Junior artist
-
జూనియర్ ఆర్టిస్ట్ ని మోసగించిన ఎస్ఐ అరుణ్
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని శారీరకంగా లోబరుచుకుని.. మరో యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్న కేసులో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్ (29) ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణ్ 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్‌గా పని చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువతి (23) సైదాబాద్ సరస్వతీనగర్ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. 2022 జనవరిలో బంధువుల కుటుంబ సమస్యల విషయమై సదరు యువతి అప్పట్లో సైదాబాద్ పీఎస్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్రైనీ ఎస్ఐ పబ్బా అరుణ్ ఆమెకు పరిచయమయ్యాడు. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్ఐ అరుణ్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అతను సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలో పని చేస్తున్న సమయంలోనూ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు. ఇటీవల అరుణ్‌కు వేరే యువతితో వివాహ నిశి్చతార్థమైన ఫొటోలను స్మార్ట్ ఫోన్లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. ఖంగు తిన్న అతను నిశ్చితార్థాన్ని ఉపసంహరించుకుంటానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. నిశ్చితార్థమైన యువతి సోదరుడు బాధిత యువతికి గత నెల ఫోన్ చేశాడు. అరుణ్ తన సోదరినే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె అరుణ్‌కు ఫోన్ చేసి ఈ విష యంపై ప్రశ్నించడంతో.. ‘అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు నన్ను మరచిపో’ అంటూ ఫోన్ పెట్టేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి శనివారం సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పబ్బా అరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సక్సెస్ కోసం ఎన్నో అవమానాలు పడ్డాను..
-
జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..
సాక్షి, బంజారాహిల్స్: తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో యువతీ, యువకులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్‌రెడ్డి సూర్యనారాయణ(30) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం తనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న నాగవర్ధినితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసేదాకా కొనసాగింది. అదే భవనంలో ఈ ఇద్దరూ కలిసి రెండో అంతస్తులో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. చదవండి: ('నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు') ఎవరికి వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకొని ఈ మేరకు సూర్యనారాయణ అదే భవనంలో ఆమె నుంచి విడిపోయి నాల్గో అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. ఈ లోపు నాగవర్ధిని రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ ఇటీవల ఆమెను నిలదీశాడు. శ్రీనివాస్‌రెడ్డితో సహజీవనం మానుకోవాలని తనతో పాటే ఉండాలని గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సూర్యనారాయణను ఆమె గదిలోకి వెళ్లగా శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధిని ఇద్దరూ కనిపించడంతో వారితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరగడంతో వారిద్దరూ కలిసి సూర్యనారాయణను అదే అంతస్తు పైనుంచి కిందికి తోసేశారు. పక్కటెముకలు విరిగిపోయి ఓ ఎముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడంతో అతడి పరిస్థితి విషమించింది. బాధితుడిని పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో బాధితుడిని చేర్నించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, నాగవర్ధినిలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే నాగవర్ధినికి వివాహం జరిగినట్లు తేలింది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి) -
అత్యాచారం కేసులో నటుడు అరెస్ట్... క్యారవాన్‌లో ఉంచమని భార్య రిక్వెస్ట్
'సార్.. మా ఆయన సినిమా హీరో.. లాకప్‌లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్‌లో ఉండటానికి అనుమతివ్వండి' అంటూ ఓ యువతి పోలీసులను వింత కోరిక కోరింది. రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన కొత్తగా మా ప్రయాణం సినిమా హీరో ప్రియాంత్‌రావు భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు పెట్టుకున్న విన్నపం ఇది. సదరు యువతి.. 'క్యారవాన్ సైతం తీసుకొచ్చాను.. రాత్రంతా అందులో ఉండటానికి అనుమతి ఇవ్వండి' అని కోరడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. చట్టం అందుకు ఒప్పుకోదని పోలీసులు చెప్పగా క్యారవాన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉంచుతామని సిబ్బంది ఎందుకని ఎదురు ప్రశ్నించింది. రూల్స్ ఒప్పుకోవమ్మా అంటూ పోలీసులు నచ్చజెప్పినా గంటపాటు భర్తను క్యారవాన్‌లో ఉంచేందుకు పోలీసులను బతిమిలాడి విఫలమైంది. సినీ నటుడు ప్రియాంత్‌రావు ఓ జూనియర్ ఆర్టిస్టును ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లిమాట ఎత్తేసరికి దిక్కున్నచోట చెప్పుకో అంటూ దూషించాడు. దీంతో బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై అత్యాచారంతో పాటు అట్రిసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు. -
జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. యంగ్ హీరో అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్‌పై ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు కులం పేరుతో దూషించాడని సదరు మహిళా ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారిలో ఉన్న ప్రియాంత్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రియాంత్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చగా.. హీరో మొహం చాటేశాడు. అంతేకాదు అబార్షన్ కోసం మెడిసిన్ ఇవ్వడంతో బాధితురాలు ఆరోగ్యం పాడైపోయింది. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించడంతో.. ప్రాణభయంతో జులై 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారిలో ఉన్న నిందితుడిని .. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. -
అప్పు కావాలి.. జూనియర్ ఆర్టిస్ట్‌ను నమ్మించి రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి..
