స్ చూపించాను. అంతే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. సుమన్: వెరీ గుడ్ ఆకతాయిల ఆటకట్టించేలా అమ్మాయిలంతా తయారవ్వాలి. కరాటే నేర్చుకుంటే పిల్లలకు దెబ్బలు తగులుతాయని, చదువు దెబ్బతింటుందని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ మనం ఎలా నడవాలో దగ్గర్నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వరకూ అన్నింట్లో మార్షల్ ఆర్ట్స్ ప్రభావం కనిపిస్తుంది. అందుకే చాలా దేశాలు దీన్ని పాఠ్యాంశాల్లో భాగం చేశాయి. షిఫా: యస్ సార్. నేను ర్యాంక్ స్టూడెంట్‌ని. సుమన్: విన్నారుగా మార్షల్ ఆర్ట్ చదువును పెంచుతుంది తప్ప, అడ్డుపడదు. మౌనిక: అవును సార్. దీనివల్ల లేజీనెస్ దూరమవుతుంది. సుమన్: ఆలోచనా శక్తి పెరగడంతోపాటు కోపం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా క్రమశిక్షణ అలవడుతుంది. ప్రశాంత్ : శరీరానికి బోలెడంత ఎక్సర్సైజ్ అవుతుంది. చూస్తూనే ఉన్నాం కదా సార్. చాలా మంది పిల్లలు ఒబేసిటీతో బాధపడుతున్నారు. సుమన్: దీనికి అసలు కారణం.. స్కూళ్లలో ఆటలకు టైమ్ కేటాయించకపోవడమే. పాఠశాలలకు ఆటస్థలమే ఉండటం లేదు. అపార్ట్మెంట్లలో చదువు నేర్పడం కన్నా దురదృష్టం మరొకటి లేదు. దీంతో పిల్లలకు శారీరక శ్రమ లేకుండా పోతోంది. పిల్లలు నిండు ఆరోగ్యంతో, చలాకీగా ఉండాలంటే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే సరి. ఈ తరం తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి. విదేశాల్లో ఇదే పని చేస్తున్నారు. ప్రశాంత్ మాస్టర్: మన దేశంలో పేరెంట్స్ ఈ దిశగా ఆలోచించకపోవడం దురదృష్టకరం. కల్యాణ్: పాఠశాలల్లో పీటీ సార్‌ను పెట్టినట్టు, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్నీ పెడితే బాగుంటుంది సార్. ప్రశాంత్: చాలామంది మాస్టర్లు అవకాశాలు లేక బాడీగార్డుల్లా పని చేసుకుంటున్నారు. కల్యాణ్: సార్.. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి? సుమన్: అడగండి.. కల్యాణ్: మీరు కరాటే ఎందుకు నేర్చుకున్నారు? ఎవరు ప్రోత్సహించారు? సుమన్: నేను ఆరో తరగతిలో ఉండగా నా ఫ్రెండ్ ఒకతను కరాటే నేర్చుకున్నాడు. నాకు బాగా నచ్చి అమ్మానాన్నని అడిగాను. వాళ్లు ఓకే అన్నారు. ఇది 70లో ముచ్చట. అప్పటికి మార్షల్ ఆర్ట్స్ గురించి ఎవరికీ అంతగా అవగాహన లేదు. ముందు నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. నేను ఎనిమిదో క్లాస్‌లో ఉండగా, మా ఇంటి దగ్గరే డోజో ఓపెన్ అయింది. అందులో చేరిపోయాను. కాలేజీ రోజుల్లో కూడా చాలా కాంపిటేషన్స్‌లో పాల్గొన్నాను. అప్పటికే నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. ప్రశాంత్: ముప్పై ఏళ్ల నుంచి ఇప్పటి దాకా యూత్‌కు మీరే ఇన్స్పిరేషన్ సార్. సుమన్: నాకూ ఈ ఆర్ట్‌పై అభిమానం ఎక్కువ. మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్‌కు తరచుగా వెళ్తుంటాను. ఈ రోజు సాక్షి స్టార్ రిపోర్టర్‌గా మిమ్మల్ని పలకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా పేరెంట్స్‌కు చెప్పేదొకటే. మీ పిల్లలకు కరాటే నేర్పించి వారి జీవితానికి దృఢమైన బాట వేయండి. థాంక్యూ.. సుమన్: నువ్వు చెప్పమ్మా కరాటే ఎందుకు నేర్చుకున్నావు ? అఖిల: కాన్ఫిడెన్స్ కోసం సార్. సుమన్: ఎవరైనా దొంగ నీ చైన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తే సమాధానం చెప్పగలవా ? అఖిల: ఒక్కరు కాదు.. నలుగురు వచ్చినా బుద్ధి చెప్పగలను. సుమన్: గుడ్...ఏదీ ఒక్కసారి రఫ్ ఫైట్ చూపించు. ఫైట్ ముగిసాక.. సుమన్: వెరీ నైస్. చెప్పు బాబు నువ్వు ఏం నేర్చుకుంటున్నవ్ ? ఏం చదువుతున్నావ్? అర్జున్: కుంగ్‌ఫూ. ఎల్కేజీ చదువుతున్నాను. సుమన్: ఎందుకు నేర్చుకుంటున్నావ్? అర్జున్: అమ్మ నేర్చుకోమంది. సుమన్: నాకు ఏం చేసి చూపిస్తావ్? అర్జున్: కటా సుమన్: ఏదీ చెయ్.. అర్జున్ కటా ప్రదర్శన తర్వాత... సుమన్: గుడ్..సూపర్.. -
తెలంగాణను టోక్యో నగరంలా చూడాలి: సుమన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని జపాన్ రాజధాని టోక్యో నగరంలా చూడాలని తాను ఆశిస్తున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేలా రైతు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సుమన్.. మార్షల్ ఆర్ట్స్ ను అగ్రస్థానంలో నిలిపేలా కేసీఆర్ ప్రభుత్వం సహకరించాలన్నారు. తాను తెలంగాణ రాష్ట్రాన్ని టోక్యో నగరం తరహాలో తాను చూడాలనుకుంటున్నట్లు సమన్ అన్నారు. ఆయన నేతృత్వంలో హైదరాబాద్ ఫిల్మ్ సిటీ దేశంలోనే నంబర్ -1గా మారనుందని సుమన్ అభిప్రాయపడ్డారు.