JD Lakshminarayana
-
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
136 రోజుల జేడీ సోదరుని పాలన..నేటితో
సాక్షి, తిరుపతి : ఎస్వీయూ వీసీగా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 3న ఎస్వీయూ 18వ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ కేవలం 136 రోజులు మాత్రమే పనిచేశారు. ఈయన తన నాలుగు నెలల పాలనలో సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. గత ప్రభుత్వంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆర్కే అనురాధ, దూరవిద్యా విభాగానికి చెందిన మాజీ డైరెక్టర్ వి.రవి నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసినట్లు విమర్శలున్నాయి. రెక్టార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ జీ.జానకి రామయ్యతో రాజీనామా చేయించడం మినహా ఇతర కీలక నిర్ణయాలు ఏమీ లేవు. ఈ నిర్ణయంకూడా వారి సూచనలకు అనుగుణంగానే తీసుకున్నట్లు క్యాంపస్‌లో ప్రచారం ఉంది. నియామకమే తప్పు ఎస్వీ యూనివర్సిటీ వీసీ నియామకానికి గత యేడాది ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈ పోస్టుకు ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ దరఖాస్తు చేయలేదు. జనవరిలో నిర్వహించిన సెర్చ్ కమిటీ సమావేశానికి వారం ముందు ఈయనను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికపుడు దరఖాస్తు తెప్పించుకున్నారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి రెండేళ్లపాటు ఇబ్బందులకు గురిచేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ రుణం తీర్చుకొనేందుకు... ప్రభుత్వం ఆయన సోదరుడైన ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌కు వీసీ పదవి కట్టబెట్టింది. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ సహకారం కూడా ఈయన నియామకంలో పాత్ర ఉంది. నియామకంపై కేసులు యూజీసీ నిబంధనల ప్రకారం వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి సభ్యుడుగా ఉండరాదు. విద్యారంగ నిపుణుడే సభ్యుడిగా ఉండాలి. ఎస్వీయూ సెర్చ్ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం గత యేడాది డిసెంబర్లో జీఓ జారీ చేసింది. ఈ జీఓను వ్యతిరేకిస్తూ ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.మునిరత్నం రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 4న తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ కేసులో తీర్పును ముందే ఊహించిన ప్రభుత్వం ఫిబ్రవరి 3న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 4వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అయితే ముందు రోజే విధుల్లో చేరినట్లు అప్పటి అధికారుల సహకారంతో తప్పుడు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. అనంతరం ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్‌ను తొలగించాలని కోరుతూ ప్రొఫెసర్ మునిరత్నం రెడ్డి కో వారెంటో దాఖలు చేశారు. వీసీ నియామకానికి సంబంధించిన రెండు కేసుల్లో ఈ నెల 24న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న విద్యాశాఖ మంత్రిని కలిసి తన రాజీనామా విషయంపై చర్చించారు. అమరావతి నుంచి మంగళవారం తిరిగి వచ్చారు. బుధవారం సన్నిహితులతో చర్చించిన అనంతరం తన రాజీనామా లేఖను గవర్నర్, ఉన్నత విద్యామండలికి పంపారు. ఈ రాజీనామా ఆమోదం పొందడం లాంఛనమే. ముందే చెప్పిన సాక్షి ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ నియామకం, నిబంధనల ఉల్లంఘన, హైకోర్టులో కేసులు తదితర అంశాలపై సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ఈ నెల 18న ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం అన్న శీర్షికన కథనం ప్రచురతమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
తీరంలో ఫ్యాన్ గాలికి సైకిల్ విలవిల..
సాక్షి, విశాఖపట్నం : ఐదేళ్ల నాటి హుద్‌హుద్.. ఇటీవలి ఫొని తుపాన్లను మించిన ప్రచండ తుపాను గురువారం రాష్ట్రాన్ని తాకింది. అవి వాతావరణం సృష్టించిన తుపాన్లయితే.. ఇప్పుడు రాష్ట్రాన్ని తాకింది వైఎస్సార్సీపీ తుపాను.. ఫ్యాను గాలి ప్రచండమై.. ఝంఝామారుతంలా ప్రజా ఓట్ల రూపంలో వెల్లువెత్తి తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో కూల్చేసింది. ఇద్దరు మంత్రులను మట్టికరిపించింది. మరో మంత్రిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. జనసేన అధినేత పవన్‌ను.. ఆయన పార్టీ తరఫున రాత్రికి రాత్రి విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా దిగుమతై.. క్రాస్ ఓటింగ్‌తో గెలిచేస్తామన్నంత హడావుడి చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణలకు ప్రజాబలం జెల్లకొట్టింది. నడమంత్రపు తాయిలాలు చెల్లవని తేల్చి చెప్పింది. వెరసి.. విశాఖ తీరంలో వైఎస్సార్సీపీ ఓట్ల తుఫాను ధాటికి టీడీపీ కోటలు కూలిపోయాయి. గ్రామీణ జిల్లాలో ఫ్యాన్ ప్రచండ వేగానికి ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అర్బన్ జిల్లా పరిధిలో మూడు స్థానాల్లో మాత్రమే అతికష్టం మీద నిలదొక్కుకోగలిగింది. ఓట్ల వర్షంలో తడిసి ముద్దయిన వైఎస్సార్సీపీ మొత్తం 11 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చివరి రెండు రౌండ్లకు చెందిన నాలుగు ఈవీఎంలు మొరాయించడంతోపాటు ఒక వీవీప్యాట్ మిస్ కావడంతో లెక్కింపు నిలిచిపోయింది. అర్ధరాత్రి సమయానికి తుది సమాచారం ప్రకారం.. మంత్రి గంటా శ్రీనివాసరావు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 1500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా రెండు రౌండ్ల ఫలితాలు, పోస్టల్ బ్యాలెట్ల వివరాలు అందాల్సి ఉన్నందున ఆయన గెలుపు గాలిలో ఉన్నట్లే.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఈ ఎన్నికల్లో జిల్లా ఓటర్లు తెలుగుదేశం మంత్రులను ముప్పుతిప్పలు పెట్టి మట్టికరిపించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడును సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం ప్రజలు ఈసారి పక్కన పెట్టారు. ఓటమి రుచి చూపించారు. ఇక తండ్రి మరణం నేపథ్యంలో.. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి వెలగబెట్టిన కిడారి శ్రావణ్‌కుమార్‌పై అరకు ప్రజలు ఏమాత్రం కరుణ చూపలేదు. వైఎస్సార్సీపీపై వారికి ఉన్న ఆదరణ ముందు తండ్రి మరణించారన్న సెంటిమెంట్ కూడా పని చేయలేదు. ఏకంగా నోటా కంటే తక్కువ ఓట్లు వేసి అట్టడుగుకు నెట్టేశారు. విశాఖ ఉత్తర నుంచి పోటీ చేసిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావును సైతం చివరి రౌండ్ల వరకు ఓటర్లు చుక్కలు చూపించారు. తుది సమాచారం అందేసరికి ఆయన అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. -
రూ.లక్ష కోట్లు... జగన్‌పై రాజకీయ ఆరోపణలే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది రాజకీయాల కోసం చేసిన ఆరోపణలేనని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన తాజాగా ఓ తెలుగు టీవీ చానల్ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జగన్‌పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో (రాజకీయ ప్రత్యర్థులు) రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని అన్నారు. తమకు వచ్చిన ఎవిడెన్స్ (ఆధారాలు) మేరకే చార్జిషీట్లో పొందుపర్చామని, దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లయితే కానే కాదని పేర్కొన్నారు. జగన్‌పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు. వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేసి, విచారణాధికారిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. -
జేడీకి మా పార్టీలో స్థానం లేదు: విజయసాయి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు మోచేతినీళ్లు తాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు తమ పార్టీలో స్థానం లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా విజయసాయిరెడ్డి, లక్ష్మీనారాయణల మధ్య ట్విటర్ వేదికగా మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి సోమవారం మరో ట్వీట్‌తో చురకలంటించారు. ‘ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్.’ అని ట్వీట్ చేశారు. లక్ష్మీనారాయణతో పాటు చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పించారు. ‘ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే దాన్నిబలపరుస్తూ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఘోర పరాజయం తర్వాత ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండు చేసినా ఆశ్చర్యం లేదు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80 శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయి.’ అంటూ మండిపడ్డారు. ‘సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎలాగైనా ఇరికించేందుకు బాబు అండ్ కో ఒత్తిళ్లు మొదలు పెట్టారని, పునేఠా ఇప్పటికే బలిపశువయ్యాడన్నారు. కోడ్ అమలులో ఉన్నా మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని ఎల్వీని బెదిరిస్తున్నారని, నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకుని పోయేవారిని పట్టించుకోనవసరం లేదన్నారు. అమరావతిలోని ‘ప్రజావేదిక’ ప్రభుత్వ ప్రాంగణమని, కానీ టీడీపీ కార్యక్రమాల కోసం చంద్రబాబు ఇప్పటి వరకు దానిని దుర్వినియోగం చేస్తూ వచ్చారన్నారు. కోడ్ అమలులో ఉన్నా తాను ఆపద్ధర్మ సీఎం అని మర్చిపోయి అదే ప్రజావేదికలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళినే హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఇది కూడా తెలియదా వీవీ అలియాస్ జేడీ..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఔను... సరిగ్గా ఊహించిందే జరుగుతోంది. ఎన్నికల ముందే జనసేన విశాఖ అభ్యర్థి జేడీ అలియాస్ వీవీ లక్ష్మీనారాయణ ముసుగు ఒక్కొక్కటీ తొలగిపోతోంది. తానో మేథావిలా బిల్డప్ ఇస్తూ బాండ్ పేపర్ హామీలంటూ హడావుడి చేసిన జేడీ యవ్వారం చూసి న్యాయ నిపుణులు నవ్వుకుంటున్నారు. చట్ట ప్రకారం చెల్లని బాండ్ పేపర్లను తెరపైకి తీసుకువచ్చి ప్రేలాపనలు చేయడం ఒక్క జేడీకే చెల్లిందని విమర్శిస్తున్నారు. ఎంపీ అభ్యర్ధిగా తాను ఇచ్చే హామీలు ఇవేనంటూ కొన్నింటిని పేర్కొంటూ వంద రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా చీప్ పబ్లిసిటీ ఎపిసోడ్ అంటూ ఇప్పటికే మేథావులు, విద్యావంతులు తేలిగ్గా తీసిపారేయగా..., ఇప్పుడు న్యాయవాదులు జేడీ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు ఎందుకు ఉపయోగిస్తారు..? అన్న చిన్న విషయంపై ఒక మాజీ సీబీఐ అధికారికి పరిజ్ఞానం లేకపోవడం ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మేనిఫెస్టో అమలు చేసేది ఒక్క శాసనసభకు పోటీ చేసేవారికి తప్ప, ఒక ఎంపీ చేయాల్సిన అవసరం లేదన్నది జగమెరిగిన సత్యం. మేనిఫెస్టోకు సంబంధించి చాలా వరకు అంశాలు రాష్ట్ర నాయకత్వం పరిధిలోనే ఉంటుందనేది తెలియని విషయం కాదు.. అంతేగాని ఒక ఎంపీ.. రాష్ట్ర నాయకుడు కాదు, అతను మేనిఫెస్టోను అమలు పరిచేదీ లేదు. మేనిఫెస్టోలో ఉన్న అంశాల్ని రా>ష్ట్ర నాయకులు, రాష్ట్రాన్ని పాలించే వారికి మాత్రమే అమలు చేసే అధికారం ఉంటుందన్నది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఒక ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టోకి సంబంధించి ఎటువంటి ప్రసంగాలు, సలహాలు, ప్రభుత్వం పై ఒత్తిడి చేయడం చేయకూడదన్న విషయాన్ని ఒక ఐపీఎస్ అధికారిగా తెలియక పోవడం విడ్డూరంగా ఉంది. విశాఖపట్నం ఎంపీగా జనసేన తరుపున పొటీ చేస్తున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ తాను అమలు చేసే పథకాలంటూ వంద రూపాయల నాన్ జ్యుడిషయల్ స్టాంప్ పేపర్‌పై తయారు చేసి చూపడం పట్ల పలు వర్గాల ప్రజలు, న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ బాండ్‌పేపర్‌లో జనసేన పేరులేని వైనం సుప్రీంకోర్టు ఏం చెప్పింది..? చాలా మంది పార్టీ సభ్యులతో సహా వ్యక్త పరిచే అభిప్రాయం ఏమిటంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టో చట్టపరంగా అమలు చేయాల్సిన అవసరం లేదని మిథిలేష్ కుమార్ పాండే వెర్సస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ వ్యాజ్యం దాఖలు చేసిన ఫిర్యాది.. ఒకే ఒక ఆధారంపై.. అదీ ఎలక్షన్ మేనిఫెస్టో తప్ప మరొక సాక్షాన్ని ఫిర్యాదులోగాని, వాదనలలో గాని వినిపించలేదు. అసలు ఫిర్యాదు ఏమిటంటే.. మేనిఫెస్టోలో సంబంధిత పొలిటికల్ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీ రాని పక్షంలో వేరే ఏ ఇతర పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదనీ, మేనిఫెస్టోలో సూచించిన విధంగా ఆ పార్టీ ఎన్నికలకు ముందు ఏ పార్టీ మద్దతు తీసుకోకూడదు అన్నది వాజ్యం సారాంశం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న వాఖ్యలు ఇలా ఉన్నాయి. ♦ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ రకమైనæ హామీలు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే అధికారం కోర్టు పరిధిలో లేదు. ♦ 1982 ఆల్ ఇంగ్లండ్ లా జర్నల్ ప్రకారం బ్రూవేల్ లండన్ బరో కౌన్సిల్ వెర్సెస్ గ్రేటర్ లండన్ కౌన్సిల్ కేసులో లార్జ్ డెనింగ్ చెప్పిన విధంగా మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు ఓట్లు పొందడానికై విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రధాన అజెండాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ♦ మేనిఫెస్టో ఒక బాండులా సంతకం చేసి, సీలు చేసి ఇచ్చినా సరే ఇది వరలో లేనివి చెప్పినా సరే, వాగ్దానాలు, గతంలో చేసిన ప్రస్తావనలు ఉన్నా అవేవీ పరిగణనలోకి రావు. ఓటర్లలో అతి తక్కువ మంది ఎన్నికల మేనిఫెస్టోలు చదువుతారు. ఎక్కువ మంది పత్రికలు, టీవీల ద్వారా వివరాలు తెలుసుకుంటారు. చాలా మందికి మేనిఫెస్టోలో విషయాలపై అవగాహన ఉండదు. ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లినప్పుడు మేనిఫెస్టోపై అవగాహన ఉండి ఓటు వేయరు. ఎక్కువ మంది పార్టీ పరంగానే ఓటు వేస్తారు. మేనిఫెస్టో వల్ల ఏమీ కాదన్న విషయంలో ఎలాంటి సందేహంలేదు. ♦ చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఫలానా పార్టీకి ఓటు వేస్తారు. ఏ ఒక్కరు కూడా అభిమానానికి వ్యతిరేకంగా ఓటు వేయరు. ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా ఎలాంటి శాసనాధికారానికి కట్టుబడి ఉండవు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారు ఏ ఒక్క ప్రస్తావన, వాగ్దానమైనా ఖచ్చితంగా అవసరాన్ని బట్టి స్వీకరించాలి. మేనిఫెస్టోలో ఉన్నవాటికి కట్టుబడివున్నామని కాకుండా పార్టీ వల్ల ఏమౌతుందో, పరిస్థితులను బట్టి చెయ్యాల్సి ఉంటుంది. అది ఆచరణ యోగ్యమై నిష్పక్ష పాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవీ మార్గదర్శకాలు ♦ చట్టప్రకారం నాన్ జ్యుడీషల్ స్టాంప్ పేపర్ ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి. ♦ ఏపీ స్టాంప్స్ యాక్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్‌లోని క్లాజు ప్రకారం ఓటరుకి వారి హక్కుల సాధించుకునేందుకు మేనిఫెస్టోపై కోర్టుకు వెళ్లే హక్కులేదు. ♦ ఇప్పుడు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ ఎలాంటి సందర్భాల్లో వినియోగిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ♦ చట్ట ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆర్ధిక ఒప్పందాలు, పరస్పర అవగాహన ఒప్పందాలు కోర్టులో చెల్లుబాటు అయ్యే విధంగా నాన్ జ్యుడీషియల్ స్టాంపులు పనిచేస్తాయి. ♦ ఇందులో వాది, ప్రతివాదులు, మేజర్ అవ్వని వారు, మానసికంగా పరిపక్వత లేనివారు, చట్టప్రకారంగా చెల్లుబాటు కానివారు, దివాలా తీసినవారు, మానసిక వికలాంగులు ఉన్నారు. ♦ ఆర్థిక పరమైన లావాదేవీలు, నిబంధనలు ఉన్నప్పుడు మాత్రమే నాన్‌జ్యుడీషియల్ స్టాంపు చెల్లుబాటు అవుతుంది. ♦ ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు పరస్పర అవగాహనతో ఒక పనిని చేయుటకుగాని, చేయకుండా ఉండేందుకు గాని, ఆర్థిక లావాదేవీలతో కూడిన ఆ లావాదేవీల విలువ రూపాయల్లో గాని, వాటిని సమానమైన గుణిజాలతో కూడినదై ఉండాలి. ♦ ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, చదువుకున్న ఎంపీ అభ్యర్ధులు చేస్తున్న విధానాలతో నాన్ జ్యుడీయల్ స్టాంపుపై ఉన్న అనర్హత పై చిక్కు ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరిచ్చిన బాండ్లో రెండో పార్టీ ఎవరు.? ♦ రాజకీయ నాయకులు ఇచ్చే బాండ్ పేపర్‌పై రెండో పార్టీ ఎవరన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరూ రెండో పార్టీ కాదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా పూర్తిగా అపరిచితులైన వ్యక్తులతో కాంట్రాక్ట్‌లు చేసేవి, ఇందులో ఎవరితోనైతే అగ్రిమెంట్ చేసుకుంటున్నామో వారి చిరునామా వివరాలు లేకపోతే ఆ ఒప్పందం చెల్లదు. ♦ లావాదేవాలు నిమిత్తమై చెప్పిన ప్రతిఫలం ఈ కాంట్రాక్ట్‌లో ఎక్కడా ఉండదు. ♦ ఇలాంటి సందర్భంలో రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ విలువ ఎలా నిర్ణయిస్తారు.? ♦ దీనిని సుప్రీంకోర్టులో ఒక కేసు మిథిలేష్ కుమార్ పాండే వెర్సస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చెప్పిన విధంగా ఇలాంటి కాంట్రాక్టులు, మేనిఫెస్టోలు చెల్లనే చెల్లవు. ఆర్థిక లావాదేవీలకే బాండ్ పేపర్లు రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఏ రకమైనæ హామీలు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే అధికారం కోర్టు పరిధిలో లేదు. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు పరస్పర అవగాహనతో ఒక పనిని చేయుటకుగాని, చేయకుండా ఉండేందుకు గాని, ఆర్థిక లావాదేవీలతో కూడినదై ఉండి, ఆ లావాదేవీల విలువ రూపాయల్లో గాని, వాటిని సమానమైన గుణిజాలతో కూడినదై ఉండాలి. కానీ పార్టీలు మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద చేయటం సరికాదు. మేనిఫెస్టో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆ పార్టీకి అనుగుణంగా మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల మేనిఫెస్టో చట్టపరంగా అమలు చేయాల్సిన అవసరం లేదని మిథిలేష్ కుమార్ పాండే వెర్సస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. – ఎన్.ఎస్.వి.రెడ్డి, సీనియర్ న్యాయవాది -
హవ్వ... జేడీకి ఏమైంది?!
ఎన్నికలకు వారం రోజుల ముందే జేడీ.. అదేనండీ విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ గాలి తీసిన బెలూన్లా రోజురోజుకు దిగజారిపోతున్నారు.దూరపు కొండలు నునుపు మాదిరిగా.. నిన్న మొన్నటి వరకు టీవీలు, పేపర్లలో ఆయన ఉపన్యాసాలు.. సందేశాలు చూసి.. అభినవ అభ్యుదయవాదిగా ఊహించుకున్న ప్రజలు.. ప్రత్యేకించి విద్యావంతులకు ఇప్పుడిప్పుడే ఆయనపై భ్రమలు తొలగిపోతున్నాయి.ఆయన ఆస్తుల చిట్టా చూసి ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు కడిగిపారేస్తే.. కుల నేతలతో సమావేశమైన నిర్వాకం చూసి మేథావులు.. ఆయన్ను ఇప్పుడు ‘అభినయ’ అభ్యుదయవాదిగా విశ్లేషిస్తున్నారు.ఇక విశాఖను సింగపూర్ చేస్తానని నిన్నటి వరకు మాట్లాడి నవ్వులపాలైన జేడీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏకంగా ఛత్రపతి శివాజీతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం ట్రోల్ అవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే బలమైన ప్రజాకర్షక నేతల్లో ఒకరైన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నాటి యూపీఏ సర్కారు కక్షపూరితంగా కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిన వాస్తవమే.. ఆ కేసుల విచారణ పేరిట ఒక్కసారిగా ’వర్గ’ మీడియా చలవతో సడెన్ సెలబ్రిటీగా మారిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలకు ముందే నవ్వులపాలవుతున్నారు. నిజానికి ఆయన విశాఖ జనసేన అభ్యర్ధిగా తెరపైకి రాకముందు వర్గ మీడియా సృష్టించిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. కానీ సొంత పార్టీ పెడతానంటూ చెప్పి చివరికి లోక్‌సత్తా టు జనసేన వయా టీడీపీగా సాగిన రాజకీయ ప్రయాణం, అర్ధరాత్రి హడావుడిగా జనసేనలో చేరి విశాఖలో వాలిపోవడంతోనే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. రాజకీయాల్లో.. అందునా పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సహజమే అనుకున్నా.. జేడీ వ్యవహారశైలి మాత్రం ఆయన వేసుకున్న ముసుగును తొలగించిందనే చెప్పాలి. తాను చిన్నప్పటి నుంచే కులాలకు, మతాలకు వ్యతిరేకమని ప్రసంగాలు దంచికొట్టే జేడీ.. జనసేనతో జత కట్టడం.. వలసవాదులు ఉత్తరాంధ్రను దోచేస్తున్నారని డైలాగులు కొట్టి.. చివరికి ఇక్కడి నుంచే బరిలోకి దిగడంతోనే జేడీ వ్యవహారం ఉత్తరాంధ్ర మేథావుల్లో చర్చకు తెరలేపింది. ఇక ఆయన మందీమార్బలంతో నామినేషన్ వేసేందుకు వెళ్ళి.. పైసా కూడా ఖర్చు చేయలేదంటూ చెప్పుకొచ్చిన వ్యవహారం.. ఆనక విశాఖను సింగపూర్ చేసేస్తానని పలికి ప్రగల్భాలు విద్యావంతులను ఆలోచింపజేశాయి. ఇదేమిటి.. జేడీ అంటే ఏమిటో అనుకున్నాం.. ఈయన కూడా ఫక్తు రాజకీయ నేత మాదిరే మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు ఊపందుకున్నాయి. నామినేషన్ సందర్భంగా ఆయన సమర్పించిన ఆస్తుల చిట్టా చూసి ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్ధులైతే విమర్శలు గుప్పించారు. తాను కరడుగట్టిన నిజాయితీ పరుడినని చెప్పుకునే జేడీకి ముంబైలో ఐదుకోట్ల విలువ చేసే ఫ్లాట్, హైదరాబాద్ శివార్లలో ఎకరాలకు ఎకరాల పొలాలు, ముప్పావు కేజీ బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటిపై ఎక్కడా సమాధానం చెప్పకుండా.. ఎవరు ఏ ప్రశ్న వేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పే జేడీకున్న విజ్ఞత ఏమిటన్న ప్రశ్న కూడా సంధించారు. ఇక ఆయన ఇటీవల వాల్తేరు క్లబ్‌లోనూ, ఓ సాఫ్ట్వేర్ సంస్థలోనూ ప్రత్యేకించి ఓ కులపెద్దలతో సమావేశం కావడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న విశాఖ విద్యావంతులు, మేథావులు....ఇప్పుడు తాజాగా జేడీ... పవన్ కీర్తన చూసి తలపట్టుకుంటున్నారు. పవన్... ఛత్రపతి శివాజీనట! సినీనటుడైన పవన్‌కల్యాణ్‌ను అభిమానులు కీర్తించడం వేరు.. కానీ జేడీ సైతం పవన్‌ను కీర్తిస్తూ ఏకంగా ఛత్రపతి శివాజీగా పేర్కొనడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆనాడు ఛత్రపతి శివాజీ కొద్ద సైన్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాడు.. ఈనాడు అలాంటి నాయకుడిని పవన్‌కల్యాణ్‌లో చూస్తున్నాను.. అని జేడీ అన్న మాటల వీడియోను స్వయంగా ఆయన ఫ్యాన్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పోస్టింగ్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. మూడు పెళ్ళిళ్లు చేసుకున్న పవన్‌కు.. ఛత్రపతి శివాజీకి ఏమైనా పోలిక ఉందా.. అసలేమిటి.. జేడీ ఏం మాట్లాడుతున్నారో అర్ధమవుతుందా.. ఇదేనా జేడీ స్థాయి.. జనం చాలా ఊహించుకుంటున్నారు.. ఆయనపై భ్రమలు తొలగిపోయాయ్... అన్న వ్యాఖ్యలు హోరెత్తుతున్నాయి. జేడీ అనొద్దు ప్లీజ్ వాస్తవానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా చాలా మంది అధికారులు పనిచేశారు.. ఇప్పుడూ చేస్తున్నారు. కానీ కేవలం వైఎస్ జగన్ పుణ్యమాని వీవీ లక్ష్మీనారాయణ ఒక్కసారిగా జేడీ లక్ష్మీనారాయణ అయిపోయారు. జేడీ హోదాను తప్పించి సొంత క్యాడర్ మహారాష్ట్రకు బదిలీ చేసిన తర్వాత అక్కడ ఐజీ, అడిషనల్ డీజీగా కూడా చేశారు. అయినా సరే జేడీ అనే పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన కూడా జేడీ అని పిలిస్తే.. చాలా సంబరపడిపోయే వారు. కానీ ఇప్పుడు అదే పేరు ఆయన్ను భయపెడుతోంది. ఎన్నికల బ్యాలెట్ పేపర్లో వీవీ లక్ష్మీనారాయణ అనే ఉంటుందని, జేడీ ఉండదు కాబట్టి వచ్చే నాలుగు ఓట్లూ గల్లంతవుతాయని కంగారు పడిపోతున్నారు. అందుకే జేడీ... అతి సర్వత్రవర్జయేత్.. అనేది. -
‘జేడీ లక్ష్మీనారాయణ.. ప్రజలకు చెప్పాలి’
సాక్షి, విశాఖపట్నం: హైదరాబాద్ శివారు శంకరాపల్లిలో ఎకరం రూ.2 కోట్ల విలువైన భూమిని రూ.4 లక్షలకే ఎలా కొన్నారో విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ ప్రజలకు చెప్పాలని వైఎస్సార్సీపీ నేత, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని చెప్పే లక్ష్మీనారాయణ ఆరున్నర కోట్లు మొబిలెసెట్స్‌గా చూపిస్తున్నారని, ముంబైలో రూ.5 కోట్లకు ఫ్లాట్ అమ్మినట్లుగా అఫిడవిట్లో సమర్పించారని తెలిపారు. ఉద్యోగం తప్ప ఏ ఆధారం లేదని చెప్పుకునే ఆయనకు ఏడాదికి రూ.20 లక్షలకు మించి ఆదాయం రాదని, కేవలం క్వీడ్‌ప్రోకోలో జరిగిన అగ్రిమెంట్‌తోనే రూ.ఆరున్నర కోట్లు మొబిలెసెట్స్‌గా తీసుకొచ్చి దాన్ని తెల్లధనంగా మార్పుచేసి హైదరాబాద్ శివారులో శంకరాపల్లిలో భూమి కొన్నారని ఆరోపించారు. కులాలకతీతంగా పనిచేస్తానని నీతులు చెబుతున్న లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో పనిచేస్తూ అంబేడ్కర్‌ను ఏనాడైనా కొలిచారా అని ప్రశ్నించారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ప్రజల కోసం పాటుపడి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్సార్‌కే సాధ్యమైందని చెప్పారు. సమావేశంలో పార్టీ అదనపు కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఎందుకు జేడీ.. విశాఖ వెంటపడి..!
గ్రామస్వరాజ్యమే లక్ష్యమంటూ లీడ్ ఇండియా పేరుతో హడావుడి చేశారు..వలసవాదులు విశాఖ సంపదను దోచేస్తున్నారని మొసలి కన్నీరు కార్చారు..మరి ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి.. మీరు గొంతు చించుకొని వల్లించిన రెండు నినాదాలకు విరుద్ధంగా విశాఖకు ఎందుకు దిగమతయ్యారు?వీవీ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణపై విశాఖవాసులు సంధిస్తున్న ప్రశ్నలివి..ఆయన ఏ తాను ముక్కో అందిరికీ తెలిసేందే.. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేశారో.. నిబంధనలకు విరుద్ధంగా అనుకూల వర్గ మీడియాకు లీకులిచ్చి ఎంత ప్రచారం పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి... ప్రత్యక్ష పోటీకి దిగడం కూడా అదే ‘వర్గ’ ప్రయోజనం కోసమేనని స్పష్టమవుతోంది.ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇందులో అనుమానమే లేదు.కానీ కొన్నాళ్ల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించి ఇక్కడి వనరులను వలసదారులు దోచేస్తున్నారని.. విశాఖపై వలసవాదుల ప్రభావం పోవాలని ప్రసంగాలు దంచేసిన ఈ పెద్ద మనిషి.. ఇప్పుడు ఏ నిబద్ధతతో విశాఖ నుంచి పోటీ చేస్తున్నారని ఇక్కడి మేధావులు ప్రశ్నిస్తున్నారు.సొంత ప్రాంతం రాయలసీమ గడప దాటి.. కనీసం ఉద్యోగ రీత్యా కూడా ఎటువంటి అనుబంధం లేని విశాఖకు ఎందుకు వచ్చినట్లని నిలదీస్తున్నారు.ఎవరి ఓట్లు చీల్చడానికి.. ఎవరి ప్రయోజనాల రక్షణకు విశాఖపై పడ్డారని ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ వివిధ హోదాల్లో పని చేసి గతేడాది మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈయనకు మించిన డీజీలు, ఐజీల గురించి వింటుంటాం.. సీబీఐలోనూ అటువంటివారెందరో ఉన్నారు. కానీ అందరిలోకి ఈయనే ఎందుకు ప్రత్యేకం అంటే.. ఒకే ఒక్క కేసు.. దాంతోనే ఈయన్ను అనుకూల మీడియా బలవంతపు సెలబ్రిటీని చేసేసి.. జనంపైకి వదిలింది. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలి మృతి చెందిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర తలపెట్టారు. దాన్ని అడ్డుకోవాలని చూసిన అధిష్టానాన్ని కాదని.. తన తండ్రి చనిపోయిన చోట నల్లకాలువలో ప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేపట్టారు. దాంతో ఆగ్రహించిన ఆ పార్టీ అధిష్టానం సీబీఐని ఉసిగొల్పి ఆస్తుల కేసులు నమోదు చేయించింది. డిఫ్యుటేషన్‌పై హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ అప్పుడే తెరపైకి వచ్చారు. అంతే.. వైఎస్ జగన్ కేసు విచారణాధికారిగా అనుకూల మీడియా ఆమాంతం ఆయన్ను ఎత్తేసింది. అందుకు ప్రతిగా ఈయనగారు ఉద్యోగ ధర్మానికి ద్రోహం చేసి మరీ.. ఆ ’వర్గ’ మీడియాకు లీకులిచ్చి.. లేనిపోని కథనాలు వండివార్చేందుకు సహకరించారు. అప్రతిష్ట మూటకట్టుకున్నారు. గోప్యంగా ఉంచాల్సిన విచారణాంశాలను మీడియాకు లీక్ చేయడంపై అప్పట్లో వివాదాలు చుట్టుముట్టాయి. ఇదే లక్ష్మీనారాయణ.. చంద్రబాబునాయుడుపై కేసుల విచారణ విషయానికి వచ్చేసరికి సీబీఐలో తగినంత స్టాఫ్ లేరని కోర్టుకు నివేదించి చేతులు దులిపేసుకున్నారు. ఇక్కడే ఆయన నిజాయితీ ముసుగు తొలగిపోయి.. పనితీరు బట్టబయలైంది. ఆయన గారి అసలు రూపం అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత డిఫ్యుటేషన్ పేరిట సొంత రాష్ట్రంలో అందించిన ‘సేవలను’ గుర్తించిన సీబీఐ కేంద్ర కార్యాలయం ఈయన్ను మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక 2018 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గ్రామస్వరాజ్యమంటూ విశాఖ నగరానికి ఎందుకొచ్చినట్టు? లీడ్ ఇండియా పేరిట గత ఏడాది కాలంగా చేసిన రాష్ట్ర పర్యటనల్లో భాగంగా లక్ష్మీనారాయణ విశాఖకు కూడా వచ్చారు. ఆ సందర్భాల్లోనే ఉత్తరాంధ్రను వలసవాదులు దోచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా విశాఖకు ఎప్పుడొచ్చినా.. వలసవాదులు ఈ ప్రాంతాన్ని దోచేస్తున్నారని, ఇలానే కొనసాగితే తెలంగాణ ఉద్యమ పరిస్థితులు ఇక్కడా ఉత్పన్నమవుతాయని ఆవేశకావేశాలు ప్రదర్శించేవారు. మరి అదే పవన్‌కల్యాణ్, లక్ష్మీనారాయణలు అర్ధంతరంగా ఇక్కడికి దిగుమతి కావడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి ఓట్లు చీల్చేందుకు.. ఎవరికి మేలు చేసేందుకు జేడీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారో చెప్పాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగిచివరికి జనసేనలోకి పదవీ విరమణ తర్వాత ఏడాదిగా లీడ్ ఇండియా పేరిట గ్రామస్వరాజ్యమే లక్ష్యమంటూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత లోక్‌సత్తా పార్టీ పగ్గాలు తీసుకోనున్నారనే వాదనలు వినిపించాయి. అయితే ఎన్నికల ప్రకటనల వెలువడిన తర్వాత భీమిలి టీడీపీ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. అబ్బే.. నేను ఏ పార్టీలోనూ చేరడంలేదని అయ్యగారు ఖండించారు. కానీ విశాఖ ఎంపీ సీటు కోసం టీడీపీలో బాలకృష్ణ అల్లుళ్ళ మధ్య పోరు నేపథ్యంలో సదరు లక్ష్మీనారాయణ రాత్రికి రాత్రి జనసేనలోకి జంప్ చేసి.. మరునాడు ఉదయమే విశాఖ ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి రావడంతో ఆయన అసలు రంగు బయటపడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులాలు, మతాలకు తాను అతీతమని, అవినీతిని సైతం సహించనని చెప్పుకునే లక్ష్మీనారాయణ.. టీడీపీ భజనసేనగా, కులసేనగా ముద్రపడ్డ జనసేనలోకి, పైగా అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు అభిశంసన ఎదుర్కొన్న మాయావతి మద్దతిచ్చిన పార్టీ తరఫున ఎలా పోటీ చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జేడీ మేక వన్నె పులివైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్ వెస్లీ నీతి నిజాయితీ కలిగిన అధికారినని చెప్పుకుని ఖద్దరుకు అమ్ముడుపోయిన జేడీ లక్ష్మీనారాయణ అసలు రూపం బట్టబయలైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుతో కుమ్మకై వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా 13 చార్జీషీట్లు వేసినందుకు ప్రతిగా క్విడ్‌ప్రోకో (నీకు ఇది నాకు అది)లో భాగంగానే ఈరోజు తెలుగుదేశానికి ముసుగు పార్టీ అయిన జనసేన టికెట్ ఇప్పించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత రాజకీయాలు కుళ్లిపోయాయని, వివేకానంద, మహత్మగాంధీ తనకు మార్గదర్శకమని విద్యార్థులు, యువతకు నీతి పాఠాలు బోధించే లక్ష్మీనారాయణ.. ఆ సిద్ధాంతాలు, విలువలను విశాఖ బీచ్‌లో ఎందుకు పాతరేశారో విద్యార్ధి లోకానికి జవాబివ్వాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పి ప్యాకేజీలకు అమ్ముడుపోయి సమాజానికే పెద్ద ప్రశ్నగా మారిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీకు ఆదర్శప్రాయుడా.. మార్గదర్శకుడా.. అని నిలదీశారు. ఎందరో ఉద్దండులను లోక్‌సభకు పంపిన విశాఖ ప్రజలు ఇటువంటి మేకవన్నె పులులకు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. జేడీ.. దమ్ముంటే రాయలసీమలో పోటీ చెయ్ దళిత న్యాయవాదుల సంఘం నేత :పాకా సత్యనారాయణ జేడీ లక్ష్మీనారాయణకు దమ్ముంటే సొంత గడ్డ రాయలసీమలో పోటీ చేయాలని దళిత న్యాయవాదుల సంఘం నేత పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన భారం ఉత్తరాంధ్రకు ఎందుకని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌పై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో పావుగా మారిన జేడీకి ఎన్నికల్లో పోటీ చేసే నిబద్ధత ఎక్కడిదని ప్రశ్నించారు. సొంతంగా పార్టీ పెడుతున్నట్టు చెప్పి.. ఎన్నికలొచ్చేసరికి టీడీపీ సీటు కోసం ప్రయత్నించి.. చివరి నిమిషంలో జనసేనలోకి వెళ్ళిన ఆయనలో విలువలు ఎక్కడున్నాయని నిలదీశారు. జనసేన విశాఖ ఎంపీ టికెట్‌కు దరఖాస్తు చేసుకోని గేదెల శ్రీనిబాబును మొదట ఎంపిక చేసి.. ఆయన వద్దని వెళ్లిపోతే జేడీకి ఇచ్చారన్నారు. కానీ జేడీ కంటే ముందు విశాఖవాసి బొలిశెట్టి సత్యనారాయణ దరఖాస్తు చేసినా పట్టించుకోకుండా దరఖాస్తు చేయని జేడీకి కట్టబెట్టారు. ఏ అర్హత ఉందని ఆయన్ను ఇక్కడ నిలబెట్టారో తెలియదు. ఓడిపోయిన తర్వాత తాను విశాఖలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని జేడీ హామీ ఇవ్వగలరా అని పాకా సత్యనారాయణ ప్రశ్నించారు. -
జేడీ లక్ష్మీనారాయణకు అంత దమ్ముందా?