బంజారాహిల్స్: అప్పు కోసం వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్‌పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే యువతి(22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. డబ్బులు ఇస్తానని లోపలికి పిలిచిన బాలు నాయక్ ఆమెను గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడితో కూడా గడిపితే రూ. 5 వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి తన బంధువుకు ఫోన్ చేసింది. ఇద్దరూ వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం -
గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ధర్నాకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర45లో ఉన్న గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది. కాగా గతంలోనూ సునీత గీతా ఆర్ట్స్ ముందు పలుమార్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. చదవండి: రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే.. -
రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ గాయత్రి మృతి.. ప్రమాదానికి ముందేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. హోలీ సందర్భంగా జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్ పబ్‌కు వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే ప్రీసమ్ పబ్‌లోకి వెళ్లి పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది క్లారిటీ లేదని తెలిపారు. గచ్చిబౌలి ఏఐజీ అసుపత్రిలో వెంటిలేటర్‌పై రోహిత్ చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐ జీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫుట్‌పాత్‌ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా గాయత్రి, రోహిత్ మధ్య స్నేహం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం హోలీ పండగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లిన రోహిత్ తనను పికప్ చేసుకున్నాడు. తరువాత ఇద్దరు కలిసి ప్రిసమ్ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయలుదేరగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రోహిత్ కూకట్‌పల్లిలోని హెచ్ఎంటీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. చదవండి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం మరోవైపు రోడ్డు ప్రమాదంపై గాయత్రి తల్లి స్పందించారు. తన కూతుకు అన్యాయం చేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రోహిత్‌తో కలిసి కూతురు బయటకు వెళ్లిందని తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
లైంగిక దాడి, ఆపై వీడియోలు తీశారు : నటి
తిరువొత్తియూరు: ఏకేఆర్ ప్రాంతంలో ఓ సహాయ నటిపై సామూహిక లైంగిక దాడి చేసిన వ్యవహారంలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు.. చెన్న వలసరవాక్కుంకు చెందిన ఓ సహాయ నటి. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో తన ఇంటిలోకి చొరబడి ఇద్దరు కత్తి చూపించి 10 గ్రాముల బంగారు నగలు లాక్కుని రూ. 50వేలు నగదు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. అలాగే వారిద్దరూ తనపై లైంగిక దాడి చేశారని, వీడియోలు తీశారని ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా చెన్నై రామాపురం ప్రారంతానికి చెందిన కన్నదాసన్, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్‌ను అరెస్ట్ చేశారు. -
జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి.. నిద్రమత్తులో..
