hiroshima
-
జేమ్స్ కామెరూన్ లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అమెరికన్ ప్రముఖ రచయిత చార్లెస్ ఆర్. పెల్లెగ్రినో రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’ బుక్ హక్కులను సొంతం చేసుకున్నారు జేమ్స్ కామెరూన్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులతో దాడి చేసింది. ఆ సమయంలో ్రపాణాలతో బతికి బయటపడ్డ జపాన్ ఇంజనీర్ సుటోము యమగుచి జీవితం ఆధారంగా ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమా తెరకెక్కనుందని హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. చార్లెస్ రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’, ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’... ఈ రెండు బుక్స్‌ని కలిపి సినిమా తీయనున్నారట జేమ్స్ కామెరూన్. ప్రస్తుతం ‘అవతార్’ ఫ్రాంచైజీతో జేమ్స్ కామెరూన్ బిజీగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్ (2019), అవతార్: ద వే ఆఫ్ వాటర్’ (2022) చిత్రాలు విడుదల అయ్యాయి. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (అవతార్ 3) చిత్రం 2025లో రిలీజ్ కానుంది. ఇంకా ‘అవతార్ 4, అవతార్ 5’ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి... ‘అవతార్’ ఫ్రాంచైజీని పక్కన పెట్టి జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ చేస్తారా? లేదా అనే అంశంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ‘అవతార్’ ఫ్రాంచైజీలకన్నా ముందే ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళితే 1997లో వచ్చిన ‘టైటానిక్’ తర్వాత జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించే నాన్ అవతార్ ఫిల్మ్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’నే అవుతుంది. -
చరిత్రలో మాయని మచ్చలు..
జపాన్‌లోని హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6న, నాగసాకిపై ఆగస్టు 9న అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా పౌరులను బలి తీసు కున్నాయి. ఇవి చరిత్రలో మాయని మచ్చలు, అతిపెద్ద దుస్సంఘటనలు. అయినా దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఒక్క క్షణంలో ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుధాలను పోగేస్తూనే ఉన్నాయి.‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (సిప్రి) 2024 నివేదిక, అమెరికా వద్ద 5,044 అణ్వా యుధాలు ఉన్నట్టు తెలిపింది. అదే నివేదిక ప్రకారం, రష్యా దగ్గర 5,580, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, బ్రిటన్ దగ్గర 225, భారత్ దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కూడా అణుసంపత్తిని కలిగి ఉన్నాయి. పైగా ఈ దేశాలన్నీ తమ అణ్వాయుధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చైనా దగ్గర గతేడాది 410 ఉండగా, ఇప్పుడది 500కు చేరింది. యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, రాజకీయ దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో అణ్వస్త్రాల పాత్ర ప్రముఖంగా మారిందని ‘సిప్రి’ రిపోర్ట్ పేర్కొన్నది.అణ్వాయుధాలతో పాటు ఆయుధాలు కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేవే. ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. భారత్ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా కొనసాగుతున్నది. భారత దిగుమతులలో రష్యా వాటా 36 శాతం. ఆయుధాల దిగుమతుల్లో మొదటి ఐదు స్థానాల్లో ఇండియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్ ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్–పాలస్తీనా యుద్ధాలు కొనసాగుతున్న వేళ అణ్వాయుధాల భయం మళ్లీ పెరిగింది. ఆయా దేశాలు రక్షణ పేరుతో ఆయుధాలు పెంచుకుంటూ పోవడం ఆయుధ పోటీకి దారి తీస్తున్నది. – నర్సింగు కోటయ్య, మిర్యాలగూడ -
‘శవాలదిబ్బ’ : ఆ మారణహోమానికి 79 ఏళ్లు
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి (ఆగష్టు 6, 2024) 79 ఏళ్లు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం. జపాన్‌లో 1945 ఆగస్ట్‌లో జరిగిన అణు బాంబు పేలుళ్లతో హిరోషిమాలో లక్షా 40వేల మంది, నాగసాకిలో 74వేల మందిని బలి తీసుకున్న ఉదంతం. ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడిగా పేరొందిన ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్ట్ 14న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిరోషిమా డే సందర్భంగాఈ ఘటనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సంగతులు..!1945 ఆగష్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు జారవిడిచింది. ఎనోలా గే అనే అమెరికన్ B-29 బాంబర్, జపాన్ నగరం హిరోషిమాపై "లిటిల్ బాయ్" అనే అణు బాంబును జారవిడిచింది. ఈ బాంబు పేలిన కాసేపట్లోనే 5 చ.కి.మీ. పరిధిలోని ప్రాంతం నాశనమైంది. 80 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 35 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు, రేడియన్ ప్రభావంతో వేలాదిమంది చనిపోయారు. మరో మూడు రోజులకు అంటే ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా మరో భారీ అణుబాంబుతో దాడి చేసింది. హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి. దీవుల సమాహారమైన జపాన్‌లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమాపై యురేనియం-235తో తయారు చేసిన “లిటిల్ బాయ్”, నాగసాకిపై ప్లూటోనియంతో తయారుచేసిప “ఫ్యాట్ మ్యాన్” అనే అత్యంత పవర్‌పుల్ బాంబును ప్రయోగించింది.‘ఎనోలా గే’ అనే విమానం బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది. ఈ దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు కాగా, తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయిందంటే ఈ విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా జపాన్‌లో ఐదు నగరాలను ఎంచుకుంది. కోకురా, హిరోషిమా, యోకోహామా, నీగాటా ,క్యోటో. ఈ దాడులకు యునైటెడ్ కింగ్డమ్ సమ్మతించింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురాతన రాజధాని పట్ల అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ స్టిమ్సన్కు ఉన్న అభిమానం కారణంగా క్యోటో తప్పించుకుంది. దానికి బదులుగా, నాగసాకి నగరం బలైంది. ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువులు ప్రభావంతో బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీం. అణ్వాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టిన మారణహోమం.ఇపుడు అణుయుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఉత్తర, దక్షిణ అమెరికా ఘర్షణలు మధ్య ఇపుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు? అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న. అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్నీ జాకబ్సెన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన 72 నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు.రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అణువిస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే. అణుయుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు. ఆకలితో అలమటించి. పోషకాహార లోపంతో కృంగి కృశించి ప్రాణాలొదులుతారు. -
‘హిరోషిమా’ కంటే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారీ: అమెరికా
వాషింగ్టన్: అటు ఏడాదిన్నర దాటినా ఆగని రష్యా–ఉక్రెయిన్ యుద్ధం. ఇటు తాజాగా పాలస్తీనా–హమాస్ పోరు. ఇంకోవైపు భయపెడుతున్న చైనా–తైవాన్ తదితర ఉద్రిక్తతలు. ఈ సమస్యలన్నీ చాలవన్నట్టు దేశాల మధ్య అణ్వాయుధ పోటీని మరింత పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. అత్యంత శక్తిమంతమైన సూపర్ అణు బాంబును తయారు చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. అది రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఏకంగా 24 రెట్లు శక్తిమంతంగా ఉండనుందని వెల్లడించింది. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు లెక్కలేనంత జన నష్టానికి దారితీయడం తెలిసిందే. ఆ విధ్వంసాన్ని తలచుకుని జపాన్ ఇప్పటికీ వణికిపోతుంటుంది. హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలో టన్నుల శక్తిని, నాగసాకిపై పడ్డ బాంబు 23 కిలో టన్నుల శక్తిని విడుదల చేశాయి. ఇప్పుడు తయారు చేయనున్న అణుబాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని వెలువరిస్తుందని చెబుతున్నారు. బి61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబును ఆధునీకరించి రూపొందిస్తున్న ఈ బాంబును బి61–13గా పిలుస్తున్నారు. దీని తయారీకి అమెరికా కాంగ్రెస్ అనుమతి లభించాల్సి ఉంది. అంతేగాక తమ అమ్ములపొదిలో ఉన్న అణ్వాయుధాలను 2030 కల్లా 1,000కి పెంచనున్నట్టు కూడా అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం? -
ఒపెన్హైమర్తో మన అనుబంధం
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు జారవిడిచి 78 ఏళ్లు అవుతోంది. ఆధునిక యుగంలో ఇంతటి విధ్వంసకరమైన ఘటన మరోటి చోటుచేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఘటనపై లెక్కలేనన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా ప్రదర్శితమవుతున్న ‘ఒపెన్ హైమర్’ చిత్రం కూడా ఈ కోవకు చెందినదే. మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా తయారైన అణుబాంబులు, వాటి సృష్టికర్త జె.రాబర్ట్ ఒపెన్ హైమర్ ఇతివృత్తంతో సాగుతుంది ఈ సినిమా. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. జర్మనీలో పుట్టి అమెరికాలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగిన ఒపెన్ హైమర్‌ను అణుబాంబు పితామహుడని కూడా అంటారు. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఉందని చెబుతున్న ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. దీన్ని 20వ శతాబ్దంలో ఆధునిక భౌతిక శాస్త్రం అభివృద్ధి నేపథ్యంలో చూడాలి. విశ్వం మొత్తానికి ఆధారమైన, మౌలికమైన కణాలపై అధ్య యనం సాగిన కాలం అది. అణు కేంద్రకం దాంట్లోని భాగాలను అర్థం చేసుకునే అణు భౌతికశాస్త్ర అభివృద్ధి కూడా ఈ కాలంలోనే వేగం పుంజుకుంది. అణుశక్తితోపాటు అణుబాంబుల తయారీకి దారితీసిన పరిశోధనలివి. ఈ కాలపు భారతీయ శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఈ అణు భౌతిక శాస్త్ర రంగంలో కృషి చేశారు. దేబేంద్ర మోహన్ బోస్ (ఇతడి విద్యార్థిని బిభా చౌధురి), మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్భాభా, దౌలత్సింగ్ కొఠారీ, పియారా సింగ్ గిల్ వంటి మహామహులు వారిలో కొందరు మాత్రమే. వీరు ఆధునిక భౌతికశాస్త్రంలో పేరెన్నికగన్న వూల్ఫ్‌గాంగ్ పౌలీ, నీల్స్ బోర్, లార్డ్ రూథర్‌ఫర్డ్, పాల్ డైరాక్, ఎన్రికో ఫెర్మీ, ఎర్నెస్ట్ ష్రోడింగర్, జేమ్స్ చాద్విక్, జాన్ కాక్‌క్రాఫ్ట్, హిడెకీ యుకవాలతో కలిసి పని చేయడం లేదా వారితో సంబంధబాంధవ్యాలను కలిగి ఉండటం కద్దు. భాభాతో సంబంధం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ వికిరణాలపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే హోమీ భాభాకు ఒపెన్ హైమర్ (కేంబ్రిడ్జ్‌లో సీనియర్. తరువాతి కాలంలో బెర్క్లీలో పనిచేశారు) గురించి ఒక అవగాహన ఉండింది. 