Justice Deepak Mishra
-
‘న్యాయ’ స్వతంత్రత అత్యున్నతం!
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రత అత్యున్నతంగా ఉందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం జడ్జీల మధ్య సహకారపూరిత వాతావరణం నెలకొందని చెప్పారు. మంగళవారం పదవీ విరమణ చేయబోతున్న ఆయన గౌరవార్థం సోమవారం కోర్టు ప్రాంగంణంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ప్రపంచంలోనే మన న్యాయ వ్యవస్థ అత్యంత పటిష్టమైనది, దృఢమైనదన్నారు. ‘ఒకరి అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ పలానా వైపునకు మొగ్గుచూపదు. నిష్పాక్షికతకు సూచికగా న్యాయ దేవత కళ్లకు గంతలు కడతాం. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా అన్ని కేసులను ఒకేలా చూస్తాం. ఎల్లప్పుడూ తీర్పు మానవీయ కోణంలో ఉండాలి. ఒక్కొక్కరి చరిత్ర ఒక్కోలా ఉంటుంది. వ్యక్తుల నేపథ్యాలు కాకుండా వారి కార్యకలాపాలు, ఆలోచనారీతుల ఆధారంగానే తీర్పులిచ్చాను’ అని అన్నారు. అంతకుముందు, కాబోయే సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ.. పౌర హక్కుల పరిరక్షణలో జస్టిస్ దీపక్ మిశ్రా ఎంతో సహకారం అందించారని ప్రశంసించారు. ఆధార్, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలపై ఇటీవల ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఉదహరించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణలో విఫలమైతే, ఒకరినొకరం చంపుకుంటూ, ద్వేషించుకూంటూ ఉంటామని వ్యాఖ్యానించారు. మనం ఏం తినాలి, ఏం ధరించాలి లాంటివి వ్యక్తిగత జీవితాల్లో ప్రముఖ విషయాలుగా మారాయని అన్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం బాధ్యతలు చేపడతారు. సీజేఐగా చివరిసారి సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం చివరిసారిగా విధులు నిర్వర్తించారు. తదుపరి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, మరో జడ్జి ఏఎం ఖన్విల్కర్‌తో కలసి సుమారు 25 నిమిషాల పాటు కోర్టు కార్యకలాపాలు నిర్వహించారు. సోమవారం అత్యవసర కేసుల విచారణ ఉండదని, అలాంటి కేసులేవైనా ఉంటే అక్టోబర్ 3న కొత్త సీజేఐ నేతృత్వంలో చేపడతామని ఆ ముగ్గురితో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. సీజేఐగా చివరి రోజు కావడంతో జస్టిస్ దీపక్ మిశ్రా కాస్త భావోద్వేగంతో కనిపించారు. జస్టిస్ మిశ్రాకు దీర్ఘాయుష్షు కాంక్షిస్తూ, సాధారణంగా పుట్టినరోజు నాడు పాడే 1950 నాటి హిందీ సినిమాలోని పాటను పాడటానికి ఓ లాయర్ ప్రయత్నించగా వద్దని సున్నితంగా వారించారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో రిటైర్మెంట్ తరువాతి ప్రణాళికలు ఏమిటని ఓ జర్నలిస్టు అడగ్గా..‘జోతిష్యం సైన్స్ కాకపోయినా ప్రజలు నమ్ముతున్నారు. భవిష్యత్తు గురించి చెప్పడానికి నేను జోతిష్యుడిని కాను’ అని జస్టిస్ దీపక్ మిశ్రా బదులిచ్చారు. కొన్ని కీలక కేసులు, తీర్పులు.. ► ఆధార్ చట్టబద్ధమేనని తీర్పు ► వివాహేత సంబంధాలు నేరం కాదని, ఐపీసీ సెక్షన్ 497 కొట్టివేత ► స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సెక్షన్ 377 కొట్టివేత ► శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలందరికీ అనుమతిస్తూ తీర్పు ► ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేర చరిత్రను ఈసీకి తెలపాలంటూ ఆదేశాలు ► అయోధ్య కేసు ► ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటా ► మూక హత్యల కట్టడికి ప్రభుత్వాలకు ఆదేశాలు ► నిర్భయ గ్యాంగ్‌రేప్‌లో కేసులో దోషుల మరణశిక్షకు సమర్థన ► బీసీసీఐలో సంస్కరణలు ► ఖాప్ పంచాయతీలపై నిషేధం ► ముంబై పేలుళ్ల కేసు దోషి యాకుబ్ మెమె న్ పిటిషన్‌ను అర్ధరాత్రి దాటిన తరువాత విచారించిన బెంచ్‌కు జస్టిస్ మిశ్రా సారథ్యం.. మెమెన్ మరణశిక్షకు సమర్థన. -
ఆధార్ రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
-
తీర్పులో ఏం చెప్పారు?
జస్టిస్ దీపక్ మిశ్రా ‘భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377 ప్రస్తుత రూపం పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నిర్వచించే రాజ్యాంగంలోని ఆరిక్టల్ 19(1)(ఏ)ను ఉల్లంఘిస్తోంది. మేజర్లయిన ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు లేదా స్త్రీ, పురుషుల మధ్య శృంగారాన్ని రాజ్యాంగవిరుద్ధంగా పరిగణించలేం. ఎవరైనా స్త్రీ, పురుషులు జంతువులతో అసహజ శృంగారానికి పాల్పడితే సెక్షన్ 377 కింద వారిని శిక్షించవచ్చు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రెండో వ్యక్తి సమ్మతి లేకుండా శృంగారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 377 కింద నేరమవుతుంది. సమాజంలోని ఓ వర్గం లేదా మైనారిటీ ప్రజల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల పాత్రకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. సమాజంలోని వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ, అల్పసంఖ్యాకుల హక్కులను హరించేందుకు చేపట్టే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవాలని రాజ్యాంగ నైతికత అనే భావన న్యాయశాఖ సహా అన్ని ప్రభుత్వ విభాగాలను కోరుతుంది’. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ‘స్వలింగ సంపర్కులకు సమాజంలో గౌరవంగా బతికే ప్రాథమిక హక్కు ఉంది. వాళ్లు ఎలాంటి మానసిక సమస్యలతో బాధపడటం లేదు. సెక్షన్ 377 అన్నది బ్రిటిష్ హాయాంలో నైతికతను వివరిస్తూ తెచ్చింది. కాలం చెల్లిన ఈ చట్టాన్ని కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. స్వలింగ సంపర్కుల విషయంలో సెక్షన్ 377 వైఖరి ఏకపక్షంగా ఉంది. ఇటీవల జరిగిన సైకియాట్రిక్ అధ్యయనాలు గే, ట్రాన్స్జెండర్లు మానసిక రోగులు కాదని, కాబట్టి వారిని శిక్షించరాదని చెబుతున్నాయి. ప్రాథమిక హక్కులన్నవి రాజ్యాంగం అనే విశ్వంలో ధ్రువ నక్షత్రం లాంటివి. ప్రభుత్వాల పరిధికి దూరంగా ఉన్న ప్రాథమిక హక్కులకు కస్టోడియన్ సుప్రీంకోర్టే. ఈ హక్కులు ఎన్నికలను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారవు. స్వలింగ సంపర్కులకు ఈ సమాజంలో గౌరవంగా బతికే హక్కుంది. చట్టాల ప్రకారం వీరికి రక్షణ కల్పించడంతో పాటు ఎలాంటి వివక్ష లేకుండా మనుషులుగానే చూడాలి. ఈ తీర్పుపై కేంద్రం విస్తృత ప్రచారం కల్పించాలి’. జస్టిస్ చంద్రచూడ్ ‘స్వలింగసంపర్కులు భయంతో బతకడానికి వీల్లేదు. 158 ఏళ్లు ఈ వర్గం అవమానాలను సహిస్తూ బతికింది. స్వాతంత్య్రం తరువాత కూడా ఇది కొనసాగింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా చెబుతున్న సెక్షన్ 377 రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం వంటి భావనలను ఉల్లంఘించింది. లైంగిక భాగస్వామిని ఎన్నుకునే హక్కును నిరాకరించడం గోప్యత హక్కును నిరాకరించడమే. రాజ్యాంగంలో రాసిన రాతలకు ఏమాత్రం అర్థం ఉన్నా స్వలింగ సంపర్కులు భయంతో బతకటానికి వీల్లేదు. ఈ డిజిటల్ యుగంలోనూ లైంగికత అన్నది దోపిడీకి అస్త్రంగా మారిపోయింది. ఈ సెక్షన్‌ను కొనసాగించడం ద్వారా మూస ఆలోచనలను, వివక్షను ప్రభుత్వం ప్రోత్సహించింది. భారత రాజ్యాంగం సమాజంలో వివక్షతను నిషేధించింది. తమ లైంగికత ఆసక్తుల ఆధారంగా ఎల్జీబీటీ వర్గంపై వివక్ష చూపరాదు’. -