గ్రామ స్వరాజ్యమే లక్ష్యమంటూ లీడ్ ఇండియా పేరుతో హడావుడి చేశారు. వలసవాదులు విశాఖ సంపదను దోచేస్తున్నారని మొసలి కన్నీరు కార్చారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి.. మీరు గొంతు చించుకొని వల్లించిన రెండు నినాదాలకు విరుద్ధంగా విశాఖకు ఎందుకు దిగమతయ్యారు?. వీవీ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణపై విశాఖవాసులు సంధిస్తున్న ప్రశ్నలివి. ఆయన ఏ తాను ముక్కో అందిరికీ తెలిసేందే.. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేశారో.. నిబంధనలకు విరుద్ధంగా అనుకూల వర్గ మీడియాకు లీకులిచ్చి ఎంత ప్రచారం పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి... ప్రత్యక్ష పోటీకి దిగడం కూడా అదే ‘వర్గ’ ప్రయోజనం కోసమేనని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇందులో అనుమానమే లేదు. కానీ కొన్నాళ్ల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించి ఇక్కడి వనరులను వలసదారులు దోచేస్తున్నారని.. విశాఖపై వలసవాదుల ప్రభావం పోవాలని ప్రసంగాలు దంచేసిన ఈ పెద్ద మనిషి.. ఇప్పుడు ఏ నిబద్ధతతో విశాఖ నుంచి పోటీ చేస్తున్నారని ఇక్కడి మేధావులు ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రాంతం రాయలసీమ గడప దాటి.. కనీసం ఉద్యోగ రీత్యా కూడా ఎటువంటి అనుబంధం లేని విశాఖకు ఎందుకు వచ్చినట్లని నిలదీస్తున్నారు. ఎవరి ఓట్లు చీల్చడానికి.. ఎవరి ప్రయోజనాల రక్షణకు విశాఖపై పడ్డారని ప్రశ్నిస్తున్నారు. చదవండి...(జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ వివిధ హోదాల్లో పని చేసి గతేడాది మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయనకు మించిన డీజీలు, ఐజీల గురించి వింటుంటాం.. సీబీఐలోనూ అటువంటివారెందరో ఉన్నారు. కానీ అందరిలోకి ఈయనే ఎందుకు ప్రత్యేకం అంటే.. ఒకే ఒక్క కేసు.. దాంతోనే ఆయన్ను అనుకూల మీడియా బలవంతపు సెలబ్రిటీని చేసేసి.. జనంపైకి వదిలింది. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలి మృతి చెందిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర తలపెట్టారు. దాన్ని అడ్డుకోవాలని చూసిన అధిష్టానాన్ని కాదని.. తన తండ్రి చనిపోయిన చోట నల్లకాలువలో ప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేపట్టారు. దాంతో ఆగ్రహించిన ఆ పార్టీ అధిష్టానం సీబీఐని ఉసిగొల్పి ఆస్తుల కేసులు నమోదు చేయించింది. డిఫ్యుటేషన్‌పై హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ అప్పుడే తెరపైకి వచ్చారు. అంతే.. వైఎస్ జగన్ కేసు విచారణాధికారిగా అనుకూల మీడియా ఆమాంతం ఆయన్ను ఎత్తేసింది. అందుకు ప్రతిగా ఈయనగారు ఉద్యోగ ధర్మానికి ద్రోహం చేసి మరీ.. ఆ ‘వర్గ’ మీడియాకు లీకులిచ్చి.. లేనిపోని కథనాలు వండివార్చేందుకు సహకరించారు. అప్రతిష్ట మూటకట్టుకున్నారు. గోప్యంగా ఉంచాల్సిన విచారణాంశాలను మీడియాకు లీక్ చేయడంపై అప్పట్లో వివాదాలు చుట్టుముట్టాయి. ఇదే లక్ష్మీనారాయణ.. చంద్రబాబునాయుడుపై కేసుల విచారణ విషయానికి వచ్చేసరికి సీబీఐలో తగినంత స్టాఫ్ లేరని కోర్టుకు నివేదించి చేతులు దులిపేసుకున్నారు. ఇక్కడే ఆయన నిజాయితీ ముసుగు తొలగిపోయి.. పనితీరు బట్టబయలైంది. ఆయన గారి అసలు రూపం అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత డిఫ్యుటేషన్ పేరిట సొంత రాష్ట్రంలో అందించిన ‘సేవలను’ గుర్తించిన సీబీఐ కేంద్ర కార్యాలయం ఆయనను మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక 2018 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. (‘జేడీ ముసుగు తొలిగిపోయింది’) అటు తిరిగి ...ఇటు తిరిగి జనసేనలోకి పదవీ విరమణ తర్వాత ఏడాదిగా లీడ్ ఇండియా పేరిట గ్రామస్వరాజ్యమే లక్ష్యమంటూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత లోక్‌సత్తా పార్టీ పగ్గాలు తీసుకోనున్నారనే వాదనలు వినిపించాయి. అయితే ఎన్నికల ప్రకటనల వెలువడిన తర్వాత భీమిలి టీడీపీ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. అబ్బే.. నేను ఏ పార్టీలోనూ చేరడంలేదని అయ్యగారు ఖండించారు. కానీ విశాఖ ఎంపీ సీటు కోసం టీడీపీలో బాలకృష్ణ అల్లుళ్ళ మధ్య పోరు నేపథ్యంలో సదరు లక్ష్మీనారాయణ రాత్రికి రాత్రి జనసేనలోకి జంప్ చేసి.. మరునాడు ఉదయమే విశాఖ ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి రావడంతో ఆయన అసలు రంగు బయటపడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులాలు, మతాలకు తాను అతీతమని, అవినీతిని సైతం సహించనని చెప్పుకునే లక్ష్మీనారాయణ.. టీడీపీ భజనసేనగా, కులసేనగా ముద్రపడ్డ జనసేనలోకి, పైగా అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు అభిశంసన ఎదుర్కొన్న మాయావతి మద్దతిచ్చిన పార్టీ తరఫున ఎలా పోటీ చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జేడీ మేక వన్నె పులి: జాన్ వెస్లీ నీతి నిజాయితీ కలిగిన అధికారినని చెప్పుకుని ఖద్దరుకు అమ్ముడుపోయిన జేడీ లక్ష్మీనారాయణ అసలు రూపం బట్టబయలైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుతో కుమ్మకై వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా 13 చార్జీషీట్లు వేసినందుకు ప్రతిగా క్విడ్‌ప్రోకో (నీకు ఇది నాకు అది)లో భాగంగానే ఈరోజు తెలుగుదేశానికి ముసుగు పార్టీ అయిన జనసేన టికెట్ ఇప్పించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత రాజకీయాలు కుళ్లిపోయాయని, వివేకానంద, మహత్మగాంధీ తనకు మార్గదర్శకమని విద్యార్థులు, యువతకు నీతి పాఠాలు బోధించే లక్ష్మీనారాయణ.. ఆ సిద్ధాంతాలు, విలువలను విశాఖ బీచ్‌లో ఎందుకు పాతరేశారో విద్యార్ధి లోకానికి జవాబివ్వాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పి ప్యాకేజీలకు అమ్ముడుపోయి సమాజానికే పెద్ద ప్రశ్నగా మారిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీకు ఆదర్శప్రాయుడా.. మార్గదర్శకుడా.. అని నిలదీశారు. ఎందరో ఉద్దండులను లోక్‌సభకు పంపిన విశాఖ ప్రజలు ఇటువంటి మేకవన్నె పులులకు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. జేడీ.. దమ్ముంటే రాయలసీమలో పోటీ చెయ్: పాకా జేడీ లక్ష్మీనారాయణకు దమ్ముంటే సొంత గడ్డ రాయలసీమలో పోటీ చేయాలని దళిత న్యాయవాదుల సంఘం నేత పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన భారం ఉత్తరాంధ్రకు ఎందుకని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌పై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో పావుగా మారిన జేడీకి ఎన్నికల్లో పోటీ చేసే నిబద్ధత ఎక్కడిదని ప్రశ్నించారు. సొంతంగా పార్టీ పెడుతున్నట్టు చెప్పి.. ఎన్నికలొచ్చేసరికి టీడీపీ సీటు కోసం ప్రయత్నించి.. చివరి నిమిషంలో జనసేనలోకి వెళ్ళిన ఆయనలో విలువలు ఎక్కడున్నాయని నిలదీశారు. జనసేన విశాఖ ఎంపీ టికెట్‌కు దరఖాస్తు చేసుకోని గేదెల శ్రీనిబాబును మొదట ఎంపిక చేసి.. ఆయన వద్దని వెళ్లిపోతే జేడీకి ఇచ్చారన్నారు. కానీ జేడీ కంటే ముందు విశాఖవాసి బొలిశెట్టి సత్యనారాయణ దరఖాస్తు చేసినా పట్టించుకోకుండా దరఖాస్తు చేయని జేడీకి కట్టబెట్టారు. ఏ అర్హత ఉందని ఆయన్ను ఇక్కడ నిలబెట్టారో తెలియదు. ఓడిపోయిన తర్వాత తాను విశాఖలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని జేడీ హామీ ఇవ్వగలరా అని పాకా సత్యనారాయణ ప్రశ్నించారు. -
‘పవన్’ పాయింట్ ప్రజెంటేషన్
జనసేన పార్టీ కార్యాలయంలో ఆరెస్సెస్ కార్యకర్తలా అటెన్షన్లో నిల్చుని ఉన్నాడు జేడీ లక్ష్మీనారాయణ. నల్లటి ప్యాంటు మీదికి తెల్లటి పొడవాటి హాఫ్‌హ్యాండ్స్ చొక్కా వదిలేసి ఉంది. లోపలికి వచ్చేటప్పుడు ‘టక్’ పైకి లాగేసుకుని వచ్చాడేమో.. షర్ట్ ముడతలు పడి ఉంది. ఎదురుగా పవన్‌కల్యాణ్ నిల్చుని ఉన్నాడు. జేడీ వచ్చాడని పవన్‌కల్యాణ్ లేచి నిల్చున్నాడా, పపన్కల్యాణ్ ఆల్రెడీ లేచి నిల్చునే ఉండడంతో జేడీ కూర్చోడానికి మొహమాటపడ్డాడా తెలియడం లేదు. ఇద్దరూ నిల్చునే ఉన్నారు. ఆ ఇద్దరే ఉన్నారు ఆ గదిలో. ‘టక్’ లేకపోయినా జేడీ జేడీలానే ఉన్నాడు. అవే బుగ్గలు. అదే క్లీన్ షేవ్డ్ గడ్డం. పవన్‌కల్యాణ్ మాత్రం పవన్‌కల్యాణ్‌లా లేడు. అల్లూరి సీతారామరాజులా ఉన్నాడు. చేగువేరాలా ఉన్నాడు. మావోయిస్టు వ్యూహకర్తలా ఉన్నాడు. కొంచెం కమ్యూనిస్టు కార్యకర్తలా కూడా ఉన్నాడు. జుట్టుకి, గడ్డానికి, మీసాలకు తెల్లరంగు వేస్తే ఆ తెల్లటి లాల్చీ, వదులు పైజమాలో ఏదో ఒక యాంగిల్లో బక్కచిక్కిన నరేంద్ర మోదీలానూ ఉండేలా ఉన్నాడు. పవన్ కుర్చీ ఖాళీగా ఉంది. జేడీ కూర్చోడానికి మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అయినా ఇద్దరూ కూర్చోలేదు. నిల్చునే ఉన్నారు. మాట్లాడుకోవడం లేదు. మధ్యమధ్య మాత్రం ఒకర్నొకరు చూసుకుంటున్నారు. గదిలో గోడ మీద స్క్రీన్ ఉంది. పవన్‌కల్యాణ్ చేతిలో రిమోట్ ఉంది. పవన్ ఏ క్షణమైనా తనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు జేడీ అర్థం చేసుకున్నాడు. తన పాయింట్ ఏదైనా, వినేందుకు జేడీ సిద్ధమై వచ్చాడని పవన్ అర్థం చేసుకున్నాడు. ‘‘బీజేపీలో బెర్త్ లేదు. భీమ్లీలో సీటు లేదు. లోక్‌సత్తాలో సత్తాలేదు. సొంతంగా పార్టీ పెట్టుకునే సీన్ లేదు. జగన్‌కి చూపించడానికి మీ దగ్గర ఫేస్ లేదు.. అందుకే ఇటొచ్చారు. యామ్ ఐ రైట్?’’ అన్నాడు పవన్‌కల్యాణ్. ‘‘అదేం కాదు. మీ సిద్ధాంతాలు నచ్చి ఇటొచ్చాను’’ అన్నాడు జేడీ. ‘‘మా సిద్ధాంతాలు మీకు నచ్చడం కాదు.. మీ సిద్ధాంతాలు మాకు నచ్చాలి.. అ..’’ అన్నాడు పవన్. ‘నాకో సిద్ధాంతం లేదు..’ అనబోయి ఆగాడు జేడీ. ‘‘ఏదో అనబోయి ఆగారూ..’’ అన్నాడు పవన్. ‘‘అనబోయి కాదు.. అనుకోబోయి ఆగాను. మీ సిద్ధాంతమే నా సిద్ధాంతం’’ అన్నాడు జేడీ. ‘‘అనుకోబోయి ఆగడం మా సిద్ధాంతం కాదు. అనుకోనిది కూడా ఆగకుండా అనేస్తాం’’ అన్నాడు పవన్. ‘‘నేనన్నది.. అనుకోబోయి ఆగడం, అనుకోనిది కూడా ఆగకుండా అనేయడం గురించి కాదు, మీ సిద్ధాంతం గురించి అన్నాను. మీరు రెండూ కలిపి అర్థం చేసుకున్నట్లున్నారు’’ అన్నాడు జేడీ. ‘‘సమాజంలో అర్థమవడం, అర్థకాకపోవడం, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోలేకపోవడం ఇవేవీ ఉండవు జేడీ గారూ. పేదరికం ఒక్కటే ఉంటుంది. గ్లాసు నీళ్లకు పేదరికం, నోటి ముద్దకు పేదరికం, పది నోటుకు పేదరికం. ఈ పేదరికానికి కారణం ఢిల్లీలో నరేంద్రమోదీ, ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్. పేదరికం ఎక్కడున్నా సరే, అక్కడికి వెళ్లి పేదరికాన్ని నిర్మూలించడం జనసేన సిద్ధాంతం’’ అన్నాడు పవన్. ‘‘జగన్‌ని మర్చిపోయినట్లున్నారు. పేదరికంలో జగన్‌కేమీ పార్ట్ లేదా?’’ అన్నాడు జేడీ. ‘‘పేదరికంలో జగన్ పార్ట్‌గా ఉన్నాడు గానీ, పేదరికంలో జగన్ పార్ట్ ఏమీ లేదు జేడీ గారూ’’ అన్నాడు పవన్. ‘‘అర్థంకాలేదు’’ అన్నాడు జేడీ. ‘‘జగన్ పాదయాత్రను ఫాలో అయి ఉంటే మీకు అర్థమై ఉండేది’’ అన్నాడు పవన్. ‘‘మీరు ఫాలో అయ్యారా జగన్ పాదయాత్రని?!!’’.. అడిగాడు జేడీ. ‘‘పేదరికం ఎక్కడున్నా జనసేన ఫాలో అవుతుంది జేడీ గారూ’’ అన్నాడు పవన్. జేడీకి అర్థమైంది. కూర్చోమని సీటే ఇవ్వనివాడు, నిలబడడానికి సీటేమిస్తాడు అనుకున్నాడు. ‘‘నమస్తే.. వెళ్లొస్తా’’ అన్నాడు. ‘‘జేడీగారూ.. చిన్న మాట. దాహమైనప్పుడు బావిని తవ్వుకోలేం. దాహమౌతుందేమోనని బావిని తవ్వుకుని ఉంచుకోవాలి. రిటైర్ అవ్వగానే మీకో పార్టీని తవ్వుకుని ఉండాల్సింది.. సారీ, మీరో పార్టీని పెట్టుకుని ఉండాల్సింది’’ అన్నాడు పవన్. ‘‘సరే, వెళ్లొస్తా.. నమస్తే’’ అన్నాడు జేడీ. ‘‘జేడీగారూ ఇంకో మాట’’ అన్నాడు పవన్. జేడీ ఆగాడు. ‘‘పాపం.. ఎంత దాహంతో ఉన్నారో.. ఈ గ్లాసు నీళ్లు తాగి వెళ్లండి’’ అని, నీళ్ల గ్లాసు అందించాడు పవన్. – మాధవ్ -
జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సాక్షి, విజయవాడ: గత కొద్ది రోజులుగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారన్న ఊహగానాలకు తెరపడింది. టీడీపీ, బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ లక్ష్మీనారాయణ ఆదివారం అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మీనారాయతో పాటు మాజీ వైస్ ఛాన్స్లర్ రాజగోపాల్ రెడ్డిలను పార్టీలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. జనసేన ఆవిర్భావం నుంచే లక్ష్మీనారాయణతో కలిసి పనిచేయాలని భావించినా కుదరలేదని.. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయబోతుండటం ఆనందంగా ఉందన్నారు. ఎక్కడినుంచైనా సిద్దమే పవన్ సమక్షంలో జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం తాను ఎక్కడ నుంచి పోటీ చేసే విషయాన్ని పవన్ ప్రకటిస్తారన్నారు. తాను ఎక్కడినుంచైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. -
మళ్లీ మళ్లీ..అదే కుట్ర..
-
చంద్రబాబు ఆదేశాల మేరకు జేడీ పనిచేశారు
-
‘జేడీ, చంద్రబాబుల కుట్ర బయటపడింది’
సాక్షి, హైదరాబాద్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం చంద్రబాబు నాయుడుల కుట్ర బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్సార్ కుటుంబం మీద కుట్రలు జరుగుతున్న క్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ పుట్టుకొచ్చిందన్నారు. ఎన్ని కష్టాలు, కుట్రలు ఎదురైనా.. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఇక జేడీ లక్ష్మీ నారాయణ టీడీపీ తరఫున భీమిలీ నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అనుకూల మీడియాలో వచ్చిందని, దీంతో చంద్రబాబు, జేడీల కుట్ర బయటపడిందన్నారు. జేడీ లక్ష్మీనారాయణ అక్కడ ఐజీగా ఉంటూ ఇక్కడ విచారణ జరిపారని, లోటస్ పాండ్‌లో అణువణువు వెతికి ఇక్కడ అనేక గదులు, లగ్జరీ సౌకర్యాలున్నాయని అసత్య ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది జేడీ చేశారని ఆరోపించారు. ఈ ఇద్దరు ఒక్కటేనని, రహస్యంగా మాట్లాడుకుంటున్నారని, వారి కాల్‌డేటా బయటకు తీయాలని ఆ రోజుల్లోనే తమ పార్టీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనంతో జేడీ-చంద్రబాబుల కుట్ర బయటపడిందని, ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీని అంతమొందించాలని చాలా ప్రయత్నించారని, చంద్రబాబు, జేడీ తోడు దొంగల్లా వ్యవహరించారని మండిపడ్డారు. ఓటు ద్వారా ప్రజలు వీరిని శిక్షించాలని ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. -
26కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు నీతివంతుడా..?
-
‘జేడీ ముసుగు తొలిగిపోయింది’
సాక్షి, హైదరాబాద్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముసుగు తొలిగిపోయిందని, ఆయన చంద్రబాబు నాయుడు మనిషేనని స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తెలిపారు. మంగళవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ మనిషేనని తమ పార్టీ ఎప్పటి నుంచో చెబుతుందని, ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ అనుకూల మీడియాలో రావడంతో ఈ విషయం సుస్పష్టమైందన్నారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌లు కుమ్మక్కై అన్యాయంగా జగన్‌పై కేసులు పెట్టారని మండిపడ్డారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతగా వ్యవహరించాల్సిన లక్ష్మీనారాయణ టీడీపీ అనుకూల మీడియాతో చేతులు కలిపి కేసుపై లీకుల మీద లీకులిస్తూ.. జగన్‌పై అసత్య ఆరోపణలకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. ఈ కేసుతో జగన్‌పై అసత్యాలను సృష్టించి అనుకూల మీడియాతో ప్రచారానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 26 కేసుల్లో స్టే తెచ్చుకొని తనకు తాను నీతిమంతుడిగా ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన జీవితమంతా నికృష్టమైన, నీచమైన రాజకీయం తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చిన చరిత్రలేదని, ఆయన పొత్తుపెట్టుకోని పార్టీ లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో రూ.3 వేల కోట్లుగా ఉన్న అప్పును రూ.60 వేల కోట్లకు పెంచి రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత బాబుదేనని మండిపడ్డారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర కూడా ఆయనదేన్నారు. చంద్రబాబు హయాంలో కంటే దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే ఐటీ రంగం బాగా వృద్ధి చెందిందన్నారు. లోకేశ్‌కు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చంద్రబాబు సర్టిఫికేట్ కొనిచ్చారని ఎద్దేవా చేశారు. ఎంఏ తర్వాత పీహెచ్డీ చేసి ఆ తర్వాత ఎంఫీల్ చేశానని చంద్రబాబు చెప్పడం బీకాంలో ఫిజిక్స్ చేసినట్లుగానే ఉందని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నవ్యాంధ్రను అవినీతిలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని విమర్శించారు. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. అమరావతిలో రాజధానికి 16 సార్లు శంఖుస్థాపన చేసి.. వర్షానికి నీళ్లు వచ్చే భవనం కట్టారని, జగన్ అనే పేరు వినిపిస్తేనే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారన్నారు. అధికారంలోరాగానే చంద్రబాబు అక్రమాలను బయటకు తీసి, విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇక ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని, ఓట్ల దొంగలున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జగన్ చేసిన బీసీ డిక్లరేషన్ బాగుందని, ప్రజల నమ్మకాన్ని గెలిచేది జగనేనన్నారు. చంద్రబాబు తాత్కలికమైన పథకాలు నమ్మవద్దని ప్రజలను కోరారు. -
‘లోక్‌సత్తా, జనసేన పార్టీలు చంద్రబాబు కవలలు’
సాక్షి, విజయవాడ : పాత బండికి కొత్త డ్రైవర్ వచ్చినట్లుగా..లోక్‌సత్తా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా జేడీ లక్ష్మీనారాయణ వచ్చారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నీతి, నియమాల గురించి మాట్లాడే లోక్‌సత్తా నాయకులు.. ఈ నాలున్నరేళ్ల చంద్రబాబు అవినీతిపై, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ తదిరత అంశాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలల్లో ఒకటి లోక్‌సత్తా పార్టీ కాగా, మరొకటి జనసేత పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు అనేసరికే చంద్రబాబుకు అన్ని పథకాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పట్టిసీమ నుంచి రాయలసీమ వరకూ అణువణువు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించకుండా పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. వైఎస్సార్‌ను, వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాకూడా అసెంబ్లీలో పోరాడుతానంటున్న పవన్.. గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయడానికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని చెప్పారు. అన్యాయంగా 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎత్తుకెళ్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజల కోసం ధైర్యంగా పోరాడుతున్న ఎకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రజల ఆశిస్సులతో అధికారంలోకి వచ్చేది కూడా తమ పార్టీయేనని అంబటి ధీమా వ్యక్త చేశారు. -
వైఎస్ఆర్ను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదు
-
చంద్రబాబు,లక్ష్మీ నారాయణ మధ్య బంధం ఏనాటిదో
-
ప్రతి పోలీసుకూ పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కానిస్టేబుళ్లు ఒక్క పదోన్నతి కూడా లేకుండానే రిటైర్ అవుతున్నారని, అలా కాకుండా ప్రతీ పోలీసుకు విధి నిర్వహణలో కనీసం ఒక ప్రమోషన్ వచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు కుటుంబాల సంక్షేమం బాధ్యత తనదని, ప్రజల సంరక్షణ బాధ్యత పోలీసులదని అన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో మోడల్‌గా మారుస్తామని ప్రకటించారు. అమరావతిలో పోలీసు అమరవీరుల స్థూపం నిర్మిస్తామన్నారు. పోలీసులకు ఇళ్లు, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పోలీసులు కన్పించకూడదని (విజిబుల్ పోలీస్), పోలీసింగ్ మాత్రమే కన్పించాలని (ఇన్విజిబుల్ పోలీసింగ్) అన్నారు. అలాగే.. రాష్ట్రంలో రౌడీలు ఉండకూడదని, వారంతా ఏపీ బయట ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, మొదటిస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. కాగా, పోలవరం భూసేకరణను అడ్డుకోవడం, రాజధానిలో చెరుకుతోట దగ్థం, తిత్లీ తుపాను బాధితులను రెచ్చగొట్టడం వంటివి రాజకీయ ముసుగులో జరుగుతున్నాయని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి సంఘటనలను అడ్డుకోవడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి పోలీసులు ప్రజలను కాపాడుతున్నారని.. వీరి త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం: డీజీపీ పోలీసులు తమ కుటుంబాలకంటే ప్రజాసేవకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని డీజీపీ ఆర్పీ ఠాకుర్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగే తమ లక్ష్యమని, చేరువ కార్యక్రమం ద్వారా ప్రజలను పోలీస్ కుటుంబంలో భాగం చేస్తున్నామని చెప్పారు. అనంతరం.. ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు సీఎం, ఉపముఖ్యమంత్రి, డీజీపీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ ఎం. మాలకొండయ్య, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. కాగా, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పోలీసు సంక్షేమ నిధికి రూ.15కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం చేసిన ప్రకటనపై పోలీసులు పెదవి విరుస్తున్నారు. -
రాజకీయాల్లోకి ఐపీఎస్ లక్ష్మీనారాయణ!
సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేయనున్నారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునేందుకు గురువారం మహారాష్ట్ర డీజీపీ నుంచి అనుమతి పొందినట్టు తెలిసింది. ఆయన పదవీ విరమణ లేఖను ఆ రాష్ట్ర సీఎస్‌కు అందజేసినట్టు లక్ష్మీనారాయణ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తారంటున్నారు. మహారాష్ట్ర కేడర్ నుంచి..: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన లక్ష్మీనారాయణ 1990లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ఆ రాష్ట్రంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎస్పీగా, సీబీఐ హైదరాబాద్ రేంజ్ జాయింట్ డైరెక్టర్‌గా, థానే జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతి పొంది మహారాష్ట్ర పోలీసు శాఖ అదనపు డీజీపీగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ హోదాలో వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. అటు మహారాష్ట్ర కేడర్‌తోపాటు ఇటు ఏపీ, తెలంగాణ క్యాడర్లలో ఉన్న ఐపీఎస్‌లలో జరుగుతున్న చర్చను బట్టి... లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లక్ష్మీనారాయణ స్నేహితులు కొందరు బీజేపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఏపీలోని ఆయన చిన్ననాటి స్నేహితులు మాత్రం ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ పెడతారని అంటున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ స్నేహితుడొకరు మాత్రం ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్‌తో జతకడతారని, త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. దీనిపై మీడియా వర్గాలు లక్ష్మీనారాయణను సంప్రదించగా... తాను వీఆర్ఎస్ తీసుకుంటున్నది నిజమేనని, తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానన్నారు. -
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ
-
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆయన కుటుంబసభ్యులు శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారు ఆరణాల బాక్సు మాయంపై ఇంట్లో పనిచేసే వాళ్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమారు ఒక కేజీ బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. కాగా కాగా జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జగన్‌పై కేసు నిలవదని ఆనాడే చెప్పా
‘సాక్షి’ టీవీ ఇంటర్వ్యూలో మాజీ సీఎస్ రమాకాంత్‌రెడ్డి ‘మనసులో మాట’ ⇒ సీబీఐకి రాష్ట్ర సచివాలయం, కేబినెట్ రూల్స్ తెలియవు ⇒ మంత్రివర్గ సమావేశం ఎందుకు నిర్వహిస్తారో కూడా తెలియదు ⇒ కేబినెట్లో తీసుకున్న నిర్ణయానికి కారణాలు రాయనక్కరలేదు ⇒ రూల్స్ తెలుసుకోకుండానే వైఎస్ జగన్ కేసుల్లో విచారణ ప్రారంభించారు ⇒ సచివాలయంలో, క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశాలకు జగన్ రాలేదు ⇒ ఫలానా పని చేసి పెట్టాలంటూ నాకు ఎన్నడూ లేఖ రాయలేదు ⇒ వైఎస్ చనిపోయిన తర్వాతే జగన్‌ను కలిశా సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్(జేడీ) వి.వి.లక్ష్మీనారాయణకు రాష్ట్ర సెక్రటేరియెట్, కేబినెట్ నిబంధనలు తెలియవని అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి చెప్పారు. జగన్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ సీబీఐ ఆరేళ్ల క్రితం నమోదు చేసిన కేసుల దర్యాప్తునకు సంబంధించి ఆయన ‘సాక్షి’ టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుకు ‘మనసులో మాట’ పేరుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై అసలు అవగాహన లేదని జగన్ కేసు విచారణ జరిగిన తీరు చూస్తే తనకు అర్థమైందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... జగన్ నాకు ఒక్క లేఖ కూడా రాయలేదు ‘‘నేను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు సచివాలయంలో గాని, అసెంబ్లీలో గాని, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోగాని జరిగిన ఏ ఒక్క సమావేశానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాలేదు. ఈ విషయం కచ్చితంగా చెప్పగలను. ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఎంపీగా ఫలానా వాళ్లకు అది ఇవ్వండి అని గాని, ఇవ్వొద్దు అని గాని, నాకు ఇది కావాలని గాని, ఫలానా కంపెనీకి అది కావాలని గాని ఆయన నాకు ఎప్పుడూ ఎలాంటి లేఖ రాయలేదు. ఒక్కరోజు కూడా ఆయన నాకు ఫోన్ చేయలేదు. నేను జగన్‌ను ఎప్పుడు కలిశానంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నా సానుభూతి తెలియజేయడానికి వెళ్లి కలిశాను. అంతకు ముందెప్పుడూ కలవడం జరగలేదు. ఫలానా ఆఫీసును రెయిడ్ చేయాలని హైకోర్టు చెబుతుందా? జగన్‌పై కేసులు పెట్టినప్పుడు సీబీఐ వాళ్లు నన్ను రెండుసార్లు దిల్కుషా గెస్ట్‌హౌస్‌కు పిలిచారు. అప్పుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా లక్ష్మీనారాయణ ఉండేవారు. ‘మీరడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నన్ను పిలిపించారు, సంతోషం. అయితే, ఫలానా వ్యక్తులను కూడా మీరు పిలిపించి మాట్లాడుతారా?’ అని ఆయనను అడిగితే, ‘నేను పిలవడం లేదండి. వారిని ప్రశ్నించడానికి హైకోర్టు నాకు అంతటి పరిధి విధించలేదు’ అని జవాబిచ్చారు. ‘మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఫలానా వాళ్లను ఇంటరాగేట్ చేయొచ్చు. ఫలానా వాళ్లను ప్రశ్నలు అడగొచ్చు. ఫలానా వాళ్ల ఇళ్లు, ఆఫీసులను రెయిడ్ చేసినా, అక్కడి నుంచి కాగితాలు తెచ్చుకోవచ్చు. ఫలానా ఆఫీసును రెయిడ్ చేయాలని హైకోర్టు చెబుతుందా?’ అని అడిగాను. దానికి ఆయన, ‘అబ్బో వద్దండి... అదంతా కదిలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది’ అన్నారు. ‘అలాగైతే మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదండి’ అన్నాను. ‘నేను ఈ మాట చెబుతున్నాను, ఇది రికార్డు అవుతుందని నాకు తెలుసు’ అని చెప్పాను. సీబీఐకి కనీసం సెక్రటేరియట్ రూల్స్ కూడా తెలియవు... కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్ గురించి ప్రశ్నించడానికి లక్ష్మీనారాయణ నన్ను దిల్కుషా గెస్ట్‌హౌస్‌లోని తన ఏసీ గదిలో కూర్చోబెట్టారు. 48 ఫైళ్లు నా ముందుంచారు. ‘మీరు సంతకం చేశారు, ఇలా నోట్ వచ్చినప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. రాష్ట్రంలో సెక్రటేరియెట్ రూల్స్, పద్ధతులు సీబీఐ వాళ్లకు తెలియవు. బేసిక్‌గా అది ఒక ప్రాబ్లమ్. కేబినెట్ సమావేశం అంటే ఏమిటి? ఏ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు..? ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం..? కేబినెట్ పరిధి ఏమిటి..? ముఖ్యమంత్రికి గల అధికారాలేమిటి? కేబినెట్లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? అనే విషయాలు సీబీఐకి నిజంగా తెలియదు. వాళ్లకు (సీబీఐ) భారత ప్రభుత్వ రూల్సే తెలుసు కాని రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ తెలియవు. అసెంబ్లీ నిబంధనలు తెలియవు. స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలేమిటో తెలియవు. మాలాంటి కార్యదర్శులకు ఉన్న అధికారులు, విధులు, బాధ్యతలు ఏమిటో వారికి తెలియవు. అవి తెలియజెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఎలా పని చేస్తుందో సీబీఐకి తెలియజెప్పే పనిని సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)లో పనిచేసే ఓ మహిళా అధికారికి అప్పగించాం. ఆమె ఆ పని చేశారు. నాకు బేసిక్‌గా తెలిసింది ఏమిటంటే.. అసలు స్టేట్ గవర్నమెంట్ రూల్స్, ప్రొసీజర్స్‌ను కూడా అర్థం చేసుకోకుండా సీబీఐ వాళ్లు విచారణ మొదలుపెట్టారు. నేను ఆరోజే ఆయన (లక్ష్మీనారాయణ)ను ఈ కేసులు నిలుస్తాయని నిజంగా మీకు నమ్మకం ఉందా..? అని అడిగితే... సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వేశారాయన. అనుమతులిచ్చిన అథారిటీని ఎలా పిలుస్తారు? మీరు విచారణకు ఎవరిని పిలుస్తారు.. అని లక్ష్మీ నారాయణను అడిగాను. అనుమతులు ఇచ్చింది ఎవరు? కేబినెట్. దానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. పిలవడానికి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు. కాబట్టి కేబినెట్లోని మంత్రులందరినీ పిలిచి అడుగుతారా? రూల్ ఏమిటంటే.. కేబినెట్లో ఏదైనా నిర్ణయం తీసుకుం టే మేము(కార్యదర్శులం) రీజన్స్ (కారణాలు) రాయన క్కరలేదు. కేబినెట్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది కూడా రాయనక్కరలేదు. మీకు ఆశ్చర్యం అనిపించ వచ్చు గానీ.. అది మా రూల్‌లో ఉంది. కేబినెట్లో ఫలానా నిర్ణయాలు ఎందుకు తీసు కున్నారో రికార్డు చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగు తారు అని జేడీతో అన్నాను. అప్పుడు పనిచేసిన మంత్రులను పిలిచి అడిగితే వాళ్లేమంటారు... అది సమిష్టి బాధ్యత అని చెబుతారు. మరి ఎవరిని అడుగుతారు? అనుమతులు ఇచ్చిన అథారిటీని అడగాలి. ఆ అథారిటీని ఎలా పిలుస్తారు? కాబట్టి మీ విచారణపై నాకు పెద్దగా నమ్మకం లేదు అని చెప్పేశాను. ఐఏఎస్‌లు ఎక్కడికీ పారిపోరు కదా! ‘‘జగన్‌పై పెట్టిన కేసుల విషయంలో అప్పటి ఐఏఎస్ అధికారులను అరెస్టు చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే వాళ్లు ఎక్కడికీ పారిపోరు కదా! ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది అనే ఉద్దేశంతో అరెస్టు చేశారమో తెలియదు. ఆ తర్వాత బ్రహ్మాండం బద్దలు కాలేదు అని నేను అనుకుంటున్నాను’’ అని రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు.