Indian wrestler
-
తొలిసారి అసెంబ్లీకి.. హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫోగట్ విజయం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. క్షణక్షణం.. రౌండ్ రౌండ్ అధిక్యాలు తారుమారు అవుతుండటంతో తుది గెలుపు ఎవరిదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది.తాజాగా భారత రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫొగట్ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 5763 ఓట్ల తేడాతో వినేశ్ పైచేయి సాధించారు. తొలి నుంచి లీడ్‌లో కొనసాగిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. మధ్యలో వెనుకంజలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకున్నారు. #WATCH | #HaryanaElections | Jind: After winning from Julana, Congress candidate Vinesh Phogat says, "This is the fight of every girl, every woman who chooses the path to fight. This is the victory of every struggle, of truth. I will maintain the love and trust that this country… pic.twitter.com/glAaySd6Ta— ANI (@ANI) October 8, 2024 దీంతో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వినేశ్.. హర్యానా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె ఒట్టి చేతులతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ తరువాత కొన్ని రోజులకే ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జులానా నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.ఇదిలా ఉండగా హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది..మూడో సారి అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 50, కాంగ్రెస్ 34, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. చదవండి: హర్యానా కౌంటింగ్ అప్డేట్లో జాప్యం.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు -
Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు. అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్‌లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కిన వినేశ్‌కు నిరాశే ఎదురైంది. -
రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు వాయిదా
-
ఒలింపిక్స్‌లో 57 కిలోల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్యం
-
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం
-
మనసు గెలిచింది- ఆ వంద గ్రాములు లెక్కే అంటారా?
నవ్వుతూ మాట్లాడకూడదు. నచ్చిన డ్రెస్ అసలే వేసుకోకూడదు. హవ్వ.. అబ్బాయిల్లా ఆ ఆటలు ఏంటి? ఏమ్మా నువ్వైనా నీ బిడ్డకు చెప్పవచ్చు కదా! అసలే తండ్రి లేని పిల్ల... ఇలాంటివి మీకు అవసరమా? సూదుల్లా గుచ్చే ఇరుగు పొరుగు మాటలు లెక్కచేయలేదు– ఆ తల్లీ.. కూతురు తల్లి ఎంతటి ధైర్యశాలో కూతురికి తెలుసు. 32వ ఏటనే భర్తను కోల్పోయినా ఇద్దరు కూతుళ్లను గొప్పగా పెంచింది. ఆడపిల్లలు బలహీనులని భావించక మగాళ్ల గోదాలో రెజ్లర్లుగా దించింది. క్యాన్సర్ బారిన పడ్డా కూతుళ్ల కోసం యముడితో పోరాడి బయటపడింది. అవును... ఆ తల్లిని చూసి పోరాడటం నేర్చుకుంది ఆ కూతురు... వినేశ్ ఫొగట్ డాటరాఫ్ సరళాదేవి.‘పట్టు’ పడితే పతకం మెడలో వాలాల్సిందే. అన్యాయం చేసిన వాళ్ల తాట తీయాల్సిందే. న్యాయపోరాటంలో మొండిగా ముందుకు దూకాల్సిందే. నాన్న లేడని అమ్మను వంకర చూపులు చూసే వాళ్ల తోడేలుతనం ఆమె దృష్టిని దాటి పోలేదు. ఆడవాళ్లకు అదెంత వేదనో స్వయంగా చూసింది. అందుకే తోటి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యామని చెబితే వారికి మద్దతుగా నిలిచింది. కెరీర్‌ను పణంగా పెట్టి రాజధానిలో ఉద్యమానికి ఊపిరిగా మారింది.పాలకుల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జీవితకాల శ్రమతో సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా తృణ్రపాయంగా విడిచిపెట్టింది. ఇంత బరితెగింపా అంటూ అజ్ఞానంతో అనరాని మాటలు అనే వాళ్లను చిరునవ్వుతో మరింత చికాకు పెట్టింది. మద్దతుగా నిలిచిన వారికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఖేల్ ఖతమే అన్న వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా అన్ని సవాళ్లను దాటుకుని మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అంతేనా.. ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించింది. స్వర్ణ పతకపోరుకు అర్హత సాధించింది. ఊహించని విధంగా వందగ్రాములు.. కేవలం వందగ్రాముల అదనపు బరువు కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం సాధించకపోతేనేమి.. అందరి హృదయాలలో అభిమానాన్ని సంపాదించింది. వీటన్నిటి ముందు ‘ఆ వంద గ్రాములు‘ లెక్కే అంటారా? (ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది)-సుష్మారెడ్డి యాళ్లచదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? -
హృదయం ముక్కలైంది: మరేం పర్లేదు.. ఇప్పటికే గెలిచేశావ్! (ఫొటోలు)
-
వినేశ్ ఫొగాట్‌కు స్వర్ణం
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. మాడ్రిడ్‌లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిలో వినేశ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో వినేశ్ 10–5 స్కోరుతో మారియా తియుమెరికొవాపై విజయం సాధించింది. రష్యాకు చెందిన మారియా తటస్థ అథ్లెట్‌గా బరిలోకి దిగింది. ఫైనల్‌కు ముందు వినేశ్ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా మూడు బౌట్లలో గెలుపొందింది. యుజ్నీలిస్ గజ్మన్ (క్యూబా)పై 12–4తో, ఆ తర్వాత మాడిసన్ పార్క్స్ (కెనడా)పై ‘విన్ బై ఫాల్’తో, సెమీ ఫైనల్లో కేటీ డచక్ (కెనడా)పై 9–4తో వినేశ్ గెలిచింది. -
రెజ్లర్ అమన్‌కు రజతం
పొల్యాక్ ఇమ్రి–వర్గా జోనస్ స్మారక ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ రజత పతకం సాధించాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అమన్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. రె హిగుచి (జపాన్)తో జరిగిన ఫైనల్లో అమన్ 1–11 పాయింట్లతో ఓడిపోయాడు. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన అమన్ 11–1తో రొబెర్టి డింగా‹Ùవిలి (జార్జియా)పై, సెమీఫైనల్లో 14–4తో టిసిటర్న్ (బెలారస్)పై గెలుపొందాడు. -
భారత టాప్ రెజ్లర్‌పై సస్పెన్షన్ వేటు
భారత టాప్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (United World Wrestling) సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు NADAచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన తర్వాత పునియాను UWW సస్పెండ్ చేసింది. పూనియాపై ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31) సస్పెన్షన్ కొనసాగనుంది.డోప్ టెస్ట్‌కు నిరాకరించాడన్న కారణంగా 20 ఏళ్ల పూనియాను ఏప్రిల్ 23న NADA సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌పై పూనియా అప్పుడే స్పందించాడు. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని వివరణ ఇచ్చాడు. శాంపిల్ తీసుకునేందుకు నాడా అధికారులు గడువు ముగిసిన కిట్‌ను ఉపయోగిస్తుండటంతో అందుకు వివరణ మాత్రమే కోరానని తెలిపాడు.UWW సస్పెన్షన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని పూనియా తాజాగా వివరణ ఇచ్చాడు. పూనియా స్టేట్మెంట్పై UWW సైతం స్పందించింది. పూనియాను సస్పెండ్ చేస్తున్న విషయాన్ని కారణాలతో సహా అతని ప్రొఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. ఒకవేళ పూనియాపై సస్పెన్షన్ వేటు నిజమే అయితే ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతక అవకాశాలకు గండి పడినట్లే. -
ఈ రెజ్లర్ ఎవరో గుర్తుపట్టగలరా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గానూ..
-
‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ‘టైమ్’ మేగజీన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్‌కు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ‘టైమ్’ ఈ జాబితాను ప్రకటించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్ల పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది. ఈ అంశంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు ఎదురొడ్డి సాక్షి మలిక్ గట్టిగా తన వాణిని వినిపిస్తూ నిరసనల్లో పాల్గొంది. వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలతో కలిసి ఆమె చేసిన ఈ పోరాటం దేశవిదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో బ్రిజ్‌భూషణ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నికి వినేశ్
పాటియాలా: వచ్చే నెలలో కిర్గిస్తాన్‌లో జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నిలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగనుంది. ఈ టోర్నిలో పాల్గొనే భారత మహిళల జట్టును ఎంపిక చేసేందుకు సోమవారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ 50 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు కాగా... ఇప్పటికే ఈ కేటగిరీలో అంతిమ్ పంఘాల్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంది. దాంతో వినేశ్ సెలెక్షన్ ట్రయల్స్ టోర్నిలో 50 కేజీలతోపాటు 53 కేజీల విభాగంలోనూ పోటీపడింది. ఒక రెజ్లర్ ఒకే రోజు ఒకే వెయిట్ కేటగిరీలో పోటీపడాలన్న నిబంధన ఉన్నా అడ్‌హక్ కమిటీ వినేశ్‌ను రెండు కేటగిరీల్లో పోటీ పడేందుకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. అయితే వినేశ్ 53 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓడిపోయింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నిలో పాల్గొనే భారత జట్టులో అన్షు మలిక్ (57 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రితిక (76 కేజీలు) కూడా ఎంపికయ్యారు. -
Zagreb Open Wrestling: అమన్ ‘పసిడి పట్టు’
జాగ్రెబ్ (క్రొయేషియా): కొత్త ఏడాదిని భారత రైజింగ్ స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణ పతకంతో ప్రారంభించాడు. జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో అమన్ 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో అమన్ 4 నిమిషాల 21 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో చైనా రెజ్లర్ జౌ వాన్హావోపై గెలుపొందాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం వచ్చిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. అమన్ తాను పోటీపడిన నాలుగు బౌట్లలోనూ ప్రత్యర్థులను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలోనే ఓడించడం విశేషం. తొలి రౌండ్లో అమన్ 15–4తో కరావుస్ (తుర్కియే)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో రిచర్డ్స్ రోడ్స్ (అమెరికా)పై, సెమీఫైనల్లో 11–0తో రొబెర్టి డాంగాషి్వలి (జార్జియా)పై విజయం సాధించాడు. -
అంతిమ్ అదరహో
బెల్గ్రేడ్: భారత మహిళా టీనేజ్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ అద్భుతం చేసింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అండర్–20 ‘డబుల్ ప్రపంచ చాంపియన్’ అంతిమ్ 16–6 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, యూరోపియన్ చాంపియన్ ఎమ్మా జోనా డెనిస్ మాల్‌్మగ్రెన్ (స్వీడన్)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో అంతిమ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పతాకంపై పోటీపడుతున్నారు. అంతిమ్ 2022, 2023 ప్రపంచ అండర్–20 చాంపియన్íÙప్లో 53 కేజీల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు 2023 ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచింది. 8 ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన ఎనిమిదో భారతీయ రెజ్లర్‌గా అంతిమ్ పంఘాల్ గుర్తింపు పొందింది. గతంలో అల్కా తోమర్ (2006; కాంస్యం), బబిత ఫొగాట్ (2012; కాంస్యం), గీతా ఫొగాట్ (2012; కాంస్యం), వినేశ్ ఫొగాట్ (2019, 2022; కాంస్యాలు), పూజా ధాండ (2018; కాంస్యం), అన్షు మలిక్ (2021; రజతం), సరితా మోర్ (2021; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
Zagreb Open 2023 wrestling: అశు ‘కంచు పట్టు’
జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాగ్రెబ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అశు కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో 23 ఏళ్ల అశు 5–0తో అడోమస్ గ్రిగాలియునస్ (లిథువేనియా)పై నెగ్గాడు. అశుకు 500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో అశు 0–9తో రెజా అబ్బాసి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. అయితే రెజా ఫైనల్ చేరుకోవడంతో... రెజా చేతిలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతిలో అశుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి బౌట్లో అశు 8–0తో పోహిలెక్ (హంగేరి)పై... రెండో బౌట్లో 9–0తో హావర్డ్ (నార్వే)పై గెలుపొంది కాంస్య పతక బౌట్‌కు అర్హత సాధించాడు. -
సుశీల్‌కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ దాదాపు ఏడాదిన్నర తర్వాత జైలునుంచి బయటకు రానున్నాడు. కుటుంబపరమైన సమస్యను ఎదుర్కొంటున్న కారణంగా మానవతా దృక్పథంతో ఈ నెల 12 వరకు అతనికి ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. సుశీల్ భార్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకునేందుకు 3 వారాల బెయిల్ ఇవ్వాల్సిందిగా సుశీల్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు కోర్టు వారం రోజుల బెయిల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ 2021 జూన్ 2నుంచి జైల్లో ఉన్నాడు. -
World Wrestling Championships 2022: భళా బజరంగ్...
బెల్గ్రేడ్ (సెర్బియా): అందివచ్చిన పతకావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ఆదివారం జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు. వాజ్జెన్తో జరిగిన మ్యాచ్‌లో ఒకదశలో బజరంగ్ 1–4తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. అనంతరం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో బజరంగ్ 11–9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. రివెరాతో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే బజరంగ్ 0–6తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న ఈ హరియాణా రెజ్లర్ ఆరు పాయింట్లు గెలిచి తొలి భాగం ముగిసేసరికి 6–6తో సమంగా నిలిచాడు. రెండో భాగం ఆరంభంలో బజరంగ్ మళ్లీ మూడు పాయింట్లు కోల్పోయి 6–9తో మళ్లీ వెనుకబడ్డాడు. అయినా ఆందోళన చెందని బజరంగ్ ఉడుంపట్టుతో మెరిసి 2, 2 పాయింట్లు సాధించి 10–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో ప్యూర్టోరికో రెజ్లర్ రివ్యూకు వెళ్లడం, దానిని అతను కోల్పోవడంతో భారత రెజ్లర్‌కు అదనంగా మరో పాయింట్ లభించింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో క్యూబా రెజ్లర్ అలెజాంద్రో వాల్డెస్తో పోటీపడుతున్న సమయంలో బజరంగ్ తలకు గాయమైంది. అయినా కట్టు కట్టుకొని ఆడిన బజరంగ్ తొలి రౌండ్లో 5–4తో వాల్డెస్ను ఓడించాడు. ఆ తర్వాత తలకు గాయంతోనే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లలో పోటీపడి చివరకు కాంస్య పతకం సాధించాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. -
భారత స్టార్ రెజ్లర్ భర్త అనుమానాస్పద మృతి
Commonwealth Games 2022 Bronze Medallist Pooja Sihags Husband Dies: బర్మింగ్‌హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజర్ల్ పూజా సిహాగ్ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఆగస్ట్ 27) రాత్రి సిహాగ్ భర్త అజయ్ నందల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హర్యానాలోని రోహ్తక్ నగర పరిసర ప్రాంతంలో నందల్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నందల్ మృతదేహం లభించిన ప్రాంతంలో అతని స్నేహితుడు రవి, మరో వ్యక్తిని అచేతనావస్థ స్థితిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా, అజయ్ నందల్ ఆకస్మిక మరణంపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అజయ్‌కు అతని స్నేహితుడు రవి డ్రగ్స్ అలవాటు చేశాడని, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే అజయ్ మృతి చెంది ఉంటాడని ఆరోపించాడు. అజయ్ తండ్రి ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని వెల్లడించారు. స్వతహాగా రెజ్లర్ అయిన అజయ్ నందల్.. క్రీడల కోటాలో ఇటీవలే ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజయ్ నందల్ భార్య, భారత స్టార్ మహిళా రెజ్లర్ పూజా సిహాగ్.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ -
భారత రెజ్లర్ సరిత స్వర్ణ సంబరం...
భారత మహిళా స్టార్ రెజ్లర్ సరితా మోర్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. కజకిస్తాన్‌లో జరుగుతున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ బొలాత్ టర్లీఖనోవ్ కప్‌లో సరితా 59 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. సరిత గెలిచిన మూడు బౌట్లూ టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం రాగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలోనే రావడం విశేషం. ఫైనల్లో సరిత 10–0తో జాలా అలియెవ్ (అజర్బైజాన్)పై, సెమీఫైనల్లో 12–2తో ఐజాన్ ఇస్మగులోవా (కజకిస్తాన్)పై, రెండో రౌండ్లో 11–0తో డయానా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మనీషా (65 కేజీలు) స్వర్ణం... బిపాసా (72 కేజీలు) రజతం, సుష్మా (55 కేజీలు) కాంస్యం సాధించారు. -
Sakshi Malik: ఐదేళ్ల తర్వాత మరోసారి పసిడి పతకం!
అల్మాటీ (కజకిస్తాన్): భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బంగారంతో మురిసింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్లో ఆమె 62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మాన్సి అహ్లావత్ (57 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి 7–4తో ఇరినా కుజ్నెత్సొవ (కజకిస్తాన్)ను ఓడించింది. చివరిసారిగా సాక్షి 2017 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో బంగారం గెలిచింది. తర్వాత రెండు ఆసియా చాంపియన్ షిప్ (2020, 2022)లలో కాంస్యాలతోనే సరిపెట్టుకుంది. 57 కేజీల ఫైనల్లో మాన్సి 3–0తో ఎమ్మా టిసినా (కజకిస్తాన్)పై గెలుపొందింది. నలుగురు రెజ్లర్లు మాత్రమే తలపడిన 68 కేజీల కేటగిరీలో దివ్య రెండు బౌట్లలో అలవోక విజయాలు సాధించింది. కానీ ఆఖరి బౌట్లో 10–14తో బొలొర్తుంగలగ్ జోరిట్ (మంగోలియా) చేతిలో ఓడింది. అయితే జోరిట్ కూడా రెండు బౌట్లలో గెలుపొందడంతో ఆమె, దివ్య సమఉజ్జీలుగా నిలిచారు. ఓవరాల్‌గా ఎక్కువ పాయింట్లు గెలిచిన దివ్యనే విజేతగా ప్రకటించారు. చదవండి: మన అమ్మాయిలు భేష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం -
ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్!
ఆదివారం (నిన్న) గూగుల్ డూడుల్ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్ చాంపియన్ ‘గామా పహిల్వాన్’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన ‘డూడుల్’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ గామా పహిల్వాన్ అసలు పేరు గులామ్ మహమ్మద్ భక్ష్ భట్. పంజాబ్‌లోని జబ్బోవల్ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సాధించాడు. ఓటమి మాటే తెలియకుండా.. సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. ♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్ రెజ్లర్లు ఫ్రాంక్ గోట్చ్, బెంజమిన్ రోలర్, మౌరిస్ డెరిజ్, జోహన్ లెమ్, జెస్సీ పీటర్సన్ వంటివారిని వరుసగా ఓడించాడు. ♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్ రెజ్లర్లతోపాటు జపాన్‌కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్ హకెన్షిమిట్ వంటివారికీ గామా పహిల్వాన్ సవాల్ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. నిజాం యోధులనూ ఓడించి 1940లో నిజాం రాజు గామా పహిల్వాన్‌ను హైదరాబాద్‌కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. గామాకు బ్రూస్లీ ఫ్యాన్.. గామా పహిల్వాన్‌కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెద్ద ఫ్యాన్. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. ♦ గామా పహిల్వాన్ శకం నడిచినప్పుడు భారత్ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు. హిందువులను కాపాడి.. దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గామా పహిల్వాన్ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్‌లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్‌లో కన్నుమూశాడు. పారిపోయిన ప్రపంచ చాంపియన్ 1910 లండన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్‌గా ఉన్న బ్రిటిష్ స్టానిస్లస్ జిబిజ్కో.. గామా పహిల్వాన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్‌ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు. జిబిజ్కో భయంతో మ్యాచ్‌కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్‌ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్‌షిప్‌లో జిబిజ్కో–గామా పహిల్వాన్ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022..) -
బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా?
మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం.. దివంగత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా బ్రూస్ లీ పేరు గుర్తుకువస్తుంది. కెమెరా కూడా అతని వేగాన్ని అందుకోలేదు. చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌పై పట్టు సాధించి గొప్ప పేరు సంపాదించాడు. 32 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమాతో విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సాధించాడు. మరి బ్రూస్ లీ ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా.. భారత్‌కు చెందిన మహ్మద్ భక్ష్ భట్.. అలియాస్ గ్రేట్ గామా ఫహిల్వాన్. గామా ఫహిల్వాన్ ఫిజిక్కు ముచ్చటపడిన బ్రూస్ లీ అతనిలా కండలు పెంచాలని అనుకున్నాడు. అందుకోసం మహ్మద్ ఎక్సర్సైజ్ ఫుటేజీలు, రెజ్లింగ్ టెక్నిక్స్‌ను కేవలం ఫోటోల ద్వారా నేర్చుకున్నాడు. గామా ఫహిల్వాన్ పేరు మీద వచ్చిన ఆర్టికల్స్‌ను తప్పకుండా చదివేవాడు. ఒక రకంగా తాను మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించడానికి గామా ఫహిల్వాన్ దారి చూపాడని బ్రూస్ లీ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. కాగా గామా ఫహిల్వాన్ ఇవాళ(మే 22) ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ అతని ఫోటోను డూడుల్‌గా ఉపయోగించింది. వ్రిందా జవేరీ అనే ఆర్టిస్ట్ గూగూల్‌కు గామా ఫహిల్వాన్ కార్టూన్‌ను గీసిచ్చాడు. భారత రెజ్లర్‌గా ఎనలేని గుర్తింపు సాధించిన మహ్మద్ భక్ష్ భట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రింగ్‌లో ఓటమి ఎరుగని రెజ్లర్‌గా పేరు పొందిన ఆయన దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు. భారతీయ సంస్కృతికి గౌరవ ప్రతీకగా ఉన్నాడు. గామా ఫహిల్వాన్ను స్మరించుకోవడం మన అదృష్టం అని గూగుల్ రాసుకొచ్చింది. మహ్మద్ భక్ష్ భట్ తన అంతర్జాతీయ రెజ్లింగ్ కెరీర్లో 1910లో వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్, 1927లో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత టైగర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి రజత తామరపత్రం అందుకున్నాడు. Gama Pehelwan's 124th Birthday pic.twitter.com/8j5kQrDXbV — Akash Kharade (@cricaakash) May 22, 2022