స్వలింగ సంపర్కం నేరం కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులంతా స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ఇన్నాళ్లుగా సరైన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 2013లో సురేశ్ కౌశల్ కేసులో ‘అంగీకారం ఉన్నప్పటికీ.. అసహజ శృంగారం నేరమంటూ’ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘నవభారతంలో మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయమిది’ అని చెప్పి తీర్పును సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ముగించారు. తాజా తీర్పు ద్వారా ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది. ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు, న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు సుప్రీం తీర్పును స్వాగతించాయి. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే లైంగికవాంఛ సహజమైన జీవసంబంధమైన ప్రక్రియని.. దీన్ని సాకుగా చూపి వివక్ష కనబరచడం స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని కోర్టు పేర్కొంది. ‘18 ఏళ్లు నిండిన వారి స్వలింగ సంపర్కాన్ని సెక్షన్ 377 నేరంగా పరిగణిస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21లకు విఘాతం కల్గించడమే. అయితే వీరి మధ్య శృంగారం పరస్పర అంగీకారంతోనే, నిర్బంధ రహితంగానే జరగాలి’ అని 493 పేజీల తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 కారణంగానే ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా దేశంలో ద్వితీయశ్రేణి పౌరుల్లా బతకాల్సి వచ్చిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377.. మైనారిటీ తీరిన హోమోసెక్సువల్స్ (ఇద్దరు పురుషులు), హెటిరో సెక్సువల్స్ (ఓ ఆడ, ఓ మగ), లెస్బియన్స్ (ఇద్దరు ఆడవాళ్లు) మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకోవడం నేరం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెబుతోంది. ఇదే సెక్షన్ ఓ మగాడైనా, ఆడదైనా.. జంతువుతో శృంగారంలో పాల్గొనటాన్నీ తప్పుబట్టింది. అంతేకాదు, పరస్పర అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య బలవంతంగా లైంగిక చర్య జరగటాన్నీ నేరంగానే పరిగణిస్తోంది. ఇలాంటి కేసులకు సెక్షన్ 377 గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తోంది’ అని ధర్మాసనం గుర్తుచేసింది. శృంగార వాంఛ నేరం కాదు: నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది. ‘శృంగారమనేది జీవసంబంధమైన ప్రక్రియ. ఇది సహజం, ప్రతి ఒక్కరిలోనూ న్యూరోలాజికల్, బయాలాజికల్‌గా అంతర్గతంగా కలిగే మార్పు. పరస్పర ఆకర్షణ కలిగినపుడు శృంగార భావన ఏర్పడటం సహజం. ఇలాంటి వారిని నేరస్తులుగా చూడడం ఎల్జీబీటీక్యూల భావప్రకటన హక్కుకు విఘాతం కల్గించినట్లే’ అని కోర్టు తీర్పు పేర్కొంది. ఎల్జీబీటీక్యూల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్ కూడా సంతకాలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇక మేమూ సమాజంలో భాగమే! 17 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించినందుకు ఢిల్లీ సహా దేశంలోని పలుచోట్ల ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వరా>్గన్ని ప్రతిబింబించే ఇంద్రధనస్సు రంగుల జెండాలను ఊపుతూ తీర్పును స్వాగతించారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని ఈ సమాజం అడ్డుకోలేదంటూ నినాదాలు చేశారు. ‘మా ఆవేదనను అర్థం చేసుకుని భారత న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేలా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. మొత్తానికి మేం కూడా సమాజంలో భాగస్వాములమయ్యాం’ అని ఎల్జీబీటీక్యూల కోసం డెల్టా యాప్‌ను రూపొందించిన ఇషాన్ సేథీ పేర్కొన్నారు. స్వాగతించిన న్యాయనిపుణులు: సుప్రీం తీర్పును సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణులు స్వాగతించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ మిగిలిన వారితో సమానంగా, హుందాగా బతికే హక్కు ఉందన్నారు. ఇది సంబరాలు జరుపుకునే తీర్పు అని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాలను, మానవ విలువలను మారుస్తుందని సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు. ప్రముఖుల మద్దతు బాలీవుడ్ ప్రముఖులు, రచయితలు, టీచర్లు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లోని వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ప్రాథమిక మానవ హక్కులు కల్పించేలా సుప్రీం తీర్పు ఉందన్నారు. గే అయినందుకు తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న చిత్ర దర్శకుడు హన్సల్ మెహతా ఈ తీర్పు కొత్త ఆరంభానికి సూచకమన్నారు. బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్ ‘దేశానికి మళ్లీ ఆక్సీజన్ అందింది’ అని ట్వీట్ చేశారు. ‘భవిష్యత్తులో ఒకరోజు ఎవరు ఏంటి అనే ముద్ర వేయడం ఉండదు. అలాంటప్పుడు దేశం స్వర్గం అవుతుంది’ అని నటి సోనమ్ కపూర్ పేర్కొన్నారు. నైతికత పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాయడం ఎవరి తరం కాదని నటి స్వరా భాస్కర్ అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కుల హక్కులపై మాట్లాడినందుకు తనను లోక్‌సభలో అడ్డుకున్న బీజేపీ ఎంపీలంతా సిగ్గుపడాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర వీరికి క్షమాపణ చెప్పాలి: జస్టిస్ ఇందు మల్హోత్రా ‘తోటి సమాజమంతా స్వలింగ సంపర్కం పూర్తిగా సహజమైన ప్రక్రియ అని గుర్తించలేకపోవడంతో ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా భయం భయంగా బతుకుతున్నారు. ఏదో మహాపరాధం చేశామన్న భావనలో పడిపోయారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు న్యాయం జరగడంలో, హక్కులు కల్పించడంలో ఆలస్యమైనందుకు చరిత్ర వీరికి క్షమాపణలు చెప్పాలి. శతాబ్దాలుగా వీరు అవమానాలకు గురయ్యారు. సమాజానికి వీరి గురించి సరైన అవగాహన లేకపోవడమే కారణం. అందువల్ల ఆర్టికల్ 14 కల్పించిన ప్రాథమిక హక్కులను ఎల్‌జీబీటీక్యూలు కోల్పోయారు’ అని తన తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 377 నేపథ్యమిదీ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో 377వ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ పాలనలో 1838లో థామస్ మెకాలే రూపొందించగా 1861లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా రూపొందింది. సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. నేరస్తులకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు వీలు కల్పించింది. ఢిల్లీలో సెక్షన్377 రాసి ఉన్న కేక్ కట్ చేస్తున్న దృశ్యం -