Junior Artist Jyothi Reddy Death News: రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి (26) హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి.. సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్‌నగర్ స్టేషన్లో దిగింది. చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్) వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆందోళన.. చాదర్‌ఘాట్: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతితో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. షాద్‌నగర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జ్యోతిరెడ్డి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స నిమిత్తం ఆమెను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం) -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Gachibowli Road Accident: 'ఆ అమ్మాయిలు వినలేదు.. మందు తాగారు'
Reason Behind Gachibowli Road Accident: గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు స్పాట్లోనే మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయి సిద్ధూ అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపినందుకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు వివరించాడు. చదవండి: జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు 'ఉదయాన్నే షూటింగ్ ఉందని రాత్రి మా ఇంటికి వచ్చారు. సిట్టింగ్ వేశాం. ముగ్గురు మందు తాగారు. నేనెం తాగలేదు. అబ్ధుల్ బ్లాక్ డాగ్ తాగాడు. అమ్మాయిలిద్దరూ బీర్లు తాగారు.మందు తాగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగుదాం అన్నారు. ఈ టైంలో ఎందుకు బయటకు వెళ్లడం..డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ప్రాబ్లం అవుతుందని చెప్పాను. అయినా ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదు. టీ తాగుదామని చెప్పారు. తోడు వెళ్లకపోతే బాగోదని నేను కూడా వెళ్లాను. నాకు డ్రైవింగ్ రాదు. అబ్దుల్ కారు నడిపాడు. అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. గచ్చిబౌలి నుంచి స్పీడ్‌గా వస్తుంటే ప్రమాదం జరిగింది. నేను మందు తాగలేదు. నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే జీరో వచ్చింది' అని పేర్కొన్నాడు. చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి A speedy car split into 2 parts after hit a tree, 3 people were dead on the spot and 1 suffered serious injuries at #Gachibowli area in #Hyderabad on Saturday. The deceased are 2 female junior artists and a bank employee.#caraccident#Carsplits2parts #DrunkandDrive pic.twitter.com/ZLWc4VQx2w — Surya Reddy (@jsuryareddy67) December 18, 2021 -
జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు
Gachibowli Road Accident: 2 Junior Artists Instagram Photos Viral: గచ్చిబౌలిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి చెందారు.హెచ్‌సీయూ రోడ్లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఎన్. మానస(23), ఎం. మానస(21)లు స్పాట్లోనే మరణించారు. వీరితో పాటు కారు నడిపిన అబ్ధుల్ సైతం అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో కారు రెండు భాగాలుగా తునాతునకలైంది. దీన్ని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ప్రాణాలు నిలవలేదు. మృతుల్లో ఎన్. మానస స్వస్థలం (23) కర్ణాటక కాగా, ఎం. మానస(21)ది మహబూబ్‌నగర్ అని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్. మానసకు చెందిన ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) View this post on Instagram A post shared by Manasa (@manasa_narayanmurthy) చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి -
Gachibowli :గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి
Gachibowli Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, కారు నడుపుతున్న ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఉన్నారు. మృతులను ఎన్. మానస(23), ఎం. మానస(21)లుగా గుర్తించారు. వీరు అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉంటున్నారు. కారు నడిపిన అబ్దుల్.. యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఇతను విజయవాడ వాసిగా గుర్తించారు. సిద్ధు అనే మరో జూనియర్ ఆర్టిస్ట్‌కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఉదయం షూటింగ్ ఉందని గచ్చిబౌలి జేవి కాలనిలో ఉండే సాయి సిద్దు ఇంటికి చేరుకున్నారు. అక్కడే నలుగురూ మద్యం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి టీ తాగడానికి లింగంపల్లి వైపు వెళ్లగా కారు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమ, పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌తో సహజీవనం.. భర్తకు విడాకులు ఇప్పించి...
