higher
-
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
అభ్యర్థులు దొరక్కుంటే అన్ రిజర్వుడే
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తాజా ప్రతిపాదిత మార్గదర్శకాలల్లో పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో ఉంచింది. అయితే, యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థల్లోని రిజర్వుడు పోస్టులు వేటినీ కూడా డీ రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పందిస్తూ ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు. -
సుప్రీం కోర్టు తీర్పు.. ఈపీఎఫ్ఓ మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ‘తరచూ అడిగే ప్రశ్నావళి’ (FAQ)లో మార్పులు చేసింది. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి అధిక పెన్షన్ అమలుపై సవరించిన ఎఫ్ఏక్యూ సెట్‌ను విడుదల చేసింది. పెన్షన్ బకాయిలను చందాదారులకు చెల్లిస్తారా లేదా అధిక చందా డిమాండ్‌కు సర్దుబాటు చేస్తారా అన్న ప్రశ్నకు సవరించిన ఎఫ్‌ఏక్యూలలో ఈపీఎఫ్ఓ బదులిచ్చింది. పెన్షన్ బకాయిలను ప్రస్తుత పద్ధతిలోనే టీడీఎస్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను నియామళిని అనుసరించి చెల్లించనున్నట్లు పేర్కొంది. మరోవైపు పింఛను లెక్కింపు సూత్రాన్ని, అలాగే ఉద్యోగుల పింఛను పథకం-1995 కింద అధిక పింఛను కోసం ఉమ్మడి దరఖాస్తు సందర్భంలో అవసరమైన ధ్రువపత్రాల జాబితాను ఈపీఎఫ్‌వో నూతన ఎఫ్‌ఏక్యూలలో మరోసారి స్పష్టం చేసింది. అధిక పెన్షన్‌కు సంబంధించిన వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయడానికి గత జూన్‌లో కూడా ఈపీఎఫ్ఓ ఇలాంటి ఎఫ్ఏక్యూ సెట్‌ను జారీ చేసింది. ఇదీ చదవండి: విశాఖ నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్ అయితే అధిక పెన్షన్‌ను ఈపీఎఫ్ఓ ఎప్పటి నుంచి అమలు చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ఈ అధిక పెన్షన్ ప్రక్రియ ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన దశలో ఉంది. వచ్చే జనవరి నాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా అధిక పెన్షన్ కోసం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
ప్రణాళికతోనే కెరీర్ బంగారం
మనీష్ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు. ఆద్య చదివే కోర్స్ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది. బోలెడు ఆప్షన్లు గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, కాగ్నిటివ్ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్ డిజైనింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)కు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ శాతం కెరీర్ ఆప్షన్లు సోషల్ మీడియా నుంచి ఉంటున్నాయి. వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ అడ్మిషన్స్ సంస్థ అధినేత శిరీష్ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, కంటెంట్ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి. ‘‘వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించి 85 శాతం ఉద్యోగాలు ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉంది. సంప్రదాయ ఉద్యోగాల నుంచి నిరంతరం మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగం దాదాపు ఉండకపోవచ్చు. అది రిటైల్ అయినా లేక ఈ కామర్స్ అయినా కృత్రిమ మేథ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుంది’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ తెలిపారు. అంటే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగై పోతాయని అనుకోవద్దు. అస్థిరతలు వద్దనుకునే వారు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు వెళుతుండడాన్ని గమనించొచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, చరిత్రకారుల అవసరం భవిష్యత్తులోనూ ఉంటుంది. కానీ, ఆటోమేషన్, ఏఐ కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పుగా మారడం ఖాయం. లోగో, గ్రాఫిక్ డిజైనింగ్ పనులు ఆటోమేషన్‌కు మారుతున్నాయి. ట్రాన్స్‌లేటర్లు, టెలీ మార్కెటర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. యంత్రాలు అంత సులభంగా చేయలేని నైపుణ్యాలు, కోర్సులను చేసే దిశగా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గుప్తా సూచించారు. విద్య, ఉపాధిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాయంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మెరుగైన విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించడాన్ని కూడా పరిశీలించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి పుట్టిన రోజు నుంచే.. పిల్లల ఉన్నత విద్యకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు ఉన్న సులభ మార్గం వారి మొదటి పుట్టిన రోజు నుంచి ఆరంభించడమే. దీనివల్ల పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం మిగిలి ఉంటుంది. నెలవారీ పరిమిత మొత్తంతో పెద్ద నిధిని సమకూర్చుకోగలరు. ఇందుకు గాను ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌ను ముందే సంప్రదించి తమకు అనుకూలమైన (తగిన) ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కేవలం ఉన్నత విద్య అనే కాకుండా వారి వివాహాలకు సంబంధించి కూడా విడిగా ప్రణాళిక అవసరం. భారీ ఖర్చులకు సంబంధించి ముందు నుంచే ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై పెద్ద భారం పడదు. పెట్టుబడుల్లో అధిక శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. 10–15 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కొంత మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలకు) వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యకు మిగిలి ఉన్న కాల వ్యవధి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రాబడులు అనే అంశాల ఆధారంగా నిపుణులు వివిధ సాధనాలను సూచిస్తుంటారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్య ఆగిపోకూడదు. అందుకని మెరుగైన కవరేజీతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో పిల్లలను కూడా భాగం చేయడం, లేదంటే వారి పేరిట ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఎంతో అవసరం. స్కాలర్ షిప్/విద్యారుణం దేశ, విదేశీ యూనివర్సిటీలు చాలా వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీ వెబ్సైట్లను సందర్శించి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. విదేశాల్లోనూ చాలా యూనివర్సిటీలు స్కాలర్షిప్లు, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పేరొందిన ట్రస్ట్‌లు కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు తమ వంతు ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఉన్న మార్గాలను తెలుసుకుని ఉండడం మంచిది. కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెషనల్ డిగ్రీలకు అనుబంధంగా అప్రెంటిషిప్ అవకాశం కలి్పస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష అనుభవంతోపాటు కొంత ఆర్థిక మద్దతు లభించినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు యూనివర్సిటీ కోర్సులకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్‌లు అనుబంధంగా ఉన్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సరిపడా సమకూర్చుకోలేని వారు విద్యా రుణాన్ని కూడా పరిశీలించొచ్చు. చిన్న మొత్తం అయితే ఎలాంటి ష్యూరిటీ అవసరం పడదు. పెద్ద మొత్తంలో రుణం తీసుకునేట్టు అయితే ఆస్తుల తనఖా, గ్యారంటీలను బ్యాంకులు కోరొచ్చు. ఇందుకు కూడా ముందుగానే సిద్ధమవ్వాలి. విద్యా రుణాలపై వడ్డీ రేటు 9–15 శాతం మధ్య ఉంది. పిల్లల విద్య పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు కోర్సు ఫీజులో 80–90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. పిల్లలు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ అవకాశాలను వినియోగించుకోవడం మరొక మార్గం. పెరిగిపోతున్న వ్యయాలు అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకమైన కోర్సులకు డిమాండ్, ఇందుకు మెరుగైన వసతుల కల్పన కారణంగా దేశ, విదేశాల్లో కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.50వేలకే పూర్తయ్యే ఎంబీఏ కోర్స్ నేడు రూ.5 లక్షలకు చేరడం ఇందుకు ఓ నిదర్శనం. ఐఐఎంలలో ఫీజులు రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నాయి. గతంలో ఇవి రూ.6 లక్షల స్థాయిలోనే ఉండేవి. ఐఐటీలోనూ కోర్సు ఫీజు రూ.6–10 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో ఫీజుల పెరుగుదల 100 శాతానికి పైనే ఉంటోంది. విదేశాల్లోనూ ఫీజుల పెరుగుదల ఇదే మాదిరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా డాలర్ మారకం రేటు అధికంగా ఉండడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ‘‘దశాబ్దం క్రితం విదేశాల్లో ఏడాది విద్యా వ్యయాలు రూ.25–30 లక్షల మధ్య ఉండేవి. ఇప్పుడు రూ.50 లక్షలకు చేరాయి’’అని గుప్తా తెలిపారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫీజు దశాబ్దం క్రితం రూ.కోటి స్థాయిలో ఉంటే, ఇప్పుడు అది రెట్టింపైంది. కేవలం ట్యూషన్ ఫీజుల వల్లే కాకుండా, జీవన వ్యయాలు కూడా పెరిగిపోవడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. కాకపోతే విదేశీ విద్యకు సంబంధించి నూరు శాతం స్కాలర్షిప్ పొందే అవకాశం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సొంతం చేసుకోవాలంటే విదేశీ విద్యా ప్రవేశానికి మూడేళ్ల ముందు నుంచే తమ ప్రొఫైల్‌పై పని చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘నూతనతరం కోర్సులు అయితే సాధారణంగా ఏటా రూ.5–10 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఢిల్లీలోని పెర్ల్ అకాడమీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూఐ/యూఎక్స్ (యూజర్ ఇంటర్ఫేజ్/యూజర్ ఎక్స్‌పీరియెన్స్) కు ఏటా రూ.7 లక్షల ఫీజు ఉంది’’అని గుప్తా వెల్లడించారు. కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజు కేవలం ఒక భాగమే. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు అదనంగా ఖర్చు చేయక తప్పదు. కాలం చెల్లిన కరిక్యులమ్ నేపథ్యంలో, పిల్లలకు సమాంతరంగా నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని గుప్తా అంటున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశానికి దూరంగా, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తే అప్పుడు వారి జీవనం కోసం మరింత వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక విదేశాలకు పంపించే వారిపై ఈ భారం మరింత పెరుగుతుంది. వసతి, ఆహారం, లాండ్రీ, ఇంటర్నెట్, మొబైల్, వస్త్రాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీవనం, రవాణా వ్యయాలు, యుటిలిటీలు (విద్యుత్, టెలిఫోన్), ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అరిజిత్ సేన్ పేర్కొన్నారు. భయపెట్టే అంచనాలు చారిత్రకంగా చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో కోర్సుల ఫీజులు నూరు శాతానికి పైగా పెరిగాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘కోర్సుల ఫీజుల పెరుగుదల వచ్చే దశాబ్దం పాటు ఇదే మాదిరిగా ఉంటుంది. జీడీపీ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వెళితే, దీనికి అనుగుణంగా సగటున పెరిగే కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, విద్యా వ్యయం 10 శాతం చొప్పున పెరుగుతూ వెళ్లినా.. ఫీజులు, విద్యా రుణాలు భారంగా మారతాయి’’అని నీతి శర్మ పేర్కొన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యామ్నాయాల రూపంలో రవాణా, జీవన వ్యయాల వంటివి ఆదా చేసుకునే అవకాశం ఉందని శర్మ వివరించారు. ‘‘ప్రతిష్టాత్మక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసేందుకు ఇప్పుడు ఏటా రూ.12–15 లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యా ద్రవ్యోల్బణం 10–12 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే పదేళ్లలో ఇది రూ.40 లక్షలకు చేరొచ్చు. ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీకి నేడు రూ.కోటి అవుతుంటే పదేళ్ల తర్వాత రూ.3 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చు’’అని అరిజిత్ సేన్ తెలిపారు. అనుసరణీయ మార్గాలు.. ఖరీదుగా మారుతున్న ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కాలేజీ ప్రవేశానికి రెండేళ్ల ముందు నుంచే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. విదేశాలకు పంపించేట్టు అయితే అక్కడి జీవన పరిస్థితులు, సంస్కృతి, దరఖాస్తు ప్రక్రియ, ఎదురయ్యే సవాళ్లపై అవగాహన తెచ్చుకోవాలి. కనుక ఈ విషయంలో నిపుణుల సాయం తప్పనిసరి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చదువులకు సంబంధించి ప్రస్తుత వ్యయాలు. తమ పిల్లల ఉన్నత విద్యకు ఇంకా ఎన్నేళ్ల కాల వ్యవధి మిగిలి ఉంది? ఎలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలి, అక్కడి ప్రస్తుత ఫీజులు, తమ పిల్లలు కాలేజీ ప్రవేశం పొందే నాటికి ఎంత మేర పెరగొచ్చనే విషయాలపై స్పష్టత అవసరం. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కోర్స్ వ్యయం, ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, రవాణా వ్యయాలు, స్కాలర్షిప్ ఉన్న అవకాశాలు, మెరుగైన విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను వారి నుంచి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వచ్చే నాటికి వారి ఆసక్తులు ఎలా ఉంటాయన్నది ముందే గుర్తించడం అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారు ఏ కోర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారన్నది ముందుగా తెలియదు. అందుకని ఖరీదైన కోర్స్‌కు సంబంధించి సన్నద్ధం కావడం మంచిది. -
ఉన్నత విద్య పేదవాళ్లకి అందాలి
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఉన్నత విద్య పేదవాళ్లందరికీ అందాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆకాంక్షించారు. ఈ దిశగా విద్యా సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యావిధానం–2020 ఈ తరహా మార్పు లకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ’’విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు– పూర్వ విద్యార్థులతో సంబంధాలు’’ అనే అంశంపై సోమవారం రాజ్‌భవన్‌లో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవి ద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వర్సిటీల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతు లు పెంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన విధానాలు తీసుకురావాలని సూచించారు. అకడమిక్ యాక్టివిటీని వర్సిటీలు మర్చిపోయాయి ప్రపంచంతో పోటీ పడగల సత్తా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉందని, అయితే అకడమిక్ యాక్టివిటీని విశ్వవిద్యాలయాలు మరిచిపోయా యని ఆమె వ్యాఖ్యానించారు. సరైన బోధన విధానాలు, మౌలిక వసతులు కల్పిస్తే ఇప్పుడు ప్రపంచ విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకున్నట్టే, భవిష్యత్‌లో మన యూనివర్సిటీల గురించి చర్చించుకునే వీలుందన్నారు. విద్యావికాసానికి డిజిటల్ లైబ్రరీ మంచి అవకాశంగా పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సహకారం విశ్వవిద్యాలయాలకు అత్యంత ముఖ్యమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. -
పేదలు ఉన్నత విద్య అభ్యసించడమే సీఎం లక్ష్యం
సాక్షి, అనకాపల్లి: పేదింటి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అరబిందో ఫార్మసీ రూ.2 కోట్ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన 2,500 సైకిళ్లను అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రితో పాటుగా అరబిందో ఫార్మసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి హాజరయ్యారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్లలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చినట్లు చెప్పారు. -
ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా?
నిజాలకు పాతరేసి.. అబద్ధాలు అందంగా అచ్చు వేయటంలో ‘ఈనాడు’ దిట్ట. ఏలినవారు కావాల్సిన వారైతే... ఏమీ చేయకపోయినా సాహో.. అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అదే అధికారం తమవారి చేతుల్లో లేకపోతే మాత్రం... ‘ప్రతిపక్ష’ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఒకనాడు కోర్టుకే నేరుగా చెప్పారు ఘనత వహించిన రామోజీరావు. ఇదంతా ఎందుకంటే... ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకు రావాల్సిన మార్పులను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలతో సమావేశమై భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులను చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న టెక్నాలజీలను మన పిల్లలు ఒడిసి పట్టుకోవటానికి యూనివర్సిటీలు ఏం చేయాలో ఆయన చెప్పారు. ఆ వార్త యథాతథంగా వేస్తే... ముఖ్యమంత్రి విజన్ అందరికీ తెలుస్తుందని, చదువుకున్న వారిలోను, విద్యార్థుల్లోను సానుకూలత వస్తుందని భయపడిన రామోజీరావు... ‘సీఎంగారూ! ఇదెలా సాధ్యం?’ అంటూ తన పైత్యం మొత్తాన్ని జోడించి ఒక కథనాన్ని వండేశారు. యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదని, నిధులు మళ్లించేస్తున్నారని, వైస్‌చాన్స్‌లర్లుగా, పాలకమండలి సభ్యులుగా అధికార పారీ్టకి కావాల్సిన వారిని నియమించారని... ఇలా చేతికొచ్చినంత రాసిపారేశారు. మరి ఇందులో నిజమెంత? ఏది నిజం? నిజమే! ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ కావటం లేదు. కాకపోతే అది గడిచిన నాలుగేళ్లుగా కాదు. చాలా సంవత్సరాలుగా!!. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచీ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లుగా, పాలక మండలి సభ్యులుగా తన బంధువులనే నియమించుకున్నారు. వారు అడ్డగోలుగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కేసి తమకు కావాల్సిన వారిని, ముడుపులిచ్చిన వారిని నియమించుకోబోయారు. ఆ పోస్టులను ఆశిస్తున్న పలువురు నిరుద్యోగులు, వారి తీరు నచ్చన ఆయా వర్సిటీల్లోని సిబ్బంది ఈ వ్యవహారంపై కోర్టులకెళ్లారు. దీంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ అలానే ఖాళీగా ఉండిపోయాయి. మరి అలా వర్సిటీల్లో తమ బంధువుల్ని నియమించుకున్నందుకు చంద్రబాబును ఎన్నడూ ప్రశి్నంచలేదెందుకు రామోజీరావు గారూ? వారు అడ్డగోలుగా పోస్టుల భర్తీ చేయబట్టే కదా... కోర్టుల్లో కేసులు పడి రిక్రూట్మెంట్లు నిలిచి పోయాయి. దాన్ని కూడా ఎన్నడూ ప్రశ్నించలేదెందుకు? ఇవన్నీ పక్కనబెడితే... కనీసం ఆ కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే వార్తలు సైతం ‘ఈనాడు’ రాస్తే ఒట్టు!. ఇప్పుడేమో ఆ కేసులన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోస్టుల భర్తీ చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశి్నంచటం మొదలెట్టారు రామోజీ!!. నాలుగేళ్లూ ఊరుకుని ఇప్పుడెందుకంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. అసలు ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబును... కోర్టు కేసులకు కారకుడైన చంద్రబాబును మాత్రం వెనకేసుకొస్తూనే ఉన్నారు. పైపెచ్చు ఈ ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 50% మహిళలకే అవకాశమిస్తోంది. దాన్ని కూడా పక్కనబెట్టి అంతా అధికార పారీ్టవారే అంటూ దుర్మార్గపు రాతలకు దిగింది ‘ఈనాడు’. అదీ రామోజీరావు తీరు!!. ఇదీ నిజం. నిధులు మళ్లించిందెవరు రామోజీ? వర్సిటీల నిధులను దారిమళ్లించినట్లు ‘ఈనాడు’ అవాస్తవాలను వండి వార్చేసింది. మరి ఇందులో నిజమెంత? టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీలకు ఉరి వెయ్యటానికి చంద్రబాబు నిధుల దుబారా పథకాన్ని అమలు చేశారు. అంటే... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాల కోసం యూనివర్సిటీల్లో సమావేశాలు నిర్వహించారు. సమావేశం వర్సిటీలో కనక దానికయ్యే ఖర్చు మొత్తాన్ని వర్సిటీల నుంచే చేయించారు. ఇందుకోసం ఆయా యూనివర్సిటీలు ఒక్కొక్కటి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేశాయి. కానీ అప్పట్లో ‘ఈనాడు’ పెన్నెత్తితే ఒట్టు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పనులకోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించింది. వర్సిటీలు సహా ఇతర సంస్థలు తమ వద్ద అదనంగా ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ కార్పొరేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. వర్సిటీల నిధులకు అధిక వడ్డీ చెల్లిస్తూ తిరిగి వారికి అవసరమైనప్పుడు ఇస్తున్నారు. బాబు దుబారాపై కళ్లు మూసుకుని... డిపాజిట్లను నిధులు మళ్లించటమని అంటున్నారంటే రామోజీని ఏమనుకోవాలి? ఎంతైనా రామోజీ.. రామోజీనే!! సాక్షాత్తూ యూజీసీ చైర్మన్ చెప్పారు జూలై 1న సాక్షాత్తూ యూజీసీ ౖచైర్మన్ కాకినాడలో జరిగిన సమావేశంలో... ఉన్నత విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పలు అంశాల్లో ముందున్నదని వ్యాఖ్యానించారు. కానీ ‘ఈనాడు’ మాత్రం ఉన్నత విద్యపై బురద చల్లుతూ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయాందోళనలను కలిగించడానికి ప్రయత్నిస్తోందన్నది నిజం. గడిచిన నాలుగేళ్లలో దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు, రీజనల్ క్లస్టర్ గ్రూపులు, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులు, నైపుణ్య కోర్సులు వంటి అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలోని మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ ‘ఈనాడు’కు అసాధ్యమైనవిగా కనిపించటం విచిత్రమే మరి. ఎందుకంటే చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదు కాబట్టి ‘ఈనాడు’కు సహజంగానే అవన్నీ అసాధ్యమైనవిగా కనిపిస్తాయి. ఒక కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టే ముందు దానిపై లోతుగా అధ్యయనం చేయటం, ప్రణాళికాబద్ధంగా అమలుకోసం సన్నద్ధమవటం వంటివి చేస్తున్నపుడు ఏదో ఒకరకంగా బురద జల్లాలనే లక్ష్యంతో ‘ఈనాడు’ వరుస కథనాలు రాస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే నిన్న జరిగిన వైస్‌చాన్సలర్ల సమావేశం.. ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి సమావేశం కాదు. 2021 అక్టోబర్ 25న తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఉపకులపతులతో సమావేశమై ఉన్నత విద్యపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగేళ్లలో దాదాపుగా 10 సార్లు ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యపై ఇన్ని సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదు. వీటన్నిటినీ విస్మరించిన ‘ఈనాడు’... నాలుగేళ్ల తరవాత తొలిసారిగా వీసీలతో సమావేశం నిర్వహిస్తున్నారన్న తరహాలో కథనాన్ని వండిందంటేనే.. రామోజీ దుర్బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచే పటిష్ట పునాదులు ఒక్క ఉన్నత విద్యలోనే కాకుండా పునాది స్థాయి నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దేలా రాష్ట్రంలో పలు సంస్కరణలను సీఎం జగన్ తొలిరోజు నుంచీ అమలు చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శంగానూ నిలిచాయి. పాఠశాల విద్యలో నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు యూపీ, అస్సాం, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. గతంలో ప్రయివేటుకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమాన్ని వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టించారు. దీనిపైనా చంద్రబాబు, రామోజీ విషం చిమ్మి అడ్డుపడే ప్రయత్నం చేశారు. నూతన విద్యావిధానం కన్నా ముందే రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యావిధానాన్ని తీసుకువచ్చి శిశుస్థాయి నుంచే పిల్లల్లో అక్షరజ్ఞానానికి సీఎం శ్రీకారం చుట్టారు. నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, సీబీఎస్ఈ విధానం వంటి విధానాలను తెచ్చి పాఠశాల విద్యను బలోపేతం చేశారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను నెలకొల్పి డిజిటల్ బోధన చేయిస్తున్నారు. ప్రతి ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్ధులకు, టీచర్లకు ట్యాబులను కూడా అందిస్తూ... దిగ్గజ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ పాఠాలను కూడా అందులో అందజేస్తున్నారు. ఉన్నత విద్య భారం పూర్తిగా ప్రభుత్వానిదే... ఉన్నత విద్యలో చేరే ప్రతి విద్యార్థికీ పూర్తి ఫీజురీయింబర్స్మెంటుతో పాటు వారి వసతి ఖర్చులనూ ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారు. దీనికోసం గత నాలుగేళ్లలో రూ.15వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచి్చంచింది. గత ప్రభుత్వంలో 35వేలు మాత్రమే ఫీజు ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని విద్యార్ధులే కట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్తిభారం ప్రభుత్వానిదే కావటంతో ఇంటర్ తరవాత డ్రాపవుట్లు గత ప్రభుత్వంలో 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గారు. ఉన్నత విద్యలోనూ నేటి అవసరాలకు తగ్గట్టుగా కరిక్యులమ్ అభివృద్ధి చేయించారు. బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీని వేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టించారు. డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి నాలుగేళ్ల హానర్ కోర్సులను ఏర్పాటు చేయించారు. 27 వేల పరిశ్రమలు, సంస్థల అనుసంధానంతో ఇంటర్న్‌షిప్. విద్యార్ధులకు ఇంటర్న్íÙప్కోసం కాలేజీలను జిల్లాల వారీగా 27వేల పరిశ్రమలతో అనుసంధానం చేయించారు. చదువులు పూర్తి చేసేనాటికే విద్యార్ధులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు సమకూరేలా చేశారు. విద్యార్ధులలో నైపుణ్యాలకోసం 553 ఎంటర్ప్రెన్యూర్íÙప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ కేంద్రాల ఏర్పాటుచేయించారు. మైక్రోసాఫ్ట్ ద్వారా రూ.32 కోట్లతో 1.62 లక్షల మందికి సర్టిఫికేషన్ కోర్సులు అందించారు. మరో 1.95 లక్షల మందికి వివిధ కంపెనీలతో వర్చువల్ ఇంటర్న్íÙప్ అందించారు. నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్, ఎడ్యుస్కిల్స్, బీఎస్ఎన్ఎల్, సేల్స్‌ఫోర్సు, పాల్ ఆల్టో, బ్లూప్రిజమ్, ఫుల్‌స్టేక్, ఏడబ్ల్యూఎస్, ఎంప్లాయిమెంటు ఎక్స్‌ప్రెస్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో వర్చువల్ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చారు. సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లోనే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్సియల్, క్స్‌టైల్స్, అపెరల్, లైఫ్‌సైన్సెస్, అగ్రికల్చర్, హెల్త్‌కేర్ తదితరాల్లో ఇంటర్న్íÙప్ వల్ల విద్యార్ధులకు అవగాహన పెరుగుతోంది. బాబు హయాంలో 37వేలు మాత్రమే ప్లేస్మెంట్లు ఉండగా గత ఏడాదికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. ఈ ఏడాదిలో 1.20 లక్షల మందికి ప్లేస్మెంట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతా ‘పచ్చ’గానే ఉండాలనుకునే రామోజీరావు కళ్లకు ఇవేవీ ఎన్నటికీ కనిపించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. బాబు హయాంలో ఒక్కపోస్టూ భర్తీ చేయలేదే.. మన పిల్లలని ప్రపంచస్థాయి లీడర్లుగా ఎదగకుండా ఆపింది ఎవరు? అనేది ‘ఈనాడు’ ప్రశ్న. దీనికి సమాధానం చంద్రబాబే. ఎందుకంటే విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం ఆయనే. చంద్రబాబు అధికారంలో ఉన్న తొలి తొమ్మిదేళ్ళూ... అంటే 1995 నుంచి 2004 వరకు, ఆలాగే, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక 2014 నుండీ 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినీ నియమించలేదు. దీన్ని రామోజీరావు ఎప్పుడూ ప్రశ్నించలేదు కూడా!. విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఆయా కోర్సుల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుంటే కృత్రిమ మేధ వంటి కొత్త కోర్సుల వల్ల ఉపయోగం ఏమిటనేది ‘ఈనాడు’ ప్రశ్న. వాస్తవానికి మారుతున్న సమకాలీన సామాజిక అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు వస్తుంటాయి. వాటికి అవసరమైన నిపుణులను వర్సిటీల్లో నియమించుకోవాలి. అంతేకానీ, ప్రస్తుతం నిపుణులు లేరు కాబట్టి కొత్త కోర్సులను తేవొద్దని చెప్పటం ఏ రకమైన పాత్రికేయం? వర్సిటీల్లో ర్యాంకులు పడిపోతున్నాయనీ, ఈ సమయంలో కొత్త కోర్సులు అవసరమా? అనేది ‘ఈనాడు’ కథనంలో ప్రధానమైన అంశం. ర్యాంకులు పడిపోవడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఆచార్యులు లేకపోవడమే కారణం. దీనికి ప్రధాన బాధ్యుడు చంద్రబాబే. నియామకాలు చేపట్టకపోవటం, కోర్టు కేసులపై దృష్టిపెట్టకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ర్యాంకులను పునరుద్ధరించుకోవడానికి ముఖ్యమంత్రి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధి నమూనాలను తీసుకోవాలని దార్శనికతతో వివరించారు. రాబోయే కొద్ది రోజుల్లో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. తద్వారా విశ్వవిద్యాలయాలను శక్తివంతమైన సాంకేతిక, ఆధునిక విద్యా కేంద్రాలుగా మారాలన్నారు. కార్యాచరణ మొదలుపెట్టి విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయాలని పేర్కొన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అంశాలు, ఏ నిరుద్యోగినీ బాధించవు. అవకాశాలు పెంచుకోవడానికి, మరికొంత మందిని ఉపాధికి చేరువ చేయడానికి కృత్రిమ మేధ ఉపయోగ పడుతుంది. బహుశా, ఇలాంటి విధానం ‘ఈనాడు’కు నచ్చి ఉండకపోవచ్చు. లేకపోతే ఇలా చెప్పింది చంద్రబాబు కాదు కాబట్టి నచ్చి ఉండకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు సిద్ధమవుతుండటాన్ని గమనించి... ఎలాగైనా నియామకాలు జరగకూడదనే కుట్ర ఈ కథనంలో స్పష్టంగా కనబడుతోంది. -
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై హయ్యర్ పెన్షన్‌కు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ కల నెరవేరింది. నూతన హయ్యర్ పెన్షన్ అర్హత ప్రకారం 5-6 రెట్లు పెన్షన్ పెరగనుంది. ఈపీఎఫ్‌వో జారీ చేసిన హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాన్ని (నెలకు 25 వేలు హయ్యర్ పెన్షన్ గా నిర్ధారిస్తూ) జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అందజేశారు. దేశంలో ఏ ఇతర ఆర్టీసీ ఉద్యోగులకు లేని అవకాశం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే! -
గుడ్‌న్యూస్: ఈపీఎఫ్‌వో అధిక పింఛన్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు
ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో అధిక పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయిన ఈపీఎఫ్‌వో సభ్యులకు ఊరట లభించింది. అధిక పింఛన్ కోసం దరఖాస్తు గడవును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడిగించింది. ఇది జూన్ 26తో ముగియాల్సి ఉండగా జూలై 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అధిక పింఛన్‌ను ఎంచుకునేందుకు ఈపీఎఫ్‌వో సభ్యులకు గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించిన ఈపీఎఫ్‌వో తాజాగా మరోసారి పొడిగించింది. సభ్యులకు మరింత అవకాశం కల్పించేందుకు ఇంతకుముందు మార్చి 3 నుంచి మే 3 వరకు, ఆపై జూన్ 26 వరకు డెడ్‌లైన్‌ను పొడించుకుంటూ వచ్చింది. ఎవరు అర్హులు? 2014 సెప్టెంబరు 1 కంటే ముందు నుంచే ఈపీఎఫ్, ఈపీఎస్‌లలో సభ్యులుగా కొనసాగుతున్నవారు అధిక పింఛన్ పొందేందుకు అర్హులు. అలాగే 2014 సెప్టెంబరు 1 కంటే ముందు రిటైరైన ఉద్యోగులు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని ఈపీఎఫ్‌వో అధికారులు తిరస్కరించి ఉంటే వారు కూడా అర్హులే. అవసరమైన పత్రాలు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీవో), వేతన పరిమితి కంటే ఎక్కువగా ఈపీఎఫ్ ఖాతాకు చెల్లించినట్లుగా రుజువు పత్రాలు అవసరమవుతాయి. అధిక పెన్షన్‌ను ఎలా లెక్కిస్తారు? 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి అధిక పెన్షన్, సభ్యత్వం నుంచి నిష్క్రమించే తేదీకి ముందు 12 నెలలలో కాంట్రిబ్యూటరీ సర్వీస్ వ్యవధిలో తీసుకున్న సగటు నెలవారీ వేతనం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2014 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన, విరమణ చేయబోయే ఉద్యోగులకు, సభ్యత్వం నుండి నిష్క్రమించే తేదీకి ముందు 60 నెలలలో పొందిన సగటు నెలవారీ వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కకడతారు. -
తగ్గినట్టే తగ్గి.. షాకిస్తున్న పసిడి
సాక్షి,ముంబై: గత కొద్దిరోజులుగాఆకాశనుంచి దిగొస్తూ మురిపించిప పసిడి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్లో ఊరట చెందాలనుకున్న పసిడి ప్రియులకు ఇది చేదు వార్త. తాజాగా గురువారం కూడా బంగారం, వెండి ధరలు వేగాన్ని అందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే హైదరాబాదులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 పలుకుతోంది. గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,175 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,200కి చేరింది. ఇక ముంబై, కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600(గురువారం)గా ఉంది చెన్నైలో రూ. 52,350, ఢిల్లీ, జైపూర్ , లక్నోలో రూ. 51,750. మరోవైపు ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి ధర రూ.66,800గా ఉంది. గ్లోబల్‌గా రాయిటర్స్ ప్రకారం, వడ్డీ రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటాయనే పెట్టుబడిదారుల ఆందోళనలను గ్లోబల్ ఎకనామిక్ డేటా మరింత పెంచింది. డాలర్ పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరిన స్పాట్ బంగారం 0.2శాతం తగ్గి ఔన్సుకు 1,833.57 డాలర్ల వద్ద ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టంతో 1,840.50 డాలర్లుగా ఉంది. కాగా బుధవారం వరుసగా మూడవ సెషన్లో లాభంతో గత వారం నుండి బంగారం దాదాపుగా తన నష్టాలనుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్: ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త. దీనికి సంబంధించిన గుడువుపై ఆందోళన అవసరం లేదు. 2023 మార్చి 3 తో గడువు ముగిసి పోతుందున్న ఆందోళన నేపథ్యంలో ఈపీఎఫ్‌వో గడువును పొడిగించింది. అధికారిక పోర్టల్ సమాచారం ప్రకారం ఈ గడువు మే 3 వ తేదీవరకు ఉంది. ఈ పరిధిలోని చందాదారులు, పెన్షన్‌దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మే 3 తేదీ వరకు అప్లయ్ చేసుకోవవచ్చు. (ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ.. ‘అధిక పెన్షన్’కు ఏం చేయాలి?) సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాలలో ఈపీఎఫ్ఓ అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల వ్యవధి మార్చి 3, 2023తో ముగిసిపోనుందనే ఆందోళన సభ్యులలో నెలకొంది. అయితే తాజాగా 60 రోజుల పొడిగింపుతో అర్హత ఉన్న సభ్యులందరూ, యజమానులతో కలిసి మే 3, 2023 వరకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఏకీకృత సభ్యుల పోర్టల్‌లో అధిక పెన్షన్ కోసం సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి దీనికి సంబంధించిన అర్హతలపై ఈపీఎఫ్ఓ తన జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. -
లాభాల ముగింపు, ఐటీ స్టాక్స్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలోనే లాభపడినా, రోజంతా లాభ నష్టాల మధ్య ఊడిసలాడాయి.చివరికి సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 53760 వద్ద నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 16,049 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 16వేల స్థాయిని ఎగువన ముగిసింది. కానీ సెన్సెక్స్ ఇంకా 54వేల దిగువనే ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ 2.86 శాతంలాభంతో అగ్రస్థానంలో ఉండగా, టైటాన్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఐషర్ మోటార్స్ మారుతీ సుజుకీ ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ హెచ్‌సిఎల్ టెక్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్ట పోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి శుక్రవారం 79.96వద్ద మరో రికార్డు కనిష్టానికి చేరింది. చివరికి 79.88 వద్ద స్థిరపడింది. గురువారం 79.90 వద్ద రికార్డు కనిష్టాన్ని టచ్ చేసి 79.89 వద్ద క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. -
AP: ఉద్యోగమే లక్ష్యంగా కోర్సులు
సాక్షి, అమరావతి: ఉద్యోగాలు కల్పించే చదువుల దిశగా కోర్సులు ఉండాలని, ఇందుకోసం ఇప్పుడున్న కోర్సులకు అనుబంధ, ప్రత్యేక కోర్సులు తీసుకు రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా శాఖను ఆదేశించారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లిష్‌పై పట్టు, ప్రావీణ్యం వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జీఆర్ఈ, జీ మ్యాట్ పరీక్షల కోసం మంచి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఉన్నత విద్య కార్యకలాపాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరగడం కోసమే విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని, వసతి ఖర్చులూ పెట్టుకోలేక చదువులు ఆపేసే పరిస్థితులు ఉండకూడదని ఈ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో కన్నా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పెరిగిన మాట వాస్తవమేనని, అయితే మనం దీంతో సంతృప్తి చెందకూడదన్నారు. జీఈఆర్ 80 శాతానికి పైగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. చదవండి👉: ప్రజా సంక్షేమం ఆగదు: సీఎం వైఎస్ జగన్ ఎంత మంది పిల్లలున్నా అందరికీ వర్తింపు ఫీజురీయింబర్స్ మెంట్, వసతి దీవెనలను ఓ కుటుంబంలో ఒకరికే పరిమితం చేయడం లేదు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ విద్యా దీవెన, వసతి దీవెన ఇస్తున్నాం. ఇదివరకు చదివించే స్తోమత లేక, చాలా మంది అబ్బాయిలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, అమ్మాయిలను పై చదువులకు పంపలేని పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ ఈ పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ రాష్ట్రంలో నాలుగైదు యూనివర్సిటీలను ఎంపిక చేసుకుని, వాటిని దేశంలో ఉత్తమ యూనివర్సిటీల స్థాయికి తీసుకెళ్లడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. కోర్సులో భాగంగా పట్టభద్రులకు తప్పనిసరిగా మూడు విడతల్లో 10 నెలల ఇంటర్న్‌షిప్ (మొదటి ఏడాది 2 నెలలు, రెండో ఏడాది 2 నెలలు, మూడో ఏడాది 6 నెలలు) ఉండాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్య కాలేజీల్లో కూడా ఇంటర్న్‌షిప్ కోసం ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో ఉన్న జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి. ఇందుకు సంబంధించి నాడు– నేడు కింద పనులు చేపట్టాలి. డిగ్రీ కాలేజీల కోసం ప్రత్యేక వ్యవస్థ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను తీసుకురావాలి. చదువులు ఏదోరకంగా సాగితే చాలు అన్న వాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే భావన ఇవాళ దేశంలో ఉంది. అయితే విదేశాల్లో డిగ్రీ అన్నది చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారు. మన రాష్ట్రంలో కూడా డిగ్రీ కోర్సులను సమర్థవంతంగా తీసుకురావాలి. ఇప్పుడున్న డిగ్రీ కాలేజీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి. మన ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యారంటే.. ఆ విద్యార్థికి మంచి విజ్ఞానం రావాలి. ఆ స్థాయిలో డిగ్రీ కాలేజీలను తీర్చిదిద్దాలి. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్, ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్సిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలి. మంచి పరిజ్ఞానం ఉన్న వారు ఈ ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలి. డిగ్రీ కోర్సులకు విలువను జోడించాలి. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలనుకునేట్టుగా ఉండాలి. ఏపీలో డిగ్రీ చదివితే.. మంచి జీతాలతో ఉద్యోగాలొచ్చే పరిస్థితి తీసుకురావాలి. – సీఎం వైఎస్ జగన్ బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్ టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని, సమర్థులైన వారిని, ప్రతిభ ఉన్న వారిని టీచింగ్ స్టాఫ్‌గా తీసుకోవాలని చెప్పారు. వారికీ పరీక్షలు నిర్వహించి, ఎంపిక చేయాలని, టీచింగ్ స్టాఫ్ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవని అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
వచ్చే పదేళ్లు ‘ఇండియాస్ టెకేడ్’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితుల్లో ఏర్పడే కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో పరిశోధన, అభివృద్ధికే పెద్ద పీట వేయాలన్నారు. అందుకే రానున్న పదేళ్ల కాలాన్ని ‘ఇండియాస్ టెకేడ్’ అని పిలుచుకోవచ్చునని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే వందకుపైగా ఐఐటీల డైరెక్టర్లలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. విద్యారంగంలో పెట్టే ప్రతీ పైసా సామాజిక పెట్టుబడి అని అన్న ప్రధాని స్తోమత, సమానత్వం, నాణ్యత, అనుసంధానం అన్నవే ఉన్నత విద్యను ముందుకు నడిపిస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కోవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ సంస్థలు చేసిన పరిశోధన, అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్ వేరబుల్స్, డిజిటల్ అసిస్టెంట్లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలన్నారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. సమావేశానంతరం ప్రధాని వాటి వివరాలను ట్వీట్ చేశారు. ముప్పు తొలగిపోలేదు: ప్రధాని మోదీ కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనాపై పోరు సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సహచరులతో సమావేశం సందర్భంగా ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్‌ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. సమయానికి కార్యాలయాలకు రావాలని, ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు. గతంలో ఆయా శాఖలు నిర్వహించిన మంత్రులను కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. -
లాభాల్లో సూచీలు: విప్రో ర్యాలీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అయితే ఆరంభ లాభాల నుంచి స్వల్పంగా వెనక్కి తగ్గిన కీలక సూచీలు ప్రధాన మద్దతు స్తాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 73 పాయింట్లు లాభంతో 48876 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 14636 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోతుండగా దాదాపు అన్నిరంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. మరోవైపు మార్చి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో విప్రో 6 శాతం ఎగిసింది. ఏషియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్, టాటా మోటర్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ లాభాల్లోనూ, ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, సన్‌ఫార్మా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. -
55 పైసలు ఎగిసిన రూపాయి
సాక్షి, ముంబై: కొత్త ఫారెక్స్ ట్రేడింగ్ గంటలు అమల్లోకి రావడంతో దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో భారీ పుంజుకుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలను అందిపుచ్చుకున్న భారతీయ రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం 55 పైసల లాభంతో 75.63 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో రూపాయి 75.57 -75.99 మధ్య ట్రేడయింది. శుక్రవారం 76.13 వద్ద స్థిరపడింది. మహావీర్ జయంతి కారణంగా సోమవారం ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఊహించిన దానికంటే ఎక్కువగా వుంటుందన్న అంచనాల మధ్య భారీ ఉత్పత్తి కోతలు అవసరమవుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ముడి ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించడానికి అంగీకరిస్తారనే ఆశతో గ్లోబల్ ఆయిల్ ధరలు ఈ రోజు పెరిగాయి. ముడి చమురు 2.4 శాతం పెరిగి బ్యారెల్ కు 33.85 డాలర్లుగా వుంది. కీలకమైన హాట్స్పాట్లలో కరోనా వైరస్ వ్యాప్తి మందగించిన సంకేతాలపై గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా లాభపడ్డాయి. 2300 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ 30వేల స్థాయిని టచ్ చేసింది. అలాగే నిఫ్టీ కూడా 700 పాయింట్లు ఎగిసి 8800 స్థాయిని తాకింది. కోవిడ్-19 విస్తరణ, దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి దేశం 21 రోజుల లాక్డౌన్ నేపథ్యంలో బాండ్లు , విదేశీ మారకద్రవ్యం ట్రేడింగ్ వేళ్లలో కీలక మార్పులను చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందులా ఉదయం 9 నుంచి సాయంత్రి 5 గంటల వరకు కాకుండా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకే పరిమితం చేసింది. అటే మార్కెట్ ట్రేడింగ్ గంటలను నాలుగు గంటలు తగ్గించింది. సవరించిన ట్రేడింగ్ వేళలు ఏప్రిల్ 17 వరకు అమల్లో వుంటాయి. -
లాభాల హోరు, 12వేలు మార్క్ తాకిన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడో రోజుకూడా లాభాలతో ఆరంభమైన సూచీలు అనంతరం మరింత పుంజుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 12వేల మార్క్‌ను టచ్ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 168 పాయింట్లు ఎగిసి 40631 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 11983 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ గరిష్టాల వద్ద జోరుగా సాగుతున్నాయి. టెలికం, అయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వ బ్యాంకింగ్ సెక్టార్ తో పాటు, దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి మరోవైపు టాప్ విన్నర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ వైపు దూసుకుపోతోంది. ఆరంభంలోనే రూ. 9.5లక్షల కోట్లను టచ్ చేసింది. రిలయన్స్, భారతిఎయిర్టెల్, ఇండస్ఇండ్, కోల్ ఇండియా,లార్సెన్, ఓఎన్‌జీఈసీ, సన్‌ఫార్మా లాభపడుతుండగా బ్రిటానియా, యస్‌బ్యాంకు, ఐటీసీ, బజాజ్ఆటో, నెస్లే,గెయిల్, ఐషర్‌మోటార్స్,ఎన్టీపీసీ నష్ట పోతున్నాయి. -
ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ?
సాక్షి, హైదరాబాద్; రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం అధ్యాపకుల్లేక ఇబ్బందులు పడుతోంది. వేల పోస్టుల భర్తీ లేక కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో సంబంధిత శాఖలు ఉన్న కొద్ది మంది అధ్యాపకులు, కాంట్రాక్టు సిబ్బందితో బోధనను కొనసాగిస్తున్నాయి. దీంతో ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వెనుకబడుతున్నారు. మరోవైపు అధ్యాపకులు లేని కారణంగానే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి రావడం లేదు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ (న్యాక్) గుర్తింపుగల విద్యా సంస్థలకే రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులిస్తామని కేంద్రం గత మూడేళ్లుగా మొత్తుకుంటున్నా అధ్యాపకుల నియామకంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. లేఖలు రాయడానికే పరిమితం.. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కాలేజీల్లో 1,200 పోస్టులు దాదాపు ఏడేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. వాస్తవానికి 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అందులో 751 పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నందున కనీసం 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ప్రభుత్వాన్ని ఏళ్ల తరబడి కోరుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ సమస్యల వంటి కారణాలతో ఆ పోస్టుల భర్తీ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మంజూరైన జూనియర్ లెక్చరర్ పోస్టులు 6,719 ఉండగా 1,040 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 5,679 పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో 3,728 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. మిగిలిన 1,951 పోస్టుల్లో 1,200 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మిగతా 751 పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిన గెస్ట్ లెక్చరర్లు (రిటైరైన వారు) బోధిస్తున్నారు. ఆ 1,200 పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని ఇటీవల ఇంటర్ విద్యా కమిషనర్‌గా వచ్చిన సయ్యద్ ఉమర్ జలీల్ లేఖ రాసినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. డిగ్రీ కాలేజీల్లోనూ అంతే.. రాష్ట్రంలోని 131 డిగ్రీ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ఏడేళ్లుగా అచరణకు నోచుకోవడం లేదు. డిగ్రీ కాలేజీల్లో మొత్తంగా మంజూరైన పోస్టులు 4,099 ఉండగా అందులో 1,280 పోస్టుల్లోనే రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగతా 2,819 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు/గెస్ట్ ఫ్యాకల్టీ 1,883 పోస్టుల్లో పనిచేస్తుండగా 936 పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వాటి భర్తీకి అనుమతివ్వాలని గతంలోనే కోరినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గతేడాది 31 కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జోన్ల ఏర్పాటు, ఆ తరువాత వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించినా పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు చేపట్టలేదు. ఇక ఇటీవలి కాలంలో మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, వాటిని కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లలో చేరుస్తూ ఫైలు కేంద్రానికి పంపడంతో వాటి భర్తీ పెండింగ్‌లో పడిపోయింది. రాష్ట్రపతి ఆమోదం తరువాతనైనా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. వర్సిటీల్లోనూ పడని అడుగులు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనూ పోస్టుల భర్తీ వ్యవహారం ముందుకు కదలట్లేదు. 2016లో కొత్తగా వీసీలను నియమించినా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతిచ్చినా వీసీలు పట్టించుకోలేదు. ఆ తరువాత కోర్టు కేసులు తదితరాలతో భర్తీని పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడైతే పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. యూనివర్సిటీలకు పూర్తిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు లేవు. పూర్తిస్థాయి వీసీలు లేరు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,738 ఉండగా అందులో 1,528 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2016 నాటికి సేకరించిన లెక్కల ప్రకారమే ఈ ఖాళీలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగిందని ఉన్నత విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న 1,528 పోస్టుల్లోనూ మొదటి విడతలో కేవలం 1,061 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం 2016లోనే నిర్ణయించింది. కనీసం వాటి భర్తీ అయినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
మార్కెట్ల జోరు:10800కిపైన నిఫ్టీ
సాక్షి, ముంబై: వారం చివరలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 290 పాయింట్లు ఎగిసి 35,535 వద్ద,నిఫ్టీ పాయింట్లు 9010,806 లాభపడి వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ 10800స్థాయికిపైన ముగిసింది. ఒక దశలో 300 పాయింట్లకుపైగా పుంజుకుంది. ఆరంభంనుంచి ఉత్సాహంగాఉన్న సూచీలు ట్రేడింగ్ ఆఖరు గంటలో మరింత పుంజుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ , ఐటీ, ఇతర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ మార్కెట్లకు ఊతమిచ్చాయి. టెలికాం, ఫార్మ సెక్టార్ భారీగా నష్టపోగా , రియల్టీ స్వల్పంగా నష్టపోయింది. రిలయన్స్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, జిందాల్ స్టీల్, హింద్ కాపర్, టాటా స్టీల్, వేదాంతా, సెయిల్, నాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఐషర్ మోటార్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ హెచ్‌సీఎల్ లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, యూపీఎల్ లాంటి షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. అయితే జియో దెబ్బతో ఎయిర్టెల్, ఆర్‌కాం, ఐడియా, పీసీ జ్యుయలరీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అటు ఫారెక్స్ మార్కెట్లు రూపాయి నష్టాలనుంచి తేరుకుంది. డాలరు మారకంలో 0.04 పైసల లాభంతో 67.28 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి కూడా రూ.121 పుంజుకుని పది గ్రా. 31,486 వద్ద ఉంది. -
పని ఎక్కువ.. జీతం తక్కువ..
శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది. చెప్పుకునేందుకు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల హోదా అయినా.. సమయానికి వేతనాలు అందని దుస్థితి. ‘వారికేం.. వేలల్లో సంపాదిస్తారు..’ అనే పేరు తప్ప.. నెల గడిచినా.. జీతం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూపులు తప్పడం లేదు. ఫీజు బకాయిల సాకుతో యాజమాన్యాలు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి ఇల్లు గడవడమే గగనమవుతోంది. ‘బాగా’నే ఇస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్న యాజమాన్యాలు.. ఇచ్చేది మాత్రం అందులో 25శాతానికి మించడం లేదు. పరీక్షల్లో ఇన్విజిలేషన్ చేసినందుకు అధ్యాపకులకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి పెండింగ్ జిల్లాలో మొత్తం 15 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో 13 ప్రైవేట్‌వే.. డిగ్రీ కళాశాలలు 129 ఉండగా 104 ప్రైవేట్‌వే.. వీటిలో మొత్తం 10వేలకుపైగా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్నిమాత్రమే క్రమం తప్పకుండా అధ్యాపకులకు వేతనాలు ఇస్తున్నాయి. మిగితా వాటిలో రెండు, మూడునెలలపాటు పెండింగ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. డిగ్రీలో 80 శాతం కళాశాలలు సమయానికి జీతాలివ్వడం లేదనే అపవాదు ఉంది. ఇంక్రిమెంట్ల విషయంలోనూ సరైన సమయానికి ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. రికార్డుల్లో నాలుగురెట్లు వేతనాలు సక్రమంగా చెల్లించని కొన్ని కళాశాలలు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వేతనాలు తీసుకుంటున్నట్లు ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి. సంతకం పెట్టకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో ఎదురుప్రశ్నించలేకపోతున్నారు. రికార్డుల్లో చూపించే వేతనాలు మాత్రం వాస్తవంగా వారికి చెల్లించే వేతనాలతో పొల్చితే మూడు, నాలుగు రెట్లు ఉంటున్నాయి. ఈ మేరకు వేతనాల రిజిస్టర్లు సాధరణరోజుల్లో, అ«ధికారుల తనిఖీలకు సంబంధించి వేరువేరుగా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్ని మూడు నుంచి ఆర్నెల్లకోమారు మాత్రమే జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకుడిని ఇంక్రిమెంట్లు వస్తాయా..? వేతనాలు నెలనెలా ఇస్తారా..? అని అడిగితే ‘ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు.. వేతనాలు నెలనెలా ఇస్తే అదే మహాభాగ్యం అంటూ నిట్టూర్చాడు. రెమ్యూనరేషన్‌కూ ఎసరు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించినప్పుడు.. ఇంటర్నల్ ప్రయోగపరీక్షలు నిర్వహించినప్పుడు అధ్యాపకులకు కొంత రెమ్యూనరేషన్ వస్తుంది. ఈ మొత్తాన్నీ ఇవ్వకుండా యాజమాన్యాలే మింగేస్తున్నాయని చర్చ అధ్యాపకుల్లో జరుగుతోంది. మరోవైపు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సంతకాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఏళ్ల తరబడి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న ప్రముఖ కళాశాలలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. తనిఖీ అధికారులు పరీక్షల విభాగం జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ సమయానికి రావడం లేదన్న సాకుతో ఉద్యోగులకు నెలనెలా జీతాలివ్వడం లేదని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు –గోపాల్, లెక్చరర్ జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలల్లో జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో బతుకు బండి నడపడం చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యాలు జీతాలివ్వాలి. అలాగే ఇంటర్నల్, చివరి పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి. -
న్యూ ఇయర్లో పసిడి పరుగులు
సాక్షి, ముంబై: నూతన సంవత్సరంలో బంగారు ధరలు ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో బంగారం ధర రూ.30 వేల స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.50 లు ఎగిసి రూ. 30,450 కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 42 ఎగసి రూ. 29,165 వద్ద ఉంది.సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.42 శాతం పెరిగి 1,308 డాలర్లకు చేరుకుంది. స్థానిక నగల విక్రయదారుల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల ధోరణితో బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే నిన్న(సోమవారం) పాజిటివ్‌గా ఉన్న వెండి ధర నేడు క్షీణించింది. కిలో వెండి రూ. 390 పతనమై 39,710 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక యూనిట్లు, నాణెం తయారీదారుల డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తిరోగమనం దిశగా మళ్లాయి. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 50 రూ. 30,450 వద్ద, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 30,300గా నమోదైంది. సావరిన్ గోల్డ్ (ఎనిమిది గ్రాములు) ధర రూ. 24,700 గా ఉంది. మరోవైపు, వెండి రూ. 390 క్షీణించి రూ. కేజీకి 39,710. వారపు ఆధారిత డెలివరీ కిలో వెండి ధర రూ. 39,040 గా ఉంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో డాలర్ బలహీనపడడంతో బంగారం కొనుగోళ్లు పుంజకున్నాయి. ఉత్తర కొరియాతో తిరిగి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో డాలరు బలహీనపడింది. దీంతో సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన స్వర్గధామ పెట్టుబడులుగా భావించే బంగారం బలపడిదని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కన్సాలిడేషన్ బాటపట్టగా దేశీయ కరెన్సీ రూపాయి భారీగా లాభపడుతూ రెండున్నరేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఆదిలాబాద్@ 41
హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండంలలో 39 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రత రికార్డు అయింది. వచ్చే నాలుగు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
లాభాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఆర్ బీఐ రివ్యూ పాలసీ అంచనాలతో దలాల్ స్ట్రీట్ పాజిటివ్ గా స్పందిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 45 పాయింట్లు బలపడి 26438వద్ద, , నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 8162 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, మెటల్ రంగాలు లాభాల్లోనూ. ఫార్మా బలహీనంగాను కొనసాగుతున్నాయి. అంబుజా సిమెంట్ టాప్ గెయినర్ గా ఉంది. బీపీసీఎల్, హీరోమోటో, లుపిన్, అదానీ పోర్ట్స్, మారుతి, బాష్ లాభాల్లో, సన్ ఫార్మా , అరబిందో ఫార్మా, జీ, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాల్లోను ఉన్నాయి. మరోవైపు దేశీ సూచీల్లో ఎఫ్ఐఐలు అమ్మకాల జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. దాదాపు రూ. 162 కోట్ల మేర కొనుగోళ్లు నమోదయ్యాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి బాగా బలంగా కొనసాగుతోంది. ద్రవ్యపరపతి విధానం సమీక్ష అంచనాల నేపథ్యంలో 36పైసలు పైకి ఎగబాకింది. దీంతో రూ. 68 స్థాయి నుంచి ఎగిసి 67.86 వద్ద కొనసాగుతోంది. -
పసిడి ధర పెరుగుతోంది కానీ...
న్యూఢిల్లీ : వరుసగా రెండో రోజూ పసిడి పరుగులు పెడుతోంది. 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.175లు ఎగిసి రూ.31,525గా నమోదవుతోంది.అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో పాటు, దేశీయ మార్కెట్లో ఆభరణాల వ్యాపారులు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేపడుతుండటంతో ఈ ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మరో విలువైన మెటల్ వెండి ధరలు మాత్రం పడిపోతున్నాయి. కేజీ వెండి ధర 50 రూపాయలు కిందకి దిగజారి రూ.45,500గా నమోదవుతోంది. పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీ దారుల నుంచి కొనుగోలు మద్దతు లేకపోవడంతో వెండి ధరలు కిందకి దిగివస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం పెరుగుతుందనే వార్తలు రావడంతో బులియన్ మార్కెట్లో సెంటిమెంట్ బలపడిందని ట్రేడర్స్ వెల్లడిస్తున్నారు. డ్యుయిస్ బ్యాంకు ఫైనాన్స్ ఈక్విటీల్లో ఆందోళనలు పెరగడంతో, బంగారాన్ని సురక్షితమైన సాధనంగా భావించి పెట్టుబడుల జోరు పెంచుతున్నారు. సింగపూర్‌లో బంగారం ధర 0.4 శాతం పెరిగి ఒక ఔన్స్‌కు 1,325.45 డాలర్లుగా నమోదవుతోంది. అదేవిధంగా దేశీయ మార్కెట్లో కూడా ఆభరణాల వ్యాపారులు కొనుగోలు పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధరలు రూ.175లు ఎగిసి రూ.31,525, రూ.31,375గా నమోదవుతున్నాయి.