1936లో భాభా, వాల్టర్ హైట్లర్ ఉమ్మడిగా ఖగోళ వికిరణ జల్లు (కాస్మిక్ రే షవర్స్) సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, ఒపెన్ హైమర్ ఓ ఏడాది తరువాత దాదాపుగా అలాంటిదే స్వతంత్రంగా ప్రతిపాదించారు. అప్పట్లో భాభాకు పాశ్చాత్యదేశాల్లోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉండేవి. ఒకానొక దశలో 1940లో తనను ఒపెన్ హైమర్‌కు పరిచయం చేయాల్సిందిగా భాభా తన మిత్రుడు పౌలీని కోరారు. ఇద్దరూ కలిసి బెర్క్లీలో పరిశోధనలు చేయాలన్నది ఉద్దేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భాభా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. భౌతికశాస్త్ర మౌలికాంశాలపై పరిశోధనలు చేసేందుకు ఓ సంస్థను స్థాపించే అవకాశమూ అప్పుడే లభించింది. తరువాతి కాలంలో భాభాకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కలిసి భారతీయ అణుశక్తి కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేసే అవకాశమూ దక్కింది. అణు రియాక్టర్ నిర్మాణానికి, యురేనియం శుద్ధికి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని భాభా తనకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నసంబంధాల ద్వారానే సంపాదించగలిగారు. ప్రిన్స్టన్ , కావెండిష్ వంటి ప్రసిద్ధ సంస్థల తరహాలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) స్థాపనకూ బాబా అంతర్జాతీయ సహ కారం అందేలా రూఢి చేసుకున్నారు. అయితే 1945లో హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు పడిన తరువాత రాబర్ట్ ఒపెన్ హైమర్ వివాదాస్పద వ్యక్తి అయ్యారు. అయినా టీఐఎఫ్ఆర్లో పరిశోధకుల బృందాన్ని తయారు చేసే విషయంలో భాభా ఆయన సాయం తీసుకున్నారు. ఒపెన్ హైమర్ విద్యార్థి, ఆయనతో కలిసి మన్హాటన్ ప్రాజెక్టులో పనిచేసిన బెర్నార్డ్ పీటర్స్‌కు ఉద్యోగమిచ్చారు. అప్పట్లో ప్రిన్స్టన్లో పనిచేస్తున్న ఒపెన్ హైమర్ సోదరుడు ఫ్రాంక్ ఒపెన్ హైమర్కూ ఉద్యోగం ఆఫర్ చేశారు భాభా. రాబర్ట్‌ను సంప్రదించిన తరువాతే ఫ్రాంక్‌కు ఉద్యోగం ఇవ్వజూపినట్లు చరిత్రకారులు చెబు తారు. ఈ అణుశక్తి కార్యక్రమ ఏర్పాటుకు ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత ఫ్రెడెరిక్ జోలియోట్ క్యూరీ సలహాలు కూడా నెహ్రూ స్వీకరించారు. పరోక్ష ప్రేరణ ఒపెన్ హైమర్‌పై విమర్శలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో భాభా చేసిన కొన్ని నియామకాలపై నిరసన వ్యక్తమైంది. ఒపెన్ హైమర్‌కు కమ్యూనిస్టులతో ఉన్న గత సంబంధాలపై కూడా వివాదాలు తలె త్తాయి. ఒపెన్ హైమర్ కూడా తన మాజీ విద్యార్థి పీటర్స్‌ను కమ్యూ నిస్టు సానుభూతిపరుడిగా అభివర్ణించారు. దీంతో పీటర్స్ భారత్‌కు రావడం కష్టమైంది. ఎలాగోలా వచ్చిన తరువాత టీఐఎఫ్ ఆర్‌లో అతడిపై ఇంకోసారి దుమారం రేకెత్తింది. ఇంకోవైపు ఫ్రాంక్ ఒపెన్ హైమర్ కూడా అమెరికా ప్రభుత్వం పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరిం చడంతో భారత్‌కు రాలేకపోయారు. అయితే అమెరికాలో రాబర్ట్ ఒపెన్ హైమర్ మాత్రం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ (ఐఏఎస్) డైరెక్టర్‌గా కొనసాగుతూ భారతీయ శాస్త్రవేత్తలు చాలామందికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో యువ భౌతిక శాస్త్రవేత్తగా ఉన్న అల్లాడి రామకృష్ణన్ కు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఏడాది స్కాలర్షిప్ మంజూరు చేయడం మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.అల్లాడి భారత్‌కు తిరిగి వచ్చాక ఐఏఎస్ లాంటి సంస్థను స్థాపించాలని ఆశించారు. ఈ ఆలోచనే తరువాతి కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌గా 1962లో మద్రాస్‌లో ఆవిష్కృతమైంది. భారత్‌కు తరచూ... ఆ కాలంలో స్వల్పకాలిక పర్యటనపై భారత్‌కు విచ్చేసే విదేశీ శాస్త్రవేత్తల్లో ఒపెన్ హైమర్ పేరు తరచూ వినిపించేది. పీసీ మహాల నోబిస్ ఆలోచనల రూపమైన ‘షార్ట్ విజిట్స్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్’లో భాగంగా ఒపెన్ హైమర్‌తో పాటు నీల్స్ బోర్, నార్బెర్ట్ వీనర్, పీఎంఎస్ బ్లాకెట్, జోసెఫ్ నీధమ్, జేబీఎస్ హాల్డేన్ లాంటి మహామహులు భారత్‌కు వచ్చిపోయేవారు. వీరికి పంపే ఆహ్వాన పత్రికలపై నెహ్రూ స్వయంగా సంతకాలు చేసేవారు. ఇందులో చాలామంది నెహ్రూకు తెలుసు. 1945 అనంతర ఒపెన్ హైమర్ నైతిక దృక్కోణాన్ని నెహ్రూ బహిరంగంగా ప్రశంసించారు. 1959లో భారత జాతీయ సైన్్స కాంగ్రెస్ సమావేశాల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, ఒపెన్ హైమర్ భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందారని ఉల్లేఖించారు. పరి శోధనలు, ఆవిష్కరణలకు కూడా సామాజిక విపరిణామాలు ఉంటా యన్న విషయాన్ని పెద్ద శాస్త్రవేత్తలు గుర్తించేందుకు ఇది ఉపయోగ పడాలన్నారు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగంతో రెండో ప్రపంచ యుద్ధం నాటకీయంగా ముగిసింది. ఈ ఘటన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య అణ్వాయుధ పోటీకి దారితీసింది. అదే సమయంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. వలసవాద శకం ముగిసిన తరువాత అణుశక్తిని శాంతియుత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకోవడమన్న అంశం భారత్ లాంటి దేశాలకు ప్రధాన పరిశోధన ఇతివృత్తమైంది. ఈ నవతరం సైన్స్ ను అభివృద్ధి చేయడం భారత్‌కు ప్రథమ కర్తవ్యమైంది. అణుశక్తిని విద్యుదుత్పత్తికి ఉపయోగించుకుంటామని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే 1964లో చైనా అణుబాంబును పరీక్షించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదేళ్ల తరువాత భారత్ కూడా పోఖ్రాన్–1తో అణ్వస్త్ర దేశాల జాబితాలో చేరిపోయింది. కానీ భగవద్గీతకు నెలవైన భారత్ అణు మార్గం పట్టడాన్ని ఒపెన్ హైమర్ మాత్రం చూడలేకపోయారు! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
హిరోషిమాలో నిష్ఠుర నిజాలు
జపాన్‌లోని హిరోషిమా వేదికగా మూడు రోజులు సాగిన జీ7 దేశాల సదస్సు రష్యాపై మరిన్ని ఆంక్షలు, చైనాపై ఘాటు విమర్శలు, ఉక్రెయిన్ అధినేత ఆశ్చర్యకర సందర్శనతో ఆదివారం ముగిసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో కూడిన ‘జీ7’లో భాగం కానప్పటికీ, ఈ 49వ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్న భారతదేశం ప్రాధాన్యం ఈ వేదిక సాక్షిగా మరోసారి వెల్లడైంది. భారత ప్రధానికి అమెరికా, ఆస్ట్రేలియా అధినేతల ప్రశంసల నుంచి పాపువా న్యూ గినియా ప్రధాని చేసిన పాదాభివందనం దాకా అనేకం అందుకు నిదర్శనాలు. రష్యా దాడి నేపథ్యంలో యుద్ధబాధిత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ఆయన సంక్షోభ పరిష్కారానికి వ్యక్తిగతంగానూ చొరవ చూపుతానడం పెద్ద వార్త. అంతటితో ఆగక ఆ మర్నాడే ఐరాసపై విమర్శల బాణం ఎక్కుపెట్టి, పరిస్థితులకు తగ్గట్టుగా సంస్కరణలు చేయకుంటే ఐరాస, భద్రతా మండలి కేవలం కబుర్లకే పరిమితమైన వేదికలుగా మిగిలిపోతాయనడం సంచలనమైంది. నిష్ఠురమైనా భారత ప్రధాని వ్యాఖ్యలు నిజమే. మూడేళ్ళక్రితం తూర్పు లద్దాఖ్ వెంట భారత్‌తో చైనా ఘర్షణ మొదలు తాజా ఉక్రెయిన్ సంక్షోభం దాకా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సమస్యల్ని చర్చించి, ఘర్షణల్ని నివారించాల్సిన ఐరాస ఆ పని చేయలేక ఇటీవల నామమాత్రంగా మారిన సంగతి చూస్తు న్నదే. సమస్యల్ని ఐరాసలో కాక, ఇతర వేదికలపై చర్చించాల్సి రావడం వర్తమాన విషాదం. అదే సమయంలో అంతర్జాతీయ చట్టం, ఐరాస నియమావళి, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వ భౌమాధికారాన్ని ప్రపంచ దేశాలన్నీ గౌరవించి తీరాలంటూ జీ7 వేదికగా భారత ప్రధాని కుండ బద్దలు కొట్టారు. కాదని ఏకపక్షంగా వాస్తవస్థితిని మార్చే ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి అన్న మోదీ వ్యాఖ్యలు పరోక్షంగా చైనాను ఉద్దేశించినవే. భద్రతా మండలిలో భారత సభ్యత్వానికి జరుగుతున్న సుదీర్ఘ కాలయాపన కూడా మోదీ మాటలకు ఉత్ప్రేరకమైంది. గమ్మత్తేమిటంటే, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం 1945 నాటి ప్రపంచ దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్న భద్రతామండలిని వర్తమాన కాలమాన పరిస్థితులకు తగ్గట్టు సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని మీడియా ఎదుట అంగీకరించడం. ఇక, సాధారణ అలవాటుకు భిన్నంగా ఒక రోజు ముందు శనివారమే వెలువడ్డ జీ7 విధాన ప్రకటన డజన్ల కొద్దీ పేజీలున్నా – అందులో ప్రధానంగా చైనాపై విసిరిన బాణాలే ఎక్కువ. కనీసం 20 సార్లు చైనా నామ స్మరణ సాగింది. తైవాన్, అణ్వస్త్రాలు, ఆర్థిక నిర్బంధం, మానవహక్కులకు విఘాతం, అమెరికా సహా పలు దేశాలతో బీజింగ్‌కు ఉన్న ఉద్రిక్తతలు ప్రకటనలో కనిపించాయి. సహజంగానే డ్రాగన్ ఈ ప్రకటనను ఖండించింది. ఇదంతా ‘పాశ్చాత్య ప్రపంచం అల్లుతున్న చైనా వ్యతిరేక వల’ అని తేల్చే సింది. రష్యా సైతం ఈ సదస్సు తమపైనా, చైనాపైనా విద్వేషాన్ని పెంచి పోషించే ప్రయత్నమంది. యాభై ఏళ్ళ క్రితం ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఏడు పారిశ్రామిక శక్తుల బృందమైన ‘జీ7’ దేశాలు ప్రపంచ సంపదలో దాదాపు 70 శాతానికి ప్రాతినిధ్యం వహించాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా 44 శాతమే. నిజానికి, 2007–08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ‘జీ20’ కూటమి ఏర్పాటయ్యాక అంతర్జాతీయ ఆర్థిక మేనేజర్‌గా ‘జీ7’ వెలుగు తగ్గింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అగ్రశ్రేణిలో నిలిచిన ఈ దేశాలు ఇప్పటికీ తామే ప్రపంచ విధాన నిర్ణేతలమని చూపాలనుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఆ ఆలోచన, ఆకాంక్ష అత్యవసర మయ్యాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని సమర్థించే శక్తులన్నీ ఒక్కచోట చేరి ఈ సదస్సును వినియోగించుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి అంతర్జాతీయ సమాజ విధివిధానాలకే సవాలని జపాన్ ప్రధాని పదే పదే పేర్కొన్నది అందుకే! స్వదేశంలోని రాజకీయ అంశాలతో తన పర్యటనలో రెండో భాగాన్ని రద్దు చేసుకున్నా ‘జీ7’కు మాత్రం అమెరికా అధ్యక్షుడు హాజరైందీ అందుకే! అదే సమయంలో 2.66 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో, తమ సభ్యదేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, కెనడాల కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను అనేకానేక కారణాల వల్ల జీ7 విస్మరించే పరిస్థితి లేదు. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, సరఫరా వ్యవస్థల్లో చిక్కులతో అనేక పాశ్చాత్య దేశాలు చిక్కుల్లో పడ్డాయి. అటు రష్యాతో, ఇటు పాశ్చాత్య ప్రపంచంతో సంబంధాల్లో సమతూకం పాటిస్తుండడం భారత్‌కు కలిసొస్తోంది. భవిష్యత్తులో చర్చలు, దౌత్యంతో యుద్ధం ఆగాలంటే – ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్ మధ్యవర్తిత్వం కీలకం. కిందపడ్డా తనదే పైచేయిగా ఉండేలా ‘జీ7’కు భారత్ ఆ రకంగా అవసరమే. భారత్ సైతం ఒకపక్కన చైనా దూకుడును పరోక్షంగా నిరసిస్తూనే, రష్యా సాగిస్తున్న యుద్ధంపై తటస్థంగా ఉంటూ శాంతి ప్రవచనాలు చేయక తప్పని పరిస్థితి. భారత ప్రధాని అన్నట్టు చర్చలే అన్ని సమస్యలకూ పరిష్కారం. సమస్యను రాజకీయ, ఆర్థిక కోణంలో కాక మానవీయ కోణంలో చూడా లన్న హితవు చెవికెక్కించుకోదగ్గదే. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిలో వెనకబడ్డ దక్షిణార్ధగోళ దేశాలకు భారత్ గొంతుక కావడమూ బాగుంది. ప్రపంచ అధికార క్రమంలో గణనీయ మార్పుల నేపథ్యంలో ఇలాంటి శిఖరాగ్ర సదస్సులు, సమాలోచనలు జరగడం ఒకరకంగా మంచిదే. సమస్యల్ని ఏకరవు పెట్టడం సరే కానీ, సత్వర పరిష్కారాలపై జీ7 దృష్టి నిలిపిందా అంటే సందేహమే! -
G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే
హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు. మీకు మహా డిమాండ్! మోదీతో బైడెన్, ఆల్బనీస్ వ్యాఖ్యలు మీ ఆటోగ్రాఫ్ అడగాలేమో: బైడెన్ జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ను మోదీ, ఆల్బనీస్ ప్రారంభించడం తెలిసిందే. -
జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!
జపాన్‌లోని హిరోషిమాలో జీ 7 సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆటోగ్రాఫ్ అడిగారు. ఈ మేరకు ఆ సదస్సులో జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన విషయంలో తాము ఎదుర్కొంటున్న విచిత్రమైన సవాళ్లను పంచుకున్నారు. జూన్ నెలలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ విషయం గురించి బైడెన్ ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని మోదీ కార్యక్రమాలకు హాజరుకావడానికి పౌరుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న అభ్యర్థనల వరద తమకు ఎలా సవాలుగా మారిందో వివరించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియ ప్రధాని అల్బనీస్ విజయోత్సవ ల్యాప్‌లో దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు ప్రధాని మోదీకి ఎలా స్వాగతం పలికారో గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు ఆయన మోదీతో మాట్లాడుతూ సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్ కెపాసిటీ 20 వేల మందికి సరిపడేదని, అయినా ఇప్పటికీ అందుత్ను రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయలేకపోతున్నానని అన్నారు. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాధరణ గురించి అల్బనీస్ సంభాస్తుండగా.. మధ్యలో బైడెన్ జోక్యం చేసుకుంటూ.. ‘నాకు మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో సుమారు 22 దేశాలకు చెందిన ప్రతినిధుల పాల్గొన్నారు. (చదవండి: క్లీనర్ సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..) -
G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ
హిరోషిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమం నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎరువుల వనరులను చెరపడుతున్న విస్తరణవాద ధోరణికి చెక్ పెట్టాలన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రజాస్వామ్యీకరణ చేయాలి. ఇలాంటి చర్యలు అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి మధ్య వారధిగా ఉంటాయి’ అని అన్నారు. పాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సులో మోదీ మాట్లాడారు. సహజ వనరులను సమగ్రంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా అభివృద్ధి నమూనాను మార్చాలని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లతో కూడిన జీ–7 కూటమి సదస్సు ఈసారి జపాన్‌లో జరుగుతోంది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల అధినేతలను సదస్సుకు జపాన్ ఆహ్వానించింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో ఆహార భద్రతపైనే అత్యధికంగా దృష్టిసారించారు. ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృథాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు. సదస్సులో జరుగుతున్న చర్చలు జీ–20, జీ–7 కూటముల మధ్య కీలకమైన అనుసంధానంగా మారతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలి’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని పదేపదే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మోదీకి బైడెన్ ఆత్మీయ ఆలింగనం జీ–7 సదస్సులో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆయన్ను చూసి మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. నేతలిరువురూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించారు. అణు విలయపు నేలపై శాంతిమూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో భస్మీపటలమై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి, అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటారని తెలిసి సంబరపడ్డారు. హిరోషిమా పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని గుర్తు చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కృషి: మోదీ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. జీ–7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభానికి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొంటానని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటిపై పలు రకాలుగా ప్రభావం చూపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని రాజకీయ, ఆర్థిక అంశంగా చూడడం లేదు. మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం. యుద్ధంతో పడే బాధలు మాకంటే మీకే బాగా తెలుసు. ఈ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో పాటు వ్యక్తిగతంగా నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. తాను రూపొందించిన సమగ్ర శాంతి ఫార్ములాలో భారత్ కూడా భాగస్వామి కావాలని జెలెన్స్కీ కోరారు. -
ఇది ప్రపంచానికే పెద్ద సమస్య: ప్రధాని మోదీ
హిరోషిమా: ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం.. కేవలం ఆ దేశ సమస్య కాదని, ఇది యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ7 సదస్సు కోసం హిరోషిమా(జపాన్) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని కలిశారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య. ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. దీనిని నేను ఓ రాజకీయ లేదంటే ఆర్థిక సమస్యగా పరిగణించను. నా దృష్టిలో ఇది మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలేంటో మా అందరికంటే మీకే బాగా తెలుసు. గత సంవత్సరం మా పిల్లలు(భారతీయ విద్యార్థులను ఉద్దేశించి..) ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు.. మీ పౌరుల ఆవేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి భారతదేశం, వ్యక్తిగతంగా నేనూ.. మా సామర్థ్యం మేరకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అని ప్రధాని మోదీ, జెలన్స్కీకి హామీ ఇచ్చారు. #WATCH | Japan: Prime Minister Narendra Modi meets Ukrainian President Volodymyr Zelensky in Hiroshima, for the first time since the Russia-Ukraine conflict, says, "Ukraine war is a big issue in the world. I don't consider it to be just an issue of economy, politics, for me, it… pic.twitter.com/SYCGWwhZcb — ANI (@ANI) May 20, 2023 జీ 7 శిఖరాగ్ర సదస్సు కోసం.. జపాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలు హిరోషిమా నగరానికి వెళ్లారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఇరువురు నేతలు వర్చువల్‌గా, ఫోన్లో సంభాషించుకున్నారు. అయితే నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధం ఆగుతుందని, శాంతి నెలకొంటుందని ప్రధాని మోదీ మరోసారి జెలెన్స్కీ వద్ద ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్ ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ గతంలోనే ప్రకటించారు. -
రష్యాకు శిక్ష తప్పదు.. ఆ దేశంపై ఇక మరిన్ని ఆంక్షలు
హిరోషిమా/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో మారణకాండ సాగిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు శిక్ష తప్పదని జి–7 దేశాల అధినేతలు హెచ్చరించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జి–7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కూటమి దేశాల అధినేతలు శుక్రవారం జపాన్‌లోని హిరోషిమాకు చేరుకున్నారు. అనంతరం సమాశమై, తాజా అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా చట్ట విరుద్ధమైన, న్యాయ విరుద్ధమైన యుద్ధం సాగిస్తోందని మండిపడ్డారు. రష్యాకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకు సాగాలని జి–7 దేశాల నేతలు ప్రతిన బూనారు. రష్యా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని రష్యానే ముగించాలని అన్నారు. హిరోషిమాలోని శాంతి పార్కును వారు సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడిలో దెబ్బతిన్న డోమ్ వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి, అమర వీరులకు నివాళులర్పించారు. జి–7 శిఖరాగ్ర సదస్సుకు గుర్తుగా చెర్రీ మొక్కను నాటారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజీలేదు: మోదీ సార్వభౌమత్వం, గౌరవాన్ని కాపాడుకొనే విషయంలో భారతదేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారత్–చైనా సంబంధాలు మెరుగుపడడం అనేది కేవలం ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. శుక్రవారం జపాన్ వార్తా సంస్థ ‘నిక్కీ ఆసియా’ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. పొరుగు దేశాలతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగడం తప్పనిసరి అని చెప్పారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకోవడానికి, చట్టబద్ద పాలనకు, వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనడానికి తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని వివరించారు. 2014లో ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో సాధారణ, ఇరుగుపొరుగు సంబంధాలను నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు నిక్కీ ఆసియా వెల్లడించింది. చదవండి: ఎలిజబెత్ అంత్యక్రియలకు రూ.1,655 కోట్లు హిరోషిలో మోదీ జి–7, క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొనడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జపాన్ సీనియర్ అధికారులు, భారత రాయబార కార్యాలయం అధికారులు స్వాగతం పలికారు. హిరోషిమాలో ల్యాండ్ అయ్యానంటూ మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఈ నెల 21 దాకా హిరోషిమాలో పర్యటిస్తారు. జి–7 సదస్సుతోపాటు వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. జపాన్ పర్యటనకు బయలుదేరేముందు ఢిల్లీలో మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘జి–20 కూటమికి ఈ ఏడాది భారత్ సారథ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో హిరోషిమాలో జి–7 దేశాల అధినేతలతో సమావేశమై, చర్చించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ప్రపంచ సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించబోతున్నాం’’ అన్నారు. సదస్సులో పాల్గొననున్న జెలెన్స్కీ జి–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొనబోతున్నారు. ఆయన ఆదివారం సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్ నిర్ధారించారు. తమ దేశంలో నెలకొన్న అస్థిరతను పరిష్కరించడానికి తమ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారని, ఎవరినైనా కలుస్తారని చెప్పారు. -
చిన్నారిని వీపుకి తగిలించుకున్న బాలుడెవరో తెలుసా!
చిన్నారిని వీపుకి తగిలించుకుని నుడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక బాలుడు. అతన్ని చూసిన ఒక సైనికుడు ఆ చిన్నారిని కిందకి దించి వెళ్లిపో అన్నాడు. ఐతే ఆ బాలుడు చెప్పిన మాటలు ప్రపంచ గతిని మార్చే చక్కటి సందేశం ఇచ్చాడు. ఇంతకీ ఆ బాలుడెవరు ఏంటా కథ! వివరాల్లోకెళ్తే... ఒక చిన్నారిని వీపుకి తగిలించుకుంటూ వెళ్తున్న బాలుడి చిత్రాన్ని డిసెంబర్ 30 2017న వాటికన్ప్రెస్ తర పత్రికలో ప్రచురించింది. ఇది నాగసాకిపై అణుదాడి తర్వాత జరిగిన పరిణామాల ఫోటోలలో ఒకటి ఇది. జపాన్ యుద్ధ సమయంలో దాదాపు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని ఖననం చేసేందుకు వీపుకి తగలించుకుని వెళ్తున్నాడు. అప్పుడూ అక్కడే ఉన్న ఒక సైనికుడు ఆ చిన్నారి చనిపోయాడు కాబట్టి ఇక్కడ వదిలి వెళ్లిపోమని సలహ ఇచ్చాడు. ఆ బాలుడు ఆ చిన్నారిని మోసుకుని వెళ్లలేక నీరసించిపోతాడని అలా చెబుతాడు సైనికుడు. కానీ ఆ చిన్నారి తన తమ్ముడని, ఇది తనకు బరువు కాదని చెబుతాడు. పడిపోతే సాయం చేయండి, ఎత్తండి, తప్పు చేస్తే క్షమించండి అని ఏడుస్తూ చెబుతాడు. ఐనా ఆ చిన్నారి బరువుగా ఉండడు కాబట్టి మీ భుజాలపైకి తీసుకుని సాయం చేయండి అని అర్థిస్తాడు. ఆ బాలుడి మాటలకు సైనికుడి కళ్లలో నీళ్లుతిరుగతాయి. అప్పటి నుంచి ఈ చిత్రం జపాన్‌లో ఐక్యతకు చిహ్నంగా మారింది. ఈ చిత్రాన్ని యూఎస్‌కి చెందిన మెరైన్ కార్ప్స్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రోజర్ ఓడొనెల్ తన కెమారాలో బంధించారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణు బాంబు దాడుల తర్వాత దృశ్యాలను డాక్యుమెంట్ చేసే బాధ్యతను ఓడొనెల్కు అప్పగించడంతో ఆయన ఈ చిత్రాన్ని తీశారు. ఆ ఫోటో వెనుక పోప్ ఫ్రాన్సిస్ 'ది ఫ్రూట్ ఆఫ్ వార్' అని రాసి సంతకం చేశారు. నాటి విషాధ ఘటన ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిదనడంలో సందేహం లేదు. (చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు) -
వామ్మో.. వందల అణు బాంబుల ఎఫెక్ట్‌తో బద్ధలైందా?
హుంగా టోంగా-హుంగా హాపై.. పదిరోజుల క్రితం దాకా పసిఫిక్ మహాసముద్రంలోని జనావాసరహిత దీవిగా ఉండేది. మరి ఇప్పుడో?.. ఏకంగా మ్యాప్ నుంచే కనుమరుగు అయిపోయింది. కారణం.. ఆ దీవిలోని అగ్నిపర్వతం భారీ శబ్ధాలతో బద్ధలైపోవడమే!. జనవరి 15వ తేదీన చిన్న దీవి దేశం టోంగాకు దగ్గర్లో ఉన్న ‘హుంగా టోంగా-హుంగా హాపై’ అగ్నిపర్వత దీవి.. మహాసముద్రం అడుగులోని అగ్నిపర్వతం బద్ధలుకావడంతో పూర్తిగా నాశనమైంది. ఆ ప్రభావం ఎంతగా ఉందంటే.. సముద్రం ముందుకు వచ్చి పెద్ద పెద్ద అలలతో సునామీ విరుచుకుపడింది. టోంగా రాజధాని నుకువాలోఫాపై దట్టమైన మందంతో విషపూరితమైన బూడిద అలుముకుంది. తాగే నీరు కలుషితం అయ్యింది. పంటలు దెబ్బతిన్నాయి. రెండు గ్రామాలు ఏకంగా జాడ లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోయాయి!. ఈ ప్రకృతి విలయంపై నాసా సైంటిస్టులు ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. టోంగా అగ్నిపర్వతం బద్ధలైన ఘటన.. వంద హిరోషిమా అణు బాంబు ఘటనలకు సమానమని నాసా పేర్కొంది. ఐదు నుంచి ముప్ఫై మెగాటన్నుల టీఎన్టీ(ఐదు నుంచి 30 మిలియన్ టన్నుల) పేలితే ఎలా ఉంటుందో.. అంత శక్తితో ఆ అగ్నిపర్వతం పేలింది. అందుకే అగ్ని పర్వత శకలాలు 40 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడ్డాయి అని నాసా సైంటిస్టుల జిమ్ గార్విన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే 1945, ఆగష్టులో హిరోషిమా(జపాన్) పడిన ఆటం బాంబు 15 కిలోటన్నుల(15 వేల టన్నుల) టీఎన్టీ డ్యామేజ్ చేసింది. కేవలం ఒక్క నగరాన్ని మాత్రమే నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అగ్నిపర్వతం ధాటికి సముద్రం కదిలి.. ఎక్కడో వేల కిలోమీరట్ల దూరంలోని తీరాల దగ్గర ప్రభావం చూపెట్టింది. ఇక టోంగాలో సునామీ ధాటికి ప్రాణ నష్టం పెద్దగా సంభవించకపోయినా!(స్పష్టత రావాల్సి ఉంది).. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. జపాన్, న్యూజిలాండ్‌తోపాటు పసిఫిక్ తీరంలోని చాలా దేశాలు సునామీ అలర్ట్ జారీ చేసి.. 48 గంటల పరిశీలన తర్వాత విరమించుకున్నాయి. సంబంధిత వార్త: సునామీకి ఎదురీగిన తాత.. అందుకే ప్రపంచం జేజేలు -
మరొక ‘హిరోషిమా’ వద్దే వద్దు
హిరోషిమా నగరంపై అమెరికన్లు అణుబాంబు వేసిన రోజు 1945 ఆగస్టు 6. అది ప్రపంచ మానవ చరిత్రలో కారుచీకటి రోజు. ఘటన జరిగి ఆగస్టు 6వ తేదీనాటికి సరిగ్గా 76 ఏళ్లయింది. బాంబు వేసిన వెంటనే 70 వేలమంది చనిపోగా తర్వాత రోజుల్లో ధార్మికకిరణాల దుష్ప్రభావంతో 2 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. 4,400 కిలోల ఈ అణ్వస్త్రం ‘లిటిల్‌బోయ్’లో 64 కిలోల యురేనియం వాడారు. ఆగస్టు 9న ‘ఫ్యాట్‌బోయ్’ను నాగసాకిలో ప్రయోగిం చారు. అక్కడికక్కడే 80 వేల వరకు సామాన్యులు చని పోయారు. 6.2 కిలోల ఫ్లుటోనియంతో ఈ బాంబును ప్రయోగించారు. ఆగస్టు 12న జపాన్ లొంగిపోయినట్లుగా ప్రకటించింది. యుద్ధానంతరం 1945 జూలై 17న విధివిధానాలు నిర్ణయించడానికి సోవియట్ యూనియన్, అమెరికా, ఇంగ్లండ్ అధినేతలు స్టాలిన్, ట్రూమెన్, చర్చిల్లు జర్మనీ పోట్స్‌డామ్‌లో సమావేశమై ఆగస్టు 2 వరకూ చర్చలు జరిపారు. జూలై 28న ఇంగ్లండ్ ప్రధాని హోదాలో అట్లీ బాధ్యతలు తీసుకున్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే జూలై 18న రహస్యంగా అమెరికాలోని న్యూ మెక్సికోసిటీ ఎడారిలో అణుబాంబును విజయవంతంగా పరీక్షించారు. ఆ తర్వాత ట్రూమెన్ వద్దకు వచ్చిన అధికారులు ‘కవలపిల్లలు ప్రసవించటానికి ఏర్పాట్లు సిద్ధం చేశాం’ అన్నారు. ఆ కవలపిల్లలే లిటిల్‌బోయ్, ఫ్యాట్బోయ్లని ప్రపంచానికి తర్వాత తెలిసింది. అమెరికా న్యూక్లియర్ బలాన్ని స్టాలిన్‌కు ప్రదర్శించటానికి, ప్రపంచ ఆధిపత్య సాధనకోసమే ఈ అణ్వస్త్రాల ప్రయోగం జరిగింది. తదనంతరకాలంలో ప్రచ్ఛన్న యుద్ధానికి, ఆయుధపోటీకి దారితీసింది. 1962లో క్యూబన్ మిస్సైల్స్ సంక్షోభంతో అణ్వాయుధ యుద్ధానికి దరిదాపుల్లోకి ప్రవేశించింది. సోవి యట్ యూనియన్, అమెరికా, యూకేల మధ్య అణ్వాయుధ పరీక్షల సంఖ్యను తగ్గిస్తూ 1963లో కుది రిన ఎల్టీబీటీ ఒప్పందంపై 113 దేశాలు సంతకం చేశాయి. కానీ ఆ తదుపరి పదేళ్లలో అప్పటికే తయారయి వున్న క్షిపణులతో 12 వేల న్యూక్లియర్ హెడ్స్‌ను బిగించటం జరిగింది. జూన్ 1979లో ఆస్ట్రియా రాజ ధాని వియన్నాలో ఒప్పందం మేరకు అణ్వాయుధాల సంఖ్యను పరిమితం చేసుకోగా, 1980 అఫ్గానిస్తాన్ పరి ణామాలతో ఈ ఒప్పందం రద్దయింది. 1970వ దశకం మధ్య వరకూ అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణుల తయారీలో అమెరికాదే పైచేయిగా ఉండేది. యూరప్‌లో ఒక మూలనుంచి వేరొక ప్రాంతానికి ఎక్కుబెట్టగలిగే అణు క్షిపణులు వేలకువేలు వచ్చిచేరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వటంతో 1987లో రొనాల్ట్ రీగన్, గోర్బచేవ్‌ల మధ్య కుదిరిన ఒప్పందమే ‘ఐఎన్ఎఫ్’ (మధ్యంతర అణుక్షిపణుల శక్తుల) ఒప్పందం. దీని ప్రకారం 5,500 కి.మీ.లలోపు ప్రయాణం చేయగల అణుక్షిపణులను నిర్వీర్యం చేయాలి. అణ్వాయుధాల నిర్మూలన ప్రక్రియలో ఇది ఒక పెద్ద విజయం. ఈ ఒప్పందాన్నే ట్రంప్ రద్దుచేశాడు. నేటి ఆయుధ పోటీలో హైపర్సోనిక్ క్షిపణులతో నూతన శకం ఆరంభమైంది. ఈ నూతన అధ్యాయాన్ని ఈసారి రష్యా ప్రారంభించింది. శక్తిమంతమైన జిక్రోన్ యుద్ధ నౌక నుండి క్రితం నెలలో ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణి శబ్ధతరంగాల వేగం కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి ప్రపంచ ఆయుధ ఉత్పత్తిదారులను ఆశ్చర్యపర్చింది. ఇటీవలి కాలంలో చైనా కూడా భూగర్భ అణ్వస్త్ర గిడ్డంగులను శరవేగంగా నిర్మిస్తోంది. ప్రపంచ అగ్రదేశాలు జాతీయవాదం, స్వీయరక్షణ పేరిట కూటములుగా ఏర్పడి అడ్డూఅదుపూ లేకుండా మారణాయుధాలను తయారు చేస్తున్నాయి. జీవన ప్రమాణాల మెరుగుదల, నిరుద్యోగ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, దారిద్య్ర నిర్మూలన, మెరుగైన విద్యావైద్య సదుపాయాలు వంటి ప్రధాన సమస్యల కంటే, మానవాళిని, భూగోళాన్ని తొందరగా వినాశనం చేయాలనే దిశగానే ఆయుధపోటీకి ప్రభుత్వాలు వెళుతున్నాయి. ప్రపంచ ప్రజల శాంతి ఉద్యమమే దీనికి విరుగుడుగా ఎదగాలి. ప్రపంచంలో కొన్నిదేశాల దగ్గరే అణ్వస్త్రాలు ఉండాలనే వాదన కంటే అణ్వస్త్ర రహిత సమాజ దిశగా పయనిద్దాం. బుడ్డిగ జమిందార్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం కార్యవర్గ సభ్యులు ‘ 98494 91969 (ఆగస్టు 6 నాటికి హిరోషిమా మారణకాండ జరిగి 76 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా) -
Japan: మే 31 వరకు అత్యవసర పరిస్థితి.. దాంతో
టోక్యో: కరోనా వైరస్‌తో ఇప్పటికే ఒకసారి వాయిదా టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఈ ఏడాదైనా జరుగుతాయో లేదో అనుమానంగా మారింది. టోక్యోలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ మార్చి 25న టార్చ్ రిలేను ప్రేక్షకులు లేకుండానే మొదలు పెట్టాయి. వచ్చే వారం టార్చ్ హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... రిలేను జరపడం లేదంటూ నగర గవర్నర్ హిడెహికో యుజాకి ప్రకటించారు. కరోనా వల్ల జపాన్‌లోని చాలా చోట్ల మే 31 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు. దాంతో హిరోషిమా నగర వీధుల్లో జరగాల్సిన రిలేను రద్దు చేస్తున్నట్లు యుజాకి తెలిపారు. చదవండి: Tokyo Olympics: వారికి ఫైజర్, బయోఎన్‌టెక్ వ్యాక్సిన్లు -
ఐఓసీ చీఫ్ జపాన్ పర్యటన రద్దు
టోక్యో: కరోనా కేసులు పెరుగుతుండటంతో జపాన్ పర్యటనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తమ ప్రకటనలో పేర్కొంది. వచ్చే సోమవారం టార్చ్ రిలే హిరోషిమా నగరానికి చేరుకోనుండగా... బాచ్ అందులో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బాచ్ పర్యటన రద్దయిందని... త్వరలోనే ఆయన కొత్త పర్యటన తేదీలను ప్రకటిస్తామని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో 10 వారాల సమయం మాత్రమే ఉండగా... నిర్వాహకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనా వేళ ఒలింపిక్స్ ఏంటంటూ... వాటిని మరోసారి వాయిదా లేదా రద్దు చేయాలంటూ స్థానిక మీడియా నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఈ సర్వేల్లో ఏకంగా 60 నుంచి 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణపై తమ విముఖతను తెలియజేశారు. మరోవైపు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటూ ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా 3 లక్షల మందికి పైగా జపాన్‌వాసులు సంతకాలు చేశారు. ఇన్ని సమస్యల మధ్య కూడా అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఐఓసీ పేర్కొనడం విశేషం. -
అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్
టోక్యో: అణుఆయుధాలను నిషేధించాలని జపాన్‌దేశం మరోసారి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. అగ్రరాజ్యం అమెరికా జపాన్‌లోని రెండు ముఖ్య నగరాలైన హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. నాగసాకి నగరంపై దాడి జరిగి ఆదివారం నాటికి(ఆగస్టు 9) 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం నాగసాకి పీస్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార యంత్రాంగంతో పాటు పౌరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగసాకి నగర మేయర్ టొమిహిమ టావ్ శాంతి సందేశాన్ని ఇచ్చారు. అణుఆయుధాలను నిషేధించాలని మేము విజ్ఞప్తి చేస్తుంటే.. అమెరికా, రష్యాలు మాత్రం అణుఆయుధాల శక్తిని పెంచుకుంటున్నాయని ఆరోపించారు. (లిటిల్ బాయ్ విధ్వంసం.. టార్గెట్ హిరోషిమానే ఎందుకు?) 2017లో ఏర్పాటు చేసిన అణుఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలతోపాటు, జపాన్ ప్రభుత్వఅధికారులను కోరారు. జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. అణుఆయుధాల ట్రీటీ ఒప్పందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అణుఆయుధాలు తయారు చేస్తున్న రాష్ట్రాలు, అణురహిత రాష్ట్రాలు కూడా దీనికి మద్దతు ఇవ్వవని ఆయన అన్నారు. రష్యా, అమెరికా దేశాలు తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను తగ్గించుకోవాలని కోరారు. న్యూక్లియర్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచినా దానిని ఎవరూ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 1945 ఆగస్టు 6,9 తేదీలలో జరిగిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు అణుబాంబుల దాడితో ఆగస్టు 15న జపాన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. (అణుబాంబు విలయానికి 75 ఏళ్లు) -
అణుబాంబు విలయానికి 75 ఏళ్లు
సెకను కాలంలో శరీరం అయిపులేకుండా కాలి బూడిదైంది ఎప్పుడు? ఏళ్లు గడుస్తున్నా ఆ ఒక్క రోజు నాటి స్మృతులు చెరిగిపోనిది ఎక్కడ? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం భూమ్మీద రెండే చోట్ల తెలుస్తాయి. అవే హిరోషిమా, నాగసాకి! జపాన్‌లోని ఈ నగరాల్లో అణుబాంబు విలయం సంభవించి 75 ఏళ్లు అవుతోంది! మానవాళిపై చెరగని మచ్చగా మిగిలిన ఆ మహోత్పాతం ఆనుపాను మరోసారి.... రెండో ప్రపంచ యుద్ధం పరిసమాప్తం కావడానికి హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు కారణమయ్యాయని చరిత్ర చెబుతోంది. 1945 ఆగస్టు ఆరున హిరోషిమాపై ఆ తరువాత మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై అణుబాంబులు పడ్డాయి. ఈ రెండు ఘటనల్లో అక్కడికక్కడ మరణించిన వారి సంఖ్య సుమారు 1.40 లక్షలు అని అంచనా. బాంబు పడ్డ ప్రాంతాల నుంచి కిలోమీటర్ చుట్టుపక్కల ఉన్న వారందరూ సెకన్ల వ్యవధిలో మాడి మసైపోగా రేడియోధార్మికత ప్రభావం కారణంగా కేన్సర్ల బారినపడ్డవారు.. తరతరాలుగా ఇతర సమస్యలు అనుభవిస్తున్న వారు కోకొల్లలు. ఆగస్టు తొమ్మిదిన ఉదయం 11.02 గంటలకు ఫ్యాట్‌మ్యాన్ పేరుతో నేలజారిన అణుబాంబు దాదాపు 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భవనాలన్నింటినీ నేలమట్టం చేసిందంటే 22 కిలోటన్నుల అణుబాంబు సృష్టించే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. (లిటిల్ బాయ్ విధ్వంసం.. టార్గెట్ హిరోషిమానే ఎందుకు?) బాంబు పడిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో రేడియో ధారి్మకత వర్షంలా కురిసింది. నాగసాకిలో అణుబాంబు తాకిడికి వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోవడంతో కొంత కాలంపాటు ఆ ప్రాంతంలో గాయపడ్డ వారికి చికిత్స అందించే వారు కూడా కరువయ్యారు. దాడి తరువాత తమవారిని వెతుక్కునేందుకు సంఘటన స్థలానికి వచ్చిన వారిలోనూ అత్యధికులు రేడియోధార్మికత బారినపడ్డారు. కనీస చికిత్స లేకుండానే చాలామంది మరణించారు కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేడియో ధార్మికత ప్రభావంతో ఆ ప్రాంతంలో కొన్నేళ్లపాటు రక్త కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య ఎక్కుంది. దశాబ్దకాలం తరువాత మిగిలిన వారిలో థైరాయిడ్, ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్ల బారిన పడగా.. చాలామంది గర్భిణులకు గర్భస్రావం జరిగింది. రేడియోధార్మికత బారినపడ్డ పసిపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల సమస్యలతో బాధపడ్డారు. ఇప్పటికీ వాటి దుష్ఫలితాలను అనుభవిస్తున్నారు కూడా. అయితే ఈ అణు విధ్వంసం మంచి విషయానికి పునాది వేసింది. ప్రపంచంలో ఏమూలనైనా ఇలాంటి ఉత్పాతం మరొకటి చోటు చేసుకోకుండా అణ్వ్రస్తాలపై నిషేధానికి కారణమైంది. ఆనాటి విధ్వంసాన్ని గుర్తు చేసుకునే లక్ష్యంతో ఏటా ఆగస్టు ఆరవ తేదీని హిరోషిమా డేగానూ, తొమ్మిదవ తేదీని నాగసాకి డేగానూ ఆచరిస్తున్నారు. ఆ నగరాల ఎంపికకు కారణం... అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపైనే అణుబాంబులు కురిపించేందుకు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. 1945 జూలై 16న అమెరికా ‘మాన్హాట్టన్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి అణుబాంబును విజయవంతంగా పరీక్షించింది. న్యూ మెక్సికోలోని అలొమోగోర్డో ప్రాంతంలోని ‘ట్రినిటీ’ పరీక్ష కేంద్రంలో అణు పరీక్ష విజయవంతం కావడం.. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తమ సత్తాను ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయమని అమెరికా భావించడం అణు విధ్వంసానికి కారణమయ్యాయి. శాంతికి జపాన్ రాజు నిరాకరించడం.. యుద్ధంలో తమ సైనికుల మరణాలను తగ్గించేందుకు అణుబాంబులు ప్రయోగించడం మేలని అమెరికా భావించింది. ముందుగా కోకురా, హిరోషిమా, యుకోహామా, నీగటా, క్యోటో నగరాలపై బాంబులు వేయాలన్నది అమెరికా ప్రణాళిక. జపాన్ మిలటరీ కేంద్రంగా ఉన్న హిరోషిమా ఈ జాబితాలో ఉండగా.. నౌకాశ్రయ నగరమైన నాగసాకి మాత్రం లేదు. సాంస్కృతికంగా జపాన్‌కు క్యోటో చాలా ప్రధానమైన నగరం కావడం, అప్పటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ స్టైమ్సన్కు ఆ నగరంపై మక్కువ ఉండటంతో చివరి క్షణాల్లో క్యోటో పేరు తొలగిపోయి నాగసాకి వచ్చి చేరింది. 1920 ప్రాంతంలో హెన్రీ స్టైమ్సన్ క్యోటో నగరాన్ని సందర్శించారని అక్కడే తన హనీమూన్ జరుపుకున్నారని అందుకే ఆయన అణుబాంబు దాడి నుంచి క్యోటోను మినహాయించాలని అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ను విజ్ఞప్తి చేశారని ఒక కథనం ప్రచారంలో ఉంది. 1945 జూలై 24న జపాన్‌పై అణుబాంబు దాడికి అధికారిక ఉత్తర్వులు వెలువడగా ఒక రోజు తరువాత క్యోటో పేరును కొట్టివేసి చేతితో నాగసాకి పేరు రాసినట్లు దస్తావేజులు చెబుతున్నాయి. నాగసాకిపైకి ‘ఫ్యాట్‌మ్యాన్’ను జారవిడిచిన బీ–29 సూపర్ఫోర్ట్ట్రెస్ పేరు బాక్స్కార్. హిరోషిమా కంటే కనీసం ఏడు కిలోటన్నుల ఎక్కువ సామర్థ్యమున్న బాంబును ప్రయోగించినప్పటికీ నాగసాకిలో జరిగిన విధ్వంసం సాపేక్షంగా తక్కువే. నగరం చుట్టూ పర్వత ప్రాంతాలు ఉండటంతో ఉరకామి లోయ ప్రాంతానికే నష్టం పరిమితమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై కాకుండా కోకురా నగరంపై దాడి జరగాల్సి ఉంది. మేజర్ ఛార్లెస్ స్వీనీ నడుపుతున్న బాక్స్కార్ కోకురాపై మూడుసార్లు చక్కర్లు కొట్టింది కూడా. అయితే బాగా మబ్బుపట్టి ఉండటం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో స్వీనీ మిగిలిన ఒకే ఒక్క లక్ష్యమైన నాగసాకిపై బాంబు జారవిడిచారు. అణు పరిజ్ఞానంతో ప్రయోజనాలు ఎన్నో.. టెక్నాలజీ రెండువైపులా పదును ఉన్న కత్తి అని అంటారు. అణుశాస్త్ర పరిజ్ఞానం కూడా ఇందుకు అతీతమేమీ కాదు. హిరోషిమా, నాగసాకిలపై బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించిన అణు పరిజ్ఞానంతో భూమ్మీద పలు చోట్ల చీకట్లను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 దేశాల్లో అణుశక్తి ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం కారణంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఎవరైనా వాడుకునే వీలేర్పడింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఆహార భద్రతతోపాటు, మానవ ఆరోగ్యం, పర్యావరణం వంటి అనేక రంగాల్లో అణుశక్తి వినియోగం జరుగుతోంది. వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు మాత్రమే కాకుండా.. ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జంతువ్యాధులను గుర్తించేందుకు అణుశక్తిని ఉపయోగిస్తున్నారు. పంట దిగుబడుల నిల్వకు భారతదేశంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అణుశక్తి కేంద్రాల వ్యర్థాలను సమర్థంగా వాడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సాయంతో కేన్సర్లతోపాటు పలు ఇతర వ్యాధుల చికిత్సలో అణుధారి్మక పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ల గుర్తింపునకూ అణుశక్తి అక్కరకొస్తోంది. సముద్రజలాల కాలుష్యాన్ని గుర్తించేందుకు మహా సముద్రాల ఆమ్లీకరణను నియంత్రించేందుకు కూడా అణువులను ఉపయోగిస్తున్నారు. హిరోషిమా, నాగసాకి అణుబాంబుల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,50,000 – 2,46,000 నాగసాకిపై పడిన అణుబాంబు ‘ఫ్యాట్‌మ్యాన్’ ప్లుటోనియంతో తయారైంది. యురేనియంతో తయారైన ‘లిటిల్‌బాయ్ హిరోషిమా విధ్వంసానికి కారణం. లిటిల్ బాయ్ సామర్థ్యం 15 కిలోటన్నులు కాగా ఫ్యాట్‌మ్యాన్ ఇంకో ఏడు కిలోటన్నులు అధిక శక్తి గలది. అమెరికా తొలి ప్రణాళిక ప్రకారం జపాన్‌లోని ఐదు నగరాలపై అణుదాడి జరగాల్సి ఉంది. ఇందులో నాగసాకి లేనే లేదు. అణు బాంబులతో దాడి చేస్తున్నట్లు అమెరికా ప్లాంప్లెట్ల ద్వారా ఇరు నగరాలను ముందే హెచ్చరించింది. నాగసాకి ఉదంతం లాంటిది మరోటి జరగక్కుండా నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి అణ్వాయుధాలపై నిషేధం విధించింది. అణ్వాయుధ దాడి తరువాత హిరొషిమాలో విరబూసిన తొలి పువ్వు ఓలియాండర్. ఈ కారణంగానే ఆగస్టు ఆరున హిరోషిమా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఓలియాండర్ మొక్కలను నాటుతారు. అణుదాడి తరువాత హిరోషిమాలోని ఓ పార్కులో వెలిగించిన శాంతి జ్యోతి 1964 వరకూ అఖండంగా వెలిగింది. -
రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి..
(వెబ్‌డెస్క్) : ఆగష్టు 6.. జపాన్‌తో పాటు ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదభరితమైన, దుర్దినంగా నిలిచిపోయింది. జపాన్‌లో అతి పెద్ద దీవిగా పేరుగాంచిన హిరోషిమాలో అమెరికన్ బాంబర్ బి–29‘లిటిల్ బాయ్’సృష్టించిన విధ్వంసానికి నేటికి సరిగ్గా 75 ఏళ్లు. సామ్రాజ్య విస్తరణ కాంక్ష, దేశాల మధ్య ఆధిపత్యపు పోరు కారణంగా వేలాది మంది ఉన్నచోటే పడి చచ్చిపోయిన ఈ ఉదంతం మానవాళి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. జన జీవనంతో హడావుడిగా ఉన్న నగరం క్షణాల్లో శ్మశానంలా మారిపోయిన వైనం శత్రుదేశాల ప్రజల చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. అయితే ఆ మహా విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది గానీ... హిరోషిమా వాసుల ఆత్మవిశ్వాసాన్ని కాదు! గడ్డిపోచ కూడా మొలవదని భావించిన ఆ చోటు.. ఇప్పుడు ఆకాశ హార్మ్యాలు, అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, నియాన్ దీపాల వెలుగుజిలుగులతో ‘నక్షత్రాల దీవి’లా అలరారుతోంది. నేటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరంగా ఉనికిని చాటుకుంటోంది. కాలంతో పోటీపడి.. వినాశనానికి ‘విశ్వాసం’తో సమాధానం చెప్పి సగర్వంగా నిలబడింది. భవిష్యత్ తరాలు బాగుండాలని.. ఒక తరం చేసిన సాహసం, త్యాగాల ప్రతిఫలంతో మానవతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అణుబాంబు దాడి చేయడానికి హిరోషిమాను ఎంచుకోవడానికి గల కారణం? అసలు ఆరోజు ఏం జరిగింది? ఎంత మంది చనిపోయారు? అణుబాంబు దాడి తదనంతర పరిణామాలేమిటి? అన్న అంశాలను పరిశీలిద్దాం. టార్గెట్ హిరోషిమానే ఎందుకు? జపాన్‌లో ఉన్న 6,852 దీవుల్లోని అతి పెద్ద దీవి ఇది. హిరోషిమా అంటే వెడల్పైన దీవి అని అర్థం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ప్రాచీన కాలం నుంచే వాణిజ్య కేంద్రగా భాసిల్లింది ఈ దీవి. ఎన్నో కర్మాగారాలకు నెలవు. అంతేగాక జపనీస్ మిలిటరీ, ఆయుధ సంపత్తికి హబ్‌గా ఉండేది. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ను అన్ని రకాలుగా దెబ్బకొట్టేందుకు అమెరికా ఈ నగరాన్ని ఎంపిక చేసుకుందని చెప్పవచ్చు. అణుబాంబు దాడికి కొన్ని రోజుల ముందే ఫైర్ బాంబింగ్ ఆపేసిన అమెరికా.. సరైన సమయం కోసం వేచి చూసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. ఆగష్టు 6, 1945.. ఆరోజు ఏం జరిగింది? జపాన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు బీ-29 బాంబర్ ఎనోలా గే.. నాలుగు టన్నుల యురేనియంతో కూడిన బాంబు లిటిల్ బాయ్‌ను అమెరికా హిరోషిమాపై ప్రయోగించింది. 9600 మీటర్ల ఎత్తు నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అయోవి బ్రిడ్జ్‌ని లక్ష్యంగా చేసుకుని బాంబును జార విడిచింది. బ్రిడ్జి పైనుంచి కేవలం 600 మీటర్ల ఎత్తులో 43 సెకన్లలోనే లిటిల్ బాయ్ పేలాడు. దీంతో ఒక్కసారిగా భారీ విప్ఫోటనం సంభవించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అంతా సర్వనాశనమై పోయింది. మంటల(3-4 వేల డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు) ధాటికి అంతా కాలి బూడిదై పోయారు. నగరమంతా పొగతో నిండిపోయింది. విస్పోటనం తర్వాత గంట సేపటి వరకు రేడియోధార్మిక కణాల వర్షం కురుస్తూనే ఉంది. లక్షకు పైగా మరణాలు హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసం ధాటికి డిసెంబరు 31, 1945 వరకు దాదాపు లక్షా నలభై వేల మంది మృతి చెందినట్లు అంచనా. నాటి నగర జనాభాలో(ఆనాటికి 3,50,000) 40 శాతం ఇది. ఘటన సంభవించిన ప్రదేశం నుంచి అర కిలోమీటర్ దూరంలో ఒక్క ప్రాణి కూడా మిగల్లేదు. నేటి వరకు బాంబు ప్రభావం వల్ల మొత్తంగా 3 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా ప్రస్తుతం హిరోషిమా జనాభా దాదాపు 12 లక్షలు. రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి యురేనియం తాలూకు దుష్పరిణామాల వల్ల బాంబు దాడిలో బతికి బయటపడ్డ వారి జీవితం డిసీజ్ ఎక్స్ అనే రోగంతో నరకప్రాయంగా మారింది. రక్తపు వాంతులు, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలతో దాదాపు ఆరు వారాల్లోనే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు కూడా దినదినగండంగానే వెళ్లదీశారు. వివిధ రకాల క్యాన్సర్లు, ఇతరత్రా అనారోగ్య కారణాలతో దయనీయ జీవితం గడిపారు. ప్రభుత్వం వీరి చికిత్స కోసం అనేకానేక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టింది. రెగ్యులర్ చెకప్, ట్రీట్మెంట్తో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించింది. దాదాపు 1,36,700 మందిని హిబాకుష(బాధితులు)లను గుర్తించి సేవలు అందించింది. అయితే బాధిత కుటుంబాల నుంచి ఒత్తిడి కారణంగా 1957లో హిబాకుషాల కోసం ప్రత్యేక చట్టం వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే ఈ రేడియేషన్ తాలూకు రోగాల ప్రభావం కనీసం వంద ఏళ్ళు ఉంటుందని అప్పటి డాక్టర్లు అంచనా వేశారు. కానీ వారి అంచనా తప్పు అని నిరూపించడానికి హిరోషిమా వాసులంతా కంకణ కట్టుకున్నారు. ఇందులో భాగంగా డిసీజ్ ఎక్స్ సోకిన వారంతా ఆటంబాంబ్ క్యాజువాలిటీ కమిషన్‌కి చేరుకుని స్వచ్ఛందంగా తమ శరీరాలని అప్పజెప్పి ఎన్నో ప్రయోగాల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. రాబోయే తరాల క్షేమం కోసం వీటన్నిటినీ పంటి బిగువున భరించి త్యాగధనులయ్యారు. నగరమంతా ఓరెగామి ‘పేపర్ క్రేన్లు’ తమ కోరికలు నెరవేరేందుకు జపాన్ వాసులు పేపర్లు మడిచి కొంగ ఆకారంలో తయారు చేసి వాటిని ఎగురవేస్తారనే కథ ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల వయసులో అణుబాంబు దాడి ప్రభావానికి లోనైన సడాకో సాసకి అనే బాలికకు లుకేమియా బారిన పడింది. పదేళ్ల పాటు మహమ్మారితో పోరాడిన ఆమె.. చికిత్స తీసుకుంటున్న సమయంలో మెడిసిన్ కవర్లను చుట్టి క్రేన్లు తయారు చేసేది. ఈ క్రమంలో పన్నెండేళ్ల వయసులో మరణించిన ఆ బాలికను శాంతి చిహ్నంగా భావిస్తూ నగరమంతా నేడు పేపర్ క్రేన్లు ఎగురవేస్తారు. ఇక అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్,1955లో హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. లొంగిపోయే లోపే లిటిల్ బాయ్, ఫ్యాట్మ్యాన్లతో విధ్వంసం రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించే అంశంపై జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది నాటి డిమాండ్. అప్పటికి శత్రుదేశాలకు బదులివ్వగల సామర్థ్యం, అధికార బలం అంతగా లేనందున జపాన్ కూడా ఇందుకు సిద్ధమైంది. అయితే జపాన్ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని భావించినందు వల్లే అమెరికా.. హిరోషిమాపై లిటిల్ బాయ్‌ను ప్రయోగించడంతో పాటుగా.. ఆ షాక్ నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబుతో దాడి చేసిందనే వాదనలు నేటికీ వినిపిస్తున్నాయి. -
హిరోషిమా బాంబులకన్నా వేడెక్కిన సముద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : 2019లో మానవ జాతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచంలోని సముద్రాలన్నీ వేడెక్కాయని ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లీజింగ్ చెంగ్ బందం వెల్లడించింది. ప్రపంచంలోని సముద్రాల సరాసరి ఉష్ణోగ్రత 0.135 ఫారిన్‌హీట్‌లకు పెరిగిందని, ఇది 360 కోట్ల హిరోషిమా బాంబు పేలుళ్ల నుంచి వెలువడే వేడికి సమానమైనదని ఆయన పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల్లోనే సముద్ర జలాల వేడి బాగా పెరిగిందని, భూతాపోన్నతికి ఇది మరో ఉదాహరణని ఆయన తెలిపారు. లీజింగ్ చెంగ్‌తో పాటు ఈ బందంలో చైనా, అమెరికాలకు చెందిన 11 సంస్థల పరిశోధకులు పాల్గొన్నారు. ప్రపంచ సముద్రాల్లోకెల్లా అట్లాంటిక్, దక్షిణ సముద్రాలు బాగా వేడెక్కాయని, సముద్రం ఉపరితలంపైనే కాకుండా ఉపరితలానికి 6,500 అడుగుల లోతులో కూడా సముద్ర జలాలు వేడెక్కాయని ఆయన చెప్పారు. 1955 నుంచి 1986 మధ్య కాలంలో పెరిగిన సముద్ర జలాల వేడితో పోలిస్తే 1987 నుంచి 2019 మధ్య 450 శాతం వేడి పెరిగిందని ఆయన తెలిపారు. భూతాపోన్నతిలో 96 శాతం వేడిని సముద్రాలే పీల్చీసుకుంటాయని, నాలుగు శాతం మాత్రమే జంతుజాలం నివసించే భూమి వాతావరణంలో కలుస్తుందని, అందుకు వేడికి తనలో కలిపేసుకునే గుణం సముద్రాలకు ఉండడమేనని ఆయన చెప్పారు. అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో భూతాపోన్నతి ఎక్కువగా పెరుగుతోందని ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలో అడవులు, పొదలు తగులబడడానికి కారణం కూడా భూతాపోన్నతి పెరగడమే కారణమని భావిస్తున్న విషయం తెల్సిందే. ఇలాగే సముద్ర జలాలు వేడెక్కుతూ పోతే 2300 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు నాలుగు అడుగులు పెరుగుతాయని పరిశోధకులు ఇదివరకే అంచనా వేశారు. తద్వారా అనేక భూభాగాలు నీట మునుగుతాయని, ఆ విపత్తును నివారించడానికి భూతాపోన్నతికి కారణం అవుతున్న ఉద్ఘారాలు తగ్గించాలని పలు ప్రపంచ సదస్సులు తీర్మానించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లే దు. -
ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం!
ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం. జపాన్ వాసులైతే ఈ తేదీని అంత తేలికగా మరిచిపోలేరు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా అణుదాడికి బలైన నగరాలు హిరోషిమా, నాగసాకి. హిరోషిమాలో లిటిల్ బాయ్ విధ్వంసానికి నేటికి సరిగ్గా 73 ఏళ్లు. 1945 ఆగస్టు 6న ఉదయం దాదాపు ఎనిమిదన్నర గంటల ప్రాంతం (జపాన్ స్థానిక కాలమానం ప్రకారం)లో హిరోషిమా గగనతలంలో చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. దానికి లిటిల్ బాయ్ అని అమెరికా పేరు పెట్టింది. భూతలానికి కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే లిటిల్ బాయ్ పేలాడు. కొన్ని సెకన్లలో హిరోషిమా శ్మశానంలా మారిపోయింది. 64 కేజీల యురేనియం గొలుసుకట్టు చర్య జరిగి ఒక ట్యూమర్ కణంలా పెరుగుతూ 67 టన్నుల జౌల్స్ శక్తిని విడుదల చేసింది. క్షణంలో 70 వేలమంది ఉన్న చోటే చచ్చి పడిపోయారు!. అనంతరం మరో 70 వేల మంది మృత్యువాత పడ్డారు. కార్బన్ రియాక్షన్ జరిగి బాంబు సమీపంలో ఉన్న వాళ్ల శరీరాలు కార్బన్ బొమ్మలుగా మారిపోయాయి. చుట్టుపక్కల నుండి చూస్తే నేల మీద ఒక 50వేల అడుగుల పుట్టగొడుగు ఆకారపు మేఘంలా ఉందా విధ్వంసం. క్షణాల్లో నగరం ఆవిరైపోయింది. ఎక్కడ చూసినా కూలిన భవంతులు. శవాల దిబ్బలు. వేల మంది గాయాలపాలై తీవ్ర అనారోగ్యానికి సైతం గురయ్యారు. ఆపై కెమికల్స్ వల్ల పుట్టుకొచ్చిన భయానక వ్యాధులతో లక్షల మంది మృత్యువాత పడ్డారు. అయితే అంత వినాశనం జరిగినా ఒకే ఒక్క భవనం జన్‌బకూ డోమ్ అనే ఒకే ఒక్క భవనం మాత్రం ఆ దుర్ఘటనకు సాక్ష్యంలా నిలిచింది. 73 ఏళ్ల క్రితం విధ్వంసాన్ని తట్టుకున్న భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందుతోంది. చివరగా ఆ విధ్వంసాన్ని చూసి, శత్రువులైన అమెరికన్లే కన్నీరు పెట్టారు. భారీ విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది... జీవాన్ని కాదు! రెండేళ్ల తరువాత బూడిదమయమై వున్న ఆ నగరంలో మొలకలు రావడం వారిలో ఆశల్ని చిగురింప చేసింది. యురేనియం ఆనవాళ్లు మెల్లగా చెరిగిపోయినా.. దాని తాలూకు దుష్పరిణామాలు అలాగే ఉన్నాయి. ఆ పేలుడులో బతికిన వారి జీవితాన్ని నరకంగా మార్చేందుకు డిసీజ్ ఎక్స్ అనే రోగం పుట్టుకొచ్చింది. ఒంటినిండా మచ్చలు వచ్చి రక్తపు వాంతులతో ప్రాణాలని మింగేస్తుందా రోగం. 6 లక్షలమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. అది రాబోయే తరాలని పీడించకుండా ఉండాలని ఎన్నో ప్రయోగాలకు వ్యాధిగ్రస్తులు తమ శరీరాలనే అప్పగించారు. ఆ ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ఫలితంగా ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్ కారక వ్యాధులు ఎంతో తక్కువ. గత తరాల త్యాగాల ప్రతిఫలమే నేటి హిరోషిమా. నాటి విధ్వసానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన డోమ్ భవనం (కుడి ఫొటో ప్రస్తుతం) జపాన్ లొంగిపోయేలోపే దారుణం రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించడంపై ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలన్నది డిమాండ్. అప్పటి జపాన్ అంత సామర్థ్యం, అధికార బలం లేనిది కనుక బేషరతుగా లొంగిపోవడానికి సిద్ధమైంది. జపాన్ తమ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని అమెరికా భావించింది. ఈ కారణంగా ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించిన అమెరికా.. దాని నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్ మ్యాన్ అనే మరో అణుబాంబును ప్రయోగించి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. శాంతికి చిహ్నంగా మారిన హిరోషిమా జపాన్‌లోని హొన్షు దీవిలో ఉన్న హిరోషిమా పెద్ద నగరం. హిరోషిమా అంటే జపాన్ భాష జపనీస్‌లో విశాలమైనది అనే అర్థం వస్తుంది. ఇప్పటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరమే. దేశ విదేశాల నుండి ఇప్పటికీ ఎందరో వ్యాపారుల రాకపోకలతో కొత్త జీవితాన్ని గడుపుతోంది హిరోషిమా. అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, ఆకాశాన్ని తాకే భవనాల నడుమ రాత్రిపూట నియాన్ దీపాల వెలుగులో నక్షత్రాల దీవిలా కనిపిస్తుంది హిరోషిమా. ప్రపంచశాంతికి చిహ్నంగా మారి, శాంతి కపోతాన్ని స్వేచ్ఛగా ఎగరవేస్తోంది హిరోషిమా. అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్‌ను నిర్మించారు. కొన్నేళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసిన హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని 1955లో ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అణ్వాయుధాలు పూర్తిగా నిషేధం కావాలని మరెన్నో దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. -
నాటి హిరోషిమా... నేటి హీరో సీమ
చరిత్ర అది 1945, ఆగస్టు 6వతేదీ. ఉదయం ఎనిమిదిన్నర. ఇది ఇండియా టైమ్ కాదు, జపాన్ టైమ్. యుద్ధమేఘాలు గగనతలాన్ని కమ్ముకుని ఉన్నాయి. ఎక్కడ రేడియో విన్నా, ఏ వార్తాపత్రిక చూసినా రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలే. యుద్ధం ఎవరికి మేలు చేస్తుందో తెలియదు, కానీ కీడు మాత్రం చాలా మందికి చేస్తుంది. ఆ కీడంతా అమాయకులకే. ఏ పాపం పుణ్యం ఎరగని జీవులకే. ఒక దేశం మరో దేశంతో ఎందుకు యుద్ధం చేస్తుందో తెలియదు వాళ్లకు. ప్రపంచం మొత్తం ఎందుకు రెండుగా చీలి పోయిందో తెలియదు. తమ దేశం ఏ పక్షాన ఉందనే ప్రాథమిక వివరం కూడా ఏ కొద్దిమందికో తప్ప అందరికీ తెలియదు. వారికి తెలిసిందల్లా ఎప్పుడు ఏ విమానం గగనతలాన చక్కర్లు కొడుతుందోనని కళ్లు తల మీద పెట్టుకుని చూస్తూ ఉండడమే. జపాన్‌లో ఆ రోజు విమానం ప్రొఫెల్లర్ల చప్పుడు ఆ దేశ పౌరులకు జానపద కథల్లోని గుర్రపు డెక్కల చప్పుడును తలపించజేస్తోంది. గుండె గుభిల్లుమంటుంటే పిల్లలు ఎక్కడ ఉన్నారో వెతికిపట్టుకుని తలదాచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. సూర్యోదయమైందంటే ఏ శకలం ఎటు నుంచి వచ్చి తాకుతుందోనని ఒళ్లంతా చెవులు చేసుకుని చిటుక్కుమనే శబ్దం కోసం ఎదురు చూడడమే అయింది. ఆ క్రమంలో పెద్ద దేశాల అధినేతలంతా సమావేశమయ్యారనే వార్త వారి చెవుల్లో పన్నీటిని చల్లింది. ఇక యుద్ధం ముగిసినట్లేనట ఆశ నిండిన మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఇంతలో పెద్ద పెట్టున శబ్దం. పిశాచి రెక్కలు విచ్చినట్లు జపాన్ గగనతలం మీద చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. మరో నిమిషంలో వంద పిడుగులు ఒక్కసారిగా నేలకు తాకినట్లు ‘లిటిల్ బాయ్’ అనే ఆ బాంబు జపాన్ భూతలాన్ని తాకింది. షిరోషిమా నగరంలో 90 వేల భవనాలున్నాయి, 1900 అడుగుల ఎత్తు నుంచి శరాఘాతంలా దూసుకొచ్చిన లిటిల్‌బాయ్ తాకిడికి నగరం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఎనభై వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 35 వేల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తీవ్రమైన రేడియేషన్‌కు గురై రకరకాల అనారోగ్యాలతో ఏడాదిలోపు సంభవించిన మరో అరవై వేల మరణాలు కూడా లిటిల్‌బాయ్ పొట్టనపెట్టుకున్నవే. ప్రపంచం ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఇంతకీ పెద్ద దేశాల అధిపతులు కూర్చుని చర్చించి సాధించిందేమిటి? సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ)... జర్మనీలో సమావేశమయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధానికి తెర దించడానికే సమావేశమయ్యారు. ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్. అనధికారికంగా వారంతా జపాన్‌లో రాజరికాన్ని కొనసాగించడానికి ఆమోదం తెలిపిన వారే. కానీ చేసిందేమిటి? బేషరతుగా లొంగిపోవడానికి జపాన్ అంగీకారం తెలిపే లోపే అమెరికా అతి తెలివిగా ఆలోచించింది. యుద్ధంలో అవసరమవుతుందని సిద్ధం చేసుకున్న అణుబాంబులను వాడకపోతే ఎలా? ప్రయత్నం అంతా వృథా అయిపోదూ? ఇప్పుడు వాడకపోతే ఇక వాడే అవసరం రాదేమో! అణుబాంబును ప్రయోగించి చూడడానికి ఇంతకు మించిన మంచి తరుణం రాకపోవచ్చు. ఇప్పుడే ప్రయోగించాలి అనుకుంది. అంతే... హిరోషిమా మీద తొలి అణుబాంబును ప్రయోగించింది. ఆ భయోత్పాతం నుంచి బయటపడేలోపు నాగసాకి పట్టణం మీద ఫ్యాట్‌మ్యాన్ పేరుతో మరో అణుబాంబును ప్రయోగించింది. నిజానికి జపాన్ అప్పటికి అగ్రదేశాధినేతల డిమాండ్‌ను ధిక్కరించే పరిస్థితిలో ఏ మాత్రం లేదు. యుద్ధానికి చరమగీతం పాడడానికి సిద్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన అణుదాడిని ఆ దేశపు ఆధిక్యభావన ప్రకటనలో భాగంగానే గుర్తించింది ప్రపంచం. ఇకపై ఇలాంటివి జరగడానికి వీల్లేదని శాంతికాముకులు చేసిన అనేక నిరసనల తర్వాత ఆగస్టు ఆరవ తేదీని ప్రపంచదేశాలన్నీ యాంటీ న్యూక్లియర్డేగా గుర్తు చేసుకుంటున్నాయి. జపాన్ ప్రజలు యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాలను దీటుగా ఎదుర్కొంటూ నేలమట్టమైన నగరాలను పునర్నిర్మించుకున్నారు. బాంబు ప్రయోగం బాంబు తాకిడికి ధ్వంసమైన హిరోషిమా హిరోషిమా ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న స్టూడెంట్స్ -
'నోట్ల రద్దు ఓ అణుబాంబు.. అందరు బలి'
ముంబయి: ప్రధాని నరేంద్రమోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని హిరోషిమా నాగాసాకిలపై వేసిన అణుబాంబులతో పోల్చారు. పెద్ద నోట్ల రద్దు అనే అణుబాంబుతో మోదీ భారత ఆర్థిక వ్యవస్థను హిరోషిమా, నాగసాకి స్థాయికి తగ్గించారని ఆరోపించారు. 'అందరూ బలయ్యారు' ఈ నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు అంటూ ఉద్ధవ్ బుధవారం తమ అధికారిక పత్రికలు 'సామ్నా, దోపహార్ కా సామ్నా'లో ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే సమయంలో రిజర్వ్ బ్యాకు ఆఫ్ ఇండియా చెప్పినా వినలేదని మండిపడ్డారు. 'చెవిటి, మూగ రామచిలుకల్లా కేబినెట్లో కూర్చుని ఉర్జిత్ పటేల్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించారు. దేశ ఆర్థికవ్యవస్థ అమాంతం పడిపోయింది' అంటూ ఆయన అందులో ఆరోపించారు. -
ఆత్మ విమర్శ ఎక్కడ?
సరిగా 71 ఏళ్లక్రితం తమ దేశం సృష్టించిన అణు విలయానికి సర్వనాశనమైన హిరోషిమా పట్టణాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించారు. అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు లక్షన్నర మంది ప్రజానీకం స్మృతికి నివాళులర్పించడంతోపాటు ఆ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన కొందరు వ్యక్తుల్ని ఆయన పలకరించారు. వారిని హత్తుకున్నారు... ఓదార్చారు. ఆధిపత్యం కోసం, గెలుపు కోసం సంపన్న దేశాల మధ్య సాగిన పోటీ పర్యవసానంగానే ఇంత దారుణం చోటు చేసుకున్నదని ఆవేదనచెందారు. మానవాళి చరిత్రనూ, దాంతో పెనవేసుకున్న ఘర్షణలు, యుద్ధాలు వగైరాలన్నిటినీ ఆయన పూసగుచ్చారు. ఒక్క మాటలో ‘క్షమాపణ’ మినహా ఒబామా అన్నీ చెప్పారు. ఇది క్షమాపణ చెప్పడానికి ఉద్దేశించిన పర్యటన కాదంటూ ముందే వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ పర్యటనపై ఇంటా బయటా ప్రశంసలతోపాటు విమర్శలూ వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడి ‘పెద్ద మనసు’ను కీర్తించినవారున్నారు. మానవేతిహాసంలోనే అత్యంత ఘోర దురంతానికి కారణమైనా ‘సారీ’ చెప్పడానికి నోరు రాలేదని ఆగ్రహించినవారున్నారు. అమెరికా, జపాన్‌లు రెండూ తమ దురుద్దేశాలను కొనసాగించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ఆరోపిస్తే... ఇలాంటి ‘సిగ్గుమాలిన’ పర్యటనలతో అమెరికా పరువు తీస్తున్నారని ‘న్యూయార్క్ పోస్టు’ వాపోయింది. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు కవి తన చేతగానితనాన్నీ, అర్ధ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలో దాచి మోసగించజూస్తాడని విఖ్యాత కథకుడు చలం అంటాడు. ఒబామా హిరోషిమాలో అలాంటి పనే చేశారా? ఆనాటి అమెరికా దుర్మార్గం జాడలు కప్పిపుచ్చాలని చూశారా? ఎందుకంటే...రెండో ప్రపంచ యుద్ధంలో అన్నివిధాలా అప్పటికే దెబ్బతిని ఉన్న జపాన్ను సమీప భవిష్యత్తులో కోలుకోలేకుండా చేయడం కోసం...తన అమ్ములపొదిలో ఉన్న అణు బాంబులు సృష్టించగల మారణ హోమాన్ని ‘వాస్తవికంగా’ పరీక్షించడం కోసం అమెరికా ఇంతటి దారుణానికి తెగించిందని చరిత్రకారులు చెబుతారు. హిరోషిమా తర్వాత మరో మూడు రోజులకు నాగసాకి పట్టణంలో కూడా ఇలాంటి దాడికే అమెరికా పాల్పడింది. ఈ రెండు ఉదంతాల్లోనూ లక్షన్నరమంది జనం ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని లక్షలమంది జీవితాంతం నరకయాతన చవిచూశారు. ఆనాటి దాడి ప్రభావంతో ఆ రెండు పట్టణాల్లో ఇప్పటికీ అంగవైకల్యంతో జన్మిస్తున్న వారున్నారు. భావోద్వే గాలతో నిండిన ఒబామా ప్రసంగంలో క్షమాపణ ప్రసక్తి లేకపోవడం సంగతలా ఉంచి... కనీసం అణ్వస్త్రాల తగ్గింపు గురించిగానీ, అందుకోసం అమెరికా తన వంతుగా చేయదల్చుకున్నదేమిటనిగానీ లేకపోవడం అన్యాయమని చాలామందికి అనిపించడంలో తప్పులేదు. చరిత్రలో జరిగిపోయిన వాటిని సరిదిద్దలేకపోయినా, అవి మళ్లీ పునరావృతం కాకుండా చూడటం సాధ్యమే. కనీసం ఆ దిశగా ఒక్క అడుగైనా ముందుకేయడానికి సంసిద్ధత ప్రదర్శిం చకపోవడమంటే ఆ తప్పు తిరిగి జరగడానికి ఆస్కారం కల్పించినట్టే. మారడానికి సిద్ధంగా లేమని ఒప్పుకోవడమే. అయితే ఒబామా వర్తమాన స్థితిని కూడా అర్ధం చేసుకోవాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక అమెరికన్ల పరిభాషలో ఆయన నిస్సహాయ లేదా నిరర్ధక అధ్యక్షుడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు అసాధ్యం. అందువల్లే హిరోషిమా వెళ్లడమే ఒక సాహ సోపేత నిర్ణయంగా భావించ మని కొందరు చెబుతున్నారు. ఆధిపత్యం కోసమో, వనరుల దోపిడీ కోసమో దేశాల మధ్య సాగే యుద్ధాలు మౌలికంగా ఆయా దేశాల సైన్యాల మధ్య సాగే సాయుధ ఘర్షణలు. జనావాస ప్రాంతాలను ఈ ఘర్షణలు తాకరాదని, పౌరులకు ప్రాణాంతకం కానీయరాదని అంతర్జాతీయ నియమాలున్నా చాలా సందర్భాల్లో వాటిని ఎవరూ పట్టించు కోవడం లేదు. ఈనియమాల ఉల్లంఘనలో అమెరికాది అగ్రస్థానమని ప్రపంచం మూలమూలనా నిరూపణవుతోంది. అది ఇరాక్ కావొచ్చు...సోమాలియా కావొచ్చు... అప్ఘానిస్తాన్ కావొచ్చు. అవి క్షిపణులు కావొచ్చు...బాంబులు కావొచ్చు... ద్రోన్ దాడులు కావొచ్చు- అతి తరచుగా బలవుతున్నది సామాన్య పౌరుల ప్రాణాలే. ఈ దేశాలన్నిటా సాగించిందీ, సాగిస్తున్నదీ దురాక్రమణే తప్ప యుద్ధం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి జపాన్ దురాక్రమణ ఉన్మాదం ఏ స్థాయిలో ఉన్నదో... దాని సైన్యాలు చైనాలోనూ, కొరియాలోనూ, ఇతరచోట్లా సాగించిన దురంతాలెలాంటివో అందరికీ తెలుసు. దాన్ని దారికి తీసుకురావడం అవసరమని అందరూ భావించినా అందుకు ఆ దేశ ప్రజల్ని మట్టుబెట్టడమే మార్గమని ఎవరూ అనుకోలేదు. అమెరికా ఇప్పుడు దేశదేశాల్లో సాగిస్తున్న దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు సైతం అందుకు ఆ దేశ ప్రజల్ని బాధ్యులుగా చేయరు. వియత్నాంలో 60వ దశకంలో అమెరికా సృష్టించిన మారణహోమాన్ని నిలువ రించడం చైతన్యవంతులైన అమెరికా ప్రజలవల్లనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అలాంటి చైతన్యమే అమెరికా దూకుడును నిలవరించగలదని అందరూ అనుకుం టున్నారు. చరిత్రకు సంబంధించిన ఎరుక ఇందుకు దోహదపడుతుంది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై జరిగిన అణ్వస్త్ర దాడుల గురించి అమెరికా ప్రజానీకం వైఖరిలో ఎంతో మార్పు వచ్చిందని ఈమధ్యే నిర్వహించిన ఒక సర్వే అంటున్నది. వ్యతిరేకులకూ, అనుకూలురకూ మధ్య స్వల్ప తేడాయే ఉన్నా ఆ దాడులు తప్పేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని చెబుతున్నది. పదేళ్లక్రితం ఇలాంటి సర్వేయే జరిపినప్పుడు అత్యధికులు ఆ దాడుల్ని సమర్ధించారు. చరిత్ర శిథిలాలపై హిరోషిమా పునర్నిర్మితమైంది. వర్తమాన ప్రపంచ అత్యాధునిక నగరాల్లో అదొకటి. 12 లక్షలమంది జనాభా గల ఆ నగరంలో ఇప్ప టికీ 50,000మంది బాంబు దాడి బాధితులున్నారు. కానీ అన్ని దేశాలూ జపాన్‌లా కాలేవు. అన్ని నగరాలూ హిరోషిమాగా చివురించలేవు. పచ్చని జీవితాన్ని ధ్వంసం చేయడం లిప్తకాలంలో చేయొచ్చుగానీ...దాన్ని పునర్నిర్మించడం, మళ్లీ జవజీవాల్ని అందించడం అంత సులభం కాదు. మరిన్ని హిరోషిమాలు రాకూడదనుకుంటే నిష్కర్షగా, నిజాయితీగా, స్వచ్ఛంగా మాట్లాడటం అవసరం. కేవల భావోద్వేగాలు, ఉత్ప్రేక్షలు, పరోక్ష ఒప్పుకోళ్లవల్ల పెద్దగా ఫలితం ఉండదు. -
గత గాయాలకు మందు
బైలైన్ క్యూబా. వియత్నాం. హిరోషిమా. బరాక్ ఒబామా మనకు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? నాకైతే అలాగే అనిపిస్తున్నది. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ అధ్యక్ష పదవీకాలంలోనే ఈ తరం అమెరి కన్లను వెంటాడిన కొన్నికొన్ని జ్ఞాపకా లనూ, సందిగ్ధాలనూ తనకు సాధ్యమై నంత మేర భూస్థాపితం చేయాలని ఒబామా ప్రయత్నం చేస్తున్నారు. ఆ జ్ఞాపకాలు, సందిగ్ధాలు ఏవంటే: 1945లో నాగసాకి, హిరోషిమాలను సర్వ నాశనం చేసిన అణుబాంబులు, 1960లలో క్యూబా, వియత్నాంల మీద జరిగిన దాడి ఘటనలు. దేశాధ్యక్షునిగా ఆయన ఈ సంఘటనల మీద క్షమాపణలు చెప్పలేరు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధులకు అది క్షేమకరం కాదు. అలాగే సోవియెట్ యూనియన్‌కు తీవ్రమైన సవాళ్లు విసరి, కమ్యూనిజం నుంచి ఈ స్వేచ్ఛా ప్రపం చాన్ని రక్షించామని విశ్వసించే వారికి కూడా అది ఆత్మహత్యా సదృశమవుతుంది. కానీ 19 60, 1970లలో పెరిగి పెద్దదైన తరానికి మాత్రం క్యూబా మీద జరిగినది ఓ మూర్ఖపు చర్య, వియత్నాం మీద దాడి ఘోర తప్పిదం. ఇది పూర్తిగా యాదృచ్ఛికం కాకున్నా, బరాక్ ఒబామా పుట్టిన సంవత్సరం, బే ఆఫ్ పిగ్స్ (దక్షిణ క్యూబా) మీద విఫల దాడికి జాన్ఎఫ్ కెన్నెడి ఆమోదించిన సంవ త్సరం కూడా 1961. కొన్ని మాసాల తరువాత క్యూబాలో క్షిపణల గురించిన వివాదం మీద అమెరికా, సోవియెట్ రష్యా అణు సంఘర్షణతో ఈ ప్రపంచాన్ని పేల్చేసినంత పనిచేశాయి. పశ్చాత్తాపం కూడా తగిలిన ఎదురు దెబ్బలకి కొంత సాంత్వన చేకూర్చగలదని ఒబామాకు తెలుసు. అయితే ఇందుకు తాను కూడా కొంత మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయ నకూ తెలుసు. అందుకు సంబంధించిన ఆత్మలు ప్రార్థనలతో సరిపెట్టుకోవు. వాటిని పూర్తిగా భూస్థాపితం చేయవలసిందే. గతకాలపు విషాదాలను మనం తుడిచిపెట్టలేం. వాటి పర్యవ సానాలను నిరాకరించలేం కూడా. ఒక ఘోర తప్పిదం గురించి బాహాటంగా అంగీకరిస్తే ప్రజలలో గుర్తింపు ఉంటుంది. గడచిన శతాబ్దంలో మనం చూసిన కనీవినీ ఎరుగని రక్తపాతాలు- యుద్ధాలు, వర్ణ వివక్ష, మారణహోమాలతో పోల్చి చూస్తే కామగాటమారు ఉదంతం వాటితో సమంగా మానవాళి మీద పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదు. కానీ సిక్కుల మీద అది లోతైన ముద్రను వదిలి వెళ్లింది. 1914లో సిక్కులు ప్రయా ణిస్తున్న కామగాటమారు అనే ఓడను జనంతో అలాగే కెనడా వెనక్కి తిరగ్గొట్టింది. ఇప్పటికీ ఆ గాయం రేగుతూనే ఉంటుంది. ఈ గాయాన్ని మాన్పవలసిన అవసరాన్ని కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆచితూచి వేసిన పదాలతో ఆయన ఓ ప్రకటన ఇచ్చారు కూడా. కామగా టమారు నౌకకు, అందులో అప్పుడు ప్రయాణించిన వారు ఎదుర్కొన్న ప్రతి విషాద ఘటనకి కెనడా బాధ్యత వహించలేదు. అయితే ఈ ప్రయాణికులు నిరపాయంగా తిరిగి వలస పోవడానికి వీలు కల్పించని నాటి కెనడా చట్టాలకు మాత్రం మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. పర్యవసానంగా ఎదురైన అన్ని విచారకర పరిణామాలకు మాత్రం మమ్మల్ని క్షమించాలి.’’ ఇందులో ముఖ్యాంశం బహిరంగంగా విచారం వ్యక్తం చేయడం. వాస్తవం ఏమిటంటే ఈ పనిచేయడానికి వందేళ్లు పట్టిందంటే, ఇలాంటి విషాదాన్ని గుర్తించడానికి వ్యవస్థలకు ఎంతకాలం పడుతుందో ఇది సూచిస్తుంది. అలాగే ఆ విషాదాలలోని అన్యాయం ఎంతటిదో గమనించడానికి కూడా ఎంత సమయం కావాలో ఇది సూచిస్తుంది. హిరోషిమా, నాగసాకిలలో నిర్మించిన శాంతి స్మారక స్తూపాన్ని సందర్శించడానికి అమెరికా అధ్యక్షుడికి 71 ఏళ్లు పట్టింది. ఇలాంటి వాటి మీద ఆగ్రహం ప్రకటించడం కంటే, నైతిక ప్రమాణాల గురించి మాట్లాడటం కంటే ఇలాంటి ఆలస్యాల వెనుక ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1945 నాటికి అమెరికా, జపాన్ అప్పటికి మూడేళ్ల నుంచి ఘోర యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి. ఎవరూ వెనక్కి తగ్గేటట్టు లేరు. కమికాజి అనుభవం దృష్ట్యా (పేలుడు పదార్థాలను నింపిన ఆ పేరు కలిగిన జపాన్ విమానం శత్రు స్థావరం మీద దాడి చేసింది) జరిగే ప్రాణనష్టం గురించి అమెరికా యోచించవలసి వచ్చింది. అయినప్పటికీ హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబుల బీభ త్సం తప్పలేదు. నా అభి ప్రాయం వరకు అమెరికా, జపాన్ల మధ్య సయోధ్య ఇప్పటికి పరిపూర్ణం కాలేదు కానీ, 1950లలోనే ఇందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక ఉత్పాతం కంటే శాంతి గొప్పదన్న వాస్తవాన్ని ఇంత తొంద రగా గుర్తించినందుకు రెండు దేశాలకు చెందిన ప్రజలకు శిరసు వంచి నమ స్కరించాలి. పర్యవసానం గా ప్రపంచం కొంత మెరుగైన స్థితికి చేరింది. చరిత్రలో సరికొత్త అధ్యాయం ఎప్పుడు మొదలవుతుంది? విజయం లేదా పరాజయం ప్రతి అంశాన్ని పరిపూర్ణంగా మార్చి వేసినప్పుడు తప్ప, సరికొత్త అధ్యాయం గురించి చెప్పడం ఎప్పుడూ కష్టమే. ఒక పరిణామం కొనసాగింపు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. ఒబామాకు క్యూబా సాదర స్వాగతం చెప్పినప్పుడు కూడా అమెరికా ఆ దేశంతో సంబంధాలకు సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని ఏళ్ల నుంచి ఆ తలుపులను తట్టలేదు. అయితే ఆ తలుపులు ఇక ఎప్పటికీ తెరిచే ఉంటాయని ఒబామా పర్యటన గట్టిగా చెబుతోంది. అమెరికా-వియత్నాం సంబంధాలలో ఒబామా తాపీగా చేసిన విన్యాసం ఒక కొత్త విధానాన్ని పరిచయం చేస్తున్నది. వియత్నాంకు అమెరికా ఆయుధాలు అమ్మబోతున్నది. వియ త్నాం యుద్ధం కొన్ని దశాబ్దాల క్రితమే ముగిసి ఉండవచ్చు కానీ, విభేదాలకు సంబంధించిన చివరి జాడలు, అంటే అనుమానాలు కూడా ఇప్పుడు సమసిపోయాయి. ఇది 1940లలో కమ్యూనిస్టు యోధుడు హోచిమన్ జపాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో కలసినప్పుడు ఆ రెండు దేశాల మధ్య కొనసాగిన బంధానికి పూర్తి విరుద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే ఐరోపా దేశాలను వలసల నుంచి ఖాళీ చేయవలసిందిగా అమెరికా ఒత్తిడి చేస్తుందని హోచిమన్ భావించారు (ఇలాంటి కారణాలతోనే గాంధీజీ మొదటి ప్రపంచ యుద్ధానికి మద్దతు ఇచ్చారు). కానీ రూజ్వెల్ట్ చనిపోయిన తరువాత ఆయన వారసుడు హ్యారీ ట్రూమన్ వియత్నాం మీదకు ఫ్రాన్స్‌ను ఉసిగొలిపారు. మిగిలిన కథ అందరికీ తెలుసు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి