Hit Movie
-
'సరిపోదా' అయిపోయింది.. కొత్తది మొదలుపెట్టిన నాని
'సరిపోదా శనివారం' సినిమాతో మొన్నీ మధ్యే హీరో నాని.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇది ఇంకా థియేటర్లలో ఉండగానే కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'హిట్ 3' రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైపోయింది. నానిపై సన్నివేశాల్ని చిత్రీకరించారు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)విశ్వక్ సేన్, అడివి శేష్.. తొలి రెండు భాగాల్లో హీరోలుగా నటించారు. ఇక మూడో పార్ట్‌లో అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ పోలీస్‌గా నాని కనిపించబోతున్నాడు. రీసెంట్గా నాని పాత్ర ఎలా ఉంటుందో తెలియజెప్పేలా చిన్న వీడియో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా తర్వాత నాని.. తనతో 'దసరా' సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెలతో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. ఇది ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉండబోతుంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో అజిత్) -
నాని సినిమా.. పిల్లలకు నో ఎంట్రీ!
హీరో నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియెన్సే మెయిన్ టార్గెట్. కానీ మెల్లమెల్లగా పంథా మార్చుకుంటున్న నాని.. యాక్షన్ మూవీస్ చేస్తూ మిగతా ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నాడు. అలా ఇప్పుడు తన తర్వాత మూవీ గురించి హింట్ ఇచ్చేశాడు. వయలెన్స్ ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పిల్లలని థియేటర్లలోకి అనుమతించడం కుదరదని చెప్పాడు.(ఇదీ చదవండి: వరదలతో ఇబ్బందులు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)నాని చెప్పిన దానిబట్టి చూస్తే హిట్ 3 గురించే అయ్యింటుందని అనిపిస్తుంది. ఎందుకంటే 'హిట్' ఫ్రాంచైజీలో ఇదివరకే వచ్చిన రెండు సినిమాల్లో హీరో పోలీస్‌గా చేస్తే సైకో పాత్రలు విలన్. ఇందులోని మూడో భాగంగా సైకో పాత్ర ఎంత కృూరంగా ఉంటుందో.. నాని చేయబోయే అర్జున్ సర్కార్ పాత్ర అంతకు మించి అనేలా ఉంటుందట. దీని గురించే నాని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడా అనిపిస్తుంది.ఇది కాకుండా 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మూవీకి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో నడిచే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇదని తెలుస్తోంది. ఇందులో కూడా యాక్షన్ డోస్ గట్టిగానే ఉండబోతుంది. దీనిబట్టి చూస్తుంటే ఇప్పటివరకు తనకు బలమైన ఫ్యామిలీ ఆడియెన్స్‌ని నాని ఏమైనా దూరం చేసుకుంటున్నాడా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?) -
సప్త సాగరాలు
రక్షిత్ శెట్టి హీరోగా నటించి, నిర్మించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. ఈ నెల 1న కన్నడలో విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి కలిసి ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో ఈ నెల 22న తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రమిది. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి కథానాయకుడిగా మంచి విజయాన్ని అందించిన చిత్రం పిజ్జా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రమ్య నంబీషన్ ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారిని కూడా విశేషంగా ఆకట్టుకుని, ఘన విజయం అందుకుంది. కాగా పిజ్జా చిత్రం సక్సెస్‌తో ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా పిజ్జా –2 విల్లా చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే సంస్థలో సీవీ కుమార్ ఇటీవల నిర్మించిన చిత్రం పిజ్జా –3 దిమమ్మీ . నటుడు అశ్విన్ కాక్కుమను కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రవీనా దాహా, సుభిక్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మోహన్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 28వ విడుదలై విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. (ఇదీ చదవండి: కోకాపేట ఆంటీ ఎప్పుడో చెప్పింది.. ఆ ఏరియా చాలా రిచ్ అని!) దీంతో పిజ్జా– 4 చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్ మీడియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తాను ఇంతకు ముందు హారర్ర్, సస్పెన్స్ నేపథ్యంలో రూపొందించిన పిజ్జా చిత్రం మూడు సీక్వెల్స్ ను ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించి వైవిధ్య భరిత కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందని నిరూపించారన్నారు. వారు ఇచ్చిన నమ్మకంతోనే పిజ్జా –4 చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన దర్శకుడు, నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెళ్లడించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్ చెప్పారు. -
Hit 2: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్ .. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్
అడివి శేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ఈ చిత్రంలో ఆయన కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శైలేష్ కొలను ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్షన్లో ఇంతకు ముందు రూపొంది ఘన విజయాన్ని సాధించిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ చిత్రానికి ఇది ఫ్రాంచైజీగా రూపొందింది. అడివి శేష్ ఇందులో కె.డి అనే పాత్రలో కనిపిస్తుంటే ఆయనకు జోడీగా ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ భారీ రేంజ్లో విడుదలవుతుంది. గత వారం విడుదలైన ‘హిట్ 2’ టీజర్‌కి టెరిఫిక్ రెస్పాన్ష్ వచ్చింది. ఇప్పుడు ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్‌తో ఆడియెన్స్‌ని అలరించబోతున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కచ్చితంగా ఫుల్ సాంగ్ ట్రీట్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. బ్యూటీఫుల్ విజుల్స్, దానికి తగ్గ ట్యూన్ మ్యాజిక్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించారు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ శ్రావ్యమైన గొంతు వినటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి సాంగ్ ఈ నెల న 10న విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బి.హెచ్ ఎడిటర్, ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్, ఎప్పుడు? ఎక్కడంటే?
తెలుగులో వచ్చిన హిట్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీని నేచురల్ స్టార్ నాని నిర్మించారు. ఇక్కడ మూవీ హిట్ కొట్టడంతో హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే కదా! రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో దంగల్ బ్యూటీ సాన్యా మల్హోత్రా కథానాయికగా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరి హిట్‌ను యధాతథంగా తీశారా? ఏమైనా మార్పులు చేశారా? హిందీ వర్షన్ ఎలాగుంది? అనేది తెలుసుకోవాలంటే మరో నాలుగురోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో హిట్‌ను చూసేయండి మరి! The tense case of a highway, a lost car and a missing girl. HIT, The First Case is coming to Netflix on 28th August!#HITTheFirstCase pic.twitter.com/8H9gj8ODY1 — Netflix India (@NetflixIndia) August 23, 2022 చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి సౌందర్యతో ఎఫైర్.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు -
'హిట్' రీమేక్ రిలీజ్ డేట్ మార్చిన మూవీ టీం
యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. రాజ్ కుమార్ రావు,దంగల్ ఫేం సన్యా మల్హోత్రా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఈనెల 20న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను మరో తేదీకి మారుస్తూ రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసింది మూవీ టీం. ఈ విషయాన్ని హీరోయిన్ సన్యా మల్హోత్రా సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని క్రిషన్‌కుమార్, కుల్దీప్ రాథోడ్‌లతో కలిసి దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మానన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_) -
‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి
Adivi Sesh Hit 2 Movie Release Date Locked: నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన 'హిట్ .. ది ఫస్టు కేస్' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్వీక్వెల్‌గా హిట్ 2ను నిర్మించారు. ఈ సీక్వెల్లో అడవి శేష్ హీరోగా నటించాడు. ' హిట్ ది సెకండ్ కేస్' అనే టైటిట్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు మేకర్స్. జూలై 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇస్తూ పోస్టర్‌ను వదిలిలారు. చదవండి: రాజీవ్‌తో విడాకులపై స్పందించిన యాంకర్ సుమ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. జాన్ స్టీవర్టు సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి - కోమలి ప్రసాద్ కథానాయికలుగా అందాల సందడి చేయనున్నారు. భానుచందర్, రావు రామేశ్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే అడివి శేష్ మరో చిత్రం మేజర్ 'మేజర్' మే 27వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ మూవీని సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. Something DANGEROUS about to unfold in the HIT universe! Get ready for spine chilling suspense on the 29th of July. #HIT2OnJuly29 #Hit2@NameisNani @KolanuSailesh @PrashantiTipirn #MeenakshiChaudhary @maniDop @Garrybh88 #JohnStewartEduri @ManishaADutt @SVR4446 pic.twitter.com/GfcAdjTj5K — Adivi Sesh (@AdiviSesh) May 2, 2022 -
ఈ సంవత్సరం సీక్వెల్స్‌తో తగ్గేదే లే..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది. దాదాపు అరడజను సినిమాల సీక్వెల్స్ నిర్మాణంలో ఉంటే, ప్రకటించిన సీక్వెల్స్ కూడా అరడజనుకు పైగా ఉన్నాయి. ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనేలా ఒకే ఏడాదిలో తెలుగులో ఇన్ని సీక్వెల్స్ రూపొందడం ఇదే మొదటిసారి. మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు ‘తరువాయి భాగం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సీక్వెల్ సినిమాల గురించి తెలుసుకుందాం. త్రిబుల్ సందడి... ‘ఎఫ్ 2’ సినిమాతో సంక్రాంతి అల్లుళ్లుగా కడుపుబ్బా నవ్వించారు వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ‘ఎఫ్ 2’ 2019 జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించింది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నవారికి ఈ సినిమా ద్వారా ‘వెంకీ ఆసనం’ నేర్పించారు వెంకటేశ్. తోడల్లుళ్లుగా వెంకీ–వరుణ్‌లు చేసిన డబుల్ సందడిని ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందాన్ని త్రిబుల్ చేయడానికి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ మే 27న విడుదలవుతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాట చేశారు. ‘ఎఫ్ 2’ మంచి విజయం సాధించడంతో ‘ఎఫ్ 3’ పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తగ్గేదే లే అంటూ... ‘తగ్గేదే లే’... ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. ‘ఆర్య, ఆర్య 2’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్– డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’: ది రైజ్. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘తగ్గేదే లే’ అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించింది టీమ్. ప్రస్తుతం ‘పుష్ప 2’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. గత ఏడాది ‘పుష్ప’ విడుదలైన తేదీ (డిసెంబరు 17)నే ఈ ఏడాది డిసెంబరులో ‘పుష్ప 2’ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎనిమిదేళ్లకు సీక్వెల్... నిఖిల్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాతి హీరోయిన్గా నటించారు. వెంకట్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా 2014 అక్టోబర్ 14న విడుదలై ఘనవిజయం సాధించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. ‘కార్తికేయ’ విడుదలైన ఎనిమిదేళ్లకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మళ్లీ హిట్ కోసం... వైవిధ్యమైన చిత్రాలతో హిట్స్ అందుకుంటున్న హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హిట్’ 2020 ఫిబ్రవరి 28న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2’ని తీస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. అయితే ‘హిట్ 2’కి హీరో, హీరోయిన్ మారారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్న, నిర్మాణంలో ఉన్న చిత్రాలైతే మరికొన్ని సీక్వెల్స్ కూడా రూపొందనున్నాయి. ఆ చిత్రాలేంటంటే.. రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’కి సీక్వెల్, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’కి సీక్వెల్, గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘లక్ష్యం’కి సీక్వెల్, మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ సీక్వెల్ కూడా రానున్నాయి. ఇంకా ఉదయ్ కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ (2000) మూవీకి సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ తెరకెక్కనుంది. అలాగే అడివి శేష్ ‘గూఢచారి’, తేజా సజ్జ ‘జాంబి రెడ్డి’, నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్’, సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ వంటి చిత్రాల సీక్వెల్స్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. చదవండి: ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హంగామా
-
ఆకట్టుకుంటున్న అడవి శేష్ కేడీ ఫస్ట్ గ్లింప్స్
నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన 'హిట్ .. ది ఫస్టు కేస్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు నాని 'హిట్ 2 ది సెకండ్ కేస్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. నేడు(డిసెంబర్ 17) అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్ వదిలారు. ఇందులో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ఆయనకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ .. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్ .. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడటం .. తన అన్వేషణకి అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. -
‘హిట్’ రీమేక్‌లో హీరోయిన్గా దంగల్ నటి ఖరారు!
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్‌ను అందుకుంటున్నాయి. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన ఉప్పెన. ఇది చిన్న సినిమే అయినప్పటికీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కంటెంట్ చిత్రాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కబీర సింగ్‌గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడంతో ఇక బాలీవుడ్ మన తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ టాలెంటెట్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ కూడా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. హిందీ రాజ్‌కుమార్ రావు హీరోగా తెరకెక్కతున్న ఈ రీమేక్‌లో.. తాజాగా హీరోయిన్ను కూడా ఖారారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దంగల్ మూవీ నటి సన్యా మల్హోత్రాను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. కాగా దంగల్‌లో ఆమె ఆమీర్ ఖాన్‌కు కూతురిగా కనిపించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితో పాటు జెర్సీ, బ్రోచేవారేవరురా, అలా వైకుంఠపురంలో, డీజే, నంది, రవితేజ ఖిలాడీ మూవీలో కూడా హందీ రీమేక్‌కు క్యూలో ఉన్నాయి. -
‘హిట్’ సీక్వెల్: హీరో ఎవరో తెలుసా..?
యువ హీరో విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ చిత్రం సూపర్ డూపర్ విజయాన్ని అందుకుంది. హీరో నాని నిర్మించిన ఈ సినిమా విశ్వక్‌కు ప్రత్యేక గుర్తింపును అందించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సీక్వెల్ లో విశ్వక్ సేన్ నటించడం లేదు. సెకండ్ పార్ట్‌లో అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు. హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలోనే హిట్ 2 సినిమా రూపొందనుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. తాజాగా శనివారం 'హిట్ 2' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆడవి శేషు ట్విటర్ వేదికగా విడుదల చేశాడు. ఈ సినిమాలో క్రిష్ణ దాస్ పాత్రలో అడవి శేషు కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కనిపించనుంది. 'ది సెకండ్ కేస్' అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా తెలంగాణకు చెందిన పోలీస్ ఆఫీసర్ అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్ సినిమాను రూపొందించగా..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిట్ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ కేసును ఆఫీసర్ కేడీ ఆసక్తికరంగా ఎలా డీల్ చేస్తారో హిట్-2లో చూపించబోతున్నారు. చదవండి: మరో ఇంట్రెస్టింగ్ కేసుతో 'హిట్ 2' అందం.. అదితిరావు హైదరి సొంతం HIT. The Second Case. #HIT2 As KD! Bigger. Better. Bad-ass. Shoot starts after I finish Major but Heat starts now. Happy to collaborate with my favorite @NameisNani the amazing @PrashantiTipirn & the talented @KolanuSailesh His vision full ga! Happy to be part of it🙏🏼 pic.twitter.com/n3rbvXIhFw — Adivi Sesh (@AdiviSesh) March 20, 2021 -
మరో ఇంట్రెస్టింగ్ కేసుతో 'హిట్ 2'
విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్: ది ఫస్ట్ కేస్’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 28కి ఏడాది పూర్తయింది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు నాని ప్రకటించారు. ‘‘హిట్’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ‘హిట్ 2’ చిత్రాన్ని ప్రకటించడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు. కనిపించకుండా పోయిన అమ్మాయి కేసును ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు ఎలా డీల్ చేశారనే కథాంశంతో తెలంగాణ హిట్ టీమ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా హిట్ సినిమాను రూపొందించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిట్ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ కేసును ఆఫీసర్ కె.డి ఆసక్తికరంగా ఎలా డీల్ చేస్తారో చూపించబోతున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు నాని. -
హిందీకి హిట్
టాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా ‘హిట్’ సినిమా చేరింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నిర్మాత కుల్దీప్ రాథోర్‌తో కలిసి ‘హిట్’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించనున్నారు. హిందీ రీమేక్‌ను కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా 2021లో సెట్స్‌పైకి వెళ్లనుంది. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్ రావ్, ‘దిల్’ రాజుగారితో కలిసి పని చేయనుండటం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి, నేటివిటీకి తగినట్లు చిన్న చిన్న మార్పులు చేస్తా’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్ మూవీ ‘హిట్’. ఓ నటుడిగా ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘హిట్’ రీమేక్ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు రాజ్‌కుమార్ రావ్ . -
అక్కా మీరు నిజంగానే సిగరెట్ తాగారా?
లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో బుల్లితెరకు విరామమిచ్చిన టీవీ సెలబ్రిటీలు.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా నటి, యాంకర్ హరితేజ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అక్క హిట్ మూవీలో మీరు నిజంగానే సిగరెట్ తాగారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన హరితేజ నిజమేనని చెప్పారు. పాత్ర డిమాండ్ చేసిందని..అందువల్ల తప్పలేదని వెల్లడించారు. అలాగే మరికొందరు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఆమె వయసు గురించి ప్రశ్నించగా.. ‘చెప్పిన ఎవరూ నమ్మరు. నమ్మన వినరు. విన్నా అర్థం చేసుకోరు. నిజాలు నిష్టూరమే ఎప్పుడూ.. అయినా చెప్తా.. 24/02/1992’ అని హరితేజ తన పుట్టిన తేదీని వెల్లడించారు. అలాగే అభిమానుల కోరిక మేరకు ఒకట్రెండు పాటలు కూడా పాడారు. కాగా, ఓ వైపు యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించినప్పటికీ.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. చదవండి : అవ్రమ్‌కు హెయిర్ కట్ చేసిన విరానిక -
అప్పుడు నిర్మాతగా.. ఇప్పుడు హీరోగా?
అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫుల్ జోష్‌లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ‘వి’ తర్వాత తన తదుపరి చిత్రాలు ‘టక్ జగదీష్’, ‘శాం సింగరాయ్’ అంటూ ప్రకటించాడు. వీటితో పాటు ‘బ్రోచేవారెవరురా’ఫేం వివేక్ ఆత్రేయతో ఓ సినిమాను పట్టాలెక్కించే పనిలో నాని ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అయితే తాజాగా ‘హిట్’ఫేం శైలేష్ కొలనుతో నాని ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ మధ్య నానికి ఓ ఆసక్తికర పాయింట్‌ను శైలేష్ వినిపించాడని, అది నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేయమన్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే... హిట్ సినిమా దర్శకుడితో నాని హీరోగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్ సేన్ ‘హిట్’ చిత్రానికి నానినే నిర్మాత అన్న విషయం తెలిసిందే. నిర్మాతగా నానికి విజయాన్ని అందించిన శైలేష్ మరి హీరోగా నానిని తెరపై ఎలా చూపిస్తాడో చూడాలి. అయితే వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం లాక్డౌన్ సమయాన్ని వీర్దిదరు కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. చదవండి: చైనా కావాలనే ఇలా చేసింది : హీరో నిఖిల్ కరోనా.. సీసీసీకి కాజల్ విరాళం -
‘సినిమా అంటే తంతా అన్నారు’
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం `హిట్`. `ది ఫస్ట్ కేస్` ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ కొలను మీడియాతో ముచ్చటించారు. ‘హిట్’ పెద్ద హిట్ కావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను దేన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాను డైరెక్ట్ చేశానో అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. డిఫరెంట్‌గా తీశాడు అని, హానెస్ట్ థ్రిల్లర్ తీశాడని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు వచ్చిన కథను నిజాయతీగానే చేశానని అనుకున్నాను. సినిమా ఎలా స్టార్టయ్యింది? మంచి కథలు చెప్పాలనే ఆలోచన నాకు చిన్నప్పట్నుండి ఉండేది. 2011లో పి.హెచ్.డి చదవడానికి ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత స్క్రిప్ట్ ఎలా రాయాలనే దాన్ని నేర్చుకోవడానికి సమయం దొరికింది. నేర్చుకున్న తర్వాత తొలి ఫీచల్ ఫిల్మ్ స్క్రిప్ట్‌ను 2016లో రాశాను. నేను నానిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన డిఫరెంట్ మూవీస్ చేస్తుండటాన్ని గమనించాను. ఆయన్ని కలిస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తారనిపించింది. కామన్ ఫ్రెండ్ ద్వారా నానిగారితో పరిచయం ఏర్పడింది. వాట్సప్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఓ రోజు ఆయన వచ్చి కథ చెప్పమని అన్నారు. నేను ముందు రెండు కథలు చెప్పాను. ఆయనకు నచ్చినా కూడా కొన్ని కారణాలతో అవి పక్కకు వెళ్లిపోయాయి. మూడో కథగా హిట్ కథను చెప్పాను. ఆయనకు నచ్చడంతో పాటు అన్ని చక్కగా అమరడంతో సినిమా స్టార్ట్ అయ్యింది. పనిచేస్తూ సినిమాలపై వర్క్ చేయడం..ఎలా మేనేజ్ చేశారు? సాధారణంగా నేను పనిచేసేటప్పుడు సాయంత్రం ఐదు వరకే పని ఉండేది. శుక్రవారం వరకు మాత్రమే పని చేసేవాళ్లం. శనివారం, ఆదివారం ఖాళీగానే ఉండేవాడిని. ప్రతిరోజూ సాయంత్రం స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ క్లాసులకు వెళ్లేవాడిని. 8 సంవత్సరాలు ప్రతివారం మూడు రోజుల పాటు సినిమాకు సంబంధించి కష్టపడేవాడిని. హీరో నాని..మీ సినిమాకు నిర్మాత ఆయనేమైన సలహాలు ఇచ్చారా? లేదండి.. చిన్న చిన్న సలహాలు చెప్పారు. అసలు నేను సన్నివేశాలను ఎందుకలా రాసుకున్నాననే ఉద్దేశాన్ని తెలుసుకున్నారు. 98 శాతం నేనెదైతే రాసుకున్నానో దాన్నే సినిమాగా తీశాం. విశ్వక్‌ను హీరోగా తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చూసినప్పుడే నేను ఈ హీరోతో పనిచేయాలని అనుకున్నాను. తనలో మంచి ఇన్టెన్స్ ఉందనిపించింది. నేను కథలు రాసే సమయంలో ఎవరినీ మనసులో పెట్టుకుని కథ రాయను. ‘హిట్’ కథ రాసుకునే సమయంలో 20-30 శాతం కథ పూర్తవగానే నాకు విశ్వక్సేన్ మైండ్లోకి వచ్చాడు. నానిగారితో, ప్రశాంతిగారితో కూడా విశ్వక్ అయితే బావుంటాడని అనుకున్నాం. అందరూ డిస్కస్ చేసుకుని చివరకు విశ్వక్‌ను ఓకే చేశాం. తనని కలిసేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అనిపించింది. కానీ.. కథ విన్న తర్వాత ప్రశ్నలు అడుగుతున్నాడు. తనకు అర్థమవుతుందా? లేదా? అనిపించింది. కానీ కథంతా విన్న తర్వాత నానిగారికి ఫోన్ చేసి సినిమా చేస్తానని చెప్పాడు. తనలో ఓ డైరెక్టర్ ఉన్నప్పటికీ మేకింగ్ పరంగా ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నాకు పూర్తిగా సరెండర్ అయ్యి సినిమా చేశాడు. మీ నాన్నగారి ఫీలింగ్ ఏంటి? నాన్నగారు ముందు సినిమా చేస్తానంటే తంతా! అని అన్నాడు. కానీ ఆయనకు నా ప్రయత్నాలు గురించి చెప్పకుండా ఇక్కడకు వచ్చి వెళ్లేవాడిని. తర్వాత నాని సపోర్ట్ చేశారో అప్పుడు ఆయన ద్వారా తెలిసింది. ఆయన సినిమా చూసి షాకయ్యారు. ఎలా నేర్చుకున్నావురా? సినిమా ఎలా తీసేశావ్? ఆడుతూ పాడుతూ చేసేశావ్ అన్నారు. నేను సినిమా గురించి చేసిన వర్క్ ఆయనకు తెలియదు. ఈ కథకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఈ సినిమాకు ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. నేనొక థ్రిల్లర్ సబ్జెక్ట్ రాయాలని అనుకున్న తర్వాత ప్రపంచంలో జరిగిన క్రైమ్స్ గురించి వార్తాపత్రికల్లో చదివాను. ఆసక్తికరమైన కేసులన్నింటినీ నా డైరీలో రాసుకుంటూ వచ్చాను. నిజ ఘటలను కలిపి రాసుకున్న కథే హిట్. కమల్‌హాసన్‌గారి హేరామ్ సినిమా వల్లనే నేను సినిమాల్లోకి రావాలని అనుకున్నాను. ఆ సినిమాను ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువసార్లు చూశాను. ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ సినిమాలో కనిపించిందనుకుంటాను. ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? లక్ష్మీ మంచుగారు నాకు మంచి ఫ్రెండ్ ఆమె సినిమా చూసి ఫోన్ చేసి అభినందించారు. రానాగారు ఇన్స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక దిల్‌రాజుగారు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. యంగ్ డైరెక్టర్స్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. రెండో సినిమా గురించి భయముందా? తప్పకుండా భయం కంటే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తొలి సినిమానే ఇంత బాగా చేశాడురా! అని అందరూ అనుకున్నారు. దాన్ని నిలబెట్టుకోవాలనుకునే బాధ్యత ఉంది. ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయననే నమ్మకం ఉంది. దర్శకుడిగా మీకు ఇష్టమైన జోనర్ ఏంటి? నేను పర్టికులర్ జోనర్ సినిమాలు చూడాలనుకోను..సినిమాలు చేయాలనుకోను. ప్రస్తుతం నా దగ్గర నాలుగు కథలు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో ఉన్నాయి. అన్నీ వేర్వేరు జోనర్ మూవీస్. ఒక సినిమా అయితే మ్యూజికల్ స్టోరి. అందులో 17 పాటలున్నాయి. దాన్ని అలాగే చెప్పాలి. వెబ్సిరీస్లేమైనా చేసే ఆలోచన ఉందా? నేను సినిమా ఫార్మేట్‌ను ఎక్కువగా నమ్ముతాను. అయితే కొన్ని కథలను వెబ్ సిరీస్‌ల ఫార్మేట్లో చెబితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని బాగా నమ్ముతాను. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ‘హిట్’ కేస్2 ఎప్పుడు తెరకెక్కిస్తారు? వెంటనే తెరకెక్కిస్తాను. ప్రస్తుతం దానిపైనే వర్క్ చేస్తున్నాం. సేమ్ టీమ్‌తో వర్క్ చేయబోతున్నాను. మరికొన్ని పాత్రలు యాడ్ అవుతాయి. 2021లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మే చివర లేదా జూన్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నానిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనకు సరిపోయే కథ నాకు ఐడియాకు వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను. చదవండి: ‘హిట్’ మూవీ రివ్యూ నోరూరించే ఎగ్ దోశ వేసిన హీరోయిన్ -
‘హిట్’ సక్సెస్ మీట్
-
‘హిట్’ మూవీ రివ్యూ
టైటిల్: హిట్ జానర్: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు: విశ్వక్సేన్, రుహానీ శర్మ, బ్రహ్మాజీ, భానుచందర్, మురళీశర్మ, తదితరులు సంగీతం: వివేక్ సాగర్ దర్శకత్వం: శైలేష్ కొలను బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ట్యాగ్ లైన్ . హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని ప్రొడ్యూసర్‌గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? క్రైమ్ స్టోరీని దర్శకుడు శైలేష్ కొలను తెరపై చక్కగా ప్రజెంట్ చేశాడా? విశ్వక్ సేన్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్‌గా ఏ మేరకు మెప్పించాడు? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం(హిట్) ఓ విభాగం. హిట్‌కు విశ్వ (భానుచందర్) హెడ్. విశ్వ టీంలోనే విక్రమ్ (విశ్వక్ సేన్), అభిలాష్ (శ్రీనాథ్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఎంతో సిన్సియర్ అండ్ టాలెంటెడ్ ఆఫీసర్స్. ప్రతీ క్రైమ్ కేసును సులువుగా ఛేదిస్తుంటారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నేహ(రుహానీ శర్మ), విక్రమ్‌ల మధ్య ఎప్పటినుంచో ప్రేమ కొనసాగుతోంది. ఈ క్రమంలో నగరంలో ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేహ కూడా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను విక్రమ్‌కు విశ్వ అప్పగిస్తాడు. అయితే కేసుకు సంబంధించి ఎటువైపు వెళ్లినా అన్ని దారులు మూసుకపోతుంటాయి. కేసులో భాగంగా విచారిస్తున్న వారందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. అయితే ఈ కేసులోకి షీల(హరితేజ), షిండే (బ్రహ్మాజీ), ఇబ్రహీం(మురళీ శర్మ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ కేసును విక్రమ్ ఛేదించాడా? ప్రీతి, నేహాలకు ఏమైంది? వారిని కిడ్నాప్ చేసింది ఎవరు? రెండు కిడ్నాప్‌లు చేసింది ఒకరేనా లేక ఇద్దరా? అసలు విక్రమ్‌కు ఉన్న ఆ వింత వ్యాధి ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: తొలి రెండు సినిమాల్లో మన గల్లీలోని కుర్రాడిలా కనిపించిన విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఓ సీరియస్ పోలీస్‌మన్ పాత్రలో మెరిశాడు. ఓ క్రైమ్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ పడే ఇబ్బందులు, ఆలోచించే విధానం, టెన్షన్స్, ఎమోషన్స్, అంతేకాకుండా అతడికున్న వింత వ్యాధితో పాటు, ప్రేమించిన అమ్మాయి దూరం అవడంతో పడే ఆవేదన ఇలా అన్ని భావాలను పండించాడు విశ్వక్. ఈ కథ హీరోయిన్ మిస్సింగ్ చుట్టూ జరిగినా.. రుహానీ శర్మకు నటన పరంగా అంతగా ప్రాధాన్యం దక్కలేదు. లుక్స్ పరంగా బాగుంది. హరితేజకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కింది. ఇప్పటివరకు ఆమె చేయని క్యారెక్టర్ అయినప్పటికీ షీలా పాత్రలో ఒదిగిపోయింది. ఇక విక్రమ్‌తోనే ఉండే రోహిత్ (చైతన్య సగిరాజు) కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. భానుచందర్, మురళీ శర్మ, బ్రహ్మాజీలు తమ అనుభవంతో వారి పాత్రలను అవలీలగా చేశారు. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: నాని ప్రొడక్షన్ హౌజ్ నుంచి విశ్వక్ సేన్ సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ డిఫరెంట్ టైటిల్, సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పగానే అందరూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల అంచనాలను, నాని నమ్మకాన్ని, విశ్వక సేన్ ఆశలను డైరెక్టర్ శైలేష్ కొలను వమ్ము చేయలేదు. ఇలాంటి క్రైమ్ స్టోరీలపై సినిమాలు చాలానే వచ్చినా.. ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. కథ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, బలమైన క్రైమ్, ఇన్వెస్టిగేషన్ సీన్లపైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అవే సినిమాకు ప్రధాన బలం అవుతాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌తో పాటు మధ్యమధ్యలో హీరోహీరోయిన్ల లవ్ సీన్స్, హీరో గతం గురించి చూపించడం వంటివి డిఫరెంట్ స్క్రీన్‌ప్లేకు అద్దంపట్టింది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డు పడే వరకు కూడా ప్రేక్షకుడు నెక్ట్స్ ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తాడు. కొన్ని క్రైమ్ సినిమాలలో అసలు దోషి ఎవరో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది అయితే హీరో అతడిని ఎలా పట్టుకుంటాడని ఆసక్తిగా తిలకిస్తారు. కానీ ఈ సినిమాలో హీరోతో పాటు ప్రేక్షకుడు కూడా అసలు ఈ కిడ్నాప్ చేసింది ఎవరో అని మదిలో ఇన్వెస్టిగేట్ చేయడం ఖాయం. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌తోనే దర్శకుడు కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ క్రైమ్ కేసు వెనక బలమైన కారణాన్ని చూపించలేదు. దీంతో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగ పడిపోయిందన్న భావన కలుగుతుంది. హిట్‌కు సీక్వెల్ ఉండటంతో క్లైమాక్స్‌ను సాదాసీదాగా ముగించవచ్చని సగటు అభిమానికి సందేహం కలగక మానదు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వివేక్ సాగర్ మ్యాజిక్ చేశాడు. ఇక సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. మణికందన్ తన కెమెరా పనితనంతో ప్రేక్షకుడు కూడా పలుమార్లు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తాను కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఇక ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. క్లైమాక్స్ ఒక్కటి మినహా సినిమా అంతా చకచకా సాగిపోతుంది.. ఇలాంటి జానర్ సినిమాలను ఇష్టపడే వారు ‘హిట్’ కథలో తప్పకుండా ఇన్వాల్వ్ అయి ఆసక్తిగా చూస్తారు. థ్రిల్‌గా ఫీలవుతారు. ప్లస్ పాయింట్స్: విశ్వక్ సేన్ నటన కథనం ఇన్వెస్టిగేషన్ సీన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్, నిడివి బలమైన క్లైమాక్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
'హిట్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
‘ఆ పబ్‌లో ఏం జరిగిందో తెలియాలి’
‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్’. ఈ చిత్రం ద్వారా శైలేష్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం అని ఇప్పటికే విడుదలై డైలాగ్ ప్రోమోలో హీరో విశ్వక్ సేన్ చిన్న క్లారిటీ ఇచ్చేశాడు. డైలాగ్ టీజర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల అయింది. 127 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్లో ప్రీతి అనే అమ్మాయి కనిపించకపోవడం, ఆమె తల్లి దండ్రులు కంప్లెయింట్ ఇవ్వడం, స్పెషల్ ఆఫీసర్‌గా విక్రమ్ (విశ్వక్ సేన్) ఈ కేసు విచారించడం.. ఈ క్రమంలో యాక్షన్, సస్పెన్స్, లవ్ సీన్స్ ఇలా అన్ని అంశాలను ఈ ట్రైలర్లో జోడించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఓ సెక్షన్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో హిట్ ట్రైలర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా విశ్వక్ సేన్ తన నటనతో రఫ్పాడించాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. మురళీ శర్మ, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్ -
ఏదేమైనా వదలనంటున్న హీరో
ఫలక్‌నుమా దాస్ చిత్రంతో కుర్ర హీరో విశ్వక్సేన్ యూత్‌లో అపారమైన క్రేజ్ సాధించుకున్నాడు. నాటు భాషతో, మోటు పదాలతో బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేశాడు. తాజాగా ఆయన హీరోగా ‘హిట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. రుహాని శర్మ(చి.ల.సౌ ఫేమ్) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘దిస్ జాబ్ విల్ డిస్ట్రాయ్ యు విక్రమ్’ అనే మహిళ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. కానీ హీరో అనుకున్నది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వంలా ఉంది. అందుకే, ఏదేమైనా సరే.. కానీ ‘డిపార్ట్మెంట్ను మాత్రం నేను వదల్లేను’ అని తెగేసి చెప్పాడీ హీరో. తక్కువ డైలాగులతో, అదరగొట్టే బీజీఎమ్‌తో రూపొందించిన టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ సినిమా ప్రధానంగా ఓ మిస్సింగ్ కేసు చుట్టూనే సాగనున్నట్లు తెలుస్తోంది. కొలను శైలేష్ ఈ మూవీతో దర్శకడుగా పరిచయం అవుతున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ‘అ!’ సినిమాతో నిర్మాణం వైపు అడుగులు వేసిన నేచురల్ స్టార్ నాని ‘హిట్’ సినిమాను నిర్మిస్తున్నాడు. చదవండి: నేనే నానీనే! -
అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్’ గ్యారెంటీ!!
హైదరాబాద్: విభిన్న కథాచిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఎలాంటి వారసత్వ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. మంచి కథలను ఎంచుకుంటు.. ఓ చిన్న హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాని ఇంతకుముందు వైవిధ్యభరితమైన ‘అ!’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులు అందుకుంది. తాజాగా నాని మరో సినిమాను నిర్మిస్తున్నాడు. తన వాల్‌పోస్టర్ సినిమా సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వేక్సేన్ (ఈ నగరానికి ఏమైంది ఫేమ్), రుహాని శర్మ (చి.ల.సౌ. ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శైలేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రశాంతి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో పూజకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో-హీరోయిన్ల తొలి సీన్‌కు నాని క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను నాని ట్విటర్లో విడుదల చేశారు. -
జీవాతో ‘భయపడొద్దు’
నటుడు జీవాతో భయపడవద్దు అంటున్నారు ఆర్ఎస్ ఇన్ఫో ట్రైయిన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్, దర్శకుడు డీకే నటుడు జీవాకు ఈ మధ్య సరైన హిట్ సినిమా లేదు. ఆయన నటించిన నీ దానే ఎన్ పొన్ వసంతం, యాన్ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో జీవా కాస్త డీలా పడ్డ విషయం నిజమే. అందుకే కొంచెం ఆలస్యం అయినా సరే మంచి కథా చిత్రాలనే ఎంచుకోవాలని ఆశించిన జీవా ఇప్పుడు మళ్లీ కార్మోన్ముకుడవుతున్నారు. వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలన్న చందాన ఇంతకుముందు నీ దానే ఎన్పొన్ వసంతం, యాన్ చిత్రాలను చేసిన ఆర్ ఎస్ ఇన్ఫోట్రైయిన్మెంట్ సంస్థలోనే తదుపరి చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సంస్థ ఇంతకుముందు డీకే దర్శకత్వంలో నిర్మించిన యామిరుక్క భయమే చిత్రం ఘనవిజయం సాధించింది. ఇదే కాంబినేషన్లో జీవా హీరోగా కవలై వేండాం (భయపడవద్దు) అనే చిత్రం చేయనున్నారు. త్వరలోనే సెట్‌పైకి రానున్న ఈ చిత్రం కోసం కథానాయకి అన్వేషణ జరుగుతోందని ఒక ముఖ్య పాత్రలో బాబి సింహా నటించనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఒక వినూత్న కథకు వినోదాన్ని జోడించి కవలైవేండాం చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంతో పాటు జీవా మరో చిత్రానికి కూడా పచ్చజెండా ఊపారు. ఈ చిత్రానికి రాజారాణి ఫేమ్ అట్లీ కథను సిద్ధం చేయడం విశేషం. నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాయకిగా శ్రీ దివ్య నటించనున్నారు.