సగంమంది జడ్జీల ఆస్తుల వివరాల్లేవు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలందరూ వారి ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని స్వయంగా సుప్రీంకోర్టే ఆదేశించిన సగం మంది జడ్జీల ఆస్తుల వివరాలు వెబ్సైట్లో లేవు. సీజేఐసహా సుప్రీంలో 23 మంది జడ్జీలుండగా, 12 మంది ఆస్తుల వివరాలే వెబ్సైట్లో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, ఆ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీల ఆస్తుల వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు కూడా ఆస్తుల వివరాలను వెల్లడించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు బహిర్గత పరచాలని 2009, ఆగస్టు 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. -
జస్టిస్ చలమేశ్వర్.. విధులకు వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన చివరి పనిదినం నాడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ వేదిక పంచుకున్నారు. సీజేఐతో కలిసి వేదిక పంచుకోరంటూ వచ్చిన ఊహాగానాలకు ఆయన తెరదించారు. జూన్ 22న జస్టిస్ చలమేశ్వర్ పదవీ విరమణ చేస్తున్నప్పటికీ.. శుక్రవారమే ఆయనకు చివరి పనిదినం. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు సుదీర్ఘ వేసవి సెలవులు. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు మరో న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కలసి కోర్టు నంబర్–1లో జస్టిస్ చలమేశ్వర్ కూర్చున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసే వారు తమ చివరి పనిదినం నాడు ప్రధాన న్యాయమూర్తితో కోర్టు నంబర్–1ను పంచుకోవడం ఆనవాయితీ. బెంచ్‌పై ఉన్నంతసేపూ సీజేఐ జస్టిస్ మిశ్రాతో జస్టిస్ చలమేశ్వర్ స్నేహపూర్వకంగా కనిపించారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్.. తమ ముందుకొచ్చిన 11 కేసుల్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా కూడా జస్టిస్ చలమేశ్వర్‌తో చర్చించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, గోపాల్ శంకరనారాయణన్ తదితరులు వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం అందరికీ నమస్కరిస్తూ కోర్టు హాలు నుంచి సీజేఐతో కలసి జస్టిస్ చలమేశ్వర్ వెళ్లిపోయారు. 2011 అక్టోబర్ 11వ తేదీన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్‌లు ఇద్దరూ ఒకేరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కావడం గమనార్హం. నిబద్ధతలో ఆయన ‘సుప్రీం’ సంచలనాలకు కేంద్ర బిందువైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ భారత న్యాయవ్యవస్థపై చెరగని ముద్రవేశారు. సుప్రీంకోర్టు జడ్జీగా దాదాపు ఏడేళ్లలో ఎన్నో కీలక తీర్పుల్లో ప్రధాన భాగస్వామిగా పేరొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యాక ఆయన అదే కోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. 2007–11 మధ్య గువాహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అక్టోబర్ 17, 2015.. ఎన్‌జేఏసీ కేసులో అసమ్మతి తీర్పు నుంచి జనవరి 12, 2018న మరో ముగ్గురు సుప్రీం జడ్జిలతో కలిసి విలేకరుల సమావేశంలో సుప్రీంలో పాలనా వ్యవహారాల్ని ప్రశ్నించే వరకూ న్యాయవ్యవస్థ గౌరవం పెరగడానికి ఆయన కృషిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహారశైలిపై అసమ్మతి వ్యక్తంచేస్తూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జనవరి 12న చలమేశ్వర్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం ఒక సంచలనం. కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి మిశ్రా ధోరణిని జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు కొలీజియం సభ్యులైన జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు తప్పుపట్టారు. జస్టిస్ మిశ్రాకు రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. సుప్రీం జడ్జిగా రిటైరయ్యాక తానే పదవి తీసుకోనని చలమేశ్వర్ ముందే ప్రకటించారు. జస్టిస్ చలమేశ్వర్ చరిత్రాత్మక తీర్పులు ►జడ్జిల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేస్తూ చేసిన చట్టం చెల్లదని అక్టోబర్ 17, 2015న ధర్మాసనంలోని నలుగురు జడ్జిలు మెజారిటీ తీర్పు ఇవ్వగా, దానిని సమర్థించిన ఏకైక జడ్జిగా చలమేశ్వర్ నిలిచారు. కొలీజియం వ్యవస్థ పనితీరు పారదర్శకంగా లేదని తీర్పులో విమర్శించారు. ►ఎవరికైనా ‘చికాకు లేదా ఇబ్బంది’ కలిగించే ఈ మెయిల్ సందేశాలు ఇచ్చేవారిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అధికారం ఇచ్చే ఐటీ చట్టంలోని 66 ఏ సెక్షన్ చెల్లదని జస్టిస్ నారిమన్‌తో కలిసి జస్టిస్ చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. ఈ సెక్షన్ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని.. రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ►ఆధార్ కార్డు లేదనే సాకుతో ఏ పౌరునికి మౌలిక సేవలు, ప్రభుత్వ సబ్సిడీలు నిరాకరించరాదని జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగప్పన్‌లతో కలిసి చలమేశ్వర్ తీర్పు ఇచ్చారు. జస్టిస్ జేజే పుట్టస్వామి కేసులో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కని తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు. ►అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులే కాకుండా జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడ్డవారు కూడా ఆస్తులు, ఆదాయం వివరాలు వెల్లడించాలని ఆయన తీర్పునిచ్చారు. -
‘కావేరి’పై సుప్రీంకు ముసాయిదా
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ముసాయిదాను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనానికి సోమవారం సమర్పించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళిక ఫిబ్రవరి 16 నాటి తమ తీర్పుకు అనుగుణంగా ఉందా లేదా అనేది ఈ నెల 16న పరిశీలించి, ఆమోదం తెలుపుతామని పేర్కొంది. కావేరీ నదీ జలాల నిర్వహణ సంస్థను బోర్డు అనాలా? కమిటీ అనాలా? అథారిటీ అనాలా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కావేరి జలాల పంపిణీ కోసం బెంగళూరు కేంద్రంగా 9 మంది సభ్యులుగాగల ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కమిటీలో కేంద్రం నియమించే ఓ చైర్మన్, ఇద్దరు శాశ్వత సభ్యులు, ఇద్దరు తాత్కాలిక సభ్యులతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల నుంచి ఒక్కోప్రతినిధి ఉంటారు. కావేరి నదీ జలాల పంపిణీని మార్చడంతోపాటు కావేరి మేనేజ్మెంట్ బోర్డును ఆరు వారాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయినా ఇన్నాళ్లూ కేంద్రం జాప్యం చేయడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ నెల 8న కేసును విచారిస్తూ కేంద్రం చర్యలు పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తాయనీ, ఈ నెల 14న (సోమవారమే) కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి స్వయంగా హాజరై ముసాయిదాను సమర్పించకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ముసాయిదాను సమర్పించింది. -
సంస్కరణలకు తక్షణ తరుణం
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులు 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంతవరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ‘భారత రాజ్యాం గంలో సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం మసకబారుతూ ఉండడంతో న్యాయస్థానం విశ్వసనీయత హరించుకుపోతుంది.’ – ఫ్రంట్‌లైన్, 25–5–2018 (హిందూ గ్రూపు) ‘భావితరాల కోసం న్యాయ వ్యవస్థ హోదాను సంరక్షించుకుని కాపాడుకోవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ దృఢంగా, తగినంత స్వతంత్ర ప్రతిపత్తితో మెలగుతూ వర్తమాన సామాజిక సమస్యల పట్ల బాధ్యతతో ఉండాలి. ఈ దేశంలో ఎవరికీ భద్రత లేదు. ఈ పరిస్థితులలో పరిపాలనలో ఉన్న స్త్రీపురుషులను అదుపాజ్ఞలలో పెట్టగల యంత్రాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ మాత్రమే. పదవులలో ఉన్నవారిని అధికారం అవినీతి పాల్జేస్తుందని మానవచరిత్ర నిరూపించింది. అధికారంలో ఉన్న పార్టీలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను దుర్వినియోగం చేస్తున్నాయి.’ – జస్టిస్ చలమేశ్వర్ (నాగ్‌పూర్ సభలో, 17–4–18) ఇటీవల దేశ పరిపాలన క్రమంలో గొలుసుకట్టుగా సాగిన పరిణామాలు గణతంత్ర రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకే ప్రమాదకరంగా పరిణమించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు దారితీసిన పరిణామాలు నాలుగు: 1. ఒక వైద్య కళాశాల ప్రవేశాల వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఒకరికి సంబంధం ఉన్న అంశాన్ని పరిశీలించాలని ఒక ఎన్జీవో (ప్రభుత్వేతర సంస్థ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సిద్ధపడలేదు. దీనితో పిటిషనర్ నుంచి మరో పిటిషన్ దాఖలైంది. ఈసారి జస్టిస్ దీపక్ మిశ్రా లేని ధర్మాసనానికి తన దరఖాస్తును నివేదించాలని పిటిషనర్ (ఎన్జీవో) కోరడం జరిగింది. ఆపై అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వేరే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. 2. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం (న్యాయ పాలనా నిర్వహణ వ్యవస్థ) సిఫారసు చేయడం. 3. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా సొహ్రా బుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా ఆకస్మికంగా మరణించారు. ఈ కేసులో ఒక బీజేపీ ప్రముఖ నేత అభియోగాలను ఎదుర్కొంటున్నారు. లోయా మరణం గురించి న్యాయవాదులు, పౌర సంఘాల ప్రతినిధులు, లోయా తోబుట్టువులు అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు కేసు సుప్రీం కోర్టుకు చేరినా సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి అంగీకరించక, కొట్టివేయడం జరిగింది. ఇంకొక అంశం– జస్టిస్ దీపక్ మిశ్రా మీద రాజ్యసభలో విపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు ఏకపక్షంగా తోసిపుచ్చడం. 4. సుప్రీంకోర్టుకు వచ్చిన పిటిషన్లను సంబంధిత ధర్మాçసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి సోదర న్యాయమూర్తులతో సంప్రతించడం అనివార్యమా అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపైన న్యాయమూర్తులలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇంత పెద్ద దేశాన్ని వారే శాసించాలా? కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పిం చింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులే 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంత వరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ఏడు దశాబ్దాలుగా పాలకవర్గ ఆచరణ దీనిని నిరూపిస్తూనే ఉంది. అలాంటి వాతావరణంలో మనం నిర్వహించుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో న్యాయస్థానాలు కూడా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేవని (తొలి రెండు దశాబ్దాల నాటి భారత న్యాయమూర్తుల తీర్పులను మినహాయిస్తే) నేటి చరిత్ర మరింత స్ఫుటంగా హెచ్చరిస్తున్నది. అనేక సందర్భాలలో సాక్ష్యాలు ఉన్నా వాటిని ‘నిర్దిష్టంగా లేవు’ అన్న సాకుతో నీరుగారుస్తున్నారు. బీజేపీ హయాంలో 2002లో గుజరాత్లో మైనారిటీల మీద జరిగిన దాడులు కావచ్చు, ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏదో ఒక పేరుతో దళితులు, మైనారిటీల మీద జరుగుతున్న దాడుల విషయంలో గానీ సాక్ష్యాలను, సాక్షులను మాయం చేస్తున్న ఘటనలు మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు సభ్యుల ధర్మాసనం 1964లోనే (కొలీజియంకు మచ్చలేని రోజులు) అన్ని కేసులలోను అన్ని సాక్ష్యాలను నమ్మలేకపోయినా సాక్ష్యాన్ని పూర్తిగా విచారించి బేరీజు వేయడంలో న్యాయస్థానం జాగరూకతతో మెలగాలని ఒక తీర్పులో పేర్కొన్నది. ‘ఇచ్చిన సాక్ష్యంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నా, లేకపోయినా లేదా సాక్ష్యం సబబైనదేనని కోర్టుకు అనిపించినా లేదా సాక్ష్యం వల్ల బహిర్గతమై గాథ నిజమైనా లేకున్నా – ఇవన్నీ తప్పనిసరిగా గణనలోనికి తీసుకోవలసిందే. కానీ సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలు సాక్షికమైనవీ, ప్రయోజనాలు ఆశించినవీ కాబట్టి, వాటిని సాక్ష్యాలుగా పరిగణించరాదన్న భావన మాత్రం హేతు విరుద్ధం. కేవలం ఫలానా సాక్ష్యాన్ని అది పాక్షికమైనదన్న కారణంగా యాంత్రికంగా (మెకానికల్ రిజెMý‡్షన్) తోసిపుచ్చడమంటే తరచూ అన్యాయానికే దారితీస్తుంది’’(మసల్తీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీం తీర్పు). న్యాయ నిపుణుడు జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ఒక సందర్భంలో చెప్పినట్టు ‘‘న్యాయమూర్తులు వివాదాలపై తీర్పులు చెబుతూంటారు. కానీ, సమాజాన్ని మార్చడం కూడా న్యాయమూర్తుల కర్తవ్యం కాగలిగినప్పుడు అసలైన మార్పుకు దోహ దం చేయగలుగుతారు!’’ సంస్కరణలకు తొందరపడాలి ఈ అనుభవాలన్నింటిని రంగరించి, క్రోడీకరించుకున్న జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థకు ఆరోగ్యకరమైన ఒక ‘సంస్కరణ పత్రాన్ని’(రిఫార్మ్ ఎజెండా) 1980లోనే అందజేశారు: అందులో: ‘‘మన న్యాయస్థానాలు నేడు క్లిష్ట దశలో ఉన్నాయి, మన జడ్జీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన న్యాయ పాలనా వ్యవస్థ ఎంత గోప్యంగా, ఎంత ఆటంకంగా తయారైందంటే– అది సామాన్య ప్రజల నుంచి దూరంగా జరిగిపోయింది. అందుకనే ఈ మౌలికమైన లోటును సవరించాలి. ఇందుకు న్యాయ ప్రక్రియలోనే సంస్కరణ, కూలంకషమైన మార్పులు రావాలి. మన న్యాయ వ్యవస్థ రాజ్యాంగ దార్శనిక దృష్టి స్పష్టంగా, ప్రకాశమానంగా ఉండాలి. దాని లక్ష్యం రాజ్యాంగం ముందుమాటలో నిర్వచించిన ప్రజానుకూల విలువలకు కట్టుబడి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయి శాసన వేదికలు నేడు సమాజంలోని మోతుబరులకే అనుకూల వ్యవస్థలు. శ్రామిక ప్రజా బాహుళ్యంతో సంబంధం లేని వర్గాలు న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల్ని నడిపిస్తున్నాయి. వీరి ఎంపిక ఆశ్రిత పక్షపాతం ఆదాయ వనరులపై ఆధారపడి జరుగుతుంటుంది. జడ్జీల ఎంపిక ప్రక్రియలో, సుప్రీం బెంచ్‌కి సోదర న్యాయమూర్తులను ఎంచుకోవడంలో చర్యలు కొన్ని సందర్భాలలో సెలక్షన్ తీరుకు విరుద్ధంగా ఉంటున్నాయి. చివరికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సహితం పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడుతున్నారు’’అన్నారు (ఫ్రం బెంచ్ టు బార్’ జస్టిస్ కృష్ణయ్యర్). ఎన్నికైన ప్రతినిధులూ, శాసనకర్తలూ ఎంతగా వంకర పద్ధతుల్లో ధన ప్రయోగానికీ అవి నీతికీ పాల్పడుతుంటారో ఇంటర్నెట్ ద్వారా ఒకరు తనకు ‘ఈ–మెయిల్’లో పంపిన వ్యంగ్య సందేశాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ ప్రస్తావించారు. అందులో పేర్కొన్న ‘కంపెనీ’ ఏదో కాదు సుమా! ప్రభుత్వమే. ‘‘ఈ కంపెనీ కింద పనిచేసే ‘ఉద్యోగులు’ 500 మంది పైచిలుకు ఉంటారు. అందులో 29 మంది భార్యల్ని వేధించేవారని ఆరోపణ. మరి ఏడుగురు మోసాల కారణంగా అరెస్టయినవారు. 19 మంది పైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 117 మంది మీద హత్య, రేప్‌లు, దాడులు, దోపిడీ నేరాల మీద విచారణ సాగుతోంది. 71 మంది తీసుకున్న రుణాలు/అప్పులున్నందున పరపతి పుట్టనివారు. 21 మంది అనేక కోర్టు దావాల్లో ఇరుక్కున్నవారు. 84 మంది దాడుల కేసుల్లో జరిమానాలు చెల్లించారు. ఇంతకూ ఇంతటి ‘బడా కంపెనీ’ ఏదై ఉంటుందో ఊహించండి. ఆ ‘కంపెనీ’ భారత దిగువ సభ, ఇది నీ కోసం, నా కోసమే పనిచేస్తుంది సుమా! దిగువ సభలోని 545 మంది సభ్యులు నీ కోసం నా కోసమే పనిచేస్తారు. ఇదే ‘గ్రూపు’ మనల్నందర్నీ ఒక వరసలో నిలబెట్టి వందలాదిగా చట్టాలు చేస్తుంది. ఇంతటి భారీ ‘కంపెనీ’ గురించి మనమేమైనా చేయగలమా?!’’. ఆ ప్రశ్నార్థకంతో ఆ ఈ–మెయిల్ సందేశాన్ని జస్టిస్ ముగించారు. -ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నేడు కొలీజియం భేటీ!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరోసారి ప్రతిపాదించేందుకు నేడు సుప్రీం కొలీజియం సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఈ అంశంపై కొలీజియం సభ్యుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ నేపథ్యంలో నేడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కొలీజియాన్ని సమావేశపర్చవచ్చని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు అత్యవసరంగా కొలీజియాన్ని సమావేశపర్చాలని కోరుతూ సీజేఐకు సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ జే.చలమేశ్వర్ బుధవారం లేఖ రాశారు. జస్టిస్ జోసెఫ్ పేరును పునఃపరిశీలించాలంటూ కొలీజియా నికి ప్రతిపాదనల్ని ఏప్రిల్ 26న కేంద్రం తిప్పిపంపిన సంగతి తెలిసిందే. గతంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలకు ప్రతిపాదనలు అనుగుణంగా లేదని, అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇప్పటికే కేరళ నుంచి తగిన ప్రాధాన్యం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీనియారిటీ జాబితాలో జస్టిస్ జోసెఫ్ కంటే అనేక మంది ముందు వరుసలో ఉన్నారని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘జనవరి 10న జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కొలీజియానికి సిఫార్సు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఆయన పేరును సుప్రీం జడ్జీగా పునరుద్ఘాటిస్తున్నాను’ అని లేఖలో జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ జోసెఫ్‌కు పదోన్నతిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు లేఖలో జస్టిస్ చలమేశ్వర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చలమేశ్వర్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా కొలీజియం బుధవారం సమావేశమవుతుందని భావించినప్పటికీ.. జస్టిస్ చలమేశ్వర్ సెలవులో ఉండటం వల్ల జరగలేదని తెలుస్తోంది. కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్లు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి ప్రతిపాదించేందుకు తాను అనుకూలంగా ఉన్నానని జస్టిస్ జోసెఫ్ కురియన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
అభిశంసన పిటిషన్ ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్ ఎంపీలు ఉపసంహరించుకున్నారు. దాంతో ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని ఎవరు ఆదేశించారో వెల్లడించాలని, ఆ ఉత్తర్వుల ప్రతుల్ని తమకు ఇవ్వాలని కోరారు. అప్పుడే ఈ పిటిషన్‌పై ముందుకెళ్లాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోగలమని సిబల్ కోర్టుకు చెప్పారు. ధర్మాసనం అందుకు సంసిద్ధత తెలపకపోవడంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఏర్పాటుపై పలు సందేహాల్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. బజ్వా, యాజ్ఞిక్ల పిటిషన్లను తోసిపుచ్చాలని ధర్మాసనాన్ని కోరారు. ’అభిశంసన తీర్మానంపై 60 మందికిపైగా సభ్యులు సంతకం చేస్తే కేవలం కాంగ్రెస్ మాత్రమే సుప్రీంను ఆశ్రయించింది. దీనిని బట్టి రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసును తిరస్కరించడాన్ని సవాలు చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని మిగతా పార్టీలు సమర్ధించడం లేదని అర్థమవుతోంది. మిగతా ఎంపీల తరఫున పిటిషన్ దాఖలు చేయడానికి వారికి అధికారం లేదు’ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు సిబల్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘తనకే సంబంధించిన అంశంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల్ని జారీ చేయలేరు. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ద్వారా మా పిటిషన్‌ను ఐదుగురు జడ్జిల ధర్మాసనానికి కేటాయించారు. ఎవరు ఆ ఉత్తర్వుల్ని జారీ చేశారు? ఒకవేళ ప్రధాన న్యాయ మూర్తి ఆదేశిస్తే ఆ విషయం తెలుసుకునే హక్కు పిటిషనర్లకు ఉంటుంది. అందువల్ల ఉత్తర్వుల ప్రతిని మాకు ఇవ్వాలి. రాజ్యసభ చైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేయాలా? వద్దా ? అని నిర్ణయించుకునేందుకు ఆ కాపీ మాకు అవసరం’ అని వాదనలు వినిపించారు. బెంచ్ ఏర్పాటు నిర్ణయం సీజేఐదే! మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా వ్యవహరిస్తున్న సీజేఐనే ఐదుగురు జడ్జీల బెంచ్‌కు కేసును కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు తనపైనే కావడంతో వ్యూహాత్మకంగా సీజేఐ వ్యవహరించారు. సీనియారిటీలో ఆరోస్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. సిబల్ వాదించడంపై న్యాయవాదుల అభ్యంతరం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ సీజేఐ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఇవ్వడం వల్ల మీకేమైనా ప్రయోజనం ఉంటుందా? అని ధర్మాసనం పదే పదే సిబల్‌ను ప్రశ్నించింది. అయితే ఉత్తర్వుల కాపీ పొందాకే.. రాజ్యసభ చైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేయాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని ఆయన సమాధానమిచ్చారు. అందుకు ధర్మాసనం ఆసక్తి చూపకపోవడంతో.. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సిబల్ నిర్ణయించారు. అభిశంసన నోటీసుపై సంతకం చేసిన కపిల్ సిబల్ ఈ కేసును వాదించడంపై వాదనలు ప్రారంభానికి ముందు న్యాయవాదులు ఆర్పీ లూధ్రా, ఏకే ఉపాధ్యాయ అభ్యంతరం తెలిపారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించలేదు. -
కొలీజియంపై కేంద్రం పెత్తనమా..!
సాక్షి, న్యూఢిల్లీ : ఐదుగురు సీనియర్ జడ్జీల సుప్రీం కోర్టు కొలీజియం మే 2వ తేదీ సాయంత్రం సమావేశమైంది. ఎజెండా ఏమిటంటే ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ కేఎం జోసఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలనే కొలీజియం సిఫారసును తిరిగి యధాతథంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించడం. అలా చేసి ఉన్నట్లయితే దాన్ని ఆమోదించడం మినహా కేంద్రానికి మరో గత్యంతరం ఉండేది కాదు. సుప్రీం కోర్టు తన స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకునేది. తద్వారా తన ఆధిక్యతను చాటుకునేది. అంతకన్నా ఏ కారణం లేకుండా కొలీజియం సిఫార్సును తిప్పి పంపిన కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పినట్లు ఉండేది. ఆ రోజు కొలీజియం సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం తిప్పి పంపిన సిఫారసును యధాతథంగా మళ్లీ పంపించడం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు లేదనేది స్పష్టమైంది. అలాంటప్పుడు కేంద్రం కాదన్న జోసఫ్ పేరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా మరొకరి పేరును కొలీజియం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలా జరుగకుండా సమావేశం వాయిదా పడిదంటే కొలీజియం సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయన్నమాట. అలాంటి సందర్భాల్లో మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అలా కూడా నిర్ణయం తీసుకోలేదంటే చీఫ్ జస్టిస్ మిశ్రా మినహా మిగతా ఎవరు కూడా ప్రభుత్వ నిర్ణయానికి అంగీకరించలేదని అర్థం అవుతుంది. చీఫ్ జస్టిస్‌ది మైనారిటీ నిర్ణయంగా ఉండ కూడదు. అందుకనే సమావేశాన్ని వాయిదా వేసినట్లు చీఫ్ జస్టిస్ ప్రకటించినట్లు ఉంది. ఇదివరకే కేంద్ర ప్రభుత్వం కొలీజియం నిర్ణయాలతో రెండు సార్లు విభేదించింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ పోతే అదే సంప్రదాయంగా మారుతుంది. అప్పుడు సుప్రీం కోర్టు నియామకాల్లో సీనియారిటీకున్న ప్రాధాన్యత కోల్పోతుంది. నియామకాల్లోని నిబంధనలనుగానీ, అందుకు పరిగణించే సీనియారిటీని గానీ రక్షించుకోవాల్సింది సుప్రీం కోర్టు కొలీజియమేగానీ, కేంద్రానిది కాదుకదా! మొత్తంగా న్యాయవ్యవస్థ, ముఖ్యంగా సుప్రీం కోర్టు నిబద్ధతపై నీలినీడలు కమ్ముకుంటున్నవేళ, న్యాయం అన్యాయం అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు తన నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించక పోవడం అన్యాయమే. జనవరి 12 తేదీన నలుగురు సుప్రీం కోర్టు జడ్జీలు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ సుప్రీం కోర్టు అడ్మినిస్ట్రేషన్ బాగోలేదని ఆరోపించారు. వారు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి కలిగించేందుకైనా జస్టిస్ మిశ్రా స్వతంత్రంగా వ్యవహరించి ఉండాల్సింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ప్రజల్లో కూడా నమ్మకం పోతోందని, దాన్ని పునరుద్ధరించేందుకైనా సుప్రీం కోర్టు జడ్జీలందరితోని ఓ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ న్యాయమూర్తులు చేసిన డిమాండ్‌కు కూడా మిశ్రా స్పందించలేదు. -
సీజేఐపై అభిశంసనకు వెనక్కి తగ్గుతున్న విపక్షాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం కోసం కాంగ్రెస్ ప్రారంభించిన సంతకాల ఉద్యమం క్రమంగా చల్లారిపోతోంది. సైద్ధాంతికంగా ఆ పార్టీతో కలిసొచ్చే కొన్ని పార్టీలే ఈ అంశంపై వెనక్కితగ్గాయి. కాంగ్రెస్ తీర్మానంపై బుధవారం ముగ్గురు డీఎంకే ఎంపీలు సంతకం చేయగా.. పార్టీ నాయకత్వం ఆదేశాలతో వారు మద్దతును వెనక్కి తీసుకున్నారు. తీర్మానంపై సమాజ్‌వాదీ పార్టీ సంతకాలు చేసినా తరువాత ఉపసంహరించుకుంది. పార్లమెంట్లో కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇతర ప్రతిపక్ష పార్టీలు సంతకం చేశాకే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లు సమాచారం. -
అయోధ్య కేసులో మిగిలింది ప్రధాన కక్షిదారులే
న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్య భూ కేటాయింపు కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ సున్నిత కేసులో కక్షిదారులుగా చేరడానికి సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాడ్, శ్యామ్ బెనగల్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రధాన కక్షిదారులే ఇకపై విచారణలో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బుధవారం ఆదేశాలు జారీచేసింది. భూ వివాదానికి సంబంధించిన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా? లేదా? అన్న అంశంపై తొలుత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. ‘మధ్యంతర జోక్యంపై కక్షిదారుల లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి పిటిషన్లతో ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తూ వాటిని తిరస్కరిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. ఇకపై కూడా అలాంటి పిటిషన్లను స్వీకరించొద్దని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హిందూ, ముస్లిం సంస్థలు, వ్యక్తులే కక్షిదారులుగా కొనసాగుతారని స్పష్టం చేసింది. -
కారుణ్య మరణంపై సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ మరణం అంచుల వద్ద ఉన్న వారికి ప్రాణాన్ని నిలబెట్టే వ్యవస్థను తీసివేయడం ద్వారా మరణాన్ని ప్రసాదించే కారుణ్య మరణాన్ని (పాసివ్ యుతనేసియా) అనుమతించింది. గౌరవంతో మరణించే హక్కు మానవులకు ఉందని మార్గదర్శకాలతో కారుణ్య మరణాలను అనుమతించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వ్యాధి నయం కాదని చట్టబద్ధ మెడికల్ బోర్డు ప్రకటించిన అనంతరమే లైఫ్ సపోర్ట్ వ్యవస్థను తొలగించాలని ధర్మాసనం పేర్కొంది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రోగులు తమకు ఎలాంటి వైద్య చికిత్స కావాలో వైద్యులకు తెలుపుతూ లివింగ్ విల్ సమర్పించేందుకు కోర్టు అనుమతించింది. లివింగ్ విల్, పాసివ్ యుతనేసియా అమలుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాణాంతక వ్యాధులతో జీవచ్ఛవాలుగా మారిన రోగులకు కారుణ్య మరణాలను ప్రసాదించాలనే చర్చ దీర్ఘకాలంగా సాగుతున్నది. -
స్థల వివాదంగా చూస్తాం
న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదం కేసును పూర్తిగా స్థల వివాదంగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరిస్తూ సాధారణ పద్ధతిలోనే విచారిస్తామంది. 700 మందికిపైగా పేద కక్షిదారులు(ఇతర కేసుల్లో) న్యాయం కోసం వేచిఉన్నారని, వారి కేసుల్ని కూడా విచారించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో క్షక్షిదారులు కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ప్రాంతీయ భాషల పుస్తకాల్లోని సారాంశాన్ని ఇంగ్లిష్‌కి అనువదించి సమర్పించాలని ఆదేశించింది. విచారణను మార్చి 14కు ధర్మాసనం వాయిదా వేసింది. అలహాబాద్ హైకోర్టులో కేసు విచారణ రికార్డులకు సంబంధించిన వీడియో క్యాసెట్ల కాపీలను కక్షిదారులకు అందచేయాలని రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘రామ్ లల్లా విరాజ్మన్’ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తూ.. కేసులోని అవతలి వైపు కక్షిదారులు తమ వాదనల సారాంశాన్ని కోర్టుకు తెలపడంతో పాటు, తమతో పరస్పర మార్పిడి చేసుకోవాలని సూచించారు. దీనికి ప్రతివాది తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తనకు నచ్చిన విధంగా వాదిస్తానని, తాను దేని ప్రామా ణికంగా వాదించాలన్నది వారు ఆదేశించలేరని పేర్కొన్నారు. హిందూ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది కె.పరాశరన్ వాదిస్తూ.. ‘ఈ సంఘటన త్రేతాయుగం నాటిది. 30 వేల ఏళ్ల నాటికి చెందిన ఏ సాక్ష్యాల్ని అప్పీలుదారులు తేగలరు? అందువల్ల మమ్మల్ని రికార్డుల్లోని సాక్ష్యాల వరకే పరిమితం చేయాలి’ అని విజ్ఞప్తిచేశారు. అయోధ్యలోని వివాదాస్పద భూమిని నిర్మోహి అఖారా, రామ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు గతంలోతీర్పునిచ్చింది. ముస్లిం నేతలతో రవిశంకర్ చర్చలు మరోవైపు అయోధ్య వివాద పరిష్కారం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ గురువారం ముస్లిం నేతలతో చర్చించారు. సున్నీ వక్ఫ్ బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో పాటు ఇతరులు రవి శంకర్‌ను కలిసి అయోధ్య వివాదంలో కోర్టు వెలుపల రాజీకి మద్దతు తెలిపారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వేరే ప్రాంతానికి మసీదును తరలించే ప్రతిపాదనకు వారు మద్దతు ప్రకటించారు’ అని వెల్లడించింది. -
ఆ హక్కు మీకు లేదు!
న్యూఢిల్లీ: సమాజంలో నైతికతను కాపాడటమే తమ బాధ్యతనే విధంగా ఖాప్ పంచాయతీలు వ్యవహరించ కూడదని సుప్రీం కోర్టు మండిపడింది. ఇద్దరు మేజర్ల వివాహాన్ని చట్టమే నిర్ధారిస్తుందని పేర్కొంది. వివాహాల విషయంలో ఖాప్ పంచాయతీల జోక్యంపై విచారించేందుకు సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ‘ఓ పెళ్లి సరైనదా? కాదా? అనే అంశాన్ని చట్టమే నిర్ణయిస్తుంది. తదనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మీరు (ఖాప్ పంచాయతీలు) సమాజంలో నైతికతను కాపాడాల్సిన పనిలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. పరువు హత్యలపై ‘శక్తి వాహిని’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఖాప్‌లు కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే.. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకే కుటుంబానికి (సపిండ) చెందిన వారు పెళ్లిచేసుకోకూడదు. సమాజంలో నైతిక విలువలను కాపాడేలా ఖాప్ పంచాయతీలు పనిచేస్తున్నాయి’ అని ఖాప్ పంచాయతీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొవద్దు: దీనిపై సుప్రీం స్పందిస్తూ.. ‘ఇద్దరు యువతీ యువకుల మధ్య పెళ్లి వారి వ్యక్తిగతం. దీనిపై చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ విషయాలపై ఖాప్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని పేర్కొంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 796 శాతం పెరిగిన పరువు హత్యలు! 2014–15లో పరువు హత్యలు దేశవ్యాప్తంగా 796 శాతం పెరిగాయి. 2014లో 28 పరువుహత్యల ఘటనలు చోటుచేసుకోగా.. 2015లో ఈ సంఖ్య 251కి పెరిగింది. ఈ జాబితాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు నాలుగైదు స్థానాల్లో ఉన్నాయని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. పది పదిహేను మంది సభ్యులుండే ఖాప్ పంచాయతీలు కోర్టులకు చేరని తమ సామాజికవర్గానికి చెందిన గొడవలను విచారణ ద్వారా పరిష్కరిస్తాయి. -
జస్టిస్ శుక్లా తొలగింపునకే సీజేఐ నిర్ణయం
న్యూఢిల్లీ: మెడికల్ కళాశాల ప్రవేశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎస్ఎన్ శుక్లా తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఆయన్ని తొలగించడానికి సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయించారు. ఈ మేరకు ఆయన నేడోరేపో రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు లేఖ రాసే అవకాశాలున్నాయి. జస్టిస్ శుక్లాపై వచ్చిన ఆరోపణలు.. ఆయన తొలగింపు ప్రక్రియను ప్రారంభించేంత తీవ్రమైనవని ముగ్గురు జడ్జీలతో కూడిన కమిటీ నిర్ధారించింది. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తరువాత.. రాజీనామా చేయాలని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని జస్టిస్ శుక్లాకు సీజేఐ సలహా ఇచ్చారు. అందుకు శుక్లా నిరాకరించడంతో ఆయనకు ఎలాంటి కేసు విచారణ బాధ్యతలు అప్పగించొద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీజేఐ ఆదేశించారు. దీంతో జస్టిస్ శుక్లా దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. -
సీజేఐ అభిశంసనకు సీపీఎం విఫలయత్నం
సాక్షి ప్రతినిధి, ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రాను పార్లమెంటులో అభిశంసించాలన్న సీపీఎం ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, బీజేపీ ఈ అంశంపై మౌనం వహించింది. సుప్రీంకోర్టులో నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ నెల 12న మీడియా ముందుకు వచ్చి జస్టిస్ మిశ్రాపై పలు ఆరోపణలు చేయడం తెలిసిందే. దీంతో సీజేఐను పార్లమెంటులో అభిశంసించేందుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో కపిల్ సిబల్ సహా కొందరు నేతలు అభిశంసనకు మద్దతివ్వగా.. చిదంబరం, ఆనంద్ శర్మ, ఆంటోనీ తదితరులు వ్యతిరేకించారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకే రాకపోవచ్చనీ, మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే రెండో దశ సమావేశాల్లో దీన్ని చేపట్టే అవకాశం ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘తొలిసారి’ ఒకే కార్యక్రమంలో సీజేఐ, జడ్జీలు నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సీజేఐపై ఆరోపణలు చేసిన అనంతరం తొలిసారిగా...జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు సీజేఐతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు కరచాలనం కూడా చేసుకున్నారు. -
జడ్జీల పేరుతో లంచాలు!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల పేరుతో కొందరు లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. నవంబర్ 13న ఇది విచారణకు వస్తుందని పేర్కొంది. కొత్త ప్రవేశాలు చేపట్టకుండా నిషేధం ఎదుర్కొంటున్న ఓ మెడికల్ కాలేజీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా ముడుపులుచేతులు మారుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐర్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఆ కాలేజీ వైద్య ప్రవేశాల కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోందని, కాబట్టి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయనకు స్థానం కల్పించొద్దని న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. ‘ఈ ఆరోపణలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. తాజా పరిస్థితులన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే ఈ విషయంపై విచారణ జరపడానికి సీనియారిటీ ప్రాతిపాదికన తొలి ఐదు స్థానాల్లో ఉన్న జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం’ అని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఉన్నత న్యాయ వ్యవస్థ గౌరవానికి సంబంధించిన ఈ వ్యవహారం విచారణలో భాగంగా సీబీఐ సేకరించిన కీలక పత్రాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని దవే ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎల్జీయే ఢిల్లీకి బాస్
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కే ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే రాజ్యాంగంలోని 239ఏఏ ఆర్టికల్ ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం కంటే ఎల్జీకే ఎక్కువ అధికారాలుంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం వెల్లడించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఎల్జీతో రోజూ ఘర్షణ తప్పట్లేదని.. మంత్రులంతా అధికారుల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. ‘ఆర్టికల్ 239ఏఏ ఢిల్లీకే ప్రత్యేకం. రాజ్యాంగ పరిధిలో ఈ చట్టం ఎల్జీకే విశిష్టాధికారాలు కట్టబెట్టింది’ అని పేర్కొంది. ‘రాష్ట్రపతికి ఉండే పలు అధికారాలు ఢిల్లీలో ఎల్జీకి ఉంటాయని చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే, మంత్రుల సలహాలతో ఎల్జీ పనిచేయాల్సి ఉంటుంది. వీరి ఆలోచనలతో విభేదిస్తే.. సమస్యల త్వరిత పరిష్కారం కోసం ఆయన రాష్ట్రపతి దృష్టికి సదరు విషయాన్ని తీసుకెళ్లాలి’ అని ధర్మాసనం స్పషం చేసింది. -
వితంతువులకు గౌరవం వద్దా?
న్యూఢిల్లీ: ఆవాస కేంద్రాల్లోని నిరుపేద వితంతువులకు తగిన గౌరవం దక్కడంలేదని సుప్రీం కోర్టు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. బృందావన్ అయినా దేశంలో మరెక్కడైనా పరిస్థితి ఇలాగే ఉందని పేర్కొంది. అసలు వారికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రద్దయిపోయినట్లు మనం ప్రవర్తిస్తున్నామని విస్మయం వ్యక్తం చేసింది. వితంతు పునర్వివాహం ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ అభిప్రాయపడింది. వితంతువులపై మూస ఆలోచనా ధోరణులకు వారి పునర్వివాహాలతో అడ్డుకట్టవేయొచ్చంది. వితంతువుల పరిస్థితిపై కోర్టుకు చేరిన పలు నివేదికలను అధ్యయనం చేసి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సూచించాలని ఆదేశిస్తూ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. బలహీనవర్గాలతో సమానం.. తన రాజ్యాంగ విధుల్లో భాగంగానే నిర్భాగ్య వితంతువుల సమస్యల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది. ‘పిటిషన్ ప్రయోజనమేంటంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారికి న్యాయం చేయడమే కాదు, సామాజిక వివక్షకు గురవుతున్న వారికి సాధికారత కల్పించడమూ. బృందావన్‌లో, దేశంలో ఇతర ఆవాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారంతా మన సమాజంలో బలహీన వర్గాల కిందికే వస్తారు. ఇతరులు వారిని చూస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది’ అని పేర్కొంది. -
కొత్త సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా
సుప్రీంకోర్టులో కీలక తీర్పులనిచ్చిన న్యాయమూర్తి న్యూఢిల్లీ/భువనేశ్వర్: 45వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా (63) నియమితులు కానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయనే అత్యంత సీనియర్ జడ్జి. జస్టిస్ దీపక్ మిశ్రాను సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేసిన అనంతరం ఈ నెల 28న జస్టిస్ మిశ్రా బాధ్యతలు చేపడతారు. 13 నెలలపాటు ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. జస్టిస్ దీపక్ మిశ్రాను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సిందిగా జస్టిస్ జేఎస్ ఖేహర్ గత నెలలో న్యాయమంత్రిత్వ శాఖకు సిఫారసు చేయడం తెలిసిందే. సీజేఐ పదవిని చేపట్టనున్న మూడో ఒడిశా వ్యక్తి జస్టిస్ దీపక్ మిశ్రా. గతంలో ఒడిశాకు చెందిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ గోపాల వల్లభ పట్నాయక్‌లు సీజేఐలుగా పనిచేశారు. సంచలన తీర్పులకు చిరునామా జస్టిస్ మిశ్రా! 1977లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన మిశ్రా అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించనున్నారు. 1996లో ఒడిశా హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 1997లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2009లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మిశ్రా... 2010లో ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అనంతరం 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండగా పలు కేసుల్లో సంచలనాత్మక తీర్పులను ఆయన వెలువరించారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషి ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు సుప్రీంకోర్టు తలుపు తెరిచి విచారణ జరిపిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. దేశాన్ని కుదిపేసిన 2012 డిసెంబరు 16 నాటి ఢిల్లీలో నిర్భయపై క్రూరమైన అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను ఆయన సమర్థించారు. సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయగీతం వేయాలని తీర్పునిచ్చింది కూడా జస్టిస్ మిశ్రానే. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైన 24 గంటల్లోపు వాటిని వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించారు. తదుపరి సీజేఐగా జస్టిస్ మిశ్రాపై చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, కావేరీ జలాల వివాదం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో సంస్కరణలు, పనామా పేపర్ల లీకులు, సెబీ–సహారా చెల్లింపులు సహా పలు కీలక కేసులను విచారించే ధర్మాసనాలకు జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించాల్సి ఉంటుంది. -
గోరక్షకులను కాపాడాల్సిన పనిలేదు
-
గోరక్షకులను కాపాడాల్సిన పనిలేదు
కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచన న్యూఢిల్లీ: గోరక్ష పేరుతో జరుగుతున్న దారుణ ఘటనలపై సుప్రీంకోర్టు మండిపడింది. చట్టాన్ని ఏ రూపంలో అతిక్రమించినా అలాంటివారిని కాపాడాల్సిన పనిలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. శాంతిభద్రతల వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోకి వస్తున్నందున రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరింది. గోరక్ష పేరుతో హింసను సహించేది లేదని ఇటీవలే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు గుర్తుచేశారు. ‘శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇందులో కేంద్రానికి సంబంధం లేదు. అయినా ఎటువంటి దాడులనైనా సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది’ అని ఎస్జీ తెలిపారు. గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు కోర్టుకు సమాధానమిస్తూ.. తమ వద్ద జరిగిన కేసులపై విచారణ జరుపుతున్నామని.. ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ధర్మాసనానికి తెలిపారు. పలుచోట్ల బాధితులకు పరిహారం కూడా అందినట్లు వెల్లడించారు. కేంద్రంతోపాటుగా పలు రాష్ట్రాలు పిటిషన్‌కు సమాధానం ఇవ్వలేదని గోరక్ష దాడులపై పిటిషనర్ల తరపు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే తెలిపారు. అయితే.. సెప్టెంబర్ 6 లోగా కేంద్రం, ఆయా రాష్ట్రాలు సవివరమైన సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. -
రాయ్ పెరోల్ జూన్ 19 వరకూ పొడిగింపు
♦ జూన్ 15 నాటికి రూ.1,500 కోట్లు కట్టాలని సుప్రీం కోర్టు ఆదేశం ♦ లేదంటే మళ్లీ జైలుకేనని హెచ్చరిక న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను జూన్ 19వ తేదీ వరకూ సుప్రీంకోర్టు గురువారం పొడిగించింది. అయితే జూన్ 15కల్లా రూ.1,500 కోట్లు సెబీ–సహారా అకౌంట్‌కు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసింది. అలాగే జూలై 15వ తేదీలోపు మరో రూ.552.22 కోట్లు చెల్లించి, ఇందుకు అనుగుణంగా ఒక అఫడవిట్ దాఖలు చేయాలనీ స్పష్టం చేసింది. గత సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు రాయ్ గురువారం హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ తేదీన వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి జైలు... ఇదిలావుండగా, న్యూయార్క్‌లోని సహారా హోటల్ ప్లాజా కొనుగోలుకు– అంతర్జాతీయ రియల్టీ సంస్థ ఎంజీ క్యాపిటల్ హోల్డింగ్స్ సిద్ధమని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించి, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడచుకోలేకపోయిన ప్రకాశ్ స్వామి అనే వ్యక్తికి సుప్రీం నెల జైలు శిక్షను విధించింది. అమెరికాలో పదేళ్లు కరస్పాండెంట్‌గా పనిచేసిన చెన్నైకి చెందిన స్వామి అనే జర్నలిస్ట్ ఎంజీ క్యాపిటల్ హోల్డింగ్స్ తరఫున పవర్ ఆఫ్ అటార్నీగా అఫిడవిట్ దాఖలు చేస్తూ, హోటల్ కొనుగోలుకు ఆ సంస్థ సిద్ధమని పేర్కొన్నారు. అయితే ఇందుకు నిజాయితీ నిరూపణగా రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందులో విఫలమైన స్వామిని ‘ధిక్కరణ కింద’ నెలపాటు తీహార్ జైలుకు పంపింది. తనకు చెప్పిన వివరాలను బట్టి, అఫిడవిట్ వేయాల్సి వచ్చిందని చేతులు జోడించి విన్నవించుకున్నప్పటికీ సుప్రీం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించలేదు. స్వేచ్ఛగా వదిలేస్తే.. తప్పుడు సందేశం పంపినట్లు అవుతుందని బెంచ్ వ్యాఖ్యానించింది.