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాది కొడుకున్న తనకు భర్తతో విడాకులిప్పించి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న యువకుడు మోసం చేశాడంటూ ఓ జూనియర్ ఆర్టిస్ట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు.. రహ్మత్‌నగర్‌లో అద్దెకుంటున్న జూనియర్ ఆర్టీస్ట్(26)కు నాలుగేళ్ల క్రితం ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తితో రహ్మత్‌నగర్ వీడియోగల్లీలో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. చదవండి: పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో.. నాలుగేళ్లుగా ఇదే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నది. ప్రసాద్‌రెడ్డి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. అప్పటి నుంచి జూనియర్ ఆర్టీస్ట్కు వేధింపులు మొదలయ్యాయి. తనను మోసం చేయడమే కాకుండా వేధింపులకు గురిచేస్తూ మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రసాద్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 354(డి), 420, 509 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. -
హైదరాబాద్ ఫిలింనగర్లో జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య
-
ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట మోసం
సాక్షి, విశాఖపట్నం: సినిమాలో అవకాశాం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ. 5లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చివరికి తను మోసపోయానని గ్రహించిన ఆ సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఆ యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన ఓ యువతి సినిమాలపై మక్కువతో జూనియర్ ఆర్టిస్టుగా అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక గీతాలయ స్టూడియోస్‌కు చెందిన గీతా ప్రసాద్‌తో పాటు మరికొంతమంది సదరు యువతిని మాయమాటలతో నమ్మించారు. హైదరాబాద్‌లోని సినిమా వాళ్లతో తనకు అనేక పరిచయాలున్నాయని, ఓ ప్రముఖ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసే అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికారు. అంతేకాకుండా రూ. 10లక్షల పారితోషకం ఇప్పిస్తానని చెప్పిన గీతాప్రసాద్ అండ్ గ్యాంగ్ ఇందుకుగాను తనకు రూ. 5 లక్షల కమీషన్ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే అతడు చెప్పిన మాయమాటలను నమ్మిన ఆ జూనియర్ ఆరిస్టు ఒప్పందం ప్రకారం ముందే రూ. 5లక్షలు ఇచ్చింది. డబ్బు ముట్టడంతో ముఖం చాటేసిన గీతప్రసాద్ను నీలదీయడంతో చివరికి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులును ఆశ్రయించిన ఆ జూనియర్ ఆర్టిస్టు గీతప్రసాద్పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. -
లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ తనతో పాటు చాలా మంది అమ్మాయిలను మోసం చేస్తూ శారీరకంగా వాడుకుంటున్నారని.. ఆయనను లారెన్స్ సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సహాయం కోసం వెళ్లే అప్పటి వెస్ట్ మారేడ్‌పల్లి సీఐ.. ప్రస్తుత ఏసీపీ రవీందర్‌రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమను తిరస్కరించింనందుకు వినోద్ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆరోపించారు. తన ఫోన్ నెంబర్ తీసుకొని వినోద్ ప్రపోజ్ చేశాడని.. తిరస్కరించడంతో చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పారు. తన స్నేహితులను సైతం ట్రాప్ చేసి వారితో వినోద్ అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ‘వినోద్ వేధింపులను తట్టుకోలేక మొదటగా ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఓ కానిస్టేబుల్‌తో మళ్లీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని వినోద్ చెప్పించాడు. దీంతో కేసు పెట్టకుండా వెళ్లిపోయాను. మళ్లీ కొద్దిరోజుల తర్వాత తిరిగి వేధించడం మొదలు పెట్టాడు. ఆయన వేధింపులు భరించలేక వెస్ట్ మారెడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పటి వెస్ట్ మారెడ్‌పల్లి సీఐ రవీందర్‌రెడ్డి తాను చెప్పినట్లు వింటే న్యాయం చేస్తానని అన్నారు. కేసు గురించి మాట్లాడేందుకు ఓ లాడ్జికి రమ్మని అక్కడ నాతో అసభ్యంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. 2006 నుంచి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని దివ్య వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఎన్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు విజ్ఙప్తి చేశారు. -
‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’
ప్రొడ్యూసర్ బన్నీ వాసు తనను ఎప్పుడు శారీరకంగా హింసించలేదని, తప్పుడు ప్రచారం చెయ్యవద్దని జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత స్పష్టం చేశారు. బన్నీ వాసు తనను శారీరకంగా హింసించాడని వస్తున్న వార్తలను సునీత ఖండిస్తూ... ఓ వీడియోను షేర్ చేశారు. బన్నీ వాసుపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని తన ఫేసుబుక్ ఖాతాలో వీడియో పోస్ట్ ద్వారా తెలియజేశారు. జనసేన పార్టీలో ఉన్న సమయంలో తాను నిర్మాత బన్నీ వాసును ఒకటి రెండు సార్లు స్వయంగా కలిశానని తెలిపారు. తర్వాత ఆయనను కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా.. అపాయింట్మెంట్ దొరకలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన్ని కలవడానికే నిరసన చేస్తున్నట్లు తెలిపారు. అంతేగానీ అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరారు. కాగా బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్ అక్కినేని నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. -
జనసేన కోసం కష్టపడితే మోసం చేశారు..
బంజారాహిల్స్: సినిమా అవకాశాల పేరుతో ప్రముఖ దర్శకుడు బన్ని వాసు తనను మోసం చేశారని, జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పిన ఆ పార్టీ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ బుధవారం తెల్లవారుజామున ఫిలించాంబర్ గేటుకు తనను తాను గొలుసులతో బంధించుకొని నిరసన తెలిపింది. దీనిని గుర్తించిన సెక్యురిటీ గార్డు పోలీసులకు సమాచారం అందిచడంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపిచేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించింది. తనకు జరిగిన మోసంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించి అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో తాను శ్రీరెడ్డికి సోషల్ మీడియా వేదికగా జనసేన తరపున కౌంటర్ ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. బన్నీవాసు సినిమా అవకాశాల పేరుతో తనను ఎన్నోసార్లు కార్యాలయానికి పిలిపించారని ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా ఫేస్బుక్ లైవ్‌ద్వారా తనకు జరిగిన అన్యాయాలను వివరించింది. తనపై తప్పుడు ప్రచారం చేసి పోలీస్ స్టేషన్‌కు పంపించిన వారు ఫిలిం ఇండస్త్రీ నుంచి బ్యాన్ చేయిస్తామని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ బ్యానర్ ఏర్పాటు చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పవన్‌కళ్యాణ్ దృష్టికి వెళ్లాలనే ఇలా చేసినట్లు తెలిపింది. మూడు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సునీతను ఎట్టకేలకు గొలుసులు తొలగించి స్టేషన్‌కు తరలించారు. ఆమెపై మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆరు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కొందరిపై కేసులు పెట్టి సెటిల్మెంట్లు చేసుకున్న వ్యవహారాలు తమ దృష్టికి వచ్చాయని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. చేతినిండా పవన్ కల్యాణ్ పేరు తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానమనీ అందుకే చేతుల నిండా పవన్ కల్యాణ్, జనసేన పేర్లు పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు సునీత తెలిపింది. -
ప్రముఖ దర్శకుడిపై జూనియర్ నటి తీవ్ర ఆరోపణలు
సాక్షి, చెన్నై : కోలివుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు అట్లీపై ఒక జూనియర్ నటి సంచలన ఆరోపణలు చేశారు. దళపతి విజయ్ 63వ సినిమాను అట్లీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు అట్లీ తనను దారుణంగా దూషించారని, అసభ్యంగా, అశ్లీలంగా ఆయన దూషణలు ఉన్నాయని ఆమె తాజాగా చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అట్లీ తనను కుక్క కంటే హీనంగా చూసేవాడని ఆమె విమర్శించారు. రాజా-రాణి, తెరి, మెర్సల్ లాంటి విజయవంతమైన సినిమాలతో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన అట్లీపై ఈరకమైన ఆరోపణలు రావడం తమిళ చిత్రసీమలో సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 13న షూటింగ్ సెట్లో తనను అట్లీ ఘోరంగా దూషించాడని, అయినా ఎన్నికలు ఉండటం, ప్రభుత్వ సెలవులు ఉండటంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదని ఆమె చెప్పుకొచ్చారు. ‘ఆహారం, సరైన టాయ్లెట్లు కావాలని మాత్రమే మేం సహాయ దర్శకులను అడిగేవాళ్లం. కానీ, అట్లీ, అతని సహాయ దర్శకులు మా విజ్ఞప్తిని పట్టించుకోకపోగా, మమ్మల్ని దూషించారు. అంతేకాదు, నన్ను షూటింగ్ స్పాట్ నుంచి బలవంతంగా తరిమేశారు’ అని ఆమె పేర్కొన్నారు. ఫుట్‌బాల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న అట్లీ తాజా సినిమాలో విజయ్ సరసన నయనతార నటిస్తుండగా.. జాకీ ష్రఫ్, కదిర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. -
భర్త ఇంటి ఎదుట జూనియర్ ఆర్టిస్ట్ హేమ ధర్నా
నెల్లూరు, ఆత్మకూరు: భర్త ఇంటి ఎదుట హేమ అనే జూనియర్ ఆర్టిస్ట్ ధర్నా చేసిన ఘటన ఆత్మకూరు పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన కూకట్ల హేమ టీవీ సీరియళ్లలో, చిన్న బడ్జెట్ చిత్రాల్లోనూ నటిస్తోంది. హేమ తల్లిదండ్రులు ఆమెను సమీప బంధువు, మేనమామకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే వివిధ కారణాల రీత్యా ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. నటనపై ఇష్టంతో హైదరాబాద్‌కు వెళ్లింది. ఆత్మకూరు క్రిస్టియన్‌పేటకు చెందిన నవతేజ 2015 నుంచి టీవీలు, సినిమాల్లో చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను హేమతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నవతేజ వేధించినట్లు హేమ చెబుతోంది. గతేడాది ఆగస్ట్ 4వ తేదీన ఇద్దరూ హైదరాబాద్‌లో పెద్దమ్మగుడిలో వివాహం చేసుకున్నారు. సంవత్సరంపాటు కాపురం చేసిన నవతేజ ఈ ఏడాది జూన్‌లో ఆమెను వదిలి ఆత్మకూరుకు వచ్చాడు. దీంతో గర్భిణిగా ఉన్న హేమ ఆత్మకూరుకు చేరుకుంది. నవతేజ తల్లిదండ్రులతో తాము వివాహం చేసుకున్న విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. తనపై నవతేజ చేయి చేసుకున్నాడని, దీంతో గర్భస్రావమైందని హేమ వాపోయింది. అప్పట్లో ఆత్మకూరు పోలీసుల వద్దకు వెళ్లగా వారి సలహా మేరకు హైదరాబాద్ సిటీలోని ఖైరతాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అనంతరం నవతేజ, తల్లిదండ్రులు సూచనప్రాయంగా వారిద్దరూ ఉండేందుకు ఒప్పుకోవడంతో తిరిగి హైదరాబాద్‌లో కలిసి ఉంటున్నారు. రెండునెలల క్రితం భర్త నవతేజ 15 రోజుల్లో వస్తానని ఆత్మకూరుకు వచ్చాడు. హేమతో ఫోన్లో కూడా మాట్లాడటం మానేయడంతో సోమవారం ఆమె ఆత్మకూరులోని నవతేజ ఇంటి ఎదుట తనకు భర్తే కావాలంటూ బైఠాయించింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై పి.నరేష్ నవతేజ, హేమ, వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీని విషయమై ఇప్పటికే హైదరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు కావడంతో అక్కడకు వెళ్లి విషయం తేల్చుకోవాలని ఆయన వారికి సర్దుబాటు చేసి పంపించారు. -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి
బంజారాహిల్స్:అనుమానాస్పద స్థితిలో జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని మంగా టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న హృదయ లాడ్జిలో అర్జున్‌గౌడ్(30) అనే యువకుడు 20 రోజులుగా ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకొని వచ్చిన అతను కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు. అక్కడే ఉన్న అతని స్నేహితుడు నాగకార్తీక్ అనే వివరాలు అడగగా దగ్గు వస్తున్నందున ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్లు చెప్పాడు. సోమవారం ఉదయం అర్జున్గౌడ్ను లేసేందుకు ప్రయత్నించగా చలనం లేకపోవడంతో 108కు సమాచారం అందించారు. పరీక్షించిన సిబ్బంది అతను మృతి చెందినట్లు తెలిపారు. నాగకార్తీక్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్జున్‌గౌడ్ వేసుకున్న మాత్రల వివరాలపై ఆరా తీస్తున్నారు. అర్జున్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక అనారోగ్యం మృతి చెందాడా అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతుంది. -
డాన్స్ ఫైట్.. వీరేబాస్..
సినిమా అంటే ఓ నాలుగు పాటలు... ఓ నాలుగు ఫైట్లు అనే ధోరణి చాలామందిలో ఉంటుంది. కానీ వాటిని తెరమీదకు తీసుకొచ్చేందేకు పడే కష్టం అంతాఇంతా కాదు. తాము కంపోజ్ చేసిన డ్యాన్స్ లేదా ఫైట్‌ను అంతేఅద్భుతంగా తెర మీదచూపేందుకు ఎంతో కష్టపడతారు మాస్టర్లు. సినిమాకు ప్రాణమైన డ్యాన్స్, ఫైట్లను కంపోజ్ చేసే కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్లర్లకు కేంద్రం కృష్ణానగర్. వీరికి సహాయ సహకారం అందించే డ్యాన్సర్లు, ఫైటింగ్ కళాకారులకూ ఇదే అడ్డా. బంజారాహిల్స్: ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లను చెన్నై నుంచి దిగుమతి చేసుకొనేవారు. కానీ తర్వాతి కాలంలో యూనియన్లు ఏర్పడ్డాయి. సినీ అవకాశాల కోసం వచ్చేవారు కృష్ణానగర్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది జూనియర్ ఆర్టిస్ట్‌లుగా ఇక్కడ అవకాశం పొందుతున్నారు. దీంతో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పింది. ఇక ఫైట్ మాస్టర్లూ గతంలో చెన్నై నుంచే వచ్చేవారు. వారు కూడా ఇప్పుడు నగరంలోనే అందుబాటులో ఉన్నారు. అంతా కృష్ణానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లోనే వీరుంటున్నారు. తెర వెనుక హీరోలు... గతంలో డ్యాన్స్ లేదా ఫైట్ గురించి ముందుగా దర్శకత్వం విభాగంతో చర్చించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్‌స్టంట్‌గా అన్నీ కావాలని డైరెక్టర్లు కోరుకుంటున్నారు. అనుభవమున్న ఫైట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు తెరపై తమ ప్రతిభ చూపుతున్నారు. తెరపై హీరోలు అద్భుతంగా డ్యా న్స్ చేసినా, ఆహా.. అనుకునేలా ఫైట్లు చేసినా... ఆ కష్టమంతా తెరవెనుకున్న వీరిదే. డ్యాన్స్ విషయం లో హీరాలాల్ మాస్టర్ సినీ పరిశ్రమకు ఓ గుర్తింపు తీసుకొచ్చారు. అప్పుడు కేవలం ఐదారుగురే డ్యా న్సర్లు ఉండేవారు. సలీం మాస్టర్ వచ్చిన తర్వాత ఆ సంఖ్య 20 వరకు చేరింది. అయితే అప్పుడు తమిళం, మళయాలం, భోజ్‌పురి, తెలుగు, కన్నడ... ఇలా అన్ని భాషాలకు వీరే మాస్టర్లుగా ఉం డేవారు. యూనియన్లు ఏర్పడిన తర్వాత డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఇక్కడే అవకాశాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు చాలా తక్కువ మంది ఫైట్ మాస్టర్లు ఉండేవారు. దీంతో చెన్నై నుంచి మాస్టర్లు వచ్చేవారు. అయితే స్థానిక యూనియన్లు ఏర్పాటుతో పరిస్థితి మారింది. ఇందిరానగర్, కృష్ణానగర్‌లలోని యూనియన్లలోనే చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. రామ్‌లక్ష్మణ్, విజయ్, సాల్మాన్రాజ్ తదితర మాస్టర్లు ఇక్కడివారే. ఒకప్పుడు సినిమాల్లో ప్రమాదకర సన్నివేశాల్లో హీరోలకు డూపుగా ఫైట్ మాస్టర్లు లేదా జూనియర్ ఆర్టిస్టులు నటించేవారు. అయితే ఇప్పుడు కొంతమంది కథానాయకులు తామే సొంతంగా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. దీంతో కొంతమంది కథానాయకులు ఇప్పటికీ డూప్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. డూప్ టు రియల్...గుర్తుండిపోవాలి... సినిమాల్లో కొరియోగ్రాఫర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలినాళ్లలో దర్శకులు కథను చెప్పి అందుకనుగుణంగా డ్యాన్స్ కంపోజ్ చేయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రాక్ ఇచ్చి డ్యాన్స్ కావాలంటున్నారు. అది ఒకరోజు ముందుగా ఇస్తారంతే.. అయితే అనుభవమున్న కొరియోగ్రాఫర్లకు ఇదేం పెద్ద సమస్య కాదు. నేను ఇప్పటికి దాదాపు 800 సినిమాలు చేశాను. భారతీరాజా దర్శకత్వంలో మొదలైన నా ప్రయాణం తాజా ఆర్ఎక్స్ 100 వరకు కొనసాగుతూనే ఉంది. కొరియోగ్రఫీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలన్నదే నా అభిప్రాయం. – స్వర్ణ, డ్యాన్స్ మాస్టర్ మళ్లీ రియల్... తొలి రోజుల్లో ప్రమాదకర సన్నివేశాల్లో డూపులుగా నటించాల్సి వచ్చేది. అయితే టెక్నాలజీ రావడంతో చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ మాయాజాలం ఉండేది. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డూపు సన్నివేశాలను ప్రేక్షకులు కోరుకోవడం లేదు. దీంతో చాలామంది హీరోలు సహజంగా నటించేందుకే మొగ్గు చూపుతున్నారు. రంగస్థలం సినిమాలో అంతా సహజత్వం ఉట్టిపడుతుంది. ఇందులో చాలామంది కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్‌లు అవకాశం పొందారు. – రామ్‌లక్ష్మణ్, ఫైట్ మాస్టర్లు సొంతంగాస్టూడియోలు... ఒకప్పుడు డ్యాన్స్, ఫైట్స్‌కు సంబంధించి లోకేషన్లోనే రిహార్సల్స్ ఉండేవి. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రముఖ హీరోలందరికీ సొంతంగా స్టూడియోలు వచ్చాయి. డ్యాన్స్, ఫైట్, జిమ్.. ఇలా ఏదైనా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. మాస్టర్లు అక్కడికే వెళ్లి నేర్పిస్తున్నారు. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు అవకాశాలు తగ్గాయి. -
ప్రముఖ టీవీ షో ప్రొడ్యూసర్‌కు ఏడేళ్ల జైలు
సాక్షి, ముంబై: జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడిన ఓ టీవీ ప్రొడ్యూసర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. 31ఏళ్ల జూనియర్ నటిపై అత్యాచారం చేసిన ఆరోపణలను ధృవీకరించిన కోర్టు అతగాడికి ఏడేళ్ల కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. ముంబై ప్రత్యేక మహిళా కోర్టు ఈ తీర్పును వెలువరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విన్ రాయకర్ అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఫ్రీ ప్రెస్ జనరల్ ఈ విషయాన్నిరిపోర్ట్ చేసింది. ప్రముఖ హిందీ టెలివిజన్ షో (ఏక్ వీర్ కి అరదాస్ వీర) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముకేష్ మిశ్రా (33) జూనియర్ ఆర్టిస్టుపై లైంగికి దాడికి పాల్పడ్డాడు. పథక ప్రకారం బాధితురాలికి ఫోన్ చేసి ఉదయమే షూటింగ్ రావాలంటూ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆమె బస్‌స్టాప్‌కు చేరుకునే లోపే అక్కడకు చేరుకున్న ముకేష్, బస్సు రావడం లేటవుతుందని చెప్పి, షూటింగ్ లొకేషన్లో తాను డ్రాప్ చేస్తానంటూ ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం మేకప్ రూమ్‌లో అత్యాచారానికి పాడ్పడ్డాడు. 2012, డిసెంబరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, బాధితురాలిని లైంగికంగా తనకు సహకరించాలంటూ బెదిరించడంతో పాటు, కూతుర్ని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భర్త సహాయంతో 2013 జనవరిలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు ముకేష్‌ను దోషిగా తేల్చింది. నేరస్తుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు 5వేల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. మరోవైపు అత్యాచార ఆరోపణల నేపథ్యంలో టీవీ షో యాజమాన్యం ముకేష్‌ను ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే తొలగించింది.